ఓ అభ్యర్థికి ఒక్క ఓటూ పడలేదు.. | Not Single Vote Was Cast For Independent Candidate In Madanapalle | Sakshi
Sakshi News home page

ఓ అభ్యర్థికి ఒక్క ఓటూ పడలేదు..

Published Mon, Mar 15 2021 8:41 AM | Last Updated on Mon, Mar 15 2021 8:41 AM

Not Single Vote Was Cast For Independent Candidate In Madanapalle - Sakshi

ఒకే ఓటు పడ్డ ఆర్‌.పవన్‌కుమార్‌

మదనపల్లె (చిత్తూరు జిల్లా): మదనపల్లె మునిసిపాలిటీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. 16వ వార్డులో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్‌.రవీంద్ర నాయుడుకు ఒక్క ఓటు కూడా పడలేదు. కాగా, ఆయనకు ఈ వార్డులో ఓటు లేదు.

అలాగే రెండో వార్డులో బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) తరఫున బరిలోకి దిగిన ఆర్‌.పవన్‌కుమార్‌కు కేవలం ఒకే ఒక్క ఓటు లభించింది. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఇదే వార్డులో ఓట్లున్నా ఆయనకు ఒక్క ఓటే పడటం గమనార్హం. అదేవిధంగా బీఎస్పీ తరఫున ఒకటో వార్డులో బరిలోకి దిగిన కందూరు సహదేవుడుకు 2 ఓట్లు మాత్రమే లభించాయి. ఆయనకు ఈ వార్డులో ఓటు లేదు.
చదవండి:
బాబు సొంత జిల్లాలో టీడీపీకి ఘోర పరాభవం    
మున్సిపల్‌ ఎన్నికలు: టీడీపీ సీనియర్లకు షాక్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement