ఇన్నాళ్లూ్ల నిధులు లేక సతమతమవుతున్న గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టనుంది. ప్రతీ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం కనీసం రూ.8 లక్షల నిధులు మంజూరు చేస్తానని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీలకు వరాలు ప్రకటించిన నేపథ్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌ల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది.
సంగారెడ్డి రూరల్ : కనీస సౌకర్యాలు కల్పించడం ద్వారా గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అన్ని పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. అంతే సమాన మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయనుంది. దీంతో ప్రతీ ఏడాది జిల్లాకు రూ.కోట్లలో నిధులు విడుదల కానున్నాయి. ఈ నిధులతో గ్రామ పంచాయతీల అభివృద్ధితోపాటు మౌలిక వసతుల కల్పనకు అవకాశం కలగనుంది. జిల్లాలో 647 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో 500 లోపు నుంచి నగర పంచాయతీ దాకా ఉన్నాయి. 500 లోపు జనాభా ఉన్న చిన్న గ్రామ పంచాయతీలకు సైతం ప్రతీ ఏడాది రూ. 8 లక్షల నిధులను మంజూరు చేసే అవకాశం ఉంది. పెద్ద పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన మరిన్ని నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. గడిచిన ఐదేళ్ల కాలంలో నిధుల కొరతతో పంచాయతీల అభివృద్ధి చేయలేక సర్పంచ్‌లు ఇబ్బందిగానే గడిపారు.
ఇప్పటి వరకు ఎన్నికల కోడ్ కారణంగా చెక్ పవర్ లేక అల్లాడుతున్న కొత్త సర్పంచ్‌లకు సీఎం కేసీఆర్ ప్రకటన కొంత ఊరటనిచ్చింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన క్రమంలో చెక్ పవర్ సైతం వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో కనీస వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కొత్తగా ఏర్పడిన పాలకవర్గాలు నిధుల కోసం ఎదురు చూస్తున్నాయి. త్వరలోనే నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని ఆశాభావంతో ఉన్నారు. నిధులు విడుదలైతే గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
కనీస సౌకర్యాలు కల్పించడం ద్వారా గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అన్ని పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. అంతే సమాన మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయనుంది. దీంతో ప్రతీ ఏడాది జిల్లాకు రూ.కోట్లలో నిధులు విడుదల కానున్నాయి. ఈ నిధులతో గ్రామ పంచాయతీల అభివృద్ధితోపాటు మౌలిక వసతుల కల్పనకు అవకాశం కలగనుంది. జిల్లాలో 647 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో 500 లోపు నుంచి నగర పంచాయతీ దాకా ఉన్నాయి. 500 లోపు జనాభా ఉన్న చిన్న గ్రామ పంచాయతీలకు సైతం ప్రతీ ఏడాది రూ. 8 లక్షల నిధులను మంజూరు చేసే అవకాశం ఉంది.
పెద్ద పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన మరిన్ని నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. గడిచిన ఐదేళ్ల కాలంలో నిధుల కొరతతో పంచాయతీల అభివృద్ధి చేయలేక సర్పంచ్‌లు ఇబ్బందిగానే గడిపారు. ఇప్పటి వరకు ఎన్నికల కోడ్ కారణంగా చెక్ పవర్ లేక అల్లాడుతున్న కొత్త సర్పంచ్‌లకు సీఎం కేసీఆర్ ప్రకటన కొంత ఊరటనిచ్చింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన క్రమంలో చెక్ పవర్ సైతం వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో కనీస వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కొత్తగా ఏర్పడిన పాలకవర్గాలు నిధుల కోసం ఎదురు చూస్తున్నాయి. త్వరలోనే నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని ఆశాభావంతో ఉన్నారు. నిధులు విడుదలైతే గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
గ్రామాభివృద్ధికి కృషి చేస్తాం
ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే గ్రామ పంచాయతీ అభివృద్ధికి మరింతగా కృషి చేస్తాం. ఎన్నికల కోడ్ కారణంగా చెక్ పవర్ రాలేదు. ఇప్పటి వరకు సొంత నిధులనే ఖర్చు చేసి గ్రామంలో కొన్ని అభివృద్ధి పనులు చేయిస్తున్నాం. సీఎం కేసీఆర్ ప్రతీ పంచాయతీకి నిధులు కేటాయిస్తానని ప్రకటించడంతో చాలా సంతోషంగా ఉంది. ఆ హామీ నెరవేరి నిధులు వస్తే గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తాయి. కేసీఆర్ నిర్ణయం మంచిదే. – రాములు, మామిడిపల్లి సర్పంచ్
Comments
Please login to add a commentAdd a comment