tank
-
అదృష్టవంతురాలంటే ఈమెనే..
విధి మనిషిని నడిపిస్తుందని అంటుంటారు. విధి చేతిలోనే మనిషి జీవితం ఉందని కూడా అంటారు. దీనిని రుజువు చేసే ఉదాహరణలు మనకు తరచూ ఎన్నో కనిపిస్తుంటాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోను చూసిన వారంతా కంగుతింటున్నారు.పైగా ఆ వీడియోలో కనిపిస్తున్న మహిళను అత్యంత అదృష్టవంతురాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక మహిళ రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళుతుండగా పక్కనే ఉన్న ఒక బిల్డింగ్ పైనుంచి ఒక పెద్ద సింటెక్స్ వాటర్ ట్యాంక్ నేరుగా ఆ మహిళ పైన పడుతుంది. దీనిని చూసిన వెంటనే ఎవరైనా సరే ఆ మహిళ తీవ్రంగా గాయపడి ఉంటుందని అనుకుంటారు. అయితే కొద్ది సేపటికి ఆ మహిళ ట్యాంక్ మధ్య నుంచి లేచి నిలబడుతుంది. ఇంతలో ఆ పక్కనే ఉన్న ఇంటి నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి, జరిగిన ప్రమాదాన్ని గమనించి, ఆ మహిళతో మాట్లాడతాడు. ఈ వీడియోను చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. An apple a day keeps the doctor away. pic.twitter.com/ugvzXYKDxq— Hemant Batra (@hemantbatra0) October 13, 2024ఇది కూడా చదవండి: హైదరాబాద్: వేడుకగా రావణ దహనం -
‘లద్దాఖ్’ మృతుల్లో పెడన జవాను
పెడన: సైనిక విన్యాసాల్లో భాగంగా తూర్పు లద్దాఖ్‌లోని ఎల్ఏసీ సమీపంలోని నదిని దాటుతున్న యుద్ధట్యాంకు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటనలో మృతిచెందిన ఐదుగురిలో కృష్ణాజిల్లా పెడన మండలం చేవేండ్ర గ్రామానికి చెందిన జవాను సాదరబోయిన నాగరాజు (32) ఉన్నారు. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి (47) మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నాగరాజు కూడా ప్రాణాలు కోల్పోయారు.ఎనిమిదేళ్ల కిందట ఇంటర్ పూర్తయిన తరువాత నాగరాజు ఆర్మీలో చేరారు. నాగరాజుకు 2019 అక్టోబర్‌లో తేలప్రోలుకు చెందిన మంగాదేవితో వివాహమైంది. మంగాదేవి పెడన మండలం ఉరివి గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి ఏడాది వయసున్న కుమార్తె హాసిని ఉంది. భర్త మరణ వార్త విన్నప్పటి నుంచి మంగాదేవి ఉలుకుపలుకు లేకుండా ఉందని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నాగరాజు తల్లిదండ్రులు వెంకన్న, ధనలక్షి్మ. నాగరాజుకు ఒక అక్క, తమ్ముడు ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో సెలవులకు ఇంటికి వచి్చన నాగరాజు ఆర్మీ జవానుగా పనిచేస్తున్న తన తమ్ముడు శివయ్య కుమార్తెకు అన్నప్రాశన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో నాగరాజు తిరిగి విధులకు హాజరయ్యారు. నేడు స్వగ్రామానికి మృతదేహం నాగరాజు మృతదేహం సోమవారం ఉదయం స్వగ్రామానికి చేరుకుంటుందని మిలటరీ అధికారులు కుటుంబ సభ్యులకు తెలిపారని పెడన ఎస్ఐ టి.సూర్యశ్రీనివాస్ చెప్పారు. ఆయన ఆదివారం నాగరాజు ఇంటికి వెళ్లి కుటుంబసభ్యుల్ని ఓదార్చారు. నాగరాజు మృతదేహం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చేవేండ్ర గ్రామానికి చేరుకుంటుందని ఎస్ఐ తెలిపారు. సోమవారం సాయంత్రంలోగా సైనిక లాంఛనాలు, స్థానిక పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారని చెప్పారు. -
యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ ఘన విజయం
న్యూఢిల్లీ:రష్యాలో జరిగిన మిలిటరీ యుద్ధ ట్యాంకు రేసుల ఛాంపియన్‌షిప్‌లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఈ పోటీల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన డ్రైవర్ మన్‌దీప్‌సింగ్ 50 టన్నుల బరువున్న యుద్ధ ట్యాంకుతో దూసుకెళ్లి రేసులో అలవోకగా విజయం సాధించారు. భారత జాతీయ జెండా రెపరెపలాడుతుండగా యుద్ధ ట్యాంకు దూసుకెళుతున్న వీడియోను బ్రిగేడియర్ హర్దీప్సింగ్సోహి తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో సోమవారం(మే27) పోస్టు చేశారు. ఈ ట్వీట్‌కు ఇండియన్ ఆర్మీ ట్యాగ్‌ను జత చేశారు. ఈ విజయానికిగాను ట్యాంకు డ్రైవర్ మన్‌దీప్‌సింగ్‌పై అభినందనలు వెల్లువెత్తు తున్నాయి. -
యాదాద్రి భువనగిరి: పెట్రోల్ బంకులో పేలిన లారీ డీజిల్ ట్యాంక్
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో పెను ప్రమాదం తప్పింది. డీజిల్ కోసం వచ్చిన లారీ ట్యాంకు ఒక్కసారిగా పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన పెట్రోల్ బంకు సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమయానికి మంటలు అదుపులోకి రాకపోయి ఉంటే.. భారీ నష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. -
ఉత్తరకొరియా యుద్ధానికి సిద్ధమవుతోందా?
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. దక్షిణ కొరియా- యునైటెడ్ స్టేట్స్ సంయుక్త విన్యాసాల ముగింపునకు ముందు కొరియాలో నూతన సైనిక ప్రదర్శన జరిగింది. దీనికి కిమ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా కిమ్ జాంగ్ ఉన్ కమాండర్లతో మాట్లాడుతూ ఈ విన్యాసాలకు నిజమైన యుద్ధంలా కసరత్తు చేయాలని ఆదేశించారు. ఈ సమయంలో ఒక నూతన యుద్ధ ట్యాంక్ తన మొదటి ప్రదర్శనలో విజయవంతంగా మందుగుండు సామగ్రిని ప్రయోగించింది. తన కమాండర్ల పనితీరుకు కిమ్ సంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఈ విన్యాసాల వివరాలను వెల్లడించిన ఒక నివేదికలో ‘యుద్ధ పరిస్థితులలో సమర్థవంతంగా పనిచేసే ఈ భారీ యుద్ధ ట్యాంకులు ఒకే సారి లక్ష్యాలపై దాడి చేసి, చిధ్రం చేస్తాయని’ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిమ్‌తో పాటు రక్షణ మంత్రి కాంగ్ సున్నామ్తో పాటు సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. సైనిక విన్యాసాల సందర్భంగా కొరియా మీడియా పలు ఫోటోలను విడుదల చేసింది. ఒక ఫోటోలో కొరియన్ నియంత యుద్ధట్యాంక్‌ను పరీక్షించడాన్ని చూడవచ్చు. కిమ్ స్వయంగా ట్యాంక్‌ను నడిపినట్లు మీడియా పేర్కొంది. మరొక ఫోటోలో కిమ్ లెదర్ జాకెట్ ధరించగా, కమాండర్లు అతని చుట్టూ ఉన్నట్లు కనిపించారు. ఉత్తర కొరియా జెండా కలిగిన యుద్ధ ట్యాంకులు కూడా ఫొటోలలో కనిపిస్తున్నాయి. దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక ఉమ్మడి సైనిక విన్యాసం ముగియనున్న తరుణంలో ఈ కసరత్తు కనిపించింది. నవంబర్‌లో ప్యోంగ్యాంగ్ ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో 2018 అంతర్-కొరియా సైనిక ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత తొలిసారిగా ఈ సైనిక విన్యాసాలు జరిగాయి. ఈ విన్యాసాలకు ఫ్రీడమ్ షీల్డ్ ఎక్స్‌ర్‌సైజ్’ అని పేరు పెట్టారు. లైవ్ ఫైర్ డ్రిల్‌లో పలు యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు, ఎఫ్ఏ-50 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. -
దృశ్యం సినిమా రేంజ్లో హత్య..చివరకు..
ఓ వ్యక్తి తెలివిగా ప్రియురాలిని దృశ్యం మూవీ రేంజ్లో హతమార్చాడు. గుట్టుచప్పుడు కాకుండా పనికానిచ్చి దర్జాగా తిరుగుతున్నాడు. కానీ ఆమె ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులకు చిక్కక తప్పలేదు. చివరికి అసలు నిజం బయటపడి కటకటాల పాలయ్యాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ వ్యక్తి ప్రియురాలిని గుట్టు చప్పుడు కాకుండా కడతేర్చాడు. ఆమె మృతదేహాన్ని నిర్మాణంలో ఉన్న తన ఇంటి ట్వాంకులో దాచిపెట్టాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆమె కనపించటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె కోసం గాలిస్తున్న పోలీసులు ఆమె చివరికాల్ డేటా ఆధారంగా అరవింద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం ప్రారంభించారు. విచారణలో ఆమెను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు అరవింద్. ట్యాంకు వద్ద దాచిపెట్టిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని 35 ఏళ్ల రాజ్ కేసర్‌గా గుర్తించారు పోలీసులు. నిందితుడు అరవింద్ దాదాపు 14 రోజుల క్రితమే కేసర్‌ను హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: బీఆర్ఎస్ మహిళా నేత ఆత్మహత్య.. వివాహ వేడుకలకు హాజరై..) -
మిరాకిల్.. యుద్ధ ట్యాంక్ కింద నలిగినా ప్రాణాలతో బయటపడి..
మాస్కో: సైన్యం మిలిటరీ డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో ఓ యుద్ధ ట్యాంకర్ సైనికుడి పైనుంచి దూసుకెళ్లింది. 13 టన్నుల బరువున్న వాహనం తనపై నుంచి వెళ్లినా అతను ప్రాణాలతో బయటపడ్డాడు. చక్రాల కింద నలిగినా మరణాన్ని జయించాడు. ఇంతా జరిగినా యథావిధిగా మళ్లీ లేచి తన స్థానంలో నిల్చున్నాడు. రష్యా సైన్యం మిలిటరీ డ్రైవ్ సమయంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 🤡Nothing says "Second Greatest Military Force in the World" quite like crushing your own soldiers under the wheels of a 13 tonne APC during a "cool military drive-by" demonstration. pic.twitter.com/xgFeTWYMCA — Captain Black Sea (@CaptainBlackSe1) October 13, 2022 అయితే రష్యా సైన్యం తీరుపై కొందరు నెటిజన్లు మండిపడ్డారు. ప్రపంచంలో శక్తిమైన సైన్యంగా చెప్పుకునే రష్యా ఆర్మీ.. సొంత సైనికుడి మీద నుంచే యుద్ధ ట్యాంకర్‌ను పోనివ్వడం వారి నైపుణ్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. మరికొందరు మాత్రం రష్యా సైనికుడు ప్రణాలతో బయటపడటం మిరాకిల్‌లా ఉందని అన్నారు. అతను అదృష్ట జాతకుడని, అందుకే ఇంకా ఆయుషు మిగిలి ఉందని పేర్కొన్నారు. చదవండి: షాకింగ్ ఘటన.. రూ.690 కోట్ల పెయింటింగ్‌పై.. -
రహదారిపై భారీ ట్యాంకు
దొరవారిసత్రం: దొరవారిసత్రం గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై శుక్రవారం అతిపెద్ద ట్యాంకు ఓ లారీపై వెళ్లడాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఈ లారీ చెన్నై హార్బర్ నుంచి వారం కిందట వంద అడుగుల పొడవున్న ట్యాంకుతో బయలుదేరింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుకు వెళ్తోంది. మార్గమధ్యంలో దారికడ్డంగా ఉన్న విద్యుత్ తీగలు తప్పిస్తూ సిబ్బంది నెమ్మదిగా ముందుకు కదలడం కనిపించింది. -
రష్యన్ యుద్ధ ట్యాంకు పై రెపరెపలాడుతున్న ఉక్రెయిన్ జాతీయ జెండా!
ఉక్రెయిన్ రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధం నేటితో 12వ రోజుకు చేరుకుంది. రష్యా నిరవధికంగా సాగిస్తున్న పోరులో ఉక్రెయిన్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతి దాడి చేస్తూనే ఉంది. ఈ దాడిలో వందలాది ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. అంతేగాక ఉక్రెయిన్ కూడా రష్యా దాడిలో చాలా దారుణంగా అతలా కుతలమైపోయింది కూడా. అయినప్పటికీ ఉక్రెయిన్ వాసుల మా దేశాన్ని కాపాడుకుంటాం, దురాక్రమణకు గురవ్వనివ్వం అంటూ ప్రతి దాడులు చేయడం అందర్ని విస్మయానికి గురి చేసింది. ఆఖరికి మహిళలు, చిన్నపిల్లలతో సహా దాడి చేసేందుకు సిద్ధం అంటూ..రష్యా దళాలకు ఎదురు నిలిచి మరీ పోరాడుతున్నారు. అందులో భాగంగానే రష్యన్ యుద్ధ ట్యాంకులు ఉక్రెయిన్‌లో రహదారుల్లోకి వస్తున్నప్పడు ప్రజలు ఏ మాత్రం భయపడకుండా తమ దేశంలోకి రావద్దంటూ వాటికి అడ్డంగా నిలబడటం వంటివి కూడా చేశారు. అయితే ఇప్పుడోక వ్యక్తి ఉక్రెయిన్ జాతీయ జెండాను పట్టుకుని ఏకంగా రష్య యుద్ధ ట్యాంకు పైకి ఎక్కి ఎగరవేయడమే కాక ఆనందంగా ఆ జెండాను అటు ఇటూ ఊపుతూ ఉన్నాడు. దీంతో అక్కడ ఉన్న మిగతా వాళ్లు ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. ఒక పక్క రష్యా దళాలు ఉక్రెయిన్‌లో ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ ఉక్రెయిన్ వాసుల మాత్రం రష్యన్ దళాలు చొరబడకుండా తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ వీరోచితంగా పోరాడుతుండటం విశేషం. అయితే ఇప్పటి వరకు ఈ యుద్ధంలో దాదాపు 331 మంది ప్రజలు మరణించారని సుమారు 1.4 మిలియన్లకు పైగా ప్రజలు వలసల బాటపట్టారని యూఎన్ మానవహక్కుల కార్యాలయం తెలిపింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. A Ukrainian climbed onto a Russian tank and hoisted the Ukrainian flag.#UkraineRussianWar #Ukraine #UkraineUnderAttack #UcraniaRussia #RussianUkrainianWar pic.twitter.com/BFrQKZvLlE — David Muñoz López 🇪🇦🇪🇺🇺🇦 (@dmunlop) March 7, 2022 (చదవండి: వాషింగ్టన్లో జెలెన్స్ స్కీ పేరుతో రహదారి! వైరల్ అవుతున్న ఫోటో) -
ఒంటి చేత్తో యుద్ధ ట్యాంక్‌ని ఆపాడు! వైరల్ వీడియా
Ukrainian Man Single-Handedly Stops: గత కొన్ని రోజులుగా రష్యా ఉక్రెయిన్ పై మూడువైపుల నుంచి దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌లోని బఖ్మాచ్ వీధుల్లో ఒక వ్యక్తి రష్యన్ యుద్ధ ట్యాంకుని ఒంటి చేత్తో పట్టుకుని ఆపేశాడు. తాను ఎంతవరకు బలంగా నెట్టగలడో అంతమేర నెట్టి ఆ తదుపరి నేలమీద మోకాళ్ల పై నిలబడి కూర్చున్నాడు. వెంటేనే అక్కడ ఉండే నివాసితులు అతని వద్దకు పరిగెత్తుకుని వస్తారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. అంతేకాదు ఉక్రెయిన్ అధికారులు ఇన్‌స్టాగ్రాంలో .."ఉక్రెయిన్ ప్రజలను బందిఖానాలో ఉంచుతానని రష్యా సంవత్సరాలుగా అబద్ధం చెబుతోంది. వాస్తవమేమిటంటే ఉక్రేనియన్ ప్రజలు స్వేచ్ఛగా జీవించడమే కాదు అవసరమైతే తమ ఒట్టి చేతులతో రష్యన్ ట్యాంకులను ఆపడానికి సిద్ధంగా ఉన్నారు" అంటూ భావోద్వేగంగా పోస్ట్‌లు పెట్టారు. View this post on Instagram A post shared by Ukraine UA (@ukraine.ua) (చదవండి: యుద్ధ ట్యాంక్ కారుని నుజ్జునుజ్జు చేసింది...కానీ ఆవ్యక్తి) -
చెరువులకు మహర్దశ!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని 185 చెరువులకు మురుగు నుంచి విముక్తి కల్పించేందుకు బృహత్తర ప్రణాళిక చేపడుతున్నారు. తద్వారా ఆయా జలాశయాలకు మహర్దశ పట్టనుంది. మహానగరం నలుమూలల్లో నూతనంగా 36 మురుగు శుద్ధి కేంద్రాలను నిర్మించడం ద్వారా గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి మురుగు జలాలు ఆయా చెరువుల్లోకి చేరకుండా జలమండలి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం సుమారు రూ.5 వేల కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంచేసే బాధ్యతలను షా కన్సల్టెన్సీకి అప్పజెప్పారు. ఇందుకు సంబంధించి మరో రెండు నెలల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంకానుంది. ఇటీవల మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎస్టీపీల నిర్మాణానికి అనువుగా ఉన్న ప్రభుత్వ స్థలాలను అన్వేషించే బాధ్యతలను జలమండలి, రెవెన్యూ విభాగాలకు అప్పజెప్పారు. ప్రతి 5–6 చెరువులకు ఒకటి చొప్పున మురుగు శుద్ధి కేంద్రాలను, డైవర్షన్ మెయిన్ పైపులైన్లను ఏర్పాటుచేసి ఆయా జలాశయాల్లోకి చేరనున్న మురుగునీటిని దారిమళ్లించి శుద్ధిచేయనున్నారు. మొత్తంగా ఆయా మురుగు శుద్ధి కేంద్రాల్లో సుమారు వెయ్యి మిలియన్ లీటర్ల మురుగు జలాలను శుద్ధిచేయాలని లక్ష్యం నిర్దేశించారు. ఆయా కేంద్రాల్లో శుద్ధిచేసిన మురుగు నీటిని గార్డెనింగ్, భవన నిర్మాణాల క్యూరింగ్, ఫ్లోర్‌క్లీనింగ్, టాయిలెట్ ఫ్లష్, వాహనాలు శుభ్రపరచడం వంటి కార్యక్రమాలను వినియోగించనున్నారు. గ్రేటర్ మురుగులెక్కలివీ... గ్రేటర్ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. ఔటర్‌రింగ్‌రోడ్డు లోపలున్న పరిధిని లెక్కిస్తే 1400 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ మహానగరం విస్తరించింది. ఈ పరిధిలో రోజువారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి నిత్యం సుమారు 2000 మిలియన్ లీటర్ల మురుగు నీరు ఉత్పన్నమౌతోంది. కానీ ప్రస్తుతం 21 మురుగు శుద్ధి కేంద్రాల్లో కేవలం వెయ్యి మిలియన్ లీటర్ల మురుగునీటిని మాత్రమే శుద్ధి చేస్తున్నారు. వీటిలో 17 ఎస్టీపీలను జలమండలి..మరో 4 ఎస్టీపీలను హెచ్ఎండీఏ నిర్వహిస్తోంది. మిగతా వెయ్యి మిలియన్లీటర్ల మురుగు నీరు గ్రేటర్ పరిధిలోని 185 చెరువులు, మూసీలోకి చేరుతుండడంతో ఆయా జలాశయాలు రోజురోజుకూ కాలుష్యకాసారమౌతున్నాయి. తాజాగా మురుగు మాస్టర్‌ప్లాన్ సిద్ధమవుతుండడంతో మహానగరవాసులతోపాటు ఆయా జలాశయాలకు మురుగు నుంచి విముక్తి లభిస్తుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. సింగపూర్, ఆస్ట్రేలియా తరహాలో... సింగపూర్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ తదితర దేశాల్లోని పలు మహానగరాల్లో మురుగు, వ్యర్థజలాల శుద్ధి..పునర్వినియోగంతో సహజవనరులపై వత్తిడి తగ్గించడంతోపాటు గ్రీన్‌బెల్ట్ పెంపొందించి సత్ఫలితాలు సాధిస్తున్న విషయం విదితమే. ఈనేపథ్యంలో మన గ్రేటర్ సిటీలోనూ ఇలాంటి వినూత్న విధానానికి జలమండలి శ్రీకారం చుట్టడం విశేషం. పకడ్బందీగా సివరేజ్ మాస్టర్‌ప్లాన్ గ్రేటర్ నగరంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఔటర్‌రింగ్ రోడ్డు పరిధి వరకు సమగ్ర మురుగునీటి మాస్టర్‌ప్లాన్ సిద్ధంచేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. దీంతో శివారు వాసులకు మురుగునీటితో అవస్థలు తప్పనున్నాయన్నారు. గ్రేటర్లో పర్యావరణ పరిరక్షణ, హరిత వాతావరణం పెంపొందించడం ద్వారా చెరువులు, కుంటలు తదితర విలువైన జలవనరులను కాపాడేందుకు కృషి చేస్తున్నామన్నారు. -
వాకింగ్‌కి వెళ్లాడు..శవమయ్యాడు
చందవరం (దొనకొండ): యువకుడు ఉదయం వాకింగ్‌కు వెళ్లి శవమైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ పి.సుబ్బారావు తెలిపిన వివరాల మేరకు మండలంలోని చందవరం గ్రామానికి చెందిన బత్తుల రమేష్ (24) ఉదయం వాకింగ్‌కు వెళ్లి నీళ్లు తాగడానికి రెండవ సమ్మర్ స్టోరేజి దగ్గరకు వెళ్లాడు. నీరు తాగుతూ కాలు జారి స్టోరేజి ట్యాంకులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో అతడు మరణించాడు. అతనికి వివాహం కాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తహసీల్దార్ కావేటి వెంకటేశ్వర్లు మృతదేహం పరిశీలించి ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయాన్ని అందజేస్తామన్నారు. ఎస్ఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు మోహన్, రవణమ్మకు ముగ్గురు కుమారులు ఉన్నారు. మొదటి కుమారుడు రమేష్, ఇతను నరసరావుపేటలో డిగ్రీ చదువుతూ అనారోగ్యంతో ఇంటికి చేరుకున్నాడు. -
ఆమాత్యా..! రాజ్యాంగం పట్ల గౌరవం లేదా!!
సాక్షి ప్రతినిధి, కడప: రాజ్యంగ బద్ధంగా నడుచుకుంటానని, రాగద్వేషాలకతీతంగా వ్యవహరిస్తానని ప్రజా శ్రేయస్సుకు పాటుపడతాని ప్రమాణం చేసిన మంత్రివర్యులు రాజ్యంగ విలువకు తిలోదకాలిస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉత్తర్వులు బేఖాతర్ చేస్తున్నారు. అధికారులు తప్పు తెలుసుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టినా, మొండిగా మంకుపట్టులో ఉన్న టీడీపీ నేతలకు మంత్రివర్యులు అండగా నిలుస్తున్నారు. నైతిక విలువలకు కోల్పోయిన ఆయన మరోమారు తన సహాజ ధోరణిని ప్రదర్శించిన వైనమిది. ప్రొద్దుటూరు మున్సిఫల్ గాంధీఫార్కులో వాటర్ ట్యాంకు నిర్మాణం పట్ల స్థానికులు ఆక్షేపణలు తెలిపారు. వారి అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి అభ్యంతరం చెప్పారు. మరో 50 మీటర్లు దూరంలో మూతపడిన పాఠశాలలో నిర్మిస్తే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదని, అక్కడ చేపట్టాలని సూచించారు. దాదాపు 2లక్షల జనాభాకు ఉన్న ఒకే ఒక్క పార్కులో వాటర్ ట్యాంకు ఏర్పాటు చేసి, పాదచారులకు ఆటంకం లేకుండా చూడాలని ప్రజాహితం దృష్ట్యా అభ్యర్థించారు. మరోవైపు పార్కులు, పబ్లిక్కు యోగ్యతరమైన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు సైతం స్పష్టం చేస్తున్నాయి. ఇంకోవైపు జిల్లా జడ్జి జి శ్రీనివాస్ జోక్యం అనివార్యమైంది. ప్రజాహితం మేరకు పార్కులో ట్యాంకు నిర్మించరాదని హితవు పలికారు. ఇవన్నీ లెక్కపెట్టకుండా మార్కెటింగ్, పశుసంవర్ధకశాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి ఎవ్వరూ ఎలాంటి ఆటంకాలు సృష్టించినా పార్కులో ట్యాంకు నిర్మిస్తామని ప్రకటించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమౌతోంది. మంత్రిగా ఉండి సామాన్యులు మాట్లాడినట్లుగా వ్యవహరించడాన్ని పలువురు తప్పు బడుతున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, జిల్లా జడ్జి జోక్యం కారణంగా పబ్లిక్‌హెల్త్, మున్సిఫల్ కమిషనర్ కాంట్రాక్టరు మరోచోట ట్యాంకు నిర్మిస్తామని రాతపూర్వకంగా విన్నవించినా మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మాత్రమే పార్కులో ట్యాంకు నిర్మిస్తామని మొండిగా వ్యవహరిస్తున్నారు. అందుకు వత్తాసుగా మంత్రి ఆదినారాయణరెడ్డి నిలుస్తుండడం విశేషం. వివాదస్పద స్థలంలోనే ఎందుకు...? ప్రొద్దుటూరు పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ.138కోట్లుతో మైలవరం జలాశయం నుంచి పైపులైను ఏర్పాటు, 3ట్యాంకులు నిర్మించనున్నారు. 2ట్యాంకులు నిర్మాణంలో ఎలాంటి అభ్యంతరం లేదు. పార్కులో నిర్మించే వాటర్ ట్యాంకు పట్ల మాత్రమే ప్రజలు, ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవికతను అర్థం చేసుకోకుండా ప్రజాహితం కోసమే పాలకులు ఉన్నారన్న సంకేతాలు ఇవ్వకుండా టీడీపీ నేత నిర్మించాలన్నారు, కాబట్టి అక్కడే నిర్మిస్తామని ప్రకటించడం ఏమేరకు సబబోనని పలువురు నిలదీస్తున్నారు. వివాదస్పదస్థలంలోనే ట్యాంకు నిర్మిస్తామని మంత్రి ఆది ప్రకటించడంపై ప్రజాస్వామ్యవాదులు ఆక్షేపిస్తున్నారు. చర్యలు చేపట్టడంలో మీనమేషాలులెక్కిస్తున్న పోలీసులు... గాంధీపార్కులో ట్యాంకు నిర్మాణం చేపట్టడం లేదని కమిషనర్, పబ్లిక్‌హెల్త్ విభాగం, కాంట్రాక్టర్ రాతపూర్వకంగా అక్కడ ట్యాంకు నిర్మించలేదని తెలిపారు. రాత్రికి రాత్రే మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వర్గీయులు 30మీటర్లు వెడల్పుతో, 12అడుగుల లోతు తవ్వి మట్టిని తరలించి విక్రయించుకున్నారు. ఇదేవిషయమై ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చట్టవిరుద్ధంగా వ్యవహారించిన వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఫిర్యాదు చేశారు. ఆధారాలున్నప్పటికీ కేసు నమోదు చేయడంలో పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఉన్నతాధికారులకు నివేధించామని, తదుపరి చర్యలు చేపట్టుతామని పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు. చట్టవిరుద్ధమైన చర్యలు చేపట్టితే ఎవ్వరికైనా ఒక్కలాంటి చర్యలే ఉంటాయని మెసేజ్ ఇవ్వాల్సిన పోలీసు యంత్రాంగంలో డొల్లతనం బహిర్గతమౌతోంది. చట్టవిరుద్ధంగా, సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా వ్యవహారిస్తున్న టీడీపీ నేతలపై చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. మున్సిపల్పార్కులోనే ట్యాంక్ నిర్మిస్తాం– మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రొద్దుటూరు టౌన్ : మున్సిపల్ పార్కులోనే ట్యాంక్ నిర్మించి తీరుతామని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి పార్కులో ట్యాంక్ కోసం తీసిన గొయ్యి వద్దకు మంత్రిని తీసుకొచ్చారు. టీడీపీ కౌన్సిలర్లు ఆ ప్రాంత మహిళలను పార్కులోకి తీసుకొచ్చి తాగునీటి సమస్య ఉందని మంత్రికి చెప్పారు. మంత్రి మాట్లాడుతూ అమృత్ పథకం కింద మైలవరం జలాశయం నుంచి పైపులైన్ పనులను ప్రారంభించామన్నారు. ట్యాంక్ ఎక్కడ కట్టాలన్న విషయం ఇదివరకే నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ ప్రాంత ప్రజలకు నీటి సమస్య లేకుండా ఇక్కడ ట్యాంక్ నిర్మించాలని టెండర్లు పిలిచామన్నారు. కాంట్రాక్టర్ పనులు ప్రారంభించాక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వచ్చి అడ్డుకున్నారన్నారు. ఎవరు అడ్డుకున్నా పార్కులో ట్యాంక్ నిర్మాణ పనులు ఆగవని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
పాఠశాల తాగునీటి ట్యాంకులో విషం
తిరువొత్తియూరు: పెను ప్రమాదం నుంచి 40 మంది విద్యార్థులను ఆ పాఠశాల ఉద్యోగిని రక్షించింది. ఈ ఘటన గురువారం జరిగింది. వివరాలు.. వేదారణ్యం, మరుదూర్ నార్త్ వళియాన్ శెట్టి కట్టలై ప్రాంతంలో పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో 40 మందిపైగా విద్యార్థులు చదువుతున్నారు. తాగునీటి కోసం పాఠశాలలో వెయ్యి లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకును ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం పాఠశాలను శుభ్రం చేయడానికి వచ్చిన నాగమ్మాళ్ కుళాయిని తెరిచింది. దుర్వాసనతో రంగుమారిన స్థితిలో నీరు వచ్చింది. సందేహంతో నాగమ్మాల్ ట్యాంకుపైకి ఎక్కి చూడగా క్రిమిసంహారక మందు బాటిల్, ఎలుక మందు ప్యాకెట్లు నీటిలో పడి ఉన్నాయి. వెంటనే నాగమ్మాల్ పాఠశాల ఉపాధ్యాయులకు తెలిపింది. ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని తాగునీటి ట్యాంకును పరిశీలించారు. వెంటనే వైద్యుల బృందాన్ని అక్కడికి రప్పించారు. పరిశీలించిన వైద్యులు తాగునీటిలో విషం కలిసిందని తెలిపారు. పెను ప్రమాదాన్ని తప్పించిన నాగమ్మాల్‌కు పాఠశాల, గ్రామ ప్రజల తరఫున రూ.500 నగదు బహుమతి అందజేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మూడుకు చేరిన మృతుల సంఖ్య
పులివెందుల: వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం ఉలిమెళ్ళ చెరువులో మరో బాలుడి మృతదేహం లభ్యమైంది. ఆదివారం ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. సాయంత్రానికి రాంచరణ్, యశ్వంత్‌ల మృతదేహాలు లభ్యమయ్యాయి. కాగా, సోమవారం మరో మృతదేహం లభ్యమవడంతో ఈ సంఘటనలో మొత్తం ముగ్గురు మృతిచెందారు. -
ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి
పులివెందుల: వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలంలో విషాదం నెలకొంది. మండలంలోని ఉలిమెల్ల చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. వీరిని 7వ తరగతి చదువుతున్న రాంచరణ్, 8వ తరగతి చదువుతున్న యశ్వంత్గా గుర్తించారు. -
యుద్ధట్యాంక్‌నుంచే క్షిపణి ప్రయోగం
సాక్షి, న్యూఢిల్లీ : పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అర్జున్ యుద్ధ ట్యాంక్‌కును మరింత శక్తివంతంగా డీఆర్డీఓ రూపొందిస్తోంది. అత్యంత శక్తివంతమైన యుద్ధ ట్యాంక్‌గా ఇప్పటికే గుర్తింపు దీనికి గుర్తింపు లభించింది. వచ్చే ఏడాది నాటికి ఈ యుద్ధ ట్యాంక్‌కు క్షిపణులు ప్రయోగించే సామర్థ్యాన్ని అందించనున్నట్లు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ఉన్నతాధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఇది పరీక్షల దశలో ఉందని డీఆర్డీఓ అధికారులు తెలిపారు. అర్జున్ ఎంకే2 ట్యాంక్ సైనిక అవసరాలకు అద్వితీయంగా ఉపయోగ పడుతుందని వారు చెబుతున్నారు. అర్జున్ ట్యాంక్‌నుంచి 1200 మీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం చేధించేలా.. రూపొందించామని అధికారులు తెలిపారు. మొదట 500 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల పరిధి సైన్యానికి సరిపోతుందని భావించినా.. తరువాత దానిని 1200 మీటర్లకు పొడిగించినట్లు డీఆర్డీఓ అధికారులు తెలిపారు. అర్జున్ ఎంకే-1తో పోలిస్తే.. అర్జున్ ఎంకే-2 యుద్ధట్యాంక్ అత్యంత అధునాతనమైందని, అందులో పలు ఫీచర్లను అప్డేట్ చేసినట్లు వారు చెప్పారు. ఇదిలావుండగా ఇప్పటికే సైన్యం దగ్గర అర్జున్ ఎంకే-1 యుద్ధట్యాంకులు 119 ఉండగా.. అందులో 80 యుద్ధట్యాంకులను పూర్తిగా ఆధునీకరించారు. -
చెరువులో పడి చిన్నారి దుర్మరణం
ఏనుగువానిలంక (యలమంచిలి) : ఏనుగువానిలంక పాత దళితపేటలోని చెరువు మరో చిన్నారి ప్రాణాలను బలిగొంది. గ్రామానికి చెందిన పాలపర్తి రమేష్, మౌనిక దంపతులకు ఇద్దరు కుమారులు విక్కీ, లక్కీ ఉన్నారు. చిన్న కుమారుడు లక్కీ (2) ఆదివారం ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయాడు. రమేష్, మౌనిక దంపతులు ఇద్దరూ ఉదయం చర్చికి వెళ్లి ఇంటికి వచ్చారు. రమేష్‌కు గ్రామంలో మెడికల్ షాపు ఉంది. మధ్యాహ్నం అతను షాపునకు వెళ్లగా మౌనిక ఇంటిలో పని చేసుకుంటుంది. ఈ సమయంలో లక్కీ చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు జారిపోయాడు. వెంటనే కొడుకు కోసం చూసిన మౌనిక పరుగున వెళ్లి బిడ్డను పైకితీయగా అప్పటికే లక్కీ మరణించాడు. సరిగ్గా ఇదే ప్రదేశంలోనే గతేడాది డిసెంబర్ 27న అంగన్వాడీ కేంద్రంలో చదువుకుంటున్న మూడేళ్ల బాలుడు మనోజ్ చెరువులో పడి మరణించాడు. నెలకే మరో బిడ్డ చెరువులో పడి చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రేవు మూసివేయాలి పాత దళితపేటలోని ఈ చెరువు రేవు వాడుకలో లేదు. ఇది ఏటవాలుగా ఉండి చివర కూడా పాకుడు పట్టి ఉండడంతో రేవులో దిగిన వారు జారిపోతున్నారు. లక్కీ కూడా పాకుడుకు జారి పడిపోయాడని స్థానికులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ రేవు మూసివేసి చెరువుగట్లను ఎత్తు చేసి మరిన్ని ప్రాణాలు పోకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ట్యాంకులో హైడ్రోజన్ కొట్టు గురూ...
మనిషికి ఆక్సిజన్ కావాలి. కారుకు పెట్రోలు కావాలి. పోనీ డీజిల్ అయినా. కాని ఈ కారు హైడ్రోజన్ అడుగుతుంది. దాంతోనే పరిగెడుతుంది. నెదర్లాండ్స్‌కు చెందిన ఒక కంపెనీ తయారు చేసిన ఈ కారు పేరు ‘ఫోర్జ్ వీ2’. ఇది పెట్రోలు, డీజిల్, గ్యాస్ వంటి సంప్రదాయ ఇంధన వనరులు కాకుండా హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడుకుంటుంది. హైడ్రోజన్ అత్యంత సమర్థమైన ఇంధనమే కాదు... ఏమాత్రం కాలుష్యం వెలువరించదు. కాకపోతే దీన్ని నిల్వ చేయడం, రవాణా చేయడంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా మనం ఇప్పటికీ పెట్రోలు, డీజిల్ కార్లనే వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫోర్జ్ వీ2లో ఒక ఫ్యూయెల్ సెల్, హైడ్రోజన్ ట్యాంకులు ఉంటాయి. ఈ ఫ్యూయెల్ సెల్ హైడ్రోజన్ ట్యాంకులలోని హైడ్రోజన్‌ను వాతావరణంలోని ఆక్సిజన్‌తో చర్య జరిపి విద్యుత్తును, నీటిని తయారు చేసి ఇంజన్‌కు ఇంధనంగా అందిస్తుంది. ఒకసారి ట్యాంకుల్ని హైడ్రోజన్‌తో నింపితే దాదాపు 45 నిమిషాలపాటు వంద కిలోవాట్ల శక్తి విడుదలవుతుంది. ఈ శక్తి ఫోర్జ్ వీ2ను కేవలం నాలుగు సెకన్లలో వంద కిలోమీటర్ల వేగానికి తీసుకెళుతుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 210 కిలోమీటర్లు గనుక ఇప్పటికే పెట్రోలు, డీజిల్ కార్లతో పోటీపడుతూ కొన్ని రేసులను గెలిచింది. ప్రస్తుతం దీన్ని వీలైనంత ఎక్కువ దూరం నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో 24 గంటలపాటు జరిగే లీమ్యాన్స్ రేస్‌లో పోటీకి దించాలని తయారీదారులు భావిస్తున్నారు. కేవలం హైడ్రోజన్‌తో నడిచే కార్లు మాత్రమే పోటీపడే రేస్ ఇది. ఇందులోనూ మంచి ఫలితాలు సాధిస్తే మరిన్ని రేసుల్లో పాల్గొనేందుకు మార్గం సుగమం అవుతుంది. -
నిర్లక్ష్యానికి మూల్యం నీటి కష్టాలు
లక్షల వ్యయంతో ట్యాంకుల నిర్మాణం నాణ్యతాలోపంతో అందని చుక్క నీరు అధికారుల పర్యవేక్షణ లోపం గుత్తేదారుల ఇష్టారాజ్యం బజార్హత్నూర్: మండలంలోని ప్రజల తాగునీటి కష్టాలు చిత్రంగా ఉన్నాయి. తాగునీటి సమస్యను పరిష్కరించుటకు కోట్ల రూపాయాల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ నిధులతో గ్రామాలలో వాటర్‌ట్యాంకులు నిర్మాణాలు చేపట్టారు. కానీ స్థానిక అధికారుల నిర్లక్ష్యంతో ఆయా గ్రామాల ప్రజలకు తాగునీటి తిప్పలు తప్పడం లేదు. వాస్తవ పరిస్థితులు ఇవే... ప్రభుత్వం మండలంలో రాంనగర్, బలాన్పూర్, కొత్తపల్లి, కొత్తగూడ, మాన్కాపూర్, తూకాన్పల్లి, జల్లుగూడ, కిన్నర్పల్లి గ్రామాలలో ఒక్కొక్క వాటర్‌ట్యాంక్ నిర్మాణానికి రూ.11లక్షల నిధులు కేటాయించింది. 2014 సంవత్సరంలో ఆయా గ్రామాలలోని వాటర్‌ట్యాంక్‌ల నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. నాటి నుంచి నేటి వరకు వాటి నిర్వహణ గాలి వొదిలేయడంతో ఎనిమిది గ్రామాల ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. నిర్మాణం పూరై ్తయిన వాటర్‌ట్యాంకులను స్థానిక గ్రామ పంచాయితీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అవి అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. ఇదే విషయంపై సర్పంచులను సంప్రదిస్తే బోరుబావుల్లో నీరులేదని, పైపులైన్ లీకేజీ ఉందని, కరెంటు సరఫరా లేదని ఒక్కొక్కరూ ఒక్కొక్క కారణం తెలుపుతున్నారు. నిర్మాణ లోపమే కారణమా.. వాటర్ ట్యాంకుల నిర్మాణం పూరై ్త రెండు సంవత్సరాలు గడిచినా నేటికీ చుక్క నీరు అందడం లేదు. అధికారులను సంప్రదిస్తే వాటర్‌ట్యాంకుల నిర్మించిన గుత్తేదారులకు బిల్లులు మంజూరు కాలేదని గుత్తేదారులు వాటర్‌ట్యాంకులను గ్రామపంచాయతీలకు అప్పగించలేదని తెలిపారు. మరో కోణంలో చూస్తే వాటర్‌ట్యాంకుల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని అన్ని కూడా లీకేజీల సమస్యతో సతమతమవుతున్నందునే బిల్లులు మంజూరు కాలేదని తెలుస్తోంది. ఇటు ప్రభుత్వ నిర్లక్ష్యంతో గ్రామీణుల నీటికష్టాలు అధికమవుతున్నాయి. ఏదిఏమైనప్పటికీ సాధ్యమైనంత త్వరగా వాటర్‌ట్యాంకులకు నీటి కనెక్షన్ ఇచ్చి తమ తాగునీటి కొరత తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే పొలం బావుల నుంచి నీటిని తీసుకొస్తున్నామని ఆయా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘నీరు’ చెట్టే మింగేసింది!
గన్నవరం: నీరు–చెట్టు అంటూ అధికార పార్టీ నాయకులు చెరువుల్లో ఇష్టరాజ్యంగా తవ్విన మట్టి తవ్వకాలకు మరో ఇద్దరు బలైపోయారు. గన్నవరం శివారు మర్లచెరువులో ఆదివారం బైక్ కడిగేందుకు వెళ్ళిన ఇరువురు విద్యార్థులు చెరువులో లోతుగా తవ్విన గోతిలో ప్రమాదవశాత్తు పడి దుర్మరణం చెందారు. పోలీసుల సమాచారం ప్రకారం...స్థానిక ఎస్సీకాలనీకి చెందిన తిరివీధి నాగేశ్వరరావు కుమారుడు దిలీప్(20) వికెఆర్ కళాశాలలో బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బైక్ కడిగేందుకని సమీప బంధువెన నాలుగో తరగతి విద్యార్థి నిడమర్తి మణిబాబు(9)ను తీసుకుని మర్లపాడులోని చెరువు వద్దకు వెళ్ళారు. బండిని గట్టుపై ఉంచి బకెట్ సహాయంతో చెరువులోని నీటిని తీసుకువచ్చి శుభ్రం చేస్తుండడం గమనించిన స్థానికులు చెరువు లోతుగా ఉంది వెళ్లొద్దనిహెచ్చరించారు. అయినా ఇద్దరూ బండి పనిలో నిమగ్నమయ్యారు. చెరువుకు వెళ్లిన ఇద్దరూ ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారు. చెరువు గట్టున బండి, చొక్కాలు, సెల్‌ఫోన్, చెప్పులు ఉన్నప్పటికి దీలిప్, మణిబాబు కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించారు. చెరువులో గాలించగా కొద్ది సేపటికి చెరువు గట్టు పక్కన లోతుగా ఉన్న గొయ్యిలో వీరి మృతదేహాలు కనిపించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. బంధుమిత్రుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఎస్సీ కాలనీవాసుల ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్సీ కాలనీవాసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తెలుగుదేశం నాయకులు మట్టి కోసం చెరువును ఇష్టారాజ్యంగా తవ్విన గోతుల్లో పడి తమవారు చనిపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల గౌడపేటకు చెందిన విద్యార్థి ఇదే చెరువులో పడి మరణించినా, ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఇప్పటికైన ప్రమాదాల నివారకు చెరువు గట్టు చుట్టూ కంచెను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
కోటి చేప పిల్లలు ఉత్పత్తి
నాతవరం : జిల్లాలోని ఏకైక తాండవ చేప పిల్లలు ఉత్పత్తి కేంద్రం ద్వారా కోటి పిల్లలను ఉత్పత్తి చేసినట్టు మత్స్యశాఖ అధికారి శ్రీదేవి తెలిపారు. చేప పిల్లలు ఉత్పత్తి కేంద్రాన్ని శుక్రవారం ఆమె పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది వాతావరణం అనూకూలించకపోవడంతో ఆలస్యంగా చేప పిల్లల ఉత్పత్తి ప్రారంభించామన్నారు. గతంలో తాండవ రిజర్వాయర్ మొయిన్గేట్లు నుంచి లీకేజీ నీరు వచ్చేదని, ఆ నీటితో చేప పిల్లలు ఉత్పత్తికి బాగుండేదన్నారు. పెద్ద ఇంజన్లతో నీరు తోడి ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఏటా జూలై, ఆగస్టు నెలల్లో మాత్రమే చేప పిల్లల ఉత్పత్తి చేపడతామన్నారు. ప్రస్తుతం బోచ్చు, రాగండి, ఎర్రమైల రకాల పిల్లలను కోటి వరకు ఉత్పత్తి చేశామన్నారు. వాటిని తాండవ రిజర్వాయరులో, నర్సీపట్నం మత్స్యశాఖ కార్యాలయంలో ఉన్న నీటిలో విడుదల చేశామన్నారు. రెండు మత్స్యకార సంఘాలకు ఒక్కోదానికి 15లక్షలు చోప్పున 30 లక్షలు వరకు పిల్లలు సరఫరా చేశామన్నారు. త్వరలో మిగతా సంఘాలకు సరఫరాకు ప్రణాళికలు రూపొందించామన్నారు. వారం రోజులుగా చేప పిల్లలు ఉత్పత్తికి వాతావరణం అనుకూలంగా ఉందన్నారు. -
నీటిట్యాంకులో పడి చిన్నారి మృతి
మల్దకల్: వ్యవసాయ పొలంలో నీటిని నిల్వ ఉంచుకునేందుకు ఏర్పాటు చేసిన ట్యాంకులో పడి ఓ చిన్నారి మృతిచెందిన విషాదకర సంఘటన సోమవారం మండలంలోని మంగంపేటలో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. అమరవాయి పంచాయతీ పరిధిలోని మంగంపేట గ్రామానికి చెందిన రామకష్ణ, సుజాత దంపతులకు కొడుకు, కుమార్తె ఉంది. వీరికి ఉన్న రెండెకరాల వ్యవసాయ పొలంలో ఈ ఏడాది సీడ్‌పత్తిని సాగుచేశారు. రోజులాగే ఉదయం పొలానికి నీళ్లు పారించేందుకు వెళ్లిన తండ్రి వెంట కూతురు వైష్ణవి(4) కూడా వెళ్లింది. చిన్నారి సమీపంలో ఉన్న నీటి ట్యాంకు వద్దకు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయింది. తండ్రికి కూతురు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికాడు. నీటిట్యాంకులో విగతజీవిగా పడి ఉన్న కూతురును చూసి ఒక్కసారిగా బోరున విలపించాడు. అప్పటి దాకా ఆడుకుంటూ కనిపించిన కూతురు శవమై కనిపించడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని చిన్నారిని చూసి కంటతడి పెట్టారు. -
మంగపట్నం చెరువుకు గండి
ముద్దనూరు: మంగపట్నం గ్రామంలో చెరువుకు గండి పడింది. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షం ధాటికి చెరువు కింద భాగంలో స్వల్పంగా గండి పడింది. దీంతో చెరవులోని నీరు క్రమక్రమంగా గండి పడిన రంధ్రం ద్వారా బయటకు ప్రవహిస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు అధికారులకు సమాచారమిచ్చారు. అలాగే చెరువు ప్రధాన కట్టపై రంధ్రాలు ఏర్పడడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సుమారు 6 నెలల క్రితమే లక్షలాది రూపాయల వ్యయంతో ఈ చెరువు కట్ట తదితర నిర్మాణ పనులు చేపట్టారు. పనులను నాణ్యతా లోపంగా చేపట్టడంతోనే గండి పడడమే గాకుండా, కట్ట బలహీనంగా తయారై రంధ్రాలు పడినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువును ఆర్డీవో వినాయకం, తహసీల్దారు రమ, ఎంపీడీవో మనోహర్‌రాజు, నీటి పారుదల శాఖ అధికారులు రాజగోపాల్, నాయక్ తదితరులు పరిశీలించారు. -
శిథిలావస్థలో నక్కల చెరువు తూము
వృథాగా పోతున్న నీరు ఆందోళనలో ఆయకట్టు రైతులు రూ.24లక్షల పనులు నీటిపాలు పట్టింకోని అధికారులు చెన్నూర్ : బొట్టు బొట్టు ఒడిసి పట్టు.. ఒక్క నీటి చుక్క వథా కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వ మిషన్ కాకతీయ ద్వారా ముమ్మరంగా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టింది. కోట్లాది రూపాయల నిధులతో నియోజకవర్గంలోని 64 చెరువుల మరమ్మతులకు శ్రీకారం చుట్టింది. అన్ని ఉన్న అల్లుని నోట్లో శని ఉన్న చందంగా మారింది. చెన్నూర్ పెద్ద చెరువు ఆయకట్టు రైతుల పరిస్థితి. రెండు పంటలకు నీరందించే సామర్థ్యం కల్గిన చెరువులో చుక్క నీరు నిలవని దుస్థితి నెలకొంది. దీంతో వందల ఎకరాల పంట పొలాలు సమీప భవిష్కత్‌లో ఎడారులుగా మారబోతున్నా పట్టించుకున్న వారే కరువయ్యారు. పెద్ద చెరువు చరిత్ర ఘనం... ఆగస్త్యా మహాముని నడయాడిన పెద్ద చెరువు (ఆగస్త్యా గుండం)గా పేరుంది. ఎంతో ఘన చరిత్ర ఉన్న చెన్నూర్ పెద్ద చెరువు పునరుద్ధరణ పనులు మిషన్ కాకతీయ ద్వారా చేయకపోవడం దారుణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. పెద్ద చెరువు ఆయకట్టు కింద 320 ఎకరాల పంట పొలాలు ఉన్నాయి. చెరువుకు ఏర్పాటు చేసిన తూములు శిథిలావస్థకు చేరుకోవడంతో నీరు వృథాగా పోతోంది. దీంతో గత నాలుగేళ్ల నుంచి ఆయకట్టు రైతులు వందలాది ఎకరాల పంట పొలాలను బీళ్లుగా వదిలేశారు. పంట పొలాలు ఉండి రైతులు వ్యవసాయ కూలీలుగా మారాల్సిన దుస్థితి నెలకొంది. మరమ్మతులు చేసిన ఫలితం శూన్యం పెద్ద చెరువు మరమ్మతుతో పాటు తూములు, కాల్వల నిర్మాణానికి త్రిబుల్ ఆర్ పథకం కింద రూ. 24 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో వేసవి కాలంలో సదరు కాంట్రాక్టర్ చెరువు మరమ్మతులతో పాటు పెద్ద తూము, ప్రధాన కాల్వ నిర్మాణం చేశారు. నక్కల తూముతో పాటు దిగువ ప్రాంతానికి వెళ్లే కాల్వ పనులు చేపట్టలేదు. ప్రధాన కాల్వ పనులు సైతం సక్రమంగా నిర్మించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. చెరువు నిండినప్పటికీ కనీసం 100 ఎకరాలకు నీరందే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.24 లక్షల నిధులతో ఒకే తూము నిర్మించి సదురు కాంట్రాక్టర్ చేతులు దులుపుకున్నా అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి శిథిలావస్థకు చేరిన నక్కల తూముతో పాటు కాల్వల నిర్మాణం చేపట్టాలని, లేనట్లయితే వర్షాలు సంమృద్ధిగా కురిసిన ఫలితం ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ఆలయ కోనేరులో పడి ముగ్గురు దుర్మరణం
నిజామాబాద్ జిల్లా యెడపల్లి మండలం జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద అపశృతి చోటు చేసుకుంది. స్వామి దర్శనం కోసం వచ్చిన ముగ్గురు కోనేరులో పడి మృతి చెందారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ పట్టణానికి చెందిన ఓ కుటుంబం ఆదివారం సాయంత్రం ఆలయానికి వచ్చింది. స్వామి దర్శనం అనంతరం రాజమ్మ (50) తన ఇద్దరు మనవళ్లు నవతేజ (10), అరుణ్(10)తో కలసి కోనేరు దగ్గర కొబ్బరికాయ కొట్టేందుకు వెళ్లింది. ఇద్దరు చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో ఒకరు కోనేరులో దిగి మునిగిపోతుండగా మరో బాలుడు బయటకు లాగే ప్రయత్నం చేశాడు. అతడు కూడా నీటిలో పడిపోవడంతో వారిని రక్షించేందుకు వెళ్లిన రాజమ్మ కూడా కోనేరులో మునిగి ప్రాణాలు కోల్పోయింది. రాత్రి 9 గంటల తర్వాత మృతదేహాలను వెలికి తీయించిన పోలీసులు పోస్ట్‌మార్టం కోసం బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. -
అహోబిలం కోనేరులో యువకుడు దుర్మరణం
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని సుప్రసిద్ధ అహోబిలం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆలయం కోనేటి వద్ద అపశృతి చోటుచేసుకుంది. ఓ యువకుడు కోనేటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురం గ్రామానికి చెందిన చిరంజీవి (20) మరికొందరు స్నేహితులతో కలసి ఆదివారం అహోబిలం క్షేత్రానికి వచ్చాడు. ఈత సరిగా రాకపోయిన కోనేటిలో దిగడంతో... నీళ్లలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. -
చెరువులో పడి నలుగురు విద్యార్థుల మృతి
గణపురం(ములుగు, వరంగల్ జిల్లా): గణపురం(ములుగు) మండలం చెల్పూరు గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఊరి చివరన ఉన్న పెద్దచెరువులో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటనలో చెల్పూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న మేదిపల్లి రమణ(11), మల్లోజు ప్రదీప్(11), కొంపెల్లి శంకర్(12), కేతిరి రమేశ్(14) లు మృత్యువాతపడ్డారు. సెలవు రోజు కావడంతో ఈతకు వెళ్లిన విద్యార్థులు ఇటీవల మిషన్ కాకతీయ కోసం తీసిన గుంతలో చిక్కుకోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ముందుగా చెరువులో దిగిన నలుగురు గుంతలో ఇరుక్కుపోవడంతో వారితో వచ్చిన మరోఇద్దరు పిల్లలు తమ స్నేహితులను కాపాడాలంటూ కేకలు వేశారు. దీంతో చుట్టు పక్కల ఉన్న వారు అక్కడకు వచ్చి కాపాడడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం మునిగిపోయిన విద్యార్థుల మృతదేహాలను బయటికి తీశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల మృతి
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలోని ఊరచెరువులో మునిగి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. సత్తుపల్లి పట్టణానికి చెందిన ఐదుగురు విద్యార్థులు ఆదివారం చెరువు చూసేందుకు వెళ్లారు. ఈత రాకపోవడంతో అందులో దిగిన తాటి దిలీప్ (12), మాదాస్ ప్రశాంత్(12) ప్రమాదంలో చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు మాదాసు ధనుష్ (11) నీటిలో దిగగా ముగ్గురూ మునిగిపోయారు. మరో ఇద్దరు విద్యార్థులు కేకలు వేయగా దగ్గర్లోని వారు స్పందించి వచ్చేసరికి నీట మునిగిన ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ప్రశాంత్, ధనుష్ స్వయానా సోదరులు. మిషన్ కాకతీయలో భాగంగా ఇటీవలే ఊరచెరువులో పూడిక తీయడంలో నీటి మట్టం ఎక్కువగా ఉంది. -
నీటితొట్టెలో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
మెదక్: మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ నీటితొట్టెలో పడి మరణించింది. వివరాలిలా ఉన్నాయి. వడియారం గ్రామానికి చెందిన మామిల్ల బాలరాజు, లక్ష్మి దంపతులు ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ధాన్యం ఎండబెట్టేందుకు వెళ్లారు. వారి కుమార్తె రేఖా మహేశ్వరి (4) ఆడుకోసాగింది. చిన్నారి ఆడుకుంటూ ఇంటి ముందున్న నీటి తొట్టెలో నుంచి మగ్గుతో నీటిని తీసుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ అందులో పడిపోయింది. తలకిందులుగా తొట్టెలోకి పడిపోవడంతో ఊపిరాడక మృతి చెందింది. ఒక్కగానొక్క కూతురు మృతితో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన గ్రామస్తులను కలచివేసింది. -
నిర్జీవంగా అనుదీప్
ఒంగోలు క్రైం: నగరంలోని ఎస్ఎస్ ట్యాంకు-2లో రెండు రోజుల క్రితం జారి పడిన విద్యార్థి శనివారం ఉదయం శవమై నిర్జీవంగా కనిపించాడు. నగరానికి చెందిన పిన్నిక సాయి అనుదీప్ అనే పదో తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తూ ట్యాంకులో పడి గల్లంతైన విషయం తెలిసిందే. అనుదీప్ తన స్నేహితులతో కలిసి ఆ పక్కనే క్రికెట్ ఆడుకొని ట్యాంకు వద్దకు వెళ్లి అందులో ప్రమాదవశాత్తూ పడ్డాడు. తాలూకా సీఐ ఎస్.ఆంథోనిరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. చివరకు మృతదేహమై బయటకు వచ్చాడు. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. -
భువి నిండుగ...విరి పండుగ
బతుకమ్మ సంబరాలకు సన్నాహాలు ముస్తాబవుతున్న పూల గోపురాలు జిల్లాల వైభవాన్ని చాటే శకటాలు సిద్ధం పది వేల బతుకమ్మల తయారీ కూకట్‌పల్లిలో కొలువుదీరనున్న 17 అడుగుల బతుకమ్మ భాగ్యనగరి పూలతో సింగారించుకుంటోంది. వీధులన్నీ విరి తోటలవుతున్నాయి. వాడలన్నీ వర్ణరంజితమవుతున్నాయి. ఇళ్ల ముందర బతుకమ్మలు కొలువుదీరుతున్నాయి. బతుకమ్మ ఒడిలో ఒదిగిపోవాలని పూలు పోటీ పడుతున్నాయి. ఆబాలగోపాలం ఆటపాటలలో మునిగి తేలుతున్నారు. తెలంగాణ వైభవానికి దర్పణం పట్టేలా ఈ వేడుక లు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సాక్షి, సిటీబ్యూరో/కూకట్పల్లి: పూల పండుగకు మహానగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. తెలంగాణ బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. తంగేడు, చామంతి, తీరొక్క రంగుల్లో ముంచి పేర్చిన గడ్డిపూలు, మందారాలు, బంతిపూలతో తీర్చిదిద్దే పూల గోపురాలు తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక సౌరభాలను గుభాళించనున్నాయి. బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు, ఎల్బీ స్టేడియం ప్రాంతాలను అందమైన విద్యుద్దీపాలతో అలంకరించారు. మరికొద్ది గంటల్లో వేలాది బతుకమ్మలతో, లక్షలాది మంది మహిళలతో భాగ్యనగరంలో మహాద్భుతమైన పూల జాతర ఆవిష్కృతం కానుంది. మరోవైపు రాష్ర్టంలోని పది జిల్లాల వైభవాన్ని చాటిచెప్పే శకటాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సద్దుల బతుకమ్మ సంబురాలను కన్నుల పండువగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వ సన్నద్ధమవుతోంది. 10 వేల పూల గోపురాలు బతుకమ్మ వేడుకలకు ఎల్బీ స్టేడియం, ఎగ్జిబిషన్ గ్రౌండ్, ట్యాంక్‌బండ్ ప్రాంతాలను అందంగా అలంకరించారు. ట్యాంక్‌బండ్ పైన స్వాగత వేదికలను తీర్చిదిద్దారు. కొన్ని చోట్ల ఉప వేదికలను ఏర్పాటు చేశారు. ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున బతుకమ్మలను తయారు చేస్తున్నారు. ఇందుకోసం వేలాది మందిని నియమించారు. ఇప్పటికే వేలాది బతుకమ్మల తయారీ పూర్తయింది. 10 వేల బతుకమ్మలను వేడుకల కోసం సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంజీవయ్య, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి రాజీవ్ సాగర్లు ఎల్బీ స్టేడియంలో బతుకమ్మల తయారీని పర్యవేక్షిస్తున్నారు. బతుకమ్మలకు కావలసిన తంగేడు, గునుగు పూలను శుద్ధి చేసి పేరుస్తున్నారు. మరోవైపు కడియం, బెంగుళూరు నుంచి 35 వేల టన్నుల బంతిపూలను తెప్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా కానుగూరు నుంచి వచ్చిన ఐ.నాగరాజు బృందం, నగరానికి చెందిన అనిత బృందాలు బతుకమ్మల తయారీలో నిమగ్నమయ్యాయి. పండుగ సందర్భంగా హుస్సేన్ సాగర్‌లో అరగంట పాటు లేజర్‌షోను ఏర్పాటు చేయనున్నారు. శకటాలు సిద్ధం మరోవైపు వివిధ జిల్లాల చరిత్ర, సంస్కృతులను చాటే శకటాలను ఎగ్జిషన్ గ్రౌండ్లో సిద్ధం చేశారు. ఆ ప్రాంతాల విశిష్టతను తెలిపే ఆకర్షణీయమైన చిత్రాలు, నినాదాలతో శకటాలను రూపొందించారు. బుధవారం సాయంత్రం రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి బీపీ ఆచార్య, సమాచార కమిషనర్ చంద్రవదన్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్. కవితాప్రసాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను సందర్శించి, శకటాల తయారీని పరిశీలించారు. ముంబైకి చెందిన విజ్‌క్రాఫ్ట్ ప్రతినిధులు శకటాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు.‘ఒక్కొక్క శకటంతో పాటు సుమారు 40 మంది కళాకారుల చొప్పున మొత్తం 2 వేల మంది ప్రదర్శనలిస్తారని’ కవితాప్రసాద్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో 25 వేల మంది మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఇన్చార్జ్ జేసీ సంజీవయ్య తెలిపారు. కూకట్‌పల్లిలో 17 అడుగుల బతుకమ్మ ఏటా బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహిస్తోన్న కూకట్‌పల్లిలో ఈ ఏడాది కూడా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి పూలు తెప్పిస్తున్నారు. నిజమాబాద్, మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట, నర్సాపూర్ తదితర ప్రాంతాల నుంచి పూలను తరలిస్తున్నారు. ఆడపిల్ల పుట్టడం శుభసూచకంగా భావించే సత్సంప్రదాయానికి బతుకమ్మ వేడుక ప్రతీక. ఆ సంప్రదాయాన్ని గత 17 ఏళ్లుగా పాటిస్తూ, తమ ఇంట్లో పుట్టిన ఆడపిల్లలకు ప్రతీకగా వేడుకలు నిర్వహిస్తోన్న గుండాల చ ంద్రమ్మ కుటుంబం ఈసారి 17 అడుగుల బతుకమ్మను తయారు చేస్తోంది. ‘తమకు ఐదుగురు కుమారులని...అమ్మాయిలు లేరనే బెంగ ఉండేదని.. తమ కొడుక్కి కూతురు పుట్టిన సంతోషంతో బతుకమ్మను అంచెలంచెలుగా పెంచుతున్నటు’్ల చంద్రమ్మ చెప్పారు. -
బండ్‌బారుతోంది!
పూడికతో నిండుతున్న ‘సాగర్’ మొక్కుబడిగా ప్రక్షాళన బాధ్యత తీసుకోని యంత్రాంగం భారీగా చేరుతున్న వ్యర్థాలు సాక్షి, సిటీబ్యూరో: పర్యావరణ హిత వినాయకుని తయారు చేయాలని పిలుపునివ్వడం మినహా పక్కాగా ఆంక్షలు విధించలేని ప్రభుత్వ నిస్సహాయత చారిత్రక హుస్సేన్‌సాగర్‌ను కాలుష్య కాసారంలా మార్చేసింది. మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై నగరంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా... అనుకున్న స్థాయిలో ఆ కార్యక్రమం విజయవంతం కాలేదు. స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ ప్రేమికులు చేసిన ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేదు. పీఓపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్)తో రూపుదిద్దుకున్న గణనాథుడి భారీ విగ్రహాల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. గత సంవత్సరం కంటే అధికంగానే పీఓపీ వినాయక విగ్రహాలు సాగర్‌లో నిమజ్జనమయ్యాయి. కృత్రిమ రంగులతో కూడిన భారీ వినాయక విగ్రహాలు అధిక సంఖ్యలో నిమజ్జనం కావడంతో హుస్సేన్‌సాగర్‌లో కాలుష్యం రెట్టింపైనట్లు పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది చిన్నా పెద్దవి కలిపి 50-55 వేల విగ్రహాలు నిమజ్జనం కాగా, ఈ ఏడాది వాటి సంఖ్య 65 వేలకు పెరిగింది. సాగర్ నుంచి వెలికి తీస్తున్న వ్యర్థాల పరిమాణం కూడా అంతే స్థాయిలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది సాగర్ నుంచి 3,723 టన్నుల నిమజ్జన వ్యర్థాలను వెలికి తీయగా, ఈసారి అది 5వేల టన్నులకు పైగా ఉండొచ్చని అధికారుల అంచనా. ఓ వైపు హెచ్ఎండీఏ రూ.370 కోట్ల వ్యయంతో సాగర్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినట్టు చెబుతోంది. మరోవైపు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటి విష రసాయన పదార్థాలతో నిర్మితమైన గణేశ్ విగ్రహాలు వేల సంఖ్యలో వచ్చి చేరాయి. వీటిని వెలికితీసే కార్యక్రమం మాత్రం మొక్కుబడిగా సాగుతోంది. ఒకవైపే శుద్ధి నిజానికి సాగర్‌లో ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌ల వైపు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నా... ఎన్టీఆర్ మార్గ్ వైపు మాత్రమే ప్రక్షాళన పనులు చేపట్టడం విమర్శలకు తావిస్తోంది. అటుగా వెళ్లే ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టిలో పడితే ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో వాటిని తొలగించేందుకే అధికారులు ప్రాధాన్యమిస్తున్నారు. అదే ట్యాంక్‌బండ్ వైపు అయితే.... లోతు ఎక్కువగా ఉండటం వల్ల నీళ్లలో పడిన విగ్రహాల ఆచూకీ తెలియట్లేదు. ఒక్కరోజు నీటిలో నానితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కరిగిపోతుండటంతో వ్యర్థాలు సాగర్ గర్భంలోకి చేరుతున్నాయి. ఇలా ట్యాంక్‌బండ్ వైపు కొన్నేళ్లుగా పూడిక పేరుకుపోతోంది. అటువైపు నిర్వహణ తమకు సంబంధం లేదని హెచ్ఎండీఏ, నీళ్లున్న ప్రాంతం తమ పరిధిలోకి రాద ని జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ విభాగాల అధికారులు ఎవరికివారు తప్పించుకుంటూ ఉండడంతో ట్యాంకు బండ్ భద్రతకు భరోసా లేకుండా పోయింది. అంత పరిజ్ఞానం లేదట... వినాయక నిమజ్జనోత్సవానికి భారీ మొత్తం ఖర్చు చేసిన జీహెచ్ఎంసీ ట్యాంక్‌బండ్ వైపు నిమజ్జనమైన విగ్రహాలను వెలికితీసే విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. లోతైన ప్రాంతం కావడంతో అటువైపు పూడిక తొలగింపు అంత సులభం కాదని, ఆ పరిజ్ఞానం కూడా తమ వద్ద లేదంటూ అధికారులు కొన్నేళ్లుగా దాటవేస్తూ వస్తున్నారు. పైపైన తేలిన విగ్రహాలను డీయూసీ, బోట్ల ద్వారా గట్టుకు చేరుస్తున్నారే తప్ప, అడుగుకు చేరుకున్న వాటి జోలికి వెళ్లట్లేదు. విగ్రహాలు కొన్నిరోజులు నీటిలో నానితే ఔట్ ఫ్లోలో కొట్టుకుపోతాయంటూ కొత్త సిద్ధాంతాన్ని చెబుతున్నారు. మరోవైపు ట్యాంక్‌బండ్ వైపు నిర్వహణ మొత్తం జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ విభాగాల పరిధిలో ఉండటంతో అటువైపు పూడికతీత పనులు చేపట్టేందుకు హెచ్ఎండీఏ అధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. మొత్తమ్మీద ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేని కారణంగా సాగర్ ఉనికికే ప్రమాదం వాటిల్లిందన్న విషయం సుస్పష్టం. అసలు లోపాన్ని చక్కదిద్దకుండా సాగర్ ప్రక్షాళన పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా చేయడం ఎంతవరకు సబబో సర్కార్కే తెలియాలి. అయ్యో.... గణేశా! సాక్షి, సిటీ బ్యూరో: వినాయక చవితి ఉత్సవాలను భక్తులు ఎంత భక్తిశ్రద్ధలతో చేస్తారో... అంతే భక్తి ప్రపత్తులతో గణేశ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఎటొచ్చీ నిమజ్జనానంతరం జరుగుతున్న తంతుభక్తుల మనస్సులను గాయపరుస్తోంది. 11 రోజుల పాటు నీరాజనాలందుకున్న ఖైరతాబాద్ భారీ గణేశుడు ఇప్పుడు ముక్కలు చెక్కలుగా విడిపోయి ‘సాగర్’ తీరంలో కనిపిస్తుండడాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. వినాయకుడు పూర్తిగా నిమజ్జనం కాకుండా సాగర్ ఒడ్డునేఅవశేషాలు ఉండడంతో దీన్ని చూస్తున్న జనం అధికారుల తీరును తప్పు పడుతున్నారు. పనులు వేగిరం: కమిషనర్ హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జన పూడికతీత పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సాగర్‌లో వినాయక విగ్రహాల తొలగింపు పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో కూడిన విగ్రహాల వ్యర్థాలను సత్వరం గట్టుకు చేర్చాలని, లేదంటే అవి కరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. నిత్యం ప్రముఖులు రాకపోకలు సాగించే ఎన్టీఆర్ మార్గ్‌ను పరిశుభ్రంగా ఉంచాలని, ఈ విషయంలో ఎక్కడా రాజీ లేకుండా పనులు నిర్వహించాలని బీపీపీ ఓఎస్డీ వి.కృష్ణకు సూచించారు. నిమజ్జనం వ్యర్థాలు 2322 మెట్రిక్ టన్నులు సాక్షి, సిటీబ్యూరో: గణేశనిమజ్జనం సందర్భంగా జీహెచ్ఎంసీలో 2,322 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను జీహెచ్ఎంసీ కార్మికులు తరలించారు. గ్రేటర్లో రోజుకు సగటున 3,800 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతుండగా, నిమజ్జనం సందర్భంగా ఈనెల 7,8, 9,10 తేదీల్లో అదనంగా 2,322 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. 7వ తేదీన 849 మెట్రిక్ టన్నులు, 8న 321, 9న 482.5, 10న 670 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు తరలించారు. -
ముంచుకొస్తున్న నీటి ఎద్దడి
జలాశయాల్లో తగ్గుతున్న మట్టాలు ఖరీఫ్ రైతుకు తప్పని ఇబ్బందులు! నీటిఎద్దడి ముంచుకొస్తోంది. ఒకవైపు ఎండలు మండిపోతుండ డం, మరోవైపు జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షపాతం సాధారణం కన్నా తక్కువ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఈసారి జిల్లాలో ఖరీఫ్ రైతుకు కష్టాలు తప్పేలా లేవు. ప్రస్తుత పరిస్థితుల్లో నాగార్జునసాగర్‌లో కూడా నీళ్లు అడుగంటడంతో వర్షాలు పడి జలాశయాలు నిండితేగానీ నీరు దిగువకు వచ్చే పరిస్థితి కనపడడం లేదు. సాక్షి, విజయవాడ : డెల్టాలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఖరీఫ్‌కు 160 నుంచి 180 టీఎంసీల నీరు అవసరమవుతుంది. ప్రస్తుతం సాగర్‌లో నీటి నిల్వ 144.74 టీఎంసీలే ఉండటం గమనార్హం. 590 అడుగుల నీటిమట్టం ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 517.5 అడుగుల మట్టం ఉంది. నాగార్జునసాగర్ డెడ్‌స్టోరేజి 496 అడుగులు అయినా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 510 అడుగుల వరకు నీటిమట్టం ఉంచాలంటూ జీవో జారీ చేయడంతో ఇబ్బందులు తలెత్తనున్నాయి. 510 అడుగుల వరకు నీరు ఇవ్వడానికి 14 టీఎంసీల నీరు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. శ్రీశైలంలో గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 815.9 అడుగులు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఆలమట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం డ్యామ్‌ల నుంచి సాగునీటి కోసం నీరు విడుదల చేసే అవకాశం లేదు. నాగార్జునసాగర్‌లోనే సాగునీటి అవసరాల కోసం 14 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ‘నైరుతీ’.. సకాలంలో వస్తేనే.. నైరుతీ రుతుపవనాలు సకాలంలో వచ్చి కర్ణాటక, మహారాష్ట్రల్లో వర్షాలు బాగా పడి ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండితేగానీ కిందికి నీరు వచ్చే అవకాశం కనపడడం లేదు. 2004 తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఖరీఫ్‌కు జూన్ రెండు, మూడు వారాల్లో నీటిని విడుదల చేసేవారు. అంతకు వారం ముందు తాగునీటికి, వరి నారుమళ్ల కోసం నాలుగు టీఎంసీల నీటిని వదిలేవారు. డెల్టాకు నీటి విడుదలపై రాష్ట్రస్థాయి కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే రాష్ట్రం విడిపోయిన తరుణంలో కృష్ణా నీటి యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలి. దీని ఏర్పాటుకు మరో ఆరు నెలలు సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రస్తుతం ఉన్న రాష్ట్రస్థాయి కమిటీలో రెండు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్‌లను సభ్యులుగా వేశారు. ఈ కమిటీ నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కావడంతో నీటి విడుదలలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం సాగర్‌లో ఉన్న నీరు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఖమ్మం, నల్గొండ జిల్లాల తాగునీటి అవసరాలకు సరిపోతాయి. జూన్ రెండో వారంలో నారుమళ్ల కోసం కూడా నీరు విడుదల చేయవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఇంకా సమయం ఉండడంతో ఈలోపు వరుణుడు కరుణిస్తే ఈ ప్రాంతానికి తాగు, సాగునీటి ఎద్దడి తప్పుతుందని, లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు. -
సెప్టిక్ ట్యాంక్‌లోపడి ......
సెప్టిక్ ట్యాంక్‌లోపడి మహిళకు గాయాలు లబ్బీపేట, : సెప్టింక్ ట్యాంక్‌పై ఉన్న దిమ్మె విరిగి మహిళ ట్యాంక్‌లో పడిన సంఘటన గురువారం లబ్బీపేట ఆర్ అండ్ బీ క్వార్టర్స్‌లో జరిగింది. ట్యాంక్ ఖాళీగా ఉండటంతో ప్రమాదం తప్పి స్వల్పగాయాలతో ఆమె బయటపడింది. ట్యాంక్‌పై ఉన్న దిమ్మె శిథిలమైందని ఎన్నిసార్లు అధికారులు చెప్పినా పట్టించుకోలేదని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నగర పోలీస్ కమిషనరేట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే జి.బుచ్చయ్య పైడియ్యవీధి చివరలో బందరు కాలువ ఒడ్డున ఉన్న ఆర్ అండ్ బీ క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. అతడి తల్లి గంగాభవానీ(54) ఆయన వద్దే ఉంటోంది. ఉదయం క్వార్టర్ వెనుక భాగంలో ఉన్న గులాబీలు కోసేందుకు సెప్టిక్ ట్యాంక్ దిమ్మెపై నుంచి వెళ్తుండగా అది ఒక్కసారిగా విరిగింది. దీంతో ఆమె ట్యాంకులో పడింది. అది ఆరడగుల లోతు ఉండటంతో ఆమెకు గాయాలయ్యాయి. ట్యాంకులో ఎటువంటి వ్యర్థాలు, నీరు లేక పోవడంతో ప్రాణాపాయం నుంచి బయట పడిందని స్థానికులు చెబుతున్నారు. ఆమెను 108లో ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. క్వార్టర్లు శిథిలావస్థకు చేరుతున్నాయని, మరమ్మతులు చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.