unemployment
-
పనీ – పాటా
పనీ–పాటా అనే నుడికారం ఊరికే పుట్టలేదు; శ్రామిక సంస్కృతిలో పని లేకుండా పాటా, పాట లేకుండా పనీ ఉండవు; అవి అన్యోన్యాలు. పాడుకుంటూ పనిచేస్తే పనిభారం తగ్గుతుందంటారు; అందుకే, ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూసొలుపేమున్నదని ఓ సినీకవి అన్నాడు. అసలు పాట రూపంలో కవిత్వమే కానీ, అభినయ రూపంలో నృత్య, నాటకాలే కానీ, ఆమాటకొస్తే ఇతర కళారూపాలే కానీ పుట్టింది పనితోనేనని పండితులు తేల్చారు. వైయక్తిక, సామూహిక శ్రమలో భాగమైన శారీరక చర్యలను కళారూపాలు అంటిపెట్టుకునే ఉండేవన్నారు. పనినీ, పాటనూ విడదీసి చూడడం నాగరికత ముదిరిన తర్వాతే వచ్చింది. పాట అనేది పనిలేనప్పుడు పాడుకునే వ్యాపకమైంది. రానురాను పాటను పక్కన పెట్టి పనికి మాత్రమే పట్టం కట్టే స్థితికి దారితీసి; తాజాగా వారానికి 70 గంటలు పనిచేయాలని ఒకరంటే, కాదు 90 గంటలు పనిచేయాలని మరొకరు అనే వరకు వెళ్లింది. కొన్నిరోజులుగా ఇదే పెద్ద చర్చనీయాంశం. మనిషితో సహా సమస్త జీవరాశితోనే పని కూడా పుట్టింది; అది కర్మగా మారి కర్మయోగంగా తాత్విక శిఖరానికీ చేరింది; దాంతోపాటు కలలూ, కన్నీళ్ళ చరిత్రనూ మూటగట్టింది. వేల సంవత్సరాల వెనకటి వేట–ఆహార సేకరణ జనాల జీవనంలోకి తొంగి చూస్తే, వారు వారానికి పదిహేను గంటలే పనిచేసేవారని మానవశాస్త్ర నిపుణులంటారు. వారిది మొరటుదనం, అజ్ఞానం మూర్తీభవించిన దుర్భర జీవితమని కొందరంటే; కాదు, ఆ తర్వాతి కాలానికి చెందిన వ్యవసాయ జీవనంతో పోల్చితే వేట–ఆహారసేకరణ జనాలది అత్యున్నత సంస్కృతికి చెందిన సంపన్న సమాజమనీ, తగినంత తీరిక ఉండడమే అందుకు కారణమనీ మరికొందరు అన్నారు. ప్రకృతిని అధ్యయనం చేయడానికీ, చంద్రుడి వృద్ధిక్షయాలపై ఆధారపడిన కాలగణనాన్ని కూర్చడానికీ, కళారూపాల అభివృద్ధికీ ఆ తీరిక తోడ్పడిందనీ, వారే తొలి శాస్త్రవేత్తలూ, కళాకారులనీ – అప్పటి అనేక గుహా చిత్రాలు, కుడ్యచిత్రాల ఆధారంగా నిపుణులు నిరూపించారు. వ్యవసాయ జీవనం నుంచీ ఆ తీరిక అడుగంటి పారిశ్రామిక యుగానికి వచ్చేసరికి వారానికి 80 నుంచి 100 గంటలు పనిచేయవలసిన దుఃస్థితి దాపురించి, ఆ నిర్బంధ శ్రమకు వ్యతిరేకంగా ఉద్యమాలు తలెత్తడంతో వారానికి 40 గంటల పని ప్రామాణిక కొలమానంగా స్థిరపడిందని చరిత్ర చెబుతోంది. నిజానికి పనీ–తీరికా అనేవి ఏదో ఒక నిర్ధారణకో, ఒకే ఒక్క నిర్వచనానికో అందని సంక్లిష్ట అనుభవాలు. ప్రతిసారీ పనిభారాన్ని దాని పరిమాణంతోనూ, గంటలతోనూ తూచలేం. ఇష్టంతో స్వచ్ఛందంగా చేసే పని అలాంటి కొలతలనూ, శ్రమనూ కూడా అధిగమిస్తుంది. నిర్బంధంగా విధించే పని తక్కువ పరిమాణంలో ఉండి, తక్కువ సమయాన్ని తీసుకునేదైనా భారంగానే తోస్తుంది. స్వతంత్రంగా కొయ్యపని చేసుకుంటూ అందులో కళాత్మకతనూ, తృప్తినీ ఆస్వాదించిన ఒక వడ్రంగి ఒక ఫ్యాక్టరీ కార్మికుడిగా మారడంతోనే వాటిని కోల్పోయి ఎలా నిరాసక్తంగా మారాడో కొడవటిగంటి కుటుంబరావు ఒక కథలో చిత్రిస్తారు. పనిగంటలు పెరిగితే ఉత్పాదకత పెరుగుతుందనుకోవడమూ సత్యదూరమేనని చెప్పి, ఐస్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్ లాంటి దేశాల అనుభ వాన్ని ఉటంకించేవారూ ఉన్నారు. వారానికి 30–35 గంటల పనితోనే ఈ దేశాలు ఉత్పాదకత లోనూ, సంతోషభరిత జీవనంలోనూ అగ్రస్థానం వహించడాన్ని వారు ఉదాహరిస్తున్నారు. పనీ–తీరికలలో ఏది ఎక్కువైనా జీవనశకటం ఒకవైపే ఒరిగిపోయి జీవితమే అస్తవ్యస్తమవుతుంది. జీవిక కోసమే మొత్తం సమయాన్ని వెచ్చిస్తే, జీవించడమే మరచిపోతామని ఒక సూక్తి. అన్నిటా సమతూకం పాటించడంలోనే సంతోష రహస్యం ఇమిడి ఉందన్నది మరొక ఉద్బోధ.అందుకే, ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నారు; అదే అన్ని సందర్భాలకూ వర్తించే సార్వకాలిక సూత్రం. నిజానికి పనికీ–తీరికకీ మధ్య అన్యోన్యతా, పరస్పరతా ఉన్నాయే తప్ప వైరుద్ధ్యం లేదని, దేని విలువ దానిదేనని అనేవారూ ఉన్నారు. కుటుంబ సభ్యులతోనూ, విందు వినోదాలతోనూ ఆహ్లాదంగా గడిపే తీరిక సమయం పనిలో నిమగ్నతకూ, నాణ్యతకూ, ఉత్పాదకత పెరగడానికే తోడ్పడుతుందంటారు. పనిలో ఇతర దేశాలతో పోటీ, అభివృద్ధీ అనేవి కొత్తగా వచ్చాయి. దేశాభివృద్ధిని కొత్తపుంతలు తొక్కించడానికి పని గంటలు పెంచాలనడం పూర్తిగా కొట్టిపారవేయవలసినదేమీ కాదు. కాకపోతే, ఇతర అనేకానేక దృష్టికోణాలను, వాస్తవాలను విస్మరించి ఏకపక్షంగా అలాంటి అభిప్రాయానికి రావడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువన్నది ఒక విమర్శ. అభివృద్ధిలో పోటీ పడవలసిందే కానీ, ఇక్కడి మానవవనరుల అందుబాటునూ, వాటి అభివృద్ధినీ కూడా పరిగణనలోకి తీసుకుని తగిన ప్రణాళికతో ముందుకు వెళ్లాలనే వాదన వినిపిస్తోంది. వివిధ రంగాలలో ఇప్పటికే పెరిగిన పని భారం ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యాలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోందనీ, అందువల్ల ఉత్పాదకత మందగిస్తోందనీ ఆయా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఇంకోవైపు దేశంలో నిరుద్యోగం రేటు పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కనుక, పని గంటలను పెంచడం కన్నా పని చేసే చేతుల సంఖ్యను పెంచి పనిని పంచడమే అత్యుత్తమ పరిష్కారమనీ; అందుకు అవసర మైన అన్నిరకాల శిక్షణ సదుపాయాలనూ అభివృద్ధి చేయాలనే వాదన ముందుకు వస్తోంది. పని నుంచి పాటను వేరు చేసినప్పుడు చిన్న పని కూడా పెనుభారమే అవుతుంది. పనికి పాటను జోడించడమే దానిని తేలికచేసే మార్గం. పనీ–పాటా కలిసినప్పుడు... పనే పాటవుతుంది! -
ఉత్తుత్తి ఉద్యోగాలు.. ఇప్పుడిదే నయా ట్రెండ్!
‘‘ఉద్యోగాలిప్పిస్తామని యువతకు కుచ్చుటోపీ.. ఉద్యోగాల పేరిట టోకరా..!’’ ఈ తరహా కథనాలు చూసి చూసి బోర్ కొడుతోందా? అయితే జస్ట్ ఫర్ ఏ ఛేంజ్.. ఉద్యోగాల పేరిట ఓ వ్యక్తి సొంతవాళ్లను, బంధువులను, చివరకు తనను తానే మోసం చేసుకోవడం గురించి ఎప్పుడైనా విన్నారా?. కానీ, ఇప్పుడది నయా ట్రెండ్‌గా అక్కడ ఓ ఊపు ఊపేస్తోంది.సాధారణంగా.. ఎక్కడో సిటీలోనో, టౌన్లోనో ఉంటూ ఉద్యోగాల వేట పేరిట తల్లిదండ్రుల నుంచి డబ్బులు పిండుకునే జాతిరత్నాల గురించి వినే ఉంటారు. అయితే.. నిజంగానే ఉద్యోగాల వేటలో అలసిపోయిన నిరుద్యోగుల కోసం పుట్టుకొచ్చిందే ఈ Pretend To Work ట్రెండ్. అంటే.. పని చేస్తున్నట్లు నటించడమన్నమాట. ఈ జాబ్‌తో జేబులు గుళ్ల కావడం తప్పించి ఎలాంటి ప్రయోజనం ఉండదు!!.ఈ జాబ్ కావాలంటే చేయాల్సిందల్లా.. రోజుకు ఫలానా డబ్బును మీ ఆ సర్వీస్ వాళ్లకు అందించాలి. అప్పుడు వాళ్లు మీకు ఆఫీస్ స్పేస్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి అందులో మీకు కుర్చీ, టేబుల్, కంప్యూటర్ లాంటివివేసి ఉద్యోగి అనే గుర్తింపు ఇస్తారు. అంతేకాదు.. ఆ పనివేళలో మధ్యలో భోజనం, కాఫీ టిఫిన్లు, స్నాక్స్, జ్యూస్‌ల వగైరా లాంటివి కూడా అందిస్తారు. మీరు చెల్లించే డబ్బును బట్టి మీ పొజిషన్, ఇతర సేవలు అందిస్తారు. ఒకవేళ ఎక్కువ చెల్లిస్తే ఏకంగా ఆ కంపెనీకి బాస్(Boss) పొజిషన్లోనే కూర్చోబెడతారు. అలాగని మీకు అక్కడ పని అప్పజెప్తారనుకుంటే పొరపాటే!. ఇవి కేవలం ఉత్తుత్తి ఉద్యోగాలు మాత్రమే!!. కేవలం మీలోని నిరుద్యోగి(Jobless)ని అనే భావనను దూరం చేయడానికి మాత్రమే వాళ్లు ఈ సేవల్ని అందిస్తోంది. అంటే.. మీరు మీ మీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఎప్పటిలాగే మునిగిపోవచ్చన్నమాట. ఎప్పుడైతే మీరు ఖాళీగా ఉన్నారనే ఫీలింగ్ కలుగుతుందో.. అప్పుడు అక్కడికి వెళ్లి వాళ్లు అడిగినంత చెల్లిస్తే సరిపోతుంది. ఆశ్చర్యం కలిగించినా ఇది ఇప్పుడు కొనసాగుతున్న ట్రెండ్. చైనా(China)లో ఈ తరహా సేవల గురించి ఇప్పుడు నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. పైగా ఈ సర్వీసును అందించేందుకు పుట్టగొడుగుల్లా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి కూడా!.‘‘మా ఆఫీస్‌కు విచ్చేయండి. మీరూ ఉద్యోగిగా మారిపోండి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా ఇక్కడే గడపండి. మీకు భోజన, ఇతర సదుపాయాలు కూడా కల్పిస్తాం. రోజూవారీగా.. అతితక్కువ ధరకే మీకు ఈ సేవల్ని అందిస్తాం’’ అనే ప్రకటనలు హెబెయి ప్రావిన్స్‌లో ఎటు చూసినా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులు, యువత ఈ తరహా సేవల కోసం ఎగబడిపోతున్నారు. ఈ తరహా సేవలు కొనసాగుతున్న మాట వాస్తవమేనంటూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కూడా ఓ కథనంలో పేర్కొంది.చైనాలో ఈ తరహా సర్వీసుల ప్రారంభ ధర 30 యువాన్లు(4 డాలర్లు.. మన కరెన్సీలో రూ.353)గా ఉంది. వాళ్లు అందించే సౌకర్యాలను బట్టి ఆ రేటు పెరుగుతూ పోతోందన్నమాట.ఈ క్రేజ్ గుర్తించిన కాఫీ షాపులు, లైబ్రరీలు కూడా ఈ తరహా సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నాయి. చైనాలో ప్రస్తుతం లే ఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. ప్రముఖ కంపెనీలు సైతం వేల సంఖ్యల్లో ఉద్యోగులను తొలగించుకుంటూ పోతున్నాయి. దీంతో.. చిన్న కంపెనీలు కొత్త రిక్రూట్లకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో నిరుద్యోగుల శాతం పెరిగిపోతోంది. ఉద్యోగాలు ఊడిపోవడం.. జాబ్‌లెస్‌గా ఉండిపోవడంతో తీవ్ర ఒత్తిడి, మానసికంగా కుంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే.. కాస్త డబ్బు ఉన్న వాళ్లకు ఊరట కలిగించేందుకే ఈ సేవలు పుట్టుకొచ్చాయి. అయితే..ఈ Pretend To Workపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా. దీనివల్ల మోసాలు పెరిగిపోవచ్చని పలువురు అంటున్నారు. అయితే ఖాళీగా రోడ్ల వెంట తిరగడం, ఉద్యోగాల కోసం తిరిగి అలసిపోవడం, ఉద్యోగం దొరక్క ఇంటికి ఆలస్యంగా వెళ్లడం.. ఇలాంటి వాటికంటే ఈ ఉత్తుత్తి ఉద్యోగాలు చేసుకోవడం నయం అనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సేవల ఉద్దేశం ఏదైనా.. దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందన్న వాదనే ఎక్కువగా వినిపిస్తోంది అక్కడ.ఇదీ చదవండి: అత్యంత అరుదు.. అందుకే రూ.5కోట్లు పలికింది!! -
ఏపీలో జాబ్ కావాలంటే.. ఆ అర్హత తప్పనిసరి!
విజయవాడ, సాక్షి: జాబ్ కావాలంటే బాబు రావాలి.. ఇది ఒకప్పుడు చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీ. ఆయన మూడుసార్లు సీఎంగా ఉన్న టైంలో అది కలగానే ఉండిపోయింది. కట్ చేస్తే.. ఇప్పుడు మళ్లీ ఆయనే అధికారంలో ఉన్నారు. అలాగే ఆ సమస్యా మొదటికొచ్చింది. ఈసారి మరోలా!. ఏపీలో ఇప్పుడు ఉద్యోగం కావాలంటే.. ఆ ఒక్కటి ఉంటే చాలూ!.అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే.. ఏపీలో ప్రతీకార రాజకీయాలకు తెర లేపింది కూటమి. తాము ఇచ్చిన హామీలనూ ఇప్పటికే అటకెక్కించేసిన చంద్రబాబు.. గత వైఎస్సార్సీపీ హయాంలో ఉన్న వ్యవస్థలను నిర్వీర్యం చేసేశారు. అధికారం ఉందని అరాచకాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. రేషన్ షాపులనూ వదలకుండా.. బలవంతంగా లాక్కుని తమ పార్టీ నేతలకు ఇప్పించేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఉద్యోగుల మీద పడ్డారు!.ఎన్నికల టైంలో అధికారం కోసం చంద్రబాబు అండ్ కో చెప్పింది ఏంటంటే.. ఉద్యోగాలను సృష్టిస్తామని, అది కుదరని పక్షంలో ఉద్యోగభృతి ఇస్తామని. కానీ, ఈ రెండూ చేయడం లేదు. ఖాళీల విషయంలో.. కనీసం సమీక్షలు సైతం జరపడం లేదు. పైగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తూ.. ఆ స్థానంలో తమవారిని తిరిగి నియమించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఏపీలో ఇప్పుడు ఉద్యోగం కావాలంటే.. కూటమి నేతల రికమండేషన్ ఉంటే చాలూ!.తాజాగా.. ఫైబర్ నెట్ నుంచి ఏకంగా 410 మంది ఉద్యోగులను తొలగించారు. ఇంకొంత మందిని కూడా తొలగించడం ఖాయమని చెప్పారు. ఉద్యోగాల తొలగింపునకు కారణం.. వైఎస్సార్సీపీ మీద పెద్ద అభాండం వేసేశారు. అయితే ఈ యాక్షన్ కూటమి పార్టీల కార్యకర్తల కోసమేనని ఇప్పుడొక ఓ స్పష్టత వచ్చింది. ఇప్పటికే మంత్రుల పేషీల్లో టీడీపీ కార్యకర్తల కోసం ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. ప్రతి మంత్రి పేషీల్లో ఇద్దరు సోషల్ మీడియా ఉద్యోగులు, పీఆర్వో నియామకానికి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే.. ఇప్పుడు ఫైబర్ నెట్ ఉద్యోగులను రోడ్డున పడేయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాళ్ల స్థానంలో తమ వాళ్లను నియమించుకోవాలని కూటమి నేత ఉవ్విళ్లూరుతున్నారు.ఇప్పటికే వాట్సాప్ సందేశాలు.. ఫోన్ల ద్వారా టీడీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఆదేశాలు వెళ్తున్నాయట!. అదే బాటలో.. మిగిలిన రెండు పార్టీల నుంచి కూడా సిఫారసులు వెళ్తున్నట్లు సమాచారం. సాధారణంగా.. అధికార యంత్రాగాల్లో ఉన్నత స్థాయిలో తమకు అనుకూలరను నియమించుకోవడం.. ఇతరులను సాగనంపడం ఇలాంటివి కనిపిస్తుంటాయి. కానీ, ఫర్ ఏ ఛేంజ్ కోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఏరకంగా చూసుకున్నా.. ఏపీలో నిరుద్యోగ సమస్య తీరింది.. అదీ నిష్పక్షపాతంగా వైఎస్సార్సీపీ హయాంలోనే!.ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ హయాంలో 30 లక్షల ఉద్యోగాలు -
‘నిరుద్యోగుల సంఖ్యను పెంచేస్తున్న చంద్రబాబు!’
గుంటూరు, సాక్షి: ఏపీ సీఎం చంద్రబాబు సంపద సృష్టించడం లేదు.. దోచుకుంటున్నారని, ప్రభుత్వ రంగంలోకి సంస్థలను అమ్మేసి దండుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) అన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై మంగళవారం సాయంత్రం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చారు. ‘ఓటేయండి తమ్ముళ్లు’ అంటూ వేడుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారు. ప్రజలపై చంద్రబాబు కసి తీర్చుకున్నారు. ‘బాదుడే బాదుడు..’ అంటూ రూ. 15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు భారం మోపారు. ఇదేనా సంపద సృష్టి.. ఇదేనా ఆదాయం పెంచడం?’’ అని అంబటి ప్రశ్నించారు . .. రాష్ట్ర ఆదాయం పడిపోయింది. రాజధాని పేరుతో 31 వేల కోట్ల అప్పులు చేస్తున్నారు. అప్పు కోసం చిప్ప పట్టుకుని తిరుగుతున్నారు. అప్పులతోనే చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఆనాడు స్మార్ట్ మీటర్లపై తప్పుడు ప్రచారం చేశారు. స్మార్ట్ మీటర్లను పగలగొట్టమని రెచ్చగొట్టారు. ఇప్పుడు మళ్లీ స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమం మొదలుపెట్టారు అని అంబటి మండిపడ్డారు... వైఎస్సార్సీపీ(YSRCP) హయాంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాం. మా హయాంలో 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాం. 1.34 లక్షల మందికి గ్రామ, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేశాం. కానీ, చంద్రబాబు అధికారంలోకి వస్తే ఉద్యోగాలు సృష్టించి ఇస్తామన్నారు. లేదంటే నిరుద్యోగ భృతిని ఇస్తామన్నారు. అయితే.. ఇప్పుడు చంద్రబాబు ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు. వలంటీర్లను పక్కన పెట్టి.. వెల్త్ వర్కర్లను తొలగించారు. ఇప్పుడు ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి ఏకంగా 400 మందిని తొలగించారు. చంద్రబాబు ఏపీలో నిరుద్యోగుల సంఖ్యను పంచేస్తున్నారు. కానీ నిరుద్యోగ భృతిని మాత్రం ఇవ్వడం లేదు’’ అని అంబటి అన్నారు.ఇదీ చదవండి: మన కేసులు ఎత్తేద్దాం! -
Year Ender 2024: నిరుద్యోగంతో అలమటిస్తున్నరాష్ట్రాలివే..
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్నప్పటికీ భారత్ నిరుద్యోగం విషయంలో పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశంలోని వివిధ రంగాలు వృద్ధిని చవిచూస్తున్నప్పటికీ, నిరుద్యోగితా స్థాయిలో ఆశించినంత మార్పు రాకపోవడం విశేషం. ఇటీవలే విడుదలైన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్) అందించిన నివేదిక ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి జాతీయ నిరుద్యోగిత రేటులో తగ్గుదల కనిపించింది. 15 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులలో నిరుద్యోగితా రేలు 3.2 శాతానికి తగ్గింది. ఇది 2020-21లో 4.2 శాతంగా, 2021-22లో 4.1శాతంగా ఉంది. అగ్రస్థానంలో లక్షద్వీప్11.1 శాతం నిరుద్యోగితా రేటుతో కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ అగ్రస్థానంలో ఉంది. పర్యాటకంపై ఆధారపడిన లక్షద్వీప్ ఆర్థిక వ్యవస్థ నిరుద్యోగాన్ని గణనీయంగా తగ్గించలేకపోయింది. గోవా, అండమాన్, నికోబార్ దీవులు రెండూ 9.7శాతం నిరుద్యోగితా రేటును నమోదు చేశాయి. కాలానుగుణ ఉపాధి, ప్రభుత్వ రంగ ఉద్యోగాలపై ఆధారపడటం మొదలైనవి నిరుద్యోగానికి సవాలుగా నిలిచాయి. ప్రభుత్వ రంగంలో పరిమిత ఉద్యోగ అవకాశాల కారణంగా అధిక నిరుద్యోగ స్థాయి కొనసాగుతోంది. వైరుధ్యాన్ని ఎదుర్కొంటున్న కేరళ యువతనాగాలాండ్, కేరళ వరుసగా 9.1శాతం, 7.0శాతం రేట్లతో రెండవ స్థానంలో ఉన్నాయి. కేరళలోని యువత అధిక అక్షరాస్యత, తక్కువ ఉపాధి అవకాశాలనే వైరుధ్యాన్ని ఎదుర్కొంటోంది. ఉత్తర భారతదేశంలో, హర్యానా పారిశ్రామిక కేంద్రంగా ఉన్నప్పటికీ 6.1% నిరుద్యోగిత రేటును నమోదు చేసింది. పారిశ్రామిక వృద్ధి ఒక్కటే ఉపాధికి హామీ ఇవ్వదని ఈ వైరుధ్యం సూచిస్తుంది.చండీగఢ్, మేఘాలయాలకు పలు సవాళ్లుఅదేవిధంగా 6.0శాతం నిరుద్యోగితా రేటుతో చండీగఢ్, మేఘాలయాలు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. చండీగఢ్ ప్రభుత్వం, అక్కడి సేవా రంగాలు రాష్ట్రంలోని యువతకు పూర్తి స్థాయిలో ఉద్యోగాలను కల్పించలేకపోతున్నాయి. మేఘాలయలో పారిశ్రామిక అభివృద్ధి చెందకపోవడం ఉపాధికి ఆటంకంగా మారింది.తెలంగాణలో..జమ్ముకశ్మీర్, తెలంగాణలో నిరుద్యోగ రేటు 4.4శాతంగా ఉంది. జమ్ముకశ్మీర్‌లోని రాజకీయ, ఆర్థిక సవాళ్లు నిరుద్యోగానికి కారణాలుగా నిలుస్తున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్‌లో ఐటీ రంగం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇది కూడా చదవండి: చైనా చేతికి ‘పవర్ఫుల్ బీమ్’.. గురి తప్పేదే లే.. -
వ్యవసాయ రంగమే ఉపాధికి ఊతం
నగర ప్రాంతాలకు తరలి వస్తోన్న లక్షలాదిమంది ప్రధానంగా ఉపాధిని పొందుతోంది, నిర్మాణ రంగంలోనే. సాఫ్ట్వేర్ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పరిణామాలు అక్కడా ఉపాధికి గండికొడుతున్నాయి. ఈ స్థితిలో ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధికి రఘురావ్‌ు రాజన్ వంటి వారు కూడా సేవారంగాన్ని ఎందుకు పరిష్కారంగా చెప్పజూస్తున్నారు? నేటి ప్రపంచ పరిస్థితులలో సరుకు ఉత్పత్తి రంగం గానీ, సేవా రంగం గానీ కోట్లాది మంది నిరుద్యోగులకు బతుకుతెరువును చూపగల స్థితి లేదు. మిగిలిందల్లా, వ్యవసాయ రంగమే. వ్యవసాయం లాభసాటిగా ఉంటే గ్రామీణులు నగరాలకు రారు. అప్పుడు కారుచవకగా కార్పొరేట్లకు కార్మికులు దొరకరు. అందుకే వ్యవసాయం లాభసాటిగా లేకుండా ‘జాగ్రత్తపడటమే’ ఇప్పటి విధానం.దేశంలోని సుమారు 65% జనాభా 35 ఏళ్ల లోపువారు. వీరికి నిరుద్యోగం, చదువుకు తగిన ఉద్యోగం లేకపోవడం ప్రధాన సమస్యలు. కోవిడ్ అనంతరం సమస్య మరింత జఠిలం అయ్యింది. 2016లో మోదీ తెచ్చిపెట్టిన పెద్ద నోట్ల రద్దు, 2017లో హడావుడిగా ఆరంభమైన జీఎస్టీ వంటివి చిన్న, మధ్యతరహా పరిశ్రమలను దెబ్బతీసి నిరుద్యోగ సమస్యను మరింత పెంచాయి.దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామనే వాగ్దానం ఆసరాగా 2014లో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఇదే నేపథ్యంలో, మోదీ ప్రభుత్వం సరుకు ఉత్పత్తి రంగాన్ని దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక ఉపాధి కల్పనా రంగంగా... దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 25% స్థాయికి చేర్చే పేరిట ‘మేకిన్ ఇండియా’ కార్య క్రమాన్ని ఆరంభించింది. దశాబ్ద కాలం తర్వాత, వెనక్కిచూసుకుంటే స్థూల జాతీయ ఉత్పత్తిలో ఈ రంగం వాటా 15– 17 శాతం మధ్య ఎదుగూ బొదుగూ లేకుండా మిగిలిపోయింది. 2020లో ఆరంభమైన ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల’ పథకం కూడా సాధించింది నామ మాత్రమే.మేకిన్ ఇండియా కార్యక్రమం విజయవంతం అయ్యే అవకాశాలు లేవంటూ అప్పట్లోనే రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురావ్‌ు రాజన్ చెప్పారు. చైనా ప్రపంచం యావత్తుకూ సరిపోయే స్థాయిలో, చవకగా సరుకులను ఉత్పత్తి చేస్తోంది గనుక ప్రపంచానికి మరో చైనా అవసరం లేదంటూ సున్నితంగా హెచ్చరించారు. ఈ రచయిత కూడా 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం, అంతర్జాతీయంగా డిమాండ్ పతనం వంటి వివిధ కారణాలను పేర్కొంటూ మేకిన్ ఇండియా, దేశ సమస్య లకు పరిష్కారం కాదంటూ ఒక వ్యాసం రాసివున్నారు.దేశంలో నిరుద్యోగం పరిష్కారానికీ, వృద్ధి రేటు పెంపుదలకూ దారి ఏమిటనే చర్చ ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే, ఈ మధ్య రఘురావ్‌ు రాజన్ ‘బ్రేకింగ్ ద మౌల్డ్: రీ ఇమేజింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్’ పేరిట రోహిత్ లాంబా అనే పెన్సి ల్వేనియా విశ్వవిద్యాలయ ఆచార్యునితో కలిసి ఒక పుస్తకం రాశారు. దీనిలో భాగంగా మేకిన్ ఇండియా, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక విధానాలు ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువగా తయారయ్యాయని పేర్కొన్నారు. ఈ సరుకు ఉత్పత్తి రంగంపై దృష్టిని కాస్తంత తగ్గించు కొని, భారతదేశం ఇప్పటికే ‘బలంగా’ వున్న సేవా రంగంపై దృష్టి పెట్టాలన్నారు. తద్వారా మెరుగైన ఉపాధి కల్పన, వృద్ధి రేటులను సాధించవచ్చనేది వారి వాదన. దీని కోసమై యువజనుల నిపుణతల స్థాయిని పెంచి వారిని సేవా రంగ ఉపాధికి సిద్ధం చేయాలన్నారు.రెండవ ప్రపంచ యుద్ధానంతరం కొరియా, జపాన్... అలాగే చైనా వంటి దేశాలు అనుసరించిన ఆర్థిక వృద్ధి నమూనా అయిన మొదటగా వ్యవసాయ రంగం నుంచి సరుకు ఉత్పత్తి రంగం దిశగా సాగడం... అనంతరం మాత్రమే సేవా రంగం వృద్ధి దిశగా పయనించడం అనివార్యం కాదని రాజన్ వాదిస్తున్నారు. అనేక ధనిక దేశాలలో ఇప్పటికే సేవా రంగం వాటా జీడీపీలో 70% మేర ఉందనీ, ఈ రంగంలో జీడీపీ వాటా సుమారు 60% పైన వున్న భారత్ కూడా పాత నమూనాని పక్కన పెట్టి మరింతగా సేవా రంగంలోకి వెళ్ళాలనేది రాజన్ తర్కం. సేవా రంగం వృద్ధి చెందాలంటే యువజనుల విద్యా నిపుణతల స్థాయి సరుకు ఉత్పత్తి రంగంలో కంటే అధికంగా ఉండాలి. ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా సేవా రంగం తాలూకు సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించగలగడంలో ఎదుర్కొంటున్న సాఫ్ట్ స్కిల్స్ లోటును చూస్తున్నాం. సేవా రంగంలో ఆంగ్ల భాషా ప్రావీణ్యం అవసరం తెలిసిందే. దేశంలోని ఎంతమంది యువజనులకు ఈ రంగంలో ప్రవేశించగల స్థాయి ఆంగ్ల భాషా ప్రావీణ్యం ఉంది? దేశంలోని మొత్తం కార్మికులలో 70% మంది మాత్రమే అక్షరాస్యులు. వీరిలో కూడా 25% మంది ప్రాథమిక స్థాయి విద్యలోపే పాఠశాల చదువు మానివేసిన వారు. దేశంలోని 20% సంస్థలు మాత్రమే తమ ఉద్యోగులకు తగిన శిక్షణను ఇచ్చుకునే ఏర్పాట్లను కలిగి వున్నాయి (ప్రపంచ బ్యాంకు పరిశోధన). ఈ స్థితిలో, గ్రామీణ యువజనులను సేవా రంగం దిశగా ఇప్పటికిప్పుడు తీసుకెళ్ళగలమా? నేడు సాఫ్ట్వేర్ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పరిణామాలు అక్కడా ఉపాధికి గండికొడుతున్నాయి. ఈ స్థితిలో, ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి కోసం రఘురావ్‌ు రాజన్ వంటి వారు కూడా సేవా రంగాన్ని ఎందుకు పరిష్కారంగా చెప్పజూస్తున్నారు?దీనికి కారణం ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘బీయింగ్ డిటర్మిన్స్ కాన్షియస్నెస్’ (మన అస్తిత్వమే మన ఆలోచనలను నిర్ణయిస్తుంది) అనే కార్ల్ మార్క్ ్స ఉద్బోధన. అంతర్జాతీయ ద్రవ్య సంస్థలో 2003 నుంచి 2007 వరకూ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పని చేసిన రాజన్ కూడా దాటుకుని రాలేని నిజం. ఆయన అస్తిత్వం తాలూకు పరిమి తులే, ఆయనను వాస్తవాన్ని చూడనివ్వడం లేదు. నేటి ప్రపంచ పరిస్థితులలో అటు సరుకు ఉత్పత్తి రంగం గానీ, ఇటు సేవా రంగం గానీ, కోట్లాది మంది నిరుద్యోగ యువతకు బతుకుదెరువును చూప గల స్థితి లేదు. మిగిలిందల్లా, మన వ్యవసాయ రంగమే. ఈ రంగంలో ఇప్పటికే, అవసరాన్ని మించి మానవ వనరులు చిక్కుకు పోయి ఉన్నాయన్నది నిజం. ప్రస్తుత ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల ‘సంస్కరణల’ యుగంలో వ్యవసాయ రంగంపై చిన్న చూపు పెరిగింది. గ్రామీణ వ్యవసాయ రంగం, నగర ప్రాంత పారిశ్రామిక రంగాల మధ్యన ఉన్న సమీకరణం గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకంగా ఉంది. వ్యవసాయ రంగ సరుకులను కారు చవుకగా, నగర ప్రాంతాలలో అందుబాటులో ఉంచడమనేది పారిశ్రామిక కార్పొరేట్ వర్గాల అవసరం. గ్రామీణ రైతాంగానికి లాభసాటి ధరలను కల్పిస్తే ఆ సరుకుల ధరలు, నగర ప్రాంత మార్కెట్లలో అధికంగా ఉంటాయి. నగర ప్రాంత కార్మికులు, ఉద్యోగులకు అవి ఖరీదైనవి అవుతాయి. అప్పుడు వేతనాల పెంపుదల కోసం యజమానులపై ఒత్తిడి తెస్తారు. ఇది పారిశ్రామిక అశాంతిగా మారవచ్చు. ఒక మోస్తరు వేతనాలతోనే పని చేయించుకోగలగాలంటే రైతాంగ ఉత్పత్తులకు తక్కువ ధరలు ఉండేలా జాగ్రత్తపడడం కార్పొరేట్లకు అవసరం. గ్రామీణ రైతాంగానికి వ్యవసాయం లాభసాటిగా ఉంటే వారు నగరాలకు రారు. అప్పుడు నగర ప్రాంతాలలో కార్మికుల సరఫరా తగ్గుతుంది. కార్మికులకు డిమాండ్ పెరుగుతుంది. దీని వలన, పారిశ్రామికవేత్తలు అధిక వేతనాలను చెల్లించి పనిలో పెట్టుకోవలసి వస్తుంది. దీనికి కూడా పరిష్కారమే గ్రామీణ వ్యవసాయం లాభ సాటిగా లేకుండా ‘జాగ్రత్తపడడం’. ఈ కథలో సూత్రధారులు ప్రపంచీకరణ వంటి నయా ఉదారవాద విధానాaలను మన మీద రుద్దుతోన్న ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధులు. ఆ ఆలోచనా విధానం తాలూకు ప్రతినిధిగా రఘురావ్‌ు రాజన్ వ్యవసాయం ఊసు ఎత్తలేరు. దాన్ని దేశానికీ, ఉపాధి కల్పనకూ దారిగా చూపలేరు. రైతుకు వ్యవసాయం లాభసాటిగా ఉంటే అది అతని కొనుగోలు శక్తిని పెంచి తద్వారా నగర ప్రాంత పారిశ్రామిక సరుకులకు డిమాండ్‌ను కల్పిస్తుంది. దేశ జనాభాలోని 55% పైన ఉన్న రైతాంగం బాగుంటే, విదేశాలలోని డిమాండ్, కొనుగోలు శక్తి, ఎగుమతులతో నిమిత్తం లేకుండా దేశంలోనే డిమాండ్‌ను సృష్టించవచ్చు. ఈ పరిష్కారాన్ని చెప్పలేని మేధా దుర్బలత్వంతో రఘురావ్‌ు రాజన్ వంటివారు మిగిలిపోతున్నారు. డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులుమొబైల్: 98661 79615 -
విధాన పాపం... ప్రజలకు శాపం...
భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ప్రపంచంలోని 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అని మోదీ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటోంది. వాస్తవంలో పేరు గొప్ప... ఊరు దిబ్బ లాగా దేశ ప్రజల స్థితిగతులున్నాయి. ఒక పక్కన నిరుద్యోగం తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. మరో పక్కన నింగినంటే ద్రవ్యోల్బణం, అంతంత మాత్రపు ప్రజల కొనుగోలు శక్తిని మరింతగా దిగజారుస్తోంది. మోదీ ప్రభుత్వం దేశం మీద వరుసగా రుద్దిన పెద్ద నోట్ల రద్దు, అశాస్త్రీయమైన జీఎస్టీ అమలు, కోవిడ్ మహమ్మారి కాలంలో అనుసరించిన అవకతవక ఆర్థిక విధానాలే ఈ దుఃస్థితికి కారణం. ఫలితంగా లక్షలాది మంది చిన్న ఉత్పత్తిదారులు, వ్యాపారులు చితికిపోయి ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం పడింది.నేడు వెలువడుతోన్న అనేక ఆర్థిక సంబంధిత గణాంకాలు చితికిపోతోన్న ప్రజల వాస్తవ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఉదాహరణకు 2023 –24 ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల రుణభారం, వారి మిగులు ఆదాయంలో (కనీస అవసరాల తాలూకు ఖర్చుల అనంతరం మిగిలే ఆదాయం) 52 శాతానికి చేరుకుంది. ఇది 2022–23లో 48 శాతంగా ఉంది. కాగా, 2019–20 ప్రాంతంలో ఇది 40 శాతమే. ఇక 2012 –13లో అయితే ఈ మిగులు ఆదాయంలో, కుటుంబాల రుణభారం కేవలం 32 శాతం. అంటే, గడిచిన సుమారు దశాబ్ద కాలంలో ప్రజల రుణభారం విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా, కుటుంబాలు తమ ఆదాయాలలో అధిక భాగాన్ని అప్పులు తీర్చేందుకు వినియోగించవలసి వస్తోంది. ఈ కారణం వలన, కనీస అవసరాలకు పోను... ఆ పైన ఖర్చులు పెట్టగల స్థోమత దిగజారిపోయింది. ఈ స్థితిలోనే 2023–24కాలంలో, బ్యాంకుల రిటైల్ రుణాలు 27.5 శాతం మేరకు పెరగగా, ఈ రుణాలు తీసుకున్నవారు, ఆ రుణంలో వినియోగ ఖర్చులకు వాడే మొత్తం కేవలం 8.5 శాతం పెరిగింది. అంటే, కుటుంబీకులు తాము తీసుకున్న రుణం తాలూకు పూర్తి మొత్తాన్ని వినియోగానికి వాడు కోలేకపోతున్నారు. దీనికి కారణం, వారు ఇందులోంచి కొంత భాగాన్ని పాత అప్పులు తీర్చేందుకు వాడటం. ప్రజల ఈ ఆర్థిక దుఃస్థితి వలన 50 వేల రూపాయల లోపు రిటైల్ రుణ గ్రహీతలు వాటిని సరైన సమయంలో చెల్లించలేని పరిస్థితి పెరుగుతోంది. ఫలితంగానే క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాల తాలూకు బకాయిల మొత్తం 2018–19 లోని జీడీపీలో 3.6 శాతం నుంచి 2023–24 నాటికి 5.6 శాతానికి పెరిగిపోయింది. ఈ విధంగా రిటైల్ రుణాలలో మొండి బకాయిగా మారుతున్నవి 8.2 శాతానికి పెరిగాయి. ఈ క్రమంలోనే వ్యవసాయ రుణాలు మొండి బకాయిలుగా మారడం కూడా పెరిగిపోతోంది. ఈ పరిస్థితి తాలూకు ప్రభావం ఏమిటంటే, 2024–25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసి కంలో (ఏప్రిల్–జూన్ ) భారత కార్పొరేట్ల లాభాల పెరుగుదల, దాని ముందరి ఏడాది త్రైమాసికాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. మార్కె ట్లో డిమాండ్ లేక ఈ కార్పొరేట్ల అమ్మకాల స్థాయి కూడా పడి పోయింది. మొత్తంగా ప్రస్తుతం మన దేశీయ మార్కెట్లో డిమాండ్ పతనం కావడం వల్ల, ప్రైవేట్ పెట్టుబడిదారులు కొత్త ప్రాజెక్టుల కోసం పెట్టే పెట్టుబడులు భారీగా తగ్గిపోతున్నాయి. ఈ పెట్టుబడుల స్థాయి 2009 సెప్టెంబర్ త్రైమాసికం నాటి అనంతరం కనిష్ఠ స్థాయిలో ఉంది. గణాంకాలను పరిశీలిస్తే, కొత్త ప్రాజెక్ట్‌లలో ప్రైవేట్ రంగం తాలూకు వాటా 2023–24 లోని చివరి త్రైమాసికం లోని 85.4 శాతం నుంచి, 2024–25 మొదటి త్రైమాసికంలోని 66.7 శాతానికి పడిపోయింది. మరి, ఈ ఆర్థిక పతనానికి కారణం ఏమిటి? ఇతరత్రా కారణాలు ఏవైనా... మోదీ ప్రభుత్వ విధానాల తాలూకు ప్రభావమే ప్రధానంగా ఈ దుఃస్థితికి కారణం. వరుస పరంపరగా మోదీ ప్రభుత్వం దేశం మీద రుద్దిన 1) పెద్ద నోట్ల రద్దు 2) అశాస్త్రీయమైన జీఎస్టీ అమలు 3) కోవిడ్ మహమ్మారి కాలంలో అనుసరించిన అవకతవక ఆర్థిక విధానాల వంటివి దీనికి కారణం. ఉదాహరణకు, పెద్ద నోట్ల రద్దు ప్రభావం వలన దేశంలోని లక్షలాది మంది చిన్న ఉత్పత్తిదారులు, వ్యాపారులు చితికిపోయారు. అసంఘటిత రంగంగా ఉండే వీరు తమ వ్యాపారాలను క్రెడిట్, డెబిట్ కార్డులు, ఆన్ లైన్లో నిర్వహించుకోగల అవకాశం లేక వ్యాపారాల నుంచి వైదొలగిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే, తమ అమ్మకాలకు డెబిట్, క్రెడిట్ కార్డులను అంగీక రించగల పెద్ద రిటైల్ మార్టులు, మాల్స్ వ్యాపారాలు పెరిగాయి. చితికిపోయిన ఈ చిన్న ఉత్పత్తిదారుల వ్యాపారం పెద్ద కార్పొరేట్ సంస్థలకు బదలాయించబడింది. అదీ కథ. పెద్ద నోట్ల రద్దు అనేది అంతిమంగా కాకులను కొట్టి గద్దలకు వేసేదిగా పరిణమించింది.ఇక, జీఎస్టీ అమలు క్రమంలో కూడా లక్షలాది మంది చిన్న వ్యాపారస్థులు, ఉత్పత్తిదారులు చితికిపోయారు. అసంఘటిత రంగంలోని వీరంతా, బలవంతంగా జీఎస్టీ పరిధిలోకి లాగబడి, పెరిగి పోయిన ఖర్చులతో (అదనపు పన్నుల భారం వచ్చి పడింది కనుక) వ్యాపారాలు, ఉత్పత్తి చేయలేక చేతులు ఎత్తేశారు. ఈ విధంగా జీఎస్టీ అమలు దేశంలోని అసంఘటిత రంగానికి చావు దెబ్బ అయ్యింది. కోవిడ్ కాలంలో ప్రభుత్వం అనుసరించిన విధానాల ఫలితంగా, మరెన్నో లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు చితికిపోయాయి. స్థూలంగా ఈ విధానాల అన్నిటి ఫలితంగా 2022–23 నాటికి దేశంలోని సరుకు ఉత్పత్తి రంగంలో ఉన్న, అసంఘటిత రంగ పరిశ్రమల సంఖ్య 9.3 శాతం తగ్గి, 17.82 మిలియన్లకు పరిమితమయ్యింది.దాంతో, ఈ పరిశ్రమలలో 15 శాతం మేర కార్మికులు ఉపాధిని కోల్పోయారు. సాధారణ స్థితిలో, ఈ అసంఘటిత సరుకు ఉత్పత్తి రంగ పరిశ్రమల సంఖ్య దేశంలో సాలీనా 2 మిలియన్ల చొప్పున పెరుగుతూ వచ్చింది. అవకతవక విధానాలు లేకుంటే ఈ అసంఘటిత రంగ సరుకు ఉత్పత్తి పరిశ్రమల సంఖ్య మరింతగా పెరిగి ఉండాలి. స్థూలంగా, మోదీ విధానాల ఫలితంగా సుమారు 10 మిలియన్ల మేర కొత్త సంస్థల ఆవిర్భావానికి ఆస్కారం లేకుండా పోయింది. దీనికిమించి, ఈ సంస్థలు ఒకొక్క దానిలో 2.5 నుంచి 3 ఉపాధి అవకాశాల కల్పనను మనం కోల్పోయాము. ఫలితంగా సుమారు 25–30 మిలియన్ల ఉపాధి అవకాశాల కల్పనకు మార్గం మూసుకుపోయింది. అంటే, ఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగాన్ని... సంఘటిత రంగం దిశగా మళ్ళించే పేరిట, మోదీ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. నిరుద్యోగం పెరిగింది. ఈ విధానాలు తొలుత కొంత పెద్ద కార్పొరేట్లకు అనుకూలించినా, అంతిమంగా నేడు అవి కూర్చున్న కొమ్మను నరుక్కున్న తీరుగా, కార్పొరేట్ల లాభాలకు కూడా గండి కొడు తున్నాయి. ఈ క్రమంలోనే, మార్కెట్లో డిమాండ్ దిగజారిపోయి నేడు రిటైల్ రంగంలోని రిలయన్ ్స, టైటాన్, రేమాండ్ వంటి సంస్థలు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2024 ఆర్థిక సంవ త్సరం కాలంలోనే సుమారుగా 26 వేల మందిని ఈ సంస్థలు ఇంటికి పంపాయి.మోదీ ప్రభుత్వ విధానాల ప్రతికూల ప్రభావాన్ని అర్థం చేసు కొనేందుకు ఒక చిన్న ఉదాహరణను చూద్దాం. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి విధానాలకు ముందర ఎయిర్ కూలర్ల తయారీలో బ్రాండెడ్ సంస్థలతో పాటుగా, స్థానికంగా చవకగా తయారయ్యే కూలర్లు కూడా ఉండేవి. ధర తక్కువ ఉన్న ఈ కూలర్లకు భారీ మార్కెట్టే ఉండేది. కానీ, ఇవి తమ ఉత్పత్తికి అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ కొరతలు, పెరిగిన పన్ను భారాల వల్ల మూసివేత బాట పట్టాయి. మార్కెట్ నుంచి వైదొలగిన ఈ లోకల్ సంస్థల అమ్మకాలు బ్రాండెడ్ కంపెనీలకు బదలాయించబడ్డాయి. ఫలితంగా తొలుత ఈ పెద్ద సంస్థల లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. కానీ, చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు దెబ్బ తినడంతో దేశంలో భారీగా పెరిగిన నిరుద్యోగం వలన ప్రజల కొనుగోలు శక్తి, డిమాండ్ పతనమై అంతిమంగా అది పెద్ద సంస్థల అమ్మకాలూ... లాభాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. బంగారు గుడ్లు పెట్టే బాతును చంపుకు తిన్న విధానాల కథ ఇది. లాభాల దురాపేక్ష తప్ప, దూరదృష్టి లేని కార్పొరేట్ల గుడ్డితనం నేడు మోదీ విధానాల రూపంలో దేశ ప్రజలకు అశనిపాతంగా మారుతోంది!డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులుమొబైల్: 98661 79615 -
ఉద్యోగాలున్నా నైపుణ్యాలేవీ..?
ఉపాధి అవకాశాలున్నా సరైన నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులు లేక కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. దేశంలో ఏటా అత్యధిక మంది గ్యాడ్యుయేట్లను అందించే రాష్ట్రం ఇది. కానీ కంపెనీల అవసరాలకు తగిన నైపుణ్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) ప్రకారం..జులై 2022 నుంచి జూన్ 2023 ఏడాదికిగాను పని చేస్తున్న, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవారిని పరిగణించి శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు(ఎల్ఎఫ్పీఆర్)ను లెక్కించారు. అందులో గరిష్ఠంగా 46 శాతంతో తమిళనాడు మొదటిస్థానంలో ఉంది. దేశంలో సగటున ఈ ఎల్ఎఫ్పీఆర్ 42.4 శాతంగా ఉంది. వర్కర్ పాపులేషన్ రేటు తమిళనాడులో 44 శాతంగా ఉంటే దేశంలో సరాసరి 41.1 శాతంగా నమోదైంది.ఇదీ చదవండి: ఇల్లు కొంటున్నారా..? ఒక్క క్షణం..!దేశవ్యాప్తంగా మొత్తం ఫ్యాక్టరీల్లో పనిచేసే జనాభాలో తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రలోనే 40 శాతం ఉంది. అయితే తమిళనాడులోని కంపెనీల్లో భారీగా ఖాళీలున్నాయని, కానీ ఆయా పోస్టులకు తగిన నైపుణ్యాలు అభ్యర్థుల వద్ద లేవని సంస్థలు చెబుతున్నాయి. రోజూ కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. అందుకు తగినట్లు నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దానివల్ల ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. -
నిరుద్యోగ ‘యువ భారత్’
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగయువత అనేక సవాళ్లు ఎదు ర్కొంటోంది. భారత్‌లోని నిరుద్యోగుల్లో 83 శాతం యువతే ఉండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాథమికోన్నత విద్య (సెకండరీ) లేదా ఆపై ఉన్నతవిద్య (హయ్యర్) అభ్యసించిన యువత నిష్పత్తి క్రమంగా పెరుగుతోంది. వీరి శాతం 2000లో 35.2 శాతం ఉండగా, 2022 నాటికి అది 65.7 శాతానికి (నిరుద్యోగుల శాతం) పెరిగింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ డెవలప్మెంట్ (ఐహెచ్డీ) సంయుక్తంగా రూపొందించి తాజాగా విడుదల చేసిన ఇండియా ఎంప్లాయిమెంట్ రిపోర్ట్ 2024లో అనేక అంశాలు వెల్లడయ్యాయి. 2000– 2019 సంవత్సరాల మధ్య యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు (అండర్ ఎంప్లాయ్మెంట్) తగ్గడం వంటివి భారీగా పెరగగా, కోవిడ్ సందర్భంగా మాత్రం కొంత తగ్గుదల నమోదైనట్టుగా ఈ నివేదిక పేర్కొంది. 2000– 2019 మధ్యలో యువత నిరుద్యోగిత శాతం దాదాపు మూడింతలు (5.7 – 17.5 శాతం) పెరిగింది. 2022 నాటికి అది 12.4 శాతానికి తగ్గింది’ అని ఈ నివేదిక చీఫ్ ఎకనమిక్ అడ్వయిజర్ వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. తెలంగాణ విషయానికొస్తే... సెకండరీవిద్య, ఆపై ఉన్నత చదువులు చదివినా తెలంగాణకు చెందిన యువత ఎక్కువగా నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నట్టుగా ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024లో నివేదిక వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం... ♦ 15–29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 30.3 శాతం అమ్మాయిలు, 18.3% అబ్బాయిలు (మొత్తం 48.6%) నిరుద్యోగులుగా ఉన్నారు. అదే జాతీయ స్థాయిలో ఇదే కేటగిరిలో చూస్తే 65.7 శాతంగా ఉంది. ♦ రాష్ట్రంలో 2005 నుంచి యువతలో నిరుద్యోగిత శాతమనేది క్రమంగా పెరుగుతోందని ఈ నివేదిక తెలిపింది. 2005లో చూస్తే.. యువతలో 14.1నిరుద్యోగ శాతం ఉండగా, 2012కల్లా 14.9 శాతానికి, 2019 కల్లా 34.9 శాతానికి చేరుకుంది. ♦ అదే 2022 సంవత్సరంలో 21.7శాతానికి తగ్గుముఖం పట్టింది. అయితే 2022లో అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిల్లో ఉద్యోగ అవకాశాలు అధికంగా సాధించారు. నిరుద్యోగిత శాతం అబ్బాయిల్లో 18.3 శాతం ఉండగా, అమ్మాయిల్లో అది 30.3 శాతంగా ఉంది. ♦ 2022లో రాష్ట్రంలో 27.5% మంది యువత ‘నాట్ ఇన్ ఎంప్లాయిమెంట్, ఎడ్యుకేషన్స్న్ ఆర్ ట్రైనింగ్’ (నీట్) కేటగి రిలో ఉన్నట్టు ఆ నివేదిక తెలిపింది. 2005 నుంచి 2019 మధ్యలో అది 17.9 శాతం నుంచి 34 మధ్యలో ఉంది. ♦ రాష్ట్రంలో పదిహేనళ్లకు పైబడిన క్యాజువల్ వర్కర్ల నెలవారీ వేతనం విషయానికొస్తే...2022లో మగవారిది రూ.10,175గా, మహిళలది రూ.6,642గా ఉంది. మనోళ్ల టెక్ స్కిల్స్ అంతంతే... దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే తెలంగాణ సాంకేతికంగా, టెక్ స్కిల్స్‌లో ఉన్నతస్థాయిలో నిలుస్తుందని అనుకుంటాం. కానీ... ♦దాదాపు 90 శాతం యువత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ లేదా కంప్యూటర్ ప్రోగ్రామ్ కూడా రాయలేకపోతున్నారు. ♦ అధికశాతం విద్యార్థులకు ఎమ్మెస్ ఎక్సెల్ తదితర అప్లికేషన్లలో విస్తృతమైన పరిజ్ఞానం, అవగాహన లేదు. ♦ 50 శాతానికి పైగా యువత అటాచ్‌మెంట్‌తో కూడిన ఈ–మెయిల్‌ను కూడా పంపించలేకపోతున్నారు. ♦ 53.83 శాతం యువత కాపీ చేసి ఫైల్‌ను మూవ్ చేయగలుగుతున్నారు. ♦ 50.4 శాతం మంది ఏదైనా ఫైల్‌ను కాపీ, పేస్ట్ చేయగలుగుతున్నారు. ♦ కేవలం 14.7 శాతం మాత్రమే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఎలక్ట్రానిక్ ప్రజెంటేషన్ చేస్తున్నారు. నిపుణులు ఏమంటున్నారంటే... ♦ తెలంగాణలోని అనేక స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్‌లున్నా, సాంకేతిక అంశాలు బోధించే టీచర్లు, టెక్ నైపుణ్యం ఉన్నవారు లేకపోవడమే కారణమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ అంశాలన్నింటిని కూడా పాఠశాల బోధనాంశాల్లో చేర్చితేనే ప్రయోజనం ఉంటుందని వారు చెబుతున్నారు. -
ఈవీఎం, ఈడీ, ఐటీ లేకుండా మోదీ ఎన్నికల్లో నెగ్గలేడు: రాహుల్
ముంబై/లఖ్‌నవూ: బీజేపీ పాలనలో దేశంలో పెచ్చరిల్లిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విద్వేషం తదితరాలను ప్రజలకు చాటిచెప్పేందుకు విధిలేని పరిస్థితుల్లో భారత్ జోడో యాత్రలు చేపట్టాల్సి వచి్చందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ అన్నారు. జాతుల హింసతో అట్టుడికిన మణిపూర్‌లో జనవరి 14న మొదలు పెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర 63 రోజులకు ఆదివారం ముంబైలో ముగిసింది. ఈ సందర్భంగా సెంట్రల్ ముంబైలోని అంబేడ్కర్ స్మారకం చైత్యభూమిని రాహుల్ సందర్శించారు. రాజ్యాంగ ప్రవేశికను చదివి నివాళులరి్పంచారు. అనంతరం స్థానిక శివాజీ పార్కులో విపక్ష ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీలో మాట్లాడారు. మోదీ ఓ అసమర్థ నేత అంటూ దుయ్యబట్టారు. ఈవీఎంలు, ఈడీ, సీబీఐ, ఐటీ లేకుండా లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గడం ఆయన తరం కాదన్నారు. ‘‘మోదీ కేవలం అధికారం కోసం అర్రులు చాచే ముసుగు మనిషి. అవినీతిపై మోదీదే గుత్తాధిపత్యం. తనది 56 అంగుళాల ఛాతీ అని ఆయన చెప్పుకునే మాటలన్నీ అబద్ధాలే’’ అంటూ తీవ్ర పదజాలంతో దుయ్యబట్టారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కోసం వీవీప్యాట్లను కచ్చితంగా లెక్కించాలన్న తమ డిమాండ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అంగీకరించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ మోదీ గ్యారెంటీ సంపన్నుల కోసమైతే ఇండియా కూటమి హామీలు సామాన్యుని కోసమన్నారు. విపక్షాల బల ప్రదర్శనలో భాగంగా జోడో యాత్ర ముగింపులో ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు శరద్ పవార్ (ఎన్సీపీ–శరద్), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), ఉద్ధవ్ ఠాక్రే (శివసేన–యూబీటీ), ఫరూఖ్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితరులు వీరిలో ఉన్నారు. ఇండియా కూటమిలో కీలక పక్షమైన సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాత్రం గైర్హాజరయ్యారు. అయితే, యాత్ర ను రాహుల్ విజయవంతంగా ముగించారని కొనియాడుతూ ఆయనకు లేఖ రాశారు. వచ్చేది ‘ఇండియా’ సర్కారే గాంధీ ముంబై నుంచే క్విట్ ఇండియా నినాదమిచ్చారని శరద్ పవార్ గుర్తు చేశారు. బీజేపీని అధికారం నుంచి దించేందుకు ఇండియా కూటమి కూడా ముంబైలో ప్రతినబూనాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఇండియా కూటమేనని స్టాలిన్ అన్నారు. ఎన్నికల బాండ్లను బీజేపీ పాల్పడ్డ వైట్ కాలర్ నేరంగా అభివర్ణించారు. ప్రజలంతా ఒక్కటైనప్పుడే నియంతృత్వానికి తెర పడు తుందని ఉద్ధవ్ అన్నారు. ఈడీ, సీబీఐ సాయంతో రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూలదోస్తోందని తేజస్వి మండిపడ్డారు. తమ పోరు విద్వేష రాజకీయాలపైనే తప్ప మోదీపైనో, అమిత్ షాపైనో కాదన్నారు. రాజ్యాంగాన్ని మార్చడం బీజేపీ తరం కాదు అంతకుముందు ముంబైలో మహాత్మాగాంధీ నివసించిన మణిభవన్‌ను రాహు ల్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చడం బీజేపీ తరం కాదన్నారు. ఈ విషయంలో పార్టీ ప్రకటనలు ఉత్తి అరుపులు మాత్రమేనన్నారు. ‘‘జ్ఞానం కేవలం ఒక్క వ్యక్తి సొత్తేనన్నది బీజేపీ, ఆరెస్సెస్ భావన. రైతులు, కారి్మకులు, నిరుద్యోగ యువతకు ఏమీ తెలియదన్నది వారి దురభిప్రాయం’’ అంటూ మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికలను కేంద్రీకృత పాలనే కావాలనే బీజేపీ, అది వికేంద్రీకృత తరహాలో సాగాలనే కాంగ్రెస్ భావజాలాల మధ్య పోరుగా అభివరి్ణంచారు. -
ఉద్యోగాల భర్తీకి తొలగిన న్యాయ చిక్కులు
తెలంగాణ రాష్ట్రం ఏర్ప డినంక నిరుద్యోగుల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడినట్లు అయింది. నీళ్లు, నిధులు, నియామకాలే ఎజెండాగా సాగిన ఉద్య మంలో నిరుద్యోగులకు గత ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలుపై విధానపరమైన నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం వల్ల వేలాది ఉద్యోగాలు, ఉద్యోగ ప్రకటనలకే పరిమి తమై భర్తీకి నోచుకోలేదు. పక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్‌లో 2016లోనే జీవో నెం. 40ని జారీ చేసి ఉద్యోగ నియామకాల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేస్తున్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం క్లిష్టమైనటువంటి మహిళా రిజర్వేషన్ అమలుపై హైకోర్టు ఆదేశానుసారంగా నిర్ణయం తీసుకొని ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన మహిళా కోటాకుసంబంధించిన జీవోలను రద్దు చేస్తూ, 3, 35నంబర్ల జీవోలను జారీ చేసి ఉద్యోగ నియామక ప్రక్రియలు కొనసాగే విధంగా మార్గాన్ని సుగుమం చేసింది. నూతన విధానంలో 100 పాయింట్ల రోస్టర్‌లో మహిళలకు ప్రత్యేక రోస్టర్ పాయింట్లను కేటాయించ కుండా ప్రతీ ఉద్యోగ ప్రకటనలో ఓసీ, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగుల, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలకు కలిపి మొత్తం 33.33 శాతం పోస్టు లను కేటాయించనున్నారు. అనగా ప్రతీ కేటగి రిలో ప్రతీ నాలుగు పోస్టుల్లో ఒక్క పోస్టు మహిళ లకు సమాంతరంగా కేటాయించ బడుతుంది. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 1992 నుండి నేటి వరకు ప్రధాన కేసులైన ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ అఫ్‌ఇండియా, రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తదితర తీర్పుల్లో వర్టికల్ రిజర్వేషన్లుగాఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాలను; హారిజాంటల్ రిజ ర్వేషన్లుగా మహిళా, దివ్యాంగులు, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్సీసీ కోటాలను నిర్ధారించింది. అందులో వర్టికల్/ నిలువు/ సామాజిక మరియు హారిజాంటల్/ సమాంతర/ ప్రత్యేక రిజర్వేష న్లను ఏవిధంగా అమలు చెయ్యాలో స్పష్టం చేసింది. వర్టికల్ రిజర్వేషన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 15(5), 15(6), 16(4), 16(6) ద్వారా కల్పిస్తున్నవి. కావున ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ ఎస్ అభ్యర్థులు జనరల్ కేటగిరీ పోస్టులకు కూడా పోటీపడి ఎంపిక కావచ్చు. ఫలితంగా వారికి కేటాయించిన రిజర్వేషన్ శాతాన్ని మించి ఎంపిక కావచ్చు. ఆర్టికల్ 15(3)ను అనుసరించి సమాంతర రిజర్వేషన్ పద్ధతిలో మహిళలకు మొత్తం ఉద్యోగాల్లో 33.33 శాతం పోస్టులకు మాత్రమే ఎంపిక అవ్వడానికి ఆస్కారం ఉంది. మహిళలు జనరల్ కేటగిరీ పోస్టులకు ఎన్నికైనా వారిని కూడా ఈ 33.33 శాతం కిందకే తీసుకువస్తారు. అంటే మహిళలు 33.33 శాతానికి మించి ఎంపిక కాకూడదన్నమాట. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2009లో జూనియర్ సివిల్ జడ్జీల నియామకా లకు సంబంధించిన కేసు: కె. వెంకటేష్ వర్సెస్ గవర్నమెంట్ అఫ్ ఆంధ్రప్రదేశ్, 2020లో తెలంగాణ హైకోర్టు మాచర్ల సురేష్ వర్సెస్ స్టేట్ అఫ్ తెలంగాణ మధ్య జరిగిన కేసుల తీర్పుల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చెయ్యాలని ఆదేశించాయి. దిన పత్రికల్లో 2020 నుండి మహిళా రిజ ర్వేషన్ల సమస్యపై పతాక శీర్షికల్లో వార్తలు వచ్చి నప్పటికీ, గత తెలంగాణ ప్రభుత్వానికి విధాన పరమైన నిర్ణయం తీసుకోవడానికి సమయం లేకపోయింది. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ సమయంలో నిర్ణయం తీసుకొని 3, 35 నంబర్ల జీవోలను జారీ చేయడం స్వాగతించ వలసిన అంశం. - వ్యాసకర్త తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మొబైల్: 94909 59625 - కోడెపాక కుమార స్వామి -
‘జై శ్రీరాం’ అంటూనే ఆకలితో చావాలనుకుంటున్నారు: మోదీపై రాహుల్ ఫైర్
భోపాల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓ వైపు దేశంలో నిరుద్యోగం, ఉపాధి లేక ఆకలి చావులు పెరిగిపోతున్నాయని.. మరోవైపు ప్రధాని మోదీ మాత్రం ‘జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయాలని చెబుతున్నారని మండిపడ్డారు. ప్రజలతో 'జై శ్రీరాం' అని చెప్పిపిస్తూ.. వారు ఆకలితో చనిపోవాలని ప్రధాని కోరుకుంటున్నారని ఆరోపించారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని సారంగ్‌పూర్‌లో భారత్ జోడో న్యాయ యాత్ర యాత్రలో భాగంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.. యాత్రలో భాగంగా రాహుల్‌కు ‘ మోదీ, మోదీ, జై శ్రీరాం’ అనే నినాదాలతో బీజేపీ కార్యకర్తలు వ్యంగ్యంగా ఆహ్వానం పలికారు. బీజేపీ శ్రేణుల చర్యపై స్పందించిన రాహుల్.. మోదీపై విమర్శలు గుప్పించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని, ఉద్యోగాలు లేక యువత సోషల్ మీడియాలో రోజంతా రీల్స్ చూస్తూ గడుపుతున్నారని అన్నారు. ‘మీరు రోజంతా ఫోన్లు చూస్తూ.. జై శ్రీరామ్ అని నినాదాలు చేసి, ఆకలితో చనిపోవాలని ప్రధాని కోరుకుంటున్నారు’ అని ఆరోపించారు. చదవండి: రాజకీయాల్లోకి అభిజిత్ గంగోపాధ్యాయ.. త్వరలో ఆ పార్టీలోకి కేంద్ర ప్రభుత్వ అగ్నివీర్ పథకంపై రాహుల్ మాట్లాడుతూ.. గతంలో సాయుధ దళాలు యువతకు రెండు హామీలు ఇచ్చాయని, యువతకు పెన్షన్ ఇవ్వడంతోపాటు వారు మరణిస్తే సరైన గౌరవం పొందుతారని చెప్పినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం అగ్నివీర్ పథకం కింద నలుగురిని తీసుకొని ముగ్గురిని వదిలేస్తారని.. ఆ ముగ్గురిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలే ఉంటారని విమర్శించారు. పాకిస్తాన్‌తో పోలిస్తే భారతదేశంలో నిరుద్యోగం రెట్టింపుగా ఉందని రాహుల్ అన్నారు. ఆదివారం గ్వాలియర్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్ర మధ్య జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ నేత మాట్లాడుతూ.. భారత్‌లో నిరుద్యోగం 23 శాతంగా ఉంటే పాక్‌లో 12 శాతం ఉందన్నారు. బంగ్లాదేశ్, భూటాన్‌ల కంటే దేశంలో నిరుద్యోగ యువత సంఖ్య ఎక్కువగా ఉందని, భారతదేశ నిరుద్యోగిత రేటు గత 40 ఏళ్లలో ఇదే అత్యధికమని ఆయన పేర్కొన్నారు. Rahul Gandhi Ji and soldier in Madhya Pradesh Jitu Patwari resumed the Bharat Jodo Nyay Yatra from Sarangpur. pic.twitter.com/EkgGr89Dyx — Shantanu (@shaandelhite) March 5, 2024 -
తగ్గిన నిరుద్యోగిత రేటు - క్యూ3 బులిటెన్ విడుదల
న్యూఢిల్లీ: దేశీయంగా పట్టణ ప్రాంతాల్లో 2023 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 15 ఏళ్లకు పైబడిన వారిలో నిరుద్యోగిత రేటు 6.5 శాతానికి తగ్గింది. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధిలో రేటు 7.2 శాతంగా నమోదైంది. కార్మిక శక్తి సర్వేకు (పీఎల్ఎఫ్ఎస్) సంబంధించి ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన త్రైమాసిక బులెటిన్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ‘2022 అక్టోబర్–డిసెంబర్లో పురుషుల్లో నిరుద్యోగిత రేటు 6.5 శాతంగా ఉండగా 2023 డిసెంబర్ త్రైమాసికంలో 5.8 శాతానికి తగ్గింది. మహిళలలో ఇది 9.6 శాతం నుంచి 8.6 శాతానికి దిగి వచ్చింది‘ అని బులెటిన్ పేర్కొంది. ఇక పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లకు పైబడిన వర్కర్ల జనాభా నిష్పత్తి 44.7 శాతం నుంచి 46.6 శాతానికి పెరిగినట్లు వివరించింది. పురుషుల్లో ఇది 68.6 శాతం నుంచి 69.8 శాతానికి మహిళల్లో 20.2 శాతం నుంచి 22.9 శాతానికి పెరిగింది. ఎప్పటికప్పుడు కార్మిక శక్తి వివరాలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2017లో పీఎల్‌ఎఫ్‌ఎస్‌ను ప్రారంభించింది. -
Mallikarjun Kharge: ‘పదేళ్ల అన్యాయ కాలం’
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ పదేళ్ల వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ గురువారం ‘బ్లాక్ పేపర్’ విడుదల చేసింది. మోదీ పాలనా కాలంలో ప్రజలకు వాటిల్లిన సామాజిక, రాజకీయ, ఆర్థిక అన్యాయాన్ని ఇందులో ప్రముఖంగా ప్రస్తావించింది. మోదీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిందని, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, వ్యవసాయ రంగం విధ్వంసానికి గురైందని, మహిళలపై నేరాలు పెరిగాయని పేర్కొంది. పెద్ద నోట్లను రద్దు చేయడం అతిపెద్ద తప్పు అని స్పష్టం చేసింది. ఈ బ్లాక్ పేపర్‌కు ‘10 సంవత్సరాల అన్యాయ కాలం’గా పేరుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వైట్ పేపర్‌కు పోటీగా ఈ బ్లాక్ పేపర్‌ను కాంగ్రెస్ తీసుకొచి్చంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 54 పేజీల ఈ బ్లాక్ పేపర్‌ను నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ‘చార్జిషీట్’గా అభివరి్ణంచారు. గత పదేళ్ల కాలమంతా అన్యాయ కాలమేనని విమర్శించారు. ఆయన ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. పార్లమెంట్లో ఎన్నో మాటలు చెప్పే ప్రధానమంత్రి వైఫల్యాలను మాత్రం నిస్సిగ్గుగా దాచిపెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ అసమర్థత గురించి తాము మాట్లాడితే దానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. అందుకే సర్కారు వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడానికి బ్లాక్ పేపర్ తీసుకొచ్చామన్నారు. ఉత్తరం, దక్షిణం పేరిట దేశాన్ని విచి్ఛన్నం చేయడానికి కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని మోదీ చేసిన విమర్శలపై ఖర్గే స్పందించారు. గతంలో మాట్లాడిన మాటలను అబద్ధాలకోరులు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్ పన్ను హక్కులు అంటూ మాట్లాడారని గుర్తుచేశారు. దళితుడిని లక్ష్యంగా చేసుకుంటున్నారు తనను దూషిస్తూ కొన్నిరోజులుగా ఫోన్‌కాల్స్ వస్తున్నాయని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని ఖర్గే తెలిపారు. 53 ఏళ్లుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నానని, దళితుడినైన తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల గురించి తాము నిలదీసినప్పుడల్లా ప్రధాని మోదీ.. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై వివక్ష ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడానికి బీజేపీ కుట్రలు సాగిస్తోందని, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్ నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, వాటిపై వివక్ష కొనసాగుతోందని చెప్పారు. ఆయా రాష్ట్రాలకే కేంద్రం నిధులు ఇవ్వడంలేదని, పైగా నిధులిస్తే ఖర్చు చేయడం లేదంటూ అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. ఇది కుట్ర కాదా? అని ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్ల ముసుగులో మోదీ ప్రభుత్వం లూటీకి పాల్పడుతోందని, ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికి ఈ సొమ్మును వాడుకుంటోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 411 మంది ఎమ్మెల్యేలను బీజేపీ వైపు తిప్పుకున్నారని, పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టారని ఆక్షేపించారు. -
నిరుద్యోగంపై సీఎం జగన్ ప్రణాళిక ఏంటి..?
-
ఉద్యోగం రావడంలేదని యువకుడి బలవన్మరణం
డోర్నకల్: ఉద్యోగం రావడంలేదనే మనోవేదనతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ శివారు ఎర్రమట్టితండాలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. డోర్నకల్ సీఐ బి.ఉపేందర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... ఎర్రమట్టితండాకు చెందిన భూక్యా అనిల్ అలియాస్ విజయ్(23) డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే కొన్ని పోటీపరీక్షలకు హాజరైన అనిల్ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఆర్థిక ఇబ్బందులకుతోడు ఉద్యోగం రావడం లేదన్న మనోవేదనలో ఉన్న అనిల్ శుక్రవారం అర్ధరాత్రి తరువాత ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. మరునాడు ఉదయం కుటుంబసభ్యులు గమనించి చుట్టుపక్కల వెతకగా తండా సమీపంలోని ఓ వ్యవసాయబావిలో అనిల్ మృతదేహం లభ్యమైంది. మృతదేహం నుంచి పురుగుమందు వాసన రావడాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. ఉద్యోగం రాలేదనే బాధతోనే అనిల్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అనిల్ తండ్రి జయరాజ్ 20 ఏళ్ల క్రితమే అదృశ్యంకాగా, తల్లి, సోదరుడు ఉన్నారు. తల్లి కల్పన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అనిల్ ఆత్మహత్యకు ముందు రాసినట్లుగా చెబుతున్న ఓ లేఖ వాట్సాప్‌లో చెక్కర్లు కొట్టింది. ఉద్యోగం రాకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో అనిల్ పేర్కొన్నాడు. కాగా, లేఖ విషయం తమ దృష్టికి రాలేదని పోలీసులు తెలిపారు. -
పార్లమెంట్‌పై దాడి..కారణాలు చెప్పిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పార్లమెంట్లో అలజడి ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.ధరల పెరుగుదల, నిరుద్యోగం కారణాల వల్లే పార్లమెంట్‌పై కలర్‌స్మోక్ దాడి జరిగిందని తెలిపారు. ‘అసలు పార్లమెంట్‌పై దాడి ఎందుకు ఎజరిగింది. నిరుద్యోగం ఈ దేశంలో పెద్ద సమస్య. ఈ సమస్యతో దేశం అట్టుడుకుతోంది. ప్రధాని మోదీ పాలసీ వల్లే యువతకు ఉద్యోగాలు లేవు’అని శనివారం రాహుల్ మీడియాతో వ్యాఖ్యానించారు. డిసెంబర్13న మధ్యాహ్నం నీలం సింగ్, అమోల్ షిండే అనే ఇద్దరు వ్యక్తులు కలర్‌స్మోక్‌తో లోక్‌సభ సందర్శకుల గ్యాలరీ నుంచి ఎంపీలపైకి దూకిన విషయం తెలిసిందే. దేశంలోని నిరుద్యోగంపై నిరసన తెలిపేందుకే ఈ దాడికి పాల్పడ్డారని నిందితుల కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదీచదవండి..మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కొత్త చీఫ్‌గా జీతూ పట్వారీ -
‘పార్లమెంట్ ఘటనకు మోదీ విధానాలే కారణం’
న్యూఢిల్లీ: దేశంలోని పెరిగిపోయిన యువత నిరుద్యోగానికి కారణం నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన శనివారం మొదటి సారీ పార్లమెంట్ భద్రత వైఫల్యంపై మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ భద్రత వైఫల్యం వంటి ఘటనలు జరగడానికి కారణం యువతకు సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడమని అన్నారు. దేశంలో నిరుద్యోగమనే అతిపెద్ద సమస్యను ఎదుర్కొవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. మోదీ పాలసీలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయని దుయ్యబట్టారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం జరిగింది నిజమేనని.. అయితే లోక్ సభలో ఈ ఘటన ఎందుకు చోటు చేసుకుంది? ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం అతి పెద్ద సమస్యగా మారిందని అన్నారు. కేవలం యువత నిరుద్యోగం ప్రధాని మోదీ అవలంభిస్తున్న విధానాల వల్లనే పెరిగిందని ధ్వజమెత్తారు. దీంతో దేశంలోని యువత ఉద్యోగాలను పొందలేకపోతున్నారని అన్నారు. మోదీ విధానాల వల్ల దేశంలో పెరుగుతున్న.. నిరుద్యోగం, ద్రవ్యోల్బణమే పార్లమెంట్ భద్రతా వైఫల్యం వెనకాల ప్రధాన కారణాలుగా ఉన్నాయని రాహుల్‌గాంధీ ఆరోపించారు. పార్లమెంట్ ఘటనకు సంబంధించిన అరెస్టు అయిన నిందితుల్లో ముగ్గురూ నిరుద్యోగ బాధితులు ఉన్నారు. నిందితులు ఉద్యోగాలు రాక చాలా నిరుత్సాహంతో ఉన్నట్లు వారి కుటుంబ సభ్యులు కూడా తెలియజేసిన సంగతి తెలిసిందే. VIDEO | "Security breach happened in Lok Sabha. The reason behind this is unemployment and inflation due to PM Modi's policies," says Congress leader @RahulGandhi. pic.twitter.com/BFkEAjoZwI — Press Trust of India (@PTI_News) December 16, 2023 -
తగ్గిన నిరుద్యోగ రేటు - గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ త్రైమాసికంలో పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి నిరుద్యోగిత రేటు 6.6 శాతానికి తగ్గింది. గతేడాది ఇదే కాలంలో ఇది 7.2 శాతం నమోదైంది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో నిరుద్యోగిత రేటు 6.8 శాతంగా ఉండగా, ఏప్రిల్–జూన్‌లో 6.6 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లోని స్త్రీలలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో నిరుద్యోగం రేటు 2023–24 ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌లో 8.6 శాతానికి వచ్చి చేరింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఇది 9.4 శాతంగా ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్‌లో 9.1 శాతం, జనవరి–మార్చిలో 9.2 శాతం, అక్టోబర్–డిసెంబర్ 9.6 శాతం నమోదైంది. పట్టణ ప్రాంత పురుషులలో నిరుద్యోగిత రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌లో 6 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఇది 6.6 శాతంగా ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్‌లో 5.9 శాతం ఉంది. 2022–23 జనవరి–మార్చిలో 6 శాతం, అక్టోబర్–డిసెంబర్లో 6.5 శాతంగా నమోదైంది. క్రియాశీల శ్రామిక శక్తి.. 2023 జూలై–సెప్టెంబర్‌లో పట్టణ ప్రాంతాలలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తుల్లో క్రియాశీల శ్రామిక శక్తి 49.3 శాతానికి పెరిగింది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 47.9 శాతంగా ఉంది. 2023 ఏప్రిల్–జూన్‌లో 48.8 శాతం, 2022–23 ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చిలో 48.5 శాతం, అక్టోబర్–డిసెంబర్లో 48.2 శాతం నమోదైంది. -
ఏపీలో తగ్గిన నిరుద్యోగం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నిరుద్యోగిత రేటు తగ్గింది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గణాంకాలు స్పష్టం చేశాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేస్తూనే.. మరోవైపు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద పీట వేస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తోంది. ఈ కృషి ఆర్బీఐ గణాంకాల్లో స్పష్టంగా కనిపించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగితపై ఆర్బీఐ నివేదిక విడుదల చేసింది. చంద్రబాబు హయాం(2018–19)లో నిరుద్యోగుల సంఖ్యతో పోల్చి చూస్తే 2022–23లో నిరుద్యోగుల సంఖ్య తగ్గిందని ఆర్బీఐ వెల్లడించింది. వైఎస్సార్సీపీ పాలనలో ఉద్యోగాలు, ఉపాధే లక్ష్యంగా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే సీఎం వైఎస్ జగన్ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాకుండా.. గ్రామ సచివాలయాల్లో పది మంది చొప్పున, పట్టణ సచివాలయాల్లో 11 మంది చొప్పున శాశ్వత ఉద్యోగాలను కల్పించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు 4.93 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తే.. ఇందులో శాశ్వత ఉద్యోగాలే 2.13 లక్షలు ఉన్నాయి. మరోవైపు స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 2.5 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటయ్యాయి. తద్వారా కొత్తగా 16.5 లక్షల మందికి ఉపాధి లభించింది. దీనికి తోడు వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, కాపు నేస్తం వంటి పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక సాయం అందిస్తూ చిన్నచిన్న వ్యాపారాలతో పాటు పెద్దపెద్ద మార్ట్ల ద్వారా వ్యాపారాలను ప్రోత్సహిస్తోంది. దీంతో లక్షలాది మంది మహిళలు తాము జీవనోపాధి పొందడంతో పాటు ఇతరులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. అలాగే క్యాంపస్ ఉద్యోగాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చింది. ఆ ఉద్యోగాలకు ఎంపికయ్యేలా విద్యార్థులకు తగిన శిక్షణ అందజేస్తోంది. దీంతో ఇప్పటివరకు 1.2 లక్షల మందికి క్యాంపస్ ఉద్యోగాలు లభించాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల ఫలితంగా చంద్రబాబు పాలనలోని 2018–19లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి 45 మంది నిరుద్యోగులుండగా.. 2022–23లో ఆ సంఖ్య 33కు తగ్గింది. అలాగే 2018–19లో పట్టణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి 73 మంది నిరుద్యోగులుండగా.. 2022–23లో ఆ సంఖ్య 65కు తగ్గిందని ఆర్బీఐ నివేదిక తెలిపింది. అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలు, పురుషుల్లోని నిరుద్యోగుల సంఖ్యలో 2018–19 కంటే 2022–23లో తగ్గిందని ఆర్బీఐ వెల్లడించింది. టీడీపీ పాలనలో ఉపాధి కల్పన శూన్యం.. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాల కల్పన, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని అసలు పట్టించుకోలేదు. ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన కన్సల్టెంట్లు, ఏజెన్సీల నియామకంపైనే దృష్టి సారించింది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కేవలం 34 వేల ఉద్యోగాలనే భర్తీ చేశారు. దీంతో ఆయన హయాంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లోని నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. 2018–19లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి 45 మంది నిరుద్యోగులు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి 73 మంది నిరుద్యోగులు ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. -
కొత్త ఉద్యోగాలు సృష్టించాలంటే ఇది తప్పనిసరి
భారతదేశ దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉన్నప్పటికీ, పెరుగుతున్న ఉద్యోగ డిమాండ్‌ను తీర్చడానికి మాత్రం వృద్ధి రేటు ఎనిమిది శాతం కంటే ఎక్కువగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామరాజన్ స్పష్టం చేశారు. చైనా రాజధాని బీజింగ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇతర దేశాలతో పోలిస్తే ప్రస్తుతం భారతదేశం 6-6.5 శాతం ఆర్థిక వృద్ధి నమోదు చేస్తోందని, కొత్త ఉద్యోగాలు కల్పించేందుకు ఇది సరిపోదని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతోపాటు భారత దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను విశ్లేషిస్తూంటారన్నది మనకు తెలిసిన విషయమే. మరోవైపు భారత్‌లో ఏటా నిరుద్యోగం పెరుగుతోంది. దీనికి తోడు ఏటా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగ వేటలో పడుతున్నవారి సంఖ్య అధికమవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా దేశం ఏ మేరకు వృద్ధి సాధించాలో ఆయన తన అంచనాలను వెల్లడించారు. ‘జనాభా అవసరాలు తీర్చాలన్నా.. కొత్త ఉద్యోగాలు సృష్టించాలన్నా భారతదేశం 8-8.5 శాతం ఆర్థికవృద్ధి సాధించాలి. ఉత్పాదకతలో చైనా, వియత్నాం వంటి దేశాలతో పోటీ పడాలి. అందుకు అవసరమయ్యే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. ఐఫోన్ వంటి ప్రతిష్టాత్మక ఉత్పత్తులను దేశంలో తయారు చేస్తున్నారు. కానీ వీటి విడిభాగాలు తయారీలో దేశం పురోగతి చెందింది. అయితే పూర్తి స్థాయి సామర్థ్యాలను సాధించడంలో మాత్రం ఇంకా వృద్ధి చెందాలి’ అని రఘురామ్‌రాజన్ అన్నారు. ప్రపంచ బ్యాంక్ సీనియర్ ఆర్థికవేత్త ధ్రువ్ శర్మ ఇటీవల మాట్లాడుతూ 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే దాదాపు ఏటా 8 శాతం ఆర్థికవృద్ధి నమోదు చేయాలని సూచించిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటేనే అది సాధ్యమవుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం చేస్తున్న వ్యయం, ఇతర నియంత్రణ చర్యల వల్ల కొవిడ్ తర్వాత దేశం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోంది. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే మెరుగైన పనితీరు కనబరుస్తున్నప్పటికీ, ఏటా ఉద్యోగాలు కల్పించడంలో మాత్రం సవాళ్లు ఎదుర్కొంటునట్లు నిపుణులు చెబుతున్నారు. నిరుద్యోగిత రేటు అక్టోబర్‌లో 10.05 శాతానికి చేరుకుందని ముంబైలోని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక తెలిపింది. రాబోయే దశాబ్దంలో దేశంలో ఏడు కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించాలని హెచ్ఎస్బీసీ సూచిస్తుంది. -
కేసీఆర్‌ను జైలుకు పంపడం ఖాయం
పెద్దపల్లిరూరల్: కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కోట్లాది రూపాయలు దిగమింగిన సీఎం కేసీఆర్‌ను, ఆయన కుటుంబసభ్యులను జైలు కు పంపడం ఖాయమని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. రూ.లక్షన్నర కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగిపోతోందని, అందుకు కల్వకుంట్ల కుటుంబసభ్యులే కారకులని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు అందుబాటులోకి వస్తాయని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావంతులైన నిరుద్యోగ యువతశక్తిని నీరుగార్చారని ఆరోపించారు. ఇప్పుడు ఏంచేయాలో తెలియక విద్యావంతులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రతి ఏటా రంజాన్ పండుగకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసుడే తప్ప మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించలేనిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇఫ్తార్ విందులు కావు.. న్యాయం కావాలని మైనారిటీలు అడుగుతున్నారని పేర్కొన్నారు. సభలో పార్టీ నాయకులు ఈర్ల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ మేళాల పేరిట మోదీ డ్రామాలు: ఖర్గే
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం విమర్శించారు. ఉద్యోగ మేళాల పేరిట మోదీ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఉద్యోగాలు, ప్రమోషన్లు వచి్చనవారికి మళ్లీ నియామక పత్రాలు ఇస్తూ ప్రచారం కోసం పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగాల కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న కోట్లాది మంది యువత ఆశలపై ప్రధానమంత్రి నీళ్లు చల్లుతున్నారని ఆక్షేపించారు. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగిత శాతం రెండేళ్ల గరిష్టాన్ని అధిగమించిందంటూ ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ లిమిటెడ్’ తాజాగా విడుదల చేసిన నివేదికను ఖర్గే ప్రస్తావించారు. మోదీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతకు తీరని అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో 90 లక్షలకుపైగా ఉద్యోగాలు మాయమయ్యాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థిత మరింత దారుణంగా ఉందన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనుల కోసం డిమాండ్ 20 శాతం పెరిగిందని తెలిపారు. మొత్తానికి దేశంలో నిరుద్యోగం 10.8 శాతానికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యువతలో నిరుద్యోగం 13.4 శాతంగా ఉందని, ప్రభుత్వ సర్వేలోనే ఈ విషయం బయటపడిందని పేర్కొన్నారు. ఉద్యోగాల విషయంలో తప్పుడు ప్రకటనలు, ట్రిక్కులు ఎక్కువ కాలం చేయవని తేలి్చచెప్పారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలి్పంచకుండా అన్యాయం చేసిన వారిపై యువత ప్రతీకారం తీర్చుకుంటారని, ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతున్నారన్నారు. -
జూన్ త్రైమాసికంలో తగ్గిన నిరుద్యోగం
న్యూఢిల్లీ: పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 6.6 శాతానికి తగ్గింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికం నాటికి ఇది 7.6 శాతంగా ఉన్నట్టు జాతీయ శాంపిల్ సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్వో) వెల్లడించింది. ఇందుకు సంబంధించి 19వ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదికను విడుదల చేసింది. 15 ఏళ్ల పైన వయసుండి, పనిచేసే అర్హతలు కలిగిన వారిలో, ఉపాధి లేమిని ఈ రేటు సూచిస్తుంటుంది. 2023 జనవరి–మార్చి కాలంలో నిరుద్యోగం 6.8 శాతంగా, 2022 జూలై–సెప్టెంబర్, అక్టోబర్–డిసెంబర్లో 7.2 శాతంగా నిరుద్యోగ రేటు ఉండడం గమనించొచ్చు. పట్టణాల్లో 15 ఏళ్లకు పైన మహిళల్లో నిరుద్యోగం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 9.5 శాతం నుంచి 9.1 శాతానికి తగ్గింది. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య ఇది ఇది 9.2 శాతంగా ఉంది. పురుషుల్లో నిరుద్యోగ రేటు జూన్ త్రైమాసికంలో 5.9 శాతానికి క్షీణించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 7.1 శాతంగా ఉంటే, ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య 6 శాతంగా ఉండడం గమనార్హం. కార్మికుల భాగస్వామ్య రేటు పట్టణ ప్రాంతాల్లో 48.8 శాతానికి పుంజుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 47.5 శాతంగా ఉంది. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య ఇది పట్టణాల్లో 48.5 శాతంగా ఉంది. -
అటు సన్నద్ధానికి, ఇటు సహనానికి.. మళ్లీ.. మళ్లీ ‘పరీక్షే’
సాక్షి, హైదరాబాద్: సర్కారు కొలువు సాధించడం ఓ యజ్ఞమే. దీనికోసం ఏళ్ల తరబడి కష్టపడేవారు కొందరు ఉంటున్నారు. అన్నీ వదిలేసి కోచింగ్ తీసుకునేవారు మరికొందరు ఉంటారు. ప్రైవేట్ ఉద్యోగాలకు రాజీనామా చేసేవారు, దీర్ఘకాలిక సెలవు పెట్టేవారూ ఉంటారు. అయితే లీకేజీల మకిలీ, పరీక్షల వాయిదా, పరీక్షల రద్దు ఇలా వరుస ఘటనలు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేవారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. ప్రిపరేషనే ఓ పరీక్ష అయితే...సహనానికీ పరీక్ష పెట్టినట్టుగా ఉందని నిరుద్యోగులు వాపోతున్నారు. 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు తెలంగాణస్టేట్ పబ్లిక్‌సర్విస్ కమిషన్ గతేడాది ఏప్రిల్‌లో గ్రూప్–1 ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత వరుసగా ఇప్పటివరకు 30 ఉద్యోగ నియామక ప్రకటనలు ఇచ్చింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఎక్కువ సంఖ్యలో ఏకంగా 503 ఉద్యోగాలతో గ్రూప్–1 ప్రకటన వెలువడడంతో నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారిలో ఎంతో ఉత్సాహం నింపింది. ఆ తర్వాత గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4, ఇంజనీరింగ్ ఉద్యోగాలతోపాటు జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, పాలిటెక్నిక్ టీచర్స్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, లైబ్రేరియన్స్, డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్స్, హార్టీకల్చర్ ఆఫీసర్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, టౌన్ ప్లానింగ్.. ఇలా దాదాపు 30వేల ఉద్యోగాలకు పైబడి నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించింది. రెండో ‘సారీ’ ప్రశ్నపత్రాల లీకేజీతో డీఏఓ, గ్రూప్–1, ఏఈఈ పరీక్షలు రద్దు చేయగా, టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, హార్టికల్చర్ ఆఫీసర్ తదితర పరీక్షలు చివరి నిమిషంలో వాయిదా వేసింది. ఈ క్రమంలో దాదాపు ఏడున్నర లక్షల మందికిపైగా అభ్యర్థులంతా రెండోసారి పరీక్షలు రాయాల్సి వచ్చింది. ఇందులో అత్యధికంగా గ్రూప్–1కు 3.80 లక్షల మంది, డీఏఓ పరీక్షకు దాదాపు 1.6లక్షల మంది అభ్యర్థులున్నారు. ఒకసారి పరీక్ష రాశాక, రెండోసారి మళ్లీ పరీక్షకు సన్నద్ధం కావడమనేది మానసికంగా తీవ్రఒత్తిడి కలిగించే విషయమే. ఇక గ్రూప్–1 విషయానికి వస్తే పరీక్ష నిర్వహణలోపాల కారణంగా రెండోసారి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని హైకోర్టు రెండుసార్లు ఆదేశించింది. గ్రూప్–1 పరీక్ష రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అత్యంత ఉత్తమమైన సర్విసు. రాష్ట్రస్థాయి సివిల్ సర్విసుగా భావించే దీనికి ప్రిపరేషన్ అంత ఈజీ కాదు. రోజుకు 18గంటల పాటు కష్టపడాల్సి ఉంటుంది. అలాంటి వారికి తాజాగా హైకోర్టు నిర్ణయం షాక్‌కు గురిచేసింది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయాల్సి వస్తే హాజరశాతం గణనీయంగా పడిపోయే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాతే హాజరులో స్పష్టత గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యను ప్రకటించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూన్ 11వ తేదీ సాయంత్రం టీఎస్పీ ఎస్సీ హాజరైన అభ్యర్థుల ప్రాథమిక సమాచారం పేరిట ప్రకటన విడుదల చేసింది. పరీక్ష కేంద్రాల నుంచి అందిన సమాచారం ఆధారంగా ఈ గణాంకాలు చెబుతున్నా, ఓఎంఆర్ జవాబుపత్రాలు స్వా«దీనం చేసుకున్న తర్వాత పక్కా గణాంకాలు ఇస్తామని తెలిపింది. సాధారణంగా పరీక్షల హాజరుశాతం గణాంకాలపై స్పష్టత రావాలంటే వెంటనే సాధ్యం కాదు. అన్ని కేంద్రాల నుంచి పక్కా సమాచారం సేకరించడానికి సమయం పడుతుంది. ఈమేరకు టీఎస్పీఎస్సీ ప్రకటనలో పేర్కొన్నా, మరుసటి ప్రకటనలో నెలకొన్న గందరగోళం అభ్యర్థులను కొంత అనుమానాలకు గురిచేసింది. ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేసిన తర్వాత టీఎస్పీఎస్సీ చేసిన ప్రకటనలో స్పష్టత ఇచ్చినా, అభ్యర్థులకు మాత్రం అనుమానాలు తొలగలేదు. ఇక బయోమెట్రిక్ హాజరుతీరు పట్ల కూడా అనుమానాలు నెలకొనడంతో న్యాయస్థానాన్ని ఆశ్ర యించాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో బయోమెట్రిక్ హాజరులో ఎదుర్కొన్న పలు సమస్యల కారణంగానే, బయోమెట్రిక్ వద్దనుకున్నట్టు టీఎస్పీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి. అభ్యర్థులకు వారం రోజుల ముందే పంపించిన హాల్‌టికెట్లలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశామని చెబుతున్నాయి. అయి తే రెండోసారి జారీ చేసిన హాల్ టికెట్లలో బయోమెట్రిక్ చెక్ఇన్ అంశాన్ని ప్రస్తావించలేదు. దీంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. -
వామ్మో రూ. 11 లక్షల కోట్లా..? అత్యంత భారీ నిరుద్యోగ మోసమిది!
Unemployment Fraud in US: అగ్రరాజ్యం అమెరికాలో అత్యంత భారీ నిరుద్యోగ మోసం బయట పడింది. కోవిడ్ (COVID-19) మహమ్మారి సమయంలో మోసగాళ్లు 100 బిలియన్ డాలర్ల (రూ. 8.3 లక్షల కోట్లు) నుంచి 135 బిలియన్ డాలర్లు (రూ. రూ. 11 లక్షల కోట్లు) వరకూ నిరుద్యోగ బీమా ప్రయోజనాలను తప్పుగా క్లెయిమ్ చేసి కాజేసి ఉండవచ్చని యూఎస్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్ (GAO) నివేదిక విడుదల చేసింది. యూఎస్, ప్యూర్టో రికో, యూఎస్ వర్జిన్ దీవులలో 2020 ఏప్రిల్ నుంచి 2023 మే మధ్య చెల్లించిన నిరుద్యోగ ప్రయోజనాలపై జీఏవో అధ్యయనం నిర్వహించింది. ఆ సమయంలో అమెరికన్లకు చెల్లించిన మొత్తం నిరుద్యోగ ప్రయోజనాలలో మోసపూరితంగా క్లెయిమ్ చేసిన నిధులు 11 శాతం నుంచి 15 శాతం వరకూ ఉన్నాయని జీఏవో అంచనా వేసింది. ఆ కాలానికి నిరుద్యోగ ప్రయోజనాల మొత్తం చెల్లింపులు 900 బిలియన్ డాలర్లు. అన్ఎంప్లాయిమెంట్ ఇన్సూరెన్స్ సిస్టమ్ ప్రోగ్రామ్ సమగ్రతతో దీర్ఘకాలిక సవాళ్లను ఎదుర్కొందని, ఇది కోవిడ్ మహమ్మారి సమయంలో మరింత దిగజారిందని జీఏవో తన నివేదికలో పేర్కొంది. కాగా ఈ మోసం మొత్తం జీఏవో గత ఫిబ్రవరిలో అంచనా వేసినదాని కంటే రెట్టింపు. ఈ నివేదికను యూఎస్ సెనేట్ ఫైనాన్స్ ర్యాంకింగ్ సభ్యుడు, సెనేటర్ మైక్ క్రాపో (R-Idaho), యూఎస్ హౌస్ వేస్ అండ్ మీన్స్ ఛైర్మన్ జాసన్ స్మిత్ (R-Missouri) అభ్యర్థించారు. ఖండించిన కార్మిక శాఖ అయితే జీఏవో నివేదికను యూఎస్ కార్మిక శాఖ ఖండించినట్లుగా రాయిటర్స్ పేర్కొంది. జీఏవో ఏ లెక్కల ఆధారంగా ఈ అంచనాకు వచ్చిందని ప్రశ్నించిందని, దాని పరిశోధనలు మోసం పరిధిని మరీ ఎక్కువగా పేర్కొన్నాయని పేర్కొంది. -
G20 Summit: జిన్‌పింగ్ ఎందుకు రావట్లేదు ?
జీ20 సదస్సుకు కయ్యాలమారి చైనా అంతగా ప్రాధాన్యత ఇవ్వట్లేదా ?. అందుకే అధ్యక్షుడు జిన్‌పింగ్ తనకు బదులు ప్రధాని లీ కియాంగ్‌ను పంపించారా ?. ఇలాంటి ప్రశ్నలకు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు తలో విశ్లేషణ చెబుతున్నారు. జీ20 కూటమి ఆవిర్భావం తర్వాత చైనా అధ్యక్షులు ఒకరు శిఖరాగ్ర సదస్సులో పాల్గొనకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇంతటి ప్రతిష్టాత్మకమైన సదస్సుకు హాజరుకాకుండా జిన్‌పింగ్ చైనాలోని ఉండి ఏం చేస్తున్నారు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 2020 మే నెల నుంచి భారత్‌తో సరిహద్దు వెంట ఇరుదేశాల సైనికులు బాహాబాహీకి దిగడం, భారీగా సైన్యం మొహరింపు వంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతుండటం వల్లే జిన్‌పింగ్ ఆగ్రహంతో సదస్సుకు రావట్లేదని చాలా మంది భావిస్తున్నారు. అసలు కారణం అది కాదని మరో వాదన బలంగా వినిపిస్తోంది. అదే అదుపు తప్పుతున్న చైనా ఆర్థిక పరిస్థితి. జిన్‌పింగ్ ధనవంతుల కుటుంబంలో పుట్టాడు. అప్పుడే వచ్చిన సాంస్కృతిక విప్లవం ధాటికి ఆయన తండ్రి పేదవాడిగా మిగిలిపోయాడు. దీంతో జిన్‌పింగ్ బాల్యంలో కష్టాలు చూశాడు. పొలంలో సాధారణ కూలీగా పనిచేశాడు. ఆరేళ్లు ఇబ్బందులు పడ్డాడు. అయితే బలీయమైన చైనాకు అధ్యక్షుడిగా ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలతో పోలిస్తే ఆనాటి కష్టాలు గడ్డిపరకతో సమానమే. ‘చైనా రాజ్య విస్తరణ వాదం, దక్షిణ చైనా సముద్రంపై గుత్తాధిపత్యం, ప్రపంచ వస్తూత్పత్తి మార్కెట్‌కు ఏకైక దిక్కుగా మారాలన్న వ్యూహాలతో చైనా చాలా ప్రపంచ దేశాలకు శత్రువుగా మారింది. ఇలాంటి తరుణంలో చైనాతో కలిసి జీ20 వేదికను కలిసి పంచుకునేందుకు తోటి దేశాలు విముఖత చూపుతున్నాయి’ అని మేథో సంస్థ కార్నీగ్ చైనా డైరెక్టర్ పాల్ హెనెల్ వ్యాఖ్యానించారు. ఆ అప్రతిష్ట పోగొట్టుకునేందుకే ‘ సదస్సు విజయవంతం అవడానికి అందరితో కలిసి పనిచేస్తాం’ అని బీజింగ్ తాజాగా ప్రకటించింది. ‘విదేశీ పర్యటనకు పక్కనబెట్టి స్వదేశ సమస్యలపై జిన్‌పింగ్ దృష్టిపెట్టారు. దేశ రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పొరుగు దేశాలతో కయ్యానికి దిగారు. ఆర్థిక వ్యవస్థ సమస్యల్లో చిక్కుకోవడంతో జిన్‌పింగ్‌కు తలనొప్పి పెరిగింది’ అని సింగపూర్‌లోని నేషనల్ యూనివ ర్సిటీ ప్రొఫెసర్ ఆల్ఫ్రెడ్ వూ వ్యాఖ్యానించారు. దెబ్బకొట్టిన హౌజింగ్ రంగం ఇటీవల దశాబ్దాల కాలంలో ఎన్నడూలేనంతగా పలు సమస్యలు చైనాలో తిష్టవేశాయి. కుటుంబాలు తమ ఖర్చులను తగ్గించుకున్నాయి. కర్మాగారాల్లో ఉత్పత్తి తగ్గిపోయింది. వ్యాపారవేత్తలు నూతన పెట్టుబడులకు ముందుకు రావట్లేదు. ఎగుమతులు దిగజారాయి. ఆగస్టులో ఎగుమతులు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.8 శాతం తగ్గాయి. దిగుమతులు 7.3 శాతంపెరిగాయి. నిరుద్యోగిత భారీగా పెరగడంతో ప్రభుత్వం తాజా గణాంకాలు బహిర్గతంచేయడం మానేసింది. ఆస్తుల మార్కెట్ విలువ భారీగా పతనమైంది. ప్రధాన డెవలపర్లు చేతులెత్తేసి దివాలాను ప్రకటించారు. దీంతో రియల్ ఎసేŠట్ట్ రంగం సంక్షోభంలో చిక్కింది. 40 ఏళ్ల భవిష్యత్ అభివృద్ది మోడల్‌ను ఈ అంశాలు తలకిందులుచేసేలా ఉన్నాయి. ప్రాపర్టీ రంగంపై అతిగా ఆధారపడటం, అత్యంత కఠినమైన కోవిడ్ ఆంక్షల విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయని నిపుణులు భావిస్తున్నారు. రుణాల పునాదిపై నెలకొల్పిన అభివృద్ధి మోడల్ ఈ పరిస్థితికి మరో కారణం. దేశం అప్పులు పెరిగిపోయాయి. 2023 తొలి త్రైమాసికంలో అప్పులు–జీడీపీ నిష్పత్తి రికార్డు స్థాయిలో 279 శాతంగా నమోదైందని బ్లూమ్‌బర్గ్ విశ్లేషించింది. రుణాలు అతిగా తీసుకొచ్చి మౌలిక వసతులపై ఖర్చుచేసిన పాపం ఇప్పుడు పండిందని మరో వాదన. హౌజింగ్ బుడగ బద్ధలైంది. చైనా ఆర్థిక వ్యవస్థ 25 శాతం ప్రాపర్టీ మార్కెట్‌పైనే ఆధారపడింది. ఇన్నాళ్లూ కేవలం చైనాపై ఆధారపడిన విదేశీ బ్రాండ్లు ఇప్పుడు చైనాతోసహా ఇతర(చైనా ప్లస్ స్ట్రాటజీ) దేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. దీని వల్ల ప్రధానంగా లాభపడేది ఇండియానే. ఆపిల్, టెస్లా మొదలుకొని నైక్ వరకు అన్ని ప్రధాన సంస్థల తయారీకేంద్రాలు చైనాలోనే ఉన్నాయి. కార్మికులకు అధిక జీతభత్యాలు, అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో విదేశీ సంస్థలు చైనాకు బదులు వేరే దేశాల వైపు చూస్తున్నాయి. ఆర్మీలో అవిధేయత? చైనా ఆర్మీలో పెరిగిన అవినీతి, పాలక పార్టీ పట్ల తగ్గిన విధేయతపై జిన్‌పింగ్ భయపడుతున్నారని ఆసియా పాలసీ సొసైటీ ఇన్స్టిట్యూట్లో జాతీయ భద్రతా విశ్లేషకుడు లైల్ మోరిస్ చెప్పారు. చైనా సైన్యంలో అణ్వస్త్ర సామర్థ్య రాకెట్ విభాగంలోని జనరల్, డెప్యూటీ జనరల్‌లను తొలగించడాన్ని ఆయన ఉటంకించారు. తనకు నమ్మకస్తుడైన విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్‌ను జిన్‌పింగ్ తప్పించడంతో పార్టీ వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి రేగింది. జిన్‌పింగ్ పాలనా సామర్థ్యానికి ఈ ఘటనలు మాయని మచ్చలని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇలాంటి సమస్యలు ఇంకొన్ని పెరిగితే డ్రాగన్ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పాలనకు తెరపడే ప్రమాదముందని కొందరు సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. ఇన్ని సమస్యలు ఇంట్లో పెట్టుకునే జిన్‌పింగ్ చైనాను వదలి బయటకు రావట్లేదనే విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిరుద్యోగభృతి ఇచ్చాకే కేసీఆర్ ఓట్లు అడగాలి
హుజూర్నగర్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఇచ్చిన తర్వాతే సీఎం కేసీఆర్ ఓట్లు అడగాలని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2018 డిసెంబర్ నుంచి నిరుద్యోగులకు ప్రభుత్వం నెలకు రూ.3 వేల చొప్పున బాకీ ఉన్నదని చెప్పారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీలో చెప్పి ఇంతవరకు పట్టించుకోకుండా కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు గత ఎన్నికల్లో దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక అందరినీ మోసం చేశారన్నారు. రాష్ట్రంలో అతి పెద్ద సామాజికవర్గంగా ఉన్న మాదిగలకు మంత్రి పదవి ఇవ్వలేదని, మరో పెద్ద సామాజికవర్గం ముదిరాజ్‌లకు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదని, ముస్లింలకు మూడు సీట్లు ఇచ్చినా వాటిలో రెండు ఓడిపోయే సీట్లేనని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు కలిసిపోయాయని, ఢిల్లీలోని బీజేపీని ఇంటికి పంపాలంటే బీఆర్ఎస్ను ఓడించాలన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఓడించాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 70 పైచిలుకు స్థానాలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న 12 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హుజూర్నగర్, కోదాడలలో 50 వేల ఓట్ల మెజారీ్టతో గెలవబోతున్నామని ఆయన తెలిపారు. -
పాపం చైనా యువతకు ఎంత కష్టం వచ్చింది!
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా (China)లో నిరుద్యోగం (Unemployment) తాండవిస్తోంది. అక్కడ యువత ఉద్యోగాలు దొరక్క అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఫ్రెషర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తాజాగా సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసిన జాంగ్ అనే యువతి ఉద్యోగం కోసం వేలకొద్దీ రెజ్యూమ్‌లను చైనీస్ కంపెనీలకు పంపినప్పటికీ, ఆమె ఎంచుకున్న మార్కెట్ పరిశోధన రంగంలో జాబ్ దొరకలేదు. నెలల తరబడి అన్వేషించినా ఉద్యోగం దొరక్కపోవడంతో నిరాశ నిస్పృహలకు గురైన 23 ఏళ్ల జాంగ్.. తాను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే ఉద్యోగ అన్వేషణలో ఉన్న యువత మానసిక స్థితి ఎలా ఉంటుందన్నదానిపై ఓ సర్వే కూడా గమనార్హం. గ్రాడ్యుయేషన్ తర్వాత యువతపై ఎంత మానసిక ఒత్తిడి ఉంటుందో తనకూ అనుభవంలోకి వచ్చినట్లు ఇటీవల బీజింగ్‌లో జరిగిన రిక్రూట్మెంట్ ఫెయిర్‌లో ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీతో జాంగ్ పేర్కొంది. తాను పంపే ప్రతి పది రెజ్యూమ్‌లకు ఒక స్పందన మాత్రమే వస్తున్నట్లు ఆమె చెప్పింది. యువత నిరుద్యోగం విపరీతంగా పెరుగుతున్న సమయంలో చైనా జాబ్ మార్కెట్ (China Job Market) లోకి ప్రవేశించిన మిలియన్ల మంది గ్రాడ్యుయేట్లలో జాంగ్ ఒకరు. 16 నుంచి 24 సంవత్సరాల వయసున్న యువతలో నిరుద్యోగం జూన్ నెలలో రికార్ట్ స్థాయిలో 21.3 శాతానికి చేరింది. తమ దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నట్లు ప్రపంచానికి తెలియకుండా వయసు ఆధారిత ఉపాధి డేటా ప్రచురణను నిలిపివేస్తున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. సవాలుగా మారిన ఉద్యోగ సాధన అనుభవం లేని అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడం సవాలుగా మారిందని బీజింగ్‌లో జరిగిన కెరీర్ ఫెయిర్లకు హాజరైన యువత పేర్కొన్నారు. యాంగ్ యావో మీడియాలో అనుభవం ఉన్న 21 ఏళ్ల నిరుద్యోగి. సెంట్రల్ బీజింగ్‌లో జరిగిన ఒక జాబ్ ఫెయిర్‌లో ప్రకటనలను చూసి నిరాశకు గురయ్యాడు. కారణం అక్కడ కంపెనీలు కేవలం సేల్స్, అడ్మినిస్ట్రేటివ్ జాబ్‌లు ఆఫర్ చేశాయి. అది కూడా తక్కువ జీతానికి పనిచేసేవారికే. బీజింగ్‌లోని తన కుటుంబానికి దగ్గరగా వెళ్లడం కోసం తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో తన మునుపటి ఉద్యోగాన్ని మానేసిన అతను ఇప్పుడు నెలల కొద్దీ వెతుకుతున్నా ఉద్యోగం దొరక్కపోవడంతో తీవ్ర ఆందోళన పడుతున్నాడు. ‘తలచుకుంటే రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు. ఉద్యోగం దొరకకపోతే జీవనం గడిచేదెలా?’ అని ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీతో వాపోయాడు. -
Parliament Monsoon Session: నేటి నుంచే సభా సమరం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సాక్షిగా అధికార, విపక్షాల మధ్య వాడీవేడి చర్చలు, సంవాదాలకు రంగం సిద్ధమయ్యింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం ఆరంభం కానున్నాయి. ఇరుపక్షాలు అస్త్రశ్రస్తాలను సిద్ధం చేసుకుంటున్నాయి. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు అధికార, ప్రతిపక్ష నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. మణిపూర్‌లో జాతుల మధ్య రగులుతున్న హింస, ఉమ్మడి పౌరస్మృతి బిల్లు, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కేంద్ర దర్యాప్తు సంస్థల దురి్వనియోగం వంటి అంశాలపై సభలో గట్టిగా నిలదీసి, కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష కూటమి సిద్ధమవుతోంది. తిప్పికొట్టేందుకు అధికార పక్షం ప్రతివ్యూహాలు పన్నుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 23 రోజుల పాటు జరిగే ఈ సెషన్లో మొత్తం 17 రోజుల పాటు పార్లమెంట్ భేటీ కానుంది. పార్లమెంటరీ వర్గాల సమాచారం ప్రకారం.. వర్షాకాల సమావేశాలు పాత పార్లమెంట్ భవనంలో ప్రారంభమై, సమావేశాల మధ్యలో నూతన భవనానికి మారుతాయి. ఈసారి మొత్తం 21 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇందులో ప్రధానమైంది ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) బిల్లు. యూసీసీ, ఢిల్లీ ఆర్డినెన్స్‌పై రగడ తప్పదా? మణిపూర్‌లో హింసాకాండపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సహా ఇతర ప్రతిపక్షాలు గట్టి పట్టుదలతో ఉన్నాయి. యూసీసీ బిల్లుపై కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఎంసీ సహా ఇతర విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే అన్ని స్థాయిల్లో అడ్డుకునేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నాయి. ఢిల్లీ విషయంలో కేంద్ర ఆర్డినెన్స్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన బీఆర్ఎస్, టీఎంసీ, సీపీఐ, సీపీఎం తదితర పారీ్టల మద్దతు కూడగట్టారు. జోషి ఆధ్వర్యంలో అఖిలపక్షం భేటీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రస్తావించే అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. జోషి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కీలకపార్టీల నేతలు పాల్గొన్నారు. 32 అంశాలు పార్లమెంట్లో ప్రస్తావనకు రానున్నట్లు జోషి చెప్పారు. కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగాలని కేంద్ర ప్రభుత్వం నిజంగా కోరుకుంటే, సభలో ప్రతిపక్షాలు లెవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ అధిర రంజన్ చౌదరి అన్నారు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని వ్యాఖ్యానించారు. మా డిమాండ్‌కు వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ మద్దతు: బీజేడీ వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని బిజూ జనతాదళ్(బీజేడీ) ఎంపీ శశి్మత్ పాత్రా కోరారు. అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై తమ డిమాండ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, వామపక్షాలు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. -
నైపుణ్యాల కొరతే అడ్డు
న్యూఢిల్లీ: నిరుద్యోగం పట్ల ప్రజల్లో ఉన్న ఆలోచనా ధోరణి సరైంది కాదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. నరేంద్ర మోదీ సారథ్యంలో 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చే నాటికే నిరుద్యోగ సమస్య వారసత్వంగా వచి్చందని, అప్పటికి పని ప్రదేశాల్లోని 42 కోట్ల ఉద్యోగుల్లో 31 కోట్ల మందికి నైపుణ్యాలు లేవని చెప్పారు. ‘‘నిరుద్యోగం పట్ల ఈ విధమైన ఆలోచన సరైంది కాదు. ఎందుకంటే ఎన్నో ఉద్యోగాలు, సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు కలి్పంచాం. కానీ వారికి నైపుణ్యాలు అవసరం. స్వాతంత్య్రం వచి్చన 65 ఏళ్ల తర్వాత కూడా ప్రతి నలుగురిలో ముగ్గురికి నైపుణ్యాలు లేవు. గత తొమ్మిదేళ్లుగా మేము దీన్ని పరిష్కరించే క్రమంలో ఉన్నాం’’అని కేంద్ర నైపుణ్యాల అభివృద్ధి శాఖ మంత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో కరోనా కాలం రెండున్నరేళ్లను మినహాయించి చూస్తే, తాము 6.25 కోట్ల యువతలో నైపుణ్యాలు కలి్పంచామని చెప్పారు. ‘‘ప్రస్తుత ప్రభుత్వం, ప్రధాని మోదీ దృష్టి అంతా స్థానికంగానే ఎన్నో ఆర్థిక అవకాశాలు కలి్పంచాలన్న దానిపైనే. ఎన్నో దశాబ్దాలుగా ఉన్న సంప్రదాయ కళలు, నైపుణ్యాలను.. ఉత్పత్తుల ఆవిష్కరణ దిశగా పునరుజ్జీవింపజేయాల్సి ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ను చేరుకునేలా అనుసంధాన కలి్పంచాలి’’అంటూ ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు. -
మోదీ లూటీ విధానాల వల్లే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుదల
న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగానికి నరేంద్ర మోదీ ప్రభుత్వ చేతగానితనమే కారణమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ప్రభుత్వ డొల్ల నినాదాలను ప్రజలు ఎంతమాత్రం నమ్మడం లేదని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రజలను లూటీ చేయడమే పనిగా పెట్టుకుందని, అందుకే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆరోపించారు. జనం కష్టాల్లో ఉంటే బీజేపీ మాత్రం అధికారం కోసం పాకులాడుతోందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఖర్గే బుధవారం ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు ఆకాశంలోకి దూసుకెళ్తున్నాయని, నిరుద్యోగం 8.45 శాతానికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని, పనులు లేక కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నికల ముందు అచ్చే దిన్, అమృత్ కాల్ అంటూ నినాదాలు ఇచి్చన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు వాటిని పూర్తిగా విస్మరించారని ఖర్గే ఆక్షేపించారు. ఈసారి ఎన్నికల్లో ఎన్ని రకాలుగా ప్రచారం చేసుకున్నా ఫలితం ఉండదని, బీజేపీని జనం ఓడించడం తథ్యమని జోస్యం చెప్పారు. -
అమెరికాలో నిరుద్యోగ భృతికి లక్షలాది దరఖాస్తులు
అమెరికాలో నిరుద్యోగం తాండవిస్తోంది. ఆ దేశ ప్రభుత్వం అందించే నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసినవారి సంఖ్య గత వారం 20 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. అది అలాగే స్థిరంగా కొనసాగుతోంది. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం.. జూన్ 17తో ముగిసిన వారంలో కాలానుగుణంగా సర్దుబాటు ప్రాతిపదికన నిరుద్యోగ ప్రయోజనాల కోసం 2,64,000 కొత్త క్లెయిమ్‌లు దాఖలయ్యాయి. అంతకు ముందు వారంతో పోలిస్తే దరఖాస్తుల సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. 2021 అక్టోబర్ తర్వాత గతవారం నిరుద్యోగ భృతి దరఖాస్తులు మొదటి సారిగా అత్యధిక స్థాయికి చేరాయి. కాగా నిరుద్యోగ భృతికి కొత్త దరఖాస్తులు సగటున 2,60,000 ఉండొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేసినట్లుగా ‘రాయిటర్స్’ పేర్కొంది. ఇదిలా ఉండగా మొదటి వారం దాటి ప్రయోజనాలను పొందుతున్న వారందరి ర్యాంక్‌లు జూన్ 10తో ముగిసిన వారంలో 17.6 లక్షలకు పడిపోయాయి. అంతకు ముందు వారం ఇది 17.72 మిలియన్లుగా ఉండేది. యూఎస్ కరెంట్ ఖాతా లోటు ఈ ఏడాది మొదటి మూడు నెలలలో స్థిరంగా విస్తరించి మూడు త్రైమాసికాల దిగువకు తగ్గిందని ఆ దేశ ప్రభుత్వం నివేదించింది. మరోవైపు 2022 నాలుగో త్రైమాసికంలో సవరించిన 216.2 బిలియన్ డాలర్ల నుంచి మొదటి త్రైమాసికంలో కరెంట్ అకౌంట్ గ్యాప్ 219.3 బిలియన్ డాలర్లకు పెరిగిందని వాణిజ్య శాఖ తెలిపింది. కాగా అది 217.5 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని ఆర్థికవేత్తలు రాయిటర్స్ పోల్‌లో అంచనా వేశారు. -
ప్రపంచ దేశాల్లో భారత్‌లో సగటు జీతం, నిరుద్యోగ శాతం ఎంతో తెలుసా?
అవునూ.. మీ జీతమెంత? ఎందుకంటే.. ప్రపంచంలో వివిధ దేశాల ప్రజల సగటు జీతం ఎంత అన్న దానిపై వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఒక నివేదిక రూపొందించింది.. దీని ప్రకారం ప్రపంచంలోని 23 దేశాల్లో సగటు జీతం లక్ష రూపాయల కన్నా ఎక్కువగా ఉందట. 104 దేశాల్లో సర్వే చేయగా.. టాప్‌లో స్విట్జర్లాండ్ (రూ.4,98,567) ఉండగా.. అట్టడుగున పాకిస్థాన్ (రూ. 11,858) ఉంది. మరి మన పరిస్థితి ఏమిటనా.. భారత్‌తో సగటు జీతం రూ.46,861. ఆయా దేశాల్లో ఉద్యోగుల కనిష్ట వేతనం, గరిష్ట వేతనాన్ని పరిగణనలోకి తీసుకొని.. ఈ సగటు వేతనాన్ని నిర్ధారించారు. జీతాల సంగతి చెప్పుకున్నాం.. ఇప్పుడు అసలు జీతాలే రాని వారి గురించి చెప్పుకుందాం.. అదేనండీ నిరుద్యోగుల గురించి.. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగిత శాతాన్ని చూస్తే.. నైజీరియాలో ఇది ఎక్కువగా ఉంది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఖతార్‌లో ఇది అత్యల్పంగా ఉంది. పలు దేశాల్లో నిరుద్యోగిత శాతం సంగతి ఓసారి చూస్తే.. చదవండి: విమానంలో రెచ్చిపోయిన ప్రయాణికుడు.. ఎయిర్ హోస్ట్‌పై లైంగిక వేధింపులు -
TS: కాంగ్రెస్ ‘నిరుద్యోగ ఉద్యమం’! 50 లక్షల మంది యువత పక్షాన పోరాటం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన సమరశంఖం పూరించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. టీఎస్పీఎస్సీ, టెన్త్ పేపర్ల లీకేజీలపై నిరసనలతోపాటు టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేశాకే పరీక్షల నిర్వహణ, పేపర్ల లీక్ కేసులో సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలన్న డిమాండ్లతో నిరుద్యోగులతో కలసి ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. ఈనెల 21న నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం కేంద్రంగా పోరాటం ప్రారంభించనుంది. ఎంజీ వర్సిటీ విద్యార్థులతో కలసి నిరసన చేపట్టిన అనంతరం.. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ నిరుద్యోగ సభలు నిర్వహించనుంది. ఈ మూడు జిల్లాల్లో కార్యక్రమాల అనంతరం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో భారీగా నిరుద్యోగ సభ నిర్వహించాలని.. దానికి కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంకాగాంధీని ఆహా్వనించాలని నిర్ణయించింది. మే నెల మొదటి వారంలో.. ఈనెల 24న ఖమ్మంలో, 26న ఆదిలాబాద్‌లో సభ నిర్వహించిన తర్వాత మే 4న, లేదా 5న సరూర్‌నగర్ సభ జరపాలని కాంగ్రెస్ భావిస్తోంది. సభ రోజున తొలుత ఎల్బీనగర్ చౌరస్తాలో తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళి అర్పించి.. అక్కడి నుంచి ర్యాలీగా సరూర్‌నగర్ స్టేడియానికి చేరుకోవాలని నిర్ణయించింది. ప్రియాంకాగాంధీ ఈ ర్యాలీలో పాల్గొంటారా? నేరుగా సరూర్‌నగర్ సభకు హాజరవుతారా? ఆమె ఎప్పుడు హైదరాబాద్‌కు వస్తారు? 4, 5 తేదీల్లో ఏ రోజున సభ జరుగుతుందన్న అంశాలపై రెండు రోజుల్లో స్పష్టత రానుంది. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రియాంకాగాంధీ బిజీగా ఉన్నారని.. ఆమె వీలును ఒకరోజు ఇక్కడికి వస్తారని పీసీసీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగుల కోసం ఏం చేస్తామనే అంశాలను ఆమె సభలో ప్రకటిస్తారని పేర్కొన్నాయి. ఇక సరూర్‌నగర్ సభ తర్వాత నాలుగైదు రోజుల విరామం తర్వాత మే 9 నుంచి రేవంత్‌రెడ్డి రెండో విడత హాథ్‌సే హాథ్ జోడో యాత్రను జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి ప్రారంభించనున్నారు. మంగళవారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్ ఈ వివరాలను వెల్లడించారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు: రేవంత్ ‘‘టెన్త్ పేపర్ లీకేజీ విషయంలో నిరసన వ్యక్తం చేసిన ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ నాయకులను ఐదు రోజులు జైల్లో పెట్టారు. అదే టెన్త్ పేపర్లు లీక్ చేశాడంటూ పెద్ద పెద్ద సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్టు చేసిన బండి సంజయ్‌కు మాత్రం తెల్లారేసరికి బెయిల్ వచి్చంది. ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ తీవ్రంగా పోరాడిన తర్వాత.. బీజేపీ ఏదో ఒక చిల్లర పంచాయితీ చేస్తుంది. దాన్ని పెద్దది చేయడంలో బీఆర్ఎస్ సహకరిస్తుంది. సంజయ్ అరెస్టు, వెంటనే బెయిల్ దీనికి నిదర్శనం. బీజేపీ, బీఆర్ఎస్ల కుమ్మక్కుకు ఇదే ఉదాహరణ’’అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇంటికో ఉద్యోగమిస్తామని కేసీఆర్ మోసం చేశారని.. ఒకేరోజు 2లక్షల ఉద్యోగాలిస్తామని బండి సంజయ్ మోసపు మాటలు మాట్లాడుతున్నారని.. నిరుద్యోగుల పక్షాన క్షేత్రస్థాయి నుంచి పార్లమెంటు వరకు కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. సంజయ్ మాటలు వింటుంటే నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదని.. అసలు ఏ శాఖలో ఎన్ని ఉద్యోగ ఖాళీలున్నాయో ఆయనకు తెలుసా? అని రేవంత్ ఎద్దేవా చేశారు. టీఎస్పీఎస్సీ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులంతా కలసి రావాలి.. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారని రేవంత్ మండిపడ్డారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ ఇప్పటివరకు 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాల్సిందని పేర్కొన్నారు. తాను పార్లమెంటులో ఈ విషయమై ప్రశ్న అడిగితే.. ఉద్యోగాల కోసం ఇప్పటివరకు 22 కోట్ల దరఖాస్తులు వస్తే 7,22,311 ఉద్యోగాలు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం తెలిపిందని వివరించారు. తాము చేస్తున్న పోరాటం కాంగ్రెస్ పార్టీ కోసం కాదని.. 50లక్షల మంది నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నామని చెప్పారు. తమ పోరాటాల్లో విద్యార్థులు సామాజిక బాధ్యతగా పాల్గొనాలని.. నిరసన దీక్షల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. చదవండి: ఇక కమలనాథుల యాత్రల జాతర -
అమ్మ బాబోయ్! నిరుద్యోగులుగా మారిన భారతీయులు అంత మందా?
2023 ప్రారంభం నుంచి ఎంతోమంది ఉద్యోగులు వివిధ కారణాల వల్ల తమ ఉద్యోగాలను కోల్పోయారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) ప్రకారం, గత మూడు నెలల కాలంలో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. భారతీయుల నిరుద్యోగిత రేటు మార్చి నెలలో మునుపటికంటే పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు ఎంతోమంది ఉద్యోగులను తొలగించాయి. ఇందులో ఎక్కువ మంది భారతీయులు ఉండటం గమనార్హం. ఈ డేటాను సిఎమ్ఐఈ విడుదల చేసింది. రానున్న రోజుల్లో నిరుద్యోగుల సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని కూడా స్పష్టం చేసింది. డిసెంబర్ 2022లో నిరుద్యోగుల రేటు 8.30 శాతం ఉండేది, అయితే ఈ రేటు 2023 జనవరి నాటికి 7.14 శాతానికి చేరుకుంది. ఫిబ్రవరిలో మళ్ళీ 7.8 శాతానికి పెరిగింది. నిరుద్యోగుల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టన ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. (ఇదీ చదవండి: విడుదలకు ముందే డీలర్ యార్డ్‌లో కనిపించిన మారుతి జిమ్నీ - పూర్తి వివరాలు) మార్కెట్లో తీవ్ర క్షీణత ఏర్పడిన కారణంగా 2023 మార్చిలో ఎక్కువ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. ఈ కారణంగా నిరుద్యోగం పెరుగుదల 39.8 శాతానికి చేరిందని CMIE మేనేజింగ్ డైరెక్టర్ 'మహేష్ వ్యాస్' తెలిపారు. అత్యధిక నిరుద్యోగ రేటు ఉన్న రాష్ట్రాలలో హర్యానా మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత జాబితాలో రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, సిక్కిం, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి. -
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి అకౌంట్లోకి డబ్బులు
భారతదేశంలో ప్రతి ఏటా యూనివర్సిటీల నుంచి చదువు పూర్తి చేసుకుని బయటకు వస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే చదివిన అందరికి ఉద్యోగాలు లభించకపోవడంతో నిరుద్యోగ సమస్య తారా స్థాయికి చేరుకుంటోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని గతంలో ఛత్తీస్‌గఢ్ గవర్నమెంట్ ఎన్నికల సమయంలో ఉద్యోగం లేని యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. అది ఇప్పుడు అమలు చేయడానికి శ్రీకారం చుట్టింది. వచ్చే నెల 01 నుంచి (ఏప్రిల్) నిరుద్యోగ యువతకు రూ. 2,500 నిరుద్యోగ భృతి ఆంచించనున్నారు. దీని కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఏకంగా రూ. 250 కోట్ల మేర బడ్జెట్ కేటాయించింది. ఇది మాత్రమే కాకుండా అంగన్వాడీ కార్యకర్తలు, హౌస్‌గార్డులు, గ్రామ కొత్వార్‌లు, ఇతర ఉద్యోగుల జీతాలు కూడా పెంచనున్నట్లు గతంలో సీఎం భూపేశ్ భఘేల్ తెలిపారు, ఇది కూడా అమలయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగ భృతి తీసుకోవడానికి అర్హతలు: నిరుద్యోగ భృతి తీసుకోవడానికి తప్పకుండా ఛత్తీస్గడ్ నివాసితులై ఉండాలి. అంతే కాకుండా 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్న యువకులు, ఇంటర్ మీడియట్ పూర్తి చేసుకున్న యువకులు దీనికి అర్హులు. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2.50 లక్షల కంటే తక్కువ ఉండాలి. నిరుద్యోగ యువత ఛత్తీస్‌గడ్‌లోని సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ గైడెన్స్ సెంటర్, జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో నమోదు చేసుకుని ఉండాలి. ఏప్రిల్ 1 నాటికి ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ రెండేళ్లుగా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే నిరుద్యోగ భృతికి అర్హత పొందుతారు. (ఇదీ చదవండి: ప్రత్యర్థులు గుండెల్లో గుబులు.. బీఎండబ్ల్యూ నుంచి మరో కారు లాంచ్) నిరుద్యోగ భృతి ఎలా అందుతుంది? నిరుద్యోగ యువతకు పైన చెప్పిన అన్ని అర్హతలు, అదే సమయంలో ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకుని ఉన్నప్పుడే నెలకు రూ. 2,500 లభిస్తుంది. ఇది నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌కి జమ అవుతుంది. అంతే కాకుండా రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్యను తగ్గించడానికి నైపుణ్య శిక్షణ కూడా అందించనున్నట్లు సంబంధింత అధికారులు చెబుతున్నారు. -
పట్టణ నిరుద్యోగం 7.2 శాతం
న్యూఢిల్లీ: పట్టణాల్లో నిరుద్యోగం 7.2 శాతానికి తగ్గింది. 2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) గణాంకాలు విడుదలయ్యాయి. 2021 అక్టోబర్–డిసెంబర్ కాలంలో పట్టణాల్లో నిరుద్యోగం 8.7 శాతంగా ఉంది. 15 ఏళ్లకు పైగా వయసు ఉండి పనిచేయడానికి అర్హత కలిగిన వ్యక్తులను సర్వే కోసం పరిగణనలోకి తీసుకున్నారు. కరోనా ప్రభావం వల్ల 2021 చివరి మూడు నెలల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉండడానికి కారణం. 2022 జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో నిరుగ్యోగ రేటు 7.2 శాతంగానే ఉండడం గమనించాలి. అంటే తదుపరి మూడు నెలలకూ అదే స్థాయిలో నిరుద్యోగం కొనసాగింది. ఇక గతేడాది ఏప్రిల్–జూన్ కాలానికి 7.6 శాతం మేర నిరుద్యోగం పట్టణ ప్రాంతాల్లో ఉంది. అలాగే 2022 జనవరి–మార్చి కాలానికి పట్టణ నిరుద్యోగం 8.2 శాతంగా ఉండడం గమనార్హం. గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ వీటిని విడుదల చేసింది. మహిళల్లో 9.6 శాతం 2022 అక్టోబర్–డిసెంబర్ కాలానికి పట్టణ ప్రాంతాల్లో మహిళా నిరుద్యోగుల సంఖ్య 9.6 శాతంగా ఉంది. 2022 జూలై–సెప్టెంబర్ కాలంలో ఉన్న 9.4 శాతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. కానీ 2021 చివరి మూడు నెలల్లో ఉన్న 10.5 శాతంతో పోలిస్తే తగ్గింది. 2022 ఏప్రిల్–జూన్ కాలంలో ఇది 9.5 శాతంగా, జనవరి–మార్చి క్వార్టర్లో 10.1 శాతం చొప్పున ఉంది. పట్టణాల్లో పురుష నిరుద్యోగులు 6.5 శాతంగా ఉన్నారు. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో 8.3 శాతంగా ఉంది. 2022 జూలై–సెపె్టంబర్లో 6.6 శాతం, 2022 ఏప్రిల్–జూన్ కాలానికి 7.1 శాతం, జనవరి–మార్చి క్వార్టర్లో 7.7 శాతం చొప్పున పట్టణాల్లో పురుషుల నిరుద్యోగం ఉన్నట్టు లేబర్ సర్వే గణాంకాలు వెల్లడించాయి. 2022 చివరి మూడు నెలల కాలంలో పట్టణాల్లో 15 ఏళ్లకు పైబడిన కార్మిక శక్తి 48.2 శాతానికి పెరిగింది. 2021 చివరి మూడు నెలల్లో ఇది 47.3 శాతంగా ఉంది. 2021–22లో 4.1 శాతం దేశవ్యాప్తంగా నిరుద్యోగుల రేటు 2021 జూలై నుంచి 2022 జూన్ కాలానికి 4.1 శాతానికి తగ్గింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 4.2 శాతంగా ఉంది. 2019–20 సంవత్సరంలో ఉన్న నిరుద్యోగం రేటు 4.8 శాతంతో పోలిస్తే 15 శాతం వరకు తగ్గినట్టు తెలుస్తోంది. పట్టణాల్లో పురుషుల నిరుద్యోగం 4.4 శాతానికి దిగొచ్చింది. ఇది అంతకుముందు ఏడాది కాలంలో 4.5 శాతంగా ఉంది. మహిళల్లో నిరుద్యోగం 3.5 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గింది. -
'అమృత కాల' బడ్జెట్ కాదు.. 'మిత్ర కాల' బడ్జెట్.. రాహుల్ సెటైర్లు..
న్యూఢిల్లీ: కేంద్రం బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని మోదీ చెబుతున్నట్లు ఇది అమృత కాల బడ్జెట్ కాదు.. మిత్ర కాల బడ్జెట్ అని రాహుల్ సెటైర్లు వేశారు. ఇది కేవలం సంపన్నులకు మాత్రమే మేలు చేసే బడ్జెట్ అని ధ్వజమెత్తారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర బడ్జెట్లో ఉద్యోగాలు సృష్టించాలన్న విజన్, ధరల పెరుగుదలను నియంత్రించాలనే వ్యూహం, దేశంలో అసమానతలను తగ్గించాలే ఉద్దేశం లేదని రాహుల్ ధ్వజమెత్తారు. దేశంలోని ఒక్క శాతం సంపన్నుల చేతిలో 40శాతం సంపద ఉందని, 50 శాతం పేదలు 64 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారని, 42 శాతం మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారని.. అయినా మోదీ వీటిని అసలు పట్టించుకోరని రాహుల్ ఫైర్ అయ్యారు. భారత్ భవిష్యత్తును నిర్మించే రోడ్‌మ్యాప్ ప్రభుత్వం వద్ద లేదని ఈ బడ్జెట్ రుజువు చేస్తోందన్నారు. ‘Mitr Kaal’ Budget has: NO vision to create Jobs NO plan to tackle Mehngai NO intent to stem Inequality 1% richest own 40% wealth, 50% poorest pay 64% of GST, 42% youth are unemployed- yet, PM doesn’t Care! This Budget proves Govt has NO roadmap to build India’s future. — Rahul Gandhi (@RahulGandhi) February 1, 2023 చదవండి: వారి ఆకాంక్షలను బడ్జెట్ నెరవేర్చింది.. విపక్షాల స్పందన ఇదే! -
అందుకే యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు: శరద్ పవార్
పుణే: కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ(షిండే వర్గం పొత్తు) పాలనపై విమర్శలు గుప్పించే క్రమంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య కారణంగానే.. పెళ్లీడుకొచ్చినా యువకులకు అమ్మాయిలు దొరకడం లేదని అన్నారు. బుధవారం ఎన్సీపీ జన్ జాగర్ యాత్ర ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దేశంలో రెండు వర్గాల ప్రజల మధ్య చీలిక ఏర్పడింది. తద్వారా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాస్తవ సమస్యల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం జరుగుతోంది. నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. చేసుకునేందుకు వేరే పనులు కూడా దొరకడం లేదు. ఉద్యోగం లేని వాళ్లకు పిల్లను ఎవరు ఇస్తారు? అందుకే వివాహాలు సకాలంలో జరగడం లేదు అని ఆయన అభిప్రాయపడ్డారు. బాగా చదువుకున్న వాళ్లు.. తమకు ఉద్యోగాలు కావాలని ప్రభుత్వాల్ని నిలదీయాలి. అది వాళ్ల హక్కు కూడా అని పవార్ సూచించారు. దేశంలో రైతులు ఉత్పత్తి పెంచితే ఆకలి సమస్య తీరుతుంది. కానీ, అధికారంలో ఉన్నవారు రైతుల శ్రమకు తగ్గ గిట్టుబాటు ధర ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. బదులుగా.. దళారుల ప్రయోజనాలను కాపాడుతూ సామాన్య ప్రజలను ద్రవ్యోల్బణ చట్రంలోకి నెట్టేస్తున్నారు అంటూ కేంద్రం తీరుపై మండిపడ్డారు ఈ కేంద్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి. ‘‘ఓసారి నేను ఓ ఊరికి వెళ్లాను. అక్కడ పాతిక నుంచి 30 ఏళ్ల లోపు ఉన్న కొందరు యువకులు పిచ్చాపాటిగా మాట్లాడుతూ కనిపించారు. ఎందుకిలా ఖాళీగా ఉన్నారు అని అడిగితే.. తమ ప్రాంతంలో చేయడానికి ఏం పనుల్లేవని బదులిచ్చారు. వాళ్లలో కొందరు డిగ్రీలు, మరికొందరు పీజీలు కూడా చేశారు. పని కోసం వేరే ఊరు వెళ్లొచ్చు కదా అంటే.. ఎంత దూరం వెళ్లాలని వాళ్లే నన్ను ప్రశ్నించారు. పని లేక పిల్లను ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదని వాళ్లు నాతో చెప్పారు’’ అని పవార్ గుర్తు చేసుకున్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాల హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించారు. దేశంలో రెండు వర్గాల మధ్య విద్వేషాలు రగులుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఎందుకంటే.. ఎన్నికల హామీలను నెరవేర్చే దమ్ము వాళ్ల దగ్గర లేదు కాబట్టి అంటూ కేంద్రంలోని బీజేపీపై ఆయన ఘాటు విమర్శ చేశారు. ఇక మహారాష్ట్రలోనూ అలాగే ఉందన్న ఆయన.. తమ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం కొలువు దీరాక రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని, తద్వారా రాష్ట్రంలోనూ నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందని పవార్ ఆందోళన వ్యక్తం చేశారు. -
కొండంత సమస్యలు.. గోరంత హామీలు
హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ నియోజకవర్గాలు చిన్నవి. సమస్యలు మాత్రం చాలా పెద్దవి. అధికార బీజేపీకి ఈ సమస్యలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా అయిదేళ్లకొకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న హిమాచల్ ప్రదేశ్ ఓటరు ఈ సారి ఎటువైపు మొగ్గు చూపుతారా అన్న ఆందోళన నెలకొంది. అయిదు అంశాలు ఈ సారి ఎన్నికల్లో అత్యధికంగా ప్రభావాన్ని చూపించబోతున్నాయి. సమస్యలివీ... నిరుద్యోగం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య దారుణంగా ఉంది. జాతీయ స్థాయిలో నిరుద్యోగం రేటు 7.6% ఉంటే హిమాచల్ ప్రదేశ్‌లో 8.6 నుంచి 9.2 శాతం వరకు ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువత 15 లక్షల మంది వరకు ఉంటే, వారిలో 8.77 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లో పేర్లు నమోదు చేసుకున్నారు. యాపిల్ రైతుల దుస్థితి దేశంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక యాపిల్ ఉత్పత్తిలో 26% వాటా హిమాచల్‌దే. గిట్టుబాటు ధర లేక రైతులు నిరసన బాట పట్టారు. సాగు ఖర్చు పెరగడం, వాతావరణ మార్పులు కుంగదీస్తున్నాయి. దీనికి తోడు యాపిల్స్‌ను రవాణ కోసం వాడే కార్టన్లపై జీఎస్టీని 12 నుంచి 18 శాతానికి పెంచడం రైతుపై మరింత భారాన్ని పెంచింది రోడ్డు కనెక్టివిటీ కొండ ప్రాంతం కావడంతో రాష్ట్రంలో ఏకంగా 39% గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ లేదు! ఇవన్నీ అటవీ ప్రాంతంలోని గ్రామాలు కావడంతో రోడ్లు నిర్మించాలంటే సుప్రీంకోర్టు అనుమతి తప్పనిసరి. ఇతర ప్రాంతాలతో సంబంధాలు లేక వీరంతా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3,125 కి.మీ. రోడ్ల పునరుద్ధరణకు బీజేపీ ప్రభుత్వం పనులు మొదలు పెట్టింది. అగ్నిపథ్ త్రివిధ బలగాల్లో కాంట్రాక్ట్ నియామకానికి కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకం మంచుకొండల్లో మంటలు రాజేసింది. 70 లక్షల హిమాచల్ జనాభాలో ఏకంగా 10 శాతం పని చేస్తున్న, లేదా రిటైర్డ్ సైనికులే ఉన్నారు. ఎందరో యువకులు సైన్యంలో చేరాలని ఆశతో శిక్షణ పొందుతున్న సమయంలో బీజేపీ తెచ్చిన పథకం వారిని నిరాశలో ముంచింది. ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కూడా ఎన్నికల్లో అత్యంత ప్రభావిత అంశంగా మారింది. 2004లో నాటి బీజేపీ ప్రభుత్వం దీన్ని నిలిపివేసింది. పాత పెన్షన్ పథకం ప్రకారం ఉద్యోగులు ఆఖరిగా తీసుకున్న జీతంలో 50 శాతం పెన్షన్‌గా ఇస్తారు. కొత్త స్కీమ్‌లో ఉద్యోగుల జీతం నుంచి 10%, ప్రభుత్వ వాటాగా 14% ఇస్తారు. కాంగ్రెస్, ఆప్ పాత పథకం తెస్తామంటున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వైఫల్యాలు ఏమార్చేందుకే కొత్త ఎత్తులు: మాయావతి
లక్నో: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ఆర్ఎస్ఎస్ కొత్త అంశాలను తెరపైకి తెస్తోందని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి ఆరోపించారు. లక్నోలో బీఎస్పీ పథాధికారులతో భేటీ సందర్భంగా మాయావతి ప్రసంగించారు. ‘ దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, హింస నెలకొన్నాయి. ఈ అంశాలపై ఆర్ఎస్ఎస్ మౌనమునిగా మారింది. మోదీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మాత్రం ఆర్ఎస్ఎస్ ముందువరసలో నిల్చుంటుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆర్ఎస్ఎస్ మరో కుట్రకు తెరతీసింది. మతమార్పిడి, అధిక జనాభా అంటూ కొత్త విషయాలకు ప్రాధాన్యతనిస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలొచ్చినా బీజేపీకి ఆర్ఎస్ఎస్ మద్దతుపలుకుతుంది. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై కనీసం ఒక్కసారైనా ఆర్ఎస్ఎస్ మాట్లాడలేదు. ఆర్ఎస్ఎస్ మౌనం విచారకరం, అంతేకాదు దేశానికి హానికరం ’ అని అన్నారు. మతమార్పిడి, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల కారణంగా అధిక జనాభా సమస్య తలెత్తుతోందని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబళె బుధవారం వ్యాఖ్యానించిన నేపథ్యంలో మాయావతి స్పందించారు. -
నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా కొలువులు!
ముంబై: బిజినెస్ ప్రాసెస్ అవుట్సౌర్సింగ్ (బీపీవో) సేవల సంస్థ ఐసీసీఎస్ వివిధ విభాగాల్లో దాదాపు 7,000 మందిని రిక్రూట్ చేసుకునే యోచనలో ఉంది. వచ్చే 12 నెలల కాలంలో ఈ మేరకు నియామకాలు జరపనున్నట్లు సంస్థ సీఈవో దివిజ్ సింఘాల్ తెలిపారు. కస్టమర్ సపోర్ట్, ఆపరేషన్స్, మార్కెట్ రీసెర్చ్, మానవ వనరులు, ఫైనాన్స్, మార్కెటింగ్ తదితర విభాగాల్లో హైరింగ్ ఉంటుందని వివరించారు. ఐసీసీఎస్కి ప్రస్తుతం ఎనిమిది ప్రాంతాల్లో డెలివరీ సెంటర్లు ఉన్నాయి. దాదాపు 6,600 మంది ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. చదవండి: పండుగ సీజన్.. కొత్త బైక్ కొనేవారికి షాక్! -
Bharat Jodo Yatra: చీతాలు సరే, కొలువులేవి?
హరిపాద్ (కేరళ)/న్యూఢిల్లీ: ‘‘దేశంలో ఒకవైపు నిరుద్యోగం, మరోవైపు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జనం ఇక్కట్ల పాలవుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యతను ప్రధాని గాలికొదిలేశారు. చీతాలను తెప్పించడంలో, వాటిని ఫొటోలు తీయడంలో బిజీగా ఉన్నారు’’ అంటూ కాంగ్రెస్‌నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఇది అర్థంపర్థం లేని పని అని వ్యాఖ్యానించారు. రాహుల్ భారత్ జోడో యాత్ర శనివారం కేరళలోని అలప్పుజ జిల్లా చేప్పాడ్‌లోకి ప్రవేశించింది. యువత ‘జాతీయ నిరుద్యోగ దినం’ అని తమ ఒంటిపై రాసుకొని ఆయనకు దారిపొడవునా స్వాగతం పలికారు. అనంతరం భారీ బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. చీతాలను రప్పించానంటున్న మోదీ గత 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానన్న హామీ నెరవేర్చడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు. ముందు నిరుద్యోగం, ధరల కట్టడిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ‘‘చిన్న, మధ్య తరహా వ్యాపారులు, రైతులు, శ్రామికులపై కేంద్రం వ్యవస్థీకృతంగా దాడి చేస్తోంది. ఇద్దరు ముగ్గురు బడా వ్యాపారవేత్తలే దేశ సంపదనంతా నియంత్రిస్తున్నారు. వారు ఏ వ్యాపారంలోకైనా ప్రవేశించి, అప్పటికే ఉన్నవారిని వెళ్లగొట్టగలరు. ఉద్యోగాలు దొరక్క యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కోట్లాది జనం పేదరికంలోకి జారుకుంటున్నారు. ఈ బడా వ్యాపారులు మాత్రం దేశంలో ఓడరేవులు, ఎయిర్‌పోర్టులు, రోడ్లు, విద్యుత్, వ్యవసాయం వంటి అన్ని రంగాలను సొంతం చేసుకుంటున్నారు’’ అంటూ వాపోయారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోదీ గత ఎనిమిదేళ్లలో ఇచ్చింది కేవలం 7 లక్షల కొలువులంటూ మండిపడ్డారు. ‘‘ఉద్యోగాలు సాధించే తీరతామంటూ యువత నినదిస్తోంది. వినిపిస్తోందా?’’ అంటూ ట్వీట్ చేశారు. జాతీయ నిరుద్యోగ దినం అంటూ హాష్టాగ్ జత చేశారు. మోదీ జన్మదినం సందర్భంగా శనివారాన్ని జాతీయ నిరుద్యోగ దినంగా యువత జరుపుకుంటోందని కాంగ్రెస్ పేర్కొంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాతా అమృతానందమయిని కరునాగపల్లి సమీపంలోని ఆమె ఆశ్రమంలో రాహుల్ కలుసుకున్నారు. పేదలు, అణగారిన వర్గాల సంక్షేమమానికి ఎనలేని కృషి సాగిస్తున్నారని కొనియాడారు. నల్ల దుస్తులతో కాంగ్రెస్ నిరసనలు నిరుద్యోగ సమస్యను తక్షణం పరిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. యువజన కాంగ్రెస్ నేతలు శనివారం దేశవ్యాప్తంగా నల్ల దుస్తులు ధరించి, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిరుద్యోగ మేళాలు నిర్వహించారు. ‘‘దేశంలో నిరుద్యోగిత రేటు కరోనాకు ముందే 45 ఏళ్ల గరిష్టానికి చేరింది. 20–24 ఏళ్ల వయసువారిలో 42 శాతం నిరుద్యోగులే’’ అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రినేట్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘కుబేరుల వ్యాపారాలే ముందుగా లబ్దిపొందుతున్నాయి. దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మోదీ సర్కార్ పథకాల ప్రయోజనాలు చిట్టచివరన దక్కుతున్నాయి’’ అని అన్నారు. మోదీ ప్రభుత్వమొచ్చి యువతకు నిరుద్యోగాన్ని బహుమతిగా ఇచ్చిందని ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ అన్నారు. -
పాలకుల కర్తవ్యం ఇదేనా?
కాలానికీ, అవసరాలకూ తగ్గట్టుగా అన్నీ మారతాయి... మారాల్సిందే. అయితే, ఆ మార్పుల వెనుక ఉద్దేశాల పట్ల అనుమానాలు తలెత్తినప్పుడే అభ్యంతరాలు వస్తాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు దేశ రాజధానిలో చేపట్టిన ‘సెంట్రల్ విస్టా’ ఆధునికీకరణ ప్రాజెక్ట్ తొలి దశ గురువారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైన తీరు, ‘రాజ్‌పథ్’కు ‘కర్తవ్యపథ్’గా పేరు మార్చడం చర్చకు తావిచ్చింది అందుకే! కేవలం 19 నెలల్లో ఇండియా గేట్ పరిసరాలు కళ్ళు చెదిరేలా మారిపోయాయి. కనువిందు చేస్తూ, గర్వకారణమనిపించే ఈ ఆధునిక మార్పులను ఆహ్వానించాల్సిందే. ఇండియాగేట్ సమీపాన బ్రిటీష్ కాలంలో కింగ్ అయిదో జార్జ్ విగ్రహమున్నచోట నేతాజీ ప్రతిమ పెట్టడమూ స్ఫూర్తిదాయ కమే. కానీ, భారీ విగ్రహాలు పెట్టి, రోడ్లకు పేర్లు మార్చి, దేశం సుభిక్షమని నమ్మింపజూస్తేనే చిక్కు. బానిసత్వాన్ని వదిలించుకోవాలని నోటితో చెబుతూ, తాము ప్రభువులమన్నట్టు ప్రవర్తిస్తేనే కష్టం. కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్, కొత్త పార్లమెంట్‌పై 4 సింహాల చిహ్నం, ఐఎన్ఎస్ విక్రాంత్, సెంట్రల్ విస్టా... ఇలా ప్రతి కొత్త ప్రారంభోత్సవం ఇవాళ ఒక జాతీయవాద ప్రచార ఆర్భాటం. ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు ఓ సరికొత్త రాజకీయ నేరేటివ్. గత నెలరోజుల్లోనే దేశవ్యాప్తంగా 30 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనో, ప్రారంభమో చేశారు. అలా దీన్ని 2024 ఎన్నికలకు ముందస్తు సన్నాహంగా మార్చడం పాలకుల గడుసుతనం. ఈ క్రమంలో వలసవాద అవశేషాలను తొలగిస్తున్నామంటూ... సామాన్యులు సైతం స్వేచ్ఛగా తిరిగిన ఇండియాగేట్ ప్రాంతాన్ని ‘కర్తవ్య పథ్’గా వారికి దూరం చేయడమే విరోధాభాస. ఈ ఏడాది స్వాతంత్య్ర దిన ప్రసంగంలోనే ప్రధాని ఈ ‘కర్తవ్యపథ’ నిర్దేశం చేసేశారు. ప్రభుత్వం చేసిన వాగ్దానాల్ని నిలబెట్టుకోవాలన్న డిమాండ్లను పక్కన బెట్టి, పౌరుల కర్తవ్యాన్ని నొక్కిచెప్పారు. ప్రజలే ప్రభువులని గుర్తు చేస్తున్న రాజ్‌పథ్‌ను, ప్రజలకు వారి కర్తవ్యాన్ని గుర్తుచేసే కర్తవ్యపథ్గా మార్చారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం లాంటి సమస్యల పరిష్కారం పాలకుల కర్తవ్యం. అది వదిలేసి ‘నామ్‌కే వాస్తే’ మార్పులపై దృష్టిపెడితే ఎలా? కాన్వాయ్‌ల మొదలు అనేక అంశాల్లో నేటికీ వలస పాలన అవశేషాలనే అనుసరిస్తున్న మన పాలకులు ముందుగా వారు వదులుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నిజానికి, రాష్ట్రపతి భవన్ నుంచి విజయ్ చౌక్, ఇండియా గేట్ మీదుగా పురానా ఖిల్లా దాకా సాగే మార్గం రాజ్‌పథ్. రైజీనా హిల్‌పై నుంచి పురానా ఖిల్లా దాకా ఆ మార్గాన్ని పరికిస్తున్నట్టుగా కట్టిన అప్పటి వైస్రాయ్ భవనమే నేటి రాష్ట్రపతి భవన్. ఆ మాటకొస్తే న్యూఢిల్లీ, అక్కడి భవనాలు, ఇండియా గేట్ లాంటి చారిత్రక కట్టడాలు బ్రిటీష్ హయాంలో నిర్మాణమైనవే. వాటన్నిటినీ బానిస చిహ్నాలుగా తృణీకరిస్తామా? చక్రవర్తి అయిదో జార్జ్ 1911లో భారత సందర్శనకు వచ్చినప్పుడు ‘ఢిల్లీ దర్బార్’ జరిగింది. కలకత్తా నుంచి ఢిల్లీకి దేశ రాజధానిని మార్చారు. ఆ జ్ఞాపకంగా బ్రిటీషర్లు ఈ మార్గానికి ‘కింగ్స్ వే’ అని పేరు పెట్టారు. దాని మీదుగా వెళ్ళే మరో రోడ్‌ను ‘క్వీన్స్ వే’ అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ‘కింగ్స్ వే’ను ‘రాజ్‌పథ్’ అనీ, ‘క్వీన్స్ వే’ను ‘జన్‌పథ్’ అనీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. నిజానికి, ఆ కొత్త పేర్లేమీ పాతవాటికి అనువాదాలు కావు. ‘రాజ్ పథ్’ అంటే రాజుల మార్గమని కాదు... ‘రాజ్య (ప్రభుత్వ) పథ’మనే అర్థం. ఆ రకంగా అప్పుడే ఆ వలస పాలకుల నామకరణా లను ప్రజాస్వామ్య చిహ్నాలుగా మార్చారు. ఆ పేర్లలో జన్‌సంఘ్ సహా ఎవరికీ కనిపించని వలస వాదం, బానిసత్వం తీరా ఇప్పుడు దర్శనమివ్వడమే విడ్డూరం. పేరులో ఏముంది పెన్నిధి అంటారు కానీ, ప్రతి పేరూ భావోద్వేగాలు రేకెత్తించగలదని ఎనిమిదిన్నరేళ్ళుగా దేశాన్ని ఏలుతున్న బీజేపీకి తెలుసు. అధికారంలోకి వచ్చిన ఏడాదికే 2015లోనే వీధులు, నగరాలు, అవార్డుల పేర్లు మార్చే పనిలో పడింది. ఢిల్లీలోని ఔరంగజేబ్ రోడ్‌ను అబ్దుల్ కలామ్ రోడ్‌గా మార్చడంతో మొదలుపెట్టి, ప్రధాని నివాసం ఉండే రేస్‌కోర్స్ రోడ్‌ను లోక్‌కల్యాణ్ మార్గ్‌గా, నెహ్రూ స్మారక మ్యూజియమ్ – లైబ్రరీ ఉన్న ఒకప్పటి నెహ్రూ నివాసం తీన్‌మూర్తి భవన్‌ను ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’గా మార్చేసింది. అక్బర్ రోడ్, హుమాయూన్ రోడ్ పేర్లు తదుపరి అజెండాలో ఉన్నాయట. ఈ దేశపు సమ్మిశ్రిత సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన పేర్లను తొలగించి, హిందూ పునరుద్ధరణవాద నామకరణాల వల్ల సమాజంలో సామరస్యం కొరవడితే అది పూడ్చలేని నష్టం. ఒక వర్గం కన్నా అధికులమనే భావన మరో వర్గంలో కలిగితే, అది సమాజాన్ని నిలువునా చీలు స్తుంది. 2019 ఎన్నికలకు ముందు ఒక్క యూపీలోనే అలహాబాద్‌ను ప్రయాగరాజ్‌గా, ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లాగా, మొఘల్ సరాయ్ రైల్వే జంక్షన్‌ను జన్‌సంఘ్ సిద్ధాంతవేత్త పేరిట దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్‌గా ఏ వలసవాద పాలన అవశేషాలున్నాయని మార్చారు? ఇది దేశ బహుళత్వ గుర్తింపును నిరాకరించడమే. చరిత్రలో మొఘల్ చక్రవర్తుల భాగాన్ని కనుమరుగు చేసే ప్రయత్నమే. రాజీవ్ ఖేల్‌రత్న అవార్డ్ పేరు ధ్యాన్‌చంద్ అవార్డుగా మారడం వెనుకా హాకీ దిగ్గజంపై గౌరవం కన్నా రాజకీయంగా తేల్చుకోదలచిన లెక్కలే ఎక్కువ. హైదరాబాద్ పేరును ‘భాగ్య నగర్’గా మారుస్తామని ఇటీవల బీజేపీ నేతలు ప్రకటించారు. ఏ చారిత్రక ఆధారాలతో ఆ మాట అన్నారో చెప్పలేం. ఇక, ఢిల్లీని ‘ఇంద్రప్రస్థం’గా మారుస్తారనీ ఓ ప్రచారం. వెరసి, ఈ పేర్ల మార్పు ధోరణితో ఎక్కడికెళతాం? వలస పాలకులు పోయారు కానీ, గద్దెపై పెద్దలు ప్రాధాన్యాలు మర్చిపో తేనే ఇబ్బంది. పాలకులు కర్తవ్యం విడిచి, దోవ తప్పితే ప్రజాస్వామ్యంలో ప్రజలకు కిం కర్తవ్యం? -
ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు: కేజ్రీవాల్
అహ్మదాబాద్: గుజరాత్ ప్రజలపై హామీల వర్షం కురిపించారు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే అందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3000 భృతి చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. అహ్మదాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి ఆయన ఈమేరకు తెలిపారు. గుజరాత్‌లోని కో-ఆపరేటివ్ రంగంలో ఉద్యోగాలన్నీ సన్నిహితులు, బంధువులకే ఇస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్‌ను గెలిపిస్తే అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. పేపర్ లీక్‌లు జరగకుండా చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ఢిల్లీలో అధికారం చేపట్టిన కొన్ని సంవత్సరాల్లోనే 12 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు కేజ్రీవాల్ వివరించారు. ఇటీవలే అధికారంలోకి వచ్చిన పంజాబ్‌లో 25 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే ఆ సంఖ్య 51 లక్షలకు పెరుగుతుందన్నారు. గుజరాత్లో కూడా 24 గంటలు నిర్విరామంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూస్తామన్నారు. చదవండి: యూపీ మంత్రికి షాక్.. అక్రమ ఆయుధాల కేసులో దోషిగా తేల్చిన కోర్టు.. -
రుతుపవనాలు ఎఫెక్ట్.. దిగొచ్చిన నిరుద్యోగం
ముంబై: దేశంలో నిరుద్యోగం గడిచిన ఆరు నెలల్లో కనిష్టానికి చేరింది. జూన్ నెలలో నమోదైన 7.80 శాతం నుంచి, జూలైలో 6.80 శాతానికి దిగొచ్చింది. వర్షకాలంలో సాగు సంబంధిత కార్యకలాపాలు పెరగడం ఉపాధి కల్పన పెరిగేందుకు దారితీసింది. ఈ వివరాలను సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) విడుదల చేసింది. గ్రామీణ నిరుద్యోగం రేటు 6.14 శాతానికి తగ్గిందని, ఇది అంతకుముందు నెలలో 8.03 శాతంగా ఉందని సీఎంఐఈ తెలిపింది. పట్టణాల్లో నిరుద్యోగం పెరిగింది. జూన్‌లో ఉన్న 7.80 శాతం నుంచి జూలైలో 8.21 శాతానికి చేరింది. పరిశ్రమలు, సేవల రంగాల్లో ఉద్యోగాలు తగ్గాయి. నెలవారీగా ఉపాధి కల్పనలో రికవరీ కొద్దిగానే ఉందని.. జూన్‌లో 1.3 కోట్ల మందికి ఉపాధి నష్టం ఏర్పడితే, జూలైలో కేవలం 63 లక్షల మందికే కొత్తగా ఉపాధి లభించినట్టు సీఎంఐఈ ఎండీ, సీఈవో మహేష్‌వ్యాస్ తెలిపారు. సాగు రంగం వల్లే.. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వ్యవసాయ రంగ కార్యకలాపాలు పెరగడం జూలైలో నిరుద్యోగం తగ్గడానికి ప్రధాన కారణమని సీఎంఐఈ నివేదిక పేర్కొంది. నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించడంతో ఖరీఫ్ సాగు పనులు ఊపందుకున్నట్టు తెలిపింది. అయితే, ఉత్తరప్రదేశ్, బీహార్‌లో ఇప్పటికీ సాగు బలహీనంగా ఉందని వ్యాస్ పేర్కొన్నారు. జూలై చివరి వరకు ఉన్న డేటాను చూస్తే వరి సాగు 13 శాతం మేర బీహార్ యూపీ, పశ్చిమబెంగాల్లో తగ్గినట్టు చెప్పారు. ‘‘ఖరీఫ్ సాగు మెరుగుపడనంత వరకు గ్రామీణ ఉపాధి కల్పనలో పురోగతి కనిపించదు. రానున్న రోజుల్లో రుతుపవనాలు మరింత బలపడతాయి. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనపై సానుకూల ప్రభావం చూపిస్తుంది’’అని వ్యాస్ చెప్పారు. చదవండి: Raghuram Rajan: అందుకే భారత్‌కు శ్రీలంక పరిస్థితి రాలేదు -
మగవారిని గమనించండి.. దేశంలో పెరుగుతున్న పురుషుల ఆత్మహత్యలు
ఇంట్లోని వారు ఎలా ఉన్నారో గమనించాల్సిన బాధ్యత మగవాడిదని సమాజం అంటుంది. కాని ఇంటి మగవాడు ఎలా ఉన్నాడో ఎవరు గమనించాలి? ఇటీవల పురుషులలో పెరుగుతున్న ఆత్మహత్యలు వారి ఒత్తిళ్లను పట్టించుకోవాల్సిన అవసరాన్ని ముందుకు తెస్తున్నాయి. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2020’ ప్రకారం దేశంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో 70 శాతం పురుషులవైతే 30 శాతం స్త్రీలవి. కోవిడ్ కాలపు అనారోగ్యం.. ఆర్థిక సమస్యలు.. ఉద్యోగ బాధలు మగవారిని ఈ వైపుకు నెడుతున్నాయి. వారి గురించి కుటుంబం, సమాజం ఆలోచించాలి. మన దేశంలో రోజుకు ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయో తెలుసా? రోజుకు దాదాపు 419. 2020లో మొత్తం ఎన్ని ఆత్మహత్యలు జరిగాయో తెలుసా? 1,53,052. వీటిలో పురుషుల సంఖ్య 1,08,532 (70 శాతం). స్త్రీలు 44, 498 (30 శాతం). అంటే స్త్రీల కంటే రెట్టింపు సంఖ్యలో పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. స్త్రీలు సున్నిత స్వభావులు, భావోద్వేగాలకు తొందరగా లోనవుతారు అనుకుంటాము. కాని పురుషులే ఇప్పుడు సున్నితంగా ఉన్నారు. జీవితాన్ని ఎదుర్కొనలేకపోతున్నారని ఈ సర్వే మనకు తెలియచేస్తోంది. స్త్రీలైనా పురుషులైనా ప్రాణం అత్యంత విలువైనది. అయితే స్త్రీలు తమ ఆందోళనను ఏదో ఒక విధంగా బయటపెట్టి నలుగురికి తెలిసేలా చేస్తారు. కాని పురుషుడు తన లోలోపల అదిమి పెట్టుకుంటాడు. తీరా నష్టం జరిగిపోయాకే అతడి మనసులో ఎంత వత్తిడి ఉన్నదో మనకు తెలుస్తుంది. దీనిని బట్టి ఇంట్లోని భర్తను, తండ్రిని, సోదరులను గమనించుకోవాల్సిన బాధ్యత మిగిలిన కుటుంబ సభ్యులపై ఉందని తెలుస్తోంది. కోవిడ్ అనంతరం 2020 ప్రారంభంలోనే కోవిడ్ మహమ్మారి రావడం, ఫలితంగా నిరుద్యోగం, ఆర్థిక అభద్రత, మానసిక ఆందోళన... ఇవన్నీ పురుషుల ఆత్మహత్యలకు కారణం కావచ్చునని నిపుణులు అంటున్నారు. అయితే దీని వెనుక సంఘం పెట్టిన ఇమేజ్ కూడా కారణమే. పురుషుడంటే సమర్థుడిగా ఉండాలి, ఎలాగైనా కుటుంబాన్ని పోషించాలి, తెగింపుతో ఉండాలి ఇలాంటి స్టీరియోటైప్ ఆలోచనలను ఇచ్చింది సంఘం. ఏడ్చే మగాళ్లను నమ్మొద్దంది. కాని పురుషుడు ఒత్తిడిలో ఉంటే ఏం చేయాలి? కష్టం చెప్పుకుంటే చేతగానివాడనుకుంటే ఎలా? ఆత్మహత్య చేసుకోవడమేనా దారి? కొందరు పురుషులు అదే చేస్తున్నారు. పనిచేసే చోట అవమానాలు 2020లో పురుషులలో జరిగిన ఆత్మహత్యలను పరిశీలిస్తే పని ప్రదేశంలో అవమానాలు కూడా ఒక కారణం అని తెలుస్తోంది. ఆ సంవత్సరం పనిచేసేచోట అవమానాల వల్ల దేశంలో మొత్తం 1847 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో పురుషులు 1602 (87 శాతం). స్త్రీలు 234 (12 శాతం). అంటే రోజుకు సగటున ఐదు ఆత్మహత్యలు దేశంలో పని ప్రదేశంలో వేధింపుల వల్ల జరుగుతున్నాయి. వీటిలో మూడు నుంచి నాలుగు పురుషులవి. బాస్‌లు అవమానించడం, జీతాల పెంపులో తేడా, ప్రమోషన్లలో తరతమ భేదాలు ఇవన్నీ మగవాళ్లను కుంగదీసి ఆత్మహత్యల వైపు నెడుతున్నాయి. స్త్రీలకు లైంగిక వేధింపులు ప్రధాన కారణం అవుతున్నాయి. అలాగే పని దొరకడం లేదన్న బాధతో కూడా పురుషులు ఎక్కువ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. భరోసా ఇవ్వాలి తండ్రి, భర్త, సోదరులతో మాట్లాడండి. వారి ఉద్యోగం, వ్యాపారం, వృత్తి... వీటిలో ఉన్న సమస్యలు ఏమిటో తెలుసుకోండి. ఆరోగ్యం గురించి ఆరా తీయండి. సమస్య ఉంటే బలవంతంగానైనా హాస్పిటల్‌కు తీసుకెళ్లండి. ఆర్థిక సమస్యలు తెలుసుకోండి. అప్పులేమైనా ఉన్నాయా కూపీ లాగండి. పరిస్థితి ఎలా ఉన్నా వారి వల్ల ఏదైనా తప్పు జరిగి ఉన్నా నిందించకండి. నిలదీయకండి. సపోర్ట్ చేస్తామని చెప్పండి. ఒత్తిడి ఉంటే విశ్రాంతి తీసుకోమని చెప్పండి. ఉద్యోగం మారాలనుకుంటే మారమని, లేదంటే మానేసి కొంతకాలం బ్రేక్ తీసుకోమని, మరేం పర్వాలేదని దిలాసా ఇవ్వండి. మిత్రులతో, క్లోజ్‌ఫ్రెండ్స్‌తో మాట్లాడించండి. నిర్లక్ష్యం చేయకండి. నిర్లక్ష్యం ప్రాణాంతకం. -
కార్మిక శక్తి సర్వే.. దేశంలో నిరుద్యోగం తగ్గిందట!?
న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం (15 ఏళ్లు, అంతకుమించి) ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో (జనవరి–మార్చి) 8.2 శాతానికి తగ్గింది. 2021 మొదటి మూడు నెలల్లో 9.3 శాతంగా ఉండడం గమనించాలి. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) నిర్వహించిన ‘14వ కార్మిక శక్తి సర్వే’లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2021 మొదటి 3 నెలల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉండడానికి కరోనా నియంత్రణ కోసం దీర్ఘకాలం పాటు విధించిన లాక్డౌన్ల ప్రభావం ఉంది. ఇక గతేడాది చివరి మూడు నెలల్లో (2021 అక్టోబర్–డిసెంబర్) నిరుద్యోగం 8.7 శాతంగా ఉంది. అంటే త్రైమాసికం వారీగా చూసినా ఉపాధిలేని వారి సంఖ్య తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. ► మహిళల్లో నిరుద్యోగ రేటు 2022 జనవరి–మార్చి మధ్య 10.1 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 11.8 శాతం. 2021 చివరి త్రైమాసికంలో 10.5 శాతంగా ఉంది. ► పురుషుల్లో ఉపాధి లేకుండా ఉన్న వారి రేటు 2022 మొదటి త్రైమాసికంలో 7.7 శాతానికి తగ్గింది. అంతక్రితం త్రైమాసికంలో ఇది 8.3 శాతంగా ఉంది. ఇక ఏడాది క్రితం ఇదే కాలంలో 8.6 శాతంగా ఉండడం గమనించాలి. ► పట్టణాల్లో నిరుద్యోగ రేటు 47.3 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 47.5 శాతంగా ఉంది. గతేడాది చివరి త్రైమాసికంలోనూ ఇది 47.3 శాతంగా నమోదైంది. ► పట్టణ ప్రాంతాల్లో పురుష నిరుద్యోగులు 7.7 శాతంగా ఉన్నారు. ఏడాది క్రితం ఇది 8.6 శాతంగా ఉంటే, గతేడాది చివరి మూడు నెలల్లో 8.3 శాతంగా ఉంది. చదవండి: శాంసంగ్ షాకింగ్ నిర్ణయం..ఆ సిరీస్ ఫోన్ తయారీ నిలిపివేత! ఎందుకంటే! -
Ukraine-Russia war: రణభూమి తూర్పు ఉక్రెయిన్
కీవ్/మాస్కో: తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడులు ఉధృతమయ్యాయి. కీలక పారిశ్రామిక ప్రాంతమైన డోన్బాస్‌పై పట్టుబిగించేందుకు రష్యా దళాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. శుక్రవారం సీవిరోడోంటెస్క్, లీసిచాన్‌స్క్‌లో భీకర దాడులకు దిగాయి. సీవిరోడోంటెస్క్‌లో ఇప్పటిదాకా 1,500 మంది మరణించారని, దాదాపు 13,000 మంది క్షతగాత్రులయ్యారని స్థానిక మేయర్ ఒలెగ్జాండర్ స్టిరియుక్ చెప్పారు. గత 24 గంటల్లో నలుగురు బలయ్యారని తెలిపారు. ఈ పట్టణంలో 60 శాతం నివాస గృహాలు రష్యా దాడుల్లో ధ్వంసమయ్యాయి. విదేశీ ఆయుధాలను వెంటనే రంగంలోకి దించకపోతే సీవిరోడోంటెస్క్‌ను రష్యా సైన్యం బారి నుంచి కాపాడడం కష్టమని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా హెచ్చరించారు. రష్యా వైమానిక దాడుల్లో లీసిచాన్స్క్ సిటీలో తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర ఖర్కీవ్‌లోని బలాక్లియాలో ఇద్దరు వృద్ధులు మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్‌పై రష్యా సైన్యం భీకరస్థాయిలో దాడులకు పాల్పడింది. నిప్పుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో కనీసం 9 మంది పౌరులు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐదు నెలల చిన్నారి కూడా ఉంది. ఆమె తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని లాంచ్ రాకెట్లు సిస్టమ్స్ ఇవ్వండి తూర్పు డోన్బాస్లో రష్యా దాడులను తిప్పికొట్టడానికి తమకు మరిన్ని లాంచ్ రాకెట్ సిస్టమ్స్ సాధ్యమైనంత త్వరగా పంపించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పశ్చిమ దేశాలను కోరారు. ఆయన తాజాగా ఒక వీడియో సందేశం విడుదల చేశారు. యుద్ధ రీతిని మార్చడానికి అవసరమైన ఆయుధాలను సమకూర్చుకుంటున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ భద్రత, స్వేచ్ఛ కోసమే తమ పోరాటం సాగుతోందని అన్నారు. ఆక్రమణదారులను ఉక్రెయిన్ నుంచి తరిమికొట్టడానికి మరింత ఆత్మవిశ్వాసంతో, వేగంగా ముందుకు సాగుతున్నామని ప్రజలకు తెలియజేశారు. మరో ఇద్దరు రష్యా సైనికుల విచారణ యుద్ధ నేరాల కింద ఉక్రెయిన్ కోర్టు ఇప్పటికే ఒక రష్యా సైనికుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. యుద్ధ నేరాల ఆరోపణల కింద మరో ఇద్దరు రష్యా జవాన్లు తాజాగా కోర్టులో విచారణకు హాజరయ్యారు. అలెగ్జాండర్ అలెక్సీవిచ్ ఇవానోవ్, అలెగ్జాండర్ వ్లాదిమిరోవిచ్ బాబీకిన్ను కొటెలెవ్స్కీ జిల్లా కోర్టు విచారించింది. వారికి దాదాపు 12 ఏళ్ల చొప్పున కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. పశ్చిమ దేశాలకు ఇక ఆర్థిక కష్టాలే: పుతిన్ తమ దేశాన్ని ఏకాకిని చేయాలన్న పశ్చిమ దేశాల ఎత్తుగడలు ఫలించబోవని రష్యా అధ్యక్షుడు పుతిన్ తేల్చిచెప్పారు. పశ్చిమ దేశాలకు ఇకపై మరిన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడం ఖాయమని అన్నారు. యూరేసియన్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పుతిన్ మాట్లాడారు. ఆధునిక ప్రపంచంలో రష్యాను ఒంటరి చేయడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. అలాంటి ప్రయత్నాలు చేసే వారికి చేదు అనుభవమే మిగులుతుందన్నారు. పశ్చిమ దేశాల్లో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతోందని, నిరుద్యోగం తాండవిస్తోందని, సప్లై చైన్ తెగిపోతోందని, ఆహార సంక్షోభం ముదురుతోందని పుతిన్ వెల్లడించారు. -
రాక రాక ఉద్యోగాల నోటిఫికేషన్లు.. అయినా పుస్తకం రాదు, కుర్చీ ఉండదు!
సాక్షి,ఖమ్మం గాంధీచౌక్: రాకరాక ఉద్యోగాలకు అవకాశం వచ్చింది. ఎలాగైనా ఫలితం సాధించాలనే లక్ష్యంతో నిరుద్యోగులు శక్తియుక్తులను ప్రయోగిస్తున్నారు. పోటీలో నెగ్గేందుకు పట్టుదలగా ముందుకు సాగుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా వారికి కావాల్సిన పుస్తకాలు లభించక ఇక్కట్లు పడుతున్నారు. ప్రస్తుత పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు జిల్లా గ్రంథాలయంలో అందుబాటులో లేక... మార్కెట్లో కొనుగోలు చేసే శక్తి లేక ఆందోళన, అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు గ్రంథాలయంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో చదువు ముందుకు సాగడం లేదని వాపోతున్నారు. సిద్ధమయ్యేదెలా.. వచ్చేనెలలో వరుసగా పోటీ పరీక్షలు జరగనుండా, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చదువుకునేందుకు ప్రతిరోజు 700 మందికి పైగా యువతీ, యువకులు వస్తున్నారు. అయితే, సబ్జెక్టుకు సంబంధించిన తాజా పుస్తకాలు అరకొరగానే ఉండడం, 2016–17కు ముందు సిలబస్ పుస్తకాలే ఉండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తాజా పుస్తకాలు లేకపోతే పరీక్షలకు ఎలా సిద్ధం కావాలనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక్కో అభ్యర్థి వ్యయ ప్రయాసలకోర్చి దూర ప్రాంతాల నుంచి ఖమ్మం వచ్చి అద్దె గదుల్లో ఉంటూ చదువుకోవాలని భావించగా గ్రంథాలయంలో పుస్తకాలు లేక పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి జూన్ నుంచి వరుసగా పరీక్షలు జరగనుండడంతో కావాల్సిన పుస్తకాలను వెంటనే తెప్పించే ఏర్పాటుచేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. అసౌకర్యాలతో సహవాసం గ్రంథాలయంలో సరిపడా బెంచీలు, ఫ్యాన్లు లేక, ఉన్న 12 ఏసీల్లో ఒకటే పనిచేస్తుండడంతో ఉక్కపోత నడుమే అభ్యర్థులు చదువుకోవాల్సి వస్తోంది. ఇక బెంచీలు సరిపోకపోవడంతో కొందరు కింద కూర్చుంటుండగా, మరికొందరు ఇళ్ల నుంచి కుర్చీలు తెచ్చుకుంటున్నారు. అలాగే, పురుషులు, మహిళలకు ఒక్కొక్కటే మరుగుదొడ్డి ఉండడంతో క్యూ కట్టాల్సి వస్తోంది. నూతనంగా మరుగుదొడ్లు నిర్మించినా వినియోగంలోకి తీసుకురాకపోవడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఇటీవల ఉచిత భోజన వసతి ఏర్పాటుచేసినట్లు ప్రకటించినా.... కొద్దిరోజులకే తొలగించారు. అలాగే, పలు సందర్భాల్లో తాగునీటికి కూడా సమస్య ఎదురవుతోందని చెబుతున్నారు. జిల్లా గ్రంథాలయం ఎదుట ఆందోళన ఖమ్మం గాంధీచౌక్ : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సౌకర్యాలు కల్పించడంతో పాటు అవసరమైన పుస్తకాలు తెప్పించాలనే డిమాండ్‌తో మంగళవారం నిరుద్యోగ యువతీ, యువకులు ఆందోళనకు దిగారు. గ్రంథాలయం ఎదుట ఆందోళనకు దిగిన వారు మాట్లాడుతూ కూర్చోవడానికి బెంచీలు సరిపోకపోగా ఫ్యాన్లు, ఏసీలు కూడా పనిచేయడం లేదని తెలిపారు. దీనికి మరుగుదొడ్ల సమస్య కూడా ఉందని పేర్కొన్నారు. దీంతో గ్రంథాలయ కార్యదర్శి మంజువాణి చేరుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారికి నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. కనీస వసతులు కూడా లేవు.. సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా. చుట్టాల ఇంట్లో ఉంటూ నిత్యం గ్రంథాలయానికి వస్తుండగా, లేటెస్ట్ పుస్తకాలు అందుబాటులో లేవు. రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు అవసరమైన బుక్స్ కూడా లభించటం లేదు. దీనికి తోడు మౌలిక వసతులు కూడా సక్రమంగా లేవు. – అశోక్, కల్లూరు అవసరమైన పుస్తకాలు తెప్పించాలి పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలు తెప్పించాలి. బయట పుస్తకాలు కొనే స్థోమత లేని వారే గ్రంథాలయానికి వస్తారు. కానీ ఇక్కడ అవసరమైన పుస్తకాలు లేక పోటీ పరీక్షలకు సిద్ధం కాలేకపోతున్నాం. దీనికి తోడు ఇతరత్రా సమస్యలు కూడా అనేకంగా ఉన్నాయి. – సుజాత, కాకరవాయి, తిరుమలాయపాలెం మండలం చదవండి: పోటీ పరీక్షల కోసం.. నిరుద్యోగ యువతకు యాప్ -
నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్..
కరీంనగర్ అర్బన్: ప్రభుత్వ కొలువులకు సన్నద్ధమయ్యే వారి కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది వారధి సంస్థ. పోటీ పరీక్షలకు సంబంధించిన సమాచారం, మాక్ టెస్ట్, సిలబస్, తదితర అంశాలను విపులంగా పొందుపరిచారు. ఏ ఉద్యోగమైనా సదరు సమాచారం లభించనుంది. కాగా.. మంగళవారం టీటి హబ్ టవర్‌లో టీమ్–అప్ సంస్థ అధినేత ఎం.కె.చైతన్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంకతో కలసి ‘వారధి సొసైటీ మొబైల్ యాప్‘ను కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రారంభించారు. జిల్లాతో పాటు రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రూప్ 1,2 పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. కరీంనగర్ పట్టణంలో మొట్టమొదటి సారిగా టీం–అప్ సంస్థ ద్వారా రూపొందించిన యాప్‌లో మాక్ టెస్ట్, స్టడీ మెటీరీయల్స్, పలు రకాల ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, టీం–అప్ సంస్థ కో ఫౌండర్ ఏ.రంజిత్, వారధి సెక్రటరీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. యాప్ వినియోగం ఇలా... టీం–అప్ సంస్థ సీఈఓ ఎంకే చైతన్య మాట్లాడుతూ.. యాప్ సేవలను పొందడానికి ఫోన్ నెంబర్, ఓటీపీతో లాగిన్ అవ్వాలి. ఒకవేళ ఇంతకు ముందు వారధిలో మెంబర్ అయినట్లైతే వారి వారధి అకౌంట్లో లాగిన్ అవ్వాలి. ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుండి వారధి అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. చదవండి: Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు -
ఏడాదికి కోటి ఉద్యోగాలేవీ?
ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ సర్కారు 8 ఏళ్ల కాలంలో 8 కోట్లు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే 60 లక్షల ఉద్యోగాలు ఇచ్చామనీ, మరో 60 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామనీ చేసిన ప్రకటన యువతకు ఆశ్చర్యం కలిగించింది. మోదీ గద్దెనెక్కిన తర్వాత 8.1 శాతం నిరుద్యోగుల సంఖ్య పెరిగింది. దేశంలో 18 నుంచి 25 ఏండ్ల వయసున్న యువత 50 శాతం ఉన్నారు. కోవిడ్‌కు ముందు 25 కోట్ల మంది నిరుద్యోగులు ఉండగా... కోవిడ్ తర్వాత ఆ సంఖ్య 45 కోట్లకు చేరింది. కొత్తగా ఉద్యోగాలను సృష్టించి ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇచ్చే మాట అటుంచి... ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలూ, శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకన్నా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలి కదా. 245 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 19.15 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 72 కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 8 లక్షల 72 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రక్షణ (2.27 లక్షలు), పోస్టల్ (90 వేలు), హోం (1.28 వేలు), రెవెన్యూ (76,327), సైన్సు– టెక్నాలజీ (8,227) గనులు (6,925), జలవనురులు (4,557), కుటుంబ– ఆరోగ్యం (21,003) వంటి ఎన్నో శాఖల్లో ఖాళీలు నింపవలసి ఉంది. అలాగే 1,672 ఐఏఎస్ పోస్టులు, 1,452 ఐపీఎస్ పోస్టులు, మరో 3 వేల వరకు ఇతర సివిల్ సర్వీసెస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సాయుధ బలగాల్లో 1,22,555, గ్రామీణ డాక్‌లలో 73,452, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41,177, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 10,368, ఐఐటీల్లో 3,876 ఖాళీలు నింపవలసి ఉంది. (చదవండి: ఇంత క్రూరమైన సమాజంలో నివసిస్తున్నామా?) నిరుద్యోగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న ప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరం. ఎన్నికలు వచ్చినప్పుడల్లా విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు యువతకు ఉద్యోగాల పేరుతో గాలమేసి ఓట్లు పొంది అధికార పీఠాన్ని ఎక్కుతున్నాయి. ఆ తర్వాత వారిని పూర్తిగా విస్మరించడం శోచనీయం! (చదవండి: కాలం చెల్లిన చట్టాలు ఇంకానా?) – గుర్రం రాంమోహన్ రెడ్డి, హైదరాబాద్ -
నిరుద్యోగ ఎమర్జెన్సీ ప్రకటించాలి: దాసోజు
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగం పేరుతో అధికార టీఆర్ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, వెంటనే రాష్ట్రంలో నిరుద్యోగ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన సర్వేలో ప్రభుత్వంపై నిరుద్యోగులు, యువతలో తీవ్ర వ్యతిరేకత ఉందని తేలడంతోనే అసెంబ్లీలో ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారే తప్ప నిరుద్యోగులపై ప్రేమతో కాదని విమర్శించారు. శనివారం గాంధీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, అలాంటప్పుడు 40 లక్షల మంది నిరుద్యోగులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ద్వారా శిక్షణ ఎందుకు ఇప్పిస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో చెప్పిన రోజు నుంచే నోటిఫికేషన్లు వస్తాయని కేసీఆర్ చెప్పారని, కానీ నేటికీ ఒక్క నోటిఫికేషన్ రాలేదని మండిపడ్డారు. అన్ని ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారానే భర్తీ చేసి, నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతిని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. -
గ్రూప్ పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
-
ఆ స్తోమత లేదా? అయినా తప్పదు! భర్తకు షాక్
భర్త పెట్టే వేధింపులు భరించలేక.. దూరంగా, వేరుగా ఉంటోందామె. అయితే భర్త తనకు దూరంగా మంచి జీతంతో విలాసవంతంగా బతుకుతున్నాడని, కాబట్టి, తనకు మెయింటెనెన్స్ కోసం కొంత డబ్బు ఇప్పించాలని ఆ భార్య కోర్టును ఆశ్రయించింది. ఆపై పరిణామాలు ఆ భార్యకు అనుకూలంగా రాగా.. పైకోర్టును ఆశ్రయించిన భర్తకు పెద్ద షాకే తగిలింది. చాలా ఏళ్ల క్రితమే భర్తను వీడి.. దూరంగా ఉంటున్న ఆ భార్యకు మధ్యంతర భరణంగా నెలకు రూ.5,133 చెల్లించాలని భర్తను ఆదేశించింది మహిళా కోర్టు. అయితే ఈ తీర్పుపై ఢిల్లీ కోర్టును ఆశ్రయించగా.. చేదు అనుభవమే ఎదురైంది. తాను నిరుద్యోగినని, భరణంగా డబ్బులు ఇవ్వలేనని పిటిషన్లో వేడుకున్నాడు ఆ భర్త. దీనిపై ఈమధ్యే విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు, భర్త నిరుద్యోగి అయినంత మాత్రాన తన భార్యను పోషించే బాధ్యత నుంచి తప్పించుకోలేడని స్పష్టం చేసింది. నిరుద్యోగం కారణంగా చూపి భార్యకు మధ్యంతర భరణం ఇచ్చే బాధ్యత నుంచి భర్త తప్పించుకోలేడని తీస్ హజారీ కోర్టుల అదనపు సెషన్స్ జడ్జి సంజయ్ శర్మ తీర్పునిచ్చారు. ‘‘భర్త నిరుద్యోగి. అది వాస్తవమే కావొచ్చు. అయినప్పటికీ భార్యకు భరణం చెల్లించే బాధ్యత నుంచి అది తప్పించలేదు. ఈ కేసులో భర్తకు మంచి విద్యార్హత ఉంది. వృత్తిపరంగా అనుభవమూ ఉంది. ఇప్పుడు ఉద్యోగం లేనంత మాత్రానా.. తర్వాతి రోజుల్లో మరో ఉద్యోగం సంపాదించలేడా?. వైకల్యం ఏం లేదు కదా’’ అని జడ్జి భర్తను ఎదురు ప్రశ్నించారు. వరకట్న వేధింపులకు పాల్పడి మరీ తనను మానసికంగా, శారీరకంగా వేధించాడని ఆ భర్తపై భార్య ఆరోపణలు చేసింది. అతడి వేధింపులు తాళలేక వేరుగా నివసిస్తూ.. నెలకు రూ.50 వేల జీతంతో విలాసవంతంగా బతుకుతున్నాడని, తన మెయింటెనెన్స్ కోసం కొంత ఇప్పించాలని ఆమె కోర్టును ఆశ్రయించింది. అయితే.. తాను ఇంటి ఖర్చులు భరిస్తున్నానని, అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చూసుకుంటున్నానని, కుట్టుపని ద్వారా తన కంటే తన భార్యే ఎక్కువ సంపాదిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అయినప్పటికీ ఆమెకు మంచి సౌకర్యాలు అందించాలని, అది నైతిక, చట్టపరమైన బాధ్యత అని ఢిల్లీ కోర్టు వ్యాఖ్యానించింది. -
కేంద్రం చేతగానితనం వల్లే నిరుద్యోగం: రాహుల్
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేతగానితనం వల్ల దేశంలో నిరుద్యోగ ఎమర్జెన్సీ నెలకొందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. పెచ్చరిల్లిన నిరుద్యోగం వల్లే యువత ఆత్మహత్యలు పెరుగుతున్నాయంటూ శనివారం ట్వీట్ చేశారు. 2018–20 మధ్య అప్పుడు, నిరుద్యోగం వల్ల దేశవ్యాప్తంగా 25 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారన్న మీడియా నివేదికను ఆయన ఉదాహరించారు. నిరుద్యోగం వల్ల ఆత్మహత్యలు 24 శాతం పెరిగాయంటూ రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా ట్వీట్ చేశారు. ‘‘84 శాతం కుటుంబాల ఆదాయం తగ్గిపోయింది. అయినా ప్రధాని మోదీ, ఆయన మంత్రులు తమ పాలనను అమృత కాలమని చెప్పుకుంటున్నారు. నిజానికి గుడ్డి రాజు పాలన సాగుతున్న అంధకాలమిది’’ అంటూ విమర్శించారు. -
లక్షల ఉద్యోగాలిస్తున్నా మొసలి కన్నీరు
సాక్షి, అమరావతి: నిరుద్యోగులను నట్టేట ముంచి ఉద్యోగాల ఊసే లేకుండా ఐదేళ్లు గడిపిన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పుడు లక్షల సంఖ్యలో పోస్టులు భర్తీ చేస్తున్నా కలెక్టరేట్ల ముట్టడి, నిరసనలంటూ తమ పార్టీ కార్యకర్తలతో డ్రామాలాడటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. జాబు రావాలంటే బాబు రావాలని టీడీపీ నేతలు ఆనాడు ఇంటింటికీ తిరిగి చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉన్నా నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ఆర్నెల్ల ముందు ఉద్యోగాల భర్తీ అంటూ జీవోలిచ్చి మభ్యపెట్టారు. ఏపీపీఎస్సీ ద్వారా 32 నోటిఫికేషన్లు విడుదల చేసి పోస్టులు మాత్రం భర్తీ చేయలేదు. గ్రూప్ – 2, గ్రూప్ – 3 తదితర కొన్ని నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించినా అక్రమాలు వెల్లువెత్తాయి. కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు ఏపీపీఎస్సీలో తిష్టవేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంస్కరణలు చేపట్టి ఎప్పటికప్పుడు పారదర్శకంగా పోస్టులను భర్తీ చేస్తోంది. గత సర్కారు హయాంలో నిలిచిపోయిన నోటిఫికేషన్లను సైతం న్యాయ వివాదాలు పరిష్కరించి నియామకాలను పూర్తి చేసింది. మరోవైపు పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేయడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందిస్తోంది. ప్రత్యేకించి కరోనా సమయంలో చిన్న, సూక్ష్మ పరిశ్రమలను నిలబెట్టేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ తీసుకుని ప్రోత్సాహకాలతో పాటు గత సర్కారు బకాయిలు కూడా విడుదల చేయడంతో యువత అవకాశాలు మెరుగుపడ్డాయి. వీటితోపాటు స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ చేదోడు, ఆసరా, చేయూత తదితర పథకాల ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందచేస్తోంది. + రెండున్నరేళ్లలో రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాట ప్రకారం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టింది. గత సర్కారు హయాంలో నోటిఫికేషన్లకే పరిమితమై న్యాయ వివాదాల్లో చిక్కుకున్న వాటిని పరిష్కరించి 3,946 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసింది. 1,237 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్లు జారీ వెలువడ్డాయి. సచివాలయాల వ్యవస్థను ప్రవేశపెట్టి ఒకే ఒక్క నోటిఫికేషన్ ద్వారా నెలల వ్యవధిలోనే ప్రక్రియను సజావుగా పూర్తి చేసింది. రెండున్నరేళ్లలో కొత్తగా 1,84,264 ఉద్యోగాలను ప్రభుత్వం సృష్టించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే 1.25 లక్షల మందికిపైగా ఉద్యోగులున్నారు. ప్రతి గ్రామంలో చదువుకున్న యువతకు ఉపాధి కల్పిస్తామన్న హామీని సీఎం జగన్ నెరవేర్చారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2019 వరకు 3.97 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులుండగా కేవలం రెండున్నరేళ్లలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రికార్డు స్థాయిలో 1.84 లక్షలకుపైగా కొత్త ఉద్యోగాలనివ్వడం గమనార్హం. + డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు న్యాయం టీడీపీ హయాంలో పాఠశాల విద్యాశాఖ ద్వారా 21 వేల పోస్టులు భర్తీ చేస్తామని నిరుద్యోగులను ఊరించి కేవలం 9,275 పోస్టులకే 2018 సెప్టెంబర్‌లో జీవో ఇచ్చారు. చివరకు నోటిఫికేషన్లు వచ్చేసరికి అది కాస్తా 7,902 పోస్టులకు కుదించుకుపోయింది. న్యాయ వివాదాలు చుట్టుముట్టడంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక చొరవ తీసుకొని పరిష్కరించి నియామకాలు చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్ధులకు కూడా మానవతా దృక్పథంతో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది. అదే సమయంలో పరీక్షలు రాసిన క్వాలిఫైడ్ అభ్యర్ధులకు పక్క రాష్ట్రంలో న్యాయం జరగకపోవడం గమనార్హం. టీడీపీ హయాంలో నిరుద్యోగులను మభ్యపెట్టేలా జీవోలిచ్చి నియామక ప్రక్రియ ముందుకు వెళ్లకుండా న్యాయ వివాదాల్లోకి నెట్టారు. ఫలితంగా వేలాది పోస్టులు అలాగే ఉండిపోయాయి. యూనివర్సిటీ పోస్టులదీ అదే పరిస్థితి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ అంటూ ఇచ్చిన నోటిఫికేషన్లు న్యాయవివాదాల్లో చిక్కుకుని నేటికీ ఎటూ తేలలేదు. చివరకు వాటి స్థానంలో కొత్తగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై ప్రస్తుతం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. + పరిశ్రమలకు ఊతంతో భారీగా ఉపాధి రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్, స్పిన్నింగ్ మిల్స్‌కు ఊతమిస్తూ రూ.2,086.42 కోట్ల ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గత సర్కారు బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను సైతం ఈ ప్రభుత్వమే చెల్లించింది. రీస్టార్ట్ ప్యాకేజీ కింద ఎంఎస్ఎంఈలకు రూ.2,086 కోట్లు విడుదల చేసింది. రెండున్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 19,997 ఎంఎస్ఎంఈల ఏర్పాటు అయ్యాయి. 1,09,829 మందికి ఉపాధి కల్పించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలతో లబ్ధి పొందుతున్న యూనిట్లలో 62 శాతం వాటా ఎస్సీ, ఎస్టీ, బీసీలది కాగా 42 శాతం అక్కచెల్లెమ్మలది కావడం గమనార్హం. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రూ. 30,175 కోట్ల పెట్టుబడితో 68 భారీ, మెగా పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. దీని ద్వారా 46,119 మందికి ఉపాధి లభిస్తోంది. ఇదే కాకుండా రూ. 36,384 కోట్ల పెట్టుబడితో త్వరలో ప్రారంభం కానున్న మరో 62 భారీ, మెగా ప్రాజెక్ట్‌లు 76,916 మందికి ఉపాధి కల్పించనున్నాయి. ఎలక్ట్రానిక్ రంగంలో భారీ పెట్టుబడులకు బ్లూస్టార్, డైకిన్, యాంబర్, డిక్సన్, ఫాక్స్‌కాన్, సెల్కాన్, కార్బన్ లాంటి సంస్థలు ముందుకొచ్చాయి. రికార్డు సమయంలో రెండు పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేసి ప్రారంభించింది. నాలుగు ఫిషింగ్ హార్బర్లకు శంకుస్థాపన చేయగా మరో ఐదు హార్బర్లకు టెండర్లు పిలిచారు. + స్వయం ఉపాధికి ప్రోత్సాహం స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందచేస్తోంది. చిరు వ్యాపారులు అధిక వడ్డీల బారిన పడి చితికిపోకుండా జగనన్న తోడు పథకం దోహదం చేస్తోంది. ఈ పథకం ద్వారా వడ్డీ లేకుండా రూ.10 వేల చొప్పున బ్యాంకు రుణాలను అందచేస్తోంది. జగనన్న చేదోడు పథకం ద్వారా రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు రూ.10 వేల చొప్పున వరుసగా రెండో ఏడాది కూడా సాయాన్ని ఇటీవలే అందించింది. జగనన్న వాహన మిత్ర ద్వారా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ. 10 వేలు చొప్పున ఇస్తోంది. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 45 – 60 ఏళ్ల అగ్రవర్ణ మహిళలకు ఏటా రూ.15 వేలు చొప్పున అందించి అండగా నిలుస్తోంది. వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా తదితర పథకాలతో వారి కాళ్లపై వారు నిలదొక్కుకుని కుటుంబాన్ని పోషించుకునేలా సాయాన్ని అందచేస్తోంది. + 4.77 లక్షల కుటుంబాలకు శాశ్వత ‘ఉపాధి’ వ్యాపార దిగ్గజ సంస్థలైన హిందూస్థాన్ లీవర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గ్యాంబల్, రిలయెన్స్, అజియో, అమూల్ లాంటి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుని గత రెండేళ్లలో 4.77 లక్షల కుటుంబాలకు శాశ్వత జీవనోపాధులను కల్పించింది. వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాల ద్వారా ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సాయంతోపాటు వ్యాపార సంస్థల అదనపు తోడ్పాటుతో లక్షల కుటుంబాలు రిటైల్ వ్యాపారాలను ఏర్పాటు చేసుకున్నాయి. + పొదుపు సంఘాలకు జీవం.. రాష్ట్రంలో 10.67 లక్షల పొదుపు సంఘాలు ఉండగా దాదాపు 1.03 కోట్ల మంది మహిళలు వీటిల్లో సభ్యులుగా ఉన్నారు. టీడీపీ హయాంలో డ్వాక్రా రుణాలను మాఫీ చేయకుండా చంద్రబాబు వంచించడంతో పొదుపు సంఘాల వ్యవస్థ కుప్పకూలింది. జీరో వడ్డీ పథకానికి నిధుల విడుదలను సైతం చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో నిరర్థక ఆస్తులుగా మారాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ ఆసరా పథకంతో పాటు జీరో వడ్డీ పథకానికి సీఎం జగన్ ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయడంతో పొదుపు సంఘాలు గాడిన పడ్డాయి. ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో 99 శాతం మంది పొదుపు మహిళలు బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారు. -
తెలంగాణలో నిరుద్యోగం ఎంతంటే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు 7.91 శాతంగా నమోదైనట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) పేర్కొంది. 2021 సెప్టెంబర్ నుంచి నెలనెలా నిరుద్యోగ రేటు పెరుగుతోందని తెలిపింది. 2021 డిసెంబర్ చివరినాటికి దేశ వ్యాప్తంగా సరాసరి 7.91 శాతం నిరుద్యోగ రేటు నమోదు కాగా, పట్టణ నిరుద్యోగ రేటు 9.30 శాతం, గ్రామీణ ప్రాంత నిరుద్యోగ రేటు 7.28 శాతంగా నమోదైనట్లు ఆ సంస్థ వివరించింది. అయితే జాతీయ సగటుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటు తక్కువగానే ఉంది. దేశవ్యాప్తంగా హరియాణాలో అత్యధిక నిరుద్యోగ రేటు నమోదైంది. ఆ రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 34.1 శాతం నమోదు కాగా తర్వాత స్థానాల్లో రాజస్తాన్ (27.1 శాతం) జార్ఖండ్ (17.3 శాతం), బిహార్ (16 శాతం), జమ్మూకశ్మీర్ (15 శాతం) ఉన్నాయి. దక్షిణాదిలో కర్ణాటకలో 1.4 శాతం, తెలంగాణలో 2.2 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 5.6 శాతం నమోదైనట్లు సీఎంఐఈ తెలిపింది. -
అయిదో రోజూ పెట్రో మంట
న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరలు వరుసగా అయిదో రోజు కూడా పెరిగాయి. ఆదివారం లీటరుపై పెట్రోల్, డీజిల్ ధరలు 35 పైసల చొప్పున పెరిగినట్లు ప్రభుత్వం రంగ ఇంధన సంస్థలు ప్రకటించాయి. తాజా పెంపుతో, లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.107.59కు, ముంబైలో రూ. 113.46కు చేరిందని తెలిపాయి. అదేవిధంగా లీటరు డీజిల్ ధర ముంబైలో రూ.104.38కి, ఢిల్లీలో రూ.96.32కు చేరింది. కాగా, పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. ఈ పెరుగుదలను ప్రభుత్వం పాల్పడుతున్న పన్ను దోపిడీగా ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎక్కడైనా ఎన్నికలు జరిగితే కొంతయినా ఉపశమనం లభిస్తుందేమోనని వ్యాఖ్యానించారు. ప్రజలను ఇబ్బందుల పాలు చేయడంలో మోదీ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. దేశంలో తీవ్రస్థాయికి చేరిన నిరుద్యోగం, ప్రభుత్వ ఆస్తుల విక్రయాలు, పెట్రోల్ ధరల పెంపులో మోదీ ప్రభుత్వం రికార్డులు సాధించిందన్నారు. -
దీన స్థితి: ఎంఏ, బీఈడీ చదివి మేస్త్రీ పనికి యువతి
ఈమె పేరు కన్నం వరలక్ష్మి. ఎంఏ బీఈడీ పూర్తి చేసి 2018లో విద్యావలంటీర్‌గా చెన్నారావుపేట మండలం బోజెర్వు పాఠశాలలో విధుల్లో చేరింది. వరలక్ష్మికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కరోనా మహమ్మారి వల్ల 20 నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. కనీసం రెన్యూవల్ చేయడంలోనూ జాప్యం జరుగుతోంది. దీంతో కుటుంబ పోషణ కోసం సుతారి పనికి వెళ్తున్నా. ప్రభుత్వం స్పందించి నాలుగు నెలల పాత వేతనాలు అందించి.. కరోనా కాలంలో ఆపత్కాలపు భృతి ఇచ్చి, రెన్యూవల్ చేయాలని వేడుకుంది. నర్సంపేట రూరల్: కరోనా మహమ్మారి వల్ల కూలీలుగా మారారు. పాఠశాలలకు వెళ్లి పాఠాలు బోధించాల్సిన విద్యా వలంటీర్లు తీరొక్క పనులు చేస్తూ పొట్టపోసుకుంటున్నారు. ప్రస్తుతానికి పాఠశాలలు తెరిచినా వీరిని రెన్యూవల్ చేయకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అలాగే 2019 విద్యాసంవత్సరానికి సంబంధించి నాలుగు నెలల పెండింగ్ వేతనాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. చదవండి: కీడు శంకించిందని గాంధీ విగ్రహాన్ని పక్కన పడేశారు కరోనా కాలంలో ప్రైవేట్ టీచర్లకు భృతి కల్పించిన ప్రభుత్వం.. విద్యావలంటీర్లను మరవడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక కుమిలిపోతున్నారు. ఉన్నత విద్యాభ్యాసం చేసినా ప్రభుత్వ కొలువు రాకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావలంటీర్లుగా చేరారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా బోధిస్తూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 3,749 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. హనుమకొండ జిల్లాలో 94, వరంగల్ 44, జనగామ 120, జయశంకర్ భూపాలపల్లి, ములుగులో 931, మహబూబాబాద్ జిల్లాలో 340 చొప్పున మొత్తం 1,529 మంది విద్యావలంటీర్లు విధులు నిర్వర్తించేవారు. అయితే కరోనా మహమ్మారి వీరి ఉపాధిని దెబ్బతీసింది. ప్రస్తుత విద్యాసంవత్సరం రెన్యూవల్ కూడా చేయకపోవడంతో కుటుంబ పోషణ కోసం కూలీ పనులు చేసుకుంటున్నారు. చదవండి: తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పాలమూరు బుడ్డోడు పట్టించుకోలేదని ఆవేదన.. 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం తమను çపట్టించుకోలేదని పలువురు వలంటీర్లు వాపోతున్నారు. పల్లె ప్రాంత విద్యార్థులకు సమాచార మాధ్యమాలు అందుబాటులో లేనప్పుడు కీలకంగా వ్యవహరించిన వీరిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో 30 శాతం ఫిట్మెంట్ వలంటీర్లకు వర్తింపజేస్తామన్నారు. గురుకులాల్లోని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, గెస్టు టీచర్లు, సీఆరీ్పలకు విధులు అప్పగించి జీతాలు ఇస్తున్న ప్రభుత్వం అదే విద్యార్హతలున్న తమపై కనికరం చూపడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పెరుగుతున్న నిరుద్యోగం: ‘ఆయా పోస్టు కూడా మేం చేస్తామయ్యా..’
సత్తుపల్లి టౌన్ : చిన్నపిల్లలను ఇంటి నుంచి తీసుకురావడం.. వారి ఆలనాపాలనా చూస్తూనే పౌష్టికాహారం వండిపెట్టడం.. ఆ తర్వాత ఇంటి వద్ద వదలడం.. ఇవీ అంగన్వాడీ కేంద్రాల్లో ఆయాల విధులు. ఈ పోస్టుకు కనీస విద్యార్హత పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కానీ ఇటీవల జిల్లాలోని కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తే పెద్దసంఖ్యలో దరఖాస్తులు రాగా.. ఇందులో ఉన్నత విద్యావంతులు కూడా ఉండడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. చదవండి: టీఆర్ఎస్ మీటింగ్‌ల్లో పస లేదు.. నాకే బ్రహ్మరథం ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాకపోవడం.. ఒకవేళ వచ్చినా కుటుంబాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేని కారణంగా ఉన్న ఊరిలోనే పనిచేయొచ్చనే భావనతో ఈ పోస్టుకు పోటీపడుతున్నట్లు దరఖాస్తులు చెబుతున్నారు. అసలు ఈపోస్టుకు అర్హత ఏమిటంటే.. అంగన్వాడీ ఆయా పోస్టుకు పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళలు మాత్రమే అర్హులు, అంగన్వాడీ కేంద్రం పరిధిలోని చిన్నారులను కేంద్రానికి తీసుకురావటం, ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా వంట సిద్ధం చేసి చిన్నారులతో పాటు బాలింతలు, గర్భిణులకు వడ్డించడం వీరి విధి. ఆ తర్వాత కేంద్రాన్ని శుభ్రం చేయటం, పనివేళలు ముగిశాక పిల్లలను ఇంటివద్దకు పంపించి రావాల్సి ఉంటుంది. గతంలో ఆయాలకు నెలకు రూ.6వేల వేతనం ఇస్తుండగా, పీఆర్సీ అమలుతో ఈ వేతనం రూ.7,800కు పెరగనుంది. ఫలితంగా చిన్న పోస్టులో పని ఎలా ఉంటుందనే భావన పక్కన పెట్టి ఉన్నత విద్యావంతులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. 120 పోస్టుల భర్తీకి దరఖాస్తులు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 120 పోస్టులు భర్తీ చేసేందుకు అధికారులు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. ప్రాజెక్టుల వారీగా దరఖాస్తుల పరిశీలన, అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించాక జాబితా తయారీలో నిమగ్నమయ్యారు. దరఖాస్తుదారుల్లో అర్హులను కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఈనెల మొదటి వారంలో ఎంపిక చేయనుంది. అయితే, పరిశీలన సందర్భంగా అధికారులు కొందరి దరఖాస్తులు, సర్టిఫికెట్లను చూసి విస్తుపోయారు. దరఖాస్తుదారుల్లో పలువురు డిగ్రీ, పీజీ పూర్తిచేసి ఉండడంతో ఆశ్చర్యపోయిన వారు వివరాలు ఆరా తీశారు. వేతనం తక్కువైనా సరే.. సొంతూరిలో పనిచేసే అవకాశం ఉండడానికి తోడు కేంద్రంలోని ఇతర పిల్లలతో పాటు తమ పిల్లల ఆలనాపాలనా కూడా చూసుకోవచ్చనే భావనతో ఆయా పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు పలువురు చెప్పారని సమాచారం. అంతేకాకుండా ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాకపోవడం, ఒకవేళ నోటిఫికేషన్ వచ్చి ఎంపికైనా పోస్టింగ్ ఎక్కడ వస్తుందోనన్న భావనతో వెనుకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. ఇలా రకరకాల కారణాలతో అంగన్వాడీ కేంద్రాల్లో గరిటె తిప్పేందుకు ఉన్నత విద్యావంతులు సిద్ధమైనట్లు చెబుతున్నారు. చదవండి: యువ రైతు కన్నీటి వ్యథ: 13 ఎకరాల్లో పంట నీట మునక.. తట్టుకోలేక కుటుంబాన్ని వదిలి వెళ్లలేక.. నేను ఎంబీఏ పూర్తి చేసి ఆరేళ్లు అయింది. నా భర్త సురేష్ వ్యవసాయం చేస్తాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలి పనులు చేయలేను. అలాగని కుటుంబానికి దూరంగా ఉద్యోగానికి వెళ్లలేను. అందుకే అందుబాటులో ఉన్న ఆయా పోస్టుకు దరఖాస్తు చేసుకున్నా. ఇక్కడైతే నా పిల్లలతో పాటు కేంద్రానికి వచ్చే పిల్లల ఆలనాపాలనా చూసుకునే అవకాశం లభిస్తుంది. ఈ పోస్టు వస్తే అదృష్టంగా భావిస్తా. - హెచ్చు కల్పన, కాకర్లపల్లి, సత్తుపల్లి మండలం సొంతూరిలో ఉండొచ్చని... ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తిచేశా. నా భర్త వీరబాబు ఉపాధిహామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. మాకు ఇద్ద రు కుమారులు. మాది పేద కుటుంబమైనందున ఆయా పోస్టు చిన్నదా, పెద్దదా అని చూడలేదు. సొంత ఊళ్లో ఉపాధి లభిస్తుందని మాత్రమే ఆలోచించా. - నడ్డి కృష్ణవేణి, కాకర్లపల్లి, సత్తుపల్లి మండలం ఏర్పాట్లు చేస్తున్నాం.. శనివారం నుండి బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని ఆదేశాలు అందాయి. కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్ ఆదేశాలతో మండల కేంద్రాలకు చీరలు పంపించాం. అక్కడి నుంచి తహసీల్దార్ల పర్యవేక్షణలో గ్రామపంచాయతీలకు పంపిస్తాం. ఆహారభద్రత కార్డులో పేరు ఉండి 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ చీరలు అందిస్తాం. - ఎం.విద్యాచందన, డీఆర్డీఓ శుభ పరిణామం.. ఆయా పోస్టులకు ఉన్నత విద్యావంతులు కూడా దరఖాస్తు చేసుకోవటం శుభపరిణా మం. యూజీ, పీజీ పూర్తిచేసిన వారు ఎంపికైతే చిన్నారులకు ప్రీ స్కూల్ కార్యక్రమాలు టైం టేబుల్ ప్రకారం అందించడానికి ఉపయోగపడుతుంది. అలాగే, వర్క్‌బుక్స్ కూడా చదివించడం, రాయించడం, మెరుగైన విద్య అందించేందుకు దోహదం చేస్తాయి. - సీహెచ్ సంధ్యారాణి, ఐసీడీఎస్ పీడీ, ఖమ్మం -
ఫ్యూన్ పోస్ట్ కోసం ఏకంగా 15 లక్షల మంది అప్లై చేశారు
ఇస్లామాబాద్: కరోనాతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆర్థిక పరిస్థితులు తారుమరయ్యాయి. వైరస్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఫలితంగా అన్ని దేశాల్లో నిరుద్యోగత భారీగా పెరిగింది. ఎంతలా అంటే కేవలం ఒక్క ఫ్యూన్ పోస్ట్ ఏకంగా 15 లక్షల మంది అప్లై చేశారంటే.. నిరుద్యోగిత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మన దాయాది దేశం పాకిస్తాన్లో ఈ పరిస్థితి తలెత్తింది. ఇటీవల పాకిస్తాన్ కోర్టులో ఒక్క ప్యూన్ పోస్ట్ కోసం దరఖాస్తులు కోరగా.. 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో ఎంఫిల్ చేసిన వ్యక్తులు కూడా ఉన్నారని పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ ఒక కథనాన్ని ప్రచురించింది. పాకిస్తాన్లో నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరుకున్నది. కరోనా వ్యాప్తి సమయంలో దాదాపు 2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం పాక్‌లో నిరుద్యోగిత రేటు 16 శాతం దాటిందని పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ (పీఐడీఈ) కొత్త గణాంకాలను బట్టి తెలుస్తున్నది. ప్రస్తుతం చదువుకున్న యువతలో 24 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. (చదవండి: ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయమే ప్రాణం తీసింది!) పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ తన సర్వే వివరాలను సెనేట్ స్టాండింగ్ కమిటీకి వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో 40 శాతం గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా ఉన్నారు. వీరిలో ఎంఫిల్ చదివిన వారు కూడా చాలా మంది ఉన్నారు. వీరిని కూడా గణాంకాల్లో చేర్చినట్లయితే నిరుద్యోగిత రేటు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. (చదవండి: యువత ఉద్యోగాలు హుష్ కాకి) మరో నివేదిక పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ లేబర్ ఫోర్స్ సర్వే (ఎల్ఎఫ్ఎస్) ప్రకారం, పాకిస్తాన్లో నిరుద్యోగం 2017-18లో 5.8శాతం నుంచి 2018-19లో 6.9 శాతానికి పెరిగింది. పురుషుల్లో నిరుద్యోగం 5.1 శాతం నుంచి 5.9 శాతానికి పెరగగా.. మహిళా నిరుద్యోగం 8.3 శాతం నుంచి 10 శాతానికి పెరిగింది. ఇక ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో కార్మికులు ఉన్న దేశాల్లో పాకిస్థాన్ 9 వ స్థానంలో ఉన్నదని ఎకనామిక్ సర్వే నివేదిక పేర్కొన్నది. చదవండి: పాకిస్తాన్‌ని సాగనంపాల్సిందేనా? -
నిరుద్యోగంపై కాంగ్రెస్ సమరభేరి
సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజన సమస్యలపై ఆందోళనలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ.. వచ్చే నెల నుంచి నిరుద్యోగ సమస్యపై పోరాటం చేయాలని నిర్ణయించింది. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు పోరాట కార్యాచరణ చేపట్టాలని.. చివరి సభకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ హాజరయ్యేలా ప్రణాళిక రూపొం దించాలని నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకు న్నారు. నిరుద్యోగ సమస్యపై పోరాటం చేయా లని.. విద్యాసంస్థల్లో పర్యటించాలని, నిరుద్యోగ యువతను కలవాలనే భావనకు వచ్చారు. ఈ పోరాటంలో భాగంగా మొదటి, చివరి సభలు ఎక్కడ నిర్వహిం చాలనేది త్వరలో జరిగే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించ నున్నారు. సిరిసిల్లలో తొలి సభ నిర్వహించాలనే ప్రతిపాదనపై చర్చ జరిగినట్టు సమాచారం. 11 రాజకీయ పార్టీలతో కలిసి పోరాటం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ఇతర ప్రతిపక్షాలతో సమావేశాలు నిర్వహించాలని, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధా నాలపై 11 రాజకీయ పార్టీలతో కలిసి పనిచేయాలని శనివారం జరిగిన సమావేశంలో నిర్ణయిం చారు. ఈ నెల 22న ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేయాలని, ఈ నెల 27న జరిగే భారత్ బంద్‌కు మద్దతు ఇవ్వాలని తీర్మానించారు. ఈ భేటీలో కీలక నేతలంతా పాల్గొన్నారు. కొందరు నేరుగా గాంధీ భవన్‌కు రాగా.. మరికొందరు జూమ్ యాప్ ద్వారా హాజరయ్యారు. కాగా.. ఆదివారం గాంధీభవన్‌లో సమావేశం అయ్యేందుకు రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలకు ఆహ్వానం పంపినట్టు పార్టీ నేతలు వెల్లడించారు.త -
Trending: దుర్మార్గం.. వ్యాక్సిన్ వేసుకోకుంటే వివక్ష?
Unvaccinated Americans: అమెరికాలో వ్యాక్సిన్ తీసుకోని వాళ్ల పరిస్థితిపై విస్తృత చర్చ నడుస్తోంది. ప్రపంచంలో జెట్ స్పీడ్‌గా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించిన అమెరికా.. ఆ తర్వాత ఆర్థిక క్షీణత కారణంగా! వెనుకబడిపోయింది. ఇక ఇప్పుడు వ్యాక్సిన్ తప్పనిసరి చేసేలా నిబంధనలు తీసుకురావాలన్న ప్రయత్నాలు, తీసుకోని వాళ్లపై వివక్ష చూపిస్తుండడంతో సోషల్ మీడియాలో చర్చ రచ్చ నడుస్తోంది. వ్యాక్సిన్ వేయించుకోని వాళ్ల ప్రయాణాల దగ్గరి నుంచి ప్రతీదాంట్లోనూ వివక్ష కనిపిస్తోంది. ఇప్పటికే విమాన ప్రయాణాలపై కీలక సూచనలు వెలువడగా.. క్యాబ్ డ్రైవర్లు వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉంటేనే రైడ్‌కు సిద్ధపడుతున్నారు. ఇక కొన్ని మాల్స్, రెస్టారెంట్లు సైతం వ్యాక్సిన్ పూర్తైన వాళ్లను మాత్రమే అనుమతించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పేషెంట్లకు(కరోనా బారిన పడిన వాళ్లూ ఉన్నారు) చికిత్స ఇవ్వడానికి ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. దీంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ తరుణంలో ఓవైపు సింపథీ వ్యక్తం అవుతుండగా.. మరోవైపు డెల్టా వేరియెంట్ విజృంభణ తరుణంలో ఇలా చేయడమే సరైన పద్ధతంటూ కామెంట్లు పెడుతున్నారు కొందరు. ఈ రకంగా సోషల్ మీడియాలో Unvaccinated Americans చర్చ జోరందుకుంది. పని చేసే చోట వర్క్ ప్లేస్‌లో వ్యాక్సినేషన్ తప్పనిసరి అనే నిబంధన విధిస్తే.. అమెరికాలో లక్షల ఉద్యోగాలు పోతాయి. ఎందుకంటే వ్యాక్సినేషన్‌కు ఉద్యోగులెవరూ సిద్ధంగా లేరు. అసలు ఉద్యోగుల అంతరంగం ఎలా ఉందో తెలుసుకునేందుకు అక్కడి ప్రముఖ మీడియా సంస్థలు ఈ మధ్య పోల్స్ నిర్వహించాయి. మొత్తం ఉద్యోగుల్లో 16 శాతం మంది వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు సిద్ధంగా ఉండగా, 35 శాతం మంది మినహాయింపులు(మతపరమైన) కోరుతున్నారు. మరో 42 శాతం మంది ఉద్యోగాలు పూర్తిగా వదిలేస్తామని చెప్తున్నారు. ఒకవేళ మినహాయింపులు లేవని చెబితే ఏం చేస్తారని అడిగితే.. 18 శాతం మంది వ్యాక్సినేషన్‌కు వెళ్తామని చెప్పగా.. 72 శాతం మంది ఎట్టిపరిస్థితుల్లో ఉద్యోగాలు చేయబోమని కుండబద్ధలు కొట్టేశారు. బైడెన్ మొండిపట్టు అమెరికాలో కొన్ని రాష్రా్టల్లో డెల్టా వేరియెంట్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో వ్యాక్సిన్‌కు దూరంగా ఉంటున్నవాళ్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శలు గుప్పించాడు. వీళ్లు ప్రమాదకరమైన వేరియెంట్ వ్యాప్తికి కారణం అవుతున్నారంటూ మండిపడ్డారు. గురువారం వ్యాక్సినేషన్ తప్పనిసరి విషయంలో కీలక ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే అమెరికాలో ఇప్పటికి పదిహేడున్నర కోట్ల మంది మాత్రమే వ్యాక్సినేషన్ ఫుల్ డోసులు పూర్తి చేసుకున్నట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెబుతోంది. ఆర్థిక సంక్షోభం కారణంగా.. మిలియన్ల మందికి సింగిల్ డోస్ కూడా పడలేదు. అమెరికాలో కేవలం ఫైజర్-బయోఎన్‌టెక్ రెండు డోసుల వ్యాక్సిన్‌కు మాత్రమే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) నుంచి పూర్తి అనుమతి ఉంది. The pandemic of the unvaccinated is a tragedy that is preventable. People are dying and will die from COVID-19 who don't have to. If you haven't gotten vaccinated, do it now. It could save your life and the lives of those you love. — Joe Biden (@JoeBiden) September 8, 2021 ఈ తరుణంలో మరిన్ని వ్యాక్సిన్లకు అనుమతలు ఇవ్వడం, వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తికి అవసరమైన అనుమతుల్ని త్వరగతిన జారీ చేయడం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం అవుతోంది. మరోవైపు ‘వ్యాక్సినేషన్ తప్పనిసరి’ నిర్ణయంతో కరోనా నియంత్రణ-అమెరికన్ల భవిష్యత్తుపై ఎలా ప్రభావం చూపెడుతుందన్న ప్రశ్నకు.. అదంతా ‘వ్యాక్సిన్ వేసుకోవడం మీదే ఆధారపడి ఉంటుంద’న్న సమాధానం వైట్‌హౌజ్ నుంచి వినిపిస్తోంది. చదవండి: ఆఫీసులకు రండి.. మీ కోసం బోలెడు ఆఫర్లు ఉన్నాయ్! -
కేసీఆర్.. ఉద్యోగాలు ఇంకెప్పుడు?
సాక్షి, మహబూబాబాద్: రాష్ట్రంలో వందలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వోద్యోగం సాధించి వస్తామని తల్లిదండ్రులకు చెప్పి వెళ్లి శవాలై ఇళ్లకు వస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెందరు చనిపోతే సీఎం కేసీఆర్ దాహం తీరుతందని, ఉద్యోగాల నోటిఫికేషన్ ఇంకెప్పుడు వేస్తారని నిలదీశారు. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల డిమాండ్‌తో ప్రతి మంగళవారం వైఎస్ఆర్టీపీ నిర్వహిస్తున్న నిరాహార దీక్ష మంగళవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగి గ్రామంలో జరిగింది. ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఐదు నెలల క్రితం కాకతీయ వర్సిటీలో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న బోడ సునీల్ నాయక్ కుటుం బాన్ని షర్మిల పరామర్శించారు. గుండెంగి సమీపంలోని సోమ్లా తండాలో ఉన్న సునీల్ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు మల్లిక, రాందన్, అన్న శ్రీనివాస్, వదిన వనజలతో మాట్లాడారు. వారిని ఓదార్చి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం గుండెంగలో నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం 6 గంటలకు సునీల్ తల్లిదండ్రులు నిమ్మరసం ఇచ్చి షర్మిల దీక్షను విరమింపజేశారు. వారి ఆత్మహత్యలకు కేసీఆరే కారణం... తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఉద్యమ నాయకుడికి ఓటు వేసినా ఉద్యోగాల నోటిఫికేషన్ వేయకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారి ఆత్మహత్యలకు కేసీఆరే కారణమని షర్మిల ఆరోపించారు. -
ముగ్గురన్నలకు ప్రభుత్వ ఉద్యోగం.. తనకు మాత్రం..
సాక్షి, దండేపల్లి(ఆదిలాబాద్): ముగ్గురు అన్నయ్యలు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు.. తనకు ఏ ఉద్యోగం రావడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రైనీ ఎస్సై శివకుమార్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన భూక్య శంకర్‌నాయక్‌కు నలుగురు కుమారులు. అందులో పెద్దవారు ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. చిన్న కొడుకు నరేశ్(26) డిగ్రీ వరకు చదివి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇంటి వద్దనే ఉంటూ తండ్రితోపాటు వ్యవసాయ పనులకు వెళ్తున్నాడు. ‘అన్నయ్యలకు ఉద్యోగాలు వచ్చాయి. వాళ్లు మంచిగా బతుకుతున్నారు. నాకే రాకపాయే, నేను ఎలా బతుకుడో’ అని అప్పుడప్పుడు తల్లిదండ్రులతో చెప్పుకుంటూ బాధపడేవాడు. ఈనెల 21న అతనికి పెళ్లి నిశ్చయించారు. దీంతో భవిష్యత్‌పై మరింత ఆందోళనకు గురైన నరేశ్ ఈనెల 9న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి తండ్రి శంకర్‌నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ట్రైనీ ఎస్సై వెల్లడించారు. -
ఏడేళ్లలో 4 రెట్లు పెరిగిన నిరుద్యోగం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎక్కువగా నిరుద్యోగ సమస్య ఉందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. గత ఏడేళ్లలో నిరుద్యోగిత నాలుగు రెట్లు పెరిగిందని చెప్పారు. నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా సీఎం కేసీఆర్ పట ్టనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడు గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని మంగళవారం ఆమె పరామర్శించారు. అనంతరం పెనుబల్లిలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బతికే మార్గం లేక ఆత్మహత్యలు తాము నిరుద్యోగులమంటూ 54 లక్షల మంది ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో పలువురు ఆత్మహత్య చేసుకున్నా.. ఫామ్‌హౌస్‌కే పరిమితమైన సీఎం దున్నపోతు మీద వాన పడిన చందంగా స్పందించడం లేదని షర్మిల విమర్శించారు. నిరుద్యోగులు బతికే మార్గం లేక, అవమానాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజైనా 50 వేల ఉద్యోగాల గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారంటే దానికి కారణం తాము బయటకు వచ్చి చేస్తున్న పోరాటం వల్లనే అని తెలిపారు. ఇప్పుడు ప్రతిపక్షానికి కూడా సోయి వచ్చిందన్నారు. తాము ప్రతి మంగళవారం దీక్షలు చేస్తుంటే వ్రతాలు చేస్తున్నా మని కేటీఆర్ అంటున్నారంటూ.. ‘మేము ఆడవాళ్లం మెతుకు ముట్టకుండా వ్రతమే చేస్తున్నాం అనుకుందాం.. మరి వీరు పెద్ద మగాళ్లు కదా.. అధికారంలో ఉన్నారు కదా.. ఉద్యోగ ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదు’అని షర్మిల నిలదీశారు. నిరుద్యోగులు హమాలీ పనులు చేసుకోవాలనే మంత్రి.. పదవికి రాజీనామా చేసి హమాలీ పనికి వెళ్లాలని సూచించారు. తనకు ఉద్యోగం రాలేదనే నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. 1.91 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దీక్షకు ముందు వేదిక వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి షర్మిల నివాళులర్పించారు. -
పెనుబల్లిలో వైఎస్ షర్మిల ‘నిరుద్యోగ దీక్ష’
సాక్షి, ఖమ్మం జిల్లా: ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లిలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఇటీవల ఆత్మహత్య పాల్పడిన గంగదేవిపాడుకు చెందిన నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. రాష్ట్రంలో ఉన్న పలువురు నిరుద్యోగులతో ఫోన్లో వైఎస్ షర్మిల మాట్లాడారు. జోహార్ వైఎస్సార్, జై తెలంగాణ అంటూ ప్రసంగం ప్రారంభించిన వైఎస్ షర్మిల.. నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సీఎం కేసీఆర్ పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితం అవుతుంటే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. పార్టీ పెట్టకముందే నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష చేపట్టామని, 72 గంటల పాటు అవమానాలను తట్టుకుని నిరాహార దీక్ష కొనసాగించామని తెలిపారు. లక్షా 91 వేల ఉద్యోగాలను వెంటనే సీఎం కేసీఆర్ భర్తీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వయో పరిమితి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. -
సకల జనుల తెలంగాణే లక్ష్యం: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: సకల జనుల తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతానని దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజ శేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. త్వరలో మంచి రోజులొస్తున్నాయని ప్రజలకు భరోసా ఇచ్చారు. ముసలవ్వలు నడిచేందుకు ఊతకర్రనవుతానని, బడి ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్న ఇంటికి పెద్దక్కనవుతానని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో షర్మిల పేర్కొన్నారు. డిగ్రీ పట్టా పట్టుకొని రోడ్డు మీదకొచ్చే తమ్ముళ్లు, చెల్లెమ్మల కోసం ఉద్యోగ బాటలు వేస్తానని తెలిపారు. చిన్నారులకు నాణ్యమైన విద్యను అందిస్తానన్నారు. మెరుగైన వైద్యం కోసం పడిగాపులు కాసే పరిస్థితిని సమూలంగా మార్చేస్తానని చెప్పారు. -
నిరుద్యోగంపై వైఎస్ షర్మిలకు తొలి విజయం
నేరేడుచర్ల / హుజూర్నగర్/ మిర్యాలగూడ: రాష్ట్రంలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేంత వరకు రాజీలేని పోరాటం చేస్తామని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిల అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీకావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం మేడారం గ్రామానికి చెందిన నీలకంఠం సాయి కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధవారం ఆమె ఇక్కడికి వచ్చారు. నిరుద్యోగులతో ముఖాముఖి మాట్లాడారు. ఎంతోమంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని ఆమె అన్నారు. తాము వస్తున్నామనే భయంతో ప్రభుత్వం నీలకంఠం సాయికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడం సంతోషకరమైన విషయమని, తాము చేస్తున్న పోరాటంలో ఇది తొలి విజయమని చెప్పారు. కాగా, ఇటీవల మృతిచెందిన ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) స్టేట్ కో ఆర్డినేటర్ గున్నం నాగిరెడ్డి కుటుంబసభ్యులను చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో వారి ఇంటికి వెళ్లి షర్మిల పలకరించారు. అలాగే, నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన తన మద్దతుదారుడు సలీం కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు. ఆమె వెంట నాయకులు కొండా రాఘవారెడ్డి, పిట్ట రాంరెడ్డి, ఇందిరశోభన్, ఆదర్ల శ్రీనివాస్‌రెడ్డి, కర్రి సతీష్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి తదితరులున్నారు. చదవండి: ‘ఈటల’ నియోజకవర్గానికి భారీగా నిధులు -
ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయమే ప్రాణం తీసింది!
చిలకలగూడ: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితిని పెంచడాన్ని నిరసిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కాకతీయ వర్సిటీ విద్యార్థి బోడ సునీల్ నాయక్ మృతి చెందాడు. శుక్రవారం తెల్లవారుజామున నిమ్స్ మిలీనియం బ్లాక్ ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామ సమీపంలోని తేజావత్ రాంసింగ్ తండాకు చెం దిన సునీల్ డిగ్రీ చదివాడు. ఐదేళ్లుగా పోలీసు ఉద్యోగం కోసం ప్రయ త్నం చేస్తున్నాడు. 2016లో నిర్వహించిన పోలీస్ ఉద్యోగ నియామకాల్లో అర్హత సాధించి దారుఢ్య పరీక్షల్లో రాణించలేకపోయాడు. ప్రస్తుతం హన్మకొండలో పోటీ పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ప్రభుత్వం ఇక ఉద్యోగాలకు ప్రకటన జారీ చేయదన్న మనస్తాపంతో గత నెల 26న కేయూ క్రీడా మైదానంలో పురుగుల మందు తాగాడు. ‘నేను చేతకాక చావడం లేదు.. నా చావుతోనైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాలి’ అని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. పోలీసులు వెంటనే అతడిని ఎంజీఎం ఆస్పత్రికి.. పరిస్థితి ఆందోళనకరంగా మారడటంతో నిమ్స్‌కు తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. గాంధీలో పోస్టుమార్టం.. ఉద్రిక్తత సునీల్ మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. వివిధ విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని నిరసన తెలపడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. ఆందోళన చేపట్టిన బీజేవైఎం, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, జనసేన యూత్వింగ్, వైఎస్ షర్మిల పార్టీలకు చెందిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం, కార్ఖానా ఠాణాలకు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. పలు విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులు ప్రవీణ్‌రెడ్డి, శ్రీహరి, సుమన్‌శంకర్, దయాకర్, విజయ్‌కుమార్, రవి, మహేందర్, రవినాయక్, వైఎస్ షర్మిల పార్టీ ముఖ్యనేతలు ఇందిరాశోభన్, సాహితి, యూత్ కాంగ్రెస్ నాయకుడు శివసేనారెడ్డి తదితరులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ప్రత్యేక అంబులెన్స్‌లో సునీల్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు. మరణవాంగ్మూలంగా సెల్ఫీవీడియోను పరిగణించాలి: బండి సంజయ్ సునీల్ తీసుకున్న సెల్ఫీ వీడియోను మరణవాంగ్మూలంగా స్వీకరించి, అందుకు కారణమైన సీఎం కేసీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. గాంధీ మార్చురీ వద్ద మృతుని కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం బీజేపీ కోర్‌కమిటీ సభ్యుడు వివేక్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. సునీల్ ఆత్మహత్యాయత్నానికి ముందు తీసుకున్న వీడియోలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతోనే మనస్తాపం చెందానని, తన మృతికి సీఎం కేసీఆర్ కారణమని స్పష్టంగా చెప్పాడని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఉన్నాయని.. అందుకే రాష్ట్రంలోని నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని, కేసీఆర్ ఉద్యోగం ఊడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సునీల్ కుటుంబసభ్యులకు షర్మిల టీం పరామర్శ సునీల్ కుటుంబ సభ్యులను వైఎస్ షర్మిల పార్టీ ముఖ్యనేతలు ఇందిరాశోభన్, సాహితీ పరామర్శించారు. తర్వాత నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం లోటస్‌పాండ్‌లో మీడియాతో సాహితి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి ఎర్రబెల్లి ఇంటి ముట్టడి... సాక్షి ప్రతినిధి, వరంగల్: సునీల్ మృతి వార్త ఉమ్మడి వరంగల్‌లో దావానలంలా వ్యాపించింది. శుక్రవారం ఉదయం నుంచే విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. సునీల్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు చేపట్టడంతో పలుచోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేయూలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. హన్మకొండలోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాలు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఇంటి ఆవరణలోని సామగ్రిని ధ్వంసం చేయడంతో పాటు ఇంటిపైకి రాళ్లు రువ్వారు. పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని హన్మకొండ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉండగా, సునీల్ మృతదేహం శుక్రవారం సాయంత్రం తండాకు చేరుకోగా.. ఎమ్మెల్యే సీతక్క, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ తదితరులు గ్రామస్తులతో కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంబులెన్స్ ముందు బైఠాయించారు. సునీల్ కుటుంబానికి రూ.కోటి పరిహారం కావాలంటూ డిమాండ్ చేశారు. ఐఏఎస్‌ను కావాల్సినోన్ని.. ‘మిత్రులందరికీ నమస్కారం.. ఫ్రెండ్స్.. నేను చేతకాక చనిపోవడం లేదు. రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు నా లెక్క ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు.. నేను పాయిజన్ తీసుకున్నా. తెలంగాణలో ఉద్యోగాలు లేవు.. నోటిఫికేషన్లు లేవు. గత ఐదేళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నా.. నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాల్సినోడిని.. ఇలా చనిపోతున్నా. విద్యార్థుల్లారా.. మీరు కేసీఆర్‌ను విడిచిపెట్టకండి.. అసలే విడిచిపెట్టకండి,’ – సెల్ఫీ వీడియోలో సునీల్ -
నిరుద్యోగ భృతిపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: నిరుద్యోగ భృతిపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం మాట్లాడారు. 100 శాతం తాము పేదల పక్షం ఉంటాం కొన్ని పెన్షన్లు, రేషన్ కార్డుల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. అతి త్వరలో తప్పకుండా కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. అలాగే కచ్చితంగా 57 ఏళ్ల పైబడిన వారికీ పెన్షన్లు ఇస్తాము వీటి విషయంలో వెనక్కి వెల్లదీ లేదు అన్నారు. కరోనా కారణంగా రాష్ట్రంపై దాదాపు లక్ష కోట్ల రూపాయల భారం పడిందన్నారు. నిరుద్యోగుల భృతికి సంబంధించి విధివిధానాల రూపకల్పనలో ఉన్నప్పుడు ఈ కరోనా వచ్చిందన్నారు. ఆ సమయంలో కొన్ని నెలల పాటు ఉద్యోగులకు వేతనాలే సరిగా ఇవ్వలేకపోయామన్నారు. అలాంటి గడ్డు పరిస్థితుల్లో నిరుద్యోగ భృతి ఇవ్వడం ప్రభుత్వానికి సాధ్యం కాలేదని సీఎం పేర్కొన్నారు. నిరుద్యోగ భృతిపై రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుందని.. ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని అన్నారు. చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపికబురు -
యువత ఉద్యోగాలు హుష్ కాకి
సాక్షి, హైదరాబాద్ : దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సంబంధించినంత వరకు యువత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. గత మూడేళ్లుగా ఆర్థిక వ్యవస్థ మందగమనంతో ఇబ్బందులు పడుతున్న యువతను, కరోనా పరిస్థితుల్లో విధించిన సుదీర్ఘ లాక్డౌన్ మరింత దెబ్బకొట్టింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని యువ ఉద్యోగులు, కార్మికులు ఎక్కువగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా నివేదిక పేర్కొంది. తమ కన్జూమర్ పిరమిడ్హోస్హోల్డ్ సర్వే (ఇంటింటి సర్వే) ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా సీఎంఐఈ ఈ నివేదిక రూపొందించింది. ప్రస్తుత పరిస్థితుల్లో 40 ఏళ్లలోపు వారే అధికస్థాయిలో ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో దేశీయ వర్క్‌ఫోర్స్ (మొత్తం పనిచేసే వారిలో)లో 40 ఏళ్లలోపు వారి సంఖ్య తగ్గిపోతోందని, అదే సమయంలో 40 ఏళ్లు పైబడినవారి సంఖ్య పెరుగుతున్నట్టు తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ఇదేమంత మంచి పరిణామం కాదని పేర్కొంది. తమ తమ రంగాల్లో మెరుగైన నైపుణ్యాలు కలిగిన గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు కోల్పోవడం వల్ల ఆ ప్రభావం వివిధ అంశాలపై పరోక్షంగా పడుతుందని హెచ్చరించింది. వేతన జీవులే అధికం 2020 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారిలో 40 ఏళ్లకు పైబడిన వారు 60 శాతంగా ఉన్నారు. ఇది గతేడాదితో పోల్చితే 4 శాతం అధికం. అదే సమయంలో వయసు తక్కువ ఉన్న ఉద్యోగుల (40 ఏళ్ల లోపు వారు) వాటా గణనీయంగా తగ్గింది. మొత్తంగా చూస్తే గత కొన్నినెలల నుంచి 2020 డిసెంబర్ నాటికి వివిధ రంగాలు, విభాగాల్లో దాదాపు కోటిన్నర ఉద్యోగాలు పోగా, వాటిలో 95 లక్షల వరకు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతే ఉన్నారు. 2019–20లో నెలవారీ వేతనాలు, జీతాలు వచ్చే ఉద్యోగులు 21 శాతంగా ఉండగా, 2020 డిసెంబర్ నాటికి మొత్తం ఉద్యోగాలు పోయిన వారిలో 71 శాతం వారే ఉండటం గమనార్హం. ఏయే రంగాలపై ప్రభావం ప్రధానంగా వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయినట్టు సీఎంఐఈ పేర్కొంది. 2017 నుంచి 2020 మార్చి వరకు సేవల రంగంలో ఉద్యోగ అవకాశాలు కొంత పెరిగినా.. లాక్‌డౌన్‌తో ఈ రంగం తీవ్ర ప్రభావానికి లోనైంది. అన్‌లాక్‌తో ఆ తర్వాత పాక్షికంగా కోలుకున్నా గతేడాది మార్చి నెల స్థాయికి మాత్రం ఇంకా చేరుకోలేదు. అలాగే రిటైల్ వ్యాపార రంగం, రవాణా, పర్యాటక రంగాలపై కూడా అధిక ప్రభావం పడింది. రిటైల్ రంగంలో ఎక్కువగా ఉద్యోగాలు పోగా, ఆ తర్వాతి స్థానాల్లో రవాణా, పర్యాటక, విద్య, తదితర రంగాలు నిలిచాయి. విద్య, దాని అనుబంధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు భారీగా తగ్గిపోయాయి. తయారీ రంగం కూడా పూర్తిస్థాయిలో పుంజుకోలేకపోయింది. ఉద్యోగాల కల్పనలో సేవల రంగంతో పాటు రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగం కొంతమేర మెరుగైన స్థితికి చేరుకున్నాయి. పరిమిత సంఖ్యలోనే అవకాశాలు లాక్‌డౌన్‌తో సేవల రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఈ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. అన్‌లాక్ తర్వాత వ్యవసాయం, గృహ నిర్మాణం, తయారీ రంగంలో అవకాశాలు కొంత పెరిగినా ఇంకా పూర్తి స్థాయిలో పుంజుకోలేదు. 2019–20తో పోల్చితే 2020 డిసెంబర్ వరకు ఫార్మాస్యూటికల్స్ మినహా పెద్ద పెద్ద పరిశ్రమలు పరిమిత సంఖ్యలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. – మహేశ్ వ్యాస్, సీఈవో, సీఎంఐఈ -
‘ఎంపికైనా ఉద్యోగాలు ఇవ్వడం లేదు’
లక్నో: నిరుద్యోగుల పట్ల యూపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా విమర్శించారు. ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడం లేదంటూ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు శనివారం ప్రియాంకా గాంధీ లేఖ రాశారు. కాగా అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు లేక నిరుద్యోగ యువత తీవ్ర మనోవేధనకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇటీవల 12,460 మంది టీచర్ రిక్రూట్మెంట్ నియామకాలలో ఉద్యోగాలు సాధించారని, కాగా వారికి ఖాళీలు లేవంటూ అపాయింట్మెంట్ లెటర్స్ (నియామక పత్రాలు) ఇవ్వడం లేదని విమర్శించారు. అత్యుత్తమ ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన వారికి ప్రభుత్వం నియమించకపోవడం విచారకరమన్నారు. ఉద్యోగాలు లేక యువత ఆర్థిక సమస్యలు, డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ప్రియాంకా విమర్శలపై యూపీ అధికారులు స్పందిస్తూ త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం లభిస్తుందని, ఇటీవల భారీ నియామకాల కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం యోగి ఆదేశించిన విషయాన్ని అధికారులు గుర్తు చేశారు. -
1,48,666 ఉద్యోగాలు ఖాళీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు అయినా నిరుద్యోగ సమస్య తీరలేదని, ఆ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ పేర్కొన్నారు. శనివారం టీజేఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని ఈ నెల 21న ‘హలో నిరుద్యోగ చలో అసెంబ్లీ’ పేరిట విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించా రు. రాష్ట్రంలో 1,48,666 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కొత్త జిల్లాలు, కొత్త మండలాల్లో దాదాపు 50,000కు పైగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లాగా స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా ఒక చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ప్రైవేటు ఉద్యోగులకు సాయం చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ప్రకటించాలని, నాగులు లాంటి వాళ్లు ఆత్మహత్యయత్నం చేసుకున్నారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించాలన్నారు. కొత్త చట్టంపై చర్చించాం.. కొత్త రెవెన్యూ చట్టంపై అఖిల పక్షంలో చర్చించామని కోదండరామ్ తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ చట్టంలో పరిష్కారం చూపలేదని పేర్కొన్నారు. సాదా బైనామా, పోడు భూములు, అసైన్డ్ భూము లు, కౌలు రైతుల సమస్యలపై రెవెన్యూ చట్టంలో స్పష్టత ఇవ్వలేదన్నారు. అసైన్డ్ భూములను రైతుల దగ్గర నుంచి బెదిరించి ప్రభుత్వం తీసుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడు రమేశ్ మాట్లాడుతూ అసెంబ్లీలో విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం చర్చించడం లేదని, నిరుద్యోగులకు ఎలాంటి భరోసా కల్పించడం లేదన్నారు. ఇదీ శాఖల వారీగా ఖాళీల లెక్క.. అగ్రికల్చర్–1,740, పశుసంవర్థక శాఖ–2,087, మార్కెటింగ్ శాఖ–583, బీసీ వెల్ఫేర్–1,027, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్–3,367, ఉన్నత విద్య– 12,857, ఎనర్జీ–26, పాఠశాల విద్య– 24,702, సివిల్ సప్లయ్స్–546, ఫైనాన్స్–1,375, జీఏడీ–984, హెల్త్– 23,512, హోం–37,218, హౌసింగ్–9, ఇరిగేషన్– 2,795, ఇన్ఫ్రాస్ట్రక్చర్–7, ఇండస్ట్రీస్–366, ఐటీ–3, లేబర్– 2,893, లా–1,854, లెజిస్లేటివ్– 300, మున్సిపల్–1,533, మైనారిటీ–51, పబ్లిక్అడ్మిన్–6, ప్లానింగ్–178, పంచాయతీరాజ్– 5,929, రెవెన్యూ–8,118, సోషల్ వెల్ఫేర్–5,534, రోడ్లు భవనాలు–962, ట్రైబల్ వెల్పేర్–5,852, మహిళా, శిశు సంక్షేమం–1,812, యూత్ సర్వీసెస్–440. -
ప్రభుత్వ వైఫల్యాలే కారణం: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ వైఫల్యాలే నాగులు మరణానికి కారణమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. బండి సంజయ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతోనే కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం వల్లనే రాష్ట్రం లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని మండిపడ్డారు. ఇది చాలా దురదృష్టకర సంఘటన అని ఆవేదన వక్తం చేశారు. గతంలో ప్రత్యేక తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటే, నేడు బ్రతకలేక ఆత్మ హత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు. కాగా మరణించిన నాగులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నేడు తెలంగాణలో ఉన్నటువంటి దుస్థితికి నాగులు మరణం అద్దం పడుతుందని పేర్కొన్నారు. (చదవండి: దమ్ముంటే పాతబస్తీకి వెళ్లి చూడాలి) -
వణికిస్తున్న నిరుద్యోగ భూతం!
సాక్షి, హైదరాబాద్: దేశంలో నిరుద్యోగం క్రమక్రమంగా పెరుగుతోంది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి మరింత పెరుగుతున్న ఈ తరుణంలో ఇది మరింత ఆందోళనకు దారితీస్తోంది. పట్టణాల్లోని సంప్రదాయ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కోత, వ్యవసాయరంగంలో ఉపాధి శాచురేషన్ పాయింట్‌కు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా నిరుద్యోగ శాతం పెరుగుదలకు కారణమవుతోంది. జూలైలో 7.43 శాతమున్న నిరుద్యోగ శాతం కాస్తా ఆగస్టు చివరినాటికి మొత్తంగా 8.35 శాతానికి చేరింది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ భూ తం మరింత ఎక్కువగా భయపెడుతోంది. ఇటు పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో కొంత తక్కువగానే నిరుద్యోగమున్నా అక్కడా మెల్లమెల్లగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆగస్టులో పట్టణ ప్రాంతాల్లో 9.83 శాతం, గ్రామాల్లో 7.65 శాతం నిరుద్యోగం రికార్డయింది. అదే జూలై నెలలో పట్టణాల్లో 9.15 శాతంగా, గ్రామాల్లో 6.66 శాతంగా ఉంది. మరీ ముఖ్యంగా నగరాల్లో ప్రతీ పది మందిలో ఒకరికి ఉద్యోగం, ఉపాధి అవకాశాలు దొరకడం లేదని తెలుస్తోంది. ఈనెలా అంతేనా..? ఇక ఈ నెల (సెప్టెంబర్) లోనూ వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగ శాతం ఇదే విధంగా కొనసాగడంతో పాటు ఆగస్టుతో పోల్చితే స్వల్పంగా పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అదీగాకుండా కరోనా వైరస్ దేశంలోకి అడుగుపెట్టడానికి ముందు జనవరిలో 7.76 శాతం, ఫిబ్రవరిలో 7.22 శాతమున్న నిరుద్యోగం కంటే ఇప్పుడు ఎక్కువగా ఉండటం, అది క్రమక్రమంగా పెరుగుతుండటం మరింత ఆందోళనకు కారణమవుతోంది. కేంద్రం కఠినమైన లాక్డౌన్ నిబంధనల తర్వాత ఆగస్టు నెలలో వివిధ వాణిజ్య, వ్యాపార ఇతర ఆర్థిక కార్యకలాపాలకు అనుమతినిచ్చినా కూడా నిరుద్యోగ శాతం తగ్గకపోవడం ఆందోళనకరమేనని పలువురు ఆర్థికవేత్తలు సైతం అంగీకరిస్తున్నారు. దేశంలోని నెలవారీ నిరుద్యోగ శాతానికి సంబంధించిన వివరాలను సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా అధ్యయనంలో వెల్లడించింది. కోవిడ్ పరిస్థితుల్లో తలెత్తిన ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాల కారణంగా వివిధ రాష్ట్రాల్లోని సంప్రదాయ, వ్యవస్థీకృత రంగాల్లో (ఫార్మల్ సెక్టార్) ఉద్యోగ, ఉపాధి తగ్గిపోవడమే దీనికి కారణమని భావిస్తున్నారు. హరియాణాలో అత్యధికంగా 33.5 శాతం నిరుద్యోగం నమోదు కాగా, కర్ణాటకలో అత్యల్పంగా 0.5 శాతమే రికార్డయింది. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 5.8 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 7 శాతం నిరుద్యోగమున్నట్టుగా సీఎంఐఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎక్కువ శాతం నిరుద్యోగమున్న రాష్ట్రాలు.. ► హరియాణా–33.5 శాతం ► త్రిపుర–27.9 శాతం ► రాజస్తాన్–17.5 శాతం ► గోవా–16.2 శాతం ► హిమాచల్‌ప్రదేశ్–15.8 శాతం ► పశ్చిమబెంగాల్–14.9 శాతం ► ఉత్తరాఖండ్–14.3 శాతం ► ఢిల్లీ–13.8 శాతం ► బిహార్–13.4 శాతం ► సిక్కిం–12.5 శాతం తక్కువ శాతం నిరుద్యోగమున్న రాష్ట్రాలు.. ► కర్ణాటక–0.5 శాతం ► ఒడిశా–1.4 శాతం ► గుజరాత్–1.9 శాతం ► తమిళనాడు–2.6 శాతం ► మధ్యప్రదేశ్–4.7 శాతం ► అస్సాం–5.5 శాతం ► తెలంగాణ–5.8 శాతం ► యూపీ–5.8 శాతం ► మహారాష్ట్ర–6.2 శాతం ► ఆంధ్రప్రదేశ్–7.0 శాతం -
నిరుద్యోగ భూతం.. పెరిగిన శాతం
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగభూతం రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో అది 9.1 శాతానికి చేరుకుంది. గత తొమ్మిది వారాల్లో జాతీయస్థాయిలో ఇదే అత్యధికం. ఆగస్ట్ 16తో ముగిసిన వారాంతానికి జాతీయస్థాయిలో చూస్తే... పట్టణాల్లో 9.61 శాతం, గ్రామాల్లో 8.86 శాతం నిరుద్యోగం నమోదైనట్టు సెంటర్ ఆఫ్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా నివేదికలో వెల్లడైంది. ఆగస్టు 9 తేదీ నాటికి 8.67 శాతమున్న దేశ నిరుద్యోగ శాతం ఆగస్టు 16 నాటికి 9.1 శాతానికి పెరిగింది. ఈ నెలలో వ్యవసాయ కార్యకలాపాలు తగ్గడం, వలస కార్మికులు నగరాలు, పట్టణాల బాట పట్టడం నిరుద్యోగ శాతం పెరగడానికి కారణాలు కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిటైల్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో డిమాండ్ తగ్గుదలతో ఉద్యోగ అవకాశాల్లో కోత పడినట్టు భావిస్తున్నారు. అయితే ఇది తాత్కాలిక ట్రెండ్ కావచ్చని మరికొందరు ఆర్థికవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నియంత్రణకు విధించిన లాక్డౌన్ ప్రభావం.. వేతనాలు, ఉద్యోగాల (శాలరీడ్ జాబ్స్)పై అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్‌తో ముగిసిన నెలకు 6.84 కోట్ల శాలరీడ్ జాబ్స్ తగ్గగా, జూలై మాసాంతానికి 6.72 కోట్లకు చేరుకున్నట్టు సీఎంఐఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ, ఏపీల్లో ఏవిధంగా ఉందంటే.. ► తెలంగాణలో 9.1 శాతం నిరుద్యోగం నమోదైంది ► ఛత్తీస్‌గఢ్‌లో 9, తమిళనాడులో 8.1, జార్ఖండ్‌లో 8.8 శాతం ► ఆంధ్రప్రదేశ్‌లో 8.3 శాతం, కేరళలో 6.8 శాతం ► పశ్చిమబెంగాల్లో 6.8 శాతం, యూపీలో 5.5 శాతం నిరుద్యోగం అగ్రస్థానంలో హరియాణా ► హరియాణా 24.5 శాతం నిరుద్యోగంతో టాప్‌ప్లేస్‌లో ఉంది ► పుదుచ్చేరి 21.1, ఢిల్లీ 20.3 శాతంతో రెండు, మూడుస్థానాల్లో నిలిచాయి ► హిమాచల్ ప్రదేశ్ 18.6 శాతంతో నాలుగోస్థానం, గోవా 17.1 శాతంతో ఐదో ప్లేస్‌లో నిలిచింది. అతి తక్కువ నిరుద్యోగమున్న రాష్ట్రాలివే... ► ఒడిశా, గుజరాత్‌ల్లో 1.9 శాతం చొప్పున అత్యల్ప నిరుద్యోగం ► మేఘాలయ 2.1, అస్సాం 3.2, మధ్యప్రదేశ్, కర్ణాటక 3.6 శాతం చొప్పున ► మహారాష్ట్ర 4.4, సిక్కింలో 4.5 శాతం నిరుద్యోగం 10 శాతానికిపైగా నిరుద్యోగమున్న రాష్ట్రాలు.. ► త్రిపురలో 16.4, రాజస్తాన్‌లో 15.2, ఉత్తరాఖండ్‌లో 12.4 శాతం నిరుద్యోగం ► బిహార్‌లో 12.2, జమ్మూ,కశ్మీర్లో 11.2, పంజాబ్‌లో 10.4 శాతం నిరుద్యోగం -
ఉపాధి ఊడుతోంది!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 ధాటికి ఉపాధి రంగం విలవిలలాడుతోంది. లాక్డౌన్, అనంతర పరిణామాలతో నిరుద్యోగం క్రమంగా పెరుగుతోంది. వరుసగా రెండు నెలల లాక్డౌన్ కారణంగా మెజార్టీ రంగాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత సడలింపులు ఇస్తున్నప్పటికీ మునుపటి ఉత్సహం కనిపించడంలేదు. దీంతో అన్ని రంగాల్లోనూ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు పెరుగుతుండడంతో ఆ మేరకు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. ఫలితంగా నిరుద్యోగ రేటు వేగంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటుపై సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఈఐ) గత కొన్నేళ్లుగా అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని అంచనా వేయగా.. రాష్ట్రంలో నిరుద్యోగులు దాదా పు రెట్టింపైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జనవరిలో నిరుద్యోగ రేటు 5.3 శాతం ఉండగా.. ప్రస్తుతం 9.1శాతానికి పెరిగింది. ఇదే జాతీయస్థాయిలో 7.4 శాతంగా ఉన్నట్లు సీఎంఈఐ తెలిపింది. నిరుద్యోగ రేటును గుర్తించేందుకు దేశవ్యాప్తంగా 1,74,405 కుటుంబాలను సర్వేలో నమూనాలుగా సేకరించారు. ఫోన్, ఆన్లైన్ తదితర మార్గా ల్లో సీఎంఈఐ ప్రతినిధులు వారితో మాట్లాడారు. గత నాలుగు నెలలుగా ఈ పద్ధతిలో సర్వే చేశారు. మేలో అత్యధికంగా.. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత నిరుద్యోగ రేటు ఏప్రిల్, మే నెలల్లో నమోదైంది. లాక్డౌన్ కారణంగా నిత్యావసర సరుకులు, అత్యవసర సేవలు మినహా అన్ని రంగాలు మూతపడ్డాయి. కొన్నింటికి అనుమతులిచ్చినప్పటికీ కార్మికులు విధులకు హాజరు కాలేదు. ఈ క్రమంలో రోజువారీ కూలీలు తీవ్రంగా నష్టపోయారు. అసంఘటిత రంగంలో అత్యధిక కార్మికులుండగా.. ఏప్రిల్, మే నెలల్లో వారికి పని దొరకలేదు. ప్రభుత్వం లేదా ఇతర దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో రోజులు వెళ్లదీసిన కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఈ రెండు నెలల్లో వరుసగా జాతీయ స్థాయిలో 23.5 శాతం నిరుద్యోగ రేటు నమోదైంది. అనంతరం లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో క్రమంగా రోజువారీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దీంతో నిరుద్యోగ రేటు జూన్‌లో 11 శాతానికి, జూలైలో 7.4 శాతానికి తగ్గింది. ఇందులో పట్టణ ప్రాంతంలో నిరుద్యోగ రేటు 9.15 శాతం ఉండగా.. గ్రామీణ ప్రాంతంలో మాత్రం 6.66 శాతంగా ఉన్నట్లు సీఎంఈఐ వివరించింది. రాష్ట్రంలో ఏప్రిల్‌లో లాక్డౌన్ ఉన్నప్పటికీ వ్యవసాయ పనులు, ఉపాధి హామీ పనులు జోరుగా కొనసాగాయి. మేలో తీవ్ర ఉష్ణోగ్రతల దృష్ట్యా వ్యవసాయ పనులు, ఉపాధి హామీ మందగించాయి. దీంతో ఆ నెలలో రాష్ట్రంలో నిరుద్యోగరేటు ఏకంగా 34.8 శాతం నమోదైంది.