ఒకే ఒక్క ఇండిపెండెంట్
Published Sun, Apr 6 2014 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM
నెల్లిమర్ల, న్యూస్‌లైన్ : మండలంలో ఈ నెల 11వ తేదీ న జరిగే ఎంపీటీపీ ఎన్నికల్లో ఒకే ఒక్క ఇండిపెండెంట్ అభ్యర్థి బరిలో ఉన్నారు. మండలంలో మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఈసారి ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్కరు ఇండిపెండెంట్‌గా పోటీలో ఉండడం చర్చనీయాంశమైంది. 15 స్థానాలకు వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ నుంచి 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా రు. అలాగే టీడీపీ నుంచి 14 మంది, కాంగ్రెస్ తరఫున 12 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే అన్నిచోట్లా ప్రధాన పార్టీల మధ్యే పోటీ నెలకొంది. కానీ ఒక్క బూరాడపేట ఎంపీటీసీ స్థానం నుంచి మాత్రమే ఇండిపెండెంట్ అభ్యర్థిగా బెల్లాన అప్పలనరసమ్మ పోటీ చేస్తున్నారు. మొదట ఐదుగురు అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ చివర్లో ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న ఏకైక అభ్యర్థిగా అప్పలనరసమ్మ నిలిచారు. ఈమెకు ఎన్నికల సంఘం పండ్ల బుట్ట గుర్తుగా కేటాయించింది.
Advertisement
Advertisement