ramesh
-
సినిమా కోసం చాలా వదులుకున్న
-
టీకా వికటించి శిశువు మృతి
తంగళ్లపల్లి (సిరిసిల్ల): టీకా వికటించి శిశువు మృతిచెందిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నేరెళ్ల గ్రామానికి చెందిన దాసరి లలిత–రమేశ్ దంపతులకు ఇద్దరు సంతానం కొడుకు హన్షిత్ (9), కూతురు(45రోజులు) ఉన్నారు. కూతురుకు నేరెళ్ల పీహెచ్సీలో బుధవారం టీకా వేయించారు. ఇంటికెళ్లాక పాప అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో హుటాహుటిన సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు శిశువు అప్పటికే మృతిచెందిందని తెలపడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా ఏడ్చారు. పాప మృతదేహంతో నేరెళ్ల పీహెచ్సీ వద్ద ధర్నాకు దిగారు. సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, ఎస్సై రామ్మోహన్ వారికి నచ్చజెప్పినా వినలేదు. కలెక్టర్ రావాలని పట్టుబట్టారు. జిల్లా వైద్యాధికారి రజిత అక్కడికి చేరుకొని బుధవారం ముగ్గురు చిన్నారులకు టీకాలు వేస్తే ఇద్దరు బాగానే ఉన్నారన్నారు. పాప మృతిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయినా తల్లిదండ్రులు వినలేదు. వీరికి తోడుగా సిద్దిపేట–సిరిసిల్ల ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగిన బీజేపీ మండలాధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్‌రావుతోపాటు మరో పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాధాబాయి పాప కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.లక్ష చెక్కు అందించారు. తంగళ్లపల్లి తహసీల్దార్ గురువారం మరో రూ.లక్ష అందజేయనున్నట్లు ప్రకటించారు. -
ఓఅండ్ఎం ఒప్పందం చేసుకోలేదు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల బరాజ్ నిర్మాణం 2021లో పూర్తయిందని, ఆ వెంటనే బరాజ్ పర్యవేక్షణ, నిర్వహణ (ఓ అండ్ ఎం) కోసం నీటిపారుదల శాఖ తమతో ప్రత్యేక ఒప్పందం చేసుకోవాల్సి ఉండగా చేసుకోలేదని బరాజ్ నిర్మాణ సంస్థ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ డైరెక్టర్ వై.రమేశ్ చెప్పారు. బరాజ్ వద్ద తమ కంపెనీ సిబ్బందితో పాటు నీటిపారుదల శాఖ సిబ్బంది ఉన్నారని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలు ఆరోపణలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గురువారం రమేశ్‌కు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. బరాజ్ నిర్వహణ, పర్యవేక్షణలో నిర్మాణ సంస్థ బాధ్యతల గురించి ప్రశ్నించింది. నీటిపారుదల శాఖ రూపొందించిన డిజైన్లతో పోల్చితే సుందిళ్ల బరాజ్ వాస్తవ షూటింగ్ వెలాసిటీ అధికంగా ఉండడంతోనే బరాజ్ దిగువన సీసీ బ్లాకులు కొట్టుకుపోయి బుంగలు ఏర్పడ్డాయని గతంలో సమర్పించిన అఫిడవిట్లో రమేశ్ పేర్కొనడాన్ని గుర్తు చేసింది. రెండు పర్యాయాలు బరాజ్‌కు బుంగలు ఏర్పడితే ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. చివరి బిల్లు చెల్లించడం లేదుతొలిసారి బుంగలు ఏర్పడినప్పుడు గ్రౌటింగ్ ద్వారా పూడ్చివేశామని రమేశ్ బదులిచ్చారు. 2022 వరదల్లో బరాజ్‌కి తీవ్ర నష్టం జరగగా, పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి పునరుద్ధరించామన్నారు. వర్క్ కంప్లిషన్ సర్టిఫికెట్‌ను శాఖ నుంచి తీసుకున్నట్టు ధ్రువీకరించారు. సుందిళ్ల బరాజ్‌లో లోపాలను గుర్తించడానికి పలు రకాల పరీక్షలను నిర్వహించాలన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనలతో.. నీటిపారుదల శాఖ అధికారుల సంతృప్తి మేరకు ఆ పరీక్షలన్నీ పూర్తి చేశామని వివరించారు. కాగా బరాజ్ నిర్మాణానికి సంబంధించిన చివరి బిల్లును ప్రభుత్వం తమకు చెల్లించడం లేదని కమిషన్‌కు రమేశ్ ఫిర్యాదు చేశారు.అనుబంధ ఒప్పందంతో కాంట్రాక్టు పునరుద్ధరణ జరగదుసుందిళ్ల నిర్మాణం 2021 డిసెంబర్లో పూర్తికాగా, 2023లో అదనపు పనులు చేసేందుకు నీటిపారుదల శాఖతో అనుబంధ ఒప్పందం చేసుకున్నామని నవయుగ ప్రాజెక్టు ఇన్చార్జి కె.ఈశ్వర్రావు తెలిపారు. అనుబంధ ఒప్పందంతో పాత కాంట్రాక్టు పునరుద్ధరణ జరగదని స్పష్టం చేశారు. సుందిళ్ల బరాజ్ దిగువన కొట్టుకుపోయిన సీసీ బ్లాకుల పునరుద్ధరణ పనులు పూర్తి చేశామని చెప్పారు. నవయుగ కంపెనీ మరో ప్రాజెక్టు ఇన్చార్జి చింతా మాధవ్ సైతం విచారణకు హాజరు కాగా, ఆయనకు కేవలం మెటీరియల్ కొనుగోళ్లతో మాత్రమే సంబంధం ఉండడంతో కమిషన్ ఆయన్ను ప్రశ్నించలేదు.కాపీ పేస్ట్‌లా అఫిడవిట్లునవయువ కంపెనీ డైరెక్టర్‌తో పాటు ఇద్దరు ప్రాజెక్టు ఇన్చార్జిలు దాఖలు చేసిన అఫిడవిట్లు కాపీ.. పేస్ట్ తరహాలో ఉన్నాయని కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. డైరెక్టర్ అఫిడవిట్‌కు కార్బన్ కాపీలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. -
Success Story: నాడు అమ్మతోపాటు గాజులమ్మి.. నేడు ఐఏఎస్ అధికారిగా..
బాల్యంలో కటిక దారిద్య్రం అనుభవిస్తూనే, చదువులు కొనసాగించిన కొందరు ఉన్నత స్థానానికి చేరుకున్న ఉదంతాల గురించి మనం అప్పుడప్పుడు వింటుంటాం. ఇదే కోవలోకి వస్తారు రమేష్ ఘోలాప్. ఈయన సాధించిన విజయం యువతకు స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు.రమేష్ ఘోలాప్.. ఐఏఎస్ అధికారిగా మారేవరకూ సాగించిన ప్రయాణంలో చదువుపై ఆయన చూపిన అంకితభావం, శ్రద్ధ, కృషి మనకు కనిపిస్తాయి. మహారాష్ట్రలోని షోలాపూర్(Solapur) జిల్లాలోని మహాగావ్ అనే చిన్న గ్రామంలో జన్మించిన రమేష్ చిన్నప్పటి నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. రమేష్ తండ్రి గోరఖ్ ఘోలాప్ ఒక చిన్న సైకిల్ మరమ్మతుల దుకాణం నడిపేవాడు. మద్యం అలవాటు కారణంగా అతని తండ్రి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఇంట్లో పరిస్థితి అంతకంతకూ దిగజారింది. ఒకరోజు రమేష్ తండ్రి దుకాణం మూసివేశాడు.దీంతో రమేష్ తల్లి విమల్ ఘోలాప్ కుటుంబాన్ని పోషించేందుకు సమీప గ్రామాల్లో గాజులు అమ్మడం ప్రారంభించింది. ఆ సమయంలో రమేష్ తన తల్లికి సహాయం చేస్తూ వచ్చాడు. 2005లో రమేష్ తండ్రి మరణించాడు. కుటుంబసభ్యులు పొరుగింటివారి సాయంలో అంత్యక్రియలు(Funeral) నిర్వహించారు. ఈ ఘటన రమేష్‌ను అమితంగా ఆలోచింపజేసింది. పేదరికం నుండి బయటపడటానికి ఏకైక మార్గం విద్య అని రమేష్ గ్రహించాడు. చదువుపై దృష్టి సారించిన రమేష్ ఓపెన్ యూనివర్సిటీ నుండి ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. 2009 లో ఉపాధ్యాయుడైన తర్వాత కూడా, తన ఆశయంపై దృష్టి సారిస్తూ ముందుకుసాగాడు.యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్ఈ) కి సిద్ధం కావాలని నిర్ణయించుకుని, ప్రిపరేషన్ కోసం రమేష్ పూణేకు పయనమయ్యాడు. ఆ సమయంలో అతని తల్లి అండగా నిలిచింది. 2010లో రమేష్ తన మొదటి ప్రయత్నంలో యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష విఫలమయ్యాడు. పోలియో బాధితుడైన రమేష్ 2012లో వికలాంగుల కోటా(Disabled quota) కింద యూపీఎస్సీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్)287తో ఉత్తీర్ణుడయ్యాడు. ఐఎఎస్ అధికారి కావాలన్న తన కలను నెరవేర్చుకున్నాడు. ప్రస్తుతం ఐఏఎస్ రమేష్ ఘోలాప్ జార్ఖండ్ ఇంధన శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన కథ కోట్లాది మంది యువతకు ప్రేరణ కల్పిస్తుందనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: తమకు తామే పిండం పెట్టుకుని.. నాగ సాధువులుగా మారిన 1,500 మంది సన్యానులు -
కట్టుకట్టి వదిలేశారు
సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామానికి చెందిన రమేశ్ సోమవారం బైక్‌పై వెళుతుండగా యాక్సిడెంట్ అయింది. దీంతో ముఖంపై తీవ్ర గాయం అయింది. వైద్యం కోసం నూజివీడు ప్రభుత్వాస్పత్రికి వెళ్లగా, విజయవాడ ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేశారు. రమేశ్ అదేరోజు జీజీహెచ్‌లో అడ్మిట్ అయ్యారు. ముఖంపై అయిన గాయానికి వైద్యులు కట్టు కట్టారు. తదుపరి చికిత్స అందించాలంటే ఆరోగ్యశ్రీ కింద కేసులు రిజిస్ట్టర్ చేసి, అనుమతులు వచ్చేవరకూ ఆగాలన్నారు. కుటుంబ సభ్యుల నుంచి సిబ్బంది ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని కేసు రిజిస్టర్ చేస్తున్నామని చెప్పారు. ఆ రోజు నుంచి బుధవారం వరకు మూడురోజుల పాటు అనుమతులు రాలేదని చికిత్సలో జాప్యం చేస్తూ వచ్చారు. ‘చిన్న గాయానికి చికిత్సకోసం మూడురోజుల నుంచి ఎదురుచూస్తున్నాం. ఇంకెన్ని రోజులు పడుతుందని ప్రశ్నిస్తే.. ఏమో చెప్పలేం.’ అని సిబ్బంది సమాధానం ఇస్తున్నారని రమేశ్ కుమారుడు వాపోయాడు. రమేశ్ తరహాలోనే చికిత్సల్లో జాప్యంతో ఏపీవీవీపీ, బోధనాస్పత్రుల్లో నిరంతరం పలువురు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సల కోసం డబ్బు ఖర్చుపెట్టే స్తోమతలేక ప్రభుత్వాస్పత్రులను ఆశ్రయిస్తున్న నిరుపేద రోగులకు తక్షణమే వైద్య సేవలు అందడం లేదు. ఆరోగ్యశ్రీ నుంచి అనుమతులు రావాలంటూ రోజుల తరబడి ఆస్పత్రుల్లో వేచి ఉండేలా చేస్తున్నారు. మైనర్ సర్జరీలకు సైతం ఆరోగ్యశ్రీ కార్డు కావాలని ఆస్పత్రుల్లో డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వాస్పత్రులంటే ఎటువంటి షరతులు లేకుండా తక్షణ వైద్యం అందుతుందని ప్రజలకు నమ్మకం. ప్రస్తుత ప్రభుత్వంలో ఇందుకు భిన్నంగా ఆస్పత్రుల్లో పరిస్థితులు ఉంటున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుల్ని కర్ణాటక పోలీసులు క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసం గత గురువారం నగరానికి తీసుకువచ్చారు. వీరంతా పోచారంలోని బృందావన్ హోటల్లో బస చేశారు. శుక్రవారం తెల్లవారుజామున కీలక నిందితుడు అంకుర్ రాణా తప్పించుకుని పారిపోయాడు. దీంతో కర్ణాటక పోలీసులు ఐటీ కారిడార్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వెలుగులోకి వచి్చన అంశాల ప్రకారం కేసును ఇక్కడకు బదిలీ చేయాల్సి ఉండగా.. కర్ణాటక పోలీసులు చూపించిన అత్యుత్సాహం కారణంగానే ఇలా జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తుకారాంగేట్ టు సంస్కృతి టౌన్షిప్ నగరంలోని తుకారాంగేట్‌కు చెందిన రమేష్ కుమార్ భార్య, కుమార్తెకు దూరంగా పోచారంలో ఉన్న సంస్కృతి టౌన్íÙప్లో ఒంటరిగా ఉండేవారు. భువనగిరికి చెందిన ఆకుల లత చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈమె బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది. ఈ నేపథ్యంలోనే తన పేరును నిహారికగా మార్చుకుంది. గతంలో ఇద్దరిని పెళ్లి చేసుకుని, వారి నుంచి వేరు పడిన నిహారికకు మాట్రిమోనియల్ సైట్ ద్వారా రమే‹Ùతో పరిచయం ఏర్పడింది. 2018లో రిజిస్టర్ వివాహం చేసుకున్న వీళ్లు సంస్కృతి టౌన్‌షిప్‌లోనే కాపురం పెట్టారు. నిహారిక మాత్రం ఉద్యోగ నిమిత్తం అంటూ ఎక్కువ రోజులు బెంగళూరులోనే ఉండేది. ఈమె తన రెండో భర్తతో కలిసి హరియాణాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసి జైలుకు వెళ్లింది. అక్కడే ఈమెకు అంకుర్ రాణా అనే నేరగాడి తల్లితో పరిచయమైంది. ఆమెను కలవడానికి ములాఖత్‌కు వచ్చే అంకుర్తోనూ స్నేహం ఏర్పడింది. జర్మనీలో ఉద్యోగం కోసం నగదు అవసరమంటూ.. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వాసవీ నగర్ నుంచి బెంగళూరులోని రామమూర్తి నగర్ వెటర్నరీ డాక్టర్‌గా స్థిరపడిన నిఖిల్ మైరెడ్డితో నిహారికకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. కొన్ని రోజులుగా నిహారిక తనకు జర్మనీలోని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం వచి్చందని, దాని నిమిత్తం రూ.2 కోట్లు చెల్లించాల్సి ఉందంటూ రమే‹Ùతో చెబుతూ వస్తోంది. కొన్నాళ్లుగా ఆమె ప్రవర్తన, మాటలపై సందేహాలు రావడంతో డబ్బు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. ఈ విషయంలోనే వీరి మధ్య వివాదం నెలకొంది. రమేష్ ఇటీవల తన స్తిరాస్థిని విక్రయించగా వచ్చిన రూ.8 కోట్లు కాజేయాలని నిహారిక పథకం వేసింది. రమేష్‌ను హత్య చేయడం ద్వారా దీన్ని అమలు చేయాలని అంకుర్ రాణాను సంప్రదించింది. అతడు అంగీకరించడంతో ఇరువురూ కలిసి గత నెల 1న నగరానికి చేరుకున్నారు. పీర్జాదిగూడలో చంపి.. మృతదేహంతో 800 కి.మీ ప్రయాణించి.. బోడుప్పల్ ప్రాంతంలో అంకుర్ బస చేయగా.. నిహారిక మాత్రం రమేష్ ఇంటికి వెళ్లింది. రెండు రోజుల పాటు వీరి మధ్య నగదు విషయంలో వాగ్వాదం జరిగింది. గత నెల 3 రాత్రిన తనను విమానాశ్రయంలో వదిలి రావాలంటూ నిహారిక కోరగా.. రమేష్ తన మెర్సిడిస్ బెంజ్ కారులో (టీఎస్ 07 ఎఫ్ఎస్ 5679) బయలుదేరారు. బోడుప్పల్–ఉప్పల్ మధ్యలో అంకుర్ వీరి వాహనం ఎక్కాడు. అతడిని తన సహోద్యోగిగా పరిచయం చేసింది. వీరి వాహనం పీర్జాదిగూడ కమాన్ వద్దకు చేరుకున్నాక వెనుక సీటులో కూర్చున్న అంకుర్ తన వద్ద ఉన్న వైరుతో రమే‹Ùకు ఉరి బిగించి చంపాడు. ఆపై వీళ్లు నిఖిల్‌ను సంప్రదించారు. అతడి సూచనల మేరకు మృతదేహాన్ని కారులో ఉంచుకుని దాదాపు 800 కి.మీ ప్రయాణించారు. ఊటీ సమీపంలోని సుంటికొప్పలో (కర్ణాటక) ఉన్న కాఫీ ఎస్టేట్‌లో పెట్రోల్ పోసి మృతదేహాన్ని దహనం చేసి కారుతో పారిపోయారు. గత నెల 8న సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కొడుగు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన అధికారులు నిహారిక, నిఖిల్‌లను బెంగళూరులో, అంకుర్‌ను హరియాణాలో అరెస్టు చేశారు.అవకాశం ఉన్నా బదిలీ చేయకుండా... నిందితుల విచారణ నేపథ్యంలో ఈ హత్య పీర్జాదిగూడలో జరిగినట్లు తేలింది. నిబంధనల ప్రకారం ఆ వెంటనే ఈ కేసును రాచకొండకు బదిలీ చేయాలి. కొడుగు పోలీసులు మాత్రం అత్యుత్సాహం చూపిస్తూ అలా చేయలేదు. దర్యాప్తు కొనసాగిస్తూ నిందితులను కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్నారు. క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసం వారిని తీసుకుని నగరానికి వచ్చి పోచారంలోని బృందావన్ లాడ్జిలో బస చేశారు. గత గురువారం సంస్కృతి టౌన్షిప్, బోడుప్పల్, పీర్జాదిగూడల్లో వీరిని తిప్పారు. ఆ రోజు రాత్రి హోటల్ గదిలో అంతా నిద్రపోతుండగా.. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అంకుర్ ఎస్కేప్ అయ్యాడు. దీంతో కర్ణాటక పోలీసులు దీనిపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిగిలిన ఇద్దరు నిందితులను తీసుకుని శనివారం కొడుగు వెళ్లిపోయారు. పరారైన అంకుర్ కోసం కర్ణాటక, తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. -
ఎస్సైకి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య
రామడుగు: తన తల్లికి స్థలాన్ని అమ్మిన మహిళ, అదే స్థలాన్ని మరొకరికి విక్రయించడంతో పాటు కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరింపులకు పాల్పడడంతో మండలంలోని వెలిచాల గ్రామానికి చెందిన దైవాల రమేశ్(35) ఎస్సైకి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కొత్తపల్లి మండలానికి చెందిన ఓ మహిళ 2004లో మృతుడి తల్లి వరమ్మకు 35 గుంటల స్థలాన్ని విక్రయించగా రమేశ్ పంటలు సాగు చేసుకుంటున్నాడు. ఇదే స్థలాన్ని మరో వ్యక్తికి అమ్మినట్టు తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించింది. ఇదేంటని ప్రశ్నించగా కుటుంబసభ్యులను చంపుతామని బెదిరించడంతో మనోవేధనకు గురైన రమేశ్ బుధవారం గ్రామ పరిధిలోని అయ్యవారి కుంటలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య శ్రీలత ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని, రమేశ్‌కు ముగ్గురు పిల్లలని ఎస్సై వి.శేఖర్ వివరించారు. -
Karimnagar: లగ్గం సినిమాలో మనోళ్లు
విద్యానగర్(కరీంనగర్): పెళ్లి అంటే రెండు కుటుంబాలు కలవడమే కాదు.. రెండు మనసులు కలవడం అన్న అంశంతో తెలంగాణ పెండ్లి సంప్రదాయాన్ని పెద్ద తెరపై ఆవిష్కరిస్తున్నారు మనోళ్లు. ‘లగ్గం’ పేరున సినిమాను కామారెడ్డికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి నిర్మించగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తికి చెందిన చెప్పాల రమేశ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సినీ, యూట్యూబ్ స్టార్స్ ఆర్ఎస్ నంద, గుండ మల్ల య్య, రాధిక, తెలంగాణ లక్ష్మి, మిమిక్రి మహేశ్, సత్య ఎలేశ్వరం, సినీ పోస్టర్, టైటిల్ డిజైనర్ విష్ణువర్దన్‌రెడ్డి, అర్చిత, కాంతరెడ్డితోపాటు మరో 10మంది వరకు నటించడం విశేషం. లగ్గం సినిమా ఈనెల 25న విడుదల కానుంది. పాటే ఆమె ప్రాణం.. శంకరపట్నం(మానకొండూర్): ఇప్పలపల్లి గ్రామానికి చెందిన జనగాం లావణ్య ఫోక్సాంగ్స్ పాడి పల్లె జనం, పట్టణ ప్రజల అభిమానం చురగొంటున్నారు. గ్రామీణ ప్రాంతమైన ఇప్పలపల్లిలో నివాసముంటూ భర్త రవీందర్ ప్రోత్సాహంతో నటనలోనూ సత్తా చూపుతున్నారు. బతుకమ్మ, పెళ్లి, వాన పాటలే కాకుండా.. వేములవాడ రాజన్న, కొండగుట్ట అంజన్న, కొమురవెల్లి మల్లన్న దేవతామూర్తుల పాటలు పాడుతూ భక్తుల గుండెల్లో చోటు సాధించారు. ఎల్ఆర్ పోక్స్ పేరిట య్యూటూబ్‌లో పాటలు, షార్ట్ఫిల్్మలు విడుదల చేస్తున్నారు. భర్త రవీందర్, కూతురు మైత్రి, కొడుకు మనోజ్‌కుమార్‌తో కలిసి నటించారు. 90 వరకు పాటలు, షార్ట్ఫిల్్మలలో నటించగా.. ఇప్పటివరకు 1.50లక్షల వ్యూయర్స్ ఉన్నారు. పాట పాడుతున్న లావణ్య -
అంతా మా ఇష్టం..!
-
కేన్ క్రాఫ్ట్! ఆకట్టుకునే ఆకృతులు.. పర్యావరణ స్నేహితులు!
సాక్షి, సిటీబ్యూరో: నడిరోడ్డుపైన కొలువుదీరిన ఉత్పత్తులు చేతి వృత్తుల నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. కాదేదీ సృజనకు అనర్హం అన్నట్టు వెదురు, కేన్లను ఉపయోగించి వివిధ రకాల ఆకృతుల్లో ఉత్పత్తులను తీర్చిదిద్దుతున్నారు. ఈ ఉత్పత్తులు అందానికీ, వైవిధ్యానికి పట్టం గడుతున్నాయి. ఖరీదైన మాల్స్‌లో మాత్రమే కాదు కచ్చా రోడ్లపై కూడా షాపింగ్ ప్రియుల్ని కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా వెదురు, కేన్‌తో తయారు చేసిన బుట్టలు, బ్యాగ్‌లు, ఇతర ఉత్పత్తులు నగరవాసుల మది దోచుకుంటున్నాయి. తయారీ నైపుణ్యంతో పాటు అందుబాటు ధరల్లో ఉండటంతో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.రూ.200 నుంచి రూ.25 వేల వరకూ..ఒకొక్కటీ సుమారుగా రూ.200 నుంచి గరిష్టంగా రూ.25 వేల వరకూ ఉంటాయని తయారీదారులు చెబుతున్నారు. ఎన్ని మార్కెట్లు ఉన్నా మా వినియోగదారులు మాకున్నారంటున్నారు. చేసే పనిలో నైపుణ్యం ఉండాలే గాని ప్లాస్టిక్, ఫ్యాబ్రిక్, ఫైబర్, వంటివి ఎన్ని మోడల్స్ వచి్చనా సంప్రదాయ కళలకు ప్రజాదరణ ఉంటుందని ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు.ఇదే జీవనాధారం.. పశ్చిమగోదావరి జిల్లా నుంచి హైదరాబాద్ వచి్చన ఓ కుటుంబం సంప్రదాయ హస్తకళనే జీవనాధారంగా చేసుకుంది. రామానాయుడు స్టూడియో నుంచి కిందికి వెళ్లే రోడ్డులో ఫుట్‌పాత్‌పై ఈ ఉత్పత్తులు మన ముందే తయారు చేసి విక్రయిస్తున్నారు. పూలు, పండ్లు, ఇతర పూజా సామాగ్రి తీసుకెళ్లేందుకు వినియోగించే బుట్టల నుంచి గార్డెన్లో విద్యుత్తులైట్లు అమర్చుకునేందుకు వివిధ ఆకృతుల్లో బుట్టలు, లాంతరు లైట్లు, తయారుచేస్తున్నారు. లాంతరు లైట్లు, మూత ఉన్న బుట్టలు, గంపలు, పెద్దపెద్ద హాల్స్‌లో అలంకరణ కోసం పెట్టుకునే పలు రకాల వస్తువులను అక్కడికక్కడే తయారుచేసి అందిస్తున్నారు. వీటిని విభిన్నమైన రంగులతో అందంగా తీర్చిదిద్దుతున్నారు.పర్యావరణ హితం కోసం.. వెదురుతో పర్యావరణ హితమైన వస్తువులను తయారు చేస్తున్నాం. మా కుటుంబానికి వంశపారంపర్యంగా వస్తున్న కళ ఇది. మాకు ఇదే జీవనాధారం. వివిధ ఆకృతుల్లో అందంగా, ఆకట్టుకునే వస్తువులను తీర్చిదిద్దుతున్నాం. వస్తువు తయారీకి ఉపయోగించిన ముడిసరుకును బట్టి దాని ధర నిర్ణయిస్తాం. పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు. కూలి గిట్టుబాటు అయితే చాలనుకుంటాం. ఫలితంగా అందరికీ అందుబాటైన ధరలోనే వస్తువులు లభిస్తాయి. రోజు పదుల సంఖ్యలో వస్తువులు అమ్మకాలు జరుగుతున్నాయి. – రమేష్, తయారీదారుడు, జూబ్లిహిల్స్ -
‘రింగ్’లో మింగారు!
సాక్షి, అమరావతి: రాజధాని.. ఇన్నర్ రింగ్ రోడ్.. కావేవీ భూ దోపిడీకి అనర్హం అన్నట్టుగా టీడీపీ పెద్దలు చెలరేగిపోయారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేసి తమ భూముల విలువ భారీగా పెంచుకున్నారు. 2014–19 మధ్య టీడీపీ హయాంలో సీఆర్డీఏ చైర్మన్ హోదాలో చంద్రబాబు, వైస్ చైర్మన్‌గా ఉన్న పొంగూరు నారాయణ బరితెగించి వ్యవహరించారు.లింగమనేని రమేశ్‌తో క్విడ్ ప్రో కోకు పాల్పడిన ఈ కేసులో నారా లోకేశ్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. లింగమనేని భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం. సీఐడీ దర్యాప్తులో ఈ కుంభకోణం పూర్తి ఆధారాలతో బట్టబయలైంది. ‘హెరిటేజ్ ఫుడ్స్’కు కానుక..లింగమనేని కుటుంబానికి కల్పించిన ప్రయోజనానికి ప్రతిగా కంతేరులో హెరిటేజ్ ఫుడ్స్‌కు 10.4 ఎకరాలు పొందారు. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని లింగమనేని కుటుంబానికి చెందిన 355 ఎకరాలతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ భూములు ఉండటం గమనార్హం. క్విడ్ ప్రో కోలో భాగంగా లింగమనేని రమేశ్ కృష్ణా కరకట్ట మీద ఉన్న తన అక్రమ బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. ఆ ఇంటిని ఉచితంగా ఇచ్చినట్లు ఆయన చెబుతుండగా నాడు చంద్రబాబు ప్రభుత్వం నుంచి హెచ్ఆర్ఏ ఎందుకు పొందారన్న ప్రశ్నకు సమాధానం లేదు.తమ భూముల విలువ పెరిగేలా..ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని కుటుంబం ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.8 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించగా మార్కెట్ ధర రూ.50 లక్షలు ఉంది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లు. ఇక ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు తరువాత ఎకరా రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లు పెరిగింది. మార్కెట్ ధర ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతం రూ.887.50 కోట్లకు పెరిగింది. అమరావతి పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా రూ.4 కోట్లకు చేరుతుందని చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. తద్వారా హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ అమరావతి పూర్తయితే రూ.54 కోట్లకు చేరుతుందని లెక్కతేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకున్న మరో నాలుగు ఎకరాల విలువ రూ.24 కోట్లకు చేరుతుంది. సీఆర్డీఏ తొలి అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపడితే నారాయణ విద్యా సంస్థల భవనాలను భూ సేకరణ కింద తొలగించాల్సి వస్తుంది. దీంతో నారాయణ అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్పించారు. పవన్ కళ్యాణ్‌కు 2.40 ఎకరాలుజనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు అవినీతిలో వాటా ఇచ్చారు. ఈ రోడ్డు అలైన్‌మెంట్‌కు సమీపంలో ఆయనకు 2.4 ఎకరాల భూమి ఉంది. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్టు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కళ్యాణ్‌కు ఇవ్వడం గమనార్హం. ఏ1 చంద్రబాబు.. ఏ2 నారాయణ.. ఏ14 లోకేశ్ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసులో సీఐడీ ఇప్పటికే విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా పొంగూరి నారాయణలను పేర్కొంది. ఐపీసీ 120(బి), 409, 420, 34, 35, 37, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2), రెడ్‌విత్ 13(1)(సి),(డి)ల ప్రకారం కేసు నమోదు చేసింది. అలైన్మెంట్ బాబుది.. ముద్ర కన్సల్టెన్సీదిఇన్నర్ రింగ్ రోడ్ కోసం సీఆర్డీయే అధికారులు తొలుత 94 కి.మీ. పొడవుతో ఓ అలైన్‌మెంట్‌ను రూపొందించారు. అయితే దానివల్ల తమ భూముల విలువ పెరగదని గుర్తించిన టీడీపీ పెద్దలు అలైన్‌మెంట్‌ను మార్చేశారు. 3 కి.మీ. దక్షిణం వైపు జరిపేసి తాడికొండ, కంతేరు, కాజాలోని చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని వెళ్లేలా ఖరారు చేశారు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు. అనంతరం ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌ను ఆమోదించుకున్నారు.ఐఆర్ఆర్ కేసులో నిందితులుఏ–1: చంద్రబాబుఏ–2: నారాయణఏ–3: లింగమనేని రమేశ్ఏ–4: లింగమనేని వెంకట సూర్య రాజవేఖర్ఏ–5: కేపీవీ అంజని కుమార్ (రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్)ఏ–6: హెరిటేజ్ ఫుడ్స్ఏ–7: ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ఏ–14: నారా లోకేశ్ -
పక్కా 420 కోసం..బాబు కష్టాలు
-
Nail Rings Photos: ఇది నెయిల్ ఆర్ట్ కాదు.. నెయిల్ రింగ్స్ (ఫోటోలు)
-
అనకాపల్లి డీఎస్పీ ఎదుట విచారణకు సీఎం రమేష్ హాజరు
-
ఒక రౌడీని గెలిపిస్తే అనకాపల్లి నాశనం అయిపోతుంది
-
బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పై కేసు నమోదు
-
అనకాపల్లిలో సామాన్యుడు బలవంతుడికి మధ్య పోటీ- బూడి ముత్యాలనాయుడు
-
ట్యాపింగ్ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ ఐబీ) కార్యాలయం కేంద్రంగా సాగిన అక్రమఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ (ఐటీఏ)ను కూడా జత చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నా రు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైనప్పుడు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నల అరెస్టు సమ యంలో ఈ చట్టంలోని సెక్షన్ల మేరకు ఆరోపణలు లేవు. తాజాగా ఈ చట్టాన్ని జోడించిన అధికారులు ఈ మేరకు నాంపల్లి కోర్టుకు మెమో ద్వారా సమాచారమిచ్చా రు. మరోపక్క ఈ కేసులో నిందితులపై నేరం నిరూపించ డానికి అవసరమైన చర్యలను సిట్ అధికారులు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఎస్ఐబీలో ఎలక్ట్రీషియన్‌గా పని చేసిన టీఎస్ఎస్పీ కానిస్టేబుల్‌ను సాక్షిగా చేర్చారు. ఐటీఏ ఉండాలన్న న్యాయ నిపుణులు ట్యాపింగ్‌పై ఎస్ఐబీ అదనపు ఎస్పీ డి.రమేష్ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ప్రణీత్ రావు, ఇతరులపై ఈ నెల 10న కేసు నమోదైంది. దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్ఐఆర్) పోలీసులు మూడు చట్టాల్లోని తొమ్మిది సెక్షన్ల కింద ఆరోపణలు చేశారు. ఐపీసీ, పీడీపీపీ, ఐటీ చట్టాల్లోని సెక్షన్లు చేర్చారు. కాగా ఈ నెల 13న ప్రణీత్ అరెస్టు తర్వాత కోర్టులో రిమాండ్ కేసు డైరీని సమర్పించిన అధికారులు.. ఇందులో ఓ సెక్షన్ తగ్గించి ఎనిమిదింటి కిందే ఆరోపణలు చేశారు. తొలుత చేర్చిన ఐపీసీలోని 120 బీ (కుట్ర), 34 (ఒకే ఉద్దేశంతో చేసే ఉమ్మడి చర్య) రెండు సెక్షన్లలో.. 120 బీ సెక్షన్లను తొలగించారు. అయితే నిందితులపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కింద అభియోగాలు దాఖలు చేయాలంటే కచ్చితంగా ఐటీఏను జోడించి, అందులోని సెక్షన్లు వర్తింపజేయాలని న్యాయ నిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్నల కస్టడీ పిటిషన్లతో పాటు ఈ చట్టాన్ని జోడిస్తూ మెమోను కూడా అధికారులు కోర్టులో దాఖలు చేశారు. కీలకం కానున్న హెడ్ కానిస్టేబుల్ కృష్ణ హార్డ్‌డిస్క్‌ల విధ్వంసంలో ప్రణీత్‌రావుతో కలిసి పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ కైతోజు కృష్ణను ఈ కేసులో సాక్షిగా చేర్చారు. నాటి ఎస్ఐబీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రణీత్‌రావు గత ఏడాది డిసెంబర్ 4న అర్ధరాత్రి కృష్ణతో కలిసే ఎస్ఐబీ కార్యాలయంలోకి వెళ్లాడు. అక్కడ తాను ఏర్పాటు చేసుకున్న వార్ రూమ్‌తో పాటు అధికారిక ట్యాపింగ్‌లు జరిగే లాగర్ రూమ్ దగ్గర సీసీ కెమెరాలను కృష్ణ ద్వారా ఆఫ్ చేయించాడు. అతని సహాయంతో వార్ రూమ్‌లోని 17 కంప్యూటర్లలో ఉన్న వాటితో పాటు విడిగా భద్రపరిచిన 50 హార్డ్ డిస్క్ల్నీ ఎలక్ట్రిక్ కట్టర్ వినియోగించి ధ్వంసం చేశాడు. ఈ కారణంగానే సిట్ అధికారులు కృష్ణను సాక్షిగా చేర్చారు. త్వరలో ఇతడితో న్యాయస్థానంలో స్టేట్మెంట్ రికార్డు చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే సిట్ కృష్ణ వాంగ్మూలం నమోదు చేయగా.. భవిష్యత్తులో అతను సాక్ష్యం చెప్పకుండా ఎదురుతిరిగే అవకాశం లేకుండా ఈ చర్య తీసుకోనున్నారు. ఎస్ఐబీలో నడిచిన ఓఎస్డీల రాజ్యం.. ఎస్ఐబీని చాలాకాలం పాటు పదవీ విరమణ పొంది ఓఎస్డీలుగా పనిచేస్తున్న వాళ్లే నడిపినట్లు తెలిసింది. ఇలాంటి దాదాపు 15 మంది అధికారులను ఆధారంగా చేసుకుని కథ నడిపినట్లు సమాచారం. ఓ మాజీ డీఐజీ, ముగ్గురు మాజీ ఎస్పీలు, ఐదుగురు అదనపు ఎస్పీలు ఇందులో కీలకంగా పనిచేశారని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం మారిన తరవాత ప్రభాకర్‌రావుతో పాటే వీళ్లు కూడా రాజీనామా చేసి వెళ్లిపోయారు. సాధారణంగా ఎస్ఐబీ లాంటి సున్నిత విభాగాల్లో మాజీ అధికారులను, ప్రైవేట్ వ్యక్తులను కీలక స్థానాల్లో ఉంచరని, అయితే ప్రభాకర్‌రావు స్వయంగా ఓఎస్డీ కావడంతో ఎస్ఐబీలో ఓఎస్డీలతో పాటు ప్రైవేట్ వ్యక్తుల రాజ్యం నడిచిందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. మరోపక్క ప్రణీత్‌రావుకు ట్యాపింగ్ వ్యవహారంలో ఐదుగురు ఇన్స్పెక్టర్లు సహకరించినట్లు సిట్ తేల్చింది. ఆ అధికారులకు త్వరలో నోటీసులు? అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ అధికారులు త్వరలో డీజీపీ, అదనపు డీజీపీ స్థాయి అధికారులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రధాన కార్యాలయం లక్డీకాపూల్‌లో ఉన్నప్ప టికీ... గ్రీన్‌ల్యాండ్స్‌లోని ఎస్ఐబీ కార్యాలయంలో కూడా ఆయనకు ఓ ఛాంబర్ ఉంది. గడిచిన కొన్నేళ్లుగా నిఘా విభాగాధిపతి అక్కడకు రాక పోవడంతో ప్రణీత్ రావు ఈ ఛాంబర్‌తో పాటు పక్కన ఉన్న రూమ్‌ను తన అక్రమ ట్యాపింగ్ వ్యవహారాల కోసం వార్‌రూమ్‌గా వినియోగించుకున్నట్లు తేలింది. ఆ చాంబర్ ఇతరులు విని యోగించాంటే కచ్చితంగా నిఘా విభాగాధిపతి, డీజీపీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అప్పట్లో ఏ కారణం చెప్పి ఈ అనుమతి తీసుకు న్నారు? ట్యాపింగ్ వ్యవహారాలు తెలిసే అను మతి ఇచ్చారా? లాంటి సందేహాలు నివృత్తి చేసుకోవడానికి గాను వీరికి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. -
వేణు దగ్గర రూ.450 కోట్లు కొట్టేశాడు.. సీఎం రమేష్ పై చీటింగ్ కేసు
-
బయటపడ్డ సీఎం రమేష్ ఎలక్టోరల్ బాండ్ల బాగోతం
-
విశాఖలో నకిలీ ఎస్ఐల ఘరానా మోసం
ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): పోలీసు ఎస్సైల వేషమేసి, పోలీసు శాఖలో ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విశాఖలో నిరుద్యోగులను మోసం చేసిన వ్యవహారం బయటపడింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు, ఘరానా మోసగాడైన హనుమంతు రమేష్, అతని ప్రియురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ మరికొంత మందితో కలిసి నిరుద్యోగుల నుంచి దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. బాధితుల కథనం ప్రకారం.. మోసాలతోనే బతికే హనుమంతు రమేష్ (47) అడవివరంలోని ఆర్ఆర్ టవర్స్‌లో ఉంటున్నాడు. అతనికి ఇద్దరు భార్యలు (అక్కచెల్లెళ్లు) ఉండగా ఇటీవల మరో ప్రియరాలితో ఉంటున్నాడు. గత కొంతకాలంగా ప్రియురాలు, మరికొందరితో కలిసి రాష్ట్ర పోలీసు శాఖలో ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామని యువకులకు ఆశ చూపించారు. వీరికి పలువురు మధ్యవర్తులు సహకరించారు. హనుమంతు, ప్రియురాలు, మిగతా వారు పోలీసు ఎస్సైల గెటప్‌లో రావడంతో వారంతా నమ్మేశారు. దాదాపు 30 మంది నుంచి రూ.3 కోట్ల వరకు దండుకొని మాయమయ్యారు. హైదరాబాద్‌లో అదుపులోకి.. బాధితుల ఫిర్యాదు మేరకు ఇటీవల నగర పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. పోలీసు కమిషనర్ సూచనలతో టాస్‌్కఫోర్స్ బృందాలు హైదరాబాద్ వెళ్లి హనుమంతు రమేష్ ను, అతడి ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నాయి. వీరిద్దరినీ గురువారం సాయంత్రం టాస్‌్కఫోర్స్ కార్యాలయానికి తీసుకొచ్చారు. అనంతరం నగర పోలీసు కమిషనర్ ఎదుట హాజరుపరిచారు. అనంతరం వారిని రహస్య ప్రాంతానికి తరలించి విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. -
జస్టిస్ రాకేష్‌పై ‘సుప్రీం’ సీరియస్!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న సమయంలో జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ దొనడి రమేష్ తమ తీర్పులో అటు అత్యున్నత న్యాయస్థానం ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పక్షపాతంతో చేసిన ఆ అభ్యంతరకర, వివాదాస్పద వ్యాఖ్యలను ఆ తీర్పు నుంచి సుప్రీంకోర్టు తాజాగా తొలగించింది. ఇలాంటి అసంబద్ధ, పక్షపాత వ్యాఖ్యలతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. ఈమేరకు ఆ వ్యాఖ్యలను తీర్పు నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం.త్రివేదీ, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఏం జరిగిందంటే...? మిషన్ బిల్డ్ ఏపీ కింద ప్రభుత్వ ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై 2020 డిసెంబర్లో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ రమేష్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ జరిగినప్పుడల్లా జస్టిస్ రాకేశ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అభ్యంతరకర, ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందా..? రాష్ట్రంలో ఆర్థిక అత్యాయక పరిస్థితి ఉందా? అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాజ్యాల విచారణను గమనించిన ప్రతి న్యాయవాది జస్టిస్ రాకేష్ కుమార్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నట్లు అర్థం చేసుకున్నారు. ఈ ధోరణిని ఎన్నోసార్లు భరిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం చివరకు మీరు విచారిస్తే న్యాయం జరిగే అవకాశం లేదని, అందువల్ల ఈ వ్యాజ్యాల విచారణ నుంచి తప్పుకోవాలంటూ (రెక్యూజ్) జస్టిస్ రాకేష్ కుమార్‌ను కోరింది. ఆ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. దీంతో జస్టిస్ రాకేష్ కుమార్ తీరు ప్రజలందరికీ తెలిసింది. ప్రభుత్వం న్యాయబద్ధంగా చేసిన అభ్యర్థనతో జస్టిస్ రాకేష్ కుమార్ అహం దెబ్బ తిన్నది. తనను విచారణ నుంచి తప్పుకోమనడం ధిక్కారపూర్వక చర్యే అవుతుందని జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ రమేష్‌ల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ధర్మాసనం తరఫున జస్టిస్ రాకేష్ కుమారే తీర్పు రాశారు. విచారణ నుంచి తప్పుకోవాలన్న ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. కొలీజియంపై తీవ్ర వ్యాఖ్యలు సర్వ సాధారణంగా ప్రభుత్వం చేసిన అభ్యర్థన పట్ల అభ్యంతరం ఉంటే ఏ న్యాయమూర్తి అయినా ఉత్తర్వులు జారీ చేసి అంతటితో ఆగిపోతారు. జస్టిస్ రాకేష్ కుమార్ మాత్రం అలా ఆగలేదు. ఆ తీర్పు ద్వారా తన అసలు నైజాన్ని బయటపెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వంపైనే కాకుండా అప్పటి ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేసినందుకు సుప్రీంకోర్టు కొలీజియంపై సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏకంగా 55 పేజీల తీర్పు వెలువరుస్తూ మిషన్ బిల్డ్‌పై దాఖలైన వ్యాజ్యాలతో సంబంధం లేని అంశాలను ప్రస్తావించారు. ఏ పిటిషనర్ ప్రస్తావించని అంశాలతోపాటు తమ ముందున్న కేసుతో సంబంధం లేని వివరాలను, వెబ్సైట్లలో ఉన్న వాటిని సైతం తీర్పులో పొందుపరిచారు. ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌పై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బనాయించిన కేసుల గురించి తన తీర్పులో ప్రముఖంగా ప్రస్తావించారు. జగన్మోహన్రెడ్డి గురించి తనకు తెలియదని, తరువాత చాలా ఆసక్తికర విషయాలు తెలుసుకున్నానంటూ ఓ న్యాయమూర్తి చేయకూడని వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా గూగుల్‌లో ఖైదీ నెంబర్ 6093 అని టైప్ చేస్తే చాలా సమాచారం వస్తుందంటూ వ్యాఖ్యానించారు. తన పదవీ విరమణకు ఒక్క రోజు ముందు జస్టిస్ రాకేష్ కుమార్ ఈ వివాదాస్పద తీర్పును వెలువరించారు. ఆ మరుసటి రోజు ఆయన పదవీ విరమణ చేసి ఇంటికి వెళుతుండగా టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ మద్దతుదారులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ఆయనను పసుపు పూలతో ముంచెత్తారు. ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసి స్వామిభక్తిని చాటుకున్నారు. ‘సుప్రీం’ విస్మయం.. ఈ తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2021లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం జస్టిస్ రాకేష్ కుమార్ తీర్పుపై తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఆ తీర్పు తమను ఆందోళనకు గురి చేస్తోందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. నిమిషం ఆలస్యం చేయకుండా జస్టిస్ రాకేష్ కుమార్ తీర్పు అమలుపై స్టే విధిస్తూ 2021 ఫిబ్రవరి 10న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అనంతరం ఈ వ్యాజ్యంపై జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా మరోసారి విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. జస్టిస్ రాకేష్ కుమార్ కేసుతో సంబంధం లేని అంశాలను ప్రస్తావించారని నివేదించారు. పలు అంశాలపై అవసరం లేని వ్యాఖ్యలు చేశారన్నారు. సుప్రీంకోర్టు కొలీజీయంపై కూడా విమర్శలు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల పాలనపరంగా పలు ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ముఖ్యమంత్రి జగన్, రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొలీజియంను విమర్శిస్తూ జస్టిస్ రాకేష్ కుమార్ తన తీర్పులో చేసిన వ్యాఖ్యలను తొలగించాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ జస్టిస్ రాకేష్ కుమార్ వ్యాఖ్యలన్నింటినీ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యంత వివాదాస్పదుడు పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ న్యాయమూర్తిగా మారిన జస్టిస్ రాకేష్ కుమార్ న్యాయవ్యవస్థలో అత్యంత వివాదాస్పదుడిగా పేరుపొందారు. బిహార్ మహాదళిత్ వికాస్ మిషన్ ఫండ్ నిధుల విషయంలో ఐఏఎస్ అధికారి రామయ్య ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఆయన తోసిపుచ్చారు. అయితే కింది కోర్టు రామయ్యకు బెయిల్ ఇవ్వడాన్ని జస్టిస్ రాకేష్ కుమార్ తప్పుబడుతూ సుమోటోగా విచారణ జరిపారు. తాను బెయిల్ నిరాకరించిన వ్యక్తికి కింది కోర్టు బెయిల్ ఎలా ఇస్తుందని ప్రశ్నిస్తూ దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సివిల్ కోర్టులో అవినీతి జరుగుతోందంటూ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. పాట్నా హైకోర్టులో అవినీతి బహిరంగ రహస్యమంటూ ఓ తీర్పే రాశారు. అవినీతి విషయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదన్నారు. జస్టిస్ రాకేష్ కుమార్ తీరును పాట్నా హైకోర్టు న్యాయమూర్తులందరూ సీరియస్‌గా తీసుకున్నారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షాహీ నేతృత్వంలో 11 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ప్రత్యేకంగా సమావేశమై జస్టిస్ రాకేష్ కుమార్ తీర్పును రద్దు చేసింది. జస్టిస్ రాకేష్ కుమార్ తీరుపై ఆ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆయనను కేసుల విచారణ బాధ్యత నుంచి తప్పించారు. అటు తరువాత సుప్రీంకోర్టు జస్టిస్ రాకేష్‌ను 2019లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేసింది. రాజ్యాంగ విచ్ఛిన్నమంటూ రభస ఏపీ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించాక కొద్ది రోజులు మౌనం పాటించిన జస్టిస్ రాకేష్ కుమార్ ఆ తరువాత నిత్యం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. చిన్న చిన్న కేసుల్లో కూడా ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ హెబియస్ కార్పస్‌పై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛినం జరిగిందంటూ విచారణ చేపట్టారు. పలు సందర్భాల్లో డీజీపీని ఆక్షేపించారు. రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై తీర్పు రాసే అవకాశం కనిపించకపోవడంతో ముఖ్యమంత్రి జగన్‌ను లక్ష్యంగా చేసుకునేందుకు మిషన్ బిల్డ్ కేసును ఎంచుకున్నారు. బహుమానంగా ఎన్సీఎల్ఏటీ పదవి.. పదవీ విరమణ అనంతరం జస్టిస్ రాకేష్ కుమార్‌కు జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) జుడీషియల్ సభ్యుడిగా అవకాశం దక్కింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకే ఎన్సీఎల్ఏటీ పదవి దక్కిందన్నది న్యాయవ్యవస్థలో అందరికీ తెలిసిన విషయమే. ఎన్సీఎల్టీలో కూడా ఆయన వివాదాస్పదంగా వ్యవహరించారు. ఏకంగా సుప్రీంకోర్టు ఆదేశాలనే ఉల్లంఘించారు. తనకు కావాల్సిన విషయం విచారణ చేపట్టారు. ఫినోలెక్స్ కేబుల్ వార్షిక సర్వసభ్య సమావేశం ఫలితాల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారు. దీంతో సుప్రీంకోర్టు ఆయనపై కన్నెర్ర చేసి కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాకేష్ కుమార్ తీరు వల్ల ఎన్సీఎల్ఏటీ కుళ్లిపోయిందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. దీంతో జస్టిస్ రాకేష్ కుమార్ బాగోతం దేశమంతా తెలిసిపోవడంతో గత్యంతరం లేక ఎన్సీఎల్ఏటీ జుడీషియల్ సభ్యుడి పదవికి రాజీనామా చేశారు. -
వివాహానికై వచ్చి ఆర్మీ జవాన్ తీవ్ర నిర్ణయం! అసలు కారణాలేంటి?
నిర్మల్: ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్‌లో చోటుచేసుకుంది. దీంతో కాలనీలో విషాదం నెలకొంది. పట్టణ ఎస్సై రాజేశ్వర్‌గౌడ్ వివరాల ప్రకారం.. స్థానిక వెంకటాపూర్ కాలనీకి చెందిన గడ్ చందా రమేష్ (28) ఆర్మీ జవాన్. కోల్కత్తా బార్డర్లో విధులు నిర్వహిస్తున్నాడు. డిసెంబర్ 15న తన బామ్మర్ది వివాహం నాగంపేట్ ముప్కల్ మండలంలో ఉండడంతో వచ్చాడు. వేడుకలు ముగించుకొని ఆదివారం ఉదయం తన ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ప్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతసేపటికి బయటకి రాకపోవడంతో ఇంట్లో వారు చూసేసరికి ప్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అక్కడికి చేరుకున్న చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రమేష్ తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: రెండు కార్లు ఢీ.. రెండు కుటుంబాల్లో ఐదుగురు మృతి -
పాపం.. తెలుగు బీజేపీ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కుంగి, కృశించిపోతున్న టీడీపీని బతికించడానికి ‘తెలుగు బీజేపీ’ నేతలు దింపుడు కల్లం ఆశతో పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి టీడీపీకి రాజకీయ ప్రయోజనం కలిగించేలా రోజుకో కొత్త ఎత్తుతో రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రజల్లో ఏమాత్రం ప్రభావం చూపించకపోవడంతో తాజాగా మరో బీజేపీ నేత సీఎం రమేశ్ రంగంలోకి దిగారు. పోలీసులపై దాడికి పాల్పడ్డ కేసులో న్యాయస్థానం ఆదేశాలతో కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బీటెక్ రవిని మంగళవారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీటెక్ రవిని అంతమొందించేందుకే పోలీసులు తీవ్రంగా కొట్టారని చెప్పారు. ‘బతికుంటే కదా పులివెందులలో పోటీ చేసేది’ అని హెచ్చరించారని ఆరోపించడం విడ్డూరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం ద్వారా టీడీపీకి రాజకీయ ప్రయోజనం కల్పించాలన్న ఆతృత తప్ప ఆయన ఆరోపణల్లో ఎలాంటి పస లేదన్నది స్పష్టమవుతోంది. పోలీసులపై దాడి చేస్తే అరెస్ట్ చేయరా? పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పోరుమామిళ్ల రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) పోలీసులపై దాడి చేయడంతో ఆయన్ను వైఎస్సార్ జిల్లా పోలీసులు ఈ నెల 14న అరెస్ట్ చేశారు. విమానాశ్రయం వద్ద ఓ కానిస్టేబుల్‌పై దాడి చేసినప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల నుంచి కడపకు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేసి, యోగి వేమన విశ్వవిద్యాలయం సమీపంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే టీడీపీ అనుకూల మీడియా దాన్ని రాద్ధాంతం చేసింది. బీటెక్ రవిని పోలీసులు కిడ్నాప్ చేశారంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది. దీనికి వత్తాసు పలుకుతూ సీఎం రమేశ్ మరింతగా వక్రీకరించేందుకు యత్నించారు. పోలీసులు బీటెక్ రవిని కిడ్నాప్ చేశారని, ఏకంగా హత్య చేసేందుకు యత్నించారని ఆరోపించడం విడ్డూరంగా ఉంది. బీటెక్ రవిని అరెస్ట్ చేసిన రెండు గంటల్లోనే పోలీసులు ఆయన్ను కడప ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఆ సమయంలో పోలీసులు తనను కొట్టారని ఆయన మేజిస్ట్రేట్‌కు చెప్పలేదు. గాయాలను చూపించలేదు. ‘పులివెందులలో పోటీ చేయాలంటే ముందు బతికి ఉండాలి కదా’ అని తనను బెదిరించినట్టూ చెప్ప లేదు. చెప్పి ఉంటే మేజిస్ట్రేట్ ఆయన ఆరోపణలను రికార్డ్ చేసేవారు. కానీ బీటెక్ రవి అలా చెప్పలేదు. ఎందుకంటే పోలీసులు ఆయన్ను కొట్ట లేదు.. బెదిరించ లేదు.. హత్యాయత్నం చేయ లేదు. అరెస్ట్ చేశాక కడప రిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన శరీరంపై గాయాలు ఉన్నట్టు వైద్య నివేదికలో లేనే లేదు. అయితే బీటెక్ రవిని పోలీసులు కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టారని. ఏకంగా హత్య చేసేందుకు యత్నించారని.. టీవీ చానళ్లలో స్క్రోలింగులు రావడంతో విడిచి పెట్టారని సీఎం రమేశ్ చెప్పడం విడ్డూరంగా ఉంది. పోలీసులపై దాడి చేసినా కూడా బీటెక్ రవిని అరెస్ట్ చేయకూడదని రమేశ్ వత్తాసు పలుకుతుండటం విస్తుగొలుపుతోంది. చంద్రబాబు కనుసైగ మేరకే.. సీఎం రమేశ్ ఉండేది బీజేపీలో.. పని చేసేది మాత్రం చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం అన్నది బహిరంగ రహస్యం. వైఎస్సార్ జిల్లా టీడీపీకి ఆయనే పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో జిల్లా టీడీపీ నేతల పాత్ర నామమాత్రం. పెత్తనం అంతా సీఎం రమేశ్‌దే. కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ నేత బీటెక్ రవిని పరామర్శించడమే ఇందుకు నిదర్శనం. టీడీపీ ప్రభుత్వ హయాంలో వీరిద్దరి జోడి చేయని అక్రమాలు లేవు. సీఎం రమేశ్ అండదండలతోనే బీటెక్ రవి యథేచ్ఛగా దందాలు, దౌర్జన్యాలకు పాల్పడేవారు. వీరిద్దరికీ చంద్రబాబు ఆశీస్సులు పుష్కలం. అందువల్లే బీటెక్ రవిని సీఎం రమేశ్ పరామర్శించడం.. అనంతరం రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదంతా చంద్రబాబు పన్నాగంలో భాగమే. పులివెందుల, వైఎస్సార్ జిల్లా ప్రజలకు సీఎం రమేశ్, బీటెక్ రవి అక్రమాలు, దౌర్జన్యాల గురించి పూర్తి అవగాహన ఉంది. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలకు త్వరలోనే గుణపాఠం చెబుతామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. -
భీమదేవరపల్లి బ్రాంచి దర్శకుడి ‘లగ్గం’
‘భీమదేవరపల్లి బ్రాంచి’మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు రమేశ్ చెప్పాల. తెలంగాణ కల్చర్‌తో పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం.. థియేటర్స్‌లో సరిగా ఆడకపోయినా.. ఓటీటీలో మాత్రం మంచి విజయం సాధించింది. అమెజాన్ ఫ్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం..ఇప్పటికే 200 మిలియన్స్‌కి పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్ర దర్శకుడు కొత్త సినిమాను ప్రకటించాడు. లగ్గం అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ చిత్రంలో ప్రముఖ హీరో, హీరోయిన్ తో పాటు అనేక మంది మంచి టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. జనవరి 16 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఫ్యామిలీ ఎంటర్టైన్ సబ్జెక్ట్ గా రాబోతున్న ఈ సినిమాలో వినోదంతో పాటు ఎమోషన్స్, పెళ్లి కల్చర్ ఉంటుందట. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ మూవీని గ్రాండ్ గా నిర్మించనుంది. పూర్తి వివరాలు త్వరలోనే తెలియస్తామని దర్శకుడు తెలిపారు. -
రెయిన్బో చిల్డ్రన్స్ లాభం రూ. 63 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ (ఆర్‌సీఎంఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సుమారు రూ. 63 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ2లో ఇది రూ. 61 కోట్లు. ఆదాయం రూ. 313 కోట్ల నుంచి రూ. 333 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కోవిడ్ అనంతరం అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, దానితో పోలిస్తే ప్రస్తుత క్యూ2లో కంపెనీ పటిష్టమైన పనితీరే కనపర్చిందని ఆర్‌సీఎంఎల్ సీఎండీ రమేష్ కంచర్ల తెలిపారు. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్‌లో కొత్తగా ప్రారంభించిన శాఖ.. అంచనాలకు అనుగుణంగానే రాణిస్తోందని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మిగతా అయిదు నెలల్లో మూడు కొత్త ఆస్పత్రులను నెలకొల్పడంతో పాటు ప్రస్తుత ఆస్పత్రిలో అదనంగా మరో బ్లాకును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కంపెనీ చేతిలో నగదు, తత్సమాన నిల్వలు రూ. 472 కోట్ల మేర ఉన్నట్లు, ఆ నిధులను పెట్టుబడి ప్రణాళిక కోసం వెచి్చంచనున్నట్లు సంస్థ తెలిపింది. క్యూ2లో పెట్టుబడి వ్యయాల కింద రూ. 55 కోట్లు వెచి్చంచనున్నట్లు పేర్కొంది. రెండో త్రైమాసికం ఆఖరు నాటికి సంస్థ పడకల సంఖ్య 1,555 నుంచి 1,655కి పెరిగింది. -
తళుకుమను తార...
‘బాహుబలి’ ప్రభాకర్ లీడ్ రోల్లో పాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌద్ర రూపాయ నమః’. రావుల రమేష్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ప్రోడక్షన్ జరుపుకుంటోంది. జాన్ భూషణ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘తళుకు తళుకుమను తార.. కులుకులొలుకు సితార...’ అంటూ సాగే సెకండ్ లిరికల్ వీడియో సాంగ్‌ని నటుడు సాయి కుమార్ రిలీజ్ చేశారు. ఈ పాటను సురేష్ గంగుల రచించారు. ‘‘రౌద్ర రూపాయ నమః’’ చాలా పవర్ఫుల్ టైటిల్. ఈ సినిమా విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు రావాలి’’ అన్నారు సాయికుమార్ అన్నారు. ‘‘మా సినిమాని ప్రేక్షకులు హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రావుల రమేష్. ‘‘ప్రభాకర్‌గారి నటన మా చిత్రానికి ఆయువుపట్టు’’ అన్నారు పాలిక్. ఈ కార్యక్రమంలో నటుడు రఘు, రచయిత తోటపల్లి సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మూవీకి కెమెరా: గిరి–వెంకట్. -
మహిళా రేషన్ డీలర్ హత్య! వివాహేతర సంబంధమే కారణమా?
కరీంనగర్: మంథనిలోని హనుమాన్‌నగర్‌లో మహిళా రేషన్ డీలర్ హత్య కలకలం రేపింది. మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బందెల రాజమణి(37) ఈ నెల 9న రాత్రి హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. బుధవారం ఆటో డ్రైవర్ పైడాకుల సంతోష్ ఇంట్లో మృతదేహాన్ని గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. ముత్తారం మండలానికి చెందిన రాజమణికి లక్ష్మీపూర్‌కు చెందిన బందెల రమేశ్‌కు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. రమేశ్ నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. రాజమణి గ్రామంలో రేషన్ డీలర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. రేషన్ సరుకులు తెచ్చే సందర్భంలో ఆటో డైవర్ సంతోష్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సంతోష్ తరచూ ఇంటికి వచ్చివెళ్లేవాడు. కొంతకాలంగా అతడితో విభేదాలు రావడంతో ఇంటికి రావడం లేదు. ఈక్రమంలో సోమవారం సాయంత్రం సరుకుల కోసం వెళ్తున్నానని రాజమణి ఇంట్లో పిల్లలకు చెప్పి బయలుదేరింది. ఆ రోజు తన చిన్న కూతురుతో ఫోన్లో మాట్లాడింది. కానీ ఇంటికి తిరిగి రాలేదు. తర్వాత పిల్లలు ఫోన్ చేయగా స్పందించలేదు. ఆమె ఆచూకీ కోసం వెతుకుతుండగా మంగళవారం రాత్రి మంథనిలోని ఎరుకల గూడెంలో పైడాకుల సంతోష్ అద్దెకు ఉంటున్న ఇంట్లో మృతిచెంది ఉంది. ఆమె నుదుటిపై, గొంతుపై బలమైన గాయాలున్నాయి. రాజమణిని సంతోష్ వేధించడంతో అతడ్ని తిరస్కరించినందుకు కోపంతో పదునైన ఆయుధంతో హత్య చేసినట్లు మృతురాలి బంధువులు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతురాలి సోదరుడు కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రొమ్ము తొలగించకుండానే..కేన్సర్ కొమ్ము వంచేలా..
సాక్షి, హైదరాబాద్: రొమ్ము కేన్సర్ వచ్చిన మహిళా రోగులకు రొమ్ము తొలగించకుండా నిర్వహించే ‘ఆంకోప్లాస్టీ’ చికిత్స పద్ధతికి ప్రభుత్వ ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి శ్రీకారం చుట్టింది. ఢిల్లీ ఎయిమ్స్, ముంబైలోని టాటా కేన్సర్ ఆస్పత్రి, పుణే, కోల్‌కతాలతో పాటు హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ఆస్పత్రిలోనే ఈ అధునాతన ఆంకోప్లాస్టీ పద్ధతిలో రొమ్ము కేన్సర్‌కు చికిత్స చేస్తున్నారు. ఎంఎన్‌జేలోని సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మాటూరి రమేష్ నేతృత్వంలోని వైద్యబృందం ఈ అధునాతన చికిత్స నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 50 మంది మహిళలకు ఆంకోప్లాస్టీ పద్ధతిలో చికిత్స చేశారు. పెరుగుతున్న రొమ్ము కేన్సర్ కేసులు రొమ్ము కేన్సర్లలో 70–80 శాతం మంది వ్యాధి ముదిరిన తర్వాతే మేలుకొంటున్నారు. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి వచ్చే రోగుల్లో ఇలాంటి వారే ఎక్కువగా ఉంటున్నారు. మహిళా కేన్సర్ కేసుల్లో 15 శాతం వరకు రొమ్ము కేన్సర్వే ఉంటున్నాయి. అందులో 80 శాతం చాలా అడ్వాన్స్ స్టేజీలో చికిత్సకు వస్తున్నారు. అక్టోబరు నెలను బ్రెస్ట్ కేన్సర్ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. రొమ్ము కేన్సర్లకు చికిత్సపరంగా కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ ఉంటాయి. వ్యాధి రొమ్ము వరకు ఉంటేనే సర్జరీ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉండి ఫోర్త్ స్టేజ్‌కు వస్తే నయం చేయలేం. 35 ఏళ్లు దాటిన ప్రతి మహిళ కేన్సర్ స్క్రీనింగ్ టెస్టు చేయించుకోవాలి. ఎంత ముందుగా గుర్తించగలిగితే నయం చేయడానికి అంత ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆంకోప్లాస్టీ చికిత్స ఇలా.. సాధారణంగా రొమ్ము కేన్సర్‌కు చికిత్సలో మహిళ రొమ్ము మొత్తం తీసేస్తారు. దీనివల్ల వారు మానసికంగా ఆందోళనకు గురవుతారు. అయితే పూర్తిగా రొమ్ము తీసే పద్ధతికి ఎంఎన్‌జే ఆస్పత్రి వైద్యులు చెక్ పెట్టారు. ఆంకోప్లాస్టీ పద్ధతిలో రొమ్ము తొలగించకుండానే సాధారణంగా ఉండేలా చేస్తున్నారు. ఎవరైనా మహిళకు రొమ్ము కేన్సర్‌ను గుర్తించినప్పుడు లేదా ఒకవేళ అది సైజు పెద్దగా ఉంటే కీమోథెరపీ ఇచ్చి గడ్డగా చిన్నగా చేస్తారు. గడ్డ వరకే ఆపరేషన్ చేసినప్పుడు మిగిలిన రొమ్ముపై గుంటలాగా ఉంటుంది. దాన్ని ఆంకోప్లాస్టీ ద్వారా దాన్ని సాధారణ స్థితికి తీసుకొస్తారు. ప్లాస్టిక్ సర్జరీ టెక్నిక్‌ను వాడుకొని ఏడాదిన్నరగా ఈ ఆంకోప్లాస్టీ చేస్తున్నారు. ఆంకోప్లాస్టీ సర్జరీ చేయడానికి నాలుౖగెదు గంటలు పడుతుంది. రొమ్ము పక్కన చంక సమీపంలోని కండను అంతర్గతంగానే ప్రత్యేక పద్ధతిలో తీసుకొచ్చి రొమ్ములో సర్దుబాటు చేస్తారు. అంటే చంకలో ఉండే అదనపు కొవ్వు, కండ, అవసరమైతే చర్మం కూడా తీసుకొని రొమ్ములో ఎక్కడ అవసరం పడుతుందో అక్కడకు తీసుకొచ్చి కుడతారు. పైకి ఎలాంటి కోత కనిపించకుండా ఆంకోప్లాస్టీ పద్ధతిలో చేస్తారు. ఎంఎన్జేలో ఇది పూర్తిగా ఉచితం. అదే కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆంకోప్లాస్టీ సర్జరీకి ఏకంగా రూ.5 లక్షల వరకు ఉంటుంది. మూడువారాల్లో సాధారణ స్థితిలోకి.. ఆంకోప్లాస్టీ విధానంపై మేం ప్రత్యేకంగా శిక్షణ పొందాం.ఆంకోప్లాస్టీ సర్జరీ చేశాక మూడునాలుగు రోజుల్లో ఆస్పత్రి నుంచి రోగిని డిశ్చార్జి చేస్తాం. ఈ చికిత్సలో కుట్లు వాటంతట అవే కరిగిపోయేలా ఉంటాయి. కాబట్టి కుట్లు తీయాల్సిన పనిలేదు. మూడువారాల్లో రోగి సాధారణ జీవితం గడపొచ్చు. నొప్పులేమీ ఉండవు. ఇంటికి వెళ్లేప్పుడు డోలో వంటి మాత్రలు మాత్రమే ఇచ్చి పంపిస్తాం. – డాక్టర్ మాటూరి రమేష్,సర్జికల్ ఆంకాలజిస్ట్, ఎంఎన్‌జే, హైదరాబాద్ రొమ్ము కేన్సర్‌లో ఆంకోప్లాస్టీ ప్రాచుర్యం పొందింది ఈ నెల 13వ తేదీన ప్రత్యేకంగా రొమ్ము కేన్సర్‌పై అవగాహనకు వాక్ నిర్వహిస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఆంకోప్లాస్టీ విధానం ప్రపంచంలో ప్రాచుర్యం పొందుతుంది. ఇండియాలో కొన్నిచోట్ల మాత్రమే ఈ చికిత్స చేస్తున్నారు. అందులో హైదరాబాద్‌లో ఎంఎన్జేలో చేస్తున్నాం. – డాక్టర్ జయలత, డైరెక్టర్,ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి -
ప్రమాదమా.. హత్యా? అసలేం జరిగింది..? అల్లుడిపై అనుమానం!
వరంగల్: ఓ వ్యక్తి తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాడు. అనంతరం ద్విచక్రవాహనంపై రాత్రి ఇంటికి ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో బయలుదేరిన గంటలోనే ద్విచక్రవాహనం నీటి గుంతలో పడింది. ఈ ప్రమాదంలో భార్య, కుమారుడు మృతి చెందగా భర్త క్షేమంగా బయటపడ్డారు. కాగా, ఈ ఘటనలో అల్లుడికి (మృతురాలి భర్త) ఎలాంటి గాయాలు కాకపోవడంతో పాటు రాత్రి సమయంలో ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకురావడంపై మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వరంగల్ శంభునిపేటకు చెందిన పస్తరి సమ్మక్క, రాజేందర్ దంపతుల పెద్ద కూతురు రాజేశ్వరి(21)ని మూడున్నర సంవత్సరాల క్రితం నడికూడ మండలం నర్సక్కపల్లికి చెందిన తూర్పాటి రమేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. దంపతులు ఆరు నెలల వరకు అన్యోన్యంగా ఉన్నారు. అనంతరం మనస్పర్థలు ప్రారంభమయ్యాయి. రమేష్‌కు మరో యువతితో పరిచయం కావడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు సాయి ఇషాన్ ఉన్నాడు. ఈ క్రమంలో రాజేశ్వరి మళ్లీ గర్భం దాల్చడంతో శుక్రవారం వరంగల్‌లోని సీకేఎం ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాడు. అనంతరం రాత్రి వేళలో ఇంటికి బయలుదేరుతుండగా వద్దని మృతురాలి అక్కాచెల్లెలు ఎంత వారించినా పట్టించుకోలేదు. ద్విచ్రవాహనంపై భార్య, కుమారుడిని తీసుకుని బయలుదేరాడు. ఈ క్రమంలో రాత్రి 9 గంటలకు ద్విచక్రవాహనం పరకాల మండలం వెల్లంపల్లి క్రాస్ సమీపంలోని నేతాని కుంటలో పడింది. ఈ ఘటనలో భార్య రాజేశ్వరి, కుమారుడు ఇషాన్ మృతి చెందగా రమేష్ క్షేమంగా బయటపడ్డాడు. రాత్రి కుమారుడు, ఉదయం తల్లి మృతదేహాలు లభ్యం! నీటి గుంతలో పడగానే రమేష్ ఫోన్ చేసి ఇరు కుటుంబాలకు సమాచారం అందించాడు. వారు హుటాహుటినా ఘటనా స్థలికి చేరుకుగానే రాజేశ్వరి దొరకడం లేదని.. సాయి ఇషాన్ మృతదేహాంతో విలపిస్తూ కనిపించాడు. సమాచారం అందుకున్న పరకాల పోలీసులు రాత్రి నుంచి అగ్నిమాపక సిబ్బంది సాయంతో గాలింపు చేపట్టగా శనివారం ఉదయం 10 గంటలకు రాజేశ్వరి మృతదేహాం లభ్యమైంది. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పరకాలకు తరలించారు. కాగా, తన కుమార్తె, మనువడి మృతికి అల్లుడే కారణమంటూ మృతురాలి తల్లి సమ్మక్క పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోలీసుస్టేషన్ వద్ద ఉద్రిక్తత..! ద్విచక్రవాహనం నీటి గుంతలో పడి తల్లి, కుమారుడు మృతి చెందాడని తెలుసుకున్న రాజేశ్వరి బంధువులు ఆమె భర్తపై అనుమానం వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో పరకాల పోలీసుస్టేషన్ వద్దకు చేరుకున్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుస్టేషన్లో రమేష్ ఆత్మహత్యాయత్నం.. ఘటనపై మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో తనపై అనవసరపు నిందలు వేస్తున్నారంటూ పోలీసు స్టేషన్లోనే రమేష్ బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. -
బాబు కనుసన్నల్లోనే ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్పు
సాక్షి, అమరావతి : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్లో మార్పులు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయని సీఐడీ హైకోర్టుకు తెలిపింది. అలైన్మెంట్ ఎలా ఉండాలో ముందే ఓ నిర్ణయానికి వచ్చి, దానికి అనుగుణంగా ప్రాజెక్టు పనులు దక్కించుకున్న సంస్థ చేత అలైన్‌మెంట్‌ను తయారు చేయించారని వివరించారు. ఈ మార్పుల ద్వారా వ్యాపారవేత్త లింగమనేని రమేశ్‌కు చంద్రబాబు లబ్ధి చేకూర్చారని చెప్పింది. అందుకు ప్రతిఫలంగా రమేష్ కృష్ణానది కరకట్ట సమీపంలో ఉన్న తన ఇంటిని చంద్రబాబుకు ఇచ్చారని తెలిపింది. ఇది క్విడ్ ప్రోకోయేనని వెల్లడించింది. ఇప్పటికే స్కిల్ కుంభకోణం కేసులో అరెస్టయి రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు.. ఐఆర్ఆర్ ముసుగులో జరిగిన భూ దోపిడీ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. అలైన్మెంట్ మార్పు వల్ల రమేశ్ భూములను కాపాడటమే కాక, వాటి విలువ ఎంతో పెరిగేలా చేశారని ఆయన వివరించారు. రమేశ్ బ్యాంకు ఖాతాల్లో పెద్ద ఎత్తున డబ్బు కూడా జమ చేశారని, అందుకు లెక్కలు కూడా చూపలేదన్నారు. దానిని ఇంటి అద్దెగా చంద్రబాబు తదితరులు చెబుతున్నారని తెలిపారు. రెండేళ్ల తరువాత అద్దె చెల్లించడంలో అంతరార్థం ఏమిటో తెలుసుకోవాల్సి ఉందని అన్నారు. ఇందుకోసం చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు అమలు వెనుక అవినీతి జరిగింది కాబట్టే అవినీతి నిరోధక చట్టం కింద కూడా చంద్రబాబుపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ ప్రాజెక్టును నామినేషన్ పద్ధతిలో అప్పగించడాన్ని అప్పటి సీఆర్డీఏ అధికారులు వ్యతిరేకించారని, వాటిని పట్టించుకోకుండా చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దురుద్దేశంతో అర్హత నిబంధనలు కుదించేశారన్నారు. అలైన్మెంట్ పరిధిలోకి కావాల్సిన వారి భూములు రాకుండా జాగ్రత్త పడ్డారని తెలిపారు. మాస్టర్ ప్లాన్‌ను సైతం అలాగే రూపొందించారని వివరించారు. ప్రాజెక్టు రూపకల్పన, అమలు, దాని వెనుక ఉన్న ఉద్దేశాలను చూడాలని కోర్టును కోరారు. ఈ ప్రాజెక్టు వెనుక క్విడ్ ప్రో కో ఉందన్నారు. ఐఆర్ఆర్ పేరుతో ఆస్తులు అమ్ముకుని, డబ్బు గడించారని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్టయి రిమాండ్‌లో ఉన్న నేపథ్యంలో ఈ కేసులో కూడా ఆయన అరెస్ట్ అయినట్లు భావించడానికి వీల్లేదన్నారు. అలా భావిస్తే దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలుగుతుందని చెప్పారు. అందువల్ల ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. లింగమనేనికి చెల్లించిన అద్దెపై సీఐడీకి అనుమానాలుంటే చంద్రబాబుకు నోటీసులు జారీ చేసి వివరణ కోరితే పూర్తి వివరాలు సమర్పించే వారిమని అన్నారు. ఇంత చిన్న దానికి కస్టోడియల్ విచారణ అవసరం ఏముందన్నారు. తాము చెల్లించిన డబ్బుకు రమేశ్ లెక్కలు చూపకుంటే అది చంద్రబాబు తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఈ కేసులో సీఐడీ వాస్తవాలను కప్పిపుచ్చుతోందన్నారు. సీఐడీ దర్యాప్తు మొత్తం పక్షపాతంతో సాగుతోందన్నారు. కోర్టు సమయం ముగియడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను అక్టోబర్ 3కి వాయిదా వేశారు. -
సుర సుర సుర అసుర!
‘బాహుబలి’ ఫేమ్ ప్రభాకర్ ప్రధాన పాత్రలో పాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌద్ర రూపాయ నమః’. రావుల రమేష్ నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ని,చిత్రంలోని మొదటి లిరికల్ (సుర సుర సుర అసురసురసుర...) వీడియోను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసి, ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘మా సినిమాని త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు రావుల రమేష్. ‘‘మా చిత్రానికి జాన్ భూషణ్ సంగీతం, సురేష్ గంగుల సాహిత్యం బాగా కుదిరాయి’’ అని పాలిక్ అన్నారు. -
Rajampeta : పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్న ప్రవాసాంధ్రుడు
కడప: దృష్టి.. జీవన ప్రయాణంలో అత్యంత కీలకం. కళ్లు సరిగా ఉంటే.. ఏ పనయినా చేసుకోవచ్చు. కానీ కొందరు కళ్లను సరిగా పట్టించుకోకపోవడం వల్ల అది దృష్టి లోపానికి దారి తీస్తోంది. సరైన ఆహారం తీసుకోకపోవడం, పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల కంట్లో శుక్లాలకు దారి తీస్తుంది. ఇలాంటి అభాగ్యులకు అండగా నిలిచారు అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రుడు వల్లూరు రమేష్ రెడ్డి.ఆకేపాడు గ్రామంలోని అమర్నాథరెడ్డి నివాసంలో చెన్నై శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 12 రోజులపాటు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం రవాణా సదుపాయంతో పాటు ఉండేందుకు వసతి కల్పించారు. ఈ శిబిరం ద్వారా ఏకంగా 238 మంది కంటి శస్త్రచికిత్సలు చేయించుకోవడం నిజంగా గొప్ప విషయం. శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరం ముగింపు సమావేశానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పేద బడుగు బలహీన వర్గాల వారికి అన్నివేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలనే ఉద్దేశంతో పట్టణాన్ని సైతం వదిలి స్వగ్రామంలోనే నివాసం ఉంటూ నిత్యం వివిధ రకాల సేవలను పేదలకు అందిస్తున్న జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి సేవా తత్పరుడని కడప మేయర్ సురేష్ బాబు తెలిపారు. అలాగే వైఎస్సార్సిపి అమెరికా కన్వీనర్ వల్లూరు రమేష్ రెడ్డి తల్లి తండ్రుల జ్ఞాపకార్థం 30 లక్షల రూపాయలు వెచ్చించి ఈ ఉచిత కంటి శిబిరం నిర్వహించి 238 మందికి కంటి చూపు తెప్పించడం చాలా అదృష్టమని అన్నారు. ఎక్కడో అమెరికాలో స్థిరపడి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ పుట్టిన గడ్డను మరవకుండా బడుగులకు సేవలు అందిస్తోన్న వల్లూరు రమేష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 12 రోజులు పాటు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 1032 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 238 మందిని ఆపరేషన్లు చేయించేందుకు నిర్ణయించారు. పూర్తిగా ఉచితంగా ఈ చికిత్స అందించడంతో పాటు అద్దాలు, మందులను కూడా పంపిణీ చేశారు. ఎప్పుడో ఓసారి ఎక్కడో ఓ చోట ఏవైనా కార్పొరేట్ ఆసుపత్రులు ఒక్కరోజు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటారని కానీ 12 రోజులు పాటు ఏకతాటిగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి సేవ చేయాలనే ఆలోచన చాలా గొప్పదని సురేష్‌బాబు కొనియాడారు. రమేష్ రెడ్డి చేసిన సేవకు ప్రతి ఒక్కరూ అభినందనలు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఈ ప్రాంతం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వారందరూ ఆకేపాటి అమర్నాథరెడ్డిని ఆదర్శంగా తీసుకొని వారి వారి స్వగ్రామాల్లో ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తే గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి చెందుతాయని చెప్పారు. పుట్టిపెరిగిన గడ్డ అమ్మకు సమానమని, ఆ మాతృభూమికి ఎంతో కొంత సేవ చేసే అవకాశం నిజంగా అదృష్టమన్నారు రమేష్ రెడ్డి వల్లూరు. వైఎస్సార్ కడప జిల్లా నుంచి మూడు దశాబ్దాల కింద అమెరికా వెళ్లిన రమేష్ రెడ్డి ప్రస్తుతం వాషింగ్టన్ డి.సి.లో స్థిరపడ్డారు. ఇటీవలే తన తల్లితండ్రుల స్మృతిలో భాగంగా శంకర నేత్రాలయ ద్వారా ఈ ఉచిత కంటి శిబిరానికి తన వంతుగా చేయూత నిచ్చారు. 👁️ Proud to share that I've made a my contribution to a health camp that provided free eye check-ups for 1000+ patients and free surgeries for 238 people. We’re making a difference in improving lives! 🙏 💪❤️ #HealthcareForAll #CommunityImpact #GivingBack #CMJagan #AndhraPradesh — Ramesh Valluru Reddy (@YSRDist_RameshR) September 7, 2023 ఈ శిబిరానికి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్యులు గజేందర్ కుమార్ వర్మ, డాక్టర్ సురభి, డాక్టర్ శంకర్ హాజరై శిబిరానికి వచ్చిన వారికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేశారు. వీరికి శంకర నేత్రాలయ నుంచి అరుల్ కుమార్, రంజిత్ సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చొప్ప ఎల్లారెడ్డి, వైసీపీ నాయకులు పోలి మురళి, దాసరి పెంచలయ్య, డీలర్ సుబ్బరామిరెడ్డి, మహర్షి, రమేష్ నాయుడు పాల్గొన్నారు. -
దివ్యాంగ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు
విజయవాడ స్పోర్ట్స్: దివ్యాంగ బాలిక(13)పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి మరణించే వరకు (జీ వి త ఖైదు) జైలు శిక్ష విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ ఎస్.రజిని మంగళవారం తీర్పు చెప్పారు. విజయవాడ సీవీఆర్ ఫ్లై ఓవర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు పిల్లలు లేకపోవడంతో తన అక్క కుమార్తెను దత్తత తీసుకుంది. ఆ బాలికను ఈ ఏడాది జనవరి 17వ తేదీన తా ను పని చేసే కంపెనీ వద్దకు ఆమె తీసుకువెళ్లింది. ఆమె పని చేస్తుండగా, కొద్దిసేపటి తర్వాత బాలిక కనిపించలేదు. కంపెనీ సెక్యూరిటీ సహాయంతో చుట్టుపక్కల వెదుకుతుండగా, సమీపంలోనే ఓ షాపు వెనుక ముళ్లపొదల వద్ద ఆ బాలికపై ఒక వ్యక్తి లైంగికదాడికి పాల్పడుతుండటంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో అఘాయిత్యానికి పాల్పడుతున్న వ్యక్తి పారిపోయాడు. బాలిక సైగల ద్వారా ఇచ్చిన సమాచారం మేరకు లైంగిక దాడికి పాల్పడి నది డ్రైవర్ రమేష్ అని గుర్తించి ఆమె కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కర్నూలు జిల్లా పాములపాడుకు చెందిన రమేష్ విజయవాడ వన్‌టౌన్ మిల్క్ ప్రాజెక్ట్ సమీపంలో నివాసం ఉంటూ బొలెరో వాహనం డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు పోలీ సు విచారణలో తేలింది. దిశా ఏసీపీ వీవీ నాయు డు ఈ కేసు విచారణ అధికారిగా వ్యవహరించారు. దిశా, సీఎంఎస్ అధికారుల సమక్షంలో 25 మంది సాక్షులను న్యాయమూర్తి విచారించారు. బాధితు రాలి తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుజ్జుల నాగిరెడ్డి వాదనలు వినిపించారు. విచారణలో నేరం రుజువు కావడంతో నిందితుడు రమేష్ కు మరణించే వరకు జైలు శిక్షతోపాటు రూ.30 వేలను జరిమానాగా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. నిందితుడు చెల్లించిన జరిమా నా రూ.30వేలు, మరో రూ. 50వేలను బాధితురాలికి నష్టపరిహారంగా చెల్లించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థను న్యాయ మూర్తి ఆదేశించారు. ఈ ఘటన జరిగిన ఎనిమిది నెలల్లోనే న్యాయస్థానం తీర్పు వెలువరించేలా ట్రయిల్ నిర్వహించిన పోలీసులను సీపీ టీకే రాణా అభినందించారు. -
నవ్వులే నవ్వులు
అభినవ్ మణికంఠ, గోల్డీ నిస్సీ, మ్యాడీ వీజే, పవన్ రమేష్, భరత్ రెడ్డి కీలక పాత్రల్లో అశోక్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మహానటులు’. ఏబీఆర్ ప్రొడక్షన్స్ అండ్ ఏబీఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై అనిల్ బోధిరెడ్డి, తిరుపతి ఆర్. యర్రంరెడ్డి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అశోక్ కుమార్ మాట్లాడుతూ– ‘‘నేను ఇప్పటి వరకూ కామెడీ జానర్ టచ్ చేయలేదు. ‘జాతిరత్నాలు’ సినిమా తరహాలో పూర్తి ఫన్, హిలేరియస్ ఎంటర్టైన్మెంట్తో తీసిన మూవీ ‘మహానటులు’. నలుగురు టీమ్‌గా మారి మహానటులు అనే యూట్యూబ్ చానల్‌ను ఎలా అభివృద్ధి చేశారు? అనేది ఈ చిత్ర కథ’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధం నరేష్, సంగీతం: మార్కస్ ఎం. -
మహిళలపై దాడి చేసినా పట్టించుకోరా?
ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ నడి బొడ్డున టవర్ సర్కిల్లో ఇద్దరు మహిళలపై నలుగురు హత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై పోలీసుల నిర్లక్ష్యం విమర్శలపాలవుతోంది. బాధితులు ఫిర్యాదుపై కనీసంగా పట్టించుకోకపోవడం, నలుగురు నిందితులను కనీసం విచారించకుండా వదిలేయడం వివాదాస్పదమవుతోంది. ఆర్మూర్ పట్టణంలోని నిజాంసాగర్ కెనాల్‌పై నివాసం ఉండే శివరాత్రి అరుణ, వింజ శోభ వరసకు అక్కా చెల్లెళ్లు. వీరిద్దరూ ఇళ్లలో కూలీ పనులు ముగించుకుని నడుచుకుంటూ తమ ఇళ్లకు వెళ్తుండగా వారి సామాజిక వర్గానికే చెందిన సంపంగి రమేష్, సంపంగి గణేశ్, సంపంగి బబ్లు, సంపంగి నాగమణి రాళ్లతో దాడి చేశారు. పాత కక్షల నేపథ్యంలో జరిగిన దాడిలో అరుణ తల పగిలి రక్తం కారడంతో తల్లి యాదమ్మ సహాయంతో ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తుకొని వెళ్లారు. వెంటనే పోలీసులు బాధిత మహిళలిద్దరినీ చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించి ఘటనా స్థలానికి వెళ్లి దాడికి పాల్పడిన నలుగురిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. కానీ ఆ తర్వాత వారిని వదిలి వేయడంపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని తిరిగి పోలీస్ స్టేషన్‌కు బాధిత మహిళలు వచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. గత రెండు రోజులుగా తిరుగుతున్నా పట్టించుకోకపోగా.. ఇదే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్సై ఏకంగా మీపైనే కేసు పెడతాం అంటూ తమనే బెదిరించారని బాధిత మహిళలు చెబుతున్నారు. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ప్రచారం చేస్తుండగా ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో మాత్రం నిరుపేద మహిళలపై దాడి చేసిన వారిని కేసులు పెట్టడానికి కూడా పోలీసులు మీనమేషాలు లెక్కించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆలస్యంగా ఎఫ్ఐఆర్ ఎందుకంటే: సురేష్ బాబు, ఎస్‌హెచ్‌వో, ఆర్మూర్ ’’ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఇతర కేసుల ఒత్తిడిలో ఇద్దరు మహిళలపై దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆలస్యం అయింది. దాడి చేసిన నలుగురిపై శుక్రవారం రాత్రి 324 సెక్షన్ కేసు నమోదు చేశాము. బాధిత మహిళలపై సైతం కౌంటర్ కేస్ ఫైల్ చేశాము.’ -
రెండో భార్య మోజులో పడి.. మొదటి భార్యను పొలం దగ్గరకి తీసుకెళ్లి..
మెదక్: రెండో భార్య మోజులో పడి మొదటి భార్యకు బలవంతంగా పురుగు మందు తాగించాడు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఆమె ఐదురోజుల పాటు ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ బుధవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి కథనం ప్రకారం.. మెదక్ మండలం తిమ్మక్కపల్లి తండాకు చెందిన కాట్రోత్ రమేశ్‌కు కౌడిపల్లి మండలం మహబూబ్‌నగర్ తండాకు చెందిన స్వరూపను (30) పదేళ్ల కిత్రం ఇచ్చి వివాహం చేశారు. వారికి ఒక బాబు జన్మించాడు. కాగా రమేశ్ ఇటీవల తిమ్మక్కపల్లి తండాకు చెందిన మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి మొదటి భార్య స్వరూపకు, రమేశ్‌కు తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఎలాగైనా మొదటి భార్యను చంపాలని పన్నాగం పన్నాడు. ఈనెల 6వ తేదీన సాయంత్రం పొలం వద్దకు వెళ్లి వద్దామని తీసుకెళ్లాడు. పథకం ప్రకారం ముందే పురుగు మందు డబ్బా తీసుకొచ్చి బలవంతంగా స్వరూపకు తాగించాడు. అపస్మారక స్థితికి చేరుకోగానే ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి పురుగు మందు తాగిందని చెప్పాడు. అనంతరం ఆమెను మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. రెండో భార్య మంజుల, అల్లుడు రమేశ్ వేధింపులకు గురి చేసి తన కూతురును పొట్టనపెట్టుకున్నారని మృతురాలి తల్లిదండ్రులు బోరున విలపించారు. గురువారం సాయంత్రం ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరికి 20 ఏళ్ల జైలు
సాక్షి, అమరావతి/ గుంటూరు లీగల్/నగరంపాలెం: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన రేపల్లె రైల్వేస్టేషన్లో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరు ముద్దాయిలకు 20 సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ.2,500 జరిమానా విధిస్తూ నాలుగో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఆర్.శరత్‌బాబు బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం మండలం, వెంకటాద్రిపురానికి చెందిన కొర్రపోలు రమేష్ వ్యవసాయ, తాపీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య ఏసమ్మ, ముగ్గురు పిల్లలు సంతానం కాగా, భార్య మళ్లీ గర్భంతో ఉంది. కృష్ణాజిల్లా నాగాయలంకలో కూలి పనులు చేసుకునేందుకు రమేష్ తన భార్య, పిల్లలతో 2022 ఏప్రిల్ 30న గుంటూరులో రైలు ఎక్కి రేపల్లె వెళ్లాడు. అప్పటికి సమయం 11.45 కావడంతో రైల్వేస్టేషన్లోనే తన భార్య, పిల్లలతో రమేష్ నిద్రకు ఉపక్రమించాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పాలుబోయిన విజ యకృష్ణ, పలుచూరి నిఖిల్, మరో మైనర్ బాలు డు మద్యం మత్తులో రైల్వేస్టేషన్‌లోకి వచ్చారు. అక్కడ భార్య,పిల్లలతో నిద్రిస్తున్న రమేష్‌ను నిఖిల్ నిద్రలేపి టైం అడిగాడు. టైం చెప్పకపోవడంతో రమేష్‌ను కొట్టడం ప్రారంభించాడు. దీంతో రమేష్ స్టేషన్ బయటకు పరుగెత్తాడు. అక్కడే ఉన్న రమేష్ భార్యపై విజయకృష్ణ లైంగికదాడికి పాల్పడ్డాడు. రమేష్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి పోలీసులను తీసుకొచ్చేసరికి నిందితులు పారిపోయారు. నిందితులు తన భార్యపై సామూహిక అత్యాచారం చేసినట్లు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రేపల్లె డీఎస్పీ టి.మురళీకృష్ణ, దిశ డీఎస్పీ యు.రవిచంద్ర దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పీపీ శారదమణి వాదించారు. ఈ కేసులో మూడో ముద్దాయి మైనర్ కావడంతో తెనాలి పోక్సో కోర్టులో విచారణ జరుగుతుంది. సత్ఫలితాలనిస్తున్న కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ అత్యాచార కేసుల్లో దోషులకు సత్వరం శిక్షలు విధించేలా పోలీసు శాఖ కోర్ట్ ట్రయల్ మానిటరింగ్ విధానాన్ని సమర్థంగా అమలు చేస్తున్నదని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్లో గతేడాది ఓ మహిళపై అత్యాచారం చేసిన కేసులో పాలుబోయిన విజయకృష్ణ, పాలుచురి నిఖిల్‌ను దోషులుగా గుర్తిస్తూ న్యాయస్థానం 20 ఏళ్లు జైలు శిక్ష విధించడం కేసు దర్యాప్తులో పోలీసుల సమర్థతకు నిదర్శనమన్నారు. కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ ద్వారా గతేడాది కాలంగా గుర్తించిన 122 కేసుల్లో 102 కేసుల్లో దోషులకు శిక్షలు పడ్డాయన్నారు. ముగ్గురికి మరణశిక్ష, 37మందికి జీవిత ఖైదు, 62 కేసుల్లో 7 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడిందన్నారు. ఈ తీర్పు ఓ గుణపాఠం.. రేపల్లె రైల్వేస్టేషన్లో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఇచ్చిన తీర్పు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఓ గుణపాఠమని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్ తెలిపారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని స్పందన హాల్లో బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బాధితురాలికి తక్షణ సాయంగా రూ.10 లక్షలు, ఎస్సి, ఎస్టి కేసు కింద రూ.8.50 లక్షలు, ఎంపీ, ఎమ్మెల్యే నుంచి రూ.1.50 లక్షలు అందజేసినట్లు చెప్పారు. కాగా, ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేసి, నిందితులకు శిక్షలు పడే వరకు ప్రతిభ కనబరిచిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శారదామణి, డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ మధుసూదనరావు, తదితర పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు, రివార్డులు అందజేశారు. -
'భోళా శంకర్'.. ఇక అంతా బోనస్!
‘‘షాడో’ సినిమా తర్వాత దర్శకుడిగా నాకు కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌లో నేను కొన్ని కథలు రెడీ చేసుకున్నాను. ఇక అన్నయ్య (చిరంజీవి) సినిమాల్లోకి కమ్‌బ్యాక్ ఇచ్చాక నా కమ్‌బ్యాక్ సినిమా ఆయనతో చేయాలనుకున్నాను. అందుకే షాడోలో వున్న నాపై మెగా లైట్ పడిందని ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్లో చెప్పాను’’ అన్నారు దర్శకుడు మెహర్ రమేష్. చిరంజీవి టైటిల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. చిరంజీవి సరసన తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో దర్శకుడు మెహర్ రమేష్ చెప్పిన విశేషాలు. ∙‘భోళా శంకర్’ సినిమాకు దర్శకుడిగా చేసి, అన్నయ్య ప్రశంసలు అందుకోవడాన్ని పెద్ద అచీవ్‌మెంట్‌లా భావిస్తున్నాను. ఇక దర్శకుడిగా నాకు లభించేది అంతా బోనస్‌గా ఫీలవుతాను. అన్నయ్య, నేను కజిన్స్. సో.. సెట్స్‌లో ఆయన నన్ను ఏరా అని చనువుగా పిలిచేవారు. ∙తరాలు మారినా అనుబంధాలు మారలేదు. ‘వేదాళం’ సినిమాలో అన్నాచెల్లెళ్ల అనుబంధం నాకు బాగా నచ్చింది. ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషనల్ సీన్స్ ఉన్న ఈ తరహా సబ్జెక్ట్‌ని నేనిప్పటివరకూ డీల్ చేయలేదు. తమిళ ‘వేదాళం’ సినిమా తెలుగు రీమేక్‌గా ‘భోళా శంకర్’ చేశాం. గతంలో నా దర్శకత్వంలో కొన్ని రీమేక్స్ వచ్చాయి. సాధారణంగా నేను రీమేక్ రిస్క్ అనుకోను. ఓ టాస్క్‌గా తీసుకుంటాను. వాటికి నా ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. ‘భోళా శంకర్’లో 60 నుంచి 70 శాతం మార్పులు చేశాం. పెద్ద సక్సెస్ అయిన సినిమాను కరెక్ట్‌గా తీయడంతో పాటు జనాలకు నచ్చేలా తీయాలి. ‘భోళా శంకర్’ని ప్రేక్షకులకు నచ్చేలా ప్రజెంట్ చేశాం. ∙ఈ చిత్రంలో చెల్లెలి పాత్రకు కీర్తీ సురేష్‌గారు ఒప్పుకుంటారని అనుకోలేదు. స్వప్న దత్ ద్వారా కీర్తీని అ్రపోచ్ అయ్యాను. కథ విని ఆమె ఈ సినిమా ఒప్పుకున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో రవితేజ పాత్ర ఆ సినిమాకు బిగ్ ఎస్సెట్. అలా ‘భోళా శంకర్’లో కీర్తీ సురేష్ రోల్ సినిమాకు పెద్ద ఎస్సెట్. మణిశర్మగారి కుమారుడు మహతి స్వరసాగర్ ఈ సినిమాకు మంచి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇక అనిల్ సుంకరగారు ఫ్యాషనేట్ అండ్ పాజిటివ్ ప్రోడ్యూసర్. నా తర్వాతి చిత్రాన్ని త్వరలో ప్రకటిస్తాను. -
మై వైఫ్ .. శివాని గురించి రమేశ్ చివరిమాటలు
సాక్షి, క్రైమ్: విశాఖలో వివాహేతర సంబంధంతో భర్త రమేశ్‌ను ప్రియుడితోపాటు హత్య చేసిన ఉదంతంలో సంచలన వీడియోలు బయటకు వచ్చాయి. భర్తను హత్యకు ముందు శివాని చేసిన పనికి పోలీసులు సైతం షాక్ తిన్నారు. రమేశ్‌కు మద్యం తాగించి.. ఆ సమయంలో తన గురించి పొగిడినదంతా ఆమె వీడియోలు తీయించుకుంది. కానిస్టేబుల్ రమేష్ హత్య కేసు లో కీలక వీడియోలు సాక్షి టివి చేతికి అందాయి. రమేశ్‌ని చంపే ముందూ.. తన మీద అనుమానం రాకుండా భర్తతో ప్రేమగా ఉన్నట్టు ఆమె వీడియోలు రికార్డు చేసింది. భర్తకి మటన్ వండి పెట్టీ.. మందు తాగించి.. ‘నా భార్య మంచిది’ అని రమేశ్‌తో చెప్పించింది శివాని. ఆపై మద్యం మత్తులో జోగుతున్న భర్తను మంచంపై పడుకోబెట్టినదంతా కూడా రికార్డు అయ్యింది. మా ఆవిడ చాలా తెలివైంది. గైడెన్స్ ఇస్తే ఏదైనా సాధిస్తుంది. నా వైఫ్.. మై లైఫ్. చాలా ధైర్యవంతురాలు. నేను ఉన్నంత వరకు ధైర్యం చూపిస్తుంది. నేను ఎప్పుడు ఉంటానో.. ఎప్పుడు పోతానో తెలియదు. నేను పోయాక కూడా అదే ధైర్యం చూపించాలి. నా వైఫ్ బెస్ట్ అంటూ మాట్లాడిన మాటలు అందులో ఉన్నాయి. భర్త హత్య తర్వాత గుండెపోటుతో చనిపోయాడని నాటకం ఆడే క్రమంలో.. తనపై ఎలాంటి అనుమానాలు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ పని చేసింది శివాని. ఆమె ఫోన్ నుంచి వీడియోలు సేకరించిన పోలీసులు.. నేరస్తురాలి తెలివితేటలు చూసి షాక్ తిన్నారు. 2009 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ బర్రి రమేష్(35). 2012లో శివాని(జ్యోతి)తో వివాహం జరిగింది. వీళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదర్శనగర్‌లో ఉంటూ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది. రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య శివాని(శివజ్యోతి) పోలీసులకు చెప్పింది. అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు సమయంలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించడంతో అసలు వాస్తవాలు బయటకొచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో సైతం అతను ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో కుట్రకోణం వెలుగుచూసింది. రామారావు అనే టాక్సీ డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమేష్ భార్య శివాని.. అతని మోజులో కట్టుకున్న భర్తను మట్టుబెట్టింది. రామా రావు విషయంలో గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. కాగా.. మంగళవారం రాత్రి ఆమె రమేష్‌తో బాగా మద్యం తాగించి.. దాన్ని వీడియో కూడా తీసింది. కొంతసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఆమె ప్రియుడు రామారావుకు సమాచారం ఇవ్వడంతో.. అతని స్నేహితుడు నీలాతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. ఆమె సమక్షంలోనే అతనిని వీరు హత్య చేశారు. నీలా రమేష్‌కి ఊపిరాడకుండా దిండుతో నొక్కిపట్టుకోగా.. రామారావు కదలకుండా అతని కాళ్లు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి ఊపిరాడక రమేష్ మృతి చెందాడు. ఇలా పక్కాగా రమేష్‌ను హతమార్చిన శివాని, అతని ప్రియుడు రామారావు దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే తొలుత మద్యం తాగి చనిపోయాడని శివాని పోలీసులకు చెప్పినట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను రాబట్టినట్లు తెలిపారు. శివానీని ఏ1గా, ప్రియుడు రామారావును ఏ2గా, వారికి సహకరించిన నీలాను ఏ3గా నిర్ధారించి కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ అఘాయిత్యంలో శివాని పెద్దమ్మ కూతురు పైడమ్మకు కూడా భాగం అయ్యిందనే అనుమానాలు ఉన్నాయి. పైడమ్మ వల్లే తనకు రామారావు పరిచయం అయ్యాడని శివాని పోలీసులకు చెప్పింది. అంతేకాదు.. కాన్ఫరెన్స్ కాల్స్‌లో మాట్లాడినట్లు నిర్థారించిన పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. అయితే తాను అమాయకురాలినని పైడమ్మ వాపోతోంది. -
వైజాగ్ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: కానిస్టేబుల్ రమేష్ మర్డర్ కేసులో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తెరపైకి కొత్త వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె ఎవరో కాదు శివాని పెద్దమ్మ కూతురు పైడమ్మ.. పోలీసుల విచారణలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పైడమ్మే.. రామారావుతో కలవడానికి కారణమని పోలీసులకు శివాని తెలిపింది. ఫోన్ కాల్ డేటా పరిశీలించిన ఎంవీపీ పోలీసులు.. వందల సార్లు కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు. పైడమ్మ, శివాని, రామారావు ముగ్గురం కలిసే బయటకు వెళ్లే వాళ్లమని శివాని చెప్పింది. పైడమ్మాను ఏ4గా చేర్చే అవకాశం ఉంది. తనకు అసలు సంబంధం లేదంటున్నా శివాని అక్క పైడమ్మా.. కావాలనే ఇరికిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. శివాని.. రామారావు ఒక ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి పరిచయం చేసిందని పైడమ్మా తెలిపింది. కాన్ఫరెన్స్ కాల్స్‌లో మాట్లాడినట్లు నిర్థారించిన పోలీసులు. పైడమ్మను విచారిస్తున్నారు. ఆమె ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంవీపీ పోలీసుల అదుపులోనే A1 భార్య శివాని, A2 ప్రియుడు రామారావు, A3 నీలా ఉన్నారు. వారిని రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. చదవండి: తహసీల్దార్ వేధింపులు... మహిళా ఉద్యోగి ఆత్మహత్య కాగా, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ రమేష్ మృతి విషయంలో తొలి నుంచి అనుమానిస్తున్నదే జరిగింది. శివజ్యోతి అలియాస్ శివానీయే ఆమె ప్రియుడితో కలిసి తన భర్త రమేష్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ శుక్రవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. 2009 బ్యాచ్‌కు చెందిన బర్రి రమేష్(35) ఆదర్శనగర్‌లో ఉంటూ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బెడ్‌పై విగతజీవిగా ఉన్న రమేష్ ను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య పోలీసులకు చెప్పింది. అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు సమయంలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించడంతో అసలు వాస్తవాలు బయటకొచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో సైతం అతను ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో కుట్రకోణం వెలుగుచూసింది. రామారావు అనే టాక్సీ డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమేష్ భార్య శివాని.. అతని మోజులో కట్టుకున్న భర్తను మట్టుబెట్టింది. రామా రావు విషయంలో గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. కాగా.. మంగళవారం రాత్రి ఆమె రమేష్‌తో బాగా మద్యం తాగించి.. దాన్ని వీడియో కూడా తీసింది. కొంతసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఆమె ప్రియుడు రామారావుకు సమాచారం ఇవ్వడంతో.. అతని స్నేహితుడు నీలాతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. ఆమె సమక్షంలోనే అతనిని వీరు హత్య చేశారు. నీలా రమేష్‌కి ఊపిరాడకుండా దిండుతో నొక్కిపట్టుకోగా.. రామారావు కదలకుండా అతని కాళ్లు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి ఊపిరాడక రమేష్ మృతి చెందాడు. ఇలా పక్కాగా రమేష్‌ను హతమార్చిన శివాని, అతని ప్రియుడు రామారావు దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే తొలుత మద్యం తాగి చనిపోయాడని శివాని పోలీసులకు చెప్పినట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను రాబట్టినట్లు తెలిపారు. శివానీని ఏ1గా, ప్రియుడు రామారావును ఏ2గా, వారికి సహకరించిన నీలాను ఏ3గా నిర్ధారించి కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. తొలి నుంచి శివానీది నేర స్వభావమే.. రమేష్ భార్య శివానీది తొలి నుంచి నేర స్వభావమే అని సీపీ తెలిపారు. తల్లిదండ్రులతో సైతం ఆమె పలుమార్లు గొడవ పడినట్లు చెప్పారు. ప్రియుడి విషయంలో భార్యను పలుమార్లు రమేష్ మందలించాడని వెల్లడించారు. ఆమె తీరు కారణంగా విసిగిపోయి ఒక దశలో ఇద్దరు కుమార్తెలను తన వద్ద వదిలేసి ప్రియుడితో వెళ్లిపొమ్మని కూడా ఆమెకు చెప్పాడన్నారు. అయితే పిల్లలు, ప్రియుడు ఇద్దరూ కావాలనే ఉద్దేశంతో శివాని రమేష్ హత్యకు కుట్ర పన్నింది. ఈ హత్యలో సహకారానికి శివానీ, ప్రియుడు రామారావు అతని స్నేహితుడు నీలాకు రూ.లక్ష సుపారి కూడా ఇచ్చినట్లు సీపీ వెల్లడించారు. -
భార్యాభర్తలకు పాముకాటు.. సొంత వాహనంలోనే..
కామారెడ్డి: రాజంపేట మండలంలోని శేర్శంకర్తండాకు చెందిన భార్యభర్తలు ముద్రిచ్చ రమేష్, నీలాలు బధవారం అర్ధరాత్రి పాముకాటుకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన భార్యభర్తలు వారి సొంత వాహనంలో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలివెళ్లారు. సమయానికి ఆస్పత్రికి చేరడంతో వైద్యులు వారికి మెరుగైన చికిత్స అందించి వారి ప్రాణాలను కాపాడారు. ప్రసుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు తండావాసులు పేర్కోన్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు.. రక్షించేందుకు సోదరుడి యత్నం.. ఆపై..
మెదక్: వరినాట్ల పనుల్లో నిమగ్నమైన అన్నదమ్ములపై దమ్ముయంత్రం (కెజివీల్స్ ట్రాక్టర్) మృత్యురూపంలో దూసుకొచ్చింది. దీంతో తమ్ముడు మృతి చెందగా.. అన్న తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా శివ్వంపేటలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎనగండ్ల నరేశ్, తమ్ముడు ఎనగండ్ల రమేశ్(35) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం వరినాట్లు వేసేందుకు దుక్కి సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. రమేశ్ వొరం చదును చేస్తున్న సమయంలో మూర్చవ్యాధితో బురదమడిలో పడికొట్టుకుంటున్నాడు. అక్కడే దమ్ము యంత్రం నడుపుతున్న నరేశ్ గమనించి తమ్ముడిని రక్షించేందుకు ట్రాక్టర్‌ను ఆఫ్ చేయకుండానే కిందికి దూకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. దీంతో ట్రాక్టర్ ఒక్కసారిగా రమేశ్ తలపై, నరేశ్ కాళ్లపై నుంచి వెళ్లడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న కూలీలు ఇద్దరిని తూప్రాన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా రమేశ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నరేశ్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం కొంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పేపర్లు పంపినందుకు రూ.16 లక్షలు!
సాక్షి, హైదరాబాద్:తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీతో పాటు హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన మాజీ ఏఈ పూల రమేశ్‌కు సహకరించిన ప్రైవేట్ కళాశాల చైర్మన్ సయ్యద్ మహబూబ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులకు చిక్కాడు. సయ్యద్ వాట్సాప్ ద్వారా అసి స్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) ప్రశ్న పత్రాలను రమేశ్‌కు ‘పంపినందుకు’రూ.16 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. రమేశ్ అరెస్టు తర్వాత పరా రీలో ఉన్న సయ్యద్ మహబూబ్‌ను బుధ వారం పట్టుకున్న అధికారులు.. అతడిని జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చంచల్‌గూడ జైలుకు తరలించారు. తదుపరి విచారణ కోసం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ సిట్ అధికారులు శుక్రవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అత్యాధునిక బ్లూటూత్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించి రమేశ్ ఏడుగురితో ఏఈఈ, డీఏఓ పరీక్షలు రాయించాడు. టోలిచౌకిలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీకి మహబూబ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 22, ఫిబ్రవరి 23న జరిగిన ఈ రెండు పరీక్షలకు సంబంధించిన సెంటర్ ఈ కాలేజీలోనే పడింది. ఈ నేపథ్యంలో రమేశ్‌తో రూ.16 లక్షలకు ఒప్పందం చేసుకున్న మహబూబ్.. పరీక్ష ప్రారంభమైన పది నిమిషాల్లోనే ప్రశ్నపత్రాలను తన సెల్ఫోన్లో ఫొటో తీసి, రమేశ్‌కు వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. ఆయా పరీక్షలకు గైర్హాజరైన వారి పేపర్లను దీనికి వినియోగించాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలను చాట్ జీపీటీ ద్వారా వెతికి, ఏడుగురు అభ్యర్థులకు అత్యాధునిక పరికరాల ద్వారా అందించే టీమ్‌కు రమేశ్ మలక్‌పేటలోని మహ్మద్ ఖాలేద్ ఇంట్లో షెల్టర్ ఏర్పాటు చేశాడు. దీని కోసం ఖాలేద్‌కు రూ.80 వేలు చెల్లించాడు. ఈ రెండు రోజులూ ఈ బృందం అక్కడ నుంచే జవాబులను అభ్యర్థులకు పంపింది. గత నెలలో రమేశ్ అరెస్టు అయిన నాటి నుంచి మహబూబ్‌తోపాటు ఖాలేద్, అభ్యర్థులు, వారికి సహకరించిన వారు పరారీలో ఉన్నారు. ఇప్పటివరకు సిట్ అధికారులు ముగ్గురు అభ్యర్థులతో పాటు ఈ నెల 9న ఖాలేద్‌ను, బుధవారం మహబూబ్‌ను పట్టుకున్నారు. మరో 35 మంది అభ్యర్థుల కోసం సిట్ అధికారులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ హైటెక్ మాస్ కాపీయింగ్, ఏఈ పేపర్ లీకేజ్ ద్వారా రమేశ్ రూ.10 కోట్లు ఆర్జించాలని భావించినట్లు తెలుస్తోంది. హైటెక్ కాపీయింగ్ ద్వారా లబ్ధిపొందిన ఒక్కో అభ్యర్థి రూ.40 లక్షలు, ఏఈ పేపర్ లీక్ ద్వారా లబ్ధిపొందిన ఒక్కొక్కరు రూ.20 లక్షలు చెల్లించేలా రమేశ్ ఒప్పందాలు చేసుకున్నాడని సమాచారం. అయితే ఇతడికి ఇప్పటివరకు రూ.1.1 కోటి మాత్రమే ముట్టినట్లు తేలింది. -
'మీటర్'కు అనుకున్నదానికంటే ఎక్కువే బడ్జెట్ అయ్యింది : డైరెక్టర్
‘మీటర్’ మంచి ఎంటర్టైనర్. తండ్రీ కొడుకుల మధ్య మంచి ఎమోషన్ ఉంటుంది. సినిమా అంతా ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది’’ అని డైరెక్టర్ రమేష్ కడూరి అన్నారు. కిరణ్ అబ్బవరం, అతుల్యా రవి జంటగా రూపొందిన చిత్రం ‘మీటర్’. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదలకానుంది. ఈ సందర్భంగా రమేష్ కడూరి మాట్లాడుతూ– ‘‘నాది విజయనగరం జిల్లా గరివిడి మండలం. దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేనిగార్ల వద్ద సహాయ దర్శకుడిగా చేశాను. ‘మీటర్’తో దర్శకుడిగా పరిచయమవుతున్నాను. కరోనా లాక్ డౌన్ తర్వాత ‘మీటర్’ ఓకే అయ్యింది. ఈ మూవీలో కిరణ్ వైవిధ్యమైన పోలీసాఫీసర్ పాత్ర చేశారు. సెకండాఫ్‌లో ఓ పది నిమిషాలు ఆయన పాత్ర సీరియస్‌గా ఉంటుంది. ఆ పది నిముషాలు థియేటర్లో రఫ్ఫాడిస్తాడు. ఈ సినిమాకి సాయి కార్తీక్ నెక్ట్స్ లెవల్ మ్యూజిక్ ఇచ్చాడు. అనుకున్నదానికంటే బడ్జెట్ ఎక్కువైనా వెనకడుగు వేయని చెర్రీ, రవిశంకర్, నవీన్‌గార్లకు రుణపడి ఉంటాను’’ అన్నారు. – రమేష్ కడూరి -
44 మందికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు
నాంపల్లి: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో విశేషమైన సేవలందించిన 44 మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2020వ సంవత్సరానికి కీర్తి పురస్కారాలను ప్రకటించింది. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన సాహితీ ప్రముఖులను పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేసింది. పురస్కారాల విజేతలు వీరే... డాక్టర్ సముద్రాల వెంకటరంగ రామానుజాచార్యులు(ఆధ్యాత్మిక సాహిత్యం), పుత్తా పుల్లారెడ్డి(ప్రాచీన సాహిత్యం), డాక్టర్ వి.వి.రామారావు (సృజనాత్మక సాహిత్యం), టి.వి. ప్రసాద్ (కాల్పనిక సాహిత్యం), వారాల ఆనంద్ (అనువాద సాహిత్యం), ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి(బాల సాహిత్యం), డాక్టర్ ఎ.వి.వీరభద్రాచారి(వచన కవిత), కొరుప్రోలు మాధవరావు(తెలుగు గజల్), జి.వి.కృష్ణమూర్తి(పద్యరచన), డాక్టర్ మాదిరాజు బ్రహ్మానందరావు(పద్యరచన), డాక్టర్ పసునూరి రవీందర్(కథ), వేముల ప్రభాకర్(నవల), ఆర్.సి.కృష్ణస్వామిరాజు (హాస్య రచన), జి.భగీరథ(జీవిత చరిత్ర), తాళ్లపల్లి మురళీధరగౌడ్(వివిధ ప్రక్రియలు), చిలువేరు రఘురాం(నాటక రచయిత), డాక్టర్ వి.వి.వెంకటరమణ(జనరంజక విజ్ఞానం), ఎస్.వి.రామారావు (పరిశోధన), అన్నవరపు బ్రహ్మయ్య(పత్రికారచన), రాళ్లపల్లి సుందర్రావు(భాష), ఘట్టమరాజు అశ్వత్థామనారాయణ(సాహిత్య విమర్శ), కాటేపల్లి లక్ష్మీ నరసింహమూర్తి(అవధానం), పి.వి.సాయిబాబ (లలిత సంగీతం), డాక్టర్ కె.శేషులత(శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు), ఎం.డి.రజియా(జానపద కళారంగం), పస్తం కొమురమ్మ(జానపద కళలు), డాక్టర్ పొనుగోటి సరస్వతి(ఉత్తమ రచయిత్రి), శైలజామిత్ర(ఉత్తమ రచయిత్రి), నాగమణి(ఉత్తమనటి), మాలెల అంజిలయ్య(ఉత్తమ నటుడు) ప్రొఫెసర్ భాస్కర్ శివాల్కర్ (నాటక రంగంలో కృషి), పేరిణి ప్రకాశ్(పేరిణి), డాక్టర్ రుద్రవరం సుధాకర్(కూచిపూడి నృత్యం), డాక్టర్ గెల్లి నాగేశ్వరరావు(సంఘసేవ), పేరలింగం(హేతువాద ప్రచారం), బండారు విజయ(మహిళాభ్యుదయం), డాక్టర్ ముదిగంటి సుధాకర్‌రెడ్డి (గ్రంథాలయ సమాచార విజ్ఞానం), ప్రొఫెసర్ గజ్జల రామేశ్వరం(గ్రంథాలయకర్త), ఆకృతి సుధాకర్(సాంస్కృతిక సంస్థ నిర్వహణ), శ్యామ్ (ఇంద్రజలం), నారు (కార్టూనిస్ట్), డాక్టర్ ఎ.ఎస్.ఫణీంద్ర (జ్యోతిషం), ఎజాజ్ అహ్మద్ (ఉత్తమ ఉపాధ్యాయుడు), ప్రొఫెసర్ ప్రీతి సంయుక్త(చిత్రలేఖనం) తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ నెల 28, 29వ తేదీలలో హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రూ.5,116 నగదు, పురస్కారపత్రంతో సత్కరిస్తామని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
బిస్లెరీని విక్రయించం: రమేష్ చౌహాన్
న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ వాటర్ బిజినెస్ బిస్లెరీ ఇంటర్నేషనల్‌ను విక్రయించే ప్రణాళికలేవీ ప్రస్తుతానికి లేవని వెనుకటితరం పారిశ్రామికవేత్త రమేష్ చౌహాన్ తాజాగా స్పష్టం చేశారు. ఇందుకు ఎవరితోనూ చర్చలు నిర్వహించడంలేదని తెలియజేశారు. బిస్లెరీ విక్రయానికి నాలుగు నెలలుగా టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌తో కంపెనీ చర్చలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే బిస్లెరీ కొనుగోలుకి ఎలాంటి ఒప్పందమూ కుదుర్చుకోలేదని, చర్చలు విరమించుకున్నామని ఇటీవలే టాటా కన్జూమర్ ప్రకటించింది. వెరసి టాటాతో డీల్ చర్చలకు తెరపడిన మూడు రోజుల తదుపరి చౌహాన్ తాజాగా ఇచ్చిన వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. గతేడాది నవంబర్‌లో టాటా కన్జూమర్సహా పలు సంస్థలతో బిస్లెరీ విక్రయానికి చర్చలు జరుపుతున్నట్లు చౌహాన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కుమార్తెకు ఆసక్తి లేదు: బిస్లెరీ బిజినెస్‌ను ఇకపై ప్రొఫెషనల్స్ హ్యాండిల్ చేయవలసి ఉన్నట్లు చౌహాన్ వ్యాఖ్యానించారు. అయితే తన కుమార్తె జయంతికి బిస్లేరీ బిజినెస్పట్ల ఆసక్తి లేదని తెలియజేశారు. బాటిల్డ్ వాటర్ విభాగంలో బిస్లేరీ ఇంటర్నేషనల్ ప్రధానంగా బిస్లేరీ బ్రాండుతో బిజినెస్ నిర్వహిస్తోంది. వేదికా బ్రాండుతో స్ప్రింగ్ వాటర్‌ను సైతం అందిస్తోంది. అంతేకాకుండా స్పైసీ, లిమొనాటా, ఫోంజో, పినాకోలాడ బ్రాండ్లతో ఫిజ్జీ డ్రింకులను సైతం ఆఫర్ చేస్తోంది. సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్లు థమ్సప్, గోల్డ్ స్పాట్, సిట్రా, మాజా, లిమ్కాలను మూడు దశాబ్దాల క్రితం(1993) యూఎస్ దిగ్గజం కోకకోలాకు చౌహాన్ కుటుంబం విక్రయించిన సంగతి తెలిసిందే. హిమాలయన్ బ్రాండుతో ఇప్పటికే టాటా కన్జూమర్ బాటిల్డ్ వాటర్ విభాగంలో బిజినెస్‌ను కలిగి ఉంది. గ్రూప్ కంపెనీలు టాటా కెమికల్స్, టాటా గ్లోబల్ బెవరేజెస్ కలయికతో టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ ఆవిర్భవించింది. హైడ్రేషన్ విభాగంలోని టాటా కాపర్ ప్లస్ వాటర్, టాటా గ్లూకో బ్రాండ్లు సైతం ఈ కంపెనీవే. -
నటుడు ఆత్మహత్య, మరణానికి ముందు రెండో భార్య చిత్రహింసలు!
తమిళ నటుడు, డ్యాన్సర్ రమేశ్ తన పుట్టినరోజు(జనవరి 27)నే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే! కొద్దిరోజుల క్రితం ఆయన 10వ అంతస్థు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే అతడి చావుకు రెండో భార్య కారణమంటూ మొదటి భార్య సంచలన ఆరోపణలు చేసింది. చనిపోవడానికి ముందు రమేశ్‌ను చిత్రహింసలు పెట్టిందని ఆరోపించింది. ఇందుకు సాక్ష్యంగా ఓ వీడియోను సైతం రిలీజ్ చేసింది. ఇందులో రమేశ్‌ను అతడి రెండో భార్య దారుణంగా హింసించినట్లు కనిపిస్తోంది. చేతిలో ఓ పొడవాటి కట్టె పట్టుకుని అతడిని చితకబాదినట్లు తెలుస్తోంది. ఓపక్క తనను కొట్టవద్దని రమేశ్ టేబుల్ ఫ్యాన్‌ను అడ్డుగా పెట్టుకుని ప్రాధేయపడుతుండగా అతడి రెండో భార్య, కూతురు మాత్రం చచ్చిపోమని శాపనార్థాలు పెడుతుండటం గమనార్హం. నా వల్ల కాదు, చచ్చిపోయేలా ఉన్నానంటూ రమేశ్ బాధతో విలవిల్లాడుతుంటే ఉరితాడు తీసుకురమ్మంటావా? అని కూతురు అడగడం మరింత షాకింగ్‌గా ఉంది. వీడియో చివర్లో రెండో భార్య సోఫాలో పెద్ద కట్టెతో కూర్చుని ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా రమేశ్ టిక్‌టాక్ డ్యాన్స్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. దీంతో అతడికి డ్యాన్స్ జోడి డ్యాన్స్ అనే రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ షోలోతో మరింత గుర్తింపు రావడంతో అతడికి సినిమా ఛాన్సులు కూడా వచ్చాయి. ఇటీవలే తునివులో నటించిన రమేశ్ రజనీకాంత్ జైలర్‌లోనూ నటించినట్లు తెలుస్తోంది. చదవండి: పెళ్లిపీటలెక్కిన దర్శకుడు, ఫోటో వైరల్ చాలా త్వరగా వెళ్లిపోయావ్.. మిస్‌యూ: నమ్రత ఎమోషనల్ పోస్ట్ -
నా భార్య మరో వ్యక్తితో కళ్లెదుటే తిరుగుతుంటే జీర్ణించుకోలేక
(అనంతపురం) రాప్తాడురూరల్: ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నాడు.. వారి ప్రేమకు గుర్తుగా ఓ కొడుకు పుట్టాడు. 15 ఏళ్ల వైవాహిక జీవితంలో మనస్పర్థలు తలెత్తడంతో సర్దుకుపోలేక విడాకులు తీసుకున్నాడు. మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని జీర్ణించుకోలేక కిరాతకంగా హతమార్చాడు. పోలీసులు తెలిపిన మేరకు... వజ్రకరూరుకు చెందిన తపాల్ బాబా బేల్దారి పనులతో జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో 17 ఏళ్ల క్రితం గార్లదిన్నె మండలం పెనకచెర్ల గ్రామానికి చెందిన లక్ష్మిని ప్రేమించి, మతాంతర వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం తన పేరును ఆషాబీగా ఆమె మార్చుకుంది. ఇద్దరూ కురుగుంట వైఎస్సార్ కాలనీలో ఉండేవారు. వీరికి నూర్ మహమ్మద్ వలి అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆ బాలుడి వయసు 15 సంవత్సరాలు. అధికారికంగా తలాక్ కొన్నేళ్ల పాటు ఆషాబీ, బాబా జీవనం సాఫీగా సాగింది. అనంతరం బాబా శైలిలో మార్పు వచ్చింది. మద్యానికి బానిసయ్యాడు. తాగుడు అలవాటు మానేయాలని తరచూ భార్య చెబుతుండడంతో ఆమెతో ఘర్షణ పడేవాడు. బంధుమిత్రులు చెప్పినా మార్పు రాలేదు. దీంతో రెండేళ్ల క్రితం మసీదులో మత పెద్దల సమక్షంలో అధికారికంగా విడాకులు (తలాక్) తీసుకున్నారు. ఆ సమయంలో తన 13 ఏళ్ల కుమారుడిని పెద్దల మాటకు కట్టుబడి భర్త వద్దనే ఆమె వదిలేసింది. ఈ క్రమంలో అప్పడప్పుడు తల్లి వద్దకు కుమారుడు వెళ్లి పలకరించి, తిరిగి తండ్రి వద్దకు చేరుకునేవాడు. మరొకరితో వివాహం తపాల్ బాబా నుంచి విడాకులు తీసుకున్నాక అక్కంపల్లికి చెందిన నబీరసూల్‌తో ఆషాబీకి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే నబీరసూల్‌కు అప్పటికే వివాహమై భార్య కూడా ఉంది. ఆషాబీ రెండోభార్యగా కొనసాగుతూ వస్తోంది. ఇటీవల కురుగుంట జగనన్న కాలనీలో ఆషాబీకి ఇల్లు మంజూరు కావడంతో నబీరసూల్ దగ్గరుండి నిర్మాణం పూర్తి చేయించాడు. అనంతరం కొత్త ఇంట్లోనే వారు కాపురం ఉంటున్నారు. కళ్లెదుటే తిరుగుతుంటే జీర్ణించుకోలేక మాజీ భార్య ఆషాబీ తన కళ్లెదుటే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా తిరుగుతుండడాన్ని చూసి తపాల్ బాబా జీర్ణించుకోలేక పోయారు. దీంతో ఆషాబీని హతమార్చేందుకు పథకం వేశాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కుమారుడు వలితో కలసి ఆషాబీ ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. ఆ సమయంలో ఆషాబీ సోదరుడు రమేష్ వాకిలి తీయగానే బాబా ఒక్కసారిగా కత్తితో కడుపులో పొడవడంతో పేగులు బయట పడి అతను కుప్పకూలిపోయాడు. వెనువెంటనే బెడ్రూంలోకి వెళ్లి ఆషాబీపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఆమె మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తర్వాత కుమారుడితో కలసి పారిపోయాడు. అపస్మార స్థితిలో పడి ఉన్న రమేష్ ను స్థానికులు వెంటనే సర్వజనాస్పత్రికి తరలించారు. వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయినా రమేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న అనంతపురం ఇన్చార్జ్ డీఎస్పీ మహబూబ్‌బాషా, రూరల్ సీఐ విజయభాస్కరగౌడ్, ఎస్ఐ నబీరసూల్, సిబ్బంది కురుగుంట జగనన్న కాలనీకి చేరుకుని పరిశీలించారు. ఘటనపై చుట్టుపక్కల వారిని, ఆషాబీ బంధువులను ఆరా తీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
Gymnastics: విజేతగా నిషిక ప్రవీణ్ అగర్వాల్
CBSE Gymnastics Championship 2022: హైదరాబాద్‌లోని గాడియమ్ స్కూల్లో సీబీఎస్ఈ జాతీయ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. దేశవ్యాప్తంగా 750 పాఠశాలలకు చెందిన 1700 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. అండర్–17 ఆల్‌రౌండ్ కేటగిరీలో గాడియమ్ స్కూల్‌కే చెందిన నిషిక ప్రవీణ్ అగర్వాల్ మొదటి స్థానంలో, నారాయణి మూడో స్థానంలో నిలిచారు. భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ విజేతలకు బహుమతులు అందజేశారు. ముగింపు కార్యక్రమంలో అరవిందో ఫార్మా డైరెక్టర్ మదన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: T20 WC 2023: టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటన.. ఇద్దరు ఏపీ అమ్మాయిలకు చోటు! -
చదివింది 8వ తరగతే.. ఆవిష్కరణలు అద్భుతం.. ఎవరా ఘనాపాటి!
ఆయనకు 67 ఏళ్లు. తలపండిన రైతు, అంతకుమించిన శాస్త్రవేత్త. చదివింది 8వ తరగతే. అయినా.. జ్ఞాన సంపన్నుడు. పురుగులను అరికట్టే బవేరియా బాసియానా అనే శిలీంద్రాన్ని 44 ఏళ్ల క్రితం ఆయన గుర్తించే నాటికి దాని గురించి శాస్త్రవేత్తలకే తెలీదు. అప్పటి నుంచి జీవన పురుగుమందు(బయో పెస్టిసైడ్)లను సొంతంగా తయారు చేసుకొని మిరప, పత్తి, మామిడి తదితర పంటలపై వాడుతున్నారు. అనేక సరికొత్త వంగడాలను అభివృద్ధి చేశారు. దేశ విదేశీ యూనివర్సిటీలతో కలసి సుదీర్ఘకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. అంతర్జాతీయ జర్నల్స్‌లో శాస్త్రజ్ఞులతో కలిసి 3 పరిశోధనా వ్యాసాలు ప్రచురించిన ఘనాపాటి ఆయన. ప్రకృతి వ్యవసాయానికి బయో పెస్టిసైడ్స్ ఎంతో అవసరమంటున్న విలక్షణ రైతు శాస్త్రవేత్త కొంగర రమేష్‌పై ప్రత్యేక కథనం. స్వీయ అనుభవ జ్ఞానంతో వ్యవసాయ రంగంలో అద్భుత ఆవిష్కరణలు వెలువరిస్తున్న తపస్వి కొంగర రమేష్. వ్యవసాయ కుటుంబంలో ఆయన పుట్టి పెరిగింది గుంటూరు జిల్లా కాకుమాను గ్రామంలో. రైతు శాస్త్రవేత్తగా పరిశోధనలు చేస్తున్నది విశాఖ జిల్లా ఆనందాపురం మండలం తర్లువాడలో. సొంతంగా తయారు చేసుకున్న జీవన పురుగుమందులతో మిరప, పత్తి, మామిడి వంటి పంటలను సాగు చేయటంతో పాటు.. అనేక విశిష్టమైన వంగడాలకు రూపుకల్పన చేసి భళా అనిపించుకుంటున్నారు. ఎంతకాలమైనా నిల్వ ఉండే, అత్యంత తీపి, సువాసన కలిగిన మామిడి వంగడాలు.. విలక్షణమైన మిరప వంగడం.. ఆవులకు ప్రాణాంతకమైన బ్రూస్లోసిస్ వ్యాధిని హోమియో వైద్యంతో తగ్గించడం.. ఇవీ రైతు శాస్త్రవేత్తగా రమేష్ సాధించిన కొన్ని విజయాలు. బయో పెస్టిసైడ్స్పై ఆయన సుదీర్ఘకాలంగా చేస్తున్న పరిశోధనల గాథ ఆసక్తిదాయకం.. ‘బవేరియా’ అప్పటికి ఎవరికీ తెలీదు సొంత పొలంలో పత్తి తదితర పంటల ఆకులు తినే పురుగుల్ని చంపుతున్న బవేరియా బాసియానా అనే శిలీంధ్రాన్ని 1978లో 22 ఏళ్ల యువ రైతుగా రమేష్ తొలుత గుర్తించారు. 1977లో దివిసీమ ఉప్పెన కారణంగా కోస్తా ఆంధ్ర తీరప్రాంతంలో లెక్కలేనన్ని పక్షులు మత్యువాత పడ్డాయి. పురుగులను తినే పక్షులు లేనందున వాటి సంఖ్య ఉధృతంగా పెరిగిపోయింది. ఒక పొలం నుంచి మరో పొలంలోనికి పురుగుల మంద గొర్రెల మందలా వచ్చేవి. ఏమి చేయాలో పాలుపోని ఆ దశలో.. కొన్ని పురుగులు సహజసిద్ధంగా చనిపోతున్నట్లు ఆయన గమనించారు. ఒక్కోసారి గుంపులో 90% పురుగులు చనిపోతూ ఉండేవి. చనిపోయిన పురుగులపై బూజు మాదిరిగా పేరుకొని ఉండేది. ఏదో ఒక ఫంగస్ ఈ పురుగులను చంపగలుగుతోందని రమేష్ గమనించారు. ఆ ఫంగస్‌ను తిరిగి వాడుకొని పురుగులను చంపగలమా? అన్న జిజ్ఞాస కలిగింది. ఫంగస్ సోకి చనిపోయిన పురుగులను బాపట్ల వ్యవసాయ కళాశాల, గుంటూరు లాం ఫారం, హైదరాబాద్‌లోని ఇక్రిశాట్, రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు యూపీలోని పంత్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లి శాస్త్రవేత్తలకు చూపించారు. ఆరేళ్లపాటు ఎంతోమంది శాస్త్రవేత్తలను కలిసి వివరించినా దీనిపై వారు సరైన అవగాహనకు రాలేకపోయారని రమేష్ తెలిపారు. రమేష్ మాత్రం పట్టువీడలేదు. ప్రయత్నం మానలేదు. చివరికి 1984లో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బాపట్ల వ్యవసాయ కళాశాలలో పాథాలజిస్టు డాక్టర్ మొహిద్దీన్ దీన్ని ఇంగ్లాండులోని మైకలాజికల్ సొసైటీకి పంపంగా.. ఇది పురుగుల పాలిట మృత్యుపాశం వంటి ‘బివేరియా బాసియానా’ అనే శిలీంధ్రం అని వెల్లడైంది. ఆ తరువాత కాలంలో శాస్త్రజ్ఞుల సూచనలతో రమేష్ స్వయంగా పరిశోధనలు చేపట్టారు. చనిపోయిన పురుగుపై నుంచి సేకరించిన ఈ ఫంగస్‌ను వేరు చేసి, తన వ్యవసాయ అవసరాల మేరకు శుద్ధమైన బవేరియా బాసియానా శిలీంధ్రాన్ని అభివృద్ధి చేయటం, పంటలపై వాడి ఫలితాలు సాధించడం నేర్చుకున్నారు. అతి తక్కువ ఖర్చుతో బవేరియా బాసియానా వంటి జీవన పురుగుమందులను పత్తి, మిరప తదితర పంటలు సాగు చేసే రైతులకు విస్తృతంగా అందుబాటులోకి తెస్తే రసాయనిక పురుగుమందుల అవసరం లేకుండా చేయవచ్చని రమేష్ భావించారు. 1987లో రాజేంద్రనగర్‌లో జరిగిన పత్తి శాస్త్రవేత్తల జాతీయ సదస్సులోనూ బవేరియా బాసియానాపై లోతైన పరిశోధనలు చేస్తే జల్లెడ పురుగులు, తెల్లదోమ ఆట కట్టించవచ్చని సూచించినా ఎవరికీ పట్టలేదు. అయినా రమేష్ తన పరిశోధనలు కొనసాగించారు. రూ. 200 ఖర్చుతో పురుగులకు చెక్ బవేరియా బాసియానా, నివేరియా రిలే, మెటరైజమ్ వంటి శిలీంధ్రాలను శాస్త్రీయ పద్ధతిలో తయారుచేసుకుని జాగ్రత్తగా వినియోగిస్తే ఎకరాకు సుమారు రూ. 200 ఖర్చుతోనే మిర్చి, పత్తి, మామిడి, కూరగాయ పంటల్లో పురుగుల బెడదను తప్పించుకోవచ్చని రమేష్ అంటున్నారు. మిరప తదితర పంటలను తీవ్రంగా నష్టపరుస్తున్న నల్ల తామర (బ్లాక్ త్రిప్స్)పై బవేరియా బాసియానా పని చేస్తున్నట్లు కొందరు రైతులు చెబుతున్నారు. అయితే, జాగ్రత్తలు తీసుకోకపోతే ఇతర రకాల ఫంగస్‌లతో కలుషితమై ప్రతికూల పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందంటున్నారు. గతంలో ఇలాంటి బయో ఫెస్టిసైడ్‌ను వాడిన అనుభవం రైతులకు లేనందున శాస్త్రజ్ఞులు సరైన విధానాలను రైతులకు వివరించాలన్నారు. ఏ స్ట్రెయిన్? ఏ పురుగు? బవేరియా బాసియానా శిలీంద్రానికి సంబంధించి అనేక స్ట్రెయిన్లు ఉంటాయి. ఏ స్ట్రెయిన్ ఏ పంటపై, ఏయే పురుగులపై పనిచేస్తుందో తెలుసుకోవడానికి స్థానికంగా పరిశోధనలు చేసి, జీవన పురుగుమందులను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. జీవన ఎరువులపై పరిశోధనలు కొంత మెరుగ్గా జరుగుతున్నప్పటికీ.. జీవన పురుగుమందులపై పరిశోధనలు మన దేశంలో చురుగ్గా జరగటం లేదని రమేష్ తెలిపారు. బవేరియా శిలీంధ్రం అనేక దేశాల్లో 200 వరకు పురుగుల నియంత్రణకు సమర్థవంతంగా పనిచేస్తున్నదని రమేష్ తెలిపారు. 16 మందికి డాక్టరేట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో కలిసి రమేష్ తర్లువాడలోని తన క్షేత్రంలో పత్తి పంటపై బవేరియా ప్రభావంపై చింతా విశ్వేశ్వరరావు సహకారంతో పరిశోధనలు కొనసాగించారు. ఈ పరిశోధనలపై అంతర్జాతీయ జర్నల్స్‌లో రమేష్ ముఖ్య పరిశోధకుడిగా 3 పరిశోధనా పత్రాలు అచ్చయ్యాయి. ఈ క్రమంలో ఏకంగా 16 మంది శాస్త్రవేత్తలకు డాక్టరేట్లు వచ్చాయి. ఈ పరిశోధనలు అడకమిక్ స్థాయిలోనే ఆగిపోయాయి. బవేరియాకు చెందిన 4–5 స్ట్రెయిన్లను వేరు చేసి యూనివర్సిటీలో భద్రపరచటం సాధ్యపడిందే తప్ప.. వాటిని విస్తృతంగా రైతుల దగ్గరకు తీసుకెళ్లటం సాధ్యపడలేదని రమేష్ తెలిపారు. జర్మనీ శాస్త్రవేత్తలు తమ కాకుమాను పొలంలో నుంచి మట్టి నమూనాలు సేకరించి తీసుకువెళ్లి ఈ ఫంగస్‌ను వాడుతున్నా తెలిపారు. ఈ నేపథ్యంలో నాబార్డ్ ఆర్థిక సాయంతో వైజాగ్‌లోని గీతం విశ్వవిద్యాలయంతో కలసి రమేష్ పరిశోధనలు చేశారు. గీతం యూనివర్సిటీ తన పేరుతో పేటెంట్‌కు దరఖాస్తు చేయబోగా, రమేష్ పేరును మొదటి ఆవిష్కర్తగా పెట్టాలని నాబార్డ్ సూచించింది. అయితే, వారు అంగీకరించకపోవటంతో వారితో నాబార్డ్ నిధులు ఇవ్వటం నిలిపివేసింది. నూనెతో కలపి చల్లాలి బవేరియా బాసియానా వంటి శిలీంధ్రాలతో తయారు చేసిన జీవన పురుగుమందులను సాయంత్రం పూట, తేమ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో నీటిలో కాకుండా ఏదో ఒక నూనె (ఎకరానికి 2 లీ.)లో శిలీంధ్రాన్ని కలిపి హెలీస్ప్రేయర్/డ్రోన్‌తో సాయంకాలం పూట పిచికారీ చేయాలని రమేష్ సూచిస్తున్నారు. రైతులు నీటితో కలిపి చల్లుతున్నారని, నీటి తేమ ఆరిపోతే శిలీంద్రపు బీజాలు చనిపోయి పురుగులపై ప్రభావం చూపలేకపోవచ్చు. అందుకని ఏదో ఒక నూనెలో కలిపి పిచికారీ చేస్తే ప్రయోజనం బాగుంటుందన్నారు. నిద్రాణంగా ఉండే శిలీంద్రపు బీజాలకు తేమ తగిలితే జర్మినేట్ అవుతాయని, ఆ తర్వాత కొద్ది గంటల వరకే బతికి ఉంటాయి. ఆ లోగానే పురుగు వాటిని తినటం లేదా దాని శరరీంపై ఇవి పడటం జరిగితే.. ఆ శిలీంద్రం పురుగు దేహంలో పెరిగి దాన్ని చంపగలుగుతుంది. అందుకు రెండు–మూడు రోజుల సమయం పడుతుంది. నూనెతో కలిపి చల్లితే బీజాలు వారం, పది రోజుల పాటు గింజగానే ఉంటాయని.. పురుగులు ఈ బీజాలను తిన్నా, వాటి శరీరానికి తగిలినా చాలు. (క్లిక్ చేయండి: జనం మేలుకోకపోతే జీఎం పంటల వెల్లువే!) శిలీంధ్రం బారిన పడిన చనిపోయిన తర్వాత 5 రోజుల్లోనే ఒక పురుగులో కోట్ల కొలదీ శిలీంధ్రపు బీజాలు పెరిగి, గాలి ద్వారా వ్యాపించి, పురుగులను నాశనం చేస్తాయి. ఇందువల్లనే జీవన పురుగుమందులు రసాయన పురుగు మందుల్లా వెంటనే కాక రెండు రోజుల తర్వాత ప్రభావం చూపుతాయి. రీసైక్లింగ్ పెస్టిసైడ్గానూ పనిచేస్తాయి. రైతులు చల్లిన గంటలోనే ఫలితం ఆశిస్తున్నారు తప్ప తర్వాత రోజుల్లో ఏమి అవుతుందో గమనించడం లేదని, ఈ విషయమై రైతుల్లో అవగాహన కలిగించాలని రమేష్ సూచిస్తున్నారు. జీవన పురుగుమందుల వల్ల పర్యావరణానికి, మనుషులకు, ఇతర జీవులకు ఎటువంటి సమస్యా ఉండదు. – గేదెల శ్రీనివాసరెడ్డి, సాక్షి, తగరపువలస, విశాఖ జిల్లా ప్రకృతి వ్యవసాయానికి తప్పనిసరి అవసరం రైతులకు మోయలేని ఆర్థిక భారంతో పాటు పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న రసాయనిక పురుగుమందులకు ఎన్నో విధాలుగా చక్కటి ప్రత్యామ్నాయం జీవన పురుగుమందులే. బవేరియా బాసియానా, నివేరియా రిలే, మెటరైజమ్, వర్టిసెల్ల లకాని వంటి శిలీంధ్రాలతో కూడిన జీవన పురుగుమందులపై ప్రభుత్వం విస్తృతంగా పరిశోధనలు జరపాలి. ఏయే పురుగులపై ఏయే స్రెయిన్లు పనిచేస్తున్నాయో నిర్థారించాలి. వ్యవసాయ వర్సిటీ నిపుణుల పర్యవేక్షణలో జీవన పురుగుమందులను ప్రభుత్వమే ఉత్పత్తి చేయించి రైతులకు అందుబాటులోకి తేవాలి. నిల్వ సామర్థ్యం తక్కువ కాబట్టి రైతులను ముందుగా చైతన్యవంతం చేయాలి. ప్రకృతి వ్యవసాయం వ్యాప్తికి బయో పెస్టిసైడ్స్ తప్పనిసరి అవసరం. – కొంగర రమేష్, నవనీత ఎవర్గ్రీన్స్, తర్లువాడ, విశాఖ జిల్లా -
Jayanti Chauhan: ఆసక్తి లేని పని ఆమెకు వద్దట
వారసులు వారసత్వాన్ని తీసుకోవడానికి ఉత్సాహపడతారు. యువరాజులు కిరీటం కోసం వెంపర్లాడతారు. ఆసక్తి లేని పని చేయనక్కర్లేదని సామ్రాజ్యాలను వదలుకుంటారా ఎవరైనా? 32 ఏళ్ల జయంతి చౌహాన్. 7000 కోట్ల బిస్లరీ వాటర్ సామ్రాజ్యానికి ఏకైక యువరాణి. ‘నాకు ఆసక్తి లేదు’ అని చైర్ పర్సన్ పదవిని నిరాకరించింది. దీని వల్ల సంస్థను టాటా పరం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. తృప్తినిచ్చే పని చిన్నది కావచ్చు. పెద్దది కావచ్చు. కాని తృప్తినిచ్చే పనిలోనే ఆనందం ఉందని ఆమె సందేశం ఇస్తోంది. ఈ కాలపు యువత ఈ మాట ఆలకించాల్సిందే. ఇదంతా ఒక జానపద కథలాగే ఉంది. పూర్వం ఎవరో ఒక రాజు తన రాజ్యం మొత్తాన్ని ఏకైక కుమార్తె చేతిలో పెడదామనుకుంటే ‘నాకు వద్దు నాన్నా. నాకు హాయిగా సెలయేళ్ల మధ్య గడుపుతూ, చిత్రలేఖనం చేసుకుంటూ, పూ లతల మధ్య ఆడుకోవాలని ఉంది’ అని ఆ కూతురు అంటే రాజు ఏమంటాడు? రాజ్యం ఏమవుతుంది? ‘జల సామ్రాజ్యం’ లేదా ‘ఆక్వా కింగ్డమ్’గా అందరూ పిల్చుకునే ‘బిస్లరీ’ సంస్థకు ఇప్పుడు ఆ పరిస్థితే ఎదురైంది. దాని అధినేత రమేష్ చౌహాన్ తన సంస్థను అనివార్యంగా టాటాకు అప్పజెప్పనున్నాడు. రేపో మాపో ఇది జరగనుంది. 7000 కోట్లకు సంస్థ చేతులు మారుతుంది. పూర్తి మార్పుకు మరో రెండేళ్లు పడుతుంది. అంతవరకూ సంస్థ భారాన్ని 82 ఏళ్ల రమేష్ చౌహాన్ మోయక తప్పదు. కారణం ఏమిటి? ‘నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. నా కుమార్తె జయంతికి సంస్థ పగ్గాలు స్వీకరించడంలో ఆసక్తి లేదు. సంస్థ అమ్మేయదల్చుకోవడం బాధాకరమే. కాని టాటా సంస్థకు విలువలు, విశ్వసనీయత ఉన్నాయి. అదైతే నా సంస్థను బాగా చూసుకుంటుందని భావిస్తున్నాను. వారి వైపే నా మనసు మొగ్గుతున్నది’ అని రమేష్ చౌహాన్ అన్నాడు. పార్లే బ్రదర్స్‌లో ఒకరైన రమేష్ చౌహాన్ 1993లో తన సొంత సాఫ్ట్డ్రింక్లైన థమ్సప్, సిట్రా, మాజా, గోల్డ్స్పాట్లను కోకాకోలాకు విక్రయించాడు. ఇప్పుడు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ అయిన బిస్లరీని అమ్మేయబోతున్నాడు. కారణం కూతురు జయంతికి ఉన్న కళాత్మక ఆసక్తులే. మనకు ఏది ఇష్టం? జయంతి నుంచి ఏం నేర్చుకోవచ్చు? ఏది మనసుకు బాగా నచ్చుతుందో ఆ పని చేయాలి. అందరికీ అన్నిసార్లు కుదరకపోవచ్చు. కాని కుదిరే అవకాశం వచ్చినప్పుడు తప్పక నిర్ణయం తీసుకోవాలి. చాలా మంది జీవితం గడిచిపోయాక ‘నేను ఇది కాదు చేయాలనుకున్నది. నాకు అవకాశం కూడా వచ్చింది. కాని వేరే దారిలో వెళ్లిపోయాను. చాలా అసంతృప్తిగా ఉంది’ అనడం వింటూ ఉంటాము. ఆ రియలైజేషన్ వచ్చేలోపు జీవితం గడిచిపోయి ఉంటుంది. అదే సమయంలో మన అభిరుచులు, ఆసక్తులు అన్ని వేళలా ఆర్థిక సమీకరణాలకు లొంగేలా ఉండకపోవచ్చు. అయినప్పటికీ కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నా జీవితం సంతోషంగా ఉంటుంది అనుకున్నప్పుడు సొంత మార్గం ఎంచుకోవడంలో తప్పు ఏముంది? ఐ.టి. ఉద్యోగాన్ని వదులుకుని వ్యవసాయం చేసేవారు, ఐ.పి.ఎస్. ఉద్యోగాన్ని వదిలి సంఘసేవ చేసేవారు ఉన్నారు. ఒక స్పష్టతతోనే జయంతి బిస్లరీని వద్దనుకుని ఉంటుంది. ఆ స్పష్టత ఉంటే ఎవరైనా తమకు ఇష్టమైన రంగంలో పని చేస్తూ ఆనందకరమైన జీవితం గడపవచ్చు. డబ్బు వల్ల మాత్రమే ఆనందం లభించదని జయంతి చెబుతోంది కదా. ఎవరు జయంతి? జయంతి చౌహాన్ (37) రమేష్ చౌహాన్‌కు ఒక్కగానొక్క కూతురు. ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఆ తర్వాత మొదట న్యూయార్క్‌లో, ఆ తర్వాత లండన్‌లో, ఆ పైన ఇటలీలో చదువుకుంది. ప్రాడక్ట్ డెవలప్మెంట్తో పాటు ఫ్యాషన్ స్టైలింగ్ కూడా చదువుకుంది. దాంతోపాటు లండన్‌లో ‘స్కూల్ ఆఫ్ ఓరియెంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్’ (లండన్ యూనివర్సిటీ) నుంచి అరబిక్ భాష నేర్చుకుంది. అరబిక్ భాష నేర్చుకోవడం ఒక భిన్న అభిరుచి అని చెప్పవచ్చు. ఆమెకు ఇదొక్కటే కాదు... ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. ప్రయాణాలు ఇష్టపడుతుంది. జంతు ప్రేమ ఉంది. అంత పెద్ద వ్యాపార సంస్థకు వారసురాలైనా చక్కగా ఒక ఆటో ఎక్కి రోడ్డు పక్కన బంతిపూలు కొనుక్కుంటూ కనిపిస్తుంది. ఆమెకు రంగులు అంటే ఇష్టం. మంచి బట్టలు ఇష్టం. భావు కత్వంతో జీవించడం ఇష్టం. అలా అని ఆమెకు వ్యాపార దక్షత లేదనుకుంటే పొరపాటు. చదువు పూర్తయిన వెంటనే 24 ఏళ్ల వయసులో సంస్థలో ప్రాథమిక స్థాయి నుంచి పని చేయడం మొదలుపెట్టింది. మొదట ఢిల్లీ కార్యాలయంలో చేసి ఆ తర్వాత ముంబై ఆఫీస్‌కు హెడ్ అయ్యింది. జయంతి చేరాక హెచ్.ఆర్, మార్కెటింగ్, సేల్స్‌లో సమూలమైన మార్పులు తెచ్చింది. పోటీదారుల చొరబాటును ఎదుర్కొనడానికి ‘బ్లూ’ కలర్ నుంచి బిస్లరీ రంగును ‘ఆకుపచ్చ’కు మార్చింది. సంస్థలో ఆధునిక యాంత్రికీకరణలో దూకుడు ప్రదర్శించింది. ఇప్పుడు సంస్థకు వైస్ ప్రెసిడెంట్‌గా ఉంది. ఇంత సాధించిన కుమార్తె సంస్థ పగ్గాలు చేపడుతుందని తండ్రి ఆశించడం సహజం. కాని జయంతి తనకు ఆసక్తి లేదని తేల్చి చెప్పింది. బహుశా ఆమె మనసు ఇందులో లేదు. ఆమెకు తృప్తినిచ్చే పని ఇది కాకపోవచ్చు. అందుకే ఆమె ఇంత సామ్రాజ్య కిరీటాన్ని వద్దనుకుంది. -
లక్షలాది జీవితాలను మార్చిన విప్లవమూర్తి
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో మహాత్మా గాంధీ స్ఫూర్తిగా సామాజిక సేవకు తమ జీవితాలను అందించిన అనేకమందిలో ఇలా భట్ లేదా అందరికీ చిరపరిచితమైన ఇలా బెన్ ఒకరు. ఆకాశమే హద్దుగా దేశ భవిష్యత్తు గురించి కలలు కన్న ఇలాబెన్ అహ్మదాబాద్‌లో న్యాయవిద్యను అభ్యసించారు. నవ భారత నిర్మాణంలో తాను భాగస్వామి నని గర్వంగా భావించారు. ‘‘జాతి నిర్మాణం అంటే నా దృష్టిలో కార్మికులకు దగ్గర కావడమే. ఎందుకంటే.. ఈ దేశానికి పునాదు లైన వీరు ఇప్పటికీ పేదలుగానే ఉన్నారు. నిర్లక్ష్యానికి గురవు తున్నారు’’ అనేవారు ఆమె. ఆ కాలపు విద్యార్థి నేత రమేశ్ భట్ కార్యకలాపాలకు ఆకర్షితులైన ఇలా బెన్ అతడినే పెళ్లి చేసుకుని జీవిత భాగస్వామి గానూ మారిపోయారు. విద్యాభ్యాసం తరు వాత ఇలా బెన్ మజూర్ మహాజన్ (టెక్స్టైల్ లేబర్ అసోసి యేషన్–టీఎల్‌ఏ)లో చేరిపోగా... రమేశ్ భట్ అహ్మదాబాద్‌లోని గుజరాత్ విద్యాపీఠ్‌లో చేరారు. మిల్లు వర్కర్ల ట్రేడ్ యూనియన్ అయిన టీఎల్ఏను స్థాపిం చింది అనసూయ సారాభాయ్ అయినప్పటికీ దీని రాజ్యాంగాన్ని రచించింది మాత్రం స్వయంగా మహాత్మా గాంధీ కావడం గమనార్హం. ట్రేడ్ యూనియన్ ప్రాముఖ్యం, నిర్వహణ వంటి అనేక అంశాలను టీఎల్‌ఏ లోనే నేర్చుకున్న ఇలా బెన్ ఇక్కడే మొదటిసారి అసంఘటిత రంగంలోని మహిళా కార్మికులను కూడా కలిశారు. వారంతా కాయగూరలు అమ్మే, తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునే, దుస్తులు కుట్టే కష్టజీవులైనప్ప టికీ పేదలుగానే ఉండటం ఆమెలోని ఆలోచనలను తట్టిలేపింది. వారి హక్కుల సాధనే లక్ష్యంగా ఇలా బెన్ 1972లో ‘సేవా’ సంస్థను ప్రారంభించారు. చిన్నగా మొదలైన ఈ సంస్థ అనతి కాలంలోనే దేశం.. ఆమాటకొస్తే ప్రపంచవ్యాప్త అసంఘటిత మహిళా కార్మికుల ఉద్యమాలకు ఆధారభూతమైంది. ఒక్కో మహిళా కార్మికురాలు... యూనియన్ కోసం తమ చిన్న చిన్న సంచి ముడులు విప్పి పావలా చొప్పున చెల్లించడం ఇలా బెన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందట. అయితే కేవలం వీరి హక్కుల కోసం పోరాడటమే సరిపోదని ఇలా బెన్ వేగంగా గుర్తించారు. యజమానుల మనసు మార్చే.. మున్సిపాలిటీ, పోలీస్ వంటి వ్యవస్థలు మహిళా కార్మికులను దోచుకోకుండా రక్షించేందుకు తగిన చట్టాలూ అవసరమని భావించారు. ఇజ్రాయెల్ పర్యటనలో సహకార సంఘాలు, ట్రేడ్ యూనియన్ల పనితీరుపై అవగాహన పెంచుకున్న ఇలా బెన్ వాటిని భారత్‌లోనూ స్థాపించే ప్రయత్నం మొదలుపెట్టారు. మహిళా కార్మికులకు తాము పొదుపు చేసుకున్న డబ్బును దాచుకునేందుకు బ్యాంకుల్లాంటి వ్యవస్థలేవీ లేకపోవడం గుర్తించిన ఆమె... వారితో ఓ సహకార బ్యాంకును ఏర్పాటు చేయించారు. అప్పట్లో ఇదో విప్లవాత్మకమైన చర్యే. ఆలోచనలు, కార్యాచరణ రెండూ అలాగే ఉండేవి. సమాజంలోని అట్టడుగు పేదల జీవితాలు మార్చే ఈ పనులకు ఆమె పెట్టుకున్న పేరు ‘అభివృద్ధికి పోరాటం’. ఇలా బెన్ మార్గాన్ని ఒక్క గుజరాత్‌లోనే కాదు... భారత్‌తో పాటు ప్రపంచంలోని మరికొన్ని దేశాల్లోనూ అనుకరించారు. ఇలా బెన్ ఆలోచనలు ఎంత విప్లవాత్మకంగా ఉండేవంటే.. కొన్ని పనులు చేయడంతోనే సమస్యలు పరిష్కారం కావనీ, అసలు సమస్య ఆలోచనా ధోరణులు మార్చడంలోనే ఉందనీ ఆమె గుర్తించారు. చట్టాలు, విధానాలు, దృక్పథాల్లో మార్పులు తీసుకురావడం ద్వారా మాత్రమే అసంఘటిత రంగ మహిళా కార్మికుల హక్కుల సాధన సాధ్యమని నమ్మి ఆచరించారు. ఇలా బెన్ కృషికి గుర్తింపు చాలా వేగంగానే రావడం మొదలైంది. 1977లో రామన్ మెగసెసె అవార్డు వరించింది. ఆ తరువాతి కాలంలో పద్మశ్రీ, పద్మభూషణ్‌లు కూడా! రాజ్యసభ సభ్యు రాలిగా నామినేట్ అయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో హార్వర్డ్, యేల్ యూనివర్సిటీలు డాక్టరేట్లతో సత్కరించాయి. నెల్సన్ మండేలా స్థాపించిన అంతర్జాతీయ బృందం ‘ద ఎల్డర్స్’లోనూ ఆమెకు సభ్యత్వం లభించింది. ఇలా బెన్ రాజ్యసభ సభ్యురాలిగా వీధి వ్యాపారులు, ఇళ్లలోంచి పనిచేసేవారి కోసం పలు బిల్లులను ప్రవేశపెట్టారు. ఆమె కృషి ఫలితంగానే వీధి వ్యాపారుల బిల్లు చట్టమైంది. పద్మశ్రీ అవార్డు అందుకునేటప్పుడు కూడా ఇలా బెన్ కోరింది ఒక్కటే... అసంఘటిత రంగంలోని మహిళా కార్మికుల కోసం ఓ కమిషన్ ఏర్పాటు చేయమని! 1988లో వీరిపై చేసిన అధ్య యనం ‘శ్రమశక్తి’ పేరుతో విడుదలైంది. శ్రామికులను సంఘటిత పరచడం ఎంత ముఖ్యమైందో ఇలా బెన్‌కు బాగా తెలుసు. అందుకేనేమో... అహ్మదాబాద్‌లో మొదలుపెట్టిన కార్మిక సంస్థలు అంతర్జాతీయ స్థాయికి విస్తరించాయి. ఆమె స్ఫూర్తితో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్, హోమ్ బేస్డ్ వర్కర్స్‌తోపాటు ఇళ్లల్లో పని చేసేవారు, చెత్త ఏరుకునేవారికీ సంఘాలు ఏర్పడ్డాయి. ఇంట ర్నేషనల్ లేబర్ యూనియన్లోనూ ఇలా బెన్ ఇళ్లల్లోంచి పనిచేసుకునే వారి కోసం ఓ సదస్సు ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు. పరిశోధకులు, విధాన రూపకర్తలు, సామాజిక కార్యకర్తలతో ఆమె ‘వీగో’ పేరుతో ఒక అంత ర్జాతీయ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ఇలా బెన్ సాధించిన అతి గొప్ప విజయం ఏదైనా ఉందంటే.. అది పేద మహిళా కార్మికుల జీవితాలను మార్చడమే కాదు.. విద్యావంతులు, ప్రొఫెషనల్స్ కూడా ఉద్యమంలో పాల్గొనేలా చేయడం! గత ఏడాది ‘సేవా’ సంస్థ స్వర్ణోత్సవాలు జరిగాయి. అయితే ఇలా బెన్ మాత్రం అప్పటికి కూడా రానున్న యాభై ఏళ్లలో ఎలాంటి మార్పులు తీసుకురాగలమో చూడాలన్న ఆశాభావంతోనే ఉండేవారు. రేనానా ఝాబ్వాలా, వ్యాసకర్త ప్రఖ్యాత సామాజిక కార్యకర్త (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
భార్యపై ‘పిచ్చి’ ప్రేమ.. భర్త ప్రాణం తీసింది!
క్రైమ్: భర్తను చంపి అడ్డుతొలగించుకున్న భార్య.. భార్యను కిరాతకంగా చంపిన భర్త.. వివాహేతర సంబంధాల మోజులో పడి.. నిత్యం దాదాపు ఇలాంటి నేరాలే వింటున్నాం ఈ రోజుల్లో. కానీ, భార్యాభర్తల ప్రేమకు పరాకాష్టగా నిలిచే విషాద గాథలు చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటిదే ఇది.. ప్రాణంగా ప్రేమించిన భార్య మీది ప్రేమను చంపుకోలేని ఓ వ్యక్తి, తన ప్రాణమే తీసుకున్నాడు. హృదయాన్ని కదిలించే ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పుణే(మహారాష్ట్ర) జున్నుర్ తాలుకా ధోండ్కార్వాడి నిమ్దారికి చెందిన రమేష్(29), విద్య(23)లు చాలా కాలంగా ప్రేమించుకున్నారు. విద్యకు తండ్రి లేడు. ఆమె చదువులకు అయ్యే ఖర్చు సైతం రమేష్ భరించాడు. ఆమె ఇంటి బాధ్యతలను సైతం మోశాడు. రమేష్‌కు అతని నుంచి మద్దతు కూడా లభించింది. చివరికి.. పెద్దల అంగీకారంతో ఎనిమిది నెలల కిందట వివాహం జరిగింది. నెల కిందట విద్య గర్భం దాల్చడంతో ఆ ఇంట ఆనందం వెల్లివిరిసింది. ఈ శుభవార్త తెలియగానే కూతురికి బంగారు గొలుసు చేయించాలని కూతురు-అల్లుడికి కబురు పెట్టింది విద్య తల్లి. నారాయణగావ్‌లో నగలు కొనడానికి ఆ భార్యభర్తలు బైక్ మీద బయలుదేరారు. షాపింగ్ ముగిసిన తర్వాత దారిలో ఓ పాలబూత్ దగ్గర ట్రాఫిక్ జామ్ కావడంతో.. బైక్ దిగింది దివ్య. ఈ క్రమంలో ఎదురుగా చెరుకులోడుతో వస్తున్న ఓ ట్రాక్టర్ ఆమెను ఢీకొట్టడంతో ఆమె కింద పడిపోయింది. వెనక చక్రాల కింద పడి దివ్య అక్కడికక్కడే మృతి చెందింది. నవంబర్ 14వ తేదీన ఈ ఘోరం జరిగింది. భార్య మరణానికి కళ్లరా చూసిన రమేష్.. మెంటల్షాక్కి గురయ్యాడు. మూడురోజుల పాటు ఏడుస్తూ.. కుంగిపోయాడు. ప్రాణంగా ప్రేమించిన దివ్య దూరం అయ్యేసరికి భరించలేకపోయాడు. ఆమె చావుకు తానే కారణం అని పశ్చాత్తప పడ్డాడు. ఆమె లేని జీవితం తనకు ఎందుకు అనుకున్నాడు. విషం తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు నారాయణ్గావ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో రమేష్ కన్నుమూశాడు. ఇదీ చదవండి: బావను ప్రేమించింది.. నమ్మింది, ఈలోపే.. -
గోవా సీఎల్పీ విలీనానికి ఆమోదం
పణజి: గోవా కాంగ్రెస్ శాసనసభా పక్షం(సీఎల్పీ)ను అధికార బీజేపీలోకి విలీనం చేయాలన్న ప్రతిపాదనకు గోవా అసెంబ్లీ స్పీకర్ రమేశ్ ఆమోద ముద్రవేశారు. కాంగ్రెస్‌కు భారీ షాక్ ఇస్తూ బుధవారం ఎనిమిది మంది పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరిన విషయం తెల్సిందే. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం మూడుకు పడిపోయింది. బీజేపీలో కొత్తగా చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని వార్తలొచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ, ప్రమాణస్వీకార తేదీల ఖరారు కోసం చర్చించేందుకు గవర్నర్‌తో సీఎంసావంత్ భేటీ అయ్యారని మీడియాలో వార్తలు వినవచ్చాయి. ఈ వార్తలను సీఎం ఖండించారు. మోదీ పుట్టినరోజు వేడుకపై చర్చించానని చెప్పారు. (చదవండి: గోవా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ షాక్) -
కథ: చివరి ప్రయాణం.. నేను ఇంకెంతో కాలం బతకనని డాక్టర్లన్నారు! గొప్ప క్షణాలు
నేను నాకిచ్చిన అడ్రస్‌కు చేరుకొని హారన్ మోగించాను. కాసేపు ఆగి మళ్లీ హారన్ వేశాను. నా షిఫ్టులో ఇది ఆఖరి బేరం కాబట్టి కాసేపు వేచి చూసి, ఇంటికి వెళ్లి పోవాలనుకున్నాను. కారును ఇంటి ముందు పార్క్ చేసి, ఆ ఇంటి వద్దకు వెళ్లి, తలుపు తట్టాను. ‘ఒక్క నిమిషం’ అంటూ లోపల నుండి పీలగా వున్న ఒక ముసలావిడ గొంతు వినిపించింది. ఇంటిలోపల ఏదో వస్తువును నేలపై తోసుకు వస్తున్న శబ్దం వినిపించింది. చాలాసేపటి తరువాత తలుపు తెరుచుకుంది. తొంభై ఏళ్లు పైబడ్డ ఒక పొట్టి వృద్ధురాలు నా ముందు నిలుచుంది. పాత మోడల్లో వున్న ఒక ప్రింటెడ్ గౌను, నర్సులు వేసుకొనే చిన్న టోపీతో వున్న ఆమె.. నాకు 1940ల బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో దర్శనమిచ్చే నటీమణులను జ్ఞప్తికి తెచ్చింది. ఆమె పక్కనే ఒక చిన్న నైలాన్ సూట్ కేసు వుంది. ఆ అపార్ట్మెంట్లో ఏళ్ల తరబడి మనుషులు నివసిస్తున్నట్లు లేదు. కుర్చీలు, సోఫాలన్నింటిపై గుడ్డ కవర్లున్నాయి. గోడలపై గడియారాలు కానీ, టేబుళ్లపై పాత్రలు కానీ లేవు. ఒక మూలనున్న అట్టపెట్టెలో ఫొటోలు, గాజు సామాగ్రి వుంది. ‘నా పెట్టెను కారు వరకు తీసుకురాగలరా?’ అని నెమ్మదిగా అభ్యర్థించిందామె. నేను సూట్‌కేసును కారులో పెట్టి, తిరిగి ఆమె దగ్గరకు చేరాను. ఆమెను నడిపించుకొని చిన్నగా నా టాక్సీ దగ్గరకు వచ్చాను. ఆమె నా దయాహృదయాన్ని మెచ్చుకోసాగింది. ‘అదేమీ లేదు. మహిళా ప్రయాణికులందరినీ నా తల్లిలాగే చూస్తాను’ అన్నాను. ‘నువ్వు చాలా మంచివాడివి’ అని నాకు ఒక చిరునామా రాసి వున్న కాగితం ఇచ్చిందావిడ. ‘మెయిన్ బజార్ల ద్వారా నువ్వక్కడికి చేరుకోగలవా?’ అందామె సీట్లో కూర్చుంటూ. ‘అలా వెళ్తే చాలా దూరమవుతుంది’ అన్నాను నేను. ‘ఏమీ ఫర్వాలేదు, నాకేమీ తొందరలేదు. నేను ఒక విందుకు వెళ్తున్నానంతే’ అందావిడ. మిర్రర్లోంచి ఆమె కళ్లు చెమర్చడం నాకు కనిపించింది. ‘నా కుటుంబ సభ్యులెవరూ లేరు. చనిపోయారు. నేనూ ఇంకెంతో కాలం బతకనని డాక్టర్లన్నారు’ సన్నని గొంతుతో చెప్పిందావిడ. నేను టాక్సీ మీటర్‌ను చిన్నగా బంద్ చేశాను. ‘మీరు నన్ను ఏ రూట్లో వెళ్లమంటారో చెప్పండి’ అడిగాను. తరువాత రెండు గంటల పాటు, పట్టణంలో చాలా రోడ్లు తిరిగాం మేం. ఆమె ఒకప్పుడు లిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేసిన భవంతిని నాకు చూపించింది. పెళ్లయిన కొత్తలో, ఆమె భర్తతో కలసి జీవించిన ప్రాంతం గుండా ప్రయాణించాం. ఆమె నన్ను ఒక ఫర్నిచర్ దుకాణం ముందు ఆపమని చెప్పి, దానిని తేరిపార చూసి, ఒకప్పుడు అది ఒక బాల్రూమ్ అనీ, అక్కడ తాను చిన్నతనంలో డాన్స్ చేసేదాన్నని అనందంగా చెప్పింది. కొన్నిసార్లు ఆమె నన్ను ఒకానొక భవంతి ముందో, కూడలిలోనో ఆపమని చెప్పి, చీకటిలోకి చూస్తూ కూర్చునేది. పొద్దుగుంకే సమయంలో ఆమె హఠాత్తుగా ‘నేను అలసిపోయాను, డిన్నర్ జరిగే ప్రదేశానికి వెళ్దామిక’ అంది. నిశబ్దంగా, ఆమె చెప్పిన ప్రదేశానికి వెళ్లాం. హాస్పిటల్‌లా వున్న ఒక చిన్న భవంతి చేరుకొని, ఆ ఇంటి ముందు కారు ఆపాను. కారు దిగగానే ఇంట్లో నుండి ఇద్దరు పనివాళ్లు వచ్చి, వృద్ధురాలి వంక గౌరవంగా చూశారు. వారు ఆమె రాక కోసం వేచి వున్నట్లుగా వుంది. నేను కారులోంచి సూట్‌కేసును ఆ ఇంటి గుమ్మం వైపు తీసుకెళ్లాను. అప్పటికే పనివారు వృద్ధురాలిని కారు నుండి దించి, ఒక వీల్ చెయిర్లో కూర్చోబెట్టారు. ‘నీకు ఎంత ఇవ్వాలి?’ సూట్ కేసును ఇంటిలోపల పెట్టి వచ్చిన నన్ను అడిగిందావిడ. ‘ఏమీ ఇవ్వనవసరం లేదు’ అన్నాను వినమ్రంగా. ‘నువ్వూ బతకాలి కదా! టాక్సీకి అయిన డబ్బులు నేను ఇవ్వాల్సిందే’ అంది పెద్దావిడ. ‘వేరే ప్రయాణికులున్నారు కదా, ఫర్వాలేదు’ అన్నాను. అనాలోచితంగా, కిందికి వంగి, ఆమెను ఆత్మీయంగా కౌగిలించుకున్నాను. ఆమె సంతోషంగా నా శిరస్సు తడిమింది. ‘నువ్వు ఒక వృద్ధురాలిని కాసేపు ఆనందంగా గడిపేలా చేశావ్. థాంక్ యూ, భగవంతుడు నిన్ను తప్పక దీవిస్తాడు’ అందామె ఆప్యాయంగా. నేను ఆమె చేయి ప్రేమగా నొక్కి, ఇంటి బయటకు నడిచాను. నా వెనుక ఒక తలుపు మూసుకొంది. ఒక జీవితం ముగిసినట్లు నాకనిపించింది. ‘ఒక వేళ ఆమెకు ఇంటికి వెళ్లే హడావిడిలో వున్న కోపిష్ఠి డ్రైవరు దొరికివుంటే ఏమయ్యేది? తప్పక తన సహనాన్ని కోల్పోయేవాడు’ అనుకున్నాను. ‘నేను మాత్రం, మొదట ఆమె ఇంటి ముందు కారు ఆపినపుడు, రెండు సార్లు హారన్ కొట్టి వెళ్లిపోయివుంటే..’ అని కూడా అనుకున్నాను. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు .. ఈ రోజు నేను చేసిన ఈ మంచిపని కన్నా జీవితంలో మరింకే మంచి పని చేయలేదు అనిపించింది. మనం ఘనకార్యాలు సాధించడం జీవిత పరమార్థమని అనుకుంటాం. మన పెంపకం అటువంటిది. కానీ గొప్ప క్షణాలు జీవితంలో అనుకోకుండా వస్తాయి. ఇతరులు వాటికి ఏమీ విలువ ఇవ్వకపోవచ్చు. ప్రజలు మనం ఏమి చేశామని కానీ, వారితో ఏం మాట్లాడమని కానీ గుర్తుంచుకోరు. మనం వారిని ఎలా ఫీల్ అయ్యేలా చేశామని మాత్రం గుర్తుంచుకుంటారు. మీరు ఈ కథను చదివి పది మందికీ చెప్తారు కదూ, థాంక్ యూ. జీవితం రంగుల మయమైనది కాదు. కానీ వున్న జీవితాన్ని ఆనందంగా గడపడం మన చేతిలోనే వుంది. -మూలం : అజ్ఞాత రచయిత అనువాదం : రాచపూటి రమేశ్ చదవండి: ఈవారం కథ- అశ్వతి: భార్య, ఇద్దరు పిల్లలతో కేరళ టూర్.. చివరికి ఏమైంది? -
టైటిల్ గెస్ చేస్తే చాలు... సినిమాలో నటించొచ్చు!
మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని రమేశ్ హీరోగా ఎస్.ఎమ్.ఎల్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 గా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కుతోంది.హేమంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ప్రీలుక్ పోస్టర్ విడుదలైంది. రక్తంతో తడిసిన పదునైన కత్తిని ఎవ్వరికీ కనిపించకుండా వీపున దాచి పెట్టిన హీరో లుక్ ఈ పోస్టర్ లో చూడొచ్చు. ఈ ప్రీ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ చూస్తుంటే మాత్రం థ్రిల్లింగ్ జానర్ లో రాబోతున్న ఈ చిత్రంలో ఏదో కొత్త వైవిద్యం చూపించబోతున్నారని స్పష్టమవుతోంది. కాగా, ఈ పోస్టర్ చూసి సినిమా టైటిల్ గెస్ చేసే అవకాశం ప్రేక్షకులకే కల్పించింది చిత్రయూనిట్. ఎవ్వరైతే ఈ టైటిల్ గెస్ చేసి ఈ మెయిల్ కి (Info@smlproductions) పంపిస్తారో వారికి తమ ప్రొడక్షన్ నుంచి రాబోతున్న తదుపరి సినిమాలో అవకాశం కల్పిస్తామని నిర్మాతలు తెలిపారు. అతిత్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్. -
సిడ్నీలో పోచంపల్లి ఇక్కత్ నేత ప్రదర్శన
భూదాన్‌పోచంపల్లి: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఆస్ట్రేలియాలోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సిడ్నీలోని పవర్‌హౌస్ మ్యూజియంలో ‘చరఖా అండ్ కర్గా’ పేరిట చేనేత హస్తకళల ప్రదర్శన జరుగుతోంది. ఇండియన్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్, కేంద్ర జౌళి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రదర్శనలో పోచంపల్లికి చెందిన నేషనల్ హ్యాండ్లూమ్ మెరిట్ సర్టిఫికెట్ విన్నర్ తడక రమేశ్‌కు అవకాశం వచ్చింది. తడక రమేశ్ మగ్గంపై ఇక్కత్ వస్త్రాల తయారీ, చిటీకి కట్టడం, రంగులద్దకం, ఆసుపోయడం వంటి నేత ప్రక్రియలను ప్రత్యక్షంగా ప్రదర్శిస్తున్నారు. ఇండియా నుంచి పోచంపల్లి ఇక్కత్‌తో పాటు బనారస్ వస్త్రాల తయారీ ప్రత్యక్ష ప్రదర్శనకు అవకాశ వచ్చిందని రమేష్ తెలిపారు. భారత రాయబారి మనీష్ గుప్తా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఆగస్టు 15న ఉదయం 10 గంటలకు సిడ్నీలో జాతీయ జెండావిష్కరణ ఉంటుందని, స్థానికంగా ఉన్న భారతీయులందరూ పాల్గొంటారని చెప్పారు. ఈ వేడుకల్లో తాను, మాస్టర్‌వీవర్ పాలాది యాదగిరి భాగస్వామికావడం గర్వంగా ఉందన్నారు. (క్లిక్: మిస్ ఇండియా యూఎస్–2022 రన్నరప్‌గా సంజన) -
ఏపీలో ఏకనాథ్ షిండే తరహా ప్లాన్.. సీఎం రమేష్ సూత్రధారి
-
వివాహేతర సంబంధం.. పిల్లలను బంధువుల ఇంటికి పంపి..
దాచేపల్లి (గుంటూరు): భార్యను కట్టుకున్న భర్తే కడతేర్చాడు. ఈ దుర్ఘటన గురువారం పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నడికుడి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ ప్రాంతంలో ఉంటున్న చల్లా నాగమణి(28), రమేష్ దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు అఖిల్‌సాయి, లోకేష్ ఉన్నారు. కొంతకాలంగా నాగమణి వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తెలుసుకున్న రమేష్ ఆమెతో గొడవ పడుతున్నాడు. కుటుంబ పెద్దల వద్ద కూడా ఈ విషయంపై పంచాయితీ పెట్టాడు. ఈ నేపథ్యంలో పిల్లలను బంధువుల ఇంటికి పంపారు. బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య మళ్లీ వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో గురువారం ఉదయం 6 గంటల సమయంలో ఇంట్లో ఉన్న కత్తితో రమేష్ నాగమణిపై దాడి చేసి విచక్షణా రహితంగా నరికాడు. రక్తపుమడుగులో పడి నాగమణి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దీంతో రమేష్ పరారయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్ఐ రహ్మతుల్లా ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నాగమణి తల్లి జెట్టిపాటి చిట్టెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రహ్మతుల్లా చెప్పారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం సభ్యులు పరిశీలించి ఆధారాలు సేకరించారు. చదవండి: (బాలిక ప్రాణం తీసిన ఇన్స్టాగ్రాం.. అసభ్య మెసేజ్‌లు పోస్టు చేస్తూ..) -
కాలిఫోర్నియా టు అనాతవరం.. సొంతూరిలో సాఫ్ట్వేర్ కంపెనీ
సాక్షి, అమలాపురం టౌన్(తూ.గో): ఆయనో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు. ఉపాధ్యాయుడిగా 1999లో రాష్ట్రపతి అవార్డు పొందారు. ఉద్యోగ జీవితంలో వేలాది మందికి విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులను చేసిన ఆదర్శ ఉపాధ్యాయుడు. పేరు ఓరుగంటి శ్రీరామ్మూర్తి. ఊరు ముమ్మిడివరం మండలం అనాతవరం. ఆయన కుమారుడి పేరు రమేష్. ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన ఆయన.. కాలిఫోర్నియాలో ‘టెక్ మంత్రా నౌ’ పేరిట ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి దానికి ఫౌండర్, సీఈఓగా పని చేస్తున్నారు. అంతా బాగానే ఉన్నప్పటికీ పుట్టి, పెరిగిన ఊళ్లోనే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి, గ్రామీణ యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించాలన్నది శ్రీరామ్మూర్తి ఆశయం. ఈ విషయాన్ని అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్న తనయుడు రమేష్ దృష్టిలో పెట్టారు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చే లక్ష్యంతో టెక్ మంత్రా నౌ కంపెనీ శాఖను రమేష్ అనాతవరంలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ కంపెనీ శాఖలు హైదరాబాద్, బెంగళూరు, పుణె, చెన్నైలో ఉన్నాయి. ఈ క్రమంలోనే సొంతూరు అనాతవరంలో.. అదీ పూర్తి గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ కంపెనీ కొత్త శాఖ శనివారం ప్రారంభమవుతోంది. ఈ వివరాలను శ్రీరామ్మూర్తి, అమెరికా నుంచి వచ్చిన ఆయన తనయుడు రమేష్‌లు అమలాపురంలోని కన్యకా పరమేశ్వరి కల్యాణ మంటపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ప్రాథమికంగా 100 మందికి ఉద్యోగాలు అనాతవరంలో జాతీయ రహదారి 216 చెంతన నెలకొల్పిన ఈ కంపెనీలో ప్రాథమికంగా 100 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే 25 మందిని నియమించామని రమేష్ తెలిపారు. కాలిఫోర్నియాలో 2014లో స్థాపించిన తమ కంపెనీ ఏడో శాఖను అనాతవరంలో నెలకొల్పుతున్నామన్నారు. తాను అనాతవరం హైస్కూలులోనే పదో తరగతి వరకూ చదువుకున్నానని తెలిపారు. తమ కంపెనీలో ట్రైనింగ్ హెచ్ఆర్గా పని చేస్తున్న పేరి విశాలి, డెలివరీ స్ట్రాటజీ డైరెక్టర్‌గా పని చేస్తున్న నూకల చిన వెంకటరత్నంలు కూడా కోనసీమకు చెందిన వారేనని చెప్పారు. వారు అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాల పూర్వ విద్యార్థులని తెలిపారు. తండ్రి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ, తన ఆశయానికి అనుగుణంగా పుట్టిన ఊళ్లోనే సాఫ్ట్వేర్ కంపెనీ పెడుతున్న కుమారుడు రమేష్ ప్రయత్నాన్ని అభినందించారు. -
Dappu Ramesh: డప్పు రమేష్ కన్నుమూత
లబ్బీపేట (విజయవాడ తూర్పు)/తెనాలి: డప్పు రమేష్‌గా ప్రాచుర్యం పొందిన జన నాట్యమండలి కళాకారుడు ఎలియాజర్ (61) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని అంగలకుదురు ఆయన స్వగ్రామం. తెనాలిలోని వీఎస్సార్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో డిగ్రీ చదివాడు. ఆ సమయంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో చేరారు. 1981లో పీపుల్స్ వార్ పార్టీ ఆదేశాల మేరకు ఆ పార్టీ సాంస్కృతిక దళమైన జన నాట్యమండలి శిక్షణ తరగతులకు వెళ్లారు. ఆ తరువాత పూర్తిస్థాయి విప్లవ కళాకారుడిగా మారారు. చదవండి: AP: భరోసాపై బురద రాతలు.. అన్నదాతల్లో ఆగ్రహం గద్దర్, దివాకర్‌లతో పాటు జన నాట్యమండలిలో పనిచేశారు. నల్లమల అడవులు, దండకారణ్యంలో సంచరించారు. కొంతకాలం అజ్ఞాత జీవితం గడిపారు. అంతకుముందు ఉద్యమ కళాకారిణి కుమారిని వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి ఆమె మలేరియా బారినపడి మరణించడంతో జ్యోతి అనే ఉద్యమకారిణిని ద్వితీయ వివాహం చేసుకున్నారు. రమేష్ అంత్యక్రియలు శనివారం పల్నాడులోని జూలకల్లు గ్రామంలో జరుగుతాయని ఆయన భార్య జ్యోతి వెల్లడించారు. -
మాజీ సర్పంచ్ కురసం రమేష్ ఆడియో విడుదల చేసిన మావోలు
-
విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు..
బెంగళూరు(తుమకూరు): ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హేమావతి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తుమకూరు జిల్లా చేళూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతులను కేబీ క్రాస్ హేమావతి కాలువ కార్యాలయంలో సహాయ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న రమేష్(55), అతని భార్య మమత(46), కుమార్తె శుభ(25)గా గుర్తించారు. ఈ ముగ్గురు గురువారం సాయంత్రం కారులో సాగరనహళ్లి గేట్ వద్దకు చేరకుని హేమావతి కాలువలోకి ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో కాలువలో శవాలు తేలుతుండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (పాపం ప్రేమను గెలిపించుకోవాలనుకున్నాడు.. అదే శాపమై..) -
ప్రేమించి పెళ్లిచేసుకుని.. భర్త అకాల మరణం.. భార్య బలవన్మరణం
సాక్షి, చిన్నశంకరంపేట్(మెదక్): ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త అకాల మరణాన్ని తట్టుకోలేని భార్య బలవన్మరణానికి పాల్పడింది. నీ వెంటే నేనంటూ భర్త చనిపోయిన రెండు వారాలకే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై గౌస్ వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన ముచ్చర్ల మహేశ్వరి (25) భర్త రమేష్ ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనారోగ్యంతో రమేష్ ఈ నెల 6న మృతిచెందాడు. ఈ క్రమంలో మానసిక వేదనకు గురైన మహేశ్వరి ఆదివారం తెల్లవారుజామున పాతచెరువులో దూకింది. స్థానికులు గమనించి రక్షించడానికి ప్రయత్నించగా, అప్పటికే నీటిలో మునిగి మృతిచెందింది. మృతురాలి తండ్రి మల్లేశం ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 15రోజుల వ్యవధిలోనే దంపతులిద్దరు చనిపోవడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. వీరి మృతితో పిల్లలు అనాథలయ్యారు. చదవండి: (హన్మయ్య నీది ఎంతపెద్ద మనసయ్య.. వారి రుణం తీర్చుకోవడం కోసం..) -
డీఎంకే ఎంపీపై హత్యకేసు.. అరెస్టు చేసేందుకు సీబీసీఐడీ సన్నాహాలు?
సాక్షి, చెన్నై : కడలూరు ఎంపీ, డీఎంకే నేత రమేష్ ఓ హత్య కేసులో బుక్కయ్యారు. ఆయనపై శనివారం సీబీసీఐడీ కేసు నమోదు చేసింది. త్వరలో అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కడలూరు నుంచి డీఎంకే అభ్యర్థిగా టీఆర్వీఎస్ రమేష్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఆయనకు కడలూరులో జీడిపప్పు పరిశ్రమ ఉంది. ఇక్కడ మేల్ వా పట్టు గ్రామానికి చెందిన గోవిందరాజన్ పనిచేస్తున్నాడు. ఈయన పీఎంకేలో కార్యకర్త. ఈ పరిస్థితుల్లో గత నెల గోవిందరాజన్ మృతి చెందాడు. అయితే, ఆయన శరీరంపై గాయాలు ఉండడం అనుమానాలకు దారితీసింది. హత్యకేసు నమోదు చేయాలంటూ.. కిడంబలూరు పోలీసులను బాధిత కుటుంబం కోరింది. అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడంతో ఆ కుటుంబం కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు జిప్మర్ వైద్య బృందం పర్యవేక్షణలో గోవిందరాజన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించారు. ఈ నివేదిక మేరకు కేసును సీబీఐకి అప్పగించాలని ఆ కుటుంబం పట్టుబట్టింది. చదవండి: (ఇకపై ట్రాఫిక్ ఆపొద్దు.. ప్రజల వాహనాలతో కలిసే..) సీబీసీఐడీ కేసు నమోదు ఈ కేసును సీబీసీఐడీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. అధికార పార్టీకి చెందిన ఎంపీ రమేష్‌పై ఆరోపణలు గుప్పుమన్నాయి. ఆయనే కొట్టి చంపినట్లుగా, బలవంతంగా విషం తాగించినట్లు ప్రచారం జోరందుకుంది. ఈ పరిస్థితుల్లో రంగంలోకి దిగిన సీబీసీఐడీ శనివారం ఎంపీపై హత్య కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఎంపీ సహాయకుడు నటరాజన్, ఆ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులు కందవేల్, అల్లాపిచ్చై, సుందర్, వినోద్ పేర్లను కూడా కేసులో చేర్చారు. నటరాజన్ అనారోగ్యం పేరిట ఆస్పత్రిలో చేరడంతో మిగిలిన నలుగుర్ని సీబీసీఐడీ అరెస్టు చేసింది. కోర్టులో హాజరుపరిచిన అనంతరం వీరిని కడలూరు జైలుకు తరలించారు. అయితే, ఈ కేసులో ఎంపీ రమేష్‌ను అరెస్టు చేయడానికి సీబీసీఐడీ వర్గాలు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. గోవిందరాజన్ పరిశ్రమలో చోరికి పాల్పడినట్లు, ఆగ్రహించి ఆయన్ని చితక్కొట్టి హతమార్చినట్లుగా సీబీసీఐడీ గుర్తించినట్లు సంకేతాలు వెలువడ్డాయి. చదవండి: (ఆశిష్ మిశ్రా అరెస్ట్) ముఖ్యనేతలతో స్టాలిన్ సమాలోచన పార్టీకి చెందిన ఎంపీపై సీబీసీఐడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో కడలూరు జిల్లా ముఖ్య నేతలు, పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలతో అన్నాఅరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ సమావేశమయ్యారు. డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్ బాలు, న్యాయవిభాగం నేతలు, రాజ్యసభ సభ్యుడు విల్సన్, ఎన్.ఆర్ ఇలంగోవన్, మంత్రి ఎంఆర్కే పన్నీర్‌సెల్వం ఈ సమావేశానికి హాజరయ్యారు. సీబీసీఐడీ నుంచి లభించే సమాచారం మేరకు పార్టీ పరంగా రమేష్‌పై చర్యలకు డీఎంకే సిద్ధమవుతోంది. -
ఈటల రాజేందర్‌కు షాకిచ్చిన ప్రధాన అనుచరుడు
సాక్షి, కరీంనగర్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రధాన అనుచరుడు, కరీంనగర్ కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్ షాకిచ్చారు. ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీ భావజాలలలో ఇమడలేక పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. కాగా, ప్రశ్నించే గొంతును మూగబోనివ్వకుండా కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందని, రాజీనామా వల్లే నియోజకవర్గంలో వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ జిల్లాలోని ఇల్లందకుంట మండలంలోని వంతడుపుల, సిరిసేడు, మర్రివానిపల్లి, బూజునూర్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. రచ్చబండ తరహాలో ప్రజల మధ్య కూర్చొని వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు తమ బాధలను, కష్టాలను ఈటలతో పంచుకున్నారు. అనంతరం పలువురు ఈటల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. చదవండి : మోదీ సూచనలతోనే అక్రమ కేసులు, సోదాలు -
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌ను బెదిరించిందెవరు?
ప్రొద్దుటూరు : జిల్లాలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్ ఫోన్‌కాల్స్ బెదిరింపు వ్యవహారంపై జోరుగా చర్చ జరుగుతోంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఎమ్మెల్సీని బెదిరించాల్సిన అవసరం ఎవరికి ఉంది.. ఎవరు బెదిరించారనే విషయంపై రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఎమ్మెల్సీ ఆర్.రమేష్‌యాదవ్‌ల మధ్య విభేదాలు సృష్టించడానికే ఇలా చేసి ఉండొచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. మున్సిపల్ ఇన్చార్జి మాజీ చైర్పర్సన్ ఆర్.వెంకటసుబ్బయ్య కుమారుడైన రమేష్ యాదవ్ హైదరాబాద్‌లో అబాకస్ కన్సల్టెన్సీ నిర్వహిస్తుండేవారు. మూడేళ్ల క్రితం ఆయన ప్రొద్దుటూరుకు వచ్చి ఆర్వీఎస్ సోషల్ సపోర్టు ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీటిని గుర్తించిన ఎమ్మెల్యే రాచమల్లు ప్రోత్సహించారు. అలాగే మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా నిలిపేందుకు ఎమ్మెల్యే అన్ని ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం ఆదేశాలతో సామాజిక సమీకరణాల్లో భాగంగా చివరి సమయంలో చేనేత వర్గానికి చెందిన భీమునిపల్లి లక్ష్మీదేవిని చైర్‌పర్సన్‌గా ఎంపిక చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో అధిష్టానం ఆదేశాలను ఎమ్మెల్యే శిరసావహించాల్సి వచ్చింది. రమేష్ యాదవ్ చైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు ఒకింత డబ్బు ఖర్చు చేయగా ఎమ్మెల్యే రెండింతలు ఖర్చు చేయాల్సి వచ్చింది. పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన ఎమ్మెల్యే పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. రమేష్ యాదవ్ చేత డబ్బు ఖర్చు పెట్టించారని ప్రతిపక్షాలు విమర్శించగా తన డబ్బును తిరిగి ఇస్తానని మీడియా ద్వారా స్వయంగా ఎమ్మెల్యే వివరించారు. ఎమ్మెల్సీ పదవి ఇప్పించేందుకు ఎమ్మెల్యే కృషి: మున్సిపల్ చైర్మన్‌గా అవకాశం కోల్పోయిన రమేష్‌యాదవ్‌కు ప్రభుత్వంలో ప్రాతినిథ్యం కల్పించాలని ఎమ్మెల్యే ఆలోచించారు. అదే సమయంలో ఎమ్మెల్సీ స్థానాన్ని బీసీ యాదవ సామాజిక వర్గానికి కేటాయించాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నిర్ణయించింది. ఈ విషయంపై అవగాహన ఉన్న ఎమ్మెల్యే రాచమల్లు రమేష్ యాదవ్ సమస్యను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై మూడు మార్లు సీఎంతో ఎమ్మెల్యే భేటీ అయినట్లు తెలిసింది. ఏది ఏమైనా మూడు నెలల క్రితం కౌన్సిలర్ అయిన రమేష్ యాదవ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇప్పించడంలో ఎమ్మెల్యే సఫలీకృతులయ్యారు. ప్రొద్దుటూరు మున్సిపల్ చరిత్రలో కౌన్సిలర్లు ఎవ్వరూ ఎమ్మెల్సీగా ఎన్నిక కాలేదు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన రమేష్ యాదవ్ గత నెల 21న ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత నాలుగు రోజులకే ఇంటర్నెట్ కాల్స్ ద్వారా ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. జూన్ 26వ తేదీన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయడానికి రమేష్ యాదవ్ మున్సిపల్ కార్యాలయానికి రాగా అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ నాయకుడు పాతకోట బంగారు మునిరెడ్డితో చర్చించారు. వెంటనే బంగారు మునిరెడ్డి ఎమ్మెల్సీని డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి ఫోన్‌కాల్స్ బెదిరింపుపై ఆరా తీయాలని కోరినట్లు తెలిసింది. ఫోన్ కాల్స్‌లో నందం సుబ్బయ్య పేరును ప్రస్తావించడం వెనుక దురుద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య దూరం పెంచడానికి ఉద్దేశపూర్వకంగా ఫోన్ కాల్స్ చేశారా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. గత సోమవారం ఎమ్మెల్యే శ్రీరాములపేటలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీతో ఫోన్‌కాల్స్ బెదిరింపు విషయంపై మాట్లాడారు. ఎమ్మెల్సీ పదవి ఇప్పించడానికి చేసిన ప్రయత్నాలను అందరికి ఎమ్మెల్యే కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించారు. కొంత మంది ప్రతిపక్ష నాయకులు ఇదే అదునుగా భావించి ఎమ్మెల్సీని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఓ ప్రతిపక్ష నాయకుడు కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. -
లవ్, సస్పెన్స్ ఎంటర్ టైనర్‌గా రమేష్ గోపిల నాల్గో చిత్రం
రమేష్, గోపిల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాలుగో చిత్రం ఆదివారం పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా నటుడు శోభన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఎస్పీ క్రియేషన్ బ్యానర్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా ప్రారంభోత్సవంలో రచ్చ రవి, హీరో రామన్, విక్రమ్ , చంద్ర వట్టికూటి, మోహన్ , మధు పగడాల, డాక్టర్ కృష్ణమూర్తి, రాహుల్, తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా గురించి దర్శకులు వివరాలు తెలియచేస్తూ ... ‘మేము దర్శకత్వం వహిస్తున్న నాలుగో సినిమా ఇది. మేము ఇదివరకే హీరో తరుణ్ తో ఇది నా లవ్ స్టోరీ, ఆ తరువాత రెడ్డి గారింట్లో రౌడీయిజం తీశాం, అది విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ఈ మద్యే కన్నడలో ఓ సినిమా చేశాం, అది కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇది మా నాలుగో సినిమా. ఈ చిత్రం ద్వారా శోభన్ ను హీరోగా పరిచయం చేస్తూన్నాం, తాను ఇప్పటికే యాక్టింగ్, డాన్స్, ఫైటింగ్ లాంటి అంశాల్లో శిక్షణ తీసుకున్నాడు. ఈ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోతాడు. ఈ సినిమా లవ్, సస్పెన్స్ ఎంటర్ టైనర్ గా ఉంటుంది. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ రోజు పూజ కార్యక్రమాలతో ప్రారంభించాం. లాక్ డౌన్ ఎత్తివేయగానే .. రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. ఈ చిత్రానికి సంబందించిన మిగతా నటీనటుల టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’ అని అన్నారు. -
వక్రించిన విధి
ప్రత్తిపాడు: విధి ఆ కుటుంబంపై విషం చిమ్మింది. అన్యోన్య దాంపత్యంపై మృత్యు సంతకం చేసింది. నూరేళ్ల బంధాన్ని చిదిమేసింది. పండుగ ప్రయాణాన్ని.. విషాదంగా మార్చింది. భార్యభర్తలిద్దరినీ మృత్యువు కబళించింది. విదేశాల నుంచి వచ్చిన అమ్మానాన్నల మురిపెం తీరకుండానే.. ఒక చిన్నారిని అనాథను చేసింది. ఈ హృదయ విదారక ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు సమీపంలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామానికి చెందిన జొన్నలగడ్డ రమేష్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. వృత్తిరీత్యా భార్య నీలిమతో కలిసి సింగపూర్‌లో ఉంటున్నాడు. కుమార్తె అశ్విత (15) చెన్నైలో హాస్టల్లో ఉంటూ పదోతరగతి చదువుకుంటోంది. రమేష్‌కు చెన్నై బదిలీ అవడంతో ఎనిమిది రోజుల కిందట భార్యాభర్తలిద్దరూ చెన్నైలోని సొంతింటికి చేరుకున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో రమేష్, నీలిమ దంపతులు కుమార్తె అశ్వితతో సహా బుధవారం కారులో చెన్నై నుంచి కొవ్వూరుకు బయలుదేరారు. మార్గంమధ్యలో 16వ నంబరు జాతీయ రహదారిపై చినకోండ్రుపాడు సమీపాన వీరి వాహనం ముందు వెళుతున్న గుర్తుతెలియని వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమేష్ అక్కడిక్కడే మృతిచెందాడు. నుజ్జునుజ్జయిన కారులోంచి అతికష్టం మీద నీలిమ, అశ్వితలను స్థానికులు, పోలీసులు బయటకుతీసి 108 అంబులెన్సులో సమీపంలోని కాటూరి వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నీలిమ మృతిచెందింది. అశ్విత అపస్మారకస్థితిలోకి వెళ్లిందని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ప్రమాదస్థలాన్ని ఎస్సై అశోక్ పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సాక్షి ఆర్టిస్ట్ రమేష్ కన్నుమూత
సాక్షి, తిరుపతి: సాక్షి దినపత్రిక తిరుపతి ఎడిషన్‌లో డిప్యూటీ చీఫ్ ఆర్టిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్న కాట్పాడి రమేష్ (53) సోమవారం తుదిశ్వాస విడిచారు. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉండటంతో గత నెల18న ఆయన తిరుపతిలోని పద్మావతి కోవిడ్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షలు చేసి కరోనా సోకినట్లు నిర్ధారించారు. అప్పటి నుంచి అక్కడే ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం తీవ్రమైన అస్వస్థతకు గురై కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, రమేష్ కుటుంబ సభ్యులకు రూ.లక్ష సాయం చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకటించారు. -
‘రమేష్‌ను ఎక్కడ దాచారో చంద్రబాబు చెప్పాలి’
సాక్షి, తాడేపల్లి: అమరావతిలో ప్రజా ఉద్యమమే లేదు. అక్కడ జరిగేది భూస్వామ్య, పెట్టుబడిదారి, ధనవంతుల ఉద్యమం అన్నారు వైస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు రాజధాని కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నట్టు భ్రమ కల్పిస్తున్నారు. అమరావతి అనేది పెద్ద స్కాం. చంద్రబాబు తన తాబేదార్లు కోసం పెట్టిందే అమరావతి. రాజధాని కోసం 85 మంది చనిపోయిన దాఖలాలు లేవు. అదంతా ఓ కట్టుకథ. రాజధాని కోసం త్యాగాలు లేవు. సాధారణంగా చనిపోయిన వారిని అమరావతి కోసం చనిపోయారని ప్రచారం చేస్తున్నారు. 85 మంది అమరావతి కోసం చనిపోతే ఉద్యమమం ఇలా ఉంటుందా. దళితులకు ఇచ్చిన భూములను టీడీపీ నేతలు బలవంతంగా లాక్కున్నారు. అమరావతిలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతుంది. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు. త్వరలో మరికొంత మందిని అరెస్ట్ చేస్తారు. అభివృద్ధి అంతా హైదరాబాద్‌లో కేంద్రీకృతం కావడం వలన మనం నష్ట పోయాం. ఏ ప్రాంతానికి అన్యాయం జరగకూడదనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ చేశారు’ అని స్పష్టం చేశారు అంబటి. (డాక్టర్ రమేష్‌ను మీ ఇంట్లో దాచారా బాబూ?) అంతేకాక ‘జూమ్‌లో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఎవరిని సంప్రదించకుండా మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నారని మాట్లాడటానికి చంద్రబాబుకు సిగ్గుండాలి. పరిపాలన వికేంద్రీకరణపై శాసనసభలో చర్చ జరిగింది. ఆ రోజు చంద్రబాబు అసెంబ్లీ నుంచి పారిపోయారు. పీడిత ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్న చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ మద్దతు తెలుపుతున్నారు. తమది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియానా.. లేక క్యాప్టలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియానా అనే దానికి రామకృష్ణ సమాధానం చెప్పాలి. నేరం జరిగినప్పుడు దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రమేష్ హాస్పిటల్స్ నిర్లక్ష్యం కారణంగా పది మంది చనిపోయారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా. అప్పుడు నిమ్మగడ్డ రమేష్, ఇప్పుడు డాక్టర్ రమేష్‌ను చంద్రబాబు ఎందుకు వెనకేసుకొస్తున్నారు. ఎందుకు దాస్తున్నారు.. తనని పోలీసులకు అప్పగించాలి. విచారణకు రమేష్ సహకరించాలి. తనని ఎక్కడ దాచారో చంద్రబాబు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు అంబటి. -
స్వదేశీ కోచ్‌లపై కేంద్రం చిన్నచూపు
చెన్నై: దేశవాళీ కోచ్‌ల విషయంలో ప్రభుత్వ వైఖరి పట్ల ఆలిండియా చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) మాజీ చీఫ్ సెలక్టర్, గ్రాండ్‌మాస్టర్ ఆర్బీ రమేశ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశానికి పతకాలు అందించే క్రీడాకారులను తయారుచేసినప్పటికీ జాతీయ అవార్డుల విషయంలో స్వదేశీ కోచ్‌లను ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. ప్రస్తుతం చెస్‌లో అద్భుతాలు చేస్తోన్న ఆర్. ప్రజ్ఞానంద, వైశాలి, జాతీయ చాంపియన్ అరవింద్ చిదంబరం, కార్తికేయన్ మురళీ వంటి ఆటగాళ్లను తీర్చిదిద్దిన రమేశ్... భారత కోచ్‌ల జీతాల విషయంలోనూ కేంద్రం తీరును విమర్శించారు. ‘భారత కోచ్‌లు కేంద్రం అందించే అవార్డుల గురించి ఆలోచించకపోవడమే ఉత్తమం. 15 ఏళ్లలో భారత్. 34 ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ పతకాలు, 40 ఆసియా యూత్, 5 ఆసియా సీనియర్, 23 కామన్వెల్త్ పతకాలు, చెస్ ఒలింపియాడ్‌లో కాంస్యం సాధించింది. కానీ కేంద్రం నుంచి లభించిన అవార్డులు సున్నా. అసలు క్రీడా పాలసీ అనేది ఉందా? భారత జట్టు చెస్ కోచ్‌కు ఒక్క రోజుకు లభించే జీతమెంతో ఎవరూ ఊహించలేరు. చెప్పినా నమ్మరు కూడా! కానీ విదేశీ కోచ్‌లకు 10 రెట్లు అధికంగా చెల్లింపులు ఉంటాయి’ అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. -
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం
-
శ్రీకాకుళంలోనే బరాటం రమేష్ ఉన్నాడా?
శ్రీకాకుళం రూరల్: రూరల్ మండలంలోని గూడెం గ్రామానికి చెందిన బరాటం రమేష్ శ్రీకాకుళంలోనే తలదాచుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం సాక్షిలో ప్రచురితమైన చీటింగ్ వార్తతో ఆమదాలవలస పరిసర ప్రాంతాలకు చెందిన కొంతమంది వ్యాపారులు, చేతివృత్తిదారులు, ఇతరత్రా బాధితులంతా గూడెం గ్రామానికి చేరుకున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద ప్రాంసరీ నోటు ఆధారంగా తీసుకున్న నగదు, చీటీల సొమ్మును మరోసారి లెక్కించే పనిలో పడ్డారు. నిందితుడు రాసిచ్చిన బాండ్లు, ప్రాంసరీ నోట్లు పట్టుకుని గురువారం రూరల్ పోలీసులను ఆశ్రయించనున్నారు. వీటిన్నింటినీ లెక్కిస్తే రూ.5 కోట్లకుపైనే టోకరా వేసినట్లు తెలుస్తోంది. ఈ సొమ్ములో కొంత మొత్తం తనకు ఆప్తులైన పొన్నాడలో బినామీల పేరిట జమ చేసినట్లు సమాచారం. జల్సారాయుడు... బాధితుల సొమ్ముతో రమేష్ జల్సాలు చేసేందుకు ఎక్కువగా ఖర్చు పెట్టేవాడని గ్రామస్తులు అంటున్నారు. ప్రధానంగా ఖరీదైన దుస్తులతోపాటు ఇతర ఆడంబరాలకు వెచ్చించేవాడు. తీర్థ యాత్రల కోసం విమానాల్లో షికార్లు చేసేవాడు. గతేడాది డిసెంబర్లో షిర్డీ తీర్థయాత్రకు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిపి 23 మందితో ప్రత్యేక విమానంలో వెళ్లి వచ్చినట్లు తెలిసింది. పొన్నాడలో అత్తవారు.. రమేష్ అత్తవారు ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామంలో ఉంటున్నారు. ప్రస్తుతం వీరి వద్దనే అతడి పిల్లలు చదువుకుంటున్నారు. అయితే నిందితుడితోపాటు ఆయన భార్య సెల్ఫోన్లు వారం రోజులుగా పనిచేయడం లేదు. పొన్నాడలో బంధువులను విచారిస్తే, ఆచూకీ తెలుస్తుందని గూడెం గ్రామస్తులు చెబుతున్నారు. -
మద్యంలో నిద్రమాత్రలు కలిపి..
సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్: నగరంలోని జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిన చేపల వ్యాపారి పి.రమేష్ (50) హత్య కేసు కొలిక్కి వచ్చింది. ఈయనకు పరిచయస్తుడైన, గతంలో వీరి ఇంట్లో అద్దెకు ఉన్న రాజు నాయక్ డబ్బు కోసమే పథకం ప్రకారం ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు స్పష్టంమైంది. మద్యంలో నిద్రమాత్రలు కలిపి రమేష్‌తో తాగించిన రాజు.. అపస్మాకర స్థితిలోకి చేరుకున్న తర్వాత సుత్తితో తలపై మోది హత్య చేశాడు. మృతదేహాన్ని మాయం చేయాలనే ఉద్దేశంతోనే ముక్కలుగా కత్తిరించడానికి సిద్ధమయ్యాడని తేలింది. పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడు రాజు నాయక్‌ను బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సినిమాలపై మోజుతో సిటీకి రాక.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి చెందిన రాజు నాయక్ అలియాస్ రిజ్వాన్ అలియాస్ శ్రీనివాస్ అక్కడే డిగ్రీ పూర్తి చేశాడు. సినిమాలపై మోజు ఉన్న ఇతగాడు వివాహానంతరం నగరానికి వలసవచ్చాడు. కొన్నాళ్లు ఏజీ కాలనీ సమీపంలోని వికాస్పురి కాలనీలో ఉన్న రమేష్ ఇంటి మొదటి అంతస్తులో ఆరేళ్ల పాటు అద్దెకు ఉన్నాడు. సినీ రంగంలో స్థిరపడాలనే ఉద్దేశంతో జూనియర్ ఆర్టిస్టుగా కార్డు కూడా తీసుకున్నాడు. అయితే ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ఇతడికి నిరాశే మిగిలింది. దీంతో 2015లో మరికొందరితో కలిసి ‘రేపల్లె ప్యాసింజర్’ పేరుతో షార్ట్‌ఫిల్మ్ రూపొందించి యూ ట్యూబ్‌లోకి అప్లోడ్ చేశాడు. కొన్నాళ్ల క్రితం మరో యువతిని వివాహం చేసుకున్న రాజు ఇద్దరు భార్యల్నీ నగరంలోని గాంధీనగర్, మల్కాజిగిరిలలో వేర్వేరుగా ఉంచాడు. ఒక్కో భార్యకు ఇద్దరు చొప్పున ప్రస్తుతం రాజుకు నలుగురు సంతానం. బతుకుదెరువు కోసం ఓ ఆన్లైన్ సంస్థలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఇతడిపై గతంలో చిలకలగూడ పోలీసు స్టేషన్లో ఓ కేసు కూడా నమోదైంది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో... ఫుడ్ డెలివరీబాయ్‌గా వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు చాలకపోవడంతో పాటు ఇటీవల ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో డబ్బు సంపాదించడానికి అనువైన మార్గాలు అన్వేషించాడు. గతంలో రమేష్ ఇంట్లో అద్దెకు ఉండటం, ఇద్దరూ కలిసి పలుమార్లు మద్యం తాగడం, అతడి వ్యాపారం, ఆర్థిక లావాదేవీలు తెలిసి ఉండటంతో అతడినే టార్గెట్‌గా ఎంచుకున్నాడు. పథకం ప్రకారం 15 రోజుల క్రితం జవహర్‌నగర్‌లో శ్రీనివాస్ అనే పేరుతో గది అద్దెకు తీసుకున్నాడు. గత నెల 26 నుంచి రెండుసార్లు రమేష్‌ను అక్కడకు ఆహ్వానించి ఇద్దరూ కలిసి మద్యం తాగారు. రమేష్‌కు ఫోన్లు చేయడం కోసం కొత్తగా ఓ సెల్‌ఫోన్ ఖరీదు చేశాడు. రోడ్డుపై లభించిన ఓ సిమ్‌కార్డును అందులో వేసి, రీచార్జి చేసి వినియోగించాడు. గత శనివారం సాయంత్రం 6.30 గంటలకు రమేష్‌కు ఫోన్ చేసిన రాజు నాయక్.. ఈఎస్ఐ వద్దకు పిలిచాడు. అక్కడ నుంచి రమేష్‌ను ఆయన స్కూటీపై జవహర్‌నగర్‌లోని తన అద్దె గదికి తీసుకొచ్చాడు. తనకు రూ.90 లక్షలు కావాలని కోరాడు. దీనికి రమేష్ తిరస్కరించి.. తన వద్ద అంత మొత్తం లేదని తేల్చి చెప్పాడు. అదను చూసుకుని.. ఆపై ఇద్దరూ మద్యం తాగడానికి ఉపక్రమించారు. రాజు నాయక్ అదను చూసుకుని అప్పటికే సిద్ధం చేసి ఉంచుకున్న నిద్రమాత్రల్ని మద్యంలో కలిసి రమేష్‌తో తాగించాడు. అతడు పూర్తిగా మత్తులోకి జారుకున్నాడని నిర్ధారించుకున్న తర్వాత సిద్ధం చేసి ఉంచిన సుత్తితో తలపై మోది చంపేశాడు. హతుడి మెడలో ఉన్న నాలుగు ఉంగరాలు, మెడలోని రెండు గొలుసులు తీసుకుని, మృతదేహాన్ని అదే గదిలో వదిలేసి శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మల్కాజిగిరిలోని తన ఇంటికి వెళ్లాడు. మృతదేహం నుంచి తీసుకున్న బంగారాన్ని తాకట్టు పెట్టాడు. మృతదేహాన్ని మాయం చేయాలనే ఉద్దేశంతో ఆదివారం తన భార్యను, కుమారుడైన చిన్నారిని తీసుకుని హతుడి స్కూటీపై జవహర్‌నగర్‌లోని గదికి వచ్చాడు. దానికి ముందే మోండా మార్కెట్ ప్రాంతంలో ఓ పెద్ద కత్తిని ఖరీదు చేశాడు. గదికి వచ్చిన తర్వాత మృతదేహాన్ని అలా తరలించడం సాధ్యం కాదనే ఉద్దేశంతో ముక్కలుగా చేసి వేర్వేరు ప్రాంతాల్లోని చెత్త కుండీల్లో పారేయడానికి పథకం వేశాడు. ముందుగా మృతదేహానికి ఉన్న రెండు చేతులు నరికేశాడు. వాటిని ఓ కవర్లో పెట్టి తరలించడానికి సిద్ధమై... కాళ్లనూ నరకడానికి ప్రయత్నించాడు. డబ్బు డిమాండ్ చేస్తూ సందేశాలు.. మృతదేహాన్ని ముక్కలు చేసి తరలించడానికి వెనుకాడిన రాజు నాయక్ అక్కడే వదిలేసి, గదికి తాళం వేసి.. భార్య, కుమారుడితో కలిసి మల్కాజిగిరి వెళ్లిపోయాడు. రమేష్ కోడలికి హతుడి సెల్‌ఫోన్ నుంచే రూ.19 లక్షలు ఇస్తే మీ మామను వదిలేస్తానంటూ మెసేజ్ పెట్టాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం మరోసారి భార్యతో కలిసి జవహర్‌నగర్‌కు వచ్చిన రాజు గదిలోని సామాన్లు సర్దుకుని వెళ్లిపోయాడు. గురువారం సాయంత్రం గది నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అది రమేష్ మృతదేహంగా గుర్తించారు. దీంతో ఎస్సార్‌నగర్‌లో నమోదైన మిస్సింగ్ కేసును, మర్డర్ కేసుగా మార్చారు. సాంకేతికంగా దర్యాప్తు చేసిన పోలీసులు ముషీరాబాద్‌లోని రాజు ఇంటిని గుర్తించి అతడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. ఆమె సహకారంతో బుధవారం రాత్రి మల్కాజిగిరిలోని మరో భార్య వద్ద ఉన్న రాజును పట్టుకున్నారు. ఇతడి నుంచి కత్తి, సుత్తితో పాటు హతుడి బంగారం తాకట్టు పెట్టిన రసీదులు స్వాధీనం చేసుకున్నారు. తాకట్టు దుకాణం నుంచి బంగారం రికవరీ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని ఎస్సార్‌నగర్ పోలీసులకు అప్పగించారు. -
చేపల వ్యాపారి హత్య కేసులో వీడిన మిస్టరీ
-
చిత్ర సీమలో మరో యువ కెరటం
సాక్షి, కడప: వైఎస్సార్ జిల్లా కళలకు కాణాచి. అటు నాటక రంగం.. ఇటు సీనీ రంగంలో ఎందరో ప్రముఖులు తమ దైన ముద్రను వేశారు. అంతర్జాతీయ స్థాయిలో కడప ఖ్యాతి చాటారు. ఇప్పుడు 29 ఏళ్ల మరో యువ కెరటం జాకట రమేష్ నిరాదరణకు గురవుతున్న భారతీయ ప్రాచీన క్రీడ ఖోఖో కథాంశంతో ‘రథేరా’ చిత్రాన్ని నిర్మించారు. ఈయన 2016లో రైతుల సమస్యలపై తీసిన ఒక షార్ట్ ఫిల్మ్‌కు జాతీయ స్థాయి అవార్డు లభించింది. రథేరా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో జనవరి 1న విడుదల అవుతోంది. అగ్ర హీరోల సినిమాలు రాబోతున్న తరుణంలో కొత్త వారితో ‘రథేరా’ విడుదల కావడం ఆసక్తిని రేపుతోంది. ఫోర్ హ్యాండ్స్ మీడియా బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం విడుదల సందర్భంగా దర్శకుడు జాకట రమేష్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ. సాక్షి : మీ నేపథ్యం వివరాలు? రమేష్ : మాది వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం, రాజుపాలెం గ్రామం అమ్మ పేరు దేవమ్మ, నాన్న పేరు ఏలిఆయ, చెల్లెలు ప్రశాంతి. నేను ప్రొద్దుటూరు ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ వరకు చదివాను. సాక్షి : సినీ రంగంపై ఎలా ఆసక్తి పెరిగింది? రమేష్ : చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. సినీ రంగంలో నిలబడి సందేశాత్మక చిత్రాలు నిర్మించాలనేది నా కోరిక. అందుకోసం కథలను రాసేవాడిని. ఈ క్రమంలో 2011లో ‘ఎ డ్రై స్టోరీ’ షార్ట్ ఫిల్మ్‌ను తీశాను. చిత్రాన్ని నిర్మించాను. ఇదే సందర్భంలో కెమెరాపై ఆసక్తి పెరిగింది. తరువాత కెమెరామెన్‌గా పట్టు సాధించాను. 2011లో రైతుల సమస్యలపై ఒక లఘ చిత్రాన్ని రూపొందించాను. దీనికి హైదరాబద్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఎడిటింగ్ విభాగానికి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది. తరువాత 30 షార్ట్ ఫిల్మ్‌లకు పని చేశాను. 10 లఘ చిత్రాలను స్వయంగా తీశాను. సాక్షి : ఖోఖో క్రీడాంశంతో ఎందుకు సినిమా తీయాలనిపించింది? రమేష్ : నేను ఖోఖో క్రీడాకారుడిని. 2006లో అహ్మదాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడాను. ప్రస్తుతం క్రికెట్, ఫుట్‌బాల్, షటిల్ తదితర ఆటలకు విపరీతమైన ఆదరణ పెరిగింది. దీంతో భారత ప్రాచీన క్రీడ ఖోఖోకు ఆదరణ తగ్గింది. ఈ తరుణంలో ఖోఖో క్రీడకు మళ్లీ పూర్వ వైభవం తేవాలని సంకల్పించాను. సాక్షి : రథేరా అంటే? రమేష్ : పూర్వం రథాల ద్వారా ఆడే ఆటను రథేరా అని పిలిచేవారు. ఈ ఆట మహారాష్ట్రలో పుట్టింది. ఇది యుద్ధ తంత్రాలు, వ్యూహాలకు సంబంధించిన ఆట. క్రమేణా ఈ ఆట మార్పులు చేసుకొని ఖోఖోగా మారింది. ఇది మన దేశ అతి ప్రాచీన క్రీడ. సాక్షి : ఎంతమంది నటులతో సినిమాను తీశారు? రమేష్ : ఈ చిత్రంలో హీరోగా సిద్దు, హీరోయిన్గా మానస, విలన్‌గా కృష్ణమూర్తి, నరేష్‌యాదవ్ నటించారు. ఖోఖో క్రీడాకారులుగా 9 మందిని ఎంపిక చేసి వారికి ఒకటిన్నర నెల శిక్షణ ఇచ్చాం. మొత్తం 75 నూతన నటులతో సినిమా తీశాం. అందులో హీరోయిన్ మినహా అందరూ మన జిల్లాకు చెందిన వారే. సాక్షి : మాజీ మేయర్ సురేష్‌బాబు పాత్ర ఎలాంటిది? రమేష్ : ఇందులో కడప మాజీ మేయర్ సురేష్‌బాబు ఒక ఆఫీసర్ పాత్రను పోషించారు. ఈ చిత్రంలో ఈ పాత్ర కీలకమైంది. సురేష్‌బాబు అద్భుతంగా నటించారు. సాక్షి : ప్రముఖులు ప్రశంసించినట్లుగా తెలిసింది? రమేష్ : ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ సినీనటులు ఫృద్వీ ఈ చిత్రాన్ని చూసి ప్రశంసించడం సంతోషంగా ఉంది. జనవరి 1న తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 45కు పైగా థియేటర్లలో సినిమా విడుదల అవుతోంది. పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతున్న తరుణంలో మా చిన్న సినిమా వస్తోంది. అయినా తట్టుకొని నిలబడుతామనే నమ్మకం ఉంది. ఎందుకంటే మా కథలో జీవం ఉంది. మనసును కదిలించే సన్నివేశాలు ఉన్నాయి. పైగా మంచి సినిమాను ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ప్రశ్న: ఎన్ని రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు? జవాబు: జూలై 2018లో కడపలోని ఎన్జీఓ కాలనీ సాయిబాబా గుడిలో షూటింగ్ ప్రారంభించాం. చిత్రీకరణ అంతా 98 శాతం జిల్లాలోనే సాగింది. ఒక షాట్ మాత్రమే నెల్లూరులో తీశాం. 58 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. -
‘తెలంగాణలో ఆర్ఎస్ఎస్ బలమైన శక్తి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) బలమైన శక్తిగా ఉందని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ అన్నారు. బర్కత్‌పుర కేశవ నిలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడు దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ పలు కార్యక్రమాలు చేపడుతోందని ఆయన తెలిపారు. 2024 నాటికి వంద ఏళ్లు పూర్తి చేసుకోబోతోందని రమేష్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 1600 క్లస్టర్లు ఉన్నాయని.. అన్ని క్లస్టర్లకు ఆర్ఎస్ఎస్ చేరుకోవలనే లక్ష్యంతో విజయ సంకల్ప శిబిరం పేరుతో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. డిసెంబర్ 24, 25, 26 తేదీల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయని రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అతిథిగా రాబోతున్నారని రమేష్ తెలిపారు. భారతి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు సరూర్‌నగర్ స్టేడియంలో ‘సార్వజనిక సభ’ నిర్వహిస్తున్నామని రమేష్ చెప్పారు. దీనికి ముఖ్య అతిధులుగా ఐఐటీ హైదరాబాద్ బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డితో పాటు, వక్తగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొంటారని రమేష్ తెలిపారు. 2024 లక్ష్యం పెట్టుకున్నప్పటికీ ప్రతి బస్తీకి ఇప్పటికే చేరుకోగలిగామని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్కి హైదరాబాద్ నగరంలో 800 శాఖలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇప్పటికే 1005 సేవ కార్యక్రమాలు చేపట్టామని రమేష్ వెల్లడించారు. తెలంగాణలో విస్తరించేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. చదవండి: ఆర్ఎస్ఎస్ తెలంగాణ బాట -
మెంచు రమేష్, శిల్ప అరెస్టు
మల్లాపూర్: మావోయిస్టులతో సంబంధాలున్నట్లు ఆరోపిస్తూ నాచారం దుర్గానగర్‌లో ఉండే తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంచు రమేష్‌ను గద్వాల పోలీసులు అరెస్ట్ చేశారు. సోదాలు నిర్వహించి కొన్ని విప్లవ సాహిత్య పుస్తకాలను స్వాధీనం చేసుకొని రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా రేపోని గ్రామానికి చెందిన మెంచు ఎల్లయ్య, భారతమ్మల చిన్న కుమారుడు రమేష్(36) ఉస్మానియాలో పీహెచ్డీ చేస్తున్నాడు. 8 ఏళ్ల క్రితం రాణితో వివాహం అయింది. వీరికి పాప ఉంది. మంగళవారం నాచారం దుర్గానగర్‌లోని రమేష్ ఇంట్లో గద్వాల పోలీసులు 6 గంటలపాటు సోదాలు నిర్వహించారు. అనంతరం రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 9 గంటలకు 15 మంది వచ్చి ఇంట్లో తనిఖీలు, సోదాలు చేశారని రాణి తెలిపారు. పోలీసులే విప్లవ సాహిత్య పుస్తకాలను తీసుకొచ్చి కిచెన్ రూమ్‌లో పెట్టి ఇంట్లో దొరికినట్లు ఆరోపిస్తూ తన భర్తను అరెస్ట్ చేసినట్లు ఆమె వెల్లడించారు. 2 నెలల నుంచి రమేష్ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. శిల్ప ఇంట్లో సోదాలు... కీసర: మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ ఎస్వీ నగర్లో ఉంటున్న చైతన్య మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిల్పను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నాగారానికి చేరుకున్న గద్వాల పోలీసులు కీసర పోలీసుల సహకారంతో శిల్ప ఇంట్లో సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు సోదాలు నిర్వహించిన పోలీసులు శిల్ప ఇంట్లో నిషేధిత సాహిత్య పుస్తకాలు, లెటర్ ప్యాడ్స్, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. శిల్పను కూడా అదుపులోకి తీసుకొని గద్వాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా అరెస్టులపై పౌర హక్కుల సంఘం, ఇతర సంఘాలు నిరసన తెలిపాయి. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తోందన్నారు.