కరీంనగర్ అర్బన్: ప్రభుత్వ కొలువులకు సన్నద్ధమయ్యే వారి కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది వారధి సంస్థ. పోటీ పరీక్షలకు సంబంధించిన సమాచారం, మాక్ టెస్ట్, సిలబస్, తదితర అంశాలను విపులంగా పొందుపరిచారు. ఏ ఉద్యోగమైనా సదరు సమాచారం లభించనుంది. కాగా.. మంగళవారం టీటి హబ్ టవర్‌లో టీమ్–అప్ సంస్థ అధినేత ఎం.కె.చైతన్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంకతో కలసి ‘వారధి సొసైటీ మొబైల్ యాప్‘ను కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ ప్రారంభించారు.
జిల్లాతో పాటు రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రూప్ 1,2 పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. కరీంనగర్ పట్టణంలో మొట్టమొదటి సారిగా టీం–అప్ సంస్థ ద్వారా రూపొందించిన యాప్‌లో మాక్ టెస్ట్, స్టడీ మెటీరీయల్స్, పలు రకాల ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, టీం–అప్ సంస్థ కో ఫౌండర్ ఏ.రంజిత్, వారధి సెక్రటరీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
యాప్ వినియోగం ఇలా...
టీం–అప్ సంస్థ సీఈఓ ఎంకే చైతన్య మాట్లాడుతూ.. యాప్ సేవలను పొందడానికి ఫోన్ నెంబర్, ఓటీపీతో లాగిన్ అవ్వాలి. ఒకవేళ ఇంతకు ముందు వారధిలో మెంబర్ అయినట్లైతే వారి వారధి అకౌంట్లో లాగిన్ అవ్వాలి. ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుండి వారధి అని టైప్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
చదవండి: Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు
Comments
Please login to add a commentAdd a comment