గుర్తింపు ఇచ్చిన సర్కారు
{పజాప్రతినిధులకు పెరిగిన వేతనం
జిల్లాలో 1,891 మందికి ప్రయోజనం
{పభుత్వ నిర్ణయంపై {పతినిధుల ఆనందం
ఏప్రిల్ 1 నుంచి అమలులోకి.. మే 1న వేతనం
వరంగల్ : స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల దీర్ఘకాలిక డిమాండ్ ఫలించింది. గౌరవ వేతనం లేదని అసంతృప్తిగా ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. గౌరవ వేతనంగా వీరికి ప్రతీనెలా ఇస్తున్న మొత్తాన్ని భారీగా పెంచింది. స్థానిక సంస్థల్లో హోదాల మేరకు గౌరవ వేతనాలు పెంచుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి పెంచిన గౌరవ వేతనాలు అమల్లోకి రానున్నాయి. మే 1 నుంచి పెంచిన వేతనాలు అందుకుంటారు. జిల్లాలో జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపి 1,891 మంది ఉన్నారు. మంగపేట మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. మిగిలిన అన్ని పదవులకు ప్రతినిధులు ఉన్నారు.
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌కు ఇప్పటివరకు నెలకు రూ.7,500 గౌరవ వేతనం ఇస్తున్నారు. ప్రభుత్వం లక్ష రూపాయలకు పెరిగింది. వరంగల్ నగరపాలక సంస్థ పరిపాలనలో కీలకమైన మేయర్‌కు ప్రస్తుతం నెలకు రూ.14వేల గౌరవ వేతనం ఉంది. ఇప్పుడు దీన్ని రూ.50 వేలకు పెంచారు. డిప్యూటీ మేయర్‌కు ప్రస్తుతం రూ.8 వేలు ఉంది. దీనిని రూ.25 వేలకు పెంచారు. వరంగల్ మహా నగరపాలక సంస్థ పరిధిలో 58 డివిజన్‌లు ఉన్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్‌ను మినహాయిస్తే మిగిలిన కార్పొరేటర్లకు నెలకు రూ.6 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తారు. ఈ మొత్తం నెలకు రూ.3.36 లక్షలు ఉంటుంది. వరంగల్ మహా నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగలేదు.
జిల్లాలో 962 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మంగపేటలోని 18 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. మిగిలిన 944 మంది సర్పంచ్‌లు ఉన్నారు. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన మేరకు వీరికి నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం దక్కనుంది. మొత్తంగా జిల్లాలోని సర్పంచ్‌ల గౌరవ వేతనం కోసం ప్రతి నెల రూ.48.10 లక్షలు ఖర్చు కానుంది.
జిల్లాలో 705 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ(ఎంపీటీసీ) సభ్యులు ఉన్నారు. పెంచిన గౌరవ వేతనం ప్రకారం వీరికి నెలకు రూ.5 వేల చొప్పున ప్రభుత్వం చెల్లించనుంది. ఎంపీటీసీల్లో 50 మంది మండల పరిషత్ అధ్యక్షులుగా ఉన్నారు. వీరికి ప్రభుత్వం ప్రతి నెల రూ.10 వేల చొప్పన గౌరవ వేతనం ఇవ్వనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీల గౌరవ వేతనం కోసం ప్రతి నెల రూ.37.75 లక్షలను ప్రభుత్వం ఇవ్వనుంది.
జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ(జెడ్పీటీసీ) సభ్యులు 50 మంది ఉన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన మేరకు వీరికి నెలకు రూ.10 వేల చొప్పున గౌరవ వేతనం అందనుంది. జిల్లాలోని 48 మంది జెడ్పీటీసీ సభ్యులకు ఈ గౌరవ వేతనం అందుతుంది. ఇది ప్రతి నెల రూ.4.80 లక్షలు ఉంటుంది. మిగిలిన ఇద్దరిలో ఒకరు జెడ్పీ చైర్‌పర్సన్, మరొకరు డిప్యూటీ చైర్‌పర్సన్ ఉన్నారు.
జిల్లాలో జనగామ, మహబూబాబాద్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లోనూ 28 మంది చొప్పున మొత్తం 56 మంది కౌన్సిలర్‌లు ఉన్నారు. నర్సంపేట, భూపాలపల్లి, పరకాల నగరపంచాయతీలు ఉన్నాయి. ఈ మూడు నగర పంచాయతీల్లోనూ 20 మంది చొప్పున కౌన్సిలర్‌లు ఉన్నారు. మొత్తంగా ఐదు పురపాలక సంఘాల్లో.. ఐదుగురు చైర్మన్లకు నెలకు రూ.7,500 చొప్పున గౌరవ వేతనం ఇస్తారు. డిప్యూటీ చైర్‌పర్సన్‌లకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తారు. చైర్‌పర్సన్, డిపూటీ చైర్‌పర్సన్‌లను మినహాయిస్తే ఉండే 86 మంది కౌన్సిలర్‌లకు ప్రతి నెల రూ.2500 చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నారు.
స్థానిక సంస్థలకు గుర్తింపు
ప్రజలకు నేరుగా సేవలు అందించే స్థానిక సంస్థలకు కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. ప్రజలతో ఎన్నికైనా.. ఇన్నాళ్లు తక్కువ గౌరవ వేతనంతో సమాజంలో ఒకరకమైన ఇబ్బంది ఉండేంది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని తొలగించింది. పెంచిన గౌరవ వేతనంతో అన్ని స్థాయిల్లోని స్థానిక ప్రజాప్రతినిధుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. కేసీఆర్ ప్రకటించిన కొత్త గౌరవ వేతనంతో మాపై బాధ్యత పెరిగింది. రాజకీయ అవినీతిని అంతం చేస్తానని చెప్పిన కేసీఆర్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో అలాంటి వాటికి ఆస్కారం లేకుండా చేశారు. గౌరవ వేతనం పెంపు మాలాంటి ప్రజాప్రతినిధులకు ఎంతో మనోధైర్యం పెంచింది.
- గద్దల పద్మ, జెడ్పీ చైర్‌పర్సన్
స్థానిక సంస్థలకు గౌరవం
Published Sat, Mar 14 2015 1:17 AM | Last Updated on Mon, Aug 13 2018 4:03 PM
Advertisement