
సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజన సమస్యలపై ఆందోళనలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ.. వచ్చే నెల నుంచి నిరుద్యోగ సమస్యపై పోరాటం చేయాలని నిర్ణయించింది. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు పోరాట కార్యాచరణ చేపట్టాలని.. చివరి సభకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ హాజరయ్యేలా ప్రణాళిక రూపొం దించాలని నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకు న్నారు. నిరుద్యోగ సమస్యపై పోరాటం చేయా లని.. విద్యాసంస్థల్లో పర్యటించాలని, నిరుద్యోగ యువతను కలవాలనే భావనకు వచ్చారు. ఈ పోరాటంలో భాగంగా మొదటి, చివరి సభలు ఎక్కడ నిర్వహిం చాలనేది త్వరలో జరిగే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించ నున్నారు. సిరిసిల్లలో తొలి సభ నిర్వహించాలనే ప్రతిపాదనపై చర్చ జరిగినట్టు సమాచారం.
11 రాజకీయ పార్టీలతో కలిసి పోరాటం
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ఇతర ప్రతిపక్షాలతో సమావేశాలు నిర్వహించాలని, కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధా నాలపై 11 రాజకీయ పార్టీలతో కలిసి పనిచేయాలని శనివారం జరిగిన సమావేశంలో నిర్ణయిం చారు. ఈ నెల 22న ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేయాలని, ఈ నెల 27న జరిగే భారత్ బంద్‌కు మద్దతు ఇవ్వాలని తీర్మానించారు. ఈ భేటీలో కీలక నేతలంతా పాల్గొన్నారు. కొందరు నేరుగా గాంధీ భవన్‌కు రాగా.. మరికొందరు జూమ్ యాప్ ద్వారా హాజరయ్యారు. కాగా.. ఆదివారం గాంధీభవన్‌లో సమావేశం అయ్యేందుకు రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలకు ఆహ్వానం పంపినట్టు పార్టీ నేతలు వెల్లడించారు.త
Comments
Please login to add a commentAdd a comment