Gram panchayats
-
27న ఉప సర్పంచ్ ఎన్నికలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 214 గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న ఉప సర్పంచ్ పదవులకు ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. వార్డు సభ్యుల ద్వారా జరిగే ఈ ఉప సర్పంచ్ల ఎన్నిక కోసం 27న ఉదయం 11 గంటలకు ఆయా పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. -
త్వరలో రూ.400 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసిన అప్పటి సర్పంచులకు త్వరలోనే రూ.400 కోట్లు విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. గత ప్రభుత్వం వారితో అభివృద్ధి పనులు చేయించి.. నిధులు విడుదల చేయకుండా వారిని రోడ్డుపై వదిలేసిందని మండిపడ్డారు. అందువల్ల పంచాయతీ బకాయిలపై బీఆర్ఎస్ నాయకులు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితవు పలికారు. రూ.10 లక్షలలోపు పెండింగ్‌లో ఉన్న ప్రజాప్రతినిధుల బిల్లులు దాదాపు రూ.400 కోట్లు ఉంటాయని అంచనా వేశామని, వాటిని త్వరలోనే విడుదల చేస్తామని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో భట్టి చెప్పారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వంటి ప్రజాప్రతినిధులు చేసిన అభివృద్ధి కార్యక్రమాల పెండింగ్ బిల్లులు గత సంవత్సరం డిసెంబర్ 7 నాటికి ఉన్న బకాయిలు రూ.1,300 కోట్లు అని వెల్లడించారు. సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పడుతున్న ఇబ్బందులను సీఎం రేవంత్‌రెడ్డి, తాను గమనించి రూ.10 లక్షల లోపు ఉన్న బకాయిలను త్వరలోనే విడుదల చేయాలన్న నిర్ణయానికి వచి్చనట్లు చెప్పారు. ప్రజా ప్రతినిధుల ఇబ్బందులకు కారణమైన బీఆర్ఎస్ నేతలు పెండింగ్ బిల్లుల కోసం ధర్నాలు చేస్తామని ప్రకటించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పంట పొలాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం–కుసుమ్) పథకం కింద రాష్ట్రంలో రైతుల పంట పొలాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 0.5– 2 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్లను ఎండిపోయిన, పాడుబడిన వ్యవసాయ భూముల్లో రైతులతో ఏర్పాటు చేయిస్తామన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసే విద్యుత్‌కు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు యూనిట్‌కు రూ.3.13 చొప్పున ధర చెల్లిస్తాయన్నారు. రైతులు, రైతు బృందాలు, సహకార సొసైటీలు, పంచాయతీలు, రైతు సంఘాలు, నీటి వినియోగ సంఘాలు ఈ పథకం కింద అర్హులన్నారు. -
Telangana: జిల్లాలన్నీ 'ఉడా'లే..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని కొన్ని గ్రామాలు మినహా.. రాష్ట్రమంతా వివిధ పట్టణాభివృద్ధి సంస్థ (యూడీఏ–ఉడా)ల పరిధిలోకి వెళ్లింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 9 ఉడాలు ఉండగా, తాజాగా వాటి పరిధిని రాష్ట్ర ప్రభుత్వం విస్తరించింది. దీంతోపాటు.. ములుగు జిల్లా, ఆసిఫాబాద్ జిల్లాలోని ఐదు మండలాలు, కొన్ని జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు మినహా ఇప్పటివరకు ఉడాలు లేని అన్ని జిల్లాలు కవర్ అయ్యేలా కొత్తగా మరో 19 ఉడాలను కూడా ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 28 ఉడాలు ఏర్పాటైనట్టయ్యింది. ప్రతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి ఆ జిల్లాలోని మండలాల్లో ఉన్న దాదాపుగా అన్ని గ్రామాలు చేరాయి. రాష్ట్రంలో సుమారు 12 వేల గ్రామ పంచాయతీలు ఉండగా, దాదాపు 10 వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఉడాల పరిధిలోకి రావడం గమనార్హం. ఇప్పటివరకు చుట్టుపక్కల గ్రామాలే ఉడాల పరిధిలో.. రాష్ట్రంలో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు ఉన్నాయి. దీంతో పాటు వరంగల్, కరీంనగర్, వేములవాడ, సిద్దిపేట, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలతో ఏర్పాటు చేసిన మొత్తం 9 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఇప్పటివరకు చుట్టుపక్కలున్న గ్రామాలు మాత్రమే ఉండేవి. మిగతా గ్రామాలన్నీ డీటీసీపీ (డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) పరిధిలోకి వచ్చేవి. దీంతో 800 చదరపు గజాల పైబడి నిర్మాణాలకు, గ్రామాల్లో సాగే లే అవుట్ల అనుమతులన్నీ డీటీసీపీ ద్వారానే తీసుకోవలసి వచ్చేది. ఇప్పుడు జిల్లాల పరిధి మొత్తానికి ఉడాలను విస్తరించడంతో లే అవుట్లతో పాటు 800 చదరపు గజాల నిర్మాణాల అనుమతులు కూడా ఆయా జిల్లాల్లో ఏర్పాటైన ఉడాల ద్వారానే పొందే అవకాశం లభించింది. జిల్లాల వారీగా మాస్టర్ ప్లాన్‌కు అవకాశం రాష్ట్రంలో ఇప్పటివరకు పట్టణాలకు కూడా సరైన మాస్టర్‌ప్లాన్ లేదు. ఉడాల ద్వారా మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు కొన్ని ప్రయత్నాలు గతంలో జరిగినా వివిధ కారణాల వల్ల కొలిక్కి రాలేదు. ఇప్పుడు జిల్లా పరిధినే యూనిట్‌గా పట్టణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడంతో జిల్లా మొత్తానికి మాస్టర్‌ప్లాన్ రూపొందించే అవకాశం లభించినట్లయిందని పురపాలక శాఖ అధికారి ఒకరు తెలిపారు. అలాగే ఆయా మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలతో పాటు మండల కేంద్రాల మాస్టర్ ప్లాన్లను కూడా ప్రత్యేకంగా రూపొందించే అవకాశం లభించింది. కేంద్ర నిధులు పెరిగేందుకు దోహదం గ్రామాల్లో సాగే పేదల గృహనిర్మాణ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పెరిగేందుకు కూడా ఉడాల ఏర్పాటు దోహదపడనుంది. ప్రతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి పట్టణాలు, కార్పొరేషన్లతో పాటు 10 నుంచి 15 మండలాల్లోని గ్రామాలు వస్తుండడంతో కేంద్రీకృతమైన అభివృద్ధికి ఆస్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామ పంచాయతీల అధికారాలు యధాతథం! జిల్లా పరిధిని పూర్తిగా పట్టణాభివృద్ధి సంస్థ కిందికి తీసుకురావడంతో గ్రామ పంచాయతీల అధికారాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పురపాలక శాఖ అధికారులు మాత్రం అలాంటిదేమీ ఉండబోదని అంటున్నారు. డీటీసీపీకి ఉన్న అనుమతుల అధికారం మాత్రమే పట్టణాభివృద్ధి సంస్థలకు దఖలు పడుతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో 800 చదరపు గజాల లోపు నిర్మాణాలకు అనుమతులు ఆయా పంచాయతీలే ఇస్తున్నాయి. ఆ విధానం భవిష్యత్తులో కూడా కొనసాగనుందని ప్రభుత్వం చెబుతోంది. గ్రామ పంచాయతీల అధికారాలు యథాతథం! జిల్లా పరిధిని పూర్తిగా పట్టణాభివృద్ధి సంస్థ కిందికి తీసుకురావడంతో గ్రామ పంచాయతీల అధికారాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పురపాలక శాఖ అధికారులు మాత్రం అలాంటిదేమీ ఉండబోదని అంటున్నారు. డీటీసీపీకి ఉన్న అనుమతుల అధికారం మాత్రమే పట్టణాభివృద్ధి సంస్థలకు దఖలు పడుతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో 800 చదరపు గజాల లోపు నిర్మాణాలకు అనుమతులు ఆయా పంచాయతీలే ఇస్తున్నాయి. ఆ విధానం భవిష్యత్తులో కూడా కొనసాగనుందని ప్రభుత్వం చెబుతోంది. -
పల్లె ముంగిట కొత్త ‘పద్దు’
సాక్షి, అమరావతి: కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ల తరహాలోనే పంచాయతీల స్థాయిలోనూ గ్రామ అభివృద్ధి ప్రణాళిక(జీపీడీపీ) పేరుతో బడ్జెట్లను పకడ్బందీగా రూపొందించే ప్రక్రియ మొదలైంది. ఈమేరకు 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో అంచనాల తయారీ ప్రారంభమైంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సూచనల మేరకు ఇక పంచాయతీలకు అందే 15వ ఆర్థిక సంఘం నిధులు పూర్తిగా ఆ గ్రామ జీపీడీపీలో పేర్కొన్న పనులకే కేటాయించాల్సి రావడంతో ఈ బడ్జెట్లకు ప్రాధాన్యం ఏర్పడింది. ఫలితంగా గ్రామస్థాయిలో పాలకవర్గం గుర్తించిన పనులను బడ్జెట్లో పొందుపరుచుకునే వెసులుబాటు లభించింది. సప్లిమెంటరీ ప్రణాళిక పేరుతో సవరణ చేసుకునే అవకాశమూ లభించింది. వచ్చే 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 1,3326 గ్రామ పంచాయతీలతోపాటు 660 మండల పరిషత్‌లు, 13 ఉమ్మడి జిల్లాల పరిషత్‌లకు కలిపి మొత్తంగా రూ.2,152 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. వీటిని గ్రామ బడ్జెట్లో పెట్టిన పనులకే వాడుకోవాలి. ఏడాది మొదట్లో గానీ లేదంటే మధ్యలో సప్లిమెంటరీగాగానీ ఆ గ్రామ బడ్జెట్లో పేర్కొనని పనులకు ఆర్థిక సంఘ నిధులను వాడుకునే అవకాశమే ఉండదు. ఇంటి పన్ను రూపంలో అందజేసే జనరల్ ఫండ్స్ తదితర ఇతర నిధులను మాత్రం బడ్జెట్ ప్రకారం ఖర్చుపెట్టాలన్న నియమేమీ లేదు. అయితే వీలైనంత మేర బడ్జెట్ ప్రణాళికల ఆధారంగానే ఖర్చు చేసేలా ప్రోత్సహించాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఉద్దేశం. మరోవైపు 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపు ప్రక్రియలో సర్పంచులకు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. కార్యదర్శులకు మండలస్థాయి అధికారుల సహకారం గ్రామ బడ్జెట్ రూపకల్పన, అమలులో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సలహాలు, సూచనలు అందించేందుకు ప్రతి మండలంలో ఆరుగురు మండల స్థాయి అధికారులతో కమిటీలను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీలకు అందుబాటులో ఉండే నిధులకు, ఇతర పథకాల వచ్చే నిధులనూ అవసరమైన మేర అనుసంధానం చేసుకునేలా ఈ ఆరుగురు మండల స్ఙాయి అధికారులు తోడ్పాటు అందిస్తారని వివరించారు. కమిటీల్లో ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీ, పంచాయతీరాజ్ ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, ఉపాధి పథకం ఏపీఓ, సెర్ప్ ఏపీఎంలు ఉంటారు. మూడొంతుల పంచాయతీల్లో పూర్తి ఇప్పటికే దాదాపు మూడోంతులకుపైగా అంటే 11,403 గ్రామ పంచాయతీల్లో 2024–25 సంవత్సరపు గ్రామ బడ్జెట్ ప్రణాళికల రూపకల్పన పూర్తయినట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా అన్ని పంచాయతీల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని 660 మండలాలు, 13 ఉమ్మడి జిల్లాల స్థాయిలోనూ మండల, జిల్లా పరిషత్‌ల వారీగా బడ్జెట్ ప్రణాళికలను మార్చి నెలలో రూపొందించే ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వివరించారు. -
గ్రామ పంచాయతీలకు గ్రేడ్ –5 కార్యదర్శులు
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీలు, సచివాలయాల మధ్య మరింత సమన్వయం తెస్తూ పాలనాపరంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా ఒక పంచాయతీ కార్యదర్శి అందుబాటులో ఉండేలా ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో గ్రేడ్ – 5 పంచాయతీ కార్యదర్శుల హోదాలో పని చేస్తున్న వారికి అవకాశం కల్పించనుంది. మిగిలిన నాలుగు కేటగిరీ పంచాయతీ కార్యదర్శుల తరహాలోనే వారికి డీడీవో అధికారాలను కల్పించనున్నారు. గ్రేడ్ – 5 పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం పనిచేస్తున్న చోట ఆయా పంచాయతీల బాధ్యతలను అప్పగించనున్నారు. ఈమేరకు సిద్ధం చేసిన ప్రతిపాదనలు బుధవారం మంత్రివర్గ సమావేశంలో తుది ఆమోదం కోసం చర్చకు రానున్నాయి. సచివాలయాలతో పాటు గ్రేడ్ – 5 కార్యదర్శుల నియామకం 2019లో సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుకు ముందు గ్రామ పంచాయతీల్లో గ్రేడ్ 1, 2, 3, 4 కేటగిరీ పంచాయతీ కార్యదర్శులు మాత్రమే విధులు నిర్వహించారు. చిన్నవైతే మూడు నాలుగు పంచాయతీలకు కలిపి ఒకే కార్యదర్శి బాధ్యతలు నిర్వహించేవారు. పంచాయతీరాజ్ శాఖ దీన్ని క్లస్టర్ పంచాయతీ విధానంగా వ్యవహరిస్తోంది. ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం చొప్పున సచివాలయాల వ్యవస్థతోపాటు గ్రేడ్ –5 పంచాయతీ కార్యదర్శుల నియామకాన్ని కూడా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. నాటి నుంచి గ్రేడ్ – 1 పంచాయతీ కార్యదర్శి మొదలు కొత్తగా నియమితులైన గ్రేడ్ –5 పంచాయతీ కార్యదర్శి వరకు ఆయా సచివాలయాల్లో కార్యదర్శి హోదాలోనే విధులు నిర్వహిస్తున్నారు. సచివాలయాల ద్వారా అందజేసే 545 రకాల ప్రభుత్వ సేవలతో సహా ప్రతి కార్యక్రమాన్ని వారికే అప్పగించారు. పంచాయతీ వ్యవస్థకు సంబంధించిన కార్యకలాపాలు మాత్రం పాత క్లస్టర్ విధానంలోనే కొనసాగుతున్నాయి. మిగతా కార్యదర్శుల మాదిరిగానే.. సచివాలయాల ఏర్పాటు సమయంలో గ్రేడ్ – 5 పంచాయతీ కార్యదర్శులకు మిగిలిన నాలుగు కేటగిరీ ఉద్యోగుల మాదిరిగానే జాబ్‌చార్టు నిర్ధారించినా ప్రొబేషన్ ఖరారు కానందున పంచాయతీ బిల్లులు తయారీ లాంటి డీడీవో అధికారాలను మాత్రం పూర్తి స్థాయిలో అప్పగించలేదు. ఇప్పుడు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో గ్రేడ్ – 5 పంచాయతీ కార్యదర్శులకు కూడా 1–4 గ్రేడ్ కేటగిరీ పంచాయతీ కార్యదర్శుల తరహాలోనే అన్ని రకాల డీడీవో అధికారాలు దక్కుతాయి. తద్వారా ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా ఒక కార్యదర్శిని కేటాయించడం ద్వారా పంచాయతీల కార్యకలాపాల నిర్వహణలో వేగం పెరిగే అవకాశం ఉంటుంది. సర్పంచ్లకూ అదనపు అధికారాలు! ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రేడ్ – 1 మొదలు గ్రేడ్ – 5 పంచాయతీ కార్యదర్శులకు అదనపు అధికారాలు దక్కడంతో పాటు సర్పంచ్‌లకు కూడా మరిన్ని అధికారాలు లభించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. పంచాయతీ రెగ్యులర్ ఉద్యోగుల (010 పద్దు ఉద్యోగులు) నెలవారీ జీతాల బిల్లులను ప్రతిపాదించే అధికారం కార్యదర్శులతో పాటు సర్పంచ్‌లకు ఉమ్మడిగా మేకర్, చెక్కర్ హోదాలో లభించనుంది. రాష్ట్రంలో 500 పైబడి జనాభా ఉండే ప్రతి గ్రామ పంచాయతీకీ సచివాలయ కార్యదర్శిగానూ, పంచాయతీ కార్యదర్శిగానూ ఒక్కరే కొనసాగనున్నారు. ఆయా పంచాయతీల పరిమాణాన్ని బట్టి కార్యదర్శులకు బాధ్యతలు కేటాయిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నెలకొల్పిన సచివాలయాల వ్యవస్థ ద్వారా కొత్తగా ఉద్యోగాలు పొందిన వేలాది మంది గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు తమ కు చిన్న పంచాయతీల బాధ్యతలు కూడా అప్పగించాలని చాలా కాలంగా కోరుతున్నారు. ఇప్పుడు వారికి కోరిక నెరవేరుతుండటంతో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అభివృద్ధికి కీలకం... వికేంద్రీకరణ
ఏ రాష్ట్రమైనా సుసంపన్నం కావాలంటే పంచాయతీ రాజ్ వ్యవ స్థను పటిష్ఠపరచాలి. మొత్తంగా దేశం అభివృద్ధి పంచాయతీ రాజ్ వ్యవస్థ బలంపైనా, అది ఏ మేర పాలనను వికేంద్రీకరిస్తుంది అన్న అంశాల పైనా ఆధారపడి ఉంటుంది. స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా పంచాయతీరాజ్ వ్యవస్థలోని ప్రాథమిక స్థాయి సంస్థలకు అధికారాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో గుర్తించారు. స్థానిక సంస్థలకు అధికారాలు పంచడం కోసం రాజ్యాంగ సవరణకు సైతం వెనుకాడలేదు. ఫలితంగా 1993లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త పంచాయతీరాజ్ వ్యవస్థ రూపు దిద్దుకొంది. ఈ వ్యవస్థే గత 30 ఏళ్లుగా కేరళతో పాటు అనేక రాష్ట్రాల్లో అద్భుత ఫలితాలను ఇచ్చింది.కేరళ వంటి రాష్ట్రాల సామా జిక, ఆర్థిక అభివృద్ధికి అక్కడి చైతన్య వంతమైన పంచాయతీ వ్యవస్థ ముఖ్య కారణం. గ్రామ పంచాయతీ స్థాయిలోనే పాలన సమర్థంగా అందడం, మరికొన్ని ఇతర అంశాలు దీనికి కారణం. మన తెలుగు రాష్ట్రాలు కూడా ఈ సంస్థల బలోపేతం, పాలన వికేంద్రీకరణ అంశాల్లో ముందు వరుసలోనే ఉన్నాయి.పరిమితమైన వనరులను దృష్టిలో పెట్టుకుంటే గ్రామాల్లో అన్ని రకాల అభివృద్ధి పనులు చేపట్టడం సాధ్యం కాదు. ఫైనాన్స్ కమిషన్ నుంచి పంచాయతీలకు అందే నిధులు కూడా అంతంత మాత్రమే. ఎందుకంటే ఈ నిధులు తలసరి లెక్కలో విడుదల అవుతూంటాయి. పోనీ పంచాయతీలు సొంతంగా ఏవైనా వినూత్నమైన ఆదాయ వనరులను సమకూర్చుకోగలవా? ఇది కూడా వీలు కాని విషయమే. ఇలా చేసుకోగలిగితే ఆ గ్రామపంచాయతీ చాలా చైతన్యవంతంగా పనిచేస్తున్నట్లు లెక్క. కేరళలో కొన్ని గ్రామ పంచాయతీలు వినూత్నమైన పద్ధతుల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తూండటం ఇక్కడ చెప్పుకోవా ల్సిన విషయం. 2030 నాటికి ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అందుకునేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గ్రామ పంచాయతీల బలోపేతం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవు తుంది. ఆర్థిక సహకారం, పాలన పరంగా స్వాతంత్య్రం కూడా అవసరమవుతాయి. వీటితోపాటు గ్రామ పంచాయతీల స్థాయిలో సామర్థ్యాలను పెంచుకోవాల్సి వస్తుంది. రాష్ట్రంలో సమర్థమైన, వికేంద్రీకృతమైన పరిపాలన సాగేందుకు కింది సూచనలను కూడా పరిగ ణనలోకి తీసుకోవచ్చు. దీనివల్ల మానవ వనరుల అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. ‘2022 నేషనల్ కెపాసిటీ బిల్డింగ్ ఫ్రేమ్‌వర్క్’ ఇచ్చిన సలహా సూచనల సాయంతో పనులు చేపట్టాలి. ప్రణా ళిక రూపకల్పన, అమలులో గ్రామపంచాయతీల్లోని ప్రజలందరూ భాగ స్వాములయ్యేలా చూడాలి. ఇందుకు తగ్గట్టుగా గ్రామ పంచాయ తీలకు అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చాలి. దాతృత్వసంస్థల ద్వారా గ్రామ పంచాయతీలకు ఆర్థిక వనరులు సమ కూరేలా వ్యస్థలను ఏర్పాటు చేయాలి. ఈ చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్రాలు సామాజిక, ఆర్థిక అభివృద్ధి అంశాల్లో సర్వతో ముఖాభివృద్ధి సాధించగలవని నా విశ్వాసం. – డా.డబ్ల్యూ. రాంపుల్లా రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఎన్ఐఆర్డీ మాజీ డైరెక్టర్ జనరల్ -
ఏకరూప పంచాయతీలపై కసరత్తు!
సాక్షి, అమరావతి: ఒకే దేశం–ఒకేసారి ఎన్నికలపై విధాన నిర్ణయం తీసుకునేందుకు యోచిస్తున్న నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. దేశంలోని పంచాయతీలలో ఏకరూపత సాధించే దిశగా చర్యలు చేపడుతోంది. కనీస నిర్ణీత జనాభా సంఖ్య ఆధారంగా దేశమంతటా గ్రామ పంచాయతీలను పునర్విభజన జరిపే ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో తీరుగా.. ఒకే రాష్ట్రంలోనూ వేర్వేరు పంచాయతీలలో ఉండే జనాభా సంఖ్య మధ్య ఊహించని స్థాయిలో వేల సంఖ్యలో వ్యత్యాసాలు ఉన్నాయి. ఒక్కొక్క చోట 15 వేల నుంచి 20 వేల జనాభా ఉండే ఓ పెద్ద గ్రామ పంచాయతీగా ఉంటుంటే.. కొన్నిచోట్ల 500 జనాభా ఉండే గ్రామం మరో పంచాయతీగా ఉంటోంది. ఉదాహరణకు రాష్ట్రంలో 13,300కి పైగా గ్రామ పంచాయతీలు ఉండగా.. ఒక్కో పంచాయతీ సరాసరి జనాభా 2,800 వరకు ఉన్నట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అక్కడ ఒక్కో పంచాయతీలో 20 వేలకు పైనే.. కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో సరాసరి జనాభా 20 వేలకు పైబడి ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. కేరళ వంటి రాష్ట్రంలో అతి చిన్న గ్రామ పంచాయతీలో సైతం 10 వేలకు తక్కువ జనాభా ఉండదని చెబుతున్నారు. మన రాష్ట్రంలో వందలోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు సైతం ఉండగా.. 30 వేల జనాభా గల గ్రామాలు కూడా పంచాయతీలుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో ఏకరీతిన కనీస ఓ నిర్ధిష్ట జనాభా సంఖ్య ఆధారంగా గ్రామ పంచాయతీలను పునర్విభజన చేయడం ద్వారా గ్రామీణ స్థానిక సంస్థల స్థాయిలోనూ మెరుగైన, సమర్థవంతమైన పరిపాలనకు అవకాశం ఉంటుందా అన్న దానిపై కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రాలతో సంప్రదింపులు చేపట్టింది. నేడు, రేపు వర్క్‌షాప్ చాలా రాష్ట్రాల్లో జిల్లా స్థాయిలో జెడ్పీ చైర్మన్ల ఎన్నిక పరోక్ష పద్ధతిన కొనసాగుతోంది. కానీ ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానాన్ని తేవడం వంటి స్థానిక సంస్థల స్థాయిలో పరిపాలనకు సంబంధించి అనేక అంశాలపై అవసరమైతే చట్ట సవరణలు తెచ్చేందుకు సోమ, మంగళవారాల్లో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అన్ని రాష్ట్రాల అధికారులు ప్రతినిధులతో హైదరాబాద్‌లో వర్క్‌షాప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మన రాష్ట్రం నుంచి 9 మంది, 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 261 మంది హాజరవుతున్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి ప్రతి రెండు విడతలకోసారి రోటేషన్ పద్ధతిన రిజర్వేషన్ల మార్పులు, చేర్పులు చేసుకునే అంశాన్ని వర్క్‌షాప్ అజెండాలో చేర్చారు. -
ప్రకృతి వనం.. కొరవడిన పచ్చదనం.. జీతాలు ఇయ్యకపాయే! ఎట్లా?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : పలు జిల్లాల్లో గ్రామపంచాయతీల సిబ్బందికి రెండు నుంచి నాలుగు నెలల వేతనాలు రాకపోవడంతో మొక్కల సంరక్షణపై దృష్టి సారించడం లేదు. ఇంకొన్ని ప్రాంతాల్లో నీటి వసతిలేదు. కొన్నిచోట్ల అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా పెద్దగా ఫలితం ఉండడం లేదు. వీటికి వేసవి తోడు కావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతున్నాయి. 12,769 గ్రామపంచాయతీల్లో ఏర్పాటు ఏటా నిర్వహించే హరితహారంలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. పల్లెవాసులకు పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచేందుకు పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలను నాటారు. అక్కడ సేద తీరేందుకు వీలుగా బెంచీలు కూడా ఏర్పాటుచేశారు. ఉపాధి హామీ పథకం కింద గత రెండేళ్లు వీటి నిర్వహణ బాగానే సాగింది. నర్సరీల పెంపకం, పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు నాటడం, నీటి వసతి, వన సేవకులకు వేతనం అంతా ఈ పథకం ద్వారా చెల్లించడంతో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. అయితే గత ఏడాది ఏప్రిల్ నుంచి పల్లె ప్రకృతి వనాల నిర్వహణ బాధ్యతను గ్రామ పంచాయతీ (జీపీ)లకు అప్పగించడంతో పరిస్థితి మారింది. పలు జిల్లాల్లో పూర్తిగా ఎండిపోయి.. ప్రకృతి వనాల్లో మొక్కల సంరక్షణ చూసుకునే బాధ్యత గ్రామపంచాయతీ వర్కర్లకు అప్పగించారు. అయితే వీరికి రెండు నుంచి నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో వీరు బాధ్యతలపై దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. కొన్నిచోట్ల వనాల్లో బోర్లు లేక కూడా మొక్కలు ఎండిపోయాయి. ఆయా ప్రాంతాల్లో పంచాయతీల ట్యాంకర్లతో నీళ్లు పట్టినా.. ట్యాంకర్ల నిర్వహణ జీపీలకు పెనుభారమైన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లోని గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతివనాలు ఇప్పటికే పూర్తిగా ఎండిపోయాయి. మోడువారిన లక్ష్మీపురం వనం ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని రాఘబోయినగూడెం జీపీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామ పల్లె ప్రకృతి వనం. 2020–21లో గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) కింద ఎకరం విస్తీర్ణంలో 913 మొక్కలు నాటారు. రెండేళ్లపాటు నిర్వహణ ఈజీఎస్ చూడటంతో వర్కర్లకు వేతనం అందింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి గ్రామ పంచాయతీకి బాధ్యతలు అప్పగించిన తర్వాత క్రమంగా మొక్కలన్నీ ఎండిపోయాయి. ఇక్కడ నీరందించేందుకు బోరు వేసినా మోటారు బిగించలేదు. అసలే ఎదగలేదు.. ఆపై నీరందక.. ఇది వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని నెక్కొండ తండాలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనం. ప్రస్తుతం విపరీతమైన ఎండలతో మొక్కలు ఎండిపోతున్నాయి. ఇక్కడ సారవంతమైన భూమికి బదులుగా చౌడు భూమిలో మొక్కలు నాటారు. దీంతో మొక్కలు మామూలుగానే సరిగా ఎదగలేదు. ప్రస్తుతం వేసవి తాపానికి తోడు తగిన నీరందకపోవడంతో ఎండిపోతున్నాయి. మూడు నెలల డబ్బులు రావాలి.. ప్రకృతి వనంలో మొక్కలను కాపాడేందుకు ఎండనక, వాననక కష్టపడ్డా. నెలకు రూ.3 వేల చొప్పున మూడు నెలల వేతనం రాలేదు. అధికారులను అడిగితే వస్తుందనే సమాధానం తప్ప బ్యాంకులో జమ అయిందే లేదు. –పార్నంది గౌరమ్మ, శివునిపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ జిల్లా నెల నెలా ఎదురుచూపులే.. వన సేవకుడిగా పనిచేస్తున్నా. గత ఐదు నెలలుగా వేతనాలు రావడం లేదు. ఎప్పటికప్పుడు ఈనెల వస్తాయంటూ ఎదురుచూస్తున్నా. చేసిన పనికి ప్రతినెలా డబ్బులిస్తే మాకు ఇబ్బందులు ఉండవు. – బోసి ధర్మయ్య, బజార్ కొత్తూర్, నందిపేట్ మండలం, నిజామాబాద్ జిల్లా జీతాలు లేక.. పనికి రాక నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని అమ్రాద్ తండాలో నాలుగైదు నెలలుగా జీతాలు లేక పంచాయతీ కార్మికులు పనికి రావడం మానేశారు. ఇక నీళ్ల ట్యాంకర్‌కు అవసరమైన డీజిల్ డబ్బు కూడా లేకపోవడంతో వనంలో మొక్కలకు నీరందక ఎండిపోతున్నాయి. అన్నిచోట్లా వేతనాల సమస్యే.. ♦ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 42 మండలాల్లో 1,070 జీపీలు ఉండగా, 3,851 మంది మల్టీ పర్పస్ వర్కర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి సంబంధించి రూ.2 కోట్ల వరకు వేతనాలు అందాల్సి ఉంది. ఈ జిల్లాలో 2,088 వనాలు ఏర్పాటు చేయగా, చాలా చోట్ల బోర్లు వేయకపోవడం, ట్యాంకర్లపైనే ఆధారపడి నీళ్లు పోయాల్సి రావడంతో వేసవిలో మొక్కలు ఎండిపోతున్నాయి. ♦ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 1,509 జీపీలకు గాను 3,406 వనాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ పనిచేస్తున్న 4,924 మంది వర్కర్లకు 2 నుంచి 4 నెలల వరకు వేతనాలు రూ.10.11 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే రూ.6 కోట్ల వేతనాలు అందాలి. ఈ క్రమంలో వేసవిలో నీరు అందకపోవడంతో అధికారుల దృష్టికి వచ్చిన చోట ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేసినా మిగతా చోట్ల వనాలు ఎండిపోయాయి. ♦ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1,056 జీపీలకు గాను 1,338 వనాలు ఉన్నాయి. నిధులు లేక వారానికోసారి నీరు పడుతున్నారు. కొన్నిచోట్ల పూర్తిగా వదిలేశారు. ఐదారు నెలలుగా డబ్బు అందక పోవడంతో వన సేవలు పని మానేశారు. ♦ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 963 గ్రామ పంచాయతీలు ఉండగా 965 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. నీరు లేక ఇప్పటికే 92 వనాలు ఎండిపోయే స్థితికి చేరాయి. మొత్తం 3,998 మంది మల్టీ పర్పస్ వర్కర్లకు రెండు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ♦ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్‌కర్నూల్‌లో రెండు నెలల నుంచి, వనపర్తి, గద్వాల, నారాయణ్‌పేట జిల్లాల్లో 4 నెలల నుంచి వేతనాలు రావడం లేదు. మొత్తంగా 5,786 మంది మల్టీ పర్పస్ వర్కర్లకు సంబంధించి సుమారు రూ.13 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4 నెలలుగా 5,666 మంది వర్కర్లకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో వారు ప్రకృతి వనాల నిర్వహణపై దృష్టి సారించడం లేదు. -
Kurnool District: గ్రామీణ ప్రాంతాల్లో మందగించిన పన్ను వసూళ్లు
కర్నూలు(అర్బన్): గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక వనరులను సమీకరించుకోవడం, పన్ను వసూళ్లు, ప్రభుత్వం విడుదల చేసే గ్రాంట్లకు సంబంధించిన నిధుల పరిపుష్టితోనే గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుత పాలకవర్గాలు ఆ దిశగా అడుగులు వేయకుండా, కేవలం ప్రభుత్వం విడుదల చేసే గ్రాంట్లపైనే ఆధారపడుతుండటంతో అభివృద్ధి నిదానించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులకు తోడుగా.. గ్రామ పంచాయతీల్లో పన్నులు, పన్నేతరములపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తే ఆయా గ్రామ పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ అయ్యే అవకాశాలు ఉంటాయి. గ్రామ పంచాయతీల్లో వసూలు చేయాల్సిన పన్నులు, పన్నేతరములకు సంబంధించి పంచాయతీరాజ్ కమిషనర్ ప్రతి వారం సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికార యంత్రాంగం పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. 2022–23 ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో రెండున్నర నెలలు మాత్రమే ఉండడంతో పన్నుల వసూలు వేగం పుంజుకుంది. సర్పంచుల పాత్ర కీలకం గ్రామ పంచాయతీ పరిధిలో పన్ను వసూలు చేయడం, వాటిని అభివృద్ధి పనులకు వెచ్చించుకునే విషయంలో గ్రామ సర్పంచులది కీలకపాత్ర. ఆయా గ్రామ పంచాయతీల్లో పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని పూర్తిగా గ్రామాభివృద్ధి కోసం వెచ్చించుకునే సౌలభ్యం ఉంది. అయినా వివిధ గ్రామాల సర్పంచులు పన్ను వసూళ్లపై పెద్దగా దృష్టి సారించనట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం, ఇతర గ్రాంట్ల పైనే గ్రామ పంచాయతీ పాలకవర్గాలు దృష్టి కేంద్రీకరించాయే తప్ప స్థానిక వనరుల నుంచి పంచాయతీలకు వచ్చే ఆదాయాలను పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో పన్నులు(ఇంటి పన్ను, లైబ్రరీ సెస్సు, కుళాయి పన్ను ), పన్నేతరముల (మార్కెట్ వేలాలు, షాపింగ్ అద్దెలు, లైసెన్స్ ఫీజులు, కుళాయి ఫీజులు, భవన నిర్మాణ ఫీజులు) రూపంలో సొంత వనరులను సమీకరించుకోవడంలో సర్పంచులు తమ పాత్రను పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పల్లె ఆదాయాన్ని పెంచేందుకు సమష్టి కృషి గ్రామ పంచాయతీలకు ఆదాయాన్ని పెంచుకునే అంశంలో క్షేత్ర స్థాయి అధికారులు సమిష్టిగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అనేక గ్రామ పంచాయతీల్లో దశాబ్దం క్రితం ఉన్న ఇళ్ల సంఖ్యనే నేటికీ లెక్కల్లో చూపుతున్నారు. జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో దాదాపు 50 శాతం గ్రామ పంచాయతీలు భౌగోళికంగా విస్తరించాయి. ఈ నేపథ్యంలోనే ఆయా గ్రామ పంచాయతీల్లో కొత్త కాలనీలు ఏర్పాటయ్యాయి. అయితే కొత్తగా గ్రామ శివారుల్లో ఏర్పాటవుతున్న కాలనీలు, కొత్త ఇళ్లపై సంబంధిత అధికారులు దృష్టి సారించకపోవడం వల్ల ఆయా గ్రామ పంచాయతీలు ప్రత్యక్షంగా పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని కోల్పోతున్నట్లు తెలుస్తోంది. డివిజన్ల వారీగా లక్ష్యాలు పన్నుల వసూళ్లకు సంబంధించి డివిజన్ల వారీగా లక్ష్యాలను నిర్ణయించాం. ఒక్కో డివిజన్ వారానికి రూ.కోటి వసూలు చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశాం. అలాగే ముగ్గురు డీఎల్పీఓలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాం. వసూళ్లకు సంబంధించి ప్రతి రోజు జిల్లా కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు పర్యవేక్షిస్తారు. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని పెంచుకునే దిశగా చర్యలు చేపట్టాలని క్షేత్ర స్థాయిలోని ఈఓఆర్డీ, పంచాయతీ కార్యదర్శులను కోరుతున్నాం. – టి.నాగరాజునాయుడు, జిల్లా పంచాయతీ అధికారి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు గ్రామాల్లో పన్నులు చెల్లించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తాము విధులు నిర్వహిస్తున్న గ్రామాల్లో ప్రజలే స్వచ్ఛందంగా పంచాయతీ కార్యాలయానికి వచ్చి చెల్లిస్తున్నారు. అలాగే డివిజన్, జిల్లా స్థాయి అధికారుల ఆదేశాల మేరకు పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాం. గ్రామ పంచాయతీకి పన్నులు చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి నిర్ణీత లక్ష్యాలను పూర్తి చేస్తాం. – గురుస్వామి, అధ్యక్షులు, జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం -
1.84 లక్షల గ్రామాల్లో భారత్‌నెట్ సేవలు
న్యూఢిల్లీ: భారత్‌నెట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసిన బ్రాడ్‌బ్యాండ్ సదుపాయాలతో దేశవ్యాప్తంగా 1,84,399 గ్రామ పంచాయితీలకు (నవంబర్ 28 నాటికి) తక్షణం సేవలు అందించొచ్చని కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ చౌహాన్ లోక్‌సభకు తెలిపారు. అన్ని గ్రామ పంచాయితీలు, గ్రామాల పరిధిలో అధిక వేగంతో కూడిన ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించనున్నట్టు చెప్పారు. ‘‘భారత్‌నెట్ ప్రాజెక్ట్ కింద ఫైబర్ ద్వారా మారుమూల ప్రాంతాల్లోని ఇళ్లకు కనెక్షన్లు అందించడం జరుగుతుంది. అలాగే, ప్రభుత్వ సంస్థలకు వైఫై యాక్సెస్ పాయింట్లు, ఇంటర్నెట్ సదుపా యం ఏర్పాటు చేస్తాం. ఇప్పటి వరకు 1,04,664 గ్రామ పంచాయితీల్లో వైఫై యాక్సెస్ పాయింట్లు ఏర్పాటయ్యాయి’’అని మంత్రి చౌహాన్ తెలిపారు. టెలికం రంగానికి సంబంధించి పీఎల్ఐ పథకం కింత ప్రోత్సాహకాల కోసం 31 దరఖాస్తులు రాగా, అర్హత కలిగిన 28 దరఖాస్తులకు ఆమోదం తెలిపినట్టు మరో ప్రశ్నకు సమధానంగా చెప్పారు. -
ఏపీకి 16 కేంద్ర అవార్డులు
సాక్షి, అమరావతి: ఈ నెల 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలకు కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ ఏకంగా 16 దక్కించుకుని సత్తా చాటింది. గ్రామీణ ప్రాంతాల్లో ‘స్థానిక’ పాలన ఆధారంగా కేంద్రం 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఈ అవార్డులను ప్రకటించింది. మన రాష్ట్రం నుంచి మొత్తం 11 గ్రామ పంచాయతీలు, నాలుగు మండల పరిషత్‌లు, ఒక జిల్లా పరిషత్‌కు అవార్డులు లభించాయి. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సునీల్‌కుమార్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు లేఖ రాశారు. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన రోజును ప్రభుత్వాలు ఏటా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ అవార్డులు ప్రకటించింది. ఆయా గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు సంబంధించిన ప్రజాప్రతినిధులు/అధికారులకు ఈ నెల 24న అవార్డులు అందజేస్తారు. జమ్మూకశ్మీర్‌లోని పాలి గ్రామ పంచాయతీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే కార్యక్రమంలో ఆన్లైన్ విధానం ద్వారా ఈ అవార్డులు బహూకరిస్తారు. ఈ అవార్డుల కింద కేంద్రం జిల్లా పరిషత్‌కు రూ.50 లక్షలు, ఒక్కో మండల పరిషత్‌కు రూ.25 లక్షలు, గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన రూ.8 నుంచి రూ.16 లక్షలు అందజేయనున్నట్టు పంచాయతీరాజ్ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. -
గ్రామాల్లో ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు వేర్వేరుగా ఆస్తి పన్ను!
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు వేర్వేరు ఇంటి పన్ను విధానాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ యోచిస్తోంది. పట్టణాలు, నగరాల్లో ఎన్నో దశాబ్దాల నుంచి వేర్వేరు పన్ను విధానం అమలులో ఉంది. గ్రామాల్లో ప్రస్తుతం ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు ఒకే రకమైన ఇంటి పన్నును వసూలు చేస్తున్నారు. అయితే, గ్రామ పంచాయతీలు తమ అవసరాలకు సరిపడా ఆదాయాన్ని అవే సమకూర్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ పలుమార్లు రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో సామాన్య ప్రజలపై ఏ మాత్రం అదనపు భారం పడకుండా నివాసిత ఇళ్లకు ఇప్పుడు అమలులో ఉన్న ఇంటి పన్ను విధానాన్నే కొనసాగించనున్నారు. వ్యాపార అవసరాలకు ఉపయోగించే ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు మాత్రం కొత్త ఇంటి పన్ను విధానం అమలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. అయితే, వ్యాపార దుకాణాలకు ఎంత ఇంటి పన్ను విధించాలన్న దానిపై పంచాయతీరాజ్ శాఖే ఒక ప్రాతిపదికను నిర్ధారించనుంది. దీని ఆధారంగా సంబంధిత గ్రామ పంచాయతీలు వ్యాపార దుకాణాలకు పన్ను నిర్ణయించుకునేలా కార్యాచరణను సిద్ధం చేశారు. ముందుగా సర్వే.. గ్రామాలవారీగా ఎన్ని వ్యాపార దుకాణాలు ఉన్నాయో తెలుసుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ ఏప్రిల్ మొదటి వారంలో అన్ని గ్రామాల్లో సర్వే నిర్వహించనుంది. పంచాయతీ, గ్రామ సచివాలయ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతుంది. వ్యాపార అవసరాలకు నిర్మించిన షాపులతోపాటు నివాసిత ఇళ్లకు అనుబంధంగా ఆ ఇంటిలోనే నిర్వహిస్తున్న దుకాణాల వివరాలను వేర్వేరుగా సేకరించనున్నారు. సర్వే అనంతరం తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని పంచాయతీరాజ్ శాఖ యోచిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో భారీ వడ్డన నిబంధనల ప్రకారం.. గ్రామాల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఇంటి పన్నును సవరించాల్సి ఉంది. అయితే, 1996 తర్వాత ఇప్పటివరకు పన్ను సవరణ జరగలేదు. దీనికి బదులుగా 2001 నుంచి ఏటా పాత పన్నుపై ఐదు శాతం చొప్పున పెంచే విధానం అమలవుతోంది. కాగా, గత ప్రభుత్వ హయాంలో 2017–18 ఆర్థిక సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని గ్రామాల్లో అప్పటి ఇళ్ల విలువ ఆధారంగా కొత్త ఇంటి పన్నును నిర్ధారించే ప్రక్రియను చేపట్టారు. దీంతో ఆ జిల్లాలో ఒక్కో యజమాని చెల్లించాల్సిన పన్ను అంతకు ముందున్న ఇంటి పన్నుకు ఐదారు రెట్లు పెరిగిపోయింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే పశ్చిమ గోదావరి జిల్లాలో మాదిరిగా రాష్ట్రమంతా అన్ని గ్రామాల్లో ఇంటి పన్ను పెంపునకు కసరత్తు చేపట్టారు. ఇందుకుగాను 2018లో ప్రిస్ సర్వే పేరిట ప్రతి ఇంటి కొలతలు తీసుకున్నారు. వాటికి ఆ గ్రామంలోని మార్కెట్ ధరను కలిపి ఆ వివరాలన్నింటినీ అన్లైన్లో నమోదు చేశారు. అయితే, 2018 ఆగస్టులో సర్పంచుల పదవీ కాలం ముగియడం, సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో ఇంటి పన్ను అమలును టీడీపీ ప్రభుత్వం వాయిదా వేసింది. -
భద్రాచలం బంద్ విజయవంతం
భద్రాచలం: రాష్ట్ర విభజన సమయాన ఏపీలో కలిపిన అయిదు గ్రామ పంచాయితీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలనే డిమాండ్‌తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అఖిలపక్షం ఆధ్వర్యాన చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో బంద్‌కు పిలుపునివ్వగా వ్యాపారులు, వర్తకులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. పెట్రోల్ బంకులు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు నడవలేదు. ఉదయం నుంచే ఇతర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో బస్టాండ్ నిర్మానుష్యంగా కనిపించింది. ఏకపక్షంగా ఏపీలో కలిపిన ఐదు పంచాయితీలను తిరిగి తెలంగాణలో కలపాలనే డిమాండ్‌తో శుక్రవారం తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను దిగ్బంధం చేయనున్నట్టు అఖిలపక్షం నేతలు తెలిపారు. యూబీ సెంటర్లో మూతపడిన దుకాణాలు -
చెత్త నుంచి సంపద సృష్టించిన గ్రామాలు
సాక్షి, అమరావతి: చెత్తే కదాని తేలిగ్గా తీసి పడేయకండి.. ఎందుకంటే ఇప్పుడది సంపదను సృష్టించే వనరుగా మారింది. దాని నుంచి వర్మీ కంపోస్ట్‌ను తయారు చేస్తూ ఆయా గ్రామ పంచాయతీలు ఆదాయార్జనకు బాటలు వేసుకుంటున్నాయి. గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామ పంచాయతీ గడిచిన మూడు నెలల్లో ఇలా రూ.1,62,800 ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను వర్మీ కంపోస్ట్‌గా మారుస్తూ.. దానిని రైతులకు అమ్ముతూ ఆ డబ్బును కూడబెట్టాయి. ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 198 గ్రామ పంచాయతీలు ఇలా చెత్త నుంచి వర్మీ కంపోస్ట్, అమ్మకం ద్వారా రూ.14,06,994ను సంపాదించాయి. క్లీన్ ఆంధ్రప్రదేశే లక్ష్యంగా గతేడాది అక్టోబర్ రెండో తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించాక.. పట్టణాల తరహాలో గ్రామాల్లోనూ చెత్త సేకరణ ప్రక్రియ మొదలైంది. గ్రామాల్లో చెత్త సేకరణకు అవసరమైన ఆటో రిక్షాలు, ఇతర సామగ్రిని ప్రభుత్వమే సమకూర్చడంతో పాటు చెత్త సేకరణలో పనిచేసే క్లాప్ మిత్రలకు గౌరవ వేతనాలనూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 98.73 లక్షల ఇళ్లు ఉన్నట్టు అంచనాకాగా, వాటిలో 95.63 లక్షల ఇళ్ల నుంచి ఇప్పటికే రోజు వారీ చెత్తను గ్రామ పంచాయతీ సిబ్బంది సేకరిస్తున్నారు. ఇక ఆ చెత్త నుంచి వర్మీ తయారీపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు దృష్టి పెట్టారు. 198 గ్రామాల్లో ఇప్పటికే వర్మీ తయారీ అమ్మకాలు మొదలు కాగా.. రానున్న వారం రోజుల్లో మరో 656 గ్రామాల్లో వర్మీ తయారీ, అమ్మకాల ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 40 రోజుల్లో వర్మీ రెడీ చెత్తను వర్మీగా తయారు చేసేందుకు కనీసం 40 రోజులు పడుతుందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను గ్రామాల్లో ప్రభుత్మం నిర్మించిన సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్లకు తరలిస్తారు. ఇప్పటికే ఉన్న షెడ్లకు తోడు ప్రభుత్వం కొత్తగా మరో 1,794 గ్రామాల్లో షెడ్ల నిర్మాణాన్ని చేపడుతోంది. ఈ షెడ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తొట్టెల్లో ఆ చెత్తను వేసి, దానిపై వాన పాములను ఉంచుతారు. ఆ తర్వాత వాటిపై గోనె పట్టలను ఉంచి ఎప్పటికప్పుడు వాటిని తడిచేస్తూ నిర్ణీత ఉష్ణోగత్ర కొనసాగేలా జాగ్రత్తలు చేపడతారు. 40 రోజుల తర్వాత వాన పాములు ఉంచిన ఆ చెత్త మిశ్రమం వర్మీగా మారుతుందని అధకారులు చెబుతున్నారు. కిలో వర్మీ రూ.10 చెత్త నుంచి తయారు చేసిన వర్మీని కిలో రూ.10 చొప్పన అమ్మాలని పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే గ్రామ పంచాయతీలకు సూచనలిచ్చింది. ప్రస్తుతం చాలా తక్కువ గ్రామాల్లో వర్మీ తయారీ ప్రక్రియ మొదలవడంతో.. తయారైన కొద్దిపాటి వర్మీ అమ్మకానికి పెద్దగా ఇబ్బందుల్లేవని అధికారులంటున్నారు. స్థానిక రైతులతో పాటు ఇళ్లల్లో మొక్కలు పెంచుకునే వారు కూడా వర్మీని కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వర్మీ తయారీ ప్రక్రియ ఊపందుకుని, పెద్ద మొత్తంలో అందుబాటులోకొస్తే.. అప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్మేందుకు ఇప్పటికే వ్యవసాయ శాఖ అనుమతి కోరుతూ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు లేఖ రాశారు. అన్ని గ్రామాల్లో మొదలైతే రూ.300 కోట్ల వరకూ ఆదాయం పంచాయతీరాజ్ శాఖ ముందస్తుగా తయారు చేసుకున్న ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో చెత్త నుంచి వర్మీ తయారీ ప్రక్రియ మొదలైతే గ్రామ పంచాయతీల ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ తరహా వర్మీ తయారీ ద్వారానే గ్రామాలకు ఏటా రూ.300 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు. -
జీపీఎస్ అటెండెన్స్ వద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరికీ లేని సర్వీసు నిబంధనలు తమకెందుకని గ్రామపంచాయతీ కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. మొబైల్ యాప్‌తో అటెండెన్స్ నమోదు, రోజంతా కార్యకలాపాలు, విధుల నిర్వహణపై జీపీఎస్ ద్వారా ట్రాకింగ్ ఎందుకని వాపోతున్నారు. సోమవారం నుంచి కొత్తగా అమల్లోకి తెచ్చిన జీపీఎస్ అటెండెన్స్‌ను పాటించలేమంటూ పర్మినెంట్ గ్రామ కార్యదర్శులతోపాటు జూనియర్ పంచాయతీ సెక్రటరీలు సైతం జిల్లా కలెక్టర్లు మొదలు పీఆర్ కమిషనర్, కార్యదర్శి, సీఎస్‌దాకా వినతిపత్రాలను ఇస్తున్నారు. ఉదయం 8:30 గంటలకే... ఉదయం 8.30 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామకార్యదర్శులు సెల్ఫీ దిగి కొత్త డీఎస్ఆర్ మొబైల్ పీఎస్ యాప్ ‘క్యాప్చర్ జీపీ లొకేషన్’ఆప్షన్ ద్వారా అటెండెన్స్ నమోదు చేయాలి. రోజుకు 12 గంటలకు పైబడి విధులు, కింది నుంచి పైస్థాయి వరకు పదిమంది దాకా బాస్‌లు, రోజూ వారడిగే నివేదికలు ఇలా అనేక బరువు బాధ్యతలతో పనిచేస్తున్న తమపై ఇప్పుడు జీపీఎస్ అటెండెన్స్ విధానాన్ని తీసుకురావడం సరికాదని అంటున్నారు. దీంతోపాటు రోజూ డీఎస్ఆర్ యాప్‌లో రోడ్లు, డ్రైన్లు తదితరాలతోపాటు పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, అవెన్యూ ప్లాంటేషన్, ఇంటింటి చెత్త సేకరణ వంటి ఐదు ఫొటోలు లైవ్‌లో అప్లోడ్ చేయాలి. జీపీఎస్ ద్వారా అటెండెన్స్ నమోదు చేశాకే డీఎస్ఆర్ యాప్‌లో మిగతా ఆప్షన్లు ఎంట్రీ చేయడానికి వీలవుతుంది. మాకెందుకు నాలుగేళ్ల ప్రొబేషన్ రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలున్నాయి. దాదాపు మూడువేల మంది పర్మినెంట్ పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు. రెండున్నరేళ్ల కింద ఏడున్నరవేల జూనియర్ పంచాయతీ సెక్రటరీలను (జేపీఎస్) నియమించారు. మరో రెండువేల మంది దాకా ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ జూనియర్ సెక్రటరీలు కూడా పనిచేస్తున్నారు. తొలుత జేపీఎస్‌లకు మూడేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉండగా.. దాన్ని నాలుగేళ్లకు పెంచారు. మహిళా జేపీఎస్‌లకు ప్రసూతి సెలవులు సైతం ఇవ్వడం లేదు. ఇతర ప్రభుత్వోద్యోగులకు రెండేళ్ల ప్రొబేషన్ ఉంటే తమకు నాలుగేళ్లు ఎందుకని అంటున్నారు. నిర్దిష్ట పనివేళలు నిర్ణయించాలి జీపీఎస్ ద్వారా ఫిజికల్ టచ్ లైవ్ లొకేషన్ అటెండెన్స్ నమోదు రద్దుచేయాలి. సెక్రటరీలకు నిర్దిష్ట పనివేళలు నిర్ణయించాలి. ఉపాధి హామీ పనులకు ఒక క్షేత్రస్థాయి సహాయకుడిని ఇవ్వాలి. పంచాయతీల్లో సాంకేతిక పనుల నిర్వహణకు ట్యాబ్లెట్, సిమ్‌కార్డు, ఇంటర్నెట్, డేటా కార్డు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. పంచాయతీలను జనాభా ప్రాతిపదికన 4 గ్రేడ్లుగా విభజించాలి. ప్రస్తుత సర్వీస్ రూల్స్ ప్రకారం 4 గ్రేడ్లు కొనసాగించాలి. –పి.మధుసూదన్‌రెడ్డి, అధ్యక్షుడు, పంచాయతీ సెక్రటరీల సంఘం పని ఒత్తిడి ఎక్కువ యాప్ ద్వారా జీపీఎస్ పద్ధతిలో అటెండెన్స్ నమోదు చేయొద్దని కలెక్టర్లను కోరాం. మేము లేవనెత్తిన అంశాలపై కలెక్టర్లు, పీఆర్ ఉన్నతాధికారుల నుంచి వచ్చే స్పందనను బట్టి మా కార్యాచరణను ఖరారు చేస్తాం. సోమవారం నుంచి అటెండెన్స్ మాత్రం నమోదు చేయడం లేదు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు విధుల నిర్వహణతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాం. –నిమ్మల వెంకట్ గౌడ్, అధ్యక్షుడు, జూనియర్ సెక్రటరీల సంఘం -
పంచాయతీ పటిష్టం!
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీల్లో కొత్తగా స్టాండింగ్ కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పంచాయతీ వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, వ్యవసాయ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు తదితర గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులను ఈ స్టాండింగ్ కమిటీల్లో సభ్యులుగా నియమిస్తూ.. ఒక్కో గ్రామ పంచాయతీలో కనీసం ఆరు కమిటీలు ఏర్పాటు కానున్నాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామ పంచాయతీ స్థాయిలో అదనంగా ఎన్ని కమిటీలైనా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ పంచాయతీలో ఉండే వార్డు సభ్యులందరినీ ఏదో ఒక స్టాండింగ్ కమిటీలో తప్పనిసరిగా సభ్యునిగా నియమించాల్సి ఉంటుంది. ఒక్కో వార్డు సభ్యుడు రెండుకు మించి స్టాండింగ్ కమిటీలలో ఉండకూడదు. ప్రభుత్వ అధికారులు, సంబంధిత అంశంలో గ్రామ స్థాయి నిపుణత ఉన్న పౌరులను ఈ కమిటీలలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించుకోవచ్చు. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాలంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్రం ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు అనుగుణంగా తమ రాష్ట్రంలోని పంచాయతీరాజ్ చట్టానికి తగిన సవరణలు తీసుకు రావడంతో పాటు, సంబంధిత శాఖ ఆదేశాలు ఇవ్వాలంటూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు తాజాగా లేఖ రాశారు. సుస్థిర అభివృద్ధే లక్ష్యం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణకు మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రభుత్వాలలో స్టాండింగ్ కమిటీల విధానం ఇప్పటికే అమలులో ఉంది. అయితే నగర పాలక సంస్థలు, మునిసిపాలిటీలు, జిల్లా పరిషత్‌లలో మాత్రమే ప్రస్తుతం స్టాండింగ్ కమిటీల విధానం కొనసాగుతోంది. మండల పరిషత్‌లలో, గ్రామ పంచాయతీ స్థాయిలో ఈ తరహా ప్రక్రియ అమలులో లేదు. చట్ట సవరణ ద్వారా కొత్తగా గ్రామ పంచాయతీలలో కూడా స్టాండింగ్ కమిటీల ఏర్పాటు వల్ల సుస్థిర అభివృద్ధితో పాటు పనుల్లో వేగం, పారదర్శకత పెరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. ఆస్తుల పరిరక్షణ, వివిధ కార్యక్రమాల అమలు సులువవుతుందన్నారు. గ్రామ పంచాయతీల్లో స్టాండింగ్ కమిటీల బాధ్యతలు 1.జనరల్ స్టాండింగ్ కమిటీ : పంచాయతీ పాలన, గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్వహణ, గ్రామ పంచాయతీ ఆస్తుల నిర్వహణ, గ్రామంలో రేషన్‌షాపుల పర్యవేక్షణ– కార్డుదారుల ప్రయోజనాలను కాపాడడం తదితర అంశాలు. 2.గ్రామ వైద్య, పారిశుధ్య, పోషకాహార స్టాండింగ్ కమిటీ : గ్రామ పరిధిలో వైద్య సంబంధిత, పారిశుధ్య సంబంధిత అంశాల అమలు. ఎక్కువ షోషకాలు ఉండే వాటినే ఆహారంగా తీసుకునేలా స్థానిక ప్రజలలో అవగాహన కల్పించడం. 3.ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీ : గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయడం. పంచాయతీ నిధుల పర్యవేక్షణ, ఆడిట్, ఇతర పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలు. 4. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ : అంగన్ వాడీ కేంద్రాలతో పాటు గ్రామ పరిధిలో విద్యా సంస్థలపై పర్యవేక్షణ, ఆయా విద్యా సంస్థలలో మధ్యాహ్న భోజన కార్యక్రమం అమలు తీరుపై పర్యవేక్షించడం. 5.సోషల్ జస్టిస్ కమిటీ : ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, వృద్ధులు, పిల్లలు, మహిళల భద్రతకు సంబంధించిన అంశాల పర్యవేక్షణ. 6.మంచినీటి సరఫరా, పర్యావరణ కమిటీ : గ్రామంలో మంచినీటి సరఫరా, వర్షపునీటిని ఆదా చేసేందుకు తగిన చర్యలు చేపట్టడం, వ్యవసాయానికి సాగునీటి సరఫరా వ్యవస్థ పర్యవేక్షణ, మొక్కల పెంపకం తదితర అంశాలు. -
5 సంవత్సరాల్లో గ్రామాల్లో పరిశుభ్రత, మంచినీటికి 6,140 కోట్లు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో మెరుగైన పరిశుభ్రత, మంచినీటి సరఫరా సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో భారీగా నిధులు వెచ్చించనుంది. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు కేటాయించే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో రూ.6,140 కోట్లను ఇందుకోసం ఖర్చు చేయనున్నారు. అదనంగా ఇతర కార్యక్రమాలు, పథకాల నిధులను వీటికి జతచేసి ఈ అవసరాల కోసం వినియోగిస్తారు. ఈ మేరకు ఆర్థిక సంఘం నిధుల వినియోగం నిబంధనల్లో మార్పులు తేనున్నారు. దీనికి సంబంధించిన ముసాయిదాను ప్రభుత్వం సిద్ధం చేసింది. 60 శాతం నిధులు.. స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం ఏటా కేటాయించే నిధుల్లో 60 శాతం పరిశుభ్రత, మంచినీటి అవసరాలకు ఖర్చు చేయాలని ముసాయిదాలో పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది. ప్రతి గ్రామంలో ఏడాది పొడవునా తాగునీటి లభ్యత సౌకర్యాల కల్పన, రోజూ ప్రతి ఇంటికీ నీటి సరఫరాకు మౌలిక వసతుల ఏర్పాటు, పర్యవేక్షణ, రహదారులు, ఇతర ఖాళీ స్థలాల్లో మురుగు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం, క్రమ విధానంలో చెత్త సేకరణ తదితరాల కోసం ఈ నిధులను వెచ్చిస్తారు. ప్రతి గ్రామానికి ఐదేళ్ల ప్రణాళిక.. గ్రామంలో పరిశుభ్రత, మంచినీటి సరఫరా సౌకర్యాల కోసం ప్రతి పంచాయతీకి ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న వనరులు, అదనపు సౌకర్యాలను పరిగణనలోకి తీసుకొని ప్రణాళిక రూపొందిస్తారు. తుపాన్లు లాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక రూపొందించాలని ముసాయిదాలో పేర్కొన్నారు. గ్రామసభలో ప్రణాళికపై చర్చించి తుది ఆమోదం తీసుకోవాలి. ప్రణాళికల అమలుకు సర్పంచ్ నేతృత్వంలో 15 మంది సభ్యులతో కమిటీని నియమించుకోవచ్చు. కమిటీలో మహిళలు, అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు వారి సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. -
‘పచ్చ’పాతం: ఇదేమి వైపరీత్యం!
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకుడొకాయన ఆమధ్య పంచాయతీ ఎన్నికలకూ మేనిఫెస్టో విడుదల చేసి ‘చరిత్ర సృష్టించారు’. జనం అంతా విస్తుపోయే వింతను తెరపైకి తెచ్చారు. ప్రజల అదృష్టం బాగుండి.. ఆయన మద్దతు ఇస్తామన్న వారిలో చాలామందిని జనం తిరస్కరించారు. కానీ.. కొద్దిగా ఎన్నికైన వారితో కూడా ఆయన.. ఆయన పార్టీ పెద్దలు అప్పుడే విచిత్రాలు చేయిస్తున్నట్టున్నారు. అభిజ్ఞ వర్గాల సమాచారం ప్రకారం.. తమ పరిధిలోని పంచాయతీ కార్యాలయాలకు పచ్చ రంగు పులమాలని పెద్దలు ఆదేశించారంటున్నారు. ఇందుకు నిదర్శనంగా.. కొత్త ఉత్సాహం కాస్త అతి కావడంతో ఓ సర్పంచ్ పంచాయతీ ఆఫీసుకు పచ్చ రంగు వేయించేశారు. అధికారులు.. ఆచి తూచి మాట్లాడుతున్నారు. మరి తదనంతర పరిణామాలపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు? సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పంచాయతీ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం వేసిన రంగులపై టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లారు. ఆ రంగులన్నీ తొలగించాలని పిటిషన్ వేశారు. రాజకీయంగా పెద్ద రాద్ధాంతమే చేశారు. చీప్ పబ్లిసిటీతో లబ్ధి పొందాలని చూశారు. కానీ ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డారు. ఇప్పుడు.. టీడీపీ మద్దతుదారులు గెలిచిన గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాలకు పసుపు రంగు పూస్తున్నారు. అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతో అధికారుల అనుమతి లేకుండా ఏకపక్షంగా రంగులు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆమదాలవలస మండలం కనుగులవలస పంచాయతీ కార్యాలయానికి పసుపు రంగు వేసేశారు. టీడీపీ నేతల ద్వంద్వ నీతి జనాలకు ఈ పనితో అర్థమైంది. ఆ నేతల దుర్నీతిని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలపై ఏ నిర్ణయమైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న సర్కార్ తీసుకోవాలి. ప్రభుత్వ ఆదేశాలు, అధికారుల అనుమతి మేరకే పంచాయతీ కార్యాలయాలకు సంబంధించిన ఏ చర్యలైనా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా అధికారుల అనుమతి లేకుండా ఇష్టారీతిన పంచాయతీ కార్యాలయానికి పసుపు రంగు వేసేశారు. తాజాగా ఎన్నికైన సర్పంచ్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. కనీసం పంచాయతీ పాలకవర్గం తీర్మానం కూడా చేయలేదు. ఎక్కడా లేని విచక్షణాధికారంతో ఆగమేఘాలపై పంచాయతీ కార్యాలయానికి రంగులు వేయడం విమర్శలకు తావిస్తోంది. రౌడీషీటర్ బుద్ధి చూపించారా? కనుగులవలస సర్పంచ్‌గా ఎన్నికైన నూక సూరప్పలనాయుడు (నూకరాజు)పై రౌడీ షీట్ ఓపెన్ చేసి ఉంది. వివాదాస్పదమైన వ్యక్తిగా ముద్ర పడ్డారు. గొడవలు, కొట్లాటకు ముందుంటారు. గతంలో ప్రస్తుత శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. తాజాగా సర్పంచ్‌గా గెలిచిన వెంటనే అదే మూర్ఖత్వం చూపించారు. అధికారుల అనుమతి లేకుండా పంచాయతీ కార్యాలయానికి పసుపు రంగు వేయించారు. ఎవరొచ్చి ఏం చేస్తారన్నట్టుగా వ్యవహరించారు. అంతటితో ఆగకుండా పసుపు రంగు వేసిన కార్యాలయంలో విధులు నిర్వహించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఇక్కడికొచ్చి విధులు నిర్వర్తించాలని కూడా సతాయించారు. దీనికి సిబ్బంది ఒప్పుకోలేదు. గ్రామ పంచాయతీ పాలకవర్గమంతా తీర్మానం చేయాలని సుతిమెత్తగా చెప్పారు. మీమాంసలో తెలుగు తమ్ముళ్లు.. సర్పంచ్‌లుగా టీడీపీ మద్దతుదారులు గెలిచిన పంచాయతీల్లో పసుపు రంగులు వేయాలని ఆ పార్టీ అ ధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. దీంతో కొందరు అధిష్టానం మాట మేరకు పసుపు రంగు వేసేందుకు యత్నిస్తుండగా, మరికొందరు మనికెందుకని మీమాంసలో పడ్డారు. మొత్తానికి రంగుల రాజకీయం చేసేందుకు టీడీపీ యతి్నస్తుందనేది స్పష్టమవుతోంది. పసుపు రంగు తొలగిస్తాం.. రంగుల విషయం మా దృష్టికి వచ్చింది. రెండు రోజుల క్రితమే పంచాయతీ కార్యాలయానికి రంగులు వేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మాకు వచ్చిన ఫిర్యాదు మేరకు పసుపు రంగు తీసేసి తెలుపు రంగు వేయిస్తాం. – పేడాడ వెంకటరాజు, ఎంపీడీఓ, ఆమదాలవలస చదవండి: రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబు హైడ్రామా వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ నేత హత్యాయత్నం -
కౌంటింగ్ వీడియో తీయండి
సాక్షి, అమరావతి: సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామ పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను తప్పనిసరిగా వెబ్‌కాస్టింగ్ లేదా సీసీ కెమెరా లేదా వీడియోగ్రఫీ ద్వారా రికార్డు చేయించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి కన్నబాబు కలెక్టర్లతో పాటు డీపీవోలు, ఎస్పీలకు లేఖలు రాశారు. మొత్తం నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ఇప్పటికే రెండు దశలు పూర్తవగా.. మూడు, నాలుగో దశ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో చేపట్టాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ► కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఆ ప్రాంతంలో కరెంటు సరఫరాకు అంతరాయం కలుగకుండా విద్యుత్ శాఖ అధికారులకు తగిన సూచనలు జారీ చేయాలి. అదే సమయంలో జనరేటర్లు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ► కౌంటింగ్ అనంతరం పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థుల మధ్య అతి స్వల్పంగా ఒక అంకె (సింగిల్ డిజిట్) ఓట్ల తేడా ఉన్నప్పుడు మాత్రమే నిబంధనల ప్రకారం ఒక్కసారి రీ కౌంటింగ్‌కు అనుమతించాలి. రెండు అంకెల (డబుల్ డిజిట్) ఓట్ల తేడా ఉంటే అనుమతించవద్దు. ► కౌంటింగ్ కేంద్రాలలోకి ముందుగా అనుమతి పొందిన వ్యక్తులను మాత్రమే అనుమతించాలి. ఇతరులను రానీయకూడదు. ► సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, పెద్ద గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలి. -
ఇంటివద్దకే సంక్షేమ ఫలాలు
సాక్షి, కడప: వైఎస్సార్ జిల్లాలో గ్రామసీమల రూపు రేఖలు మారుతున్నాయి. ఒకనాడు పల్లెల్లో అంతం త మాత్రంగా జీవనం సాగిస్తున్న ప్రజల జీవనశైలి లో పూర్తిగా మార్పులు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో అధునాతన వసతులు సమకూరడం, ఆరోగ్యానికి అభయం లభించడంతో పల్లెలు నవజీవనంతో వెలిగిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఎక్కడికక్కడ ప్రాజెక్టులు, చెరు వుల్లో నీరు నిండడంతో పల్లె సీమలు పచ్చని పంట లతో కళకళలాడుతున్నాయి. పల్లెల్లో పరిస్థితి చూస్తే ఆనాడు జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కళ్లెదుటే కనిపి స్తోంది. మనం పరు గెత్తే పరిస్థితి నుంచి అధికారులే ఇంటి వద్దకు వచ్చి సంక్షేమ ఫలాలు అందించే పరిస్థితి వచ్చింది. పెన్షన్, బియ్యం కార్డు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు, అవసరమైన సర్టిఫికెట్లు.. ఇలా అవసరమైనవన్నీ ఊళ్లోని సచివాలయంలోనే ఇస్తున్నారు. సచివాలయానికి వెళ్లలేనివారికి వలంటీరే ఇంటివద్దకు వచ్చి అందజేస్తున్నారు. రూ.400 కోట్లకు పైగా నిధులతో గ్రామాల్లో పనులు వైఎస్సార్ జిల్లాలో 807 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పల్లెసీమల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నడుం బిగించింది. పల్లెలను అభివృద్ధి బాట పట్టిస్తున్నారు. పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పాడా) ఆధ్వర్యంలో పులివెందుల నియోజకవర్గంలోను, పంచాయతీ రాజ్‌శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగాను విస్తృతంగా అభివృద్ధి పనులు జరిగాయి. సిమెంటు రోడ్లు, వీధిలైట్లు, డ్రైనేజీ నిర్మాణాల కోసం రూ.400 కోట్లకుపైగా ఖర్చుచేశారు. వైద్యానికి భరోసా జిల్లాలో 74 పీహెచ్‌సీలు, 17 పట్టణ ఆరోగ్య కేం ద్రాలు, 14 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల చెంతకే వైద్యం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లను ప్రారంభించింది. దీన్లో భాగంగా జిల్లాలో రూ.87.50 కోట్లతో 500 హెల్త్ క్లినిక్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వీటిలో 10 భవనాలు పూర్త య్యాయి. 450 భవన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. మార్చి నాటికి వీటిని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుని పనులు చేస్తున్నారు. కమలాపురంలో ఇటీవల ప్రారంభించిన రైతు భరోసా కేంద్రం ఆధునిక టెక్నాలజీ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 2012–13 పంటల బీమా మొదలు అన్నింటినీ ప్రభుత్వం ఒక్కొక్కటి అన్నదాతలకు అందిస్తూ వస్తోంది. ఆధునిక సాం కేతిక పరిజ్ఞానంతో కూడిన రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా అనేక సేవలు అందిస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వీటి ద్వారా సత్వరం అందిస్తున్నారు. జిల్లాలో 621 ఆర్బీకేల నిర్మాణానికి ప్రభుత్వం రూ.135.38 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే రూ.21.77 కోట్లు వెచ్చించి 14 భవనాలను పూర్తిచేశారు. ప్రజలకు సత్వరసేవలు గ్రామాల్లో ప్రజలకు వేగవంతమైన సేవలు అందిం చడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగు తోంది. జిల్లాలో 631 సచివాలయాలున్నాయి. వీటి భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.233 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే రూ.88.65 కోట్లు ఖర్చుచేసి 142 భవనాలను పూర్తిచేశారు. మరో 430 భవనాల నిర్మాణాలు పూర్తయ్యే దశలో ఉన్నా యి. 59 భవనాల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఆహ్లాదకర వాతావరణంలో విద్య శిథిలావస్థకు చేరిన భవనాలు, ఫర్నిచర్ లేని తరగతి గదులు, మరుగుదొడ్ల కొరత.. వంటి సమస్యలతో కునారిల్లుతున్న పాఠశాలలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. జిల్లాలో తొలివిడతలో 1,040 పాఠశాలలను నాడు–నేడులో భాగంగా తీర్చిదిద్దేందుకు రూ.185 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటికే దాదాపు అన్ని పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించారు. 300 పాఠశాలలకు సంబంధించి పెయింటింగ్ పనులు మిగిలి ఉన్నాయి. మార్చి చివరి నాటికి పనులన్నీ పూర్తిచేసేలా కసరత్తు చేస్తున్నారు. రెండో విడత కూడా మరో 1000కి పైగా పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ఏప్రిల్ నుంచి పనులు చేపట్టాలని భావిస్తున్నారు. చదువుకునేందుకు మంచి వాతావరణం నాడు–నేడు ద్వారా పాఠశాలల్లో వసతులు కల్పించడంతో చదువుకునేందుకు మంచి వాతావరణం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పెద్దపీట వేయడంతో ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి దాదాపు 20 వేలమందికి పైగా విద్యార్థులు వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఇప్పటికే నాడు–నేడు పనుల్లో భాగంగా పాఠశాలలకు తుది మెరుగులు దిద్దుతున్నాం. – డాక్టర్ అంబవరం ప్రభాకర్‌రెడ్డి, సమగ్రశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి, కడప వేగవంతంగా పనులు చేయిస్తున్నాం జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి పనులను వేగవంతంగా నడిపిస్తున్నాం. జిల్లాలో రైతుభరోసా కేంద్రాలతోపాటు సచివాలయాల నిర్మాణం, హెల్త్ క్లినిక్‌ల పనులు కూడా చేయిస్తున్నాం. మార్చి చివరి నాటికి వీలైనన్ని ఎక్కువ భవన నిర్మాణాలు పూర్తిచేసి అప్పగించే దిశగా అడుగులు వేస్తున్నాం. – వెంకటసుబ్బారెడ్డి, ఎస్ఈ, పంచాయతీరాజ్‌శాఖ, కడప -
ఊరు ఉంది.. పేరు లేదు
పెదపాడు: పట్టణ స్థాయికి ఎదిగిన హనుమాన్‌జంక్షన్ అంటే అందరికీ తెలుసు. కానీ ఆ పేరు ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా లేదు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దుగా కల్లూరు టు మచిలీపట్నం రహదారి ఉంది. ఈ రహదారి లోని జంక్షన్లో పెదపాడు మండంలోని అప్పన వీడు, ఏపూరు.. కృష్ణా జిల్లా బాపులపాడును కలుపుకుని హనుమాన్ జంక్షన్‌గా పిలుస్తారు. నాలుగు రోడ్ల కూడలి కావడంతో ఈ జంక్షన్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు. మూడు మేజరు గ్రామ పంచాయతీల కలయిక అని మాత్రం ఎక్కువమందికి తెలియదు. (చదవండి: సినిమాలో చూస్తాడు.. బయట చేస్తాడు) అంతర్మథనం: గోడ మీద టీడీపీ తమ్ముళ్లు..! -
ఏపీ పంచాయతీ ఎన్నికలు: ఒక్క ఓటుతో సర్పంచ్ పదవి
సాక్షి, అమరావతి బ్యూరో: అది కృష్ణా జిల్లాలోనే బుల్లి పంచాయతీ.. 1975లో కుందేరు నుంచి వేరుపడి పంచాయతీగా ఏర్పాటైంది. 350 మంది జనాభా, 232 మంది ఓటర్లున్న ఆ ఊరి పేరు కందలంపాడు. కంకిపాడు మండలంలో ఉంది. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు గతంలో నిర్మల్ గ్రామ పురస్కారాన్ని అందుకుంది. ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచింది.. ఈ పంచాయతీ జనరల్ కేటగిరీకి రిజర్వ్ అవడంతో ఇద్దరు బరిలో నిలిచారు. మంగళవారం నాటి ఓటింగ్‌లో 232 ఓట్లకు గాను 211 పోలయ్యాయి. ఆరు ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇందులో బాయిరెడ్డి నాగరాజు (వైఎస్సార్సీపీ మద్దతుదారు)కు 103, మొవ్వ శివనాగ సుబ్రహ్మణ్యానికి 102 ఓట్లు వచ్చాయి. దీంతో ఒకే ఒక్క ఓటు ఆధిక్యంతో నాగరాజు సర్పంచ్ అయ్యారు. ఇక ఆ ఊరిలోని నాలుగు వార్డుల్లో ఒకటి ఏకగ్రీవం అయింది. మిగిలిన మూడు వార్డుల్లో వైఎస్సార్సీపీ మద్దతు అభ్యర్థులే గెలుపొందారు. ఏకగ్రీవంగా ఎన్నికైన నవీన్‌కు ఉప సర్పంచ్ పదవిని కట్టబెట్టారు. దిబ్బపాలెంలోనూ అంతే.. మాడుగుల రూరల్: విశాఖ జిల్లా చీడికాడ మండలంలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందారు. దిబ్బపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు. గ్రామానికి చెందిన నందారపు కాసులమ్మ, తుంపాల నిరంజని పోటీ పడ్డారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో నిరంజని కేవలం ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందారు. కాసులమ్మకు 742 ఓట్లు రాగా, తుంపాల నిరంజనికి 743 ఓట్లు వచ్చాయి. కాపవరం పంచాయతీలోనూ.. సామర్లకోట: ఒక్క ఓటు.. కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఆయనను విజయం వరించింది. తూర్పుగోదావరి జిల్లా కాపవరం పంచాయతీలో 8 వార్డులున్నాయి. అయితే ఒకే ఒక్క ఓటు తేడాతో కుంచం మాధవరావు గెలుపొందారు. అధికారులు తిరిగి ఓట్లు లెక్కించడంతో అదే ఒక్క ఓటు తేడాతో మాధవరావు గెలుపొందారు. లాటరీతో వరించిన పదవి గోనేడ సర్పంచ్‌గా గంగరాజు ప్రత్తిపాడు : ఇద్దరు అభ్యర్థులకూ ఓట్లు సమంగా వచ్చాయి.. దీంతో అధికారులు లాటరీ తీసి అభ్యర్థిని ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం గోనేడ పంచాయతీ సర్పంచ్ పదవికి జరిగిన ఎన్నికల్లో అల్లు విజయకుమార్, పలివెల గంగరాజులకు 1,207 చొప్పున ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు లాటరీ తీయగా విజయ్‌కుమార్‌ను అదృష్టం వరించడంతో సర్పంచ్ అయ్యారు. -
రెండో విడతలో 539 పంచాయతీలు ఏకగ్రీవం
సాక్షి, అమరావతి: రెండో విడతలో 2,789 గ్రామ సర్పంచ్ పదవులకు ఈ నెల 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత కింద మొత్తం 3,328 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవగా.. అందులో 539 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,789 సర్పంచ్ పదవులకు గాను 7,510 మంది పోటీలో ఉన్నారు. ఆయా గ్రామాల్లో మొత్తం 33,570 వార్డు పదవులకు ఎన్నికలు జరుగుతుండగా.. అందులో 12,605 ఏకగ్రీవమవగా, మిగతా 20,965 వార్డు పదవులకు 13న పోలింగ్ జరగనుంది. వార్డు పదవులకు 44,879 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారానికి గడువు గురువారం రాత్రి 7:30 గంటలతో ముగుస్తుంది. శనివారం ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ వెంటనే ఓట్ల లెక్కిస్తారు. -
మా గ్రామానికి ఎన్నికలు రద్దు చేయండి
పిడుగురాళ్లరూరల్ (గురజాల): తమ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు రద్దు చేయాలని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండల పరిషత్ కార్యాలయం వద్ద న్యూ వెల్లంపల్లి గ్రామస్తులు ఆదివారం ఆందోళన చేపట్టారు. గతంలో మాచవరం మండలంలోని పులిచింతల ముంపు గ్రామంగా వెల్లంపల్లి ఉంది. ఈ ముంపు వాసులకు పిడుగురాళ్ల మండలంలోని బ్రాహ్మణపల్లి శివారులో నివాసం కల్పించారు. ఆ నివాస ప్రాంతాన్ని న్యూ వెల్లంపల్లి గ్రామ పంచాయతీగా పరిగణిస్తున్నట్లు 2020లో ప్రభుత్వం నుంచి ఉత్వర్వులు అందాయి. ఈ పంచాయతీకి 2019 ఓటర్ల లిస్టు ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం గ్రామంలో నివసించేవారంతా వేరువేరు గ్రామాలకు చెందిన వారని, గతంలో తాము కోర్టుకు వెళ్లగా న్యూ వెల్లంపల్లిలో ఇప్పుడు నివసిస్తున్న వారితోపాటు కొత్త ఓటర్ల లిస్టు తయారు చేయాలని కోర్టు ఆదేశించిందని వివరించారు. అయినా అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తూ ధర్నా చేశారు. అధికారులు స్పందించి కొత్త లిస్టు వచి్చన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీనిపై ఎంపీడీవో కాశయ్య స్పందిస్తూ ఎన్నికల నిర్వహణ తమ చేతుల్లో లేదని, అధికారుల ఆదేశాల మేరకే పనిచేస్తున్నామని చెప్పారు. -
2,723 గ్రామాల్లో రేపే పోలింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో తొలి విడతలో 2,723 గ్రామ పంచాయతీల్లో మంగళవారం పోలింగ్ జరగనుంది. ఉదయం 6.30 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. ఆయా గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారం ఆదివారం రాత్రి 7.30 గంటలతో ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ప్రకటించింది. నెల్లూరు జిల్లాలో ఒక్కటి మినహా.. తొలి విడతలో 3,249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారులు ఎక్కడికక్కడ నోటిఫికేషన్ జారీ చేయగా 525 గ్రామాల్లో సర్పంచి ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. నెల్లూరు జిల్లాలోని ఒక గ్రామ పంచాయతీలో సర్పంచి పదవికి, వార్డు సభ్యులుగా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో మిగిలిన 2,723 గ్రామాల్లో సర్పంచి పదవికి పోలింగ్ జరగనుంది. మొత్తం 32,502 వార్డు సభ్యుల పదవులు ఉండగా 12,185 ఏకగ్రీవమయ్యాయి. మరో 157 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 20,160 వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు కూడా రేపే.. తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఓట్ల లెక్కింపు కూడా మంగళవారమే చేపట్టనున్నట్లు ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు చెప్పారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఎక్కడికక్కడే ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదట వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపును చేపడతారు. గ్రామంలో ఒకటో వార్డు నుంచి చివరి వార్డు వరకు లెక్కింపు పూర్తయిన తర్వాత సర్పంచి ఓట్ల లెక్కింపును చేపడతారు. ఫలితాల వెల్లడి తర్వాత వెంటనే వార్డు సభ్యుల ద్వారా ఉప సర్పంచి ఎన్నికను చేపట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఓటు హక్కు విధిగా వినియోగించుకోండి ప్రశాంత వాతావరణంలో పూర్తి భద్రతా ఏర్పాట్ల మధ్య పంచాయతీ ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటర్లను కోరారు. ఈ మేరకు కమిషన్ కార్యాలయం ఓ వీడియో సందేశాన్ని మీడియాకు విడుదల చేసింది. ఓటు హక్కు వినియోగం ద్వారా పంచాయతీలకు జవసత్వాలు వస్తాయని నిమ్మగడ్డ పేర్కొన్నారు. విధిగా ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను ఆశీర్వదించాలని కోరారు. తొలి విడత ఇలా ► తొలివిడత ఎన్నికల్లో 2,723 సర్పంచి పదవులకు 7,506 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. 20,160 వార్డు సభ్యుల పదవులకు 43,601 మంది బరిలో ఉన్నారు. ► సర్పంచి, వార్డు సభ్యులను ఎన్నుకునేందుకు ఓటర్లు ఒకేసారి ఓటు వేయాల్సి ఉంటుంది. బ్యాలెట్ పేపరు విధానంలో ఎన్నిక జరుగుతుంది. ► సర్పంచి పదవికి గులాబీ రంగు (పింక్ కలర్) బ్యాలెట్ పేపరుపైనా, వార్డు పదవికి తెలుపు రంగు బ్యాలెట్ పేపరుపైనా ఓటు వేయాలి. ఓటు వేసిన తర్వాత రెండు బ్యాలెట్ పేపర్లను బ్యాలెట్ బాక్స్ వద్దకు తీసుకెళ్లి రెండూ కలిపి అందులోనే వేయాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ► పోలింగ్ మెటీరియల్‌ను సోమవారం ఆయా మండల పరిషత్‌ల కార్యాలయాల వద్ద సంబంధిత పోలింగ్ సిబ్బందికి అందజేస్తారు. ► బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్లు, ఇంకు, కవర్లు తదితర 38 రకాల పోలింగ్ మెటీరియల్స్‌ను పోలింగ్ సిబ్బందికి అందిస్తారు. -
రాష్ట్రానికి 11 పంచాయతీ అవార్డులు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు సేవలు అందించడంలో మెరుగైన పనితీరును కనబరిచినందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ పురస్కార్ (డీడీయూపీఎస్‌పీ)–2020 అవార్డులు ఈ ఏడాది రాష్ట్రానికి 11 దక్కాయి. పారిశుధ్యం, ప్రజా సేవలు (తాగునీరు, వీధి దీపాలు, మౌలికవసతులు), సహజ వనరుల నిర్వహణ, అట్టడుగు వర్గాలు (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, వయో వృద్ధులు), సామాజికరంగ పనితీరు, విపత్తు నిర్వహణ, గ్రామ పంచాయతీల అభివృద్ధికి వ్యక్తిగత సహాయం, ఆదాయ ఆర్జనలో కొత్తవిధానాలు, ఇ–గవర్నెన్స్ విభాగాల్లో ఆయా పంచాయతీరాజ్ సంస్థలు తీసుకునే ఉత్తమ చర్యలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులు ఇస్తారు. ఈ ఏడాది అవార్డుల జాబితాను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ సంజీబ్ పత్‌జోషి ఇటీవల వెల్లడించారు. రాష్ట్రంలో ఒక జిల్లా పరిషత్, నాలుగు మండల పరిషత్‌లు, ఆరు గ్రామ పంచాయతీలు ఈ ఏడాది అవార్డులను దక్కించుకున్నాయి. అవార్డులు ఇలా.. జిల్లా స్థాయిలో– పశ్చిమ గోదావరి మండల స్థాయిలో– రామచంద్రాపురం, బంగారుపాళెం (చిత్తూరు జిల్లా), మేడికొండూరు (గుంటూరు జిల్లా), చెన్నూరు (వైఎస్సార్ జిల్లా) గ్రామ పంచాయతీ స్థాయిలో– కొండకిందం (విజయనగరం జిల్లా), వేములకోట, కురిచేడు (ప్రకాశం జిల్లా), చెల్లూరు (తూర్పు గోదావరి జిల్లా), అంగలకుదురు, కొట్టెవరం (గుంటూరు జిల్లా). -
20 కోట్ల మొక్కలు లక్ష్యంగా..
సాక్షి, హైదరాబాద్: ‘మొక్క’వోని దీక్షతో మరోసారి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 20.8 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు, హరితహారం కార్యక్రమాన్ని తక్షణమే ప్రారంభించాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశించింది. కోటి చింత మొక్కలు.. మియావాకీ వనాలు హరితహారంలో భాగంగా ఈ ఏడాది కోటి చింత మొక్కలను నాటనున్నారు. అటవీ ప్రాంతాల్లో ఫల వృక్షాలు గణనీయంగా తగ్గిపోవడంతో జనావాస ప్రాంతాలకు వస్తున్న కోతుల బెడదను అరికట్టడానికి సాధ్యమైనంతవరకు పండ్ల మొక్కలను అభివృద్ది చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా కోటి చింత మొక్కలకు ప్రాణం పోసేలా కార్యాచరణ ప్రణాళిక తయారు చేశారు. గ్రామ పంచాయతీలు, అటవీ ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ ప్రదేశాల్లో వీటిని విరివిగా నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చింతపండుకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నందున ఈ మొక్కల పెంపకానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరోవైపు పచ్చదనంతో ఆహ్లాదకరంగా కనిపించే మియావాకీ వనాలను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఒకే చోట గుబురుగా పెరిగే ఈ వనాలతో ఆ ప్రదేశం ఆకుపచ్చగా కనిపించడమేగాకుండా.. పర్యావరణ సమతుల్యతను కూడా కాపాడవచ్చని అంచనా వేస్తున్న ప్రభుత్వం.. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో 4వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, స్థానిక ప్రజలు తమ ఇంటి పెరట్లో పెంచుకునేందుకు వీలుగా మొక్కలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీనికి తగ్గట్టుగా స్థానిక నర్సరీల్లోని మొక్కలను ఇప్పటికే సిద్ధం చేశారు. వ్యవసాయ అటవీ విస్తరణలో భాగంగా వెదురు మొక్కలను బాగా నాటాలని, అప్రోచ్ రోడ్లు, ప్రధాన రోడ్ల కిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్‌ను చేపట్టాలని నిర్ణయించింది. జీవాలనుంచి మొక్కలను కాపాడేందుకు ఫైబర్ ట్రీ గార్డులు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. కాగా, పంచాయతీలు, పురపాలికల్లో 85 శాతం మొక్కలు బతకకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతోంది. అలాగే ప్రతి శుక్రవారం మొక్కలకు నీరుపోసేలా వాటరింగ్ డేను పాటించాలని నిర్ణయించింది. -
మండల, జిల్లా పరిషత్‌లకూ నిధులు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం చల్లని కబురు పంపింది. పంచాయతీరాజ్ సంస్థలకు మూడంచెల్లో నిధులు సర్దుబాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇన్నాళ్లూ 100 శాతం ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలకే విడుదల చేసిన కేంద్ర సర్కారు.. ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో కొంత మేర వాటాను మండల, జిల్లా పరిషత్‌లకు కూడా కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ స్థానిక సంస్థలకు వాటాల వారీగా నిర్దేశించుకోవాలని సూచించింది. పంచాయతీలకు 70 నుంచి 85 శాతం, మండల పరిషత్‌లకు 10 నుంచి 25 శాతం, జిల్లా పరిషత్‌లకు 5 నుంచి 15 శాతం మధ్యన ఖరారు చేసుకునే వెసులుబాటు ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు గ్రామ పంచాయతీలకు 85%, మండల పరిషత్‌లకు 10%, జిల్లా పరిషత్‌లకు 5% నిష్పత్తిలో వాటా ఖరారు చేస్తూ ఉత్తర్వులు (జీవో నం.215) జారీ చేసింది. ఈ ఏడాది నుంచి మనుగడలోకి వచ్చే 15వ ఆర్థిక సంఘం జనాభా ప్రాతిపదికన మన రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థలకు రూ.1,847 కోట్లు కేటాయించింది. దీంట్లో గ్రామ పంచాయతీలకు రూ.1,569.95 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.184.7 కోట్లు, జిల్లా పరిషత్‌లకు రూ.92.35 కోట్ల నిధులు రానున్నాయి. స్థానిక సంస్థలకు ఊరట.. గత ఆర్థిక సంవత్సరం వరకు అమల్లో ఉన్న 14వ ఆర్థిక సంఘం మొత్తం నిధులను నేరుగా పంచాయతీలకే బదలాయించేది. దీంతో ఇతర వనరుల్లేక, ఆర్థిక సంఘం నిధులు కూడా రాక అభివృద్ధి పనులు చేయలేక మండల, జిల్లా పరిషత్‌లు చతికిలపడ్డాయి. అయితే, తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఈ సంస్థలకు ఊరటనిచ్చింది. 13వ ఆర్థిక సంఘం వరకు మూడంచెల వ్యవస్థలైన పంచాయతీ, మండల, జెడ్పీలకు నిర్దేశిత నిష్పత్తిలో నిధులను కేంద్రం విడుదల చేసింది. కేంద్రం లో మోదీ సర్కారు అధికారంలోకి రాగానే ఈ విధానానికి స్వస్తి పలికింది. ఆర్థిక సంఘం నిధుల నుంచి మండల, జిల్లా పరిషత్‌లకు కోత విధించి మొత్తం నిధులను పంచాయతీలకే బదలాయించింది. కాగా, 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ఆధారంగా 2020–21 ఆర్థిక సంవత్స రానికి దేశంలోని 28 రాష్ట్రాలకు రూ.60,750 కోట్లు మంజూరు చేసిన కేంద్రం.. తెలంగాణకు రూ.1,847 కోట్లు నిర్దేశించింది. ఈ నిధులకు సమానంగా మ్యాచింగ్ గ్రాంటు రూపేణా రాష్ట్ర సర్కారు సర్దుబాటు చేయనుంది. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 50 శాతం (టైడ్ గ్రాంట్) నిధులను ప్రజల మౌలిక అవసరాలకు ఖర్చు చేయాలని, మిగతా నిధుల (బేసిక్ గ్రాంట్)ను శాశ్వత పనులకు వెచ్చించాలని స్పష్టం చేసింది. ఈ నిధులను రెండు విడతల్లో విడుదల చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. -
ఊళ్లలో మాస్కు లేకుంటే రూ.1,000 ఫైన్
సాక్షి, హైదరాబాద్: మాస్కు ధరించకుండా గ్రామాల్లో తిరిగితే రూ.1,000 జరిమానా విధించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గ్రామ పంచాయతీలకు అధికారం కట్టబెడుతూ మంగళవారం పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. పనిచేసే చోట్ల, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకుండా కనిపిస్తే ఫైన్ వసూలు చేయాలని స్పష్టంచేశారు. అలాగే వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా పంచాయతీ పాలకవర్గాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీజనల్ వ్యాధులు దరి చేరకుండా పల్లెప్రగతి మాదిరి కార్యక్రమాలను తాజాగా నిర్వహించాలని ఆదేశించారు. అందులో భాగంగా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, శానిటేషన్ కమిటీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని పేర్కొన్నారు. వానాకాలానికి ముందు, తర్వాత పక్కా, కచ్చా మురుగు కాల్వల్లో పూడికతీత తీయాలని, ప్రధాన రోడ్లపై ఉన్న గుంతలను మొరంతో కప్పేయాలని సుల్తానియా సూచించారు. ప్రతి ఇంట్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు ఉండేలా చూడాల్సిన బాధ్యత పంచాయతీలదేనని స్పష్టంచేశారు. రక్షిత నీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రతి పది రోజులకోసారి ట్యాంకులను క్లోరినేషన్ చేయాలని, నీటి నాణ్యతా పరీక్షలు నిర్వహించి గ్రామస్తులకు మాధ్యమాల ద్వారా తెలియజేయాలని ఆదేశించారు. -
కరోనా పనులకు 14వ ఆర్థిక సంఘం నిధులు
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడి చర్యలకు 14వ ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలు వినియోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇప్పటివరకు పారిశుద్ధ్యం, తాగునీరు, మూలపనులకు మాత్రమే ఈ నిధులను ఉపయోగించే అవకాశముండేది. తాజాగా కరోనా నియంత్రణ పనులకు కూడా ఈ నిధులను వాడుకునే వెసులుబాటును కేంద్ర çపంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ కల్పించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా గ్రామాల్లో విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున.. పంచాయతీలకు నిధుల కటకట ఏర్పడింది. తాజాగా గ్రామాల్లోని స్కూళ్లు, రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, పశుసంవర్థక శాఖ కేంద్రాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టాలని సూచించింది. అలాగే శానిటేషన్ పనులు నిర్వహించే సిబ్బందికి హ్యాండ్‌వాష్, మాస్క్‌లను కూడా కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఇదిలావుండగా, 2019–20 వార్షిక సంవత్సరంతో 14వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగిసింది. అయితే, దీన్ని మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పద్దుకింద మిగిలిపోయిన నిధులను వాడుకునేందుకు ఏడాదికాలం కలిసిరానుంది. -
పల్లెకు పైసలొచ్చాయ్...!
విజయనగరం: రెండేళ్లుగా నిధుల కొరతతో సతమతమవుతున్న పంచాయతీలపై కేంద్ర ప్రభు త్వం కరుణ చూపింది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు నిబంధనలను పక్కనపెట్టి 14వ ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేసింది. దీనిద్వారా పల్లెలు పారిశుద్ధ్య, తాగునీటి సమస్యల నుంచి గట్టెక్కేందుకు అవకాశం లభించింది. జిల్లాలో 919 గ్రామ పంచాయతీలకు రూ. 46,46,65,800లు ఆర్థిక సంఘం నిధులు విడుదల చేశారు. ప్రస్తుతం వీటిని పల్లె ఖాతాలకు జమ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరగాల్సిన గ్రామ పంచాయతీల ఎన్నికలు అప్పటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిర్వహించకపోవడంతో నిధులు విడుదల కాకుండా పోయాయి. అప్పటి నుంచి కేవలం సాధారణ నిధులతోనే పల్లెలు నెట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో వణుకుతున్న కష్టకాలంలో నిధులు అందుబాటులోకి రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నాడు సగం నిధులే...: పంచాయతీల్లో సర్పంచుల పదవీకాలం 2018 ఆగస్టుతో పూర్తయింది. అప్పటినుంచి ఎన్నికలు లేకుండా పంచాయతీలన్నీ ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి. ఆ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు సగం మాత్రమే వచ్చాయి. పాలకవర్గాలు లేకపోవడంతో మిగతా నిధులు మంజూరు చేయలేదు. 2019–20 సంవత్సరానికి సంబంధించిన నిధులు నిలిచిపోయాయి. ఇటీవల స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆఖరి నిమిషంలో కరోనా వల్ల అవీ వాయిదా పడ్డాయి. దీనివల్ల 14 ఆర్థిక సంఘం నిధులు మరి రావని ఆందోళన చెందారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విషపు కోరలు చాస్తుండడంతో గ్రామాల్లో నిధుల సమస్య తలెత్తకూడదన్న ఉద్దేశంతో కేంద్రం ఎన్నిక లు నిర్వహించకపోయినా బకాయిలు విడుదల చేసింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ. 46.46 కోట్లు జిల్లాకు మంజూరు చేశారు. జనాభా ప్రాతిపదికన సర్దుబాటు: జిల్లాకు వచ్చిన ఆర్థిక సంఘం నిధులను జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు సర్దుబాటు చేస్తున్నారు. తలసరి రూ.242 చొప్పున పంచాయతీలో ఎంతమంది జనాభా ఉంటే అంత మొత్తం ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులను కొత్త పంచాయతీలకు కూడా జనాభా ప్రాతిపదికన సర్దుబాటు చేయాల్సి ఉంది. నిబంధనలకు లోబడే వినియోగం: నిధులు అందుబాటులో ఉన్నాయని ఇష్టానుసారం ఖర్చు చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా అవసరాలకు దామాషా ప్రకారం ఖర్చుచేయాల్సి ఉంటుంది. మంజూరైన రూ. 46.46 కోట్లలో రూ. 4.09 కోట్లు సమగ్ర రక్షిత నీటి పథకాల నిర్వహణకు, మరో రూ.1.60 కోట్లు బోరువావుల నిర్వహణకు జిల్లా పరిషత్‌కు మళ్లించనున్నారు. మిగిలిన రూ. 40.76 కోట్లు పంచాయతీల ఖాతాల్లోకి జమ చేసేందుకు జిల్లా పంచాయతీ ఖాతాల్లోకి సర్దుబాటు చేస్తున్నారు. -
మండల, జిల్లా పరిషత్‌లకు కేంద్ర నిధులు
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లుగా నిధుల లేమితో కొట్టుమిట్టాడిన జిల్లా, మండల పరిషత్‌లకు ఊరట దక్కనుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లోని పంచాయతీరాజ్ సంస్థలకు ఇచ్చే నిధులను గ్రామ పంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్‌లకు సైతం కేటాయించాలని నిర్ణయించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ సంస్థలకు 15 ఆర్థిక సంఘం నిధుల విడుదలకు సంబంధించిన విధివిధానాలు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేసింది. శుక్రవారం రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. మొండిచేయి చూపిన 14వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వం తనకు వచ్చే పన్ను వాటాలో కొంత మొత్తాన్ని ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రాలతో పాటు స్థానిక సంస్థలకు నేరుగా అందజేస్తుంది. 2015 ఏప్రిల్ నుంచి 2020 మార్చి మధ్య ఐదేళ్ల కాలానికి అమల్లో ఉన్న 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్రం విడుదల చేసే నిధుల్లో 100 శాతం నిధులను గ్రామ పంచాయతీలకే కేటాయిస్తూ అప్పట్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు 13వ ఆర్థిక సంఘం అమల్లో ఉన్నప్పుడు కేంద్రం ఇచ్చే నిధుల్లో 70 శాతం గ్రామ పంచాయతీలకు, 20 శాతం జిల్లా పరిషత్‌లకు, 10 శాతం మండల పరిషత్‌లకు కేటాయించేవారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా మండల, జిల్లా పరిషత్‌లు నిధులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా నిధులివ్వకపోవడంతో మండల, జిల్లా పరిషత్‌ల్లో అభివృద్ధి నిలిచిపోయింది. రాష్ట్రాలకు కొంత స్వేచ్ఛ కేంద్రం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 70–85 శాతం నిధులను గ్రామ పంచాయతీలకు.. 10–25 శాతం నిధులను మండల పరిషత్‌లకు.. 5–15 శాతం నిధులను జిల్లా పరిషత్‌లకు కేటాయించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది. నిర్ణీత పరిమితికి లోబడి ఎంతెంత కేటాయింపులు చేయాలన్న దానిపై రాష్ట్రాలకు కొంత స్వేచ్ఛ ఇస్తున్నట్టు పేర్కొంది. రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్నచోట(ఆంధ్రప్రదేశ్ కాదు) గ్రామ పంచాయతీలకు 70–85 శాతం.. జిల్లా పరిషత్‌లకు 15–30 శాతం నిధులు కేటాయించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,625 కోట్లు 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీలోని గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లకు కలిపి రూ.2,625 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రానికి రూ.1,847 కోట్లు కేటాయించింది. పరిమితికి లోబడి ఏ పంచాయతీరాజ్ సంస్థకు ఎన్ని నిధులను కేటాయిస్తారన్న వివరాలను ఏప్రిల్‌లోగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖకు తెలియజేస్తే జూన్‌లో మొదటి విడత నిధులు విడుదల చేస్తామని కేంద్రం వెల్లడించింది. -
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాడేపల్లి మున్సిపాలిటీలో 8 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రూరల్ మండలంలోని పెనుమాక, ఉండవల్లి, ఇప్పటం, మల్లెంపూడి, చిర్రావురు, వడ్డేశ్వరం, గుండిమెడ, ప్రాతురు గ్రామాలు తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి. ఈ మేరకు ఎనిమిది గ్రామ పంచాయతీలను పంచాయతీరాజ్ శాఖ డీనోటిఫై చేసింది. (సీఆర్డీఏ చట్టంలో ఎక్కడుంది?) -
ఆ సెక్షన్లు.. రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీలు, మండల ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రజా పరిషత్‌ల్లో రిజర్వేషన్లకు ఉద్దేశించిన పంచాయతీరాజ్ చట్టం 9, 15, 152, 153, 180, 181 సెక్షన్లను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సెక్షన్లను రాజ్యాంగ, చట్ట విరుద్ధంగా ప్రకటించి కొట్టివేయాలని కోరుతూ కర్నూలు జిల్లాకు చెందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 28న జారీ చేసిన జీవో 176ని కూడా ప్రతాప్‌రెడ్డి సవాలు చేశారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరపనుంది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమే కాకుండా కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సైతం విరుద్ధమని ప్రతాప్‌రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యను అడ్డుకోకుంటే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. తొలుత జనాభా గణన చేపట్టాలి... పంచాయతీరాజ్ చట్టంలోని 9, 15, 152, 153, 180, 181 సెక్షన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం ప్రభుత్వానికి ఉన్నా 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లను ఏ ప్రాతిపదికన ఖరారు చేశారో తెలియచేయడం లేదన్నారు. ఎటువంటి శాస్త్రీయ సర్వే చేయకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా రిజర్వేషన్లు ఖరారు చేసిందన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం సరికాదన్నారు. ఎస్సీ, ఎస్టీలతో పోలిస్తే బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం తప్పనిసరి కాదని, ఇదే విషయాన్ని రాజ్యాంగ నిబంధనలు చెబుతున్నాయన్నారు. బీసీలకు రిజర్వేషన్ల కల్పన ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అసాధారణ పరిస్థితుల్లోనే రిజర్వేషన్లు 50% దాటవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. బీసీలకు వారి జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే తొలుత జనాభా గణన జరగాల్సిన అవసరం ఉందన్నారు. అత్యవసర విచారణకు నిరాకరణ ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది మంగళవారం ఉదయం సీజే నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీనికి నిరాకరించిన ధర్మాసనం బుధవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఇదే రీతిలో జీవో 176ని సవాలు చేస్తూ పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. -
‘స్థానిక’ సందడి!
ఈసారి మనూరి ప్రెసిడెంట్‌గా వెంకట్రావు పోటీ చేస్తానంటున్నాడట..! ఎంపీటీసీకి పోటీ చేయడానికి ప్రతాప్‌రెడ్డి రెడీ అవుతున్నాడు. వీలైతే మండల ప్రెసిడెంట్ కావాలని ప్రయత్నిస్తున్నాడు..!! సాక్షి, అమరావతి: త్వరలో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ ఎన్నికలు వరుసగా జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు ఏ ఊరిలో చూసినా ఇలాంటి చర్చలే జోరుగా సాగుతున్నాయి. మార్చి నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ప్రక్రియ వేగం అందుకుంది. స్థానిక సంస్థల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనే లక్షన్నరకు పైగా పదవులకు పోటీ జరగనుంది. దాదాపు ఆరున్నర ఏళ్ల తరువాత పంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. తెరపైకి కొత్త తరం! రాజకీయాల ద్వారా సామాజిక సేవ చేయాలని ఎన్నికల్లో పోటీకి యువతరం అసక్తి చూపుతోంది. యువ సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు మహిళలకు కూడా సమాన అవకాశాలు దక్కాలన్న ఉద్దేశంతో పార్టీ, ప్రభుత్వపరంగా ప్రోత్సాహంఅందిస్తుండటం యువత ముందుకు రావటానికి కారణమని విశ్లేషిస్తున్నారు. కొత్తవి ఏర్పాటు, విలీనంపై నిషేధం ఎత్తివేత గ్రామ పంచాయతీలను విడదీసి కొత్తవి ఏర్పాటు చేయడం, ప్రస్తుతం పంచాయితీలుగా ఉన్న వాటిని రెండు మూడు కలిపి ఒకటిగా విలీనం చేయడంపై ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి నిషేధం అమలులో ఉంది. పలుచోట్ల నుంచి అందుతున్న విజ్ఞప్తుల మేరకు నాలుగు రోజుల క్రితం నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. డిసెంబరు 20 నాటికి జిల్లాల నుంచి అందే వినతుల మేరకు కొత్త పంచాయతీల ఏర్పాటు, విలీనం ప్రక్రియను చేపట్టి ఆ తర్వాత తిరిగి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ చివరి వరకే గడువు 2020 జనవరి నుంచి దేశవ్యాప్తంగా జనగణన మొదలు కానున్న నేపథ్యంలో గ్రామ, మండల, జిల్లా, పట్టణ ప్రాంతాల సరిహద్దుల్లో మార్పులు చేర్పులు చేయదలిస్తే డిసెంబరు నెలాఖరుకే పూర్తి చేయాలని సూచిస్తూ కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. జనవరి నుంచి ఆయా ప్రాంతాలలో మార్పులు చేర్పులకు తావు ఉండదని అధికారులు చెబుతున్నారు. కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ గ్రామ పంచాయతీలతోపాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల హడావుడి మొదలైన నేపధ్యంలో పంచాయితీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పని చేసేందుకు సిబ్బందిని తాత్కాలికంగా డిప్యుటేషన్, ఔట్సోర్సింగ్ విధానంలో నియమించుకునేందుకు అనుమతి కోరుతూ కమిషనర్ కార్యాలయం ప్రభుత్వానికి లేఖ రాసింది. సిద్ధంగా ఉన్నాం.. రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రకటన చేసిన వెంటనే అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు పంచాయితీరాజ్ శాఖ సిద్ధంగా ఉంది. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పూర్తి పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తి చేస్తాం. – గిరిజాశంకర్ (పంచాయితీరాజ్ శాఖ కమిషనర్) పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలు - ప్రస్తుతం గ్రామ పంచాయతీలుగా ఉన్న 249 గ్రామాలను పట్టణాలుగా మార్పు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందినట్టు అధికారులు చెబుతున్నారు. - 78 పంచాయతీలను కొత్తగా 36 నగర పంచాయితీలుగా మార్చే ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉంది. - వివిధ పట్టణాలు, నగర పాలక సంస్థలకు చుట్టుపక్కల ఉండే మరో 97 గ్రామాలను సమీప పట్టణాల్లో విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఇవికాకుండా కలెక్టర్ల వద్ద మరో 74 ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. - రెండు మూడు గ్రామాలు కలిపి ఒక పంచాయతీగా ఉన్న చోట్ల వాటిని వేరు చేసి కొత్తవి ఏర్పాటు చేయాలంటూ మరో 60 దాకా ప్రతిపాదనలు అందాయి. -
‘నిన్ను చంపి.. నేనూ చచ్చిపోతా’
నరసన్నపేట (శ్రీకాకుళం): తన పొలంలో మురుగు కాలువ నిర్మించినందుకు చాలా కాలంగా అభ్యం తరం చెబుతున్న ఓ రైతు మహిళ పంచాయతీ కార్యదర్శిని చంపేసి తానూ చచ్చిపోతానని బెదిరించాడు. వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను వంటిపై పోసు కునే ప్రయత్నం చేయడంతో రైతు భరోసా గ్రామ సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. వివరాలివీ.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మం డలం దూకలపాడులో బుధవారం వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో రైతు భరోసా గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఆ సభకొచ్చిన అల్లు జగన్మోహనరావు అనే రైతు గ్రామ పంచాయతీ కార్యదర్శి జె.సుమలతపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ‘నా పొలంలో మురికి కాలువ తవ్విస్తావా.. నాకు ప్రభుత్వం నుంచి ఏ పథకం రాకుండా చేస్తావా’ అంటూ దూషించాడు. ‘నిన్ను పెట్రోల్ పోసి చంపేస్తా.. నేనూ పెట్రోల్ పోసుకుంటా’ అంటూ బ్యాగ్‌లోంచి పెట్రోల్ బాటిల్ తీసి తన శరీరంపై పోసుకోబోయాడు. స్థానికులు అడ్డుకోవడంతో సభలో ఉన్న అధికారులు, ఇతరులపై పెట్రోల్ పడింది. అగ్గిపుల్ల తీయడానికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో మహిళా అధికారులు, వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. పంచాయతీ కార్యదర్శి సుమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రైతును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై డీపీవో సమీక్షించారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఫోన్లో పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి అధైర్యపడవద్దని చెప్పారు. నిర్భయంగా విధులు నిర్వహించాలని, తప్పులు జరగకుండా చూసుకోవాలని సూచించారు. -
పల్లె సేవలో ప్రవాసులు
సాక్షి, నెట్వర్క్: కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలలో ఎన్ఆర్ఐలను కోఆప్షన్ సభ్యులుగా నియమించడానికి అవకాశం ఏర్పడింది. దీంతో పలు పల్లెల్లో కోఆప్షన్ సభ్యులుగా ప్రవాసులు పదవులు పొందారు. సీనియర్ సిటిజన్ లేదా ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి ఒకరు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, ఎన్ఆర్ఐ కోటాలో మరో వ్యక్తిని కోఆప్షన్ సభ్యులుగా నియమించడానికి పంచాయతీరాజ్ శాఖ అనుమతి ఇచ్చింది. గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లి వచ్చిన ఎంతో మంది కోఆప్షన్ పదవిని అలంకరించారు. సవరించిన పంచాయతీరాజ్ చట్టం ద్వారా తమకు ఒక మంచి అవకాశం లభించిందని, పంచాయతీల అభివృద్ధికి సహాయం అందిస్తామని వారు చెబుతున్నారు. ఇప్పటికే పలు గ్రామాలలో గల్ఫ్ వలస జీవులు అభివృద్ధి పనులకు చేయూత ఇచ్చారు. ఇలా.. ఊరికి ఉపకారం చేసిన వారిపై అభిమానంతో వారిని గ్రామస్తులు కోఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేసుకున్నారు. పల్లెల అభివృద్ధిలో భాగస్వాములైన గల్ఫ్ వలస జీవుల మనోగతం వారి మాటల్లోనే... సమష్టిగా సమస్యల పరిష్కారం బతుకుదెరువు కోసం పదిహేనేళ్లు దుబాయికి వెళ్లా. అక్కడ సెంట్రింగ్ కార్మికునిగా పనిచేశా. నాలుగేళ్ల క్రితం దుబాయి నుంచి వచ్చి.. స్థానికంగానే పనిచేస్తున్నా. ఇటీవల గ్రామ పంచాయతీ కోఆప్షన్ సభ్యుడిగా నన్ను ఉండాలన్నరు. సీనియర్ సిటిజన్ కోటాలో ఎన్నికయ్యా. మా తండ్రి శివయ్య జ్ఞాపకార్థం బస్‌షెల్టరు నిర్మిస్తా. – మ్యాదరి దేవయ్య, జోగాపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఊరు కోసం పనిచేస్తా.. మాది సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట. ఉపాధి కోసం 2008లో మస్కట్ వెళ్లి కూలీ పనులు చేశాను. అక్కడ ఆరేళ్ల పాటు ఉన్నా. జీతం కొద్దిగా ఉండడంతో 2014లోగ్రామానికి వచ్చిన. అప్పటి నుంచి ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ కిరాణం షాపు నడిపించుకుంటున్నా. నన్ను కోఆప్షన్ సభ్యుడిగా ఉండాలని గ్రామస్తులు కోరితే ముందుకు వచ్చా. భవిష్యత్‌లోనూ ఊరు కోసం పనిచేస్తా. – చిగుర్ల మల్లేశం పేదలకు సేవ చేస్తా.. నాది చందుర్తి మండలం జోగాపూర్. ఉపాధి కోసం దుబాయికి వెళ్లాను. ఎనిమిదేళ్లు అక్కడే కంపెనీలో పనిశాను. పదేళ్ల క్రితం గ్రామానికి వచ్చి ఇక్కడే ఉంటున్నా. దేవాలయాల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాను. ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులు మృతిచెందగా.. అ చిన్నారుల పేరుపై రూ.1.80 లక్షలు ఫిక్స్ డిపాజిట్ చేయించా. నిరుపేద కుటుంబాలకు సహాయం చేయాలనే సంకల్పంతో ముందుకుసాగుతున్నా. నన్ను గ్రామపంచాయతీ కోఆప్షన్ సభ్యునిగా ఎన్నుకున్నారు. – మ్యాకల పరశురాములు నా వంతు సాయం.. ఏడు సంవత్సరాలు గా దుబాయిలో వలస కూలీగా ఉన్నా. కొ న్నేళ్లుగా ఊరికి దూరమయ్యాను. అప్పుడప్పుడు ఊరికి వస్తే.. ఇక్కడే ఉండాలనిపించేది. ఈ మధ్యనే గ్రామానికి వచ్చేశాను. ఇక ఊళ్లోనే ఉండాలని.. అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోఆప్షన్ సభ్యుడిగా నియామకమయ్యాను. ప్రజలకు సేవ చేయాలనేదే నా కోరిక. – మహమ్మద్ ఫసి, నర్సాపూర్(జి),నిర్మల్ జిల్లా గ్రామాన్ని మారుస్తా.. నేను పదేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయికి వెళ్లాను. అక్కడ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాను. ఇటీవల గ్రామానికి తిరిగి వచ్చాను. మా గ్రామస్తులు నన్ను కోఆప్షన్ మెంబర్‌గా ఎన్నుకున్నారు. దుబాయిలో పారిశుద్ధ్యం తీరును చూసిన నేను.. మా గ్రామంలో కొంతవరకైనా అమలు చేయాలనుకుంటున్నా. గ్రామాభివృద్ధికి చేయూత ఇస్తా.– సంజీవ్‌రెడ్డి, కుమ్మర్పెల్లి, రాయికల్‌మండలం, జగిత్యాల జిల్లా సేవ చేసే అవకాశం దక్కింది నేను తిమ్మాపూర్‌కు కోఆప్షన్ సభ్యునిగా ఎన్నికయ్యాను. ఈ పదవి ద్వారా మా గ్రామానికి సేవ చేసే అవకాశం దక్కింది. కువైట్, దుబాయిలలో వ్యాపారం చేస్తున్ననేను మా గ్రామానికి ఏదైనా చేయాలని భావించాను. కోఆప్షన్ సభ్యునిగా ఎంపిక చేయడంతో గ్రామానికి ఆర్థికంగా చేయూత ఇవ్వడానికి సిద్ధమయ్యాను. సొంత గ్రామం రుణం తీర్చువకోవాడానికి ఇది అవకాశం అనుకుంటున్నా.– దాసరి సంతోష్, తిమ్మాపూర్, మోర్తాడ్ (నిజామాబాద్ జిల్లా) గ్రామాభివృద్ధికి బాటలు వేస్తాం.. మా సొంత ఊరు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవి పదిర. నేను దుబాయికి సామాన్య కార్మికుడిగా వెళ్లాను. అక్కడే కంపెనీ ఏర్పాటు చేశాను. దుబాయిలో ఈటీసీఏ (ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్) అధ్యక్షుడిగా ఉన్నా. మా ఊళ్లో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు చేయూత ఇచ్చాను. గుడిని రూ.1.50లక్షలతో అభివృద్ధి చేశాను. మరో రూ.1.50 లక్షలతో స్కూల్‌కు ఫర్నిచర్ అందించాను. ఆడ పిల్లల పెళ్లిళ్లకు పుస్తె, మట్టెలు అందిస్తున్నా. మున్ముందు కూడా గ్రామాభివృద్ధికి సహకారం అందిస్తా. కోఆప్షన్ సభ్యుడిగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు. – రాధారపు సత్యం, అడవి పదిర పేదలకు సాయం చేస్తా.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మల్లారం సొంత ఊరు. పదేళ్లుగా దుబాయిలో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నా. నెలకోసారి ఇంటికి వస్తా. మా ఊరిలో పేదలకు సాయం చేస్తా. గ్రంథాలయ అభివృద్ధికి సహకారం అందించాను. స్కూల్ పిల్లలకు పుస్తకాలు, ప్రొజెక్టర్ అందించా. ఇటీవలే గ్రామాభివృద్ధి కోసం కొత్త పాలకవర్గానికి సహకారం అందించాను. నేను దుబాయిలో ఉండగానే నన్ను గ్రామపంచాయతీ కోఆప్షన్ సభ్యుడిగా ఎనుకున్నందుకు సంతోషం. గ్రామానికి మరింత చేయూతనిస్తా. – కొమ్ము అశోక్ అందరి సహకారంతో ఎన్నిక.. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్. నేను 2006లో గల్ఫ్ వెళ్లాను. అక్కడే రెండేళ్లు పనిచేశాను. దుబాయిలో మన వాళ్లు పడే కష్టాలను కళ్లారా చూశాను. ఇంటికి వచ్చి మళ్లీ వ్యవసాయం చేశాను. ఈ మధ్యనే సిరిసిల్లలో ప్రైవేటుగా ఉద్యోగం చేస్తున్నా. ఊళ్లో ఏ పని జరిగినా నేను అందరితో పాటు పాల్గొంటా. ఇటీవల గ్రామ కోఆప్షన్ సభ్యుడిగా ఎన్నికయ్యా. పాలకవర్గం సభ్యుల సహకారంతో గ్రామాభివృద్ధికి పాటుపడుతా.– కనమేని శ్రీనివాస్‌రెడ్డి ఊరిని తీర్చిదిద్దుతాం.. రుద్రంగి మండలం మానాల శివారులోని గైదిగుట్టతండా మా స్వగ్రామం. మునుపు మా ఊరు నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉండేది. నేను రెండేళ్ల పాటు సౌదీ అరేబియా వెళ్లి వచ్చా. ఇప్పుడు ఇక్కడే వ్యవసాయం చేస్తున్నా. మా తండా కొత్తగా గ్రామ పంచాయతీ అయింది. నాకు గ్రామ కోఆప్షన్ సభ్యుడిగా అవకాశం లభించింది. ఊరిలో వీధులను అందంగా తీర్చిదిద్దేందుకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని సంకల్పించా. అందరం సమష్టిగా ఊరును అభివృద్ధి చేసుకుంటాం.– ధరావత్ రవి సేవకు గుర్తింపు లభించింది మాది రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి. నేను 14 ఏళ్లు దుబాయికి వెళ్లా.ఆర్థిక పరిస్థితి మెరుగయ్యాక ఇంటికి వచ్చాను. ఊరిలో సాయిబాబాఆలయ అభివృద్ధికి రూ.4 లక్షలు ఇచ్చా. కళాశాలలో విద్యార్థులకు కంప్యూటర్లు సమకూర్చాను. ట్రీ గార్డులకు ఆర్థిక సాయం అందించా.నేను ఊరికి చేసిన సేవలను గుర్తించి గ్రామ పంచాయతీ కోఆప్షన్ సభ్యుడిగా ప్రజలు అవకాశం ఇచ్చారు. భవిష్యత్‌లోనూ ఊరి అభివృద్ధికి నా వంతు సహకారం ఉంటుంది. – ఎర్రం గంగనర్సయ్య -
పల్లెలో నవ వసంతం
సాక్షి, అమరావతి: మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా రాష్ట్రంలో అడుగులు పడుతున్నాయి. గ్రామీణాంధ్రప్రదేశ్‌లో ఇక నవ వసంతం వెల్లివిరియనుంది. గ్రామ ప్రజల సమస్యలన్నింటికీ సత్వర పరిష్కారం చూపేలా ఒకే వేదిక తుదిమెరుగులు దిద్దుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2వ తేదీ నుంచి కొత్తగా ప్రవేశ పెట్టనున్న గ్రామ సచివాలయ వ్యవస్థ ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపనుంది. చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితిలో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో విన్నవించిన 72 గంటల్లోనే సమస్యలకు సత్వర పరిష్కారం చూపేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక ఉద్యోగులు, సిబ్బంది నియామక ప్రక్రియ సైతం పూర్తికావచ్చింది. ప్రభుత్వం ద్వారా పరిష్కారం కావాల్సిన ప్రజల కనీస ఇబ్బందులు, సమస్యలు, వినతులు గ్రామ స్థాయిలోనే పరిష్కరించేందుకు సచివాలయ వ్యవస్థను ప్రారంభించబోతున్నట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూపుదిద్దుకున్న గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు, విద్యార్థులకు అవసరమైన వివిధ సర్టిఫికెట్లు వెంటనే అందనున్నాయి. గ్రామంలో రైతుల సమస్యలు, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు దృష్టి సారించి అవసరమైన సేవలు అందించే అవకాశాలు మెరుగు పడతాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న 13,065 గ్రామ పంచాయతీలను 11,158 గ్రామ సచివాలయ కేంద్రాలుగా వర్గీకరించి కొత్త హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఈ భవనాలను రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన రంగులతో అలంకరిస్తున్నారు. కార్యాలయ భవనంపై సీఎం జగన్మోహన్రెడ్డి ఫొటో, ఆ గ్రామం పేరు రాసేలా ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ప్రజల నుంచి అందిన వినతుల మేరకు పింఛన్లు, రేషన్‌కార్డులు, లోన్ ఎలిజిబులిటీ కార్డుల వంటివి మంజూరు అనంతరం సచివాలయంలోనే లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఒక జిల్లాలోని మొత్తం సచివాలయాలకు అవసరమైన సామగ్రిని ఏకమొత్తంగా కొనుగోలు చేస్తారు. ఈ మేరకు 13 జిల్లాలకు కలిపి ప్రభుత్వం ఇప్పటికే రూ.200 కోట్లు విడుదల చేసింది. జిల్లాల్లో కొనుగోలు టెండర్ల ప్రక్రియ సాగుతోంది. కాగా, అక్టోబరు 2వ తేదీన మండలంలో కనీసం ఒక గ్రామంలో గ్రామ సచివాలయం ప్రారంభ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తొలుత రాష్ట్ర వ్యాప్తంగా 661 గ్రామ సచివాలయ భవనాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, ఆయా కార్యాలయాల్లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. చకచకా పనులు విశాఖపట్నం జిల్లాలో తొలిరోజు అక్టోబరు 2వ తేదీన 39 గ్రామ సచివాలయాలను ప్రారంభించనున్నారు. వీటిలో భీమిలి మండలంలోని చేపలుప్పాడ, అన్నవరం, యలమంచిలి మండలంలోని ఏటికొప్పాక గ్రామ సచివాలయాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లాలో 844 గ్రామ సచివాలయాలు, అర్బన్ ప్రాంతాల్లో 306 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్టోబరు 2న మండలానికొకటి చొప్పున మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రారంభించేందుకు ముస్తాబు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో అక్టోబర్ 2వ తేదీన బేతంచర్ల మండలం ఆర్ఎస్ రంగాపురంలోని గ్రామ సచివాలయాన్ని రాష్ట్ర ఆర్థిక, శాసన సభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆలూరులో రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖమంత్రి గుమ్మనూరు జయరాం ప్రారంభించనున్నారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో మోడల్ గ్రామ సచివాలయ భవనం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. తాగు నీటి పైపులైన్, విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. ఫర్నిచర్, స్టేషనరీ, ఒక కంప్యూటర్ సిద్ధం చేశారు. రెండు, మూడు రోజుల్లో రంగులు వేయడం పూర్తవుతుంది. ఈ సచివాలయ భవనాన్ని రాష్ట్ర విద్యుత్, అటవీ పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. యర్రగొండపాలెంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న సచివాలయ భవనం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఇదే రీతిలో అన్ని జిల్లాల్లో పలు గ్రామ సచివాలయాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. మౌలిక వసతులు సమకూరుస్తున్నాం అక్టోబరు 2వ తేదీన మండలానికి ఒక గ్రామంలో గ్రామ సచివాలయాన్ని అన్ని వసతులతో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశాం. ఆయా గ్రామాల్లో సచివాలయ కార్యాలయ భవనాలను జిల్లా అధికారులు కొత్త రంగులతో అలంకరిస్తున్నారు. ఫర్నిచర్, కంప్యూటర్, ప్రింటర్ వంటి ఇతర మౌలిక వసతులను కూడా కల్పిస్తున్నాం. మిగిలిన గ్రామాల్లోని సచివాలయ కార్యాలయాల్లోనూ పర్నిచర్, ఇతర మౌలిక వసతులను దశల వారీగా కల్పిస్తాం. – గిరిజా శంకర్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనుకోలేదు మాది నిరుపేద కుటుంబం. మా నాన్న చిరంజీవులు రోజు కూలీగా కుటుంబాన్ని నెట్టుకువస్తున్నారు. నేను ప్రభుత్వ ఉద్యోగిని అవుతానని అనుకోలేదు. 2008 – 2010లో వెటర్నరీ డిప్లొమా పూర్తి చేశాను. అప్పటి నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను. ఈనాటికి నా కల నెరవేరింది. ఎలాంటి సిఫార్సు లేకుండా ఉద్యోగం పొందాను. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మేలును ఎప్పటికీ మర్చిపోలేం. గ్రామీణులకు సత్వర సేవలు అందేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. – ఎస్.బాలకృష్ణ, పడిమందస గ్రామం, మందస మండలం, శ్రీకాకుళం జిల్లా ►రాష్ట్రంలో మొత్తం గ్రామ పంచాయతీలు 13,065 ►మొత్తం గ్రామ సచివాలయ కార్యాలయాలు 11,158 ►సొంతంగా గ్రామ పంచాయతీ భవనం ఉన్న గ్రామాలు 7,500 ►సొంతంగా గ్రామ పంచాయతీ భవనం లేని గ్రామాలు (అద్దె) 1850 ►అదనంగా గ్రామ పంచాయతీ భవనాలు అవసరం ఉన్న గ్రామాలు (అద్దె) 1,800 ►వీటన్నింటిలో పని చేసే ఉద్యోగుల సంఖ్య దాదాపు 1,34,524 ►శాశ్వత భవనాల విస్తీర్ణం చదరపు అడుగులు 2800 సచివాలయ సామగ్రి : 2 కంప్యూటర్లు, 2 ప్రింటర్లు, స్కానర్లు, ఇంటర్నెట్ సౌకర్యం, బయోమెట్రిక్ డివైస్, ఆధార్ ఎనేబుల్డ్ ట్యాబ్‌లు, 10 టేబుళ్లు, 30 కుర్చీలు, 6 టేబుల్ ర్యాకులు, ఒక బీరువా -
పంచాయతీలకు డిజిటల్ ‘కీ’
సాక్షి, పాలకుర్తి(రామగుండం): గ్రామ పంచాయతీల్లో నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. డిజిటల్ ‘కీ’ ద్వారా చెల్లింపులు జరిపేందుకు చర్యలు చేపట్టింది. ఈమేరకు దీనికి సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. గతంలో గ్రామ పంచాయతీల్లో వినియోగించిన నిధుల విడుదల చెక్కుల రూపంలో ఉండేది. కొన్ని చోట్ల పంచాయతీల తీర్మానం లేకుండానే నిధులు దుర్వినియోగం చేస్తుండటంతో ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచులు సస్పెండ్‌కు గురికావడం, విచారణను ఎదుర్కోవడం వంటి సమస్యలు ఎదురయ్యేవి. ఈ నేపథ్యంలో అలాంటి అక్రమాలకు చెక్‌పెట్టి పంచాయతీ నిధుల వినియోగంలో పారదర్శకతను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్‘కీ’ పేరుతో కొత్త విధానాన్ని రూపొందించింది. సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకాలతో.. గతంలో పంచాయతీ నిధుల వినయోగం విషయంలో గ్రామ కార్యదర్శితోపాటు సర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టం ఆధారంగా సర్పంచ్, ఉప సర్పంచ్‌కు చెక్‌పవర్ కల్పించారు. దీంతో ఇద్దరి సంతకాలు సేకరించి డిజిటల్ ‘కీ’ల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా సర్పంచులు, ఉప సర్పంచ్ల వివరాలు, వారి సంతకాలతో కూడిన ఫారంలను నింపి డిజిటల్ ‘కీ’ తయారీ కోసం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈబాధ్యతను ప్రభుత్వం ఓప్రైవేటు ఏజెన్సీకి అప్పగించి పనులను నిర్వహిస్తోంది. డిజిటల్‘ కీ’ ద్వారానే చెల్లింపులు.. పంచాయతీలకు మంజూరైన 14వ ఆర్థిక సంఘం నిధులతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులతో చేపట్టే పనులకు ఇక నుంచి డిజిటల్ ‘కీ’ ద్వారానే చెల్లింపులు జరుపనున్నారు. దీంతో జవాబుదారీతనం పెరిగి పంచాయతీ నిధుల స్వాహాకు చెక్ పడనుంది. తప్పుడు రికార్డులు, పనులు చేయకున్నా చేసినట్లు చూపే అవినీతి విధానానికి అడ్డుకట్టపడనుంది. దొంగ సంతకాలు, ఫోర్జరీలు చేసి నిధులను స్వాహా చేసే యత్నాలకు తావులేకుండా ఉంటుందని, ఈవిధానం ద్వారా నిధుల చెల్లింపులు జరుగుతాయి, ఏపనికి ఎంత చెల్లించాలనే విషయాలు స్పష్టంగా రికార్డు చేసి నిధులు విడుదల చేయనున్నారు. దీంతో పనులు చేయకుండానే నిధులు విడుదల చేస్తే దొరికిపోయే అవకాశాలు ఉన్నాయి. చెక్కులకు కాలం చెల్లినట్లే.. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలల్లో నిధుల వినియోగానికి సంబంధించి చెక్కుల రూపంలో చెల్లింపులు జరిగేవి. ప్రతీ పంచాయతీకి ప్రత్యేకంగా ఒక బ్యాంక్ ఖాతాను తెరచి నిధులను ఖర్చు చేసేవారు. గ్రామ అభివృద్ధికి మంజూరైన నిధులను విడుదల చేసేందుకు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఇద్దరు సంతకం చేసి ట్రెజరీ కార్యాలయానికి తీసుకెళితే అన్నీ సరిగాఉండి ఆమోదం పొందితేనే నిధులను విడుదల చేసుకునే అవకాశం ఉండేది. అయితే కొందరు తప్పుడు వివరాలు సమర్పించి నిధులను కాజేసిన సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి. ఇలా జరుగకుండా ఉండేందుకు ప్రస్తుతం చెక్కుల విధానాన్ని తొలగించి ఈ–కుభేర్ ద్వారా బ్యాంక్‌లకు వెళ్లకుండా డిజిటల్ ‘కీ’ల ద్వారా నేరుగా బ్యాంక్ నుంచి చెల్లింపులు జరుగుతాయి. ప్రస్తుత 14వ ఆర్థికసంఘం నిధులు విడుదల చేసుకోవాలంటే చెక్కు అవసరం లేదు. ఆన్లైన్లో నమోదు చేసిన సర్పంచ్, ఉప సర్పంచుల డిజిటల్ సంతకాలను సరిపోల్చిచూసి, పంచాయతీ అధికారుల అనుమతి తర్వాత డిజిటల్ ‘కీ’ వస్తుంది. ఈ ‘కీ’లను ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించిన ట్రెజరీ కార్యాలయాలకు సమర్పించనున్నారు. ఆన్లైన్ ద్వారా లావాదేవీలు.. జిల్లా వ్యాప్తంగా 223 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఆన్లైన్ ద్వారా పనులు నిర్వహించే దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నూతన ఇంటి నిర్మాణ అనుమతులు, ట్రైడ్ లైసెన్స్‌లు, ఆస్తి మార్పిడి, లే అవుట్ల అనుమతులకు సంబంధించిన సేవలను ఆన్లైన్లో చేపడుతున్నారు. ఈసేవలన్నీంటికీ గ్రామ పంచాయతీ కార్యదర్శిని బాధ్యులుగా చేసి వారి సంతకాలను కూడా డిజిటల్ చేశారు. వీటితోపాటు జనన, మరణ, వివాహా ధ్రువీకరణ పత్రాలను ఆయా గ్రామపంచాయతీల్లోనే జారీ చేయనున్నారు. ఈసేవలన్నీంటినీ ఆన్లైన్ ద్వారా అందిస్తుండటంతో అవినీతి, అక్రమాలకు చోటు ఉండదు. అదేవిధంగా నిధుల విడుదలలో డిజిటల్ ‘కీ’తో పాలన మరింత పారదర్శకంగా జరిగే అవకాశం ఉంది. ఆన్లైన్ సేవలతో మేలు గ్రామ పంచాయతీల ద్వారా అందించే సేవలను ఆన్లైన్ విధానం ద్వారా అందుతుండటంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. వారు ఇబ్బంది పడకుండా స్థానికంగా అనేక సేవలను సులభంగా అందించే వీలు ఏర్పడుతుంది. ఇంటి నిర్మాణ అనుమతులు, జనన, మరణ, వివాహ ధ్రువీకరణ పత్రాలు సులభంగా పొందవచ్చు. –ఉదయ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి -
సర్పంచ్‌కు ఆ అధికారం లేదు
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని పంచాయతీ చేసే తీర్మానాన్ని అమ లు చేయాలని నోటీసు జారీ చేసే అధికారం గ్రామ సర్పంచ్‌లకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీ తీర్మానాన్ని పంచాయతీ కార్యదర్శి ద్వారా అమలు చేయించాలని చట్టం చెబుతోందని, గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం ప్రకారం నోటీసును నేరుగా గ్రామ సర్పంచ్ జారీ చేసే అధికారం చట్టంలో లేదని తెలిపింది. రంగారెడ్డి జిల్లా శంషా బాద్ మండలం నానాజీపూర్కి చెందిన రైతు వంగ రాఘవరెడ్డి దాఖలు చేసిన కేసులో హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ప్రహరీ నిర్మాణం వల్ల రోడ్డు మూసుకుపోతుందని, అక్రమంగా నిర్మించిన ప్రహరీని తొలగించాలని గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం ప్రకా రం నోటీసును నేరుగా అక్రమ కట్టడానికి పాల్పడిన వ్యక్తికి సర్పంచ్ జారీ చేయడాన్ని తప్పుబడుతూ రాఘవరెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి చేయాల్సిన విధుల్ని సర్పంచ్ చేయడం చట్ట వ్యతిరేకమని, పంచాయతీరాజ్ చట్టంలోని 32 సెక్షన్ ప్రకారం సర్పంచ్‌కు అధికారం పరిమితమని పిటిషనర్ తరఫు న్యాయవాది జనార్దన్‌రెడ్డి వాదించారు. పంచాయతీ చట్టం ప్రకారం పంచాయతీలకు అధికారం ఉంటుందని, పంచాయతీ తీర్మానం ప్రకారం సర్పంచ్ నోటీ సు ఇవ్వొచ్చని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. వాద నలు విన్న హైకోర్టు ‘పంచాయతీ శాఖ కమిషనర్ చట్టంలోని 42వ సెక్షన్ ప్రకారం గ్రామ పంచాయతీ కార్యదర్శిని నియమిస్తారు. కార్యదర్శే పంచాయతీ స్థిరచరాస్తుల రక్షణ, నిర్వహణ బాధ్యతలు నిర్వహించాలి. ఆస్తుల అంశంపై పంచాయతీ పాలకవర్గం చేసే తీర్మానాన్ని కార్యదర్శే అమలు చేయాలి. ఈ కేసులో పిటిషనర్ సర్పంచ్ నేరుగా నోటీసు ఇవ్వడాన్ని సవాల్ చేయడం సరైనదే. సర్పంచ్‌కు నోటీసు ఇచ్చే అధికారం లేదు’ అని స్పష్టం చేస్తూ వ్యాజ్యంపై విచారణ ముగిసినట్లుగా ప్రకటించింది. -
పదునెక్కిన ‘పంచాయతీ’ చట్టం
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులకు కొత్త పంచాయతీరాజ్ చట్టంలో భాగంగా వివిధ విధులు, అధికారాలు, బాధ్యతలను నిర్దేశించారు. కొత్తగా ఎన్నికైన పంచాయతీ పాలకవర్గ సభ్యులంతా తమ విధులను సక్రమంగా నిర్వహించేలా చట్టంలో ఆయా అంశాలు సోదాహరణంగా వివరించారు. గ్రామ ప్రథమ పౌరుడిగా వార్డు సభ్యులకు సర్పంచ్ నేతృత్వం వహిస్తారు. వివిధ రూపాల్లో పంచాయతీకి వచ్చే అన్నిరకాల నిధులను సమర్థవంతంగా నిర్వహించేలా వార్డుమెంబర్లకు సర్పంచ్ చేదోడువాదోడుగా నిలుస్తారు. సర్పంచ్‌లు, పాలకవర్గాలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా ఈ చట్టంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సర్పంచ్ల విధులు, బాధ్యతలు.. ►చట్టం లేదా ప్రభుత్వ నిబంధనల ద్వారా సంక్రమించిన అధికారాలు వినియోగించుకుని సర్పంచ్ తన విధులు నిర్వహిస్తారు. ►పంచాయతీ కార్యదర్శి కార్యకలాపాలపై సర్పంచ్‌కు పరిపాలనాపరమైన అధికారం. గ్రామ పంచాయతీలు, ఇతర కమిటీలలో ఆమోదించిన తీర్మానాల అమలుకు పంచాయతీ కార్యదర్శుల విధులపై సర్పంచ్ల పర్యవేక్షణ ఉంటుంది. ►రోజువారీ పనుల నిమిత్తం ప్రభుత్వ ఆమోదం మేరకు డబ్బు ఖర్చుచేసే అధికారం సర్పంచ్‌లకు ఉంటుంది. ఈ మేరకు చేసిన వ్యయాలకు తదుపరి పంచాయతీ సమావేశంలో ఆమోదం పొందాలి. పంచాయతీల ఆమోదం మేరకు చెల్లింపులు, ధరావతు చెల్లింపులు జరుపుతారు. చెల్లింపు విషయంలో గ్రామపంచాయతీ తీర్మానాలకు లోబడే సర్పంచ్ పనిచేయాలి ►గ్రామంలో పారిశుద్ధ్యం సక్రమంగా ఉండేలా సర్పంచ్ బాధ్యత వహిస్తారు. ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శిచేసే పనుల పరిశీలన, పారి«శుధ్య కార్మికులు తమ విధులకు సక్రమంగా హాజరయ్యేలా పర్యవేక్షిస్తారు. ► ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా చూడాలి. శిథిలాలు తొలగించాలి. పాడుబడిన బావులు, నీటి గుంటలు పూడ్చేయాలి. పిచ్చిచెట్లు నరికివేయాలి. ► పంచాయతీకి విధించిన లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ఉద్దేశించిన హరితహారం కార్యక్రమాన్ని సర్పంచ్ పరిశీలించాల్సి ఉంటుంది. ప్రతియేటా నాటిన మొక్కల్లో కనీసం 85 శాతం పెరిగి పెద్దవయ్యేలా చూడటం సర్పంచ్ బాధ్యత ► ప్రతి ఇంటికి మొక్కలు సరఫరాచేయాలి. వీధులు, ఖాళీ ప్రదేశాల్లో చెట్లు పెంచాలి. మొక్కలను జాగ్రత్తగా కాపాడాలి. ► నెలకు ఒకసారి గ్రామపంచాయతీ సమావేశం నిర్వహించాలి. రెండునెలలకు ఒకసారి గ్రామసభ నిర్వహించాలి. ► వందశాతం పన్నులు వసూలు చేయాలి. పంచాయతీ రికార్డులు, వీధి దీపాల నిర్వహణ, జనన మరణ రికార్డుల నిర్వహణ. ► సర్పంచ్‌లు తమ గ్రామాల్లోనే నివాసముండాలి. గ్రామపంచాయతీ కార్యాలయానికి క్రమం తప్పకుండా హాజరుకావాలి. గ్రామపంచాయతీ సమర్థవంతంగా పనిచేసేలా అప్పగించిన విధులను పూర్తిచేయడానికి సర్పంచ్ల పర్యవేక్షణ ఉపయోగపడుతుంది. నిర్లక్ష్యంగా ఉంటే వేటుకూ అవకాశం.. నూతనంగా ఎన్నికైన గ్రామ పాలకవర్గాలకు అధికారాలతోపాటు బాధ్యతలు కూడా పెరిగాయి. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై వేటు పడేందుకు కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్త చట్టంలో నిర్ధేశించిన బాధ్యతలు సరిగా నిర్వహించకపోతే, కేటాయించిన నిధులను సవ్యంగా ఖర్చుచేయకపోతే సర్పంచ్ల తొలగింపుతో పాటు పాలకవర్గాన్ని రద్దుచేసే అవకాశముంది. చట్టప్రకారం తాను నిర్వహించాల్సిన విధుల నిర్వహణలో విఫలమైతే వివరణ ఇచ్చేందుకు సర్పంచ్‌కు అవకాశమిస్తారు. ఈ తర్వాత జిల్లా కలెక్టర్ అతడిని పదవి నుంచి తొలగించవచ్చు. పంచాయతీల నిర్వహణకు కలెక్టర్ లేదా పీఆర్ కమిషనర్, ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు పట్టించుకోకపోతే విధుల నుంచి తొలగించే అవకాశముంది. ఒకసారి సర్పంచ్‌గా తొలగిస్తే ఆరేళ్లపాటు సర్పంచ్‌గా పోటీచేయకుండా అనర్హత వేటు వేయొచ్చు. గ్రామాభివృద్ధికి సంబంధించిన ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికలను పంచాయతీ పాలకవర్గాలు రూపొందించుకోవాలి. చట్టంలో సర్పంచ్‌లకు పూర్తిస్థాయి కార్యనిర్వహణాధికారాలతో పాటు, సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్‌ను కట్టబెట్టారు. గ్రామాల్లో అక్రమ లేఅవుట్లకు అనుమతినిచ్చిన పక్షంలో మొత్తం పాలకవర్గాన్నే రద్దు చేసే అవకాశం ఉంది. అక్రమ నిర్మాణాల విషయంలోనూ కఠిన చర్యలుంటాయి. మూడు వందల మీటర్ల స్థలంలో, పది మీటర్ల ఎత్తు మించకుండా జీప్లస్‌టు భవనాల నిర్మాణాలకే పంచాయతీలు అనుమతి ఇవ్వొచ్చు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అయ్యే వ్యయాన్ని సర్పంచ్, స్థానిక కార్యదర్శి భరించాలి. ప్రతి ఊళ్లో నర్సరీ... మొక్కల నిర్వహణలో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కల పంపిణీ కోసం నర్సరీ ఏర్పాటుతోపాటు ఊళ్లోని ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండేలా చూసే బాధ్యత సర్పంచ్‌పై ఉంటుంది. ప్రతీ రెండు నెలలకు ఒకసారి గ్రామసభ నిర్వహించాలి. వరుసగా మూడుసార్లు గ్రామసభలు నిర్వహించకపోతే సర్పంచ్‌లను తప్పించే వీలుంది.. ప్రతినెలా గ్రామపాలకవర్గం సమావేశమై అభివృద్ధి, ఇతర కార్యకలాపాలు సమీక్షించాలి. చెత్తపడేస్తే జరిమానా... గ్రామాలు, ఇళ్ల పరిసరాల్లో ఇష్టం వచ్చినట్టుగా చెత్తా చెదారం పడేస్తే, ఇంటి ఎదుట చెత్త వేస్తే ఆ ఇంటి యజమానికి రూ.500 జరిమానా విధించే అధికారాన్ని సర్పంచ్‌లకు కల్పించారు. ఇంటి నుంచి మురుగునీటిని రోడ్డు మీదకు వదిలితే రూ. ఐదువేలు జరిమానా విధించే అవకాశముంది. ఊళ్లోని ప్రతి కుటుంబం ఆరు మొక్కలు నాటాలని చట్టంలో పేర్కొన్నా, వాటిలో కనీసం మూడింటినైనా నాటాలి. హరితహారంలో ఇచ్చిన మొక్కలను పెంచకపోతే ఇంటి యజమాని నుంచి రెండింతలు ఆస్తిపన్నును జరిమానాగా వసూలు చేసే వీలుంది. -
ఒక్క నామినేషన్ వస్తే ఒట్టు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలోని మూడు గ్రామ పంచాయతీలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులకూ నామినేషన్లు దాఖలు చేయలేదు. ఒక్క గిరిజనుడూ లేని 2 గ్రామాలను ఏజెన్సీలుగా నోటిఫై చేయగా, అక్కడి 2 గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. కొత్త పం చాయతీ ఏర్పాటును వ్యతిరేకించిన ఓ గ్రామం ఎన్నికకు దూరంగా ఉంది. దీంతో మంచిర్యాల జిల్లాలోని 3గ్రామాల్లో ఈసారి ఎన్నికలు జరగడం లేదు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ప్రసిద్ధ సత్యనారాయణ స్వామి ఆలయం నెలకొని ఉన్న గూడెం గ్రామ పంచాయతీని 1987లోనే ఏజెన్సీ గ్రామంగా ప్రకటించారు. ఈ గ్రామంలో ఒక్క ఎస్టీ లేకపోవడంతో ఈ సారీ నామినేషన్లు దాఖలు కాలేదు. వార్డు సభ్యులు సగం మంది గిరిజనేతరులు అందుబాటులో ఉన్నప్పటికీ, సర్పంచ్‌కి ఎన్నిక జరగకుండా వార్డులకు పోటీ చేయడం ఎందుకని ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. 1987 నుంచి అంటే 32 ఏళ్లుగా ఇక్కడ ఎన్నిక జరగలేదు. ఇదే మండలంలోని నెల్కి వెంకటాపూర్ గ్రామం ఇదే జాబితాలో చేరింది. ఏజెన్సీ గ్రామంగా ఉన్న ఈ పంచాయతీని పునర్విభజనలో వందుర్‌గూడ పంచాయతీగా మార్చారు. ఎస్టీ వర్గంతో కూడిన వందూర్‌పల్లిని పంచాయతీగా మార్చగా నెల్కివెంకటాపూర్ లో ఎస్టీలు లేకుండాపోయారు. ఎస్టీలను ప్రత్యేక పంచాయతీగా మార్చినా, నెల్కి వెంకటాపూర్‌ను ఏజెన్సీ గ్రామంగా డీనోటిఫై చేయలేదు. దాంతో ఎస్టీలు లేని ఈ పంచాయతీలో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక నెల్కి వెంకటాపూర్ గ్రామం నుంచి విభజించి ప్రత్యేక పంచాయతీగా మార్చిన వందుర్‌గూడ ఏజెన్సీ గ్రామంలో గిరిజనులు, ఇతర వర్గాల వారు ఎన్నికలను బహిష్కరించారు. నెల్కి వెంకటాపూర్ గ్రామం నుంచి విడిపోవడం ఈ గ్రామస్తులకు ఇష్టం లేకపోవడంతో ఎన్నికను బహిష్కరించారు. మూడో విడత నామినేషన్ల చివరి రోజు శుక్రవారం నాటికి ఈ 3 గ్రామాల్లో ఒక్కరూ నామినేషన్లు వేయలేదు. -
పల్లెల్లో గులాబీ పండుగ!
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తొలి విడతలో 4,480 గ్రామ పంచాయతీలు, 39,832 వార్డుల్లో ఎన్నికలు జరుగుతుండగా, ఆదివారంతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తర్వాత తొలి విడతలో 763 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో దాదాపు 662 పంచాయతీలను టీఆర్ఎస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 38 పంచాయతీలతో సరిపెట్టుకోగా.. స్వతంత్రులు 49 పంచాయతీల్లో గెలిచారు. న్యూడెమోక్రసీ పార్టీ మద్దతుదారులు 6, సీపీఎం మద్దతుదారులు 4, సీపీఐ, టీడీపీ, బీజేపీ చెరొక పంచాయతీని దక్కించుకున్నాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఈ నెల 21న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనున్నాయి. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం మొదటిదశ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తుది జాబితా విడుదలైన నేపథ్యంలో సర్పంచ్, వార్డుమెంబర్ స్థానాలకు పోటీ చేస్తున్న వారికి రిటర్నింగ్ అధికారులు ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు. సోమవారం నుంచి గుర్తులతో అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నం కానున్నారు. ముగిసిన రెండో విడత నామినేషన్లు రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఆదివారంతో ముగిసింది. సోమవారం నామినేషన్లను పరిశీలించి పోటీకి అర్హులైన అభ్యర్థుల జాబితాలను ప్రకటించనున్నారు. 15న నామినేషన్ల పరిశీలనలో తీసుకున్న నిర్ణయాలపై అప్పీళ్లను స్వీకరించి 16 నాటికి పరిష్కరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 17 వరకు అవకాశం ఉండనుంది. 25న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. -
ఊళ్లో ఓటుంటేనే పోటీ..
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీకి ప్రథమ పౌరుడైన సర్పంచ్ పదవికి పోటీచేయాలంటే.. ఆ గ్రామంలో ఓటుహక్కు తప్పనిసరిగా కలిగుండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల ప్రకటన తేదీకి ముందే ఓటరు జాబితాలో పేరు నమోదై ఉండాలని పేర్కొంది. ఎన్నికల ప్రకటన తేదీకి ముందే ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవాల్సిందే. దీంతోపాటుగా ఆర్టీసీ, సింగరేణి సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా సర్పంచ్ ఎన్నికల బరిలో దిగవచ్చు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ వాటా 25% ఉన్న సంస్థల ఉద్యోగులు మాత్రం పోటీ చేసేందుకు అనర్హులని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికలకు సంబంధించిన అర్హతలు, అనర్హతలు సహా పలు అంశాలపై ఎన్నికల సంఘం పలు మార్గదర్శకాలు జారీచేసింది. అర్హతలు ►అభ్యర్థి కచ్చితంగా తను పోటీచేసే పంచాయతీలో సభ్యుడిగా ఉండాలి. ►అభ్యర్థి వయసు 21 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు. నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి అభ్యర్థికి 21 ఏళ్లు నిండాయా? లేదా? అనే ప్రాతిపదికన వయసును లెక్కిస్తారు. ►ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో అభ్యర్థులు.. షెడ్యూల్డ్ తెగలు (తెలంగాణకు సంబంధించిన)గా ప్రకటించిన ఏదైనా ఒక కులం, తెగకు (కమ్యూనిటీకి) చెందినవారై ఉండాలి. ఎస్సీ, బీసీ రిజర్వ్డ్ స్థానాల్లో పోటీ చేసే ►అభ్యర్థులు.. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్డ్ కులాలు లేదా వెనుకబడిన తరగతులుగా ప్రకటించిన ఏదైనా సామాజిక వర్గానికి చెందినవారై ఉండాలి. ►మహిళలతోపాటు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు చెందిన వారు అన్–రిజర్వ్డ్ స్థానాలకు పోటీపడొచ్చు. ►రేషన్ డీలర్లు, సహకార సంఘాల సభ్యులు అర్హులే. ►పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ఆర్టీసీ, సింగరేణి సంస్థల ఉద్యోగులు అర్హులే. ఆర్టీసీ, సింగరేణి సంస్థల్లో మేనేజింగ్ ఏజెంట్/మేనేజర్/కార్యదర్శులు తప్ప మిగిలిన ఉద్యోగులు అర్హులే. రాష్ట్ర ప్రభుత్వ వాటా 25%లోపుగా ఉన్న సంస్థల ఏజెంట్/మేనేజర్/కార్యదర్శులు సైతంపోటీకి అర్హులే. అనర్హతలు ►క్రిమినల్ కోర్టు ద్వారా శిక్ష పడితే సర్పంచ్ పదవికి పోటీచేసేందుకు అనర్హులు. కేసులో శిక్ష ముగిసిన తేదీ నుంచి ఐదేళ్ల పాటు అనర్హత వర్తిస్తుంది. ►మతిస్థిమితం లేనివారు, చెవిటి, మూగవారు. ► దివాలా తీసిన లేదా దివాలా నుంచి వెలుపలికి రాని(ఇన్సాల్వెన్సీ) వ్యక్తిగా కోర్టు నిర్ణయించినవారు, ఇన్సాల్వెన్సీకి దరఖాస్తు చేసుకున్న వారు. ►గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ లేదా ఏదైనా రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాల ద్వారా చేపట్టిన ఏదైనా పనికి సంబంధించిన కాంట్రాక్ట్ పొందినవారు, అందులో భాగస్వామ్యం ఉన్నవారు. ► ఏదైనా పారితోషికం పొందుతూ పంచాయతీ తరఫున లేదా దానికి వ్యతిరేకంగా లీగల్ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తున్న వారు. ►రాష్ట్ర ప్రభుత్వం వాటా 25% లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్న కంపెనీలు లేదా కార్పొరేషన్ (సహకార సొసైటీ కాకుండా)లలో మేనేజర్, కార్యదర్శిగా పనిచేసే వారు. ►1973 నేరశిక్షాస్మృతి ప్రకారం మేజిస్ట్రేట్‌గా ఆ గ్రామంలోని ఏదైనా ప్రాంతంపై అధికార పరిధి కలిగి ఉన్నవారు. ►ప్రస్తుత, గత ఆర్థిక సంవత్సరంలో గ్రామపంచాయతీకి పడిన బకాయిని చెల్లించాలంటే బిల్లు/నోటీసులు అందుకుని.. గడువులోగా బకాయి చెల్లించని వారు. ►గ్రామ సహాయకునిగా (వీఆర్ఓ), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి, అధికారి, స్థానిక సంస్థల్లో, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందుతున్న సంస్థలో ఉద్యోగిగా ఉన్నవారు. ►పార్లమెంట్ లేదా అసెంబ్లీ ద్వారా చట్టబద్ధత పొందిన ఏదైనా సంస్థలో ఆఫీస్ బేరర్‌గా ఉండకూడదు. ►రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న ఏదైనా చట్టం ప్రకారం సభ అనర్హులుగా ప్రకటించినవారు అనర్హులు. ►మత సంబంధ సంస్థల చైర్మన్, సభ్యులు అనర్హులు. ►పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేం దుకు అంగన్వాడీ వర్కర్లు అనర్హులు ►నీటి వినియోగదారుల సంఘం సభ్యులు పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హులు. ఖర్చుల అకౌంట్ తప్పనిసరి ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు వీలుగా ఎన్నికల్లో చేసే ఖర్చు నిమిత్తంప్రతీ అభ్యర్థి ప్రత్యేకంగా ఏదో ఒక జాతీయ బ్యాంక్‌లో ఖాతా తెరవాలి, అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడానికి కనీసం ఒకరోజు ముందుగా ఈ ఖాతా తెరవాలి. నామినేషన్ దాఖలు సమయంలో సంబంధిత రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా అభ్యర్థి ఈ బ్యాంక్ ఖాతా వివరాలు తప్పకుండా తెలియజేయాలి. ఈ బ్యాంక్ ఖాతానుంచే అభ్యర్థి తన మొత్తం ఎన్నికల వ్యయాన్ని ఖర్చుచేయాలి. తమ రోజువారీ ప్రచార ఖర్చుకు సంబంధించిన లెక్కలు అభ్యర్థులు తప్పనిసరిగా ఎంపీడీఓకు వెల్లడించాలి. దీనికితోడు గ్రామాల్లోని ఓటర్లు, ప్రజలు ఎవరైనా అభ్యర్థుల ప్రచార వ్యయం వివరాలు కోరితే వారికి వాటిని కచ్చితంగా సమర్పించాలని ఎస్ఈసీ సూచించింది. సున్నిత ప్రాంతాల్లో పటిష్ట భద్రత రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆయా వర్గాలను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి, వారు ఓటింగ్‌లో పాల్గొనకుండా చేయడం లేదా తమకు అనుకూలంగా ఓటు వేయించుకోవడం ఆందోళన కలిగించే విషయమని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ సవాళ్లను అధిగమించేందుకు సున్నితమైన ఇలాంటి ప్రాంతాలను ముందే గుర్తించి భద్రతను కట్టుదిట్టం చేసే పనిలో ఉంది. సర్పంచ్‌కి 30,వార్డు సభ్యులకు20 గుర్తులు సర్పంచ్ అభ్యర్థులకుకేటాయించే ‘ఫ్రీ సింబల్స్’ఇవే ఉంగరం, కత్తెర, బ్యాట్, కప్పు–సాసర్, విమానం, బంతి, షటిల్‌కాక్, కుర్చీ, వంకాయ, నల్లబోర్డు, కొబ్బరికాయ, లేడీ పర్సు, మామిడికాయ, సీసా, బకెట్, బుట్ట, దువ్వెన, అరటిపండు, మంచము, పలక, టేబులు, బ్యాటరీ లైట్, బ్రష్, క్యారెట్, గొడ్డలి, గాలిబుడగ, బిస్కెట్, వేణువు(పిల్లనగ్రోవి), ఫోర్కు, చెంచా వార్డు సభ్యులకు కేటాయించే ‘ఫ్రీ సింబల్స్’ఇవే... నీళ్ల జగ్గు, గౌను, గ్యాస్ స్టౌ, స్టూలు, గ్యాస్ సిలిండర్, గాజుగ్లాసు, బీరువా, ఈల, కుండ, డిష్ యాంటెనా, గరాటా, మూకుడు, కెటిల్, విల్లు–బాణం, కవర్, హాకీ బ్యాట్–బంతి, నెక్ టై, కటింగ్ ప్లేయర్, పోస్టుబాక్స్, విద్యుత్ స్తంభం నోటాకూ గుర్తు.. పంచాయతీ ఎన్నికల్లో నన్ ఆఫ్ ద అబౌ(నోటా)కు కూడా గుర్తు కేటాయిస్తారు. నమూనా బ్యాలెట్ పేపర్‌పై కొట్టివేత మార్క్‌తో ఉన్నదే ఆ గుర్తు. నేర చరిత్ర ప్రకటించాల్సిందే! సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నేర చరిత్ర కలిగి ఉంటే తప్పనిసరిగా వెల్లడించాల్సిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్లతో పాటు నేర చరిత్రపై స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించిన విషయం తెలిసిందే. సరిగ్గా అలాగే పంచాయతీతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో పాటు విద్యార్హతలు, ఆస్తులు, అప్పులు, నేర చరిత్రకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని స్వీయ ధ్రువీకరణ రూపంలో రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశించిన నమూనాలో ఈ సమాచారాన్ని పొందుపరిచి ఇద్దరు సాక్షుల సంతకాలతో సమర్పించాల్సి ఉంటుంది. కేసు వివరాలు, సెక్షన్లు, నేర సంఘటన వివరాలు, కోర్టు పేరు, కేసు నంబర్, కేసు నమోదైన తేదీ, శిక్ష పడిందా.. అప్పీల్ చేశారా.. తదితర సమాచారాన్ని పొందుపర్చాల్సి ఉంటుంది. -
‘మున్సిపాల్టీల్లో అన్యాయంగా గ్రామాల విలీనం ’
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగంలోని 243(క్యూ) అధికరణానికి వ్యతిరేకంగా గ్రామ పంచాయతీలను మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనం చేసేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం చట్ట సవరణ చేసిందని హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్ట సవరణ (4/2018)ను సవాల్ చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై బుధ వారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, మెదక్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పలువురు తెలంగాణ ప్రభుత్వం చేసిన చట్టసవరణను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. వారి తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. చట్ట వ్యతిరేకంగా గ్రామాల్ని మున్సిపాల్టీ లు, మున్సిపల్ కార్పొరేషన్లల్లో విలీనం చేస్తున్నారని, మధ్యలో కొన్ని గ్రామాల్ని వదిలిపెట్టి ఎంపిక చేసుకున్న గ్రామాల్నే విలీనం చేయడాన్ని హైకోర్టు గమనించాలన్నారు. రాజ్యాంగంలోని 243(క్యూ) అధికరణ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని చెప్పారు. పిటిషనర్ల వాదనలు ముగియడంతో ప్రభుత్వ వాదన నిమిత్తం విచారణ గురువారానికి వాయిదా పడింది. -
తీరనున్న ప‘రేషన్’
పెద్దశంకరంపేట(మెదక్) : ప్రభుత్వం నూతన పంచాయతీల ఏర్పాటుతో ప్రజలను పలు సమస్యల నుంచి ప్రజలకు విముక్తి కల్పించింది. ఎన్నో ఏళ్లుగా తీరని సమస్యలు కొత్త పంచాయతీల రాకతో తీరేందుకు అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం మంత్రుల సబ్‌కమిటీ సమావేశంలో కొత్త పంచాయతీల్లో రేషన్ దుకాణాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. ఈ నిర్ణయంతో జిల్లాలో కొత్త రేషన్ దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ఇక కొత్త పంచాయితీల వద్దనే రేషన్ సరుకులను ప్రజలు అందుకునే అవకాశం ఉండనుంది. జిల్లాలో ప్రస్తుతం 2,07,643 కుటుంబాలు ఆహార భద్రత కార్డులు కలిగి ఉన్నారు. ఇందులో అంత్యోదయ 13,016, అన్నపూర్ణ 88 కార్డులున్నాయి. వీరికి ప్రతీ నెల రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం సరుకులను అందజేస్తుంది. ఇప్పటి వరకు మధిర గ్రామాలతో పాటు గిరిజన తాండాలకు చెందిన ప్రజలు రేషన్ సరుకులను పొందాలంటే వారు తప్పని సరిగా ఆటోలు, లేక కాలినడకన కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి. ప్రభుత్వం ఈ విషయంపై ఇటీవల చర్చించడంతో పాటు నూతనంగా కొత్త పంచా యతీల్లో రేషన్ దుకాణాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులను దూరం చేయాలని నిర్ణయిం చింది. అదిగాక దుకాణా నికి వెళ్లినప్పుడు ఈ – పాస్ మిషిన్లకు సిగ్నల్స్ సమస్య కూడా లబ్ధిదారులను వేధిస్తుంది. దీంతో ఒక రోజంతా రేషన్ సరుకులు తెచ్చుకోవడానికే సమయం వె చ్చిం చాల్సిన పరి స్థితి. ఇది వరకు జి ల్లా వ్యాప్తం గా 312 పంచాయతీలుండగా కొత్తగా 157 పంచా యతీలు ఏర్పాటయ్యా యి. పాత పంచాయతీల్లో రేషన్ దుకాణాలు ఉండగా ఇప్పుడు 157 కొత్త పంచాయతీల్లో రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ 500 మంది జనాభాకు అనుగుణంగా రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయాలని నిబంధనలు చెబుతున్నా గతంలో పట్టించుకున్న పాపనలేదు. పెద్దశంకరంపేట మండలంలో గతంలో ఉన్న 22 పంచాయతీల పరిధిలో 27 రేషన్ దుకాణాలున్నాయి. నూతనంగా ఏర్పాటైన 5 పంచాయతీలతో కలిపి మండలంలో 27 పంచాయతీలయ్యాయి. ఆహారభద్రత కార్డుల సంఖ్య 11,034 ఇందులో అంత్యోదయ 764, అన్నపూర్ణ 20. వీటికి తోడు ఇటీవల వేలాది మంది కొత్తగా ఆహారభద్రత కార్డులు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. వీరందరిని పరిగణలోనికి తీసుకొని కొత్తగా రేషన్ దుకాణాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులను దూరం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతిపాదనలు పంపించాం మండలంలో కొత్తగా రేషన్ దుకాణాల ఏర్పాటకు గతంలోనే ప్రతిపాదనలు పంపించాం. కొత్త పంచాయతీలలో రేషన్ దుకాణాల ఏర్పాటుపై ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేవు. కొత్త పంచాయతీల్లో రేషన్ దుకాణాల ఏర్పాటుపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. –నారాయణ, తహసీల్దార్, పెద్దశంకరంపేట ఇబ్బందులు తొలుగుతాయి.. కొత్తగా ఏర్పాటైన మా పంచాయతీ ఇసుకపాయలతాండాలో రేషన్‌దుకాణం ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తొలిగిపోతాయి. ఎన్నో ఏళ్లుగా రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి రేషన్ తెచ్చుకుంటున్నాం. ప్రభుత్వం వెంటనే రేషన్ దుకాణాం ఏర్పాటు చేయాలి. –దీప్‌సింగ్, ఇసుకపాయలతాండా, పెద్దశంకరంపేట -
తలొగ్గేవారికే ప్రత్యేక పగ్గాలు
పంచాయతీలలో సర్పంచ్ల పాలనకు కాలం తీరింది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల బండి నడిపించేందుకు ప్రత్యేక అధికారులకు పగ్గాలు అప్పగించింది. చర్నాకోలు మాత్రం తన వద్దే ఉంచుకుంది. తమకు అనుకూలంగా వ్యవహరించాలంటూ ప్రత్యేక అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఏమాత్రం తమ ఆదేశాలకు తలూపని వారిని పక్కన పెట్టింది. ఒక్కొక్కరికి పదేసి పంచాయతీలు అప్పగించింది. ప్రస్తుతం ఉన్న విధులతోపాటు ఈ ప్రత్యేక భారాన్ని మోయలేం మహాప్రభో అంటున్నా వారి వేదనను పెడచెవిన పెట్టింది. అధికార పార్టీ సర్పంచ్ల అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకుగాను అభివృద్ధికి సైతం పాతరేసింది. సాక్షి, గుంటూరు : గ్రామ సర్పంచుల పదవీకాలం ఈ నెల ఒకటో తేదీన ముగిసింది. జిల్లాలోని 1011 గ్రామ పంచాయతీలను 587 క్లస్టర్లుగా ఏర్పాటు చేసి వీటికి తహసీల్దార్, ఎంపీడీవో, ఈఓపీఆర్డీ, ఎంఈవో వంటి గెజిటెడ్ ర్యాంకు అధికారులను స్పెషల్ అధికారులుగా నియమించారు. ఇప్పటికే కొంత మంది అధికారులు స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతలు స్వీకరించారు. అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే అందలం.. అధికార పార్టీ నేతలు చెప్పిన అధికారులకు మాత్రమే ప్రత్యేక బాధ్యతలు కట్టబెట్టారు. నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాల్లో అత్యధికంగా ఒక్కో అధికారికి 6 నుంచి 13 గ్రామాల బాధ్యతలు అప్పజెప్పడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉండే వారిని ప్రత్యేక అధికారులుగా నియమించుకోవడం కోసం మాజీ సర్పంచ్‌లు కూడా పైరవీలు చేశారు. ఆందోళన చెందుతున్న ప్రజలు.. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల నియామకంపై తెలుగుదేశం పార్టీ పెత్తనానికి తెర తీసింది. ఎమ్మెల్యేలు, మంత్రులు ఆమోదించిన వారికే ప్రత్యేక అధికారులుగా నియమించడం కోసం భారీగా ఒత్తిళ్లు తెచ్చారని తెలుస్తోంది. దీంతో అ«ధికార పార్టీకి అనుకూలంగా ఉండే అధికారులకే 5 నుంచి 10కిపైగా గ్రామాలు కట్టబెడితే సమస్యలు ఏ విధంగా పరిష్కారమవుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి గతంలో ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు పంచాయతీ కార్యదర్శులకు ఇన్చార్జి బాధ్యత అప్పగించేవారు. కానీ జిల్లాలో కార్యదర్శుల కొరత ఉంది. ఒక్కో కార్యదర్శి మూడు నుంచి నాలుగు పంచాయతీల బాధ్యతలు ఇప్పటికే మోస్తున్నారు. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్యం, జ్వరాల విజృంభణ, తాగు నీరు, డంపింగ్ యార్డు వంటి సమస్యలు గ్రామాల్లో పేరుకుపోయాయి. ఎక్కువ గ్రామాలకు ప్రత్యేకాధికారులుగా ఉన్న వారు ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తారనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. అభివృద్ధి అధోగతే.. పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా అధికార పార్టీకి ఇష్టమైన వారికి నియమించారు. టీడీపీ మాజీ సర్పంచ్‌లు వారి పెత్తనాన్ని కోల్పోకుండా ఉండటానికి భారీగా పైరవీలు నడిపించారు. ఇప్పటికే గ్రామాల్లో కొన్ని అభిృద్ధి కార్యక్రమాలు మధ్యలో నిలిచిపోయాయి. ఒక్కో అధికారికి 5 నుంచి 10కిపైగా గ్రామాలను కేటాయిస్తే అభివృద్ధి ఎలా సాగుతుంది. – ఆళ్ల బుచ్చిరెడ్డి, జొన్నలగడ్డ మాజీ సర్పంచ్ అన్నీ సమస్యలే.. ఇప్పటికే గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. ఒక్కో అధికారికి 4, 5 గ్రామాలు కట్టబెట్టారు. దీంతో గ్రామాల్లో సమస్యలు పట్టించుకునే నాథుడు లేకుండా పోతారు. ప్రత్యేక అధికారులుగా ఉన్న వారికి ఇప్పటికే మండల స్థాయిలో పని భారం ఎక్కువ ఉంది. ఇక పంచాయతీల సమస్యలు ఎప్పుడు పట్టించుకుంటారు. – ఇర్ల గొల్లారావు, కోనంకి, మాజీ సర్పంచ్ -
‘కేంద్రం’ లేని కొత్త పురపాలికలు
సాక్షి, హైదరాబాద్: ‘శంషాబాద్’ పేరుతో ఈనెల 1న కొత్త మున్సిపాలిటీ ఆవిర్భవించింది. అయితే శంషాబాద్ మాత్రం ఇంకా గ్రామ పంచాయతీగానే కొనసాగుతోంది. హైదరాబాద్ శివార్లలోని చిన్నగొళ్లపల్లి, తొండుపల్లి, ఓట్పల్లి పంచాయతీలు విలీనమై శంషాబాద్ మున్సిపాలిటీ అవతరించగా.. మున్సిపల్ కేంద్రంగా ఆవిర్భవించాల్సిన శంషాబాద్‌కు వచ్చే ఏడాది ఏప్రిల్ 20 వరకు మున్సిపాలిటీ హోదా లభించే అవకాశం లేదు. ఏప్రిల్ వరకు శంషాబాద్ గ్రామ పంచాయతీ పాలక వర్గం పదవీకాలం కొనసాగనుండటమే ఇందుకు కారణం. ఇంకా సర్పంచ్ల పాలనలోనే.. ఈనెల 1, 2వ తేదీల్లో రాష్ట్రంలో 68 కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు కాగా, అందులో శంషాబాద్, దమ్మాయిగూడ, నాగారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి మున్సిపల్ కేంద్రాలు మాత్రం ఇంకా గ్రామ పంచాయతీలుగానే కొనసాగుతున్నాయి. దీంతో ఈ ఐదు మున్సిపాలిటీలు భౌగోళికపరంగా పాక్షిక రూపంలో మాత్రమే ఏర్పటయ్యాయి. ఈ గ్రామ పంచాయతీల పాలకవర్గాలు పదవీ కాలం ముగిసే వరకు సర్పంచ్ల పాలనలో కొనసాగనున్నాయి. ఆ వెంటనే శివారు గ్రామ పంచాయతీల కలయికతో ఏర్పడిన సంబంధిత పురపాలికలో విలీనమై ఆయా పురపాలికల కేంద్రాలుగా ఏర్పడనున్నాయి. అప్పటి వరకు ఈ పురపాలికలకు పరిపాలన కేంద్రం ఉండదని, తాత్కాలికంగా వేరే ప్రాంతాల నుంచి పాలన వ్యవహారాలు నడిపిస్తారని అధికారవర్గాలు తెలిపాయి. ఎందుకంటే.. రాష్ట్రంలో 173 గ్రామ పంచాయతీల విలీనం ద్వారా 68 పురపాలికల ఏర్పాటుతోపాటు రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ఐదు మున్సిపల్ కార్పొరేషన్లు, 36 మున్సిపాలిటీల్లోకి మరో 136 గ్రామ పంచాయతీలను విలీనం చేసేందుకు గత మార్చిలో శాసనసభ రాష్ట్ర మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. గత సాంప్రదాయానికి భిన్నంగా స్థానిక ప్రజల అభిప్రాయంతో, గ్రామ పంచాయతీల తీర్మానంతో పనిలేకుండా.. నేరుగా కొత్త పురపాలికల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న పురపాలికల్లో గ్రామాలు/ఆవాసాలను విలీనం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఈ చట్టాలకు సవరణలు చేసింది. ఆయా గ్రామ పంచాయతీల పాలక మండళ్ల పదవీకాలం ముగిసిన వెంటనే వాటికి మున్సిపాలిటీల హోదా లభిస్తుందని మున్సిపల్ చట్టాల్లో చేర్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మెజారిటీ గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఈనెల 1, 2వ తేదీలతో ముగిసిపోయింది. దీంతో ఆ వెంటనే రాష్ట్రంలో కొత్తగా 68 మున్సిపాలిటీలు ఆవిర్భవించాయి. అయితే శంషాబాద్, దమ్మాయిగూడ, నాగారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలు కేంద్రాలుగా ఏర్పడాల్సిన ఆయా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఆలస్యంగా జరగడంతో వాటి పాలకవర్గాల పదవీకాలం ఇంకా పూర్తి కాలేదు. -
పంచాయతీ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఆదివారం లేఖ రాశారు. ఏళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న వీరికి కనీస వేతనం కూడా దక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 40వేల మంది కారోబార్, బిల్ కలెక్టర్, పారిశుధ్య సిబ్బంది పంచాయతీల్లో పనిచేస్తున్నారన్నారు. పొరుగు రాష్ట్రాల్లో పంచాయతీ ఉద్యోగులను క్రమబద్ధీకరించారన్నారు. పంచాయతీ పాలనలో కీలకంగా వ్యవహరిస్తున్న వీరిని క్రమబద్ధీకరిస్తే మరింత మెరుగ్గా పనిచేసే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
విలీనం.. అగమ్యగోచరం
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా పంచాయతీరాజ్ విభాగం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఓటరు జాబితా మొదలుకుని, బ్యాలెట్ పత్రాల ముద్రణ వరకు కీలక ఘట్టాలన్నీ ఒక్కటొక్కటిగా కొలిక్కి వస్తున్నాయి. జిల్లా స్థాయిలో రిజర్వేషన్ల మార్గదర్శకాలు ఒకటి రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీల్లో ఎన్నికల రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. ఇదిలా ఉంటే గతంలో మేజర్ పంచాయతీలుగా వెలుగొందిన గ్రామ పంచాయతీలు త్వరలో మున్సిపాలిటీలుగా మారనున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల సందడి కనిపించడం లేదు. మరోవైపు మేజర్ పంచాయతీలు కేంద్రంగా చక్రం తిప్పిన నాయకులు, కొత్తగా మున్సిపాలిటీల్లో తమ రాజకీయ భవిష్యత్తుపై లెక్కలు వేసుకుంటున్నారు. –సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మున్సిపాలిటీలుగా, గజ్వేల్– ప్రజ్ఞాపూర్, అందోలు–జోగిపేట నగర పంచాయతీలుగా ఉన్నాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నగర పంచాయతీ కొత్తగా ఏర్పాటైన సిద్దిపేట జిల్లా పరిధిలోకి వచ్చి చేరింది. దుబ్బాకను 2013లో నగర పంచాయతీగా ఏర్పాటు చేసినా, కోర్టు కేసుల మూలంగా పాలక మండలి ఎన్నిక జరగలేదు. చేగుంటను నగర పంచాయతీగా ఏర్పాటు చేసినా స్థానికులు కోర్టును ఆశ్రయించడంతో ఆరేళ్లుగా విలీన ప్రతిపాదిత గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. కాగా జిల్లాల పునర్విభజన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న మున్సిపాలిటీల పరిధిని విస్తరించడంతో పాటు నగర పంచాయతీలకు కూడా మున్సిపాలిటీ హోదా కల్పించింది. మరోవైపు కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ఏడాది మార్చిలో ప్రకటించింది. మెదక్ జిల్లా పరిధిలో కొత్తగా రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్, అమీన్పూర్, బొల్లారం, తెల్లాపూర్, సిద్దిపేట జిల్లాలో చేర్యాలకు మున్సిపల్ హోదా దక్కింది. జనాభా, ఆదాయం పరంగా మేజర్ పంచాయతీలుగా ఉన్న గ్రామాలన్నీ దాదాపు మున్సిపాలిటీగా రూపాంతరం చెందాయి. మేజర్ పంచాయతీలకు సమీపంలో ఉన్న 30కి పైగా పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. అంతటా ఎన్నికల సందడి కనిపిస్తున్నా, మున్సిపాలిటీలో విలీనమై, కొత్తగా మున్సిపాలిటీలుగా ఆవిర్భవించిన పంచాయతీల్లో స్తబ్ధత నెలకొంది. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో రామాయంపేట, నర్సాపూర్, నారాయణఖేడ్, చేర్యాల నియోజకవర్గ, తాలూకా, మండల కేంద్రాలుగా జిల్లా రాజకీయాల్లో దశాబ్దాలుగా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న తూప్రాన్ మండలం గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుండగా, జిల్లాల పునర్విభజనలో రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారింది. వీటితో పాటు రాజధాని హైదరాబాద్‌కు పొరుగునే ఉన్న మేజర్ పంచాయతీలు అమీన్పూర్, బొల్లారం, తెల్లాపూర్ గ్రామ పంచాయతీలు వేగంగా పట్టణీకరణ చెందడంతో.. ఇక్కడ సర్పంచ్ పదవికి ఎక్కడా లేని క్రేజ్ ఏర్పడింది. గతంలో మేజర్ పంచాయతీలుగా వెలుగొందిన ఉస్మాన్‌నగర్, వెలిమెల, కొల్లూరు తదితర గ్రామ పంచాయతీలు తెల్లాపూర్ మున్సిపాలిటీలో అంతర్భాగంగా మారాయి. సంగారెడ్డి మున్సిపాలిటీలో అంతర్భాగంగా మారిన పోతిరెడ్డిపల్లి ప్రస్తుతం పన్నుల రాబడిలో జిల్లాలో అగ్రస్థానంలో ఉంది. పత్యేకత కలిగిన మేజర్ పంచాయతీలన్నీ మున్సిపాలిటీలుగా అవతరించడంతో పంచాయతీ రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకులు తమ రాజకీయ భవితవ్యంపై కొత్త లెక్కలు వేసుకుంటున్నారు. భవితవ్యంపై కొత్త లెక్కలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు శివారులో ఉన్న అమీన్పూర్ పంచాయతీ ఎన్నికల తంతు అసెంబ్లీ ఎన్నికలను తలపించే రీతిలో సాగేది. అమీన్పూర్ సర్పంచ్‌లుగా పనిచేసిన నాయకులు ప్రస్తుతం పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పదవులను ఆశించడం పరిస్థితికి అద్దం పడుతోంది. మాజీ సర్పంచ్ శశికళ యాదవరెడ్డి, ప్రస్తుత సర్పంచ్ కాటా శ్రీనివాస్ గౌడ్ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. తెల్లాపూర్ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బొల్లారం కేంద్రంగా పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కొలన్ బాల్‌రెడ్డి భార్య సర్పంచ్‌గా, సోదరుడు రవీందర్‌రెడ్డి జిన్నారం ఎంపీపీగా ఉన్నారు. నర్సాపూర్ మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా టీఆర్ఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మురళీ యాదవ్, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీ యాదవ్ తమ రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. మేజర్ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారిన నేపథ్యంలో విలీన ప్రతిపాదిత గ్రామాలకు చెందిన నాయకులు తమ రాజకీయ భవితవ్యంపై లెక్కలు వేసుకుంటున్నారు. కొందరు నేతలు వచ్చే ఏడాది జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా అవతారం ఎత్తేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మున్సిపాలిటీలో అంతర్భాగంగా మారిన తమ ప్రాంతంపై పట్టు నిలుపుకొంటూనే రాజకీయంగా ఎదగాలనే ఆలోచనతో ఉన్నారు. గ్రామ పంచాయతీ రాజకీయాలపై ఆశ చావని ఔత్సాహికులు కొందరు.. తమకు అనుకూలమున్న పంచాయతీల్లో ఓటర్లుగా నమోదు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. -
68 పంచాయతీలకు రూ.16.60 కోట్లు
భువనేశ్వర్ : గ్రామీణాభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. ‘మన పల్లె–మన వికాసం’ పథకంలో భాగంగా 3 జిల్లాల్లోని 68 పంచాయతీలకు రూ.16.60 కోట్లు మంజూరుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. రాష్ట్ర సచివాలయం నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ‘మన పల్లె–మన వికాసం’ కార్యక్రమంపై నిర్వహించారు. సమితి స్థాయిలో ఈ కార్యక్రమం నిధుల్ని మంజూరు చేయడం ఇటీవల ప్రారంభించారు. బాలాసోర్, ఢెంకనాల్, భద్రక్ జిల్లా గ్రామ పంచాయతీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సులో సమీక్షించారు. ఒక్కో పంచాయతీలో గ్రామీణ అభివృద్ధి పరిస్థితులను ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం 3 జిల్లాల్లోని 68 పంచాయతీలకు రూ.16.60 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. బాలాసోర్ జిల్లా నీలగిరి సమితి, ఢెంకనాల్ జిల్లా కొంకొడాహడో, భద్రక్ జిల్లా భొండారిపొఖొరి çసమితులకు ఈ నిధులు మంజూరయ్యాయి. బాలాసోర్ జిల్లా నీలగిరి సమితిలోని 25 పంచాయతీల్లో 302 ప్రాజెక్టులకు రూ. 6.25 కోట్లు, డెంకనాల్ జిల్లా కొంకొడాహడో సమితి 21 పంచాయతీల్లో 152 ప్రాజెక్టులకు రూ.4.85 కోట్లు, భద్రక్ జిల్లా భొండారిపొఖోరి సమితి 22 పంచాయతీల్లోని 222 ప్రాజెక్టులకు రూ.5.50 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. -
ఉపాధి హామీలో ఘన వ్యర్థాల నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా గ్రామ పంచాయతీలో పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలపై రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగా ప్రతి 1000 మంది జనా భాకు 5 లక్షల చొప్పున ఖర్చు పెడతారు. ఈ పనిలో పాలుపంచుకున్న పారిశుధ్య కార్మికులు ఎంత సమయం పని చేయాలి, వారికి ఎంత వేతనం చెల్లించాలనే వివరా లను ఈ ఉత్తర్వుల్లో పొందుపరిచారు. ఈ పనులకు నిధు లు సమకూర్చే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు. -
పోరుకు సన్నద్ధం
సాక్షి, వనపర్తి : గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లు, పోలింగ్ స్టేషన్లను గుర్తించడం, ఎన్నికల నిర్వహణకు సిబ్బంది వివరాలు నమోదు చేసుకోవడం, జిల్లాలోని 14 మండలాలను మూడు విభాగాలుగా విభజించడం వంటి ప్రక్రియను పూర్తిచేశారు. జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,438 వార్డులు ఉన్నాయి. వార్డు వారీగా ఒక పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనుండడంతో 2,438 ఉండనున్నాయి. ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు ఆయా మండలాల ఎంపీడీఓలు, గ్రామాల కార్యదర్శులు ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు అనువుగా ఉన్న గదులను గుర్తించారు. వాటిలో వెలుతురు సరిగ్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎన్నికల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండే భవనాలను ఎంపికచేశారు. ఓటర్ల గుర్తింపు జిల్లాలోని 14 మండలాల్లోని 255 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లను గుర్తించారు. మొత్తం 2,88,503 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 1,46,718 మంది, మహిళలు 1,41,785 మంది ఉన్నారు. ఇందులో ఎస్టీ ఓటర్లు 24,369 మంది ఉండగా పురుషులు 12,162, మహిళలు 12,207 ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 49,285 మంది ఉండగా, ఇందులో పురుషులు 25,230, మహిళలు 24,052 మంది ఉన్నారు. బీసీ ఓటర్లు 1,82,788 మంది ఉన్నారు. కాగా, వీరిలో పురుషులు 92,734, మహిళలు 90,054 మంది ఉన్నారు. ఇతర ఓటర్లు మొత్తం 32,049మంది ఉండగా>.. పురు షులు 16,578 మంది, మహిళలు 15,470 మంది ఉన్నారని రెవెన్యూ అధికారులు గుర్తించారు. అధికారులకు బాధ్యతలు ఇవే.. జిల్లాలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలంటే తగిన సిబ్బంది కావాలి. ఆర్ఓ స్టేజ్ 1 అధికారి, ఆర్ఓ స్టేజ్ 2 అధికారి, ప్రిసైడింగ్ సిబ్బంది, పోలింగ్ సిబ్బందిని ఇప్పటికే ఎంపిక చేశారు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చిన సమయం నుంచి గ్రామాల్లో ప్రకటించడం, అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించడం, నామినేషన్ల ఉపసంహరణ, తిరస్కరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థులను ప్రక టించి వారికి గుర్తులు కేటాయించడం రిటర్ని ంగ్ అధికారి స్టేజ్ 1కు బాధ్యత అప్పగించారు. వీరిని ఒక్కో క్లస్టర్ గ్రామపంచాయతీలకు ఒక్కొక్కరి చొప్పున మొత్తం 98మందిని ఎంపికచేశారు. ∙ఇక స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారికి ఎన్నికల పోలింగ్ జరిగే రోజు బాధ్యతలు అప్పగించారు. ఇందుకోసం మొత్తం 286 మందిని ఎంపికచేశారు. వీరంతా పోలింగ్ రోజు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడడం, పోలింగ్ తీరు, కౌంటింగ్, ఎన్నికల్లో గెలిచిన వారిని ప్రకటించడం, ఉప సర్పంచ్ ఎన్నికను వెంటనే పూర్తిచేయడం వంటి పనులు చేయాల్సి ఉంది. ప్రతి పోలింగ్ స్టేషన్లో ప్రిసైడింగ్ అధికారి ఒకరు ఉంటారు. మొత్తం 2,583 మంది ప్రిసైడింగ్ అధికారులను గుర్తించారు. 2,847 మంది పోలింగ్ అధికారులు ఉంటారు. ప్రిసైడింగ్ అధికారి, పోలింగ్ అధికారి ఇద్దరు కలిసి ఓటు వేయడానికి వచ్చిన వారికి పూర్తిగా సహకరించాలి. మూడు విడతలుగా ఎన్నికలు ∙14 మండలాలను మూడు విభాగాలుగా విభజించారు. మొదటి విడతలో వనపర్తి, ఖిల్లాఘనపురం, పెద్ద మందడి, గోపాల్పేట్, రేవల్లి మండలాలు ఉన్నాయి. ∙రెండవ విడతలో కొత్తకోట, మదనాపురం, ఆత్మకూరు, అమరచింత మండలాలను చేర్చారు. ∙మూడవ విడతలో పెబ్బేరు, శ్రీరంగాపూర్, పానగల్, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలు చేర్చినట్లు అధికారులు ప్రకటించారు. ఏర్పాట్లు పూర్తిచేశాం.. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నాం. ఇప్పటికే పోలింగ్స్టేషన్ల గుర్తింపు, అవసరమైన సిబ్బందిని గుర్తించడం వంటి పనులు పూర్తిచేశాం. జిల్లాలోని 14 మండలాలను మూడు విడతలుగా విభజించాం. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. – వీరబుచ్చయ్య, జిల్లా పంచాయతీ అధికారి, -
పంచాయతీల్లో మహిళా ఓటర్లే ఎక్కువ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీలలో మొత్తం 1,37,15,150 మంది ఓటర్లుండగా.. వీరిలో 68,49,146 మంది పురుషులు, 68,65,144 మంది మహిళలు, 860 మంది ఇతరులు (ట్రాన్స్ జెండర్) ఉన్నారు. పురుషుల కంటే 15,998 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇతరుల కేటగిరీ ఓటర్లు అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 81 మంది ఉండగా.. వరంగల్ అర్బన్ జిల్లాలో తక్కువగా ముగ్గురే ఉన్నారు. ఇతరుల కేటగిరీ ఓటర్లు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే ఉండడం వల్ల పంచాయతీలలో ఈ సంఖ్య తక్కువగా ఉందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. నల్లగొండ జిల్లాలో ఎక్కువ మంది ఓటర్లున్నారు. అలాగే గ్రామ పంచా యతీలు, వార్డుల సంఖ్య విషయంలోనూ ఈ జిల్లానే అగ్రస్థానంలో ఉంది. మొత్తంగా 844 గ్రామపంచాయతీల్లో 7,340 వార్డులుండగా.. 8,50,664 మంది ఓటర్లు నల్లగొండ జిల్లాలో ఉన్నారు. ఇక మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో తక్కువ పంచాయతీలుండటంతో ఓటర్ల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. మొత్తంగా 61 పంచాయతీల్లో 596 వార్డులుండగా.. 1,26,011 మంది ఓటర్లున్నారు. -
పంచాయతీలకు స్టార్ రేటింగ్
బేస్తవారిపేట: పంచాయతీలకు ఇకపై గ్రేడింగ్ విధానం అమల్లోకి రానుంది. గ్రామాలు ఎంత మేరకు అభివృద్ధి సాధించాయో గుర్తించేందుకు నక్షత్రాల రూపంలో గ్రేడింగ్ ఇవ్వనున్నారు. గ్రేడింగ్ ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కానున్నాయి. క్షేత్ర స్థాయిలో ఆశించిన విధంగా అభివృద్ధి కనిపించడం లేదన్న కారణంతో నూతన విధానానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, భవిష్యత్‌లో చేపట్టే చర్యలపై ఈ రేటింగ్ విధానం ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు. అభివృద్ధి ఆధారంగా.. గ్రామ పంచాయతీల మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందించేందుకు ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో 11 అంశాల్లో జరిగిన అభివృద్ధి ఆధారంగా స్టార్ రేటింగ్ ఇస్తారు. 11 స్టార్లు సాధించిన గ్రామాలను ఆదర్శ పంచాయతీలుగా ప్రకటించి సముచిత రీతిలో ప్రభుత్వం గౌరవిస్తుంది. దశలవారీగా అన్ని గ్రామ పంచాయతీలకు మిషన్ అంత్యోదయ కార్యక్రమంలో భాగంగా 2019 అక్టోబర్ 2 నాటికి ఆదర్శ గ్రామాలుగా తీర్చదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు.గ్రామ పంచాయతీలకు విడుదలైన 14వ ఆర్థిక సంఘం నిధులు పక్కదోవ పట్టించకుండ సక్రమంగా వినియోగిస్తే 11 అంశాల్లో ఎంతో కొంత అభివృద్ధి సాధించవచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు. గతంలో పలువురు పంచాయతీ నిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు చేస్తూ, సర్పంచ్ల చేతివాటంతో పంచాయతీ జమాఖర్చులో తప్పుడు లెక్కలు నమోదు చేయడంతో నిధుల దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకుని పూర్తిస్థాయిలో గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తే ఆదర్శ గ్రామంగా నిలుస్తుందని పలువురు అంటున్నారు. ఇవే 11 అంశాలు.. ⇔ వంద శాతం మరుగుదొడ్లు వినియోగం జరగాలి ⇔ ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం, వీధిదీపాలను ఎల్ఈడీలుగా మారాలి ⇔ ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉండాలి ⇔ గ్రామ ప్రజలందరికీ సురక్షిత తాగునీరు అందాలి. ప్రతి ఇంటికి వ్యక్తిగత కుళాయి కనెక్షన్ ఉండాలి ⇔ గ్రామంలో పారిశుద్ధ్యాన్ని పెంపొందించేందుకు ఘన వ్యర్థాల నిర్వహన, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల ఏర్పాటు చేయాలి. ⇔ ప్రయాణాలకు అనువైన రహదాలు, గ్రామంలో అంతర్గత సీసీరోడ్లు, శివారు గ్రామాలకు కలుపుతూ రోడ్ల నిర్మాణం జరగాలి. ⇔ గ్రామాన్ని కో–నాలెడ్జ్ సొసైటీగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రతి ఇంటికి వెబ్సైట్. ⇔ ప్రతి పేద మహిళ పొదుపు సంఘంలో సభ్యులుగా ఉండేలా చూడడం, వారికి విభిన్న అంశాలపై నైపుణ్యాభివృద్ధితో శిక్షణ ఇచ్చి ఆదాయ వనరులను చూపడం ⇔ బడిఈడు పిల్లలంతా పాఠశాలకు హాజరవడం, అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, ఫర్నీచర్, ఫైబర్ నెట్ ఏర్పాటు ⇔ పిల్లలందరికీ 100 శాతం వ్యాధి నిరోధక టీకాలు, 100 శాతం ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాలు,100 శాతం పోషకాహార సేవలందజేయాలి ⇔ మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతకు కృషి, లింగ సమానత్వ సాధనకు మహిళలకు అన్నీ రంగాల్లో సమాన అవకాశాలు, గృహ హింస రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి. -
అంబుడ్స్‌మెన్ వ్యవస్థను అటకెక్కించారు
సాక్షి, హైదరాబాద్ : పంచాయితీ రాజ్ వ్యవస్థలో అవినీతి లేకుండా ఉండేందుకు అంబుడ్స్‌మెన్ వ్యవస్థ ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. పంచాయితీ రాజ్, రాజ్యాంగ సవరణపై మంత్రి లోకేశ్‌కు అవగాహన కల్పించాలని అన్నారు. కేరళలో పంచాయితీ రాజ్ వ్యవస్థను ఓ సారి చూసి రావాలని సూచించారు. వైఎస్సార్ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు పంచాయితీ రాజ్ దినోత్సవం.. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ సర్పంచ్‌లకు స్వతంత్ర ప్రతిపత్తి లేదని విమర్శించారు. రాజ్యాంగంలో ఇచ్చిన అధికారాలు అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో అంబుడ్స్‌మెన్ వ్యవస్థ అమలు కావడం లేదు.. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కేవలం పది అధికారాలను మాత్రమే పంచాయితీలకు ఇచ్చింది’ అని వ్యాఖ్యానించారు. వాటిని మైనింగ్, ఇసుక మాఫియాలా తయారు చేసిందని ఆరోపించారు. పంచాయితీలు కునారిల్లుతున్నా.. ప్రభుత్వ అక్రమాలు బయటపడతాయనే అంబుడ్స్‌మెన్ వ్యవస్థ ఏర్పాటు చేయడం లేదని ఉమ్మారెడ్డి విమర్శించారు. పండించిన పంటను కొనే నాధుడు లేడు.. అయినా ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పించన్, ఇల్లు కావాలంటే జన్మభూమి కమిటీ దగ్గరకు వెళ్లమంటున్నారు.. టీడీపీ వాళ్లు కాదంటే చెక్ పవర్ తీసేస్తారని ఎద్దేవా చేశారు. పంచాయితీ రాజ్ వ్యవస్థలో ఇన్ని దురాగతాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోదని అన్నారు. 73వ రాజ్యాంగ సవరణను అమలు చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తుచేశారు. కానీ ఇప్పడు వాటిని అమలు చేయకుండా ఆత్మ వంచనకు పాల్పడుతుందని తెలిపారు. గ్రామ పంచాయితీలను బలోపేతం చేసేందుకు ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
చకచకా.. కులగణన
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు ప్రామాణికంగా పరిగణించే కులగణన వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ చకచకా ఏర్పాట్లు చేస్తుండడంతో దానికి తగ్గట్టుగా పంచాయతీరాజ్ శాఖ వ్యవహరిస్తోంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని యోచిస్తుండడంతో సమాచారాన్ని తెప్పించింది. జిల్లా పరిధిలో మొత్తం 560 గ్రామ పంచాయతీల్లో 8,93,311 జనాభా ఉంది. ఇందులో ఎస్టీ 98,273, ఎస్సీ 1,90,466, బీసీ(అంచనా) 3,97,058, ఇతరులు 2,07,515 ఉన్నట్లు తేల్చింది. 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ 16 శాతం, ఎస్టీ 6 శాతం, బీసీ 34 శాతం రిజర్వేషన్లను అమలు చేశారు. ఇదే విధానం కొనసాగితే ఈసారి 90 గ్రామ సర్పంచ్ స్థానాలు ఎస్సీలకు, 34 స్థానాలు గిరిజనులకు, 190 సీట్లు బీసీలకు రిజర్వ్ చేయాల్సివుంటుంది. ఇతరులకు 246 సీట్లు దక్కనున్నాయి. కాగా, మొత్తం స్థానాల్లో సగం మహిళలకు కేటాయించాల్సివుంటుంది. ఓటరు జాబితా సవరణకు నోటిఫికేషన్ గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. నిర్దేశిత గడువులోపు ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎలక్షన్ కమిషన్‌ది కావడంతో ఆ మేరకు సన్నాహాలు చేస్తోంది. శుక్రవారం ఓటర్ల జాబితా ప్రకటించిన ఈసీ.. ఈ నెల 30వ తేదీన గ్రామ పంచాయతీలు/మండల పరిషత్ కార్యాలయంలో ముసాయిదా ఓటర్ల జాబితాను వెల్లడించనుంది. మే 1న జిల్లా, 3న మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలను నిర్వహించనుంది. మే 8వ తేదీవరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. పదో తేదీన క్లెయిమ్‌లను పరిష్కరించే యంత్రాంగం.. 17న తుది ఓటర్ల జాబితాను జిల్లా పంచాయతీ విభాగం ప్రకటించనుంది. వార్డులవారీగా రూపొందించే ఈ జాబితాలో ఓటర్ల ఫొటోలను పొందుపరచనుంది. ఇదిలావుండగా, శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. జూన్ 30వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ ముగించేలా సన్నద్ధం కావాలని ఆదేశించారు. -
బీసీ ఓటర్ల గణనకు వేళాయె!
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన దృష్ట్యా పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొత్త గ్రామ పంచాయతీల ప్రకారం ఓటర్ల సంఖ్యను నిర్ధారిస్తోంది. వార్డుల విభజనకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. పంచాయతీల్లోని ఆవాసాల వారీగా ఓట ర్ల సంఖ్యను గ్రామ కార్యదర్శులు లెక్కిస్తున్నారు. వివరాలు రాగానే పంచాయతీల్లోని మొత్తం ఓటర్ల ఆధారంగా వార్డుల వారీగా ఓటర్లను విభజిస్తారు. గ్రామ పంచాయతీల వారీగా బీసీ ఓటర్ల సంఖ్యను తెల్చే ప్రక్రియ 2 రోజుల్లో మొదలుకానుంది. తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ 2018 మార్చి 24న ఓటర్ల జాబితాను రూపొందించింది. అసెంబ్లీ నియోజకవర్గా ల్లోని ఓటర్ల జాబితా ఆధారంగా కొత్త గ్రామ పంచాయతీలు, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాను వేరు చేస్తున్నా రు. కొత్త పంచాయతీల ప్రకారమే ఈ ప్రక్రియ జరుగుతోంది. ఓటర్ల జాబితాలో ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఇప్పటికే నమోదై ఉంటారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ ఓటర్లను గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి ఇంటికీ వెళ్లి బీసీ ఓటర్లను గుర్తించనున్నారు. అనంతరం గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. నెల రోజుల్లో ఇది పూర్తవుతుందని పంచాయతీరాజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. జూలై 31లోగా ఎన్నికలు! రాష్ట్రంలో ప్రస్తుతం 8,684 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలోని 313 ఆవాసాలను మున్సిపాలిటీల్లో చేర్చా రు. కొత్తగా 4,380 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. వాటితో కలిపి రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సంఖ్య 12,741కి పెరిగింది. పంచాయతీల ప్రస్తుత పాలక వర్గాల పదవీకాలం జూలై 31 నాటికి పూర్తి కానుండగా.. అప్పటి నుంచి కొత్త పంచాయతీలు మనుగడలోకి వస్తాయి. ఆ లోపు ఎన్నికలు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పంచాయ తీరాజ్ శాఖ ఆధ్వర్యంలో బీసీ ఓటర్ల గణన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి అవుతుంది. రిజర్వేషన్ల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తుంది. నివేదిక అంది న తర్వాత 20 నుంచి 90 రోజుల్లోగా రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అమల్లోకి కొత్త చట్టం: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన తెలంగాణ పంచాయతీరాజ్ నూతన చట్టం అమల్లోకి వచ్చింది. కొత్త పాలకవర్గాలు కొలువుదీరిన తర్వాత వర్తించే 9 అంశాలను మినహాయించి.. మిగిలిన చట్టాన్ని అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న పంచాయతీరాజ్ చట్టం–1994 ముగిసింది. కొత్త పాలక వర్గాలు వచ్చాక సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు సంయుక్తంగా చెక్‌పవర్ ఉంటుంది. అప్పటివరకు సర్పంచ్, గ్రామ కార్యద ర్శులకు సంయుక్తంగా చెక్‌పవర్ నిబంధన ఉంటుంది. ఆడిట్ పత్రాలు సమర్పించకపోతే సర్పంచ్‌ను, గ్రామ కార్యదర్శిని తొలగించే అంశాన్ని కొత్త పాలకవర్గం వచ్చే వరకు వాయిదా వేశారు. సర్పంచ్‌ను ఆరు నెలల చొప్పున రెండుసార్లు సస్పెండ్ చేసే అధికారాన్ని కలెక్టర్‌కు ఇచ్చే నిబంధన అమలు సైతం ఇప్పుడే వర్తించదని అధికారులు పేర్కొన్నారు. -
మా గ్రామాలను తొలగించడం అన్యాయం...
సాక్షి, హైదరాబాద్ : నల్లగొండ జిల్లా, పెద్దవూర మండలంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న గ్రామ పంచాయతీల జాబితా నుంచి రామన్నగూడెం తండా, ఎనిమిది తండాలను తొలగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ రెండు తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలన్న పంచాయతీరాజ్ కమిషనర్ లేఖ ఆధారంగా జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలు సిద్ధం చేశారని, అయితే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆ ప్రతిపాదనను కలెక్టరే ఉపసహరించుకున్నారని, దీనిని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ టీపీసీసీ ఎస్టీ విభాగం వైస్ చైర్మన్ రమావత్ ప్రదాస్ నాయక్, రమావత్ నాగేశ్వరనాయక్లు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, రామన్నగూడెం ప్రస్తుత జనాభా 1000, ఎనిమిది తాండా జనాభా 1800పైన ఉందన్నారు. ఈ రెండు తాండాల మధ్య దూరం అరకిలోమీటరని,ప్రస్తుతం ఇవి తుంగతుర్తి గ్రామ పంచాయతీలో భాగంగా ఉన్నాయని వివరించారు. రామన్నగూడెం, ఎనిమిది తండాల గ్రామాలకు, తుంగతుర్తికి మధ్య దూరం 4 కిలోమీటర్ల ఉందని, అక్కడి వెళ్లేందుకు సైతం సరైన రవాణా సదుపాయాలు కూడా లేవని ఆయన కోర్టుకు నివేదించారు. ఇదిలా ఉంటే 500 జనాభా, ప్రస్తుతం ఉన్న పంచాయతీకి రెండు కిలోమీటర్ల మించి దూరం ఉన్న గ్రామాలను పంచాయతీలుగా చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ఈ మేరకు తమ గ్రామాలను సైతం కొత్త పంచాయతీలుగా చేయాలని జిల్లా కలెక్టర్‌కు పంచాయతీరాజ్ కమిషనర్ లేఖ రాశారని, ఆ లేఖ ఆధారంగా కలెక్టర్ ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలిపారు. అకస్మాత్తుగా జిల్లా కలెక్టర్ తమ గ్రామాలను కొత్త పంచాయతీల జాబితా నుంచి తొలగించారని, కేవలం స్థానిక రాజకీయ నేతల నుంచి వచ్చిన ఒత్తిళ కారణంతోనే ఆయన ఇలా వ్యవహరించారని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గ్రామ పంచాయతీలయ్యేందుకు తమ గ్రామాలకు పూర్తి అర్హత ఉందని ఆయన వివరించారు. ఈ వాదనలను పరిగణలనోకి తీసుకున్న న్యాయమూర్తి, ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తన ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. -
తండాల్లో పంచాయితీ
తండాల్లో ‘పంచాయితీ’ మొదలైంది. కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు.. తండాల విభజనకు దారితీస్తోంది. నూతనంగా ఆవిర్భవించే పంచాయతీలకు మా తండా పేరే పెట్టాలంటే.. మా తండా పేరు పెట్టాలంటూ భీష్మిస్తుండడం జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఐదొందలు జనాభా దాటిన గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశిం చింది. ఒకవేళ నిర్దేశిత జనాభా లేకపోతే సమీప తండాలను విలీనం చేసి ప్రతిపాదనలు పం పాలని సూచించింది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో రెండేసి, మూడేసి తండాలను కలుపుతూ పంచాయతీని ప్రతిపాదించారు. ఈ క్రమంలో ఏ తండాను పంచాయతీగా నిర్వచించాలనే అంశం విభేదాలకు దారితీస్తోంది. ఎవరికి వారు పంతానికి దిగుతుండడంతో కొత్త గ్రామ పంచాయతీల కసరత్తుపై ప్రభావం చూపుతోంది. 167 కొత్త గ్రామ పంచాయతీలు కొత్త గ్రామ పంచాయతీల జాబితా ఖరారుపై ఇంకా కసరత్తు జరుగుతోంది. తొలుత 174 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 167 పల్లెలే ఉండడంతో వాటిని ప్రతిపాదించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. 500 లోపు జనాభా, 1.5 కిలోమీటరు పరిధిలోని గ్రామాలను ప్రత్యేక పంచాయతీలుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు కొత్త పంచాయతీల ఏర్పాటు క్రతువును దాదాపుగా కొలిక్కి తెచ్చింది. కాగా, నూతన పంచాయతీల ఆవిర్భావంపై రకరకాల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీకి తమ ఊరు పేరే పెట్టాలని, ఫలానా రెవెన్యూ సర్వే నంబర్లు ప్రతిపాదిత పంచాయతీలోనే రావాలని కోరికలను స్థానికులు, నాయకులు అధికారుల ముందు పెడుతున్నారు. మరికొన్ని గ్రామాల్లోనైతే.. కాసుల వర్షం కురిపించే పరిశ్రమలను కూడా తమ గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చేలా చూడమని విన్నవిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగైదు గ్రామాలతో ఉన్న గ్రామ పంచాయతీని పునర్విభజిస్తుండడంతో రెవెన్యూను కోల్పోతామని భావిస్తున్న ప్రస్తుత పంచాయతీ పాలకవర్గాలు రెవెన్యూ సరిహద్దును కూడా సూచిస్తుండడం అధికారగణానికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదిలావుండగా, కొత్త గ్రామ పంచాయతీలకు సంబంధించిన ప్రతిపాదనలకు తుదిరూపు ఇచ్చిన పంచాయతీ విభాగం.. ప్రతిపాదనలను కలెక్టర్‌కు నివేదించింది. దీనిపై మరోసారి సూక్ష్మంగా పరిశీలించి జాబితాను ప్రభుత్వానికి పంపనుంది. అత్యధికంగా ఫరూఖ్‌నగర్, మాడ్గుల తదితర మండలాల్లో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడనున్నాయి. మరోవైపు ఆమనగల్లు పంచాయతీకి అనుబంధంగా ఐదు తండాలను గతంలో పంచాయతీలుగా ప్రతిపాదించినప్పటికీ, ఆమనగల్లును నగరపంచాయతీగా చేయాలనే యోచన ఉన్నందున.. తాజాగా వీటిని కొత్త పంచాయతీల జాబితా నుంచి తొలగించారు. ఇదిలావుండగా, జిల్లావ్యాప్తంగా 11 నగర పంచాయతీ/మున్సిపాలిటీల ఏర్పాటుపై ఏకాభిప్రాయం కుదిరింది. స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు ప్రతిపాదనలు ఖరారు చేయడంతో వీటిని యథావిధిగా ప్రభుత్వానికి పంపారు. బ్యాలెట్ బాక్సులొచ్చాయ్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సరిపడా బ్యాలెట్ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో అధికార యం త్రాంగం పొరుగు రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను తెప్పిస్తోంది. కొత్త పంచాయతీల జాబితా దాదాపు ఖరారు కావడం, పోలింగ్ కేంద్రాలపై స్పష్టత రావడంతో బ్యాలెట్ పెట్టెల లభ్యతపై దృష్టిసారించింది. రంగారెడ్డి జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని సర్పంచ్, వార్డు సభ్యులకు వేర్వేరు పోలింగ్ డబ్బాలు పెట్టనున్నందున 6,360 బాక్సులు అవసరమవుతాయని జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే, ఇందులో కేవలం 613 బాక్సులు మాత్రమే జిల్లాలో అందుబాటులో ఉన్నట్లు తేల్చింది. దీంతో మిగతా బ్యా లెట్ బాక్సులను కర్ణాటక నుంచి తీసుకురావా లని నిర్ణయించింది. ఇందులో భాగంగా.. విజయపుర జిల్లా నుంచి మంగళవారం జిల్లాకు బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చారు. ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు జరుగనున్నట్లు తాజా సంకేతాలను బట్టి తెలుస్తుండడంతో దానికి అనుగుణంగా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. -
పని చేయని ఈ-పంచాయతీలు..
గద్వాల రూరల్: ఈ–పంచాయతీలంటూ ఎంతో గొప్పగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించినా ప్రజలకు ఎలాంటి మేలు జరగడం లేదు. రెండేళ్ల క్రితం పంచాయతీ కార్యాలయాలకు కంప్యూటర్లు పంపిణీ చేసినా ఇంటర్నెట్ సౌకర్యం, ఆపరేటర్ల కొరత కారణంగా అవి మూలన పడ్డాయి. కొన్ని గ్రామాల్లో పంపిణీ చేసిన సామగ్రి లేకపోవడం గమనార్హం. దీంతో గ్రామపంచాయతీ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంతోపాటు అన్ని సేవలు ప్రజల ముంగిట నిలపాలన్న లక్ష్యం నీరుగారిపోతోంది. జిల్లాలోని 195 గ్రామ పంచాయతీలకుగాను 118చోట్ల మూడేళ్ల క్రితం ఈ–పంచాయతీ సేవలు ప్రారంభించారు. ఒక్కో గ్రామపంచాయతీకి అప్పట్లో రూ.40వేలు విలువజేసే కంప్యూటర్ మానిటర్, యూపీఎస్, టేబుల్ తదితర పరికాలను అందించారు. ఆయా గ్రామాల్లో ఆపరేటర్ల నియామకానికి శ్రీకారం చుట్టినా అది అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం కేవలం మండల స్థాయిలోనే 12చోట్ల కొనసాగుతోంది. రెండేళ్లపాటు కంప్యూటర్ ఆపరేటర్లకు వేతనాలు చెల్లించగా కాంట్రాక్టు పూర్తి కావడంతో సంబంధిత కంపెనీ ఈ–సేవల నుంచి తప్పుకొంది. అనంతరం ప్రభుత్వం గ్రామపంచాయతీల నిధుల నుంచి మండలస్థాయిలో ఆపరేటర్లకు వేతనాలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 10శాతం వేతనం రూపంలో వివిధ దశల్లో గ్రామపంచాయతీ నిధుల నుంచి చెల్లిస్తున్నారు. మరోవైపు పంచాయతీ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నా ఈ–సేవలపై మాత్రం దృష్టి సారించడం లేదు. రెండు గ్రామ పంచాయతీలను క్లస్టర్‌గా ఏర్పరచి మండలానికి ముగ్గురు చొప్పున ఆపరేటర్లు ఉండాలని సూచించింది. 12రకాల సేవలు అందించాలి ఈ–పంచాయతీల్లో భాగంగా ఇంటిపన్ను, ఆస్తి వివరాలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ వ్యయాలు, నీటి పథకాలు, కొళాయి కనెక్షన్లు, వీధిదీపాలు, వనరులు, అక్షరాస్యత శాతం, ఇంటి పన్నుల వసూళ్లు, బకాయిల వివరాలు అన్నీ కంప్యూటర్లోనే నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. అంతేకాక సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడంతోపాటు 12రకాల సేవలను అందించాలి. అయితే కేవలం మండల పరిషత్ కార్యాలయాల్లోనే కంప్యూటర్లు వినియోగంలో ఉండగా గ్రామాల్లో మూలకు చేరాయి. చాలా గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో లేకపోవడంతో పంపిణీ చేసిన కంప్యూటర్లు నిరుపయోగంగా ఉన్నాయి. మండలం కేంద్రాల్లో కొనసాగుతున్న ఈ–పంచాయతీల సేవలతోపాటు స్వచ్ఛభారత్, ఆసరా పింఛన్లు, హరితహారం, ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన జాబితాల తయారీలో ఆపరేటర్లు బిజీగా ఉన్నారు. దీంతో తమకు పని తలకు మించిన భారమవుతోందని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు. చాలా ఇబ్బందిగా మారింది నాకు మూడు గ్రామ పంచాయతీలు అప్పగించారు. ఎందులోనూ ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో నిధులు, లావాదేవీలు, పింఛన్లు, నీటి, ఇంటి పన్ను బకాయిలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతిసారి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి నమోదు చేయాల్సి వస్తోంది. – సురేష్, పంచాయతీ కార్యదర్శి, గోనుపాడు, గద్వాల మండలం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతోపాటు ఆపరేటర్ల సమస్య కారణంగా కంప్యూటర్లు వృథాగా ఉన్నది వాస్తవమే. చాలా గ్రామాల్లో బీఎస్ఎన్ఎస్ బ్రాడ్‌బాండ్ సేవలు అందుబాటులోకి రాలేదు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – కృష్ణ, డీపీఓ, గద్వాల -
పంచాయతీలకు కొత్త మ్యాపులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామ పటాల రూపకల్పనలో ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. ప్రస్తుతమున్న రెవెన్యూ గ్రామాలవారీ మ్యాపులు కాకుండా ప్రతి గ్రామ పంచాయతీకి ఓ మ్యాపును సిద్ధం చేస్తోంది. ఈ మ్యాపుల్లో సరిహద్దులు, రైల్వే, రోడ్డు మార్గాలతోపాటు కొత్తగా సర్వే నంబర్లవారీ భూముల వివరాలు, ప్రభుత్వ భూముల వివరాలను సర్వేశాఖ ప్రత్యేకంగా పేర్కొననుంది. ప్రతి సర్వే నంబర్ స్పష్టంగా... రెవెన్యూ గ్రామాలవారీగా ఉన్న మ్యాపుల్లో రెవెన్యూ గ్రామ సరిహద్దులతోపాటు రైల్వే, రోడ్డు మార్గాలు, అటవీ భూములు, నీటివనరులు, వృథాగా ఉన్న భూములు తదితర వివరాలే ఉండేవి. సర్వే నంబర్లను కేవలం ఉదహరించేవారు కానీ ఏ నంబర్లో ఎంత భూమి ఉందన్న వివరాలు ఉండేవి కావు. ఇప్పుడు సర్వే నంబర్లవారీ భూముల వివరాలతోపాటు ప్రత్యేకంగా ప్రభుత్వ భూములను కూడా మ్యాపుల్లో గుర్తించనున్నారు. గతంలో ఉన్న దాదాపు 9 వేల పంచాయతీలకుతోడు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న 4 వేల పంచాయతీలను కలిపి మొత్తం 13 వేల మ్యాపులను సర్వేశాఖ సిద్ధం చేస్తోంది. వనరుల్లో స్పష్టత... రెవెన్యూ గ్రామాల మ్యాపుల స్థానే గ్రామ పంచాయతీ మ్యాపుల తయారీ ద్వారా ప్రతి గ్రామానికి ఉన్న వనరుల విషయంలో స్పష్టత తీసుకురావాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ గ్రామాలవారీ మ్యాపుల ద్వారా ఆయా గ్రామాల్లో ఉన్న పంచాయతీలన్నింటినీ ఒకే సరిహద్దు కింద చూపిస్తున్నారు. మరికొన్ని చోట్ల రెండు, మూడు రెవెన్యూ గ్రామాలు కలిపి ఓ పంచాయతీగా ఉంటే ఒకే పంచాయతీకి రెండు, మూడు మ్యాపులున్నాయి. ఈ నేపథ్యంలో ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వనరుల విషయంలో స్పష్టత రావాలంటే గ్రామ పంచాయతీలవారీగా మ్యాపులు తయారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం, ఉపాధి హామీ పథకం పనులు, భూ లావాదేవీలను స్పష్టంగా గ్రామ పంచాయతీలవారీగా విభజించే అవకాశం కలగనుంది. అయితే ఈ మ్యాపుల తయారీకి నిధుల కొరత ఉందని సర్వేశాఖ అధికారులు వాపోతున్నారు. ప్రభుత్వం మ్యాపులను తయారు చేయాలని చెప్పింది కానీ ఇందుకు అయ్యే ఖర్చును ఏ పద్దు కింద తీసుకోవాలో పేర్కొనలేదని జిల్లాస్థాయి అధికారులు చెబుతున్నారు. జిల్లాకు సగటున రూ. 2 లక్షల వరకు ఖర్చవుతోందని, కొన్ని చోట్ల కలెక్టర్లు ఈ ఖర్చును ఇచ్చేందుకు అంగీకరిస్తున్నా మరికొన్ని జిల్లాల్లో సర్వేశాఖ అధికారులు ఎప్పటికైనా రాకపోతాయా అనే ఆలోచనతో సొంత నిధులను వినియోగిస్తున్నట్లు సర్వేశాఖలో చర్చ జరుగుతుండటం గమనార్హం. -
ఎల్ఈడీ వెలుగులేవీ?
కర్నూలు(అర్బన్): గ్రామాల్లో ఎల్ఈడీ దీపాల ఏర్పాటుకు గ్రహణం పట్టింది. గతేడాది ప్రారంభంలో జిల్లాలోని 889 పంచాయతీల్లో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో నంద్యాల, గోస్పాడు మండలాల్లో మాత్రమే పూర్తి ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేశారు. మిగిలిన పంచాయతీ(854)ల గురించి పట్టించుకోవడం లేదు. కర్నూలు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈఎస్‌ఐఎల్ కంపెనీ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్టు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మూడో లైన్ ఏదీ? గ్రామ పంచాయతీల్లోని అన్ని వీధుల్లో ఎల్ఈడీ లైట్లు వేయాలంటే ముందుగా ప్రస్తుతం ఉన్న విద్యుత్ వైరింగ్‌కు తోడు విద్యుత్ సరఫరాను కంట్రోల్ చేసేందుకు అవసరమైన మూడో లైన్‌ను (ఆన్ ఆఫ్) వేయాల్సి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం 2,96,478 మీటర్ల వైర్ అవసరం కానుంది. ఏపీఎస్పీడీసీఎల్ ఉచితంగా అన్ని గ్రామ పంచాయతీల్లో మూడో లైన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే సంస్థ ఈ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ఎల్ఈడీ లైటింగ్‌లో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 1.81,760 విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. అనేక గ్రామ పంచాయతీలు విస్తరించిన నేపథ్యంలో తాజాగా 19,969 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు గుర్తించారు. ఒక్కో ఎల్ఈడీ బల్బుకు రూ.150 చెల్లించాల్సిందే ... గ్రామాల్లో ఎల్ఈడీ బల్బుల ఏర్పాటుకు సంబంధించి ఆయా గ్రామ పంచాయతీలు ఒక్కో బల్బుకు రూ.150 ప్రకారం చెల్లించాల్సి ఉంది. ఒక్క సారి ఈ మొత్తం చెల్లిస్తే సదరు కంపెనీ పదేళ్లపాటు వాటి నిర్వహణ బాధ్యతను స్వీకరిస్తుంది. ఈ మేరకు జిల్లాలో మొత్తం 2,01,729 ఎల్ఈడీ బల్బులకు గాను రూ.3.02 కోట్లను పంచాయతీలు చెల్లించాల్సి ఉంది. మార్చి నాటికి పూర్తి చేయాలని కోరాం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మూడో విద్యుత్ లైను ఏర్పాటు చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులను కోరాం. అలాగే అవసరమైన మేరకు కొత్తగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించేందుకు చర్యలు చేపట్టాం. ఈ పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని పంచాయతీల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. మార్చి ఆఖరు నాటికి ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ దాదాపు పూర్తి చేయాలని కోరాం. – బీ పార్వతి, జిల్లా పంచాయతీ అధికారిణి -
వేతన వెతలు
గ్రామ పంచాయతీల కార్మికుల పట్ల పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. నెలనెల వేతనాలు అందక ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. నిత్యం పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచుతున్నా కార్మికుల సమస్యలు పరిష్కారంపై పాలకులు అలివిమాలిన నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏళ్లతరబడి పోరాడి సాధించుకున్న జీవోలు సైతం అమలకు నోచుకోని దుస్థితి జిల్లాలో నెలకొంది. ప్రభుత్వాలు.. లాఠీ దెబ్బలకు వెరవకుండ పోరాడి సాధించుకున్న జీవోలను అధికారులు కాగితాల్లోనే మగ్గబెడుతున్నారు. వాటిని అమలు చేయకుండా సంకెళ్లు వేసి.. పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఒంగోలు టూటౌన్: పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల పట్ల పాలకులు అవలంబిస్తున్న నిర్లక్ష్యాన్ని పరిశీలిస్తే.. జిల్లాలో 1028 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో పారిశుద్ధ్య కార్మికులు, టైమ్‌స్కేల్ కార్మికులు, పర్మినెంట్, టెండర్, ఎన్ఎంఆర్ ఇలా ఐదు రకాల కార్మికులు పనిచేస్తున్నారు. పర్మినెంట్, టైమ్ స్కేల్ కార్మికులు కాంట్రాక్ట్, ఎన్ఎంఆర్ (దినసరి కూలీలు) పద్ధతిలో పనిచేసే కార్మికులు దాదాపు 1000 మంది ఉన్నారు. ఎన్‌ఎంఆర్‌లు 100 వరకు ఉన్నారు. వీరందరికీ పంచాయతీలకు వచ్చే ఆదాయంలో 30 శాతం నిధులను జీత, భత్యాలకు ఖర్చు పెట్టాల్సి ఉంది. ఈ విధానం ఏ గ్రామ పంచాయతీలో అమలుకు నోచుకోవడం లేదు. అరకొర వేతన కార్మిక వేతన చట్టం ప్రకారం నెలకు రూ.12 వేల వరకు ఇవ్వాల్సి ఉంది. అలా కాకుండా కేవలం రూ.ఆరు వేలు, కొన్ని పంచాయతీల్లో రూ.7 వేలలోపు వేతనాలు చెల్లిస్తూ కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు. ఈ అరకొరగా ఇచ్చే వేతనాలు కూడా నెలనెలా ఇవ్వని దుస్థితి నెలకొంది. జిల్లాలోని పొదిలి, పామూరు, సంతనూతలపాడు, దర్శి ఇలా చాలా గ్రామ పంచాయతీల్లో ఏడాది నుంచి జీతాలు ఇవ్వని పరిస్థితి ఉంది. కొన్ని పంచాయతీల్లో మూడు నెలలు, ఆరు నెలలకు కూడా ఇవ్వడం లేదు. కొత్తపట్నం పంచాయతీలో పది మంది స్వీపర్లు వారికి 6 నెలల వేతనాలు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం అనధికారికంగా ఒక్కో కార్మికునికి రూ.3 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. సంతనూతలపాడులో ఇటీవల కార్మికులు జీతాల కోసం రోడ్డెక్కి ఆందోళన చేశారు. పది నెలలకుపైగా జీతాలు ఇవ్వాల్సి ఉంటే కేవలం 5 నెలలకు ఇచ్చి ఊరటనిచ్చారు. ఇలా నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. చిల్లర దుకాణాల్లో కూడా అప్పులు పెరిగి తిరిగి అప్పు పుట్టని పరిస్థితి నెలకొంది. అయినా అధికారులకు కార్మికుల పట్ల కనికరం లేకుండా పోతోంది. జీవో అమలులో నిర్లక్ష్యం కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, నెల మొదటి వారంలో జీతాలు చెల్లించాలని, బకాయిలు వెంటనే చెల్లించాలని 13–07–2011న (మెమో నెం.16306 /ఇ.ఎస్.టి.టి /4 /ఎ2 /2010–4), (పి.ఆర్.ఓ.సి. నెం. సి /953/2014) ప్రకారం రోజుకు రూ.300 ఇవ్వాలని ఆదేశాలు గతంలో జారీ చేశారు. జారీ చేసిన జీవో కాపీలు జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా పంచాయతీ, స్థానిక పంచాయతీలకు అందాయి. దశాబ్దాలు గడిచినా నేటికీ జీవో అమలు చేసిన నాథుడు లేడు. కార్మికులు పోరాడి సాధించుకున్న ఆ జీవో కాగితాల్లోనే మగ్గుతోంది. మళ్లీ తాజాగా ఇటీవల ప్రభుత్వం 151 జీవోని విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం కార్మికులకు నెలకు రూ.12 వేలు వేతనం ఇవ్వాల్సి ఉంది. ఇంతవరకు ఈ జీవో అమలకు నోచుకోలేదు. హైకోర్టు ఆదేశాలు బేఖాతర్ హైకోర్టు ఇటీవల ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. గ్రామ పంచాయతీల్లో కార్మికుల నియామకానికి నిర్వహిస్తున్న టెండర్ల విధానాన్ని రద్దు చేయాలని ఆదేశించింది. దీర్ఘకాలికంగా పనిచేస్తున్న కార్మికులను కొనసాగించాలని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు పంచాయతీరాజ్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. టెండర్ల విధానం రద్దు చేస్తామని చెప్పారు. టెండర్ల రద్దు చిత్తూరు జిల్లాలో అమలకు నోచుకుంది. మన జిల్లాలో ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. కలగానే 010 పద్దు జీతాలు పర్మినెంట్ కార్మికులకు ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని 2011 సెప్టెంబర్‌లో ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జాయింట్ కలెక్టర్ అధ్యక్షుడిగా, జిల్లా పంచాయతీ అధికారి, డీఎల్‌పీవోతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. పర్మినెంట్ కార్మికులను గుర్తించి వివరాలు పంపిస్తే ప్రభుత్వం ఖజానా శాఖ ద్వారా జీతాలు చెల్లించే అవకాశం ఉంటుంది. పర్మినెంట్ కార్మికులు ఉన్న పంచాయతీలకు ఆర్థిక భారం తగ్గుతుంది. మిగిలిన పార్ట్‌టైం, ఎన్ఎంఆర్ పారిశుద్ధ్య కార్మికులకు పంచాయతీలు వేతనాలు ఇచ్చేందుకు వెసులుబాటు కలుగుతుంది. జిల్లాలో పర్మినెంట్ కార్మికులను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆందోళనకు సిద్ధం గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో ఆందోళన చెపడుతున్నట్లు సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు మజూందర్ తెలిపారు. టెండర్ల విధానం రద్దు చేయాలని, నెలనెలా కార్మికులకు జీతాలు ఇవ్వాలని, 151 జీవో ప్రకారం జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మజుందార్ పేర్కొన్నారు. -
కొత్త గ్రామ పంచాయతీలు 231
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లాలో కొత్త గ్రామపంచాయతీల జాబితా రూపొందించడంపై బుధవారం అధికారులు కసరత్తు చేపట్టారు. జిల్లా పంచాయతీ విభాగం.. ప్రతిపాదిత గ్రామాల సర్వే నంబర్లు, మ్యాపుల రూపకల్పనపై దృష్టిసారించింది. ప్రస్తుతం జిల్లా పరిధిలో 415 గ్రామ పంచాయతీలుండగా తాజా ప్రతిపాదనలతో ఈ సంఖ్య 646కు చేరనుంది. అయితే, నగర శివార్లలోని పంచాయతీలను హైదరాబాద్ మహానగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ)లో విలీనం చేయాలనే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో ఉండడం.. కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలలో కలపాలనే ప్రతిపాదనలు కూడా ఉండడంతో దాదాపు 40 గ్రామపంచాయతీలు జీహెచ్ఎంసీలో, మున్సిపాలిటీల్లో విలీనమయ్యే అవకాశం కనిపిస్తోంది. గండిపేట మండలంలోని మొత్తం గ్రామాలు జీహెచ్ఎంసీలో విలీనం కానుండగా శంషాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లో ఎక్కువ పంచాయతీలు గ్రేటర్లో కలవనున్నాయి. ఈ మేరకు ఇటీవల జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. మరోవైపు 15వేల జనాభా దాటిన పంచాయతీలను పురపాలక సంఘాలు కూడా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో ఆమనగల్లు కొత్త మున్సిపాలిటీగా ఆవిర్భవించనుంది. దీంతో ఒకవైపు ఇబ్బడిముబ్బడిగా పంచాయతీలు పెరిగినా.. మరోవైపు కొన్ని గ్రామాలు పంచాయతీరాజ్‌శాఖ నుంచి పురపాలక శాఖ పరిధిలోకి వెళ్లనున్నాయి. 231 పల్లెలకు పంచాయతీ శోభ 500 జనాభా కలిగి ఉండి.. ప్రస్తుత పంచాయతీకి 1.5 కిలోమీటరు దూరంలో ఉన్న ప్రతి పల్లెను గ్రామ పంచాయతీగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే 300 జనాభా ఉన్న ఆవాసాలను కూడా పంచాయతీలు ప్రతిపాదించవచ్చని స్పష్టం చేశారు. మైదాన ప్రాంతాల్లో మాత్రం 500 జనాభానే ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్దేశించారు. దీంతో జిల్లావ్యాప్తంగా 231 పల్లెలకు కొత్తగా పంచాయతీ హోదా కలిగే అవకాశం కనబడుతోంది. గత నెలలో ప్రతిపాదించిన సంఖ్య కంటే తాజా కసరత్తులో పంచాయతీల జాబితా పెరగడం అధికారయంత్రాంగాన్ని ఆశ్చర్యపరిచింది. 500 జనాభాను కటాఫ్‌గా నిర్దేశించినందున ప్రతిపాదిత పంచాయతీల సంఖ్య తగ్గుతుందని అంచనా వేసింది. అయితే, ఈ సంఖ్య గణనీయంగా పెరగడం గమనార్హం. అత్యధికంగా మాడ్గుల మండలంలో కొత్త పంచాయతీలు ఏర్పడుతున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ నెల 25వ తేదీలోపు పంచాయతీల ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం ఆదేశించడంతో దానికి అనుగుణంగా తర్జనభర్జనలు పడుతోంది. సర్వేనంబర్ల వారీగా, ప్రతిపాదిత పంచాయతీ భూభాగంతో కూడిన మ్యాప్‌ల తయారీలో తలమునకలైంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న సర్కారు..ఆలోపు కొత్త పంచాయతీరాజ్ చట్టానికి ఆమోదముద్ర వేయాలని నిర్ణయించింది. చట్టానికి రాజముద్ర పడడమే తరువాయి పంచాయతీ సమరానికి నగారా మోగించే ఆలోచన చేస్తోంది. పల్లెల్లో వేడెక్కిన రాజకీయం.. ఆర్నెళ్ల ముందే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలనే ప్రభుత్వ యోచనతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కొంతకాలంగా ఎలాంటి హడావుడీ లేకుండా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన పల్లెవాసులకు పంచాయతీ పోరు హాట్‌టాపిక్ మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్య ప్రకటన అధికారపార్టీనే కాదు విపక్షాలకూ షాక్ ఇచ్చింది. ఇప్పట్లో ఎన్నికలు ఉండవని అనుకుంటున్న రాజకీయ నాయకులకు తాజా పరిణామం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ప్రత్యక్ష పద్ధతా, పరోక్ష విధానమా అనే అంశంపై ఇప్పటికే చర్చోపచర్చలు జరుగుతుండగా.. ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టానికి ప్రభుత్వం పదును పెడుతుండడం, ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తుండడంతో రిజర్వేషన్లపై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. -
గడువులోగా గ్రామ పంచాయతీ ఎన్నికలు: జూపల్లి
సాక్షి, భువనగిరి : గడువు లోగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడాతూ వచ్చే ఎన్నికల్లో విపక్ష పార్టీలకు స్థానమే లేకుండా ప్రజలు తీర్పు ఇస్తారని మంత్రి తేల్చిచెప్పారు. పారదర్శకత కోసమే పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేస్తున్నామని తెలిపారు. కొత్త చట్టంతో నీతివంతమైన పాలన అమల్లోకి వస్తుందని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. -
కొత్తగా 40 మున్సిపాలిటీలు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు మరింత మెరుగ్గా ప్రభుత్వ పథకాలు అందించడంతో పాటు పరిపాలనా సౌలభ్యాన్ని పెంచేందుకు రాష్ట్రంలో పురపాలక సంస్థల పరిధిని మరింత విస్తృతం చేయాల్సిన అవసరముందని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీతో కలిపి రాష్ట్రంలో ఉన్న 74 నగర, పురపాలక సంస్థలకు అదనంగా మరో 40 పురపాలక సంస్థలను ఏర్పాటు చేసే అవకాశముందని వెల్లడించారు. స్థానిక ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. రామాయంపేట, బాన్సువాడ, నర్సాపూర్ వంటి అనేక మేజర్ గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీ హోదా కల్పించాలని విజ్ఞప్తులొస్తున్నాయని తెలిపారు. పురపాలక సంస్థల్లో అభివృద్ధి కార్యక్రమాలపై మంగళవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని చాలా పట్టణాల మధ్యలో మేజర్ గ్రామ పంచాయతీలున్నాయని, దీంతో ప్రభుత్వ పథకాల అమలు, అనుమతులు, పరిపాలన పద్ధతుల్లో భిన్నత్వం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొత్త పురపాలికల ఏర్పాటుతో పాటు గ్రామ పంచాయతీలను సమీప పట్టణాల్లో విలీనం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో పట్టణీకరణ సమస్యలను ఎదుర్కొనే అవకాశం కలుగుతుందని చెప్పారు. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, గ్రామ పంచాయతీల విలీనం అవకాశాలపై నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శివారు గ్రామాలను పట్టణాల్లో విలీనం చేసి పట్టణీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సాధ్యమైనన్ని ఎక్కువ పట్టణాలు కొత్త పురపాలికల ఏర్పాటుకు 15 వేల జనాభా ఉన్న మేజర్ గ్రామ పంచాయతీలను గుర్తించాలని కలెక్టర్లకు కేటీఆర్ ఆదేశించారు. 2011 జనాభా లెక్కలు, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా 15 వేలకు మించి జనాభా ఉన్న గ్రామ పంచాయతీల వివరాలు అందజేయాలని సూచించా రు. ప్రస్తుతమున్న మున్సిపాలిటీల పరిధి పెంచేందుకు 3 నుంచి 5 కి.మీల పరిధిలోని గ్రామాలను విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని కోరారు. గ్రామ పంచాయతీల పాలక మండలిల కాలపరిమితి వచ్చే ఏడాది జూలైలో ముగుస్తుందని, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు చట్టపరమైన చర్యలను ఆ వెంటనే ప్రారంభించాలని పురపాలక శాఖను ఆదేశించారు. పంచాయతీల హోదాను ఉపసంహరించడంతో పాటు మున్సిపాలిటీల హోదా కల్పించేందుకు ఆ తర్వాత ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. సాధ్యమైనన్ని ఎక్కువ సంఖ్యలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
నిర్ణయమే తరువాయి..
సాక్షి, యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడానికి అర్హత కలిగిన మధిర గ్రామాల నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వం సూచించిన ప్రకారం తీరొక్క రకంగా వివరాలు సేకరించారు. జిల్లాలోని 14 పూర్వ మండలాలతో పాటు జనగామ జిల్లాలోని గుండాల మండలం నుంచి 95 గ్రామాలను అధికారులు ఎంపిక చేశారు. ఆయా మండలాలకు చెందిన ఎంపీడీఓలు రూపొందించిన జాబితా ప్రకారం ఇవి పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు అర్హత కలిగి ఉన్నాయి. వీటితోపాటు మరికొన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు 115 గ్రామాల నుంచి నూతన పంచాయతీల కోసం ప్రజ ల నుంచి లిఖిత పూర్వక దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని 15 మండలాల్లో ప్రస్తుతం 334 గ్రామ పంచాయతీ లు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 784 మధిర గ్రామాలు ఉన్నాయి. వీటిలో 500 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలు 371 ఉండగా, 500 కంటే తక్కువ జనాభా కలిగినవి 413 ఉన్నాయి. తాజా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారుల లెక్కల్లో 81 గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడానికి అర్హత కలిగినట్టు నిర్ధారించి నివేదికను పంపారు. అధికారులు సేకరించిన వివరాలు ఏ ప్రాతిపదికనంటే.. 500మంది కంటే ఎక్కువ, రెండు కిలో మీటర్లకు పైన దూరం ఉన్న మధిర గ్రామాలు 18 600 మంది కంటే ఎక్కువ జనాభా రెండు కిలోమీటర్ల పైన గ్రామాలు 8 750 మందికి మించి రెండు కిలోమీటర్ల పైన దూరం ఉన్న గ్రామాలు 8 1.000 కంటే ఎక్కువ జనాభా, రెండు కిలోమీటర్ల పైన దూరం ఉన్నవి 4 మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం, 500లోపు జనాభా ఉన్న మధిర గ్రామాలు 68 నాలుగు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం 500 లోపు జనాభా ఉన్న మధిర గ్రామాలు 22 ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం 500లోపు జనాభా ఉన్న మధిర గ్రామాలు 37 కొత్త పంచాయతీలపై ఆశలు.. ప్రజల డిమాండ్లకు అనుగుణంగా కొత్త గ్రామ పం చాయతీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు అర్హత కలిగిన మదిర గ్రామాల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. రిజన తండాలు, మధిర గ్రామాలను ప్రత్యేక పంచాయతీలుగా చేసే విధంగా కార్యాచరణ చేపట్టామని మంత్రి జూపల్లి కృష్ణారావు శాసనసభలో ప్రకటించడంతో అర్హత కలిగిన గ్రామాల ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానానికి అనుగుణంగా నూతన పంచాయతీలు ఏర్పాటు చేసి కచ్చితంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడంతో ఆయా గ్రామల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
92 తండాలకు మహర్దశ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామన్న సీఎం కేసీఆర్ హామీ త్వరలో అమలు కాబోతుంది. జిల్లాలో ఇప్పటికే 500 జనాభా ఉన్న తండాల నివేదికలను జిల్లా పంచాయతీ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. వరంగల్ జరిగిన కాకతీయ మేగా టెక్స్లైల్ పార్క్ శంకుస్తాపన సభలో సీఎం కేసీఆర్ ఈనెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడుతామని ప్రకటించారు. జిల్లాలో 92 తండాలు జిల్లాలో అర్హత ఉన్న 92 పంచాయతీల్లో పర్యటించి తుది నివేదికను జిల్లా పంచాయతీ అధికారులకు సమర్పించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది, రెవెన్యూ అధికారుల, సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పంచాయతీలుగా మారే తండాలపై కసరత్తు చేశారు. 2018 జూలైలో గ్రామ పంచాయతీల ఎన్నికలు జరుగనున్నాయి. వాటితోపాటు పంచాతీలుగా మారే తండాలకు ఎన్నికలు జరుగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో 20 తండాల వినతులు జిల్లాలో మరో 20 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని జిల్లా పంచాయతీ కార్యాలయానికి ఇటీవల వినతులు వచ్చాయి. మా తండాకు అన్ని హంగులు ఉన్నాయని 20 తండాల నుంచి గిరిజనులు వినతులు అందించారు. జిల్లాలోని జడ్చర్ల, నారాయణపేట్, మక్తల్ నియోజవకవర్గాల నుంచి తండా డిమాండ్లు వస్తున్నాయి. ఈ వినతులను సంబందిత మండల ఎంపీడీఓలకు పరిశీలించి డీపీఓ అధికారులు పంపించారు. ఇలా వచ్చిన వినతులను ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా వినతుల్లో వచ్చిన తండాలకు ఉన్నాయా లేదా అని పరిశీలించనున్నారు. ఇలా పరిశీలించిన అనంతరం నివేదికలను డీపీఓకు సమర్పించనున్నారు. ఇక్కడి నుంచి జిల్లా డీపీఓ అధికారులు రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. ఆలోపే సర్పంచ్ల ఎన్నికలు సర్పంచుల ఎన్నికలను జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని జరుగుతున్న ప్రచారానికి సీఎం కేసీఆర్ తెరదించారు. వరంగల్ సభలో సర్పంచుల ఎన్నికల సమయంలోపు నిర్వహిస్తామని చెప్పారు. సమయానుకూలంగానే ఎన్నికలను నిర్వహింస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది సర్పంచుల పదవీకాలం ముగియనుండడంతో ప్రభుత్వం ఎన్నికలకు వెల్లే యోజనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పంచాయతీ అధికారులు నుంచి వివరాలు తెప్పించుకునే పనిలో ప్రభుత్వం పడింది. వచ్చే ఏడాది జూలై నెలతో ప్రస్తుత పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ముగియనుంది. ప్రభుత్వం ముందస్తుగా ఎన్నికలకు జరపాలనే యోజనలో ఉన్నట్లు సీఎం ప్రకటనతో అర్థం అవుతుంది. వడివడిగా ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం ఓటర్ జాబితా, బూత్ వివరాల సేకరించే పనిలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 26 మండలాలు 468 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 2011 లెక్క ప్రకారం 11,78,574 జనాభా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఓ సర్వే నిర్వహించిన దాని ప్రకారం 15,88, 973 జనాబా ఉంది. ఈ గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కావల్సిన మౌళిక సదుపాయాలపై జిల్లా యంత్రాంగాన్ని ఎన్నికల కమిషన్ ఇప్పటికే వివరణ కోరంది. ఈ మేరకు జిల్లాలోని ఉన్న వనరులపై జాబితా సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించింది. ఈ సారి ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో జిల్లాలో ఎన్ని ఈవీఎంలు, ఎంత మంది సిబ్బంది. ఎన్ని నిదులు అవసరం అనే కోణంలో అధికారులు లెక్కలు తీస్తున్నారు. జాబితా తయారీకి కసరత్తు... సీఎం ప్రకటనతో ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండడంతో అధికార యంత్రాగం ఇప్పటికే వివరాల సేకరణ చేపట్టింది. ఇప్పటికే ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుండగా ఎన్నికల నాటికి పూర్తి ఓటరు జాబితా విడుదల కానుంది. జిల్లాలో వార్డులు, పోలింగ్ బూత్‌లు, అవసరమైన సిబ్బంది తదితర వివరాలు ప్రభుత్వానికి అందజేయనుంది. కాగా పదవీ కాలం ముగిసేలోపే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. 2019లో సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్దమవుతున్న పార్టీలకు వచ్చే ఏడాదిలో జరిగే సర్పంచ్ ఎన్నికలు కీలకం కానున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్కు చెందిన సర్పంచులు అధికంగా ఉన్నాయి. గ్రామ స్థాయి నుంచే ప్రజల మద్దతు కూడగట్టుకుంటే సార్వత్రిక ఎన్నికల్లోపు మరింత బలపడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆయా పార్టీలు సభ్యత్వ నమోదు పార్టీలో చేరికలు, కమిటీలు ఏర్పాటు జిల్లాలో దాదాపు పూర్తి చేసుకుంటున్నాయి. బూత్ స్థాయిలో బలపడాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలు బూత్‌స్థాయి కమిటీలను నియమిస్తు ప్రజల్లోకి వెల్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాట్లు తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లా నుంచి చేయాల్సిన తండాల వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. ఇదే కాకుండా జిల్లా నలు మూలల నుంచి వినతులు వస్తున్నాయి. జిల్లాలో 92 తండాలను గుర్తించాం. దీంతోపాటు మరో 20 ప్రతిపాదనలు వచ్చాయి. ప్రభుత్వం నిర్ణయం మేరకు కసరత్తు చేస్తాం. – వెంకటేశ్వర్లు, డీపీఓ -
ఇటు శిక్షణ..అటు సెల్ వీక్షణ..!
‘‘ గ్రామాభివృద్ధికి వార్షిక ప్రణాళికలు వేయండి..అవే మార్గదర్శకం కావాలంటూ’’ జిల్లా పంచాయతీ అధికారులు ఓ వైపు గొంతుచించుకుంటుంటే..మరోవైపు తమకేదీ పట్టదన్నట్టు కొందరు అధికార సిబ్బంది తమ ఇష్టానుసారంగా వ్యవహరించారు. సమావేశం జరుగుతుండగానే కొందరు అధికారులు ధైర్యంగా చేతుల్లో ఉన్న సెల్ఫోన్లతో సెల్ఫీలు దిగారు. మరికొందరు వీడియోలు చూసుకుంటూ విషయాన్ని పట్టించుకోవడం మానేశారు. శనివారం ఉదయం స్థానిక జెడ్పీసమావేశ మందిరంలో చోటు చేసుకున్న దృశ్యాలు ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి. అరసవల్లి: గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలపై టీవోటీ (ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్) శిక్షణ కార్యక్రమాలు జెడ్పీ కార్యాలయంలో గత మూడు రోజులుగా జరుగుతున్నాయి. రోజుకో డివిజన్ చొప్పున మూడు డివిజన్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే శనివారం నాడు జరిగిన టెక్కలి డివిజన్ సమావేశంలో పలువురు అధికారులు సెల్ఫోన్లతో సెల్ఫీలు దిగగా, మరికొందరు వాట్సాప్ మెసేజ్‌లు, ఫేస్బుక్ అక్కౌంట్లు చూసుకుంటూ గడిపేశారు. మరికొందరైతే...చల్లగా నిద్రలోకి జారుకున్నారు. దీంతో ఒకవైపు శిక్షణ..మరోవైపు సెల్ వీక్షణలతో సమావేశ లక్ష్యం పూర్తిగా నీరుగారిపోయింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం వరకు సాగింది. ఎంతో కీలకమైన పంచాయతీ బడ్జెట్ రూపకల్పన అంశాలను, ప్రభుత్వం లక్ష్యాలు, సాధించే క్రమాలను రిసోర్స్పర్సన్లు, అధికారులు వివరంగా చెప్పే ప్రయత్నాలు చేస్తుంటే...పలువురు సిబ్బంది ఎంచక్కా..తమ పనులను సెల్ఫోన్లలో చక్కదిద్దుకున్నారు. ఇదిలావుంటే కొందరు కార్యదర్శులు సమావేశానికి ముందుగా హాజరై, తర్వాత కొందరు మార్నింగ్‌షో సినిమాలకు పోతే...మరికొందరు వారి స్వంత పనులను చేసుకుని తీరిగ్గా భోజనాల సమయానికి తిరిగి జెడ్పీ హాల్లో హాజరై భోజనాలు చేసి, అధికారికంగా టీఏ బిల్లులు తీసుకుని వెళ్లిపోవడం కనిపించింది. జిల్లా పంచాయతీ వనరుల కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ హేమసుందరరావు అధ్యక్షతన జరిగిన ఈశిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పంచాయతీ అధికారి బి.కోటేశ్వరరావు హాజరయ్యారు. చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్న సర్పంచ్‌లపై చర్యలు: డీపీవో కోటేశ్వరరావు జిల్లాలో చాలా గ్రామాల్లో సర్పంచ్‌లు చట్టాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ..తీర్మానాలను సైతం చేయడం లేదని, ఇలాంటి వారిపై తగు చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి బి.కోటేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం జరిగిన టీవోటీ శిక్షణ కార్యక్రమంలో ఆయన పైవిధంగా స్పందించారు. పంచాయతీల్లో పారిశుద్ధ్య, వీధి లైట్లు, మంచినీటి సరఫరా వంటి మూడు అత్యంత ప్రాధాన్యతాంశాలని, వీటికి అభ్యంతరాలు చెప్పకూడదని హెచ్చరించారు. చట్టానికి వ్యతిరేక చర్యలు చేపడితే వెంటనే నోటీసులు జారీ చేసి బాడీని రద్దు చేసే అధికారం తనకుందని స్పష్టం చేశారు. అలాగే 14వ ఆర్థిక సంఘ నిధులను కూడా నిబంధనలకు విరుద్ధంగా ఖర్చుచేస్తే బిల్లులు అవ్వవని గుర్తు చేశారు. అలా అని సర్పంచులు అక్రమాలు చేస్తున్నారని కాదని, చేస్తున్న పనులు పద్ధతిగా, నిబంధనలకు లోబడి చేయాలని వివరణ ఇచ్చారు. గ్రామ పంచాయతీల బడ్జెట్లో పేర్కొన్న పనులు మాత్రమే అధికారికంగా చెల్లుబాటు అవుతాయని, అందుకే సర్పంచులు, కార్యదర్శులు సమన్వయంగా పనిచేసి గ్రామాభివృద్ధికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లా పంచాయతీ వనరుల కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ హేమసుందరరావు మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధికి ముందుచూపుతో ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. లేదంటే పరిమితమైన ఫలితాలే ప్రజలకు అందుతాయని వివరించారు. అలాగే లింగ సమానత్వం కూడా ప్రాధాన్యతగా బడ్జెట్లో తీసుకోవాలన్నారు.కార్యక్రమంలో జెడ్పీ అక్కౌంట్స్ అధికారి కిరణ్‌కుమార్, నందిగాం సర్పంచ్ ఎన్.శ్యామల, రిసోర్స్పర్సన్లు వెంకటరాజు, హరిహరరావు, ఎంపిడివోలు, ఇవోపిర్డీలు, పలు మండలాల అధికారులు పాల్గొన్నారు. -
కనీస వేతనం 10,500కు పెంచండి
గ్రామ పంచాయతీ, సర్పంచ్ల సంఘం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనం రూ.10,500లకు పెంచాలని గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చక్రధర్, సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి చెల్లాపురం వెంకట్ గౌడ్, వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, అటవీశాఖ మంత్రి జోగు రామన్నను కలసి విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల్లో కరెంట్, వీధిలైట్లు, రోడ్లకు నిధులు మంజూరు చేయాలని కోరారు. బుధవారం జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చ జరపాలని మంత్రులకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. -
చెట్లకింద ‘పంచాయతీ’ వద్దు
కొత్తగా 914 గ్రామ పంచాయతీ భవనాలు అధునాతన సౌకర్యాలతో నిర్మాణాలకు ఆదేశం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.118.80 కోట్లు అత్యధికంగా కరీంనగర్, వరంగల్ జిల్లాలకు.. సాక్షి, కరీంనగర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్జీఏ) కింద గ్రామ పంచాయతీలు నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా పాత 10 జిల్లాలల్లో కొత్తగా 914 భవనాలను నిర్మించనున్నారు. ఒక్కో భవనానికి రూ.13 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. ఉమ్మడి (పాత) కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలతోపాటు ఆరు కొత్త జిల్లాల్లో ఈ గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించడమే లక్ష్యం. పది జిల్లాల్లో అత్యధికంగా ఉమ్మడి వరంగల్‌కు 275, కరీంనగర్‌కు 257 కేటాయించారు. రంగారెడ్డికి 88, నిజామాబాద్‌కు 20, భద్రాద్రి కొత్తగూడెంకు 11, నల్ల గొండ 53, సూర్యాపేట 9, యాదాద్రి 98, ఖమ్మం 16, సంగారెడ్డికి 87 చొప్పున గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరక్టర్ నీతూప్రసాద్ జిల్లా పరిషత్‌లు, జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారుల కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ నిధులను ఉపాధి కూలీలు, మెటీరియల్ కాంపోనెట్ల కోసం 60:40 నిష్పత్తిలో ఖర్చు చేయనున్నారు. శిథిలమైన భవనాలకు త్వరలో నిధులు.. పక్కా భవనాలు లేని ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించేందుకు ఉపాధి హామీ పథకం కింద 2013లో నిధులు మంజూరయ్యాయి. అంచనాలు, నిధుల విడుదల ప్రక్రియలు పూర్తయి నిర్మాణాలు ప్రారంభించే తరుణంలో సర్పంచుల పదవీకాలం ముగిసింది. అప్పటికే ప్రారంభమైన పనులను పూర్తి చేసేవారు లేక చాలాచోట్ల నిలిచిపోయాయి. సర్పంచ్ల స్థానంలో పగ్గాలు చేపట్టిన ప్రత్యేకాధికారులు భవనాల నిర్మాణంపై దృష్టి సారించలేదు. అయితే కొత్త పాలకవర్గం వచ్చేసరికి నిర్మాణ వ్యయం పెరిగింది. దీంతో ఉన్న బడ్జెట్లోనే పని కానిద్దామన్న ధోరణితో నిర్మాణాలు పూర్తి చేసినా... అరకొర నిధులు, అసౌకర్యాల కారణంగా శిథిలమైన, అద్దె భవనాల్లోనే గ్రామ పంచాయతీల పాలన సాగుతోంది. ఫలితంగా జిల్లాల్లో పలు పంచాయతీలకు సొంత భవనాల విషయం కలగానే మిగిలింది. ఈ నేపథ్యంలోనే ఒక్కో భవనానికి రూ.13 లక్షల చొప్పున, 914 గ్రామ పంచాయతీ భవనాల కోసం రూ.118.80 కోట్లు మంజూరు చేసింది. శిథిలావస్థకు చేరిన పాత కాలంనాటి భవనాల ఆధునీకరణ, కొత్త నిర్మాణాలకు కూడా త్వరలో నిధులు మంజూరు చేయనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి అందాయి. -
సర్పంచ్ల గౌరవ వేతన బకాయిలకు మోక్షం
రూ. 26.08 కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు అందాల్సిన గౌరవ వేతన బకాయిలకు ఎట్ట కేలకు మోక్షం లభించింది. 2015 అక్టోబరు నుంచి 2016 మార్చి వరకు ఆరునెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని సర్పం చులు పెద్దెత్తున ఆందోళన చేసిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. ఇటీవల సర్పంచ్ల సంఘాలను పిలిపించుకొని వారి సమస్యలపై పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టమైన హామీలను కూడా ఇచ్చారు. మంత్రి ఆదేశాల మేరకు పాత వేతన బకాయిల నిమిత్తం రూ.26.08 కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ట్రెజరీల నుంచి సర్పంచులు తమ వేతనాలను తీసుకునేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల పంచాయతీ అధి కారులను కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ ఆదేశించారు. ప్రతినెలా గౌరవవేతనం చెల్లింపు వివరాలను కమిషనర్ ఆఫీసుకు విధిగా పంపాలని డీపీవోలకు సూచించారు. చెక్కులపై ఈవోపీఆర్డీ సంతకం ఇకపై అక్కర్లేదు! రెండేళ్లుగా ప్రభుత్వానికి సర్పంచులకు మధ్య నలుగుతున్న చెక్ పవర్ వివాదం ఎట్టకేలకు కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీలకు సంబంధించిన అభివృద్ధి నిధుల వినియోగంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శితో పాటుగా ఈవో పీఆర్డీ (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్)కు కూడా కౌంటర్ సిగ్నేచర్ అధికారాన్ని కల్పిస్తూ 2015 జూన్‌లో ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే.. ప్రజలే నేరుగా ఎన్నుకున్న తమను ప్రభుత్వం దొంగలుగా చూస్తోందని, తమపై నమ్మకం లేకనే బిల్లులపై ఈవోపీఆర్డీ కౌంటర్ సిగ్నేచర్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసిందని సర్పంచులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సర్పంచుల నుంచి రోజురోజుకూ ఆందోళన తీవ్రమవుతుండటంతో ప్రభుత్వం పాత విధానాన్నే అవలంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది. మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ విషయమై సానుకూలంగా స్పందిం చడంతో ఈ వివాదం తాజాగా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పంచా యతీల బిల్లులపై ఈవోపీఆర్డీ కౌంటర్ సిగ్నేచర్ పద్ధతిని రద్దు చేస్తూ నేడో, రేపో ఉత్తర్వులు కూడా జారీ అవనున్నాయని తెలంగాణ సర్పంచుల సంఘం కన్వీనర్ ఎం.పురుషోత్తం రెడ్డి సోమవారం సాక్షికి తెలిపారు. -
వసూలు కాని సెస్
► గ్రంథాలయూలకు రాబడి కరువు ► సహకరించని మున్సిపల్, గ్రామ పంచాయతీలు.. ► లక్ష్యం రూ.కోటి 50 లక్షలు.. వసూలు రూ.40 లక్షలే.. ► సౌకర్యాలు లేక అవస్థలు.. పాఠకులకు సేవలు అంతంతే.. ఆదిలాబాద్ కల్చరల్/దండేపల్లి : విజ్ఞాన భాంఢాగారాలు.. సరస్వతీ క్షేత్రాలుగా పేరొందిన గ్రంథాలయూలకు సెస్ బకారుులు ఏటా పెరిగిపోతున్నారుు. ఏళ్ల తరబడి మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీలు పన్ను ఎగనామం పెడుతున్నారుు. లక్ష్యాన్ని మించి వసూలైన దాఖలాలు ఇప్పటికీ లేవు. పన్నులు వసూలు కావడం లేదనే సాకుతో కొన్ని మున్సిపాల్టీలు సగమే పన్నులు చెల్లిస్తుండగా.. మరికొన్ని 20 శాతం మాత్రమేచెల్లిస్తున్నారుు. వీటికి తోడు గ్రామ పంచాయతీల్లో పన్నులు వసూలు కావడం లేదని సెస్ చెల్లించడమే మానేశారుు. ఫలితంగా గ్రంథాల యూలకు రాబడి కరువై సౌకర్యాల కల్పనలో వి ఫలమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 52 గ్రంథాలయూలు, 81 బుక్ డిపో సెంటర్లు ఉన్నారుు. వీటిలో రెండు మాత్రమే అద్దె భవనాల్లో కొనసాగుతండగా.. మిగితా వాటికి గ్రామ పంచాయతీ కార్యాలయూలు, పాఠశాలల ఆవరణలో గదులు కేటారుుంచారు. వసూలు కాని పన్ను... ఎక్కడి పనులు అక్కడే.. ప్రతీ మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలు వసూలు చేసే ఆస్తి పన్నుల్లో 8 శాతం పన్ను గ్రంథాలయ పన్నుగా గ్రంథాలయూలకు చెల్లించాల్సి ఉంటుంది. వాటితో పుస్తకాల కొనుగోలు, భవనాల నిర్మాణాలు, పత్రికల బిల్లులు, పార్ట్ టై ఉద్యోగులు, స్వీపర్ల వేతనాలు, విద్యుత్ చార్జీలు ఇతరత్రా ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. సెస్ చెల్లించకపోవడంతో కొత్త పుస్తకాల కొనుగోలు, భవనాల నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోయూరుు. 2012-13 సంవత్సరంలో కొనుగోలు చేసిన పుస్తకాలనే ఇప్పటికీ పాఠకులు చదువుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కొత్త పుస్తకాలు వచ్చిన దాఖలాలు లేవు. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంచాలని పలుమార్లు విద్యార్థులు అధికారులకు విన్నవించినా.. సెస్ వసూలు కాక కొనలేని పరిస్థితి నెలకొంది. తలమడుగు, మామడ మండల కేంద్రాల్లో గ్రంథాలయ నిర్మాణానికి స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చినా నిర్మాణానికి నిధులు సమకూరడం లేదు. నామమాత్రమే చెల్లింపులు గ్రంథాలయాల అభివృద్ధికి ప్రధాన వనరు సెస్. ఈ పన్ను మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు పూర్తి స్థాయిలో చెల్లించకపోవడంతో గ్రంథాలయాలు సమస్యలకు చేరువవుతున్నాయి. 2013-14 సంవత్సరంలో రూ.కోటి 25 లక్షల పన్ను రావాల్సి ఉండగా.. రూ.79,77,719 మాత్రమే వచ్చాయి. 2014-15లో రూ.కోటి 30 లక్షలు లక్ష్యం ఉండగా రూ.84,16,724 పన్ను వసూలైంది. 2016 సంవత్సరంలో రూ.కోటిన్నర సెస్సు వసూలు లక్ష్యం కాగా రూ.89,74,143 గ్రంథాలయాలకు వచ్చింది. 2016-17 సంవత్సరానికి గాను రూ.కోటి 50 లక్షల సెస్సు వసూలు లక్ష్యం ఉండగా అక్టోబర్ మాసం వరకు రూ.40 లక్షలు మాత్రమే చెల్లించారు. ఏళ్లుగా గ్రంథాలయాలకు ఇదే తీరుగా పన్ను వసూలు అవుతుండడంతో గ్రంథాలయాల్లో సౌకర్యాల కల్పనలో ఇబ్బందులు తలెత్తుతున్నారుు. 50 శాతం కంటే తక్కువే.. ఉమ్మడి జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు ఉండగా, 866 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి వచ్చే ఆస్తి పన్నులో 8 శాతం గ్రంథాలయాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సి ఉంటుంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ మున్సిపాలిటీలు 50 శాతం వరకు పన్నులు ఏటా చెల్లిస్తున్నాయి. భైంసా, మందమర్రి, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో నుంచి 20 శాతం కంటే ఎక్కువ సెస్సు రావడం లేదు. గ్రామ పంచాయతీలు అంతంత మాత్రంగానే సెస్సు చెల్లిస్తున్నాయి. పూర్తిస్థాయిలో పన్ను వసూలు కావడం లేదని మున్సిపల్ కమిషనర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రంథాలయ సెస్సుకు ఎగనామం పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. సెస్సు వసూలుకు చర్యలు.. ఉమ్మడి జిల్లాలో ఉన్న వ్యవస్థనే రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుండడంతో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో పన్ను వసూలుకు చర్యలు తీసుకుంటున్నాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పలుమార్లు లేఖలు రాశాం. ఉన్నతాధికారులు స్పందించి పన్ను వసూలుకి సహకరిస్తే గ్రంథాలయాల అభివృద్ధి సాధ్య పడుతుంది. మున్సిపల్, గ్రామ పంచాయతీల అధికారులకు సైతం లైబ్రేరియన్ల ద్వారా సెస్సు వసూలు అంశాన్ని పరిశీలించే విధంగా చూడాలని చెబుతున్నాం. లైబ్రేరియన్లతోపాటు అధికారులకు ఈ సమస్యను ప్రతిఏటా విన్నవిస్తూనే వస్తున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించి గ్రంథాలయ పన్ను వసూలు అయ్యేలా చూడాలి. సెస్సు వసూలు కాక పోటీ పరీక్షల అభ్యర్థులకు కొత్త పుస్తకాలు కొనుగోలు చేయని పరిస్థితిలో గ్రంథాలయాలు ఉన్నాయి. - ప్రభాకర్, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి -
గ్రామాభివృద్ధి మీ చేతుల్లోనే
పంచాయతీలకు నిధుల కొరత లేదు ♦ ‘పంచాయత్ దినోత్సవం’లో గ్రామపంచాయతీలను కోరిన ప్రధాని జంషెడ్పూర్: క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటంలో గ్రామపంచాయతీల పాత్ర కీలకమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ‘పంచాయత్ దినోత్సవం’ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలులో పంచాయతీలదే కీలకపాత్ర అని తెలిపారు. ఢిల్లీయే దేశం కాదని దేశాభివృద్ధి గ్రామాభివృద్ధితోనే ముడిపడి ఉందన్నమోదీ నగరాలు, గ్రామాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు అధునాతన వసతులను అన్ని మారుమూల ప్రాంతాలకు చేరవేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం రైతులు, మహిళలు, చిన్నారులపై ప్రత్యేకమైన దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఐదేళ్లలో గ్రామాల్లో వచ్చే మార్పు ద్వారా భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరుగుతుందని మోదీ తెలిపారు. ప్రజాస్వామ్యంలో పార్లమెంటుకున్నంత ప్రాముఖ్యత గ్రామసభలకు ఉందని.. అందువల్ల గ్రామపంచాయతీలను మరింత పరిపుష్టం చేయాల్సిన బాధ్యత పంచాయతీ ప్రతినిధులకుందన్నారు. ప్రజల కలల సాకారానికి కేంద్ర ప్రభుత్వం, గ్రామపంచాయతీలు భుజం కలుపుతూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మొన్నటివరకు పంచాయతీలకు నిధుల కొరత ఉండేదని.. ఇప్పుడు ఆ సమస్య లేనందున పంచాయతీ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ప్రభుత్వ పథకాల అమలు సరిగా జరుగుతుందా, లేదా? అనే విషయాన్నీ సమీక్షించాలన్నారు. ప్రతిఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకునేలా గ్రామస్తులంతా ప్రతినబూనాలన్నారు. గ్రామాల్లో వెలుగు తీసుకొచ్చేందుకు వెయ్యి రోజుల్లో 18వేల పల్లెలను విద్యుదీకరించాలని సంకల్పించామన్నారు. ‘గ్రామస్తులారా అప్రమత్తంగా ఉండండి. మీకోసం జరుగుతున్న పనులకు సంబంధించి నాకు తప్పుడు సమాచారం రావొద్దు. మీరు అప్రమత్తంగా ఉంటే.. నా ఆందోళన కాస్తై తగ్గుతుంది’ అని అన్నారు. వచ్చే మూడేళ్లలో ఐదుకోట్ల మంది గ్రామీణులకు ఎల్పీజీ కనెక్షన్లు ఇస్తామని, ఇవి లబ్ధిదారులకు అందేలా పంచాయతీ పెద్దలు చొరవతీసుకోవాలన్నారు. ప్రతి బొట్టూ ఒడిసిపట్టాలి దేశ వ్యాప్తంగా కరువు పరిస్థితులు ఆందోళనకరంగా మారాయని మోదీ తెలిపారు. ఆదివారం మన్ కీ బాత్ ప్రసంగంలో జలవనరుల సంరక్షణపైనే ప్రధాని దృష్టిపెట్టారు. ఈ ఏడాది 110 శాతం వర్షాలుంటాయన్న వాతావరణ శాఖ సూచన నేపథ్యంలో నీటిసంరక్షణను ప్రజలూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ యత్నాలతోపాటు ప్రజల భాగస్వామ్యంతోనే కరువు సమస్యలు రాకుండా జాగ్రత్త పడొచ్చన్నారు. జలసంరక్షణ ఉద్యమాన్ని ప్రజలే నడిపించాలన్నారు. 200 ఏళ్ల క్రితమే గాంధీ పుట్టిన పోరుబందర్లో భూగర్భ నీటి ట్యాంకులు నిర్మించారన్నారు. నీటి కొరత స్ప్రింక్లర్లు, బిందుసేద్యం వంటివాటిపై దృష్టిపెట్టాలని సూచించారు. -
కొత్త పురపాలికలపై ఆస్తి పన్ను మోత
-
కొత్త పురపాలికలపై ఆస్తి పన్ను మోత
సాక్షి, హైదరాబాద్: కొత్త పురపాలికల ప్రజల నడ్డి విరిగింది. ఆస్తి పన్నుల డిమాండు నోటీసులు గుండె దడ పుట్టిస్తున్నాయి. ఒక్కసారిగా ఆస్తి పన్నులు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు చెల్లించిన పన్నుతో పోల్చితే 30 శాతం పెరిగిపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 31 నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుల సవరణ గత ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు నామమాత్రంగా ఆస్తి పన్ను వసూలు చేసేవారు. మున్సిపల్ చట్టం మేరకు ఈ కొత్త పురపాలికల్లో ఆస్తి పన్ను సవరణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు కొలిక్కి వచ్చాయి. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు రూ. 162.04 కోట్లున్న ఆస్తి పన్ను డిమాండు .. నగర పంచాయతీలుగా మారిన తర్వాత రూ. 215 కోట్లకు పెరిగింది. ఈ పురపాలికల్లో ప్రజలపై రూ.50 కోట్లకు పైనే అదనపు భారం పడింది. 31 కొత్త మున్సిపాలిటీలతో పాటు వందలాది విలీన గ్రామాల పరిధిలోని 50 వేల నివాస, నివాసేతర సముదాయాలపైనా పన్నుల పెంపు పడనుంది. పన్నుల సవరణ ప్రక్రియ ముగియడంతో తాజాగా అన్ని నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రజలకు డిమాండు నోటీసులు జారీ చేస్తున్నారు. వార్షిక అద్దె విలువ ఆధారంగా ఆస్తి పన్నును నిర్ణయించడంతో విలువైన ప్రాంతాల్లో ఉన్న నివాస, నివాసేతర భవనాల పన్నులు రెండు మూడు రెట్లు పెరిగాయి. దీంతో పన్నుల సవరణను పునఃసమీక్షించాలని కోరుతూ భారీ ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. విలీన గ్రామాలపై పిడుగు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వందల సంఖ్యలో శివారు గ్రామాలు విలీనమయ్యాయి. పురపాలికల పరిధిలోకి వచ్చిన ఈ గ్రామాల్లో సైతం ఆస్తి పన్నుల సవరణ అమలు చేస్తున్నారు. శివారు గ్రామ పంచాయతీలను విలీనం చేయడంతో వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్లో రూ.1.76 కోట్లు, నిజామాబాద్ కార్పొరేషన్లో రూ.3.64 కోట్లు, కరీంనగర్ కార్పొరేషన్లో రూ.2.93 కోట్లు, రామగుండంలో రూ.2.93 కోట్లు ఆస్తి పన్నులు పెరిగాయి. పన్నులు సరే.. సదుపాయాలేవీ! గత కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల కిందట ఉన్నఫళంగా ఈ గ్రామ పంచాయతీల స్థాయిని పెంచి నగర పంచాయతీలు, మున్సిపాలిటీల హోదాను కల్పించింది. గతేడాది అక్టోబర్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కొత్త పురపాలికల్లో ఆస్తి పన్నుల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేవలం పేరుకే హోదా పెరిగినా.. నేటికీ ఈ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి పనులను ప్రభుత్వాలు చేపట్టలేదు. కనీసం తాగునీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెగ్యులర్ మున్సిపల్ కమిషనర్లు లేక చాలా నగర పంచాయతీల బాగోగులు పట్టించుకునే వారే కరువయ్యారు. కనీస వసతులను కల్పించకుండానే ఆస్తి పన్నులను భారీగా పెంచడం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
అన్ని పంచాయతీలకు ఎల్ఈడీ బల్బులు
-ఏపీఈఆర్సీ చైర్మన్ గ్రంధి భవానీప్రసాద్ చల్లపల్లి (కృష్ణా జిల్లా): రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీలకు త్వరలో వీధి దీపాల ఏర్పాటు కోసం ఎల్ఈడీ బల్బుల పంపిణీకి చర్యలు తీసుకోనున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ గ్రంధి భవానీప్రసాద్ చెప్పారు. కృష్ణాజిల్లా చల్లపల్లిలో బుధవారం ఎల్ఈడీ బల్బుల రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే తొలిదశలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని, రెండోదశలో భాగంగా త్వరలో రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీలకు ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తామని చెప్పారు. దీనివల్ల పెద్ద ఎత్తున విద్యుత్ ఆదా అవుతుందన్నారు. వ్యవసాయ విద్యుత్‌ను రాత్రివేళ తొలగించి పూర్తిగా పగటివేళ సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. హుదూద్ తుపాను సందర్భంగా విశాఖపట్నంలో రికార్డు సమయంలో విద్యుత్‌ని పునరుద్ధరించడం ద్వారా ప్రపంచ స్థాయిలో గొప్ప ఘనత సాధించామన్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఆదా చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టామన్నారు. ఇందులో భాగంగానే తొలి విడతలో మూడు జిల్లాల్లో 57 లక్షల ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేయగా వీటివల్ల 349 మెగావాట్ల విద్యుత్‌ని ఆదా చేయగలిగామని చెప్పారు. రెండో విడతలో ఐదు జిల్లాల్లో 75.18 లక్షల ఎల్ఈడీ బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మూడో విడతలో మరో నాలుగు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులు కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర మాట్లాడుతూ సమర్థవంతమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు ఆదాలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఎల్ఈడీ బల్బుల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లును ఆదా చేసుకోవాలని వినియోగదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
పంచాయతీల్లోనూ భూగర్భ డ్రైనేజీ
తొలుత ప్రయోగాత్మకంగా ఐరాల పంచాయతీలో.. మరో పది పంచాయతీల్లో భూగర్భ డ్రైనేజీ తర్వాత జిల్లా వ్యాప్తంగా నిర్మాణం వెస్ట్ గోదావరి వెలివెన్ను ఆదర్శం {పణాళికలు సిద్ధం చేసిన అధికారులు చిత్తూరు : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుకు జిల్లా పంచాయతీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మూమూలుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మాత్రమే భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొస్తుంది. అయితే చిత్తూ రు జిల్లాలో ప్రయోగాత్మకంగా చిన్నచిన్న పంచాయతీల్లో భూగర్భ డ్రైనేజీని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం పశ్చిమ గోదావరి జిల్లా వెలివెన్ను గ్రామ పంచాయతీలో ఫైలట్ ప్రాజెక్టుగా నిర్మించిన భూగర్భ డ్రైనేజీని జిల్లా అధికారుల బృందం పరిశీలించి వచ్చింది. ఆ స్పూర్తితో రాష్ట్రంలో ఎక్కడా లేని రీతిలో గ్రామ పంచాయతీల్లో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలవాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలుత పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల పంచాయతీలో వినాయకపురం, అంచనవారిపల్లి, నయనాంపల్లి గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీలను నిర్మించారు. వినాయకపురంలో రూ.5 లక్షలతో నిర్మించగా, అంచనవారిపల్లి, నయనాంపల్లిలో రూ.4 లక్షలతో పూర్తి చేశారు. ఆయా గ్రామాల్లోని అన్ని వీధుల్లో భూగర్భంలోనే పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. వాటిని బయటకు వెళ్లే నీటితో అనుసంధానం చేశారు. ఊరి చివరన సంపు నిర్మించి మురుగు నీటిని అందులోకి వదిలేలా ఏర్పాటు చేశారు. ఇందుకోసం 13వ ఆర్థిక సంఘం నిధులను వెచ్చించారు. మొత్తం పనులను రెండు నెలల్లో పూర్తి చేశారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలో పది గ్రామ పంచాయతీల్లో పూర్తి స్థాయిలో భూగర్భ డ్రైనేజీని నిర్మించేందుకు పంచాయతీ అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో పాటు ఉపాధి హామీ నిధులను సైతం వెచ్చించనున్నారు. జిల్లాలో ఆదర్శవంతంగా గ్రామ పంచాయతీల్లో భూగర్భ డ్రైనేజీ పూర్తి చేసి రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లాను ఆదర్శంగా నిలిపేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకరరావు సాక్షికి తెలిపారు. తొలుత పది పంచాయతీలలో డ్రైనేజీ పూర్తి స్థాయిలో నిర్మించి, తర్వాత జిల్లాలోని అన్ని పంచాయతీల్లో వీటి నిర్మాణం చేపడతామని చెప్పారు. -
జీవో 55ను బయట పెట్టిన సిబ్బందికి షోకాజ్
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల అధికారాలను కత్తిరించేందుకు ప్లాన్ చేసిన ప్రభుత్వ పెద్దలు, తమ బండారాన్ని బయటపెట్టిన కిందిస్థాయి అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం తెచ్చిన నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా.. గ్రామ పంచాయతీలు చేసిన తీర్మానాలను రద్దు చేసే హక్కును కలెక్టర్లకు కల్పించాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా జీవో నెంబరు 55ను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలించక మునుపే ఉత్తర్వుల తుది ప్రతి(ఫైనల్ డ్రాఫ్ట్) ప్రభుత్వ వెబ్సైట్లో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. జీవో 55 జారీ పట్ల సర్పంచుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో జీవోను ఉపసంహరించుకున్నట్లు సర్కారు ప్రకటించింది. కానీ, తెలిసో తెలియక తుది ప్రతిని వెబ్సైట్లో పెట్టిన పాపానికి ముగ్గురు సెక్షన్ అధికారులను మాత్రం సర్కారు చిక్కుల్లో పడేసింది. ఉత్తర్వులు బహిర్గతం కావడానికి కారకులుగా భావిస్తూ ఒక సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్రటరీపై అభియోగాలు మోపుతూ సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పదిరోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అనంతరం విచారణ జరిపి శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. -
త్వరలో పంచాయతీ నగారా
ఖాళీ అయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డుల స్థానాలకు రానున్న నోటిఫికేషన్ 25వ తేదీన ఓటరు జాబితా ప్రకటన నకిరేకల్ గ్రామపంచాయతీ రిజర్వేషన్‌పై తొలగని సందిగ్ధత గ్రామాల్లో ఎన్నికల నగారా మోగనుంది. జిల్లాలో వివిధ కారణాలతో ఖాళీ అయిన గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఖాళీలు ఏర్పడిన స్థానాలకు జూన్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. నల్లగొండ : జిల్లాలో మరికొన్ని రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు నిర్వ హిం చేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి నమోదైన ఓటరు జాబితాను ఖాళీ అయిన స్థానాల్లో ప్రచురించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో కోరం ఉండి కూడా ఖాళీ ఉన్న ఉప సర్పంచ్ స్థానాలు రెండు ఉన్నాయి. పలు చోట్ల కోరం లేక వాయిదా పడిన ఉప సర్పంచ్ స్థానాలు కూడా ఉన్నాయి. ఉప సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 1173 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో సర్పం చ్‌లు 11, వార్డు సభ్యులు 44, ఎంపీటీసీ 1, జెడ్పీటీసీ 1 స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. కాగా నకిరేకల్ గ్రామ పంచాయతీ స్థానం రిజర్వేషన్ ఎటూ తేల్చకపోవడంతో ఈ స్థానంలో ఓటరు జాబితాను ప్రచురించడం లేదు. ఆర్డీఓ రిజర్వేషన్ ఖరారు చే యాల్సి ఉంది. అయితే వివిధ రాజకీయ కారణాల వల్ల అధికారులు రిజర్వేషన్‌ను పెండిం గ్లో పెట్టినట్లు తెలుస్తోంది. వార్డుల వివరాలు దేవరకొండ మండల చెన్నారం పంచాయతీలోని 10వ వార్డు, హాలియా మండలం తిమ్మాపురంలో 3వ వార్డు, నిడమనూరు మండలం గుంటిపల్లిలో 3, రేగులగడ్డలో 3వ, త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలోని 3, దొనకొండలో 3, దామరచర్ల మండలం దిలావర్పూర్లో 8, ఇరిగిగూడలోని 6, వేములపల్లి మండలం సల్కునూర్లోని 1వ వార్డు, గరిడేపల్లి మండలం కుతుబుషాపురంలోని 3, హుజూర్నగర్ మండలం లక్కవరంలో 3, మఠంపల్లి మండలం బంకమంతులగూడెంలో 5వ వార్డు, మేళ్లచెర్వు మండలం రామాపురంలోని 5వ వార్డు, చిలుకూరులోని 5వ వార్డు, మోతె మండలం బుర్కచర్లలోని 10వ వార్డు, మునగాల మండలం మాదారంలోని 3, ఆత్మకూర్.ఎస్ కోటపహాడ్లో 6, నల్లగొండ మండలం దొనకల్లో 8, దండెంపల్లిలోని 3, కనగల్ మండలం కురంపల్లిలోని 5వ వార్డులో ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా తిప్పర్తి మండలం చిన్నసూరారంలోని 2వ వార్డు, చండూరు మండలం ఇడికుడలోని 4, బంగారిగడ్డలో 1, చండూరులో 11, మునుగోడు మండలం కొరకటికల్లో 1, నాంపల్లి మండలం చామలపల్లిలో 1, బీబీనగర్ మండలం రావిపహాడ్‌లో 8, వలిగొండ మండలం రావిపహాడ్‌లో 8, నెమలికాల్వలో 3, వేములకొండలోని 4వ వార్డులో ఎన్నికలు జరగాలి. కట్టంగూర్ మండలం పిట్టంపల్లిలోని 1వ వార్డు, బొల్లేపల్లిలోని 4, నకిరేల్ మండలం వల్లభాపురంలోని 2, రామన్నపేట మండలం శోభనాద్రిగూడెంలోని 10, వెల్లంకిలోని 4, అర్వపల్లి మండలం నాగారంలోని 3, నూతనకల్ మండలం చిల్పకుంట్లలోని 11, ఆత్మకూర్.ఎం మండలం నాంచారిపేటలోని 6, ఉప్పలపహాడ్లోని 8, ఆలేరు మండలం రాఘవాపురంలోని 2, బి.రామారం మండలం మల్యాలలోని 1, బండికాడిపల్లిలోని 2వ వార్డు, కంచల్తండాలోని 3, గుండాల మండలం పల్లెపహాడ్‌లోని 8, తుర్కపల్లిలోని దాచారం 1వ వార్డుకు ఎన్నికలు జరగాల్సి ఉంది. -
ఏదీ నజరానా!
⇒ ‘ఏకగ్రీవ’ సర్పంచులను మరిచిన సర్కారు ⇒ ప్రొత్సాహకాలను పట్టించుకోని వైనం ⇒ రెండేళ్లుగా 74 పంచాయతీల ఎదురుచూపు ⇒ రూ.6.11 కోట్ల విడుదలపై నిర్లక్ష్యం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రజాస్వామ్య భారతావనిలో తొలిదశ పాలనా వ్యవస్థ పంచాయతీలదే. ఇందులో గ్రామీణుల బాగోగులు, ప్రగ తి పనులు, మౌలిక సదుపాయల కల్పన తదితర బాధ్య తలన్నింటినీ నెరవేర్చాల్సింది సర్పంచులే. అందుకే పల్లెలను రాజకీయ సంగ్రామానికి దూరంగా ఉంచేందుకు సర్కా రు ఏకగ్రీవ పంచాయతీలకు నజరానాలు ప్రకటించింది. ఈ క్రమంలో పలువురు సర్పంచులు పోటీ లేకుండానే పల్లె పీఠంపై కూర్చున్నారు. వారు పదవులు చేపట్టి రెం డేళ్లు గడుస్తున్నా నేటికీ, నజరానాలు రాకపోవడంతో వారు నైరాశ్యం లో మునిగిపోయారు. నజరానా వస్తుందని, గ్రామాలలో మౌలిక వసతులు కల్పించవచ్చని ఆశించినా ఫలితం లే కుండాపోరుుంది. అభివృద్ధికి సంబంధించి ప్రజలకు జవా బు చెప్పలేని స్థితిలో పడిపోయారు. మూడు దశలుగా ఎన్నికలు జిల్లాలో 718 గ్రామ పంచాయతీలున్నాయి. వీటికి 2013 జూలై 23,27,31 తేదీలలో ఎన్నికలు జరిగాయి. మూడు డివిజన్ల పరిధిలో ఎలాంటి ఘర్షణలు, పోటీ లేకుండా 74 గ్రామ పంచాయతీలకు ప్రజలు సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్లో 38 గ్రామ పంచాయతీలు, కామారెడ్డి డివిజన్లో 22, బోధన్ డివిజన్లో 14 పంచాయతీలు ఎలాంటి ఉత్కంఠ లేకుండా ఏకగ్రీవమయ్యాయి. ఈ పంచాయతీలన్నింటికీ జనాభా ప్రాతిపదికన ప్రోత్సాహకాలు అందాల్సి ఉంది. కానీ, ప్రభుత్వం, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఏకగ్రీవ సర్పంచుల ఆశలు నీరుగారుతున్నారుు. పల్లెల అభివృద్ధి కోసం వస్తున్న ఆర్థిక సంఘం నిధులను ఒక పక్క విద్యుత్ బకాయిల పేరుతో లాక్కుంటూ, ఇంకోపక్క ప్రోత్సహకాలు విడుదల చేయక తాత్సారం చేస్తున్నారని సర్పంచులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి సాధిస్తాయనే పోటీ లేకుండా పాలకవర్గాన్ని ఎన్నుకుంటే, ఆ గ్రామం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్న ఉద్ధేశ్యంతో ప్రభుత్వాలు ‘ఏకగ్రీవాలను’ ప్రోత్సహించాయి. ప్రభుత్వం ఇ చ్చిన పిలుపునకు స్పందించిన ప్రజలు పలుచోట్ల సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణలోని మిగతా జిల్లాలతో పోలిస్తే, మన జిల్లాలోనే ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రంలో 2007లో ఏకగ్రీవంగా ఎన్నికైనవాటిలో మైనర్ గ్రామ పంచాయతీలకు రూ. 5 లక్షలు మేజర్ గ్రామ పంచాయతీకి రూ. 10 ల క్షలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే నజరానాలు పెంచింది. మైనర్ పంచాయతీలకు రూ.7 లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీలకు రూ. 15 లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఈ లెక్కన జిల్లాలో ఏకగ్రీవమైన మొత్తం 74 గ్రామ పంచాయతీలలో 31 మేజర్ గ్రామ పంచాయతీలకు రూ. 3.10 కోట్లు, 43 మైనర్ పంచాయతీలకు రూ.3.01 లక్షల నజరానా రావాలి. ఇంకా ఎన్నాళ్లు? ఏకగ్రీవ పంచాయతీలకు ప్రకటించిన ప్రోత్సాహం ఇవ్వడాన్ని ప్రభుత్వం మరచిపోయింది. సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికై రెండేళ్లు కావస్తున్నా ప్రోత్సాహం ఊసే లేదు. నిధులు లేక గ్రామపంచాయతీలు నిర్వీర్యమైపోతున్నాయి. కనీసం ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహమైనా ఆసరాగా ఉంటుందంటే అది కూడా రావడం లేదు. తెలంగాణ ప్రభుత్వమైనా ప్రోత్సాహకాలను విడుదల చేయాలి. -గడ్డం నర్సారెడ్డి, సర్పంచ్, కొత్తపల్లి(ఎన్) -
గ్రామ పంచాయతీల పనితీరు మెరుగుపడాలి
కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి విజయానంద్ హైదరాబాద్: దేశాభివృద్ధిలో కీలకమైన గ్రామాలు తమ పని తీరును మెరుగు పరుచుకోవాలని, అందుకు ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి విజయానంద్ పేర్కొన్నారు. టీఎస్ ఐపార్డ్‌లో (గతంలో ఆపార్డ్) గురువారం పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. పంచాయతీలకు నేరుగా నిధులను కేటాయించే పద్ధతిని కేంద్రం ప్రవేశ పెట్టిందని, ఇందుకు రూ. 2 లక్షల కోట్లు బడ్జెట్లో కేటాయించిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలు గ్రామ సభలను నిర్వహించి పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం తదితర 22 అంశాలకు నిధులను కేటాయించిపనులను చేపట్టాలని సూచించారు. టీఎస్ ఐపార్డ్ కమిషనర్ అనితా రామచంద్రన్ మాట్లాడుతూ మన ఊరు-మన ప్రణాళిక ప్రవేశపెట్టి అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రం చేపడుతోందన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ పాల్గొన్నారు. -
స్థానిక సంస్థలకు గౌరవం
గుర్తింపు ఇచ్చిన సర్కారు {పజాప్రతినిధులకు పెరిగిన వేతనం జిల్లాలో 1,891 మందికి ప్రయోజనం {పభుత్వ నిర్ణయంపై {పతినిధుల ఆనందం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి.. మే 1న వేతనం వరంగల్ : స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల దీర్ఘకాలిక డిమాండ్ ఫలించింది. గౌరవ వేతనం లేదని అసంతృప్తిగా ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. గౌరవ వేతనంగా వీరికి ప్రతీనెలా ఇస్తున్న మొత్తాన్ని భారీగా పెంచింది. స్థానిక సంస్థల్లో హోదాల మేరకు గౌరవ వేతనాలు పెంచుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి పెంచిన గౌరవ వేతనాలు అమల్లోకి రానున్నాయి. మే 1 నుంచి పెంచిన వేతనాలు అందుకుంటారు. జిల్లాలో జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపి 1,891 మంది ఉన్నారు. మంగపేట మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. మిగిలిన అన్ని పదవులకు ప్రతినిధులు ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌కు ఇప్పటివరకు నెలకు రూ.7,500 గౌరవ వేతనం ఇస్తున్నారు. ప్రభుత్వం లక్ష రూపాయలకు పెరిగింది. వరంగల్ నగరపాలక సంస్థ పరిపాలనలో కీలకమైన మేయర్‌కు ప్రస్తుతం నెలకు రూ.14వేల గౌరవ వేతనం ఉంది. ఇప్పుడు దీన్ని రూ.50 వేలకు పెంచారు. డిప్యూటీ మేయర్‌కు ప్రస్తుతం రూ.8 వేలు ఉంది. దీనిని రూ.25 వేలకు పెంచారు. వరంగల్ మహా నగరపాలక సంస్థ పరిధిలో 58 డివిజన్లు ఉన్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్‌ను మినహాయిస్తే మిగిలిన కార్పొరేటర్లకు నెలకు రూ.6 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తారు. ఈ మొత్తం నెలకు రూ.3.36 లక్షలు ఉంటుంది. వరంగల్ మహా నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగలేదు. జిల్లాలో 962 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మంగపేటలోని 18 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. మిగిలిన 944 మంది సర్పంచ్‌లు ఉన్నారు. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన మేరకు వీరికి నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం దక్కనుంది. మొత్తంగా జిల్లాలోని సర్పంచ్ల గౌరవ వేతనం కోసం ప్రతి నెల రూ.48.10 లక్షలు ఖర్చు కానుంది. జిల్లాలో 705 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ(ఎంపీటీసీ) సభ్యులు ఉన్నారు. పెంచిన గౌరవ వేతనం ప్రకారం వీరికి నెలకు రూ.5 వేల చొప్పున ప్రభుత్వం చెల్లించనుంది. ఎంపీటీసీల్లో 50 మంది మండల పరిషత్ అధ్యక్షులుగా ఉన్నారు. వీరికి ప్రభుత్వం ప్రతి నెల రూ.10 వేల చొప్పన గౌరవ వేతనం ఇవ్వనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీల గౌరవ వేతనం కోసం ప్రతి నెల రూ.37.75 లక్షలను ప్రభుత్వం ఇవ్వనుంది. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ(జెడ్పీటీసీ) సభ్యులు 50 మంది ఉన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన మేరకు వీరికి నెలకు రూ.10 వేల చొప్పున గౌరవ వేతనం అందనుంది. జిల్లాలోని 48 మంది జెడ్పీటీసీ సభ్యులకు ఈ గౌరవ వేతనం అందుతుంది. ఇది ప్రతి నెల రూ.4.80 లక్షలు ఉంటుంది. మిగిలిన ఇద్దరిలో ఒకరు జెడ్పీ చైర్పర్సన్, మరొకరు డిప్యూటీ చైర్పర్సన్ ఉన్నారు. జిల్లాలో జనగామ, మహబూబాబాద్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లోనూ 28 మంది చొప్పున మొత్తం 56 మంది కౌన్సిలర్లు ఉన్నారు. నర్సంపేట, భూపాలపల్లి, పరకాల నగరపంచాయతీలు ఉన్నాయి. ఈ మూడు నగర పంచాయతీల్లోనూ 20 మంది చొప్పున కౌన్సిలర్లు ఉన్నారు. మొత్తంగా ఐదు పురపాలక సంఘాల్లో.. ఐదుగురు చైర్మన్లకు నెలకు రూ.7,500 చొప్పున గౌరవ వేతనం ఇస్తారు. డిప్యూటీ చైర్పర్సన్లకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తారు. చైర్పర్సన్, డిపూటీ చైర్పర్సన్లను మినహాయిస్తే ఉండే 86 మంది కౌన్సిలర్లకు ప్రతి నెల రూ.2500 చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నారు. స్థానిక సంస్థలకు గుర్తింపు ప్రజలకు నేరుగా సేవలు అందించే స్థానిక సంస్థలకు కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. ప్రజలతో ఎన్నికైనా.. ఇన్నాళ్లు తక్కువ గౌరవ వేతనంతో సమాజంలో ఒకరకమైన ఇబ్బంది ఉండేంది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని తొలగించింది. పెంచిన గౌరవ వేతనంతో అన్ని స్థాయిల్లోని స్థానిక ప్రజాప్రతినిధుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. కేసీఆర్ ప్రకటించిన కొత్త గౌరవ వేతనంతో మాపై బాధ్యత పెరిగింది. రాజకీయ అవినీతిని అంతం చేస్తానని చెప్పిన కేసీఆర్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో అలాంటి వాటికి ఆస్కారం లేకుండా చేశారు. గౌరవ వేతనం పెంపు మాలాంటి ప్రజాప్రతినిధులకు ఎంతో మనోధైర్యం పెంచింది. - గద్దల పద్మ, జెడ్పీ చైర్పర్సన్ -
లక్షల్లో సెస్ బకాయిలు
దండేపల్లి : గ్రంథాలయాలకు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు చెల్లించే సెస్ బకాయిలు రూ.లక్షల్లో పేరుకుపోతున్నాయి. దీంతో జిల్లాలోని గ్రంథాలయాల్లో అ భివృద్ధి కుంటుపడుతోంది. సెస్ ద్వారానే గ్రంథాలయాలను అభివృద్ధి చేయాల్సి ఉన్నా.. వసూళ్లు లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 52 గ్రంథాలయాలు ఉండగా.. 16గ్రంథాలయాలకు మా త్రమే సొంత భవనాలున్నాయి. 35 గ్రంథాలయాలను పంచాయతీ కార్యాలయాలు, ఉచిత భవనాల్లో నిర్వహిస్తుండగా ఖానాపూర్లోని శాఖ గ్రంథాలయాన్ని అద్దె భ వనంలో కొనసాగిస్తున్నారు. జిల్లాలో ప్రతిరోజూ సుమారుగా 5 వేల మంది పాఠకులు గ్రంథాలయాల సేవలను వినియోగించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 వేల మంది గ్రంథాలయ డి పాజిట్దారులు ఉన్నారు. రూ.50 లక్షల వరకు బకాయిలు.. గృహ వినియోగదారులు చెల్లించే ఇంటి పన్నులో నుంచి 8 శాతం పన్ను గ్రంథాలయాలకు చెల్లించాల్సి ఉంటుం ది. జిల్లాలోని 866 గ్రామపంచాయతీలు, ఏడు మున్సిపాలిటీల ద్వారా జిల్లా గ్రంథాలయ సంస్థకు ఏటా రూ. కోటి వరకు సెస్ వస్తుంది. ఇందులో మున్సిపాలిటీల ద్వారా సుమారుగా రూ.70 లక్షలు, పంచాయతీల ద్వా రా రూ.30 లక్షలు. అయితే సెస్‌లో అధిక బాగం మున్సిపాలిటీల నుంచే రావాల్సి ఉన్నా పూర్తిస్థాయిలో వసూలు కావడం లేదని గ్రంథాలయ సంస్థ అధికారులు అంటున్నారు. గ్రామ పంచాయతీల్లో కేవలం మేజర్ పంచాయతీలు, మండల కేంద్రాల పంచాయతీలు మాత్రమే సెస్ చెల్లిస్తుండగా మిగతా జీపీల నుంచి అసలు సెస్ రావడం లేదంటున్నారు. మున్సిపాలిటీలు కూడా పూర్తిస్థాయిలో చెల్లించడం లేదు. ఏటా రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు మాత్రమే వసూలవుతోంది. కుంటుపడుతున్న అభివృద్ధి.. గ్రంథాలయాల అభివృద్ధికి సెస్ ప్రధానం. గ్రంథాలయాలకు వచ్చే సెస్‌ను పుస్తకాలు, వివిధ దినపత్రికల కొనుగోలుకు, పార్ట్‌టైం వర్కర్లకు వేతనాలు, పుస్తక నిక్షిప్త కేం ద్రాల నిర్వహణకు వినియోగిస్తుంటారు. ఇవే కాకుండా నూతన భవనాల నిర్మాణానికి కూడా వాడుతుంటారు. సెస్ వసూలు లేక అభివృద్ధికి నోచుకోవడం లేదు. -
3 రోజులే గడువు!
సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులకు ముగియనున్న వ్యవధి చేవెళ్ల రూరల్: సంక్షేమ పథకాలకోసం దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 15 చివరి తేదీ కావడంతో గ్రామ పంచాయతీలు జనంతో జాతరను తలపిస్తున్నాయి. సెలవు రోజైన ఆదివారం కూడా కార్యదర్శులు, వీఆర్ఓలు, పంచాయతీ సిబ్బంది ప్రజలనుంచి దరఖాస్తులు స్వీకరించారు. రేషన్, పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలని, అందుకు 15 తేదీనే చివరి గడువని చెప్పడంతో జనం ఉరుకులు పరుగుల మీద అర్జీలు పెట్టుకుంటున్నారు. ఒక్కసారిగా వెల్లువలా దరఖాస్తులు వస్తుండడంతో వాటిని స్వీకరించేందుకు సిబ్బంది సైతం ఇబ్బంది పడుతున్నారు. దరఖాస్తుదారులు సరైన వివరాలు ఇవ్వకపోవడం, ఆధార్, ఇతర ధ్రువీకరణ పత్రాలు వాటికి అనుసంధానం చేయకపోవడంతో మళ్లీ వారికి చెప్పి తెప్పిస్తున్నారు. -
పంచాయతీలకు సర్కార్ ‘షాక్’
కరీంనగర్ సిటీ: గ్రామపంచాయతీలు బకాయిపడ్డ విద్యుత్ బిల్లుల చె ల్లింపులో ప్రభుత్వం తిరకాసు పెట్టింది. బిల్లుల చెల్లింపు నుంచి తెలివిగా తప్పుకున్న సర్కారు... బకాయిల భారాన్ని పంచాయతీలపైనే వేసింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలు మంజూరు చేస్తున్న 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్ఎఫ్సీ) నిధుల్లోంచి 25 శాతం విద్యుత్ బిల్లుల కోసం వినియోగించుకోవాలని ఆదేశించింది. అసలే అంతంతమాత్రంగా వస్తున్న నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలా? కరెంటు బిల్లులు చెల్లించాలా? అని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా సర్కారు విడుదల చేస్తున్న అరకొర నిధుల్లోంచి 25 శాతంతో సగం బకాయిలు కూడా తీర్చే పరిస్థితి లేదని అంటున్నారు. జిల్లాలో 1207 పంచాయతీలు ఉండగా, పలుచోట్ల ఏళ్ల తరబడి విద్యుత్ బిల్లులు చెల్లించలేదు. జిల్లావ్యాప్తంగా రూ.64 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ట్రాన్స్‌కో అధికారులు పలుసార్లు నోటీసులు జారీ చేసినా.. ప్రభుత్వమే చెల్లిస్తుందని పంచాయతీలు స్పందించలేదు. ఈ బకాయిలు రాబట్టుకునేందుకు విద్యుత్ అధికారులు పంచాయతీల్లో వీధిదీపాలు, తాగునీటి పథకాలకు కరెంట్ కట్ చేశారు. దీంతో స్పందించిన జిల్లా పంచాయతీ అధికారి విద్యుత్ బకాయిలు చెల్లించడానికి గ్రామపంచాయతీలకు అనుమతిస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఆ బకాయిలను ప్రభుత్వం నేరుగా చెల్లించకుండా, గ్రామపంచాయతీలే తమకు వస్తున్న నిధుల నుంచి చెల్లించాలంటూ మెలిక పెట్టారు. ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి కేటాయిస్తున్న 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధుల నుంచి 25 శాతం వాడుకోవాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా, వీధిదీపాలు తదితర అవసరాల కోసం గ్రామపంచాయతీలు విద్యుత్‌ను వినియోగిస్తుంటాయి. ఈ చార్జీలను మేజర్ పంచాయతీలు భరిస్తుండగా, మైనర్ పంచాయతీల బిల్లులన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేది. ఇప్పుడు ఆ భారాన్ని పంచాయతీల నెత్తిన వేసింది. అసలే అంతంతమాత్రంగా నిధులు వస్తుంటే, అందులోంచి విద్యుత్ చార్జీలు చెల్లిస్తే పంచాయతీలకు చిల్లిగవ్వ కూడా మిగిలే పరిస్థితి లేదని సర్పంచులు పేర్కొంటున్నారు. కొన్ని పంచాయతీల్లో మంజూరయ్యే నిధులకంటే విద్యుత్ బకాయిలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే నేరుగా చెల్లించాలని సర్పంచుల సంఘం డిమాండ్ చేస్తోంది. -
తండాలిక పంచాయతీలు..
- జిల్లాలో 1000కి పైగా తండాలకు గ్రామ పంచాయతీ హోదా - 1000 జనాభా పరిగణనలోకి తీసుకుంటే 1214 తండాలకు.. - రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా అధికారుల నివేదిక - త్వరలోనే వెలువడనున్న ఉత్తర్వులు ఖమ్మం కలెక్టరేట్ : తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాలనే లంబాడీ గిరిజనుల చిరకాల స్వప్నం త్వరలోనే సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా మార్చేందుకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పంచాయతీల వివరాలతో కూడిన నివేదికలుఅందజేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో స్థానిక పంచాయతీరాజ్ అధికారులు జిల్లా వ్యాప్తంగా ఉన్న తండాల వివరాలు సేకరించారు. వాటి భౌగోళిక స్వరూపం ఆధారంగా 500, 750, 1000 జనాభా గల లంబాడీ, ట్రైబల్ తండాలు, గిరిజన తండాలను వేర్వేరుగా గుర్తించారు. అయితే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తండాలను పంచాయతీలుగా మార్చుతానని హామీ ఇచ్చి, వాటి పరిస్థితులపై కమిటీ వేసి నివేదికలు సైతం తయారు చేయించారు. ఆయన ఆకస్మిక మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ విషయాన్ని పక్కనపెట్టాయి. ఇప్పుడు ఈ ప్రతిపాదన వాస్తవ రూపం దాలిస్తే జిల్లాలో గ్రామపంచాయతీల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 758 పంచాయతీలు ఉండగా అదనంగా మరో 1214 పంచాయతీలు (1000 జనాభా పరిగణనలోకి తీసుకుంటే) ఏర్పాటు కానున్నాయి. కొత్తగూడెం డివిజన్లో 629, ఖమ్మం డివిజన్లో 128, భద్రాచలం డివిజన్లో 457 తండాలను గ్రామపంచాయతీలుగా మార్చేందుకు అర్హత ఉన్నవిగా గుర్తించారు. అయితే, పోలవరం ముంపు ప్రాంతంలోని గ్రామాలను సీమాంధ్రలో కలపాలన్న కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ అమలయితే జిల్లాలోని గ్రామపంచాయతీల సంఖ్య తగ్గనుంది. ప్రస్తుతం ఉన్న 758 పంచాయతీల నుంచి 136 పంచాయతీలు ఆంధ్రప్రదేశ్‌లోకి వెళితే.. జిల్లాలో 622 పంచాయతీలు ఉంటాయి. ప్రభుత్వానికి నివేదికలు.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జిల్లా యంత్రాంగం జనాభా ప్రాదిపదికన తండాలను గుర్తించింది. ప్రభుత్వం సూచించిన విధంగా 500, 750, 1000 జనాభా గల తండాల వివరాలను ప్రత్యేక ఫార్మాట్లో జిల్లా పంచాయతీ అధికారులు మంగళవారం పంచాయతీరాజ్ కమిషనర్‌కు పంపించారు. అయితే ఎంత జనాభా కలిగిన తండాలను పంచాయతీలుగా గుర్తిస్తారనే దానిపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవటంతో మూడు ఫార్మాట్లలో నివేదికలు పంపించారు. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయంతో జిల్లాలో మరికొన్ని తండాలు పంచాయతీలుగా మారనున్నాయి. ఇక తండాలకు కొత్త శోభ... రాష్ట్ర ప్రభుత్వం హామీ మేరకు తండాలను పంచాయతీలుగా గుర్తిస్తే ఆ తండాల అభివృద్ధి వేగవంతం కానుంది. ఇప్పటివరకు పంచాయతీల పరిధిలో ఉన్న తండాలు గ్రామాలకు దూరంగా ఉండి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. తాగునీరు, విద్యుత్, రహదారి సౌకర్యం లేక తండా వాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటే తమ జీవితాలలో కొంతైనా వెలుగులు నిండుతాయని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
పంచాయతీలకు ‘పన్ను’ నొప్పి
రెండేళ్ల డిమాండ్ 43.47 కోట్లు వసూలయింది 18.51 కోట్లు ఏడాదికేడాది పెరిగిపోతున్న బకాయిలు ఏజెన్సీలో పరిస్థితి దయనీయం గ్రామ పంచాయతీలు తిరోగమన దిశగా పయనిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు సకాలంలో రాక.. రావాల్సిన పన్నులు వసూలు కాక.. పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. అభివృద్ధి పనులూ కుంటుపడుతున్నాయి. ఏజెన్సీ పంచాయతీల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఒకటి రెండు శాతం వసూలు గగనమవుతోంది. వరుసగా ఎన్నికల నిర్వహణ.. పంచాయతీల్లో సిబ్బంది కొరత.. ఉన్నవారిపై అదనపు పనిభారం కూడా ఇందుకు కారణమన్న వాదన అధికారుల్లో వ్యక్తమవుతోంది. విశాఖ రూరల్: జిల్లాలో ప్రస్తుతం 925 పంచాయతీలు ఉన్నాయి. ఒక్కోదానికి ఒక్కో కార్యదర్శి ఉండాలి. కానీ 255 మంది పంచాయతీ కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. దీంతో ఒక్కక్కరికీ మూడు నాలుగింటి బాధ్యతలు అప్పగించారు. ఏజెన్సీలోని కొయ్యూరు మండలంలో ఒక్కరూ లేరు. ఇటువంటి పరిస్థితుల్లో సిబ్బందిపై తీవ్రమైన పనిభారం ఉంటోంది. దీంతో పాటు ఇటీవల వరుసగా స్థానిక ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరగడంతో పన్నుల వసూలుపై అధికారులు, సిబ్బంది దృష్టి సారించలేకపోయారు. గత కొన్నేళ్లుగా పన్నుల బకాయిలు రూ.14.24 కోట్లు ఉండగా 2013-14లో రూ.25.47 కోట్ల డిమాండుకు కేవలం రూ.8.51 కోట్లు మాత్రమే వసూలైంది. ఈ ఆర్థిక సంవతర్సంలో రూ.18 కోట్లు రావాల్సి ఉండగా కేవలం రూ.10 కోట్లు మాత్రం వసూలు కావడం గమనార్హం. ఏటా కనీసం 30 శాతం కూడా వసూలు కాకపోవడంతో బకాయిలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం పన్నుల వసూలుకు వెళితే రాజకీయ నాయకుల పేర్లు చెప్పి కొంత మంది బెదిరింపులకు దిగుతున్నారని, చెల్లించడానికి అంగీకరించడం లేదని సిబ్బంది వాపోతున్నారు. పెరిగిపోతున్న ఎరియర్స్: సాధారణంగా పంచాయతీల పరిధిలో ఉన్న ఇళ్లకు,నీటికే కా కుండా లైబ్రరీ సెస్సు కింద పన్నులు వసూలు చేస్తుంటారు. దీనికి ప్రకారం 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.8.02 కోట్లు వసూలు కావాల్సి ఉంది. అలాగే నాన్‌ట్యాక్సెక్ కింద సంతలు, వేలం వంటి వాటి నుంచి ఈ ఏడాది రూ.3.21 కోట్లు,ట్యాక్స్, నాన్ట్యాక్స్లతో కలి పి రూ.11.23 కోట్లు, బకాయిలు రూ.14.24 కోట్లు మొత్తంగా రూ.25.47 కోట్లు ఆదాయం సమకూరాల్సి ఉంది. అయితే గతేడాది డిసెం బర్ వరకు పన్నుల కింద రూ.2.32 కోట్లు, నాన్‌ట్యాక్సెక్ కింద రూ.1.12 కోట్లు, ఎరియర్స్ రూ.5.06 కోట్లు మొత్తంగా రూ.8.51 కోట్లు మా త్రమే వసూలైంది. ఇంకా ఎరియర్స్ రూ. 9.17 కోట్లు, ట్యాక్స్, నాన్ట్యాక్సెస్ కింద రూ. 7.78 కోట్లు మొత్తంగా రూ.16.96 కోట్లు రావాల్సి ఉంది. ఇరిగేషన్ ప్రాంతాల్లో మాత్రమే పన్నులు కొంత వరకు వస్తుండగా ఏజెన్సీలో కనీసం ఒక శాతం కూడా కష్టంగానే వసూలవుతున్నాయి. దీంతో పన్నుల వసూళ్లపై అధికారులు దృష్టి సా రించారు. ఈ విషయంపై అధికారులు సిబ్బంది తో సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. -
అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సిద్ధం
కలెక్టరేట్ : వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు(బీఆర్జీఎఫ్) ఏయే అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలనేది గ్రామాల్లో సర్పంచులు నిర్ణయిస్తున్నారు. పంచాయతీ కార్యాలయాల్లో పనుల ప్రతిపాదనలపై ప్రజల సమక్షంలో తీర్మానం చేసి జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో పది రోజులుగా గ్రామసభలు కొనసాగుతున్నాయి. పంచాయతీకి కేటాయించిన బీఆర్జీ నిధులు ఎన్ని, వాటితో ఎన్ని పనులు అవుతాయని లెక్కేస్తున్నారు. గ్రామాల్లో సర్పంచులు ఉన్నప్పటికీ మండల స్థాయిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టలేదు. దీంతో మండల స్థాయిలో పనుల ఆమోదానికి కొంత సమయం పడుతుంది. కాగా, పనుల ప్రతిపాదనలు ఈ నెల 25లోగా పంపించాలని ప్రభుత్వం ఆదేశించింది. మండలాల్లో ప్రజాప్రతినిధులు కొలువుదీరకపోవడం, జెడ్పీ చైర్మన్ ఎన్నికల నోటిఫికేషన్ తదితర పరిణామాల నేపథ్యంలో గడువు పెంచే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపాదనలు ఇలా.. జిల్లాకు కేటాయించిన బీఆర్జీఎఫ్ బడ్జెట్లో పంచాయతీలకు 50శాతం నిధులు కేటాయిస్తారు. వీటిని అభివృ ద్ధి పనులకు వినియోగించాల్సి ఉంటుంది. గ్రామాల్లో స ర్పంచు, ఈవోపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శులు ప్రజల సమక్షంలో సభ నిర్వహించి పనుల ప్రతిపాదనకు ఆమో దం పొందాలి. తాగునీరు, రోడ్డు, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు, ప్రహరీలు, పైపులైన్లు ఇతరత్రా పనులు ప్రతిపాదించాలి. ఆమోదం తెలిపిన జాబితాను ఎంపీడీవోలకు పంపిస్తారు. మండల స్థాయిలో సెక్టార్ జాబితాకు ఆమోదం పొందుతారు. ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ నుంచి 30శాతం నిధులు మండల సెక్టార్‌కు, 18శాతం మున్సిపల్ సెక్టార్‌కు కేటాయిస్తారు. మం డల, గ్రామ పనుల జాబితాను ఎంపీడీవో జిల్లా పరిషత్‌కు పంపిస్తారు. మున్సిపల్‌కు నిధులు కేటాయించిన తర్వాతే మండల, గ్రామ, జిల్లా పరిషత్ సెక్టార్లకు కేటాయిస్తారు. మున్సిపాల్టీల్లో ప్రతీ వార్డులో సభ నిర్వహిం చి పనులకు ఆమోదం పొందాలి. ఆ జాబితాను కమిషనర్లు జిల్లా పరిషత్‌కు పంపిస్తారు. జిల్లా స్థాయిలో సాధారణ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి పనుల ప్రతిపాదనల జాబితాను ఆమోదిస్తారు. జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ అధ్యక్షులు, చైర్మన్ ఉండాల్సి ఉంటుంది. జిల్లా ప్రణాళిక కమిటీ ఆమోదం పొందిన పనుల జాబితాను ప్రభుత్వానికి పంపిస్తారు. ఇదంతా జరిగేసరికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశాలున్నాయి. గతంలో దుర్వినియోగం 2012-13 సంవత్సరానికి సంబంధించిన బీఆర్జీ నిధుల దుర్వినియోగం అయ్యాయి. పనులు చేయకుండానే రూ.20 లక్షలు డ్రా చేసుకున్నారని 2013-14లో నిర్వహించిన ఆడిట్లో వెల్లడైంది. అప్పుడు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. 12 మండలాల అధికారులు డబ్బులు డ్రా చేశారని గుర్తించారు. రూ.10 లక్షల వరకు రికవరీ చేశారు. మిగతా రూ.10 లక్షలు రికవరీ చేయాల్సి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పనుల ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని అధికారులు చర్చించుకుంటున్నారు. -
తాండాలకు కొత్త కళ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: గిరిజన తండాలు త్వరలో కొత్త కళను సంతరించుకోనున్నాయి. ఇప్పటివరకు అనుబంధ గ్రామాలుగా ఉన్న తండాలు కొత్తగా గ్రామ పంచాయతీలుగా అవతరించనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసే అంశంపై గతవా రం సీఎం కేసీఆర్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిం చారు. ఇందులో భాగంగా చర్చకు వచ్చిన అంశాలపై వివరాలు సేకరించేం దుకు ఆ శాఖ అధికారులు చర్యలు ముమ్మరం చే శారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ శాఖ అధికారులకు సర్క్యులర్ జారీ చేశారు. దీంతో చర్యలకు ఉపక్రమించిన పంచాయతీ రాజ్‌శాఖ అధికారులు క్షేత్రస్థాయి లో వివరాలు సేకరించే పనిలో పడ్డారు. మూడు రకాలుగా వివరాల సేకరణ తండాలను గ్రామ పంచాయతీలుగా రూపొందించే అంశంపై మూడు రకాలు గా వివరాలు సమర్పించాలంటూ మం డల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో గ్రామ పంచాయ తీ పేరు, జనాభాతో పాటు వాటి పరిధి లో 500, 750, 1000 జనాభా ఉన్న తం డాల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని సూ చించింది. ఈ వివరాలను నిర్ణీత ప్రొఫార్మాలో ఈ నెల 14లోగా సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో.. అధికారులు వివరాల సేకరణ ప్రక్రియను వేగవంతం చేశారు. జిల్లాలో 705 పంచాయతీలకుగాను 18 పంచాయతీలను ఐదు నగర పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. మరికొన్ని గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేసే క్రమంలో ఆటంకాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వాటిని పం చాయతీలుగా ఉంచినప్పటికీ.. ఎన్నికలు నిర్వహించలేదు. ఇవికాకుండా మరో 350 వరకు తండాలున్నట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. తాజాగా సేకరిస్తున్న వివరాల ప్రకారం వీటిలో ఎన్ని తండాలు గ్రామపంచాతీయలుగా మారనున్నాయో త్వరలో స్పష్టత రానుంది. -
కొత్తగా 12 మున్సిపాలిటీలు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌కు సమీపంలోని గ్రామ పంచాయితీల హోదా మారబోతుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న ఆయా గ్రామ పంచాయితీలను గ్రేటర్లో విలీనం చేయాలని చేసిన ప్రభుత్వ ప్రయత్నానికి న్యాయ పరమైన అడ్డంకులు ఏర్పడడంతో మధ్యే మార్గంగా ఆ పంచాయితీలను మున్సిపాలిటీలుగానో, నగర పంచాయితీలుగానో చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. మున్సిపాలిటీల్లో విలీనమయ్యే గ్రామ పంచాయితీల జనాభా ఆధారంగా నగర పంచాయితీగా గానీ, మున్సిపాలిటీగా గాని నిర్ణయిస్తారు. ఈ మేరకు తొలుత 15 మున్సిపాలిటీలు/నగర పంచాయితీల ప్రతిపాదనలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిం చారు. అయితే అందులో వివిధ కారణాల వల్ల కాల్వంచ, మణికొండ జాగీర్, గుండ్లపోచంపల్లిలను తోసిపుచ్చిన ప్రభుత్వం.. మిగతా పన్నెండింటికీ ప్రాథమికంగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ కొత్త మున్సిపాలిటీ/ నగర పంచాయితీలకు కార్యరూపం ఇచ్చే పనిలో నిమగ్నమైంది. రాష్ట్ర విభజన అంశం దుమారం లేపుతున్న తరుణంలో త్వరలోనే కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయితీలకు ఆమోదం తెలపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రతిపాదిత మున్సిపాలిటీ/ నగర పంచాయితీలు ఇవే... మున్సిపాలిటీ/నగర పంచాయితీ- విలీనమయ్యే గ్రామాలు- మండలం శంషాబాద్- శంషాబాద్, శాతం రాయి, కొత్వాల్ గూడ- శంషాబాద్ నార్సింగి నార్సింగి, గండిపేట, వట్టినాగులపల్లి,నెక్నంపూర్, పుప్పాలగూడ, ఖానాపూర్, మంచిరావుల, కోకాపేట- రాజేంద్రనగర్ బండ్లగూడ జాగీర్ -బండ్లగూడ జాగీర్, కిస్మత్పూర్, హిమయత్ సాగర్, పీరంచెరువు, హైదర్షా కోట్- రాజేంద్రనగర్ నిజాంపేట- నిజాంపేట, ప్రగతి నగర్, బాచుపల్లి- కుత్బుల్లాపూర్ కొంపల్లి- కొంపల్లి, దూలపల్లి- కుత్బుల్లాపూర్ జిల్లెలగూడ- జిల్లెలగూడ- సరూర్‌నగర్ కొత్తపేట- కొత్తపేట, బాలాపూర్‌లో కొంత భాగం(సర్వేనంబర్ 140 నుంచి 253) మీర్‌పేట మీర్‌పేట- సరూర్‌నగర్ జల్పల్లి జల్పల్లి, పహడీషరీఫ్ సరూర్‌నగర్ బోడుప్పల్- బోడుప్పల్, ఫిర్జాదిగూడ, మేడిపల్లి, పర్వతాపూర్, చెంగిచెర్ల- ఘట్కేసర్ జవహర్‌నగర్- జవహర్‌నగర్- షామీర్పేట నాగారం -నాగారం, దమ్మాయిగూడ -కీసర -
బిల్లులు గ్రామ పంచాయతీలే చెల్లించాలని ఉత్తర్వులు
సాక్షి, నల్లగొండ: పల్లెలకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఇప్పటికే ఆర్థికలేమితో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలకు విద్యుత్ షాక్ తగలనుంది. మైనర్, మేజర్ గ్రామ పంచాయతీల్లో (జీపీ) తాగునీటి పథకాలు, వీధి దీపాలకు సంబంధించిన విద్యుత్‌చార్జీలు ఇకపై పంచాయతీలే భరించాల్సి ఉంటుంది. అంతేగాక ఇప్పటివరకు ఉన్న బకాయిలు కూడా చెల్లించాల్సిందేనని సర్కారు స్పష్టం చేసింది. ఈ మేరకు మూడు రోజుల క్రితం జీఓ జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పల్లెలు మరింత అధోగతికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. కష్టకాలమే.. జిల్లాలో మొత్తం 1169 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో మేజర్ 15పోను మిగిలినవన్నీ మైనర్ పంచాయతీలే. ఆయా గ్రామాలకు సంబంధించిన విద్యుత్ చార్జీలను మొన్నటి వరకు ప్రభుత్వమే నేరుగా రాష్ట్రస్థాయిలో చెల్లించేది. ఈ చర్య ద్వారా పల్లెలకు విద్యుత్ భారం తప్పేది. ఆర్థికంగా వెసులుబాటు కలిగేది. ఇకపై పల్లెల్లో ప్రతి వీధిలోని స్తంభానికి బల్బులు ఏర్పాటు చేయాలన్నా పంచాయతీలు ఒకటికి మూడుసార్లు ఆలోచించాల్సిందే. ముఖ్యంగా చిన్న పంచాయతీలు ఆచిచూచి అడుగేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు పంచాయతీల విద్యుత్ బకాయిలు, నెలవారీ బిల్లులు చెల్లిస్తూ వస్తున్న ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవడమే అందుకు ప్రధాన కారణం. బకాయిలూ.... 13వ ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ (రాష్ట్ర ఆర్థిక సంఘం) నిధుల నుంచి విద్యుత్ శాఖకు వెళ్లాల్సిన బకాయిల మొత్తాన్ని రెండు వాయిదాల్లో చెల్లించాలని చెప్పింది. అంతేగాక ఇక మీదట పంచాయతీలే విద్యుత్ చార్జీలు ఎప్పటికప్పుడు చె ల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. స్థానిక సంస్థలకు నిధులు లేకుండా ప్రభుత్వం ఇప్పటికే నిర్వీర్యం చేసింది. ఇప్పుడు విద్యుత్‌చార్జీలను మళ్లీ పాత పద్ధతిలో పంచాయతీలే చెల్లించాలని పేర్కొనడం జీపీలకు శరాఘాతమే. పల్లెల్లో చీకటి వీధులు దర్శనమివ్వడం ఖాయమని పలువురు పేర్కొంటున్నారు. గతంలో ప్రభుత్వమే.. 2008 వరకు విద్యుత్ బిల్లులు పంచాయతీలే చెల్లించేవి. ప్రభుత్వాలు అభివృద్ధి పనులకే సరిగా నిధులు విడుదల చేయలేకపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో విద్యుత్ బిల్లులు చెల్లించడం జీపీలకు తలకుమించిన భారంగా మారింది. ఇలా ఏటికేడు బకాయిల కుప్ప పేరుకుపోయింది. వీటిని చెల్లించకపోతే పల్లెలకు విద్యుత్ కట్ చేస్తామని ట్రాన్స్‌కో అధికారులు పలుమార్లు లేఖలు పంపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే నేరుగా బాధ్యత తీసుకొని అప్పుడప్పుడు కొంతమేర బకాయిలు చెల్లిస్తూ వస్తోంది. పెండింగ్‌లో రూ 56 కోట్లు... జిల్లాలోని పంచాయతీలకు ప్రతినెలా సుమారు రూ 4.50 కోట్ల విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. వీటిని అప్పుడప్పుడు ప్రభుత్వం చెల్లిస్తూ వస్తోంది. అయినా ఇంకా జీపీలపై రూ 56 కోట్ల బకాయిల భారం ఉందని విద్యుత్ శాఖాధికారులు పేర్కొం టున్నారు. ఈ మొత్తాన్ని చెల్లించడం పంచాయతీలకు శక్తికి మించిన భారమే. అంతేగాక ప్రతినెలా వచ్చే బిల్లులు కూడా చెల్లించాలి. చాలా గ్రామాలకు ఎటువంటి ఆదాయమూ సమకూరడం లేదు. పన్ను వస్తున్న పంచాయతీలు చాలా అరుదు. ఇటువంటి సమయంలో విద్యుత్ బిల్లులు చెల్లించమనడం.. పంచాయతీలను మరింత దిగజార్చేందుకు తీసుకున్న నిర్ణయమేనని పలువురు పేర్కొంటున్నారు. -
కరెంట్ బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలి
అన్ని మేజర్, మైనర్ గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని రాష్ట్ర సర్పంచ్ల సంఘం డిమాండ్ చేసింది. విద్యుత్ ఛార్జీలు చెల్లించాలంటూ విద్యుత్ సంస్థలు ఇటీవలి కాలంలో పంచాయతీలకు నోటీసులు ఇస్తున్నాయని, అరుుతే, ఆర్థికంగా పూర్తిగా కుంగిపోయిన పంచాయతీలు ఆ ఛార్జీలను చెల్లించే స్థితిలో లేవని సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు డోకూరి రామ్మోహన్రావు, గౌరవాధ్యక్షుడు పిల్లి సత్తిరాజు, ప్రధాన కార్యదర్శి భూమన్నయాదవ్ తదితరులు బుధవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో తెలిపారు.