
మృతదేçహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ
చందవరం (దొనకొండ): యువకుడు ఉదయం వాకింగ్‌కు వెళ్లి శవమైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ పి.సుబ్బారావు తెలిపిన వివరాల మేరకు మండలంలోని చందవరం గ్రామానికి చెందిన బత్తుల రమేష్ (24) ఉదయం వాకింగ్‌కు వెళ్లి నీళ్లు తాగడానికి రెండవ సమ్మర్ స్టోరేజి దగ్గరకు వెళ్లాడు. నీరు తాగుతూ కాలు జారి స్టోరేజి ట్యాంకులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో అతడు మరణించాడు. అతనికి వివాహం కాలేదు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తహసీల్దార్ కావేటి వెంకటేశ్వర్లు మృతదేహం పరిశీలించి ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయాన్ని అందజేస్తామన్నారు. ఎస్‌ఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు మోహన్, రవణమ్మకు ముగ్గురు కుమారులు ఉన్నారు. మొదటి కుమారుడు రమేష్, ఇతను నరసరావుపేటలో డిగ్రీ చదువుతూ అనారోగ్యంతో ఇంటికి చేరుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment