devolpment
-
ఆరు ప్రధాన రంగాలలో నాలుగేళ్లలో విప్లవాత్మక మార్పులు :సీఎం జగన్
-
ఇక మహర్దశ
ఇన్నాళ్లూ్ల నిధులు లేక సతమతమవుతున్న గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టనుంది. ప్రతీ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం కనీసం రూ.8 లక్షల నిధులు మంజూరు చేస్తానని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీలకు వరాలు ప్రకటించిన నేపథ్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. సంగారెడ్డి రూరల్ : కనీస సౌకర్యాలు కల్పించడం ద్వారా గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అన్ని పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. అంతే సమాన మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయనుంది. దీంతో ప్రతీ ఏడాది జిల్లాకు రూ.కోట్లలో నిధులు విడుదల కానున్నాయి. ఈ నిధులతో గ్రామ పంచాయతీల అభివృద్ధితోపాటు మౌలిక వసతుల కల్పనకు అవకాశం కలగనుంది. జిల్లాలో 647 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో 500 లోపు నుంచి నగర పంచాయతీ దాకా ఉన్నాయి. 500 లోపు జనాభా ఉన్న చిన్న గ్రామ పంచాయతీలకు సైతం ప్రతీ ఏడాది రూ. 8 లక్షల నిధులను మంజూరు చేసే అవకాశం ఉంది. పెద్ద పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన మరిన్ని నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. గడిచిన ఐదేళ్ల కాలంలో నిధుల కొరతతో పంచాయతీల అభివృద్ధి చేయలేక సర్పంచ్‌లు ఇబ్బందిగానే గడిపారు. ఇప్పటి వరకు ఎన్నికల కోడ్ కారణంగా చెక్ పవర్ లేక అల్లాడుతున్న కొత్త సర్పంచ్‌లకు సీఎం కేసీఆర్ ప్రకటన కొంత ఊరటనిచ్చింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన క్రమంలో చెక్ పవర్ సైతం వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో కనీస వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కొత్తగా ఏర్పడిన పాలకవర్గాలు నిధుల కోసం ఎదురు చూస్తున్నాయి. త్వరలోనే నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని ఆశాభావంతో ఉన్నారు. నిధులు విడుదలైతే గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కనీస సౌకర్యాలు కల్పించడం ద్వారా గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అన్ని పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. అంతే సమాన మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయనుంది. దీంతో ప్రతీ ఏడాది జిల్లాకు రూ.కోట్లలో నిధులు విడుదల కానున్నాయి. ఈ నిధులతో గ్రామ పంచాయతీల అభివృద్ధితోపాటు మౌలిక వసతుల కల్పనకు అవకాశం కలగనుంది. జిల్లాలో 647 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో 500 లోపు నుంచి నగర పంచాయతీ దాకా ఉన్నాయి. 500 లోపు జనాభా ఉన్న చిన్న గ్రామ పంచాయతీలకు సైతం ప్రతీ ఏడాది రూ. 8 లక్షల నిధులను మంజూరు చేసే అవకాశం ఉంది. పెద్ద పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన మరిన్ని నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. గడిచిన ఐదేళ్ల కాలంలో నిధుల కొరతతో పంచాయతీల అభివృద్ధి చేయలేక సర్పంచ్‌లు ఇబ్బందిగానే గడిపారు. ఇప్పటి వరకు ఎన్నికల కోడ్ కారణంగా చెక్ పవర్ లేక అల్లాడుతున్న కొత్త సర్పంచ్‌లకు సీఎం కేసీఆర్ ప్రకటన కొంత ఊరటనిచ్చింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన క్రమంలో చెక్ పవర్ సైతం వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో కనీస వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కొత్తగా ఏర్పడిన పాలకవర్గాలు నిధుల కోసం ఎదురు చూస్తున్నాయి. త్వరలోనే నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని ఆశాభావంతో ఉన్నారు. నిధులు విడుదలైతే గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. గ్రామాభివృద్ధికి కృషి చేస్తాం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే గ్రామ పంచాయతీ అభివృద్ధికి మరింతగా కృషి చేస్తాం. ఎన్నికల కోడ్ కారణంగా చెక్ పవర్ రాలేదు. ఇప్పటి వరకు సొంత నిధులనే ఖర్చు చేసి గ్రామంలో కొన్ని అభివృద్ధి పనులు చేయిస్తున్నాం. సీఎం కేసీఆర్ ప్రతీ పంచాయతీకి నిధులు కేటాయిస్తానని ప్రకటించడంతో చాలా సంతోషంగా ఉంది. ఆ హామీ నెరవేరి నిధులు వస్తే గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తాయి. కేసీఆర్ నిర్ణయం మంచిదే. – రాములు, మామిడిపల్లి సర్పంచ్ -
పల్లె నుంచి వలసతో విపరిణామాలు
గ్రామ వికాసమే దేశ వికాసం : సీతారాంజీ ∙ జిల్లాలో ప్రవేశించిన భారత పరిక్రమ పాదయాత్ర తుని రూరల్ : గ్రామీణులు పట్టణాలకు వలస పోతున్నందు వల్ల పెక్కు విపరిణామాలు సంభవిస్తున్నాయని పూజ్య సీతారాంజీ ఆవేదన వ్యక్తం చేశారు. వలసలతో గ్రామ జీవనం, భూమి, నీరు, అడవులు, ప్రాణులు, ప్రకృతి, గ్రామీణ సంస్కృతులు అస్తవ్యస్తమవుతున్నాయన్నారు. దేశం అభివృద్ధి సాధించాలంటే గ్రామ జీవనం సురక్షితంగా ఉండాలని, ఒకే కుటుంబంగా సామరస్య పూర్వకంగా కలసి జీవించాలని పేర్కొన్నారు. ఈ లక్ష్యసాధనకే ప్రజలను, చేతివృత్తిదారులను చైతన్యం చేసేందుకు భారత పరిక్రమ పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న భారత పరిక్రమ పాదయాత్ర బుధవారం జిల్లాలో ప్రవేశించింది. రాముడి నుంచి కలాం వరకూ అదే చెప్పారు.. ఈ సందర్భంగా తుని మండలం డి.పోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఆలయ ప్రాంగణంలో వేర్వేరుగా విద్యార్ధులు, ప్రజలతో సీతారాంజీ సమావేశమయ్యారు. గ్రామ వికాసంతోనే దేశ వికాసం సాధ్యమవుతుందన్నారు. ఇందుకు మనస్సులో శ్రద్ధ కలగాలని స్వామి వివేకానంద ఉద్బోధించారని, ప్రతి వ్యక్తీ తన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తే భారతదేశం అభివృద్ధి చెందుతుందని మహాత్మా గాంధీ అన్నారని చెప్పారు. త్రేతాయుగం నుంచి కలియుగం వరకూ; రాముడి నుంచి అబ్దుల్ కలాం వరకూ గ్రామాన్ని రక్షించాలని ఆకాంక్షించారన్నారు. ‘గ్రామాలను దర్శిద్దాం, గోవులను సంరక్షిద్దాం, ప్రకృతిని కాపాడుదాం’ అని ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాలలో మొక్కలను నాటారు. చేతివృత్తిదారుల ఇళ్లను సందర్శించి వారి స్థితిగతులను అడిగితెలుసుకున్నారు. కాగా సీతారాంజీ రాత్రికి గ్రామంలోనే బస చేసి గురువారం చామవరంలో సందేశం కార్యక్రమం నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు. సాదర స్వాగతం పాదయాత్రగా వచ్చిన సీతారాంజీకి ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సాదర స్వాగతం పలికారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండారెడ్డి, కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యదర్శి చోడ్రాజు సత్య కృష్ణంరాజు, ఓలేటి సత్యనారాయణ, ఎం.వి.కుమార్, డాక్టర్ పలకా సోమేశ్వరరావు, చదరం నరసింహమూర్తి, వాడబోయిన సాంబయ్య స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. -
పెరుగుతున్న వ్యయం
ఆదాయ వనరులపై అశ్రద్ధ అంచనా బడ్జెట్ రూ.280 కోట్లు ఆదాయం రూ.40 కోట్లు గ్రాంట్లు, ప్రత్యేక నిధులతోనే అభివృద్ధి కరీంనగర్ కార్పొరేషన్ : ఆదాయాన్ని మించిన వ్యయంతో కార్పొరేషన్లో వింత పరిస్థితి ఉంది. అభివద్ధి పనులకు ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు, నిధులే ఆధారం. అదనపు ఆదాయ మార్గాలు అన్వేషించడం ఎప్పుడో నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లకు రూ.100కోట్ల చొప్పున కేటాయించడంతో ఆశలు చిగురించాయి. అమత్కు ఎంపికవడంతో ఏటా రూ.25కోట్లు వచ్చే అవకాశం ఉంది. నిధులు పుష్కలంగా వస్తాయనే ఉద్దేశంతో రూ.280కోట్లతో అంచనా బడ్జెట్ రూపొందించారు. అయితే ఆదాయాన్ని మరిచిపోయారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో ఆదాయ వనరులపై అశ్రద్ధ కనిపిస్తుంది. బల్దియా ఆదాయాన్ని పెంచుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే నిధులు, గ్రాంట్లపై ఆధారపడి అభివద్ధి పనులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లకు రూ.100 కోట్ల చొప్పున కేటాయించడం, అమృత్ నిధులు రూ.25కోట్లు, ఆర్థిక సంఘం నిధులు రూ.16.2 కోట్లను పరిగణలోకి తీసుకుని రూ.280 కోట్లతో అంచనా బడ్జెట్‌ను రూపొందించారు. కానీ బల్దియా ఆదాయం రూ.40 కోట్లకు మించి లేదనే విషయాన్ని మరిచారు. నల్లాల ద్వారా రూ.4.8 కోట్లు నగరంలో నల్లాల సంఖ్య 40,500కు చేరుకుంది. నల్లా కనెక్షన్ల ద్వారా ఏడాదికి రూ.4.8 కోట్లు ఆదాయం సమకూరుతోంది. విద్యుత్ చార్జీలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడం, నీటిశుద్ధికి కావాల్సిన ఆలం, క్లోరినైజేషన్ కొనుగోలు, మోటార్లు, పైపులైన్ల మరమ్మతులు వంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఏటా సుమారు రూ.6 కోట్లకు పైగా ఖర్చవుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అక్రమ నల్లా కనెక్షన్లు వేల సంఖ్యలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హోర్డింగ్‌లపై శ్రద్ధేది? నగరంలో హోర్డింగ్‌లపై పట్టింపు కరువైంది. ప్రస్తుతం రూ.2కోట్లు వస్తున్న హోర్డింగ్‌ల ద్వారా కనీసం రూ.50 కోట్లు కూడా రాబట్టవచ్చని అధికారుల అభిప్రాయం. ఈ విషయంపై కమిషనర్, మేయర్ సైతం పలుమార్లు సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. అయినా వాటికి ఖచ్చితమైన లెక్కలు ఇప్పటికీ చేయకపోవడం విచారకరం. ఖాళీ స్థలాలపై వీఎల్టీ వేయాల్సి ఉంది. లైసెన్స్ ఫీజుల్లో చేతివాటం నగరపాలకసంస్థలో ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూళ్లు గందరగోళంగా మారాయి. ట్రేడ్ లైసెన్స్‌లు ఇష్టానుసారంగా వసూల్లు చేస్తున్నారు. రూ.కోటి వరకు వసూలు చేయాల్సి ఉండగా రూ.50 లక్షలు కూడా రావడం లేదనే ఆరోపణలున్నాయి. నగరంలో 5 వేల దుకాణాలు ఉన్నట్లు గుర్తించారు. అద్దెలపై అశ్రద్ధ నగరపాలకసంస్థలోని దుకాణాలను వేలం వేయడంలో అశ్రద్ధ చూపుతున్నారు. ఏటా రూ.3.5కోట్ల ఆదాయం రావాలి. కానీ దుకాణాలు ఖాళీగా ఉండడంతో అది రూ.2 కోట్లకే పరిమితమైంది. వీటి గురించి మూడేళ్లుగా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆస్తి పన్నులే ప్రధానాధారం నగరపాలక సంస్థలో ఆస్తి పన్నుల రూపంలో రూ.16.5 కోట్లు ఆదాయం వస్తుంది. ఆస్తి పన్నుల విషయంలో మాత్రం నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ఏటా 97 శాతానికిపైగా వసూలు చేస్తున్నారు. ఆస్తిపన్నులే బల్దియాకు ఆధారంగా మారుతున్నాయి. పెరుగుతున్న వ్యయం నగరపాలక సంస్థకు విద్యుత్ బిల్లులు, శానిటేషన్ కార్మికుల వేతనాలు గుదిబండగా మారుతున్నాయి. విద్యుత్ బిల్లులకు రూ.6 కోట్లు, శానిటేషన్ కార్మికులకు ఏటా రూ.10.5 కోట్లు, సాధారణ పాలన వ్యవహారాలకు రూ.6 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ నిధులు, గ్రాంట్లే ఆధారం నగరపాలక సంస్థలో ఆదాయానికి మించిన ఖర్చులు ఉండడంతో ప్రభుత్వ నిధులు, గ్రాంట్లు, ఆర్థిక సంఘం నిధులపైనే ఆదారపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో రూ.100 కోట్లు, అమత్ నిధులు రూ.25 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.16.2 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులతోనే అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. -
యాదాద్రి అభివృద్ధిపై సీఎస్ సమీక్ష
నల్లగొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, యాదాద్రి సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ హైదరాబాద్‌లోని తన ఛాంబర్లో అన్ని శాఖల అధికారులతో శనివారం సమీక్ష జరిపారు. ఇందులో గుట్ట అభివృద్ధికి ప్రతిపాదించిన స్థలాల సేకరణ, రెండెకరాల్లో ఏర్పాటు చేయనున్న జింకల పార్కు పనుల పురోగతిని తెలుసుకున్నారు. తుర్కపల్లి , వంగపల్లి నుంచి యాదగిరిగుట్ట వేస్తున్న నాలుగు లైన్ల రహదారి పనులను సమీక్షించారు. ఆర్కిటెక్టులు వేసిన ప్లాన్‌కు తుది మెరుగులు దిద్ది సీఎం సంతకం కోసం వేచి చూస్తున్నామని ఆయన తెలిపినట్లు సమాచారం. రెండెకరాల్లో పెంచనున్న ఔషదాలు, వనమూలికలు, సుగంధ ద్రవ్యాల చెట్లు వాటి పెంపకంపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.