రేపు అంధ నిరుద్యోగుల సంఘం ప్రారంభం | tomorrow stats blind unemploys union | Sakshi
Sakshi News home page

రేపు అంధ నిరుద్యోగుల సంఘం ప్రారంభం

Published Sun, Sep 11 2016 12:38 AM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM

tomorrow stats blind unemploys union

ఏలూరు సిటీ : నూతనంగా ఏర్పాౖటెన బ్రెయిలీ విజువల్లీ చాలెంజ్డ్‌ అనెంప్లాయీస్‌ అసోసియేషన్‌ను ఈ నెల 12న ఏలూరు వన్‌టౌన్‌ అగ్రహారంలోని గాంధీ ఆంధ్ర మహావిద్యాలయ ఆవరణలో ప్రారంభిస్తున్నట్టు సంఘ అధ్యక్ష, కార్యదర్శులు వై.రమేష్, కె.బాలాజీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించే సమావేశంలో అంధ నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు కూడా హాజరుకావాలని వారు కోరారు. వివరాలకు 95739 36302, 96426 32344 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement