yadaadri
-
యాదాద్రి భువనగిరి: పెట్రోల్ బంకులో పేలిన లారీ డీజిల్ ట్యాంక్
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో పెను ప్రమాదం తప్పింది. డీజిల్ కోసం వచ్చిన లారీ ట్యాంకు ఒక్కసారిగా పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన పెట్రోల్ బంకు సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమయానికి మంటలు అదుపులోకి రాకపోయి ఉంటే.. భారీ నష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. -
కనుల పండువగా లక్ష్మీ నరసింహుడి వివాహ మహోత్సవం (ఫొటోలు)
-
యాదాద్రీశుడికి శాస్త్రోక్త పూజలు
సాక్షి, యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం శ్రీస్వామి అమ్మవార్లకు ఆచార్యులు విశేష పూజలు నిర్వహించారు. ఉదయమే ఆలయాన్ని తెరచిన అర్చక స్వాములు శ్రీస్వామి వారికి సుప్రభాతం చేపట్టారు. అనంతరం అర్చనలు, అభిషేకం, సువర్ణ పుష్పార్చన చేశారు. మండపంలో ఉత్సవ మూర్తులకు అష్టోత్తర పూజలు, శ్రీసుదర్శన నారసింహ హోమం జరిపించారు. పంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణ వేడుకను నిర్వహించారు. రాత్రి శ్రీస్వామి అమ్మవార్లకు మహానివేదన, శయనోత్సవం నిర్వహించారు. ఆన్లైన్ పూజల ద్వారా శ్రీస్వామి వారి నిత్య కల్యాణం, అభిషేకాల్లో భక్తులు పేర్లు నమోదు చేసుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ వేళల్లో మార్పులు.. యాదగిరిగుట్ట పట్టణంలో రోజురోజుకూ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మరోసారి ఆలయ పూజలు, దర్శనాల వేళల్లో మార్పులు చేస్తున్నట్లు ఈఓ గీతారెడ్డి శనివారం వెల్లడించారు. ఇటీవల లాక్డౌన్ సడలింపులో భాగంగా పాత పద్ధతిలో పూజలు, దర్శనాల మార్పులు చేసిన ఆలయ అధికారులు, వాటిని మరోసారి కుదిస్తూ మార్పులు చేశారు. స్థానిక ప్రజలు, ఆలయ సిబ్బంది ఆరోగ్య దృష్ట్యా ఆలయ వేళల్లో మార్పులు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఆలయ వేళలు ఇలా.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయాన్ని ఉదయం 5.30 గంటలకు తెరిచి, ఉదయం 5.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు శ్రీస్వామి వారికి సుప్రభాత సేవ, ఉదయం 6గంటల నుంచి 6.30గంటల వరకు బిందె తీర్థం, ఆరాధన. ఉదయం 6.30 నుంచి 7.15 గంటల వరకు శ్రీస్వామి వారికి బాలబోగం, 7.15గంటల నుంచి 8.15 గంటల వరకు అభిషేకం. 8.15 గంటల నుంచి 9గంటల వరకు సహస్త్ర నామార్చన, ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఉచిత లఘు దర్శనం, మధ్యాహ్నం 12గంటల నుంచి 12.45గంటలకు శ్రీస్వామి వారికి మహా రాజబోగం (ఆరగింపు), మధ్యాహ్నం 12.45 నుంచి సాయంత్రం 6.30గంటల వరకు ఉచిత లఘు దర్శనం, సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు శ్రీస్వామి వారికి ఆరాధన, రాత్రి 7గంటల నుంచి 7.30 గంటల వరకు సహస్త్ర నామార్చన, రాత్రి 7.30 నుంచి రాత్రి 8గంటల వరకు నివేదన, అనంతరం ఆలయ ద్వార బంధనం చేయనున్నట్లు ఈఓ తెలిపారు. ఇదిలా ఉండగా ఉదయం 8.30 గంటల నుంచి 10గంటల వరకు శ్రీస్వామి వారి సుదర్శన నారసింహ హోమం, ఉదయం 10.30 గంటల నుంచి 11.30గంటల వరకు శ్రీస్వామి అమ్మవార్ల నిత్య కల్యాణం, సాయంత్రం 5గంటలకు శ్రీస్వామి వారి జోడు సేవలు దేవస్థానం నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనుబంధ ఆలయమైన శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కూడా ఈ విధంగానే ఉండనున్నట్లు వెల్లడించారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
బీబీనగర్ (భువనగిరి) : బంధువుల జన్మదిన వేడుకలకు వెళ్తున్న ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.ఈ ఘటన శుక్రవారం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. అదిలాబాద్ జిల్లాకు చెందిన మునెసూల అరుణ(21) హైదరాబాద్ నాంపల్లిలోని ఓహస్టల్‌లో ఉంటూ ఎస్ఎన్ వనిత మహావిద్యాలయ్ డిగ్రీ కళాశాలలో బీఎస్ఈ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కాగా యాదాద్రి(గుట్ట)లోని తమ అక్క కూతురి జన్మదినం కావడంతో అరుణ తన బంధువు ముషీరాబాద్‌కు చెందిన శ్రీకాంత్‌తో కలిసి స్కూటీపై హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చారు. బీబీనగర్‌లోని చెరువు కట్ట సమీంపలోకి రాగానే వెనుక నుంచి వస్తున్న బ్రీజా కారు స్కూటీని ఢీకొట్టి వెళ్లిపొయింది. దీంతో రోడ్డుపై ఎగిరి పడ్డ అరుణపై నుంచి అదే సమయంలో వెనుక నుంచి మరోకారు దూసుకుపోయింది. ఈసంఘటనలో అరుణ అక్కడికక్కడే మృతి చెందగా రోడ్డు పక్కన పడ్డ శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మొదట ప్రమాదానికి కారణమైన బ్రీజా కారు అక్కడి నుంచి తప్పించుకు పోగా అరుణ మృతికి కారణమైన హైదరాబాద్‌కు చెందిన కారును, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అరుణతో కలిసి వచ్చిన శ్రీకాంత్ అరుణ తన స్నేహితురాలు అంటూ స్థానికులతో చెప్పుకొచ్చాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు
సాక్షి,మోత్కూరు(తుంగతుర్తి) : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా రాజకీయ ప్రచారం, స్వేచ్ఛగా ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాచకొండ జాయింట్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు తెలిపారు. సోమవారం సాయంత్రం మోత్కూరు పోలీస్‌స్టేషన్‌ను భువనగిరి డీసీపీతో కలిసి సందర్శించారు. చౌటుప్పల్ ఏసీపీ బాపురెడ్డి, రామన్నపేట సీఐ ఎం.శ్రీనివాస్, స్థానిక ఎస్ఐ సీహెచ్.హరిప్రసాద్లతో ఎన్నికలకు సంసిద్ధత కావడంపై సమీక్షించారు. అనంతరం జాయింట్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని చాలా సున్నితంగా వ్యవహరిం చాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక గ్రామాలను గుర్తించి వాటిలో ఎలా వ్యవహరించాలని తమ సిబ్బందికి వివరించినట్లు తెలి పారు. ప్రజలు స్వేచ్ఛ వాతావరణంలో ఎన్నికల్లో పాల్గొనేందుకు తమ శాఖ అన్నిరకాల బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. -
ఎన్నికల మార్గదర్శకాలను వివరించిన కలెక్టర్
సాక్షి, యాదాద్రి : మండల అభివృద్ధి అధికారులు తమ మండలాల పరిధిలో ఎన్నికల మోడల్ కోడ్ కచ్చితంగా అమలు పర్చేందుకు అన్ని చర్యలు తీ సుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అని తారామచంద్రన్ కోరారు. కలెక్టర్ సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో మండల అభివృద్ధి అధి కారులతో సమావేశమై ఎన్నికల మార్గదర్శకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడా రు. మండలంలోని ఆశవర్కర్లు, ఉపాధి హామీ ప థకంలో పని చేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది, ఇతర పొరుగు సేవల ఉద్యోగులు ఎవరూ కూడా ఎన్నికల్లో ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా కాని పాల్గొనకుండా అన్నిచర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ ల ప్రచారాల్లో పాల్గొనకుండా అవగాహన కలిగిం చాలన్నారు. స్వయం సహాయక సంఘాలు డబ్బు ల పంపిణీ ఇతర కార్యక్రమాలలో పాల్గొనడం ఉపేక్షించరాదని, అదే విధంగా రేషన్‌డీలర్లకు కూ డా ఈవిషయంలో అవగాహన కలిగించాలని సూ చించారు. కొత్తగా సీసీరోడ్లు వేయడం, బోర్లు వే యడం, కొత్తగా పనుల మంజూరు ప్రారంభించ డం అన్ని కూడా ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తాయ ని వాటిని గ్రహించాలన్నారు. ఉద్యోగులు ప్రభు త్వ వేతనం పొందుతూ ఎన్నికల ప్రచారాల్లో పా ల్గొని ఉద్యోగాలు కోల్పోవడం, ప్రమోషన్లు, రిటైర్మెంట్ సమయంలో బెనిఫిట్లు కోల్పోరాదన్నా రు. ఈవిషయంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. దివ్యాంగులు తమ ఓటు హక్కు సద్వినియోగపర్చుకునేందుకు పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపుల నిర్మాణం, వీల్‌చైర్స్ ఏర్పాటుతో పాటుగా వారిని ఆటోలో తీసుకువచ్చేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు అన్ని చర్యలు చేపడుతున్నందున పనులు పర్యవేక్షించాలన్నారు. అర్హులైన వారు ఓటరుగా నమోదుకు 9వ తేదీచివరి గడువు అయినందున బీఎల్ఓల ద్వారా ఫారం–6 ద్వారా ఓటరుగా నమోదు చేయించాలన్నారు. దివ్యాంగులకు తోడ్పాటు నందించేందుకు అంగన్వాడీలను వలంటీర్‌గా పెట్టి వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తహసీల్దార్, ఎంపీడీఓలు కలిసి మండల స్థాయి పార్టీ అధ్యక్షులతో సమావేశాలు పెట్టి మోడల్ కోడ్‌పై అవగాహన పర్చాల న్నారు. చెల్లింపు వార్తలు, ప్రీసర్టిఫికేషన్ పొందడం ప్రకటనలు జారీ తదితర విషయాలపై ఎంపీడీఓలకు అవగాహన కలిగించారు. సీవిజిల్ నోడల్ అధికారి ప్రియాంక మాట్లాడుతూ మోడల్ కోడ్ ఉల్లంఘించిన సంఘటనలపై ఫొటో, వీడియో క్లిప్పింగ్ ఆధారాలతో ఫిర్యాదు చేసేందుకు సీవిజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా అవగాహనపర్చాలన్నారు. అదే విధంగా సువిధ ఆన్లైన్ పోర్టల్ ద్వారా అనుమతులు పొందడంపై వివరించారు. ఈ సమావేశంలో ఆలేరు ఆర్ఓ ఉపేందర్‌రెడ్డి, ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
యాదాద్రి అభివృద్ధిపై సీఎస్ సమీక్ష
నల్లగొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, యాదాద్రి సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ హైదరాబాద్‌లోని తన ఛాంబర్లో అన్ని శాఖల అధికారులతో శనివారం సమీక్ష జరిపారు. ఇందులో గుట్ట అభివృద్ధికి ప్రతిపాదించిన స్థలాల సేకరణ, రెండెకరాల్లో ఏర్పాటు చేయనున్న జింకల పార్కు పనుల పురోగతిని తెలుసుకున్నారు. తుర్కపల్లి , వంగపల్లి నుంచి యాదగిరిగుట్ట వేస్తున్న నాలుగు లైన్ల రహదారి పనులను సమీక్షించారు. ఆర్కిటెక్టులు వేసిన ప్లాన్‌కు తుది మెరుగులు దిద్ది సీఎం సంతకం కోసం వేచి చూస్తున్నామని ఆయన తెలిపినట్లు సమాచారం. రెండెకరాల్లో పెంచనున్న ఔషదాలు, వనమూలికలు, సుగంధ ద్రవ్యాల చెట్లు వాటి పెంపకంపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.