గౌరవ వేతనం ఇంకెప్పుడిస్తారు..
ప్రభుత్వం సర్పంచులకు గౌరవ వేతనం ఇస్తామన్నారు. కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరికీ ఇచ్చిన దాఖలాలు లేవు. గ్రామాల్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండేది సర్పంచులే అయినందున సర్పంచు మమ్మల్ని గుర్తించాలి. జూలై 27 వస్తే సర్పంచ్‌లు గెలిచి సంవత్సరం కావస్తున్నా వేతనాల గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. సర్పంచులను ప్రభుత్వం గుర్తించి గౌరవ వేతనాన్ని రూ.5 వేలకు చేయాలి. సర్పంచులకు గౌరవ వేతనం ఇచ్చే వరకు అందరం కలిసి కట్టుగా ఉద్యమిస్తాం.
- సీదర్ల రమేశ్, సర్పంచ్, కిష్టాపూర్
ఆదిలాబాద్ అర్బన్ : ప్రభుత్వం గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు గౌరవ వేతనం ఇవ్వడం లేదు. మేజర్ గ్రామ పంచాయతీ(జీపీ) సర్పంచ్‌లకు గౌరవ వేతనం నెలకు రూ.1,500, మైనర్ జీపీ సర్పంచ్‌లకు నెలకు రూ.1000 చొప్పున ఇవ్వాలి. ఇందులో ప్రభుత్వం వాటా సగమైతే, మిగతా సగం గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. సర్పంచ్‌లు ఎన్నికై పది నెలలు అవుతున్నా వేతనం రావడం లేదు.
జిల్లాలోని 866 గ్రామ పంచాయతీలలో 27 మేజర్ జీపీ సర్పంచ్‌లకు రూ.750, మిగతా 839 జీపీ సర్పంచ్‌లకు రూ.500 చొప్పున రూ.4.39 లక్షలు ఏప్రిల్ నెల వేతనంగా మాత్రమే ఇచ్చారు. కాగా, ప్రస్తుత సర్పంచ్‌ల తొమ్మిది నెలల వేతనం రూ.39.57 లక్షలు, గత సర్పంచ్‌లకు రావాల్సిన 30 నెలల వేతనం రూ.11.87 కోట్లు కలిపి మొత్తం రూ.12.26 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది.
రూ.12.26 కోట్లు
2006లో సర్పంచ్‌లు పదవీ బాధ్యతలు చేపట్టారు. జిల్లాలోని 866 మంది సర్పంచ్‌లకు గౌరవ వేతనం కింద నెలకు రూ.4.39 లక్షలు చెల్లిస్తారు. గత సర్పంచ్‌ల పదవీ కాలం ఐదేళ్లలో 30 నెలలకు సంబంధించి గౌరవ వేతనాలు ఇచ్చారు. మిగతా 30 నెలలకు చెందిన వేతనాలు ఇవ్వలేదు. అంటే ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల వేతనం ఇచ్చిందన్నమాట.
ఈ లెక్కన చూసుకుంటే గత సర్పంచ్‌లకు చెందిన 30 నెలల వేతనం కింద రూ.11.87 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం సర్పంచ్‌లు ఎన్నికై పది నెలలు అవుతుంది. వీరికి ఇప్పటివరకు వేతనాలు లేవు. ఒక ఏప్రిల్ నెల వేతనం కింద రూ.4.39 లక్షలు అందజేశారు. మిగతా తొమ్మిది నెలల గౌరవ వేతనం రావాల్సి ఉంది. పాత వారి వేతనాలు అటుంచితే కొత్త వారికి రావాల్సిన వేతనాలు ఇవ్వాలని పలువురు సర్పంచ్‌లు కోరుతున్నారు.
పెరగని గౌరవం
ప్రభుత్వం సర్పంచ్‌లకు ఇచ్చే గౌరవ వేతనం పెరగలేదు. గతంతో ఇచ్చిన వేతనాలే ఇప్పుడూ ఇస్తుంది. అయితే ఆ వేతనాలు సక్రమంగా కూడా ఇవ్వడం లేదు. అసలు వేతనాలు ఇస్తుందో లేదో కూడా తెలియదని పలువురు సర్పంచ్‌లు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి సర్పంచ్‌ల రావాల్సిన వేతనాలు వస్తాయా.. రావా.. అనేది కచ్చితంగా చెప్పలేమని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఒక నెల వేతనాలు ఇచ్చి దానినే మూడు నెలలకు సరిపడా వేతనాలుగా సర్దుకోమని ప్రభుత్వం పలుమార్లు సూచించినట్లుగా అధికారుల ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉండగా, గ్రామాభివృద్ధిలో భాగస్వాములమయ్యే తమకు ఇప్పటికైనా ప్రభుత్వం నెలనెల వేతనాలు ఇవ్వాలని పలువురు సర్పంచ్‌లు కోరుతున్నారు.
గౌరవం లేదు..
Published Sat, Jul 19 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM
Advertisement
Advertisement