
కరీంనగర్ జిల్లా: రాబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ‍్క్షప్తి చేశారు. 27వ తేదీన జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగునున్న తరుణంలో పొన్నం ప్రెస్ మీట్ నిర్వహించారు. జిల్లాకు సంబంధం లేని వాళ్లు వచ్చి ఏదో చెబితే ఏమీ కాదని, వారి మాటలు నమ్మవద్దని పొన్నం పేర్కొన్నారు. ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం రోజున ఎస్సారార్ కళాశాలలో సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ఉంటుందని ఈ సందర్బంగా పొన్నం తెలియజేశారు.
‘మా పెళ్లి అక్కడే ఐందన్నవాళ్లు గానీ, హిందువులమని చెప్పుకున్నవాళ్లుగానీ పట్టోంచుకోకపోతే మేం వేములవాడ అభివృద్ధి చేస్తున్నాం. అలాగే మిడ్ మానేరు నిర్వాసితులకు గత సర్కార్ పట్టించుకోకపోతే మేమే వారి పరిహారం చెల్లించాం. శాతవాహన యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ను తీసుకురావడంతో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం . ఇప్పటికే మేం 50 శాతంతో ముందున్నాం, కరీంనగర్ లో కూడా కలుపుకుని మొత్తం 65 శాతంకు పైగా మెజార్టీ సాధిస్తామనే నమ్మకం మాకుంది.
బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది, బండి సంజయ్ ఈ ఆరేళ్లల్లో కరీంనగర్ పార్లమెంటుకు ఏం తెచ్చారో చెప్పాక ఓట్లు అడగండి. నేను ఫలానా చేశాను ఎంపీగా అని చెప్పగలను. రిజర్వేషన్లకు సంబంధించి చట్టం విషయంలో కేంద్రంలో చట్టబద్ధత కల్పించకపోతే వెంటపడతామంటూ సంజయ్ ను హెచ్చరిస్తున్నా. ఎన్నికల్లో ఓట్ల కోసం మతాన్ని వాడుకోవడం అలవాటు చేసుకున్నారు. కానీ, పట్టభద్రుల దగ్గర ఆ పప్పులుడకవు. గుజరాత్ లో పదిశాతం ఈబీసీలకు మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు రిజర్వేషన్లు కల్పించారో ముందు సంజయ్ చెప్పాలి. బీసీ కులగణనపై చర్చకు మేం సిద్ధమంటూ బండి సంజయ్ కి ప్రతి సవాల్ విసురుతున్నా., ఎల్అర్ఎస్ పై ఎన్నికల ముందు చెప్పినా.. తెలంగాణాలో జరిగిన ఆర్థిక విధ్వంసంతో నిర్ణయాల్లో మార్పు ఉండవచ్చు’ అని పొన్నం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment