MPTC elections
-
ఎన్నికల కౌంటింగ్‌కు ముహూర్తం ఫిక్స్
-
పశ్చిమ గోదావరి జిల్లా లో జోరుగా పరిషత్ ఎన్నికల ప్రచారం
-
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బలవంతంగా ఉపసంహరింప చేసిన నామినేషన్లను పునరుద్ధరించే అంశంపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై వాదనలు సోమవారం ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎక్కడైనా అభ్యర్థుల నామినేషన్లను బలవంతంగా ఉపసంహరింపచేశారని నిర్ధారణ అయితే వాటిని పునరుద్ధరించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం విదితమే. ఈ మేరకు గత నెల 18న జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలు కాగా.. వాటిపై సోమవారం తుది విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి, వీఆర్ఎన్ ప్రశాంత్, వీఆర్ రెడ్డి, జీఆర్ సుధాకర్ తదితరులు వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, ఎన్నికల కమిషన్ తరఫున ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. పత్రికా కథనాల ఆధారంగా ఎలా నిర్ణయిస్తారు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఒకే నామినేషన్ వచ్చిన చోట నిబంధనల ప్రకారం రిటర్నింగ్ అధికారులు ఆ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తక్షణమే ప్రకటించి ఫారం–10, ఎంపీటీసీ, జెడ్పీసీలుగా గెలుపొందినట్టు ఫారం 29 జారీ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రసుత కేసులో కూడా రిటర్నింగ్ అధికారులు నిబంధనల మేరకే నడుచుకున్నారని తెలిపారు. వీటిపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడమే మార్గమని వివరించారు. పత్రికల్లో ప్రచురితమైన కథనాలను ఆధారంగా చేసుకుని బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై ఎన్నికల కమిషనర్ ఓ నిర్ణయానికి వచ్చారని, ఇది ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. జనసేన పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఈ నెల 15కి వాయిదా వేశారు. -
జెడ్పీటీసీ, ఎంపీటీసీ వ్యాజ్యాల్లో విచారణ 8కి వాయిదా
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాల్లో తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అప్పటికల్లా కౌంటర్లు దాఖలు చేసి, ఆ కాపీలను పిటిషనర్లు, ఇతర ప్రతివాదులకు అందచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అప్పటికల్లా కౌంటర్లు దాఖలు చేయకపోతే, ఈ వ్యాజ్యాల్లో కౌంటర్లు లేనట్లుగానే భావించి విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించారని నిర్ధారణ అయితే, ఆ అభ్యర్థుల నామినేషన్లను పునరుద్ధరించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గత నెల 18న ఉత్తర్వులిచ్చారు. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, వాటిపై ఫిబ్రవరి 20వ తేదీకల్లా నివేదికివ్వాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులకనుగుణంగా అదేరోజు ప్రెస్‌నోట్ జారీ చేశారు. ఈ ఉత్తర్వులను, ప్రెస్‌నోట్‌ను రాజ్యాంగ విరుద్ధంగా, ఏకపక్ష చర్యగా ప్రకటించి.. రద్దు చేయాలని కోరుతూ పలువురు పిటిషన్లు వేశారు. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ జారీచేసేలా ఆదేశాలివ్వాలంటూ జనసేన పార్టీ పిటిషన్ వేసింది. ఈ వ్యాజ్యాలన్నీ గత వారం విచారణకు రాగా, కౌంటర్ల దాఖలుకు ఎన్నికల కమిషన్ గడువు కోరింది. ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తి.. మార్చి 3 వరకు గడువిచ్చారు. తాజాగా శుక్రవారం ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా, పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన వివేక్ చంద్రశేఖర్, ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్‌లు స్పందిస్తూ.. ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ కౌంటర్లు దాఖలు చేయలేదన్నారు. ఈ వ్యాజ్యాలను అడ్డంపెట్టుకుని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణను జాప్యం చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందన్నారు. ఈ నెల 3వ తేదీకల్లా కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ వ్యాజ్యాలను అడ్డంపెట్టుకుని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణను జాప్యం చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందని సుమన్ అన్నారు. అందుకే కౌంటర్ల దాఖలులో జాప్యం చేస్తోందన్నారు. ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ స్పందిస్తూ.. కౌంటర్ల దాఖలులో జరిగిన జాప్యానికి కోర్టును క్షమాపణ కోరారు. విచారణను సోమవారానికి వాయిదా వేస్తే, ఆలోగా కౌంటర్ల కాపీలను అందరికీ అందచేస్తామని అభ్యర్థించారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేశారు. -
తాజా నోటిఫికేషన్ అక్కర్లేదు
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) హైకోర్టుకు నివేదించింది. గత ఏడాది జారీ చేసిన నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా ఈ నెల 18న ప్రొసీడింగ్స్ ఇచ్చినట్టు ఎస్ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్ తెలిపారు. గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్ ఇంకా మనుగడలో ఉండగా, కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాదని వివరించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక దాన్ని ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదన్నారు. ఇప్పటికే ఇదే అంశంపై వ్యాజ్యాలు దాఖలై ఉన్నాయని, ఈ వ్యాజ్యాన్ని కూడా వాటితో పాటు కలిపి విచారించాలని కోర్టును కోరారు. ఇందుకు అంగీకరించిన కోర్టు ఈ వ్యాజ్యాన్ని కూడా ఇదే అంశంపై దాఖలైన వ్యాజ్యంతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు బుధవారం ఉత్తర్వులిచ్చారు. గత ఏడాది జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయని, ఈ నేపథ్యంలో తాజాగా నోటిఫికేషన్ జారీచేసేలా ఆదేశించాలని కోరుతూ జనసేన పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు ముగిశాయి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్ హైకోర్టుకు తెలిపారు. ఈ దృష్ట్యా గ్రామాల్లో ఇంటింటికీ రేషన్ పథకాన్ని అడ్డుకోవద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన అప్పీల్‌పై తదుపరి విచారణ అవసరమో లేదో ఎన్నికల కమిషనర్‌తో మాట్లాడి చెబుతామన్నారు. ఇందుకు అంగీకరిం చిన హైకోర్టు తదుపరి విచారణను మార్చి 1వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ఎ.కె. గోస్వామి, జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
‘కళా’కు పరాభవం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావుకు ఊహించని పరిణామం ఎదురైంది. తన సొంత మండలానికి చెందిన నాయకులు షాక్ ఇవ్వడంతో ఆయన కంగుతిన్నారు. తాజాగా జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికల్లో ఇంకా పోలింగ్ జరక్కుండానే అవమానకరమైన ఫలితాలను చవిచూశారు. ఉపసంహరణలకొచ్చేసరికి ఇంకెంతటి చేదు అనుభవాలను ఎదుర్కొంటారో చూడాలి. సొంత మండలమైన రేగిడిలో మూడు ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మండల పరిషత్ అధ్యక్ష పదవిని సైతం దక్కించుకోబోతోంది. దీన్నిబట్టి టీడీపీ ఎంత గడ్డు పరిస్థితిలో ఉందో స్పష్టమవుతోంది. రాష్ట్ర అధ్యక్షుడి సొంత మండలంలోనే ఇలా ఉంటే జిల్లాలో మిగతా చోట్ల ఇంకెంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నానాటికీ తీసికట్టు కళా వెంకటరావు.. ఈ పేరుకు జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యత ఉండేది. గతంలో అనేక పర్యాయాలు మంత్రిగా చేసిన అనుభవం.. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా.. ఇంతటి పేరున్న కళా వెంకటరావు పరిస్థితి ప్రస్తుతం దయనీయమని చెప్పాలి. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసినప్పటికీ పార్టీ అధ్యక్షుడిగా తన పెత్తనం ఇంకా ఉన్నప్పటికీ సొంత మండలంలో కనీసం పట్టు సాధించలేకపోయారు. దాదాపు ఉనికిని కోల్పోయారు. తాజాగా జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికల్లో సొంత మండలమైన రేగిడిలో మూడు ఎంపీటీసీ స్థానాలకు తన పార్టీ అభ్యర్థుల చేత నామినేషన్ వేయించలేకపోయారంటే ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఖండ్యాం, కందిశ, కొమ్మెర ఎంపీటీసీ స్థానాలకు ఒక్క వైఎస్సార్సీపీ అభ్యర్థులే నామినేషన్లు వేయడంతో ఏకగ్రీవమైపోయాయి. కనీసం నామినేషనే వేయలేదంటే అక్కడ టీడీపీ కార్యకర్తలే లేరా అనే సందేహానికి ఊతమిచ్చింది. దీన్నిబట్టి టీడీ పీ ఎంత ప్రతికూల పరిస్థితిని ఎదుర్కుంటుందో స్పష్టమవుతుంది. అధినేత చంద్రబాబునాయు డు అజెండాను తలకెత్తుకోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని అక్కడివారు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు ఎఫెక్ట్.. రాష్ట్రంలో వెనకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందేందుకు దోహదపడే పరిపాలన వికేంద్రీకరణకు అడ్డుతగలడం, మూడు రాజధానులు వ ద్దు–అమరావతే ముద్దు అని చంద్రబాబు అజెండాను భుజానికెత్తుకుని ముందుకెళ్లడం వలన ప్రజలు చీదరించుకుంటున్నారు. రాగా రాగా వచ్చే అవకాశాన్ని కాలదన్నుతున్నారని, అభివృద్ధికి అడ్డుపడే నాయకులకు అండగా ఉండటం అనవసరమని కళా వెంకటరావు సొంత మండలంలోనే కాదు జిల్లావ్యాప్తంగా తిరస్కరిస్తున్నా రు. అధికారంలో ఉన్నంతకాలం అవినీతి అక్రమాలకు తెరలేపి, జన్మభూమి కమిటీల పేరుతో పచ్చనేతలను ప్రజల్లోకి వదిలేసి జిల్లాను నాశ నం చేసిన నేతలకు పట్టం కట్టడం కన్నా పక్కన పెట్టడమే మంచిదన్న నిర్ణయానికొచ్చిన ప్రజలు ఛీత్కరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తగి న బుద్ధి చెబుతామని బాహాటంగానే ప్రజలు ప్రకటిస్తుండటంతో ఆ పార్టీ తరపున పోటీ చే యడానికి నాయకులు భయపడుతున్నారు. అందులో భాగంగా కళా వెంకటరావు సొంత మండలంలోని మూడు ఎంపీటీసీ స్థానాలకు ఏకంగా నామినేషన్ వేయలేదు. జిల్లాలో టీడీపీ దయనీయ పరిస్థితికి ఇది తార్కాణంగా నిలిచింది. -
రాజకీయ పార్టీలతో.. 17న ఈసీ భేటీ
సాక్షి, అమరావతి : ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈనెల 17వ తేదీ శుక్రవారం వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది. దీనికి హాజరుకావాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలతో పాటు వివిధ రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలకు లేఖలు రాసినట్లు ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. ఈ సమావేశం ఉ.11గంటలకు విజయవాడ బందరు రోడ్డులో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో జరుగుతుందన్నారు. గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలుగా ఆర్హత సాధించిన వాటిలో అధికార వైఎస్సార్సీపీతోపాటు టీడీపీ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలను సమావేశానికి హాజరుకావాలంటూ అధికారులు లేఖ రాశారు. జనసేన పార్టీకి గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీగా అర్హత లేకపోయినప్పటికీ.. నిర్ణీత గుర్తు కలిగి ఉన్న రిజస్టర్డ్ పార్టీగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద నమోదు చేసుకోవడంతో ఆ పార్టీని కూడా సమావేశానికి ఆహ్వానించారు. వీటితో పాటు రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, నేషనలిస్టు కాంగ్రెస్, బీఎస్పీలకు కూడా లేఖలు రాశారు. వీటితో పాటు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద నమోదు చేసుకున్న తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకేతోపాటు వివిధ రాష్ట్రాలలో గుర్తింపు పొందిన మరో ఆరు పార్టీలను కూడా ఆహ్వానించినట్లు అధికారులు వివరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణపై ఆయా రాజకీయ పార్టీల అభిప్రాయం సేకరించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తారని అధికారులు చెబుతున్నారు. కాగా, శుక్రవారం సాయంత్రమే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. -
ఎంపీటీసీ, జడ్పీటీసీలకు రెండు దశల్లో ఎన్నికలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో 45 రోజుల్లో జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లకు నూతన చైర్మన్లు, అధ్యక్షులు కొలువుదీరనున్నారు. వచ్చే నెలన్నర రోజుల వ్యవధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్, ఫలితాల వెల్లడి ప్రక్రియ ముగిసి నూతన సారథులను ఎన్నుకోవడం పూర్తి కానుంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 333 మండలాల్లో తొలివిడతలో, 327 మండలాల్లో రెండో విడతలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతి జిల్లాలో సగం మండలాల చొప్పున రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ ముగిసిన నాలుగు రోజులకు రెండో దశ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. 17 సాయంత్రం షెడ్యూల్ విడుదల.. - ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికల షెడ్యూల్‌కు ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తారు. - ఈనెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి అదే రోజు సాయంత్రం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. - రాష్ట్రంలో 660 మండలాలు ఉండగా 333 జడ్పీటీసీలకు, 5,352 ఎంపీటీసీలకు మొదటి దశలో ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో దశలో 327 జడ్పీటీసీలకు, 4877 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. - ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల అనంతరం మూడు రోజుల వ్యవధితో జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికకు సంబంధించి మరో నోటిఫికేషన్ విడుదల కానుంది. - 660 మండలాల్లో మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నిక ఒకే రోజు జరుగుతుంది. 13 జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికను కూడా ఒకే రోజు నిర్వహిస్తారు. - జడ్పీటీసీ స్థానాలకు జిల్లా కలెక్టరు కార్యాలయం లేదా జడ్పీ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. - ఎంపీటీసీ స్థానాలకు మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. - రెండు విడతల్లో మొత్తం 660 జడ్పీటీసీ, 10,229 ఎంపీటీసీ స్థానాలకు 34,320 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. వెయ్యి మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. - బ్యాలెట్ పేపర్ విధానంలో పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికల నిర్వహణకు మొత్తం నాలుగు రకాల బ్యాలెట్ బాక్స్‌లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధం చేసింది. చిన్నది, మధ్యస్తం, పెద్దది, జంబో తరహాలో బ్యాలెట్ బాక్స్‌లను వర్గీకరించారు. అభ్యర్థులు, ఓటర్ల సంఖ్య ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు. - పార్టీలతో సంబంధం లేకుండా పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థుల కోసం 30 గుర్తులను (ఫ్రీ సింబల్స్) సిద్ధం చేశారు. - మొదటి దశ ఎన్నికల్లో 1,45,05,502 మంది ఓటర్లు, రెండో దశలో 1,36,17,833 మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. - మొత్తం 2,17,908 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. - ప్రతి కేంద్రంలో పోలింగ్ అధికారితో పాటు మరో ఐదుగురు సిబ్బంది ఉంటారు. మండల పరిధిలో కొంతమంది సిబ్బందిని అదనంగా ఉంచుతారు. ఏర్పాట్లపై చర్చించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఈనెల 17వ తేదీన షెడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ శుక్రవారం కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సిబ్బంది నియామకం, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటర్ల జాబితా, బ్యాలెట్ పేపర్ల ముద్రణ తదితర అంశాలపై చర్చించారు. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటైన చోట, ఉన్నవాటిని రెండుగా విభజించిన చోట ఎన్నికల నిర్వహణకు కొత్తగా ఓటర్ల జాబితా, వార్డులను వర్గీకరించాల్సి ఉంటుంది. ఆయా చోట్ల ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించే ప్రక్రియను ఫిబ్రవరి 8 నాటికి పూర్తి చేసేలా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నోటిఫికేషన్ జారీ అయ్యే నాటికి ఎన్నికల సిబ్బందికి ఒక విడత శిక్షణ పూర్తి కావాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో తగినంత మంది పోలీసు సిబ్బందిని నియమించాలని, అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి అదనపు బలగాలను తెప్పించాలని సూచించారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో ఎన్నికల ఏర్పాట్లపై పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. -
విప్ ధిక్కరణ.. ఎంపీపీపై వేటు..!
సాక్షి, కామారెడ్డి : పార్టీ విప్ ధిక్కరించిన ఓ ఎంపీపీపై వేటు పడింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని నాగిరెడ్డిపేట్ ఎంపీపీ కృష్ణవేణి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీగా గెలుపొందారు. పార్టీ విప్ ధిక్కరించి టీఆర్ఎస్ మద్దతుతో ఎంపీపీగా గెలుపొందారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. విప్ తీసుకున్న సంతకం తనది కాదని కృష్ణవేణి బుకాయించడంతో ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. సంతకం ఆమెదే అని తేలడంతో కృష్ణవేణిపై అనర్హతవేటు వేయాలంటూ కాంగ్రెస్ నాయకులు హైకోర్టులో పిటిషన్ వేశారు. పూర్వాపరాలు పరిశీలించిన హైకోర్టు ఎంపీపీ కృష్ణవేణిపై అనర్హత వేటు వేయాలని ప్రిసైడింగ్ అధికారుకు ఆదేశాలు జారీచేసింది. -
ఎంపీపీ ఎన్నిక ; ఎంపీటీసీ కిడ్నాప్..!
సాక్షి, హైదరాబాద్ : ఎంపీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తన భర్త కనిపించడంలేదని ఓ వివాహిత ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలు.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం మూట్పూర్ గ్రామానికి చెందిన రాంరెడ్డి అదే గ్రామం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎంపీటీసీగా గెలుపొందారు. ఫలితాల వెల్లడి అనంతరం రాంరెడ్డి కనిపించడం లేదు. గురువారం ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో ఆయన భార్య జ్యోతి మండల కార్యాలయానికి వచ్చారు. తన భర్త జాడ తెలపాలంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. రిజల్ట్స్ తెలుసుకుందామని వచ్చిన తన భర్తను ఎవరో కిడ్నాప్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆమె కళ్లు తిరిగి పడిపోవడంతో ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో రాంరెడ్డిని ఎవరైనా క్యాంపునకు తీసుకెళ్లారా అనే విషయం తేలాల్సిఉంది. -
ఎంపీటీసీగా గెలిచిన పైలట్
శంషాబాద్ రూరల్: ఓ పైలట్.. ప్రజా సేవ కోసం ప్రాదేశిక ఎన్నికల్లో పోటీచేసి ఎంపీటీసీగా గెలుపొందారు. శంషాబాద్ మండలంలోని శంకరాపురం గ్రామానికి చెందిన గుర్రం ఆనంద్‌రెడ్డి బీటెక్ తర్వాత పైలట్‌గా ఏపీ ఏవియేషన్ అకాడమిలో ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత యూఎస్ఏతో పాటు వివిధ దేశాల్లో 14 ఏళ్ల నుంచి పైలట్ ఉద్యోగం చేశారు. ఇటీవల ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన ఆయన తాత్కాలికంగా ఉద్యోగానికి సెలవు పెట్టారు. కాంగ్రెస్ పార్టీపై చిన్నగోల్కొండ ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేసి తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి గుర్రం విక్రమ్‌రెడ్డిపై 673 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆనంద్‌రెడ్డి తండ్రి గుర్రం వెంకట్‌రెడ్డి మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా, టీడీపీ మండల అధ్యక్షుడుగా పనిచేశారు. ఆయన కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యం కారణంగా విజయం సునాయాసంగా వరించిందని చెప్పవచ్చు. మనం సమాజం నుంచి తీసుకున్న దాంట్లో ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని రాజకీయాల్లోకి వచ్చానని ఆనంద్‌రెడ్డి చెప్పారు. ఈ ప్రాంతం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తానని పేర్కొన్నారు. తన గెలుపుతో ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రశాంతంగా కొనసాగుతున్న పరిషత్ పోలింగ్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పరిషత్ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతొంది. ఎండ తీవ్రత ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఉదయమే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. దీంతో తొలి రెండుగంటల్లో 19 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మూడో విడతలో భాగంగా 27 జిల్లాల్లో 161 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 741మంది పోటీ చేస్తున్నారు. ఇక 1738 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 5,723మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడో విడతలో 30 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. -
పరిషత్ పోరు: తొలిదశ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
-
టికెట్ కలిపింది ఇద్దరినీ...
రామడుగు (చొప్పదండి): చిన్న మనస్పర్థలతో భార్యాభర్తలు ఐదేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. విడిపోవడానికి కోర్టు మెట్లెక్కారు. కానీ.. స్థానిక ఎన్నికల పుణ్యమా అని విడిపోవడానికి నిశ్చయించుకున్న దంపతులు ఏకమయ్యారు. వివరాలు.. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలంలోని మోతె ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. దీంతో పలువురు ఆభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్టు ఆశించారు. కోరటపల్లికి చెందిన సీనియర్ నేత కలిగేటి లక్ష్మణ్ కూడా టికెట్టు కోసం పార్టీ అధినాయకత్వానికి విన్నవించుకున్నాడు. పలువురి పేర్లతోపాటు లక్ష్మణ్ పేరు కూడా పరిశీలించారు. కుటుంబ గొడవల కారణంగా ఆయన భార్య కాపురానికి రావడం లేదన్న విషయం నాయకులు గుర్తించారు. ఇదే విషయమై లక్ష్మణ్‌ను అడగగా, తన భార్య రావడం లేదని, కోర్టులో కేసు నడుస్తుందని, తన తల్లికి టికెట్టు ఇస్తే గెలిపించుకుంటానని విన్నవించుకున్నాడు. దీంతో వారు ‘నీ భార్యను తీసుకొని వస్తేనే టిక్కెట్ ఇస్తాం’అని చెప్పడంతో లక్ష్మణ్ తన భార్య తరఫు బంధువులతో సంప్రదింపులు జరిపాడు. కాపురానికి వచ్చేలా ప్రయత్నాలు చేసి బుధవారం భార్య కవితను ఒప్పించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మణ్ భార్యకు టికెట్టు కేటాయించారు. గురువారం బీఫాం ఆర్వోకు అందజేశారు. కాగా, పార్టీ టిక్కెట్ భార్యాభర్తలను ఏకం చేయడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. లక్ష్మణ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎంపీటీసీ ఎన్నికలు మమ్మల్ని కలుపడం సంతోషంగా ఉందని చెప్పారు. -
పంతం నెగ్గించుకున్న తీగల కృష్ణారెడ్డి
టీఆర్ఎస్ పార్టీలో జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిపై సందిగ్ధత వీడింది. మొన్నటి వరకు జెడ్పీ పీఠం కోసం పోటీపడిన ముగ్గురు నేతల కుటుంబ సభ్యుల్లో ఒకరికి పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చైర్మన్ గిరిపై మొదటి నుంచి ఆశలు పెట్టుకున్న మహేశ్వరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు డాక్టర్ అనితారెడ్డి పేరును దాదాపుగా ఖరారు చేసింది. దీంతో కొన్ని రోజులుగా సాగుతున్న సస్పెన్స్‌కు తెరపడినట్లయింది. జెడ్పీ చైర్పర్సన్ పదవిని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పంచాయతీరాజ్ కొత్త చట్టం సంస్కరణల నేపథ్యంలో చైర్పర్సన్ కీలకంగా మారనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ పదవికి తీవ్ర పోటీ ఏర్పడింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: అధికార పార్టీ తరఫున ముగ్గురు నేతలు తమ కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కోరారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూతురు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కోడలు పదవిని ఆశించారు. తన కూతురు పోటీ విషయంలో ప్రకాశ్‌గౌడ్ చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నారని సమాచారం. దీంతో తమకు వద్దని అధిష్టానానికి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి కోడలు మంచాల నుంచి బరిలోకి దిగాలనుకున్నారు. తొలిదశ ఎన్నికల జాబితాలో ఉన్న ఆ మండలంలో అప్పటికే నామినేషన్ల దాఖలు గడువు ముగియడంతో అవకాశం చేజారింది. దీంతో అనితారెడ్డికి లైన్ క్లియర్ అయ్యింది. అంతేగాక అనితారెడ్డి మామ కృష్ణారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అంతకుముందు అనితారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ అభ్యర్థిగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆర్కేపురం డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా బరిలోకి దిగి ఓటమి చెందారు. ఈ నేపథ్యంలో తమకు ఎలాగైనా చైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పట్టుబట్టినట్లు సమాచారం. ఫలితంగా చైర్పర్సన్ పదవి కోపం అనితారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే మొన్నటి వరకు మహేశ్వరం స్థానికుల్లో ఒకరికి లేదంటే.. మొదటి నుంచి పార్టీలో కొనసాగిన వారికే జెడ్పీటీసీ టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పార్టీని కోరారు. దీనికితోడు టీఆర్ఎస్లో చేరడం దాదాపు ఖాయమైన స్థానిక ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి కూడా తమ వర్గానికి జెడ్పీటీసీ టికెట్ కావాలని ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. ఈనేపథ్యంలో అనితారెడ్డి గెలుపుకోసం స్థానిక నాయకులు, సబితమ్మ వర్గం ఏ స్థాయిలో కృషిచేస్తారన్నది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ నుంచి రేసులో ఇద్దరు.. జెడ్పీ చైరపర్సన్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థులు రేసులో ఉన్నారు. ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ మర్రి నిరంజన్‌రెడ్డి సతీమణి నిత్యారెడ్డి ఒకరుకాగా.. తుక్కుగూడ మాజీ సర్పంచ్ కొమిరెడ్డి నర్సింహారెడ్డి కోడలు శాలినీరెడ్డి మరొకరు. మంచాలలో నిత్యారెడ్డి పోటీచేస్తుండగా.. శాలినీరెడ్డి మహేశ్వరం నుంచి బరిలో నిలిచారు. అయితే ప్రస్తుతానికి వీరిలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడే అభ్యర్థి పేరును ప్రకటిస్తే గ్రూపు రాజకీయాలు మొదలయ్యే ప్రమాదం ఉందని పార్టీ నేతలు జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే నేతలు, కార్యకర్తల వలసలతో కుదేలవుతున్న జిల్లా పార్టీ.. గ్రూపు తగాదాలైతే ఇతర పార్టీలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో జెడ్పీటీసీ స్థానాలు దక్కితే.. ఆ తర్వాత చైర్పర్సన్ అభ్యర్థి పేరును ఖరారు చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో అనిశ్చితి.. మరోపక్క బీజేపీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటి వరకు ఆ పార్టీలో చైర్పర్సన్ పదవిని ఆశిస్తున్నవారు పెద్దగా లేనట్లు తెలుస్తోంది. తొలుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో గెలుపుపై ప్రధానంగా దృష్టిసారించింది. తొలి, రెండు దశల్లో ఎన్నికలు జరిగే మండలాల్లో ఆ స్థాయి అభ్యర్థులు లేరని పార్టీలో చర్చజరుగుతోంది. ఇక ఆశలన్నీ మూడో దశ ఎన్నికలు జరుగుతున్న మండలాలపైనే ఉన్నాయి. -
బెదిరించడంతో విత్‌డ్రా!
నాగర్‌కర్నూల్ ఎడ్యుకేషన్ : గగ్గలపల్లి ఎంపీటీసీ నామినేషన్ విత్‌డ్రా విషయంలో హైడ్రామా సాగింది. నాగర్‌కర్నూల్ మండలంలో తొలి విడతలో ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఈ విడతకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఆదివారంతో ముగిసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన దొడ్ల వెంకట్ నారాయణ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి దొడ్ల ఈశ్వర్ రెడ్డితో పాటు పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే అన్ని పార్టీల అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి దొడ్ల ఈశ్వర్ రెడ్డి ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నిం గ్ అధికారులు ప్రకటించారు. ఇది వరకు బాగానే ఉన్నా.. తాను విత్‌డ్రా చేసుకోవడానికి గల కారణాలను వివరిస్తూ సోమవారం కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ నారాయణరెడ్డి ధర్నాకు దిగారు. టీఆర్ఎస్ అభ్యర్థి దొడ్ల ఈశ్వర్‌రెడ్డితో పాటు మరో నలుగురు టీఆర్ఎస్ నాయకులు తనను ఈనెల 28న మధ్యాహ్నం 12.45గంటలకు గగ్గలపల్లి నుంచి కారులో బలవంతంగా తీసుకెళ్లి ఉయ్యాలవాడలోని ఓ టీఆర్ఎస్ నేత ఇంట్లో బంధించి, రూ.20 లక్షలు ఇస్తామని నామినేషన్ విత్‌డ్రా చేసుకోమన్నారని ఆరోపించారు. విత్‌డ్రా చేసుకోకుంటే కుటుంబసభ్యులపై దాడులు చేస్తామని బెదిరించి తన భార్యకు రూ.10లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చారని ఆరోపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టలేకపోయినా 28న విత్‌డ్రా చేసుకున్నానని ఆయన తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన టీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట సోమవారం నారాయణరెడ్డి ధర్నా చేశారు. అనంతరం డీఆర్వో మధుసూదన్‌నాయక్‌కు వినతి పత్రాన్ని అందించారు. మద్దతుగా కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ అభ్యర్థి దొడ్ల ఈశ్వర్ రెడ్డి తమ పార్టీ అభ్యర్థిని బెదిరింపులకు గురిచేశారని, ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొండా మణెమ్మ తెలిపారు. తమ పార్టీ అభ్యర్థికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. వారి వెంటనాయకులు పాపయ్య, మాజీ సర్పంచ్‌లు భార్గవి, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వరమ్మ, నిరంజన్, నగేష్ తదితరులు ఉన్నారు. -
ప్రతిష్టాత్మకం..పరిషత్ ఎన్నికలు
బెల్లంపల్లి : పరిషత్ ఎన్నికలు టీఆర్ఎస్, కాంగ్రెస్ పక్షాలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అసెంబ్లీ , గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే ఈఎన్నికల్లోనూ సత్తాచాటాలని టీఆర్ఎస్ తహతహలాడుతుండగా కనీసం పరిషత్ ఎన్నికల్లోనైనా నెగ్గి పరువు దక్కించుకోవాలనే కాంక్షతో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ఆ రెండు పక్షాలు ఎన్నికల్లో విజయం సాధించడమే ప్రధాన లక్ష్యంగా పోరాడుతున్నాయి. అందులో భాగంగానే సమర్థులైన అభ్యర్థులను పోటీలోదింపి ప్రచార పర్వం సాగిస్తున్నాయి. అయితే మారిన పరిణామాలతో ప్రతీచోట ఎన్నిక ఏ ఒక్కరాజకీయ పార్టీకి అంత ఈజీగా లేకపోవడంతో చెమటోడ్చాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడా ఏకపక్షంగా ఏ పార్టీ అభ్యర్థికి విజయావకాశాలు కానరావడం లేదు. ఈ తీరు ఆయాపక్షాల అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. పోటీలో ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉండటంతో ఎన్నికలు రసవత్తరంగా జరుగనున్నాయి. ఎన్నికల్లో గెలుపు సాధించడమే ప్రధాన కర్తవ్యంగా రెండు ప్రధాన పక్షాలు ముందుకు సాగుతుండటంతో ఓటర్ల ఆదరణ ఎవరికి ఉంటుందనేది ఆసక్తికరంగా ఉంది. అసెంబ్లీ నియోజకవర్గంలో... బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు తొలిదఫాలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆదివారంతో ముగిసింది. నియోజకవర్గంలోని 7 జెడ్పీటీసీ స్థానాలకు ఏకంగా 27 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తాండూర్, కన్నెపల్లి జెడ్పీటీసీ సా ్థనాల్లో ఆరుగురు అభ్యర్థులు, కాసిపేటలో నలుగురు అభ్యర్థులు, నెన్నెల , భీమిని, బెల్లంపల్లి మండలాల్లో ముగ్గురు అభ్యర్థుల చొప్పున పోటీకి సిద్ధమయ్యారు. వేమనపల్లి మండలంలో మా త్రం ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ జరుగుతోంది. ఏకగ్రీవానికి ‘నై’ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రాధాన్యత ఇవ్వగా పరిషత్ ఎన్నికల్లో మాత్రం ఆ పాచిక ఎక్కడా సరిగా పారలేదు. ప్రతీచోట పోటీ చేయడానికే ఔత్సాహిక అభ్యర్థులు మరీ ముఖ్యంగా యువకులు ఆసక్తి చూపించారు. రిజర్వేషన్ ప్రాతిపదికన మహిళలు కూడా అధికసంఖ్యలోనే పోటీలో ఉన్నారు. ఓ ప్రధానరాజకీయ పార్టీ అక్కడక్కడ తమ అభ్యర్థులు ఏకగ్రీవం కావడానికి ఆదిలో పావులు కదిపినా ప్రయోజనం లేకుండా పోయింది. అన్నిచోట్ల కూడా పోటీకీ అభ్యర్థులు సిద్ధపడటం, ప్రలోభాలకు ఆకర్షితులు కాకపోవడంతో పోటీ అనివార్యమైంది. కాగా ఎన్నికల ప్రచారపర్వం మరో రెండు, మూడురోజుల్లో ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. ఎంపీటీసీ బరిలో 166 మంది 47 ఎంపీటీసీ స్థానాల్లో 166 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాసిపేట మండలంలో ఉన్న 9 స్థానాల్లో అత్యధికంగా 42 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా తాండూర్లోని 9 స్థానాలకు 39 మంది, బెల్లంపల్లిలోని 8 స్థానాలకు 26 మంది, నెన్నెలలో 7స్థానాలకు 19 మంది. కన్నెపల్లిలో 5 స్థానాలకు 18 మంది, వేమనపల్లిలో 5 స్థానాలకు 14 మంది పోటీలో ఉన్నారు. భీమిని మండలంలో 4 స్థానాలు ఉండగా 8 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. చిన్నగుడిపేట ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవమైంది. ఇక్కడ ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా ఆఖరిరోజు నలుగురు అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. అయితే సదరు అభ్యర్థి ఎన్నికను ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆ ఒక్కస్థానంలో మినహా ఇతర అన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో హోరాహోరీగా పోటీ కనిపిస్తోంది. -
తొలి విడత ప్రచారం షురూ!
సాక్షి, హైదరాబాద్: తొలివిడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ప్రచురణతో రాజకీయ పార్టీలు, స్వతంత్రుల గుర్తుల వారీగా బ్యాలెట్ పేపర్ల ముద్రణలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆదివారం సాయంత్రం 5 గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థులు, వారికి కేటాయించిన గుర్తులను రిటర్నింగ్ అధికారులు ఖరారు చేసి, అభ్యర్థుల జాబితాలు ప్రకటించారు. వచ్చేనెల 6న 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడత ఎన్నికలుండడంతో రాజకీయ పార్టీల గుర్తులతో బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్నకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు లేదా నాలుగు రోజుల్లోనే వీటి ముద్రణ పూర్తిచేసి, పోలింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంది. ఈ విడత ఎన్నికల ప్రచారం కూడా ఆదివారం సాయంత్రం నుంచే మొదలైంది. నేడు రెండో విడత నామినేషన్ల పరిశీలన రెండోదశ పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సోమవారం సాయంత్రం 5 వరకు నామినేషన్లను పరిశీలించి, 5 గంటల తర్వాత చెల్లుబాటయ్యే నామినేషన్ల జాబితా సిద్ధం చేస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై మంగళవారం సాయంత్రం 5 గంటలలోగా అప్పీలు చేసుకోవాలి. మే1న సాయంత్రం 5లో గా వాటిని పరిష్కరిస్తారు. 2న నామినేషన్ల ఉపసం హరణ గడువు ముగిశాక, అదేరోజుసాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. వచ్చేనెల 10న రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. శనివారం వరకు 1,913 ఎంపీటీసీ స్థానాలకు 4, 652, 180 జెడ్పీటీసీ స్థానాలకు 660 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండోదశకు నామినేషన్ల ప్రక్రియ ఆఖరు రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. -
చెంబెడు నీటితో చెరువు నింపుతాం
జనగామ: జలం కోసం జనం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేలా ప్రజాప్రతినిధులు, అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని జనగామ మండలంలోని పెంబర్తి గ్రామ యువకులు నిర్ణయించారు. పెంబర్తిలోని పెద్ద చెరువు ఎండిపోయినా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం.. చుక్క నీరు లేక ఎండుతున్న పంటలకు తోడు గుక్కెడు నీటి కోసం ప్రజలు పడుతున్న కష్టాలను చూసిన చలించిపోయిన యువకులు వినూత్న నిరసనకు దిగారు. స్థానిక యువకులు చొప్పరి సంతోష్, సతీష్, ఏదునూరి రాము, గుడికందుల ప్రశాంత్, మణికంఠ, సాయి, పల్లపు శ్రీకాంత్, గుజ్జుల వేణు, పల్లపు హరీశ్ ఆధ్వర్యాన ఇంటింటికి చెంబెడు నీళ్ల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్లో వెయ్యి దరఖాస్తులు అందించిన యువకులు మరో నిరసన చేపట్టారు. ఇంటింటికీ చెంబు చొప్పున సేకరించిన నీటితో పెద్ద చెరువును నింపే యత్నం చేస్తామని, అప్పుడైనా ప్రజాప్రతినిధులు మేల్కొంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా శనివారం వంద బిందెల నీటిని పెద్దచెరువులో పోసి తమ ఆవేదన వెళ్లగక్కారు. ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలపి సత్తా చాటుతామని యువకులు పేర్కొన్నారు. -
మీ ఎంపీటీసీగా ఎవరుండాలి?
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికలపై టీఆర్ఎస్ దృష్టి సారించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కొత్త పరీక్ష తెచ్చిపెట్టాయి. ఆయా నియోజకవర్గాల్లోని అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే.. ఎమ్మెల్యేలకు రాజకీయంగా, పార్టీలో పట్టు ఉంటుంది. దీంతో అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు ఎమ్మెల్యేలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల కంటే మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ బీఫారం దక్కితే గెలుపు ఖాయమనే అభిప్రాయం ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నేతల్లో ఉంది. దీంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ల కోసం అధికార పార్టీలో తీవ్రమైన పోటీ ఉంది. ఆశావహుల్లో పోటీని అధిగమించి గెలిచే వారికి అవకాశాలు ఎలా ఇవ్వాలా అని ఎమ్మెల్యేలు తర్జనభర్జన పడుతున్నారు. ఏకాభిప్రాయం అనే విధానాన్ని అనుసరించాలని కొందరు నిర్ణయించారు. అయితే అన్ని పార్టీల నేతలు టీఆర్ఎస్లోకి చేరడంతో గ్రామాల్లో రెండు మూడు గ్రూపులుగా ఉన్నాయి. అన్ని స్థాయిలలో గ్రూపులు ఉండటంతో ఏకాభిప్రాయం సాధ్యం కావట్లేదు. దీంతో అభ్యర్థుల ఎంపిక కోసం చివరికి సర్వే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. అన్ని గ్రామాల్లో పలు సంస్థలతో సర్వే నిర్వహించి.. టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు ఎమ్మెల్యేలు సొంత ఖర్చులతో సర్వేలు మొదలుపెట్టారు. టీఆర్ఎస్ టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉండే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల్లోనూ పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు సర్వేలతోనే అభ్యర్థులను ప్రకటించారు. పలు సంస్థలతో.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అమలు చేస్తున్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు టికెట్ల కోసం పోటీలో ఉన్న వారి జాబితా రూపొందించి వారిలో మెరుగైన అభ్యర్థి ఎవరనేది ప్రజల నుంచి తెలుసుకునేలా ఈ సర్వేలు సాగుతున్నాయి. జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇబ్బంది లేకున్నా.. ఎంపీటీసీ అభ్యర్థుల ఖరారు మాత్రం ఎమ్మెల్యేలకు తలనొప్పులు తెస్తోంది. మరోవైపు గ్రామాల్లోని స్థానిక పరిస్థితులను అంచనా వేయడం క్లిష్టంగా మారుతోంది. సర్వే నివేదికల ఆధారంగా మండలాల వారీగా ముఖ్యకార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎంపీటీసీ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల ముఖ్యులతో చర్చించి సర్వే వివరాలను చెబుతున్నారు. సర్వేలో పలానా వారి పేరు ముందుందని, వారికి అవకాశం ఇవ్వాల్సి వస్తుందని వివరిస్తున్నారు. ఆశావహులకు సర్వే వివరాల కాపీలను అందజేసి పార్టీ గెలుపు కోసం పని చేయాలని అనునయిస్తున్నారు. మరోసారి సర్వే చేయాలని ఎమ్మెల్యేలను కొందరు కోరుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎమ్మెల్యేలు సానుకూలంగానే స్పందిస్తున్నారు. బీ ఫారాలు ఇచ్చే వరకు సర్వేలు నిర్వహిస్తామని, అప్పటి వరకు ఎవరు మెరుగ్గా ఉంటే వారికే అవకాశం వస్తుందని చెబుతున్నారు. సర్వే వివరాలను పరిశీలించిన ఆశావహులు అందులోని అంశాలను చూసి ఎమ్మెల్యేల నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు. గ్రామ ప్రజల్లో తమ గురించి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకునే అవకాశం వచ్చిందని అంటున్నారు. -
పరిషత్తు.. కసరత్తు
సాక్షి, మంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల కోసం అన్ని పార్టీలూ కసరత్తు మొదలుపెట్టాయి. అసెంబ్లీ, సర్పంచ్, పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు తెరలేచింది. ఒకటి, రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో పార్టీల నాయకులు ప్రణాళికలు రూపొందించుకునే పనిలోపడ్డారు. దూకుడుమీదున్న అధికార టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నేతృత్వంలో సోమవారం సమావేశంకాగా.. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తపరిచేందుకు కాంగ్రెస్ మండలాల వారీగా సమావేశాలకు శ్రీకారం చుట్టింది. టార్గెట్ చైర్మన్ అసెంబ్లీ, సర్పంచ్ విజయాలతో దూకుడు మీదున్న అధికార టీఆర్ఎస్ పార్టీ పరిషత్ చైర్మన్లను కైవసం చేసుకునే దిశగా ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయం తమదేనంటున్న గులాబీ శ్రేణులు అదే ఉత్సాహంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి అధికారం కూడా టీఆర్ఎస్ చేతిలో ఉంటే ప్రభుత్వ కార్యక్రమాలు మరింత సాఫీగా సాగుతాయనే భావనతో టీఆర్ఎస్ పెద్దలున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జెడ్పీ పీఠాలను కైవసం చేసుకోవాలని ఇప్పటికే టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాష్ట్ర కమిటీ సమావేశంలో పిలుపునిచ్చారు. అందులోభాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు జిల్లా ప్రజాపరిషత్‌లు, 66 మండల పరిషత్‌లను కైవ సం చేసుకోవాలని టీఆర్ఎస్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్‌లో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పరిషత్ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు తరలివెళ్లారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, ప్ర జాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు సమన్వయంతో అన్ని జిల్లా ప్రజాపరిషత్‌లను కైవసం చేసుకోవాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులుగా సమర్థవంతులను ఎంపిక చేసుకోవాలన్నారు. అలాగే ఇటీవ ల ఉమ్మడి జిల్లాలో ఓటమి చెందిన ఏకైక పార్టీ అ భ్యర్థి కోవ లక్ష్మికి జెడ్పీ చైర్పర్సన్ అవకాశం క ల్పించారు. ఆసిఫాబాద్ టీఆర్ఎస్ జెడ్పీ చైర్పర్స న్ అభ్యర్థిగా కోవ లక్ష్మి పేరును కేసీఆర్ ప్రకటిం చారు. అలాగే పరిషత్ ఎన్నికల బాధ్యతలు పార్టీ నేతలకు అప్పగించిన సీఎం, ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం జెడ్పీ స్థానాలు గెలవాలని తేల్చిచెప్పారు. పోరుకు కాంగ్రెసై అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లోనైనా ఉనికి చాటుకోవా లని ఉబలాటపడుతోంది. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీమంత్రి టి.జీవన్‌రెడ్డి ఘన విజయంతో ఉత్సాహంతో ఉన్న ఆ పార్టీ.. అదే ఊపుతో మెజార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలను దక్కించుకోవాలని యోచిస్తోంది. దీనికోసం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు మండలాల వారిగా పార్టీ నాయకులు, క్యాడర్‌తో మంతనాలు జరుపుతున్నారు. మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు. ఆయా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆశావహుల పేర్లను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. దీనితోపాటు కాంగ్రెస్ పార్టీకి వీలైనన్ని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు దక్కించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే మండలాల వారిగా కాంగ్రెస్ పార్టీ సమావేశాలను నిర్వహిస్తూ, పార్టీ క్యాడర్‌ను స్థానిక పోరుకు సమాయత్తం చేసే పనిలో కాంగ్రెస్ నేతలున్నారు. పార్టీ గుర్తులతో జరిగే పరిషత్ ఎన్నికల్లో అధికారాన్ని నిలుపుకోవడానికి టీఆర్ఎస్, పునరుత్తేజం పొందడానికి కాంగ్రెస్ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. -
‘పరిషత్’ ఎన్నికలకు ఓటర్ల జాబితాలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. ఏప్రిల్ 11న రాష్ట్రంలో తొలివిడత లోక్‌సభ ఎన్నికలు ముగియగానే, రెండో వారంలో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. మే నెల మొదటి లేదా రెండో వారంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అవకాశమున్నట్లుగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 27న జిల్లా పంచాయతీ అధికారులు చేసిన వార్డుల విభజనకు అనుగుణంగా వార్డులు, పంచాయతీల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితా ప్రచురణ పూర్తయింది. తుది జాబితా పూర్తయిన నేపథ్యంలో శనివారం మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ)ల పరిధిలోని ఎంపీటీసీ స్థానాల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలతోపాటు జిల్లా ప్రజాపరిషత్ (జెడ్పీపీ)ల పరిధిలోని జెడ్పీటీసీ సీట్ల వారీగా ఓటర్ల జాబితాలను కొన్ని జిల్లాల్లో సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ జాబితాలను ఆయా జిల్లాల్లోని సంబంధిత మండల, జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించినట్టు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తి కాని జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి కల్లా అధికారులు తమ పనిని ముగించవచ్చని చెబుతున్నారు. 27న జిల్లాల్లోని పంచాయతీల వారీగా ప్రచురించిన ఓటర్ల తుది జాబితాకు అనుగుణంగా ఏప్రిల్ 7 నుంచి పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాలు సిద్ధం చేయాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ జాబితాల ఆధారంగా పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేసుకుని, అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించింది. మండలాల పరిధిలోని పంచాయతీల్లో పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియను ఏప్రిల్ 20 కల్లా పూర్తిచేసుకోవాలని పేర్కొంది. పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల పర్యవేక్షణ, సంసిద్ధతపై రాష్ట్ర ఎన్నిక కమిషన్ , పంచాయతీరాజ్ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. -
‘ప్రాదేశిక’ ఓటర్లు 57,789
సాక్షి, కరీంనగర్‌రూరల్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. రిజర్వేషన్లతో ఎంపీటీసీలుగా పోటీ చేసేందుకు స్థానిక నాయకులు కసరత్తులు చేస్తున్నారు. కొత్తపల్లి మండలంలో 24,402, కరీంనగర్‌రూరల్ మండలంలో 33,387 ఓటర్లు, మొత్తం 57,789 మందితో కూడిన కొత్త ఓటర్ల జాబితా ముసాయిదాను అధికారులు శని వారం విడుదల చేశారు. ఆయా గ్రామపంచాయతీల్లో ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. ఓటర్ల జాబితాలో అభ్యంతరాలున్నట్లయితే ఈనెల 20వరకు లిఖితపూర్వకంగా స్వీకరిస్తారు. తుది ఓటర్ల జాబితాను ఈనెల 27న ప్రకటిస్తారు. ఈ జాబితా ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహిస్తారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు కరీంనగర్ మండల పరిషత్ సమావేశమందిరంలో కరీంనగర్, కొత్తపల్లి మండలాలకు చెందిన రాజకీయపక్షాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయపార్టీల అధ్యక్షులు, ప్రతినిధులు సకాలంలో సమావేశానికి హాజరు కావాలని ఎంపీడీవో పవన్‌కుమార్ కోరారు. ఎంపీటీసీ కోసం ప్రయత్నాలు ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో స్థానిక నాయకులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేస్తూ నే మరోవైపు ఎంపీటీసీలుగా పోటీ చేసేందుకు మద్దతు కూడగట్టుతున్నారు. ఎంపీటీసీ ఎన్నికలు పార్టీల గుర్తులతో ఉండటంతో రిజర్వేషన్ల ప్రకా రం పోటీచేసేందుకు నాయకులు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి చెందిన పలువురు నాయకులు మరోమారు పోటీ చేసేం దుకు సమాయత్తమవుతున్నారు. రిజర్వేషన్లు కలి సిరాని నాయకులు తమ భార్యలను బరిలో దిం చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కరీంనగర్‌రూరల్ మండలంలో మొత్తం 12, కొత్తపల్లి మం డలంలో మొత్తం 8 ఎంపీటీసీ స్థానాలున్నాయి. కరీంనగర్‌రూరల్ ఎంపీపీ పదవి జనరల్, కొత్తపల్లి ఎంపీపీ పదవి బీసీ మహిళకు కేటాయించడంతో పలువురు నాయకులు ఎంపీపీ పదవికోసం పావులు కదుపుతున్నారు. కరీంనగర్ ఎంపీపీ కోసం జనరల్ ఎంపీటీసీస్థానాలైన బొమ్మకల్–2, నగునూరు–2, గోపాల్పూర్, చెర్లభూత్కూర్, చామన్‌పల్లి ఎంపీటీసీలకు అవకాశముంది. అదేవిధంగా కొత్తపల్లి ఎంపీపీ కోసం బావుపేట–1, చింతకుంట–1, నాగులమల్యాల ఎంపీటీసీ స్థానా ల నుంచి మహిళలకు అవకాశముంది. దీంతో ఈస్థానాల నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి పలువురు నాయకులు పోటిచేసేందుకు ఆసక్తిచూపుతున్నారు. స్థానిక నాయకుల నుంచి అవసరమైన మద్దతు కూడగట్టుతున్నారు. సతీమణులకు అవకాశం కరీంనగర్‌రూరల్ జెడ్పీటీసీ స్థానం జనరల్ మ హిళ, కొత్తపల్లి జెడ్పీటీసీ స్థానం బీసీ మహిళలకు కేటాయించడంతో అధికారపార్టీకి చెందిన పలువు రు నాయకులు తమ భార్యలను రంగంలోకి దిం పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మద్దతు కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. కరీంనగర్‌రూరల్ జెడ్పీటీసీ కోసం టీఆర్ఎస్ నుంచి బొమ్మకల్, చేగుర్తి మాజీ సర్పంచులు పురుమల్ల లలిత, బల్మూరి భాగ్యలక్ష్మి, దుర్శేడ్ ఎంపీటీసీ కోరుకంటి శోభరాణి, బీజేపీ నుంచి మొగ్ధుంపూర్ మాజీ సర్పంచ్ తాళ్లపల్లి లక్ష్మి, కాంగ్రెస్‌పార్టీ నుంచి ఇరుకుల్ల మాజీ సర్పంచ్ మారుతీరావు సతీమణి శ్వేత పోటీచేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కొత్తపల్లి జెడ్పీటీసీ కోసం బావుపేటకు చెందిన పిల్లి మహేశ్‌గౌడ్, మల్కాపూర్మాజీ సర్పంచ్ కాసారపు శ్రీనివాస్‌గౌడ్, ఎలగందల్‌కు చెందిన మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నిమ్మ ల అంజయ్య తదితరులు తమ సతీమణులను పోటీలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్ల వివరాలు మొత్తం ఓటర్లు 57,789 కొత్తపల్లి మండలం 24,402 కరీంనగర్‌రూరల్ మండలం 33,387 -
మే మొదటి వారంలో పరిషత్ ఎన్నికలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు మే నెల మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం తొలిదశలోనే (ఏప్రిల్ 11) తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ పూర్తవుతోంది. లోక్‌సభ ఎన్నికలు ముగియగానే పరిషత్ ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ రెండో నోటిఫికేషన్ ఇచ్చి.. దీనికి అనుగుణంగానే ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలు గడువు ముగిసేలోపు (మే 25) జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను ముగించేలా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబరులో అసెంబ్లీ, జనవరిలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఇలా వరుస ఎన్నికల నేపథ్యంలో నెలల తరబడి ఎన్నికల నియమావళి అమల్లో ఉంటోంది. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల పురోగతి ఉండటంలేదు. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికలను త్వరగా ముగించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈవీఎంలతో పరిషత్ ఎన్నికల్లో ఈసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యం త్రాలు (ఈవీఎం) ఉపయోగించాలనే ఆలోచనలో ఎస్ఈసీ ఉంది. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. దీనిపై టీఆర్ఎస్, తదితర పార్టీల నుంచి సానుకూలత వ్యక్తమైనట్టు సమాచారం. ఈ ఎన్నికలు రెండువిడతల్లో నిర్వహించాలని ఎస్ఈసీ భావిస్తోంది. త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈవీఎంలను ఉపయోగించాలనే ఆలోచనతో ఎస్ఈసీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు కూడా అన్ని పార్టీలనుంచి ఆమోదం వచ్చినట్లు సమాచారం. వేగంగా ఏర్పాట్లు పరిషత్ ఎన్నికలకోసం ఎస్ఈసీ ఏర్పాట్లును వేగవంతం చేసింది. వచ్చే జూలై 4న కొత్త జడ్పీలు, ఎంపీపీ పాలకవర్గాలు ఏర్పడేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తోంది. గతంలోని పాత 9 జడ్పీల స్థానంలో 32 జడ్పీల చైర్పర్సన్లు, వాటి పరిధిలోని 535 గ్రామీణ రెవెన్యూ మండలాల పరిధిలో ఎంపీపీ అధ్యక్ష స్థానాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. కొత్త జడ్పీలు, ఎంపీపీల పరిధిలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల పునర్విభజన కూడా పూర్తయింది. కొత్త పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సరిహద్దులు ఖరారయ్యాయి. 32 జడ్పీలు, 535 ఎంపీపీలు ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ ప్రక్రియను పూర్తిచేయడంలో భాగంగా ఇప్పటికే పాత 9 జడ్పీల స్థానంలో జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా 32 జడ్పీలు, వాటి పరిధిలోని 535 గ్రామీణ రెవెన్యూ మండలాలను ఎంపీపీలుగా పునర్విభజన పూర్తిచేశారు. 32 జడ్పీ చైర్పర్సన్లు, 535 ఎంపీపీలకు సంబంధించి ఎస్టీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కూడా ఖరారుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో మొత్తం 5,984 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడనున్నట్టు సమాచారం. కొత్తగా 68 మున్సిపాటిలీలు ఏర్పడిన నేప థ్యంలో ఆయా మండలాల పరిధిలోని కొన్ని గ్రామ పంచాయతీలను వాటిలో విలీనం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా 489 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. 27న ఓటర్ల తుది జాబితా ఈ నెల 27న రాష్ట్రంలో గ్రామపంచాయతీల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఎస్ఈసీ ఇదివరకే ఆదేశించింది. తుది జాబితా సిద్ధం చేసి మార్చి 27న ప్రచురించాలని గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో సూచించిన మేరకు వార్డుల విభజన పూర్తిచేయాలని ఆదేశాలొచ్చాయి. ఈ నెల 16న వార్డుల వారీగా విభజించిన గ్రామపంచాయతీ ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితాను సిద్ధం చేసి గ్రామపంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ జాబితాలపై వివిధ ప్రక్రియలను నిర్వహించాక 27న డీపీవో చేసిన వార్డుల విభజనకు అనుగుణంగా గ్రామపంచాయతీ ఫొటో ఓటర్ల తుది జాబితా ప్రచురించాలి. -
‘బీసీ రిజర్వేషన్ల తగ్గింపు దుర్మార్గం’
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 18 శాతానికి తగ్గించి అమలు చేయడం దుర్మార్గమని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. విద్యానగర్‌లోని బీసీ భవన్లో శుక్రవారం జరిగిన బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గ్రామ స్థాయిలలో బీసీల నాయకత్వం ఎదగకుండా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. జిల్లా పరిషత్ చైర్మన్లలో ఆరు చైర్మన్లు, 550 మండల పరిషత్ చైర్మన్లలో 94 చైర్మన్లు ఏ లెక్కన ఇస్తారని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించి ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని విమర్శించారు. రిజర్వేషన్ల తగ్గింపునకు వ్యతిరేకంగా అన్ని పార్టీల్లోని బీసీ నాయకులు రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎంపీపీల జిల్లా కోటాను ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు రోజులపాటు కసరత్తు చేసిన జిల్లా పరిషత్ అధికారులు బుధవారం రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎంపీపీ, జెడ్పీటీసీలకు సంబంధించి మండలాల వారీగా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగించారు.ఎంపీటీసీల రిజర్వేషన్ మాత్రం ఆయా జిల్లాల ఆర్డీఓల పర్యవేక్షణలో ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్‌ను జనాభా ప్రాతిపదికన నిర్ణయించగా, బీసీల రిజర్వేషన్ మాత్రం ఓటర్ల జాబితా ఆధారంగా నిర్వహించారు. ఉదయంనుంచి రాత్రి వరకు రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించి రిజర్వేషన్లను ప్రస్తుతం తయారు చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్ల అనుమతికి సూర్యాపేట, భువనగిరికి రిజర్వేషన్ జాబితాను పంపంచి అనుమతి తీసుకున్నారు. జిల్లాల వారీగా రిజర్వేషన్ నల్లగొండ జిల్లా ఎంపీపీ జెడ్పీటీసీ అడవిదేవులపల్లి ఎస్టీ(జ) ఎస్టీ(జ) అనుముల ఎస్సీ(జ) ఎస్సీ(జ) చందంపేట ఎస్టీ(మ) ఎస్టీ(మ) చండూరు బీసీ(మ) బీసీ(జ) చింతపల్లి జనరల్(మ) జనరల్(మ) చిట్యాల బీసీ(మ) బీసీ(మ) దామరచర్ల ఎస్టీ(మ) ఎస్టీ(మ) దేవరకొండ జనరల్ జనరల్(మ) గుండ్లపల్లి జనరల్(మ) జనరల్ గుర్రంపోడు జనరల్ జనరల్(మ) కనగల్ బీసీ(జ) బీసీ(జ) కట్టంగూర్ జనరల్ జనరల్ కేతెపల్లి ఎస్సీ(జ) ఎస్సీ(మ) కొండమల్లేపల్లి జనరల్(మ) జనరల్(మ) మాడ్గులపల్లి ఎస్సీ(మ) ఎస్సీ(జ) మర్రిగూడ జనరల్ జనరల్ మిర్యాలగూడ జనరల్(మ) జనరల్ మునుగోడు బీసీ(జ) బీసీ(మ) నకిరేకల్ జనరల్ జనరల్(మ) జనరల్ జనరల్(మ) నల్లగొండ ఎస్సీ(జ) ఎస్సీ(జ) ఎస్సీ(జ) ఎస్సీ(జ) నాంపల్లి జనరల్(మ) జనరల్ నార్కట్‌పల్లి నార్కట్‌పల్లి(జ) జనరల్ నేరేడుగొమ్ము ఎస్టీ(జ) ఎస్టీ(జ) నిడమనూరు జనరల్(మ) జనరల్(మ) పీఏపల్లి జనరల్ జనరల్(మ) పెద్దవూర జనరల్(మ) జనరల్ శాలిగౌరారం ఎస్సీ(మ) ఎస్సీ(మ) తిప్పర్తి జనరల్ జనరల్ తిరుమలగిరి సాగర్ ఎస్టీ(జ) ఎస్టీ(మ) త్రిపురారం జనరల్(మ) జనరల్(మ) వేములపల్లి ఎస్సీ(మ) ఎస్సీ(మ) అడ్డగూడూరు ఎస్సీ(జ) ఎస్సీ(మ) ఆలేరు ఎస్సీ(జ) ఎస్సీ(జ) ఆత్మకూరు ఎం జనరల్(మ) జనరల్ బొమ్మల రామారం జనరల్ జనరల్ భువనగిరి బీసీ(మ) బీసీ(జ) బీబీనగర్ జనరల్ జనరల్(మ) చౌటుప్పల్ జనరల్ జనరల్ గుండాల ఎస్సీ(మ) ఎస్సీ(మ) మోటకొండూరు జనరల్(మ) జనరల్ మోత్కూర్ జనరల్(మ) జనరల్(మ) నారాయణపురం జనరల్(మ) జనరల్(మ) పోచంపల్లి జనరల్ జనరల్(మ) రాజాపేట బీసీ(జ) బీసీ(జ) రామన్నపేట బీసీ(మ) బీసీ(మ) తుర్కపల్లి ఎస్టీ(జ) ఎస్టీ(జ) వలిగొండ బీసీ(జ) జనరల్(మ) యాదగిరిగుట్ట బీసీ(జ) బీసీ(మ) నల్లగొండ జిల్లాకు సంబంధించిన రిజర్వేషన్‌తోపాటు మిగిలిన రెండు జిల్లాల జాబితాను కూడా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అనుమతితో జెడ్పీ అధికారులు ప్రకటించారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 31 మండలాల పరిధిలో మొత్తం 16మహిళలకు రిజర్వ్ కాగా, 15 మండలాలు జనరల్‌కు కేటాయించారు. సూర్యాపేటలో మొత్తం 23 మండలాలకు మహిళలకు 12, జనరల్‌కు 11 కేటాయించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలకు గాను 7 మహిళలకు రిజర్వ్ చేయగా, 10 జనరల్‌కు కేటాయించారు. మూడు జిల్లాల పరిధిలో ఎంపీపీ, జెడ్పీటీసీల రిజర్వేషన్లలో మహిళలకు 50 శాతం కేటాయించారు. -
5,984 ఎంపీటీసీ స్థానాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మండల పరిష త్ ప్రాదేశిక నియోజకవర్గాల సంఖ్య ఖరారైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 5,984 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడనున్నట్టు సమాచారం. గతంలో ఉమ్మడి 9 జిల్లా ప్రజా పరిషత్‌ల పరిధిలో 6,473 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వాటి సంఖ్య ప్రస్తుతం 5,984 స్థానాలకు తగ్గనుంది. కొత్తగా 68 మున్సిపాలిటీలు ఏర్పడిన నేపథ్యంలో ఆయా మండలాల పరిధి లోని కొన్ని గ్రామ పంచాయతీలను వాటిలో విలీనం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా 489 ఎంపీటీసీ స్థానాల తగ్గింపునకు ఆస్కారం ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన 32 జిల్లాల (పూర్తిగా పట్ట ణ ప్రాంతమైన జీహెచ్ఎంసీ మినహా) ప్రాతిపదికన ఆయా జిల్లాల్లో ఎంపీటీసీ స్థానాల పునర్విభజన చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా 98 స్థానాలు పెరగ్గా, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో అత్యల్పంగా 90 స్థానాలు తగ్గాయి. మంగళవారం నాటికి అత్యధిక శాతం జిల్లాలు ఈ స్థానాల పునర్విభజన ప్రక్రియను పూర్తిచేసి, గెజిట్లు ప్రచురించాయి. ఈ నెల 25 నాటికే ఈ స్థానాల పునర్విభజన పూర్తి చేసి జాబితాలను పంపించాలని జిల్లా సీఈఓలు, డీపీఓలను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆదేశించారు. అయితే మంగళవారం రాత్రి వరకు కూడా అన్ని జిల్లాల నుంచి పూర్తి స్థాయిలో ఈ జాబితాలు అందకపోవడంతో బుధవారం వాటిని ప్రభుత్వానికి సమర్పించాలనే ఆలోచనలో పీఆర్ శాఖ ఉంది. మార్చి చివరికల్లా ఓటర్ల జాబితాలు ప్రస్తుతం 32 జిల్లాల పరిధిలోని 535 గ్రామీణ మండలాలను జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (50 పట్టణ స్వరూపమున్న రెవెన్యూ మండలాలు మినహాయించి)గా పరిగణిస్తున్నారు. ఆ మేరకు 32 జిల్లా ప్రజా పరిషత్‌లు, 535 మండల ప్రజాపరిషత్‌లు ఏర్పడనున్నాయి. కొత్త పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సరిహద్దులు ఖరారవుతున్నాయి. వచ్చే నెల చివరికల్లా గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం కానున్నాయి. తాజా అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా ప్రాతిపదికన మార్చి ఆఖరులోగా ఈ ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఇదివరకే జిల్లా కలెక్టర్లు, డీపీఓలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ జాబితాలు సిద్ధమయ్యాక ఏప్రిల్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాతే... లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న దాన్ని బట్టి రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలుంటాయి. మే నెల మధ్యలోగా లోక్‌సభ ఎన్నికలు ముగిస్తే, మే నెలాఖరులో లేదా జూన్ మొదటి లేదా రెండో వారంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు అనువుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. -
జన్వాడలో టీఆర్ఎస్ విజయం
శంకర్పల్లి: మండలంలోని జన్వాడ ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఈ నెల 11న పోలింగ్ జరగగా.. శనివారం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఒక స్వతంత్ర అభ్యర్థి పోటీ చేయగా.. టీఆర్ఎస్ అభ్యర్థి మల్లేశ్‌గౌడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి.నాగేందర్‌పై 561 ఓట్ల మోజార్టీతో గెలుపొందారు. మొత్తం 3,111 ఓట్లకు గాను.. 2,359 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి మల్లేశ్ గౌడ్‌కు 1,388 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నాగేందర్‌కు 827, బీజేపీకి 68, టీడీపీకి 27, స్వతంత్ర అభ్యర్థికి 35, నోటాకు 14 ఓట్లు వచ్చాయి. మల్లేశ్‌గౌడ్ 561 ఓట్ల మోజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జగన్‌రెడ్డి ప్రకటించారు. శంకర్‌పల్లిలో విజయోత్సవ ర్యాలీ.. జన్వాడ ఎంపీటీసీ స్థానం టీఆర్ఎస్కు కైవసం కావడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకొన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మల్లేశ్‌గౌడ్‌కు స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి , సంక్షేమ పథకాలే తమ అభ్యర్థి విజయానికి కారణమయ్యాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రజల పూర్తి మద్దతు ఉందని చెప్పారు. సాధారణ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, నాయకులు వాసదేవ్‌కన్న, మల్లేశ్‌యాదవ్, రవీందర్‌గౌడ్, అశోక్‌కుమార్, సర్పంచులు మానిక్‌రెడ్డి, శ్రీధర్ తదితరులు ఉన్నారు. -
త్వరలో పంచాయతీ నగారా
ఖాళీ అయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డుల స్థానాలకు రానున్న నోటిఫికేషన్ 25వ తేదీన ఓటరు జాబితా ప్రకటన నకిరేకల్ గ్రామపంచాయతీ రిజర్వేషన్‌పై తొలగని సందిగ్ధత గ్రామాల్లో ఎన్నికల నగారా మోగనుంది. జిల్లాలో వివిధ కారణాలతో ఖాళీ అయిన గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఖాళీలు ఏర్పడిన స్థానాలకు జూన్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. నల్లగొండ : జిల్లాలో మరికొన్ని రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు నిర్వ హిం చేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి నమోదైన ఓటరు జాబితాను ఖాళీ అయిన స్థానాల్లో ప్రచురించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో కోరం ఉండి కూడా ఖాళీ ఉన్న ఉప సర్పంచ్ స్థానాలు రెండు ఉన్నాయి. పలు చోట్ల కోరం లేక వాయిదా పడిన ఉప సర్పంచ్ స్థానాలు కూడా ఉన్నాయి. ఉప సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 1173 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో సర్పం చ్‌లు 11, వార్డు సభ్యులు 44, ఎంపీటీసీ 1, జెడ్పీటీసీ 1 స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. కాగా నకిరేకల్ గ్రామ పంచాయతీ స్థానం రిజర్వేషన్ ఎటూ తేల్చకపోవడంతో ఈ స్థానంలో ఓటరు జాబితాను ప్రచురించడం లేదు. ఆర్డీఓ రిజర్వేషన్ ఖరారు చే యాల్సి ఉంది. అయితే వివిధ రాజకీయ కారణాల వల్ల అధికారులు రిజర్వేషన్‌ను పెండిం గ్లో పెట్టినట్లు తెలుస్తోంది. వార్డుల వివరాలు దేవరకొండ మండల చెన్నారం పంచాయతీలోని 10వ వార్డు, హాలియా మండలం తిమ్మాపురంలో 3వ వార్డు, నిడమనూరు మండలం గుంటిపల్లిలో 3, రేగులగడ్డలో 3వ, త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలోని 3, దొనకొండలో 3, దామరచర్ల మండలం దిలావర్పూర్లో 8, ఇరిగిగూడలోని 6, వేములపల్లి మండలం సల్కునూర్లోని 1వ వార్డు, గరిడేపల్లి మండలం కుతుబుషాపురంలోని 3, హుజూర్నగర్ మండలం లక్కవరంలో 3, మఠంపల్లి మండలం బంకమంతులగూడెంలో 5వ వార్డు, మేళ్లచెర్వు మండలం రామాపురంలోని 5వ వార్డు, చిలుకూరులోని 5వ వార్డు, మోతె మండలం బుర్కచర్లలోని 10వ వార్డు, మునగాల మండలం మాదారంలోని 3, ఆత్మకూర్.ఎస్ కోటపహాడ్లో 6, నల్లగొండ మండలం దొనకల్లో 8, దండెంపల్లిలోని 3, కనగల్ మండలం కురంపల్లిలోని 5వ వార్డులో ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా తిప్పర్తి మండలం చిన్నసూరారంలోని 2వ వార్డు, చండూరు మండలం ఇడికుడలోని 4, బంగారిగడ్డలో 1, చండూరులో 11, మునుగోడు మండలం కొరకటికల్లో 1, నాంపల్లి మండలం చామలపల్లిలో 1, బీబీనగర్ మండలం రావిపహాడ్‌లో 8, వలిగొండ మండలం రావిపహాడ్‌లో 8, నెమలికాల్వలో 3, వేములకొండలోని 4వ వార్డులో ఎన్నికలు జరగాలి. కట్టంగూర్ మండలం పిట్టంపల్లిలోని 1వ వార్డు, బొల్లేపల్లిలోని 4, నకిరేల్ మండలం వల్లభాపురంలోని 2, రామన్నపేట మండలం శోభనాద్రిగూడెంలోని 10, వెల్లంకిలోని 4, అర్వపల్లి మండలం నాగారంలోని 3, నూతనకల్ మండలం చిల్పకుంట్లలోని 11, ఆత్మకూర్.ఎం మండలం నాంచారిపేటలోని 6, ఉప్పలపహాడ్లోని 8, ఆలేరు మండలం రాఘవాపురంలోని 2, బి.రామారం మండలం మల్యాలలోని 1, బండికాడిపల్లిలోని 2వ వార్డు, కంచల్తండాలోని 3, గుండాల మండలం పల్లెపహాడ్‌లోని 8, తుర్కపల్లిలోని దాచారం 1వ వార్డుకు ఎన్నికలు జరగాల్సి ఉంది. -
‘స్థానిక’ నగారా!
సాక్షి, సంగారెడ్డి : జిల్లాలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని రెండు ఎంపీటీసీ, పది సర్పంచ్ స్థానాలతో పాటు వంద పంచాయతీ వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆయా స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అనారోగ్య కారణాలతో ఇద్దరు ఎంపీటీసీలతో పాటు తొమ్మిది మంది సర్పంచ్‌లు మృతి చెందగా ఒకరు పదవికి రాజీనామా చేశారు. అలాగే వేర్వేరు కారణాలతో వంద పంచాయతీ వార్డు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఏడాదికిగా ఖాళీగా ఉన్న ఆయా స్థానాలకు ఎన్నికల సంఘం త్వరలో ఎన్నికలు నిర్వహించనుంది. త్వరలో ఎన్నికల నోటిఫికే షన్ వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో పంచాయతీ అధికారులు ఆయా స్థానాల ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం అవుతున్నారు. ఈనెల 25న ఖాళీగా ఉన్న స్థానాల్లో ఓటర్ల జాబితాను వెలువరించనున్నారు. ఎన్నికలు నిర్వహించాల్సిన రెండు ఎంపీటీసీ స్థానాలు, పది సర్పంచ్ స్థానాలతో పాటు వంద వార్డు సభ్యుల స్థానాలున్న గ్రామాల ఓటర్ల జాబితాను పంచాయతీ అధికారులు ఎన్నికల సంఘం నుంచి తీసుకుంటున్నారు. దీన్ని పరిశీలించిన అనంతరం ఈనెల 25న తుది ఓటరు జాబితాను పంచాయతీల్లో ప్రకటిస్తారు. ఎన్నికలు నిర్వహించే గ్రామాల్లో 24వ తేదీ వరకు ఓటరు సవరణ చేపట్టే అవకాశం ఉంటుంది. ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఈవీఎంల సేకరణ వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించారు. ఇద్దరు ఎంపీటీసీల మృతితో ఎన్నికలు సదాశివపేట మండలం పెద్దాపూర్ ఎంపీటీసీ రవీందర్‌యాదవ్ అనారోగ్యంతో ఐదు నెలల క్రితం మృతి చెందారు. ఇది బీసీ జనరల్ రిజర్వు స్థానం. అలాగే దుబ్బాక మండలం రాజక్కపేట ఎంపీటీసీ అక్కల లావణ్య ఆరు నెలల క్రితం మృతి చెందారు. ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పది సర్పంచ్ స్థానాలకు.. సంగారెడ్డి మండలం చింతలపల్లి సర్పంచ్ స్థానం ఎస్టీకి రిజర్వుకాగా అక్కడ ఎస్టీ అభ్యర్థులు లేరు. దీంతో సర్పంచ్ స్థానం ఖాళీగా ఉంది. కవలంపేట సర్పంచ్ అనంతరావు అనారోగ్యంతో మృతిచెందారు. పటాన్చెరు మండలం చిన్నకంజర్ల సర్పంచ్ మల్లేపల్లి నర్సమ్మ, కౌడిపల్లి మండలం సలాబత్పూర్ సర్పంచ్ చిన్నసాయిరెడ్డి, రాయికోడ్మండలం ఔరంగానగర్ సర్పంచ్ రాంచందర్‌గౌడ్, మునిపల్లి మండలం పొల్కంపల్లి సర్పంచ్ ఎం.అంజన్న, సదాశివపేట మండలం మద్దికుంట సర్పంచ్ బావోద్దీన్, పుల్కల్మండలం శివ్వంపేట సర్పంచ్ మిర్యాల మంజుల, సిద్దిపేట మండలం పొన్నాల సర్పంచ్ టి.ఎల్లమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఎనిమిది మంది సర్పంచ్ల మృతితో ఖాళీగా ఉన్న ఆయా గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే న్యాల్కల్ మండలం మిర్జాపూర్(ఎన్) సర్పంచ్‌గా ఎన్నికైన శారదారెడ్డి తన పదవికి రాజీనామా చేసి జెడ్పీటీసీగా గెలుపొందారు. ఖాళీ స్థానానికి త్వరలో ఎన్నికలు జరపనున్నారు. వంద వార్డు సభ్యుల స్థానాలకు... వేర్వేరు కారణాలతో ఖాళీగా ఉన్న వంద గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల స్థానాలకు అధికారులు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలోని 59 పంచాయతీల పరిధిలో వంద వార్డు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికలు నిర్వహణకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. -
వైఎస్సార్సీపీ ఖాతాలోకి ఐదు మండల పరిషత్‌లు
సాక్షి నెట్వర్క్ : చిత్తూరు, కర్నూలు, కృష్ణా, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆదివారం జరిగిన మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ ఐదు మండల పరిషత్‌లను కైవసం చేసుకోగా, టీడీపీ రెండిటిని దక్కించుకుంది. విజయనగరం జిల్లా మెంటాడ, తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం, కృష్ణాజిల్లా ఆగిరిపల్లి, చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం, కర్నూలు జిల్లా కొత్తపల్లి ఎంపీపీ పీఠాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ‘పశ్చిమ’లో వైఎస్ఆర్సీపీ సభ్యులకు బెదిరింపులు, ప్రలోభాలు సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ కుటిల రాజకీయాలకు పాల్పడి దేవరపల్లి మండల పరిషత్ అధ్యక్ష పదవిని తన్నుకుపోయింది. ఇక్కడ టీడీపీ దౌర్జన్యాల వల్ల ఈ నెల 4న ఎంపీపీ ఎన్నిక నిలిచిపోగా ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఆదివారం ఎన్నిక నిర్వహించారు. ఎంపీటీసీ ఎన్నికల్లో మండలంలో మెజారిటీ స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఉన్నా టీడీపీ ఇద్దరిని ప్రలోభాలకు గురిచేసి తమవైపునకు తిప్పుకుంది. ఈ నేపథ్యంలో లాటరీలో ఆ స్థానాన్ని దేశం చేజిక్కించుకుంది. -
ఇద్దరు టీడీపీ ఎంపీటీసీలు అరెస్టు
దేవరపల్లి(ప.గో): దేవరపల్లి ఎంపీపీ పీఠానికి సంబంధించి జరిగిన ఎన్నికల్లో అధికారులపై దాడికి దిగిన ఇద్దరు టీడీపీ ఎంపీటీసీలను ఎట్టకేలకు శనివారం పోలీసులు అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేసిన అనంతరం రిమాండ్ కు తరలించారు. ఎలాగైనా ఆ మండలంలో పాగా వేయాలని భావిస్తున్న టీడీపీ ఘర్షణ వాతావరణాన్ని తిరిగి సృష్టించాలని యత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఒకసారి ఉద్రిక్తతలు సృష్టించి ఎన్నిక వాయిదా పడేలా చేసిన ఆ పార్టీ నేతలు ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లోనూ శాంతిభద్రతల సమస్య తీసుకురావాలని కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. దేవరపల్లి మండల పరిషత్‌లో 22 ఎంపీటీసీ స్థానాలకుగాను 12 వైఎస్సార్ సీపీ, 9 టీడీపీ గెల్చుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన పెనుబోతుల సుబ్బారావు వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. వైఎస్సార్ సీపీ తరఫున ఎంపీపీ పదవికి గన్నమని జనార్దనరావు పోటీకి దిగారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుల్ని భయపెట్టో, ప్రలోభపెట్టో తమవైపు తిప్పుకొని ఎంపీపీ పదవి దక్కించుకోవాలని టీడీపీ పథకాలు రచిస్తోంది. -
ఓటమి మంటలు !
కాంగ్రెస్ పార్టీలో సార్వత్రిక ఓటమి మంటలు రాజుకుంటున్నాయి. అపజయానికి నువ్వంటే.. నువ్వే! కారణమంటూ దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో గుమ్మనంగా వ్యవహరించిన నేతలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతూ అధిష్టానవర్గం వద్దకు ‘క్యూ’ కడుతున్నారు. వ్యతిరేకులపై ఫిర్యాదులపర్వం మొదలైంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత సోదరుడిపై వేటుపడింది. మరో పదిమందిపై క్రమశిక్షణ చర్యలకు టీపీసీసీ సిద్ధమైంది. దీంతో హస్తం పార్టీలో పెద్ద రచ్చే జరగనుంది. సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మొదలుకుని సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నేతలపై రగిలిపోతున్న పలువురు అభ్యర్థులు ఫలితాలు వెలువడగానే ఫిర్యాదుల పర్వానికి తెరతీశారు. ఎన్నికల సమయంలో గుట్టుగా టీపీసీసీకి ఫిర్యాదులు అందించిన అభ్యర్థులు చర్యలు తీసుకోవాలని ఇటీవల గట్టిగా పట్టుబడుతున్నారు. సాధారణ ఎన్నికల్లో టికెట్ల కోసం ప్రయత్నించి భంగపడిన నేతలు ప్రచారం, పోలింగ్ పర్వంలో తమ ప్రతాపాన్ని పరోక్షంగా చూపారు. మరికొందరు నామ్‌కే వస్తేగానే పార్టీలో కొనసాగినా.. అధికార అభ్యర్థులకు సహాయ నిరాకరణ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇదిలాఉండగా, కేంద్ర మాజీమంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి జిల్లా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాతే కాంగ్రెస్‌లో విభేదాలు తీవ్రంగా పోడచూపాయనే ఆరోపణలు ఉన్నాయి. మాజీమంత్రి డీకే అరుణ కూడా తమ వర్గీయులకు పట్టుబట్టి టికెట్లు ఇప్పించుకోవడం ఈ విభేదాలకు మరింత ఆజ్యం పోసినట్లయిందని భావిస్తున్నారు. కొడంగల్, మక్తల్, షాద్‌నగర్, జడ్చర్లలో టికెట్లు దక్కని కొందరు కాంగ్రెస్ ముఖ్యనేతలు పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. వ్యతిరేకులపై వేటు కల్వకుర్తి నుంచి టికెట్ ఆశించి భంగపడిన కసిరెడ్డి నారాయణరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి ఓటమిపాలైనస్పటికీ 24 వేలకు పైగానే ఓట్లను తెచ్చుకోగలిగారు. ఈ కారణంతోనే అధికార అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి స్వల్పమెజార్టీతో గెలుపొందారనే వాదన వినిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి సోదరుడు రాంరెడ్డి పార్టీ ప్రకటించిన అభ్యర్థికి వ్యతిరేకంగా.. కసిరెడ్డి నారాయణరెడ్డికి అనుకూలంగా ఎన్నికల్లో పనిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొల్లాపూర్‌లో కూడా పార్టీ టికెట్ దక్కించుకున్న బీరం హర్షవర్ధన్‌రెడ్డికి వ్యతిరేకంగా విష్ణువర్ధన్‌రెడ్డి పనిచేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. కల్వకుర్తి అభ్యర్థి వంశీచందర్‌రెడ్డి అయితే యువనేత రాహుల్‌గాంధీ వద్దనే మాజీ మంత్రి జైపాల్రెడ్డిై వర్గీయులు సహకరించడం లేదని ఫిర్యాదుచేశారు. మరోవైపు తమకు సహకరించని మాజీమంత్రి డీకే.అరుణ వర్గీయులపై చర్యలు తీసుకోవాలని ఎస్.జైపాల్‌రెడ్డి వర్గీయులు టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని 10 మంది నాయకులకు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఈ మేరకు రాంరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసిన ట్లు ప్రకటించింది. అదేవిధంగా మరికొందరు నాయకులపై కూడా చర్యలు తీసుకునేందుకు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక వర్గం నాయకులపైనే చర్యలు చేప ట్టి మరోవర్గం వారిని చూసీచూడనట్లు శిక్షణ సంఘం వ్యవహరిస్తునందన్న ఆరోపణలతో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జిల్లా కాంగ్రెస్‌లో మళ్లీ రచ్చ మొదలైందనే చర్చ ఆ పార్టీ వర్గాల నుంచే వ్యక్తమవుతోంది. -
గాలం వేసేయ్..!
సాక్షి, మంచిర్యాల : జిల్లా, మండల పరిషత్, పురపాలక అధ్యక్ష స్థానాలను కైవసం చేసుకోవడానికి పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్‌ను అమలు చేస్తున్నాయి. ఎన్నికలపై ఇంకా స్పష్టత రానప్పటికీ ఇప్పటి నుంచే రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. క్యాంపు రాజకీయాలతో వేడేక్కిస్తున్నాయి. స్థానిక సంస్థల ఫలితాల్లో జిల్లాలో అత్యధిక స్థానాలు సాధించిన టీఆర్ఎస్లో అంతర్గత పోరు నెలకొంది. జెడ్పీ చైర్ పర్సన్ పీఠంపై గురిపెట్టిన ఆయా పార్టీల అగ్రనేతలు ఇప్పటికే క్యాంపు రాజకీయాలు నడిపిస్తున్నారు. పార్టీలోని ప్రత్యర్థులు సైతం ఇదే రీతిలో ముందుకెళ్తున్నారు. దీంతో ఎవరికి వారు తమ వ్యూహాలకు పదునుపెట్టి ఎదు టి క్యాంపులోని వారి ని తమ గూటికి చేర్చుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. క్యాంపుల్లో ఉన్నవారు ఎవరు చెబితే వింటారో వారితో మంతనాలు సాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి పరిషత్ అధ్యక్ష స్థానాన్ని తామే అధిరోహించాలనే పట్టుదలతో ముందడుగు వేస్తున్నారు. మరో వైపు మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లోనూ ఇదే తీరును అనుసరిస్తున్నారు. జంప్ జిలానీలు.. ఆసిఫాబాద్ మండల పరిషత్‌లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అనిశ్చితి నెలకొంది. 17 ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 6, టీడీపీ 4, సీపీఐ ఒక స్థానం దక్కించుకున్నాయి. ఎంపీపీ పీఠం కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి. ఈ నెల 19న టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి అలిబిన్ అహ్మద్, ము గ్గురు ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచులు ఎమ్మెల్యే కోవ ల క్ష్మి సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కొత్తగా చేరిన ఎంపీటీసీ సభ్యులతో కలిసి టీఆర్ఎస్ సభ్యుల సంఖ్య తొమ్మిదికి చేరింది. దీంతో ఎంపీపీ పీఠంపై ఉ త్కంఠకు తెరపడిందని భావించారు. ఈ క్రమంలో సో మవారం రాత్రి టీఆర్ఎస్లో కొత్తగా చేరిన ఇద్దరు ఎంపీటీసీ సభ్యులతోపాటు మరో ఎంపీటీసీ కాంగ్రెస్ శిబిరానికి తరలి వెళినట్లు సమాచారం. దీంతో సీన్ మారిపోయింది. తాజా పరిణామాలతో ఎంపీపీ పీఠం కాంగ్రెస్‌కు దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మొదట్నుంచి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమై ఇటీవల ఎన్నికల్లో విజేతలైన వారు, పార్టీలు మారి గెలిచిన వారి మధ్య పోటీ నెలకొంది. దీంతో ఎవరి మార్కు రాజకీయాలను వారు నడిపిస్తూ అధ్యక్ష స్థానంపై దస్తీ వేస్తున్నారు. ఆసక్తికరం పురపాలక పీఠం పురపాలక అధ్యక్ష స్థానాన్ని అధిరోహించాలని ఎత్తులు వేస్తున్న నాయకులు, కౌన్సిలర్లు అంతర్గత రాజకీయాలతోపాటు విజేతలతో మంతనాలు నడిపిస్తున్నారు. ఆయా వార్డుల వారీగా గెలిచిన వారికి అభివృద్ధి పనుల కేటాయింపులో పెద్దపీట వేయడంతోపాటు ఉపాధ్యక్ష స్థానం కట్టబెడతామని హామీ ఇస్తున్నారు. ఇదే హామీని అందరికీ ఇవ్వడం కొసమెరుపు. కొన్ని మున్సిపాలిటీలో మిశ్రమ ఫలితాలు వ చ్చిన నేపథ్యంలో వారికి గాలం వేయడంలో టీఆర్ఎస్ వర్గాలు ముందుంటున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకే మద్దతిస్తే భవిష్యత్తుకు ఢోకా ఉండదన్న అభిప్రాయంలో పలువురు కౌన్సిలర్లు ఉన్నట్లు సమాచారం. జిల్లాలో బెల్లంపల్లి, మంచిర్యాల, కాగజ్‌నగర్ బల్దియా చైర్పర్సన్ స్థానాలపై ఆసక్తి నె లకొంది. బెల్లంపల్లిలోని 34వార్డులకు కాంగ్రెస్ పార్టీ 14, టీఆర్ఎస్ 10, ఇతరులు 5 స్థానాలు గెలుచుకున్నారు. ఇక్కడ స్వతంత్రుల మద్దతు కీలకం అయిన నేపథ్యంలో వారితో కలిసి పీఠాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ టీఆర్ఎస్కే వారు మద్దతిస్తారేమోననే గుబులు సైతం వారిని పట్టిపీడిస్తోంది. మంచిర్యాలలో 18 స్థానాలు కాంగ్రెస్, 14 స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకున్నప్పటికీ హస్తం గూటిలోని కొందరు తమకు మద్దతిచ్చే అవకాశాలున్నాయని తద్వారా బల్దియాపై జెండా ఎగరవేస్తామని టీఆర్ఎస్ వర్గాలు ధీమాగా ఉన్నాయి. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలోని 28 స్థానాలకు గాను టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 5, ఇతరులు 10 గెలుచుకున్నారు. ఇక్కడ సైతం ఇతరులతో కలిసి చైర్పర ్సన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. స్వతంత్రులు అధిక స్థానాలున్న టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతారా లేదా కాంగ్రెస్‌తో కలిసి పీఠాన్ని చేజిక్కుంచుకొని వారిలో ఎవరో ఒకరు ముఖ్యస్థానాన్ని అధిరోహిస్తారా అనే చర్చ మున్సిపాలిటీలో జోరుగా సాగుతోంది. -
ఖమ్మంలో వైఎస్సార్సీపీకి 5 జెడ్పీటీసీలు
సాక్షి, హైదరాబాద్: ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు వెలువడిన ఫలితాల్లో దాదాపు 115 ఎంపీటీసీ, 5 జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. ముఖ్యంగా పోరాటాల పురిటిగడ్డ ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టుల కంటే కూడా వైఎస్సార్సీపీ మెరుగైన ఫలితాలు దక్కించుకుంది. ఈ జిల్లాలో పార్టీ 5 జెడ్పీటీసీలు, 93 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. -
గ్రామీణ ప్రజలు, రైతాంగానికి అంకితం: బాబు
సాక్షి, హైదరాబాద్: జెడ్పీ, మండల పరిషత్ ఎన్నికల్లో తెలుగుదేశం సాధించిన విజయాన్ని గ్రామీణ ప్రజలు, రైతాంగానికి అంకితమిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మంగళవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీకి విజయాన్ని అందించిన గ్రామీణ ప్రజలు, రైతాంగానికి, నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీపై వారు చూపిన ఆదరణ చారిత్రాత్మకమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలోని మండల పరిషత్‌లలో 20 శాతం గెలవటం టీడీపీ వెంట అక్కడి ప్రజలు, కార్యకర్తలు ఉన్నారనేందుకు నిదర్శమన్నారు. ఈ ప్రాంతంలో తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్, తెచ్చామని టీఆర్ఎస్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశాయని విమర్శించారు. తమ పార్టీపై దుష్ర్పచారం చేసి లబ్ధి పొందాలని చూసిన వైఎస్సార్సీపీ ఈ ఫలితాలతో ఖంగుతిన్నదన్నారు. -
‘మండలం’లోనూ హంగే
కాంగ్రెస్ - టీఆర్ఎస్ల మధ్య పోటాపోటీ.. 441 స్థానాల్లో 200 చోట్ల ఫలితం తేలే సూచనల్లేవు ఇతరుల మద్దతు కోసం ఆశావహుల ప్రయత్నాలు.. వేసవి శిబిరాల పేరుతో క్యాంపు రాజకీయాల జోరు ఇంకా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. నేటి ఉదయానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలోని మండల ప్రజా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. మంగళవారం అర్ధరాత్రి వరకు కూడా ఎంపీటీసీ స్థానాల ఫలితాలు వస్తూనే ఉన్నాయి. మొత్తం 441 మండల ప్రజా పరిషత్తులకు గాను 6,497 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో రాత్రి పొద్దుపోయే వరకు ఫలితాలను విశ్లేషిస్తే కాంగ్రెస్‌కు 2,216, టీఆర్ఎస్కు 1,844, టీడీపీకి 831, బీజేపీకి 230, ఇతరులు 820 స్థానాలను సాధించినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం మేరకు 441 ఎంపీపీలకు గాను సుమారు 200 స్థానాల్లో హంగ్ ఫలితాలే దర్శనమిచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మిగిలిన వాటిలో కాంగ్రెస్ 58, టీఆర్ఎస్ 78, టీడీపీ 10 ఎంపీపీ పీఠాలను దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎన్నికల కమిషన్ అధికారులు మాత్రం బుధవారం ఉదయానికల్లా స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు. అర్ధరాత్రి దాటేవరకు కూడా జిల్లా పార్టీ కార్యాలయాల్లో వివిధ రాజకీయ పార్టీలు మకాం వేసి ఏయే మండలంలో ఎన్ని స్థానాలు తమకు వచ్చాయి? ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే ఎన్ని సీట్లు కావాలి? ఈ విషయంలో మద్దతిచ్చే వాళ్లెవరున్నారు? అనే విషయాలపై మల్లగుల్లాలు పడుతున్నారు. మ్యాజిక్ ఫిగర్‌కు దగ్గరగా ఉన్న కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు ఇతర పార్టీల ‘మద్దతు’ కోసం ఇప్పటికే ఆయా నేతలతో సంప్రదింపులు జరుపుతుండటం విశేషం. ఇక్కడా తప్పని క్యాంపు రాజకీయాలు: తెలంగాణలోని మండల పరిషత్‌లలో చాలాచోట్ల హంగ్ ఫలితాలు దర్శనిమిస్తుండటం, స్వతంత్రులు, చిన్నా చితక పార్టీల మద్దతు కీలకం కానున్న నేపథ్యంలో ఇక్కడా క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. మండల, జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఆశిస్తున్న నేతలంతా ఇప్పటికే స్వతంత్ర సభ్యుల మద్దతును కూడగట్టేందుకు బేరసారాలకు దిగుతున్నారు. సమ్మర్ క్యాంప్ పేరుతో ప్రత్యేక శిబిరాలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. బుధవారం నుంచి క్యాంపు రాజకీయాలు వేడెక్కడం ఖాయంగా కన్పిస్తోంది. -
జెడ్పీల్లో హోరాహోరీ.. దేశం ముందంజ
► 40 సీట్ల తేడాతో సీమాంధ్రలోని 9 జిల్లాల్లో వెనకబడ్డ వైఎస్సార్ సీపీ ► ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో ఫ్యాన్ హవా ► రాత్రి ఒంటి గంటకు 534 స్థానాల్లో ఫలితాల వెల్లడి.. టీడీపీకి 281; వైసీపీకి 249; ఇతరులకు రెండు ► దాదాపు 120 స్థానాల్లో ఇంకా వెల్లడికాని ఫలితం ► రెండు పార్టీల మధ్య సీట్లలో తేడా కేవలం 4 శాతం.. ఎంపీటీసీల్లోనూ ఇదే తరహా ఫలితాలు ► టీడీపీకి 4,650; వైఎస్సార్ కాంగ్రెస్‌కు 3,897 సాక్షి, హైదరాబాద్: జిల్లా పరిషత్, మండల ప్రజా పరిషత్‌లపై ఆధిపత్యం కోసం నువ్వా నేనా అంటూ జరిగిన పోరాటంలో చివరకు తెలుగుదేశం పైచేయి సాధించింది. 13 జిల్లాల్లోని 653 జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాలకు (జెడ్పీటీసీ), 10,092 మండల పరిషత్ ప్రాదేశిక స్థానాలకు జరిగిన ఎన్నికల పోరులో కేవలం 30-40 సీట్ల తేడాతో 9 జిల్లాల్లో టీడీపీ కన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనకబడింది. దీంతో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ పైచేయి సాధించింది. గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో హోరాహోరీ పోరు సాగించి వెనకబడ్డ వైఎస్సార్ కాంగ్రెస్... కర్నూలు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాలను భారీ మెజారిటీతో సొంతం చేసుకుంది. ఈ నాలుగు జిల్లా పరిషత్‌లతో పాటు ఈ జిల్లాల్లోని ఎంపీటీసీల్లోనూ స్పష్టమైన మెజారిటీని సొంతం చేసుకుంది. ప్రకాశం జిల్లాలో మొత్తం 56 జెడ్పీటీసీలుండగా 32 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. కడప జిల్లాలో 50 స్థానాలకు గాను మెజారిటీ సీట్లను వైఎస్సార్ సీపీయే గెలుచుకుంది. ఇక నెల్లూరులో 46 స్థానాలకు గాను అధిక స్థానాల్లో విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుండగా... మంగళవారం రాత్రి 1 గంట సమయానికి అందిన సమాచారం మేరకు సీమాంధ్రలో 281 జెడ్పీటీసీలను తెలుగుదేశం సొంతం చేసుకోగా... 249 జెడ్పీటీసీలలో వైఎస్సార్ కాంగ్రెస్ విజయ భేరి మోగించింది. కాంగ్రెస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రె డ్డి నేతృత్వంలోని జై సమైక్యాంధ్ర పార్టీ తలా ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. ఫలితాలు వెల్లడైన సీట్లను మొత్తం జెడ్పీటీసీ సీట్లతో పోల్చినపుడు టీడీపీ- వైఎస్సార్ కాంగ్రెస్ మధ్య తేడా 4 నుంచి 5 శాతం మధ్య మాత్రమే ఉంది. ఎందుకంటే ఈ ఫలితాల ప్రకారం టీడీపీ 43.03 శాతం సీట్లను, వైఎస్సార్ సీపీ 38.13 శాతం సీట్లను గెలుచుకున్నాయి. ఎంపీటీసీల విషయానికొస్తే కడపటి వార్తలందేసరికి దాదాపు 750 సీట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకన్నా అధికంగా గెలుచుకుని టీడీపీ ముందంజలో ఉంది. రాత్రి 1.30 గంటలకు అందిన సమాచారం ప్రకారం... 4,650 ఎంపీటీసీల్లో తెలుగుదేశం విజయభేరి మోగించగా... 3,897 స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 118 ఎంపీటీసీల్ని, ఇతరులు 405 స్థానాల్ని గెలుచుకున్నారు. మొత్తం సీట్లతో ఫలితాలు వెల్లడైన స్థానాలను పోల్చిచూసినపుడు వైఎస్సార్ సీపీ కన్నా తెలుగుదేశానికి 7 శాతం సీట్లు అధికంగా దక్కాయి. ఈ ఫలితాల ప్రకారం టీడీపీకి 46 శాతం సీట్లు దక్కగా, వైఎస్సార్ సీపీ 38.61 శాతం సీట్లను సొంతం చేసుకుంది. ఉదయం నుంచి ఉత్కంఠ... ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ఆరంభమైనప్పటి నుంచి జడ్పీటీసీలు, ఎంపీటీసీల్లో ఏ పార్టీకి ఆధిక్యత లభిస్తుంది? ఏయే జిల్లా పరిషత్‌లను ఏ పార్టీ కైవసం చేసుకుంటుంది? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఉదయం ఎనిమిది గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంల) ద్వారా కాకుండా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగినందున కౌంటింగ్ ఆరంభించడానికి చాలా సమయం పట్టింది. ముందుగా బ్యాలెట్ బాక్సులు విప్పి బ్యాలెట్లను 25 చొప్పున కట్టలు కట్టిన తర్వాత కౌంటింగ్ ఆరంభించారు. దీంతో చాలాచోట్ల కౌంటింగ్ ఆరంభించడానికి మధ్యాహ్నం 12 గంటల వరకూ సమయం పట్టింది. కొన్ని జిల్లాల్లో బ్యాలెట్ బాక్సుల్లోకి వర్షపు నీరు రావడంతో బ్యాలెట్లను ఆరబెట్టిన తర్వాత కౌంటింగ్ చేపట్టారు. అర్ధరాత్రి తర్వాత కూడా ఓట్ల లెక్కింపు కొనసాగింది. తొలుత ఎంపీటీసీ స్థానాల లెక్కింపు ప్రారంభం కావడంతో అర్థరాత్రి దాటిన తర్వాత ఎంపీటీసీ ఫలితాలు దాదాపు పూర్తయ్యాయి. జడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ఆలస్యంగా ప్రారంభం కావడం, ఓట్ల సంఖ్య ఎక్కువ కావడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఓట్ల లెక్కింపు పూర్తి కాలేదు. -
కౌంటింగ్ కేంద్రంపై తేనెటీగల దాడి
శ్రీకాకుళం జిల్లా పలాసలోని కౌంటింగ్ కేంద్రంపై మంగళవారం తేనెటీగలు దాడి చేశాయి. ఇద్దరు కానిస్టేబుళ్లతోపాటు మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను అధికారులు స్థానికుల సహయంతో ఆసుపత్రికి తరలించారు. మంగళవారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్బంగా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ జోరుగా సాగుతుంది. అయితే పలాస కౌంటింగ్ కేంద్రం వద్ద ఓట్ల లెక్కింపు జరుగుతుండగా తేనెటీగలు అకస్మాత్తుగా దాడి చేశాయి. అక్కడే విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు, పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లు తీవ్రంగా గాయపడ్డారు. పోలింగ్ కేంద్రంలోని సిబ్బంది వెంటనే తలుపులు మూసివేశారు. అప్పటికే తేనెటీగలు భారీగా పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించాయి. -
'స్లిప్‌లు, నోటు తడిచాయి.. చెదలు పట్టాయి'
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటిసి ఎన్నికలు, ఓట్ల లెక్కింపు సందర్భంగా చిత్ర, విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. పలు చోట్ల ప్రజలు తమ నిరసనను బ్యాలెట్ బాక్సుల్లో చూపారు. * చిత్తూరు జిల్లా కలిగిరి మండలంలో ఓటర్లు గత ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. మంచి నీళ్ళివ్వని మీకెందుకు ఓటేయాలంటూ.. స్లిప్‌లు రాసి బ్యాలెట్ బాక్సుల్లో వేశారు. కలిగిరి తాజా మాజీ సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి సొంత మండలం కావడం విశేషం. *అనంతపురం జిల్లా నల్లచెర్వు జెడ్పీటీసీ కౌంటింగ్‌కు టీడీపీ ఏజెంట్‌గా రౌడీషీటర్ నాగభూషణం నాయుడు హాజరయ్యాడు. *అటు గుంటూరు జిల్లా కర్లపాలెంలో కూడా ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా బ్యాలెట్ పత్రంతో పాటు, ఓ పది రూపాయల నోటు కూడా బయట పడింది. కర్లపాలెం ఎంపిటిసిలో ఓటు వేసిన ఓ వ్యక్తి బ్యాలెట్ పత్రంతో పాటు, పది రూపాయల నోటు జత చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ నోటు బయట పడింది. *నెల్లూరు జిల్లా కావలిలో ఓ కళాశాలలో ఉంచిన కొండాపురం మండలం బ్యాలెట్ బాక్స్‌లకు చెదలు పట్టాయి. మంగళవారం ఓట్లు లెక్కింపు సందర్బంగా బ్యాలెట్ బాక్స్‌లను ఏజెంట్లు బయటకు తీశారు. అందులోని బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టి చిరిగిపోయి ఉన్నాయి. బ్యాలెట్ పత్రాలు చిరిగిపోయి ఉండటంపై ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. *ఇక విశాఖ జిల్లా నర్సీపట్నం కౌంటింగ్ కేంద్రంలో పాము ప్రత్యక్షం కావటంతో సిబ్బంది భయంతో పరుగులు తీశారు. *శ్రీకాకుళం జిల్లా పలాస కౌంటింగ్ కేంద్రం వద్ద తేనెటీగలు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుల్స్‌తో పాటు, 20మంది గాయపడ్డారు. *పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండ, పెనుమంట్ర మండలాల ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పెనుగొండ మండలానికి చెందిన 3 బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లు తడిచి ముద్దయ్యాయి. అధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది వాటిని ఆరబెట్టే పనిలో పడ్డారు. దీంతో కౌంటింగ్ ఎప్పటికి పూర్తవుతుందోనని అభ్యర్ధుల్లో ఆందోళన నెలకొంది. *నిడదవోలు మండలంలో తాడిమళ్ల, కోరుమామిడి బ్యాలెట్ ఓట్లు తడవటంతో, లెక్కింపుకు సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. *తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దపూడి మండలంలో పోలైన ఓట్లతో కూడిన బ్యాలెట్ బ్యాక్స్ వర్షానికి తడిసిపోయింది. *రంగారెడ్డి జిల్లా తాండూరు కౌంటింగ్ కేంద్రంలో భోజనాలు అందలేదని సిబ్బంది కౌంటింగ్ నిలిపివేశారు. *కరీంనగర్ జిల్లా పెద్దపల్లి కౌంటింగ్ కేంద్రం వద్ద స్టాంగ్ రూమ్ తాళాన్ని సిబ్బంది పోగొట్టడంతో, అధికారులు తాళాలు పగులకొట్టి బ్యాలెట్ బాక్సులు బయటకు తీశారు. *నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం వడ్లూరు బ్యాలెట్ బాక్స్‌లో ఓ లెటర్ ప్రత్యక్షం అయ్యింది. అభ్యర్థులు నచ్చలేదని ఓ ఓటరు ఓటు బదులు బ్యాలెట్ బాక్స్‌లో లెటర్ వేశాడు. *ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ డివిజన్లో కాజద్నగర్, కౌటాలా పోలింగ్ కేంద్రంలో భోజనం సదుపాయం కల్పించలేదని సిబ్బంది విధులు బహిష్కరించారు. -
అక్కడ ఓట్లు ఆరిన తర్వాతే కౌంటింగ్
ఆచంట : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండ, పెనుమంట్ర మండలాల ఓట్ల లెక్కింపు ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పెనుగొండ మండలానికి చెందిన 3 బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లు తడిచి ముద్దయ్యాయి. అధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది వాటిని ఆరబెట్టే పనిలో పడ్డారు. దీంతో కౌంటింగ్ ఎప్పటికి పూర్తవుతుందోనని అభ్యర్ధుల్లో ఆందోళన నెలకొంది. -
'కౌంటింగ్‌కు వీలుకాకుంటే రీ పోలింగ్'
-
కౌంటింగ్‌కు వీలుకాకుంటే రీ పోలింగ్
హైదరాబాద్ : అకాల వర్షాలకు తడిచిన, చెదలు పట్టిన బ్యాలెట్ పేపర్లను పరిశీలిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాలో మూడుచోట్ల బ్యాలెట్ పేపర్లు తడిచాయని, అలాగే నెల్లూరు జిల్లాలో ఓ చోటు బ్యాలెట్ పేపర్లకు చెదలు పట్టాయన్నారు. ఒకవేళ లెక్కింపుకు వీలు కాకుంటే రీ పోలింగ్ నిర్వహిస్తామని రమాకాంత్ రెడ్డి తెలిపారు. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. విజయనగరం, విశాఖ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఈవీఎంలు తెరుచుకోలేదని వాటిని ఈసీఐఎల్ నిపుణులు పరిశీలిస్తున్నట్లు రమాకాంత్ రెడ్డి తెలిపారు. అవి ఓపెన్ కాకుంటే మళ్లీ రీపోలింగ్ జరుపుతామన్నారు. అలాగే ఖమ్మం జిల్లాలో జెడ్పీటీసీ-2, ఎంపీటీసీ-15 స్థానాల ఎన్నికలను ప్రజలు తిరస్కరించారని రమాకాంత్ రెడ్డి పేర్కొన్నారు. వాటిని ఎప్పుడు నిర్వహించమంటే అప్పుడు ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉందన్నారు. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు సాయంత్రం లేదా రాత్రి వరకూ కొనసాగవచ్చునని ఆయన తెలిపారు. -
ఆరు ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ నిలిపివేత
ఒంగోలు : ప్రకాశం జిల్లా మార్టురులో ఆరు ఎంపీటీసీ స్థానాలకు అధికారులు కౌంటింగ్ నిలిపివేశారు. హైకోర్టు ఆదేశాలతో కౌంటాంగ్ నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం. కోనపల్లి, కొమరోలు, చీమకుర్తి, గిద్దలూరు, పెద్దారవీడు, అద్దంకి ఎంపీటీసీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. -
కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ హవా
-
కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ హవా
కర్నూలు : కర్నూలు జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగిస్తోంది. జిల్లాలోని పలు మండలాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. జిల్లాలోని 53 జెడ్పీటీసీ, 785 ఎంపీటీసీ స్థానాలకు గత ఏప్రిల్ 6,11 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించారు. 53 జెడ్పీటీసీ స్థానాల్లో 196 మంది... 785 ఎంపీటీసీ స్థానాల్లో 2,213 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న ఎంపీటీసీ స్థానాలు .... * బేతంచర్ల మండలం ముద్దవరం *బేతంచర్ల మండలం సీతరామపురం * కోసిగి మండలం అడసనూరు * నంద్యాల మండలం పుట్లూరు *జూపాడు బంగ్లా మండలం మండ్లెం *జూపాడు బంగ్లా మండలం పప్పూరు *రాయచోటి మండలం మాధవరం * నంద్యాల మండలం నిష్ణ * పగిడ్యా మండలం నెహ్రునగర్ * నంద్యాల మండలం ఓడుమాలపురం * తుగ్గలి మండలం రాంపురం * ఎమ్మిగనూరు మండలం గుడికల్లు * నందికొట్కూరు మండలం శాసనకోట ఇక ఓట్ల లెక్కింపు జరుగుతున్న ప్రాంతాలు: కర్నూలు డివిజన్ : సిల్వర్ జూబ్లీ కళాశాల... బి.క్యాంప్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల. నంద్యాల డివిజన్ : కె.వి.సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆదోని డివిజన్ : ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల -
నర్వకాకిపల్లి ఎంపీటీసీ వైఎస్ఆర్ సీపీ కైవసం
కడప : వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలం నర్వకాకిపల్లి ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 82 ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. * పులివెందుల మండలం రాగిమానుపల్లె ఎంపీటీసీ వైఎస్ఆర్ కైవసం * టి.సుండుపల్లి ఎంపీటీసీ 900 ఓట్లతో వైఎస్ఆర్ కైవసం * పుల్లంపేట మండలం రంగంపల్లి ఎంపీటీసీ వైఎస్ఆర్ కైవసం * వైఎస్ఆర్ జిల్లాలో 24 ఎంపీటీసీలు ఏకగ్రీవం *వైఎస్ఆర్సీపీ 17, టీడీపీ -6, కాంగ్రెస్ 1 ఏకగ్రీవం * అట్లూరు మండలం కమలాపూర్‌లో బ్యాలెట్ పేపర్లు గల్లంతు -
'పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు'
-
కౌంటింగ్ కేంద్రంలో పాము కలకలం
విశాఖ: విశాఖ జిల్లా నర్సీపట్నం కౌంటింగ్ కేంద్రంలో మంగళవారం ఉదయం ఓ పాము కలకలం రేపింది. కౌంటింగ్ కేంద్రంలో ఒక్కసారిగా పాము ప్రత్యక్షంగా కావటంతో సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. అనంతరం పామును బయటకు పంపేందుకు చర్యలు చేపట్టారు. నర్సీపట్నం డివిజన్‌కు సంబంధించి నర్సీపట్నం, మాకవరపాలెం, కోటవురట్ల, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాలకు పెద్దబొడ్డేపల్లి వద్ద ఉన్న డాన్‌బాస్కో కాలేజ్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇక జిల్లాలో 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ స్థానాలకు రెండు దశల్లో గత నెల 6,11 తేదీల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. -
'మంచినీళ్లివ్వని మీకెందుకు ఓటేయ్యాలి'
చిత్తూరు : మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి సొంత మండలం కలిగిరిలో ఓటర్లు వినూత్నంగా తమ నిరసన తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటర్లు తమ సమస్యను ఓటర్ స్లిప్‌ల ద్వారా తెలిపారు. మంచినీళ్లు ఇవ్వని మీకు ఓట్లెందుకు వేయాలంటూ ఓటర్లు బ్యాలెట్ బాక్స్‌లో స్లిప్‌లు వేశారు. కాగా చిత్తూరు జిల్లాలోని 65 జెడ్పీటీసీ, 887 ఎంపీటీసీ స్థానాలకు ప్రజలు ఇచ్చిన తీర్పు నేడు బహిర్గతం కానుంది. జెడ్పీ పీఠాన్ని అధిరోహించాలంటే 33 జెడ్పీటీసీ స్థానాలను కైవశం చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాలెట్ పత్రాల రూపంలో ఇచ్చిన తీర్పును లెక్కించడానికి అధికారులు ఆరుచోట్ల కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో స్థానిక సంస్థలకు గత నెల మదనపల్లె, తిరుపతి, చిత్తూరు డివిజన్లకు రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. -
బ్యాలెట్ బాక్స్‌లో రూ.10 నోటు
గుంటూరు : గుంటూరు జిల్లా కర్లపాలెం బ్యాలెట్ బాక్స్ లో విచిత్రం చోటుచేసుకుంది. ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఓటుతో పాటు ఓ పది రూపాయల నోటు బయటపడింది. కాగా నల్లమోతువారిపాలెం బ్యాలెట్ బాక్స్ లో నాలుగు ఓట్లు గల్లంతు అయ్యాయి. మరోవైపు జిల్లాలోని 57 జడ్పీటీసీ, 887 ఎంపీటీసీ స్థానాల ఫలితాలపై అటు రాజకీయ పార్టీల్లోనూ, ఇటు బెట్టింగ్ రాయుళ్లలోనూ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏప్రిల్ 6,11 తేదీల్లో జిల్లాలో రెండు విడతలుగా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 57 జడ్పీటీసీ స్థానాలకు 208 మంది, 887 ఎంపీటీసీ స్థానాలకు 2,374 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక పల్లె తీర్పు ఎలా ఉండబోతోందనే అంచనాలు ప్రధాన రాజకీయ పార్టీల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి. వీరి భవిష్యత్తు మంగళవారం సాయంత్రానికి తేలనుంది. -
'పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు'
విజయవాడ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు సందర్భంగా కృష్ణాజిల్లా విజయవాడలో మంగళవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. సిద్ధార్థ మహిళా కళాశాల వద్ద కౌంటింగ్ కేంద్రం వద్ద ఏజెంట్లను లోనికి అనుమతించటం లేదంటూ వారు ఆందోళనకు దిగారు. ఎన్నికల నిబంధన ప్రకారం ఏజెంట్లను కేంద్రంలోకి అనుమతించాలని వారు పట్టుబడుతున్నారు. దాంతో పోలీసులకు, ఏజెంట్లకు మధ్య వాగ్వివాదం నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులకు, ఏజెంట్లకు మధ్య తోపులాట జరగటంతో ఉద్రికత్త నెలకొంది. పాసులు ఇచ్చి అనుమతించకపోవటం అవమానకరమని ఏజెంట్లకు ఆరోపిస్తున్నారు. అభ్యర్థితో పాటు ఏజెంట్‌ను కూడా కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని మండిపడుతున్నారు. మరోవైపు సీపీ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రారంభం
-
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రారంభం
హైదరాబాద్ : పల్లె పాలకులు ఎవరో నేడు తేలనుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీస్‌గా సాగిన పల్లె పోరులో పోటీ పడిన నేతల భవితవ్యం వెల్లడి కానుంది. ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు దశలుగా జరిగిన ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాల గడువు ముగిసి మూడేళ్లు గడిచిన తరువాత జరిగిన ఎన్నికలు కావడంతో పల్లె తీర్పుపై ప్రజలతో పాటు, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలోని మొత్తం 2,099 కేంద్రాల్లో 1093 జడ్పీటీసీ, 16,214 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కౌంటింగ్ ప్రక్రియలో 15 వేల మంది సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. -
‘స్థానిక’ వీరుడు ఎవరో?
చిత్తూరు(అర్బన్), న్యూస్‌లైన్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలఫలితాలు వెలువడ్డాయి. ఇక రెండో అంకం స్థానిక సంస్థల ఫలితాలు. జిల్లాలోని 65 జెడ్పీటీసీ, 887 ఎంపీటీసీ స్థానాలకు ప్రజలు ఇచ్చిన తీర్పు మంగళవారం బహిర్గతం కానుంది. జెడ్పీ పీఠాన్ని అధిరోహించాలంటే 33 జెడ్పీటీసీ స్థానాలను కైవశం చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాలెట్‌పత్రాల రూపంలో ఇచ్చిన తీర్పును లెక్కించడానికి అధికారులు ఆరుచోట్ల కేంద్రాలు ఏర్పాటు చేశారు. 35 లక్షలకు పైగా ఓట్లు జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించి గతనెల మదనపల్లె, తిరుపతి, చిత్తూరు డివిజన్లకు రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. మదనపల్లె డివిజన్లోని 31 మండలాల్లో జెడ్పీటీసీ స్థానాలకు 144 మంది పోటీ చేయగా 8,74,292 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీటీసీలకు 8,78,339 మంది బ్యాలెట్ ద్వారా ఓట్లు వేశారు. తిరుపతి డివిజన్లో 9,19,978 మంది, చిత్తూరులో 8,98,184 మంది ఓట్లు వేశారు. మొత్తం 35,70,793 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఓట్లన్నీ బ్యాలెట్ పత్రాల రూపంలో ఉండటంతో లెక్కింపునకు ఎక్కువ సమయం పట్టే అవకాశముంది. పూర్తిస్థాయి ఫలితాలు రాత్రి 10 గంటలకు తెలిసే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మ్యాజిక్ ఫిగర్ ఎవరికో? జెడ్పీ చైర్పర్సన్ స్థానం ఈసారి మహిళలకు కేటాయించిన విషయం తెలిసిందే. ఓసీ మహిళకు రావడంతో ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలంటే జిల్లాలోని 65 స్థానాలకుగానూ 33 ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీకే చైర్పర్సన్ స్థానం దక్కుతుంది. కౌంటింగ్ జరిగే ప్రాంతాలివే చిత్తూరు మండలంలోని చిత్తూరు, గుడిపాల, యాదమరి, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, పెనుమూరు, బంగారుపాళెం, తవణంపల్లె, ఐరాల, ఎస్ఆర్.పురం, వెదురుకుప్పం, రామచంద్రాపురం, వడమాలపేట, పుత్తూరు, పాలసముద్రం, కార్వేటినగరం, నారాయణవనం, నగరి, నిండ్ర, విజయపురానికి చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలను పూతలపట్టు మండల సమీపంలోని వేము ఇంజనీరింగ్ కళాశాలలో లెక్కిస్తారు. పలమనేరులో రామకుప్పం, గుడుపల్లె, శాంతిపురం, కుప్పం, పలమనేరు, గంగవరం, బెరైడ్డిపల్లె, వీ.కోట, రామసముద్రం, పెద్దపంజాణి, పుంగనూరు, చౌడేపల్లె, పీలేరు, ఎర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు, కేవీ.పల్లె, రొంపిచెర్ల, సదుం, సోమల మండలాలకు చెందిన బ్యాలెట్ పత్రాలను పలమనేరులోని మదర్ థెరిస్సా జూనియర్ కళాశాలలో లెక్కిస్తారు. మదనపల్లెలోని మాచిరెడ్డిగారిపల్లెలో ఉన్న కేశవరెడ్డి పాఠశాలలో నిమ్మనపల్లె, కలికిరి, కలకడ, వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాలకు చెందిన బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు. వశిష్ట పాఠశాలలో మదనపల్లె, కురబలకోట, బీ.కొత్తకోట, పెద్దమండ్యం, తంబళ్లపల్లె, పీటీఎం, ములకలచెరువు మండలాలకు సంబంధించి ఓట్లను లెక్కిస్తారు. తిరుపతిలోని శ్రీపద్మావతి డిగ్రీ కళాశాలలో పాకాల, చంద్రగిరి, తిరుపతి, రేణిగుంట, ఏర్పేడు, పులిచెర్ల, శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు, బీఎన్.కండ్రిగ, కేవీబీ.పురం, వరదయ్యపాళెం మండలాలకు సంబంధించి బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు. -
నేడు ‘పల్లె’ ఫలితాలు
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్: నెల రోజులపాటు కొనసాగిన ఉత్కంఠకు తెరపడనుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీస్‌గా సాగిన పల్లె పోరులో పోటీ పడిన నేతల భవితవ్యం మంగళవారం తేలనుంది. ఉదయం 8 గంటలకు ప్రాదేశిక ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్ 6, 11వ తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరిగారుు. జిల్లాలోని 50 జెడ్పీటీసీ స్థానాల్లో 337 మంది... 705 ఎంపీటీసీ స్థానాల్లో నాలుగు ఏకగ్రీవం కాగా, విగిలిన వాటిలో 2,989 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈ మేరకు ఓట్ల లెక్కింపు కోసం జిల్లాలోని ఐదు డివిజన్ల పరిధిలో ఏడు కేంద్రాలు కేటారుుంచారు. వరంగల్, నర్సంపేట, జనగామ డివిజన్లకు ఒకటి చొప్పున, మహబూబాబాద్, ములుగు డివిజన్లకు రెండు చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా మొత్తం 2,214 మంది అధికారులను నియమించారు. కౌంటింగ్‌కు మొత్తం 491 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ముందుగా ఎంపీటీసీ ఫలితాలు వెల్లడించిన అనంతరం జెడ్పీటీసీ ఫలితాలు వెలువడనున్నారుు. బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఫలితాలు ఆలస్యంగా వెలువడే అవకాశాలున్నారుు. బ్యాలెట్ బాక్స్‌లను తెరిచి 25 చొప్పున కట్టలు కట్టడం మధ్యాహ్నం వరకు సాగుతుంది. ఆ తర్వాతే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండడంతో పూర్తి స్థాయిలో ఫలితాలు కోసం అర్ధరాత్రి వరకు వేచి చూడాల్సిందే. మండలాలవారీగా కౌంటింగ్ కేంద్రాలు... ములుగు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట, ములుగు, వెంకటాపురం మండలాల ఓట్ల లెక్కింపునకు ములుగులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కేంద్రం ఏర్పాటు చేశారు. అదేవిధంగా.. భూపాలపల్లి, మొగుళ్లపల్లి, శాయంపేట, గణపురం, చిట్యాల, పరకాల, రేగొండ మండలాల ఓట్ల లెక్కింపును పరకాలలోని గణపతి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు. నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని చెన్నారావుపేట, దుగ్గొండి, గూడూరు, ఖానాపురం, కొత్తగూడ, నల్లబెల్లి, నర్సంపేట మండలాల ఓట్ల లెక్కింపు కోసం నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కేంద్రం ఏర్పాటు చేశారు. జనగామ డివిజన్ పరిధిలో స్థానిక ప్రసాద్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో బచ్చన్నపేట, చేర్యాల, దేవరుప్పుల, జనగామ, కొడకండ్ల, లింగాల ఘనపురం, మద్దూరు, నర్మెట, పాలకుర్తి, రఘునాథపల్లి మండలాల ఓట్లను లెక్కించనున్నారు. మహబూబాబాద్ డివిజన్ పరిధిలోని కేసముద్రం, కురవి, మహబూబాబాద్, నర్సింహులపేట, నెల్లికుదురు మండలాల్లోని ఓట్ల లెక్కింపు కోసం ఏపీ మోడల్ స్కూల్(అనంతారం)లో... మరిపెడ, తొర్రూరు, నెక్కొండ, డోర్నకల్ మండలాల ఓట్ల లెక్కింపునకు మానుకోటలోని ఫాతిమా హైస్కూల్లో కేంద్రం ఏర్పాటు చేశారు. వరంగల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆత్మకూరు, ధర్మసాగర్, గీసుకొండ, స్టేషన్‌ఘన్‌పూర్, హన్మకొండ, హసన్‌పర్తి, పర్యతగిరి, రాయపర్తి, సంగెం, వర్ధన్నపేట, జఫర్‌గఢ్ మండలాల ఓట్ల లెక్కింపు కోసం జిల్లాకేంద్రంలోని నిట్‌లో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. -
కౌంటింగ్‌ను పరిశీలించిన ఎస్పీ
గుడివాడ అర్బన్, న్యూస్‌లైన్ : స్థానిక అక్కినేని నాగేశ్వరరావు కళాశాల్లోని కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు సోమవారం పరిశీలించారు. కౌంటింగ్ వివరాలను మున్సిపల్ కమిషనర్ ఎన్.ప్రమోద్‌కుమార్, ఆర్డీవో ఎస్.వెంకటసుబ్బయ్య, కార్యాలయపు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే సిబ్బందికి తెలియజేయాలని అధికారులకు సూచించారు. మంచినీళ్లు ఏర్పాటు చేయలేదని, తాగడానికి బయటకు వెళ్తుంటే పోలీసులు మరలా లోపలికి రానివ్వడం లేదంటూ పలు వార్డుల అభ్యర్థులు ఎస్పీ దృష్టికి తీసుకురాగా... స్పందించిన ఎస్పీ డిఎస్పీ జి.నాగన్నను పిలిచి మంచినీళ్లు ఏవి అని ప్రశ్నించారు. మున్సిపల్ సిబ్బంది ఏర్పాటు చేయలేదని డీఎస్పీ బదులిచ్చారు. దీంతో రూమ్‌లో ఓ పక్కన మంచినీళ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఎస్పీని ఆదేశించారు. దీంతో ఎస్పీ వెళ్లిన అరగంట తరువాత మంచినీళ్లు ఏర్పాటు చేశారు. మచిలీపట్నంలో... మచిలీపట్నం క్రైం : హిందూ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని ఎస్పీ జె ప్రభాకరరావు సందర్శించారు. ఉదయం 9 గంటల సమయంలో కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన బందోబస్తులో పాల్గొన్న సిబ్బంది పనితీరును పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి ఘటనలు జరిగినా తక్షణమే తనకు సమాచారం అందించాలని డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలకు ఆయన సూచించారు -
ప్రాదేశిక ఫలితాలు నేడే
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. జిల్లాలోని 49 జెడ్పీటీసీ, 812 ఎంపీటీసీ స్థానాలకు గత నెలలో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. బ్యాలెట్ పత్రాల ద్వారా ఈ ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. వీటి లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. జిల్లాలో 49 జెడ్పీటీసీ స్థానాలకు 177 మంది, 812 ఎంపీటీసీ రీ-పోలింగ్ నేడే మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని జిల్లాలోని ఐదు అసెంబ్లీ, ఐదు లోక్‌సభ స్థానాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో మంగళవారం రీ-పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల ఏడో తేదీన నిర్వహించిన సాధారణ ఎన్నికల పోలింగ్‌లో ఈవీఎంలలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో రీ-పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు తెలిపారు. జిల్లాలో పది పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్ జరుగుతున్నందున 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఒపీనియన్ పోల్స్ ప్రకటించటంపై నిషేదం విధించినట్లు కలెక్టర్ చెప్పారు. -
టెన్షన్...టెన్షన్!
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్ : జిల్లావ్యాప్తంగా 34 జెడ్పీటీసీ, 542 ఎంపీటీసీ స్థానాలకు గత నెల 6,11 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించి మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కౌంటింగ్‌కు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేశారు. లెక్కింపులో ఎలాంటి అక్రమాలు జరగకుండా అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 34 జెడ్పీటీసీ స్థానాలకు 135 మంది బరిలో ఉన్నారు. 542 ఎంపీటీసీ స్థానాలకు 1,489 మంది పోటీ చేశారు. పార్వతీపురం డివిజన్లో 15 జెడ్పీటీసీ స్థానాలకు 54 మంది, 225 ఎంసీటీసీ స్థానాలకు 605 మంది పోటీ పడ్డారు. విజయనగరం డివిజన్లో 19 జెడ్పీటీసీ స్థానాలకు 81 మంది, 317 ఎంపీటీసీ స్థానాలకు 884 మంది పోటీ చేశారు. గత నెల 6వ తేదీన పార్వతీపురం డివిజన్లో, 11వ తేదీన విజయన గరం డివిజన్లో ఎన్నికలు జరిగాయి. పార్వతీపురం డివిజన్ కు పార్వతీపురంలోను, విజయనగరం డివిజన్‌కు విజయనగరంలోను ఓట్లు లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. పార్వతీపురం డివిజన్‌కు సంబంధించి పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఐదు మండలాలు, ఆర్సీఎం గర్ల్స్ హైస్కూల్లో ఐదు మండలాలు, ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఐదు మండలాలకు చెందిన ఓట్లు లెక్కించనున్నారు. విజయనగరం డివిజన్‌కు సంబంధించి ఎంఆర్ కళాశాలలో 9 మండలాలకు, ఎంఆర్ మహిళా కళాశాలలో 10 మండలాల కు చెందిన ఓట్లు లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు ఇలా పార్టీల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు పోలై న ఓట్లను ముందు కట్టలుగా కడతారు. ఆ తరువాత వాటిని లెక్కిస్తారు. అందులో ముందుగా ఎంపీటీసీ ఓట్లను, ఆ తరువాత జెడ్పీటీసీ ఓట్లను లెక్కిస్తారు. తొలి ఫలితం మధ్యాహ్నం రెండుగంటల లోగా, తుది ఫలి తం రాత్రి ఎనిమిది గంటలకు వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మండలానికి 50 మంది చొప్పున కౌంటింగ్ సిబ్బందిని నియమించినట్టు జిల్లా పరిషత్ ఏఓ శ్రీధర్ రాజా తెలిపారు. గొడవలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఓట్ల లెక్కింపులో భాగంగా తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం బ్యాలెట్ బ్యాక్సుల్లో ఓట్లను లెక్కించనున్నారు. ఓట్లు లెక్కించే గదిలోకి సెల్ఫోన్లను అనుమతించరు. కౌంటింగ్‌కు హాజరయ్యే ఏజెంట్లు సెల్ఫోన్లను బయట వదిలివెళ్లాలి. కౌంటింగ్ కేంద్రాల వద్ద మీడియా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఫలితాలను మైక్ ద్వారా వెల్లడిస్తారు. -
‘స్థానిక’ తీర్పు నేడే
* జెడ్పీటీసీ స్థానాలు: 46 * పోటీ చేసిన అభ్యర్థులు: 236 * ఎంపీటీసీ స్థానాల సంఖ్య: 685 * పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య: 2,583 సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ఉత్కంఠకూ తెరపడనుంది. వీటి ఫలితాల కోసం ఇటు అభ్యర్థులు.. అటు ప్రజలు సుమారు నెల రోజులకు పైగా నిరీక్షిస్తున్నారు. జిల్లాలోని 46 జెడ్పీటీసీ, 685 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతలుగా జరిగిన విషయం విదితమే. గత నెల 6న 24 మండలాలు, 11న 22 మండలాలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. కాగా ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో మండలాల వారీగా ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సంగారెడ్డిలో 15 మండలాలు, మెదక్‌లో 18 మండలాలు, సిద్దిపేటలో 13 మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సోమవారం సమీక్షించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు. మరోవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. మండలానికి పది కౌంటర్లు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ మండలాల వారీగా జరగనుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్లను లెక్కిస్తారు. ప్రతి మండలానికి పది చొప్పున కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో కౌంటర్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, ముగ్గురు కౌంటింగ్ సిబ్బంది ఉంటారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలను 25 చొప్పున బండిళ్లు కడతారు. ఇలా కట్టిన బండిళ్లను ఒకచోట డ్రమ్ములోచేర్చి ఆ తర్వాత వెయ్యి చొప్పున కౌంటింగ్ సిబ్బందికి అందజేస్తారు. ఐదు టేబుల్స్‌లో జెడ్పీటీసీ, ఐదు టేబుల్స్‌లో ఎంపీటీసీ ఓట్లను లెక్కిస్తారు. ఇదిలా ఉంటే బ్యాలెట్ పత్రాల ఓట్ల లెక్కింపునకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీంతో ఫలితాలు వెల్లడి జాప్యమయ్యే అవకాశం ఉంది. మొదటగా ఆర్సీపురం ఫలితాలు చివరగా జహీరాబాద్, పటాన్చెరు మండలాల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జెడ్పీ చైర్మన్ పదవి ఏ పార్టీకి దక్కుతుందోనని పార్టీలతోపాటు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ ఎస్ పార్టీలు తామంటే తాము మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గత ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయిగా ఉంది. అయితే తెలంగాణ సాధించామన్న ధీమాతో ఉన్న టీఆర్ఎస్ గ్రామీణ ఓటర్లు తమ పార్టీకి పట్టం కడతారని ఆశిస్తోంది. ఏ పార్టీకి మెజార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు వస్తాయో వేచి చూడాల్సి ఉంది. కౌంటింగ్ కేంద్రాల వివరాలు సంగారెడ్డి ఎంపీపీ కార్యాలయం: సంగారెడ్డి మండలం తారా డిగ్రీ కళాశాల: సదాశివపేట, కొండాపూర్, ఆర్సీపురం, మునిపల్లి, రాయికోడ్, ఝరాసంగం మహిళా ప్రాంగణం(సంగారెడ్డి): పటాన్చెరు, న్యాల్కల్, కోహీర్, మనూర్ పాత డీఆర్డీఏ కార్యాలయం(సంగా రెడ్డి): నారాయణఖేడ్, కంగ్టి, కల్హేర్ రాయల్ డిగ్రీ కాలేజ్(మెదక్): పాపన్నపేట, పెద్దశంకరంపేట, చేగుంట, అల్లాదుర్గం, రేగోడ్, మెదక్, కొల్చా రం, నర్సాపూర్, పుల్కల్, వెల్థుర్తి, జిన్నారం, శివ్వంపేట, హత్నూర {పభుత్వ డిగ్రీ కాలేజ్(మెదక్): టేక్మాల్, రామాయంపేట, చిన్నశంకరంపేట, అందోలు, కౌడిపల్లిఇందూరు బీఈడీ, ఇంజినీరింగ్ కళాశాల భవనం(సిద్దిపేట): మిరుదొడ్డి, జగదేవ్‌పూర్, నంగనూరు, దుబ్బాక, కొండపాక, చిన్నకోడూరు, సిద్దిపేట, ములుగు, దౌల్తాబాద్, వర్గల్, గజ్వేల్, తొగుట, తూప్రాన్. -
తేలనున్న నే‘తల రాత’
సదాశివపేట, న్యూస్‌లైన్: మున్సిపల్, ప్రాదేశిక ఫలితాలపై నెల కొన్న ఉత్కంఠకు రెండు రోజుల్లో తెరపడనుం ది. ఈనెల 12న మున్సిపల్, 13న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కిపు జరుగనుంది. అదేరోజు ఫలితాలు వెలువడుతాయి. అయితే అభ్యర్థు ల్లో ఫలితాల టెన్షన్ నెలకొంది. సదాశవపేట పట్టణంలోని మున్సిపల్, మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు హోరాహోరిగా జరి గాయి. మున్సిపల్ ఎన్నికల్లో 132 మంది కౌన్సిలర్ అభ్యర్థులుగా, జెడ్పీటీసీ అభ్యర్థులుగా నలుగురు, ఎంపీటీసీ సభ్యులుగా 54 మంది బరిలో నిలిచారు. గెలిచేందుకు శతవిధాలుగా ప్రయత్నించి అన్ని అస్త్రాలను ఉపయోగించా రు. తమ స్థాయి కంటే అధికంగా డబ్బులు ఖర్చు చేశారు. కొందరు అభ్యర్ధులు స్థలాలు, పొలాలు, నగలు తాకట్టు పెట్టి మరి డబ్బులు తెచ్చి ఎన్నికల్లో ఖర్చుపెట్టారు. అయినా తమను గెలుపు వరిస్తుందా లేదా అన్న గుబు లు వారిలో నెలకొంది. ఫలితాలు అనుకులం గా వస్తే సరి లేకుంటే తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన అభ్యర్ధులను వేధిస్తోంది. ఫలితాలు అనుకూలంగా రాకుంటే కొందరు అభ్యర్థులు దివాలు తీసే పరిస్థితి ఉందని సమాచారం. మళ్లీ వేడెక్కుతున్న రాజకీయం జోగిపేట: స్థానిక ఓట్ల లెక్కింపు ఫలితాల తేదీ సమీపించడంతో మళ్లీ పల్లెలు, పట్టణాల్లో రాజకీయం వేడెక్కింది. ఎవరు గెలుస్తారన్న విషయమై చిన్నా చితక పందేలు గ్రామాల్లో ఊపందుకున్నాయి. ఇన్నాళ్లు సార్వత్రిక ఎన్నికల మాటున మరచిపోయిన అభ్యర్థుల్లో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. నెల రోజుల నిరీక్షణ అనంతరం ఫలితాలు వస్తున్నాయని అభ్యర్థులు ఊపిరి పీల్చుకుంటుండగా, మున్సిపల్, జడ్పీ, మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికలపై మళ్లీ ఉత్కంఠే నెలకొంది. ఈ పదవుల ఎన్నికకు ఎన్నికల కమిషన్ ఇంకా ఎలాంటి అధికార ఆదేశాలు ఇవ్వకపోవడంతో జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అవతరించనుండడంతో సందిగ్దం నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత ఈ పదవులకు పరోక్ష ఎన్నిక ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో ఎమ్మెల్యే, ఎంపీల ఓటు కీలకం కానుంది. మరిన్ని రోజులు మున్సిపల్ చెర్మైన్, పరిషత్ చైర్మన్లపై ఆశలు పెట్టుకున్న వారికి మరిన్ని రోజులు నిరీక్షణ తప్పడంలేదు. చైర్మన్ పీఠంపై పార్టీల గురి వరుసగా మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు వెలువడుతుండడంతో ఇప్పుడు అన్ని పార్టీలు చైర్మన్ పీఠంపై గురి పెట్టాయి. ఈ పదవులను కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. తమ అభ్యర్థులను బరిలో నిలిపిన అన్ని పార్టీలు ఆ దిశగా పావులు కదుపుతున్నాయి. తమకు ఎన్ని స్థానాలు వస్తాయి..స్పష్టమైన మెజార్టీకి ఇంకా ఎన్ని స్థానాలు అవసరమవుతాయి.. స్వతంత్రులు ఎంత మంది గెలుస్తారు..చిన్న పార్టీలకు ఎన్ని స్థానాలు వస్తాయి వారిని మనవైపు ఎలా త్రిప్పుకోవాలి..అనే ఆంశాలపై చర్చల్లో మునిగారు. క్యాంపులంటేనే బెంబేలు మున్సిపల్, జడ్పీ, పరిషత్ చైర్మన్ ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ రాకపోవడంతో ఫలితాలు వెలువడిన తర్వాత క్యాంపులంటేనే పదవులు ఆశిస్తున్న అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. ఫలితాలు వచ్చిన పది రోజుల్లోగా పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తే క్యాంపుల నిర్వాహణ పెద్ద భారం కాదు. కానీ ఈసారి ఫలితాలు వెలువడిన చాలా రోజుల తర్వాత పరోక్ష ఎన్నికలు జరుగనుండడంతో క్యాంపులంటేనే పార్టీల నేతలు, పదవులు ఆశించే వారు హడలెత్తిపోతున్నారు. ఎన్నికల కమిషన్ ఈఎన్నికలపై ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం. -
టెన్షన్.. టెన్షన్
కామారెడ్డి, న్యూస్‌లైన్ : ఒకదాని వెంట ఒకటిగా జరిగిన ఎన్నికలకు సంబంధించి ఫలితాల కోసం మరోవా రం రోజులు ఆగాల్సిన పరిస్థితి ఉంది. దీంతో అభ్యర్థులు, వారి అనుచరుల్లో టెన్షన్ పెరుగుతోంది. మార్చి 30న జరిగిన మున్సిపల్ ఎన్నికలు, ఏప్రిల్ 06 ,11 తేదీల్లో రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 30న నిర్వహించా రు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్‌పై కోర్టులు తీర్పు ఇచ్చాయి. దీంతో ఫలితాలు సార్వత్రిక ఎన్నికల అనంత రానికి వాయిదా పడ్డాయి. కోర్టుల ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఈనెల 12న, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ 13న, సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ 16న జరగనున్నాయి. దీంతో మరో వారం రోజుల వరకు అందరూ టెన్షన్‌తో గడపాల్సిందే. ముఖ్యంగా ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులు, కార్యకర్తలు ఫలితాల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాల టెన్షన్‌తో ఆయా పార్టీల అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు ఏ పని చేసుకోలేకపోతున్నారని తెలిసింది. ఇంటిపట్టున ఉన్న సమయంలో నేతలు, కార్యకర్తలు రోజూ తమ గెలుపు ఓటముల గురించి చర్చించుకోవడం, టెన్షన్ ను తగ్గించుకునేందుకు కొందరు మద్యం సేవించడం ద్వారా ఆ రోజు గడిపేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు వారం రోజుల గడువు ఉండడంతో ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. తెల్లవారే మండల, జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ ఉండడంతో కొంత ఊరట కలుగుతోందని భావిస్తున్నారు. మరో రెండు రోజులకే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. అయితే కౌంటింగ్‌కు మిగిలిన వారం రోజుల సమయం గడపడం భారంగా మారింది. విహారయాత్రలతో రిలీఫ్.. ఎన్నిక ల్లో పోటీచేసిన అభ్యర్థులు కొందరు విహారయాత్రలకు వెళ్లినట్టు తె లిసింది. వేసవి ఎండలు ఎక్కువగా ఉండడంతో కొందరు గోవా, ఊటీకి, ఆర్థికంగా ఉన్నవారు ఇతర దేశాలకు వెళ్లినట్టు సమాచారం. మరికొందరు విహారయాత్రలకు వెళ్లడానికి ప్రిపేర్ అవుతున్నారు. కొందరు నేతలు, కార్యకర్తలు వారివారి కుటుంబసభ్యులతో కలిసి దేవాలయాల దర్శనాలకు ప్లాన్ చేసుకున్నారు. ఇంకొందరు బంధువుల ఇళ్లకు తిరుగుతున్నారు. మొత్తమ్మీద ఫలితాల టెన్షన్ అందరినీ వెన్నాడుతోంది. గెలుస్తామో, ఓడుతామో తెలియని పరిస్థితుల్లో చాలామంది నేతలు, అభ్యర్థులు కౌంటింగ్ సమయం దగ్గర పడేదాక స్థానికంగా ఉండకూడదనే భావనతో టూర్లకు వెళుతున్నారు. ఫలితాలు ఎవరిని ముంచుతామో.. ఎవరిని గట్టెక్కిస్తాయో వేచి చూడాల్సిందే. -
స్ట్రాంగ్ రూముల్లో ‘స్థానిక’ బ్యాలెట్లు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ముగిసినప్పటికీ లెక్కింపును కోర్టు వాయిదా వేయడంతో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూముల వద్ద కట్టు దిట్టమైన భద్రతతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఈ నెల 6వ తేదీన భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, 11వ తేదీన ఖమ్మం డివిజన్ల లో ఎన్నికలు నిర్వహించిన విషయం విది తమే. ఎన్నికల అనంతరం భద్రాచలం రెవె న్యూ డివిజన్ పరిధిలోని ఎనిమిది మండలాల బ్యాలెట్ బాక్సులను భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భద్రపరిచారు. పాల్వంచ డివిజన్లోని మూడు మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్సులను మణుగూరులోని స్త్రీ శక్తిభవనంలో, మరో మూడు మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్సులను పాల్వంచలోని కేఎల్ఆర్ డిగ్రీ కళాశాలలో భద్రపరిచారు. కొత్తగూడెం డివిజన్లోని ఆరు మండలాలకు చెందిన బ్యా లెట్ బాక్సులను పాత ఇల్లెందులోని సింగరేణి ఉన్నత పాఠశాలలో భద్రపరిచారు. మరో ఐదు మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్సులను కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాలలో భద్రపరిచారు. సత్తుపల్లిలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో పాల్వం చ డివిజన్లోని దమ్మపేట, అశ్వారావుపేట మండలాలు, ఖమ్మం డివిజన్లోని నాలుగు మండలాల బ్యాలెట్ బాక్సులను భద్రపరి చారు. మిగిలిన ఖమ్మం డివిజన్లోని 13 మండలాల బ్యాలెట్ బాక్సులను కొణిజర్ల మండలంలోని తనికెళ్ల గ్రేస్ జూనియర్ కళాశాలలో భద్రపరిచారు. వచ్చే నెల 12, 15 తేదీల్లో ఓట్లను లెక్కించేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థులకు తప్పని ఎదురు చూపులు.. ఇప్పటికే ఎన్నికలు ముగిసి 12 గడుస్తుండడం, సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని లెక్కింపును కోర్టు వాయిదా వేయడంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. -
ఓటు హక్కు ప్రాధాన్యం గుర్తించాలి
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్:ఓటు హక్కు ప్రాధాన్యం గుర్తించి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ సూచించారు. అమరావతిరోడ్డులో నగరాలులోని నవీన విద్యాలయంలో సోమవారం ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నగరాల్లో 65 శాతం మంది ప్రజలే ఓటింగ్‌లో పాల్గొన్నారని, గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం పోలింగ్ నమోదు కాగా, నగరానికి చేరువలో ఉన్నా ఇక్కడ తక్కువ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం విచారకరమని తెలిపారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవ్వరూ నచ్చని పక్షంలో దానిని వ్యక్తపరిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలపై ప్రత్యేక బటన్ కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. సాధారణ ఎన్నికలకు వారం రోజుల ముందుగానే బూత్ స్థాయి అధికారులు ఇంటిం టికీ తిరిగి ఓటర్లకు స్లిప్పులు అందజేయాలని ఆదేశించారు. పోలింగ్ జరిగే రోజున వచ్చే వారికి పోలింగ్ కేంద్రం వద్ద స్లిప్పులు అందజేయాలన్నారు. నగరాలులోని బూత్ స్థాయి అధికారి ఓ బూత్‌లో 1200 మంది ఓటర్లు ఉండగా, వారిలో 200 మంది వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాలకు వెళ్లారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ వారి పూర్తి వివరాలు సేకరించి, ఓటు వేసేందుకు వచ్చిన సమయంలో తగిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలని సూచించారు. సదస్సుకు హాజరైన బూత్ స్థాయి అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, రిటైర్డు ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గుంటూరు చౌత్రా సెంట ర్లోని చలమయ్య జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్వో కె. నాగబాబు, ఆర్డీవో బి.రామమూర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ పి.నాగవేణి పాల్గొన్నారు. లాడ్జి సెంటర్లో ... పటిష్ట రాజ్యాంగ రూపకల్పనతో దేశానికి సార్వభౌమాధికారం కల్పించిన అంబేద్కర్ స్ఫూర్తితో సమ సమాజ స్థాపనకు నడుం బిగించాలని జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ పిలుపునిచ్చారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం లాడ్జి సెంటర్లోని ఆయన విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో పౌరులందరికీ సమాన హక్కులు దక్కాలని ఆశించిన అంబేద్కర్ ఆశయాలు అనుసరణీయమన్నారు. కార్యక్రమంలో డీఆర్వో కె. నాగబాబు, ఆర్డీవో బి.రామమూర్తి పాల్గొని అంబేద్కర్‌కు నివాళులర్పించారు. -
పంచడమే తప్పు... అందులోనూ దొంగ నోట్లా..!
-
ఉద్రిక్తతల మధ్య మలి విడత పోలింగ్
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా జిల్లాలో శుక్రవారం రెండో విడత పోలింగ్ ఉద్రిక్తతల నడుమ ముగిసింది. పలు చోట్ల ఘర్షణలు, ఓటర్ల నిరసనలు, పోలీసుల లాఠీచార్జీలు తదితర ఘటనలు చోటుచేసుకున్నాయి. గరివిడి మండలం తోండ్రంగిలో ఓటు వేసేందుకు క్యూలో నిలుచున్న ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. మెరకముడిదాం మండలం రామాయవలస, గాతాడలలో ఓట్లు తారుమారవడంతో పోలింగ్ నిలిచిపోయింది. 19 జెడ్పీటీసీ, 317 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగగా, మొదట్లో మందకొడిగా సాగిన ఓటింగ్ తరువాత పుంజుకుంది. మొత్తం 8,05,532 ఓట్లకు గాను జెడ్పీటీసీ అభ్యర్థులకు 6,94,204, ఎంపీటీసీలకు 6,91,844ఓట్లు పోలయ్యాయి. జెడ్పీటీసీలకు 86.43 శాతం, ఎంపీటీసీకు 86.35 పోలింగ్ శాతం నమోదైంది. అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద నుంచి బ్యాలెట్ల పెట్టెలను స్ట్రాంగ్‌రూంలకు తరలించారు. 2,538 బ్యాలెట్ బాక్సుల్లో ఓటర్ల తీర్పు నిక్షిప్తమై ఉంది. ఎస్.కోట మండలం రేవళ్లపాలెంలో చిన్న సందులో పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. మొత్తం 18 గిరిజన గ్రామాలకు చెందిన నాలుగువేల మంది ఓటర్లు ఇక్కడ సందులోనే ఓటు వేయాల్సి వచ్చింది. గజపతినగరం మండలం జిన్నాం గ్రామంలో పోలీసులు జులుం ప్రదర్శించడంతో ఆగ్రహించిన స్థానికులు పోలింగ్‌ను గంటపాటు నిలిపి వేశారు. విజయనగరం డివిజన్లోని పలు ప్రాంతాల్లో కలెక్టర్ కాంతిలాల్ దండే పర్యటించి పోలింగ్ తీరును గమనించారు. ఎక్కడయినా చిన్న సమస్యలుంటే వాటిని పరిష్కరించారు. డివిజన్లోని ధర్మవరం, అలమండ, గంట్యాడ, కొత్తవలస, బొద్దాం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఆయన పర్యటించారు. -
ఇక సార్వత్రిక సమరం
పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ రాష్ర్ట విభజన అనంతరం తొలి పోరు రాష్ట్ర భవితవ్యాన్ని మార్చనున్న ఎన్నికలు నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ 19న ఆఖరు.. అయితే 5 రోజులే అవకాశం మండే ఎండలకు తోడు కానున్న రాజకీయ వేడి కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ :కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు మార్చి 30న ముగిశాయి. రెండు విడతల జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు శుక్రవారంతో పూర్తయ్యాయి. ఇక కీలకమైన సార్వత్రిక ఎన్నికల ఘట్టం శనివారం నుంచి మొదలవనుంది. రాజకీయ పార్టీల దశ దిశ మార్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ మార్చి 5న విడుదలైంది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి.. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇదే రోజు నుంచి నామినేషన్లు దాఖలు చేసుకునే వీలుంది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కలెక్టర్ చాంబర్, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నంద్యాల ఆర్డీఓ చాంబర్లో రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి గూడూరు, శ్రీశైలం నియోజకవర్గానికి సంబంధించి ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయాల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మిగిలిన ఆయా నియోజకవర్గ తహశీల్దార్ కార్యాలయాల్లో రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు ఈనెల 19 వరకు అవకాశం ఉన్నా 13, 14, 18వ తేదీలు సెలవులు కావడంతో నామినేషన్ల దాఖలుకు అవకాశం లేదు. 12, 15, 16, 17, 19 తేదీల్లో మాత్రమే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తారు. 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్లకు గడువు పూర్తి కానుంది. 21న నామినేషన్లను పరిశీలన.. 23న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. నామినేషన్ల దాఖలుకు రిటర్నింగ్ అధికారి చాంబర్లోకి పోటీ చేసే అభ్యర్థి సహా ఐదుగురిని మాత్రమే అనుమతిస్తారు. ఆర్డీఓ కార్యాలయ ప్రధాన గేటుకు 100 మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేయాల్సి ఉంది. నామినేషన్ సందర్భంగా ఊరేగింపులు నిర్వహించుకోవాలంటే పోలీసు అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. అయితే బాణసంచా పేల్చరాదనే నిబంధన విధించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఎండలు మండిపోతుండగా.. నామినేషన్ల దాఖలుకు తెర లేవడంతో రాజకీయ వేడి మరింత ఉక్కిరిబిక్కిరి చేయనుంది. రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వహిస్తున్న ఈ ఎన్నికలు విభజనకు కారణమైన పార్టీల్లో గుబులు పుట్టిస్తున్నాయి. -
పల్లెల్లో ఫ్యాన్ గాలి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అదే స్పీడ్.. అదే జోష్.. పల్లెసీమల్లో ఎక్కడ చూసినా ఫ్యాన్ గాలే.. వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలే. తొలివిడతలో పోలింగ్ సీనే.. తుది విడతలోనూ రిపీట్ అయ్యింది. ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సాధించడం దాదాపు ఖాయమైంది. రెండు విడతల్లో జరిగిన జెడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికల ఓటింగ్ సరళి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. తొలిసారి తలపడుతున్న ప్రాదేశిక ఎన్నికల పోరులోనే పార్టీ జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోనుంది. సార్వత్రిక ఎన్నికలకు నెలరోజుల ముందు జరిగిన ప్రాదేశిక పోరులో ప్రజాతీర్పు అధికారికంగా వెల్లడికాకపోయినా.. ఆ సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. దాంతో వైఎస్సార్సీపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో కీలకమైన సార్వత్రిక సమరానికి సిద్ధమవుతున్నాయి. తిరుగులేని ఆధిక్యం ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. జిల్లాలోని అత్యధిక మండలాల్లో తన ప్రధాన ప్రత్యర్థి టీడీపీ కంటే తిరుగులేని ముందంజలో ఉంది. సాంకేతిక కారణాలతో నరసన్నపేట జెడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైనా పార్టీ నిరుత్సాహ పడలేదు. పైగా రెట్టించిన పోరాట పటిమతో ఎన్నికల రణరంగంలోకి దూకింది. ఈ నెల 6న మొదటి విడతలో పోలింగ్ జరిగిన 17న జెడ్పీటీసీ స్థానాల్లో అత్యధికం ఫ్యాన్ ఖాతాలోకి వెళ్లనున్నాయి. కనీసం 12 జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకోనుంది. టీడీపీకి 4 స్థానాల్లోనే విజయావకాశాలు ఉన్నాయి. మరో స్థానంలో రెండు పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇక రెండో విడతగా శుక్రవారం 20 జెడ్పీటీసీలకు జరిగిన ఎన్నికల్లోనూ అదే పునరావృతమైంది. కనీసం 13 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయభేరి మోగించనుందని స్పష్టమైంది. టీడీపీకి 3 జెడ్పీటీసీ స్థానాల్లోనే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. మరో 4 స్థానాల్లో ఇరుపార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. వెరసి జిల్లాలో కనీసం 25 జెడ్పీటీసీ స్థానాలను సాధించడం ద్వారా వైఎస్ఆర్సీపీ జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవడం ఖాయమైంది. టీడీపీ సింగిల్ డిజిట్ మార్క్ దాటడం గగనంగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల జోష్! సార్వత్రిక ఎన్నికలకు నెలరోజుల ముందు జరిగిన ప్రాదేశిక ఎన్నికలు వైఎస్సార్సీపీలో జోష్‌ను అమాంతంగా పెంచాయి. ప్రధానంగా మారుమూల పల్లెలకు కూడా పార్టీ గుర్తు ఫ్యాన్ సుపరిచితమైంది. ఇంతకాలం పార్టీపట్ల ప్రజల్లో తిరుగులేని ఆదరణ ఉందని తెలిసినప్పటికీ గుర్తుపై ఎంతవరకు ఆవగాహన ఉందోనన్న సందేహం వెంటాడేది. కానీ ప్రాదేశిక ఎన్నికల పుణ్యమా అని మారుమూల పల్లె ఓటర్లకు కూడా వైఎస్సార్సీపీ గుర్తు ఫ్యాన్ అని పూర్తి అవగాహన వచ్చేసింది. ఇక ప్రాదేశిక ఎన్నికలతో చేకూరిన మరో ప్రధాన ప్రయోజనం.. బూత్‌స్థాయిలో పటిష్ట నాయకత్వం ఏర్పడటం. తొలిసారి సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కొంటున్నందున బూత్‌స్థాయిలో నాయకత్వంపై కొంతవరకు సందిగ్ధత ఉండేది. కానీ ఎమ్పీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో జిల్లావ్యాప్తంగా అన్ని బూత్స్థాయిల్లోనూ పార్టీ కమిటీలు పటిష్టమయ్యాయి. వచ్చే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవడం పార్టీకి సులభతరం కానుంది. ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆదరణను ఓట్లరూపంలోకి మార్చగల యంత్రాంగం రూపొందింది. దాంతో వైఎస్సార్సీపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో సార్వత్రిక ఎన్నికల సమరానికి కదంతొక్కుతున్నాయి. -
మలిదశలో మరింత జోరు
సాక్షి, గుంటూరు: మలి విడత పరిషత్తు ఎన్నికల్లో ఓటర్లు మరింత చైతన్యం కనబరిచారు. ఎండ తీవ్రతను కూడా లెక్క చేయకుండా ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. తొలిదశలో 85.10 శాతం పోలింగ్ నమోదు కాగా శుక్రవారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో సగటున 85.79 శాతం నమోదైంది. గుంటూరు డివిజన్లో 87.01 శాతం, గురజాల డివిజన్లో 83.26 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 28 మండలాల్లో జరిగిన రెండో దశ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తుళ్ళూరు మండలంలో అత్యధికంగా 91.18 శాతం నమోదు కాగా, అత్యల్పంగా గురజాల మండలంలో 80.34 శాతం నమోదైంది. ఈ రెండు డివిజన్లలో మొత్తం 11,30,636 మంది ఓటర్లుంటే, 9,69,979 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సరళిని పరిశీలించిన అధికారులు.. సత్తెనపల్లి నియోజకవర్గంలోని కంటెపూడి, ధూళిపాళ్లలో పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టరు ఎస్.సురేశ్‌కుమార్ పరిశీలించి పోలింగ్ సరళి తెలుసుకున్నారు. పల్నాడు ప్రాంతమైన మాచర్లలో జిల్లా కలెక్టరు, రూరల్ ఎస్పీలు మకాం వేసి పర్యవేక్షించారు. మంగళగిరి రూరల్ మండలంలో పోలింగ్ సరళిని అర్బన్ ఎస్పీ గోపీనాథ్, జేసీ వివేక్‌యాదవ్‌లు పరిశీలించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కండ్లకుంటలోను, వైఎస్సార్ సీపీ గుంటూరు, కృష్ణా జిల్లాల సమన్వయకర్త ఆళ్ళ రామకృష్ణారెడ్డి స్వగ్రామం పెదకాకానిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీ, వైఎస్సార్ సీపీ శ్రేణుల ఘర్షణ.. శుక్రవారం నాటి ఎన్నికలు కొన్ని చోట్ల ప్రశాంతంగానే జరిగినా మరికొన్ని చోట్ల ఉద్రిక్తతకు దారితీశాయి. గుంటూరు రూరల్ మండలం లాలుపురంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మూకుమ్మడిగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై రాళ్ళ దాడి చేశారు. ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ, వైఎస్సార్ సీపీ శ్రేణులు ఘర్షణకు దిగారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట మండలం గ్రంధశిరిలోనూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి. ఇక్కడ దాడులకు పాల్పడిన టీడీపీ కార్యకర్తలే ఆందోళనలు నిర్వహించడ ం గమనార్హం. తాడేపల్లి మండలం గుండిమెడలో టీడీపీ సర్పంచి కాసరనేని లలిత ఓటర్లను పోలింగ్ కేంద్రం వద్దే అభ్యర్థించడంపై వైఎస్సార్ సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ నేతలతో ఘర్షణకు దిగారు. పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఇదే మండలంలో చిర్రావూరులో చెట్టు కింద నిలబడి ఉన్న వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ధనేకుల బ్రహ్మానందంను పోలీసులు అకారణంగా లాక్కెళ్లి జీపెక్కించారు. స్థానికులు పోలీసుల్ని అడ్డగించి నినాదాలు చేయడంతో బ్రహ్మానందంను వదిలి అతని వద్ద ఉన్న డబ్బు రూ.12 వేలు తీసుకెళ్లారు. పెనుమాకలో టీడీపీ నేతలు డబ్బు పంచుతూ పోలీసులకు చిక్కారు. మంగళగిరి రూరల్ మండలం కురగల్లులో టీడీపీ నేతలు పోలీసులపై దాడికి యత్నించారు. మాచర్లలో నేతల గృహ నిర్బంధం.. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ళలో పోలింగ్ అధికారుల వద్ద తొలగించిన జాబితా లేకపోవడంతో ఆ జాబితాలోని ఓటర్లు కూడా ఓట్లు వేశారు. ముప్పాళ్ల మండలం తురకపాలెంలో బ్యాలెట్ బాక్సులో నీళ్లు పోసేందుకు కొందరు ప్రయత్నించారు. మాచర్ల నియోజకవర్గంలో అన్ని పార్టీల నేతల్ని గృహ నిర్భంధం చేశారు. దుర్గి మండలం శ్యామరాజుపురం, ఆత్మకూరు గ్రామాలకు సంబంధించి బ్యాలెట్ పేపర్లు తారుమారు కావడంతో శ్యామరాజు పురంలో రాత్రి 8 గంటల వరకు పోలింగ్ సాగింది. తాడికొండలో టీడీపీకి చెందిన కొందరు దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డగించారు. -
జెడ్పీ పీఠం వైఎస్సార్ సీపీదే
పెదమామిడిపల్లి (పాలకొల్లు అర్బన్), న్యూస్‌లైన్ : జిల్లా జెడ్పీపీఠంతో పాటు అత్యధిక ఎంపీపీలను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకోవడం ఖాయమని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని దిగమర్రు, కొత్తపేట, పెదమామిడిపల్లి గ్రామాల్లో పోలింగ్ సర ళిని పరిశీలించారు. అనంతరం పెదమామిడిపల్లిలో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాలకొల్లు మండలంలో జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులను వైఎస్సార్ సీపీ గెలుచుకుంటుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పేద ప్రజలే దిక్సూచిగా నిలిచారని, వైఎస్ రాజశేఖరరెడ్డి రుణం తీర్చుకునే సమయం కోసం ప్రజలు ఇన్నాళ్లూ వేచి చూసినట్టు శేషుబాబు చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్లోబల్ ప్రచారం చేశారని, ఆయితే ప్రజలు విశ్వసనీయతకు, మాట విలువకు ప్రాధాన్యతనిచ్చి వైఎస్సార్ కాంగ్రెస్‌కి ఓటు వేశారన్నారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ యాండ్ర గోపి, ఉప సర్పంచ్ యాండ్ర సత్యనారాయణ, పనమట పెద్దఅబ్బులు, కవురు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఇక మహాసంగ్రామం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : సుమారు నెల రోజులుగా సాగుతున్న స్థానిక పోరు శుక్రవారం ముగిసీ ముగియగానే.. శనివారం మహా సంగ్రామానికి తెరలేవనుంది. రాష్ట్రంలో ‘సెమీ ఫైనల్స్’గా పరిగణన పొందిన మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియకు తెరపడిన వెంటనే.. ఫైనల్స్‌గా భావిస్తున్న సార్వత్రిక ఎన్నికల పోరుకు సిద్ధం కావలసి రావడంతో రాజకీయ నాయకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కాగా.. ఎన్నికల కోలాహలం ఉన్నన్నాళ్లూ.. తిండికీ, తాగుడికీ వెతుక్కోవలసిన అగత్యం లేని వాళ్లూ, ఓటుకు వెలగట్టి చెల్లిస్తే నిస్సంకోచంగా పుచ్చుకునే వారూ చంకలు గుద్దుకుంటున్నారు. జిల్లాలో రాజమండ్రి కార్పొరేషన్ సహా ఏడు మున్సిపాలిటీలు, మూడు నగరపంచాయతీలు, 57 జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక ఎన్నికల సందడికి శుక్రవారం తెరపడింది.ఇంతలోనే శనివారం శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపు నోటిఫికేషన్ వెలువడిన వెంటనే నామినేషన్ల స్వీకరణా మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ శుక్రవారం సమీక్షించారు. నేటి వరకూ స్థానిక సమరంలో తలమునకలైన వివిధ పార్టీల నేతలు కూడా వెనువెంటనే సార్వత్రిక ఎన్నికల సన్నాహాలకు సిద్ధమయ్యారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలిసారి 2009లో జరిగిన ఎన్నికల్లో మహానేత వైఎస్‌రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో మూడు పార్లమెంటు, 11 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వైఎస్ మరణానంతరం రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు జిల్లాలోనూ చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు పూనుకోగా తెలుగుదేశం వత్తాసుగా నిలిచిన నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో.. సమైక్యాంధ్ర కోసం అనేక ఉద్యమాలు చేపట్టిన ఏకైక పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ బరిలోకి దిగుతోంది. వైఎస్సార్ సీపీ జిల్లాలో దాదాపు అన్ని స్థానాలపైనా ఒక స్పష్టతతో ఉంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైఎస్సార్ జనభేరి సభల్లో అమలాపురం, కాకినాడ పార్లమెంటు స్థానాలకుపినిపే విశ్వరూప్, చలమలశెట్టి సునీల్, రామచంద్రపురం, ముమ్మిడివ రం, పిఠాపురం, తుని, పెద్దాపురం ని యోజకవర్గాలకు మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, గుత్తుల సాయి, పెండెం దొరబాబు, దాడిశెట్టి రాజా, తోట సుబ్బారావునాయుడులను అభ్యర్థులు గా ప్రకటించారు. మిగిలిన స్థానాలపై కూడా కసరత్తు తుది దశకు చేరుకుంది. బాబుకు షాక్ ఇవ్వనున్న గోరంట్ల..? విభజనలో కాంగ్రెస్‌తో అంటకాగిన టీడీపీ బీజేపీతో పొత్తు సంగతి తేల్చుకోలేక తలపట్టుకుంటోంది. రాజమండ్రి సిటీ, రాజోలు స్థానాలు బీజేపీకి విడిచి పెట్టే ప్రయత్నంలో పిల్లిమొగ్గలు వేస్తోంది. మండపేట, రాజానగరం, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్, తుని, పి.గన్నవరం, ముమ్మిడివరం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాకినాడ పార్లమెంటు స్థానం కోసం బీజేపీ పట్టుబడుతున్నందున.. ఆ సీటుపై ఆశతో కాంగ్రెస్ నుంచి టీడీపీ పంచన చేరిన మాజీ మంత్రి తోట నరసింహం పరిస్థితి ఏమిటనేది తేలడం లేదు. బీజేపీకి ఇస్తారంటున్న రాజమండ్రి సిటీ విషయంలో మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఒకటి, రెండురోజుల్లో చంద్రబాబుకు షాక్ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. కడరూ కరువైన ‘జై సమైక్యాంధ్ర’ నిన్నమొన్నటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ విభజనతో కుదేలై అభ్యర్థుల కోసం భూతద్దం పెట్టి వెతకాల్సి వస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సై తం అభ్యర్థులను నిలపలేక చేతులెత్తేసి న ఆ పార్టీ ఇప్పుడు కాకినాడ నుంచి సిట్టింగ్ ఎంపీ పళ్లంరాజును మాత్రమే ప్రకటించి, మిగిలిన వారి కోసం వేట ప్రారంభించింది. ఇక మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన జై సమైక్యాంధ్ర పార్టీకి అభ్యర్థులను ఎంపిక చేసుకోలేక తంటాలు పడుతున్నారు. కేడర్ లేని ఆ పార్టీ ఎన్ని స్థానాల్లో బరిలోకి దిగుతుందో వేచి చూడాలి. -
ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను పలు ప్రాంతాల్లో ఓటర్లు బహిష్కరించారు. సమస్యల పరిష్కారమయ్యేవరకు ఓటు వేసేది లేదని గ్రామస్తులు పట్టుదలతో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం భట్లమగుటూరు గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. గ్రామంలో కనీస అవసరాలు తీర్చాలని డిమాండ్ చేస్తూ వారు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. మరోవైపు విశాఖపట్నం జిల్లా డుంబ్రిగూడ మండలం పుట్టిలో గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. గ్రామంలో అభివద్ధి చేయలేదంటూ నిరసన తెలుపుతూ వీరు ఎన్నికలను బహిష్కరించారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కిష్టంపల్లి గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించి తమ నిరసన తెలిపారు. ప్రత్యేక గ్రామ పంచాయతీ హోదా కల్పించాలంటూ స్థానిక ప్రజలు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అలాగే ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో ఎన్ఎస్పీ కాలనీ వాసులు పోలింగ్‌ను బహిష్కరించారు. తమ ఓట్లు మరో పోలింగ్ బూత్‌కు మార్చారంటూ నిరసన తెలిపారు. -
ఒకే ఒక్కడుతో పోలింగ్....పార్టీల హల్ చల్
రంపచోడవరం : తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం ముసురుమిల్లి బూత్ వద్ద ఒకే ఒక్క పోలీసు కానిస్టేబుల్ తో అధికారులు స్థానిక సంస్థల తుది విడత పోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. దాంతో పోలింగ్ బూత్ వద్ద విచ్చలవిడిగా వాహనాలు రాకపోకలు సాగుతున్నాయి. రాజకీయ పార్టీల నేతలు పోలింగ్ బూత్ వద్ద హల్ చల్ చేస్తున్నారు. ఉన్న ఒక్క కానిస్టేబుల్ ఏమీ చేయలేకపోవడంతో అంతా ఇష్టారాజ్యంగా సాగుతోంది. అయితే ఎన్నికల సిబ్బంది దీని గురించి ఏమాత్రం స్పందించలేదు. మరోవైపు కాజులూరు పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్న టీడీపీ నేత నానాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. -
పరిటాల వర్గీయుల్ని ఎందుకు నిర్బంధించలేదు?
అనంతపురం : అనంతపురం జిల్లావ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో పోలీసుల వ్యవహరిస్తున్న తీరుపై ఆపార్టీ జిల్లా సమన్వయకర్త ప్రకాష్ రెడ్డి ఖండించారు. స్థానిక సంస్థల ఎన్నికల తుది విడత పోలింగ్ సందర్భంగా నేర చరిత్ర లేకపోయినా కీలక నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. క్రిమినల్స్‌గా ముద్రపడ్డ పరిటాల వర్గీయుల్ని ఎందుకు నిర్బంధించలేదని ప్రకాష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఆత్మకూరు, కనగానపల్లి, రామగిరి మండలాల్లో వందలాది మంది వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేయటంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. -
వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై తెలుగు తమ్ముళ్ల దాడి
కర్నూలు : ప్రాదేశిక ఎన్నికల తుదివిడత పోరు సందర్భంగా కర్నూలు జిల్లాలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. కౌథాల మండలం వన్నూరులో ఓటర్లకు డబ్బు పంచుతున్న టీడీపీ కార్యకర్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన దాడిలో నలుగురు గాయపడగా. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పలు పోలింగ్ కేంద్రాల్లో అంధకారం
కొవ్వూరు : పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో పలు పోలింగ్ కేంద్రాల్లో అంధకారం నెలకొంది. విద్యుత్ సరఫరా లేక ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 24 మండలాల్లో 452 ఎంపీటీసీ, 24 జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. విద్యుత్ కోతలు ఉంటాయని తెలిసినా...అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయటంలో విఫలం అయ్యారు. ఇక తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో బూత్ లెవల్ అధికారులు ఓటర్ స్లిప్‌లు ఇవ్వకపోవటంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. బ్యాలెట్ పేపర్లో గుర్తులు తారుమారు ఒంగోలు : ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మల్లవరపాడులో అధికారుల నిర్లక్ష్యంతో ఎంపీటీసీ ఎన్నికలు నిలిచిపోయాయి. బ్యాలెట్ పేపర్లో గుర్తులు తారుమారు అయ్యాయి. ఇండిపెండెంట్ అభ్యర్థికి హస్తం గుర్తు కేటాయింపుతో ఎన్నికలు నిలిచాయి. -
ఓటర్లను ప్రలోభపెడుతున్న టీడీపీ కార్యకర్తలు
అనంతపురం: ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ సందర్భంగా అనంతపురం జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లిలో టీడీపీ కార్యకర్తలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. దాంతో టీడీపీ కార్యకర్తలకు ఎన్నికల సిబ్బంది సహకరిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన తెలిపారు. మరోవైపు రామగిరి, బుక్కపట్నం, నల్లచెరువులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ముందస్తు అరెస్ట్‌ల పేరుతో పలువురు వైఎస్ఆర్ సీపీ నేతలను, కార్యకర్తలను నిర్బంధించారు. ఇక తలుకుల మండలంలో పోలింగ్ ప్రారంభం కాలేదు. -
మలి పోరుకు రె‘ఢీ’
సాక్షి, ఏలూరు : జిల్లా పరిషత్, మండల పరి షత్ ఎన్నికల మలిపోరు శుక్రవారం జరగనుంది. 24 జెడ్పీటీసీ, 452 ఎంపీటీసీ స్థానాల్లో ఓటరు తీర్పు కోసం అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. తొలి విడత పోలింగ్‌లో ఎదురైన అవాం ఛనీయ ఘటనలు ఈసారి తలెత్తకుండా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నరసాపురం, కొవ్వూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 24 మండలాల్లో శుక్రవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. జెడ్పీటీసీ అభ్యర్థులు 87మంది, ఎంపీటీసీ అభ్యర్థులు 1,180 మం ది పోటీపడుతున్నారు. 11,67,231మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగిం చుకోవాల్సి ఉంది .686 ప్రాంతాల్లో 1,434 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణకు 9వేల 414 మంది సిబ్బంది గురువారం ఆయా ప్రాంతాలకు వెళ్లారు. బ్యాలెట్ పేపర్లు, ఇంక్ బాటిళ్లు, స్వస్తిక్ గుర్తులు, ఇతర పరికరాలు వెంటబెట్టుకెళ్లారు. 451 సమస్యాత్మక, 315 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 2,275 మంది పోలీసులతో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్రమాలను అరికట్టేందుకు రహస్య నిఘా ఈ ఎన్నికల్లో నగదు, మద్యం, ఇతర ప్రలోభాలను నిరోధించేందుకు రహస్యంగా నిఘా వేసే బృందాలను కలెక్టర్ సిద్ధార్థజైన్ రంగంలోకి దించారు. నిఘా బృందాల సభ్యులు సాధారణ జనంలా.. అవసరమైతే మారువేషాల్లో వెళ్లి అక్రమార్కుల భరతం పట్టాలని కలెక్టర్ సూచించారు. తమ వాహనాలను దూరంగా ఉంచి తనిఖీలు చేయాలని చెప్పారు. తొలి విడతలో జరిగిన లోటుపాట్లు దృష్టిలో ఉంచుకుని అలాంటివి మలి విడత పోలింగ్ ప్రక్రియలో చోటుచేసుకోకుండా చూడాలని పోలింగ్ యంత్రాంగానికి ఆయన సూచించారు. పూర్తయిన పంపకాలు : అధికారుల తనిఖీలు ఎక్కువగా ఉండటంతో అభ్యర్థులు ముందుగానే మేల్కొన్నారు. డబ్బు, మద్యం పంపిణీని పోలింగ్ ముందు రోజు రాత్రి ముమ్మరంగా చేయడం ఆనవాయితీ. కానీ ఈ సారి ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే సహించమని అధికారులు హెచ్చరికలు జారీచేయడంతో పాటు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. దీంతో రెండు రోజులు ముందునుంచే పంపకాలు ప్రారంభించారు. గురువారం ఉదయానికే చాలా చోట్ల పూర్తి చేశారు. -
ఓటే ఆయుధం
మారేడుమిల్లి, న్యూస్‌లైన్ : ప్రజాస్వామ్యానికి ఓటే ఆయుధమని కలెక్టర్ నీతూ ప్రసాద్ పేర్కొన్నారు. ఓటు హక్కును సద్వినియోగపరుచుకుని అభివృద్ధికి తోడ్పాటునందించే నాయకులను ఎన్నుకోవాలని గిరిజనులకు ఆమె సూచించారు. కలెక్టర్ నీతూప్రసాద్ గురువారం మారేడుమిల్లి మండలంలో పర్యటించారు. తొలుత ఆమె స్థానిక జెడ్పీ హైస్కూలులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. మారేడుమిల్లిలోని పోలింగ్ కేంద్రాల్లో ఫర్నిచర్, తాగునీటి ఏర్పాట్లు, విద్యుత్‌సరఫరా, వెబ్ సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం మారేడుమిల్లి మండలం బంద గ్రామంలో ఓటు వేసేలా ప్రజలను చైతన్య పరచేందుకు ఓటర్లకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలకు బంద గ్రామంలో పోలింగ్ బూత్‌లను నూతనంగా ఏర్పాటు చేసినట్టు ఆమె తెలియజేశారు. సాధారణంగా వెయ్యిమంది ఓటర్లు ఉన్నచోట ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాన్ని కేటాయిస్తుందన్నారు. అయితే గిరిజన ప్రాంతాల్లో దూరభారాలను పరిగణనలోకి తీసుకొని 400 మంది ఓటర్లు ఉన్నప్పటికీ పోలింగ్‌కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఈవీఎంలపై గిరిజనులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గుడిసే గ్రామంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించారు. ఐటీడీఏ పీఓ గంధం చంద్రుడు, ఆర్డీవో శంకరవరప్రసాద్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ మణికుమార్, ఈఈ నాగేశ్వరరావు, తహశీల్దారు సుబ్బారావు, రెవెన్యూ, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. -
‘మలి విడత’ ప్రచారం నేటితో సమాప్తం
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : మలి విడత ప్రాదేశిక ఎన్నికల ప్రచార హోరుకు నేటితో తెరపడనుంది. 11న జరిగే రెండోవిడత ఎన్నికలకు బుధవారం సాయంత్రం 5 గంటలతో ప్రచారాలకు బ్రేక్ పడనుంది. దీంతో అభ్యర్థులు ఓటర్లను తమ వైపునకు తిప్పుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విడతలో ఏజెన్సీ 11 మండలాలు పాడేరు, ముంచింగ్‌పుట్, జి.కె.వీధి, చింతపల్లి, డుంబ్రిగుడ, అనంతగిరి, అరకు వ్యాలీ, కొయ్యూరు, హుకుంపేట, పెదబయలు, జి.మాడుగుల స్థానాలతో పాటు ట్రైబల్ సబ్‌ప్లాన్ మండలాలైన నాతవరం, గొలుగొండ, రోలుగుంట, రావికమతం, వి.మాడుగుల, దేవరాపల్లి మండలాలు మొత్తం 17 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో 277 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ పెదబయలు మండలంలో జామిగూడ,ఇంజరి సెగ్మెంట్లకు నామినేషన్లు పడలేదు. దేవరాపల్లి మండలంలో ఎ.కొత్తపల్లి, చింతపల్లి మండలంలో బలపం ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 273 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీ స్థానాలకు 100 మంది, ఎంపీటీసీ స్థానాలకు 1067 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో తలపడుతున్నారు. 6,84,825 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం 794 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రచార సందడి ఏజెన్సీలో చిన్న చిన్న తండాల్లో సైతం ఎన్నికల ప్రచార సందడి కనిపిస్తోంది. పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా ఈ ఎన్నికల్లో పోటీపడుతున్నారు. మొదటి దశ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ, టీడీపీల మధ్యే ప్రధాన పోరు జరిగింది. కాంగ్రెస్, సీపీఎం, ఇతర పార్టీలు కూడా ఒకటి రెండు స్థానాలకే పరిమితమయ్యాయి. రెండో దశ ఎన్నికల్లో ఏజెన్సీ స్థానాల్లో 5 నుంచి 9 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ స్థానాలకు అన్ని పార్టీలు అభ్యర్థులను నిలబెట్టడంతో పాటు స్థానిక బలంతో కొంత మంది స్వతంత్రులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ సారి ఏజెన్సీలో సైతం ఎన్నికల వాతావరణం వేడెక్కింది. రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. నియోజకవర్గ స్థాయి నాయకులు సైతం తమ పార్టీ అభ్యర్థులను గెలుపించుకోడానికి రంగంలోకి దూకారు. ఒకవైపు ఈ స్థానిక ఎన్నికలపైనే కాకుండా సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా క్యాంపేన్ చేస్తున్నారు. దీంతో ఏజెన్సీలో కూడా స్థానిక పోరు రసవత్తరంగా మారింది.