నల్లగొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, యాదాద్రి సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ హైదరాబాద్‌లోని తన ఛాంబర్‌లో అన్ని శాఖల అధికారులతో శనివారం సమీక్ష జరిపారు. ఇందులో గుట్ట అభివృద్ధికి ప్రతిపాదించిన స్థలాల సేకరణ, రెండెకరాల్లో ఏర్పాటు చేయనున్న జింకల పార్కు పనుల పురోగతిని తెలుసుకున్నారు. తుర్కపల్లి , వంగపల్లి నుంచి యాదగిరిగుట్ట వేస్తున్న నాలుగు లైన్ల రహదారి పనులను సమీక్షించారు.
ఆర్కిటెక్టులు వేసిన ప్లాన్‌కు తుది మెరుగులు దిద్ది సీఎం సంతకం కోసం వేచి చూస్తున్నామని ఆయన తెలిపినట్లు సమాచారం. రెండెకరాల్లో పెంచనున్న ఔషదాలు, వనమూలికలు, సుగంధ ద్రవ్యాల చెట్లు వాటి పెంపకంపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.