grama panchayat sarpanch
-
ఇక మహర్దశ
ఇన్నాళ్లూ్ల నిధులు లేక సతమతమవుతున్న గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టనుంది. ప్రతీ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం కనీసం రూ.8 లక్షల నిధులు మంజూరు చేస్తానని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీలకు వరాలు ప్రకటించిన నేపథ్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. సంగారెడ్డి రూరల్ : కనీస సౌకర్యాలు కల్పించడం ద్వారా గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అన్ని పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. అంతే సమాన మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయనుంది. దీంతో ప్రతీ ఏడాది జిల్లాకు రూ.కోట్లలో నిధులు విడుదల కానున్నాయి. ఈ నిధులతో గ్రామ పంచాయతీల అభివృద్ధితోపాటు మౌలిక వసతుల కల్పనకు అవకాశం కలగనుంది. జిల్లాలో 647 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో 500 లోపు నుంచి నగర పంచాయతీ దాకా ఉన్నాయి. 500 లోపు జనాభా ఉన్న చిన్న గ్రామ పంచాయతీలకు సైతం ప్రతీ ఏడాది రూ. 8 లక్షల నిధులను మంజూరు చేసే అవకాశం ఉంది. పెద్ద పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన మరిన్ని నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. గడిచిన ఐదేళ్ల కాలంలో నిధుల కొరతతో పంచాయతీల అభివృద్ధి చేయలేక సర్పంచ్‌లు ఇబ్బందిగానే గడిపారు. ఇప్పటి వరకు ఎన్నికల కోడ్ కారణంగా చెక్ పవర్ లేక అల్లాడుతున్న కొత్త సర్పంచ్‌లకు సీఎం కేసీఆర్ ప్రకటన కొంత ఊరటనిచ్చింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన క్రమంలో చెక్ పవర్ సైతం వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో కనీస వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కొత్తగా ఏర్పడిన పాలకవర్గాలు నిధుల కోసం ఎదురు చూస్తున్నాయి. త్వరలోనే నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని ఆశాభావంతో ఉన్నారు. నిధులు విడుదలైతే గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కనీస సౌకర్యాలు కల్పించడం ద్వారా గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అన్ని పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. అంతే సమాన మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయనుంది. దీంతో ప్రతీ ఏడాది జిల్లాకు రూ.కోట్లలో నిధులు విడుదల కానున్నాయి. ఈ నిధులతో గ్రామ పంచాయతీల అభివృద్ధితోపాటు మౌలిక వసతుల కల్పనకు అవకాశం కలగనుంది. జిల్లాలో 647 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో 500 లోపు నుంచి నగర పంచాయతీ దాకా ఉన్నాయి. 500 లోపు జనాభా ఉన్న చిన్న గ్రామ పంచాయతీలకు సైతం ప్రతీ ఏడాది రూ. 8 లక్షల నిధులను మంజూరు చేసే అవకాశం ఉంది. పెద్ద పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన మరిన్ని నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. గడిచిన ఐదేళ్ల కాలంలో నిధుల కొరతతో పంచాయతీల అభివృద్ధి చేయలేక సర్పంచ్‌లు ఇబ్బందిగానే గడిపారు. ఇప్పటి వరకు ఎన్నికల కోడ్ కారణంగా చెక్ పవర్ లేక అల్లాడుతున్న కొత్త సర్పంచ్‌లకు సీఎం కేసీఆర్ ప్రకటన కొంత ఊరటనిచ్చింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన క్రమంలో చెక్ పవర్ సైతం వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో కనీస వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కొత్తగా ఏర్పడిన పాలకవర్గాలు నిధుల కోసం ఎదురు చూస్తున్నాయి. త్వరలోనే నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని ఆశాభావంతో ఉన్నారు. నిధులు విడుదలైతే గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. గ్రామాభివృద్ధికి కృషి చేస్తాం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే గ్రామ పంచాయతీ అభివృద్ధికి మరింతగా కృషి చేస్తాం. ఎన్నికల కోడ్ కారణంగా చెక్ పవర్ రాలేదు. ఇప్పటి వరకు సొంత నిధులనే ఖర్చు చేసి గ్రామంలో కొన్ని అభివృద్ధి పనులు చేయిస్తున్నాం. సీఎం కేసీఆర్ ప్రతీ పంచాయతీకి నిధులు కేటాయిస్తానని ప్రకటించడంతో చాలా సంతోషంగా ఉంది. ఆ హామీ నెరవేరి నిధులు వస్తే గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తాయి. కేసీఆర్ నిర్ణయం మంచిదే. – రాములు, మామిడిపల్లి సర్పంచ్ -
ఇక స్థానిక సమరం!
సార్వత్రిక సమరం ముగిసింది. ఇంకా ఫలితాలు వెలువడటానికి మరో నలభైరోజుల వ్యవధి ఉంది. ఈలోగా స్థానిక సమరానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. పంచాయతీలు, మునిసిపాలిటీలకు కొత్త పాలకవర్గాల ఏర్పాటుకోసం రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి అనుగుణంగా ఓటర్ల జాబితాలను తయారు చేయడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. మే ఒకటో తేదీలోగా మునిసిపాలిటీల స్థాయిలో... మే పదోతేదీలోగా పంచాయతీలవారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయనగరం రూరల్: సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. అప్పుడే స్థానిక సంస్థల సంగ్రామానికి తెరలేచింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల పాలకమండళ్ల ఏర్పాటుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. మునిసిపాలిటీ ఎన్నికలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికలలో వినియోగించిన ఓటరు జాబితాలను వా ర్డుల వారీగా విభజించి, ఓటరు ఫొటోతో కూడిన జాబి తాలను సమగ్ర వివరాలతో రూపొందించాలని అందరు కమిషనర్లకు ఈసీ నుంచి ఆదేశాలువచ్చాయి. వీటికి సం బంధించి ఇంకా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. మే 1లోగా మునిసిపాలిటీల్లో వార్డుల విభజన మునిసిపాలిటీల్లో అసెంబ్లీ ఓటర్ల జాబితాలకు అనుగుణంగా వార్డుల విభజన చేపట్టాలని ఆదేశాలిచ్చారు. మే ఒకటి లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్, నగరపాలక సంస్థల కమిషనర్లకు ఆదేశాలొచ్చాయి. వార్డుల వారీ ఓటర్ల విభజన కోసం కొత్త ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుంటారు. జిల్లాలో విజయనగరం సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీతో పాటు సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీలు ఉండగా.. నెల్లిమర్ల నగర పంచాయతీగా ఉంది. ఇందులో నెల్లిమర్ల నగర పంచాయతీకి మినహా మిగిలిన వాటన్నింటికీ ఎన్నికలు జరిగాయి. జూలై రెండో తేదీతో ఆయా పాలకవర్గాల గడువు పూర్తవుతుంది. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల ప్రకారం అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు జిల్లా కలెక్టర్ ద్వారా అసెంబ్లీ ఓటర్ల జాబితాలను సేకరించి ఏ వార్డులో ఎంతమంది ఓటర్లు ఉన్నారనేది ప్రకటిస్తారు. జిల్లాలో ఉన్న ఐదు పట్టణాల్లో రెండింటి ఎన్నికల నిర్వహణకు అవాంతరాలు ఉండగా... వాటిపై మున్సిపల్ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉంది. ఆరేళ్లుగా పాలకవర్గం లేని నెల్లిమర్ల జిల్లాలోని నెల్లిమర్ల ప్రాంతం నగర పంచాయతీగా రూపాంతరం చెంది ఆరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఎన్నికలకు నోచుకోలేదు. 27వేల జనాభా, 18వేల ఓట్లు ఉన్న నెల్లిమర్ల, జరజాపుపేట మేజర్ గ్రామపంచాయతీలను విలీనం చేస్తూ 2013 మార్చి 21న నగర పంచాయతీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నగర పంచాయతీకి ప్రత్యేక అధికారులే తప్ప పాలకవర్గం లేకపోవటం గమనార్హం. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతున్న తరుణంలో ఈ సారైనా ఎన్నికలు జరుగుతాయో లేదో నన్న అయోమయం అక్కడ నెలకొంది. ఇక విజయనగరం కార్పొరేషన్ విజయనగరం మున్సిపాలిటీ 1888 ఏర్పడింది. 1998 నుంచి సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీకి చేరుకుంది. 57.01 చదరపు కిలోమీటర్ల పరిధిలో మున్సిపాలిటీ విస్తరించి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 2,44,598 మంది జనాభా ఉన్నారు. అయితే ఇవే ప్రామాణికాలతో 2015 సంవత్సరం జూలై నెలలో సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న విజయనగరం మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా... స్థానిక పాలకులు తమ పదవులు కాపాడుకునేందుకు ఆ ఉత్తర్వులను అమల్లోకి రానీయకుండా అడ్డుకున్నారు. వారి పదవీకాలం పూర్తయ్యేంత వరకు ఉత్తర్వులను ఎబియన్స్లో ఉంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రత్యేకంగా జీఓ తీసుకువచ్చారు. అప్పట్లో ఉన్న అధికార టీడీపీ సైతం ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగిసేంత వరకువిజయనగరం సెలక్షన్‌గ్రేడ్ మున్సిపాలిటీగా కొనసాగుతుందని, పదవీ కాలం పూర్తయిన మరుక్షణం కార్పొరేషన్ హోదా వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఎన్నికల సంఘం మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణపై సమాయత్తం కావటంతో మరోసారి కార్పొరేషన్ హోదా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో మరలా విలీన ప్రాంతాలతో వార్డుల విభజన తదితర అంశాలపై అధికార యంత్రాంగం పెద్ద కసరత్తు చేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం సెలక్షన్‌గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న విజయనగరాన్ని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయాల్సి వస్తే పట్టణ పరిధి పెరగటంతో పాటు ప్రస్తుతం ఉన్న 40 వార్డుల సంఖ్య 55 నుంచి 60కు చేరే అవకాశం ఉంది. పంచాయతీవారీ ఓటర్ల జాబితాలు రాష్ట్రంలో పంచాయతీ పోరుకు సిద్ధమయ్యేలా పంచా యతీ, వార్డుల వారీగా ఓటర్ల జాబితా వచ్చే నెల 10 నాటికి ప్రచురించాలని ఎన్నికల కమిషన్ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో గడువులోగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం గతంలో సిద్ధం కాకపోవడంతో పంచాయతీ పాలన ప్రత్యేకాధికారుల ఆధీనంలోకి వెళ్లింది. జిల్లాలో ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికలకు అయ్యే వ్యయ వివరాలను ప్రభుత్వం అధికారుల నుంచి సేకరించింది. ఇందుకు రూ. 9కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. 2018 అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగానే పంచాయతీ ఓటర్ల జాబితా గతేడాది మే, జూన్ నెలల్లో రూపొందించారు. 2018 జూన్ 15న 34 మండలాల్లో 920 పంచాయతీల ఓటర్ల జాబితాలను ప్రచురించారు. అయితే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడంతో తాజాగా మే 10 నాటికి ఓటర్ల జాబితా రూపొందించా లని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. 2019 జనవరి 1 నాటికి అసెంబ్లీ ఓటర్ల సంఖ్య ఆధారంగా ఓటర్ల జాబితాను రూపొందించాలని ఆదేశాలు వచ్చినట్లు జిల్లా పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ తెలిపారు. ఖరారు కాని రిజర్వేషన్లు పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్ల అంశం సందిగ్ధంగా మారుతోంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు 50శాతం మించడానికి లేదు. 2013లో ఎస్టీ 8.5 శాతం, ఎస్సీ 18.25 శాతం, బీసీలు 34 శాతం ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలయ్యాయి. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును అనుసరించి 50 శాతం దాటకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు ఎన్నికలు నిర్వహిస్తే ఎటువంటి అవరోధం ఉండదు. ఏమైనా మార్పు చేయాల్సి వస్తే కేంద్రం అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆదేశాలు రావాలి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలువచ్చాయి. ఆ మేరకు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాయనున్నాం. విజయనగరం సెలక్షన్‌గ్రేడ్ మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదా కల్పించిన తరువాత ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజెప్పి, వారి ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తాం. – ఎస్.ఎస్.వర్మ, కమిషనర్, విజయనగరం మున్సిపాలిటీ. -
సొంత భవనాలు కలేనా?
స్వపరిపాలనలో గ్రామాలను ఎంతో అభివృద్ధి చేసుకుంటామని కలలుగన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పడటంతో గ్రామాలకు మరో స్వాతంత్య్రం వచ్చినట్లయింది. పంచాయతీ హోదాతో పాటు సమస్యలు నెరవేరుతాయని, సొంత భవనాల నిర్మాణం \జరుగుతుందని ఆశపడ్డారు. పంచాయతీ హోదావచ్చి ఏడాది కావస్తున్నా కనీస సౌకర్యాల కల్పనకు నోచుకోవడం లేదు. సమస్యలకు తోడు ఇన్చార్జి కార్యదర్శులతో పాలన అస్తవ్యస్తంగా మారింది. రేగోడ్(మెదక్): మండలంలో గతంలో 12 పంచాయతీలు ఉండేవి. గతేడాది పెద్దతండా, సంగమేశ్వర తండా, తిమ్మాపూర్, వెంకటాపూర్, పోచారం, తాటిపల్లి గ్రామాలకు పంచాయతీలుగా హోదా దక్కడంతో మొత్తంగా పంచాయతీల సంఖ్య 18కి చేరింది. స్వరాష్ట్రంలో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావించిన ప్రజలకు నిరాశే మిగులుతోంది. కనీస సౌకర్యాలు లేక ఇబ్బందుల పాలవుతున్నారు. ఐదు వందల జనాభా కలిగిన గ్రామాలు, తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసినా పంచాయతీలకు సొంత భవనాలు ఇప్పటి వరకూ నిర్మించలేదు. అంగన్వాడీ పాఠశాలల భవనాలు, ప్రభుత్వ పాఠశాలల భవనాల్లో పంచాయతీ కార్యాలయాలను కొనసాగిస్తున్నారు. నామమాత్ర ఫర్నిచర్‌ను ఏర్పాటు చేసినా సమావేశాలకు స్థలం సరిపోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. పంచాయతీలను ఏర్పాటు చేసి సుమారు ఏడాది కావస్తున్నా.. భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయకపోవడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇన్చార్జి కార్యదర్శులే దిక్కు.. పంచాయతీకి ఒక గ్రామ కార్యదర్శి ఉండాలి. కానీ ఇక్కడ 18 గ్రామ పంచాయతీలకు నలుగురు మాత్రమే కార్యదర్శులు పని చేస్తున్నారు. ఇద్దరు కార్యదర్శులకు ఐదు చొప్పున పంచాయతీలు, మరో ఇద్దరు కార్యదర్శులకు నాలుగు చొప్పున పంచాయతీలకు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇన్చార్జి బాధ్యతలతో కార్యదర్శులకు భారంగా మారింది. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏ గ్రామ కార్యదర్శి ఏ గ్రామంలో ఉంటున్నారనే విషయం తెలియక అధికారులు, ప్రజలు సతమతమవుతున్నారు. దీంతో పారిశుధ్య నిర్వహణ గ్రామాల్లో అస్తవ్యస్తంగా మారింది. అపరిశుభ్రత కారణంగా ఇటీవల సంగమేశ్వర తండాలో ఇంటింటికీ జ్వరాలు వచ్చిన విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీలకు లక్షలాది రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తున్నా సమస్యల పరిష్కారం నోచుకోక, పారిశుధ్యం కానరక ప్రజలు అవస్థలు పడుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిధులు మంజూరు చేయాలి మా తండాను మేమే పరిపాలించుకునే విధంగా సీఎం కేసీఆర్ కృషి చేయడం ఆనందంగా ఉంది. పంచాయతీ ఏర్పడినా సొంత పంచాయతీ భవనం నిర్మాణం కాలేదు. పంచాయతీలో సమస్యలు వెక్కిరిస్తున్నాయి. నిధులు మంజూరు చేసి సమస్యలను తొలగించాలి. –సంతోష్ చౌహాన్, సంగమేశ్వర తండా వెంటనే బదిలీలు చేపట్టాలి జిల్లాలో సుమారు పదేళ్లకు పైగా ఒకే మండలంలో పనిచేస్తున్న కార్యదర్శులు ఉన్నారు. వారందరికీ బదిలీలు చేయాలి. ఒక్కో కార్యదర్శికి ఐదారు పంచాయతీలు ఉండటంతో పని ఒత్తిడికి గురై మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతీ పంచాయతీకి కార్యదర్శులను నియమించి సమస్యలను పరిష్కరించాలి. –పంచాయతీ కార్యదర్శిల అసోసియేషన్ జిల్లా కోశాధికారి -
పంచాయతీల్లో ప్రత్యేక పాలన
కడప ఎడ్యుకేషన్: గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలనకే ప్రభుత్వం మొగ్గుచూపింది. ఉత్కంఠకు తెరదించుతూ స్పెషలాఫీసర్లను నియమించాలని జీఓ 90ని బుధవారం విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే.. పాలకవర్గాల గడువు గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పర్సన్ ఇన్చార్జులా లేక ప్రత్యేకాధికారుల పాలనా అనే దానిపై మొదటి నుంచి సందిగ్ధం నెలకొంది. దీనిపై రాష్ట్రప్రభుత్వం నోరు మొదపకపోవడంతో సర్పంచ్‌లలో ఆందోళన నెలకొంది. ఎన్నికలు లేవని తేల్చుకున్న సర్పంచ్‌లు కనీసం పర్సన్ ఇన్‌చార్జులుగానైనా కొనసాగించాల ని డిమండ్ చేస్తూ హైకోర్టును కూడా ఆశ్రయించగా దీనిపై కోర్టు కూడా పర్సన్ ఇన్చార్జులుగా సర్పంచ్‌లను నియమించడంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించినా ఆదేం తమకు పట్టదన్నట్లుగా రాష్ట్రప్రభుత్వం స్పెషలాఫీసర్లను నియమించాల ని జీఓను విడుదల చేసింది. అంటే ఈ ప్ర భుత్వానికి కోర్టులపైన ప్రజాస్వామ్యంపై ఎంత గౌరవం ఉందో ఇట్టే అర్థమవుతుం దని సర్పంచ్‌లు విమర్శిస్తున్నారు. ఓటర్ల జాబితాను ప్రకటించినా.. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ప్రభుత్వం ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ప్రచురించాల ని ఎన్నికల కమిషన్ అధికారులను అదేశిం చింది. ఈ మేరకు అధికారులు గత నెలలోనే ఓటర్ల జాబితాను ప్రచురణ కూడా చేశారు. మొదలైన కసరత్తు ప్రభుత్వం పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించాలని జీఓ విడుదల చేయడంతో జిల్లా పంచాయతీ అధికారులు స్పెషలాఫీసర్ల నియామకానికి కరసత్తు మొదలుపెట్టారు. మండలస్థాయిలో తహసీల్దారు. ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ స్థాయి తగ్గకుండా ఉండేవారిని నియమించాలని సూచించడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. స్పెషలాఫీసర్లు తాగునీటి సరఫరా, నూతన నిర్మాణాలకు అనుమతులు, ట్రేడ్ లైసెన్సులు, తాగునీటి సరఫరాలో పైపుల లీకేజీలను అరికట్టడం, మోటర్ల మరమ్మతులు, దుకాణాల పన్నుల వసూలు, తాగునీటిలో క్లోరినేషన్, రోడ్లను శుభ్రం చేయడం, కాల్వలను శుభ్రంచేయడం వంటి కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుంది. ఓటమి భయంతోనే.. రాష్ట్రప్రభుత్వం అధికారంలో ఉండి కూడా స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించపోవడం పై జిల్లాలో తీవ్రచర్చ సాగుతోంది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామనే భయంతోనే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణను వాయిదా వేసుకుందని సర్పంచ్‌లు విమర్శి స్తున్నారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించి ఓడిపోతే ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై చూపుతుందనే వెనుకంజ వేసిందని విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలనే పర్సన్ ఇన్చార్జులుగా కొనసాగించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పలువురు సర్పం చులు డిమాండ్ చేసినా వారి విన్నపాలను ఈ రాష్ట్రప్రభుత్వం తోసిపుచ్చుతే స్పెషలా ఫీసర్ల నియామకానికే మొగ్గుచూపింది. దీని పై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ప్రగతికి ఆటంకం.. ప్రత్యేకాధికారుల పాలన వస్తే ప్రగతికి ఆటంకం ఏర్పడనున్నట్లు చర్చ సాగుతోంది. గ్రామాల్లో నీటి పథకాలు మరమ్మతులకు గురైనా, వీధిలైట్లు వెలగకపోయినా ప్రజా అవసరాల దృష్ట్యా సర్పంచ్‌లు తమ జేబు నుంచి ఖర్చుచేసి పనులను సవరించేవారు. తర్వాత నిదానంగా నిధులు వచ్చినప్పుడు బిల్లులు పెట్టుకుని డబ్బులను డ్రా చేసుకునేవారు. ప్రత్యేక పాలనలో ఆ స్వేచ్ఛ ఉండ దు. నిబంధనల ప్రకారం అన్నీ జరగాల్సిందే. ఇలా అయితే ప్రజలు ఇబ్బందుల పాలు కాక తప్పదని సర్పంచ్‌లు చెబుతున్నారు. -
గౌరవం లేదు..
గౌరవ వేతనం ఇంకెప్పుడిస్తారు.. ప్రభుత్వం సర్పంచులకు గౌరవ వేతనం ఇస్తామన్నారు. కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరికీ ఇచ్చిన దాఖలాలు లేవు. గ్రామాల్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండేది సర్పంచులే అయినందున సర్పంచు మమ్మల్ని గుర్తించాలి. జూలై 27 వస్తే సర్పంచ్‌లు గెలిచి సంవత్సరం కావస్తున్నా వేతనాల గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. సర్పంచులను ప్రభుత్వం గుర్తించి గౌరవ వేతనాన్ని రూ.5 వేలకు చేయాలి. సర్పంచులకు గౌరవ వేతనం ఇచ్చే వరకు అందరం కలిసి కట్టుగా ఉద్యమిస్తాం. - సీదర్ల రమేశ్, సర్పంచ్, కిష్టాపూర్ ఆదిలాబాద్ అర్బన్ : ప్రభుత్వం గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు గౌరవ వేతనం ఇవ్వడం లేదు. మేజర్ గ్రామ పంచాయతీ(జీపీ) సర్పంచ్‌లకు గౌరవ వేతనం నెలకు రూ.1,500, మైనర్ జీపీ సర్పంచ్‌లకు నెలకు రూ.1000 చొప్పున ఇవ్వాలి. ఇందులో ప్రభుత్వం వాటా సగమైతే, మిగతా సగం గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. సర్పంచ్‌లు ఎన్నికై పది నెలలు అవుతున్నా వేతనం రావడం లేదు. జిల్లాలోని 866 గ్రామ పంచాయతీలలో 27 మేజర్ జీపీ సర్పంచ్‌లకు రూ.750, మిగతా 839 జీపీ సర్పంచ్‌లకు రూ.500 చొప్పున రూ.4.39 లక్షలు ఏప్రిల్ నెల వేతనంగా మాత్రమే ఇచ్చారు. కాగా, ప్రస్తుత సర్పంచ్ల తొమ్మిది నెలల వేతనం రూ.39.57 లక్షలు, గత సర్పంచ్‌లకు రావాల్సిన 30 నెలల వేతనం రూ.11.87 కోట్లు కలిపి మొత్తం రూ.12.26 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. రూ.12.26 కోట్లు 2006లో సర్పంచ్‌లు పదవీ బాధ్యతలు చేపట్టారు. జిల్లాలోని 866 మంది సర్పంచ్‌లకు గౌరవ వేతనం కింద నెలకు రూ.4.39 లక్షలు చెల్లిస్తారు. గత సర్పంచ్ల పదవీ కాలం ఐదేళ్లలో 30 నెలలకు సంబంధించి గౌరవ వేతనాలు ఇచ్చారు. మిగతా 30 నెలలకు చెందిన వేతనాలు ఇవ్వలేదు. అంటే ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల వేతనం ఇచ్చిందన్నమాట. ఈ లెక్కన చూసుకుంటే గత సర్పంచ్‌లకు చెందిన 30 నెలల వేతనం కింద రూ.11.87 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం సర్పంచ్‌లు ఎన్నికై పది నెలలు అవుతుంది. వీరికి ఇప్పటివరకు వేతనాలు లేవు. ఒక ఏప్రిల్ నెల వేతనం కింద రూ.4.39 లక్షలు అందజేశారు. మిగతా తొమ్మిది నెలల గౌరవ వేతనం రావాల్సి ఉంది. పాత వారి వేతనాలు అటుంచితే కొత్త వారికి రావాల్సిన వేతనాలు ఇవ్వాలని పలువురు సర్పంచ్‌లు కోరుతున్నారు. పెరగని గౌరవం ప్రభుత్వం సర్పంచ్‌లకు ఇచ్చే గౌరవ వేతనం పెరగలేదు. గతంతో ఇచ్చిన వేతనాలే ఇప్పుడూ ఇస్తుంది. అయితే ఆ వేతనాలు సక్రమంగా కూడా ఇవ్వడం లేదు. అసలు వేతనాలు ఇస్తుందో లేదో కూడా తెలియదని పలువురు సర్పంచ్‌లు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి సర్పంచ్ల రావాల్సిన వేతనాలు వస్తాయా.. రావా.. అనేది కచ్చితంగా చెప్పలేమని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఒక నెల వేతనాలు ఇచ్చి దానినే మూడు నెలలకు సరిపడా వేతనాలుగా సర్దుకోమని ప్రభుత్వం పలుమార్లు సూచించినట్లుగా అధికారుల ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉండగా, గ్రామాభివృద్ధిలో భాగస్వాములమయ్యే తమకు ఇప్పటికైనా ప్రభుత్వం నెలనెల వేతనాలు ఇవ్వాలని పలువురు సర్పంచ్‌లు కోరుతున్నారు.