![Diesel Tank Of Lorry Exploded In A Petrol Station In Bhuvanagiri](/styles/webp/s3/article_images/2024/05/19/fire1.jpg.webp?itok=yMX3OsiD)
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో పెను ప్రమాదం తప్పింది. డీజిల్ కోసం వచ్చిన లారీ ట్యాంకు ఒక్కసారిగా పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన పెట్రోల్ బంకు సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమయానికి మంటలు అదుపులోకి రాకపోయి ఉంటే.. భారీ నష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు.
![](/sites/default/files/inline-images/fire3.jpg)
![](/sites/default/files/inline-images/fire2.jpg)
Comments
Please login to add a commentAdd a comment