ఖాళీ అయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డుల స్థానాలకు రానున్న నోటిఫికేషన్
25వ తేదీన ఓటరు జాబితా ప్రకటన
నకిరేకల్ గ్రామపంచాయతీ
రిజర్వేషన్‌పై తొలగని సందిగ్ధత
గ్రామాల్లో ఎన్నికల నగారా మోగనుంది. జిల్లాలో వివిధ కారణాలతో ఖాళీ అయిన గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఖాళీలు ఏర్పడిన స్థానాలకు జూన్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
నల్లగొండ : జిల్లాలో మరికొన్ని రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు నిర్వ హిం చేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి నమోదైన ఓటరు జాబితాను ఖాళీ అయిన స్థానాల్లో ప్రచురించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో కోరం ఉండి కూడా ఖాళీ ఉన్న ఉప సర్పంచ్ స్థానాలు రెండు ఉన్నాయి. పలు చోట్ల కోరం లేక వాయిదా పడిన ఉప సర్పంచ్ స్థానాలు కూడా ఉన్నాయి. ఉప సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 1173 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో సర్పం చ్‌లు 11, వార్డు సభ్యులు 44, ఎంపీటీసీ 1, జెడ్పీటీసీ 1 స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. కాగా నకిరేకల్ గ్రామ పంచాయతీ స్థానం రిజర్వేషన్ ఎటూ తేల్చకపోవడంతో ఈ స్థానంలో ఓటరు జాబితాను ప్రచురించడం లేదు. ఆర్డీఓ రిజర్వేషన్ ఖరారు చే యాల్సి ఉంది. అయితే వివిధ రాజకీయ కారణాల వల్ల అధికారులు రిజర్వేషన్‌ను పెండిం గ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.
వార్డుల వివరాలు
దేవరకొండ మండల చెన్నారం పంచాయతీలోని 10వ వార్డు, హాలియా మండలం తిమ్మాపురంలో 3వ వార్డు, నిడమనూరు మండలం గుంటిపల్లిలో 3, రేగులగడ్డలో 3వ, త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలోని 3, దొనకొండలో 3, దామరచర్ల మండలం దిలావర్‌పూర్‌లో 8, ఇరిగిగూడలోని 6, వేములపల్లి మండలం సల్కునూర్‌లోని 1వ వార్డు, గరిడేపల్లి మండలం కుతుబుషాపురంలోని 3, హుజూర్‌నగర్ మండలం లక్కవరంలో 3, మఠంపల్లి మండలం బంకమంతులగూడెంలో 5వ వార్డు, మేళ్లచెర్వు మండలం రామాపురంలోని 5వ వార్డు, చిలుకూరులోని 5వ వార్డు, మోతె మండలం బుర్కచర్లలోని 10వ వార్డు, మునగాల మండలం మాదారంలోని 3, ఆత్మకూర్.ఎస్ కోటపహాడ్‌లో 6, నల్లగొండ మండలం దొనకల్‌లో 8, దండెంపల్లిలోని 3, కనగల్ మండలం కురంపల్లిలోని 5వ వార్డులో ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా తిప్పర్తి మండలం చిన్నసూరారంలోని 2వ వార్డు, చండూరు మండలం ఇడికుడలోని 4, బంగారిగడ్డలో 1, చండూరులో 11, మునుగోడు మండలం కొరకటికల్‌లో 1, నాంపల్లి మండలం చామలపల్లిలో 1, బీబీనగర్ మండలం రావిపహాడ్‌లో 8, వలిగొండ మండలం రావిపహాడ్‌లో 8, నెమలికాల్వలో 3, వేములకొండలోని 4వ వార్డులో ఎన్నికలు జరగాలి. కట్టంగూర్ మండలం పిట్టంపల్లిలోని 1వ వార్డు, బొల్లేపల్లిలోని 4, నకిరేల్ మండలం వల్లభాపురంలోని 2, రామన్నపేట మండలం శోభనాద్రిగూడెంలోని 10, వెల్లంకిలోని 4, అర్వపల్లి మండలం నాగారంలోని 3, నూతనకల్ మండలం చిల్పకుంట్లలోని 11, ఆత్మకూర్.ఎం మండలం నాంచారిపేటలోని 6, ఉప్పలపహాడ్‌లోని 8, ఆలేరు మండలం రాఘవాపురంలోని 2, బి.రామారం మండలం మల్యాలలోని 1, బండికాడిపల్లిలోని 2వ వార్డు, కంచల్‌తండాలోని 3, గుండాల మండలం పల్లెపహాడ్‌లోని 8, తుర్కపల్లిలోని దాచారం 1వ వార్డుకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
త్వరలో పంచాయతీ నగారా
Published Tue, May 19 2015 4:14 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement