పంచాయతీలకు ‘పన్ను’ నొప్పి | Be the 'tax' pain | Sakshi
Sakshi News home page

పంచాయతీలకు ‘పన్ను’ నొప్పి

Published Sat, Jun 21 2014 12:48 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

Be the 'tax' pain

  • రెండేళ్ల డిమాండ్ 43.47 కోట్లు
  •  వసూలయింది 18.51 కోట్లు
  •  ఏడాదికేడాది పెరిగిపోతున్న బకాయిలు
  •  ఏజెన్సీలో పరిస్థితి దయనీయం
  • గ్రామ పంచాయతీలు తిరోగమన దిశగా పయనిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు సకాలంలో రాక.. రావాల్సిన పన్నులు వసూలు కాక..  పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. అభివృద్ధి పనులూ కుంటుపడుతున్నాయి. ఏజెన్సీ పంచాయతీల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఒకటి రెండు శాతం వసూలు గగనమవుతోంది. వరుసగా ఎన్నికల నిర్వహణ.. పంచాయతీల్లో సిబ్బంది కొరత.. ఉన్నవారిపై అదనపు పనిభారం కూడా ఇందుకు కారణమన్న వాదన అధికారుల్లో వ్యక్తమవుతోంది.
     
    విశాఖ రూరల్: జిల్లాలో ప్రస్తుతం 925 పంచాయతీలు ఉన్నాయి. ఒక్కోదానికి ఒక్కో కార్యదర్శి ఉండాలి. కానీ 255 మంది పంచాయతీ కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. దీంతో ఒక్కక్కరికీ మూడు నాలుగింటి బాధ్యతలు అప్పగించారు. ఏజెన్సీలోని కొయ్యూరు మండలంలో ఒక్కరూ లేరు. ఇటువంటి పరిస్థితుల్లో సిబ్బందిపై తీవ్రమైన పనిభారం ఉంటోంది. దీంతో పాటు ఇటీవల వరుసగా స్థానిక ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరగడంతో పన్నుల వసూలుపై అధికారులు, సిబ్బంది దృష్టి సారించలేకపోయారు.

    గత కొన్నేళ్లుగా  పన్నుల బకాయిలు రూ.14.24 కోట్లు ఉండగా 2013-14లో రూ.25.47 కోట్ల డిమాండుకు కేవలం రూ.8.51 కోట్లు మాత్రమే వసూలైంది. ఈ ఆర్థిక సంవతర్సంలో రూ.18 కోట్లు రావాల్సి ఉండగా కేవలం రూ.10 కోట్లు మాత్రం వసూలు కావడం గమనార్హం. ఏటా కనీసం 30 శాతం కూడా వసూలు కాకపోవడంతో బకాయిలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం పన్నుల వసూలుకు వెళితే రాజకీయ నాయకుల పేర్లు చెప్పి కొంత మంది బెదిరింపులకు దిగుతున్నారని, చెల్లించడానికి అంగీకరించడం లేదని సిబ్బంది వాపోతున్నారు.
     
    పెరిగిపోతున్న ఎరియర్స్: సాధారణంగా పంచాయతీల పరిధిలో ఉన్న ఇళ్లకు,నీటికే కా కుండా లైబ్రరీ సెస్సు కింద పన్నులు వసూలు చేస్తుంటారు. దీనికి ప్రకారం 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.8.02 కోట్లు వసూలు కావాల్సి ఉంది. అలాగే నాన్‌ట్యాక్సెక్ కింద సంతలు, వేలం వంటి వాటి నుంచి ఈ ఏడాది రూ.3.21 కోట్లు,ట్యాక్స్, నాన్‌ట్యాక్స్‌లతో కలి పి రూ.11.23 కోట్లు, బకాయిలు రూ.14.24 కోట్లు మొత్తంగా రూ.25.47 కోట్లు ఆదాయం సమకూరాల్సి ఉంది. అయితే గతేడాది డిసెం బర్ వరకు పన్నుల కింద రూ.2.32 కోట్లు, నాన్‌ట్యాక్సెక్ కింద రూ.1.12 కోట్లు, ఎరియర్స్ రూ.5.06 కోట్లు మొత్తంగా రూ.8.51 కోట్లు మా త్రమే వసూలైంది.

    ఇంకా ఎరియర్స్ రూ. 9.17 కోట్లు, ట్యాక్స్, నాన్‌ట్యాక్సెస్ కింద రూ. 7.78 కోట్లు మొత్తంగా రూ.16.96 కోట్లు రావాల్సి ఉంది. ఇరిగేషన్ ప్రాంతాల్లో మాత్రమే పన్నులు కొంత వరకు వస్తుండగా ఏజెన్సీలో కనీసం ఒక శాతం కూడా కష్టంగానే వసూలవుతున్నాయి. దీంతో పన్నుల వసూళ్లపై అధికారులు దృష్టి సా రించారు. ఈ విషయంపై అధికారులు సిబ్బంది తో సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement