Independent candidate
-
‘టీడీపీ ఎమ్మెల్యే కూనరవితో ప్రాణహాని’
శ్రీకాకుళం, సాక్షి: టీడీపీ నేతల దాడులు, బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్యే కూనరవితో తనకు ప్రాణహాని ఉందని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస స్వతంత్ర అభ్యర్థి సనపల సురేష్ తెలిపారు. ఆయన ఓ సెల్ఫీ వీడియో ద్వారా ఎమ్మెల్యే దాడి, బెదిరింపుల విషయాన్ని బయటపెట్టారు. ‘‘ఎమ్మెల్యే కూనరవి నుంచి నాకు ప్రాణహాని ఉంది. అక్రమ ఇసుక రవాణా అడ్డుకుంటున్నానని దాడి చేశారు. ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారు. జిల్లా ప్రభు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదు. దెబ్బలు తగిలినా రిపోర్టు నార్మల్ అని ఇచ్చారు. పోలీసులతో కలిసి నన్ను చంపేందుకు రవి కూమార్ స్కెచ్ వేశారు. దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాల్సిందే. నాపై దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు’’ అని వీడియోలో తెలిపారు. -
Lok Sabha Election 2024: మోదీకి ఆయన స్టైల్లోనే బదులిస్తా
శ్యామ్ రంగీలా. మిమిక్రీ సంచలనం. ప్రధాని మోదీ, రాహుల్‌గాంధీ వంటి నేతలను అనుకరిస్తూ 2017లో ఆయన చేసిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. సరిగ్గా ఏడేళ్ల తరవాత ఆయన స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. అది కూడా వారణాసిలో మోదీపైనే పోటీ చేస్తున్నారు! రాజస్తాన్‌లోని శ్రీగంగానగర్‌కు చెందిన శ్యామ్ యూట్యూబ్ చానల్‌కు దాదాపు కోటిమంది సబ్స్రై్కబర్లున్నారు. మోదీని అనుకరిస్తూ ‘ధంగ్ కీ బాత్’ షో కూడా నడుపుతున్నారాయన. ఒకప్పుడు మోదీకి మద్దతు పలికిన శ్యామ్ ఆయనపైనే ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? ఇలాంటి పలు ప్రశ్నలకు ఆయన ఇచి్చన సమాధానాలు... ప్రధానిపై ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? ఇటీవల సూరత్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. అది సరికాదనిపించింది. ఎన్నికల ప్రక్రియే ప్రజాస్వామ్యానికి ప్రాణం. పోటీ ఉండాలి. అలాకాకుండా బీజేపీ తన ప్రత్యర్థుల నామినేషన్లను విత్‌డ్రా చేయిస్తోంది. అందుకే నేను పోటీ చేస్తున్నా. ఒక సామాన్యుడు ప్రధానిపైనే పోటీలో నిలబడ్డాడనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నా. మీది రాజకీయ ప్రధాన హాస్యం. ప్రస్తుతం దేశ రాజకీయాల తీరుపై ఏమంటారు? ఇప్పుడు రాజకీయాలే అతి పెద్ద కామెడీ. రాజకీయాల్లో హాస్యానికి కొదవే లేదు. కమెడియన్లను నిషేధించి రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ ఖర్చుతో కూడింది. మరి మీకు డబ్బులెలా...? నా దగ్గర ఏమీ లేవు. నేనేం చేసినా ప్రజల సాయంతోనే. ‘అభీ తో జోలా హై బస్. ఉఠాకే చల్ దేంగే, ఔర్ క్యా?’ (నా దగ్గరున్నది జోలె మాత్రమే. అది తీసుకుని రోడ్డున పడతానంతే) ‘జోలా ఉఠాకే’ అన్నది ప్రధాని మోదీ డైలాగ్ కదా! ఒకప్పుడు ప్రధాని మద్దతుదారుగా ఉన్న మిమ్మల్ని మార్చిందేమిటి? 2016 దాకా ప్రధానికి అభిమానినే. బీజేపీ అధికారంలోకి రాగానే ఇక అవినీతి పోతుందని, పెద్ద మార్పు వస్తుందని చాలామందిమి భావించాం. అందుకే ఆయనకు మద్దతుగా పోస్టులు పెట్టేవాన్ని. ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్‌కు ఎంపికైనప్పుడు ఎగిరి గంతేశా. మోదీని అనుకరిస్తూ నేను చేసిన వీడియోకు ప్రశంసలొచ్చాయి. కానీ అది ప్రసారమే కాలేదు. ప్రభుత్వం వద్దందని చానల్ వాళ్లు చెప్పారు. నేను మోదీని అనుకరించానంతే. ఎందుకు వద్దన్నారో అర్థం కాలేదు. రాజకీయాలపై హాస్యానికి చాలా దేశాల్లో ఆదరణ ఉంది. భారత్‌లో పరిస్థితి ఏమిటనుకుంటున్నారు? ఇక్కడ వ్యంగ్యాన్ని, హాస్యాన్ని అర్థం చేసుకోవడంలో లోపం ఉంది. రాజకీయాలపై హాస్యం ఇక్కడ పని చేయదు. అందుకే చానళ్లలో పొలిటికల్ కామెడీ షోలే ఉండవు. రాహుల్ గాంధీపై జోకేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆహా్వనించవు, మోదీ మీద కామెడీ చేస్తే బీజేపీ ఊరుకోదు. అందుకే నా యూట్యూబ్‌లో వీడియోలు చేయాలని నిర్ణయించుకున్నా. వారణాసిలో ప్రచారమెలా ఉంది? బాగా సాగుతోంది. నలుగురైదుగురు స్నేహితులు నా వెంట వచ్చారు. ఇక్కడ మరింతమంది కలిసొస్తున్నారు. మీకు వారణాసి ప్రజల మద్దతు ఉందనుకుంటున్నారా? కచ్చితంగా. పోటీ చేస్తానని ప్రకటించినప్పటి నుంచే నాకు మద్దతుగా సందేశాలు వస్తున్నాయి. వరుస కాల్స్ వస్తున్నాయి. ప్రచారంలోనూ మోదీని మీ స్టయిల్లో అనుకరిస్తారా? తప్పకుండా. మోదీకి ఆయన శైలిలోనే బదులిస్తానని ఇప్పటికే చెప్పా కూడా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హెలికాప్టర్ వద్దన్నందుకు.. ఎడ్లబండిలో వచ్చి నామినేషన్
పాట్నా:ఎన్నికల వేళ నేతల మధ్య మాటల తూటాలు పేలడంతో పాటు చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా నామినేషన్ పర్వంలోనైతే అభ్యర్థులు తమ బలాబలాలను ప్రదర్శిస్తుంటారు.ఈ క్రమంలోనే ఆసక్తికర ఘటనలు, పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. ఇదే తరహాలో బిహార్‌లోని సమస్తిపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న స్వతంత్ర అభ్యర్థి ఒకరు నామినేషన్ వేసేందుకు హెలికాప్టర్లో వస్తానని అధికారులను అనుమతి అడిగారు. హెలికాప్టర్లో వచ్చి నామినేషన్ వేసేందుకు స్వతంత్ర అభ్యర్థి అమ్రేష్రాయ్కి అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆయన హెలికాప్టర్ నుంచి ఏకంగా ఎడ్లబండి రేంజ్‌కు వచ్చేశారు.ఎడ్లబండిలో ఊరేగింపుగా వచ్చి డ్యాన్సులతో హోరెత్తించి నామినేషన్ దాఖలు చేశారు. హెలికాప్టర్‌కు అనుమతివ్వనందుకే తాను ఎడ్లబండిలో వచ్చి నామినేషన్ వేశానని అమ్రేష్రాయ్ చెప్పారు. ఇదీ చదవండి.. పొలిటికల్ ఎంట్రీపై డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు -
Vijay prakash kondekar: పట్టువదలని విక్రమార్కుడు
విజయ ప్రకాశ్ కొండేకర్. తెల్లగడ్డం, తెల్లని దోతీ, భుజంపై కండువా, ఒంటిపై అంగి కూడా లేకుండా కనిపిస్తాడు. కానీ పట్టు వదలని విక్రమార్కుడనే పదబంధానికి నిలువెత్తు రూపం. మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఈయన స్థానిక సంస్థల నుంచి లోక్‌సభ దాకా ఇప్పటికి ఏకంగా 25 సార్లు పోటీ చేశారు. దశాబ్దాలుగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూనే ఉన్నారు. మహారాష్ట్ర రాష్ట్ర విద్యుత్ బోర్డు నుంచి 1980ల్లో రిటైరయ్యారు. ‘బూటు గుర్తునే గెలిపించండి’ అని రాసున్న ప్లకార్డును ఓ బండిపై పెట్టుకుని కాలినడకన ప్రచారం చేస్తుంటారు. నగర వీధుల్లో అతడిని కొందరు పట్టించుకోకుండా వెళ్తే మరి కొందరు సెలీ్ఫలు తీసుకుంటారు. సోషల్ మీడియాలో ఉచితంగా ప్రచారం దొరికిందంటూ సంతోషిస్తారాయన. గెలిచే అవకాశం లేదని తెలిసినా ప్రచారం కోసం పూరీ్వకుల భూమి, ఇల్లు అమ్మేశాడు. ఎప్పటికైనా ప్రధాని కావాలన్నది ఆయన కలట. దాన్ని నిజం చేసుకోవడానికి ఎన్ని సార్లైనా పోటీ చేస్తూనే ఉంటానంటారు కొండేకర్. ఆయన కంటే ఘనుడు మరొకరున్నారు. ఆయనే కె.పద్మరాజన్. గిన్నిస్ రికార్డు కోసం 170 కంటే ఎక్కువ ఎన్నికల్లో పోటీ చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీపైనే బరిలో దిగారు! అలాగే యూపీలోని ఆగ్రా జిల్లాకు చెందిన 78 ఏళ్ల హస్నురామ్ అంబేద్కరి ఇప్పటిదాకా ఏకంగా 98సార్లు ఎన్నికల్లో తలపడ్డారు. ఈసారి కూడా ఆగ్రా, ఫతేపుర్సిక్రీ స్థానాల్లో నామినేషన్ వేస్తున్నారు. ఆ రెండింట్లోనూ ఓడి సెంచరీ కొడతారట! ‘నీ భార్యే నీకు ఓటేయదు. ఇతరులెలా వేస్తారు’ అంటూ ఓ బీఎస్పీ నేత అవమానించడంతో విజయం కోసం కాకుండా ఓట్ల కోసం ఆయన ఇలా పోటీ చేస్తూనే ఉన్నారు!! -
దేశ రాజకీయాల్లో సంచలనం.. ఈ 26 ఏళ్ల కుర్రాడు!
దేశ రాజకీయాల్లో సంచలనంగా మారాడు రాజస్థాన్‌కు చెందిన ఓ 26 ఏళ్ల కుర్రాడు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈ యువకుడు.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచాడు. చక్కని వాగ్ధాటి, అగర్గళమైన, చురుకైన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నాడు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గాలే కాదు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను చుట్టేస్తున్నాడు. బార్మర్- పశ్చిమ రాజస్థాన్, ముఖ్యంగా బార్మర్-జైసల్మేర్-బలోత్రా నియోజకవర్గం ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో కేంద్ర బిందువుగా మారింది. ఇది దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. 1.9 మిలియన్ ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 7 లక్షల మంది జాట్లు, 2.5 లక్షల రాజ్‌పుత్ ఓటర్లు కీలకంగా ఉన్నారు. ఇక్కడ ఎన్నికల రణరంగం ముక్కోణపు పోటీని చూస్తోంది. వివిధ రాజకీయ వర్గాలకు చెందిన ప్రముఖ అభ్యర్థులు బరిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి కైలాష్ చౌదరి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమేరామ్ బేనివాల్ ప్రధాన అభ్యర్థులుగా ఉన్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థి 26 ఏళ్ల రవీంద్ర సింగ్ భాటి పోటీలో ఉండటంతో అందిరి దృష్టి ఈ నియోజక వర్గంపై పడింది. ఆకట్టుకునే ప్రసంగాలు బార్మర్ జిల్లాలోని షియో అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యేగా విజయాన్ని రుచి చూసిన రవీంద్ర, ఇప్పుడు మరోసారి బరిలోకి దిగి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే సాంప్రదాయ ద్విముఖ భావాన్ని మార్చేందుకు సిద్ధమయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా భాటి ప్రజాదరణ ఆయన సొంత నియోజకవర్గానికి మించి విస్తరించింది. ఈయన ఆకర్షణ, ప్రసంగాలు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించాయి. సోషల్ మీడియాలో సంచలనాన్ని రేకెత్తించాయి. ప్రచారం ముమ్మరం కావడంతో భాటి గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా వ్యూహాత్మక పర్యటనను ప్రారంభించారు. రవీంద్ర భాటి బెంగుళూరుకు వెళ్లినప్పుడు ఆయన ప్రసంగాన్ని వినడానికి అధిక సంఖ్యలో జనం గుమిగూడారు. అదేవిధంగా హైదరాబాద్‌లోనూ ప్రజాదరణ లభించింది. ఆయన విమానాశ్రయానికి రాకముందే జనాలను ఆకర్షించింది. గుజరాత్‌లోని సూరత్‌కు చేరుకున్నప్పుడు అతని పేరు కొన్ని మైళ్ల వరకు ప్రతిధ్వనించింది. రవీంద్ర భాటి నేపథ్యం రవీంద్ర సింగ్ భాటి బార్మెర్లోని దుధోడా అనే గ్రామానికి చెందిన రాజపుత్ర కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి న్యాయ విద్యను అభ్యసించిన రవీంద్ర భాటి తన పాఠశాల విద్యను ప్రభుత్వ స్కూల్లో పూర్తి చేశారు. జై నారాయణ్ వ్యాస్ యూనివర్శిటీలో 2019 విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా రవీంద్ర భాటి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంస్థ అయిన ఏబీవీపీ నుంచి మొదట టికెట్‌ను కోరినప్పటికీ, చివరికి తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికలలో అతని విజయం ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. విశ్వవిద్యాలయం 57 సంవత్సరాల చరిత్రలో విద్యార్థి సంఘం అధ్యక్ష పదవిని గెలుచుకున్న మొదటి స్వతంత్ర అభ్యర్థిగా రవీంద్ర సింగ్ బాటీ నిలిచాడు. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో భాటి రాజకీయ పథం మరో ముఖ్యమైన మలుపు తిరిగింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన అభ్యర్థులను ఎదుర్కొని భాటి విజయం సాధించారు. సుమారు 4 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో లోక్‌సభ బరిలో నిలిచారు. #संबोधन pic.twitter.com/4CU0fnZTwe — Ravindra Singh Bhati (@RavindraBhati__) April 9, 2024 -
నాడు ప్రత్యర్థికి ఓటు వేయాలని కోరిన వాజ్‌పేయి?
దేశంలో ఎక్కడ చూసినా లోక్‌సభ ఎన్నికల సందడే కనిపిస్తోంది. ఎన్నికలు ప్రజాస్వామ్య పండులని అంటుంటారు. దేశంలో 1957లో జరిగిన లోక్‌సభ ఎన్నికలను ఇప్పటికీ ఏదోవిధంగా గుర్తుకు తెచ్చుకుంటారు. దేశంలో 1957లో రెండో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పలు వింత వైనాలు చోటుచేసుకున్నాయి. నాడు జన్‌సంఘ్ నేతగా ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయి కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఒక ప్లాన్ చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి 1957 లోక్‌సభ ఎన్నికల్లో మథుర, బల్రాంపూర్, లక్నో ఈ మూడు చోట్ల నుంచి పోటీ చేశారు. బలరాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన ఆయన పార్లమెంటుకు చేరుకున్నారు. తన 60 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఐదుసార్లు ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నారు. వాజ్‌పేయి తొలిసారిగా మధుర లోక్‌సభలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. నాడు రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన కారణంగానే అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ ఓటమిని తనకు తానుగా ఆహ్వానించుకున్నారని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటారు. ఈ ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్‌పేయి బహిరంగ సభలకు వెళ్లినప్పుడు ప్రత్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేసేవారు. తనకు కాకుండా రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్‌కు ఓటువేయాలని కోరేవారు. ఇలా తాను వెళ్లిన ప్రతీచోటా ప్రత్యర్థికి ఓటు వేయాలని కోరారట. ఎవరైనా అదేమిటని అడిగితే ఆయన తన లక్ష్యం ఎన్నికల్లో గెలవడం కాదని, కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని నిర్ధారించడమేనని చెప్పుకొచ్చేవారు. నాటి లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి రాజ మహేంద్ర ప్రతాప్ విజయం సాధించారు. ఆయనకు 95 వేల 202 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దిగంబర్ సింగ్ 69 వేల 209 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. జనసంఘ్‌కు చెందిన అటల్ బిహారీ వాజ్‌పేయి నాలుగో స్థానంలో నిలిచారు. వాజ్‌పేయికి కేవలం 10 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. -
ఎంపీగా గెలిస్తే ఫారెన్ లిక్కర్ ఇస్తా: మహిళా అభ్యర్థి వినూత్న ప్రచారం
చంద్రాపూర్: ఈ లోక్‌సభ ఎన్నికల్లో తాను గెలిస్తే పేదలకు సబ్సిడీ పై బీరు, విస్కీ అందిస్తానని మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో ఓ స్వతంత్ర అభ్యర్థి చెబుతున్నారు. ఈ విచిత్ర హామీ ఇస్తున్న అభ్యర్థి పేరు వనితా రౌత్. బీరు, విస్కీలను సబ్సిడీ ధరలకు ఇవ్వడమే కాకుండా ప్రతి గ్రామంలో బీరు బార్లు ఓపెన్ చేసి ఎంపీ నిధుల నుంచి విదేశీ మద్యంతో పాటు విదేశీ బీర్లను కూడా ఇస్తానని చెబుతోంది వనితా రౌత్. అయితే ఈ స్కీమ్ కింద తాగేవాళ్లు, అమ్మేవాళ్లు ఇద్దరికీ లైసెన్స్ ఉండాల్సిందేనన్న కండీషన్ పెడుతోంది. అత్యంత కష్టపడి పనిచేసే పేదలకు ఉన్న ఒకే ఒక విలాసం మందు తాగడమని, ఇందుకే తన ఈ వినూత్న స్కీమ్ వారికి అవసరమని సమర్థించుకుంటోంది. పేదలకు అందుబాటులో ఉండేది కేవలం దేశీయ మద్యమేనని, ఇది తాగి వారు చనిపోతున్నారని, ఇందుకే వారి కోసం విదేశీ మద్యం తెప్పించి ఇస్తానని తెలిపింది. వనిత ఎన్నికల్లో పోటీ చేయడం ఇది తొలిసారి కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాగ్‌పూర్ నుంచి పోటీ చేయగా, అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిమూర్ సెగ్మెంట్ నుంచి బరిలో నిలిచారు. గతంలో కూడా విస్కీ, బీరు హామీ ఇచ్చినందుకు ఆమె సెక్యూరిటీ డిపాజిట్‌ను ఎన్నికల కమిషన్ జప్తు చేసింది. అయినా ఆమె మారకుండా మళ్లీ అదే హామీ ఇస్తుండటం విశేషం. ఇదీ చదవండి.. మోదీ హామీలు చైనా వస్తువుల లాంటివి -
ఈ ఇండిపెండెంట్ అభ్యర్థి డిపాజిట్ ఎలా కట్టాడో తెలుసా?
ప్రతి ఎన్నికలలోనూ ఇండిపెండెంట్ అభ్యర్థులు చర్చనీయాంశం అవుతూ ఉంటారు. ఏదో ఒక అంశంలో ప్రత్యేకత చాటుతూ ఉంటారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న జబల్పూర్ వ్యక్తి కూడా ఇలాగే వార్తల్లో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా జబల్పూర్లో ఎన్నికల బరిలోకి దిగాలనుకుంటున్న వినయ్ చక్రవర్తి ఎన్నికల డిపాజిట్‌ను చిల్లర నాణేల రూపంలో చెల్లించారు. నామినేషన్ ఫారమ్ కోసం సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించడానికి రూ. 25,000 నాణేలతో బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లారు. రూ. 10, రూ. 5, రూ. 2 నాణేల రూపంలో రూ.25,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించారు. లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నానని, కలెక్టర్ కార్యాలయంలో డిజిటల్, ఆన్లైన్ విధానంలో డిపాజిట్ చెల్లించే సౌకర్యం లేదని అందుకే తన వద్ద ఉన్న నాణేల రూపంలో డిపాజిట్ చెల్లించానని చక్రవర్తి తెలిపారు. దీనిపై జబల్పూర్ జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా విలేకరులతో మాట్లాడుతూ, అభ్యర్థి నాణేలలో రూపంలో చెల్లించిన డిపాజిట్‌ను స్వీకరించి దానికి సంబంధించిన రశీదును అతనికి అందించినట్లు చెప్పారు. లోక్‌సభ తొలి దశ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌లోని అరడజను స్థానాలకు ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనుంది. మొత్తంగా దేశవ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
ఎన్నికల గుర్తు కన్నా.. నువ్వే బాగున్నావ్!
కామారెడ్డిటౌన్: ‘ఎన్నికల గుర్తు కన్నా.. ఈ ఫొటోలో ఉన్న నువ్వే చాలా బాగున్నావ్’అంటూ రిటర్నింగ్ అధికారి తనను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడినట్లు కామారెడ్డి నియోజకవర్గ స్వతంత్ర మహిళా అభ్యర్థి మంగిలిపల్లి భార్గవి ఆరోపించారు. శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాక్ పోలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు కేటాయించిన బేబీవాకర్ గుర్తు ఈవీఎంలో సరిగా కనబడటంలేదని భార్గవి రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. ఆ అధికారి వెంటనే ‘ఈ ఎన్నికల గుర్తు కన్నా నువ్వే చాలా బాగున్నావ్’అంటూ అసభ్యంగా మాట్లాడారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నిరుద్యోగంతో బాధపడుతున్న తాను సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. తనకు జరిగిన అవమానంపై ఆమె కంటతడి పెట్టారు. ఎన్నికల్లో ప్రధాన పార్టీల మహిళాఅభ్యర్థులు ఉంటే ఇలానే ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ విషయమై శ్రీనివాస్‌రెడ్డిని వివరణ కోరగా తాను అసభ్యపదజాలం వాడలేదని చెప్పారు. -
బర్రెలక్క తమ్ముడిపై దాడి
మహబూబ్‌నగర్: కొల్లాపూర్‌లో బర్రెలక్క అలియాస్ శిరీష స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. మంగళవారం కోడేరులో ప్రచారం ముగించుకుని వెన్నచర్ల గ్రామానికి వెళ్లగా.. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు శిరీష తమ్ముడు భరత్‌కుమార్‌పై దాడికి యత్నించారు. విషయాన్ని గమనించిన శిరీష తన మద్దతుదారులతో కలిసి పెద్దకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. తన తమ్ముడిపై దాడి చేసిన వారిని శిక్షించాలని, తనకు పోలీస్ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్ఐ రాజు శిరీషతో మాట్లాడి శాంతింపజేశారు. దాడి చేసిన వారిపై ఫిర్యాదు తీసుకుని సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీస్ సెక్యూరిటీ విషయంలో జిల్లా ఎస్పీతో మాట్లాడుతామని చెప్పారు. దారుణం.. కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన నిరుద్యోగి శిరీష అలియాస్ #Barrelakka తమ్ముడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. గత కొద్దిరోజులుగా ప్రజల చందాలతో ఎన్నికల ప్రచారం చేస్తున్న శిరీషకు సోషల్ మీడియాతో విస్తృత స్పందన వస్తోంది. గతంలో కేసులు, బెదిరింపులతో… pic.twitter.com/UopywJvMdA — ThulasiChandu (@thulasichandu1) November 21, 2023 -
నిజామాబాద్ అర్బన్ ఇండిపెండెంట్ అభ్యర్థి ఆత్మహత్య
సాక్షి, నిజామాబాద్: సైబర్ మోసగాళ్ల వలలో పడి నిజామాబాద్ అర్బన్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నయ్య గౌడ్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో కలకలం రేపింది. గాయత్రినగర్‌లో ఉండే కన్నయ్యకుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. అయితే శనివారం రాత్రి తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కన్నయ్య కుమార్ గౌడ్ ఫోన్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన ఎన్నికలు అఫిడవిట్ సైతం సైబర్ నేరగాళ్లు కాజేసినట్లు చెబుతున్నారు. రెండు రోజుల్లో గృహప్రవేశం పెట్టుకున్న కన్నయ్య ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరుతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. చదవండి: వారసులకు ‘హోం’ సిక్ -
అప్పట్లో స్వతంత్రులదే హవా..! కానీ ఇప్పుడు..
సాక్షి, కరీంనగర్: ఒకప్పుడు చాలా మంది నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి, సత్తా చాటేవారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ప్రజాభిమానం ఉన్న కొందరు నాయకులు స్వతంత్రులుగా పోటీ చేసి, విజయబావుటా ఎగురవేశారు. ప్రజాబలం ముందు పార్టీ సింబల్ బలాదూర్ అని నిరూపించారు. 1952 నుంచి 2018 వరకు 15 సార్లు సాధారణ ఎన్నికలు జరిగాయి. 1994 వరకు (ఉప ఎన్నికలతో కలిపి) 15 మంది స్వతంత్రులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో ఎక్కువ మంది కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి, దక్కకపోవడంతో స్వతంత్రులుగా పోటీలో ఉన్నారు. గెలిచాక వివిధ పార్టీల్లో చేరిపోయారు. మాజీ ఎమ్మెల్యే గొట్టె భూపతి వరుసగా రెండుసార్లు రిజర్వ్డ్ స్థానం(నేరెళ్ల) నుంచి పోటీ చేసి, ప్రజా నాయకుడని నిరూపించుకున్నారు. నియోజకవర్గాల వారీగా గెలిచినవారు.. 1952లో మెట్పల్లి నుంచి జి.భూమయ్య, 1957లో హుజూరాబాద్ నుంచి పి.నర్సింగరావు, 1957లో హుజూరాబాద్ ద్వినియోజకవర్గం నుంచి జి.రాములు, 1962లో జగిత్యాల నుంచి ఎం.ధర్మారావు, 1962లో బుగ్గారం నుంచి ఎ.నారాయణరెడ్డి, 1967లో నేరెళ్ల నుంచి జి.భూపతి, 1967లో మెట్పల్లి నుంచి సీహెచ్.సత్యనారాయణరావు, 1967లో పెద్దపల్లి నుంచి జె.మల్లారెడ్డి, 1972లో నేరెళ్ల నుంచి జి.భూపతి, 1972లో బుగ్గారం నుంచి జె.దామోదర్‌రావు, 1972లో కమలాపూర్ నుంచి పి.జనార్ధన్‌రెడ్డి, 1989లో హుజూరాబాద్ నుంచి కె.సాయిరెడ్డి, 1989లో బుగ్గారం నుంచి జె.రత్నాకర్‌రావు, 1989లో కరీంనగర్ నుంచి వి.జగపతిరావు, 1994లో మేడారం నుంచి మాలెం మల్లేశం గెలుపొందారు. ఆ తర్వాత స్వతంత్రులకు ఆదరణ కరువైంది. -
తెలంగాణ ఎన్నికల బరిలో బర్రెలక్క.. నామినేషన్ దాఖలు
నాగర్‌కర్నూల్: రెండేళ్ల కిందట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన బర్రెలక్క గుర్తుందా?. డిగ్రీ చదివి తాను బర్రెలు కాసుకుంటున్నానని వీడియో ద్వారా తెగ వైరల్ అయ్యిందామె. ఆ వీడియోలోని బర్రెలక్క అలియాస్ శిరీష మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ‘‘హాయ్ ఫ్రెండ్స్.. నేను మీ బర్రెలక్కను డిగ్రీ చేసాను. ఫ్రెండ్స్ ఉద్యోగ నోటిఫికేషన్ లేక మా అమ్మను అడగి బర్రెలు కొన్నాను ఫ్రెండ్స్. ఎన్ని డిగ్రీలు చేసిన సర్టిఫికేట్లు వస్తున్నాయి తప్ప ఉద్యోగాలు వస్తలేవు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటూ సోషల్ మీడియాలో ఒకప్పుడు ఊపు ఊపిన వీడియో అది. ఆమె ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని శిరీష నిర్ణయించుకుంది. ఈ మేరకు కొల్లాపూర్(నాగర్ కర్నూల్) నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసింది కూడా. నిరుద్యోగుల తరపున పోరాడటం కోసమే తాను పోటీ చేస్తున్నానని ఈ సందర్భంగా శిరీష ప్రకటించుకుంది. ప్రజలకు ఇవ్వడానికి తన దగ్గర డబ్బు లేదని ప్రచారం చేయడానికి అంత సమయం లేదని అందరిని కలవకపోవచ్చు అందుకే ఈ వీడియో ఫ్రెండ్స్ అంటూ సోషల్ మీడియాలో వదిలింది. ప్రస్తుతం ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Barrelakka Siri (@princes_siri_barrelakka) View this post on Instagram A post shared by Barrelakka Siri (@princes_siri_barrelakka) View this post on Instagram A post shared by Telugu Scribe (@telugu_scribe) -
గాడిద సవారీతో నామినేషన్‌కు..
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ఊపందుకుంది. కొందరు అభ్యర్థులను వినూత్న మార్గాల్లో నామినేషన్లు వేస్తున్నారు. బుర్హాన్పూర్ నియోజకవర్గానికి ప్రియాంక్ ఠాకూర్ అనే స్వతంత్ర అభ్యర్థి గాడిదపై వచ్చి నామినేషన్ సమరి్పంచారు. ‘అన్ని రాజకీయ పార్టీలు తమ ఆశ్రితులకే టికెట్లు ఇస్తున్నాయి. ప్రజలను గాడిదలుగా, అంటే మూర్ఖులుగా తయారు చేస్తున్నాయి. అందుకే గాడిదపై సవారీ చేస్తూ వచ్చి నామినేషన్ వేయాలనుకున్నాను’ అని ఆయన అన్నారు. ఇదే సీటుకు కాంగ్రెస్ అభ్యర్థి ఠాకూర్ సురేంద్ర సింగ్ ఎడ్ల బండిపై మద్దతుదారులతో కలిసి వచ్చి నామినేషన్ వేశారు. బీజేపీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసన తెలిపేందుకే ఇలా చేసినట్లు చెప్పుకున్నారు. సన్వేర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రీనా బొరాసి ట్రాక్టర్‌పై వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. రైతుల సమస్యలను తెలిపేందుకే ఇలా చేశానన్నారు. రాష్ట్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి విశ్వాస్ సారంగ్ స్కూటర్‌పై వచ్చి నరేలా నియోజకవర్గానికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 చివరి తేదీ. -
ఎన్నికల్లో నామినేషన్ కోసం 22 కి.మీ పరిగెత్తాడు.. కారణం ఏంటంటే!
సాధారణంగా ఎన్నికల్లో నామినేషన్ అంటే చుట్టూ జనాలు, పదుల సంఖ్యలో వాహనాలు.. ఓ వేడుకను తలపిస్తుంటుంది. అయితే ఓ వ్యక్తి మాత్రం వీటికి భిన్నంగా 22 కి.మీ పరిగెత్తుకుంటూ వెళ్లి పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేశాడు. అయితే తాను ఈ పద్ధతినే ఎంచుకోవడం వెనుక ఓ కారణముందని చెబుతున్నాడు. అదేంటంటే.. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల 2023 నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అందుకే 22 కి.మీ పరగు డార్జిలింగ్ జిల్లాలోని సొనాడ గ్రామ పంచాయతీకి చెందిన తుమ్సోంగ్ ఖాస్మహల్ నివాసి అయిన సనారా సుబ్బా ఈ సారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నాడు. ఇక డార్జిలింగ్‌లో కొండ ప్రాంతంలోని గ్రామంలో రోడ్లు కూడా సరిగా ఉండవు, ఇక కమ్యూనికేషన్ వ్యవస్థ గురించి చెప్పక్కర్లేదు. ఈ సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశ్యంతో 22 కిలోమీటర్లు పరిగెత్తుతూ బీడీఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశాడు. ఎన్నో ఏళ్లుగా తమ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని ఈ విధంగా నిరసన తెలిపాడు. తన గ్రామంలోని రోడ్ల పరిస్థితి ఎంతో అధ్వాన్నంగా ఉందని.. ఎవరైనా అనారోగ్యానికి గురైతే, అతన్ని పర్వత సానువులలో అనేక కిలోమీటర్లు స్ట్రెచర్‌పై తీసుకెళ్లి అంబులెన్స్‌లో తీసుకెళ్లాల్సి ఉంటుందని తెలిపాడు. రోడ్లు లేకపోవడంతో విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారని అతను అభిప్రాయపడ్డాడు. పర్యావరణ కాలుష్యం పర్వతాలను కూడా ప్రభావితం చేసిందని.. దీంతో పాటు ట్రాఫిక్ జామ్ కూడా పెరిగిందని తెలిపాడు.ట్రాఫిక్ జామ్‌తో కొండవాలు, పర్యాటకులు కూడా నానా అవస్థలు పడుతున్నారని.. అయితే రాజకీయ పార్టీలకు వాటి గురించి ఆలోచించే సమయం లేదని వాపోతున్నాడు. చదవండి: తల్లి, ఐదుగురు చిన్నారులు సజీవదహనం -
పదేళ్ల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి.. ముద్రగడ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి ...
సాక్షి ప్రతినిధి, కాకినాడ: దశాబ్ద కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మౌనం వీడారు. రాజకీయంగా, ఉద్యమపరంగా సంచలనంగా నిలిచే ఈయన రాజకీయ పునరాగమనానికి ముహూర్తం దగ్గర పడిందా అంటే అవుననే అంటున్నారు సన్నిహితులు. 2016 జనవరి 31న తుని రైలు దహనం కేసులో ముద్రగడతో పాటు మరికొందరిపై నమోదైన కేసును రైల్వే కోర్టు ఇటీవల కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజకీయ నిర్ణయాన్ని భవిష్యత్‌లో ప్రకటిస్తానని ముద్రగడ లేఖ ద్వారా ప్రకటించారు. ఆ లేఖలో పలు అంశాలు ప్రస్తావించినా భవిష్యత్ రాజకీయ ప్రకటన పైనే అందరి దృష్టీ పడింది. ఆది నుంచీ కాపు ఉద్యమ సారథిగా ముద్రగడకు రాష్ట్రవ్యాప్తంగా ఆదరణ ఉంది. తాతల కాలం నుంచి వచ్చిన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ వచ్చిన ఈయన ప్రస్తుత కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 2014లో స్వతంత్ర అభ్యర్థిగా ఓటమి చెందారు. తరువాత నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇన్నేళ్ల తరువాత తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు సంకేతాలు ఇవ్వడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. అన్ని వర్గాలతో బలమైన బంధం సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండగానే రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో బలమైన సామాజికవర్గ ప్రతినిధిగా ముద్రగడకు పేరుంది. ఆ సామాజికవర్గం కోసం అనేక ఉద్యమాలు చేశారు. బీసీ, ఎస్సీ నేతలతో కూడా ఆయనకు సత్సంబంధాలున్నాయి. గతంలో సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కొన్ని పోస్టులకు కలత చెందిన ఆయన కాపు సామాజిక ఉద్యమానికి దూరంగా ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేపట్టిన ఉద్యమం మహోధృతమైంది. టీడీపీ ప్రభుత్వ పునాదుల్ని కదిలించింది. కాపు ఉద్యమంపై ఉక్కుపాదం మోపిన చంద్రబాబుతో తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పొత్తుకు సై అన్న తరుణంలో ముద్రగడ తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. జనసేనపై రగులుతున్న యువత తాజా పరిణామాలు యాదృచ్ఛికంగా జరిగినా రాజకీయాల్లో మాత్రం చర్చకు తెర తీశాయి. జనసేనపై గంపెడాశలు పెట్టుకున్న కాపు సామాజికవర్గం ప్రధానంగా కాపు యువత.. చంద్రబాబుతో దోస్తీ అనేసరికి మండిపడుతోంది. పవన్ నిర్ణయాన్ని తప్పు పడుతోంది. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటోంది. ఇటువంటి తరుణంలో ముద్రగడ రాజకీయంగా తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందనేది చర్చనీయాంశమైంది. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే సంకల్పంతో తలపెట్టిన ఉద్యమంలో ముద్రగడ అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అయిప్పటికీ ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాల వైపు మళ్లించలేదు. అభిమానుల ఒత్తిడి: 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పద్మనాభం.. ఓటమి అనంతరం కాపు ఉద్యమాన్ని కొనసాగించారు. తదనంతర పరిణామాల్లో 2020లో ఆ ఉద్యమం నుంచి దూరంగా జరిగారు. రైలు దహనం కేసు కొట్టివేసిన అనంతరం ఆయనకు అభిమానుల తాకిడి పెరిగింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని వారి నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ముద్రగడ ఏ పార్టీలో చేరుతారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలో రాజకీయ ప్రవేశం చేస్తానని చెప్పిన ముద్రగడపై సహచరుల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో ముద్రగడ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదీ రాజకీయ నేపథ్యం ముద్రగడ తాత పద్మనాభం మునసబుగా పని చేశారు. తండ్రి వీర రాఘవరావు 1962, 67 ఎన్నికల్లో ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా పని చేశారు. 1977లో తండ్రి మరణానంతరం పద్మనాభం అదే ప్రత్తిపాడు నుంచి 1978లో జనతా పార్టీ నుంచి తొలిసారి, 1983, 85లో రెండుసార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో పని చేసి, 1988లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, తరువాత మంత్రి అయ్యారు. 1995 ఎన్నికల్లో ముద్రగడ ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓటమి చెంది, 1999లో తిరిగి టీడీపీ నుంచి కాకినాడ ఎంపీ అయ్యారు. 2009లో వైఎస్ హయాంలో పిఠాపురం, 2014లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అన్ని ప్రధాన పార్టీల్లో పని చేసిన రాజకీయ అనుభవం ముద్రగడకు ఉంది. పాత, కొత్త తరం నేతలతో రాజకీయాలు నడిపిన నేపథ్యమూ ఉంది. -
కర్నాటకలో ట్విస్ట్.. ఎన్నికల బరిలో కేజీఎఫ్ బాబు భార్య
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జాతీయ పార్టీలు సీనియర్లకు, కీలక నేతలకు సీటు ఇవ్వకపోవడంతో వారు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఇదే సమయంలో కొందరు ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించిన ఓ కోటీశ్వరుడు ఇప్పుడు తన భార్యను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నాడు. వివరాల ప్రకారం.. కర్నాటకలోని ధనవంతుల లిస్టులో కేజీఎఫ్వాసి యూసుఫ్ షరీఫ్ కూడా ఒకరు. యూసుఫ్‌ను అలియాస్ కేజీఎఫ్ బాబుగా పిలుస్తారు. అయితే, కేజీఎఫ్ బాబు రెండేండ్ల క్రితం కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాను చిక్కపేట నుంచి పోటీచేయాలని భావించి ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో కాంగ్రెస్ కేజీఎఫ్ బాబుకు అవకాశం ఇవ్వకపోగా, పార్టీ నేతల్లో నెలకొన్న విభేదాల కారణంగా ఏకంగా ఆయనపై సస్పెండ్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో సస్పెండ్‌ను సీరియస్‌గా తీసుకున్న కేజీఎఫ్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను పోటీ చేయాలనుకున్న స్థానం నుంచి ఆయన తన భార్య షాజియాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించారు. ఇందుకోసం ఆమె గురువారం నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేశారు. తన భర్త బాబు, కుమార్తెతో కలిసి నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఇక, కేజీఎఫ్ బాబు కర్నాటకలో గుజిరీ వ్యాపారాన్ని ప్రారంభించి కోట్ల రూపాయలు సంపాదించారు. కేజీఎఫ్ బాబు అంతుకుముందు ఎన్నికల సమయంలో ఆయన తన ఆస్తిని రూ.1,743 కోట్లుగా ప్రకటించి సంచలనం సృష్టించారు. దీంతో, దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగింది. ఇక, తాజాగా ఆయన భార్య కూడా ఎన్నికల బరిలో నిలవడంతో మరోసారి ఆయన హాట్ టాపిక్‌గా మారారు. -
ఓటర్లకు ఆన్లైన్లో నగదు పంపిణీ
తాడిపత్రి అర్బన్: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న చామల వెంకట అనిల్‌కుమార్‌రెడ్డి ఉపాధ్యాయుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమచేసేందుకు యత్నించి పోలీసులకు దొరికిపోయారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ ఎస్ఐ ధరణీబాబు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రి పట్టణంలోని గన్నెవారిపల్లి కాలనీలో ఉన్న లార్డ్ ఆసుపత్రి అధినేత చామల వెంకట అనిల్‌కుమార్‌రెడ్డి పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే, ఓటమి ఖాయమని భావించిన ఆయన కొత్త పద్ధతుల్లో డబ్బు పంపిణీకి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలం కోడిగుడ్లపాడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాంబశివారెడ్డి, యల్లనూరుకు చెందిన పోస్టుమన్ నగేష్ ద్వారా తాడిపత్రి పోలీస్‌స్టేషన్ సమీపంలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ సర్వీస్ పాయింట్ (సీఎస్పీ)లో శుక్రవారం 28 మంది ఉపాధ్యాయ ఓటర్ల ఖాతాల్లోకి నేరుగా రూ.49 వేల నగదు బదిలీ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పట్టణ, రూరల్ పోలీసులు దాడులు నిర్వహించి కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వాహకుడు శివశంకర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. సాంబశివారెడ్డి, నగేష్ ప్రోద్బలంతో నగదు బదిలీ చేసినట్లు అతను అంగీకరించాడు. అతని నుంచి రూ.1,36,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అతనితో పాటు హెచ్ఎం సాంబశివారెడ్డి, పోస్టుమన్ నగేష్‌పై కేసు నమోదు చేశారు. మరోవైపు.. అనిల్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా కొండేపల్లికి చెందిన ఉపాద్యాయులు వజ్రగిరి, వైఎస్సార్ జిల్లా రైల్వే కొండాపురం మండలం బెంజి అనంతపురానికి చెందిన ఉపాధ్యాయుడు బత్తల రాజు, పి. నరసింహులుతో పాటు మరికొందరు కూడా శుక్రవారం తాడిపత్రిలో ఓటర్లకు నగదు పంపిణీ చేపట్టినట్లు పోలీసు విచారణలో తేలింది. -
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దినసరి కూలీ.. రూపాయి నాణేలతో..
గాంధీనగర్: డిసెంబర్ మొదటి వారంలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో దినసరి కూలీగా పనిచేసే ఒక యువకుడు బరిలోకి దిగుతున్నాడు. గాంధీ నగర్‌లోని ఓ మురికివాడలో నివసించే మహేంద్ర పాట్నీకి స్థానికులు మద్దతుగా నిలుస్తున్నారు. వీరి నుంచి ఇతడు రూ.10వేలు సేకరించాడు. ఈ డబ్బంతా రూపాయి నాణేల రూపంలోనే ఉండటం గమనార్హం. ఈ మొత్తాన్ని తీసుకెళ్లి అతడు ఎన్నికల సంఘం వద్ద సెక్యూరిటీ డిపాజిట్ చేశాడు. దీంతో డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నాడు. మహేంద్ర పాట్నీ గాంధీనగర్ నార్త్ నుంచి పోటీ చేస్తున్నాడు. అయితే ఈ యువకుడు స్వతహాగా ఎన్నికల బరిలో దిగడానికి బలమైన కారణమే ఉంది. 2019లో ఓ హోటల్‌కు దారికోసం ఇతడు నివసించే మురికివాడను అధికారులు తొలగించారు. 521 గుడిసెలను నేలమట్టం చేశారు. దీంతో వారు గత్యంతరంలేక వేరేప్రాంతానికి తరలివెళ్లారు. కానీ అక్కడ విద్యుత్, నీటి సరఫరా వంటి కనీస సౌకర్యాలు లేవు. వీరిని పట్టించుకునే నాథుడు కూడా లేడు. దీంతో ఈ ప్రాంతంలో నివసించే వారంసా తమ ప్రతినిధిగా మహేంద్ర పాట్నీని నిలబెట్టారు. ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకున్నా స్వతంత్రంగా బరిలోకి దింపుతున్నారు. 2010లోనూ మహెంద్ర పాట్నీ నివసించే మురికివాడను అధికారులు తొలగించారు. మహాత్మా గాంధీకి అంకితం చేస్తూ ప్రభుత్వం నిర్మించిన దండీ కుటీర్ మ్యూజియం కోసం వీరి గుడిసెలను తొలగించారు. ఇప్పుడు మళ్లీ మరోమారు ఓ హోటల్‌కు దారికోసం వీరి కాలనీని కాళీ చేయించారు. దీంతో తమ సమస్యను పరిష్కరించునేందుకు అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకుని మహేంద్ర పాట్నీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ వద్దకు వస్తాయని, కానీ ఎన్నికల తర్వాత తమ గోడు ఎవరూ వినిపించుకోవడం లేదని వీరు వాపోతున్నారు. అందుకే తామే స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు. అయితే ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా వచ్చి తమ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటానని మహేంద్ర పాట్నీ చెబుతున్నాడు. తాము నివసించేందుకు శాశ్వతంగా ఒక స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నాడు. అంతేకాదు తమ దుకాణాలు, తోపుడు బండ్లను అధికారులు తరచూ సీజ్ చేస్తున్నారని, తిరిగి వాటిని విడిచిపెట్టేందుకు రూ.2500-3000 తీసుకుంటున్నారని తెలిపాడు. ఇలా జరగకుండా ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు డిసెంబర్ 2, 5 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 8న ప్రకటిస్తారు. చదవండి: అది మసాజ్ కాదు.. ట్రీట్మెంట్.. జైలు వీడియోపై ఆప్ కౌంటర్.. -
పదోసారి పోటీ.. మునుగోడులో విజయం నాదే : మారం వెంకట్‌రెడ్డి
నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికలో మొదటి రోజు నామినేషన్ వేసిన అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన మారం వెంకట్‌రెడ్డి 1996 నుంచి ఇప్పటికి 9 సార్లు చట్టసభలకు పోటీ చేశారు. మునుగోడులో పోటీతో పదవది అవుతుంది. 1999, 2004లో తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి, 2009, 2014, 2018లో సూర్యాపేట శాసనసభ స్థానానికి ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. 1996లో మిర్యాలగూడ పార్లమెంట్ స్థానానికి, 2019లో నల్లగొండ పార్లమెంట్ స్థానానికి పోటీచేశారు. నల్లగొండ పార్లమెంట్ స్థానంలో తనకు 10వేల పైచిలుకు ఓట్లు వచ్చినట్లు వెంకట్‌రెడ్డి చెప్పారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేశానని, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో నామినేషన్ వేసి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా విత్‌డ్రా అయ్యానని తెలిపారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా పోటీచేసినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయడంతో తాను 10వసారి ఎన్నికల్లో పోటీ చేసినట్లవుతుందన్నారు. మునుగోడులో తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తాను ఆ పార్టీలో పనిచేశానని, 2004 వరకు తుంగతుర్తి నియోజకవర్గంలో చురుగ్గా పనిచేశానని, అప్పటి ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడంతో పార్టీని వదిలానని వెంకట్‌రెడ్డి వివరించారు. ఆర్ఎంపీగా జీవనం గడుపుతున్నట్టు చెప్పారు. నామినేషన్‌కు, ఎన్నికల ప్రచారానికి ఖర్చవుతుంది కదా అని ప్రశ్నించగా.. ప్రజా సేవకోసం తానేమీ బాధ పడటం లేదని.. ప్రజలెప్పుడో ఒకసారి తనను అర్థం చేసుకుంటారని.. ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకే పోటీ చేస్తున్నానని వివరించారు. -
ఓ అభ్యర్థికి ఒక్క ఓటూ పడలేదు..
మదనపల్లె (చిత్తూరు జిల్లా): మదనపల్లె మునిసిపాలిటీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. 16వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్.రవీంద్ర నాయుడుకు ఒక్క ఓటు కూడా పడలేదు. కాగా, ఆయనకు ఈ వార్డులో ఓటు లేదు. అలాగే రెండో వార్డులో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరఫున బరిలోకి దిగిన ఆర్.పవన్‌కుమార్‌కు కేవలం ఒకే ఒక్క ఓటు లభించింది. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఇదే వార్డులో ఓట్లున్నా ఆయనకు ఒక్క ఓటే పడటం గమనార్హం. అదేవిధంగా బీఎస్పీ తరఫున ఒకటో వార్డులో బరిలోకి దిగిన కందూరు సహదేవుడుకు 2 ఓట్లు మాత్రమే లభించాయి. ఆయనకు ఈ వార్డులో ఓటు లేదు. చదవండి: బాబు సొంత జిల్లాలో టీడీపీకి ఘోర పరాభవం మున్సిపల్ ఎన్నికలు: టీడీపీ సీనియర్లకు షాక్ -
బిర్యానీ ప్యాకెట్లలో బంగారు ముక్కు పుడకలు
నంద్యాల: ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఓ అభ్యర్థి ఓటర్లకు గాలం వేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నంద్యాల పట్టణంలోని 12వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా ఖండే శ్యాంసుందర్‌లాల్ పోటీ చేస్తున్నాడు. ఓటర్లను డబ్బు, బంగారంతో మభ్యపెట్టాలని చూశాడు. ఎవరికీ అనుమానం రాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కొందరిని కిరాయికి పిలిపించాడు. మంగళవారం బిర్యాని పొట్లాల్లో ముక్కుపుడకలు ఉంచి ఓటర్లకు పంపిణీ చేయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు పంపిణీ చేస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాఘవేంద్రస్వామి, రవికిరణ్, మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు బైకులు,రూ.55 వేల నగదు, 23 బంగారు ముక్కుపుడకలు, బిర్యానీ పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. అభ్యర్థి శ్యామ్‌సుందర్‌లాల్‌తో పాటు మరో ముగ్గురిపై ఎన్నికల నియామావళి అతిక్రమణ కింద కేసు నమోదు చేశారు. చదవండి: బయటకు వెళ్లకుండా తల వ్రెంటుకలను కట్ చేయించి.. -
మహారాష్ట్ర ఎంఎల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ
సాక్షి, ముంబై: మహారాష్ట్ర శాసన మండలిలో ఖాళీ అయిన ఆరు స్థానాలకు జరిగిన ఎన్ని కల్లో నాలుగు స్థానాలు మహావికాస్ ఆఘాడి (కాంగ్రెస్–ఎన్సీపీ–శివసేన), ఒక స్థానం స్వతంత్ర అభ్యర్ధి, ఒక స్థానం బీజేపీ కైవసం చేసుకున్నాయి. రాష్ట్రంలోని మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలతో పాటు ఒక స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కరోనా మహ మ్మారి నేపథ్యంలో లాక్డౌన్ ఆంక్షలను సడలించిన అనంతరం జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రావడంతో మహావికాస్ ఆఘాడిలో నూతన ఉత్సాహం నిండింది. డిసెంబర్ 1న జరిగిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ప్రారంభం కాగా బీజేపీకి తొలి విజయం దక్కింది. ధులే–నందుర్బార్ స్థానిక సంస్థ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అమరీష్ పటేల్ విజయం సాధించారు. అయితే మిగిలిన స్థానాల్లో మాత్రం బీజేపీ ఓటమిపాలైంది. ముఖ్యంగా పెట్టని కోటగా ఉండే నాగపూర్, పుణే, ఔరంగాబాద్‌లలో బీజేపీకి షాక్‌నిస్తూ మహావికాస్ ఆఘాడి విజయ ఢంకా మోగించింది. పుణే పట్టభద్రుల నియోజకవర్గంలో మహావికాస్ ఆఘాడికి చెందిన ఎన్సీపీ అభ్యర్థి అరుణ్ లాడ్ విజయం సాధించారు. సుమారు 60 ఏళ్ల అనంతరం నాగపూర్‌లో బీజేపీ పరాజయం పాలైంది. ఈ నియోజకవర్గంలో మహావికాస్ ఆఘాడికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి అభిజిత్ వంజారీ తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సందీప్ జోషిపై విజయం సాధించారు. అమరావతి టీచర్ల నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్ధి కిరణ్ సర్నాయక్ గెలుపొందారు. -
ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సామాజిక విశ్లేషకుడు, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగనున్నారు. గతంలో 2007, 2009లలో ఎమ్మెల్సీగా ఆయన విజయం సాధించారు. 2014 వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు. ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల మద్దతుతో తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీ చేసే అంశంపై మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వెలువడుతున్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ స్పష్టత ఇచ్చారు. -
ఎన్నికల్లో ‘చిల్లర’ డిపాజిట్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లాతూర్ స్థానం నుంచి స్వతంత్ర పోటీ చేస్తున్న ఓ యువ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. నామినేషన్ వేసేందుకు చెల్లించాల్సిన డిపాజిట్ రూ.10 వేల మొత్తాన్ని రూ. 10 రూపాయల నాణేలతో చెల్లించారు. సెంట్రల్ మహారాష్ట్రలోని లాతూర్ నుంచి పోటీ చేస్తున్న సంతోష్ సబ్డే (28) పట్టణంలో ఉన్న సమస్యను ఎత్తిచూపేందుకు, ఓ సినిమా నుంచి స్ఫూర్తి పొంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నగరంలో పలు దుకాణాల్లో రూ. 10 నాణేలను స్వీకరించడం లేదని, దీన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ మార్గం ఎంచుకున్నట్లు తెలిపారు. మొదట ఎన్నికల అధికారులు కూడా రూ. 10 నాణేలను వద్దన్నారని, విషయం మీడియాకు తెలియడంతో రూ. 1000 వరకూ రూ. 10 నాణేలు తీసుకుంటామని, మిగిలింది నోట్ల రూపంలో ఇవ్వాలని కోరారని తెలిపారు. అయితే తాను ససేమీరా అనడంతో చివరకు మొత్తాన్ని రూ. 10 నాణేల రూపంలో స్వీకరించారని తెలిపారు. -
వన్ థర్డ్
మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తే వచ్చింది.. లేదంటే మహిళలే తమంతట తాము ముప్పై మూడు శాతంలోకి వచ్చేస్తారన్న ఒక ఉత్తేజకరమైన ఆశాభావాన్ని అత్యధికంగా ఎన్నికైన కొత్త మహిళా ఎంపీల సంఖ్య కలిగిస్తోంది. మహిళలు ఉత్సాహంగా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఈ సంఖ్య పెరగడం అనేది ఒక ప్రేరణాంశం. మాధవ్ శింగరాజు పార్టీల సిద్ధాంతాలు వేరుగా ఉన్నట్లే, ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే హామీలూ వేరుగా ఉంటాయి. అయితే ఈసారి నరేంద్రమోదీ, రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు వేర్వేరుగా ఉన్నప్పటికీ ఒక విషయంలో మాత్రం ఇద్దరూ ఒకే విధమైన హామీ ఇచ్చారు. తమని అధికారంలోకి తెస్తే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని! బాగా పాతబడిన హామీ ఇది. ఇరవై రెండేళ్లుగా నాయకులు హామీ అయితే ఇస్తున్నారు కానీ, రిజర్వేషన్ మాత్రం ఇవ్వడం లేదు. గత ఐదేళ్ల పాలనలో మన్‌కీ బాత్, పాకిస్తాన్‌కి జరిపిన ఆశ్చర్యకర పర్యటన, ‘యోగా డే’కి ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రసంగం, పెద్ద నోట్ల రద్దు, స్వచ్ఛ భారత్, సర్జికల్ స్ట్రయిక్స్.. ఇవి మాత్రమే మోదీ సాధించిన ఘనతలుగా, గుర్తులుగా మిగిలిపోయాయి. రిజర్వేషన్ బిల్లుని నోటి మాటగానైనా మోదీ ఎక్కడా ప్రస్తావించలేదు. బహుశా పైన వేటికీ (మన్ కీ బాత్ వగైరా..) పార్లమెంటు ఆమోదం అవసరం లేదు కాబట్టి అవి సాధ్యమయ్యాయేమో! మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం అవసరం. రాజ్యసభ 2010లోనే బిల్లును ఆమోదించింది. అప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. పదహారవ లోక్‌సభలో (ఇప్పుడొచ్చింది పదిహేడవ లోక్‌సభ) ఎన్డీయేకి తగినంత బలం ఉన్నప్పటికీ మహిళా బిల్లును తెచ్చే సంకల్పబలం లేకపోయింది. గత ఐదేళ్లలో వంద వరకు కీలకమైన బిల్లులు పాస్ అయిన లోక్‌సభలో మహిళా బిల్లు కనీసం ప్రతిపాదనకు కూడా రాలేదు.హెచ్.డి. దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు తొలిసారిగా 1996 సెప్టెంబర్ 12న పార్లమెంటులో ప్రతిపాదనకు వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఆయన తర్వాత.. ఐ.కె.గుజ్రాల్, అటల్ బిహారీ వాజ్‌పేయి. మన్మోహన్సింగ్, నరేంద్ర మోదీ.. ఇంత మంది ప్రధానులు మారినా.. లోక్‌సభకు రాలేదు. మహిళా బిల్లు చట్టంగా వస్తే కనుక లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల స్థానాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లభిస్తుంది. మహిళా బిల్లు చట్టంగా రావాలంటే లోక్‌సభలో, రాజ్యసభలో ఆమోదం పొందాలి. దేశంలోని కనీసం సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. రాష్ట్రపతి సంతకం చేయాలి. ఇప్పటి వరకు ఒక్క రాజ్యసభలో మాత్రమే అయితే బిల్లు ఆమోదం పొందింది.2009 డిసెంబర్ 17న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రెండు సభల్లో బిల్లును ప్రవేశపెట్టింది. సమాజ్‌వాదీ, జనతాదళ్ (యు), ఆర్జేడీ నిరసనలు, తీవ్ర వ్యతిరేకతల నడుమ బిల్లుపై ప్రభుత్వం ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయింది. అనంతరం 2010 మార్చి 8న బిల్లును ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఆ మర్నాడు జరిగిన ఓటింగులో భారీ మెజారిటీతో మహిళా బిల్లును రాజ్యసభ ఆమోదించింది. అప్పట్నుంచీ ఎనిమిదేళ్లు గడిచాయి. జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం లేకపోవడం వల్లనే బిల్లును లోక్‌సభకు తేలేకపోతున్నామని రెండు దశాబ్దాలుగా ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నా.. వాస్తవానికి రాజ్యాంగం ప్రకారం గానీ, పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం గానీ ఒక చట్టం తెచ్చేందుకు ఏకాభిప్రాయంతో పని లేదని నిపుణులు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు.బీజేపీని గెలిపిస్తే మహిళా రిజర్వేషన్ బిల్లును తెస్తామని ఈ ఎన్నికల్లో మోదీ హామీ ఇచ్చారు. ఆ హామీ కారణంగానే ఆయన గెలవక పోవచ్చు కానీ, గెలిచాక హామీని నెరవేర్చే బాధ్యత ఆయన మీద ఉంది. రాహుల్ వచ్చి ఉంటే రాహుల్ మీద ఉండేది. కొద్ది రోజుల్లో కొలువు తీరబోతున్న కొత్త లోక్‌సభకు 78 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటి వరకు జరిగిన పదహారు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇంత పెద్ద సంఖ్యలో మహిళా ఎంపీలు లేరు. 78 మంది అంటే లోక్‌సభలో 14 శాతం. ఇది ముప్పైమూడు శాతానికి చేరుకోవాలంటే ఇంకా 103 మంది ఉండాలి. రిజర్వేషన్లేమీ లేకుండా లోక్‌సభలో మహిళా ఎంపీల సంఖ్య వన్ థర్డ్కు (వందకు ముప్పైమూడు) అందుకోవాలంటే మరో నలభై ఏళ్లు పడుతుందని ఒక అంచనా! అంటే మరో ఎనిమిది సార్వత్రిక ఎన్నికలు. ‘పెర్ఫార్మింగ్ రిప్రెజెంటేషన్ : ఉమెన్ మెంబర్స్ ఇన్ ది ఇండియన్ పార్లమెంట్’ అనే పుస్తకం కోసం 2009–2016 మధ్య.. డాక్టర్ కరోల్ స్ప్రే అనే ఇంగ్లండ్ ప్రొఫెసర్.. షిరిన్ రాయ్ అనే భారతీయ ప్రొఫెసర్ సహకారంతో వందల మంది మహిళా ఎంపీలను, పురుష ఎంపీలను ఇంటర్వ్యూ చేశారు. కరోల్ వేసిందే ఈ ‘మరో నలభై ఏళ్లు’ అనే అంచనా. అసలీ రిజర్వేషన్లు లేకుండా ప్రతి పార్టీ తప్పనిసరిగా 33 శాతం సీట్లను మహిళలకు ఇచ్చేలా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరిస్తే పోయేదానికి రాజ్యాంగాన్నే సవరించడం ఎందుకు?! అలా చేస్తే మహిళలకు మళ్లీ అదొక అవరోధం అవుతుంది. ఓడిపోయే స్థానాల్లో పార్టీలు మహిళా అభ్యర్థుల్ని నిలబెట్టి, గెలిచే చోట మగాళ్లను నిలబెడతాయి. అప్పుడిక రిజర్వేషన్ అన్నమాటకే అర్థం ఉండదు. పోటీ చేసేవాళ్లు 33 శాతం ఉంటారు కానీ, గెలిచి చట్టసభల్లోకి వెళ్లే వాళ్లు అంతమంది ఉండరు. ఇన్ని రాజకీయాలు ఉంటాయి కనుకే మహిళలు చట్టసభల్లోకి రావడానికి మహిళా రిజర్వేషన్ చట్టం తప్పనిసరిగా ఉండాలి. చట్టం రాకపోతే.. కరోల్ భావిస్తున్నట్లు చట్టంతో పనిలేకుండా తమంతట తామే ముప్పై మూడు శాతంలోకి వచ్చేస్తారు..కాలక్రమంలోనో, కాలాన్ని తామే ముందుకు నడిపిస్తూనో! -
ఆస్తి రూ.1,107 కోట్లు.. దక్కింది1,558 ఓట్లు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో అత్యంత ధనవంతుడైన రమేశ్‌కుమార్ శర్మ డిపాజిట్ గల్లంతైంది. ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తిని రూ.1,107 కోట్లుగా పేర్కొన్న రమేశ్‌కుమార్, బిహార్‌లోని పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. ఆయనకు కేవలం 1,558 ఓట్లు మాత్రమే రావడంతో డి´జిట్‌ను కోల్పోయారు. మొత్తం పోలైన ఓట్లలో ఆయనకు వచ్చినవి 0.14 శాతం ఓట్లు మాత్రమే. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రామ్‌క్రిపాల్ యాదవ్ గెలుపొందారు. రామ్క్రిపాల్కు 5 లక్షల ఓట్లు(47.28 శాతం) రాగా, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి 4.7 లక్షల ఓట్లతో (43.63 శాతం) రెండో స్థానంలో నిలిచారు. లోక్‌సభలో పోటీపడిన టాప్ 5 ధనవంతుల్లో రమేశ్‌కుమార్ మినహా మిగతా నలుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. వారిలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రూ.895 కోట్ల ఆస్తితో రెండో స్థానంలో, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్ రూ.660 కోట్ల ఆస్తితో మూడో స్థానంలో, వసంతకుమార్ రూ.417 కోట్ల ఆస్తితో నాలుగో స్థానంలో, జ్యోతిరాదిత్య సింధియా రూ.374 కోట్ల ఆస్తితో ఐదో స్థానంలో ఉన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో బరిలో నిలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి చేతిలో 14,317 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మధ్యప్రదేశ్ లోని చిన్‌ద్వారా నియోజకవర్గంలో పోటీచేసి న నకుల్ నాథ్ 35 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. తమిళనాడులోని కన్యాకుమా రి నియోజకవర్గంలో వసంతకుమార్ 3 లక్షల ఓట్ల మెజారిటీలో విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గంలో పోటీచేసిన జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ అభ్యర్థి క్రిష్ణపాల్ సింగ్ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. -
నామ్‌కే వాస్తే లాలూ!
ఈ ఎన్నికల్లో ‘నామ్‌కే వాస్తే’ అభ్యర్థుల బెడద అసలు అభ్యర్థులకు తప్పడం లేదు. ఊరూ పేరూ లేకున్నా పాపులర్ రాజకీయ వేత్తల పేర్లున్న సాధారణ పౌరులను అసలు సిసలు అభ్యర్థులపై పోటీకి నిలబెట్టి ఓట్లు చీల్చే ప్రక్రియతో అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. మే 6న పోలింగ్ జరిగే సారణ్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసే అభ్యర్థుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ పేరు కూడా ఉండడంతో అక్కడి ఓటర్లు తికమకపడే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే నిజానికి అభ్యర్థుల జాబితాలో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం దాణా స్కాంలో జైల్లో ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు అయిన అసలు సిసలు లాలూ ప్రసాద్ యాదవ్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అయితే ఈ లాలూ కేవలం ఓ సాదాసీదా నామ్‌కే వాస్తే లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రమే. అయితే 2014లో రబ్రీదేవి మీద స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఈ మామూలు లాలూ ప్రసాద్ యాదవ్‌కి 9,956 ఓట్లు వచ్చాయి. ఇతని మాదిరిగానే ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మాదిరి పేరున్న మరో వ్యక్తి కూడా 2014లో రబ్రీ దేవిపై పోటీ చేశారు. అతనికి కూడా 14,688 ఓట్లు రావడం విశేషం. అయితే ఇలా ఒకే పేరున్న అభ్యర్థులు ఓట్లు చీల్చడం వల్లనే రబ్రీదేవి ఆ ఎన్నికల్లో 40,948 ఓట్ల తేడాతో ఓడిపోవాల్సి వచ్చిందని ఆర్జేడీ ఆరోపిస్తోంది. ఈ నామ్‌కే వాస్తే లాలూ యాదవ్ తనకు ఏ స్థిర చరాస్తులూ లేవని నామినేషన్ పత్రాల్లో నమోదు చేశారు. అలాగే ఇతనికి పెళ్ళి అయ్యింది, పిల్లలు కూడా ఉన్నప్పటికీ వారి వివరాలేవీ ఇందులో పొందుపరచలేదు. సెక్యూరిటీ డిపాజిట్ కింద 25,000 రూపాయలను చెల్లించి నామినేషన్ పత్రాలను పొందిన లాలూ కాని లాలూ ప్రసాద్ భవిష్యత్తులో తమ ఓటర్లను తికమకపెట్టే పరిస్థితి ఉందని ఆర్జేడీ ఆందోళన పడుతోంది. -
బెంగళూరు దక్షిణ నియోజకవర్గంలో మౌనవ్రత అభ్యర్థి
-
స్వతంత్ర అభ్యర్థిగా!
‘జస్ట్ ఆస్కింగ్’ అనే యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో సామాజిక అంశాలపై తన అభిప్రాయలను షేర్ చేసుకుంటుంటారు నటుడు ప్రకాశ్‌రాజ్. ఇప్పుడు ఆయన ప్రజల తరఫున రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ‘‘ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ (ప్రజలు) సపోర్ట్‌తో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. ఎక్కడి నుంచి అనే వివరాలు త్వరలో వెల్లడిస్తాను. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాను. ఇప్పుడు నా బాధ్యత మరింత పెరిగింది’’ అని ట్వీట్ చేశారు ప్రకాశ్‌రాజ్. ప్రస్తుతం ఆయన సౌత్ మూవీస్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
వెరైటీ ప్రచారం: ఒక చేత చెప్పులు.. మరో చేత రాజీనామా
సాక్షి, జగిత్యాల : రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ముగిసి.. ప్రచార హోరు పుంజుకుంటుంది. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి ఇంటింటికి వెళ్లి చెప్పులు పంచుతూ.. వెరైటీ ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. వివరాలు.. జిల్లాలోని కొరుట్ల నియోజవర్గం నుంచి ఆకుల హన్మంతు అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మంతు ఇంటింటికి తిరుగుతూ తనను గెలిపించాల్సిందిగా ఓటర్లకు మనవి చేశారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే తాను ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తానన్నారు. ఒక వేళ మాట తప్పితే పబ్లిక్‌గా తనను చెప్పు తీసుకుని కొట్టండంటూ ఓటర్లకు చెప్పులను కూడా పంచారు. హామీలను నెరవేర్చకపోతే తనను పదవి నుంచి తొలగించవచ్చంటూ..ముందే సిద్ధం చేసి పెట్టుకున్న రాజీనామా పత్రాన్ని కూడా జనాలకు చూపిస్తున్నారు. ఈ విషయం గురించి హన్మంతు మాట్లాడుతూ.. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకే తాను ఇలా ప్రచారం చేస్తున్నానంటూ తెలిపారు. అయితే కోరుట్ల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పోటీచేస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు విజయం సాధించిన విద్యాసాగర్ రావు వరుసగా నాల్గోసారి విజయం సాధించాలని ఉవ్విళూరుతుండగా.. అధికార పార్టీ అభ్యర్థి మీద విజయం సాధించాలని హన్మంతు కృషి చేస్తున్నారు. -
స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తా
సాక్షి,మునుగోడు : త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలువనున్నట్లు టీఆర్ఎస్ బహిష్కృత నేత వేనేపల్లి వెంకటేశ్వర్ రావు అన్నారు. సోమవారం మునుగోడులో మునుగోడు, నారాయణపురం మండలాల టీఆర్ఎస్ పార్టీ అసమ్మతి నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం చౌటుప్పల్, నాంపల్లి మండలాల కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తే ప్రతి ఒక్కరు ఎన్నికల బరిలో నిలవాలని కోరుతున్నారన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిపై వ్యతిరేకత కలిసి వస్తుందని, ఆయనకు ఓట్లు వేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. అదేవిధంగా మహాకూటమి అభ్యర్థి నేటికీ తేలకపోవడంతో కాస్త శ్రమించి ప్రజల్లోకి వెళ్లి తాను చేయబోయే అభివృద్ధి వివరించి గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. అందరి కోరిక మేరకు ఈ నెల 14 న నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తన గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మాజీ ఎమ్మెల్యే కొందరిపై చేస్తున్న కక్షపూరిత చర్యలను అడ్డుకునేందుకే తాను బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్‌లు వీరమళ్ల నర్సింహగౌడ్, పందుల నర్సింహ, ముప్ప రవీందర్‌రెడ్డి, జీడిమెట్ల యశోధ, భిక్షం, ఎంపీటీసీ జీడిమడ్ల నర్సమ్మ, యాదయ్య, ఎండీ పాష, కొత్త శంకర్, చలిచీమల యాదగిరి, సైదులు, నాగేందర్, యాదయ్య, వీరేశం, తీగల యాదయ్య, పందుల వెంకటేశ్వర్లు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నామినేషన్‌కు నాణేలు
ఆదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేసిన తొగరి రాములు డిపాజిట్ కోసం రూపాయి నాణేలు తీసుకొచ్చారు. ఒక్కో ప్లాస్టిక్ కవర్లో రూ.2,500 చొప్పున రెండు కవర్లకు బ్యాంకు సీల్ వేయించి నామినేషన్ కేంద్రానికి తీసుకొచ్చారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుకుంటున్న ప్రజలు, సన్నిహితులు ఒక్కో రూపాయి చొప్పున పది వేల మంది రూ.10 వేల నాణేలు ఇచ్చారని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రాములు తెలిపారు. రూ.5 వేల నాణేలను నామినేషన్ డిపాజిట్ కింద రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. డిపాజిట్ కోసం నాణేలను తీసుకురావడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. -
స్వతంత్ర అభ్యర్థిగా.. కసిరెడ్డి నారాయణరెడ్డి?
కల్వకుర్తి సెగ్మెంట్ నుంచి బరిలో దిగాలని భావించిన కసిరెడ్డి నారాయణరెడ్డికి టీఆర్ఎస్ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. టికెట్‌ను జైపాల్‌యాదవ్‌కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అందరూ సమష్టిగా కృషి చేయాలని మంత్రి కేటీఆర్ అసమ్మతి నేతలను బుజ్జగించినా ఫలితం లేనట్టుగా కనిపిస్తోంది. అసెంబ్లీ బరిలో దిగాలని కసిరెడ్డిపై ఆయన అనుచరగణం తీవ్ర ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కసిరెడ్డి పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆమనగల్లు (రంగారెడ్డి): ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి శాసనసభ బరిలో దిగాలని దాదాపుగా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. స్వతంత్ర అభ్యర్థిగా ఆయన కల్వకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్‌కు పోటీ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈమేరకు తన అనుచరవర్గానికి సంకేతాలిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ టికెట్‌ను ఆశించిన ఆయనకు అధిష్టానం నుంచి చుక్కెదురైంది. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అభ్యర్థిత్వానికి ఆమోదముద్ర వేయడంతో కసిరెడ్డికి నిరాశే మిగిలింది. ఈ పరిణామాలను జీర్ణించుకోలేని ఆయన సన్నిహితులు సైతం బరిలో దిగాల్సిందేనని తెగేసి చెబుతున్నారు.ముఖ్యంగా గత ఎన్నికల్లో జైపాల్‌కు వ్యతిరేకంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కసిరెడ్డికి అనుకూలంగా వ్యవహరించిన నేతలకు తాజా పరిణామాలు మింగుడుపడడంలేదు. దీంతో కినుక వహించిన కసిరెడ్డి.. పార్టీ అభ్యర్థి జైపాల్‌యాదవ్ ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. గత నాలుగైదు రోజులుగా తన మద్దతుదారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్న ఎమ్మెల్సీకి వారి నుంచి బరిలో దిగాలని తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. కేటీఆర్ సముదాయించినా.. కల్వకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆశావహులతో ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని, వెన్నంటి నిలిచినవారికి సముచిత స్థానం కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సమావేశానికి హాజరైన కసిరెడ్డి కూడా మెత్తబడ్డట్లే కనిపించినా.. తన అనుచరుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పునరాలోచనలో పడ్డారు. -
పాక్ ఎన్నికల్లో హిందూ మహిళ పోటీ
కరాచీ: పాకిస్తాన్లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న హిందూ మహిళగా సింధ్ ప్రావిన్సుకు చెందిన సునీతా పర్మార్ (31) రికార్డు సృష్టించారు. జూలై 25న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, థార్పార్కర్ జిల్లాలోని సింధ్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సునీత బరిలో నిలిచారు. పాక్‌లో అల్ప సంఖ్యాకవర్గమైన హిందువులు అత్యధికంగా ఉండేది థార్పార్కర్ జిల్లాలోనే. గత ప్రభుత్వాలు ఈ ప్రాంత అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరించాయనీ, 21వ శతాబ్దంలోనూ అక్కడ అమ్మాయిలు చదువుకోవడానికి సరైన సౌకర్యాల్లేవనీ, కనీస వైద్య సదుపాయాలు కూడా లేవని ఆమె పేర్కొన్నారు. -
ఈ అభ్యర్థి ఆస్తులు రూ.22,300 కోట్లు!
ఇస్లామాబాద్: త్వరలో జరగనున్న పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో కళ్లు చెదిరే ఆస్తులున్న అభ్యర్థి బరిలోకి దిగాడు. నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు అతడు తెలిపిన తన ఆస్తుల విలువ రూ. 223 బిలియన్లు (రూ. 22,300 కోట్లు). కాగా ఈ ఎన్నికల్లో అతడు స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేయడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. ముజఫర్గడ్ జిల్లాలోని ఎన్ఏ-182, పీపీ-270 నియోజక వర్గాల నుంచి మహ్మద్ హుస్సేన్ షేక్ పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల అఫిడవిట్ తన ఆస్తుల విలువ దాదాపు 22,300 కోట్ల రూపాయలుగా ఆయన ప్రకటించారు. ఇందులో 40శాతం మేరకు భూమి విలువ(స్థిరాస్తి)గా చూపించారు. మరోవిషయం ఏమిటంటే ముజఫర్‌గడ్‌లోని హుస్సేన్ భూముల వివాదం కేసు గత 88 ఏళ్లుగా సుప్రీం కోర్టులో కొనసాగుతోంది. ఇటీవల పాకిస్తాన్ సుప్రీంకోర్టు హుస్సేన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో ఆయన ఆస్తుల విలువ ఒక్కసారిగా రూ.22,300 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో అత్యంత సంపన్న అభ్యర్థిగా హుస్సేన్ నిలిచారు. మాజీ విదేశాంగ మంత్రి హినా రబ్బానీ ఖర్, ఇతర నేతలు కూడా ఆ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. జులై 25న పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. -
హెలికాప్టర్లో వెళ్లి నామినేషన్
సాక్షి, బెంగళూరు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప శికారిపురకు హెలికాప్టర్లో వచ్చి గత గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తానేం తక్కువ కాదంటూ వినయ్ రాజావత్ అనే స్వతంత్ర అభ్యర్థి కూడా హెలికాప్టర్లోనే వచ్చి నామినేషన్ సమర్పించారు. 25 ఏళ్ల ఈ యువకుని స్వస్థలం బెంగళూరు కాగా, హెలికాప్టర్లో శికారిపురకు వెళ్లి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. హెలికాప్టర్ అద్దె డబ్బులను అతని స్నేహితులు భరించడం విశేషం. ఎద్దులబండిలో వెళ్లాలనుకున్నా : రాజావత్ మాట్లాడుతూ అందరి కంటే విచిత్రంగా నామినేషన్ పత్రాలను సమర్పించాలని తొలుత తాను తలచినట్లు చెప్పారు. ఎద్దుల బండిలో వెళితే ఎలా ఉంటుందని ఆలోచించా ను, కానీ ఆ తర్వాత యడ్యూరప్ప లాంటి వ్యక్తిని ఎదుర్కొవాలంటే హెలి కాప్టర్లో వెళ్లడమే ఉత్తమమని తన స్నేహితులు సూచించినట్లు చెప్పారు. రాజావత్ ‘విద్యార్థి’ అనే ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్నారు. -
ధనిక స్వతంత్ర అభ్యర్థిగా చాయ్‌వాలా.. !
సాక్షి, బెంగళూరు : ఒకప్పుడు చాయ్‌వాలా.. కానీ ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయనున్న ధనిక స్వతంత్ర అభ్యర్థి. పి. అనిల్ కుమార్.. కృషి, పట్టుదల ఉన్న వ్యక్తి. ఆయనకు అదృష్టం కూడా తోడైంది. అందుకే చాయ్‌వాలాగా జీవితం ప్రారంభించిన ఆయన నేడు కోట్లకు అధిపతి అయ్యారు. వచ్చే నెలలో జరిగే కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తుస్తున్న అనిల్ కుమార్ ఈ మేరకు నామినేషన్ కూడా దాఖలు చేశారు. 339 కోట్ల రూపాయల సంపద కలిగి ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొనడంతో ధనిక స్వతంత్ర అభ్యర్థిగా రికార్డుకెక్కారు. బొమ్మనహళ్లి నియెజక వర్గం నుంచి పోటీ చేయనున్నట్లు అనిల్ కుమార్ తెలిపారు. దేవుడి దీవెనలు, ప్రజల అండదండలతో బీజేపీ అభ్యర్థి సతీశ్ రెడ్డిపై విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. చాయ్‌వాలా నుంచి బిలియనీర్దాకా.. కేరళకు చెందిన అనిల్ కుమార్ చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో కుటుంబంతో సహా బెంగళూరుకు వచ్చారు. తనతోపాటు తన తోబుట్టువులను పోషించేందుకు తల్లి ఎంతో కష్టపడిందని అనిల్ కుమార్ తెలిపారు. పనిచేసినందుకు ఆమెకు నాలుగు ఇడ్లీలు పెట్టేవారని.. వాటిని తినకుండా తమ కోసం తీసుకువచ్చేదని కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నతనంలో ఎన్నోసార్లు ఫుట్‌పాత్ మీదే పడుకునే వాడినని.. అలాంటి సమయంలోనే ఒక వ్యక్తి తనను చూసి ఆయన కొట్టులో పని ఇప్పించాడని గుర్తుచేసుకున్నాడు. తర్వాత చిన్న టీ స్టాల్ పెట్టానని, ఐటీ రంగం అభివృద్ధి చెందుతున్న కాలంలోనే తన వ్యాపారం కూడా వృద్ధి చెందిందని తెలిపారు. అలా సంపాదించిన డబ్బుతో చిన్న ప్లాట్ కొని అధిక ధరకు అమ్మడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టానని, తన విజయ ప్రస్థానాన్ని అనిల్ కుమార్ వివరించారు. ప్రస్తుతం తన కంపెనీ ఎమ్ జే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధిక టర్నోవర్ సాధిస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. -
దళిత హక్కుల కార్యకర్తకు పట్టం
అహ్మదాబాద్ : దళిత హక్కుల కార్యకర్త, లాయర్ జిగ్నేష్ మేవాని(36) గుజరాత్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు. బనస్కంత జిల్లాలోని వడ్గాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. దళిత హక్కుల కార్యకర్త అయిన మేవాని వడ్గాం నుంచి పోటీకి నిలవడంతో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు అక్కడి నుంచి తమ అభ్యర్ధులను ఉపసంహరించుకున్నాయి. దీంతో జిగ్నేష్, బీజేపీ అభ్యర్థి విజయ్ చక్రవర్తిల మధ్య గట్టి పోటీ ఉంటుందని భావించారు. అయితే, అంచనాలను తలక్రిందులు చేస్తూ 18,150 ఓట్ల భారీ మెజార్టీతో జిగ్నేష్ భారీ విజయం సాధించారు. గుజరాత్‌లోని ఉనా జిల్లాలో దళితులపై దారుణాలపై జిగ్నేష్ అనేక ఆందోళనలు నిర్వహించారు. తన జాతి వారికి జీవించడానికి భూమిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 'ఆజాదీ కూచ్' పేరుతో మేవాని చేపట్టిన ర్యాలీ బాగా ప్రాచుర్యం పొందింది. ఎవరి వాడిని కాదన్నారు.. దళితులపై దారుణాలను ఎండగట్టిన మేవాని.. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వానికి తాను వ్యతిరేకినని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను మద్దతు ఇవ్వబోనని కూడా చెప్పారు. ఎవరికి ఓటు వేయాలనే విషయం ప్రజలకు తెలుసని, వారు అందరి కంటే స్మార్ట్ అని ఎన్నికలకు ముందు ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు మేవాని. -
ప్రజల్ని పిచ్చోళ్లని చేస్తా..డబ్బు సంపాదిస్తా..
-
ప్రజల్ని పిచ్చోళ్లని చేస్తా..డబ్బు సంపాదిస్తా..
లక్నో: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల చిత్రపటంలో ఓ ఆసక్తికరమైన అంశం నమోదైంది. ఆగ్రా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటిస్తున్న వ్యక్తి షాకింగ్ ప్రచారంతో వెలుగులోకి వచ్చారు. తాను డబ్బుకోసమే రాజకీయాల్లోకి వచ్చానంటూ ఇండిపెండెంట్ అభ్యర్థి చౌదరి బహిరంగంగా ప్రకటించుకోవడం సంచలనంగా మారింది. ఈ అభ్యర్థి చేస్తున్న ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజకీయాల్లో రావడానికి కారణం కేవలం డబ్బు సంపాదించడానికే.. ప్రజల్ని అవివేకులను (ఫూల్స్) చేస్తానంటున్నాడు. అంతేకాదు దాదాపు అందరూ రాజకీయాల్లోకి పరోక్షంగా అదే ఉద్దేశ్యం తో వస్తున్నారని వ్యాఖ్యానించారు. మరోఅడుగు ముందుకేసి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తన దాడిని ఎక్కుపెట్టి, విమర్శలు గుప్పించారు. ప్రజల్ని పిచ్చోళ్లని చేసి...ఒక వ్యక్తి దేశాన్నేలుతున్నపుడు ..తానెందుకు చేయలేనని ప్రశ్నించారు. తానూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నానంటున్నారు .ప్రజలను ఫూల్స్ ని చేసిన ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు. దానికి కొంత టాలెంట్ ఉండాలంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. -
అయ్యో పాపం... స్వతంత్ర అభ్యర్థి
కేకేనగర్: ఓటర్లు జాబితాలో పేరు లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థి ఓటు వేయలేక నిరాశతో వెనుదిరిగారు. తిరువోత్తియూర్‌లో చిన్న మేట్టు పాలెయం కు చెందిన త మిళ్ సెల్వన్ ,మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఈయన తిరువోత్తియూర్ నియోజక వర్గంలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సోమవారం ఉదయం తమిళ్‌సెల్వన్ తిరువోత్తియూర్ అవర్లేడి పాఠశాలలో ఓటు వేయడానికి ఓటర్ ఐడితో వెళ్లారు. అక్కడున్న అధికారులు ఓటర్లు జాబితాను చెక్ చేయగా అందులో ఆయన పేరు లేదు. దీంతో తమిళ్ సెల్వన్ ఓటు వేయడానికి అనుమతి లభించలేదు. ఆయననిరాశతో వెనుదిరిగాడు. ఓటరు ఐడి,అభ్యర్థి గుర్తింపు కార్డులను చూపించి తనపేరు లేకుండా ఉంటే అధికారులు తన నామినేషన్‌ను ఎలా స్వీకరించారని ప్రశ్నించారు. తంజావూరులో ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు తంజావూరు నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థి ఓటర్లకు రూ.6 కోట్లు నగదు బట్వాడా చేసాడనే ఫిర్యాదు అందింది. విచారణలో నగదు బట్వాడా చేసినట్లు తెలియడంతో ఎన్నికలను హఠాత్తుగా నిలిపివేశారు. ఈ విషయం తెలియక అనేక మంది ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి నిరాశతో వెనక్కి వెళ్లారు. -
'స్వతంత్రంగా పోటీచేసినా గెలుస్తాను'
న్యూఢిల్లీ: ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసినా తాను గెలుస్తానని, ప్రజల నుంచి తనకు మద్దతు ఉందని బీజేపీ అసమ్మతి ఎంపీ, షాట్‌గన్ శత్రుఘ్న సిన్హా పేర్కొన్నారు. ఇతర పార్టీల నేతలు తనతో వారి పార్టీ అంతర్గత విషయాలు కూడా పంచుకుంటారని చెప్పారు. గతకొంతకాలంగా బీజేపీ అధిష్టానంపై బాహాటంగా వ్యాఖ్యలు చేస్తూ.. స్వేచ్ఛగా మాట్లాడుతున్న శత్రుఘ్న సిన్హాను గత బిహార్ ఎన్నికల్లో పార్టీ పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ప్రధానమంత్రి మంచి చేసినా, చేడు చేసినా దానిపై తన అభిప్రాయాన్ని మాత్రమే చెబుతున్నాని, తానేమీ అసమ్మతితో రగిలిపోవడం లేదని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉన్న మంచి వ్యక్తిని తాను కావడంతో ఇతర పార్టీల నుంచి కూడా తనకు చాలాకాలంగా సమాచారం అందుతోందని, ఇందులో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ఆయన పీటీఐ వార్తాసంస్థతో చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 2.46 లక్షల భారీ మెజారిటీతో గెలుపొందిన శత్రుఘ్న తనకు ప్రజామద్దతు ఉందని, స్వతంత్ర అభ్యర్థిగా నిలబడినా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
కోడ్ ఉల్లంఘించిన ఇండిపెండెంట్ అభ్యర్థికి నోటీసు
గుర్గావ్: హర్యానాలో అక్టోబర్ 15వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరించిన అభ్యర్థులపై చర్యలకు ఈసీ నడుంబిగించింది. బాద్షాపూర్ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి ముఖేష్ శర్మ ఎలక్షన్ అధికారి నుంచి అనుమతి తీసుకోకుండానే బహిరంగ సమావేశం నిర్వహించినందుకు అడిషనల్ డిప్యూటీ కమిషనర్ పీఎస్ చౌహాన్, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) మంగళవారం నోటీసు జారీ చేశారు. నోటీసు అందిన 48 గంటల్లో సమాధానం చెప్పాలని, సకాలంలో స్పందించకుంటే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు తక్షణమే చర్యలు తీసుకొంటామని నోటీసులో హెచ్చరించారు. ఎన్నికల అధికారి నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే ముఖేష్ శర్మ భారీ ఎత్తున కార్యకర్తలను తరలించి బహిరంగ సమావేశం నిర్వహించినట్లు ఓ హిందీ పత్రికలో మీడియా కథనం ప్రచురితమైందని, అందుకే అతడికి నోటీసు జారీ చేసినట్లు ఆర్ఓ చెప్పారు. ఇంకా పలుచోట్ల ఎన్నికల అధికారుల అనుమతులు తీసుకోకుండానే బహిరంగ సమావేశాలు నిర్వహించనట్లు పేర్కొన్నారు. ఎన్నికల మోడల్ కోడ్ సెప్టెంబర్ 12వ తేదీ నుంచి అమలులోకి వచ్చిందని చెప్పారు. 90 మంది సభ్యులున్న అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 15వ తేదీన నిర్వహించామని, అక్టోబర్ 19వ తేదీన కౌంటింగ్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి బహిరంగ సమావేశాలు నిర్వహించడానికి అభ్యర్థులు కచ్చితంగా సంబందిత ఎన్నికల అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్నికల్లో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినవారికి చర్యలు తీసుకోంటామని చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో జనగామ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి మృతి
వరంగల్: వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జనగామ అసెంబ్లీ నియోజకవర్గ స్వంతంత్ర అభ్యర్థి శశిధర్ రావుతో పాటు ముగ్గురు మరణించారు. మంగళవారం ఉదయం చినపెండ్యాల వద్ద ఎదురెదురుగా వస్తున్న కారు, లారీ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో కారు పూర్తిగా నుజ్జువగా, అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో శశిధర్ రావుతో పాటు ఇద్దరు మహిళలు ఉన్నారు. -
ఇదీ చరిత్ర: ప్రగతి పరిశీలన
నంద్యాల లోక్‌సభ స్థానం 1952లో ఏర్పడింది. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి శేషగిరిరావు విజయుం సాధించారు. ఆ తర్వాత ఈ స్థానం ఒకసారి ఆదోని, వురోసారి మార్కాపురం నియోజకవర్గాల్లో అంతర్భాగంగా ఉంటూ వచ్చింది. 1967లో తిరిగి నంద్యాల నియోజకవర్గంగా ఏర్పడింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికలతో పాటు 1971, 19-0లోనూ పెండేకంటి వెంకటసుబ్బయ్యు (కాంగ్రెస్) ఎన్నికయ్యూరు. ఈయున కేంద్రంలో మంత్రి పదవులను నిర్వహించారు. గవర్నర్‌గానూ పనిచేశారు. 1977 ఎన్నికల్లో నీలం సంజీవరెడ్డి జనతా పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. లోక్‌సభ స్పీకర్‌గానూ పని చేశారు. తర్వాత కొంతకాలానికే రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. పెండేకంటి గెలుపొందారు. 19-4లో ఈ స్థానాన్ని టీడీపీ చేజిక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్థి వుద్దూరు సుబ్బారెడ్డి గెలుపొం దారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బొజ్జా వెంకటరెడ్డి (19-9), గంగుల ప్రతాపరెడ్డి(1991) ఎంపీలుగా పనిచేశారు. ప్రతాపరెడ్డి ఎన్నికైన కొంతకాలానికే పదవికి రాజీనావూ చేసి..అప్పటి ప్రధాని పీవీ నరసింహరావుకు అవకాశమిచ్చారు. పీవీ 1991-1996 వుధ్య ప్రాతినిధ్యం వహించారు. 1996 ఎన్నికల్లో ఆయన నంద్యాలతో పాటు ఒడిశాలోని బరంపురం నుంచి గెలుపొందారు. నంద్యాల కు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక నిర్వహించగా.. టీడీపీ తరఫున భూమా నాగిరెడ్డి ఎన్నికయ్యారు. ఆయన 199-, 1999లోనూ ఇక్కడి నుంచి గెలిచారు. గత రెండు పర్యాయూలూ ఎస్పీవై రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. సమాధి రాళ్లు - చంద్రబాబు హయూంలో నంద్యాల పట్టణంలోని పేదలు ఇళ్లస్థలాలు లేక ఇబ్బందిపడ్డారు. - రెండు కార్లకు సాగునీరు అందక నియోజకవర్గ రైతులు నష్టపోయూరు. - వరదలు వచ్చి నంద్యాల పట్టణ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోరుునా చంద్రబాబు పట్టించుకోలేదు. - విజయా, నంది డెయిరీల నుంచి నంద్యాల పట్టణంలోకి బైపాస్ రోడ్లు లేక రాకపోకలకు కష్టంగా ఉండేది. వీటిపై బాబు ఏనాడూ దృష్టి పెట్టలేదు. - చంద్రబాబు హయూంలో నంద్యాల చక్కెర ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేశారు. ఆ సమయంలో ఎంపీగా ఉన్న భూమా నాగిరెడ్డి అభ్యంతరం తెలిపినా బాబు వినలేదు. వంద ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్యాక్టరీని కేవలం రూ.6.50 కోట్లకు విక్రయించారు. అభివృద్ధికి ఆనవాళ్లు - వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో వరద రక్షణ చర్యల కోసం రూ.100 కోట్లు వుంజూరు చేశారు. - నంద్యాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.75 కోట్లను మంజూరు చేశారు. - నంద్యాల పట్టణంలో ఏడు వేల మందికి ఇళ్ల స్థలాలను ఇవ్వడమే కాకుండా పక్కాగృహాలను కూడా మంజూరు చేశారు. - నంద్యాలలోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. - అవుకు రిజర్వాయర్ నుంచి 36 గ్రామాలకు తాగునీటి వసతి కల్పించారు. - డోన్‌కు రూ.53 కోట్లతో, ఆత్మకూరుకు రూ.14 కోట్లతో మంచినీటి పథకాలు వుంజూరు చేశారు. నంద్యాలలో రూ.10 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్, రూ.2 కోట్లతో స్టేడియం నిర్మించారు. - శెలం అసెంబ్లీ సెగ్మెంట్లో సిద్ధాపురం ఎత్తిపోతల పథకానికి రూ.110 కోట్లు, నందికొట్కూరు నియోజకవర్గంలో వుల్యాల ఎత్తిపోతల పథకానికి రూ.3వేల కోట్లు వుుంజూరు చేశారు. శివాపురం, సంగమేశ్వరం ఎత్తిపోతల పథకాలనూ చేపట్టారు. -
స్వతంత్ర అభ్యర్థి అనుమానాస్పద మృతి
పశ్చిమగోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సత్యనారాయణ అనుమానాస్పద స్థితిలో మరణించారు. మరో పదిరోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఆయన మరణించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుటుంబకలహాల నేపథ్యంలో బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తుంటే... అతని కుటుంబసభ్యులు మాత్రం దీనిపై పెద్దగా స్పందించడం లేదు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు... మృతుడిది సహజ మరణమా లేదా ఆత్మహత్య అన్న కోణంలో విచారణ సాగిస్తున్నారు. -
ఒకే ఒక్క ఇండిపెండెంట్
నెల్లిమర్ల, న్యూస్‌లైన్ : మండలంలో ఈ నెల 11వ తేదీ న జరిగే ఎంపీటీపీ ఎన్నికల్లో ఒకే ఒక్క ఇండిపెండెంట్ అభ్యర్థి బరిలో ఉన్నారు. మండలంలో మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఈసారి ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్కరు ఇండిపెండెంట్‌గా పోటీలో ఉండడం చర్చనీయాంశమైంది. 15 స్థానాలకు వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ నుంచి 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా రు. అలాగే టీడీపీ నుంచి 14 మంది, కాంగ్రెస్ తరఫున 12 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే అన్నిచోట్లా ప్రధాన పార్టీల మధ్యే పోటీ నెలకొంది. కానీ ఒక్క బూరాడపేట ఎంపీటీసీ స్థానం నుంచి మాత్రమే ఇండిపెండెంట్ అభ్యర్థిగా బెల్లాన అప్పలనరసమ్మ పోటీ చేస్తున్నారు. మొదట ఐదుగురు అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ చివర్లో ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న ఏకైక అభ్యర్థిగా అప్పలనరసమ్మ నిలిచారు. ఈమెకు ఎన్నికల సంఘం పండ్ల బుట్ట గుర్తుగా కేటాయించింది. -
‘చేతి’కి రాని కోల్‌బెల్ట్
రామగుండం కోల్‌బెల్ట్ ఏరియాలో 25 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. ఇందుకు పార్టీలో ఏర్పడిన గ్రూపులు, వర్గాలే కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 1967లో మేడారం నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గడిపెల్లి రాములు విజయం సాధించారు. ఆ తర్వాత 1972, 1978లో జరిగిన ఎన్నికల్లో ఇదే పార్టీకి చెందిన పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వెంకటస్వామి అన్న కొడుకు ఈశ్వర్ గెలుపొందారు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మాతంగి నర్సయ్య విజయం సాధించారు. 1989లో మాతంగి నర్సయ్య కాంగ్రెస్ పార్టీలో చేరి అనూహ్యంగా తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక అప్పటి నుంచి కోల్‌బెల్ట్ ప్రాంతంలో కాంగ్రెస్ నుంచి ఎవరూ ఎమ్మెల్యేగా గెలుపొందలేకపోయారు. స్వతంత్ర అభ్యర్థి మాలం మల్లేశం 1994లో, టీడీపీ నుంచి మాతంగి నర్సయ్య 1999లో, టీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ 2004లో, స్వతంత్ర అభ్యర్థి సోమారపు సత్యనారాయణ 2009లో ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వచ్చారు. మేడారం ఎస్సీ నియోజకవర్గం నుంచి పునర్విభజనలో రామగుండం జనరల్ నియోకవర్గంగా మార్పు చెందినప్పటికీ కాంగ్రెస్ పార్టీ గెలువలేకపోయింది. పార్టీలో ఉన్న గ్రూపులు, వర్గాలే ‘చేతి’కి అధికారం రాకుండా చేశాయనేది సుస్పష్టం కాగా, ఆ విభేదాలు నేటికీ కొనసాగుతున్నాయి. 1994లో కాంగ్రెస్ తరఫున బడికెల రాజలింగం పోటీ చేయగా, ఓటర్లు స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో నిలిచిన మాలెం మల్లేశాన్ని ఎన్నుకున్నారు. రాజలింగాన్ని సొంతపార్టీ వారే ఓడించారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత 1999లో కాంగ్రెస్ నుంచి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు టికెట్ ఇవ్వగా ఆయన చిన్నవాడనే ఉద్దేశంతో పార్టీ పెద్దలే ఓడించారని చెబుతారు. 2004లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తులో భాగంగా ఇక్కడి సీటును టీఆర్ఎస్కు కేటాయించారు. ఎమ్మెల్యేగా గెలిచిన కొప్పుల ఈశ్వర్ పదవికి రాజీనామా చేయడంతో 2008లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌ను గుమ్మడి కుమారస్వామికి ఇచ్చారు. టీఆర్ఎస్ గాలి వీయడంతో పాటు గుమ్మడికి కాంగ్రెస్ పెద్దల నుంచి సహకారం అందకపోవడంతో ఆయన ఓటమిపాలయ్యారు. 2009లో మేడారం పునర్విభజనలో రామగుండం జనరల్‌గా మార్పు చేయగా ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ బాబర్ సలీంపాషాకు ఇచ్చారు. ఎన్టీపీసీకి చెందిన బాబర్‌కు సింగరేణికి చెందిన పార్టీ, యూనియన్ శ్రేణులు సహకారం అందించకపోవడంతోనే ఆయన ఓడిపోయినట్లు ప్రచారం జరిగింది. ఈ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారా వేచి చూడాల్సిందే. -
కాంగ్రెస్‌కు మానుకోట
మహబూబాబాద్, న్యూస్‌లైన్ : పునర్విభజన జరిగిన ప్రతిసారి రూపురేఖలు మార్చుకున్న నియోజకవర్గం మహబూబాబాద్. 1952లో మహబూబాబాద్ తాలుకాగా ఉండేది. ఆ తాలుకా ద్విసభ్య నియోజకవర్గం. మహబూబాబాద్ తాలుకాలో డోర్నకల్, మహబూబాబాద్, చిల్లంచర్ల, నర్సింహులపేట, నెల్లికుదురు, కేసముద్రం మండలాలుండేవి. ఆ సమయంలో ఎస్సీ అభ్యర్థి, జనరల్ అభ్యర్థి బరిలో నిలిచారు. ప్రతి ఓటరు ఇద్దరికీ ఓట్లు వేసేవారు. 1952లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.రెడ్డిపై పీడీఎఫ్‌కు చెందిన కన్నెకంత శ్రీనివాసరావు సుమారు 15 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి రాజయ్యపై పీడీఎఫ్ అభ్యర్థి బీఎం.చందర్రావు విజయం సాధించారు. 1957లో డోర్నకల్... చిల్లంచర్ల 1957లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో మానుకోట తాలూకాను డోర్నకల్, చిల్లంచర్ల నియోజకవర్గాలుగా విభజించా రు. డోర్నకల్ నియోజకవర్గంలో మానుకోట, డోర్నకల్, కురవి మండలాలు ఉండేవి. చిల్లంచర్ల నియోజకవర్గంలో కేసముద్రం, చిల్లంచర్ల, నర్సింహులపేట మండలాలు ఉన్నా యి. 1967లో జరిగిన పునర్విభజనలో అవి చిల్లంచర్ల, మహబూబాబాద్ నియోజకవర్గాలుగా విభజింపబడ్డారుు. చిల్లంచర్ల సెగ్మెంట్లో డోర్నకల్, కురవి, చిల్లంచర్ల మండలాలు... మహబూబాబాద్ నియోజకవర్గంలో కేసముద్రం, నర్సిం హులపేట, మహబూబాబాద్ మండలాలు ఉండేవి. 1972 డీలిమిటేషన్లో కేసముద్రం, నర్సింహులపేట, మహబూబాబాద్ మండలాలు అలాగే ఉండగా... గూడూరు మండలంలోని కొన్ని గ్రామాలు, నెక్కొండ మండలాలు మహబూబాబాద్ సెగ్మెంట్లో కలిశారుు. 2004 పునర్విభజనలో మహబూబాబాద్ నియోజకవర్గం మళ్లీ రూపురేఖలను మార్చుకుంది. కేసముద్రం, నెక్కొండ, గూడూరు మండలంలోని పది గ్రామాలు, నెల్లికుదురు మండలంలోని 14 గ్రామాలు, చెన్నారావుపేట మండలంలోని ఏడు గ్రామాలు, కొత్తగూడెంలోని మూడు గ్రామాలు ఇందులో ఉండగా... నర్సింహులపేట మండలం డోర్నకల్ సెగ్మెంట్లోకి మారింది. -
జోరుగా అభ్యర్థుల ప్రచారం
కరీంనగర్ కల్చరల్/కమాన్‌చౌరస్తా/టవర్‌సర్కిల్, న్యూస్‌లైన్ : కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గురువారం వివిధ డివిజన్లలో అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేశారు. 23వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి తాటి ప్రభావతి, 27లో టీడీపీ అభ్యర్థి సునావత్ అపసూర్య, 29లో సీపీఐ అభ్యర్థి నందికొండ అంజిరెడ్డి, 21లో కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల ప్రకాశ్, 33లో స్వతంత్ర అభ్యర్థి ఎస్డీ.ఆరీఫ్ హుస్సేన్, 45లో టీడీపీ అభ్యర్థి వంచ శ్రీనివాస్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి ఆకుల నాగరాజు, మూ డో డివిజన్లో స్వతంత్ర అభ్యర్థి వైద్యుల శ్రీదే వి, 22లో స్వతంత్ర అభ్యర్థి కనుకుంట్ల సంధ్యారాణి, 50లో బీజేపీ అభ్యర్థి మందల జానకమ్మ, 47లో కాంగ్రెస్ అభ్యర్థి మేచినేని అశోక్‌రావు, టీఆర్ఎస్ అభ్యర్థి బండారి వేణు, 48లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్, 49లో టీఆర్ఎస్ అభ్యర్థి డి.సంపత్, 50లో టీఆర్ఎస్ అభ్యర్థి వొంటెల సుమ, 17లో టీఆర్ఎస్ అభ్యర్థి వరాల జ్యోతి, 43లో కాంగ్రెస్ అభ్యర్థి మీస బీరయ్య, స్వతంత్ర అభ్యర్థి మేకల నర్సయ్య, 26, 29 డివిజన్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా డాక్టర్ విజయేందర్‌రెడ్డి ప్రచారం చేశారు. 30 డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి చొప్పరి జయశ్రీ, కాంగ్రెస్ అభ్యర్థి పత్తెం పద్మ ఇంటింటా తిరిగి ప్రచారం చేశారు. 50 డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి వొంటెల సుమ, 31, 32, 33 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు చిటీ రామారావు, ఏవీ.రమణ, వొడ్నాల రాజు, 34,35లో కాంగ్రెస్ అభ్యర్థులు వావిలాల హన్మంత రెడ్డి, చాడగొండ కవిత, 32లో బీజేపీ అభ్యర్థి గడ్డం లత, 47లో బండారి మాలతి, కాంగ్రెస్ అభ్యర్థి అశోక్‌రావు, 49లో టీఆర్ఎస్ అభ్యర్థి డి.సంపత్ ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధి కోసం ఆశీర్వదించండి నగరపాలక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. గురువారం 41వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా స్వరూపారాణి భారీ ర్యాలీ నిర్వహించారు. -
సోలోగానైనా సై
సాక్షి ప్రతినిధి, కాకినాడ :నామినేషన్ల ఘట్టం దగ్గర పడటంతో రాజ్య(పెద్దల)సభకు పార్టీల అభ్యర్థులెవరన్న దానిపై సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్సీ చైతన్యరాజు పార్టీ అవకాశం ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పార్టీ నుంచి చైతన్యరాజుతో పాటు మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి జె.సి.దివాకరరెడ్డి, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ల పేర్లు నాలుగైదు రోజులుగా నలుగుతున్నాయి. నామినేషన్ల అనంతరం బరిలో మిగిలే వారెవరనే విషయం ప్రస్తుతానికి పక్కనబెడితే సీమాంధ్ర జిల్లాల్లో ఎవరు బరిలో నిలిస్తే ఎంతమంది మద్దతు లభిస్తుందని నేతలు లెక్కలు తీస్తున్నారు. ఈ క్రమంలో తొలుత సొంత జిల్లాల్లో మద్దతు సాధించే దిశగా ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా బరిలో నిలుస్తానంటున్న ఎమ్మెల్సీ చైతన్యరాజు ఆదివారం హైదరాబాద్‌లో రెండు విడతలుగా జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. జేసీ, గంటా, ఉండవల్లి, చైతన్యరాజుల్లో చివరకు బరిలో ఒకరే నిలుస్తారా లేక ఒకరికి మించే పోటీ పడతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది. చైతన్యరాజు అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారు సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. ఆ ముగ్గురితో కూడా ఆయన మాట్లాడుతున్నారని సమాచారం. విశాఖ జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు తొలుత చైతన్యరాజుకు మద్దతు ఇవ్వడం, అనంతరం బరిలోకి వచ్చిన గంటా వైపు మొగ్గు చూపడం, విభజన పరిణామాల్లో జేసీ, గంటా టీడీపీ వైపు అడుగులు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్వతంత్రంగా బరిలోకి దిగితే చైతన్యరాజు పేరు పరిశీలించాలనే ప్రతిపాదన కాంగ్రెస్ వర్గాల్లో వచ్చిందని సమాచారం. ఉండవల్లి పేరును ఎంపీ హర్షకుమార్ శనివారమే తెరపైకి తీసుకురాగా మిగిలిన నాయకులెవరూ సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నామినేషన్ వేయనున్నట్టు చైతన్యరాజు హైదరాబాద్ నుంచి ‘సాక్షి ప్రతినిధి’కి ధ్రువీకరించారు. ధనబలమే ‘దేశాని’కి గీటురాయి..! తెలుగుదేశం విషయానికి వస్తే సమర్థత కంటే ఆర్థిక అంశాలే ప్రామాణికమవుతున్నాయి. పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా రికార్డు స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించిన నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రులు చిక్కాల రామచంద్రరావు, మెట్ల సత్యనారాయణరావు, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం రాజ్యసభకు వెళ్లాలని ఆశిస్తున్నా వారిని పక్కనబెట్టే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఉభయగోదావరి జిల్లా ల పార్టీ అధ్యక్షులు చినరాజప్ప, సీతామహాలక్ష్మి అవకాశం కోసం పోటీపడుతుం డగా మహిళా కోటాలో సీతామహలక్ష్మికే అవకాశం ఉండవచ్చన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం వీరందరినీ కాదని ఆర్థిక దన్ను కలిగిన నారాయణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ పి.నారాయణ వైపే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే అంతకంటే అన్యాయం మరొకటి ఉండబోదని తెలుగు తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు.