మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది.
మెదక్: మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ నీటితొట్టెలో పడి మరణించింది. వివరాలిలా ఉన్నాయి.
వడియారం గ్రామానికి చెందిన మామిల్ల బాలరాజు, లక్ష్మి దంపతులు ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ధాన్యం ఎండబెట్టేందుకు వెళ్లారు. వారి కుమార్తె రేఖా మహేశ్వరి (4) ఆడుకోసాగింది. చిన్నారి ఆడుకుంటూ ఇంటి ముందున్న నీటి తొట్టెలో నుంచి మగ్గుతో నీటిని తీసుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ అందులో పడిపోయింది. తలకిందులుగా తొట్టెలోకి పడిపోవడంతో ఊపిరాడక మృతి చెందింది. ఒక్కగానొక్క కూతురు మృతితో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన గ్రామస్తులను కలచివేసింది.