Works in progress
-
ఇక మహర్దశ
ఇన్నాళ్లూ్ల నిధులు లేక సతమతమవుతున్న గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టనుంది. ప్రతీ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం కనీసం రూ.8 లక్షల నిధులు మంజూరు చేస్తానని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీలకు వరాలు ప్రకటించిన నేపథ్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. సంగారెడ్డి రూరల్ : కనీస సౌకర్యాలు కల్పించడం ద్వారా గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అన్ని పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. అంతే సమాన మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయనుంది. దీంతో ప్రతీ ఏడాది జిల్లాకు రూ.కోట్లలో నిధులు విడుదల కానున్నాయి. ఈ నిధులతో గ్రామ పంచాయతీల అభివృద్ధితోపాటు మౌలిక వసతుల కల్పనకు అవకాశం కలగనుంది. జిల్లాలో 647 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో 500 లోపు నుంచి నగర పంచాయతీ దాకా ఉన్నాయి. 500 లోపు జనాభా ఉన్న చిన్న గ్రామ పంచాయతీలకు సైతం ప్రతీ ఏడాది రూ. 8 లక్షల నిధులను మంజూరు చేసే అవకాశం ఉంది. పెద్ద పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన మరిన్ని నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. గడిచిన ఐదేళ్ల కాలంలో నిధుల కొరతతో పంచాయతీల అభివృద్ధి చేయలేక సర్పంచ్‌లు ఇబ్బందిగానే గడిపారు. ఇప్పటి వరకు ఎన్నికల కోడ్ కారణంగా చెక్ పవర్ లేక అల్లాడుతున్న కొత్త సర్పంచ్‌లకు సీఎం కేసీఆర్ ప్రకటన కొంత ఊరటనిచ్చింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన క్రమంలో చెక్ పవర్ సైతం వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో కనీస వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కొత్తగా ఏర్పడిన పాలకవర్గాలు నిధుల కోసం ఎదురు చూస్తున్నాయి. త్వరలోనే నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని ఆశాభావంతో ఉన్నారు. నిధులు విడుదలైతే గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కనీస సౌకర్యాలు కల్పించడం ద్వారా గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అన్ని పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. అంతే సమాన మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయనుంది. దీంతో ప్రతీ ఏడాది జిల్లాకు రూ.కోట్లలో నిధులు విడుదల కానున్నాయి. ఈ నిధులతో గ్రామ పంచాయతీల అభివృద్ధితోపాటు మౌలిక వసతుల కల్పనకు అవకాశం కలగనుంది. జిల్లాలో 647 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో 500 లోపు నుంచి నగర పంచాయతీ దాకా ఉన్నాయి. 500 లోపు జనాభా ఉన్న చిన్న గ్రామ పంచాయతీలకు సైతం ప్రతీ ఏడాది రూ. 8 లక్షల నిధులను మంజూరు చేసే అవకాశం ఉంది. పెద్ద పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన మరిన్ని నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. గడిచిన ఐదేళ్ల కాలంలో నిధుల కొరతతో పంచాయతీల అభివృద్ధి చేయలేక సర్పంచ్‌లు ఇబ్బందిగానే గడిపారు. ఇప్పటి వరకు ఎన్నికల కోడ్ కారణంగా చెక్ పవర్ లేక అల్లాడుతున్న కొత్త సర్పంచ్‌లకు సీఎం కేసీఆర్ ప్రకటన కొంత ఊరటనిచ్చింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన క్రమంలో చెక్ పవర్ సైతం వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో కనీస వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కొత్తగా ఏర్పడిన పాలకవర్గాలు నిధుల కోసం ఎదురు చూస్తున్నాయి. త్వరలోనే నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని ఆశాభావంతో ఉన్నారు. నిధులు విడుదలైతే గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. గ్రామాభివృద్ధికి కృషి చేస్తాం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే గ్రామ పంచాయతీ అభివృద్ధికి మరింతగా కృషి చేస్తాం. ఎన్నికల కోడ్ కారణంగా చెక్ పవర్ రాలేదు. ఇప్పటి వరకు సొంత నిధులనే ఖర్చు చేసి గ్రామంలో కొన్ని అభివృద్ధి పనులు చేయిస్తున్నాం. సీఎం కేసీఆర్ ప్రతీ పంచాయతీకి నిధులు కేటాయిస్తానని ప్రకటించడంతో చాలా సంతోషంగా ఉంది. ఆ హామీ నెరవేరి నిధులు వస్తే గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తాయి. కేసీఆర్ నిర్ణయం మంచిదే. – రాములు, మామిడిపల్లి సర్పంచ్ -
ఆహ్లాదం.. వేగిరం
నీటివనరుల పరిరక్షణ, మత్స్య సంపద పెంపు, వ్యవసాయానికి భరోసాతోపాటు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద చేపట్టిన మినీ ట్యాంక్బండ్ల నిర్మాణాలు జిల్లాలో పూర్తికావొచ్చాయి. సివిల్ వర్క్స్ పూర్తి కాగా.. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తుదిమెరుగులు దిద్దనున్నారు. మరో నెల, రెండు నెలల్లో అంటే వర్షాకాలంలో మెతుకు సీమ ఆహ్లాదసీమగా మారనుంది. దీంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, మెదక్ : మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2015లో ప్రతిష్టాత్మకంగా మినీ ట్యాంక్బండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున అందుబాటులో ఉన్న పెద్ద చెరువులను ఎంపిక చేసి.. విడతల వారీగా అభివృద్ధి చేయాలని సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లా కేంద్రం, మెదక్ నియోజకవర్గ పరిధిలోని పిట్లం, గోసముద్రం మినీ ట్యాంక్‌బండ్ పనులు తుది దశలో కొనసాగుతున్నాయి. దీంతోపాటు నర్సాపూర్‌లోని రాయరావు చెరువు బ్యూటిఫికేషన్ సైతం పూర్తయింది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రత్యేక శోభను సంతరించుకోనుంది. సకాలంలో వర్షాలు కురిస్తే... జూన్ లేదా జూలై నుంచి ప్రతి రోజూ ‘మినీ’జాతరేనని అధికారులు భావిస్తున్నారు. పిట్లం, గోసముద్రం కలిపి.. మెదక్ పట్టణ సమీపంలోని పిట్లం, గోసముద్రం చెరువులు రెండింటినీ కలిపి మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసేందుకు 2016లో అనుమతులు వచ్చాయి. ఈ మేరకు రూ.9.52 కోట్లు మంజూరు కాగా.. మిషన్ కాకతీయ పథకంలో సివిల్ వర్క్స్ చేపట్టారు. ఈ పనులు తుది దశలో ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు రూ.7 కోట్ల వ్యయమైనట్లు అధికారులు చెబుతున్నారు. కట్టల బలోపేతం, వెడల్పు, జంక్షన్ పాయింట్ల నిర్మాణాలు చేశారు. కట్టపైన రెయిలింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ లెక్కన సివిల్ వర్క్స్ పూర్తయినట్లే. ఆ తర్వాత పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గ్రీనరీ, అలంకరణ, వసతుల కల్పన వంటి పనులు చేపట్టాల్సి ఉంది. ఇది పూర్తయితే పిట్లం, గోసముద్రం మినీ ట్యాంక్ బండ్ అందుబాటులోకి వచ్చినట్లే. మల్లెచెరువుకు మహర్దశ మరోవైపు మెదక్ నియోజకవర్గంలోని రామాయంపేటలో ఉన్న మల్లెచెరువును సైతం మినీట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మొదటి దఫాలో రూ.3 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు కాగా.. పనులు గత నెలలో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కట్టపై బ్రిడ్జి నిర్మాణంతోపాటు కట్ట వెడల్పు పనులు కొనసాగుతున్నాయి. ఇది కూడా నెల, రెండు నెలల్లో పూర్తి కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తయితే పట్టణ ప్రజలకు ప్రధానంగా మురికి నీటి సమస్య తొలగడంతోపాటు ఆహ్లాదకర వాతావరణం అందుబాటులోకి రానుంది. ‘రాయరావు’ అందం చూడతరమా.. నర్సాపూర్ నియోజకవర్గంలోని రాయరావు చెరువు బ్యూటిఫికేషన్‌కు తొలివిడతగా రూ.2.90 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో చెరువు కట్ట బలోపేతం, పంట కాల్వల నిర్మాణంతోపాటు బతుకమ్మ పండుగకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు నర్సాపూర్‌కు చెందిన జెడ్పీ చైర్పర్సన్ రాజమణిమురళీధర్ యాదవ్ దంపతులు తమ కుమారుడు అజయ్ యాదవ్ స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో చెరువు కట్టపై పలు అభివృద్ధి పనులు చేపట్టారు. పట్టణ పరిధిలోని బీవీ రాజు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యం సహకారంతో కట్టపై విద్యుద్దీకరణ, వాకింగ్ ట్రాక్, కట్టపై గ్రిల్స్ ఏర్పాటు, మొక్కలు నాటడం, బెంచీల ఏర్పాటు, ఓపెన్ జిమ్ పరికరాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రాయరావు చెరువు బ్యూటిఫికేషన్ పూర్తి కాగా.. మినీ ట్యాంక్‌బండ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదించే యోచనలో ఉన్నారు. కౌడిపల్లి చెరువు.. నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లిలోని పెద్దచెరువును సైతం మినీట్యాంక్ బండ్‌గా మార్చే పనులు సాగుతున్నాయి. గతంలోనే రూ.4 కోట్లు మంజూరు కాగా.. కట్ట బలోపేతం వంటి తదితర పనులు చేపట్టారు. కట్టపై సీసీ రోడ్డు నిర్మాణం తదితర పనులు అలాగే ఉన్నాయి. ఇది మిషన్ కాకతీయ పథకంలో లేనందున నిధుల లేమి సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది. దీని కోసం నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. తూప్రాన్ పెద్దచెరువు.. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న తూప్రాన్ మండలం జిల్లాల విభజనలో మెదక్‌లో చేరింది. ఇక్కడ పెద్దచెరువును మినీట్యాంక్‌బండ్‌గా మార్చాలని సంకల్పించారు. రూ.7 కోట్ల వ్యయంతో బ్యూటిఫికేషన్ పనులు చేపట్టారు. పనులు దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. తాజాగా.. మినీట్యాంక్ బండ్‌గా మార్చేందుకు రూ.4 కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. నిధులు విడుదల కాగానే.. మిగిలిన పనులు పూర్తిచేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
‘భగీరథ’ నీళ్లొచ్చేనా..!
కరీంనగర్‌కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ మంచినీటి సరఫరా కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అర్బన్ మిషన్ భగీరథ పథకం పనులు నత్తనడక కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్ల అలసత్వం.. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఈ పరిస్థితి నెలకొందనే ఆరోపణలు ఉన్నాయి. నిండు వేసవిలో కరీంనగర్ నగర ప్రజలకు నీటి తిప్పలు తప్పేలా లేవు. ఇప్పటికే బోర్లు ఎండిపోయి నల్లా నీటిపైనే ఆధారపడుతున్నారు. దీనికి తోడు నీటి సరఫరాలో ఇబ్బందులతో తాగునీటి తండ్లాట మొదలైంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా 24/7 నీటి సరఫరాకు కరీంనగర్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. కరీంనగర్‌కు వరప్రదాయినిగా ఉన్న లోయర్ మానేరు డ్యాంతోనే ఇది సాధ్యమవుతుందని భావించారు. తెలంగాణలోనే ఏ నగరానికి లేని తాగునీటి వనరులు కరీంనగర్‌కు ఉన్నాయి. ఎల్ఎండీలో నీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉండడంతో ప్రయోగాత్మకంగా నిరంతరంగా నగరానికి తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టారు. నగరానికి నిరంతర నీటి సరఫరాకు కార్యాచరణ జరుగుతుండగా ఆశలన్నీ అర్బన్ మిషన్ భగీరథ పథకం మీదే ఉన్నాయి. పథకం పూర్తయితేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుండడంతో ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మిషన్ భగీరథ ద్వారానే నిరంతర నీటి సరఫరాకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. కొత్తగా ఓవర్‌హెడ్ ట్యాంకులు, సంపులు, పైపులైన్ కనెక్షన్లు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. గతేడాది నవంబర్లోనే పనులు పూర్తి చేయాల్సి ఉండగా తీవ్ర జాప్యం జరిగింది. ప్రభుత్వం గడువు పెంచి మార్చి నెలాఖరులోగా పనులు పూర్తిచేయాలని ఆదేశించింది. అయినా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. రూ.109 కోట్లతో పనులు... నగరంలో అర్బన్ మిషన్ భగీరథ పథకం కింద ప్రభుత్వం రూ.109.26 కోట్లు మంజూరు చేసింది. వీటితోపాటు పాటు స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు అమలులో ఉండడంతో 24 గంటల నీటి సరఫరాకు శ్రీకారం చుట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 16 ఓవర్‌హెడ్ ట్యాంకులకు తోడు మరో 3 ఓవర్‌హెడ్ ట్యాంకులు మిషన్ భగీరథ పథకంలో నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం నగరంలో ఉన్న 43 వేల నల్లా కనెక్షన్లకు రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతుండగా, మిషన్ భగీరథ పనులు పూర్తయితే నిరంతర నీటి సరఫరా జరగనుంది. అన్ని డివిజన్లలో పనులు ప్రారంభించడంతో పైపులైన్ల పనులు కొనసాగుతున్నాయి. కాగా ఇటీవల 8 గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేశారు. గ్రామాలన్నింటికీ కార్పొరేషన్‌తో సమానంగా నీటి సరఫరా చేయాల్సి ఉంది. రెండు సార్లు గడువు పెంచినా... అర్బన్ మిషన్ భగీరథ పనులు 2017 మేలో ప్రారంభించారు. పూర్తిచేసేందుకు 18 నెలల కాల వ్యవధిని విధించారు. అంటే గతేడాది నవంబర్లోనే పూర్తిచేయాల్సి ఉన్నా పూర్తి కాలేదు. మరోమారు ఈ యేడాది మార్చి ఆఖరులోగా పనులు పూర్తిచేసి నీటిని సరఫరా చేయాలని గడువు పెంచారు. గడువు ముగిసినా పనులు మాత్రం పూర్తికాలేదు. ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక పనులు పూర్తిచేసి ఇంటింటికీ నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించింది. ఆ ఆదేశాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. వంద శాతం పైపులైన్ల పనులు పూర్తికాకపోవడంతో ఎక్కడా ఇంటర్ కనెక్షన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. 2033 సంవత్సరం కల్లా 4.03 లక్షల జనాభాకు సరిపడేలా 68.65 ఎంఎల్డీ(మిలియన్ లీటర్ పర్ డే) సామర్థ్యంతో ఫిల్టర్‌బెడ్, 3000 కేఎల్ సామర్థ్యంతో శాతవాహన యూనివర్సిటీ పరిధిలో మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. దీని పనులు 40 శాతం మేర పూర్తయ్యాయి. 800 కిలో లీటర్ల సామర్థ్యం గల సంపు, పంపుహౌజ్‌ను ఫిల్టర్‌బెడ్ దగ్గర నిర్మిస్తున్నారు. దీని పనులు చివరి దశలో ఉన్నాయి. రాంనగర్లో 1300 కిలో లీటర్ల ట్యాంకు పనులు 60 శాతం మేర, హౌజింగ్‌బోర్డు కాలనీలో 2200 కిలో లీటర్ల సామర్థ్యంతో నిర్మాణం చేస్తున్న ట్యాంకు పనులు 80 శాతం పూర్తయ్యాయి. ఎప్పటికి పూర్తవునో... ప్రతిష్టాత్మకమైన భగీరథ పనులు ఎప్పటికీ పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం పెంచిన గడువు ప్రకారం ప్రజలకిచ్చిన వాగ్దానం ప్రకారం ఏప్రిల్ నుంచి ఇంటింటికి తాగునీరు అందించాలని గడువు విధించింది. ఆ గడువు కూడా ముగిసింది. రిజర్వాయర్లు, సంపుల నిర్మాణం, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ ఆ పనులు పూర్తికాలేదు. పైపులైన్ల అనుసంధానం పనులు సైతం ఆశించిన స్థాయిలో జరగడంలేదు. మిషన్ భగీరథ పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తేనే నిరంతర నీటి సరఫరాకు అడ్డంకులు తొలగుతాయి. -
రహదారి విస్తరణ
ఆదిలాబాద్‌రూరల్: ఆదిలాబాద్ మున్సిపా లిటీ పరిధిలోని పాత జాతీయ రహదారి 7కు ఇరువైపులా అక్రమంగా నిర్మించిన భవనాల కూల్చివేతకు అధికారులు రంగం సిద్ధం చేశారు. టీచర్స్ కాలనీ నుంచి తిర్పెల్లి సీసీఐ క్రాస్ రోడ్డు వరకు సుమారు 3.5 కిలోమీటర్ల ఆర్ అండ్ బీ స్థలంలో నిర్మించుకున్న భవనాలు తొలగించనున్నారు. జాతీయ రహదారి మధ్యలో నుంచి ఇరువైపులా 75 ఫీట్ల స్థలం ఉండాలి. కానీ ప్రస్తుతం అందులో సగం స్థలం కూడా లేదు. రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నందున అధికారులు సోమవారం కొలతలు చేశారు. సుమారు 65 ఇళ్ల వరకు ఆర్ అండ్ బీ రోడ్డు స్థలంలో అక్రమంగా భవనాలు నిర్మించుకున్నట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు పేర్కొంటున్నారు. రోడ్డు స్థలంలో టీన్ షెడ్లు అధికంగా వేసుకు న్నారు. వారిని తొలగించుకోవాలని సూచించినట్లు తెలిపారు. సుందరీకరణకు చర్యలు.. పాత జాతీయ రహదారి 7కు ఇరువైపులా ఆదిలాబాద్ మున్సిపాలిటీ రూపురేఖలు త్వరలో మారనున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టణ సుందరీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. రోజు రోజుకు పట్టణ జనాభా పెరుగుతుండడంతో ట్రాఫిక్ సైతం పెరుగుతోంది. మావల సమీపంలోని జాతీయ రహదారి 44 నుంచి చాందా(టి) శివారు ప్రాంతాంలో గల గాయత్రి గార్డెన్ వరకు పనులు చేపట్టనున్నారు. టీచర్స్ కాలనీ నుంచి తిర్పెల్లి సీసీఐ క్రాస్ రోడ్డు వరకు ప్రస్తుత పాత జాతీయ రహదారి 7 వెడల్పు ఇరువైపులా 25 ఫీట్లు మాత్రమే ఉంది. దీంతో పట్టణ ప్రజలకు ప్రతీ రోజు ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 25 ఫీట్ల రోడ్డును ఇరువైపులా రోడ్డు మధ్యలో నుంచి 75 ఫీట్లకు రోడ్డు విస్తరణ చేపట్టనున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీ సమీపం నుంచి తిర్పెల్లి సీసీ క్రాస్ రోడ్డు వరకు 3.5 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డు వెడల్పు పనులను చేపట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. దీంతో ట్రాఫిక్ సమస్య తీరడంతోపాటు రోడ్డు అందంగా మారనుంది. తొలగిపోనున్న ఆక్రమణలు గత కొన్నేళ్ల కిందట పాత జాతీయ రహదారి 7కు ఇరువైపులా ఆర్ అండ్ బీ రోడ్డు స్థలాన్ని ఆక్రమించుకుని సుందరమైన భవనాలను నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఆ స్థలాల్లో వివిధ రకాల షాపులను ఏర్పాటు చేసుకొని వ్యాపారం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం రోడ్డు వెడల్పు కోసం నిధులు విడుదల చేయడంతో కొన్నేళ్ల కిందట నిర్మించుకున్న భవనాలు కూల్చి వేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగానే సోమవారం అక్రమంగా నిర్మించుకున్న భవనాల వారి వద్దకు వెళ్లి ఏవైనా వస్తువులు ఉంటే తొలగించాలని సూచించారు. ఆర్ అండ్ బీ స్థలం నిర్మించుకున్న భవనాలను మంగళవారం రోజున కూల్చివేస్తామని ఆర్ అండ్ బీ ఈఈ వెంటకట్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా, కమిషనర్ మారుతిప్రసాద్‌తోపాటు ఇతర అధికారులు షాపుల వద్దకు వెళ్లి చెప్పారు. రూ.44 కోట్లు వ్యయం పట్టణ సుందరీకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ పనులతోపాటు రోడ్డుకు మధ్యలో 2 ఫీట్ల వెడల్పులో సెంట్రల్ లైటింగ్(స్ట్రీట్ లైట్లు) ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 9.6 కిలోమీటర్ల పొడవున ఈ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీలను నిర్మించనున్నారు. జాతీయ రహదారి పక్కన వాహనాల ను పార్కింగ్, మొక్కలను నాటేందుకు 28 ఫీట్ల రోడ్డు ఏర్పాటు చేయనున్నారు. రోడ్డు విస్తీర్ణం పెరగడంతో ట్రాఫిక్ సమస్య సైతం తీరనుంది. రూ.26 కోట్ల వ్యయంతో రోడ్డు, డ్రైనేజీ, కల్వర్టులు, రూ.3.25 కోట్ల వ్యయంతో సెంట్రల్ లైటిం గ్, మరో రూ.5.50 కోట్ల వ్యయంతో సిఫ్టింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీతోపాటు తదితర పనులను చేపట్టనున్నారు. మరిన్ని పనులకు ఆర్ అండ్ బీ శాఖ రూ.44.30 కోట్లు మంజూరు చేసింది. మొదలైన గుబులు.. గత కొన్నేళ్ల కిందట ఆర్ అండ్ బీ రోడ్డుకు సంబంధించిన స్థలంలో మాలీగీలు నిర్మించుకొని దర్జగా వ్యాపారం కొనసాగిస్తున్న వారికి భవనాలను కూల్చివేస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో వారిలో గుబులు మొదలైంది. వందలాది ఇళ్లు కూలనున్నాయి. రోడ్డు పనులు ఇంతవరకు వస్తాయా అనే ధీమాతో లక్షలాది రూపాయలు వెచ్చించుకొని వారి.. వారి ఇంటి ఎదుట ఉన్న స్థలాల్లో మంచి.. మంచి భవనాలను నిర్మించుకొని అద్దెకు ఇస్తున్నారు. వాటిని కూల్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేయడంతో తాము ఎవరిని సంప్రదిస్తే కూల్చివేతలు నిలిచిపోతాయని ఆలోచనల్లో పడ్డట్లు తెలుస్తోంది. ఏదేమైనా హైదరాబాద్ నగరంలో అటువంటిది రోడ్డు స్థలాల్లో నిర్మించుకున్న భవనాలను ప్రభుత్వం కూల్చి వేసింది. ఇక్కడ కూడా ఎట్టిపరిస్థితిల్లో వాటిని ఉంచే ప్రసక్తే లేదని అధికారులు పేర్కొంటున్నారు. రోడ్డు పనులు ప్రారంభం కానుండడంతో పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లా కేంద్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నందున ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలు కోరుతున్నారు. ఆక్రమణలు తొలగించిన వెంటనే పనులు పాత జాతీయ రహదారి 7 రోడ్డు విస్తరణ పనుల కోసం నిధులు మంజూరయ్యాయి. 3.5 కిలోమీటర్ల మేర ఈ పనులను చేపట్టనున్నాం. అలాగే 9.6 కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్స్ ఏర్పాటు చేయడంతోపాటు డ్రైనేజీ, కల్వర్టులు, తదితర వాటిని నిర్మించునున్నాం. మున్సిపాలిటీ అధికారులు ఆక్రమణలు తొలగించిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. – వెంకట్‌రెడ్డి, ఈఈ, ఆర్ అండ్ బీ, ఆదిలాబాద్ రెండు, మూడు రోజుల్లో తొలగిస్తాం పట్టణ అభివృద్ధిలో భాగంగా పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని పాత జాతీయ రహదారి 7కు ఇరువైపులా అక్రమంగా నిర్మించుకున్న భవనాలను తొలగించనున్నాం. రెండు మూడు రోజుల్లో వాటిని తొలగించేందుకు రంగం సిద్ధం చేశాం. అందులో భాగంగానే ఆర్ అండ్ బీ స్థలంలో భవనాలు నిర్మించుకున్న వారికి ముందుగా చెప్పడం జరిగింది. – మారుతి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్, ఆదిలాబాద్ -
గడువులోపు గగనమే..
కరీంనగర్‌కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి మంచినీరు సరఫరా చేసేం దుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అర్బన్ మిషన్ భగీరథ పథకం పనులు కరీంనగర్లో నత్తనడకన కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోనే మొదటిసారిగా 24 గంటలు నీరందించేందుకు కరీంనగర్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. నగరానికి సమీపంలో ఉన్న లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ)లో నీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉండడంతో ప్రయోగాత్మకంగా నిరంతరంగా నీటి సరఫరాకు చర్యలు చేపట్టింది. నగరానికి నిరంతరం నీరందించేందుకు కార్యాచరణ జరుగుతుండగా.. ఆశలన్నీ అర్బన్ మిషన్ భగీరథ మీదే ఉన్నాయి. ఈ పథకం పూర్తయితేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుండడంతో ఎప్పుడెప్పుడా అని ప్రజలు వేచిచూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మిషన్ భగీరథ ద్వారానే నిరంతర నీటి సరఫరా చేసేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. కొత్తగా ఓవర్‌హెడ్ ట్యాంకులు, సంపులు, పైపులైన్ కనెక్షన్లు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. గతేడాది నవంబర్లోనే పనులు పూర్తి చేయాల్సి ఉండగా తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం గడువు పెంచి మార్చి నెలాఖరులోగా పనులు పూర్తిచేయాలని ఆదేశించింది. ప్రస్తుత పనులు కూడా ఆలస్యం అవుతుండడంతో గడువులోపు పూర్తవడం అనుమానమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూ.109 కోట్లతో పనులు... నగరంలో అర్బన్ మిషన్ భగీరథ పథకం కింద ప్రభుత్వం రూ.109.26 కోట్ల నిదులు మంజూరు చేసింది. అర్బన్ మిషన్ భగీరథతో పాటు స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు ఇక్కడ అమలులో ఉండడంతో 24 గంటల నీటి సరఫరాకు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 16 ఓవర్‌హెడ్ ట్యాంకులకు తోడు మరో 3 ట్యాంకులు మిషన్ భగీరథ పథకంలో నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం నగరంలో ఉన్న 43 వేల నల్లా కనెక్షన్లకు రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతుండగా, మిషన్ భగీరథ పనులు పూర్తయితే నిరంతర నీటి సరఫరా జరగనుంది. అన్ని డివిజన్లలో పనులు ప్రారంభించడంతో పైపులైన్ల నిర్మాణం కొనసాగుతోంది. పనులు ప్రారంభించినప్పుడు 18 నెలల కాల వ్యవధిని ఇచ్చారు. అంటే గతేడాది నవంబర్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించినప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక మార్చి చివరి వరకైనా పనులు పూర్తిచేసి ఏప్రిల్ నుంచైనా ఇంటింటికి నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో యంత్రాంగం ఉరుకులు, పరుగులు పెడుతున్నా పనులు ఊపందుకోకపోవడం గమనార్హం. పనులు జరుగుతున్న తీరు... అర్బన్ మిషన్ భగీరథ పైపులైన్ పనులు అన్ని డివిజన్లలో కొనసాగుతున్నాయి. 110 ఎంఎం డయా పైపులైన్ 147.43 కిలోమీటర్లు వేయాల్సి ఉండగా 85.21 కిలోమీటర్లు పూర్తయింది. 100 ఎంఎం డయా పైపులైన్ 40 కిలోమీటర్లుకు గాను 35 కిలోమీటర్లు, 150 ఎంఎం డయా పైపులైన్ 29.79 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉండగా, 36.25 కిలోమీటర్లు చేపట్టారు. అలాగే 200 ఎంఎం, 250 ఎంఎం డయా పైపులైన్ 73.64 కిలోమీటర్లు వేయాల్సి ఉండగా 40.04 కిలోమీటర్ల మేర నిర్మించారు. మిగతా పైపులైన్ పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. స్లాబ్ లెవల్‌కు ఓవర్‌హెడ్ ట్యాంకులు... అర్బన్ మిషన్ భగీరథ ద్వారా నిర్మాణం చేపట్టిన మూడు ఓవర్‌హెడ్ ట్యాంకులు స్లాబ్ లెవల్‌కు చేరుకున్నాయి. 2033 సంవత్సరం కల్లా 4.03 లక్షల జనాభాకు సరిపడేలా 68.65 ఎంఎల్డీల సామర్థ్యంతో ఫిల్టర్‌బెడ్, 3000 కేఎల్ సామర్థ్యంతో శాతవాహన యూనివర్సిటీ పరిధిలో మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. దీని పనులు 30 శాతం మేర పూర్తయ్యాయి. 800 కిలో లీటర్ల సామర్థ్యం గల సంపు, పంపుహౌస్‌ను ఫిల్టర్‌బెడ్ దగ్గర నిర్మిస్తున్నారు. 90 శాతం పనులు పూర్తిచేశారు. రాంనగర్లో 1300 కిలో లీటర్ల ట్యాంకు పనులు 50 శాతం మేర, హౌసింగ్‌బోర్డు కాలనీలో 2200 కిలో లీటర్ల సామర్థ్యంతో నిర్మా ణం చేస్తున్న ట్యాంకు పనులు 60 శాతం పూర్తయ్యాయి. ఈ పనులన్నీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. హౌసింగ్‌బోర్డు, రాంనగర్ రిజర్వాయర్ల పనులు జరుగుతుండగా, ఫిల్టర్‌బెడ్ దగ్గర ఉన్న రిజర్వాయర్ పూర్తయింది. సంపుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. గడువులోగా అనుమానమే... ప్రతిష్టాత్మకమైన భగీరథ పనులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టీఆర్ఎస్ రెండోసారి అధికారం చేపట్టాక మిషన్ భగీరథ పనులను మార్చిలోగా పూర్తిచేసి ప్రజలకిచ్చిన వాగ్ధానం ప్రకారం ఏప్రిల్ నుంచి ఇంటింటికి తాగునీరు అందించాలని గడువు విధించింది. రిజర్వాయర్లు, సంపుల నిర్మాణం, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై దృష్టి కేంద్రీకరించింది. పైపులైన్ల అనుసంధానం పనులు సైతం ఆశించిన స్థాయిలో జరగకపోవడం వల్ల ఈ పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని అధికాÆ ý‡ులను ఆదేశించింది. అయితే పైపులైన్లతో పాటు ట్యాంకుల నిర్మాణం అడ్డగోలుగా ఆలస్యమవుతుండడంతో గడువులోగా పనులు పూర్తవుతాయా లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మార్చి టార్గెట్‌గా పనులు.. అర్బన్ మిషన్ భగీరథ పనులను ప్రభుత్వం ఇచ్చిన గడువు మార్చిలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. పైపులైన్ల పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. మిగతా అన్ని నిర్మాణ పనులపై దృష్టి సారించి ఆ మేరకు పనులు జరిగేలా చూస్తున్నాం. శాతవాహన యూనివర్సిటీ ఆవరణలో జరుగుతున్న మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనుల్లో మరింత వేగం పెంచాలని కాంట్రాక్టర్లను ఆదేశించాం. పనులన్నీ గడువులోగా పూర్తి చేయడంపైనే దృష్టి సారించాం.– సంపత్‌రావు, డీఈఈ, ప్రజారోగ్యశాఖ -
‘ప్రాణహిత’ పనుల్లో పురోగతి
{పాజెక్టు కింద కోల్పోతున్న భూమికి పరిహారం! నీటి పారుదల శాఖ నిర్ణయం హైదరాబాద్: తెలంగాణలోని అత్యధిక జిల్లాల సాగునీటి అవసరాలను తీర్చే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనుల పురోగతిలో మరో ముందడుగు పడింది. ప్రాజెక్టు నిర్మాణంతో నష్టపోయే అటవీభూమికి సమానస్థాయిలో పరిహారంగా రెవెన్యూ భూమిని అందించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు నివేదికను రాష్ట్ర అటవీ శాఖకు అందజేసింది. అటవీ శాఖ దానిని పరిశీలించి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు పంపనుంది. ఈ నివేదికకు కేంద్రం అంగీకారం తెలిపితే ప్రాజెక్టుకు జాతీయ హోదా వైపు కీలక అడుగు పడినట్లే. జాతీయ హోదాకు సంబంధించి 18 రకాల క్లియరెన్స్‌లు అవసరం ఉండగా, ఇప్పటికే 13 రకాల క్లియరెన్స్‌లు దక్కాయి. మరో 5 అంశాలకు సంబంధించి అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఇందులో అటవీశాఖ అనుమతులు ముఖ్యమైనవి. ప్రాజెక్టు కింద కోల్పోతున్న 7,240 ఎకరాల అటవీ భూమికి పరిహారంగా భూమిని ప్రభుత్వం చూపించాల్సి ఉంటుంది. అటవీ భూమికి సమానవైన రెవెన్యూ భూమి కోసం అధికారులు సెప్టెంబర్ చివరి వారం నుంచే ఆయా జిల్లాల పరిధిలో సర్వే నిర్వహించారు. సుమారు 8 వేల ఎకరాల పరిహార భూమిని గుర్తించి రూపొందించిన నివేదికను రాష్ట్ర అటవీ ప్రధాన సంరక్షణ అధికారికి అందజేశారు. ఇప్పటికే ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురయ్యే గిరిజన గ్రామాల ప్రజల సమ్మతి తెలుపుతూ రాష్ట్ర గిరిజన సలహా మండలి తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే.