AP Municipal Elections 2021
-
చంద్రబాబు రాజకీయ జీవితానికి తెరపడింది
సాక్షి, అమరావతి: చంద్రబాబు రాజకీయ జీవితానికి తెరపడిందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అన్నారు. తాజా మునిసిపల్ ఫలితాలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపునకు చిహ్నమని అభిప్రాయపడ్డారు. రాబోయే రెండు దశాబ్దాల పాటు సీఎం వైఎస్ జగనే రాష్ట్రాన్ని పరిపాలిస్తారని ఈ ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు గ్రహణం పట్టిందని, రాష్ట్రంలో కార్తీక పౌర్ణమి విరబూస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో సొంత కొడుకు ఓడిపోయాడని, ఇప్పుడు సొంత నియోజకవర్గం కుప్పాన్ని కూడా చంద్రబాబు పోగొట్టుకున్నారన్నారు. ఇకపై చంద్రబాబు హైదరాబాద్‌లో ప్రవాసాంధ్రుడిలా విశ్రాంతి తీసుకుంటూ.. రామోజీరావును, రాధాకృష్ణను రోజూ కలుసుకుంటూ భవిష్యత్‌పై చర్చించుకోవచ్చని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకుంటే ఓట్లు పడవని, మంచి చేస్తేనే పడతాయని అన్నారు. ‘తనపై 11 కేసులున్నాయని, అందులో సెక్షన్ 307 కూడా పెట్టారని.. ఏం పీక్కుంటారని లోకేశ్ అడుగుతుంటే కుప్పం పీకేసుకుంటామని ప్రజలు ఈ రోజు తీర్పు ఇచ్చారు. ఏదైనా కేసు ఉంటే.. 48 గంటల్లోనే స్టే తీసుకు వస్తానని లోకేశ్ అంటున్నాడు. ఇది న్యాయవ్యవస్థను కించపరచటం కాదా. కంటెప్ట్ యాక్ట్ కింద లోకేశ్ మీద సుమోటోగా విచారణ చేపట్టిæ శిక్షించాలని హైకోర్టుకు నివేదించుకుంటున్నాను’ అన్నారు. తండ్రీకొడుకులిద్దరూ సీటు మారాల్సిందే.. చంద్రబాబుకు తన కొడుకు దేనికీ పనికిరాకుండా పోయాడన్న మనస్తాపం తప్ప ఇంకొకటేమీ మిగల్లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మొన్న మంగళగిరి సీటు పోతే, ఇప్పుడు కుప్పం కూడా పోయిందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ సీట్లు మారాల్సిందేనన్నారు. కారుపై నిలబడి కాలర్ ఎగరేస్తూ బూతులు తిడితే సీట్లు రావని.. ప్రజాప్రయోజనాలు కాపాడితేనే ప్రజలు ఓట్లు వేస్తారనే విషయాన్ని గుర్తించాలని లోకేశ్‌కు హితవు పలికారు. మాపై బాధ్యత పెంచిన విజయం: మంత్రి ముత్తంశెట్టి ప్రజలిచ్చిన తీర్పును తాము వినయంతో, విధేయతతో స్వీకరిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఈ తీర్పు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపైన, రాష్ట్ర ప్రభుత్వంపైన బాధ్యతను పెంచిందని వ్యాఖ్యానించారు. సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం వరకు ఒకే పార్టీ ఉండటం దేశ చరిత్రలో జరగలేదని, మొదటిసారి ఆంధ్రప్రదేశ్‌లోనే ఇలాంటి ఘనత నమోదైందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు నమ్మకంతో, విశ్వాసంతో ఈ తీర్పు ఇచ్చారన్నారు. -
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ ట్వీట్
-
కుప్పం ఫలితంతోనైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి: మంత్రి బొత్స
-
కుప్పం ఫలితంతోనైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి: మంత్రి బొత్స
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రజల ఆదరణ చెక్కు చెదరడం లేదని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్య నారాయణ తెలిపారు. ప్రజల్లో రోజురోజుకీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజాధరణ పెరుగుతోందన్నారు. ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు ఎప్పుడూ చూసి ఉండరని, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ఇది సాధ్యమైందని ప్రశంసించారు. రాష్ట్రంలో సీఎం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని బొత్స కొనియాడారు. చదవండి: ఏపీ గవర్నర్ విశ్వభూషణ్‌కు అస్వస్థత.. హెల్త్ బులెటిన్ విడుదల వైఎస్సార్సీపీకి ప్రజలు 99 శాతం మార్కులు వేశారని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చినమాట నిలనేట్టుకునే దానిపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారనేదానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. కొన్ని పత్రికలు, చంద్రబాబు నాయుడు తమ పాలనపై బురద జల్లాలని ప్రయత్నం చేసినా ప్రజలు దాన్ని విశ్వసించలేదని చెప్పారు. కుప్పం ఫలితంతో అయినా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ఇక చంద్రబాబు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు ఈవీఎంలను నిందించారని, నిన్న దొంగ ఓట్లు అంటున్నారని, ఆ భగవంతుడే చంద్రబాబును రక్షించాలని చురకలంటించారు. చదవండి: కుప్పం మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ కైవసం ‘ఇంకా ప్రజాసేవలో మరింత పునరంకితం అవుతాం. తక్కువ ఓట్లు వచ్చిన చోట సమీక్షించుకొని రాబోయే కాలంలో దాన్ని కూడా అధిగమిస్తాం. చంద్రబాబులా కింద పడ్డా పైనే ఉన్నాం అనే పద్ధతి మాది కాదు. ఇప్పటికైనా ఆ పత్రికలు ఆలోచన చేసుకోవాలి. జనసేన, బీజేపీ పార్టీల ప్రభావం రాష్ట్రంలో లేదు. వాటి గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అమరావతి ఉద్యమాన్ని కోర్టు స్వాతంత్ర్య ఉద్యమంగా చెప్పిందని నేనైతే నమ్మడం లేదు. అమరావతి ఉద్యమం తమ ఆస్తులను కాపాడుకోడానికి చేస్తున్నదే. ఓ రాజకీయ పార్టీ చేయిస్తున్న ఉద్యమాన్ని స్వాతంత్ర్య పోరాటంతో పోల్చలేం. ఎక్కడ రైతులు అమరులయ్యారు.? అందరూ అనారోగ్యంతో చనిపోయిన వారే. 700 రోజులు కాదు.. టీడీపీ ఉన్నంత కాలం ఆ ఉద్యమం కొనసాగుతుంది. కొంత మంది స్వార్థం కోసం టీడీపీ డబ్బిచ్చి నడిపిస్తున్న ఉద్యమం అది. అదే వైఎస్సార్సీపీ ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వం. అన్ని ప్రాంతాల అభివృద్ధికి మేం నిర్ణయాలు తీసుకుంటాం. ఏ ఒక్క వర్గం కోసమో పనిచేయం. అందరి కోసం పనిచేయడమే మా పార్టీ విధానం’ అని మంత్రి బొత్స పేర్కొన్నారు. -
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: నెల్లూరు కార్పొరేషన్ సహా 13 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు, మరో 10 మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. అన్ని ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న 54 స్థానాలను (8 స్థానాలు ఏకగ్రీవం) క్లీన్‌స్వీప్ చేసి వైఎస్సార్సీపీ చరిత్ర సృష్టించింది. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపాలిటీలోనూ వైఎస్సార్సీపీ ఘన విజయాన్ని సాధించింది. 25 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు 19 చోట్ల విజయం సాధించారు. మరో 6 చోట్ల టీడీపీ గెలుపొందింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ఓటరు దేవుళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ‘దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు... ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. (చదవండి: కుప్పంలో కుప్పకూలిన టీడీపీ) దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు... ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) November 17, 2021 -
ఏపీ మున్సిపల్ ఎన్నికలు: కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలింగ్
-
నమ్మించి నట్టేట ముంచారు.. టీడీపీ ఎమ్మెల్యేపై గుస్సా
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: విజయవాడ తూర్పు నియోజకవర్గం కంచుకోట... ఇది నిన్నటి వరకు టీడీపీ మాట. కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ అంచనాలు పటాపంచలయ్యాయి. 21 నెలల కిందట జరిగిన సాధారణ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ తల్లకిందులైంది. పూర్తిగా తిరగబడటంతో అన్ని స్థాయిల నాయకులకు కళ్లు బైర్లుకమ్మాయి. ఇదంతా ఒక ఎత్తయితే స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ తమను నమ్మించి మోసం చేశారని పోటీదారులు పలువురు వాపోతున్నారు. తాము పోటీ చేయలేమని, ఆర్థికంగా తమ పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పినా వినిపించుకోకుండా అన్నివిధాలా తాము సర్దుబాటు చేసేస్తామని చెప్పి పోటీలోకి దింపి ఆఖరుకు చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గద్దె రామ్మోహన్ గాని, ఇతర పార్టీ ముఖ్య నేతలు తమ వారి గెలుపు కోసం తాపత్రయ పడ్డారే తప్ప తక్కిన పేద సామాజికవర్గాల అభ్యర్థులను పట్టించుకోలేదంటూ చర్చించుకుంటున్నారు. ఎవరికి ఏయే విధంగా లాభనష్టాలు జరిగాయో అంచనాలు వేసుకుంటూ ఇప్పుడు తామేం చేయాలో చెప్పాలంటూ తమ సామాజిక వర్గాల నేతల సలహాల కోసం సంప్రదిస్తున్నారని అత్యంత విశ్వసనీయ సమాచారం. బీసీ వర్గానికి చెందిన డాంగే కుమార్ భార్య గతంలో కౌన్సిల్ సభ్యురాలు. అదేవిధంగా మైనార్టీ వర్గానికి చెందిన నజీర్ హుస్సేన్ కూడా గత కౌన్సిల్లో ఉన్నారు. వారివురినీ పక్కన పెట్టి గద్దె తన సామాజిక వర్గం వారికే టిక్కెట్లు ఇచ్చుకుని గెలిపించుకున్నారని నగరంలోని బీసీ, మైనార్టీ వర్గానికి చెందిన నేతలు తలపోసుకుంటున్నారు. పాత డివిజన్ల లోని కొన్ని ప్రాంతాలు అటు ఇటు మారినా తమ వారిని మాత్రం ఎక్కడికక్కడ సర్దుబాట్లు చేసుకుని జాగ్రత్త పడ్డారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్‌కు ముందే గట్టు కింద ప్రాంతానికి చెందిన పోటీదారు, అనుచరులు తమను చిన్నచూపు చూస్తున్నారని బాహాటంగానే వ్యాఖ్యానించినట్లు టీడీపీ శ్రేణులు గుర్తుచేస్తున్నాయి. ఎన్నికలకు రెండు రోజులు ముందు వరకు సాయం చేస్తామని చెప్పి ఇప్పుడు లేదంటే ఎలాగని కొందరు నిలదీయ గా, పోగైన సొత్తును ఏం చేశారని సీనియర్లు ఆరా తీశారని సమాచారం. బొండాతో తొలి నుంచీ అంతే... కృష్ణలంక, రామలింగేశ్వరనగర్ ప్రాంతాల్లో మధ్య నియోజకవర్గ ఇన్చార్జి బొండా ఉమామహేశ్వరరావు సామాజికవర్గానికి చెందిన వారి సంఖ్య కాస్త ఎక్కువ. బొండా, గద్దెల మధ్య ఎప్పుడూ పొసగదనేది పార్టీలో బహిరంగ రహస్యమే. అంతెందు కు తూర్పు నియోజకవర్గంలో కార్పొరేటర్లుగా గెలుపొందిన ఏడుగురు ఎవరెవరో పరిశీలిస్తే నాయకు ల మనస్తత్వం తేటతెల్లం అవుతుందంటున్నారు. ♦4వ డివిజన్: ఈ డివిజన్ గతంలో రెండు, మూడు డివిజన్లలో ఉండేది. గత కౌన్సిల్లో ఈ ప్రాంతం నుంచి దేవినేని అపర్ణ కార్పొరేటర్‌గా కొనసాగారు. ప్రస్తుతం జాస్తి సాంబశివరావు గెలుపొందారు. ♦8వ డివిజన్: గతంలో ఇందులో 13వ డివిజన్లో కొంత మేర ఉండేది. ఈ డివిజన్లో 2014–19 వరకు జాస్తి సాంబశివరావు కార్పొరేటర్‌గా కొనసాగగా ప్రస్తుతం చెన్నుపాటి ఉషారాణి గెలిచారు. ♦9వ డివిజన్ : ఈ ప్రాంతం పూర్వం 13వ డివిజన్‌గా ఉండేది. ఇందులో గత కౌన్సిల్లో కార్పొ రేటర్‌గా చెన్నుపాటి గాంధీ వ్యవహరించగా తాజా ఎన్నికల్లో చెన్నుపాటి క్రాంతిశ్రీ గెలుపొందారు. ♦10వ డివిజన్: ఇది గతంలో 8, 9 డివిజన్లలో కొంత భాగంగా ఉండేది. ఈ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా దేవినేని ఆపర్ణ కార్పొరేటర్‌గా గెలిచారు. ♦11వ డివిజన్: ఈ డివిజన్ గతంలో 9వ డివిజన్‌గా ఉండేది. కోనేరు శ్రీధర్ మేయర్‌గా ఈ డివిజన్ నుంచే ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం కేశినేని శ్వేత కార్పొరేటర్‌గా గెలుపొందారు. ♦12వ డివిజన్ : ఈ డివిజన్ గతంలో 10వ డివిజన్‌గా ఉండేది. 2014–19 వరకు ఈ డివిజన్ మైనార్టీ వర్గానికి చెందిన నజీర్ హుస్సేన్ కార్పొరేటర్‌గా కొనసాగారు. సిట్టింగ్ అయిన నజీర్‌కు టిక్కెట్ ఇవ్వలేదు. ఇక్కడి నుంచి సాయిబాబుగెలుపొందారు. ♦13వ డివిజన్ : ఈ డివిజన్ గతంలో 11వ డివిజన్‌గా ఉండేది. 2014–17 వరకు బీసీ నాయకుడు వీరంకి డాంగే కుమార్ కార్పొరేటర్‌గా ఉన్నారు. 2016లో ఆకస్మిక మరణంతో ఆయన సతీమణి వీరంకి కృష్ణకుమారి ఉప ఎన్నికల్లో పోటీచేసి కార్పొరేటర్‌గా గెలిచారు. డాంగే కుటుంబాన్ని పక్కనపెట్టి ముమ్మినేనిని గెలిపించుకున్నారు. ♦15వ డివిజన్: ఈ డివిజన్ గతంలో 14వ డివిజన్‌గా ఉండేది. 2014–19 కౌన్సిల్లో ఉమ్మడిశెట్టి బహదూర్ (వైఎస్సార్ సీపీ ) కార్పొరేటర్‌గా ఉన్నా రు. 2021లో ఈ డివిజన్ 15గా మారింది. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి రత్నం రమేష్ సతీమణి రత్నం రజని పోటీ చేశారు. నామినేషన్ల ఉపసంహరణ సమయంలో రత్నం రజనీని విత్‌డ్రా చేయించారు. వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన బెల్లం దుర్గ డిప్యూటీ మేయర్ అయ్యారు. చదవండి: చంద్రబాబు – నారాయణపై విచారణకు బ్రేక్ 4 వారాలు ‘స్టే’ తిరుపతి ఫలితం అదిరిపోవాలి -
నమ్మకానికి నిలువెత్తు నమూనా
ప్రభుత్వాధినేతను జనం మనస్ఫూర్తిగా నమ్మితే ఎలా ఉంటుందో ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. సీఎం జగన్‌పై ప్రజల నమ్మకానికి నిలువెత్తు నమూనాగా నిలిచిన ఫలితాలివి. బలహీనవర్గాలకు అన్నిటిలోను ఏభై శాతం అవకాశాలు కల్పించడం ద్వారా వైఎస్ జగన్ సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం చెక్కు చెదరలేదనీ, ఉన్న బలాన్ని కూడా ప్రతిపక్ష టీడీపీ కోల్పోయిందనీ స్పష్టమైంది. అన్ని మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో గెలిచిన వైఎస్ఆర్సీపీపై మరింత బాధ్యత పడింది. గెలిచిన వార్డు, డివిజన్ సభ్యులు ప్రజలకు మరింతగా సేవలందించాలి. ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి వారు చేయగలిగిన పనులన్నీ చేయాలి. అప్పుడే ఈ విజయానికి సార్థకత వస్తుంది. అసాధారణ రీతిలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలలో గెలిచినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు, ఆ పార్టీకి అభినందనలు. నిజంగానే ఇది అత్యంత ప్రతిష్టాత్మక విజయం. గతంలో ఎన్నడూ ఉమ్మడి ఏపీలో కూడా ఇలాంటి ఫలితాలు చూడలేదు. 73 మున్సిపాలిటీలు,11 మున్సిపల్ కార్పొరేషన్లు వైఎస్సార్సీపీ వశం అవడం కొత్త చరిత్ర. కేవలం రెండు మున్సిపాలిటీలు తాడిపత్రి, మైదుకూరులలో టీడీపీకే ఎక్కువ వార్డులు వచ్చినా, ఆ రెండు మున్సిపల్ చైర్మన్ పదవులు కూడా టీడీపీకి దక్కుతాయన్న నమ్మకం లేదు. ఈ రకంగా వైఎస్సార్సీపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన విజయం సాధించడం ఎలా సాధ్యమైంది? ఇది ఏ రకమైన సంకేతాలు ఇస్తోంది అన్నవి పరి శీలించాలి. ముందుగా ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఇరవై రెండు నెలలపాటు ప్రభుత్వాన్ని నడిపిన తీరు, ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల ప్రభావం ప్రజలపై ముఖ్యంగా పేదవర్గాలపై విపరీతంగా పడిందని స్పష్టమైంది. రాష్ట్రవ్యాప్తంగా గత ఎన్నికలలో మాదిరి సామాజిక సమీకరణలలో ఎలాంటి మార్పు రాకుండా జగన్ కాపాడుకోగలిగారు. బలహీనవర్గాలకు అన్నిటిలోను ఏభై శాతం అవకాశాలు కల్పించడం ద్వారా ఆయన సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టారు. ఆ వర్గాలవారు చెక్కుచెదరకుండా జగన్‌కు అండగా నిలిచారని అర్థం అవుతుంది. అలాగే ఇతరవర్గాలలో కూడా మెజార్టీ ప్రజలు జగన్ ప్రభుత్వానికే మద్దతు ఇచ్చారు. విశేషం ఏమిటంటే పంచాయతీ ఎన్నికలలో కాని, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలలో గాని తన పార్టీకి ఓటు వేయాలని ప్రజలకు ఒక్కసారి కూడా జగన్ విజ్ఞప్తి చేయలేదు. ప్రజలు తనను ఆదరిస్తారని ఆయన నమ్మారు. కచ్చితంగా అలాగే జరిగింది. మరోవైపు ప్రతిపక్షనేత వారం పాటు ఆయా ప్రాంతాలలో పర్యటించి ప్రచారం చేసినా, అనేక విమర్శలు చేసినా, చివరికి ప్రజలనే తిట్టి రెచ్చగొట్టినా ఫలితం దక్కలేదు. ఆయన రాజకీయ జీవితంలో ఇంతటి ఘోర పరాజయం చూడడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఇంత దారుణంగా ఎన్నడూ ఓడిపోలేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో 23 సీట్లు మాత్రమే వస్తే, ఈసారి రెండు, మూడు మున్సిపాలిటీలలోనే ఓ మోస్తరు పోటీ ఇవ్వగలిగింది. జగన్ ప్రజలను విశ్వసిస్తే, చంద్రబాబు ఎన్నికల కమిషన్ వ్యవస్థను నమ్ముకుని బొక్కబోర్లాపడ్డారు. నిజానికి ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలంలో ఉండగా స్థానిక ఎన్నికలు జరగరాదని వైఎస్సార్సీపీ భావించింది. కానీ కోర్టులు అంగీకరించకపోవడంతో ఎన్నికలకు సిద్ధపడింది. మరోవైపు ఎన్నికలకు సై అంటూ, ఎన్నికలకు వైఎస్సార్సీపీ భయపడిపోతోందంటూ చంద్రబాబు కాలుదువ్వారు. కానీ తీరా ఎన్నికలు అయ్యేసరికి ఆయన చతికిలపడే పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని ఆయన ముందుగా గమనించకపోలేదు. అందుకే తనకు ఆప్తుడని భావించిన ఎన్నికల కమిషనర్‌ను సైతం చంద్రబాబు విమర్శించారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు. పంచాయతీ ఎన్నికలలో కాని, మున్సిపల్ ఎన్నికలలో ఎక్కడా గొడవలు జరగకుండా, రీపోలింగ్ అవకాశం లేకుండా జరగడం కూడా బహుశా ఒక రికార్డు కావచ్చు. స్వయంగా నిమ్మగడ్డే ఈ విషయం వెల్లడిస్తూ మున్సిపల్ ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా జరిగాయని ప్రకటించారు. నిమ్మగడ్డ పదవీకాలంలోనే ఈ ఎన్నికలు పూర్తి కావడం వైఎస్సార్సీపీకి మంచిది అయింది. లేకుంటే తెలుగుదేశం ఏమని ఆరోపించేదో ఊహించండి. కొత్త ఎన్నికల కమిషనర్‌ను అడ్డుపెట్టుకుని ఎన్నికలలో విజయం సాధించిందని చంద్రబాబు ఆరోపించేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. తాజాగా ఎంపీటీసీ ,జడ్పిటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేయాలని వైఎస్సార్సీపీ కోరుతుంటే ఎన్నికల కమిషనర్ వెనుకాడుతున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. ఆయన సెలవుపై టూర్ వెళ్లాలని నిర్ణయించుకోవడం కూడా ఇందుకు ఊతం ఇస్తుంది. ఈ ఏడాదికాలంలో జరిగిన వివిధ పరిణామాలలో ఎన్నికల కమిషనర్‌తో విభేదాలు, తెలుగుదేశంతో సహా ఆయా ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలు, టీడీపీ మీడియా చేసిన దుష్ప్రచారం వీటన్నిటినీ ఎదుర్కొని వైఎస్సార్సీపీ నిలబడగలిగింది. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు స్పష్టమైన కొన్ని సంకేతాలు ఇచ్చాయి. జగన్ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం చెక్కు చెదరలేదన్నది వాటిలో ఒకటి అయితే, ప్రతి పక్ష టీడీపీ ఉన్న బలాన్ని కూడా కోల్పోయిందన్నది మరొకటి. వైఎస్సార్సీపీకి గత అసెంబ్లీ ఎన్నికలలో 49.5 శాతం ఓట్లు వస్తే ఈ మున్సిపల్ ఎన్నికలలో 52.63 శాతం ఓట్లు వచ్చాయి. ఇది అరుదైన విషయమే. మరో వైపు టీడీపీకి గత అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు నలభై శాతం ఓట్లు వస్తే, ఈ మున్సిపల్ ఎన్నికలలో దాదాపు 31 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 22 నెలల్లో మరో పదిశాతం ఓట్లను టీడీపీ కోల్పోయిందన్నమాట. అధికారపార్టీ కన్నా ఈసారి టీడీపీకి పది లక్షల ఓట్లు తగ్గాయి. ఆ పార్టీకి ఇరవైమూడు మంది ఎమ్మెల్యేలు ఉంటే నలుగురు ఇప్పటికే పార్టీకి దూరం అయ్యారు. మిగిలిన 19 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా టీడీపీ గెలవలేకపోయింది. అంటే టీడీపీ గతంలో కన్నా దారుణమైన పతనాన్ని చవిచూసిందని అర్థం. జగన్ చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలు, నేరుగా ప్రజల ఖాతాలలోకే డబ్బు చేరడం, అవినీతి, మధ్య దళారీ వ్యవస్థ లేకపోవడం, అన్ని ప్రభుత్వ స్కీములూ నేరుగా ఇళ్ల వద్దకే చేరడం, పాలనను ప్రజలకు గ్రామాలలోనే అందించడం, కరోనా కష్టకాలంలో సైతం ప్రజలను వివిధ స్కీముల ద్వారా ఆదుకోవడం.. ఇలా అన్నీ పనిచేశాయన్నమాట. ఇక చంద్రబాబు కొన్ని సవాళ్లు విసిరారు. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలలో వైఎస్సార్సీపీని ఓడిస్తే మూడు రాజధానులకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పవచ్చని ఆయన ఆశించారు.అందుకోసం ఆయన రెచ్చగొట్టే విధంగా విజయవాడ, గుంటూరు ప్రాంత ప్రజలు అమరావతి ఉద్యమాన్ని పట్టించుకోవడం లేదని, వారు పాచిపనుల కోసం బెంగళూరు, చెన్నై తదితర చోట్లకు వెళుతున్నారని, అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ప్రజలను అవమానపర్చడమేనని ఆయన అనుకోలేదు. అంతేకాదు. ప్రజలకు సిగ్గు ఉందా? రోషం ఉందా? అంటూ కొత్త తరహా ప్రచారం చేశారు. అయినా ప్రజలు వాటికి రెచ్చిపోలేదు. ప్రభుత్వం పట్ల తమ అభిమతాన్ని చాలా స్పష్టంగా తెలియచేశారు. ఆరకంగా చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించే హిందూపూర్‌లో మొదటిసారి టీడీపీ అపజ యాన్ని చవిచూడడం కూడా గమనించదగిన అంశమే. చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో 75 పంచాయతీలలో ఓటమి చెందారు. ఆయన జిల్లా అయిన చిత్తూరులో టీడీపీ పరాజయ పరాభవాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. దీనితో ఆయన నైతికంగా ఇతర టీడీపీ నేతలను ప్రశ్నించే అర్హత కోల్పోయినట్లయింది. అందువల్లే విజ యవాడలో టీడీపీ కుల సంఘంగా మారిందని ఆరోపించిన సొంతపార్టీ నేతలను బాబు కనీసం మందలించలేకపోయారు. అన్ని మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై మరింత బాధ్యత పడిందని అర్థం చేసుకోవాలి. గెలిచిన వార్డు సభ్యులు, డివిజన్ సభ్యులు ప్రజలకు మరింతగా సేవలందిం చాలి. ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి వారు చేయగలిగిన పనులన్నీ చేయాలి. తద్వారా వారు మరింత పేరు తెచ్చుకోవాలి. మరో మూడు సంవత్సరాలలో శాసనసభ ఎన్నికలు వస్తాయి. వీరు సరిగా పనిచేయకపోతే దాని ప్రభావం ఆ ఎన్నికలపై కొంత పడుతుంది. ప్రస్తుతం జగన్ ప్రభావంతో గెలిచిన వీరు ఆయనకు అండగా నిలిచి ప్రభుత్వానికి మంచి పేరుతేవాలి. అప్పుడే ఈ విజయానికి సార్థకత వస్తుంది. వారికి మరోసారి శుభాకాంక్షలు. అభినందనలు. విశ్లేషణ కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న బెదిరింపు కాల్స్..ఆడియో వైరల్
సాక్షి, విజయవాడ: కార్పోరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఫ్యాన్ వీచిన గాలికి సైకిల్ కనుమరుగైంది. ఒకవైపు టీడీపీ పార్టీని తమ భుజాలపై మోస్తున్న కార్యకర్తలను, నాయకులను ఓదార్చాల్సిన బాధ్యత మరిచిన ఆ పార్టీ అగ్రనాయకులు ఏకంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా విజయవాడ కార్పోరేషన్ పరిధిలో ఈ తరహా ఘటన చోటు చేసుకుంది. విజయవాడ 42 వ డివిజన్ నుంచి పోటీచేసి ఓడిపోయిన టీడీపీ కార్పోరేటర్ అభ్యర్ధి యెదుపాటి రామయ్యపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న బెదిరింపులకు దిగారు. యెదుపాటి రామయ్య ఫేస్బుక్లో టీడిపీ నాయకులను విమర్శించారు. ‘ఒక్క ప్రెస్‌మీట్‌తో 20 మంది కార్పోరేట్ అభ్యర్ధులం ఓడిపోయాం. మన ఓటమికి కారణం ఎవరో మనందరికి తెలుసు ’ అని పశ్చిమ నియోజక వర్గ టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు తెలిపారు. ఈ విషయాన్ని లేవనెత్తినందుకు గాను బుద్దా వెంకన్న నుంచి బెదిరింపుకాల్స్ వచ్చాయని తెలిపారు. ఆ ఆడియోను విడుదల చేశారు యెదుపాటి రామయ్య. ఇప్పుడు ఆ ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే చివరగా తమకు ఇక ఫోన్లు చేయవద్దని, అవసరమైతే పార్టీని వీడుతామని రామయ్య భార్య రమణి తెలిపారు. అదే సమయంలో తాము ఊరు వదిలిపెట్టి వెళ్లిపోతాం సార్ అంటూ ఫోన్ పెట్టేశారు రమణి. -
ప్రచారానికి వచ్చి పౌరుషం చూపినా.. పనికాకపాయే!
సాక్షి, విశాఖ దక్షిణ : చంద్రబాబుకు విశాఖ ప్రజలు తమ పౌరుషాన్ని రుచి చూపించారు. సిగ్గులేదా.. పౌరుషం లేదా.. అని నోరుపారేసుకున్న బాబుకు చుక్కలు చూపించారు. పంచాయతీ ఎన్నికల ఓటమి రుచించక నగర ప్రజలపై ఆక్రోశాన్ని వెళ్లగక్కిన తండ్రీ కొడుకులకు బుద్ధి చెప్పారు. కార్యనిర్వాహక రాజధాని విశాఖపై విషం కక్కుతున్న తెలుగుదేశానికి జీవీఎంసీ ఎన్నికల్లో కోలుకోలేని షాకిచ్చారు. మొత్తం 98 వార్డులకు గాను 30 వార్డులకే టీడీపీని పరిమితం చేశారు. 58 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టారు. సంక్షేమం, అభివృద్ధికే మేయర్ పీఠాన్ని కట్టబెట్టారు. పరిపాలన రాజధానిగా విశాఖకు మద్దతు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినడంతో జీవీఎంసీ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని తెలుగుదేశం పార్టీ అధినాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అందుకోసం టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ విశాఖలో రెండు రోజుల పాటు మకాం వేశారు. అటు పెందుర్తి నుంచి మధురవాడ వరకు కాళ్లకు బలపం కట్టుకొని ఎన్నికల ప్రచారం చేశారు. వారు అడుగుపెట్టిన ప్రతి చోటా పరాభవమే! చంద్రబాబు, లోకేష్‌బాబు ప్రచారం చేసిన అన్ని వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు ఓటమిపాలుకావడం విశేషం. చంద్రబాబు పర్యటించిన 6, 9, 24, 25, 29, 43, 44, 45, 46, 47, 58, 59, 60, 61, 81, 91,92, 95 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు, 48వ వార్డులో బీజేపీ అభ్యర్థి విజయం సాధించగా.. లోకేష్ పర్యటించిన 1, 4, 65, 66, 68, 71, 72, 73, 74 వార్డుల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగరేసింది. 66, 68 వార్డుల్లో చంద్రబాబు,లోకేష్ ఇద్దరూ ప్రచారం నిర్వహించినా.. ప్రజలు మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థులకే ఓటేయడం విశేషం. అధినాయకులు ప్రచారానికి వచ్చినప్పటికీ ఓటమి తప్పకపోవడంతో తెలుగు తముళ్లలో కలవరం మొదలైంది. తమ భవితవ్యం ఏమిటన్న ప్రశ్నలు శ్రేణులను వెంటాడుతున్నాయి. ప్రచారానికి వచ్చి ప్రజలను తిడతారా.. ఎన్నికల ప్రచారానికి వచ్చి విశాఖ ప్రజలపై నోరుపారేసుకున్న అధినేతపై ఆ పార్టీ శ్రేణుల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒకవైపు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటే.. చంద్రబాబు ప్రజలపై ఆక్రోశం వెల్లగక్కడం ఏమిటని పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి రగులుతోంది. ప్రజలను మచ్చిక చేసుకోవాల్సిన సమయంలో వారిని నిందించిన కారణంగా పార్టీకి మరింత నష్టం కలిగించిందని ఆ పార్టీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
అచ్చెన్న ఎత్తులు చిత్తు, రెండు చోట్లా పరాభవం
సాక్షి, శ్రీకాకుళం: పలాస–కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఒక ఎంపీ, మరో ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు, జిల్లాలోని మిగతా మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ ప్రతినిధులు దృష్టి సారించారు. ఎన్నికల ఆద్యంతం అక్కడే తిష్ట వేశారు. ఫోన్లో బెదిరింపులకు దిగారు. నేరుగా బేరసారాలు సాగించారు. అక్కడితో ఆగకుండా పెద్ద ఎత్తున డబ్బును సమకూర్చి దగ్గరుండి పంపిణీ చేయించారు. ఎలాగైన గెలవాలని విశ్వప్రయత్నాలు చేశారు. కానీ ప్రజలు వాటిన్నింటినీ తిప్పికొట్టారు. జిల్లాలో పలాస, ఇచ్ఛాపురం, పాలకొండలో ఎన్నికలను టీడీపీ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వీటిపైనే ఎక్కువ దృష్టిసారించారు. పోలింగ్ వరకు తమ శక్తియుక్తులన్నీ ప్రదర్శించారు. అచ్చెన్నతో పాటు ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్, మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర్ శివాజీ, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌతు శిరీష, మిగతా మాజీ ఎమ్మెల్యేలంతా టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం అడ్డదారులు తొక్కారు. కానీ జనం మాత్రం వైఎస్సార్ సీపీ వైపే నిలబడ్డారు. నిజంగా ఇది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడికి ఘోర పరాభవమే. ఎంపీ రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌కు కూడా చావు దెబ్బ వంటిదే. పంచాయతీ ఎన్నికల్లోనూ కళా వెంకటరావు వంటి వారు ఎంత ప్రయత్నించినా గెలవలేకపోయారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముందు కుట్రలు, కుతంత్రాలు నడవవని ఈ ఎన్నికలు రుజువు చేశాయని వైఎస్సార్సీపీ నేతలు భావిస్తున్నారు. పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు, పాలకొండలో విశ్వాసరాయి కళావతి, పాలవలస విక్రాంత్, ఇచ్ఛాపురంలో పిరియా సాయిరాజ్, నర్తు రామారావు తదితర నేతలే బాధ్యత తీసుకుని గెలిపించారు. చదవండి: గూగుల్ పే ఉందా.. అయితే డబ్బులు పంపండి చిన్నారి ఉసురు తీసింది.. కుక్కలు, కోతులా? హత్యా? -
విజయవాడలో పుర‘పోల్’ సిత్రాలివే!
సాక్షి, అమరావతి బ్యూరో: తాజాగా జరిగిన విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లోనూ కొన్ని ఆసక్తికర పరిణామాలు వెలుగు చూశా యి. ఈ ఎన్నికల బరిలో ఉన్న ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకు ఒక్కటంటే ఒక్క ఓటూ పడలేదు. అంటే వారి ఓటు కూడా వారు వేసుకోలేదన్న మాట! నగరంలోని 9వ డివిజన్లో బొల్లినేని లక్ష్మీ సంధ్య, 46వ డివిజన్లో దిల్ షాద్ బేగంలు ‘0’ ఓట్లు సాధించిన ఘనతను చాటుకున్నారు. అలాగే 9వ డివిజన్‌లోనే కన్నా లక్ష్మి, 59వ డివిజన్లో ఎండీ వహీదా పర్వీన్, 60వ డివిజన్లో ఎండీ నజీమాలకు ఒక్కొక్క ఓటు మాత్రమే పోలయ్యాయి. రెండేసి ఓట్లు తెచ్చుకున్న వారిలో 60వ డివిజన్లో ఎం. మాధవి, 31వ డివిజన్లో కె.విజయశ్రీలు ఉన్నారు. ఇక 20వ వార్డులో జె.బాలాజీ, 40వ డివిజన్లో సీహెచ్. రామునాయుడులు మూడేసి ఓట్లు లభించాయి. ఇలా నాలుగు ఓట్లు తెచ్చుకున్న వారు ఐదుగురు, ఐదుఓట్లు లభించిన వారు ఏడుగురు, ఆరు ఓట్లు వచ్చిన వారు ఒక రు, ఏడు ఓట్లు పోలైన వారు ఆరుగురు, ఎనిమిది ఓట్లు దక్కిన వారు ఐదుగురు, తొమ్మిది ఓట్లు పొందిన వారు ఒకరు, పది ఓట్లు వచ్చిన వారు ఒకరు చొప్పున ఉన్నారు. ఇలా విజయవాడ నగరపాలకసంస్థలో వివిధ డివిజన్లలో పది లోపు ఓట్లను పొందిన స్వతంత్ర అభ్యర్థులు 35 మంది ఉన్నారు. వీరిలో 24 మంది మహిళా అభ్యర్థులే కావడం విశేషం! ఇదీ సంగతి..! కొందరు అభ్యర్థులు అత్యల్పంగా ఓట్లు తెచ్చుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థితో పాటు డమ్మీ అభ్యర్థులతోనూ వేయిస్తారు. ఉపసంహరణ సమయంలో డమ్మీ అభ్యర్థులు బరి నుంచి తప్పిస్తారు. దీంతో బరిలో అసలు అభ్యర్థులే మిగులుతారు. అయితే కొంతమంది ప్రధాన అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లుగాను, బూత్ ఏజెంట్లుగాను పనికొస్తారన్న ఉద్దేశంతో వారిని కొనసాగిస్తారు. ఇలాంటి వారిని నిబంధనల ప్రకారం అధికారులు స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణిస్తారు. వీరు తమ ఓటును కూడా తమకు వేసుకోరు. దీంతో వీరికి ‘0’ ఓట్లు పడినట్టు రికార్డుల్లోకి ఎక్కుతారు. ఒకవేళ ఎవరైనా పొరపాటున వేస్తే మాత్రం స్వల్ప ఓట్లు వీరి ఖాతాలో జమ అవుతాయ. అయితే మరికొంతమంది ఉద్దేశపూర్వకంగానే నామినేషన్లు దాఖలు చేస్తారు. ఫలానా ఎన్నికల్లో పోటీ చేశాను.. అని చెప్పుకోవడానికి అలా వేస్తుంటారు. అలాంటి వారు ఎన్నికల్లో ప్రచారం కూడా చేయరు. తనకు ఓటేయమని జనంలోకి వెళ్లి అడగరు. వీరికి తన ఓటుతో పాటు తమ కుటుంబ సభ్యుల, స్నేహితుల ఓట్లు నామమాత్రంగా పడతాయి. చర్చకు దారితీస్తాయి. చదవండి: ఓ అభ్యర్థికి ఒక్క ఓటూ పడలేదు.. -
అరరే.. తిరుపతిలో పరువు పాయే!
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి శృంగభంగమే ఎదురైంది. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, యువనేత భూమన అభినయ్‌రెడ్డి రాజకీయ చతురత ముందు సైకిల్ తునాతునకలైంది. భవిష్యత్‌లో తామే ఎమ్మెల్యే అభ్యర్థులమని చెప్పుకునే నేతలు సైతం ఓటమిపాలయ్యారు. సొంత డివిజన్లో గెలుపు వాకిట చేరకమునుపే బొక్కబోర్లా పడ్డారు. ఒక్క ఎన్నికతో మాజీ ఎమ్మెల్యే, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, తెలుగు యువత.. తదితర నేతల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టేసినట్టయ్యింది. సాక్షి, తిరుపతి: ఆధ్యాత్మిక నగరంలో దాదాపు 19 ఏళ్ల తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. మేయర్ పీఠంపై రాజకీయ పార్టీలు ఆసక్తి ప్రదర్శించాయి. 50 డివిజన్లు ఉన్న కార్పొరేషన్లో 49 డివిజన్లలో ఎన్నికలు నిర్వహిస్తే, అందులో 48 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. తెలుగుదేశం పార్టీ ఒక్క డివిజన్‌కే పరిమితమైంది. 22 డివిజన్లు వైఎస్సార్సీపీకి ఏకగ్రీవంగా దక్కాయి. ఎన్నికలు జరిగిన 27 డివిజన్లలో 26 డివిజన్లలో వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడింది. తండ్రికి తగ్గ తనయుడు తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతలను ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తన కుమారుడు భూమన అభినయ్‌రెడ్డికి అప్పగించారు. ప్రత్యక్షంగా కార్పొరేషన్ ఎన్నికల్లో పాల్గొన్న ఆయన 4వ డివిజన్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్పొరేషన్ పరిధిలో అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టిసారించారు. 27 మంది పోటీ చేస్తే అందులో 25 మంది విద్యాధికుల్ని ఎంపిక చేశారు. ఇందులో ముగ్గురు వైద్యులు, ఏడుగురు బీటెక్, ముగ్గురు పోస్టు గ్రాడ్యుయేట్స్, 12 మంది గ్రాడ్యుయేట్స్ ఉండడం గమనార్హం. తాజా ఫలితాల్లో ఒక్కరు మినహా విద్యాధికులంతా విజేతలుగా నిలిచారు. యువనేత ముందు చూపు, రాజకీయ చతురతతోనే అద్భుత ఫలితాలు సాధించారని విశ్లేషకులు పేర్కొన్నారు. చదవండి: (ప్రజలు నమ్మటంలేదు.. మనపని అయిపోయింది..) టీడీపీ నేతల పరువు గల్లంతు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ నేతల పరువు గల్లంతైంది. నియోజకవర్గం, పార్లమెంటు, రాయల సీమ స్థాయి నేతలుగా చెప్పుకుంటున్న వారంతా, వారివారి డివిజన్లను కూడా దక్కించుకోలేక పోయారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మను మరాలు వెంకటకీర్తి 18వ డివిజన్లో బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. టీడీపీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, తుడా మాజీ చైర్మన్, టీడీపీ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు నరసింహయాదవ్ తమ్ముడు కృష్ణాయాదవ్ 3వ డివిజన్లో బరిలోకి దిగి ఓడిపోయారు. దాదాపు 1,081 ఓట్ల తేడాతో ప్రత్యర్థి చేతిలో చిత్తయ్యారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌వర్మ భార్య జ్యోత్స్న 15వ డివిజన్లో పోటీచేసి ఓడిపోయారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, టౌన్‌బ్యాంక్ మాజీ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి మద్దతుతో నిలిచిన అభ్యర్థులకూ శృంగభంగమే ఎదురైంది. తిరుపతిలో ఉనికి చాటుకునేందుకు నిత్యం అధికార పార్టీపై బురదచల్లే నవీన్‌కుమార్‌రెడ్డి తమ్ముడు భువన కుమార్‌రెడ్డిని స్వతంత్ర అభ్యరి్థగా బరిలోకి దింపి భంగపడ్డారు. 31వ డివిజన్లో మబ్బు దేవనారాయణరెడ్డి బలపరిచిన పుష్పలత సైతం ఓటమిని చవిచూశారు. టౌన్‌బ్యాంక్ మాజీ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి సొంత డివిజన్ అయిన 26వ డివిజన్‌ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఎవరికి వారు ఉద్ధండులమని చెప్పుకునే నాయకులను ప్రజలు తిరస్కరించారని స్థానికులు చర్చించుకుంటున్నారు. చదవండి: హిందూపురంలో బాలయ్యకు ఓటు దెబ్బ సెల్‌ఫోన్ వాడొద్దన్నందుకు.. మనస్తాపం చెంది! -
ప్రజలు నమ్మటంలేదు.. మనపని అయిపోయింది..
సాక్షి, అమరావతి: మునిసిపల్ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేశాయి. ఇంతటి ఘోర ఓటమి తమకు ఎప్పుడూ లేదని నేతలు, కార్యకర్తలు వాపోతున్నారు. పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్నో ఓటముల్ని చూసిన నేతలు కూడా మునిసిపల్ ఎన్నికల పరాజయాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితమైనప్పుడు పార్టీ భవిష్యత్తుపై ఆందోళన చెందినా ఎలాగోలా జవసత్వాలు కూడదీసుకున్నారు. ఇప్పుడు జరిగిన పరాభవం మాత్రం వారికి ఆ అవకాశం కూడా లేకుండా చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. స్థానిక ఎన్నికల చరిత్రలో ఎక్కడా జరగని విధంగా పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఏమిటో తమకు అర్థం కావడంలేదని టీడీపీ ముఖ్య నాయకులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు తమను ఏమాత్రం నమ్మడంలేదని పార్టీలో ఉన్న కొందరు సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు. ఏడాదిన్నరగా తమ అధినేత చంద్రబాబు చెప్పిన ఏ విషయాన్ని ప్రజలు నమ్మలేదని విజయవాడకు చెందిన టీడీపీ నాయకుడు ఒకరు చెప్పారు. ప్రభుత్వంపై వ్యతిరేకత భారీగా ఉందని నమ్మి దాన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నించామని, లేని వ్యతిరేకతను ఉన్నట్లు చెప్పడం వల్ల ప్రజల విశ్వాసం కోల్పోయామని ఆ పార్టీ సీనియర్ నాయకులు విశ్లేషిస్తున్నారు. ప్రజల్ని మెప్పించలేక ఇంకా విశ్వాసం కోల్పోయాం ఐదేళ్ల పాలనలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాక వారిని ఎలా మెప్పించాలో ఆలోచించకుండా గుడ్డిగా రాజకీయాలు చేశామనే అభిప్రాయం పార్టీ నేతల్లో వినిపిస్తోంది. అబద్ధాలనే నిజాలుగా ప్రచారం చేయడం, ప్రజల తీర్పునే ప్రశ్నించడం, ప్రజల్ని కూడా నిందిస్తూ మాట్లాడడం వల్ల పూర్తిగా విశ్వాసం కోల్పోయామని కొందరు నాయకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు టీడీపీకి ఓటేయలేదని ప్రజల్నే ప్రశ్నిస్తూ, కొన్నిసార్లు తిడుతూ చేసిన వ్యాఖ్యలు పార్టీని ఇంకా దిగజార్చాయని, వీటివల్ల ఆయన స్థాయి కూడా తగ్గిపోయిందని చెబుతున్నారు. ప్రజల కోణం నుంచి ఆలోచించకుండా ప్రతిదీ రాజకీయ కోణంలో చూసి అర్థం లేకుండా మాట్లాడి పరువు పోగొట్టుకున్నామంటున్నారు. అమరావతిలోనే తమను తిరస్కరించాక ఇక తమ రాజకీయం ఎక్కడ పనిచేస్తుందో అర్థం కావడం లేదని వాపోతున్నారు. సీఎం జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో ఆదరణ తగ్గలేదని, సంక్షేమ పథకాల వల్ల అది ఇంకా పెరిగిందని టీడీపీ సీనియర్లు కొందరు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా ముందుకెళ్లడం కష్టమని వారు వాపోతున్నారు. భవిష్యత్తు బెంగతో చాలామంది నేతలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. -
జనం గుండెల్లో జగన్ ముద్ర
సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభంజనం రికార్డులను తిరగరాసింది. ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో 52.63 శాతం ఓట్లను వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. 82.60 శాతం వార్డుల్లో విజయ కేతనం ఎగుర వేసింది. పురపాలక ఎన్నికల్లో పోలైన ఓట్ల సరళి వైఎస్సార్సీపీ జైత్రయాత్రకు తార్కాణంగా నిలుస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దాదాపు రెండేళ్లుగా విజయవంతంగా అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు.. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి విధానాలకు ప్రజామోదం లభించిందన్నది స్పష్టమైంది. 11 కార్పొరేషన్లలో 45,80,762 ఓట్లు ఉన్నాయి. వాటిలో పోలింగ్ రోజున 27,36,268 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటిలో 57,847 ఓట్లు చెల్ల లేదు. దాంతో 26,78,421 ఓట్లు చెల్లిన ఓట్లుగా గుర్తించి వాటిని ఓట్ల లెక్కింపులో పరిగణనలోకి తీసుకున్నారు. ► 75 మున్సిపాలిటీల్లో 30,13,702 ఓట్లు ఉన్నాయి. వాటిలో 21,06,200 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 38,426 ఓట్లు చెల్లుబాటు కాలేదు. దాంతో మిగిలిన 20,67,774 ఓట్లు చెల్లినవిగా గుర్తించి వాటిని ఓట్ల లెక్కింపులో పరిగణనలోకి తీసుకున్నారు. ► మొత్తం మీద 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో 75,94,464 ఓట్లలో 48,42,468 ఓట్లు పోలయ్యాయి. వాటిలో 96,273 ఓట్లు చెల్లలేదు. మిగిలిన 47,46,195 ఓట్లు చెల్లినవిగా గుర్తించి ఓట్ల లెక్కింపులో పరిగణనలోకి తీసుకున్నారు. 52.63 శాతం ఓట్లు ‘ఫ్యాన్’కే ► 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో మొత్తం చెల్లిన 47,46,195 ఓట్లలో వైఎస్సార్సీపీ 24,97,741 ఓట్లు దక్కించుకుంది. అంటే 52.63 శాతం ఓట్లు వైఎస్సార్ కాంగ్రెస్‌కు వచ్చాయి. టీడీపీకి కేవలం 14,58,346 ఓట్లు వచ్చాయి. అంటే టీడీపీ 30.73 శాతం ఓట్లకే పరిమితమైంది. ► 11 కార్పొరేషన్లలో 26,78,421 చెల్లిన ఓట్లలో వైఎస్సార్సీపీకి 13,19,466 ఓట్లు పడ్డాయి. అంటే నగర పాలక సంస్థల్లో 50 శాతం ఓట్లను వైఎస్సార్సీపీ దక్కించుకుంది. టీడీపీకి కేవలం 8,35,534 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ 31 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. ► 75 మున్సిపాలిటీల్లో మొత్తం 20,67,774 చెల్లిన ఓట్లలో 11,78,275 ఓట్లు వైఎస్సార్సీపీకి పడ్డాయి. అంటే పురపాలక సంఘాల్లో 57 శాతం ఓట్లు వైఎస్సార్సీపీకే దక్కాయి. టీడీపీ కేవలం 6,22,812 ఓట్లతో 30 శాతానికి పరిమయింది. 2,265 వార్డుల్లో వైఎస్సార్సీపీ జయభేరి ► 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో మొత్తం మీద 2,742 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించారు. వాటిలో వైఎస్సార్సీపీ 2,265 వార్డుల్లో జయభేరి మోగించింది. అంటే వైఎస్సార్సీపీ రికార్డు స్థాయిలో ఏకంగా 82.60 వార్డుల్లో విజయకేతనం ఎగుర వేసింది. ► 11 కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించిన 620 వార్డుల్లో వైఎస్సార్సీపీ 515 వార్డుల్లో విజయ దుందుభి మోగించింది. అంటే 83.06 శాతం వార్డుల్లో ఘన విజయం సాధించింది. దీంతో 11 మేయర్ స్థానాలు వైఎస్సార్సీపీకి దక్కనున్నాయి. అంటే 100 శాతం విజయం సాధించింది. ► 75 పురపాలక సంఘాలు /నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించిన 2,122 వార్డుల్లో వైఎస్సార్సీపీ 1,750 వార్డుల్లో గెలుపొందింది. అంటే 82.46 శాతం వార్డులను చేజిక్కించుకుంది. ► 75 మున్సిపాలిటీల్లో 97.33 శాతం వైఎస్సార్సీపీ పరమయ్యాయి. 73 మున్సిపాలిటీల్లో 90 శాతానికిపైగా వార్డులను దక్కించుకుంది. ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లతో మైదుకూరు పురపాలక సంఘాన్ని దక్కించుకునే అవకాశాలున్నాయి. ఇక తాడిపత్రి పురపాలక సంఘం ఎవరికి దక్కుతుందన్నది ఉత్కంఠ భరితంగా మారింది. ► రాష్ట్రంలో 10 పురపాలక సంఘాల్లో 100 శాతం వార్డుల్లో గెలిచి వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని వార్డులూ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇక తుని, కనిగిరి, వెంకటగిరి, ధర్మవరం, రాయచోటి, ఎర్రగుంట్ల పురపాలక సంఘాల్లో అన్ని వార్డుల్లోనూ వైఎస్సార్సీపీ విజయం సాధించింది. వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయడంతో ఆ 10 పురపాలక సంఘాల్లో ప్రతిపక్షమన్నదే లేకుండా పోయింది. మరో రెండు అడుగులు ముందుకు.. గత సార్వత్రిక ఎన్నికల్లో (2019) వైఎస్సార్సీపీ దాదాపు 50 శాతం ఓట్లను సాధించి ఘన విజయం సాధించింది. అప్పట్లో టీడీపీకి 39.99 శాతం ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ.. దాదాపు రెండేళ్లుగా చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి పథకాలు, విప్లవాత్మక నిర్ణయాల కారణంగా ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరింతగా ఆదరించారని స్పష్టమైంది. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సింహభాగం గెలుపొందడటం, నిన్నటి పురపాలక ఎన్నికల్లో ఏకంగా 52.63 ఓటు బ్యాంకును సాధించడం విశేషం. టీడీపీ మాత్రం 30.73 శాతానికే పరిమితమైంది. అంటే దాదాపు 9 శాతం ఓటు బ్యాంకును కోల్పోయింది. ఇదే సమయంలో బీజేపీ, జనసేనలకు ఉన్న కాస్తోకూస్తో ఓటు బ్యాంకు సైతం భారీగా గల్లంతయ్యింది. -
సీఎం వైఎస్ జగన్ పాలనకు జనం పట్టం కట్టారు : అనిల్ కుమార్ యాదవ్
-
‘ఆ నిర్ణయాలే వైఎస్సార్ సీపీ విజయానికి కారణం’
సాక్షి, గుంటూరు : గుంటూరు, విజయవాడ ప్రజలు అభివృద్ధి వికేంద్రీకరణకు స్పష్టమైన తీర్పునిచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ మోపీదేవి వెంకటరమణ పేర్కొన్నారు. రేపల్లెలో ప్రజలకు ఇచ్చిన హామీలను సంవత్సరంలో పూర్తి చేస్తామని భరోసానిచ్చారు. రేపల్లె పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని, వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి సీఎం తీసుకున్న నిర్ణయాలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాయని అన్నారు. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ప్రజలు ఇచ్చిన తీర్పు చూస్తే సీఎం వైఎస్ జగన్‌పై ప్రజలకు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుందన్నారు. గుంటూరులో చంద్రబాబు మాట్లాడిన మాటలకు ప్రజలే బుద్ధి చెప్పారని విమర్శించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నైజం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది అయితే ఇచ్చిన మాటను నెరవేరకపోవడంతో చంద్రబాబు నైజమని దుయ్యబట్టారు. చదవండి: నిన్న వలంటీర్లు.. నేడు కౌన్సిలర్, కార్పొరేటర్లు చెక్కు చెదరని వైఎస్సార్సీపీ ఓట్ షేర్ -
చెక్కు చెదరని వైఎస్సార్సీపీ ఓట్ షేర్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ మరోసారి భారీ మెజారిటీతో రికార్డు సృష్టించింది. వైఎస్సార్సీపీ ఓట్ షేర్ చెక్కు చెదరలేదు. మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు వైఎస్సార్సీపీ దక్కించుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓట్ షేర్ 52.63 శాతం కాగా, టీడీపీ 30.73 శాతం, బీజేపీ 2.41 శాతం, జనసేన 4.67 శాతం, సీపీఐ 0.80 శాతం, సీపీఎం 0.81 శాతం, కాంగ్రెస్ 0.62 శాతం ఓట్లు దక్కించుకున్నాయి. సాధారణ ఎన్నికలతో పోలిస్తే టీడీపీ ఓట్ షేర్ భారీగా తగ్గింది. మున్సిపల్ ఎన్నికల చరిత్రలో.. మున్సిపల్ ఎన్నికల చరిత్రలో ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్సీపీ దేశంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో మొత్తం కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేసి ప్రభంజనం సృష్టించింది. ‘ఫ్యాన్’ ప్రభంజనంతో 97.33 శాతం మున్సిపాలిటీలలో పాగా వేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్నాలు, అభివృద్ధి కార్యక్రమాలు, కీలక నిర్ణయాలకు ప్రజలు పట్టం కట్టారు. ప్రతిపక్ష పెద్దలు ఎంతగా రెచ్చగొట్టినా, కుట్రలకు తెరలేపినా.. తమ తీర్పు ఇదేనని తేల్చి చెప్పారు. అటు న్యాయ రాజధాని.. ఇటు పరిపాలనా రాజధాని.. మధ్యలో శాసన రాజధానిలోనూ విస్పష్ట తీర్పునిచ్చారు. 2014లో అలా.. 2021లో ఇలా... 2014లో జరిగిన పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 939 వార్డుల్లో గెలిచింది. అప్పటి ఎన్నికల్లో 36.52 శాతం వార్డులను కైవసం చేసుకుంది. టీడీపీ 1,424 వార్డుల్లో గెలిచి 55.39 శాతం వార్డుల్లో విజయం సాధించింది. కాగా ప్రస్తుతం వైఎస్సార్సీపీ ఏకంగా 2,265 వార్డులను కైవసం చేసుకుంది. 81.07 శాతం వార్డుల్లో విజయ దుందుభి మోగించింది. టీడీపీ కేవలం 348 వార్డులకే పరిమితమైంది. ఆ పార్టీ కేవలం 12.70 శాతం వార్డులతో సరిపెట్టుకుంది. చదవండి: మున్సిపల్ ఎన్నికల చరిత్రలో 'ఫ్యాన్' తుపాన్ మున్సిపల్ ఎన్నికలు: టీడీపీ సీనియర్లకు షాక్ -
నిన్న వలంటీర్లు.. నేడు కౌన్సిలర్, కార్పొరేటర్లు
సత్తెనపల్లి/కంచరపాలెం (విశాఖ ఉత్తర): నిన్నమొన్నటివరకు విశేష సేవలందించి అందరి ప్రశంసలు పొందిన ఇద్దరు వలంటీర్లు నేడు కౌన్సిలర్, కార్పొరేటర్‌గా ఎన్నికై రికార్డు సృష్టించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మునిసిపాలిటీలో 12వ వార్డు నుంచి వైఎస్సార్సీపీ తరఫున వలంటీర్ లోకా కల్యాణి బరిలోకి దిగారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీకి చెందిన సరికొండ జ్యోతిపై 504 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. విశాఖలో.. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో ఓ వార్డు వలంటీర్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 47వ వార్డు కంచర్లపాలెం అరుంధతినగర్ కొండవాలు ప్రాంతానికి చెందిన కంటిపాము కామేశ్వరి గతంలో వార్డు వలంటీర్‌గా పనిచేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన ఆమె తన సమీప ప్రత్యర్థిపై 3,898 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. చదవండి: తాడిపత్రి ఎక్స్అఫిషియో ఓట్ల కేటాయింపులో ట్విస్ట్ -
తాడిపత్రి ఎక్స్అఫిషియో ఓట్ల కేటాయింపులో ట్విస్ట్
అనంతపురం: తాడిపత్రి ఎక్స్అఫిషియో ఓట్ల కేటాయింపులో ట్విస్ట్ చోటుచేసుకుంది. నలుగురు ఎమ్మెల్సీలకు ఎక్స్అఫిషియో ఓటును ఈసీ తిరస్కరించింది. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఇక్బాల్, గోపాల్‌రెడ్డి, శమంతకమణి దరఖాస్తులను ఈసీ తిరస్కరించింది. తాడిపత్రిలో ఓటు హక్కు లేనందున ఎమ్మెల్సీలకు ఎక్స్అఫిషియో తిరస్కరించారని.. ఓటు హక్కు ఉన్న చోటే సభ్యత్వం ఉంటుందని కమిషనర్ తెలిపారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, అనంతపురం ఎంపీ రంగయ్యకు ఎక్స్అఫిషియో ఓట్లు జారీ అయ్యాయి. 18న తాడిపత్రి మున్సిపల్ సమావేశానికి హాజరుకావాలని అధికారులు లేఖ రాశారు. చదవండి: ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చు.. కానీ ఏం చంద్రబాబు ఇప్పుడేమంటారు..? -
ఓట్లు వేయమని సీఎం వైఎస్ జగన్ అడగలేదు: గండికోట శ్రీకాంత్ రెడ్డి
-
రాష్ట్రంలో ఒకటే జెండా, ఒకటే అజెండా మిగిలాయి
-
మునిసిపల్ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు
-
మిగిలింది.. ఒకటే జెండా, ఒకటే అజెండా
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు తిరుగులేదని ప్రజలు మరోసారి నిరూపించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రజలు మద్దతు తెలిపారన్నారు. రాష్ట్రంలో ఒకటే జెండా, ఒకటే అజెండా మిగిలాయని.. అమరావతి పేరుతో చంద్రబాబు చేసిన దోపిడీకి ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ‘‘బెజవాడలో పైన అమ్మవారు.. కింద అన్నగారు మాత్రమే ఉన్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం. ఎక్కడైనా దౌర్జన్యంపై పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేశారా?. రాష్ట్రమంతా కలిపి 19 వార్డులు గెలిచిన పవన్‌కు విమర్శించే అర్హత ఉందా?. పవన్ కల్యాణ్ పూటకో పార్టీకి మద్దతు ఇచ్చి కార్యకర్తలను అవమానిస్తున్నారు. అందరికీ మద్దతిచ్చే వారికి పార్టీ ఎందుకు, జెండా ఎందుకు?’’ అని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఇక ప్రజలకు ప్రతిపక్షాలతో పని లేదని తేలిపోయిందని ఎమ్మెల్యే రోజా అన్నారు. చదవండి: ఏం చంద్రబాబు ఇప్పుడేమంటారు..? మున్సిపల్ ఎన్నికలు: టీడీపీ సీనియర్లకు షాక్ -
విశాఖ కార్పొరేషన్ లో వైఎస్సార్సీపీ అఖండ విజయం
-
వైస్ జగన్ నాయకత్వానికి ప్రజలు సంపూర్ణ మద్దతు: మోపి దేవి
-
మున్సిపల్ ఎన్నికల సమయంలో బాబు వ్యాఖ్యలు సరికావు
-
చంద్రబాబు మానసికంగా బాగా దెబ్బతిన్నాడు: వల్లభనేని వంశీ
-
ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల చరిత్రలో 'ఫ్యాన్' తుపాన్
-
తెలుగు రాష్ట్రాల్లో ‘పొలిటికల్ ఫీవర్’
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం రాజకీయ వేడి కొట్టొచి్చనట్టు కనిపించింది. తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగడం, ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో రెండు రాష్ట్రాల్లోనూ ఆదివారమంతా రాజకీయ చర్చే జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరీగా జరగడంతో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సరళిపై చర్చోపచర్చలు జరగ్గా, ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించడంతో రెండు రాష్ట్రాల్లోని వైఎస్ కుటుంబ అభిమానుల్లో జోష్ కనిపించింది. ప్రతిపక్షాలు దరిదాపుల్లో కూడా లేకుండా అటు మున్సిపాలిటీలు, ఇటు కార్పొరేషన్లను వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేయడం... తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ ప్రత్యేక చర్చకు తావిచ్చింది. టీవీలకు అతుక్కుపోయి తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళుతున్న తీరుపై అన్ని రాజకీయ పారీ్టలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ కనిపించాయి. ఇక సామాన్య ప్రజానీకం టీవీలకు అతుక్కుపోయి పోలింగ్ సరళిని గమనిస్తూ.. తమదైన విశ్లేషణ చేశారు. ఉదయం కొంత మందకొడిగా పోలింగ్ జరిగినా, ఆ తర్వాత పుంజుకుని గత ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ఎక్కువ పోలింగ్ అయిన నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న దానిపైనా పలు రకాల చర్చలు జరిగాయి. పెరిగిన పోలింగ్‌శాతం అధికార టీఆర్ఎస్కు నష్టం చేస్తుందా? లాభం కలిగిస్తుందా? ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్, బీజేపీలు ఏ మేరకు సొమ్ము చేసుకుంటాయి? స్వతంత్ర అభ్యర్థులు ఎలాంటి ప్రభావం చూపుతున్నారన్న దానిపై అటు టీవీల్లోనూ, ఇటు బయట విశ్లేషించడం కనిపించింది. ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళిని తెలంగాణ ప్రజానీకం ఆసక్తిగా గమనించారు. ఫలితాలు పూర్తిగా ఏకపక్షంగా ఉండటంతో అక్కడి వైఎస్సార్సీపీ పాలన, నవరత్నాల పేరిట రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న తీరు, జగన్ నాయకత్వంపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న విశ్వాసం లాంటి అంశాలపై తెలంగాణ ప్రజానీకం చర్చించుకుంది. మొత్తంమీద రెండు రాష్ట్రాల్లో ఆదివారం పొలిటికల్ ఫీవర్ స్పష్టంగా కనిపించింది. స్థానిక ఎన్నికలను తలపిస్తూ తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తీరు స్థానిక ఎన్నికలను తలపించింది. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లాగానే... స్థానిక నాయకులు తీవ్రంగా శ్రమించారు. వారం రోజుల ముందు నుంచే ఓటర్లతో టచ్‌లో ఉన్న ఆయా పారీ్టల నేతలు ఆదివారం ఉదయం నుంచే ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఓటేసేందుకు రావాలని అభ్యరి్థంచారు. ఇక గ్రామాల నుంచి ఓటర్లు మండల కేంద్రాలకు రావాల్సి ఉండటంతో ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నం భోజనం వరకు రాజకీయ పారీ్టలు ఏర్పాటు చేయడం గమనార్హం. పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదలుపెట్టిన గ్యాస్‌దండాలు తెలంగాణలో చర్చనీయాంశమయ్యాయి. కేటీఆర్ తరహాలోనే పలువురు ఓటర్లు గ్యాస్ సిలండర్లకు దండాలు పెట్టి, పూజలు చేసి పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేటీఆర్‌కు కౌంటర్ అన్నట్లుగా ... తాను నిరుద్యోగికి దండం పెట్టి ఓటు వేయడానికి వెళ్లినట్లు బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేర్కొనడం గమనార్హం. ఈ ఓట్ల దండాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. -
నే గెలిచా... లేవండీ!
అమలాపురం టౌన్: ఏవండీ.. లేవండీ.. ఎన్నికల్లో నే గెలిచా.. నన్ను ఆశీర్వదించండి. మీరిచ్చిన ధైర్యమే నాకు అండండీ.. మీరు లేరనే మాట నన్ను కుంగదీస్తుందండీ... అంటూ అమలాపురం మున్సిపాలిటీలో 10వ వార్డు నుంచి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్‌గా గెలిచిన కొల్లాటి నాగవెంకట దుర్గాబాయి ఆమె భర్త మృతదేహం వద్ద విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. దుర్గాబాయి తల్లి శనివారం తెల్లవారు జామున మరణించారు. ఆ బాధను దిగమింగుకుని తప్పని పరిస్థితుల్లో అమలాపురం ఎస్కేబీఆర్ కౌంటింగ్ హాలుకు ఆదివారం ఉదయం ఆమె వచ్చారు. లెక్కింపు సమయంలో బరువెక్కిన హృదయంతోనే ఆమె ఉన్నారు. పదో వార్డు కౌన్సిలర్‌గా విజయం సాధించడంతో అంతా కృతజ్ఞతలు చెబుతుండగా.. ఇంతలో ఆస్పత్రిలో ఉన్న తన భర్త కూడా మరణించినట్లు సమాచారం తెలియడంతో కుంగిపోయింది. రెండు రోజుల వ్యవధిలోనే తల్లీ, భర్త చనిపోవడంతో ఆమె పడుతున్న బాధ వర్ణనాతీతం. వారిద్దరూ ఐసీయూల్లో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నా ఆ బాధను దిగమింగి మున్సిపల్ అభ్యర్థిగా పోటీ చేసిన బాధ్యతతో ప్రచారం చేశారు. చివరికి తల్లీ భర్త మరణించడంతో కౌన్సిలర్‌గా గెలిచిన ఆనందం పంచుకునే అవకాశం లేకుండా పోయింది. దుర్గాబాయి దీన గాథను చూసి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలే కాకుండా స్థానిక ప్రజలు చలించిపోయారు. ఆమె వద్దకు వెళ్లి ఓదార్చారు. మంత్రి పినిపే విశ్వరూప్, బేబీ మీనాక్షి దంపతులు, పట్టణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర సంతాపం తెలిపారు. చదవండి: ఓ అభ్యర్థికి ఒక్క ఓటూ పడలేదు.. మున్సిపల్ ఎన్నికలు: టీడీపీ సీనియర్లకు షాక్ -
ఓ అభ్యర్థికి ఒక్క ఓటూ పడలేదు..
మదనపల్లె (చిత్తూరు జిల్లా): మదనపల్లె మునిసిపాలిటీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. 16వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్.రవీంద్ర నాయుడుకు ఒక్క ఓటు కూడా పడలేదు. కాగా, ఆయనకు ఈ వార్డులో ఓటు లేదు. అలాగే రెండో వార్డులో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరఫున బరిలోకి దిగిన ఆర్.పవన్‌కుమార్‌కు కేవలం ఒకే ఒక్క ఓటు లభించింది. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఇదే వార్డులో ఓట్లున్నా ఆయనకు ఒక్క ఓటే పడటం గమనార్హం. అదేవిధంగా బీఎస్పీ తరఫున ఒకటో వార్డులో బరిలోకి దిగిన కందూరు సహదేవుడుకు 2 ఓట్లు మాత్రమే లభించాయి. ఆయనకు ఈ వార్డులో ఓటు లేదు. చదవండి: బాబు సొంత జిల్లాలో టీడీపీకి ఘోర పరాభవం మున్సిపల్ ఎన్నికలు: టీడీపీ సీనియర్లకు షాక్ -
మున్సిపల్ ఎన్నికలు: టీడీపీ సీనియర్లకు షాక్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సీనియర్లమంటూ చెప్పుకునే టీడీపీ నేతలకు మున్సిపల్ ఎన్నికల్లో జనం షాకిచ్చారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన పచ్చనేతలకు చెక్ పెట్టారు. చైర్పర్సన్ అభ్యర్థులుగా బరిలో దిగిన నేతలను దారుణంగా ఓడించారు. ♦పలాస మున్సిపాలిటీ పరిధిలో తిత్లీ పరిహారం అక్రమాలకు పాల్పడిన గోల్ల చంద్రను అక్కడి ఓటర్లు ఓడించారు. ♦అదే పట్టణంలో భూ ఆక్రమణలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొన్న సైన వల్లభ భార్య కవితను ప్రజలు చిత్తుగా ఓడించారు. ♦పార్టీలు మారుతూ చివరికీ టీడీపీలో చైర్పర్సన్ అభ్యర్థిగా పోటీ చేసిన మున్సిపల్ మాజీ చైర్మన్ వజ్జ బాబూరావు భార్య గంగాభవానీ ఓడిపోయారు. ♦గతంలో రెండు సార్లు గెలిచిన టీడీపీ మాజీ కౌన్సిలర్ సవర రాంబాబుకు అక్కడి ఓటర్లు ఈ సారి ఓటమి రుచి చూపించారు. ♦టీడీపీ పట్టణ అధ్యక్షుడు లొడగల కామేశ్వరరావు భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతేకాకుండా టీడీపీలో పట్టు ఉన్న మాజీ కౌన్సిలర్ బడ్డ నాగరాజు, లావ ణ్య దంపతులిద్దరూ ఓడిపోయారు. ♦టీడీపీ సీనియర్ నేత శేసనపురి మోహనరావు కూడా ఈ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. గత పాలకవర్గంలో ఉన్న 12 మంది టీడీపీ కౌన్సిలర్లు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ♦ఇచ్ఛాపురంలో టీడీపీ సీనియర్ నేత, గతంలో మూడు సార్లు కౌన్సిలర్‌గా పనిచేసిన తెలుకల శ్రీనివాసరావు ఈసారి 9వ వార్డు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ♦పోలింగ్‌కు ముందు నగదు పంపిణీ చేస్తూ కెమెరాకు దొరికిపోయిన టీడీపీ కార్యకర్తల విషయం తెలిసిందే. ఎవరికోసమైతే ఆరోజు నగదు పంపిణీ చేశారో ఆ అభ్యర్థి , బంగారు వ్యాపారి వెచ్చా కేశవరావు ఒక్క ఓటు తేడాతో తన సమీప ప్రత్యరి్థ, వైఎస్సార్సీపీ అభ్యర్థి పల్లంటి మధుమూర్తి చేతిలో పరాజయం పాలయ్యారు. ♦పాలకొండలో టీడీపీ నేత, నగర పంచాయతీ మాజీ చైర్మన్ పల్లా విజయనిర్మల భర్త కొండలరావు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. అదే విధంగా గతంలో టీడీపీ నుంచి వైస్ చైర్మన్‌గా పనిచేసిన సిరిపురం చూడామణి కూడా ఓడిపోయింది. చదవండి: బాబు సొంత జిల్లాలో టీడీపీకి ఘోర పరాభవం మున్సిపల్ ఎన్నికల చరిత్రలో 'ఫ్యాన్' తుపాన్ -
బాబు సొంత జిల్లాలో టీడీపీకి ఘోర పరాభవం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీ కంచుకోటలు బద్దలు కొట్టింది. చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లలో విజయ ఢంకా మోగించింది. అలాగే మదనపల్లె, పలమనేరు, పుత్తూరు, నగరి మునిసిపాలిటీల్లో జయకేతనం ఎగురవేసింది. పుంగనూరు మునిసిపాలిటీని ఏకగ్రీవంగా దక్కించుకుంది. మొత్తం రెండు కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీల పరిధిలో 217 డివిజన్లు, వార్డులకు ఎన్నికలు జరిగితే 197 స్థానాలను కైవసం చేసుకుంది. వార్డు, డివిజన్లతో కలిపి టీడీపీ కేవలం 17 స్థానాలకే పరిమితమైంది. సాక్షి, తిరుపతి: జిల్లాలో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించింది. మునిసిపల్ ఎన్నికల్లో క్లిన్‌స్వీప్ చేసి తిరుగులేని శక్తిగా నిలిచింది. 19 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత మొదటిసారి జరిగిన తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. కంచుకోటగా పిలుచుకునే ఈ నగరంలో టీడీపీ కేవలం ఒక్క డివిజన్‌కే పరిమితమైంది. మొత్తం 50 డివిజన్లలో 22 ఏకగ్రీవం కాగా, 27 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. ఏకగ్రీవాలతో కలిపి వైఎస్సార్సీపీ 48 డివిజన్లను కైవసం చేసుకుంది. ఒక డివిజన్ కోర్టు తీర్పు నేపథ్యంలో పెండింగ్‌లో ఉంది. 35వ డివిజన్ టీడీపీ అభ్యర్థి ఆర్సీ మునికృష్ణ 126 ఓట్ల స్వల్ప మెజారిటీతో బయటపడ్డారు. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి క్యాన్సర్‌తో మంచం పట్టి పెద్దగా ప్రచారం చేయలేకపోయినా గట్టి పోటీనిచ్చారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనుమరాలు వెంకటకీర్తి పోటీచేసిన 18వ డివిజన్, తుడా మాజీ చైర్మన్, తిరుపతి పార్లమెంట్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్ సోదరుడు కృష్ణాయాదవ్ పోటీచేసిన 3వ డివిజన్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌వర్మ సతీమణి జ్యోత్స్న పోటీచేసిన 15వ డివిజన్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. టీడీపీ కంచు కోటలు బద్దలు జిల్లా కేంద్రమైన చిత్తూరు కార్పొరేషన్ కాంగ్రెస్, టీడీపీకి కంచుకోట. చిత్తూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, ఎంపీ సీఎం రమేష్ వంటి అగ్రనాయకులంతా ఈ నగరంలోనే నివాసం ఉంటున్నారు. వీరంతా కార్పొరేషన్‌ను దక్కించుకునేందుకు సాయశక్తులా ప్రయత్నించారు. పెద్ద ఎత్తున ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. డబ్బు, మద్యంతోపాటు బంగారు ముక్కుపుడకలు, వెండి కుంకుమ భరిణెలు, చీరలు పంపిణీ చేశారు. అయినా స్థానిక ఓటర్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకే జై కొట్టారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి సొంత నియోజకవర్గమైన పలమనేరు మునిసిపాలిటీలో వైఎస్సార్సీపీ రెపరెపలాడింది. ఇక్కడ మొత్తం 26 వార్డులకుగాను ఏకగ్రీవాలతో కలుపుకుని 24 వార్డులను ఆ పార్టీ సొంతం చేసుకుంది. 2 వార్డుల్లో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. కుప్పం పక్క నియోజకవర్గం అయినా చంద్రబాబు ప్రభావం పెద్దగా కనిపించలేదు. మదనపల్లె మునిసిపాలిటీలోని 35 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు పోటీకి దిగారు. అయినా ఫలితం లేకపోయింది. 33 వార్డులు వైఎస్సార్సీపీ కైవశం చేసుకుంది. టీడీపీ రెండు వార్డులకే పరిమితమైంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఉంటున్న 27వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి షేక్ కరీముల్లా 507 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఆధిక్యం ఉన్నా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ మునిసిపాలిటీని టీడీపీ దక్కించుకుంది. వికసించని కమలం మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ పలుచోట్ల పోటీ చేసినా ఒక్క చోటా బోణీ చేయలేకపోయింది. తిరుపతిలో ఎనిమిది, నగరి, పుత్తూరులో ఆరు వార్డులు, పలమనేరులో ఒక చోట ఆ పార్టీ అభ్యర్థులు పోటీచేశారు. అక్కడా నామమాత్రపు ఓట్లు కూడా రాబట్టుకోలేకపోయారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఎనిమిది మంది బీజేపీ అభ్యర్థులకు కలిపి వచ్చిన ఓట్లు 2,546 మాత్రమే. అదేవిధంగా జనసేన తరుఫున తిరుపతిలో రెండు డివిజన్లలో పోటీచేస్తే ఇద్దరికీ కలిపి వచ్చిన ఓట్లు 231 మాత్రమే. డబ్బు పోసినా.. ఫ్యాన్‌గాలికి తలవంచాల్సిందే నగరి, పుత్తూరు మునిసిపాలిటీలను దక్కించుకునేందుకు మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్, అతని అనుచరులు తీవ్రంగా ప్రయ తి్నంచారు. ఈ మునిసిపాలిటీలను దక్కించుకునేందుకు అమెరికాలో ఉన్న టీడీపీ శ్రేణులు డబ్బు సంచులతో చేరుకున్నాయని ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకూ రాని వారు సైతం వచ్చి అహరి్నశలు శ్రమించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. రెండు మునిసిపాలిటీలను వైఎస్సార్సీపీ కైవశం చేసుకుంది. ఇటీవల మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ అధినేత చంద్రబాబు సుమారు 10 గంటలు రేణిగుంట విమానాశ్రయంలో హైడ్రామా చేసినా ఓటర్లు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకే జై కొట్టారు. చదవండి: మున్సిపల్ ఎన్నికల చరిత్రలో 'ఫ్యాన్' తుపాన్ తాడిపత్రి, మైదుకూరు ఎవరి వైపు? -
గుంటూరు జిల్లాలో కరోనా కలకలం
పొన్నూరు/తెనాలి అర్బన్: గుంటూరు జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. జిల్లాలో చానాళ్లుగా 10 లోపు కేసులే నమోదవుతుండగా, ఆదివారం ఒకే రోజు 48 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. పొన్నూరు పట్టణంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో 8 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చినట్టు తహసీల్దార్ డి.పద్మనాభుడు చెప్పారు. వారితో పాటు పట్టణంలోని మరో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. పాఠశాలను మూసివేసి పిల్లలను హోం క్వారెంటైన్‌లోఉంచినట్టు తెలిపారు. అలాగే తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో ఆరుగురు ఉద్యోగులు కోవిడ్ బారిన పడినట్టు సిబ్బంది చెప్పారు. కార్యాలయ మేనేజర్, టౌన్ ప్లానింగ్ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిసింది. ఈ నెల 10న మున్సిపల్ ఎన్నికల విధుల్లో వీరు పనిచేయడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. -
నగరాలు.. సంక్షేమానికి మేరు నగవులై..
వైఎస్ జగన్ సర్కారు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు నగరాల్లోనూ మేరు నగవులై నిలిచాయి. పేద, మధ్య తరగతి ప్రజల జీవన ప్రమాణాలను పెంచాయి. ఆ సానుకూల పవనాలు ప్రభంజనంలా వీచాయి. వైఎస్సార్సీపీకి అరుదైన ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టాయి. నగర ఓటర్లు విలువలు, విశ్వసనీయతకే పట్టం గట్టారు. కృత్రిమ ఉద్యమాలతో దగా చేయాలనుకున్న ప్రతిపక్షాలకు కీలెరిగి వాత పెట్టారు. అటు న్యాయ రాజధాని.. ఇటు పరిపాలనా రాజధాని..శాసన రాజధానిలోనూ విశ్లేషకుల ఊహకందని ఫలితాలు ఇచ్చారు. – సాక్షి నెట్వర్క్ బెజవాడలో ఫ్యాన్ దూకుడు విజయవాడ నగరంలోనూ ఫ్యాన్ గాలి బలంగా వీచింది. వైఎస్సార్సీపీ జెండాను రెపరెపలాడించింది. బెజవాడ ప్రజలు మూడు రాజధానులకే ఓటేశారు. అమరావతి రాజధాని సెంటిమెంట్‌కు ఏ మాత్రం విలువ లేదని తేల్చేశారు. విజయవాడ గడ్డపై ఎలాగైనా గెలిచి అమరావతి సెంటిమెంట్ ఉందని చూపాలని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ ఫలితాలు చెంపపెట్టులా మారాయి. బీజేపీతో జతకట్టి విజయవాడ నగరపాలక సంస్థలో పాగా వేయాలని భావించిన జనసేన పార్టీ చతికిలపడింది. ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్సీపీ పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచింది. కచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేసిన టీడీపీ ఫ్యాన్ దూకుడు ముందు నిలబడలేకపోయింది. మొత్తం 64 డివిజన్లు ఉండగా.. 49 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. టీడీపీ 14 డివిజన్లతో సరిపెట్టుకోగా.. ఒకచోట సీపీఎం అభ్యర్థి గెలుపొందారు. జనసేన పత్తా లేకుండాపోయింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 21, పశ్చిమ నియోజకవర్గంలో 22, తూర్పు నియోజకవర్గంలో 21 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడి ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నప్పటికీ వైఎస్సార్సీపీ మాత్రం సార్వత్రిక, పంచాయతీ ఎన్నికల మాదిరిగానే విజయబావుటా ఎగురవేస్తామని మొదటి నుంచీ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చింది. ఆ విధంగానే ఫలితాలు వచ్చాయి. గుంటూరులో టీడీపీకి చావు దెబ్బ ‘గుంటూరు నగరపాలక సంస్థను వైఎస్సార్సీపీ గెలుచుకుంటే అధికార వికేంద్రీకరణకు మద్దతు తెలిపినట్టే. ఎన్నికల్లో టీడీపీకి ఓటేసి గుంటూరు ప్రజలు అమరావతి రాజధానికి మద్దతు తెలపాలి’ అని ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ నెల 8న గుంటూరులో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓటర్లకు పదేపదే చెప్పారు. ‘గుంటూరు ప్రజలకు సిగ్గు, శరం, రోషం లేదు. అమరావతి కోసం రాజధానిలో ఆందోళనలు చేస్తుంటే మీరేం చేశారు. కనీసం మద్దతు తెలిపారా? మీరు బతికున్నట్టా? లేనట్టా? చేవ చచ్చిపోయారు’ అంటూ ప్రజల్ని రెచ్చగొట్టి.. అమరావతి సెంటిమెంట్‌తో ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసింది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ప్రజా తీర్పు ఆదివారం వెలువడింది. సంక్షేమానికి, అభివృద్ధి వికేంద్రీకరణకే ప్రజలు ఓటేశారు. గుంటూరు నగరపాలక పీఠాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. గత సార్వత్రిక ఎన్నికల నుంచి మొదలైన టీడీపీ ఘోర పరాజయాల పరంపర పంచాయతీలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగింది. నగరపాలక సంస్థ ఎన్నికల్లోనూ ఓట్లు దండుకునేందుకు టీడీపీ వేసిన అమరావతి పాచిక పారలేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని అంటూ భ్రమలు కల్పించిన చంద్రబాబుకు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. మరోమారు అదే అమరావతి అజెండాగా మున్సిపల్ ఎన్నికల్లో నెగ్గుకు రావాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలకు ఓటర్లు గండికొట్టారు. చిత్తశుద్ధితో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికీ, అన్నివర్గాల సంక్షేమానికీ కట్టుబడి ఉన్న వైఎస్సార్సీపీకి పట్టంగట్టారు. అమరావతి ఉద్యమాల పేరుతో టీడీపీ చేపట్టిన ఆందోళనలతో పారీ్టకి మైలేజితోపాటు, పూర్వ వైభవం రావడం ఖాయమని నాయకులు భావించారు. చంద్రబాబు రంగంలోకి దిగినా ఆశించిన ఫలితాలు రాలేదు. నగరపాలక సంస్థ పరిధిలో 57 డివిజన్లకు గాను 44 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలుపొందారు. టీడీపీ కేవలం 9 డివిజన్లకే పరిమితమైంది. జనసేన రెండుచోట్ల, ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు. విశాఖలో విజయ దరహాసం కార్యనిర్వాహక రాజధాని కాబోతున్న విశాఖ నగరం విజయ దరహాసం చేసింది. వికేంద్రీకరణకే నగర ప్రజలు ఓటేశారు. అమరావతి రాజధానే ఆమోద యోగ్యమంటూ విశాఖలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ప్రజలు చుక్కలు చూపించారు. నగరంలో వరుసగా మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారన్న బలుపు చూపించిన టీడీపీకి విశాఖ ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. విలక్షణ తీర్పునిచ్చి విశాఖ మహానగర ఎన్నికల్లో తొలిసారిగా ఒకే పార్టీకి భారీ మెజారిటీ కట్టబెట్టారు. విశాఖ నగరపాలక సంస్థగా ఏర్పడిన తర్వాత ఏ ఎన్నికల్లోనూ ఒకే పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ కట్టబెట్టని ఓటర్లు చరిత్రలో తొలిసారి వైఎస్సార్సీపీకి తిరుగులేని విజయాన్ని అందించారు. 98 డివిజన్లకు గాను 58 డివిజన్లలో వైఎస్సార్ సీపీ సత్తా చాటి గ్రేటర్ పీఠంపై జెండా ఎగరేసింది. చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా టీడీపీ 30 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక రెబల్స్లోనూ వైఎస్సార్సీపీకి చెందిన వారే ఎక్కువగా విజయం సాధించడం కొసమెరుపు. బాబు, లోకేశ్ ప్రచారం చేసినచోటా అభాసుపాలు విశాఖ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ.. వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రచారం నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ ప్రచారం నిర్వహించిన డివిజన్లలో ఆ పార్టీకి మరింత భంగపాటు తప్పలేదు. చంద్రబాబు పర్యటించిన 6 ,9, 24, 25, 29, 43, 44, 45, 46, 47, 58, 59, 60, 61, 81, 91 ,92, 95 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు, 48వ వార్డులో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. లోకేశ్ పర్యటించిన 1, 4, 65, 66, 68, 71, 72, 73, 74 డివిజన్లలోనూ వైఎస్సార్సీపీ జయకేతనం ఎగరేసింది. 66, 68 వార్డుల్లో చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ప్రచారం నిర్వహించినా.. ప్రజలు మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థులకే ఓటేయడం విశేషం. ఓట్ల కోసం ప్రజల్ని ఎంత రెచ్చగొట్టాలని చంద్రబాబు, లోకేశ్ ప్రయత్నించినా నగర ప్రజలు మాత్రం వారి మాటల్ని విశ్వసించకుండా అధికార పార్టీకి పట్టం గట్టారు. పార్టీ అధినేతలు వచ్చి ప్రచారం చేసినా ఓటమి తప్పకపోవడంతో టీడీపీ అభ్యర్థులు తలలు పట్టుకున్నారు. ఆ నియోజకవర్గాల్లోనూ ఫ్యాన్ గాలి 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నగరంలోని నాలుగు స్థానాల్లోనూ టీడీపీ విజయం సాధించింది. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే టీడీపీకి గుడ్‌బై చెప్పారు. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. అయినా.. ఆ మూడు నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎక్కువ మంది విజయం సాధించి.. టీడీపీ కోటల్ని బద్దలుగొట్టారు. తూర్పు నియోజకవర్గంలో 15 డివిజన్లకు గాను 10, పశి్చమలో 14 డివిజన్లకు గాను 10, ఉత్తర నియోజకవర్గంలో 17 డివిజన్లకు గాను 15 స్థానాలను వైఎస్సార్ సీపీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. వాత పెట్టిన చిత్తూరు చిత్తూరు నగరపాలక సంస్థగా అవతరించిన తరువాత 2014లో తొలి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో బీసీ మహిళకు రిజర్వు అయిన మేయర్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకోగా.. ఆ పదవి కటారి అనురాధను వరించింది. ఏడాది కూడా ఆమెను ఆ కుర్చీలో కూర్చోనివ్వలేదు. కటారి కుటుంబంలో చిచ్చురేపిన టీడీపీలోని ఓ సామాజిక వర్గ నేతలు అనురాధ, ఆమె భర్త మోహన్ హత్యలకు పరోక్ష కారణమయ్యారు. ఆ తరువాత మేయర్ పీఠంపై రెండేళ్లకు పైగా పురుషుడు కూర్చుని పాలన సాగించినా అడిగే దిక్కు లేకుండాపోయింది. జంట హత్యల తరువాత చిత్తూరును గుప్పెట్లోకి తెచ్చుకున్న ఆ సామాజిక వర్గం మునిసిపల్ కార్యాలయంలో ఉద్యోగుల్ని కొట్టడం, టెండరు వేసినందుకు ప్రతిపక్ష నేత ఇంటిపై రాళ్లు వేయడం, మరో ఆర్యవైశ్యుడిని కార్పొరేషన్ కార్యాలయంలో తన్నడం, చెప్పిన పనులు చేయని అధికారులను నిర్ధాక్షిణ్యంగా తరిమేయడం వంటి అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఇది చాలదన్నట్టు ప్రతి అభివృద్ధి పనికి స్టాండింగ్ కమిటీ 8 శాతం చొప్పున బహిరంగంగానే లంచాలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. చివరి ఏడాదిలో కటారి కుటుంబం నుంచి హేమలత మేయర్ పీఠాన్ని అధిష్టించినా.. నగరాన్ని అభివృద్ధి వైపు నడిపించడంలో విఫలమయ్యారు. ఈ పరిణామాలతో చిత్తూరు నగర ఓటర్లు టీడీపీకి ఓటెయ్యకూడదనే నిర్ణయానికి వచ్చారు. ప్రజా సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల ముంగిటకే చేరుస్తూ వైఎస్ జగన్ వారి విశ్వాసాన్ని చూరగొన్నారు. ఈ క్రమంలోనే చిత్తూరు కార్పొరేషన్ తాజా ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ చరిత్రాత్మక విజయం సాధించింది. 50కి గాను 46 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగించింది. ఒకప్పుడు టీడీపీకి జై కొట్టిన చిత్తూరు వాసులు ఆ పార్టీ నేతల హత్యా రాజకీయాలు, అవినీతిని చూసి ఈ ఎన్నికల్లో వాళ్లను ఛీకొట్టి పక్కకు పెట్టేశారు. న్యాయ రాజధానికి నీరాజనం కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ఇక్కడి ప్రజలు జై కొట్టారు. కర్నూలులో హైకోర్టుతో లాభం ఏమీ ఉండదని వాదించే టీడీపీ అధినేత చంద్రబాబుకు బ్యాలెట్‌తో సమాధానం చెప్పారు. ఏకపక్షంగా సాగిన పోరులో టీడీపీ అభ్యర్థులు ఓటమిని మూట కట్టుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు తన ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. 18 డివిజన్లతో ఆయన ప్రచారం చేస్తే ఒక్కచోట మాత్రమే ఆ పార్టీ అభ్యర్థి గెలుపొంద డం గమనార్హం. మొత్తం 52 డివిజన్లకు గాను 41 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచారు. మరో మూడు స్థానాల్లో ఆ పార్టీ రెబల్ అభ్యర్థులు విజయం సాధించారు. 8 డివిజన్లలోనే టీడీపీ గెలిచింది. హైకోర్టును వ్యతిరేకించి.. ఏపీ విభజన తర్వాత రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలని సీమవాసులు కోరారు. 2014లో సీఎంగా ఉన్న చంద్రబాబు ఏకపక్షంగా అమరావతిలో రాజధాని ఏర్పాటుకు మొగ్గు చూపారు. ఈ క్రమంలో కర్నూలులో కనీసం హైకోర్టు అయినా ఏర్పాటు చేయాలని కోరినా వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్.. 2019 డిసెంబర్ 13న మూడు రాజధానుల్లో భాగంగా కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయంతో కర్నూలు వాసులు వైఎస్సార్సీపీకి ఘన విజయాన్ని అందించారు. ‘అనంత’ అభిమానం అనంతపురం నగరపాలక సంస్థ చరిత్రను వైఎస్సార్ సీపీ తిరగరాసింది. నగరపాలక సంస్థ ఆవిర్భవించాక కనివినీ ఎరుగని రీతిలో ఒకే పార్టీకి ప్రజలు పట్టం కట్టడం విశేషం. మొత్తం 50 స్థానాల్లో 48 స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకోగా.. రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ప్రతిపక్ష టీడీపీ నామరూపాల్లేకుండా పోయింది. టీడీపీకి వంత పాడిన వామపక్షాలు, జనసేన, బీజేపీ కూడా మట్టికరిచాయి. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మేయర్లు ఇక్కడే నివాసముంటున్నా.. టీడీపీ ఉనికి కోల్పోయింది. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి నివాసముంటున్న 37వ డివిజన్లో 628 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి కొమ్మా అనిల్‌కుమార్‌రెడ్డి గెలుపొందారు. మాజీ మేయర్ స్వరూప సొంత వార్డు 30వ డివిజన్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి నరసింహులు 500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మచిలీపట్నంలో విజయఢంకా మునిసిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన మచిలీపట్నం నగరానికి జరిగిన తొలి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించింది. ఇక్కడ మొత్తం 50 డివిజన్లు ఉండగా.. 44 స్థానాల్లో వైఎస్సార్సీపీ, ఐదుచోట్ల టీడీపీ, ఒకచోట ఇతరులు గెలుపొందారు. ‘కడప’ గడపలో.. కడప నగరపాలక సంస్థలో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించింది. ఆ దెబ్బకు ప్రతిపక్ష టీడీపీ కొట్టుకుపోయి కనుమరుగైంది. ప్రజల మద్దతుతో అధికార పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. నగరంలో 50 డివిజన్లు ఉండగా 24 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 26 డివిజన్లకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవాలతో కలుపుకుని అధికార పార్టీ అభ్యర్థులు 48 డివిజన్లలో విజయం సాధించారు. ప్రతిపక్ష టీడీపీ కేవలం ఒక్క డివిజన్‌కే పరిమితమైంది. మరో డివిజన్లో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఒంగోలులో తిరుగులేని విజయం ఒంగోలు నగరపాలక సంస్థలోనూ వైఎస్సార్సీపీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఇక్కడ మొత్తం 50 డివిజన్లు ఉండగా.. 41 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగించింది. 6 స్థానాల్లో టీడీపీ, మూడు స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. సంక్షేమమే ‘విజయ’ రహస్యం విజయనగరం నగరపాలక సంస్థగా ఆవిర్భవించాక జరిగిన తొలి ఎన్నికలో వైఎస్సార్సీపీ అనూహ్య విజయం సాధించింది. మొత్తం 50 స్థానాలకు 48 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేయగా, టీడీపీ, ఇండిపెండెంట్ చెరో స్థానం చొప్పున దక్కించుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ప్రభావం ఫలితాల్లో స్పష్టంగా ప్రతిఫలించింది. టీడీపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు, ఆయన తనయ అదితి గజపతిరాజు స్వయంగా ప్రచారం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా నిలిచిన విజయనగరం ఇప్పుడు వైఎస్సార్సీపీ పరమైంది. ఆధ్యాత్మిక నగరంలోనూ అదే జోరు తిరుపతి నగరపాలక సంస్థకు 19 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. మొత్తం 50 డివిజన్లు ఉండగా.. 7వ డివిజన్లో హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలిన 49 డివిజన్లలో ఎన్నికలు జరగ్గా.. టీడీపీ కేవలం ఒక్క డివిజన్‌తో సరిపెట్టుకుంది. 22 డివిజన్లు వైఎస్సార్సీపీకి ఏకగ్రీవం కాగా, 27 డివిజన్లలో పోలింగ్ నిర్వహించారు. 26 డివిజన్లలోనూ వైఎస్సార్సీపీ విజయం సాధించగా.. ఏకగ్రీవ స్థానాలతో కలిసి వైఎస్సార్సీపీకి 48 స్థానాలు లభించాయి. -
ఒక్క ఓటుతో గెలుపు
ముమ్మిడివరం/పిఠాపురం/సత్తెనపల్లి: తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీలో వైఎస్సార్సీపీ ధాటికి ప్రతిపక్షాలు కొట్టుకుపోయాయి. మొత్తం 20 వార్డుల్లో 14 వార్డులను అధికార పార్టీ కైవసం చేసుకోగా టీడీపీ కేవలం ఆరింటికే పరిమితమైంది. కాగా, 17వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి బొంతు సత్యశ్రీనివాస్.. జనసేనకు చెందిన జక్కంశెట్టి బాలకృష్ణపై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఒక్క ఓటుతో కౌన్సిలర్ పదవి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మునిసిపాలిటీలో ఐదో వార్డు కౌన్సిలర్‌గా వైఎస్సార్సీపీ అభ్యర్థి బొజ్జా రామయ్య ఒక్క ఓటు మెజార్టీతో గెలిచారు. తన సమీప ప్రత్యర్థిపై కేవలం ఒక్క ఓటు మాత్రమే ఎక్కువ సాధించారు. తీవ్ర ఉత్కంఠ మధ్య రీకౌంటింగ్ నిర్వహించిన అధికారులు చివరకు ఒక్క ఓటు మెజారిటీతో రామయ్య గెలిచినట్టు ప్రకటించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో రెండు ఓట్లతో గెలుపు గుంటూరు జిల్లా సత్తెనపల్లి 8వ వార్డు నుంచి పోటీ చేసిన వైఎస్సార్సీపీ రెబల్ అభ్యర్థి గుజ్జర్లపూడి ప్రమీల రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రమీలకు 585, వైఎస్సార్సీపీ అభ్యర్థి రేపూడి విజయకుమారికి 584, టీడీపీ అభ్యర్థి గుజ్జర్లపూడి ఝాన్సీకి 48 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు తేడాతో ప్రమీల గెలుపొందడంతో రీకౌంటింగ్ చేయాలని అధికార పార్టీ అభ్యర్థి రేపూడి విజయకుమారి కోరారు. రీకౌంటింగ్‌లో ప్రమీలకు మరో ఓటు పెరిగి 586 ఓట్లు రావడంతో 2 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. -
పారని సైకిల్, గ్లాస్ పాచిక
కర్నూలు(టౌన్): మున్సిపల్ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో ఎలాగైనా గెలవాలన్న కుయుక్తులతో తెలుగుదేశం పార్టీ.. జనసేనలు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నా ఫలితం లేకపోయింది. జిల్లా ప్రజలు ఈ రెండు పార్టీలను తిరస్కరించారు. బీజేపీతో మిత్రత్వం కొనసాగిస్తున్న జనసేన ఈ ఎన్నికల్లో లోపాయికారీగా టీడీపీతోనే కలసి పనిచేసింది. ఆ మేరకు జిల్లాలోని కర్నూలు కార్పొరేషన్‌తో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీలో రెండు పార్టీలు అంతర్గతంగా కలసి పనిచేశాయి. అయితే రెండు పార్టీలకూ చుక్కెదురైంది. జిల్లాలోని 302 వార్డుల్లోనూ పోటీ చేసిన టీడీపీ కేవలం 23 వార్డులకు పరిమితమైంది. కర్నూలులో 8, నంద్యాల 4, ఎమ్మిగనూరు 3, ఆదోని 1, ఆళ్లగడ్డ 2, గూడూరు 3, ఆత్మకూరు 1, నందికొట్కూరు 1 చొప్పున మాత్రమే ఆ పార్టీ వార్డులను గెలుచుకుంది. మరోవైపు కర్నూలు, ఎమ్మిగనూరులో 8 సీట్లలో పోటీ చేసిన జనసేన అన్నింటా ఓడిపోయింది. -
తాడిపత్రి, మైదుకూరు ఎవరి వైపు?
సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా తాడిపత్రి, వైఎస్సార్ జిల్లా మైదుకూరు మున్సిపాలిటీల్లో ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. దీంతో ఈ రెండుచోట్లా ఏ పార్టీకి చైర్పర్సన్ పీఠం దక్కుతుందో అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయగా.. ఈ 2 మున్సిపాలిటీల్లో మాత్రం వైఎస్సార్సీపీతో టీడీపీ పోటాపోటీగా నిలిచింది. కానీ, సొంతంగా చైర్పర్సన్ పదవిని దక్కించుకునే మ్యాజిక్ ఫిగర్‌ను ఏ పార్టీ సాధించలేకపోయాయి. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక జరిగే 18వ తేదీపైనే అందరి కళ్లూ ఉన్నాయి. ఆ రోజు అనూహ్య పరిణామాలు జరిగే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ రెండుచోట్లా ఎక్స్అఫిషియో సభ్యుల ఓట్లూ కీలకంగా మారనున్నాయి. మైదుకూరులో ఎక్స్ ఆఫిషియో ఓట్లు వైఎస్సార్సీపీకే ఎక్కువ మైదుకూరు మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి మొత్తం 26 ఓట్లు ఉన్నట్లు లెక్క. ఇందులో 14 ఓట్లు ఏ పార్టీకి వస్తే వారికి చైర్పర్సన్ పదవి దక్కుతుంది. ఇక్కడ మొత్తం 24 వార్డుల్లో వైఎస్సార్సీపీ 11 చోట్ల, తెలుగుదేశం 12 చోట్ల, జనసేన ఒక స్థానంలో గెలుపొందాయి. వైఎస్సార్సీపీకి చెందిన మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప లోకసభ సభ్యుడు అవినాష్‌రెడ్డి మైదుకూరు మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా తమ పేర్లు నమోదు చేసుకోవడంతో ఇక్కడ వైఎస్సార్సీపీ బలం 13కు పెరిగింది. జనసేన టీడీపీకి మద్దతు పలకని పక్షంలో వైఎస్సార్సీపీ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకుంటుంది. ఒకవేళ టీడీపీకి జనసేన మద్దతు ఇచ్చినా కూడా టీడీపీకి చైర్పర్సన్ పదవి దక్కదు. ఎందుకంటే.. జనసేనతో కలిపి టీడీపీ బలం 13కు పెరిగి వైఎస్సార్సీపీతో సమానమవుతుంది. ఇదే పరిస్థితి ఉత్పన్నమైతే టాస్ వేయాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ అధికారులు చెప్పారు. తాడిపత్రిలోనూ అదే గందరగోళం.. మైదుకూరు మాదిరిగానే తాడిపత్రిలో మున్సిపాల్టీలోనూ సస్పెన్స్ వాతావరణం నెలకొంది. ఇక్కడ మొత్తం 36 వార్డులుండగా టీడీపీ 18చోట్ల.. వైఎస్సార్సీపీ 16 చోట్ల విజయం సాధించాయి. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి చెరొకచోట గెలుపొందారు. ఇక్కడ స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన ఎక్స్అఫిషియో ఓటును ఇప్పటికే నమోదు చేసుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీ బలం 17కి పెరిగింది. అనంతపురం ఎంపీ రంగయ్య ఇప్పటి దాకా తన ఎక్స్ అఫిషియో ఓటు ఇంకా ఎక్కడా నమోదు చేసుకోలేదని మున్సిపల్ శాఖ అధికారులు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల చట్టం సెక్షన్–5 క్లాజ్ (3) ప్రకారం.. పొలింగ్ తేదీ తర్వాత 30 రోజుల్లోపు ఆయన ఎక్కడో ఒకచోట తన పేరును ఎక్స్ అఫిషియో సభ్యునిగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో తలారి రంగయ్య తన ఓటును తాడిపత్రి మున్సిపాలిటీలో నమోదు చేసుకునే పక్షంలో అక్కడ వైఎస్సార్సీపీ బలం కూడా 18కు పెరిగి టీడీపీతో సమానంగా ఉంటుంది. అప్పుడు సీపీఐ, స్వతంత్ర సభ్యుల ఓట్లు కీలకంగా మారతాయి. వారు ఎవ్వరికీ మద్దతివ్వని పక్షంలో.. లేదా చేరొక పార్టీకి మద్దతిచ్చినా ఇక్కడా టాస్ తప్పకపోవచ్చని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఇద్దరూ కలిసి ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీ చైర్పర్సన్ పీఠం దక్కించుకుంటుంది. మొత్తంగా ఇక్కడా చైర్పర్సన్ ఎన్నిక రసవత్తరంగా మారనుంది. మైదుకూరులో క్యాంపు రాజకీయాలకు తెరలేపిన టీడీపీ సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా మైదుకూరు మునిసిపాలిటీ ఫలితాల్లో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రాకపోవడంతో చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. మునిసిపాలిటీలో మొత్తం 24 వార్డులున్నాయి. వైఎస్సార్సీపీ 11 వార్డుల్ని, టీడీపీ 12 వార్డులు, జనసేన ఒక వార్డు గెలుచుకున్నాయి. మునిసిపాలిటీలో స్పష్టమైన ఆధిక్యత రావాలంటే 13 వార్డులు గెలవాల్సి ఉంది. ఈ మునిసిపాలిటీలో ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్అఫిషియో సభ్యులు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీకి 13 మంది ఉన్నట్లవుతుంది. దీంతో ఈ మునిసిపాలిటీ వైఎస్సార్సీపీకే దక్కే అవకాశాలున్నాయి. మరోవైపు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ తమ 12 మంది వార్డు సభ్యులను ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయానికి తరలించారు. సభ్యులపై నమ్మకంలేక వారిని నిర్బంధించినట్లు సమాచారం. మరోవైపు జనసేన సభ్యుడితోనూ టీడీపీ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. రహస్య ప్రాంతానికి టీడీపీ విజేతలు తాడిపత్రి : అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపాలిటీలో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. ఇక్కడ హంగ్ ఏర్పడడంతో తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. వారు ఎక్కడ జారిపోతారోనని ఆదివారం ఉదయం కౌంటింగ్ ప్రారంభం కాగానే ఆయన వారందరినీ తన నివాసంలోనే నిర్బంధించారు. అభ్యర్థుల తరఫున కేవలం ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి పంపించారు. ఆ తర్వాత మధ్యాహ్నం టీడీపీ విజేతలందరినీ రహస్య ప్రాంతానికి తరలించినట్లు తెలిసింది. -
బీజేపీతో తెగతెంపుల దిశగా జనసేన
సాక్షి, అమరావతి: ఒకసారి తెగిపోయి మళ్లీ అతుక్కున్న బీజేపీ– జనసేన పార్టీల స్నేహబంధం ఏడాదికే తెగతెంపులయ్యే దిశగా సాగుతోంది. రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ పవన్‌కల్యాణ్ హైదరాబాద్‌లో జనసేన ఆవిర్భావ సభలో చేసిన ప్రకటనతో రెండు పార్టీల మధ్య తెగతెంపులకు నాంది పలికారా? అనే అనుమానాలు కలిగించగా విజయవాడలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన మహేష్ చేసిన ప్రకటనతో ఇక రెండు పార్టీల స్నేహానికి ముగింపు ఖాయమన్న స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. తెలంగాణలో పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న ఆదివారం రోజు బీజేపీ అభ్యర్ధికి కాకుండా టీఆర్ఎస్ బలపరిచిన మాజీ ప్రధాని పీవీ కుమార్తెకు మద్దతు తెలుపుతూ పవన్ కల్యాణ్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘బీజేపీ రాష్ట్ర నాయకత్వం తమను వాడుకుని వదిలేసిందని జనసేన నాయకులు నా దృష్టికి తెచ్చారు. గౌరవం లేని చోట మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాంటివారితో మీరు ఇంకా స్నేహం చేయండి అని చెప్పే ధైర్యం నాకు లేదు’ అని పవన్ వ్యాఖ్యానించారు. అనంతరం కొద్దిసేపటికే జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ విజయవాడలో ఓ వీడియో విడుదల చేస్తూ బీజేపీ విధానాల వల్లే విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో జనసేన ఓడిపోయిందని ఆరోపించారు. బీజేపీ విధానాలను రాష్ట్ర ప్రజలెవరూ నమ్మడం లేదన్నారు. రహస్య స్నేహితులు... 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా.. ఇటీవల బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ పవన్‌కల్యాణ్ రహస్యంగా టీడీపీతో, ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో స్నేహం కొనసాగిస్తున్నారని ఆదినుంచి విమర్శలున్నాయి. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగి టీడీపీకి ప్రయోజనం కలిగించాలని పవన్‌కల్యాణ్ భావించినా బీజేపీ నేతలు అక్కడ తామే పోటీ చేస్తామని ప్రకటించారు. టీడీపీని చేరువ చేసేందుకు పవన్ చేసిన ప్రయత్నాలు బీజేపీ కేంద్ర నాయకత్వం వద్ద చెల్లుబాటు కాలేదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరోవైపు తాజా మునిసిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చే ఎత్తుగడలు పారకపోవడంతో ఇక దీన్ని ఎక్కువ కాలం కొనసాగించరాదన్న చంద్రబాబు సూచనల మేరకే పవన్ బీజేపీతో తెగతెంపులు చేసుకుని టీడీపీతో బహిరంగ స్నేహం దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. -
ఓ చరిత్ర.. ఓ అద్భుతం..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఓ చరిత్ర, అద్భుతమని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభివర్ణించారు. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఫలితాలు వచ్చాయన్నారు. నగర, పట్టణ ఓటర్లు మూకుమ్మడిగా సీఎం జగన్ పాలనకు పట్టం కట్టారన్నారు. మంత్రి ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మేయర్, చైర్పర్సన్లు ఎవరనే దానిపై తమ పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్నిచేసినా ప్రజలు మనవైపే ఉన్నారని సీఎం చెప్పారు.. ఫలితాలు చూస్తే అది నిజమని తేలిందన్నారు. సంక్షేమ పథకాలకు ఒక క్యాలెండర్ రూపొందించి ఎప్పుడేది ఇస్తున్నదీ చెప్పిన ప్రభుత్వం తమది కాబట్టే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాలకు కారణమైన సీఎం జగన్ నాయ కత్వంలో పనిచేయడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. వైఎస్సార్ హయాంలో కూడా తాము భారీ సక్సెస్ సాధించామని, అయితే తండ్రిని మించిన తనయుడినని సీఎం జగన్ నిరూపించుకున్నారని బొత్స పేర్కొన్నారు. అబ్బా కొడుకులు ఫలితం అనుభవిస్తున్నారు.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అబ్బాకొడుకులైన చంద్రబాబు, లోకేశ్ అసభ్య పదజాలంతో రాజకీయం చేశారని, దానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. మాయమా టలు చెప్పిన చంద్రబాబుకు ప్రజలు ఓట్లు వేయకుండా నిరాకరించారన్నారు. విజయవాడ, గుంటూరు అభివృద్ధికి గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. అమరావతి పేరుతో దోచు కుతిన్నారని, ఒకే సామాజిక వర్గానికి మేలుచేసే ప్రయత్నం మాత్రమే చేశారన్నారు. విశాఖ స్టీల్‌ప్లాం ట్ ఆంధ్రులందరి హక్కు అని, దీన్ని రాజకీయం చేసేందుకు చంద్రబాబు యత్నించారని, అందుకే ప్రజలు బుద్ధి చెప్పారని మంత్రి అన్నారు. -
మండపేటలో టీడీపీ పాతికేళ్ల ఆధిపత్యానికి గండి
మండపేట: తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ కంచుకోటగా పేరుపొందిన మండపేటలో ఆ పార్టీ ఆధిపత్యానికి గండి పడింది. మున్సిపల్ ఎన్నికల్లో మండపేట పురపాలక సంఘం వైఎస్సార్సీపీ పరమైంది. మొత్తం 30 వార్డులకుగాను 22 చోట్ల వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. టీడీపీ కేవలం ఏడు వార్డులకు పరిమితమైంది. దాదాపు 25 ఏళ్లుగా మండపేట మున్సిపాలిటీలో టీడీపీదే ఆధిపత్యం. టీడీపీ ఆవిర్భావం అనంతరం 1987లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మున్సిపల్ చైర్ పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జునచౌదరి సతీమణి విజయ ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1995, 2000, 2005, 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ వరుస విజయాలు సాధించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పదివేల పైచిలుకు ఓట్ల మెజార్టీ సాధించగా అందులో సగంపైగా మండపేట పట్టణం నుంచే వచ్చింది. అయితే రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం.. సీఎం వైఎస్ జగన్ సాగిస్తున్న సంక్షేమ పాలనతో టీడీపీ కంచుకోట అని భావించిన మండపేటలో ఆ పార్టీ కూసాలు కదిలిపోయాయి. వైఎస్సార్సీపీ అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులు తన రాజకీయ వ్యూహాలతో పార్టీకి ఘనవిజయం అందించారు. కార్పొరేషన్లలో సైకిల్ అడ్రస్ గల్లంతు 11 కార్పొరేషన్లలో ఒక్కచోట కూడా టీడీపీ ప్రభావం చూపించలేకపోయింది. తమకు పట్టున్నట్లు చెప్పుకుంటూ కచ్చితంగా గెలుస్తామని బీరాలు పలికిన విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో సైతం చిత్తుగా ఓడిపోయింది. రాజధాని ప్రాంతమైన గుంటూరు కార్పొరేషన్లో ఆ పార్టీకి వచ్చిన డివిజన్లు 8 మాత్రమే కావడం గమనార్హం. చంద్రబాబు సొంత జిల్లాలోని చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లలో ఆ పార్టీ ప్రభావమే కనిపించలేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని వైఎస్సార్సీపీకి అంటగట్టి గెలవాలని చంద్రబాబు చూసినా నగర ప్రజలు ఛీకొట్టారు. విశాఖలో గత ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీ తరఫున గెలిచినా కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం ఏమాత్రం ప్రభావం కనపడలేదు. ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల నియోజకవర్గాల్లోనూ టీడీపీ చతికిలపడింది. ఇచ్ఛాపురంలో టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఉన్నా మున్సిపాల్టీలో గెలవలేకపోయింది. -
మూడు రాజధానులకు ప్రజల మద్దతు
సాక్షి, విశాఖపట్నం: మూడు రాజధానుల నిర్ణయానికి రాష్ట్ర ప్రజలంతా మద్దతు తెలుపుతూ పురపోరులో వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ఆమోదించి మెజార్టీ స్థానాల్లో గెలిపించారన్నారు. ఆదివారం విశాఖపట్నం మద్దిలపాలెం పార్టీ నగర కార్యాలయంలో మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు వెళ్లి మీకు రోషం.. పౌరుషం లేదా? అంటూ చంద్రబాబు రెచ్చగొట్టాడని.. అక్కడి ప్రజలు తమ రోషం, పౌరుషాన్ని చక్కగా ఆయనపైన చూపించారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల రోజు చంద్రబాబునాయుడు ఏపీలో లేకుండా ముఖం చాటేశాడంటే.. ఆయన పరిస్థితేంటో అర్థం చేసుకోవాలన్నారు. ‘‘ఏపీ ప్రజలు పాచి పనులకోసం వేరే రాష్ట్రాలకు పోతున్నారని బాబు అన్నారు. మరి ఆయన కొడుకు, ఆయన హైదరాబాద్‌లోని పాచి పనులకోసం వెళ్లారా? ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే మాట కాదా?’’ అని సాయిరెడ్డి ప్రశ్నించారు. ఏపీకి రావడానికి ముఖం కూడా చెల్లని చంద్రబాబు, ఆయన తనయుడు భవిష్యత్తులో రాష్ట్రానికి వచ్చినా ప్రయోజనం ఉండదన్నారు. మరో 25 ఏళ్లపాటు సీఎంగా వైఎస్ జగన్... మరో 25 ఏళ్లు సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉంటారని, ప్రజల ఆకాంక్ష కూడా అదేనని విజయసాయిరెడ్డి చెప్పారు. 13 జిల్లాల్లోని ఐదుకోట్ల మంది ప్రజల మనసుల్లో జగన్ గూడు కట్టుకున్నారన్నారు. జగన్ చేసిన అభివృద్ధే స్థానిక ఎన్నికల్లో, పురపాలక ఎన్నికల్లో పార్టీని గెలిపించిందన్నారు. మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలను మించి పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అత్యధికంగా గెలుపొందిందన్నారు. విశాఖ ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు, ఆయన తనయుడు ఏమీ చేయలేకపోయారని, ఆ పార్టీ జెండాను ప్రజలే పీకేశారని విమర్శించారు. సమావేశంలో ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎంపీ భీశెట్టి సత్యవతి, ప్రభుత్వ సలహాదారు సాగి దుర్గాప్రసాద్‌రాజు, ఎమ్మెల్యే అమర్నాథ్, పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
మత రాజకీయాలకు చెంపపెట్టు
సాక్షి, అమరావతి: ఆలయాలపై దాడుల పేరిట రాష్ట్రంలో ఇటీవల తెలుగుదేశం పార్టీ లేవనెత్తిన మత రాజకీయాలు మున్సి‘పోల్స్’పై ఏమాత్రం ప్రభావం చూపలేదు. సీఎం వైఎస్ జగన్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఆ పార్టీ చేసిన కుటిల యత్నాలకు ఆదివారం వెల్లడైన ఫలితాలు చెంపపెట్టులా మారాయి. సీఎంపై రాష్ట్ర ప్రజలకు ఉన్న నమ్మకాన్ని చంద్రబాబు మత రాజకీయాలు ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయన్నది ఈ ఫలితాల ద్వారా రుజువైందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు వారు పలు ఉదంతాలను ఉదహరిస్తున్నారు. ► విజయనగరం జిల్లా రామతీర్థంలోని శ్రీరాముని ఆలయంలో మూలవిరాట్ విగ్రహాన్ని «కొందరు విద్రోహులు ధ్వంసం చేయడం.. వెంటనే చంద్రబాబు అక్కడ హంగామా చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇక్కడకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోని నెల్లిమర్ల మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ బావుటా ఎగురవేసింది. అలాగే.. ► విజయవాడ దుర్గగుడిలో వెండి సింహాల చోరీ అంశాన్ని టీడీపీ రాజకీయం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించింది. అయినా, ఇక్కడ కార్పొరేషన్లో కూడా వైఎస్సార్సీపీ తిరుగులేని విజయం సాధించింది. ► తిరుమల తిరుపతి దేవస్థానంపై కూడా టీడీపీ దుష్ప్రచారానికి చేయని ప్రయత్నంలేదు. కానీ, తిరుపతి ప్రజలు ఇవేమీ పట్టించుకోలేదు. కార్పొరేషన్లో వైఎస్సార్సీపీకి అఖండ విజయం చేకూర్చారు. మత రాజకీయాలకు రాష్ట్రంలో చోటులేదనేందుకు ఈ ఫలితాలు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. -
నింగినంటిన విజయోత్సవాలు
సాక్షి, అమరావతి: మునిసి‘పోల్స్’లో తిరుగులేని విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం పెద్దఎత్తున విజయోత్సవాలు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం కన్పించింది. ఏకపక్ష ఫలితాలు వెలువడతాయనే నమ్మకంతో ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులు ఆదివారం ఉదయం నుంచే ఆనందోత్సాహాలకు తెరలేపారు. కౌంటింగ్ ఆరంభం నుంచే తమకు అనుకూలంగా వస్తున్న ఫలితాలతో పార్టీ అభిమానులు కేరింతలు కొట్టారు. వైరిపక్షం టీడీపీని కకావికలం చేస్తూ విజయం వైపు దూసుకుపోతున్న తీరుతో అన్ని వర్గాల వారు సంబరాలు చేసుకున్నారు. పట్టణాలే కాకుండా పల్లెల్లోనూ విజయోత్సవ వేడుకలు పెద్దఎత్తున జరిగాయి. జగన్ ప్లకార్డులతో ఊరేగింపులు చేసుకున్నారు. అతి తక్కువ కాలంలోనే తమ వద్దకు చేరిన సంక్షేమ ఫలాలను గొప్పగా చెప్పుకున్నారు. ఇక గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మొత్తం సందడే కన్పించింది. ఉ.10 గంటలకల్లా అనేక ప్రాంతాల నుంచి అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. జగన్ నినాదంతో ఆ ప్రాంతం మార్మోగింది. పార్టీ ఆఫీసు వద్ద సభా వేదికను నిర్మించారు. వచ్చిన జనానికి భోజనాలు, మంచినీళ్లు పార్టీ వర్గాలు ఏర్పాటుచేశాయి. విజయోత్సవానికి తరలివచ్చిన మహిళలు పూలదండలతో ఆ ప్రాంతాన్ని అలంకరించారు. పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. డప్పుల మోత.. అభిమానుల నృత్య ప్రదర్శనలు, కోలాటాలు, జయహో జగన్ అంటూ జేజేలతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. విజయవాడ, గుంటూరు, విశాఖలోనూ పార్టీ విజయ దుందుభితో అభిమానం ఉప్పొంగింది. అభిమానులతో నేతలు మమేకం జనాభిమానంతో వైఎస్సార్సీపీ నేతలు మమేకమయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్ర కార్యాలయం వద్దకు వచ్చిన ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. మంత్రులు, సీనియర్ నేతలు ధన్యవాదాలు చెప్పారు. కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ లేళ్ల అప్పిరెడ్డి అభిమానులకు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. ఫలితాల తీరును విశ్లేషిస్తూ నేతలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ, స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ చల్లా మధు, రాష్ట్ర అధికార ప్రతినిధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, అంకిరెడ్డి నారాయణమూర్తి, ఈదా రాజశేఖర్, నారమల్లి పద్మజ, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
జగన్‌కు ప్రజలిచ్చిన ఆశీర్వాదం ఈ గెలుపు
సాక్షి, అమరావతి: మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారా రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆశీర్వదించారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. పెరిగిన జీవన ప్రమాణాలకు కృతజ్ఞతగానే జనం వైఎస్ జగన్‌కు మద్దతిస్తున్నారని చెప్పారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే.. పెరిగిన నమ్మకం పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్ ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల నుంచే మేనిఫెస్టో తయారు చేశారు. యువ నాయకుడిపై నమ్మకం ఉందని, ఆకాంక్షలు నెరవేరుస్తున్నాడనే విశ్వాసం ప్రకటించారు. ప్రజల జీవితాల్లో వెలుగు నింపేలా ఆయన చేపట్టిన చర్యలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. పాలనను ప్రజల ముంగిట్లోకే తీసుకెళ్లారు. రైతులకు పూర్తి భరోసా వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారయ్యాయి. అందుకే ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎన్నికల్లో సానుకూల తీర్పు వచ్చింది. కృత్రిమ ఉద్యమాలకు కాలం చెల్లు చంద్రబాబు పదవి నుంచి దిగిపోతూ రాష్ట్రంపై రూ. 2 లక్షల కోట్ల అప్పు మోపారు. కోవిడ్ కష్టకాలం వల్ల రాష్ట్రం ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నా వైఎస్ జగన్ ప్రజా సంక్షేమం విషయంలో వెనుకడుగు వేయలేదు. నిబ్బరంగా అడుగులు ముందుకేశారు. ఈ రెండేళ్లుగా చంద్రబాబు ప్రజా సంక్షేమాన్ని అడ్డుకోవడానికే పనిచేశారు. చౌకబారు రాజకీయాలు చేశారు. వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసమే పనిచేశారు. నిర్మాణాత్మక పాత్ర పోషించారు. చంద్రబాబు మాత్రం లేని సమస్యలు సృష్టించారు. తాను నమ్ముకున్న మీడియాపైనే ఆధారపడ్డారు. ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ వైపు అడుగులేస్తే.. అమరావతి భ్రమను చూపించి ఉద్యమం అన్నారు. కృత్రిమ ఉద్యమాలు చేస్తే ప్రజలు సహించరని రుజువైంది. ప్రజల పట్ల అసభ్యంగా మాట్లాడిన టీడీపీకి వెంటిలేటర్ కూడా జనం పీకేశారు. తమ రోషం ఏంటో చూపించిన జనం చంద్రబాబును ఛీకొట్టారు. ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో కూర్చున్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా వ్యవహరించినా.. ఎన్ని సమస్యలు సృష్టించినా.. ప్రజలు జగన్ ప్రభుత్వాన్నే కోరుకోవడం శుభపరిణామం. ఈ విజయంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలంటే టీడీపీ భయపడుతోంది. -
నేతల ఇలాకాల్లోనూ పరాభవమే
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ అసెంబ్లీ ఎన్నికల కంటే ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. 13 జిల్లాల్లో ఎక్కడా ప్రభావం చూపలేక చేతులెత్తేసింది. 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీల ఫలితాల్లో ఒక్కచోట (తాడిపత్రి) మినహా అన్నిచోట్లా మట్టికరిచింది. 11 కార్పొరేషన్లలో 9 చోట్ల సింగిల్ డిజిట్ డివిజన్లు, 75 మున్సిపాల్టీల్లో 58 చోట్ల సింగిల్ డిజిట్ వార్డులకే పరిమితమైందంటే టీడీపీ ఓటమి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సింగిల్ డిజిట్ నెంబర్లోనూ అనేక చోట్ల దక్కింది ఒకటి, రెండు వార్డులే. 12 మున్సిపాల్టీల్లో ఆ పార్టీ అసలు ఖాతా తెరవలేదు. చంద్రబాబు ఎన్నో ప్రగల్భాలు పలికి వ్యక్తిగత విమర్శలకు దిగినా ఈ ఎన్నికల్లో కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఎంత దుష్ప్రచారం చేసినా టీడీపీని రాష్ట్ర ప్రజలు ఏమాత్రం నమ్మడం లేదని మరోసారి స్పష్టమైంది. చంద్రబాబు చెప్పే మాటలు, చేసే పనులన్నీ మీడియా కోసమేనని, ఆయనకు ఏమాత్రం ప్రజాదరణ లేదని ఈ ఫలితాలు తేటతెల్లం చేశాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. మున్సిపాల్టీల్లో సైకిల్ పల్టీ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సొంత మున్సిపాల్టీ తునిలో ఒక్క వార్డును కూడా టీడీపీ గెలుచుకోలేకపోయింది. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని పెద్దాపురం, సామర్లకోట మున్సిపాల్టీల్లోనూ ఓటమి పాలైంది. ఎన్నో ఏళ్లుగా టీడీపీ గెలుస్తున్న, ప్రస్తుతం ఆ పార్టీ ఎమ్మెల్యే ఉన్న మండపేటలోనూ నెగ్గలేకపోవడం గమనార్హం. పశ్చిమ గోదావరిలో ఎన్నికలు జరిగిన నాలుగు మున్సిపాల్టీలకు గానూ ఒక్క చోట కూడా డబుల్ డిజిట్ వార్డులు సాధించలేకపోయింది. తూర్పు గోదావరిలో ఎన్నికలు జరిగిన పది మున్సిపాల్టీల్లోనూ సింగిల్ డిజిట్ వార్డులకే పరిమితమైంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని మున్సిపాల్టీల్లో టీడీపీ నామరూపాలు లేకుండాపోయింది. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ రేపల్లె మున్సిపాల్టీని గెలిపించుకోలేకపోయారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీని కాపాడలేకపోయారు. చంద్రబాబు బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో టీడీపీ చతికిలపడింది. టీడీపికి చెందిన మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, అమర్నాథ్రెడ్డి, కేఈ కృష్ణమూర్తి, గంటా శ్రీనివాసరావు, కాల్వ శ్రీనివాస్ తదితరులు సొంత నియోజకవర్గాల్లోని మున్సిపాల్టీల్లోనూ ప్రభావం చూపలేకపోయారు. డోన్, వెంకటగిరి, ధర్మవరం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, యర్రగుంట్ల, కనిగిరి, పులివెందుల, పిడుగురాళ్ల, మాచర్ల, పుంగనూరు మున్సిపాల్టీల్లో టీడీపీ గుడ్లు తేలేసింది. మొత్తంగా మున్సిపల్ ఎన్నికలు టీడీపీకి శరాఘాతంలా మారాయి. పార్టీ గుర్తు లేకుండా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తామే విజయం సాధించామని శ్రేణుల్ని మభ్యపుచ్చిన చంద్రబాబు అసలు రంగు ఈ ఎన్నికల్లో బయటపడిందని పేర్కొంటున్నారు. కర్నూలులో బడా నేతలకు షాక్ కర్నూలు(అర్బన్): టీడీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఒక వెలుగు వెలిగిన నేతలకు ప్రస్తుత మునిసిపల్ ఎన్నికల్లో ‘ఫ్యాన్’ షాక్ ఇచ్చింది. టీడీపీ హయాంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగిన కేఈ కృష్ణమూర్తి, ఆయన సోదరుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత టీజీ వెంకటేష్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు నివాసాలు కర్నూలు నగరంలోని 49వ డివిజన్ పరిధిలో ఉన్నాయి. అయితే ఈ డివిజన్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి కృష్ణకాంత్‌రెడ్డి విజయకేతనం ఎగురవేశారు. కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి నివాసముంటున్న 13వ డివిజన్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం.విజయలక్ష్మి విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి నివాసం ఉంటున్న 20వ డివిజన్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఏ నాగలక్ష్మిరెడ్డి గెలుపొందారు. నంద్యాలలో మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ నివాసమున్న 10వ డివిజన్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి అబ్దుల్‌మజీద్ విజయం సాధించారు. ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నివాసమున్న 8వ డివిజన్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మోబీన్ గెలుపొందారు. ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి నివాసమున్న 27వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ రఘు గెలుపొందారు. సీపీఎం తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది. ఎవరూ నిరుత్సాహపడొద్దు మునిసిపల్ ఎన్నికల ఫలితాలతో నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో దారుణ పరాజయం నేపథ్యంలో ఆయన హైదరాబాద్ నుంచి ఈ ట్వీట్ చేశారు. రౌడీయిజం, బెదిరింపులు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలున్నా గట్టిగా పోరాడినట్టు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర భవిష్యత్తే లక్ష్యంగా ముందుకు సాగుదామని, ఇదే స్ఫూర్తితో పనిచేస్తే రానున్న రోజుల్లో విజయం మనదేనని తెలిపారు. పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని, కొన్ని చోట్ల ప్రాణాలు సైతం పణంగా పెట్టారని, అందరి పోరాట స్ఫూర్తికి వందనాలు తెలిపారు. -
3 రాజధానులకు మద్దతిస్తూ ఆంధ్రావని స్పష్టమైన తీర్పు
సాక్షి, అమరావతి: ముగ్గురిదీ ఒకే మాట...! ఒకే తీర్పు..! ప్రాంతాలు వేరైనా ఫలితాలు, అందరి అభిమతం ఒక్కటే. ప్రాంతీయ విభేదాలు రగిల్చి వైషమ్యాలను రెచ్చగొట్టే కుట్రలను ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. మున్సిపల్ ఎన్నికల్లో మూడు ప్రాంతాల్లోనూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి దక్కిన అపూర్వ ఆదరణే ఇందుకు నిదర్శనం. రాష్ట్రమంతా మాదిరిగానే రాజధాని ప్రాంతాలు మూడింటా ఘన విజయాన్ని అందించి ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పాలనను, అభివృద్ధి నిర్ణయాలను ప్రజలు స్వాగతించారు. గుంటూరు – విజయవాడ కావచ్చు. విశాఖ కావచ్చు.. కర్నూలు కావచ్చు... మూడు రాజధానులుగా ప్రకటించిన పెద్ద కార్పొరేషన్లలో భారీ విజయాన్ని చేకూర్చారు. చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టి రెచ్చగొట్టేలా ప్రచారం నిర్వహించినా ఆయన మాటలను ప్రజలు నమ్మలేదు. పాలన వికేంద్రీకరణకు జై కొట్టారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఓటు.. పాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని సమానంగా విస్తరించాలనే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ నిర్ణయానికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలిచ్చిన విస్పష్టమైన తీర్పు దీన్ని తేటతెల్లం చేసింది. ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ సాధించిన అద్భుత విజయం వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న స్వార్థ రాజకీయ పక్షాలకు చెంపపెట్టని రుజువైంది. పట్టణ ప్రాంత ప్రజలు వికేంద్రీకరణకు వ్యతిరేకమనే వాదన తప్పని ఈ ఫలితాలు తేల్చేశాయి. విద్యావంతులు అధికంగా ఉండే మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో మూడు రాజధానుల నిర్ణయాన్ని అంగీకరించడం లేదనే ప్రచారం అంతా భ్రమేనని స్పష్టమైంది. విజయనగరం మొదలు శ్రీకాకుళం, విశాఖ.. అమరావతి, కర్నూలు, తిరుపతి.. ప్రతి చోటా వైఎస్సార్సీపీకి పట్టం కట్టిన ప్రజలు వికేంద్రీకరణకే తాము మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా కృత్రిమ ఉద్యమం రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానులను ప్రకటించిన విషయం తెలిసిందే. విశాఖలో పరిపాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అమరావతి పేరుతో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి వికేంద్రీకరణ ప్రయత్నాలను అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డారు. రాజధాని నిర్మాణం ముసుగులో చేసిన అరాచకాలను కప్పిపుచ్చుతూ కొందరు స్వార్థపరులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఉసిగొల్పి ప్రభుత్వంపై దు్రష్పచారమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 29 గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు, బయట ప్రాంతాల నుంచి తరలించిన వారితో దీక్షలు, ఉద్యమాలు చేయించి హంగామా సృష్టించారు. ఎల్లో మీడియా దీన్ని భూతద్దంలో చూపించి కొందరి అభిప్రాయాన్నే రాష్ట్ర ప్రజల అభిప్రాయంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. నాలుగు గ్రామాల్లో జరిగే కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా ప్రచారం చేస్తూ మూడు రాజధానులను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని నమ్మించేందుకు సకల ప్రయత్నాలు చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించి రిఫరెండం కోరాలని చంద్రబాబు, ఆయన్ను వెన్నంటి ఉండే జనసేన, సీపీఐ పార్టీలు అధికార పక్షాన్ని సవాల్ చేయని రోజే లేదు. బాబు రెచ్చగొట్టినా విజ్ఞతతో ప్రజా తీర్పు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు తన స్థాయిని మరచిపోయి అమరావతి పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నించారు. గుంటూరు వాసులకు రోషం లేదని, సిగ్గుంటే వైఎస్సార్సీపీకి ఓటేయరని తిట్టిపోశారు. గుంటూరు కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ గెలిస్తే అక్కడి ప్రజలు అమరావతి వద్దని చెప్పినట్లేనని వ్యాఖ్యలు చేశారు. పోలింగ్‌కు ముందురోజు అమరావతి ఉద్యమం పేరుతో కొందరు మహిళలను విజయవాడకు పంపి అలజడి సృష్టించాలని చూశారు. వారిని పోలీసులు అడ్డుకునేలా చేసి సానుభూతి పొందాలని ప్రయత్నించారు. ఇవన్నీ మున్సిపల్ ఎన్నికల్లో వికటించాయి. ఎక్కడైతే చంద్రబాబు తిట్టారో అక్కడ ప్రజలు టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించారు. గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లలో టీడీపీ ఘోరంగా ఓటమిపాలైంది. ఈ రెండు కార్పొరేషన్లలో అధికార పార్టీ గెలిస్తే రాజధాని తరలిపోతుందని టీడీపీ నాయకులు రెచ్చగొట్టినా ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి వైఎస్సార్సీపీకి పట్టంగట్టారు. కృష్ణా, గుంటూరులో మట్టికరిచిన టీడీపీ అమరావతి ప్రభావం ఉంటుందని టీడీపీ చెప్పుకునే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆ పార్టీ మట్టికరిచింది. రెండు జిల్లాల్లో ఎన్నికలు జరిగిన కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఎక్కడా ఆ పార్టీ గెలవకపోగా అవమానకరమైన రీతిలో సింగిల్ డిజిట్ వార్డులు, డివిజన్లకే పరిమితమైంది. పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖలో ప్రజలు టీడీపీని తిరస్కరించారు. న్యాయ రాజధానిగా ప్రకటించిన కర్నూలులో వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. ప్రాంతాలకు అతీతంగా అన్ని చోట్లా వైఎస్సార్సీపీని గెలిపించడం ద్వారా అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్నది ఫేక్ ప్రచారమని తేల్చేశారు. పంచాయతీ ఎన్నికల్లోనూ అమరావతి ప్రాంతం ఉన్న తాడికొండ సహా అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్సీపీని ఆదరించడం ద్వారా వికేంద్రీకరణకు ప్రజలు మద్దతు పలికారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ వికేంద్రీకరణకు ప్రజలు జై కొట్టినట్లు స్పష్టమైంది. -
ఈ గొప్ప విజయం ప్రజలది
సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడంపై సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ గొప్ప విజయం ప్రజలదని వినమ్రంగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. ‘‘ఈ గొప్ప విజయం ప్రజలది. దేవుని దయతో ప్రతి అక్కచెల్లెమ్మ, ప్రతి సోదరుడు, స్నేహితుడు, ప్రతి అవ్వాతాత మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం వల్ల ఈ చారిత్రక విజయం సాధ్యమైంది. ఈ విజయం నా మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని, బాధ్యతను పెంచింది. ఇంకా మంచి చేయడానికి మీ కుటుంబంలో ఒకరిగా మరింత తాపత్రయపడతాను’’ అని పేర్కొన్నారు. విజయం సాధించిన ప్రతి సోదరుడికి, అక్కచెల్లెమ్మకూ అభినందనలు తెలియజేస్తున్నానని సీఎం పేర్కొన్నారు. -
మున్సిపల్ ఎన్నికల చరిత్రలో 'ఫ్యాన్' తుపాన్
మున్సిపల్ ఎన్నికల చరిత్రలో ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్సీపీ దేశంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో మొత్తం కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేసి ప్రభంజనం సృష్టించింది. ‘ఫ్యాన్’ ప్రభంజనంతో 97.33 శాతం మున్సిపాలిటీలలో పాగా వేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్నాలు, అభివృద్ధి కార్యక్రమాలు, కీలక నిర్ణయాలకు ప్రజలు పట్టం కట్టారు. ప్రతిపక్ష పెద్దలు ఎంతగా రెచ్చగొట్టినా, కుట్రలకు తెరలేపినా.. తమ తీర్పు ఇదేనని తేల్చి చెప్పారు. అటు న్యాయ రాజధాని.. ఇటు పరిపాలనా రాజధాని.. మధ్యలో శాసన రాజధానిలోనూ విస్పష్ట తీర్పునిచ్చారు. ఈ ఎన్నికలపై సీఎం జగన్ ఒక్క మాట మాట్లాడింది లేదు.. ఓటు వేయండని అడిగింది లేదు. పాలనలో తన మార్క్ ఏమిటో స్పష్టంగా చూపారు.. కష్ట కాలంలో అందరికీ అండగా నిలి చారు. మాటలు కాదు.. చేతల ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు.. సంక్షేమాభివృద్ధికి పెద్ద పీట వేశారు. రెండేళ్లు పూర్తవకుండానే ఇంత చేస్తే, ఇంకా అవకాశం ఇస్తే మరింత చేస్తారని జనం నమ్మారు. ఆ నమ్మకాన్ని ఓట్ల రూపంలో చూపిం చారు. హుందాతనాన్ని మరచిన విపక్షాలకు కర్రు కాల్చి వాత పెట్టారు.. బాధ్యతతో మెలగాలని హితవు పలికారు. (సాక్షి, అమరావతి): పురపాలక ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టారు. ‘ఫ్యాన్’ను హోరెత్తించారు. దాదాపు రెండేళ్లుగా ప్రగతిదాయక, సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను ప్రజలు మనస్ఫూర్తిగా దీవించారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు.. అన్ని జిల్లాల్లోనూ పార్టీ అఖండ విజయం సాధించింది. ఫలితాలు ప్రకటించిన 11 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాల్లోని 2,742 డివిజన్లు, వార్డుల్లో ఏకగ్రీవాలతోసహా 2,265 వార్డుల్లో విజయ దుందుభి మోగించింది. టీడీపీ కేవలం 348 డివిజన్లు, వార్డులకే పరమితమైంది. ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టిన 11 నగర పాలక సంస్థలనూ వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. 75 పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో గతంలోనే 4 పురపాలక సంఘాలను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మిగిలిన 71 పురపాలక సంఘాల్లో 69 చోట్ల పూర్తి మెజార్టీ సాధించింది. మైదుకూరు మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక తాడిపత్రిలో సమీకరణలు ఆసక్తికరంగా మారాయి. తిరుగులేని ప్రజా మద్దతుతో వైఎస్సార్సీపీ సృష్టించిన రాజకీయ సునామీలో ప్రతిపక్ష టీడీపీ తుడుచుకుపెట్టుకుపోయింది. నగర పాలక సంస్థల్లో తుడిచి పెట్టుకుపోయిన టీడీపీ.. మున్సిపాలిటీలల్లోనూ బోర్లా పడింది. కనీసం ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. ఇక జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీలు అసలు పత్తా లేకుండా పోయాయి. 11 నగర పాలక సంస్థల్లోనూ వైఎస్సార్సీపీ జెండా ఫలితాలు ప్రకటించిన 11 నగర పాలక సంస్థల్లోనూ వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. ఒక్క చోట కూడా టీడీపీ ప్రభావం చూపించలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన రాజధానిగా ప్రకటించిన మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ)లో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించింది. మొత్తం 98 వార్డుల్లో వైఎస్సార్సీపీ 58 వార్డుల్లో ఘన విజయం సాధించింది. ► విజయవాడ నగర పాలక సంస్థ(జీఎంసీ)లో మొత్తం 64 వార్డుల్లో 49 వార్డుల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేసింది. గుంటూరులో 57 వార్డులకు గాను 44 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. ► తిరుపతి, కడప, అనంతపురం, విజయనగరం నగర పాలక సంస్థల్లో 50 చొప్పున వార్డులు ఉన్నాయి. ఆ నాలుగు చోట్లా కూడా వైఎస్సార్సీపీ 48 వార్డుల చొప్పున కైవసం చేసుకుని విజయఢంకా మోగించింది. ► మచిలీపట్నం నగర పాలక సంస్థలో 50 వార్డులకు గాను 44, ఒంగోలు నగర పాలక సంస్థలో 50 వార్డులకు గాను 41, చిత్తూరు నగర పాలక సంస్థలో 50 వార్డులకు గాను 46, కర్నూలులో 52 వార్డులకు గాను 41 వార్డుల్లో వైఎస్సార్సీపీ జయ కేతనం ఎగురవేసింది. మునిసిపాలిటీల్లో విజయ ఢంకా ఎన్నికలు జరిగిన 75 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లలో మొత్తం 2,794 వార్డులున్నాయి. కోర్టు తీర్పు కారణంగా ఏలూరు కార్పొరేషన్లో ఓట్ల లెక్కింపు జరగలేదు. ఈ కార్పొరేషన్లో 50 వార్డులు ఉన్నాయి. మిగతా 2,744 వార్డులకు గాను 2,265 వార్డులలో (ఏకగ్రీవాలతో సహా) వైఎస్సార్సీపీ విజయం సాధించింది. వాటిలో 11 నగర పాలక సంస్థల్లో 515 వార్డులు, పురపాలక సంఘాలు/ నగర పంచాయతీల్లో 1,750 వార్డులు ఉన్నాయి. ► నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు/ నగర పంచాయతీల్లో కలిపి టీడీపీ కేవలం 348 వార్డుల్లోనే గెలిచింది. వాటిలో నగర పాలక సంస్థల్లో 78 వార్డులు, పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో 270 వార్డులు ఉన్నాయి. ► జనసేన.. నగర పాలక సంస్థల్లో 7 వార్డుల్లో, పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో 19 వార్డుల్లో గెలిచింది. జనసేన మిత్రపక్షమైన బీజేపీకి నగర పాలక సంస్థల్లో కేవలం ఒక వార్డు, పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో 8 వార్డులు దక్కాయి. ► స్వతంత్రులు నగర పాలక సంస్థల్లో 14 వార్డులు, పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో 39 వార్డుల్లో గెలిచారు. ఇతరులు నగర పాలక సంస్థల్లో 5 వార్డులు, పురపాలక సంఘాల్లో 15 వార్డుల్లో గెలిచారు. ► పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో వైఎస్సార్సీపీ అన్ని వార్డులను ఏకగ్రీవంగా గెలుచుకుంది. దాంతో అక్కడ చైర్పర్సన్ పీఠాలు వైఎస్సార్సీపీ పరమయ్యాయి. ఇవి పోగా, ఎన్నికలు జరిగిన 71 పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో రాయచోటి, ఎర్రగుంట్ల, కనిగిరి, ధర్మవరం, వెంకటగిరి, తుని పురపాలక సంఘాల్లో వైఎస్సార్సీపీ అన్ని వార్డుల్లోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది. ► నిడదవోలు, ఆదోని, డోన్, సూళ్లూరుపేట, గుత్తి, ప్రొద్దుటూరు పురపాలక సంఘాల్లో ఒక్కో వార్డు మినహా మిగిలిన అన్ని వార్డుల్లో విజయం సాధించింది. మొత్తం మీద 75 పురపాలక సంఘాల్లో 73 మున్సిపల్ చైర్మన్ పీఠాలను వైఎస్సార్సీపీ సునాయసంగా గెలుచుకోనుంది. టీడీపీ కుదేలు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పురపాలక ఎన్నికల్లో పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయింది. ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించడంతో టీడీపీ కనీస పోటీ కూడా ఇవ్వలేక కుదేలైపోయింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్.. ఎన్నికల్లో ప్రచారం చేసినప్పటికీ, ప్రాంతీయ విద్వేషాలు రేకెత్తించేందుకు యత్నించినప్పటికీ ప్రజలు టీడీపీని ఏమాత్రం నమ్మలేదు. చిత్తుగా ఓడించారు. ► అనంతపురంలో ఒక్క వార్డులోనూ గెలవకపోగా, విజయనగరం, తిరుపతి, కడప నగర పాలక సంస్థల్లో కేవలం ఒక్కో వార్డుకే పరిమితమైంది. చిత్తూరులో 3, మచిలీపట్నంలో 5, కర్నూలులో 8, గుంటూరులో 9 వార్డుల చొప్పున మాత్రమే గెలిచింది. విశాఖపట్నంలో 30, విజయవాడలో 14 వార్డుల్లో విజయం సాధించింది. మొత్తం మీద ఫలితాలు ప్రకటించిన 11 నగర పాలక సంస్థల్లో 9 చోట్ల రెండంకెల లోపు వార్డులతో సరిపెట్టుకుంది. పురపాలక సంఘాల్లో చిత్తు చిత్తు ► పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో టీడీపీ కేవలం 270 వార్డుల్లోనే గెలిచింది. 9 పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో ఆ పార్టీ బోణి కూడా కొట్టలేకపోయింది. రామచంద్రాపురం, నరసాపురం, పెడన, చీరాల, సూళ్లూరుపేట, నాయుడుపేట, ప్రొద్దుటూరు, ఆదోని, నందికొట్కూరు, ఆత్మకూరు (కర్నూలు జిల్లా), గుత్తిలో ఆ పార్టీ కేవలం ఒక్కో వార్డులో మాత్రమే గెలిచింది. కేవలం నాలుగు పురపాలక సంఘాల్లో మాత్రమే టీడీపీ రెండంకెల సంఖ్యలో వార్డుల్లో విజయం సాధించింది. సోదిలోలేని బీజేపీ, జనసేన ► పొత్తు పెట్టుకుని తొలిసారి పోటీ చేసిన బీజేపీ, జనసేన పార్టీలు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. ఆ పార్టీలను అసలు ఓటర్లు ఏమాత్రం పట్టించుకోలేదు. జనసేన నగర పాలక సంస్థల్లో 7 వార్డుల్లో, పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో 19 వార్డుల్లో మాత్రమే గెలిచింది. ► బీజేపీ నగర పాలక సంస్థల్లో ఒక వార్డులో, పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో 8 వార్డులకే పరమితమైంది. స్వతంత్రులు నగర పాలక సంస్థల్లో 14 వార్డుల్లో, పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో 39 వార్డుల్లో గెలిచారు. ఇతరులు నగర పాలక సంస్థల్లో 5 వార్డుల్లో, పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో 15 వార్డుల్లో గెలుపొందారు. మూడు ప్రాంతాల్లోనూ మూకుమ్మడి తీర్పు ► రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని ప్రజలు మూడు రాజధానులకు ఆమోదం తెలుపుతున్నామన్నట్లు తమ తీర్పును స్పష్టంగా ప్రకటించారు. ► ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించిన 9 పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. వాటిలో మొత్తం 237 వార్డులకు గాను ఆ పార్టీ 164 వార్డుల్లో విజయభేరి మోగించింది. టీడీపీ కేవలం 57 వార్డుల్లోనే గెలిచింది. విజయనగరం, విశాఖపట్నం నగర పాలక సంస్థల్లోని 148 వార్డుల్లో వైఎస్సార్సీపీ 106 వార్డుల్లో విజయకేతనం ఎగురవేసింది. టీడీపీ కేవలం 31 వార్డులకే పరిమితమైంది. ► కోస్తా ప్రాంతంలోని 6 జిల్లాల్లోని 36 పురపాలక సంఘాలు /నగర పంచాయతీల్లో వైఎసార్సీపీ విజయకేతనం ఎగరవేసింది. వాటిలోని 973 వార్డుల్లో ఆ పార్టీ ఏకంగా 812 వార్డుల్లో ఘన విజయం సాధించింది. వైఎస్సార్సీపీ రెబల్స్ 12 వార్డులు దక్కించుకున్నారు. టీడీపీ కేవలం 114 వార్డుల్లోనే గెలిచింది. జనసేన 16 వార్డులకు, బీజేపీ 2 వార్డులకే పరిమితమయ్యాయి. స్వతంత్రులు 11 వార్డులు, ఇతరులు 5 వార్డులు గెలుచుకున్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు నగర పాలక సంస్థల్లోని మొత్తం 221 వార్డుల్లో వైఎస్సార్సీపీ 178 వార్డుల్లో విజయ ఢంకా మోగించింది. టీడీపీ కేవలం 34 వార్డులకే పరిమితమైంది. ► రాయలసీమలోని 4 జిల్లాల్లో 27 పురపాలక సంఘాలు / నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 25 చోట్ల వైఎసార్సీసీ తిరుగులేని విజయాన్ని సాధించింది. రాయలసీమలో మొత్తం 913 వార్డుల్లో వైఎస్సార్సీపీ 778 వార్డుల్లో విజయం సాధించింది. వైఎస్సార్సీపీ రెబల్స్ 3 వార్డులు దక్కించుకున్నారు. టీడీపీ కేవలం 99 వార్డుల్లోనే గెలిచింది. బీజేపీ ఆరు వార్డుల్లో, జనసేన ఒక వార్డులో గెలిచాయి. స్వతంత్రులు 17 వార్డులు, ఇతరులు 9 వార్డులు సాధించారు. ► రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం నగర పాలక సంస్థల్లో మొత్తం 252 వార్డుల్లో వైఎస్సార్సీపీ 231 వార్డుల్లో ఘన విజయం సాధించింది. టీడీపీ కేవలం 13 వార్డులతో సరిపెట్టుకుంది. 2014లో అలా.. 2021లో ఇలా... 2014లో జరిగిన పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 939 వార్డుల్లో గెలిచింది. అప్పటి ఎన్నికల్లో 36.52 శాతం వార్డులను కైవసం చేసుకుంది. టీడీపీ 1,424 వార్డుల్లో గెలిచి 55.39 శాతం వార్డుల్లో విజయం సాధించింది. కాగా ప్రస్తుతం వైఎస్సార్సీపీ ఏకంగా 2,265 వార్డులను కైవసం చేసుకుంది. 81.07 శాతం వార్డుల్లో విజయ దుందుభి మోగించింది. టీడీపీ కేవలం 348 వార్డులకే పరమితమైంది. ఆ పార్టీ కేవలం 12.70 శాతం వార్డులతో సరిపెట్టుకుంది. -
సీఎం వైస్. జగన్ అందిస్తున్న పాలనపై ప్రజలు విశ్వాసం ఉంచారు: మంత్రి అవంతి శ్రీనివాస్
-
చంద్రబాబు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి : మంత్రి కొడాలి నాని
-
‘బాబుకు సిగ్గుంటే కృష్ణా జిల్లాలో అడుగుపెట్టొద్దు’
సాక్షి, తాడేపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి తగిన గుణపాఠం చెప్పారని మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన వీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నవారే నాయకులని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబును మళ్లీ ప్రజలు తిరస్కరించారని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను సీఎం జగన్ నెరవేర్చారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకే ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. ప్రజలకు ఏం కావాలో సీఎం జగన్మోహన్రెడ్డికి తెలుసు అని చెప్పారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని కొడాలి నాని హితవు పలికారు. ఎన్నికలకు ముందు ఒక మాట.. ఎన్నికలైన తర్వాత చంద్రబాబుది మరో మాట ఉంటుందని మండిపడ్డారు. సీఎం జగన్మోహన్రెడ్డిని చూసి చంద్రబాబు చాలా నేర్చుకోవాలన్నారు. చంద్రబాబుకు సిగ్గుంటే కృష్ణా జిల్లాలో అడుగు పెట్టకూడదని అన్నారు. అమరావతిలో ఉన్న రైతులను చంద్రబాబు రోడ్డుపైకి తెచ్చారని కొడాలి నాని మండిపడ్డారు.మహిళలను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ది పొందాలని చంద్రబాబు చూశారని కొడాలి నాని మండిపడ్డారు. ఇప్పటికైనా దొంగల్ని వదిలేసి అమరావతి ప్రజలు ఆలోచించాలన్నారు. ఎల్లో మీడియాలో వస్తున్న విష ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అమరావతి ప్రాంతానికి ఏం కావాలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లండిని తెలిపారు. హైదరాబాద్‌లో చంద్రబాబు, లోకేష్ పాచిపనులు చేస్తున్నారా అని ప్రశ్నించారు. కుల, మత, పార్టీలు లేకుండా అందరినీ సీఎం జగన్ సమానంగా చూస్తున్నారని గుర్తుచేశారు. పేద ప్రజలకు సమానంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని తెలిపారు. దొంగ మాటలు చెప్పి ఎన్నికల్లో లబ్ది పొందాలని చంద్రబాబు చూశారని కొడాలి నాని మండిపడ్డారు. నీచ రాజకీయాలు చేసే బాబు మున్సిపల్ ఫలితాలపై ఏం జవాబు చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, బీజేపీ, ఎల్లో మీడియా కలిసి ఎన్నికల్లో ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మలేదని తెలిపారు. చదవండి: మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది -
నా భర్తకు చేసిన అవమానమే ఇప్పుడు వాళ్లకు: లక్ష్మీ పార్వతి
-
వైఎస్సార్సీపీ ప్రభంజనం
-
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది
-
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది
సాక్షి, తాడేపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో 100 శాతం వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందని తెలిపారు. సీఎం జగన్ పాలనకు ప్రజలు పట్టం కట్టారని చెప్పారు.22 నెలల సంక్షేమ సీఎం పాలనకు ప్రజలు ఘన విజయం అందించారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పనిచేసే ప్రభుత్వానికి, నిజాయితీ, నిబద్ధతకు ప్రజలెప్పుడూ మద్దతు ఇస్తారని వ్యాఖ్యానించారు. ఎక్కడా ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ ప్రజల వద్దకు వెళ్తున్నామని చెప్పారు. ఎక్కడైతే టీడీపీ గెలిచిందో అక్కడ ఎక్స్ ఆఫీషియో సభ్యులతో ఫామ్ చేస్తామని తెలిపారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా, దౌర్జన్యాలు చేసినా ప్రజలు వైఎస్సార్సీపీనే నమ్మారని తెలిపారు. ఏ సమస్య వచ్చినా స్పందిస్తున్నామని, ప్రజలపై తనకు నమ్మకం ఉందని జగన్ చెప్పారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని చేసినా ప్రజలు తమవైపే ఉన్నారని సీఎం చెప్పారని వ్యాఖ్యానించారు. ఈ విజయాన్ని ఇచ్చిన పట్టణ ప్రాంత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో ఇంకా బాధ్యతగా పని చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మేయర్, చైర్మన్ ఎంపిక పార్టీ అధ్యక్షుడు నిర్ణయిస్తారని చెప్పారు. టీడీపీని ఒక సామాజికవర్గ పార్టీగా మారుస్తున్నారని సొంత పార్టీ వారే అంటున్నారని తెలిపారు. మాయ మాటలు, మోసం చేసే వ్యక్తికి ఓటు ఎలా వేస్తారని అన్నారు. అమరావతి, విశాఖ ఉక్కు అంటూ బాబు రాజకీయం చేయబోయాడని అందుకే ప్రజలు ఆయన ఆలోచనకు బుద్ధి చెప్పారని తెలిపారు. తండ్రీకొడుకులు ఎలా మాట్లాడారో రాష్ట్రమంతా చూశారని బొత్స మండిపడ్డారు. చదవండి: మున్సి‘పోల్స్’ ఫలితాలు: వైఎస్సార్సీపీ ప్రభంజనం -
వాళ్లు హైదరాబాద్‌కే పరిమితమైతే మంచిది: రోజా
సాక్షి, తిరుపతి: మున్సిపల్ ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు సీఎం జగన్మోహన్రెడ్డి మంచి గిఫ్ట్ ఇచ్చారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అఖండ మెజారిటీలతో అత్యధిక సీట్లను గెలిపించారని, వార్ వన్ సైడ్ అనే విధంగా ఎన్నికలు జరిగాయని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హైదరాబాదులో రెస్ట్ తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వాళ్లు ఇక అక్కడే పరిమితమైతే మంచిదని తెలిపారు. ప్రజల విశ్వాసం ఉంటే ఎంతటి ఘన విజయాలు సాధించవచ్చని మున్సిపల్ ఎన్నికలు నిరూపించాయని చెప్పారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఒకే రకంగా ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎక్కడున్నారో వెతుక్కొని మరీ ప్రజలు ఓట్లు వేశారని తెలిపారు. ఇంత అభిమానం పొందడం సీఎం జగన్‌కే సాధ్యమైందని తెలిపారు. చరిత్ర సృష్టించాలన్నా, దాన్ని తిరగరాయాలన్నా జగన్‌కే సాధ్యమని పేర్కొన్నారు. చదవండి: నా భర్తకు చేసిన అవమానమే ఇప్పుడు వాళ్లకు: లక్ష్మీ పార్వతి మున్సి‘పోల్స్’ ఫలితాలు: వైఎస్సార్సీపీ ప్రభంజనం.. -
నా భర్తకు చేసిన అవమానమే ఇప్పుడు వాళ్లకు: లక్ష్మీ పార్వతి
సాక్షి, తాడేపల్లి: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీడీపీకి చెంప పెట్టు అని ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుకు తన కొడుకును వారసుడిగా చేయాలన్న ఆశయం పోయిందని, లాక్కున్న పార్టీని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించుకున్నాడని మండిపడ్డారు. ఇప్పుడు టీడీపీ పార్టీని భూస్థాపితం చేశాడని, ఇక తండ్రీ కొడుకులు పాలు, కూరగాయలు అమ్ముకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. తన భర్తకు చేసిన అవమానం ఇప్పుడు వాళ్లకు వచ్చిందని తెలిపారు. సీఎం జగన్ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాడని లక్ష్మీపార్వతి తెలిపారు. నిజమైన ఎన్టీఆర్ అభిమానులైతే ఇకనైనా చంద్రబాబును వదిలేయండని చెప్పారు. టీడీపీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించడం కష్టమని తెలిపారు. మరో 30 ఏళ్లు సీఎం జగన్ ప్రజలకు సేవ చేస్తారని తెలిపారు. తన భర్తను అవమానించిన పార్టీ ఉంటే ఏమిటి ఊడితే ఏమిటని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు పని అయిపోయిందని, ఆత్మ విమర్శ చేసుకోవడానికి తన మైండ్ కూడా చెడిపోయిందని ధ్వజమెత్తారు. బాబు చేసిన పాపాలు తన కొడుకు రూపంలో శాపంగా మారాయని ఆమె విమర్శించారు. చదవండి: ‘ఇక టీడీపీ లేదు, దాని తోక పార్టీలు లేవు’ -
వైఎస్సార్ సీపీ సరికొత్త రికార్డు
-
వార్ వన్ సైడ్ అనే విధంగా ఎన్నికలు జరిగాయి :ఎమ్మెల్యే రోజా
-
‘ఇక టీడీపీ లేదు, దాని తోక పార్టీలు లేవు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయంతో ముందుకు వెళుతోందని పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. పట్టణ ఓటర్లు 20 మాసాల తర్వాత తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారని అన్నారు. అర్బన్‌లో తనకేదో బలముందని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం పేరిటి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి గెలవాలని అనుకున్నాడని మండిపడ్డాడు. 21 మాసాల సీఎం జగన్ పరిపాలనకు ప్రజలు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. ప్రజలు సీఎం జగన్‌కు పట్టం కట్టారని తెలిపారు. ఇంత బ్రహ్మాండమైన విజయం ఏ అధికార పక్షానికి రాలేదని, ఇంత వైఫల్యం ఏ ప్రతిపక్షానికి రాలేదని తెలిపారు. రాష్ట్రంలో నిజమైన హీరో వైఎస్ జగన్ అని ప్రజలు నిరూపించారని అంబటి తెలిపారు. చంద్రబాబు, ఆయన కుమారుడు ఫలితాలు వస్తున్న వేళ ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. పాచి పనులు చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్లారా అని ప్రశ్నించారు. బాబు ఈవీఎం టాంపరింగ్ అన్నాడు. కానీ బ్యాలెట్ పేపర్లోను అదే మెజార్టీ వచ్చిందని తెలిపారు. ఏకగ్రీవాలు అని విమర్శించారు, ఏకగ్రీవాలు కానీ చోట కూడా అలాంటి ఫలితాలే వస్తున్నాయని అంబటి తెలిపారు. దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్, సొంత పుత్రుడు లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో టీడీపీ తుక్కు తుక్కుగా ఓడిపోయిందని, రాష్ట్రంలో ఈ దెబ్బతో టీడీపీ కనుమరుగైపోయిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ఏ ఎన్నికల్లో అయినా వైఎస్సార్సీపీదే విజయమని చెప్పారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్‌ని ఎదుర్కొనే పార్టీ ఏదీ లేదని అంబటి స్పష్టం చేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో కంటే ఎక్కువ ప్రేమను ప్రజలు ఈ ఎన్నికల్లో చూపించారని అంబటి తెలిపారు. ఇక టీడీపీ లేదు, దాని తోక పార్టీలు లేవని చెప్పారు. టీడీపీనే ప్రజలు నమ్మలేదని, ఇక వాళ్ల మేనిఫెస్టోని ఎలా నమ్ముతారని ఎద్దేవా చేశారు. ఇవాళ ఓటమి టీడీపీ పతనానికి నాంది అన్నారు. వైజాగ్, విజయవాడతో సహా అన్ని చోట్లా ప్రజలు పౌరుషం చూపించారని తెలిపారు. వైఎస్సార్సీపీకి ఓటు వేస్తే అమరావతికి ప్రజల మద్దతు లేనట్టే అన్నాడని, మరి గుంటూరు, విజయవాడ ప్రజలు అమరావతికి మద్దతు ఇవ్వలేదని స్పష్టమవుతోందని అంబటి తెలిపారు. చదవండి: మున్సి‘పోల్స్’ ఫలితాలు: వైఎస్సార్సీపీ ప్రభంజనం -
ఏపీ మునిసిపల్ ఎన్నికల ఫలితాలపై కెఎస్ఆర్ ప్రత్యేక చర్చ
-
‘ఇక టీడీపీ లేదు, దాని తోక పార్టీలు లేవు’
-
మున్సిపల్ ఫలితాలు సీఎం జగన్ పాలనకు నిదర్శనం
సాక్షి, తాడేపల్లి: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు నిదర్శనమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ తన రెక్కల కష్టంతో నిర్మించుకున్న పార్టీ వైఎస్సార్సీపీ అని పేర్కొన్నారు. పార్టీ గెలుపు క్రెడిట్ అంతా ఆయనను ఆశీర్వదించిన ప్రజలదేనని చెప్పారు. అక్కా చెల్లెల్లు, అన్నదమ్ములు, అవ్వతాతలు తన వైపు ఉన్నారని సీఎం జగన్‌కి భరోసా ఉందని, నేడు అదే నిజమైందని చెప్పారు. వారి కుటుంబంలో ఒకరిగా సీఎంను గుర్తించారని హర్షం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఫలితాలు వచ్చాయిని సజ్జల పేర్కొన్నారు. ఒక నాయకుడిపై ఇంత భరోసా చూపడం దేశంలోని ఇది తొలిసారి అని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ప్రచారం పేరిట, ప్రజల్ని బూతులు తిట్టారని మండిపడ్డారు. ఇప్పుడు వెళ్లి హైదరాబాద్‌లో కూర్చున్నారని, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ఉన్నారని ఎద్దేవా చేశారు. బాబును ప్రజలు చెత్తబుట్టలో వేశారని ఆయనకీ తెలుసన్నారు. దింపుడు కల్లం ఆశతో విపరీతంగా డబ్బు కూడా పంచారని మండిపడ్డారు. తాము ప్రతిపక్షం ఉండాలి అని కోరుకుంటున్నామని, కానీ, చంద్రబాబు దానికి కూడా అర్హుడను కాదు అని నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. ఇక వెంటిలేటర్ మీద నుంచి కూడా టీడీపీ కిందకు పడిపోయినట్లేనని సజ్జల పేర్కొన్నారు. చదవండి: మున్సి‘పోల్స్’ ఫలితాలు: క్లీన్‌స్వీప్ దిశగా దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ -
‘ఫ్యాన్’ సునామీలో కొట్టుకుపోయిన టీడీపీ, జనసేన!
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాంగించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ‘ఫ్యాన్’ గాలి వీచింది. పట్టణాలు, నగరాల్లో ఓటెత్తి అధికార వైఎస్సార్ సీపీకి జనం జైకొట్టడంతో క్లీన్‌స్వీప్ చేసింది. మొత్తం 11 కార్పోరేషన్లలో 11 స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఏపీ చరిత్రలో ఇంతవరకు ఒకే పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఇదే తొలిసారి. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు జై కొట్టడంతో.. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ.. ఇలా మూడు ప్రాంతాల్లోనూ వైఎస్సార్ సీపీ ఆధిక్యం కొనసాగడం విశేషం. దీంతో మూడు రాజధానులకు ప్రజలు మద్దతిచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇక ‘ఫ్యాన్’ గాలిలో కొట్టుకుపోయిన టీడీపీ, బీజేపీ, జనసేన ఉనికి చాటలేక చతికిలపడ్డాయి. కాగా టీడీపీ సీనియర్ నేతల జిల్లాల్లో ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు(విజయనగరం), తునిలో యనమల రామకృష్ణుడికి, పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్పకు, హిందూపురంలో బాలకృష్ణకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. సానుకూల దృక్పథంతో, సంక్షేమ పథకాలతో తమ హృదయాలను గెలుచుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే మరోసారి ప్రజలు పట్టం కట్టడంతో సరికొత్త రికార్డు దిశగా వైఎస్సార్ సీపీ దూసుకుపోతోంది. ► ఇప్పటివరకు చిత్తూరు, తిరుపతి, కడప, ఒంగోలు, కర్నూలు, గుంటూరు తదితర 6 కార్పొరేషన్లను కైవసం చేసుకున్న వైఎస్సార్సీపీ... విశాఖపట్నం, మచిలీపట్నం, విజయవాడ కార్పొరేషన్లలోనూ ఆధిక్యం కనబరుస్తోంది. మిగతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ ముందంజలో ఉంది. దీంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ►టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీ కంచుకోటలు బద్దలు కొడుతూ.. చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్స్ విజయ ఢంకా మోగించింది. అదే విధంగా మదనపల్లి, పలమనేరు, పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లో జయకేతనం ఎగురవేసింది. ►75 మున్సిపాలిటీల్లో కేవలం ఒక్క మున్సిపాలిటీకే టీడీపీ పరిమితం అయ్యింది. చదవండి: మున్సి‘పోల్స్’ ఫలితాలు: వైఎస్సార్సీపీ ప్రభంజనం.. -
క్లీన్‌స్వీప్ దిశగా దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ
-
ఏపీ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు 2021
-
మున్సి‘పోల్స్’ ఫలితాలు: వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్
మున్సిపల్ ఎన్నికల చరిత్రలో వైఎస్సార్సీపీ సరికొత్త రికార్డ్ సృష్టించింది. అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్సీపీ హవా కొనసాగించింది. ఫ్యాన్ దూకుడుకు టీడీపీ, బీజేపీ, జనసేన సోదిలో లేకుండా పోయాయి. మొత్తం 11 కార్పొరేషన్లు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. విశాఖపట్నం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, విజయనగరం, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది. ఇక 75 మున్సిపాలిటీల్లో ఇప్పటివరకూ వైఎస్సార్సీపీ 74 స్థానాలను దక్కించుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అనంతపురం కార్పొరేషన్లో టీడీపీ ఖాతా తెరవలేదు. ధర్మవరం మున్సిపాలిటీలోనూ టీడీపీ సున్నా. గుత్తిలో ఒకటి, రాయదుర్గంలో 2 సీట్లతో టీడీపీ సరిపెట్టుకుంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీకి సున్నా వార్డులు. యనమల రామకృష్ణుడు సొంతూరు తునిలో కూడా టీడీపీ ఖాతా తెరవలేదు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట, రామచంద్రాపురంలో ఒక్క వార్డుతో.. పెద్దాపురం, గొల్లప్రోలులో రెండు వార్డులతో టీడీపీ సరిపెట్టుకుంది. కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్ విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లు వైఎస్ఆర్సీపీ కైవసం కృష్ణా: ఉయ్యూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ఉయ్యూరు (20): వైఎస్ఆర్సీపీ -16, టీడీపీ -4 కృష్ణా: నందిగామ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం నందిగామ (20): వైఎస్ఆర్సీపీ -13, టీడీపీ -6, జనసేన -1 కృష్ణా: నూజివీడు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం నూజివీడు (23): వైఎస్ఆర్సీపీ -21, టీడీపీ -1, బీజేపీ -1 విశాఖ కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ కైవసం విశాఖ కార్పొరేషన్ (98): వైఎస్ఆర్సీపీ -58, టీడీపీ -30, జనసేన -3 విశాఖ కార్పొరేషన్ (98): బీజేపీ -1, సీపీఐ -1, సీపీఐ(M) -1, ఇతరులు -4 యలమంచిలి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం యలమంచిలి (25):వైఎస్ఆర్సీపీ -23, టీడీపీ -1, ఇతరులు -1 నర్సీపట్నం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం నర్సీపట్నం (28):వైఎస్ఆర్సీపీ -14, టీడీపీ -12, ఇతరులు -2 అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్ అనంతపురం కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ కైవసం అనంతపురం కార్పొరేషన్ (50): వైఎస్ఆర్సీపీ -48, ఇతరులు -2 రాయదుర్గం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం రాయదుర్గం (32): వైఎస్ఆర్సీపీ -30, టీడీపీ -2 మడకశిర మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం మడకశిర (20): వైఎస్ఆర్సీపీ -15, టీడీపీ -5 కల్యాణదుర్గం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం కల్యాణదుర్గం (24): వైఎస్ఆర్సీపీ -20, టీడీపీ -4 గుత్తి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం గుత్తి (25): వైఎస్ఆర్సీపీ -24, టీడీపీ-1 పుట్టపర్తి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం పుట్టపర్తి (20): వైఎస్ఆర్సీపీ -14, టీడీపీ -6 ధర్మవరం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ధర్మవరం (40): వైఎస్ఆర్సీపీ -40, టీడీపీ -0 హిందూపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం హిందూపురం (38): వైఎస్ఆర్సీపీ -29, టీడీపీ -6, బీజేపీ -1, ఎంఐఎం -1, ఇతరులు -1 కదిరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం కదిరి (36): వైఎస్ఆర్సీపీ -30, టీడీపీ -5, ఇతరులు -1 గుంతకల్లు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం గుంతకల్లు (37): వైఎస్ఆర్సీపీ -28, టీడీపీ -7, సీపీఐ -1, ఇతరులు -1 తాడిపత్రి: వైఎస్ఆర్సీపీ -16, టీడీపీ 18, సీపీఐ 1, ఇతరులు 1 గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్ గుంటూరు కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ కైవసం గుంటూరు (57): ఎస్ఆర్సీపీ-45, టీడీపీ-8, బీజేపీ+ 4, ఇతరులు 2 తెనాలి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం తెనాలి (40): వైఎస్ఆర్సీపీ-32, టీడీపీ-8 చిలకలూరిపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చిలకలూరిపేట (38): వైఎస్ఆర్సీపీ-30, టీడీపీ-8 రేపల్లె మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం రేపల్లె (28): వైఎస్ఆర్సీపీ-26, టీడీపీ-2 సత్తెనపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం సత్తెనపల్లి (31): వైఎస్ఆర్సీపీ-24, టీడీపీ-4, బీజేపీ-1, ఇతరులు -2 వినుకొండ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం వినుకొండ (32): వైఎస్ఆర్సీపీ-28, టీడీపీ-4 మాచర్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం మాచర్ల (31): వైఎస్ఆర్సీపీ-31, టీడీపీ-0 పిడుగురాళ్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం పిడుగురాళ్ల (33): వైఎస్ఆర్సీపీ -33, టీడీపీ-0 ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్ ఒంగోలు కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ కైవసం ఒంగోలు (50): వైఎస్ఆర్సీపీ -41, టీడీపీ-6, జనసేన -1, ఇతరులు -2 గిద్దలూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం గిద్దలూరు (20): వైఎస్ఆర్సీపీ-16, టీడీపీ-3, ఇతరులు -1 కనిగిరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం కనిగిరి (20): వైఎస్ఆర్సీపీ-20, టీడీపీ-0 చీమకుర్తి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చీమకుర్తి (20): వైఎస్ఆర్సీపీ-18, టీడీపీ-2 మార్కాపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం మార్కాపురం (35): వైఎస్ఆర్సీపీ-30, టీడీపీ-5 అద్దంకి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం అద్దంకి (19): వైఎస్ఆర్సీపీ-13, టీడీపీ-6 చీరాల మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చీరాల (33): వైఎస్ఆర్సీపీ-19, టీడీపీ-1, ఇతరులు 13 నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్ నాయుడుపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం నాయుడుపేట (25): వైఎస్ఆర్సీపీ 23, టీడీపీ-1, బీజేపీ-1 సూళ్లూరుపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం సూళ్లూరుపేట (25): వైఎస్ఆర్సీపీ 24, టీడీపీ-1 వెంకటగిరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం వెంకటగిరి (25): వైఎస్ఆర్సీపీ 25 ఆత్మకూరు (ఎం) మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ఆత్మకూరు (ఎం) (23): వైఎస్ఆర్సీపీ19, టీడీపీ-2, ఇతరులు 2 చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్ చిత్తూరు కార్పొరేషన్ వైఎస్ఆర్ సీపీ కైవసం చిత్తూరు కార్పొరేషన్ (50): వైఎస్ఆర్సీపీ -46, టీడీపీ -3, ఇతరులు -1 తిరుపతి కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ కైవసం తిరుపతి కార్పొరేషన్ (49): YSRCP -48, TDP -1 మదనపల్లె మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం మదనపల్లె (35): వైఎస్ఆర్సీపీ -33, టీడీపీ -2 పుంగనూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం పుంగనూరు (31): వైఎస్ఆర్సీపీ -31, టీడీపీ -0 పలమనేరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం పలమనేరు (26): వైఎస్ఆర్సీపీ -24, టీడీపీ -2 నగరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం నగరి (29): వైఎస్ఆర్సీపీ -24, టీడీపీ -4, ఇతరులు -1 పుత్తూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం పుత్తూరు (27): వైఎస్ఆర్సీపీ -22, టీడీపీ -5 కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్ కర్నూలు కార్పొరేషన్ (52): వైఎస్ఆర్సీపీ-44, టీడీపీ-6, ఇతరులు -2 గూడూరు (20): వైఎస్ఆర్సీపీ- 12, టీడీపీ-3, బీజేపీ -1, ఇతరులు - 4 డోన్ (32): వైఎస్ఆర్సీపీ- 31, ఇతరులు - 1 ఆత్మకూరు (24): వైఎస్ఆర్సీపీ- 21, టీడీపీ-1, ఇతరులు - 2 ఎమ్మిగనూరు (34): వైఎస్ఆర్సీపీ- 31, టీడీపీ-3 ఆదోని (42): వైఎస్ఆర్సీపీ- 41, టీడీపీ-1 నందికొట్కూరు (29): వైఎస్ఆర్సీపీ- 21, టీడీపీ-1, ఇతరులు -7 ఆళ్లగడ్డ (27): వైఎస్ఆర్సీపీ- 22, టీడీపీ-2, బీజేపీ - 2, ఇతరులు - 1 నంద్యాల (42): వైఎస్ఆర్సీపీ-37, టీడీపీ-4, ఇతరులు - 1 చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చిత్తూరు కార్పొరేషన్ వైఎస్ఆర్ సీపీ కైవసం చిత్తూరు కార్పొరేషన్ (50): వైఎస్సార్సీపీ -46, టీడీపీ -3, ఇతరులు -1 తిరుపతి కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ కైవసం తిరుపతి కార్పొరేషన్ (49):వైఎస్సార్సీపీ -48, టీడీపీ -1 మదనపల్లె మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం మదనపల్లె (35): వైఎస్సార్సీపీ -33, టీడీపీ -2 పుంగనూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం పుంగనూరు (31): వైఎస్సార్సీపీ -31, టీడీపీ -0 పలమనేరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం పలమనేరు (26): వైఎస్సార్సీపీ -24, టీడీపీ -2 నగరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం నగరి (29):వైఎస్సార్సీపీ -24, టీడీపీ -4, ఇతరులు -1 పుత్తూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం పుత్తూరు (27): వైఎస్సార్సీపీ -22, టీడీపీ -5 వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ కడప కార్పొరేషన్ వైఎస్సార్సీపీ కైవసం కడప కార్పొరేషన్ (50): వైఎస్సార్సీపీ -48, టీడీపీ -1, ఇతరులు -1 ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ప్రొద్దుటూరు (41): వైఎస్సార్సీపీ -40, టీడీపీ -1 పులివెందుల మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం పులివెందుల (33): వైఎస్సార్సీపీ -33, టీడీపీ-0 జమ్మలమడుగు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం జమ్మలమడుగు (20): వైఎస్సార్సీపీ -18, బీజేపీ -2 బద్వేల్ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం బద్వేల్ (35): వైఎస్సార్సీపీ -28, టీడీపీ -3, ఇతరులు -4 రాయచోటి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం రాయచోటి (34): వైఎస్సార్సీపీ -34, టీడీపీ -0 ఎర్రగుంట్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ఎర్రగుంట్ల (20): వైఎస్సార్సీపీ -20, టీడీపీ -0 శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్ ఇచ్ఛాపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ఇచ్ఛాపురం (23): వైఎస్ఆర్సీపీ -15, టీడీపీ -6, ఇతరులు-2 పలాస మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం పలాస (31): వైఎస్ఆర్సీపీ -23, టీడీపీ -8 పాలకొండ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం పాలకొండ (20): వైఎస్ఆర్సీపీ -17, టీడీపీ -3 విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్ బొబ్బిలి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం బొబ్బిలి (31): వైఎస్ఆర్సీపీ -19, టీడీపీ -11, ఇతరులు -1 పార్వతీపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం పార్వతీపురం (30): వైఎస్ఆర్సీపీ -22, టీడీపీ-5, ఇతరులు -3 సాలూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం సాలూరు (29): వైఎస్ఆర్సీపీ-20, టీడీపీ-5, ఇతరులు -4 నెల్లిమర్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం నెల్లిమర్ల (20): వైఎస్ఆర్సీపీ -11, టీడీపీ-7, ఇతరులు -2 ►విశాఖ కార్పొరేషన్ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. విశాఖ కార్పొరేషన్లో 57 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ ►పెద్దాపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ♦పెద్దాపురం (29): వైఎస్సార్సీపీ -21, టీడీపీ -2, జనసేన -1 ►అమలాపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ♦అమలాపురం (30): వైఎస్సార్సీపీ-19, టీడీపీ-4, జనసేన -6, ఇతరులు -1 ►గొల్లప్రోలు నగర పంచాయతీ వైఎస్ఆర్సీపీ కైవసం ♦గొల్లప్రోలు (20): వైఎస్ఆర్సీపీ -18, టీడీపీ - 2 ►ముమ్మిడివరం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ♦ముమ్మిడివరం (20): వైఎస్ఆర్సీపీ - 14, టీడీపీ-6 ►ఏలేశ్వరం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ♦ఏలేశ్వరం (20):వైఎస్సార్సీపీ -16, టీడీపీ -4 ►మండపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ♦మండపేట (30): వైఎస్సార్సీపీ -22, టీడీపీ -7, ఇతరులు -1 ►ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఒంగోలు కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ఒంగోలు (50): వైఎఎస్సార్సీపీ-41, టీడీపీ-6, జనసేన -1, ఇతరులు -2. గిద్దలూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం, గిద్దలూరు (20): వైఎఎస్సార్సీపీ-16, టీడీపీ-3, ఇతరులు -1 ►కనిగిరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం కనిగిరి (20): వైఎఎస్సార్సీపీ-20, టీడీపీ-0 ►చీమకుర్తి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చీమకుర్తి (20):వైఎఎస్సార్సీపీ-18, టీడీపీ-2 ►మార్కాపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం మార్కాపురం (35): వైఎఎస్సార్సీపీ-30, టీడీపీ-5 ►అద్దంకి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం అద్దంకి (19): వైఎస్సార్సీపీ-13, టీడీపీ-6 ►చీరాల మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చీరాల (33): వైఎస్సార్సీపీ-19, టీడీపీ-1, ఇతరులు 13 ►అనంతపురం: హిందూపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 38 వార్డులకు ఇప్పటి వరకు 20 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయవం సాధించింది. ►చిత్తూరు: నగరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. నగరి (29): వైఎస్సార్సీపీ-24, టీడీపీ-4, ఇతరులు -1 ►తూర్పుగోదావరి: తుని మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్. 30 వార్డులకు 30 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►కృష్ణా: తిరువూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 20 వార్డులకు ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►విశాఖ కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీ ఆధిక్యం. ఇప్పటి వరకు 46 డివిజన్లలో YSRCP ఆధిక్యం చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీకి ఘోర పరాభవం.. చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీకి ఘోర పరాభవం ఎదురయ్యింది. టీడీపీ కోటలు బద్ధలయ్యాయి. చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ విజయ ఢంకా మోగించింది. మదనపల్లి, పలమనేరు, పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీ ఘన విజయం సాధించింది. వైఎస్సార్సీపీ విజయఢంకా విజయవాడ: మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల మొదటిరౌండ్లో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించింది. 23 డివిజన్ల లో 18 స్థానాల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. 5 డివిజన్లకు మాత్రమే టీడీపీ పరిమితం కాగా, గ్లాస్ బోణి కొట్టలేదు. ఎమ్మెల్యే బాలకృష్ణ కు చేదు అనుభవం అనంతపురం: ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. హిందూపురం మున్సిపాలిటీ వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. మొత్తం 38 వార్డుల్లో 20 వైఎస్సార్ సీపీ కైవసం చేసుకోగా, నాలుగు వార్డులకే టీడీపీ పరిమితమైంది. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సొంత వార్డులో టీడీపీ ఓటమి కృష్ణా జిల్లా: మచిలీపట్నం కార్పొరేషన్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సొంత వార్డులో టీడీపీ ఓటమి పాలైంది. టీడీపీ అభ్యర్థి బొడ్డు నాగలక్ష్మి పై వైసీపీ అభ్యర్థిని కొలుసు విజయగంగ విజయం సాధించారు. ధర్మవరంలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్.. అనంతపురం: ధర్మవరంలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 40 వార్డుల్లో పది వార్డులు ఏకగ్రీవం కాగా, 30 వార్డుల్లో ఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలుపొందారు. కదిరిలో మాజీ ఎమ్మెల్యే కందికుంట దౌర్జన్యం అనంతపురం: కదిరిలో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దౌర్జన్యానికి దిగారు. అక్రమంగా కౌంటింగ్ కేంద్రంలో చొచ్చుకువెళ్లారు. 29వ వార్డులో ఆరు ఓట్లతో గెలిచిన వైఎస్సార్ సీపీ అభ్యర్థికి డిక్లరేషన్ ఇవ్వకుండా కందికుంట.. అడ్డుకున్నారు. కందికుంట దౌర్జనానికి నిరసనగా ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి బైఠాయించారు. అయ్యన్నపాత్రుడికి ఎదురు దెబ్బ విశాఖ: నర్సీపట్నం లో టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఎదురు దెబ్బ తగిలింది. నర్సీపట్నం మున్సిపాలిటీని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 28 వార్డులకు గాను 16 వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ►కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ తొలి రౌండ్ ఫలితాల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. 20 వార్డులకు గాను తొలి రౌండ్లో ఆరు వార్డును కైవసం చేసుకుంది. పశ్చిమలో వైఎస్సార్సీపీ హవా.. పశ్చిమగోదావరి జిల్లా: మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతుంది. జిల్లాలో కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, నరసాపురం మున్సిపాలిటీలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అభ్యర్థులను మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అభినందించారు. మచిలీపట్నం కార్పొరేషన్లో ముందంజలో వైఎస్సార్సీపీ.. కృష్ణా జిల్లా: మచిలీపట్నం కార్పొరేషన్ లో 17 డివిజన్లకు తొలి రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది. 15 డివిజన్లలో వైఎస్సార్సీపీ ముందంజలో ఉంది. లోకేష్ ప్రచారం నిర్వహించిన 7 వ డివిజన్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారు. ►నెల్లూరు: సూళ్లూరుపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 25 వార్డులకు ఇప్పటి వరకు 24 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు సాధించింది. ►తూర్పుగోదావరి: గొల్లప్రోలు నగర పంచాయతీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 20 వార్డులకు ఇప్పటి వరకు 12చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►శ్రీకాకుళం: పాలకొండ నగర పంచాయతీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 20 వార్డులకు ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ఇప్పటి వరకు 50 మున్సిపాలిటీలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ►నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. వెంకటగిరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 25 వార్డుల్లో 25 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు సాధించింది. ►విజయవాడ కార్పొరేషన్లో వెలువడిన తొలి ఫలితం. 37వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి గెలుపు. ►పశ్చిమగోదావరి: జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 29 వార్డులకు ఇప్పటి వరకు 25 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు సాధించింది. ►గుంటూరు: చిలకలూరిపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 38 వార్డులకు ఇప్పటి వరకు 21 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►విజయనగరం: బొబ్బిలి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 8 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ►చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. తిరుపతి కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీలు కైవసం. పుత్తూరు, నగరి, పలమనేరు, పుంగనూరు, మదనపల్లి మున్సిపాలిటీలు వైఎస్ఆర్సీపీ కైవసం ►కర్నూలు కార్పొరేషన్లో ఇప్పటి వరకు 10 డివిజన్ల ఫలితాల వెల్లడి.10 డివిజన్లలోనూ వైఎస్ఆర్సీపీ విజయం ►గుంటూరు కార్పొరేషన్ కైవసం దిశగా వైఎస్ఆర్సీపీ. 57 డివిజన్లకు ఇప్పటి వరకు 25 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►అనంతపురం: పుటపర్తి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 20 వార్డులకు 14 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం ►కర్నూలు: ఆళ్లగడ్డ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 27 వార్డులకు 22 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►విజయనగరం: నెల్లిమర్ల నగర పంచాయతీ వైఎస్ఆర్సీపీ కైవసం. 20 వార్డులకు ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం ►అనంతపురం: రాయదుర్గం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 32 వార్డులకు ఇప్పటి వరకు 17 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►కడప: బద్వేల్ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ►తిరుపతి కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 50 డివిజన్లలో ఇప్పటి వరకు 30 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ►గుంటూరు: తెనాలి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 5 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం ►కృష్ణా: తిరువూరు 9వ వార్డులో వైఎస్ఆర్సీపీ విజయం ►తూర్పుగోదావరి: రామచంద్రపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 28 వార్డులకు ఇప్పటి వరకు 15 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు. ముమ్మిడివరం నగరపంచాయతీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 20 వార్డులకు ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►పశ్చిమగోదావరి: నరసాపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 31 వార్డులకు ఇప్పటి వరకు 16 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 29 వార్డులకు ఇప్పటి వరకు 17 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. ►ఉయ్యూరులో ఇప్పటి వరకు 9 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం ►కర్నూలు జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. అన్ని మున్సిపాలిటీల్లోనూ ఓటర్లు ఫ్యాన్‌కే పట్టం కట్టారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. ►గుంటూరు: వినుకొండ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 25 వార్డులకు గాను 21 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ►చిత్తూరు: మదనపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ►నగరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ►నగరిలో 29 వార్డులకు 15 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం ►గుంటూరు: రేపల్లె మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ►విజయనగరం: సాలూరులో ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం ►విశాఖ: యలమంచిలి 1వ వార్డులో వైఎస్ఆర్సీపీ విజయం ►నందిగామ 9, 10, 17 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం ►ఒంగోలు కార్పొరేషన్లో 19 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ విజయం ►గుంటూరు కార్పొరేషన్లో 4, 24, 34, 36, 41, 44 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ విజయం ►పుట్టపర్తిలో 20 వార్డులకు ఇప్పటి వరకు 9 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం ►కర్నూలు: ఆళ్లగడ్డ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ►27 వార్డులకు ఇప్పటి వరకు 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►గుంటూరు: సత్తెనపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ►28 వార్డులకు ఇప్పటి వరకు 26 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►కడప: ఎర్రగుంట్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్. 20 వార్డులకు 20 చోట్లా వైఎస్ఆర్సీపీ గెలుపు ►విశాఖ: యలమంచిలి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 25 వార్డులకు గాను ఇప్పటి వరకు 23 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►కర్నూలు: ఆదోని మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ►42 వార్డులకుగాను ఇప్పటివరకు 22 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►నందిగామ మున్సిపాలిటీలో ఇప్పటివరకు 3 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ►కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్ ►కృష్ణా: ఉయ్యూరు 5 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ►తిరుపతి: 15, 20, 26, 32, డివిజన్లలో వైఎస్ఆర్సీపీ విజయం ►గుంటూరు: వినుకొండ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 25 వార్డులకు గాను 21 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం ►చిత్తూరు: మదనపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ►నగరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 29 వార్డులకు 15 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం ►గుంటూరు: రేపల్లె మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ►విజయనగరం: సాలూరులో ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం ►విశాఖ: యలమంచిలి 1వ వార్డులో వైఎస్ఆర్సీపీ విజయం ►నందిగామ 9, 10, 17 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం ►ఒంగోలు కార్పొరేషన్లో 19 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ విజయం ►గుంటూరు కార్పొరేషన్లో 4, 24, 34, 36, 41, 44 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ విజయం ►పుట్టపర్తిలో 20 వార్డులకు ఇప్పటి వరకు 9 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం ►ఆళ్లగడ్డ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 27 వార్డులకు ఇప్పటి వరకు 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో 6, 13, 24 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం ►తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఇప్పటివరకు 9 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం. 1, 5, 9, 13, 14, 17, 21, 25, 29 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ►కృష్ణా: పెడనలో 23 వార్డులకు గాను 8చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం. 1, 2, 3, 4, 5,. 6, 7, 8 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ►విశాఖ: యలమంచిలి 5, 6, 11, 13, 14 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ►శ్రీకాకుళం: పలాస మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 31 వార్డులకుగాను ఇప్పటివరకు 16 చోట్ల గెలుపు ►పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఇప్పటివరకు 7వార్డుల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ►ప్రకాశం: అద్దంకి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 19వార్డులకుగాను ఇప్పటివరకు 11చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►కర్నూలు: ఎమ్మిగనూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 30 వార్డులకుగాను ఇప్పటివరకు 18చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►గుంటూరు కార్పొరేషన్లో 25 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ ఆధిక్యం ►వైఎస్ఆర్జిల్లా: ఎర్రగుంట్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 20వార్డులకు గాను ఇప్పటివరకు 17చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఇప్పటివరకు 7వార్డుల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ►అనంతపురం: మడకశిర మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ►25 వార్డులకుగాను 11చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►ఇప్పటివరకు 33 మున్సిపాలిటీలు వైఎస్ఆర్సీపీ కైవసం ►తూర్పుగోదావరి: తుని మున్సిపాలిటీ వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకుంది. 30 వార్డులకు గాను ఇప్పటివరకు 18 చోట్ల వైఎస్ఆర్ సీపీ గెలుపొందింది. మరోసారి యనమలకు ఎదురుదెబ్బ తగిలింది. మండపేటలో 1, 2, 8 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ►అనంతపురం: మడకశిరలో 2, 3, 7, 10 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది ►వైఎస్ఆర్జిల్లా: ఎర్రగుంట్లలో 11, 14 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం ►కృష్ణా: ఉయ్యూరు 8వ వార్డులో వైఎస్ఆర్సీపీ విజయం ►నెల్లిమర్లలో ఇప్పటివరకు 6 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం ►2, 3. 4, 5, 7, 8 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ►కర్నూలు: ఆత్మకూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ►24 డివిజన్లకుగాను 21 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం ►అమలాపురం మున్సిపాలిటీలో ఇప్పటివరకు 10 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం. 1, 8, 10, 11, 12, 13, 14, 16, 17, 25 వార్డుల్లో ఫ్యాన్ హవా ►నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్. అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న వైఎస్ఆర్సీపీ ►నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆత్మకూరు, వెంకటగిరిలో వైఎస్ఆర్సీపీ గెలుపు ►చిత్తూరు: మదనపల్లె మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 35 వార్డులకు గాను ఇప్పటివరకు 19 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ►గుంటూరు కార్పొరేషన్ 34 డివిజన్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. వినుకొండ మున్సిపాలిటీ 13వ వార్డులో వైఎస్సార్సీపీ గెలిచింది. ►విజయనగరం: సాలూరు 4, 5, 6, 7 వార్డులో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. పార్వతీపురం 12, 13 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. ►శ్రీకాకుళం: పలాస 6, 9, 15, 16 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ఇచ్చాపురం 1, 6, 7 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ►చిత్తూరు కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీ ఆధిక్యత కొనసాగుతుంది. 50 డివిజన్లకు గాను 37 చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ►కదిరి 30వ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి విజయం సాధించారు. 970 ఓట్లతో గులాబ్ జాన్ గెలుపొందారు. ►ఆత్మకూరు మున్సిపాలిటీ 19వ వార్డులో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ►కర్నూలు: ఆత్మకూరు మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 24 వార్డుల్లో ఇప్పటికే 20 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. ►పశ్చిమగోదావరి: నరసాపురం 23వ వార్డులో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. నిడదవోలు 6వ వార్డులో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ►కర్నూలు జిల్లా డోన్ మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 32 వార్డులకు గాను ఇప్పటికే 30 వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ‘కనిగిరి’లో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ కనిగిరి మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ సత్తాచాటింది. 20 వార్డులకు గాను 20 గెలుచుకొని క్లీన్‌స్వీప్ చేసింది మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి జోరు మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతుంది. ఇప్పటికే 18 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న వైఎస్సార్సీపీ.. చాలా స్థానాల్లో ముందంజలో ఉంది. కనిగిరిలో 20 వార్డులకు గాను 20 గెలుచుకొని క్లీన్‌స్వీప్ చేసింది. ‘గిద్దలూరు’ వైఎస్సార్సీపీ కైవసం ప్రకాశం జిల్లాలోని మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతుంది. ఇప్పటికే కనిగిరి, గిద్దలూరు మున్సిపాలిటీ స్థానాలను కైవసం చేసుకుంది. పలు స్థానాల్లో ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్‌ల్లో వైఎస్సార్సీపీదే ఆధిక్యం పోస్టల్ బ్యాలెట్‌ల్లో వైఎస్ఆర్సీపీదే ఆధిక్యం ఉంది. అన్ని మున్సిపాలిటీల్లోనూ వైఎస్ఆర్సీపీ ముందంజలో ఉంది. ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు పాలకొండ నగర పంచాయతీలో 2 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు పార్వతీపురం మున్సిపాలిటీలో 6 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు బొబ్బిలి మున్సిపాలిటీలో ఒక వార్డులో వైఎస్సార్ సీపీ గెలుపు యలమంచిలి మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు అమలాపురం మున్సిపాలిటీ 6 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు రామచంద్రపురం మున్సిపాలిటీలో 10 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు సామర్లకోట మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు తుని మున్సిపాలిటీలో 15 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ముమ్మిడివరం నగర పంచాయతీ 1 వార్డులో వైఎస్సార్ సీపీ గెలుపు కొవ్వూరు మున్సిపాలిటీలో 13 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు నరసాపురం మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు తెనాలి మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు చిలకలూరిపేట మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు రేపల్లె మున్సిపాలిటీలో 4 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు సత్తెనపల్లి మున్సిపాలిటీలో 4 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు వినుకొండ మున్సిపాలిటీలో 7 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు కనిగిరి మున్సిపాలిటీలో 7 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు సూళ్లూరుపేట మున్సిపాలిటీలో 14 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు నాయుడుపేట మున్సిపాలిటీలో 23 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ఆత్మకూరు మున్సిపాలిటీలో 6 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు వెంకటగిరి మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు నూజివీడు మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ఉయ్యూరు నగర పంచాయతీలో 2 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు తిరువూరు నగర పంచాయతీలో 2 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ధర్మవరం మున్సిపాలిటీలో 10 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు గుత్తి మున్సిపాలిటీలో 6 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు గుంతకల్లు మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు తాడిపత్రి మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 9 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో 13 వార్డుల్లో వైఎస్సార్ సీపీగెలుపు జమ్మలమడుగు మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు బద్వేల్ మున్సిపాలిటీలో 10 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ఇప్పటికే నాలుగు మున్సిపాలిటీలు వైఎస్సార్ సీపీ కైవసం పులివెందుల, మాచర్ల మున్సిపాలిటీలు వైఎస్సార్ సీపీ కైవసం పుంగనూరు, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు వైఎస్సార్సీపీ కైవసం ►విశాఖ కార్పొరేషన్ 11 వార్డు జనసేన అభ్యర్థి గోనె భారతి గుండెపోటుతో మృతి చెందారు. కౌంటింగ్ ప్రారంభం ఏపీలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. ఆ తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కించనున్నారు. కాగా 11 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం అవుతంది. అనంతరం ఇనీషియల్ కౌంటింగ్ ప్రారంభించి బ్యాలెట్ పేపర్లని సరిచూసుకుంటారు. తర్వాత 25 ఓట్లని ఒక బండిల్ కట్టి ఆయన డివిజన్లకి ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేస్తారు. అనంతరం 40 బండిళ్లను డివిజన్‌కు లేదా వార్డుకు వెయ్యిఓట్ల చొప్పున ప్రారంభిస్తారు. ఇప్పటికే నాలుగు మున్సిపాలీటీలు ఏకగ్రీవం పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని డివిజన్లు (మొత్తం 128) ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో కూడా 362 డివిజన్లు, వార్డులు ఏకగ్రీవమవడంతో మొత్తం ఏకగ్రీవ డివిజన్లు, వార్డుల సంఖ్య 490కు చేరింది. దాంతో ఎన్నికలు నిర్వహించిన మిగిలిన 1,633 డివిజన్లు, వార్డుల్లో పోలైన ఓట్లను లెక్కించి నేడు ఫలితాలు ప్రకటించనున్నారు. ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు ఓట్ల లెక్కింపు కోసం పురపాలక శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ చేపట్టనున్న 11 నగర పాలక సంస్థల్లో మొత్తం 2,204 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 7,412 మంది కౌంటింగ్ సిబ్బంది, 2,376 మంది కౌంటింగ్ సూపర్వైజర్లను నియమించారు. ఓట్ల లెక్కింపు చేపట్టనున్న 71 పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో 1,822 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 5,195 మంది కౌంటింగ్ సిబ్బంది, 1,941మంది కౌంటింగ్ సూపర్వైజర్లను నియమించారు. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పురపాలక ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఏలూరు నగర పాలక సంస్థ మినహా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించిన నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఆదివారం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏలూరులో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రస్తుతం చేపట్టడం లేదు. ఓట్ల లెక్కింపు కోసం పురపాలక శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. -
ఒక్కసారే రీ కౌంటింగ్‌కు అనుమతి
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను అన్నిచోట్లా రాత్రి 8 గంటలకల్లా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ జిల్లాల కలెక్టర్లతోపాటు మున్సిపల్ శాఖ కమిషనర్, ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీ/కార్పొరేషన్ కమిషనర్లకు సూచించారు. కౌంటింగ్ సందర్భంగా ఒక అంకె ఓట్ల తేడా ఉన్నచోట మాత్రమే రీకౌంటింగ్ నిర్వహించాలని, రెండంకెల ఓట్ల తేడా ఉన్నప్పుడు అభ్యర్థులెవరైనా రీకౌంటింగ్ కోరితే రిటర్నింగ్ అధికారులు నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాలని తెలిపారు. కేవలం ఒకసారి మాత్రమే రీకౌంటింగ్‌కు అనుమతించాలని ఆయన స్పష్టం చేశారు. కౌంటింగ్ సమయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై నిమ్మగడ్డ శనివారం ఆదేశాలు జారీ చేశారు. అన్నిచోట్ల వీడియో కెమేరాల ద్వారా, లేదంటే సీసీ కెమేరాలు, వెబ్‌కాస్టింగ్ పర్యవేక్షణలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. ఆ వీడియో ఫుటేజీని ఎన్నికల రికార్డుల్లో భద్రపరచాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియలో విద్యుత్ అంతరాయాల్లేకుండా చర్యలు తీసుకోవాలని, కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైతే జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచనలిచ్చారు. -
గెలుపు ఊపులో వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: మునిసిపల్, నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగించడం ఖాయమని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మనసున్న సీఎంగా వైఎస్ జగన్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థుల గెలుపునకు దోహదం చేశాయని చెప్పారు. ఆ విజయ పరంపర మునిసిపల్ ఎన్నికల్లోనూ కొనసాగుతుందన్నారు. ఆదివారం జరగబోయే విజయోత్సవాలను పురస్కరించుకుని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద భారీగా సంబరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో టీడీపీకి ప్రజలు పూర్తిగా చరమగీతం పాడినట్టేనని అన్నారు. మునిసిపల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే సంబరాల ఏర్పాట్లపై పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి వరకు సంబరాలు నిర్వహించాలని నిర్ణయించారు. కార్యకర్తల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సంబరాలకు హాజరయ్యే వారు విధిగా మాస్క్‌లు ధరించాలని సూచించారు. సమావేశంలో లేళ్ల అప్పిరెడ్డి, నేతలు ఎ.నారాయణమూర్తి, ఎన్.పద్మజ, న్యాయవాది రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
మున్సిపోల్స్‌తో మునిగిపోతాం!
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదనే అంచనాలతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల తీర్పే అర్బన్ ప్రాంతాల్లోనూ ప్రతిఫలిస్తుందనే అభిప్రాయాన్ని టీడీపీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. అంతర్గతంగా పార్టీ నేతలు చేసుకునే విశ్లేషణల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే పూర్తి అనుకూల వాతావరణం ఉన్నట్లు వారే చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతానికిపైగా సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవులను వైఎస్సార్సీపీ అభిమానులు చేజిక్కించుకోవడంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే ట్రెండ్ కొనసాగుతుందని ఆ పార్టీ సీనియర్ నేతలు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే టీడీపీ బోల్తా పడడంతో స్థానిక ఎన్నికలపై ఆ పార్టీ నేతలు ఆశలు వదిలేసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో కూడా 80 శాతానికిపైగా పంచాయతీలను ఆ పార్టీ కోల్పోవడంతో ప్రజల్లో వైఎస్సార్సీపీకి ఉన్న ఆదరణ ఏ మాత్రం తగ్గకపోగా, మరింత పెరిగిందనే విషయం స్పష్టమైందని టీడీపీ నాయకులు అంతర్గత చర్చల్లో మాట్లాడుకుంటున్నారు. ప్రజల్ని రెచ్చగొట్టినా పట్టించుకోలేదు.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి తమ పార్టీకి అనుకూలంగా లేదని పంచాయతీ ఫలితాలు రుజువు చేసినా ప్రచారం కోసం చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల్లోనూ హడావుడి చేయడంతో పార్టీ శ్రేణులు అయిష్టంగానే పోటీకి దిగాయి. చాలా చోట్ల అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉన్నా చంద్రబాబు ఎలాగైనా నామినేషన్లు వేయించాలని ఒత్తిడి చేయడంతో అనేక మంది నేతలు బలవంతంగా పలువురిని పోటీకి దింపారు. నామినేషన్లు వేశాక ఇక తమ పని అయిపోయిందన్నట్లు పార్టీ ముఖ్య నేతలు వ్యవహరించడంతో కింది స్థాయిలో ఎన్నికలను ఎదుర్కొనేందుకు అభ్యర్థులు, ద్వితీయ శ్రేణి నేతలు ఇబ్బందులు పడ్డారు. అధిష్టానం మీడియాలో ప్రకటనలు, ఎస్ఈసీకి లేఖలు రాయడం వంటి వాటికే ప్రాధాన్యత ఇచ్చి అభ్యర్థుల గురించి పట్టించుకోకపోవడంతో కింది స్థాయిలో ఆందోళన నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో దాదాపు అన్ని వర్గాలకు మేలు జరగడం, సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న ఆదరణ చెక్కు చెదరక పోవడంతో తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చంద్రబాబు సహనం కోల్పోయి అమరావతి పేరుతో విజయవాడ, గుంటూరు నగరాల్లో ప్రజల్ని రెచ్చగొట్టేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అయినా ఎవరూ నమ్మే పరిస్థితి లేకపోవడంతో ఆ పార్టీ నేతల ఆశలు నీరుగారి పోయాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాన కార్పొరేషన్లలోనూ ఛాన్స్ లేదా? మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయనే నమ్మకం టీడీపీ నేతల్లో ఏమాత్రం కనిపించడం లేదు. టీడీపీ బలంగా ఉందని భావించే విజయవాడ, విశాఖపట్నం కార్పొరేషన్లలోనూ తమకు అవకాశం లేదని గుంటూరుకు చెందిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. పార్టీ చేయించిన సర్వేల్లో కూడా ఒక్క కార్పొరేషన్ అయినా వస్తుందో లేదో అనేలా పరిస్థితి ఉందన్నారు. ఇక మున్సిపాలిటీల్లో నాలుగైదు రావడం కూడా కష్టమని తమ సర్వేల్లోనే వెల్లడైనట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పోలింగ్ తర్వాత టీడీపీ నాయకులు ఎవరిలోనూ ధీమా కనిపించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైకి మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు తమదేనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఎక్కడికక్కడ పార్టీ నాయకులు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తామే గెలుస్తామని మీడియాలో ప్రకటించుకోవడమే తప్ప ఎవరికీ ఆ నమ్మకం లేదంటున్నారు. -
ఫలితాలు నేడే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పురపాలక ఎన్నికల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఏలూరు నగర పాలక సంస్థ మినహా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించిన నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఆదివారం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏలూరులో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రస్తుతం చేపట్టడం లేదు. ఓట్ల లెక్కింపు కోసం పురపాలక శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ చేపట్టిన 12 నగర పాలక సంస్థల్లోని 671 డివిజన్లలో 91 ఏకగ్రీవమయ్యాయి. దాంతో 580 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. వాటిలో ఏలూరులో ఎన్నికలు నిర్వహించిన 47 డివిజన్లలో ఓట్ల లెక్కింపు ప్రస్తుతం చేపట్టడం లేదు. మిగిలిన 533 డివిజన్లలో పోలైన ఓట్లను ఆదివారం లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. రాష్ట్రంలో 71 పురపాలక సంఘాలు / నగర పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. వాటిలో పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని డివిజన్లు (మొత్తం 128) ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో కూడా 362 డివిజన్లు, వార్డులు ఏకగ్రీవమవడంతో మొత్తం ఏకగ్రీవ డివిజన్లు, వార్డుల సంఖ్య 490కు చేరింది. దాంతో ఎన్నికలు నిర్వహించిన మిగిలిన 1,633 డివిజన్లు, వార్డుల్లో పోలైన ఓట్లను ఆదివారం లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. పురపాలక శాఖ పటిష్ట ఏర్పాట్లు ఓట్ల లెక్కింపు కోసం పురపాలక శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు చేపట్టనున్న 11 నగర పాలక సంస్థల్లో మొత్తం 2,204 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 7,412 మంది కౌంటింగ్ సిబ్బంది, 2,376 మంది కౌంటింగ్ సూపర్వైజర్లను నియమించారు. ► ఓట్ల లెక్కింపు చేపట్టనున్న 71 పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో 1,822 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 5,195 మంది కౌంటింగ్ సిబ్బంది, 1,941మంది కౌంటింగ్ సూపర్వైజర్లను నియమించారు. ► ఓట్ల లెక్కింపు టేబుళ్ల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొత్తం వీడియో తీయనున్నారు. ► ఓట్ల లెక్కింపు సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా డిస్కం అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్తగా జనరేటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం విజయవాడలోని లయోలా కాలేజీలో చేసిన ఏర్పాట్లు రెండు గంటల్లో తొలి ఫలితాలు ► ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను, తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కిస్తారు. ► వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లను 25 చొప్పున కట్టలు కడతారు. ఒక్కో టేబుల్‌కు 40 ఓట్ల కట్టలు చొప్పున విభజించి ఓట్లు లెక్కింపు ప్రారంభిస్తారు. ► ఓట్ల లెక్కింపు వివరాలు ప్రకటించేందుకు పోలింగ్ కేంద్రాల్లో డిజిటల్ తెరలు ఏర్పాటు చేశారు. వార్డుల వారీగా, రౌండ్ల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు ఎప్పటికప్పుడు డిజిటల్ తెరలపై వెల్లడిస్తారు. ► ఓట్ల లెక్కింపు ప్రారంభమైన రెండు గంటలకు తొలి ఫలితాలు వెలువడతాయని అధికారులు భావిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి నగర పంచాయతీల తుది ఫలితాలు ప్రకటించగలమని చెబుతున్నారు. ► విశాఖపట్నం మినహా మిగిలిన అన్ని చోట్లా ఆదివారం సాయంత్రానికి ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. అత్యధికంగా 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నంలో తుది ఫలితాలు వెలువడేందుకు మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు. -
రేపే ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్..
సాక్షి, అమరావతి: రేపటి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. 11 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ జరగనుంది. హైకోర్టు ఉత్తర్వులతో ఏలూరు కార్పోరేషన్, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియకు బ్రేక్ పడింది. హైకోర్టు తుది తీర్పు తర్వాతే ఆ రెండు చోట్ల కౌంటింగ్ చేపట్టనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత,144 సెక్షన్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కోసం కార్పోరేషన్లలో 2204 టేబుళ్లు, మున్సిపాలిటీలలో 1822 టేబుళ్లు మొత్తం 4026 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కార్పోరేషన్లలో కౌంటింగ్ సూపర్ వైజర్లు- 2376, కౌంటింగ్ సిబ్బంది -7412 మంది, మున్సిపాలిటీలలో కౌంటింగ్ సూపర్ వైజర్లు-1941, కౌంటింగ్ స్టాఫ్ సిబ్బంది 5195 మందిని ప్రభుత్వం నియమించింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత కోసం 20,419 పోలీసు సిబ్బంది నియమించారు. ఇందులో 172 మంది డీఎస్పీలు, 476 మంది సీఐలు, 1345 మంది ఎస్ఐలు, 17292 మంది కానిస్టేబుళ్లు,ఇతరులు1134 మందిని ప్రభుత్వం నియమించింది. 11 కార్పోరేషన్లలో స్థానికంగా 16 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు.. ►విజయనగరం కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు- పాత బస్టాండ్ సమీపంలో రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ►విశాఖపట్నం కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు- ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణం,వాల్తేరు ►విజయవాడ కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు- ఆంధ్ర లయోలా కళాశాల ►మచిలీపట్నం కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు- కృష్ణా యూనివర్సిటీ ►గుంటూరు కార్పోరేషన్లో స్థానికంగా నాలుగు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ♦ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ♦ప్రభుత్వ టెక్స్ టైల్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ న్యూబ్లాక్ ♦నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్ ♦ప్రభుత్వ టెక్స్ టైల్స్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ ఓల్డ్ బ్లాక్ ►ఒంగోలు కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు- సెయింట్ క్సావియర్ హైస్కూల్ కళాశాల ►అనంతపురం కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు -ఎస్ఎస్ బీఎమ్ జూనియర్ కళాశాల ►కర్నూలు కార్పోరేషన్లో 3 చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ♦రాయలసీమ యూనివర్సిటీ ♦సెయింట్ జోసెఫ్ డిగ్రీ, పీజీ మహిళా కళాశాల ♦పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాల ►చిత్తూరు కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు - పీవీకెఎన్ ప్రభుత్వ కళాశాల ►తిరుపతి కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు - ఎస్ వీ ఆర్ట్స్ కళాశాల మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో ఎక్కడికక్కడ అన్ని వార్డులను కలిపి ఒకే కేంద్రంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. చదవండి: పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అక్రమాలు లేవు రూపకర్తకు నీరాజనం.. జెండాకు వందనం -
పోలింగ్ కేంద్రంలో బాలయ్య హంగామా
సాక్షి, హిందూపురం: ఓటేసేందుకు అనంతపురం జిల్లా హిందూపురం రెండో వార్డు చౌడేశ్వరీకాలనీలోని పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన బాలయ్య, ఆయన సతీమణి వసుంధరలు హంగామా చేశారు. క్యూలో నుంచుని ఓటర్లకు నమస్కారాలు చేస్తూ, నవ్వుతూ పలకరిస్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నించారు. మీడియాకు ఫోజులిస్తూ అక్కడి ఓటర్లు, పోలీస్, పోలింగ్ సిబ్బందితో మాట్లాడటం గమనార్హం. ఓటు వేసి అక్కడి పోలింగ్ సిబ్బందిని పలకరించి వారితో ఫొటోలు దిగారు. చదవండి: (కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన జేసీ) -
విధుల్లో ఉన్న ఎస్ఐని నెట్టేసిన కొల్లు రవీంద్ర
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల పోలింగ్ వేళ తెలుగుదేశం పార్టీ బరి తెగించింది. ఓటమి భయంతో టీడీపీ నేతలు, శ్రేణులు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ప్రత్యక్ష దాడులు, దౌర్జన్యాలకు తెగబడ్డారు. దాడుల్లో పలుచోట్ల వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు గాయాల పాలయ్యారు. పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్‌లకు యత్నించారు. ఇతర ప్రాంతాల వ్యక్తులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించేందుకు సైతం వెనుకాడలేదు. పోలింగ్ జరుగుతుండగానే ప్రలోభాల పర్వాన్ని కొనసాగించారు. కృష్ణా జిల్లా బందరులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వీరంగం సృష్టించారు. 25వ వార్డు జలాల్ పేట పోలింగ్ కేంద్రంలోకి కార్యకర్తలతో కలిసి వెళ్తున్న రవీంద్రను పోలీసులు వారించబోగా.. విధుల్లో ఉన్న పోలీసులను కొట్టి అక్కడే ఉన్న ఎస్సైను నెట్టేశారు. ‘ఏయ్.. ఎస్ఐ. నన్నే ఆపుతావా’ అని బెదిరించడమేకాక, ‘చంపుతావా.. చంపు’ అంటూ ఎస్ఐని రెచ్చగొట్టారు. మోదుగులపై రాళ్లదాడి.. రిగ్గింగ్‌కు యత్నం గుంటూరులో దొంగ ఓట్లు వేయిస్తున్నారనే సమాచారం అందడంతో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు బండరాళ్లతో దాడి చేశారు. మోదుగుల కారుతోపాటు మరో రెండు కార్లను ధ్వంసం చేశారు. ఈ దాడిలో మోదుగులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దొంగ ఓట్లు వేయించేందుకు టీడీపీ నేతలు 10కి పైగా డివిజన్లలో ఓ సామాజిక వర్గానికి చెందిన హాస్టల్లో ఉన్న యువతులు, విద్యార్థులను రంగంలోకి దించారు. ఈ క్రమంలోనే 38వ డివిజన్ పరిధిలో స్తంభాల గరువు మున్సిపల్ పాఠశాలలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన ముగ్గురు యువతులను పట్టాభిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యానగర్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో దొంగ ఓటు వేసేందుకు వచ్చిన మరో యువతిని పట్టుకున్నారు. వారి కోసం టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నేతలు మారణాయుధాలతో ఓటర్లను బెదిరించారు. 6వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి సమత కుమారుడు గౌతమ్ రైలుపేటలోని పోలింగ్ కేంద్రం వద్ద కత్తితో హల్చల్ చేస్తూ ఓటు వేయడానికి వచ్చిన ముస్లిం మహిళలను భయభ్రాంతులకు గురి చేశాడు. స్థానిక యువకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గౌతమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే జిల్లాలోని సత్తెనపల్లిలో ఓటమి భయంతో టీడీపీ శ్రేణులు రిగ్గింగ్‌కు ప్రయత్నించాయి. 24వ వార్డులో మధ్యాహ్నం వరకు పోలింగ్ ప్రశాంతంగా జరగ్గా.. ఓటమి పాలవుతామనే నిర్ణయానికి వచ్చిన టీడీపీ నేత చౌటా శ్రీనివాసరావు పార్టీ నేతలను రప్పించి రిగ్గింగ్‌కు పాల్పడేందుకు ప్రయత్నించారు. మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు మద్యం, డబ్బుతో నేరుగా పోలింగ్ కేంద్రానికి కారులో వచ్చారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కార్యకర్తలతో ఘర్షణకు దిగి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో వైఎస్సార్ సీపీ నేత చిట్టా విజయ భాస్కర్‌రెడ్డి చేతికి గాయం కాగా, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు కారు వెనుక అద్దం ధ్వంసమైంది. సత్తెనపల్లిలోని 7వ పోలింగ్ బూత్ వద్ద టీడీపీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి ఉషారాణి భర్త నాగేశ్వరరావును జనసేన కార్యకర్తలు కొట్టారు. ఎల్లో మీడియాలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేసినట్టు ప్రచారం జరిగింది. తిరుపతిలో దొంగ ఓట్లు వేయించే యత్నం తిరుపతి 43వ డివిజన్లో దొంగ ఓట్లు వేయించబోయిన టీడీపీ అడ్డంగా బుక్కయ్యింది. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని వైఎస్సార్సీపీ ఏజెంట్లు అడ్డుకోగా.. ఐదుగురు మహిళలు సహా 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15వ డివిజన్లో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. విజయవాడలో ప్రలోభాల పర్వం విజయవాడలో పలుచోట్ల పోలింగ్ కొనసాగుతున్న సమయంలోనూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రలోభాలకు తెరలేపారు. 8వ డివిజన్లో టీడీపీ కార్యకర్తపై వైఎస్సార్సీపీ అభ్యర్థి భర్త దాడి చేశారంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేసింది. వాస్తవానికి ఆ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రభావితం చేసేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. వారి ప్రలోభాలను వైఎస్సార్సీపీ అభ్యర్థి భర్త అడ్డుకోవడంతో దుష్ప్రచారానికి తెరతీశారు. అనంతపురంలోని 29వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోగా.. వారితో టీడీపీ నేత కందికుంట ప్రసాద్ దురుసుగా ప్రవర్తించారు. సీఐ మధుసూదన్‌ను దుర్భాషలాడారు. ప్రకాశం జిల్లా అద్దంకి 20వ వార్డులో టీడీపీ చీఫ్ ఏజెంట్ విషయంలో చోటుచేసుకున్న వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. అనంతపురం జిల్లా గుత్తిలోని 20వ వార్డులో టీడీపీ అభ్యర్థి సునీల్ తరఫున ఆ పార్టీ నాయకుడు శ్రీనివాసులు ఓటర్లకు నగదు పంపిణీ చేస్తుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విశాఖలో టీడీపీ ఓవరాక్షన్ ఎమ్మెల్యే వెలగపూడి హల్చల్ సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరపాలక సంస్థలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్న నేపథ్యంలో ఇబ్బందులు సృష్టించేందుకు టీడీపీ ప్రయత్నించింది. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఏయూ హైస్కూల్ పోలింగ్ కేంద్రానికి వచ్చిన వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిబంధనల మేరకు కేంద్రానికి 100 మీటర్ల దూరంలో తన వాహనాన్ని నిలిపి కారులోనే ఉన్నారు. తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాత్రం కారులో నేరుగా పోలింగ్ కేంద్రం గేటు వద్దకు వచ్చి ఓటర్లు వద్దకు వెళ్లారు. దీనిపై స్థానికులతో పాటు వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు వెలగపూడిని బయటకు తీసుకొచ్చారు. స్థానికులు, వైఎస్సార్సీపీ శ్రేణుల డిమాండ్‌తో వెలగపూడిని అరెస్ట్ చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే గణబాబు హల్చల్ చేశారు. గోపాలపట్నం పోలింగ్ బూత్ వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ నేతలు చోడవరం ప్రాంతం నుంచి కొందర్ని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించే ప్రయత్నం చేశారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా పారిపోయారు. నలుగురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మొత్తం 300 మంది ఓటు వేసినట్లుగా అనుమానం వ్యక్తం చేసిన నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేకే రాజు 10, 11 పోలింగ్ బూత్‌లలో రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. -
ఓటెత్తిన పురం
సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల్లో ఓట్లు పోటెత్తాయి. 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీలకు బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో ఏకంగా 62.28 శాతం పోలింగ్ నమోదైంది. నగరపాలక సంస్థల కంటే పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగిన 12 నగరపాలక సంస్థల్లో 57.14 శాతం పోలింగ్ నమోదు కాగా.. 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో 70.66 శాతం ఓట్లు పోలయ్యాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏకగ్రీవమైనవాటిని మినహాయించగా 12 నగరపాలక సంస్థల్లోని 581 డివిజన్ల్లో 2,569 మంది, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లోని 1,633 వార్డుల్లో 4,981 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం మీద 7,550 మంది ఎన్నికల బరిలో నిలిచారు. నగరపాలక సంస్థల పరిధిలో 4,626, పురపాలక సంఘాలు/నగర పంచాయతీల పరిధిలో 3,289 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే పోటెత్తిన ఓటర్లు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో బుధవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మహిళలు, వృద్ధులు సైతం ఓటింగ్ పట్ల ఆసక్తి చూపారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు విజయవాడలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు క్యూలైన్లలో ఉన్నవారిని కూడా ఓట్లు వేసేందుకు అనుమతించారు. ఓటర్ స్లిప్పులు లేకపోయినా ఓటర్ల జాబితాలో ఉన్నవారు ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకువస్తే ఓటింగ్‌కు అవకాశమిచ్చారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్సులను సంబంధిత ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూములకు తరలించారు. సీసీ కెమెరాలతోపాటు స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఓట్లేసిన 48.30 లక్షల మంది.. ► పోలింగ్ నిర్వహించిన 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో మొత్తం 77,56,200 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 48,30,296 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. ► అత్యధికంగా 75.93 శాతం ఓటింగ్‌తో తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ► 75.49 శాతం పోలింగ్‌తో ప్రకాశం జిల్లా రెండో స్థానంలో, 71.52 శాతంలో శ్రీకాకుళం జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. ► కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 55.87 శాతం పోలింగ్ నమోదైంది. నగరపాలక సంస్థల్లో టాప్‌లో ఒంగోలు ► నగరపాలక సంస్థల్లో 75.52 శాతం పోలింగ్‌తో ఒంగోలు మొదటి స్థానంలో నిలిచింది. ► 71.14 శాతం పోలింగ్‌తో మచిలీపట్నం రెండో స్థానంలో, 66.06 శాతం పోలింగ్‌తో చిత్తూరు మూడో స్థానంలో ఉన్నాయి. ► కర్నూలులో అత్యల్పంగా 49.26 శాతం ఓట్లు పోలయ్యాయి. పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో మొదటి స్థానంలో గూడూరు ► 85.98 శాతం పోలింగ్‌తో గూడూరు (కర్నూలు జిల్లా) నగర పంచాయతీ మొదటి స్థానంలో నిలిచింది. ► 83.04 శాతం ఓటింగ్‌తో అద్దంకి రెండో స్థానంలో, 82.24 శాతం ఓటింగ్‌తో మండపేట మూడో స్థానంలో ఉన్నాయి. ► ఆదోనిలో అత్యల్పంగా 50.05 శాతం ఓట్లు పోలయ్యాయి. పురపాలక ఓట్ల లెక్కింపు కోసం విస్తృత ఏర్పాట్లు.. పురపాలక ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్, పురపాలక శాఖ అధికారులు దృష్టి సారించారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కౌంటింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ► ఎన్నికలు నిర్వహించిన 12 నగరపాలక సంస్థల్లో మొత్తం 2,204 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 9,788 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. వారిలో కౌంటింగ్ సిబ్బంది 7,412 మంది కాగా కౌంటింగ్ సూపర్వైజర్లు 2,376 మంది. ► ఎన్నికలు నిర్వహించిన 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు కోసం 1,822 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 7,136 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. వారిలో కౌంటింగ్ సిబ్బంది 5,195 మంది కాగా కౌంటింగ్ సూపర్వైజర్లు 1,941 మంది ఉన్నారు. -
ఏయ్ ఎస్సై నన్నే ఆపుతావా: కొల్లు రవీంద్ర
కృష్ణా: తెలుగు దేశం నేత కొల్ల రవీంద్ర పోలింగ్ సెంటర్ వద్ద వీరంగం సృష్టించాడు. ఓటింగ్ ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. తనను పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా అడ్డుకున్నందుకు ఏకంగా విధుల్లో ఉన్న ఎస్ఐపై చేయి చేసుకున్నాడు. ఆ వివరాలు.. మచిలిపట్నం 25వ డివిజన్ సర్కిల్‌పేటలోని పోలింగ్ కేంద్రానికి టీడీపీ నేత కొల్లు రవీంద్ర, మరి కొందరి కార్యకర్తలతో కలిసి వచ్చాడు. తాను లోపలికి వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలించాలంటూ హాడావుడి చేసే ప్రయత్నం చేశాడు. దాంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు 144 సెక్షన్ అమల్లో ఉందని.. కనుక ఆయన లోపలికి వెళ్లడానికి కుదరదని కొల్లు రవీంద్రకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొల్లు రవీంద్ర పోలీసులపై విరుచుకుపడ్డాడు.. ‘‘ఏయ్ ఎస్పై నన్ను ఆపుతావా’’ అంటూ బెదిరించడమే కాక.. ‘‘చంపుతావా.. చంపు’’ అంటూ ఎస్ఐ మీదకు వెళ్లాడు. వారిని వెనక్కి నెట్టాడు. నేను లోపలికి వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలించాలంటూ వారితో వాదనకు దిగాడు. ఈ క్రమంలో టీడీపీ నేతల దౌర్జన్యాన్ని అరికట్టాలని.. ఇలాంటి చర్యలు జరగకుండా చూడాలని జనాలు కోరుతున్నారు. చదవండి: బరి తెగించిన టీడీపీ: దొంగ ఓట్లు వేయించేందుకు యత్నం -
కొల్లు రవీంద్ర దౌర్జన్యం
-
బరి తెగించిన టీడీపీ: దొంగ ఓట్లు వేయించేందుకు యత్నం
సాక్షి, తిరుపతి: ఆంధ్రపదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం వరకు 42.84 శాతం పోలింగ్ నమోదయ్యింది. మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోంది. దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యింది. తిరుపతి 43వ డివిజన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దొంగ ఓట్లు వేయించేందుకు టీడీపీ విఫలయత్నం చేసింది. కానీ చివరి నిమిషయంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు గుర్తించి అభ్యంతరం తెలిపారు. దొంగ ఓట్లు వేయకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఐదుగురు మహిళలు సహా 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా రామచంద్రాపురం మండలం మొండేడుపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. విశాఖలో.. విశాఖపట్నం 5 వార్డులో దొంగ ఓట్లు వేయడానికి టీడీపీ కార్యకర్తలు తీసుకువచ్చిన వచ్చిన వారిని వైఎస్సాఆర్సీపీ కార్యకర్తలు సారిపల్లి గోవింద, వార్డు ఇన్చార్జి తుళ్ళి చంద్రశేఖర యాదవ్ పట్టుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించిచారు. టీడీపీ నేతలకు ఓడిపోతామనే భయం పట్టుకుందని.. అందుకే ఇలా అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు. -
తిరుపతి, విశాఖలో దొంగ ఓట్లు వేయించేందుకు యత్నించిన టీడీపీ
-
గుంటూరు: సత్తెనపల్లి 7వ వార్డు పోలింగ్ బూత్ వద్ద ఘర్షణ
-
టీడీపీ నాయకుల ఓవర్ యాక్షన్
-
ఏపీ: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ
-
ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఫోటోలు
-
బిర్యానీ ప్యాకెట్లలో బంగారు ముక్కు పుడకలు
నంద్యాల: ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఓ అభ్యర్థి ఓటర్లకు గాలం వేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నంద్యాల పట్టణంలోని 12వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా ఖండే శ్యాంసుందర్‌లాల్ పోటీ చేస్తున్నాడు. ఓటర్లను డబ్బు, బంగారంతో మభ్యపెట్టాలని చూశాడు. ఎవరికీ అనుమానం రాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కొందరిని కిరాయికి పిలిపించాడు. మంగళవారం బిర్యాని పొట్లాల్లో ముక్కుపుడకలు ఉంచి ఓటర్లకు పంపిణీ చేయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు పంపిణీ చేస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాఘవేంద్రస్వామి, రవికిరణ్, మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు బైకులు,రూ.55 వేల నగదు, 23 బంగారు ముక్కుపుడకలు, బిర్యానీ పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. అభ్యర్థి శ్యామ్‌సుందర్‌లాల్‌తో పాటు మరో ముగ్గురిపై ఎన్నికల నియామావళి అతిక్రమణ కింద కేసు నమోదు చేశారు. చదవండి: బయటకు వెళ్లకుండా తల వ్రెంటుకలను కట్ చేయించి.. -
అనంతపురం జిల్లా: ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్
-
ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి
-
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం
-
ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్
Time: 5:00 PM ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. Time: 4:45 PM ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. Time: 4:30 PM ప్రకాశం: అద్దంకి 20వ వార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉదయం టీడీపీ చీఫ్ ఏజెంట్ విషయంలో చిన్న వివాదం జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి బూత్ వద్దకు వచ్చాడు. దీంతో వైఎస్ఆర్సీపీ ఇంఛార్జ్ కృష్ణ చైతన్య కూడా అక్కడ చేరుకున్నారు. రెండు వర్గాల అనుచరులతో నేతలు బూత్ బయట కూర్చొన్నారు. దీంతో పోలీసులు రెండు వర్గాల కార్యకర్తలను దూరంగా పంపుతున్నారు. Time: 4:20 PM మచిలీపట్నం: మచిలీపట్నం 25వ డివిజన్లో పోలీసులపై కొల్లు రవీంద్ర దౌర్జన్యానికి పాల్పడ్డాడు. పోలింగ్ బూత్‌ల పర్యవేక్షణకు వెళ్లకూడదని,144 సెక్షన్ అమలులో ఉందని పోలీసులు చెబుతున్నా పోలీసులపై చేయి చేసుకుని ఎస్ఐని నెట్టివేశాడు. Time: 4:00 PM మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53.57 పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మరో గంటలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. Time: 3:00 PM రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లాల వారీగా పోలింగ్ శాతం ►శ్రీకాకుళం- 59.9శాతం ►విజయనగరం- 53.31శాతం ► కృష్ణా- 52.87 శాతం ► తూర్పుగోదావరి- 53.08 శాతం ► కర్నూలు- 48.87 శాతం ► అనంతపురం- 56.93 శాతం ►చిత్తూరు- 54.12 శాతం ►ప్రకాశం- 64.31 శాతం ► కడప- 56.63 శాతం ► నెల్లూరు- 61.03 శాతం ►విశాఖపట్నం- 47.86 శాతం ►గుంటూరు- 54.42 శాతం ► పశ్చిమ గోదావరి- 53.68 శాతం Time: 2:30 PM అనంతపురం: జిల్లాలోని కదిరి 3వ వార్డులోని పోలింగ్ కేంద్రంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. Time: 2:00 PM టీడీపీ దుశ్చర్య చిత్తూరు: తిరుపతి 43వ డివిజన్లో టీడీపీ దుశ్చర్యకు పాల్పడింది. దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నం చేసింది. చివరి నిమిషంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు గుర్తించి అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఐదుగురు మహిళలు సహా 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా రామచంద్రాపురం మండలం మొండేడుపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 42.84% పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లాల వారీగా పోలింగ్ శాతం శ్రీకాకుళం: 44.38% విజయనగరం: 45.10% విశాఖ: 36.75% తూర్పు గోదావరి: 53.08% పశ్చిమ గోదావరి: 45.51% కృష్ణా: 41.51% గుంటూరు: 44.69% ప్రకాశం: 53.19% నెల్లూరు: 48.89% అనంతపురం: 45.42% కర్నూలు: 40.99% కడప: 46.02% చిత్తూరు: 41.28% పోలింగ్ Time: 1:28 PM ఏయూ హైస్కూల్ బూత్ వద్ద ఎమ్మెల్యే వెలగపూడి హల్చల్ విశాఖపట్నం: ఏయూ హైస్కూల్ బూత్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హల్చల్ సృష్టించారు. అనుచరులతో బూత్‌కు వచ్చిన వెలగపూడిని పోలీసులు అడ్డుకున్నారు. గొడవలు సృష్టించడానికే వెలగపూడి వచ్చారంటూ వైఎస్సార్సీపీ ఆందోళన చేసింది. టీడీపీ కార్యకర్తలు.. బూత్ వద్ద నినాదాలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వెలగపూడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Time: 1:17 PM పోలింగ్ ఏజెంట్ల పేరుతో బూత్‌లోనే టీడీపీ నేతలు.. గుంటూరు: నగరంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. పోలింగ్ ఏజెంట్ల పేరుతో బూత్‌లోనే టీడీపీ నేతలు తిష్ట వేశారు. స్టాల్ గర్ల్స్ హైస్కూల్ బూత్ లోపలే టీడీపీ నేతలు ఉండిపోయారు. టీడీపీ నేతలు బూత్‌లో ఉన్నారంటూ పోలీసులకు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. Time: 12:45 PM ఓటు వేసిన మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం: మంత్రి బొత్స సత్యనారాయణ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాజా కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. అనంతరం మాట్లాడుతూ, ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. మున్సిపల్లో విజయం సాధించిన అభ్యర్థులు మరింత బాధ్యతగా పని చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. పట్టణాభివృద్ధికి తమ వంతు కృషి ఎప్పుడూ ఉంటుందన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం 11వ వార్డు పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. Time: 12:37 PM సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే చాలు: ఎస్ఈసీ విజయవాడ: ఓటు హక్కు వినియోగించుకోవాలని వచ్చే ఓట్లర్ల వద్ద సెల్ఫోన్లు ఉన్నప్పటికీ.. ఎటువంటి అభ్యంతరం వద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. అధికారులకు సూచించారు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే చాలని ఎస్ఈసీ తెలిపారు. Time: 12:06 PM విశాఖలో టీడీపీ దౌర్జన్యం విశాఖపట్నం: ఆంధ్రా వర్సిటీ హైస్కూల్ బూత్‌లో టీడీపీ దౌర్జన్యానికి దిగింది. ఓటింగ్ అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు గొడవ సృష్టించారు. పోలింగ్ అధికారులపై టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. మహిళలను భయాందోళనలకు గురిచేశారు. టీడీపీ నేత శ్రీ భరత్.. అక్రమంగా పోలింగ్ బూత్‌లోకి చొచ్చుకెళ్లారు. Time: 11:55 AM రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 32.23 శాతం పోలింగ్ నమోదైంది. ఎప్పటికప్పుడు మున్సిపల్ ఎన్నికల సరళిని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అధికారులు పరిశీలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. జిల్లాల వారీగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శాతం ఇలా.. కృష్ణా జిల్లా- 32.64 శాతం చిత్తూరు జిల్లా-30.12 శాతం ప్రకాశం జిల్లా-36.12 శాతం వైఎస్సార్ జిల్లా -32.82 శాతం నెల్లూరు జిల్లా-32.67 శాతం విశాఖ జిల్లా-28.50 శాతం కర్నూలు జిల్లా -34.12 శాతం గుంటూరు-33.62 శాతం శ్రీకాకుళం-24.58 శాతం తూర్పుగోదావరి-36.31శాతం అనంతపురం-31.36 శాతం విజయనగరం-31.97 శాతం పశ్చిమ గోదావరి-34.14 Time: 11:33 AM ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్ దంపతులు విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతీ పౌరుడూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా బాధ్యతతో తాను ఓటు హక్కును వినియోగించుకున్నానని ప్రజలంతా ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. Time: 11:25 AM టీడీపీ నేత కందికుంట ప్రసాద్ దౌర్జన్యం అనంతపురం: టీడీపీ నేత కందికుంట ప్రసాద్ దౌర్జన్యానికి తెరలేపారు. 29వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు ప్రలోభాలకు గురిచేస్తున్న టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులపై కందికుంట దురుసుగా ప్రవర్తించారు. సీఐ మధుసూధన్‌ను కందికుంట ప్రసాద్ దుర్భాషలాడారు. Time: 11:18 AM ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్... ఎప్పటికప్పుడు మున్సిపల్ ఎన్నికల సరళిని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అధికారులు పరిశీలిస్తున్నారు. ఎన్నికల అధికారి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రతి పోలింగ్ స్టేషన్ లో నిఘా ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఓటర్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోందన్నారు. పోలింగ్ కేంద్రాల బయట కూడా కెమెరాలు ఏర్పాటు చేశామని, ఇప్పటివరకూ ఎటువంటి సంఘటనలు లేవన్నారు. ఎక్కడ చిన్న సంఘటన జరిగినా దగ్గరలో ఉన్న ఎన్నికల, పోలీస్ అధికారులను వెంటనే అలెర్ట్ చేస్తామని ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. Time: 11:08 AM ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని, విశాఖ జిల్లా భీమిలి నేరెళ్లవలసలో అవంతి శ్రీనివాస్, వైఎస్సార్ జిల్లా కడప 29వ డివిజన్లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రకాశం జిల్లా ఒంగోలు 34వ డివిజన్లో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు. Time: 11:02 AM రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 13.23 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఇలా... కృష్ణా జిల్లా- 13 శాతం చిత్తూరు-9 శాతం ప్రకాశం-14 శాతం, వైఎస్సార్ జిల్లా- 8 శాతం నెల్లూరు జిల్లా 12 శాతం విశాఖ జిల్లా- 14 శాతం కర్నూలు జిల్లా- 11 శాతం గుంటూరు జిల్లా 16 శాతం శ్రీకాకుళం 10 శాతం తూర్పుగోదావరి- 16 శాతం పశ్చిమగోదావరి-16 శాతం అనంతపురం-12 శాతం విజయనగరం-14 శాతం Time: 10:51 AM జనసేన, టీడీపీ ఘర్షణ గుంటూరు: సత్తెనపల్లి 7వ బూత్ వద్ద జనసేన, టీడీపీ మధ్య ఘర్షణ నెలకొంది. టీడీపీ మద్దతు అభ్యర్ధి భర్తపై జనసేన కార్యకర్తల దాడి చేశారు. అయితే ఎల్లో మీడియా మాత్రం.. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు దాడికి దిగారు అంటూ దుష్ప్రచారం చేస్తోంది. టీడీపీ నేతల దౌర్జన్యం చిత్తూరు: తిరుపతి 15వ డివిజన్లో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్ సీపీ అభ్యర్ధి భర్తను దుర్భాషలాడారు. ఓటు హక్కు లేని టీడీపీ నేతలు కూడా పోలింగ్ కేంద్రానికి రావడాన్ని ప్రశ్నించడంతో ఈ విధంగా వైఎస్సార్ సీపీ నేతలపై అక్కసు వెళ్లగక్కారు. బీజేపీ నగదు పంపిణీ! తూర్పు గోదావరి: రామచంద్రపురంలో బీజేపీ అభ్యర్ధి తరఫున నగదు పంపిణీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఓటర్ లిస్ట్‌తో పాటు రూ.37వేలు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు పంపిణీ చేస్తున్న ఏడుగురిపై కేసు నమోదు చేశారు. Time: 9:57 AM రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 13.23 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోని 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం.. శ్రీకాకుళం జిల్లా: ఇచ్చాపురం-7.59 శాతం, పలాస - కాశీబుగ్గ- 10.81 శాతం, పాలకొండ- 6.74 శాతం పశ్చిమగోదావరి: జంగారెడ్డిగూడెం- 15.51 శాతం, కొవ్వూరు-17.48 శాతం, నరసాపురం- 5.51 శాతం, నిడదవోలు-13.52 శాతం కృష్ణా జిల్లా: మచిలీపట్నం- 12 శాతం, నూజివీడు-10 శాతం, పెడన- 16 శాతం, కృష్ణా: తిరువూరు-17 శాతం ప్రకాశం జిల్లా: ఒంగోలు- 14 శాతం, కనిగిరి- 16 శాతం, గిద్దలూరు-14 శాతం, చీరాల- 11 శాతం, అద్దంకి- 20.26 శాతం వైఎస్సార్ జిల్లా: కడప-4 శాతం, రాయచోటి-14 శాతం, మైదుకూరు- 15 శాతం, బద్వేల్ 12 శాతం, ప్రొద్దుటూరు- 9 శాతం కర్నూలు జిల్లా: నంద్యాల 9.8 శాతం, ఆదోని- 8.86 శాతం, ఎమ్మిగనూరు- 16.45 శాతం, డోన్-11.96 శాతం, ఆత్మకూరులో 17.51 శాతం, ఆళ్లగడ్డ- 21.28 శాతం, నందికొట్కూరు 13.39 శాతం Time: 9:21 AM ఎల్లో మీడియా దుష్ప్రచారం విజయవాడ: 8వ డివిజన్లో టీడీపీ కార్యకర్తపై దాడి అంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి భర్త దాడి చేశాడంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారానికి ఒడిగట్టింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. వారి ప్రలోభాలను వైఎస్సార్సీపీ అభ్యర్థి భర్త అడ్డుకున్నారు. Time: 9:21 AM సంతృప్తికరంగా భద్రతా ఏర్పాట్లు: ఎస్ఈసీ విజయవాడ: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారని, భద్రతా ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నానన్నారు. గతంలో కంటే ఈసారి ఓటింగ్ శాతం ఎక్కువగా చూస్తామని.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్ఈసీ పిలుపునిచ్చారు. Time: 9:12 AM ఓటు హక్కును వినియోగించుకున్న పవన్ కల్యాణ్ విజయవాడ: తూర్పు నియోజకవర్గం పటమట లంక కొమ్మా సీతారామయ్య జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పోలింగ్ బూత్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో ఎమ్మెల్యే సిద్దారెడ్డి దంపతులు, గుంటూరు హిందూ కాలేజీలో ఎమ్మెల్యే మద్దాల గిరి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. Time: 8:40 AM పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన ఎస్ఈసీ విజయవాడ: రాష్ట్రంలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఓటింగ్ సరళి పరిశీలనలో భాగంగా విజయవాడలోని బిషప్ గ్రేసి హైస్కూల్, సీవీఆర్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్‌తో కలిసి సీవీఆర్ స్కూల్లో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని కూడా ఎస్ఈసీ పరిశీలించారు. వృద్ధులు, యువకులు, మహిళా ఓటర్లతో ఆయన మాట్లాడారు. పోలింగ్, క్యూ లైన్లపై ఓటర్ల స్పందన అడిగి తెలుసుకున్నారు ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్ఈసీ విజ్ణప్తి చేశారు. ఓటు వేయడానికి 75 సంవత్సరాల టంకాశాల సుబ్బమ్మను ఆయన అభినందించారు. మీ లాంటి వారే సమాజానికి స్ఫూర్తి అని ఎస్ఈసీ అన్నారు. Time: 8:08 AM ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖపట్నం: మారుతీనగర్ పోలింగ్ బూత్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి సతీసమేతంగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి 50వ నంబర్ పోలింగ్ బూత్‌కి వచ్చిన ఎమ్మెల్యే.. గంటసేపు క్యూలో నిల్చుని ఓటు వేశారు.. Time: 7:55 AM తిరుపతిలో టీడీపీ ఏజెంట్ ఓవరాక్షన్ తిరుపతి: తిరుపతి 50వ డివిజన్లో సైకిల్ గుర్తులు ఉన్న షర్ట్ వేసుకుని వచ్చిన టీడీపీ ఏజెంట్ ధనరాజ్ ఓవరాక్షన్ చేశారు. ధనరాజ్‌ను గుర్తించిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి అనిల్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైకిల్ గుర్తుల షర్టు వేసుకొచ్చిన ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కోరారు. Time: 7:34 AM ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అనంతపురం: అనంతపురం: మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని నెహ్రూ మున్సిపల్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. విజయనగరం: కణపాక యూత్ హాస్టల్ లోని పోలింగ్ బూత్ లో విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. Time: 7:23 AM ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోని 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. Time: 7:05 AM 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేయగా.. వైఎస్సార్ జిల్లా పులివెందుల, చిత్తూరు జిల్లా పుంగనూరు, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దాంతో ఆ నాలుగు పట్టణాల్లో పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేకుండాపోయింది. ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలను యథాతథంగా నిర్వహించేందుకు హైకోర్టు అనుమతించడంతో సందిగ్ధత తొలగిపోయింది. వివిధ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏకగ్రీవమైన వార్డులు పోనూ మొత్తం 2,214 వార్డులు/డివిజన్లలో 7,549 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 77,73,231 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. జిల్లాకో నోడల్ అధికారి పర్యవేక్షణ ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ ప్రక్రియను సక్రమంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టింది. ఎన్నికలను పర్యవేక్షించేందుకు జిల్లాకు ఓ నోడల్ అధికారి చొప్పున ప్రత్యేకంగా నియమించింది. ఓటర్ల ఫొటోలతో కూడిన ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తయ్యింది. సకాలంలో పోస్టల్ బ్యాలెట్ పత్రాల జారీని పూర్తి చేసింది. పోలింగ్ నిర్వహణకు అవసమైన బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రిని పోలింగ్ సిబ్బందికి మంగళవారం పంపిణీ చేశారు. వారిని ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, టాయిలెట్లు, ఇతర సౌకర్యాలు కల్పించారు. వైద్య సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచారు. పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసింది. సున్నిత, అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉంది. మొత్తం 7,915 పోలింగ్ కేంద్రాల్లో 4,788 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వాటిలో 12 నరగపాలక సంస్థల పరిధిలో 2,468 (1,235 సున్నితమైనవి, 1,233 అత్యంత సున్నితమైనవి) ఉన్నాయి. 71 పురపాలక సంఘాలు /నగరపాలక సంస్థల పరిధిలో 2,320 (సున్నితమైనవి 1,151, అత్యంత సున్నితమైనవి 1,169) ఉన్నట్టు గుర్తించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును పర్యవేక్షించనున్నారు. సునిశిత పరిశీలనలకు మైక్రో అబ్జర్వర్లను నియమించడంతోపాటు పోలింగ్ ప్రక్రియను ఫొటోలు, వీడియోలు తీయనున్నారు. పట్టణ ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పురపాలక శాఖ కోరింది. పోలింగ్ నిర్వహణకు రూ.30 కోట్లు ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 48,723 మంది అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. వారికి పారితోషికం, ఇతర వ్యయం కోసం రూ.30 కోట్లు విడుదల చేసింది. జోనల్ అధికారులు, రూట్ అధికారులు, సెక్టోరల్ అధికారులు ఒక్కొక్కరికీ రోజుకు రూ.1,500, ప్రిసైడింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్వైజర్లకు రోజుకు రూ.350 చొప్పున చెల్లిస్తారు. పోలింగ్ అధికారులు, కౌంటింగ్ అసిస్టెంట్లకు రోజుకు రూ.250, ఆఫీసు సబార్డినేట్లకు రోజుకు రూ.150, పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాల్లో అధికారులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం, అల్పాహారం నిమిత్తం ఒక్కొక్కరికి రోజుకు రూ.150 చొప్పున చెల్లిస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
10,12 తేదీల్లో హైకోర్టుకు సెలవు
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బుధవారం(10వ తేదీ) హైకోర్టుకు సెలవు దినంగా ప్రకటించారు. అలాగే హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ, లీగల్ సర్వీసెస్ కమిటీ, మీడియేషన్, ఆర్బిట్రేషన్ సెంటర్లకు కూడా సెలవు ప్రక టించారు. దీనికి బదులుగా మే 1(శని వారం)ని పనిదినంగా నిర్ణయించారు. అలాగే శివరాత్రి మరుసటి రోజు సెలవు కావాలంటూ హైకోర్టు ఉద్యోగుల సంఘం పెట్టుకున్న వినతిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం 12వ తేదీన కూడా సెలవు ఇచ్చింది. దీనికి బదులు ఈనెల 20వ తేదీ(శనివారం)ని పనిదినంగా నిర్ణయించింది. ఈ విషయాన్ని రిజిస్ట్రార్ జనరల్ భానుమతి మంగళవారం తెలియజేశారు. -
కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన జేసీ
సాక్షి, తాడిపత్రి (అనంతపురం): అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సోమవారం ఓ కార్యకర్త చెంప చెళ్లుమనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. జేసీ ప్రభాకరరెడ్డి అనుచరులతో కలిసి మెయిన్ బజార్లో ఎన్నికల ప్రచారానికి బయలుదేరగా.. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రచారానికి గుంపుగా వెళ్లకూడదని పోలీసులు ఆయనకు చెప్పారు. అయినా వినకుండా ప్రచారం చేపట్టడంతో మార్గమధ్యంలో డీఎస్పీ వీఎన్కే చైతన్య మరోసారి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పైగా అరెస్ట్ చేస్తారా.. చేయండి అంటూ ఆవేశంతో ఊగిపోయారు. నడుచుకుంటూ కాకుండా ప్రచార వాహనంలో వెళ్లాలని పోలీసులు సూచించినా వినిపించుకోలేదు. ఇంతలో టీడీపీ కార్యకర్త రఘునాథ్‌రెడ్డి కల్పించుకుని పోలీసులు చెప్పినట్టు చేద్దాం అనడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి బండబూతులు తిడుతూ ఆయనపై పలుమార్లు చేయి చేసుకున్నారు. -
పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన జిల్లా యంత్రాంగం
-
'పుర పోరు'కు సర్వం సిద్ధం
-
బాబుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి
తాడికొండ: అమరావతిని కాపాడుకోకపోతే వేరే రాష్ట్రాలకు పోయి పాచిపని చేసుకోవాల్సి వస్తుందంటూ పేద, దళిత వర్గాల వృత్తిని కించపరిచేలా మాట్లాడిన చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలులో పెట్టాలని బహుజన పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 160వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో పలువురు నేతలు మాట్లాడారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో కులాలను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు యత్నిస్తున్న చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలకు రెచ్చిపోయిన పెయిడ్ ఆర్టిస్టులంతా రాజధాని నుంచి డ్రామా కంపెనీని వేసుకుని బయలుదేరి మహిళా దినోత్సవం పేరుతో దుర్గమ్మను అడ్డు పెట్టి కుట్రలు చేస్తుండడం సిగ్గుచేటన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 160 రోజులుగా దీక్షల్లో పాల్గొంటున్న పలువురు మహిళా సంఘాల నాయకులను శాలువాలతో ఘనంగా సత్కరించి మిఠాయిలు పంపిణీ చేశారు. -
‘వంగవీటిని హత్య చేయించిన టీడీపీని ఓడించండి’
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): వంగవీటి మోహనరంగాను హత్య చేయించిన టీడీపీని మునిసిపల్ ఎన్నికల్లో ఓడించి, వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు సుంకర శ్రీనివాసరావు కాపు కులస్తులకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎన్నడూ ప్రశ్నించని పవన్‌కల్యాణ్ ఇప్పుడు ప్రజాభిమానంతో సీఎం అయిన జగన్‌ను ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ నాయకులు జనసేనకు ఓటు వేయాలని ప్రచారం చేయడం వింతగా ఉందన్నారు. విజయవాడ అభివృద్ధి వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమన్నారు. -
హిందూపురం: బాలకృష్ణ గోబ్యాక్..
హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజున ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. సోమవారం ఆయన 21వ వార్డు మోత్కుపల్లిలో ప్రచారం నిర్వహిస్తుండగా.. స్థానికులు గోబ్యాక్ బాలకృష్ణ.. అంటూ వెనక్కు పంపించారు. సాయంత్రం 4 గంటల సమయానికి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, వైఎస్సార్సీపీ అభ్యర్థి మారుతీరెడ్డిల ప్రచారానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే బాలకృష్ణతో పాటు స్థానిక టీడీపీ నాయకులు గత ఆదివారం ఇదే ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. తిరిగి సోమవారం సాయంత్రం అక్కడికి చేరుకోవడంతో స్థానికులతో పాటు వైఎస్సార్సీపీ వారు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీకి కేటాయించిన సమయంలో మీరెలా ప్రచారానికి వస్తారని నిలదీశారు. గోబ్యాక్ బాలకృష్ణ.. జై జగన్.. అంటూ నినదించారు. ఈ సందర్భంగా వైఎస్సా ర్సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు సర్దిచెప్పారు. బాల కృష్ణ ప్రచారానికి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు. -
సభ్యత మరిచి బాబు వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ అస భ్యంగా మాట్లాడుతూ ప్ర జలను రెచ్చగొడుతున్నా రని వైఎస్సార్సీపీ ఎమ్మె ల్యే జోగి రమేష్ ధ్వజమెత్తారు. ఇంగితజ్ఞానం లేకుండా పిచ్చికుక్కల్లా వ్యవహరిస్తూ ప్రజలపైనా, సీఎం జగన్‌పైనా నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా వారిద్దరూ సభ్యతగా నడుచుకోవాలని హితవు పలికారు. స్థానిక ఎన్నికల్లో ఎదురవుతున్న ఓటమిని తట్టుకోలేక చంద్రబాబు, లోకేశ్ మతిస్థిమితం కోల్పోయారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రానికి తండ్రీకొడుకు విషపురుగుల్లా తయారయ్యారని నిప్పులు చెరిగారు. కరోనా ఫస్ట్ వేవ్‌లో ఇద్దరూ ఏపీ వదిలి పారిపోయారని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో దేశం వదిలిపోయే పరిస్థితి వారికి వస్తుందని జోస్యం చెప్పారు. 2019 ఎన్నికలు, ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో తగిన శాస్తి జరిగినా వారి బుద్ధి మారలేద ని ధ్వజమెత్తారు. సీఎంను ఉద్దేశించి ఏం పీకుతావ్ అని అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎంత దిగజారిపో యారో వారి మాటలను బట్టే అర్థమవుతోందన్నారు. చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉండి ఏం పీకలేకపోయారని, అందుకే గత ఎన్నికల్లో ప్రజలు వారిని కలుపుమొక్కల్లా పీకేశారని ఎద్దేవా చేశారు. మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ వందశాతం విజయదుందుభి మోగిస్తుందన్నారు. విజయవాడలో ఇప్పటికే టీడీపీ నిట్టనిలువుగా చీలిపోయిందని ఆయన చెప్పారు. -
బీసీలకే విశాఖ మేయర్ పీఠం
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని వైఎస్సార్ సీపీ బీసీలకే కేటాయించిందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ప్రకటించారని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో 80కి పైగా వార్డులను వైఎస్సార్సీపీ గెలవడం ఖాయమని చెప్పారు. మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌లతో కలిసి సోమవారం విశాఖలో పలు వార్డుల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విశాఖను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. విశాఖ అభివృద్ధి కోరుకునే వారంతా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీడీపీ పాలనంతా గ్రాఫిక్‌లు, అబద్ధాల మయమని, బాబుకు ఉన్న సినిమాల పిచ్చినంతా.. పాలనలో ఉపయోగించాడే తప్ప ప్రజల యోగ క్షేమాలను పట్టించుకోలేదని అన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన భూదోపిడీని, ముఖ్యంగా విశాఖలో జరిగిన భూ కుంభకోణాలను ప్రజలు మరిచిపోలేదని అన్నారు. తెలుగు దోపిడీ దొంగలను తరిమికొట్టాలి తెలుగు దోపిడీ దొంగలైన చంద్రబాబు, ఆయన తనయుడిని పురపాలక ఎన్నికల్లో ఘోరంగా ఓడించి ఏపీ నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పంచాయతీల్లో పది శాతం కూడా టీడీపీ గెలవలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్నిపల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైఎస్సార్సీపీ గెలవనుందని చెప్పారు. తన అనుకూల మీడియా ద్వారా సర్వేలు చేయించుకున్న చంద్రబాబు ఓడిపోతామని తెలిసి విశాఖకు పరిగెత్తుకుంటూ వచ్చారని తెలిపారు. గత ఐదేళ్లలో విశాఖకు చేసిన ఒక పనైనా చెప్పారా? చెప్పడానికి ఏమీ లేక హుద్‌హుద్ సమయంలో బస్సులో ఉన్నాను.. బస్సులో తిన్నాను.. అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విశాఖకు ఏమీ చేయలేని వాడివి.. జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ గెలిచి విశాఖకు ఏమిచేస్తావు చంద్రబాబూ అని విమర్శించారు. -
సంక్షేమ ప్రభుత్వాన్ని దీవించండి
సాక్షి, అమరావతి: ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ప్రజా సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. ఓటమి భయంతో ప్రజలను అవమానిస్తున్న టీడీపీకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరముందని పేర్కొంది. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ వంద శాతం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పాలన అందిస్తున్న జగన్‌ను ప్రజలు శాశ్వతంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. 20 నెలల్లోనే ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా సుపరిపాలన అందించిన జగన్‌ను ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే... ప్రజలనే అవమానిస్తావా బాబూ! ఓటమి భయంతో చంద్రబాబులో ఉక్రోషం తారస్థాయికి చేరింది. ఇష్టమెచ్చినట్టు మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. పాచి పనులు చేసుకోడానికి వెళ్లే ప్రజలు అమరావతి కోసం ఏమీ చేయడం లేదంటున్నాడు. ప్రజలకు రోషం లేదంటున్నాడు. సిగ్గూ ఎగ్గూ లేదని ప్రజలను ఘోరంగా అవమానిస్తున్న చంద్రబాబుకు ఈ ఎన్నికల్లోనూ తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబుకు ప్రజలతో ఎప్పుడూ సంబంధం లేదు. మామను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడు. ప్రతి ఎన్నికల్లోనూ వేరే వాళ్లతో పొత్తు పెట్టుకుని, వాళ్లను మింగేసి అధికారంలోకి వచ్చాడు. అసలు అధికారం ఈయన సొత్తు అనుకుంటున్నాడా. శాశ్వతంగా ప్రజలు ఈయనకు బానిసలుగా ఉండాలనుకుంటున్నాడా. 2019 ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా.. చంద్రబాబు ఆయన కొడుకు ప్రజలు, సీఎంపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు పీకడానికి చంద్రబాబు దగ్గరేముంది. జనమే ఎప్పుడో వాళ్లను పీకేశారు. చంద్రబాబును ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితి లేదు. అందుకే కనీసం ఆ పార్టీ తరఫున నామినేషన్లు వేసేందుకే ఎవరూ ముందుకు రావడం లేదు. వైఎస్ జగన్ 21 నెలల కాలంలోనే ప్రజల నుంచి వంద శాతం మార్కులు సంపాదించారు. అవినీతి రహిత, పారదర్శక పాలనను ప్రజల ముంగిటికు తీసుకెళ్లారు. ఆయన పథకాలు 95 శాతం ప్రజల జీవితాలను తాకాయి. ఆ స్పర్శతో ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపిస్తే జగన్ పథకాలు, ఆశయాలు మరింత ముందుకెళ్తాయి. రిపబ్లిక్ టీవీపై చట్టపరమైన చర్యలు వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసిన కథనాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. తప్పుడు కథనం ప్రసారం చేసినందుకు ఆ చానల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. పొగ, నిప్పు ఏదీ లేకుండానే ఇలా తప్పుడు కథనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం దురుద్దేశపూరితమేనన్నారు. నిజానికి ఆ టీవీ కథనాన్ని పట్టుమని పదిమంది కూడా ఏపీలో చూసి ఉండకపోవచ్చు కానీ, ఎన్నికల వేళ ఇలాంటి ప్రచారం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా జనంలో ఊపు ఎలా ఉందో అందరికీ తెలిసిందేనని, వాతావరణం ఎంత సానుకూలంగా ఉందో అందరూ చూస్తూనే ఉన్నారని తెలిపారు. దీని వెనుక చంద్రబాబు హస్తం ఇలాంటి తప్పుడు కథనాల వెనుక చంద్రబాబు ఉన్నాడా అనే అనుమానాన్ని సజ్జల వ్యక్తం చేశారు. ఆ చానల్ అధినేత ఆర్నబ్ గోస్వామి గురువు చంద్రబాబేనని సందేహించాల్సి వస్తోందన్నారు. రిపబ్లిక్ టీవీ ఇప్పటికే విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. ప్రజలకు అనుమానం రాకూడదనే ఉద్దేశంతో తామీ స్పష్టత ఇవ్వాల్సి వస్తోందన్నారు. అసలు తిరుగుబాటు సంకేతాలు టీడీపీలోనే కనిపిస్తున్నాయని, ఆ పార్టీ నేతలంతా ప్రస్ట్రేషన్‌తో ఊగిపోతున్న తీరే దీనికి నిదర్శనమన్నారు. ఇలాంటి వాస్తవ పరిస్థితిని వదిలేసి తప్పుడు కథనాలు రాయడం ఏమిటని ప్రశ్నించారు. కనీసం తమ ఎంపీలను సంప్రదించి నిజం తెలుసుకుంటే బాగుండేదన్నారు. ఇలాంటి పెయిడ్ ప్రచారాల వెనుక రాష్ట్రంలో ఎవరున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. -
పరుష పదజాలం.. ప్రజలపై ప్రతాపం
సాక్షి, గుంటూరు: ‘మీకు సిగ్గు, రోషం లేదా. గుంటూరు కారం తిన్న పౌరుషం ఏమైంది. యువతలో చేవ చచ్చిపోయిందా’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు పరుష పదజాలంతో ప్రజలు, యువతపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరులో సోమవారం ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుంటూరు ప్రజలు బతికున్నా బతికున్నట్టు కాదని, సిగ్గుంటే వైఎస్సార్సీపీ జెండా పట్టుకుని తిరుగుతారా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. తాను సీఎం అయ్యాక పోలీసులు నమోదు చేసిన కేసులన్నింటినీ సమీక్షిస్తానన్నారు. అమరావతి కోసం మీరు రావడం లేదు అమరావతి కోసం రాజధాని ప్రాంతంలో ఆందోళనలు జరుగుతుంటే గుంటూరు ప్రజలు ఏం పట్టనట్టు ఉన్నారంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ‘అమరావతి రాజధాని కోసం గుంటూరు ప్రజలు ఏం చేశారు. మీకు రోషం, కసి ఉందా. ఉంటే ఎందుకు అమరావతి ఆందోళనలను పట్టించుకోవడంలేదు’ అని ప్రశ్నించారు. గుంటూ రు కార్పొరేషన్‌ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటే రాజధాని వికేంద్రీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని తెలిపారు. మునిసిపల్ ఎన్నికల్లో అమరావతి, ప్రజా వ్యతిరేకతే టీడీపీ అజెండా అని చెప్పారు. -
నిబంధనల మేరకే నామినేషన్ల ఉపసంహరణ
సాక్షి, అమరావతి: తమకు తెలియకుండా తమ సంతకాలను ఫోర్జరీ చేసి నామినేషన్లను ఉప సంహరించారని, అందువల్ల తమ డివిజన్లలో ఎన్నికలను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18 డివిజన్లకు చెందిన టీడీపీ అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వ లేదు. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. అంతకు ముందు ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ స్పందిస్తూ.. పిటిషనర్లకు సంబంధించిన ప్రతిపాదితులే వారి నామినేష న్లను ఉపసంహరించారని తెలిపారు. అందు వల్ల ఈ వ్యాజ్యంలో పిటిషనర్లు కోరినట్లుగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ జోక్యం చేసుకుని.. ఈ 18 డివిజన్లలో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారు లు ఫారం–10 జారీచేశారని తెలిపారు. తిరుపతి 7వ డివిజన్‌పై విచారణ వాయిదా తిరుపతి 7వ డివిజన్ ఎన్నికల నిలిపివేతను సవాలు చేస్తూ ఆ డివిజన్లో నామినేషన్ వేసిన సుజాత దాఖలు చేసిన వ్యాజ్యంపై తదుపరి విచారణను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఈనెల 15కి వాయిదా వేశారు. -
‘ఏలూరు’ ఎన్నికలకు బ్రేక్
సాక్షి, అమరావతి: ఏలూరు నగరపాలక సంస్థ పాలకవర్గ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ నెల 10న జరగాల్సిన ఎన్నికపై స్టే విధించిన హైకోర్టు ఓటర్ల జాబితాలో తప్పులను సవరించే వెసులుబాటును అధికారులకు కల్పించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తుది ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున తప్పులున్నాయని, అభ్యంతరాలను స్వీకరించకుండానే తుది ఓటర్ల జాబితాను ప్రచురించారంటూ టీడీపీ నేత ఎస్వీ చిరంజీవి, మరికొందరు గత ఏడాది హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఓటర్ల జాబితాలో కుక్క ఫొటో ముద్రించడంపై మండిపడుతూ పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఓటర్ల జాబితాలో తప్పులను సవరించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ గత ఏడాది మార్చి 5న తీర్పునిచ్చారు. ఈ తీర్పును అధికారులు అమలు చేయలేదంటూ చిరంజీవి, మరో 33 మంది హైకోర్టును ఆశ్రయించగా.. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు సోమవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రకటించిన తరువాత నిబంధనల ప్రకారం పబ్లిక్ నోటీసులు ఇచ్చి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించలేదని, తుది ఓటర్ల జాబితా తయారీ విషయంలో నిబంధనలు పాటించలేదని ఆక్షేపించారు. గత ఏడాది హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో వందలాది ఓటర్ల ఇంటి నంబర్లు 000గా చూపారని, అనేక మంది ఓటర్ల పేర్లు తప్పుగా ఉన్నాయని తెలిపారు. న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వుల అమలును వాయిదా వేయడానికి వీల్లేదని, కోర్టు ఉత్తర్వులను అమలు చేసి తీరాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఎవరు ఎంత పెద్ద వారైనా, చట్టం వారి కంటే పెద్దదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. తప్పులు లేని ఓటర్ల జాబితా ఎన్నిక ప్రక్రియకు పునాది అని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. చట్టం నిర్దేశించిన విధంగా ఓటర్ల జాబితా తయారు చేయకపోవడాన్ని కేవలం సాంకేతిక లోపంగా మాత్రమే చూడలేమన్నారు. ఓటర్ల జాబితా సక్రమంగా లేదని కోర్టు తేల్చిన తరువాత దానిని సరిచేయకుండా ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. ఎన్నికను వాయిదా వేయడం వల్ల కలిగే కష్టం కంటే, ఓటర్ల జాబితాను సవరించడం వల్లే కలిగే ప్రజోపయోగమే ప్రధానమైనదని తెలిపారు. ఈ కారణాలతో ఏలూరు నగరపాలక సంస్థ పాలకవర్గ ఎన్నికలపై స్టే విధిస్తున్నట్టు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
'పుర పోరు'కు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో 12 నగర పాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో బుధవారం పోలింగ్ నిర్వహించేందుకు పురపాలక శాఖ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేశాయి. అయితే, ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలను నిలుపుదల చేస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేయడంతో అక్కడ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. అయితే, కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని, బుధవారం ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని కోరుతూ పురపాలక శాఖ మంగళవారం హైకోర్టును ఆశ్రయించనుంది. తదుపరి ఉత్తర్వులను అనుసరించి అక్కడ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటారు. ఇదిలావుండగా.. మునిసిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహిస్తారు. భారీగా ఏకగ్రీవాలు.. ఏలూరు సహా 12 నగరపాలక సంస్థల్లో 671 డివిజన్లు, 75 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో 2,123 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నామినేషన్లు స్వీకరించింది. కాగా, ఈ సారి గణనీయంగా వార్డులు ఏకగ్రీవమయ్యాయి. నగరపాలక సంస్థల్లో 89 డివిజన్లు, పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో 490 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని వార్డులూ ఏకగ్రీవం కావడం విశేషం. నగర పాలక సంస్థల పరిధిలో 582 డివిజన్లు, పురపాలక సంఘాల పరిధిలో 1,633 వార్డులకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అదృష్టం పరీక్షించుకోనున్న 7,552 మంది అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మునిసిపల్ ఎన్నికల్లో మొత్తం 7,552 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో నగరపాలక సంస్థల పరిధిలో 2,571 మంది, పురపాలక సంఘాలు/నగర పంచాయతీల పరిధిలో 4,981 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 78,71,272 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. వారిలో పురుషులు 38,72,264 మంది కాగా.. మహిళలు 39,97,840 మంది, ఇతరులు 1,168 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో నగరపాలక సంస్థల పరిధిలో 48,31,133 మంది ఉండగా, పురపాలక సంఘాలు/నగర పంచాయతీల పరిధిలో 30,40,139 మంది ఉన్నారు. 7,915 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు రాష్ట్రవ్యాప్తంగా 7,915 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వాటిలో నగరపాలక సంస్థల పరిధిలో 4,626 ఉండగా పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో 3,289 ఉన్నాయి. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 4,788 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. 2,468 కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించగా.. 2,320 పోలింగ్ కేంద్రాలు అతి సున్నితమైనవిగా గుర్తించారు. 48,723 మంది పోలింగ్ సిబ్బంది ఒక్కో పోలింగ్ కేంద్రానికి 1+4 చొప్పున పోలింగ్ సిబ్బందిని కేటాయించారు. వారిలో ఒక ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారితోపాటు ఇతర పోలింగ్ సిబ్బంది ముగ్గురు ఉన్నారు. వారితోపాటు రూట్ అధికారులు, జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లను నియమించారు. మొత్తం మీద 48,723 మంది ఉద్యోగులను పోలింగ్ నిర్వహణ కోసం కేటాయించారు. పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలట్ పత్రాలు, ఇతర మెటీరియల్‌ను ఆయా పట్టణాల్లోని పంపిణీ కేంద్రాలకు తరలించారు. అక్కడి నుంచి మంగళవారం ఉదయం నుంచి పోలింగ్ అధికారులు, సిబ్బందికి వాటిని అందజేస్తారు. పోలింగ్ అధికారులు, సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు బస్సులు, ఇతర వాహనాలను ఏర్పాటు చేశారు. ‘ఏలూరు’ ఎన్నికపై నేడు స్పష్టత ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లు ఉండగా.. మూడు డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 47 వార్డులకు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా, ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఎన్నికలను నిలుపుదల చేస్తూ తీర్పు వెలువరించింది. కాగా, కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని, బుధవారం పోలింగ్‌ను యథాతథంగా నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ పురపాలక శాఖ మంగళవారం హైకోర్టును ఆశ్రయించనుంది. కోర్టు అనుమతిస్తే ముందుగా నిర్ణయించిన ప్రకారం ఏలూరు సహా 12 నగర పాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. -
టీడీపీతో జనసేన చెట్టపట్టాల్
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లోనూ ‘పంచాయతీ’కి మించి దారుణ ఓటమి తప్పదని పసిగట్టిన టీడీపీ కనీసం పరువైనా కాపాడుకునేందుకు జనసేన పార్టీతో రహస్య ఒప్పందం కుదుర్చుకుంది. స్థానికంగా అవకాశం ఉన్న ప్రతి చోటా ఆ పార్టీతో కలిసి పనిచేస్తోంది. ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేకపోవడం, కొన్ని చోట్ల పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువవడంతో జనసేనతో అక్రమ బంధానికి టీడీపీ తెరతీసింది. పలు కార్పొరేషన్లలో టీడీపీ నేతలు బహిరంగంగానే జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. వారికి అవసరమైన ఆర్థిక ఆసరాను అందిస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశంతోనే జనసేన నేతలతో కలిసి పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుతం బీజేపీతో కలసి ప్రయాణం సాగిస్తున్నట్లు ప్రకటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన భాగస్వామ్య పార్టీని వదిలేసి టీడీపీతో తెరచాటు పొత్తులకు తెర తీయడం గమనార్హం. తెరపై బీజేపీ నేతలతో కనిపిస్తూ తరచూ ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపే ఆయన టీడీపీతో అనైతిక పొత్తులకు తలుపులు తెరవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. బెజవాడలో బయటపడ్డ బాగోతం విజయవాడ కార్పొరేషన్ 15వ డివిజన్లో జనసేన అభ్యర్థి గాదిరెడ్డి ఝాన్సీలక్ష్మి కోసం టీడీపీ అభ్యర్థి బేతి లక్ష్మి పోటీ నుంచి తప్పుకున్నారు. ఇందుకు ప్రతిఫలంగా జనసేన తూర్పు నియోజకవర్గంలోని పదికిపైగా డివిజన్లలో టీడీపీ అభ్యర్థులకు మద్దతిచ్చింది. కొన్ని డివిజన్లలో డమ్మీ అభ్యర్థులను నిలపగా కొన్నిచోట్ల పోటీలో ఉన్న అభ్యర్థులు బయటకు రాకుండా టీడీపీకి సహకరిస్తున్నారు. 15వ డివిజన్లో జనసేన అభ్యర్థికి ఓటేయాలని టీడీపీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ ఆదివారం ప్రచారం చేయడం ఈ రెండు పార్టీల అపవిత్ర పొత్తును బట్టబయలు చేసింది. జనసేన కోసం 34వ డివిజన్లో టీడీపీ సీనియర్ నాయకుడు కొట్టేటి హనుమంతరావు భార్యను ఎంపీ కేశినేని నాని పోటీ నుంచి తప్పించి డమ్మీ అభ్యర్థికి బీ ఫారం ఇచ్చారు. కొట్టేటి దీనిపై కేశినేని కార్యాలయం వద్ద ధర్నాకు దిగి జనసేనకు లబ్ది చేకూర్చడానికి తనను బలి చేస్తారా? అని ఇటీవల నిలదీశారు. ఇలా విజయవాడ కార్పొరేషన్లో టీడీపీ–జనసేన అనుబంధం కొనసాగుతోంది. గోదారిలో చీకటి పొత్తులు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జనసేన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కార్పొరేషన్లో నాలుగు డివిజన్లను జనసేనకు వదిలేసిన టీడీపీ మిగిలిన చోట్ల తమకు మద్దతిచ్చేలా ఆ పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప నేరుగా జనసేనతో చీకటి పొత్తు కుదుర్చుకున్నారు. మున్సిపాల్టీలో 27 వార్డులకు 10, 12 వార్డులను జనసేనకు కేటాయించి మిగిలిన వార్డుల్లో ఆ పార్టీ తమకు మద్దతిచ్చేలా మాట్లాడుకున్నారు. నామినేషన్లకు ముందే అవగాహన రాష్ట్రవ్యాప్తంగా అవకాశం ఉన్న ప్రతిచోటా రెండు పార్టీలు లోపాయకారీగా ఒప్పందం కుదుర్చుకుని పనిచేస్తున్నాయి. నామినేషన్లకు ముందే ఆయా నియోజకవర్గాలకు చెందిన రెండు పార్టీల నేతలు ఒక అవగాహనకు వచ్చి ఏ వార్డులు, డివిజన్లలో ఎవరు పోటీ చేయాలి? ఎక్కడ ఎవరికి మద్దతు ఇవ్వాలో నిర్ణయించుకున్నారు. చాలా మున్సిపాల్టీల్లో జనసేనకు ఒకటి రెండు వార్డులు కేటాయించి మిగిలిన చోట్ల తమకు మద్దతిచ్చేలా, ఆ పార్టీ ఓట్లు తమకు వేయించేలా మాట్లాడుకున్నారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఎక్కువ చోట్ల ఈ సూత్రం కింద రెండు పార్టీల నేతలు పనిచేస్తున్నారు. జనసేన తరఫున ఎవరూ పోటీ చేసే పరిస్థితి లేకపోయినా ఏదో ఒక వార్డు కేటాయించి అన్నీ తామే సమకూర్చి టీడీపీ నేతలు పోటీకి దించినట్లు చెబుతున్నారు. ఇందుకు ప్రతిగా మిగిలిన డివిజన్లలో ఆ పార్టీ స్థానిక నేతలను తమకు మద్దతుగా తిప్పుకుంటున్నారు. విజయవాడ లాంటి చోట్ల జనసేన అభ్యర్థులు ఎక్కువ డివిజన్లలో పోటీ చేసినా టీడీపీతో ఒప్పందం మేరకు సైలెంట్ అయిపోయినట్లు చెబుతున్నారు. చదవండి: నరసాపురంలో బహిరంగంగానే... -
పుర ప్రచారం నేటితో సమాప్తం
సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారం ముగియనుంది. రాష్ట్రంలో 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. వీటిలో పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని వార్డులు ఏకగ్రీవమవ్వడంతో అక్కడ పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు. మిగిలిన నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో ఈ నెల 10న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. -
పాచి పనులకు పోతారా?
సాక్షి, అమరావతి బ్యూరో/చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): అమరావతి కోసం విజయవాడ ప్రజలు ముందుకు రావడం లేదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. బెంగళూరో, చెన్నైకో పాచి పనులు చేసుకోవడానికి పోతారు గానీ అమరావతిని కాపాడుకోవడానికి సిద్ధంగా లేరంటూ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన విజయవాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో రోడ్డు షో చేపట్టారు. ఆ వివరాలివీ.. మిమ్మల్ని ఏమనాలో..!! ‘పట్టిసీమ నీళ్లు తాగేవాళ్లకు అర్థం కాదా? ఈ పట్టిసీమ నా కోసం తెచ్చానా? అమరావతిని నా కోసం కట్టానా? ఈ ప్రాంతం కోసం.. మిమ్మల్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ఈరోజు నేను ఓట్లడగాలా మిమ్మల్ని? వాళ్లకే (వైఎస్సార్సీపీ అభ్యర్థులకే) ఓటేసి ఆ తర్వాత ఊడిగం చేయండి.. నామీద అభిమానం అక్కర్లా. అవినీతి కంపుకొడుతుంటే మీరు ఇంట్లో ఆనందంగా పడుకోండి’ అంటూ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ‘మన పార్టీలో ఫ్రీడం ఎక్కువైంది. కంట్రోల్ చేస్తా.. దీనిపై మాట్లాడకపోతే నేను భయపడినట్లుంటుంది’ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు చెప్పింది కాకుండా మోసం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని జాడ లేకుండా పోయారు. ప్రజలను బెదిరిస్తున్న చంద్రబాబు తొలుత భవానీపురంలో ప్రచార రథంపైకి చంద్రబాబుతో పాటు బుద్దా, బోండాలు ఎక్కారు. ‘మీరు వెనక్కి వెళ్లండి.. జనం వాళ్లను (అభ్యర్థులు) చూస్తే నాలుగు ఓట్లేస్తారు. నాయకులు ముందుంటే కష్టాలొస్తాయి ’ అని చంద్రబాబు వ్యాఖ్యానించడంతో వారిద్దరూ ప్రచార రథం దిగి వెళ్లిపోయారు. కాగా, ఎన్నికల ప్రచార సమయం ముగిసినా చంద్రబాబు ఆదివారం రాత్రి ర్యాలీ నిర్వహించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి రాత్రి 9.57 గంటలకు చుట్టుగుంట వద్ద తూర్పు నియోజకవర్గంలోకి ప్రవేశించి అక్కడ ప్రసంగించారు. రాత్రి 10 తర్వాత కూడా తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండటంతో పోలీసులు అభ్యంతరం వ్యక్తంచేశారు. కొద్దిసేపు ససేమిరా అన్న చంద్రబాబు ఆ తర్వాత కారులోకి వెళ్లిపోయారు. కానీ, ముందుగా నిర్ణయించిన రూట్లోనే ర్యాలీగా కొనసాగారు. బైక్ ర్యాలీ నిర్వహించడం సరికాదని పోలీసులు చెప్పినా లెక్కచేయలేదు. చివరకు రాత్రి 11.08కి చంద్రబాబు తాడేపల్లికి బయల్దేరారు. -
ప్రజలపై అక్కసు.. చంద్రబాబు శాపనార్థాలు
సాక్షి, విజయవాడ: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మరోసారి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అసహనంతో ఊగిపోయారు. ఎన్నికల ప్రచారంలో ఆయన అక్కసు వెళ్లగక్కారు. టీడీపీకి ఓట్లు వేయలేదని ఉక్రోశంతో ప్రజలను దూషించారు. కోపం రాదా? రోషం రాదా? అంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. పాచి పనులు చేసేందుకు హైదరాబాద్, బెంగళూరు వెళ్లండంటూ ప్రజలకు చంద్రబాబు శాపనార్ధాలు పెట్టారు. ఓటు వేసేందుకు డబ్బులు తీసుకుని ఊడిగం చేయండంటూ ప్రజలను దూషించారు. చంద్రబాబు తీరుపై ప్రజలు విస్తుపోయారు. ఆయన వ్యాఖ్యలపై విజయవాడ స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ప్రజలు బరితెగించాలి’’ అంటూ శనివారం విశాఖలో రోడ్‌షోలో చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. ‘‘ఏం పీకుతావ్.. గడ్డిపీకుతావా.. నీ అబ్బ జాగీరా..’’ అంటూ తిట్ల వర్షం కురిపించారు. పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఒకవైపు.. మున్సిపల్ ఎన్నికల్లోనూ పరాజయం తప్పదన్న వాస్తవం మరోవైపు చంద్రబాబులో తీవ్ర అసహనానికి కారణమవుతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. విశాఖ, విజయవాడలో మాత్రమే కాదు.. గత కొద్ది రోజులుగా చంద్రబాబు ఇలానే అదుపు తప్పి మాట్లాడుతున్నారు. చదవండి: విశాఖ రోడ్‌షోలో చంద్రబాబు విచిత్రమైన పిలుపు ‘హెరిటేజ్ అంతా పాపాల పుట్ట’ -
'రాసలీలలు చేసే లోకేష్‌కు విమర్శించే హక్కు లేదు'
సాక్షి, ప్రకాశం: విదేశాల్లో రాసలీలలు చేసే లోకేష్‌కు తనను విమర్శించే హక్కు లేదని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. ''లోకేష్ ఒక దరిద్రుడు.. చంద్రబాబు ఒక నీచుడు. చంద్రబాబు, లోకేష్ ఇక్కడ దోచుకుని విదేశాల్లో దాచుకుంటున్నారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని లోకేష్ నాపై మాట్లాడటం సిగ్గుచేటు. ప్రత్తిపాటితో కలిసి లోకేష్ పేకాట క్లబ్ నడిపిన విషయం ప్రజలకు తెలుసు. నేను కులాలు చూడలేదు.. కమ్మవారికి కూడా కార్పొరేషన్లో టికెట్ ఇచ్చా. టీడీపీ వారు వ్యక్తిగత సమస్యలపై నా వద్దకు వస్తే పరిష్కరించా. ఒంగోలు అభివృద్ధిపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. గతంలో ఒంగోలును అభివృద్ధి చేశా.. ఇప్పుడూ చేస్తున్నా. టీడీపీ ఇన్ఛార్జ్ దామచర్ల జనార్ధన్ బాగోతం అందరికీ తెలుసు. నాకు సంస్కారం ఉంది కాబట్టి.. వ్యక్తిగత విమర్శలు చేయను. దామచర్ల జనార్ధన్ అప్పులు ఎగ్గొడితే.. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కరోనా సమయంలో ఒంగోలులో రూ.కోటి సొంత డబ్బు ఖర్చు చేశా. రోడ్లు మీద రోడ్లు వేసి టీడీపీ నేతలు దోచుకున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చూస్తే.. కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారు. కుప్పంలో చంద్రబాబుకు పట్టిన గతే.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రిపీట్ అవుతుంది'' అంటూ పేర్కొన్నారు. చదవండి: ఇక టీడీపీ చాప్టర్ క్లోజ్: విజయసాయిరెడ్డి లెక్కలు తప్పులైతే ముక్కు నేలకు రాస్తా.. -
ఇక టీడీపీ చాప్టర్ క్లోజ్: విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడినా జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ విజయం సాధిస్తుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల తరువాత టీడీపీ చాప్టర్ క్లోజ్ అవుతుందన్నారు. పురపాలక, కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్కచోట కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం 85 నుంచి 90 శాతం స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పారు. చంద్రబాబు ఎన్ని మాయమాటలు, అబద్ధాలు చెప్పినప్పటికీ ప్రజలు విశ్వసించే అవకాశం లేదన్నారు. చంద్రబాబు సినిమాకు ప్రజలు ముగింపు పలకబోతున్నారని చెప్పారు. వాళ్లిద్దరూ రాబందులు చంద్రబాబు, అతని కొడుకు పప్పునాయుడు రాబందులని ఘాటుగా విమర్శించారు. టీడీపీ హయాంలో పరిశ్రమలు, హౌసింగ్, ఇతరత్రా పేరు మీద భూములను తమ అనుయాయులకు దోచిపెట్టారని ఆరోపించారు. భూ దందాలు, ఆక్రమణలు, దొంగతనంగా భూములు రాయించుకోవడం వంటి దుర్మార్గాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. అందుకే టీడీపీకి దొంగల పార్టీగా ముద్ర పడిందని పేర్కొన్నారు. పెద్దల రూపంలో ఉన్న భూకబ్జాదారులకు మేలు చేసే ఈ ముఠా విశాఖను ఛిద్రం చేసిందన్నారు. ఈ ముఠా చెరబట్టిన భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుంటే చంద్రబాబు, అతని కొడుకు లోకేశ్ తట్టుకోలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాబందులను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని విజయసాయిరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఏ మొహం పెట్టుకుని విశాఖలో తిరుగుతున్నాడు విశాఖను రాజధాని కాకుండా అడ్డుకుంటూ విశాఖపై విష ప్రచారం చేస్తున్న చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని నగరంలో పర్యటిస్తున్నారని విజయసాయిరెడ్డి ప్రశి్నంచారు. ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు, లోకేశ్‌లను ప్రజలు తరిమికొట్టే సమయం వచి్చందన్నారు. వీరు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ విశాఖ కార్యనిర్వాహక రాజధాని అవడం ఖాయమని పునరుద్ఘాటించారు. ప్రశాంత వాతావరణంతో అందమైన నగరంగా విశాఖను తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని స్పష్టం చేశారు. -
అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గెలుచుకుంటాం
సాక్షి, అమరావతి: పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలంతా సీఎం వైఎస్ జగన్ సుపరిపాలనకు మద్దతు పలికి 80 శాతానికి పైగా గ్రామాల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులను గెలిపించారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ గుర్తులతో జరిగే మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో అంతకుమించిన ఫలితాలను వైఎస్సార్సీపీకి కట్టబెట్టబోతున్నారన్నారు. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో టీడీపీ నాలుగైదు డివిజన్లలో కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు. కుప్పం దెబ్బకు బాబు చిన్న మెదడు చితికింది: కొడాలి కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టిన దెబ్బకు చంద్రబాబు చిన్న మెదడు చితికిందని, పప్పుగా పేరొందిన లోకేశ్‌కు మతి తప్పిందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు విషయంలో మోదీని ప్రశ్నించలేక సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. బాలకృష్ణకు రాష్ట్రంలో పరిస్థితులు తెలియవని, చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప ఏమీ చేయలేడన్నారు. చంద్రబాబుకు పిచ్చి పరాకాష్టకు చేరింది: ఎమ్మెల్యేలు చంద్రబాబుకు పిచ్చి పరాకాష్టకు చేరిందని ఎమ్మెల్యే జోగి రమేష్ విమర్శించారు. టీడీపీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. బీజేపీ నేత సోము వీర్రాజు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అతని కథ ఎక్కువైందని, కాస్త తగ్గించుకుంటే ఆరోగ్యకరమని సూచించారు. చంద్రబాబు తామిచ్చిన ఇళ్ల స్థలాల గురించి మాట్లాడే ముందు తానేం చేసాడో గుర్తుంచుకోవాలన్నారు. బాబు ఒక ఫెయిల్యూర్ సీఎం అని, టిడ్కో ఇళ్లను చూస్తేనే ఆయన ఫెయిల్యూర్ అర్థం అవుతుందని తెలిపారు. సమష్టిగా ముందుకు సాగాలి: సజ్జల, పెద్దిరెడ్డి అంతకుముందు వైఎస్సార్సీపీ కార్యాలయంలో కృష్ణా జిల్లా మున్సిపల్ ఎన్నికలపై పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. నాయకులంతా ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ సమష్టిగా ప్రచారంలో దూసుకుపోవాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకుని వారికి దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో వెలంపల్లి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, వల్లభనేని వంశీ, నాయకులు దేవినేని అవినాష్, కడియాల బుచ్చిబాబు, పడమట సురేష్‌బాబు, బొప్పన భవకుమార్, పండుగాయల రత్నాకర్ పాల్గొన్నారు. -
రాత్రి మందు తాగి.. పగలు ప్రజల్ని కొట్టడం
సాక్షి, అనంతపురం: టీడీపీ అభిమానిపై ఎమ్మెల్యే బాలకృష్ణ చేయి చేసుకోవడాన్ని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఖండించారు. శనివారం అనంతపురంలోని 25వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాస్‌కు మద్దతుగా గోరంట్ల మాధవ్, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ప్రచారం నిర్వహించారు. ఎంపీ మాధవ్ మాట్లాడుతూ.. రాత్రి మందు తాగడం.. పగలు ప్రజలను కొట్టడం ఎమ్మెల్యే బాలకృష్ణకు మామూలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి ఓటేసిన పాపానికి అభిమానులు శిక్ష అనుభవించాలా అని ప్రశ్నించారు. చదవండి: (మరోసారి అభిమాని చెంప ఛెళ్లుమనిపించిన బాలయ్య) -
విశాఖ రోడ్‌షోలో చంద్రబాబు విచిత్రమైన పిలుపు
సాక్షి, అమరావతి: ‘‘ప్రజలు బరితెగించాలి’’ విశాఖలో రోడ్‌షో సందర్భంగా శనివారంనాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపు ఇదీ.. ముందురోజు కూడా చంద్రబాబు ఇదేతీరులో ‘‘ఏం పీకుతావ్.. గడ్డిపీకుతావా.. నీ అబ్బ జాగీరా..’’ అంటూ తిట్ల వర్షం కురిపించారు. విశాఖలో మాత్రమే కాదు గత కొద్ది రోజులుగా చంద్రబాబు ఇలానే అదుపు తప్పి మాట్లాడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఒకవైపు.. మున్సిపల్ ఎన్నికల్లోనూ పరాజయం తప్పదన్న వాస్తవం మరోవైపు చంద్రబాబులో తీవ్ర అసహనానికి కారణమయ్యాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పరాజయాల పరంపర ఆ పార్టీని కుదిపేస్తోందని వారు పేర్కొంటున్నారు.. చంద్రబాబు మాత్రమే కాదు శనివారం విజయవాడలో టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా కూడా ఇలానే అదుపు తప్పి మాట్లాడడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ‘‘చంద్రబాబు రోడ్ షోలో కేశినేని పాల్గొంటే మేం పాల్గొనం.. మాకు ఏ గొట్టం గాడూ అధిష్టానం కాదు’’ అంటూ వారు నిప్పులు చెరిగారు. విజయవాడలో టీడీపీ నేతల వర్గపోరుగా ఇది కనిపించినా అధినాయకత్వంపై ద్వితీయ శ్రేణి నాయకులు ఎంత చులకనభావంతో ఉన్నారో ఈ వ్యాఖ్యలు రుజువు చేశాయని పరిశీలకులంటున్నారు. పైకి ఎంపీ కేశినేని నానిపై ఆగ్రహించినట్లు కనిపించినా కేశినేనికి చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారన్న దుగ్థ వారి వ్యాఖ్యలలో కనిపిస్తోందని జనం చర్చించుకుంటున్నారు. ఇక చంద్రబాబు బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోమారు తనదైన శైలిలో రెచ్చిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒక ఫొటోగ్రాఫర్‌పై బాలకృష్ణ చేయిచేసుకోవడం చూసి అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. నా అనుమతి లేకుండా వీడియో తీస్తావా అని బాలకృష్ణ ఆ ఫొటోగ్రాఫర్ చెంప ఛెళ్లుమనిపించారు. బాలయ్య కోపాన్ని చూసి అక్కడున్న టీడీపీ శ్రేణులు కూడా హడలెత్తిపోయారు. హిందూపురంలో మూడురోజులుగా రోడ్‌షో నిర్వహిస్తున్న బాలకృష్ణ తొలిరోజు అక్కడి టీడీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్‌షోకు జనం నుంచి స్పందన లేకపోవడం వల్లే ఆయన అలా కోపగిస్తున్నారని టీడీపీ నాయకులంటున్నారు. జనం రాకపోతే మేమేం చేయగలం అని వారు చర్చించుకుంటున్నారు.. గెలిచే పరిస్థితులు ఏమాత్రం కనిపించక, ఓటమి భయంతో అధినేత నుంచి స్థానిక నాయకుల వరకూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలే వ్యాఖ్యానిస్తుండడం విశేషం.. అధినేత ఎందుకిలా... ‘ఏం పీకుతావ్.. గడ్డి పీకావా, నువ్వు పోటుగాడివా.., నీ అబ్బ జాగీరా, సీఎం ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేస్తున్నాడు, రేపు మిమ్మల్ని కూడా అమ్మేస్తాడు.. మీరెవరూ ఇళ్లలో నుంచి బయటకు రారా, మీరు ఇంట్లో కూర్చుంటే, మీకోసం మేం పోరాడాలా, మీకు బాధ్యత లేదా’ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పదేపదే చేస్తున్న వ్యాఖ్యలివి. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానని రోజూ చెప్పే టీడీపీ అధ్యక్షుడు ఇలా పూర్తిస్థాయిలో సంయమనం కోల్పోవడం విచిత్రమేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తన స్థాయిని మరచిపోయి దుర్భాషలాడడం ఆయనకు నిత్యకృత్యంగా మారిందంటున్నారు. ఎంత అసహనం, అభద్రత లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారో ఊహించుకోవచ్చని చాలాకాలం నుంచి రాజకీయాలను పరిశీలిస్తున్న వారు అభిప్రాయపడుతున్నారు. ఫ్రస్ట్రేషన్ అనే పదానికి చంద్రబాబు ప్రస్తుతం తరచూ మాట్లాడుతున్న మాటలే ఉదాహరణలని, ఏమాత్రం సంయమనం లేకుండా, పూర్తిగా బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారని సొంత పార్టీ నేతలే ఆందోళన చెందుతున్నారు. ఒక్కోసారి ఆయన ఏంమాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాని విధంగా పరిస్థితి ఉంటోందని చెబుతున్నారు. వరుస ఓటముల ప్రభావమే.. తనకు ఎదురే లేదనుకున్న కుప్పంలో ఓడిపోవడం.. సొంత జిల్లా చిత్తూరుపై పూర్తిగా పట్టు కోల్పోవడం.. పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా దారుణ పరాజయాలు.. మున్సిపల్ ఎన్నికల్లోనూ వ్యతిరేక గాలి స్పష్టంగా కనబడుతుండడంతో చంద్రబాబు పార్టీ భవిష్యత్తు పట్ల తీవ్ర ఆందోళనతో ఉన్నట్లు రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. అందుకే ప్రచార సభలు, మీడియా సమావేశాల్లో అస్సలు కంట్రోల్ లేకుండా ఇష్టానుసారం తిట్లు, శాపనార్థాలు పెడుతున్నారని చెబుతున్నారు. కుప్పం పంచాయతీ ఎన్నికల్లో ఓటమి ఆయనపై తీవ్రంగా ఉందని చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్న నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఏమాత్రం ఊహించని విధంగా ఎదురైన ఈ ఓటమి ఆయన్ను కుంగదీసిందని, పార్టీ శ్రేణులు, నాయకులు కూడా దీనిపై ఆందోళన చెందడంతో ఆయన ఇంకా ఆవేదన చెందుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కర్నూలు ప్రచారంలో ‘రాష్ట్రం కోసం మీరెవరూ రారా, మీరు ఇంట్లో కూర్చుంటే, మీకోసం మేం పోరాడాలా, మీకు బాధ్యత లేదా’ అని ప్రజలపైనే విరుచుకుపడడంతో పక్కనున్న టీడీపీ సీనియర్ నేతలు బెంబేలెత్తిపోయినట్లు సమాచారం. తనను తిరుపతి ఎయిర్‌పోర్టులో నిర్బంధిస్తే ఒక్కరు రాలేదని, రాష్ట్రం కోసం తానొక్కడినే పోరాడాలా అంటూ ఏవేవో సంబంధం లేని మాటలు మాట్లాడడంతో టీడీపీ నాయకులు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ గడిపినట్లు చెబుతున్నారు. పోలీసులపైనా శృతి మించిపోయి విమర్శలు చేస్తుండంపై పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బెజవాడలో నేతల తిట్ల పోటీ మరోవైపు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవడం కష్టమని అంచనాకు వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఓటమికి ముందే ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ వీధిన పడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేశినేని నాని పై నుంచి కింది వరకు తానే అధిష్టానం అంటున్నాడని, అతన్ని చెప్పు తీసుకుని కొట్టేవాడినని పార్టీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తిట్టడం పార్టీలో అసహనం ఏ స్థాయికి చేరిందో సూచిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని, పార్లమెంటు అంతా తిరుగుతానని వెంకన్న ప్రకటించుకోవడంతో పార్టీ నాయకులకు ఏం జరుగుతుందో అర్థం కావడంలేదంటున్నారు. కేశినేని నానికి నిజంగా సత్తా, గ్లామర్ ఉంటే రాజీనామా చేయాలని, ఇండిపెండెంటుగా గెలవాలని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సవాల్ విసరడంతో పార్టీ నాయకులపై చంద్రబాబుకు కంట్రోల్ లేదని తేటతెల్లమైందని చెబుతున్నారు. కేశినేని కుల అహంకారంతో మాట్లాడుతున్నాడని, వాళ్ల చెప్పులు ఇంకెన్నాళ్లు మోస్తామని విజయవాడలో ఎన్నో ఏళ్ల నుంచి టీడీపీ నాయకుడిగా ఉన్న నాగుల్ మీరా వంటి నాయకులు తీవ్ర ఆవేదనతో రోడ్డెక్కడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. -
‘అభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీని గెలిపించండి’
సాక్షి, పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఏలూరు 2వ డివిజన్లో డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత రెండేళ్లలో ఏలూరును ఎంతో అభివృద్ధి చేశామని వెల్లడించారు. ఏలూరులో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. ఏలూరు కార్పొరేషన్‌ను గెలుచుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇస్తామన్నారు. విశాఖపట్నం: విశాఖలోని 90వ వార్డులో వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విశాఖ అభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సీఎం వైఎస్ జగన్‌ది సంక్షేమ ప్రభుత్వమని, విశాఖకు త్వరలో పరిపాలన రాజధాని రాబోతోందన్నారు. భరత్‌నగర్‌లో ఇల్లు లేని 30 కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఇస్తామని భరోసానిచ్చారు. చదవండి: 'చంద్రబాబుకు విశాఖలో అడుగుపెట్టే హక్కే లేదు' మళ్లీ చెంప చెళ్లుమనిపించిన బాలయ్య -
పంచాయతీ ఫలితాలను మించి..
సాక్షి, అమరావతి: సీఎం జగన్ సుపరిపాలనకు మద్దతుగా పార్టీరహితంగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 80 శాతానికిపైగా గ్రామాల్లో అధికార వైఎస్సార్సీపీ మద్దతుదారులను ప్రజలు గెలిపించారని, పార్టీ గుర్తులతో జరిగే మునిసిపాలిటీ ఎన్నికల్లో అంతకుమించిన ఫలితాలను వైఎస్సార్ సీపీకి కట్టబెట్టబోతున్నారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 80 శాతానికిపైన.. 90 శాతం వరకు వార్డులు, డివిజన్లలో గెలుపు వైఎస్సార్సీపీ అభ్యర్థులదేనన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలపై ఉన్నతాధి కారులు, జిల్లా అధికారులతో మంత్రి శుక్రవారం సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పనితీరు, ప్రభుత్వ పాలన కు మద్దతుగా స్థానిక ఎన్నికలలో ప్రజాతీర్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీల్ని ఏర్పాటు చేసి, తమకు అనుకూలంగా ఉన్నవారికే ప్రభుత్వ పథకాలను అందించిందన్నారు. సీఎం జగన్ మాత్రం అర్హతే కొలమానంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ‘స్థానిక’ ఎన్నికల్లో ప్రజలు సీఎం జగన్‌కు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారన్నారు. గ్రామీణప్రాంతాల్లో 3,185 కిలోమీటర్ల రోడ్లు.. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో పీఎంజీఎస్‌వై కింద కొత్తగా 3,185 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపడుతున్నట్టు పెద్దిరెడ్డి తెలిపారు. తొలివిడత కింద రూ.524.36 కోట్లతో 935.84 కిలోమీటర్ల మేర పనులను ప్రారంభించామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో పేదకూలీ లకు రికార్డు స్థాయిలో పనులు కల్పించినట్టు చెప్పారు. 2020–21లో 25.25 కోట్ల పనిదినాలను కల్పించాలనేది లక్ష్యమని, ఇప్పటివరకు 23.67 కోట్ల పనిదినాలను కల్పించినట్టు చెప్పారు. కూలీలకు ఇప్పటివరకు రూ.5,423 కోట్లు వేతనాల రూపంలో చెల్లించామన్నారు. గ్రామ సచివాలయాలు, అంగన్వాడీ, వెల్నెస్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాల భవనాల నిర్మాణానికి మరో రూ.4 వేల కోట్ల వరకు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు రూ.3,086 కోట్ల మేర పనులు పూర్తి చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో 19,21,050 ఇళ్లకు ఈ ఏడాది కొత్తగా మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని.. ఈనెల ప్రారంభం నాటికి 9,41,731 ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నెలాఖరుకు మరో ఆరులక్షల కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించామన్నారు. వ్యవసాయ బోర్లకోసం రైతు లు అప్పులుపాలు కాకూడదనే ఆశయంతో సీఎం జగన్ వైఎస్సార్ జలకళ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారని.. ఇందుకు మూడేళ్లలో రూ.4వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు తెలిపారు. -
చేతులెత్తేసిన టీడీపీ సీనియర్లు
సాక్షి, అమరావతి: పంచాయతీ ఫలితాలతో తమకు ప్రజాదరణ లేదని తేలిపోవడంతో టీడీపీ సీనియర్ నాయకులు మునిసిపల్ ఎన్నికల్లో పూర్తిగా చేతులెత్తేశారు. అక్కడక్కడా కొందరు తప్పదన్నట్టు మెరిసి మాయమైపోతున్నారు. ఎలాగూ ఓడిపోయే దానికి తాము చేయగలిగిందేముంటుందని మెజారిటీ నాయకులు ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవడం లేదని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. టీడీపీ అధికారంలో ఉండగా హవా చలాయించిన నాయకులు, సీనియర్లు, మాజీ మంత్రులు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోవడానికి ఇదే కారణమని చెబుతున్నారు. నీరుగారిపోయిన క్యాడర్లో భ్రమలు కల్పించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలతో ఉపయోగం లేదని పలువురు పార్టీ నాయకులు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు. ‘పంచాయతీ’ ఎఫెక్ట్.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ పరిస్థితి దయనీయంగా ఉంది. చంద్రబాబు తర్వాత అంతటి స్థాయి నాయకుడినని ఊహించుకునే మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మున్సిపల్ ఎన్నికల బాధ్యత తనది కాదని పార్టీ నేతలతోనే చెబుతున్నట్లు తెలిసింది. మీడియాలో కనిపించేందుకు ఆరాట పడే ఆయన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల గురించి ఇప్పటివరకూ ఎవరితోనూ మాట్లాడలేదని నగర నాయకులు వాపోతున్నారు. తాను ఇన్ఛార్జిగా ఉన్న మైలవరం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో చావుదెబ్బ తగలడంతో ఆయన ఇంకా తేరుకోలేకపోతున్నారు. గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పంచాయతీ ఎన్నికల్లో అంటీముట్టనట్టు ఉండగా మున్సిపల్ ఎన్నికలను పట్టించుకోకుండా హైదరాబాద్‌లోనే ఎక్కువ రోజులు గడుపుతున్నారు. విజయనగరం జిల్లాలో మాజీ మంత్రులు సుజయకృష్ణ రంగారావు, శత్రుచర్ల విజయరామరాజు, అశోక్ గజపతిరాజు లాంటి నాయకులు ఓటమిని ముందే గ్రహించి మునిసిపాల్టీలను వదిలేసినట్లు ప్రచారం జరుగుతోంది. పలువురు అస్త్ర సన్యాసం.. విశాఖ జిల్లాలో గంటా శ్రీనివాసరావు చాలాకాలం క్రితమే అస్త్ర సన్యాసం చేశారు. మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పంచాయతీ ఎన్నికల్లో తన సతీమణిని పోటీ చేయించి ఓటమి పాలవడంతో తల ఎత్తుకోలేక మునిసిపల్ ఎన్నికలను పెద్దగా పట్టించుకోవడంలేదు. తూర్పు గోదావరి జిల్లాలో మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూలు పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నా గెలుపు పట్ల నమ్మకం లేదని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. టీడీపీ సూపర్ సీనియర్ యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గం తునిలో పూర్తిగా చేతులెత్తేశారు. తుని మునిసిపాల్టీలో అభ్యర్థులను నిలబెట్టలేక ఆయన తమ్ముడు కృష్ణుడు జంప్ అయిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. పశ్చిమ గోదావరిలో గతంలో పార్టీని నడిపించిన మాగంటి బాబు, తోట సీతారామలక్ష్మి ప్రస్తుతం ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. అధికారంలో ఉండగా చక్రం తిప్పిన మాజీ మంత్రి పి.నారాయణ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వల్ల వచ్చే ఒకటి అరా ఓట్లు కూడా రావని పార్టీ నాయకులు వాపోతున్నారు. కర్నూలు జిల్లాలో మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి, భూమా అఖిలప్రియలు వైఎస్సార్సీపీతో పోటీ పడలేక పూర్తిగా సైలెంట్ అయిపోయారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారింది. కుప్పంలో ఫలితాలతో పార్టీ నాయకులు నైరాశ్యంలో మునిగిపోయారు. మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి తాను ఇన్ఛార్జిగా ఉన్న పలమనేరు మునిసిపాల్టీపైనే ఆశ వదులుకున్నారు. అనంతపురంలో కాల్వ శ్రీనివాస్, పరిటాల కుటుంబ సభ్యులు ఈ ఎన్నికల్లో స్తబ్దుగా ఉన్నారు. చంద్రబాబు ఫోన్లు చేస్తున్నా చాలామంది నాయకులు అందుబాటులోకి రావడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
వలంటీర్ల ఫోన్లు అధికారుల వద్ద జమ చేయండి
సాక్షి, అమరావతి: వార్డు వలంటీర్ల మొబైల్ ఫోన్ల విషయంలో ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఈ నెల 3న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం సవరించింది. వార్డు వలంటీర్లు లబ్ధిదారుల డేటా ఉన్న మొబైల్ ఫోన్లను మునిసిపల్ కమిషనర్లు నియమించే అధికారుల వద్ద జమ చేయాలని హైకోర్టు ఆదేశించింది. వలంటీర్లు ఆ అధికారుల అనుమతితో అవసరమైనప్పుడు మొబైల్ ఫోన్లను వారి పర్యవేక్షణలో ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసే విషయంలో తేదీ, సమయం, ప్రదేశాన్ని మునిసిపల్ కమిషనర్ నిర్ణయిస్తారని పేర్కొంది. మొబైల్ ఫోన్లను ఉపయోగించకుండా పూర్తిగా నిషేధించడం సరికాదన్న ధర్మాసనం, అలా నిషేధం విధించడం వారి విధులకు ఆటంకం కలిగించడమే అవుతుందని ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఒకవేళ వలంటీర్లు లబ్ధిదారుల డేటా ఉన్న మొబైల్ ఫోన్లను దుర్వినియోగం చేస్తే క్రమశిక్షణ చర్యల నిమిత్తం ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు మాత్రమే చేయవచ్చని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. నేరుగా చర్యలు తీసుకునే పరిధి కమిషన్‌కు లేదు.. తమ ఆదేశాలను వలంటీర్లు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొనడం తమను అత్యంత ఆందోళనకు గురి చేస్తోందని విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలా నేరుగా చర్యలు తీసుకునే అధికారం, పరిధి ఎన్నికల కమిషన్‌కు లేదని స్పష్టం చేసింది. దీనిపై ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు స్పందిస్తూ పంచాయతీ ఎన్నికల్లో వలంటీర్ల తీరుపై అనేక ఫిర్యాదులు వచ్చాయని, వాటిని దృష్టిలో పెట్టుకునే ప్రస్తుత ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ వలంటీర్లు ఎవరితో మాట్లాడారో సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ల నుంచి ఎన్నికల కమిషన్ వివరాలు తెప్పించుకోవచ్చు కదా? అని ప్రశ్నించింది. ఫిర్యాదులు ఎన్నో వస్తుంటాయని, అన్నీ వాస్తవం కాకపోవచ్చని పేర్కొంది. అవసరానికి మించి ఆంక్షలు విధిస్తున్నారన్న అభిప్రాయం ఈ కోర్టుకు కలుగుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం మునిసిపల్ కమిషనర్ ద్వారా నియమితులయ్యే అధికారి వద్ద మొబైల్ ఫోన్లు ఉంచాలన్న ప్రతిపాదనకు ఇరుపక్షాలు అంగీకరించడంతో హైకోర్టు ధర్మాసనం ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ఎస్ఈసీ అప్పీల్... మునిసిపల్ ఎన్నికల్లో వార్డు వలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకోకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ గత నెల 28న ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. ఈ ఉత్తర్వులను చట్ట విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ గ్రామ వలంటీర్, వార్డు వలంటీర్, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.అజయ్‌జైన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ ఈ నెల 3న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్నికల కమిషన్ కార్యదర్శి శుక్రవారం సాయంత్రం అత్యవసరంగా హౌస్‌మోషన్ రూపంలో అప్పీల్ దాఖలు చేయగా జస్టిస్ బాగ్చీ నేతృత్వంలోని ధర్మాసనం ఇంటి వద్ద విచారణ జరిపింది. -
చంద్రబాబు ఓ ఊసరవెల్లి: మంత్రి కొడాలి నాని
సాక్షి, విజయవాడ: కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ పూటకో రంగు మార్చి పబ్బం గడుపుకోవాలని చూసే చంద్రబాబు నాయుడుని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయనగరంలో హిందువునని, కర్నూలుకు వెళ్లి టోపీ పెట్టుకొని ముస్లింనని ప్రచారం చేసుకునే చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పూటకో మతం పేరు చెప్పుకుంటూ ఆయా మతాల వారి మనోభావాలను దెబ్బతీస్తున్న చంద్రబాబుకు ఓటనే ఆయుధంతో బుద్ధిచెప్పాలని కోరారు. చంద్రబాబు హయాంలో సంపదనంతా విజయవాడలో గోడలపై పెయింటింగ్‌ల కోసం ఖర్చ చేశారని విమర్శించారు. గత కౌన్సిల్లో నిధులను టీడీపీ నేతలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. టీడీపీ నేతలు నగరంలో పేదల ఉండే ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, తమ ప్రభుత్వం వచ్చాక వారి స్థితిగతుల్లో చాలా మార్పు వచ్చిందని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి మంచి ఆలోచనతో పేదల కోసం 30 లక్ష ఇళ్ల పట్టాలను ఇవ్వాలని చూస్తే చంద్రబాబు అండ్ కో కోర్టుల ద్వారా అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 45 వేల స్కూళ్ల రూపురేఖల్ని మార్చేశామన్నారు. టీడీపీ హయాంలో కార్పొరేట్ కళాశాలు రాజ్యమేలిన విషయాన్ని ఆయన ప్రస్థావించారు. 8 వేల కోట్లతో రాష్టంలో 16 మెడికల్ కళాశాలు కట్టాలని సీఎం జగన్‌మెహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. సీఎం జగన్‌మెహన్‌రెడ్డిపై విషం కక్కాలని చూసే చంద్రబాబుకు ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయడులు సహకరిస్తున్నారన్నారు. కరోనా కష్టాల్లో ఉన్నా అప్పులు తెచ్చి మరీ నిరుపేదల కడుపులు నింపిన గొప్ప వ్యక్తి సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్ధులకు ఓటు వేసి.. రాష్టాన్ని సంక్షేమం, అభివృద్ధిపధంలో తీసుకెళ్తున్న సీఎం జగన్మోహన్రెడ్డిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. -
మున్సిపోల్స్‌పై ఖాకీల డేగకన్ను..
సాక్షి, విజయవాడ: ఈనెల 10న జరుగనున్న మున్సిపల్ ఎన్నికలపై విజయవాడ పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. సిటీ పోలీస్ కమీషనరేట్ పరిధిలో కీలకమైన విజయవాడ కార్పొరేషన్, ఉయ్యూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీపీ బత్తిన శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించారు. సీపీ నిత్య పర్యటనలతో సిబ్బందిని అలర్ట్ చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో మొత్తం 3,200 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు, ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నట్లు సీపీ తెలపారు. ఎన్నికల విధుల్లో 67 మొబైల్, 27 స్ట్రైకింగ్, 12 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నేర చరిత్ర కలిగిన 1900 మందిని 110 సీఆర్పీసి కింద బైండోవర్ చేసినట్లు వెల్లడించారు. ఈనెల 8వ తేదీ నుండి పోలింగ్ కేంద్రాలను అధీనంలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నిస్తే ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని, ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఏపీ బంద్‌కు అసదుద్దీన్ ఓవైసీ సంఘీభావం
సాక్షి, కర్నూలు: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు కార్మిక సంఘాలు చేపట్టిన బంద్‌కు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కార్మికులు చేపడుతున్న బంద్‌కు ఆయన మద్దతు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను ఖండిస్తున్నానని అన్నారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆదోని పట్టణానికి బయలుదేరిని ఆయన.. మార్గమధ్యంలో కోడుమూరు పట్టణంలో ఆగి అక్కడ శాంతియుతంగా బంద్‌ను పాటిస్తున్న కార్మికులనుద్దేశించి మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, దాన్ని బయటి వ్యక్తులకు కట్టబెట్టే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని హెచ్చరించారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్థావించి, కేంద్రంపై ఒత్తిడి తెస్తానని హామీనిచ్చారు. ఇదిలా ఉండగా ఆదోని మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తరఫున పలువురు అభ్యర్ధులు రంగంలో నిలిచారు. వీరికి మద్దతుగా ప్రచారం చేసేందుకు అసదుద్దీన్ ఆదోనికి వెళ్లారు. కాగా, పాతబస్తీ పార్టీగా ముద్రపడిన ఎంఐఎం పార్టీ ఇటీవల పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పలు స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. -
నాకు పదవీకాంక్ష లేదు.. 14ఏళ్లు సీఎంగా చేశా..
సాక్షి, కర్నూలు : ‘ఈరోజు నేను నా కోసం రాలేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశా. పదేళ్లు ప్రతిపక్ష నేతను. నాకు పదవీకాంక్ష లేదు. మీ కోసం, మీ పిల్లల భవిష్యత్తు.. రాష్ట్ర భవి ష్యత్తు కోసం వచ్చాను. ఆశీర్వదిస్తారా? లేదా? అనే ది మీరే నిర్ణయించుకోండి’.. అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన గురువారం కర్నూలులో ఎన్నికల ప్రచారం చేశారు. కార్యకర్తలు పెద్దగా రాకపోవడంతో బోసిపోయిన ప్రచారాన్ని ఆయన నిరుత్సాహంగా కానిచ్చేశారు. చంద్రబాబు ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే.. ‘నిర్మాణరంగం కుదేలైంది. మద్యం కావాలంటే కర్నూలు జిల్లా వాసులు కర్ణాటక, తెలంగాణకు వెళ్లి తాగుతున్నారు. ఇది ఎంత దుర్మార్గం. జగన్ ఓ ఫేక్ ముఖ్యమంత్రి. అమరావతిని నిర్వీర్యం చేశారు. అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. ఉద్యోగాల్లేవు.. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. విశాఖ ఉక్కును కాపాడలేకపోయారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు ఏకగ్రీవాలు చేసేస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ ఇలా కాలేదు. దౌర్జన్యాలు చేసి కైవసం చేసుకుంటున్నారు’ అని ఆరోపించారు. న్యాయవాదుల బైఠాయింపు ఇదిలా ఉంటే.. కర్నూలుకు హైకోర్టు రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని పెద్దమార్కెట్ సమీపంలో కర్నూలు బార్ అసోసియేషన్ సభ్యులు వి.నాగలక్ష్మిదేవి, ఎం.సుబ్బయ్య, ప్రభాకర్, షఫత్, మధుసూధన్‌రెడ్డి, రామాంజనేయులు తదితరులు చంద్రబాబు కాన్వాయ్ ఎదుట బైఠాయించారు. చదవండి: (జగన్మోహన్రెడ్డి పెట్రోల్ రేట్లు పెంచేశారు) -
నారా లోకేశ్ అభ్యంతరకర వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురువారం విశాఖలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ తనదైనశైలిలో చేసిన అసంబద్ధ ప్రసంగాలు నగర ప్రజలను విస్మయానికి గురిచేశాయి. 1978లో అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయి కూడా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నించారని లోకేశ్ వ్యాఖ్యానించారు. పక్కన ఉన్న టీడీపీ నేతలు 1998 అని చెప్పడంతో.. ఆయన సర్దుకున్నారు. సీఎం జగన్ పెట్రోల్, డీజిల్ ధరలను ఇష్టానుసారంగా పెంచుతూ ప్రజలపై తీవ్ర భారాన్ని మోపుతున్నారంటూ వ్యాఖ్యలు చేయడం ప్రజలను విస్మయానికి గురిచేశాయి. మంత్రిగా వ్యవహరించిన లోకేశ్‌కు చమురు ధరలు ఎవరు పెంచుతారో తెలీదా? అంటూ వారు వ్యాఖ్యానించారు. భీమిలిలో ప్రసంగిస్తూ మూడోవార్డు అభ్యర్థిని గెలిపిస్తే.. మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని ప్రస్తావించారు. భీమిలి.. విశాఖ నగరంలో విలీనమైన సంగతి కూడా ఆయనకు తెలియకపోవడం గమనార్హం. దక్షిణ నియోజకవర్గంలో మాట్లాడుతూ ప్రశాంత నగరంలో గడ్డాలు పెంచుతూ ఒక రౌడీ తిరుగుతున్నారన్నారు. రోడ్ షో అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేశ్.. విశాఖ నగరానికి 16 నెలలుగా ఏమీ చేయలేనివారు ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌తో ఏం పీకుతారంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. లోకేశ్ తొలుత సింహాచలం లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. అంతంతమాత్రంగా వచ్చిన జనాన్నే అన్ని డివిజన్లకు తరలించేందుకు నేతలు అష్టకష్టాలు పడ్డారు. -
చంద్రబాబుకు చుక్కలు చూపించిన న్యాయవాదులు
సాక్షి, కర్నూలు: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు నగరంలో పర్యటించిన చంద్రబాబుకు స్థానిక న్యాయవాదులు చుక్కలు చూపించారు. పెద్ద మార్కెట్ వద్ద జరగిన రోడ్డు షోలో పాల్గొన్న చంద్రబాబును న్యాయవాదులు, స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హైకోర్టు కర్నూలుకు రాకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని నిరసన స్వరాలు వినిపించిన న్యాయవాదులు.. చంద్రబాబు గోబ్యాక్ అంటూ ఆందోళన చేపట్టారు. దీంతో న్యాయవాదులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొని, తోపులాటకు దారి తీసింది. హైకోర్టు విషయంలో చంద్రబాబు వైఖరిపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హైకోర్టుకు మద్దతు తెలపాలని వారు డిమాండ్ చేశారు. -
ఓటుతో చంద్రబాబును తరిమికొట్టండి: కొడాలి నాని
సాక్షి, విజయవాడ: సీఎం జగన్మోహన్రెడ్డి అద్భుత పరిపాలన చూసి, పోటీ చేసినా ఓటమి తప్పదని టీడీపీ, బీజేపీ అభ్యర్దులు ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నారని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. విజయవాడ నగరంలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడేనన్నారు. విజయవాడ నగర మేయర్ పీఠంపై వైఎస్సార్సీపీ జండా ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కులమతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు చేరాయని పేర్కొన్నారు. ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి చంద్రబాబును ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వంగవీటి రంగా, నెహ్రూ పిల్లలను ఇబ్బంది పెట్టిన చంద్రబాబుకు విజయవాడ ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేదలకు ఆరోగ్యం, విద్య, నివాసం కల్పించాలని ఆలోచన చేస్తున్నారని, ఇందులో భాగంగా అనేక పథకాలు ఇదివరకే ప్రజలకు చేరువయ్యాయన్నారు. సీఎం జగన్ విద్య విషయంలో తండ్రి స్థానంలో ఉండి ఆలోచిస్తారని, ఈ విషయంలో దివంగత నేత రాజశేఖరరెడ్డి, సీఎం జగన్మోహన్రెడ్డి ఇద్దరూ ఇద్దరేనని ప్రశంసించారు. పేదల ఆరోగ్యం విషయంలోనూ తండ్రి బాటలో సీఎం జగన్ నడుస్తున్నారన్నారు. 30 వేల కోట్ల భూముల కొని 30 లక్షల మంది పేదలకు పంచిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. 3 సెంట్ల భూమి ఇస్తానని 14 ఏళ్లు కాలయాపన చేసిన దుర్మాగుడు చంద్రబాబన్నారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చిన మొనగాడు సీఎం జగన్మోహన్రెడ్డే అన్నారు. అన్ని డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్దులను గెలిపించుకొని, నగర అభివృద్ధికి అధిక నిధులు తెచ్చుకుందామన్నారు. రాష్ట్ర ప్రజల ఆరాధ్యుడు.. ఆర్థికంగా చితికి పోయిన రాష్టంలో కులమతాలకతీతంగా సంక్షేమ పధకాలను గడపగడపకు అందిస్తున్న వ్యక్తి సీఎం జగన్మోహన్రెడ్డి మాత్రమేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. విజయవాడ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమ పధకాలను అన్ని వర్గాల ప్రజలకు అందిస్తూ రాష్ట్ర ప్రజల పాలిట ఆరాధ్యుడయ్యారన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో 36 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారన్నారు. అమ్మాఇది నీ ఇల్లు.. కొబ్బరి కాయ కొట్టి లోనికి వెళ్ళు అని మహిళాలోకానికి ధైర్యం నింపారన్నారు. ప్లకార్డులు పట్టుకునే కమ్యూనిస్టు కూడా ఇళ్ల గురించి చర్చించేలా చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. -
బెదిరింపులతో నామినేషన్ల ఉపసంహరణ జరగదు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: మున్సిపల్ ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి అన్నారు. ఇప్పటికే 571 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. ఈ మేరకు తాడేపల్లిలో గురువారం ఆయన మాట్లాడుతూ.. పేదల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని అన్నారు. 20 నెలల కాలంలో ప్రజల్లో సీఎం సుస్థిరస్థానం సంపాదించుకున్నారని.. ఈ నేపథ్యంలో ప్రజలు తమ అభిమానాన్ని చాటుతూ వైస్సార్సీపీకి మద్దతుగా నిలుస్తున్నారన్నారు. మరోవైపు ఏకగ్రీవాలపై ఎల్లో మీడియాలో దిగజారుడు కథనాలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బెదిరింపులతో నామినేషన్ల ఉపసంహరణ జరగవని స్పష్టం చేశారు. ఎల్లో మీడియా కథనాలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని సజ్జల పేర్కొన్నారు. పార్టీ తరపున పరువునష్టం దావా వేస్తామని అన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని, అబద్ధాలతో ప్రజలను మోసం చేద్దామని బాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 20నెలల్లో సాధించిన ప్రగతిని ప్రజల ముందు పెడతామని, అధికారంలోకి రాగానే 4 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు. లబ్ధిదారుల ఖాతాల్లోకే నేరుగా నగదు జమ చేస్తున్నామని, సంక్షేమాన్ని ప్రజల ఇంటి వద్దకే తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. మహిళలను బలోపేతం చేసే అన్ని కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. మంచి చేసిన ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో మద్దతు పలకాలని కోరారు. చదవండి: మహిళల భద్రతపై కీలక నిర్ణయాలు: సీఎం జగన్ ‘రేపటి ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం’ -
ప్రజారంజక పాలనకు ఏకగ్రీవాలే దర్పణం..
సాక్షి, తాడేపల్లి: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సానుభూతిపరులను ఆదరించిన విధంగానే మున్సిపల్ ఎన్నికల్లో సైతం ప్రజలు తమ పార్టీ అభ్యర్దులకు పట్టం కడతారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజారంజక పాలనకు వరుసగా వస్తున్న ఫలితాలే దర్పనమన్నారు. సీఎం జగన్ నాయకత్వాన్ని ప్రజలు పూర్తిగా విశ్వసించారు కాబట్టే మున్సిపల్ ఎన్నికల్లో 20, 797 వార్డులకు గాను 571 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్దులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. పన్నులు పెంచుతామంటూ చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని, సీఎం జగన్ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయమే తీసుకుంటుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా చేసిన సంస్కరణల్లో భాగంగా చట్టం చేసామే కానీ, చంద్రబాబులా ఇష్టారాజ్యంగా పన్నులు పెంచలేదని తెలిపారు. పట్టణ ప్రజల వైద్య అవసరాలు తీర్చే నిమిత్తం సీఎం జగన్ చేతుల మీదుగా త్వరలో 550 అర్బన్ క్లినిక్‌లు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నాడు నేడు పథకం కింద స్కూల్లు అభివృద్ధి బాట పడుతున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మొద్దని ప్రజలను అభ్యర్ధించారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం జరుగనున్న రేపటి బంద్‌కు సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు...దాని కోసం ఏమి చేయాలో అన్నీ చేస్తామని వివరించారు. -
ఏకగ్రీవాలపై మంత్రి బొత్స సత్యనారాయణ హర్షం
-
టీడీపీలో టికెట్ బేరాలు
సాలూరు: ‘పార్టీలో కష్టపడి పనిచేసే తనకు కాకుండా డబ్బులకు అమ్ముడుపోయి ఇంకెవరికో టికెట్టు ఎలా ఇస్తారు..’ అని ప్రశ్నించిన ఓ టీడీపీ మహిళా నేతను చేయి పట్టుకుని ఓ మాజీ ఎమ్మెల్యే గెంటేసిన ఉదంతం బుధవారం విజయనగరం జిల్లా సాలూరులో చర్చనీయాంశంగా మారింది. టికెట్ ఇస్తామని నియోజకవర్గ నాయకులు హామీ ఇవ్వడంతో సాలూరు మున్సిపాలిటీలో బంగారమ్మపేట 25వ వార్డు నుంచి టీడీపీ అభ్యర్థిగా కొయ్యాన లక్ష్మి నామినేషన్ వేశారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన బుధవారం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆర్.పి.భంజ్‌దేవ్ ఇంటికి రమ్మని చెప్పడంతో లక్ష్మి, ఆమె భర్త, మద్దతుదారులతో కలిసి వెళ్లారు. ‘నీవు ఎంత ఖర్చు పెడతావ్, టికెట్‌కు రూ.5 లక్షలు ఇవ్వాలి. నీవు ఎంత ఇవ్వగలవు’ అని భంజ్‌దేవ్ అడుగగా, రూ.4 లక్షలు ఇవ్వగలమని తెలిపారు. అక్కడే ఉన్న మరో అభ్యర్థి ఇంకా ఎక్కువ ఇస్తాననడంతో సీన్ రివర్స్ అయింది. దీంతో లక్ష్మికి బీ–ఫారం ఇవ్వబోమని చెప్పారు. ‘ఇన్నేళ్లుగా పార్టీని నమ్ముకున్న మమ్మల్ని కాదని వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి డబ్బులు తీసుకుని టికెట్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం’ అని లక్ష్మి, ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌ను ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన భంజ్‌దేవ్.. లక్ష్మి చేయి పట్టుకుని బయటకు పొమ్మంటూ నెట్టేశారు. ‘నాకు నచ్చిన వారికే టికెట్ ఇస్తా, చేతనైంది చేసుకో..’ అంటూ దురుసుగా ప్రవర్తించారు. ఈ సంఘటనను అక్కడున్నవారు సెల్ఫోన్లో చిత్రీకరించడంతో ఇది స్థానికంగా వైరల్ అయింది. భంజ్‌దేవ్ టికెట్ అమ్ముకున్నారని లక్ష్మి కంటతడిపెట్టారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుస్తానని పేర్కొన్నారు. -
చంద్రబాబు మాట.. అబద్ధాల మూట
సాక్షి, అమరావతి: అధికారంలో ఉండగా పన్నులతో ప్రజల రక్తాన్ని పిండుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్ను తగ్గిస్తామంటూ మోసపూరిత హామీలతో ఓట్ల రాజకీయం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సజ్జల మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును ప్రజలు విశ్వసించడం లేదు కాబట్టే పంచాయతీ ఎన్నికల్లో కుప్పంతో సహా రాష్ట్రమంతా ఘోరంగా ఓడించారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమ న్నారు. ఈ సందర్భంగా సజ్జల ఇంకా ఏమన్నారంటే... ప్రజలు అంతా గమనిస్తున్నారు.. పురపోరులో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఏకగ్రీవాలు పెరి గాయి. ప్రజలు సీఎం వైఎస్ జగన్ పనితీరును గమనిస్తున్నారు. కోవిడ్ కాలంలో భరోసా ఇవ్వడం, మెరుగైన చికిత్స అందించడంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రపంచంతోనే పోటీపడిందన్నది వాస్తవం. ప్రజలు వైఎస్సార్సీపీ వైపే ఉన్నారని తెలిసి చంద్రబాబు, ఎస్ఈసీ కలిసి ఎన్నో కుట్రలు చేస్తున్నారు. ఎస్ఈసీని వీరుడు, ధీరుడు అని పొగిడినవారే ఆయన నీరుగారిపోయా డని, మారిపోయాడని విమర్శించడంలో అర్థమేం టి? ఎస్ఈసీ నాటకాలు కూడా అదేస్థాయిలో ఉన్నా యి. వలంటీర్లపై ఫిర్యాదులు వచ్చాయని ఎస్ఈసీ చెప్పడం దారుణం. ఈ వ్యవహారంపై న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నాం. పురపోరులో టీడీపీకి అభ్యర్థులే కరువు.. 40 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకునే టీడీపీకి మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసేందుకు కనీసం అభ్య ర్థులే లేకపోవడం సిగ్గుచేటు. టీడీపీ, చంద్రబాబుపై క్యాడర్ నమ్మకం కోల్పోయి పక్కకు తప్పుకుంటు న్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఏస్థాయిలో వేధించారో తెలిసిందే. అయినా ఏ ఒక్క కార్యకర్తగానీ, వైఎస్ కుటుంబీకులుగానీ వెనక్కు తగ్గారా? ఏ ఒక్కరైనా ఎన్నికల నుంచి తప్పుకున్నారా? టీడీపీ పాలనలో ఆస్తిపన్నులో వివిధ వర్గాల మధ్య తేడాలుండేవి. వైఎస్ జగన్ దీన్ని సరిదిద్ది పారదర్శకంగా ఉండేలా చట్ట సవరణ చేశారు. 15 శాతం మించని పన్ను తీసుకొచ్చారు. దీనిప్రకారం మహా అయితే రూ.150 కోట్ల అదనపు పన్ను వస్తుందేమో. ప్రజలపై పన్నుల భారం వేస్తున్నట్లు చంద్రబాబు యాగీ చేస్తున్నారు. మొన్న పంచాయతీ సీఎంగా... ఇప్పుడు మున్సిపల్ సీఎంగా మారిపోయిన చంద్ర బాబు ప్రకటించిన తప్పుడు మేనిఫెస్టోపై ఎస్ఈసీ కి ఫిర్యాదు చేస్తాం. 2014లో చంద్రబాబు 600 హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయలేదు. చంద్రబా బు మాట అబద్ధాల మూట లాంటిది. సీఎం వైఎస్ జగన్ ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపర్చాలన్న తలంపుతో ఉన్నారు. దొడ్డిదారిన పన్నులేయాలనే ఆలోచన ఆయన కలలో కూడా చేయరు. కాబట్టే జనం పంచాయతీ ఎన్నికల్లో అంతగా ఆదరించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇంతకన్నా మెరుగైన తీర్పు వస్తుంది. -
'తూర్పు' తీర్పు విలక్షణమే
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: గౌతమి, వృద్ధగౌతమి, వైనతేయ, వశిష్ట నదుల సవ్వడితో రాజకీయ చైతన్యం మెండుగా ఉండే తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఇచ్చే తీర్పు ఎప్పుడూ విలక్షణంగానే ఉంటుంది. అవి సార్వత్రిక ఎన్నికలైనా, పంచాయతీ ఎన్నికలైనా.. ఏ ఎన్నికలైనా ఇక్కడి ఓటర్ల తీర్పు ఏకపక్షంగానే ఉంటుంది. ఆ తీర్పునకు ప్రాంతాలు, పార్టీలు, వర్గాలు అనే వ్యత్యాసం ఉండదు. ఇందుకు 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలే నిదర్శనం. నాటి ఎన్నికల్లో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 14 చోట్ల వైఎస్సార్సీపీకి తూర్పు ఓటర్లు పట్టం కట్టారు. తాజాగా పార్టీ రహితంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం 90 శాతం ఆ పార్టీ అభిమానుల్నే గెలిపించారు. వారం రోజుల్లో జరగనున్న పురపాలక సంఘాల ఎన్నికల్లో సైతం పంచాయతీ ఫలితాలే పునరావృతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా రెండు నగరపాలక సంస్థలు, ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలు.. ఈ జిల్లాలో ఉన్నాయి. వీటిలో కాకినాడ నగరపాలక సంస్థకు పాలకవర్గం ఉంది. పంచాయతీల విలీన వివాదం న్యాయస్థానంలో ఉండటంతో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలు జరగడం లేదు. తుని, అమలాపురం, మండపేట, పెద్దాపురం, సామర్లకోట, రామచంద్రపురం, పెద్దాపురం మున్సిపాలిటీలకు, గొల్లప్రోలు, ముమ్మిడివరం, ఏలేశ్వరం నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో మొత్తం 268 వార్డులుండగా 35 ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన వారంతా వైఎస్సార్సీపీ అభ్యర్థులే. ► 1959లో ఆవిర్భవించిన తుని మున్సిపాలిటీ పేరున ఒక అరుదైన రికార్డు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2005లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 30 వార్డుల్లోనూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థులే విజయం సాధించారు. ప్రస్తుతం 30 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా.. 15 వార్డులలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఎన్నికలు జరిగే 15 వార్డుల్లో 10 చోట్ల గెలుపుపై వైఎస్సార్సీపీ ధీమాగా ఉంది. ► కేరళ తరువాత కొబ్బరికి పుట్టిల్లు కోనసీమలో ఏ కైక మున్సిపాలిటీ అమలాపురంలో కూడా వైఎస్సార్సీపీకే అనుకూలంగా ఉంది. స్వాతం్రత్యానంతరం 1948లో ఏర్పాటైన ఈ మున్సిపాలిటీలో గత టీడీపీ హయాంలో ఆ పార్టీ 22 వార్డులు, వైఎస్సార్సీపీ 8 వార్డుల్లో గెలుపొందాయి. ఈసారి 30 వార్డుల్లో ఇప్పటికే ఆరు వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఎన్నికలు జరిగే 24 వార్డుల్లో 20కిపైనే వైఎస్సార్సీపీ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్టణాన్ని ఆనుకుని ఉన్న మూడు మేజర్ పంచాయతీలు కామనగరువు, బండార్లంక, పేరూరుల్లో వైఎస్సార్సీపీ అభిమానులు సర్పంచులుగా విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆ ఫలితాలే పునరావృతం కానున్నాయని అంచనా. ► ఆవిర్భావం నుంచి టీడీపీకి కంచుకోటగా ఉన్న మండపేటలో ఈసారి ఆ పార్టీ ఎదురీదుతోంది. పంచాయతీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 43 పంచాయతీలకు 31 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ అభిమానులను ప్రజలు ఎన్నుకున్నారు. పట్టణ సమీపంలోని టీడీపీ ఓటమి ఎరుగని ఏడిద, నేలటూరు, మారేడుబాక, అర్తమూరు తదితర పంచాయతీల్లో వైఎస్సార్సీపీ అభిమానులు విజయం సాధించడంతో మున్సిపల్ ఎన్నికల్లోను అదే ఒరవడి కనిపిస్తోంది. ► పెద్దాపురంలోని 29 వార్డుల్లో 18 చోట్ల వైఎస్సార్సీపీ సునాయసంగా గెలిచే అవకాశాలున్నాయి. మిగిలిన వార్డుల్లో సైతం పారీ్టకి సానుకూల పవనాలు వీస్తున్నాయి. పట్టణానికి దగ్గర్లోని గుడివాడ, ఆర్బీ కొత్తూరు, కట్టమూరు, దివిలి వంటి పంచాయతీల్లో వైఎస్సార్సీపీ పాగా వేయడంతో మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు పునరావృతం కానున్నాయి. ► టీడీపీకి కంచుకోట అయిన సామర్లకోటలో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించే పరిస్థితి కనిపిస్తోంది. ఈ మున్సిపాలిటీ సమీపాన వేట్లపాలెం, మేడపాడు మేజర్ పంచాయతీల్లో వైఎస్సార్సీపీ అభిమానులు విజయం సాధించారు. ఈ మున్సిపాలిటీలోని 31 వార్డుల్లో రెండింటిని వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. 20 నుంచి 22 వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ► రామచంద్రపురంలోని 28 వార్డుల్లో 10 వార్డులను వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. 12 వార్డుల్లో వైఎస్సార్సీపీ గెలుపొందే సూచనలున్నాయి. పిఠాపురంలో 30 వార్డులున్నాయి. ఒక వార్డును ఏకగ్రీవంగా గెలుచుకున్న వైఎస్సార్సీపీ మరో 26 వార్డుల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి. నగర పంచాయతీల్లో.. వాణిజ్యపంటల కేంద్రమైన గొల్లప్రోలు నగర పంచాయతీలో 20 వార్డులున్నాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ చెరిసగం గెలుచుకున్నాయి. టీడీపీ అధికారబలంతో వైఎస్సార్సీపీ తరఫున గెలిచినవ్యక్తిని లోబరుచుకుని చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 15 వార్డులకుపైగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముమ్మిడివరం, ఏలేశ్వరం నగర పంచాయతీ పీఠాలను సైతం వైఎస్సార్సీపీ కైవశం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పారదర్శకంగా అమలుచేస్తోన్న సంక్షేమ పథకాలు పల్లె ప్రజలతో పాటు పట్టణ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. -
సొంత జిల్లాలో బాబుకు చుక్కెదురు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత జిల్లాలో మరోసారి చుక్కెదురైంది. చిత్తూరు జిల్లాలో ఎన్నికలు ఏవైనా వైఎస్సార్సీపీకి తిరుగులేదని రుజువైంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్లు ముఖ్యమంత్రి, 10 ఏళ్లు ప్రతిపక్షనేతగా చెప్పుకొనే చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల్లోనూ భంగపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగింది. జిల్లాలో మొత్తం 58 డివిజన్లు, 71 వార్డులు వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. నగిరి మున్సిపాలిటీలో మాత్రమే టీడీపీకి ఒక వార్డు ఏకగ్రీవమైంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో క్లీన్‌స్వీప్ చేశారు. ఇక్కడ మొత్తం 31 వార్డుల్ని వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. పలమనేరు, మదనపల్లె ఎన్నికలు ఏకపక్షంగా నిలవనున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో 84 శాతం విజయకేతనం ఎగురవేసిన వైఎస్సార్సీపీ మున్సిపోల్స్‌లో కూడా సత్తా చాటుకుంది. మొత్తం 130 స్థానాలు ఏకగ్రీవమైతే, అందులో 129 వైఎస్సార్‌సీపీవే. మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గం పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా నిలిచింది. ఇప్పుడు పుంగనూరు మున్సిపాలిటీ కూడా వైఎస్సార్సీపీ దక్కించుకుంది. కార్పొరేషన్లలో.. చిత్తూరు కార్పొరేషన్లో 50 డివిజన్లకుగాను 37 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరు మేయర్ పీఠం వైఎస్సార్సీపీకి దక్కడం లాంఛనమే. తిరుపతి కార్పొరేషన్లో 50 డివిజన్లకు 22 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 28 డివిజన్లలో కూడా పోటీ ఏకపక్షమేనని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో తిరుపతి మేయర్ పీఠం కూడా వైఎస్సార్సీపీకే దక్కనుంది. పలమనేరు, మదనపల్లెలో హవా పలమనేరులో 26 వార్డులకుగాను 18 వార్డుల్ని వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఈ మున్సిపల్ చైర్మన్ పదవి గెలుచుకునేందుకు అవసరమైన బలం ఇప్పటికే లభించింది. మదనపల్లెలో 35 వార్డులకు గాను 15 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రెండుచోట్ల ఎన్నికలు ఏకపక్షమేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నగరి మున్సిపాలిటీలో 7 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో 6 వార్డుల్ని వైఎస్సార్సీపీ, ఒక వార్డును టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకున్నాయి. పుత్తూరు మున్సిపాలిటీలో 1 వార్డును వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మొత్తంగా పరిశీలిస్తే చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీకి తిరుగులేదని, తెలుగుదేశం పార్టీ జవసత్వాలు కోల్పోయిందని నిరూపణ అయింది. -
'పురం'లోనూ ఫ్యాన్ హవా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పట్ల రాష్ట్రంలో తిరుగులేని ప్రజాదరణ వ్యక్తమవుతోందని మరోసారి స్పష్టమైంది. పురపాలక ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ఘన విజయం సాధించనుందని దాదాపు తేటతెల్లమైపోయింది. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న 12 నగర పాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు/ నగర పంచాయతీల్లో బుధవారం ముగిసిన నామినేషన్ల ప్రక్రియ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ ఏకంగా 571 వార్డులు/డివిజన్లను ఏకగ్రీవంగా గెలుచుకుంది. (తిరుపతిలో మరో డివిజన్ విషయంలో ఎన్నికల కమిషన్ గురువారం నిర్ణయం తీసుకోనుంది. అది కూడా వైఎస్సార్సీపీ పరం అయ్యే అవకాశాలున్నాయి). రాష్ట్రంలో మొత్తం 2,794 వార్డులు/డివిజన్లకు గాను 578 వార్డులు/డివిజన్లలో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాటిలో ఏకంగా 571 వార్డులు/డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలుపొందడం విశేషం. పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల మున్సిపాలిటీల్లో అన్ని వార్డులనూ వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. రాయచోటి, పలమనేరు, నాయుడుపేట, ఆత్మకూరు (కర్నూలు జిల్లా), డోన్ మున్సిపాలిటీలలో మూడింట రెండొంతుల వార్డులు వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. సూళ్లూరుపేట, కొవ్వూరు, తుని మున్సిపాలిటీల్లో సగం వార్డులను ఏకగ్రీవంగా గెలుచుకుని ఆ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం ఖాయమని తేల్చి చెప్పింది. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకూ ఏకగ్రీవాల్లో వైఎస్సార్సీపీ పూర్తి స్థాయిలో ఆధిపత్యం కనబరిచి ప్రజాభిప్రాయం తమ పక్షమే అని పునరుద్ఘాటించింది. ఏకగ్రీవాల్లో ‘ఫ్యాన్’ ప్రభంజనం పురపాలక ఎన్నికల్లో ఏకగ్రీవాల్లో ‘ఫ్యాన్’ ప్రభంజనం సృష్టించింది. మొత్తం ఏకగ్రీవాల్లో 98.80 శాతం వైఎస్సార్సీపీ పరమయ్యాయి. తిరుపతిలో ఓ డివిజన్లో మళ్లీ నామినేషన్‌కు ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చింది. దాంతో ఒకరు రీ నామినేషన్ వేశారు. కానీ రీ నామినేషన్‌కు అవకాశం ఇస్తూ ఎన్నికల కమిషన్ ఇచి్చన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. దాంతో ఆ డివిజన్లో వేసిన రీ నామినేషన్‌పై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇది చెల్లకపోతే ఆ డివిజన్‌ను కూడా వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంటుంది. ఇక రాష్ట్రంలో టీడీపీ అభ్యర్థులు 6 వార్డుల్లో, బీజేపీ అభ్యర్థి ఒక వార్డులో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 578 ఏకగ్రీవమైన వార్డులు/డివిజన్లలో 130 వార్డులతో చిత్తూరు జిల్లా మొదటి స్థానం సాధించగా, 120 వార్డులు/డివిజన్లతో వైఎస్సార్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. చిత్తూరు, తిరుపతి, కడప కార్పొరేషన్లలో హవా ► పోలింగ్‌తో నిమిత్తం లేకుండానే 3 నగర పాలక సంస్థలు, 13 పురపాలక సంఘాలను వైఎస్సార్సీపీ దక్కించుకోవడం ఖాయమని తేలిపోయింది. ► చిత్తూరు నగర పాలక సంస్థలో 50 డివిజన్లలో 37 ఏకగ్రీవంగా గెలుచుకుంది. తిరుపతి నగర పాలక సంస్థలో 50 డివిజన్లలో 21, కడప నగర పాలక సంస్థలో 50 డివిజన్లలో 23 డివిజన్లను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మున్సిపాలిటీలలో వైఎస్సార్సీపీ ఏకగ్రీవాలు ఇలా.. ► పులివెందుల (31), పుంగనూరు (31), పిడుగురాళ్ల (33), మాచర్ల (31) మున్సిపాలిటీలలో అన్ని వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఈ మున్సిపాలిటీలో పోలింగ్ నిర్వహించాల్సిన అవసరమే లేదు. ► రాయచోటిలో 34 వార్డులకు గాను 31, నాయుడుపేటలో 25 వార్డులకు గాను 23, పలమనేరులో 26 వార్డులకు గాను 18, డోన్‌లో 32 వార్డులకు గాను 22, ఆత్మకూరు (కర్నూలు జిల్లా)లో 24 వార్డులకు గాను 18, కొవ్వూరులో 23 వార్డులకు గాను 13, తునిలో 30 వార్డులకు గాను 15 వార్డులు వైఎస్సార్సీపీకి ఏకగ్రీవమయ్యాయి. సూళ్లూరుపేటలో 25 వార్డులకు గాను 15 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీలో 20 వార్డులకు గాను 12 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. విశాఖలో నాలుగు చోట్ల టీడీపీకి అభ్యర్థులు కరువు ► గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేందుకు నాలుగు వివిజన్లలో అభ్యర్థులు కరువయ్యారు. 15, 49, 72, 78 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు పోటీలో లేరు. ► వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, మైదుకూరు, రాయచోటి, పులివెందుల, బద్వేలు మున్సిపాలిటీల్లో కూడా వైఎస్సార్సీపీ పలు కౌన్సిలర్ స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకుంది. ► ఏలూరులో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు పోటీలో లేని చోట్ల తాను జనసేనకు ప్రచారం చేస్తానని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని అన్నారు. బుధవారం చింతమనేని కార్పొరేషన్ కార్యాలయం వద్దకు వచ్చి కొద్దిసేపు హల్చల్ చేశారు. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నారని తిట్ల దండకం అందుకున్నారు. ఏలూరులోని టీడీపీ నాయకులను కూడా ఇష్టారాజ్యంగా తిట్టారు. -
మున్సిపల్ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీదే హవా..
సాక్షి, తాడేపల్లి: తామందరమూ ఊహించిన విధంగానే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందనడానికి ఈ ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాలే నిదర్శనమన్నారు. ఏకగ్రీవాలు అధికంగా జరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా ఇవే ఫలితాలు ఉండేవని పేర్కొన్నారు. సుపరిపాలన అందిస్తే ప్రజల ఆశీస్సులు ఉంటాయనేది ఈ ఫలితాల ద్వారా స్పష్టమవుతోందన్నారు. ఫలితాలు వైఎస్సార్సీపీ అనుకూలంగా ఉంటాయని తెలిసే చంద్రబాబు కోవిడ్ చూపి ఎన్నికలను వాయిదా వేయించాడన్నారు. ఎస్ఈసీ విషయంలో చంద్రబాబు రోజుకో తీరులో మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఒక రోజు మెరునగధీరుడు అన్నారు.. ఇప్పుడేమో ఎస్ఈసీ మారిపోయాడంటున్నాడన్నారు. వలంటీర్ల సర్వీసులపై ఆంక్షలు పెట్టాలని ఎస్ఈసీ కుట్రలు పన్నినప్పటికీ, కోర్ట్ ఆ కేసును కొట్టేసిందని గర్తుచేశారు. ఎస్ఈసీ అధికార దుర్వినియోగం చేసి మళ్లీ నామినేషన్ వేయండని టీడీపీ వారిని కోరినా ఎవరూ ముందుకు రాలేదన్నారు. ఆ పార్టీపై నమ్మకం పోయింది కాబట్టే నామినేషన్ వేసే నాధుడే కరువయ్యాడన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల చేయడం అంత చెండాలం లేదనుకుంటే, ఇప్పుడు మళ్లీ మేనిఫెస్టో విడుదల చేయడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలను మేనిఫెస్టోలో పెట్టడం విడ్డూరంగా ఉందని, దీనిపై తాము ఈసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. 2014 మున్సిపల్ మేనిఫెస్టోలో 2 రూపాయలకే 20 లీటర్ల తాగునీరు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఆతరువాత ఆ ఊసే లేదన్నారు. ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో మేనిఫెస్టోని వెబ్ సైట్ నుంచి తీసేసిన ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. అధికారమే లేకుంటే మున్సిపల్ పన్నులు ఎలా తగ్గిస్తాడని చంద్రబాబును నిలదీశారు. చంద్రబాబుని పంచాయతీకి, మున్సిపాల్టీకి ముఖ్యమంత్రిని చేయాలని ఎద్దేవా చేశారు. ఆస్తి పన్ను సవరణకు సంబంధించి పారదర్శకంగా చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఆస్తిపన్నుపై చంద్రబాబు ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మరన్నారు. పంచాయతీల కంటే పట్టణ ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ అధిక స్థానాల్లో గెలుస్తందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. -
మున్సిపోల్స్: జిల్లాల వారిగా ఏకగ్రీవాల వివరాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. ఎన్నికలు జరుగనున్న 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 17,418 నామినేషన్లు దాఖలు కాగా, 2,900 మందికిపైగా అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాసేపట్లో అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల కమీషన్ అధికారికంగా ప్రకటించనుంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈనెల 10న జరుగనుండగా, 14న ఫలితాలు వెలువడునున్నాయి. ఇక ఏకగ్రీవాల విషయానికొస్తే.. పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ తన హవాను కొనసాగించింది. చిత్తూరు కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ పాగా.. చిత్తూరు కార్పొరేషన్ పరిధలోని 50 డివిజన్లకు గాను 37 డివిజన్లు ఏకగ్రీవం కావడంతో ఎన్నికలతో సంబంధం లేకుండా కార్పొరేషన్‌ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకంది. దీంతోపాటు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు మున్సిపాలిటీలు కూడా వైఎస్సార్సీపీ ఖాతాలో చేరాయి. మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఇక పలమనేరు మున్సిపాలిటీలో 26 వార్డులకు గాను 18 వార్డులు, నగరి మున్సిపాలిటీలో 7 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మదనపల్లి మున్సిపాలిటీలో 35 వార్డులకు గాను 15 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 19 డివిజన్లను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. వైఎస్సార్ జిల్లాలో తిరుగేలేదు.. పులివెందుల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 33 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయచోటి మున్సిపాలిటీలోని 34కు 34 వార్డులు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీ లోని 20 వార్డుల్లో 13 స్థానాల్లో, బద్వేలు మున్సిపాలిటీలోని 35 వార్డులకు గాను 10 వార్డుల్లో, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని 41 వార్డులకు గాను 9 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో 23 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్సీపీ ఖాతాలో డోన్, ఆత్మకూరు మున్సిపాలిటీలు.. కర్నూల్ జిల్లాలోని డోన్ మున్సిపాలిటీని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులకు గాను 22 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరధిలోని 24 వార్డులకు గాను 15 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు కార్పొరేషన్‌లోని 34, 35 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నంద్యాల మున్సిపాలిటీలో 42 వార్డులకు గాను 12, ఆళ్ళగడ్డ మున్సిపాలిటీలోని 27 వార్డులకు గాను 8, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 2, ఆదోని మున్సిపాలిటీలో 9, నందికొట్కూరు మున్సిపాలిటీలోని 29 వార్డులకు గాను 4 వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లాలోని గుత్తి మున్సిపాలిటీలో 6 వార్డులు, ధర్మవరం మున్సిపాలిటీలో 10 వార్డులు, గుంతకల్లు మున్సిపాలిటీలోని 3 వార్డులు, తాడిపత్రిలో 2 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. ప్రకాశం జిల్లాలో మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చీరాల మున్సిపాలిటీలోని 33 వార్డులకు గాను 3, గిద్దలూరు మున్సిపాలిటీలో 20 వార్డులకు 7, మార్కాపురం మున్సిపాలిటీలోని 35 వార్డులకుగాను 5 వార్డులు, కనిగిరి నగర పంచాయతీలోని 20 వార్డులకు గాను 7 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట మున్సిపాలిటీలోని 25 వార్డులకు గాను 13 వార్డుల్లో, ఆత్మకూరు మున్సిపాలిటీలోని 23 వార్డుల్లో 6 వార్డులు, నాయుడుపేట మున్సిపాలిటీలోని 25కి గాను 21 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాచర్ల, పిడుగురాళ్ల వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్.. గుంటూరు జిల్లాలోని మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. మాచర్ల మున్సిపాలిటీలోని మొత్తం 31 వార్డుల్లో, పిడుగురాళ్లలోని మొత్తం 33 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వినుకొండ మున్సిపాలిటిలో 7, రేపల్లె మున్సిపాలిటీలో 4, సత్తెనపల్లిలో 2, తెనాలిలో 2, గుంటూరు కార్పొరేషన్లో 1 డివిజన్( 48వ డివిజన్)ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతీలో 2 వార్డులు, తిరువూరు నగర పంచాయతీలో 2 వార్డులు, నూజివీడు మున్సిపాలిటీలోని 32 వార్డులకు గాను 2 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం, తుని మున్సిపాలిటీల్లోనూ వైఎస్సార్సీపీ హవా కొనసాగింది. రామచంద్రాపురం మున్సిపాలిటీలో 28 వార్డులకు గాను 10 వార్డులు, తుని మున్సిపాలిటీలోని 30 వార్డులకుగాను 15 వార్డులు, అమలాపురం మున్సిపాలిటీలోని 30 వార్డులకు గాను 6, పిఠాపురంలో 6, సామర్లకోటలో 28 వార్డుల్లో 2, ముమ్మిడివరంలో 20 వార్డుల్లో 1 వార్డును వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్లో 3 డివిజన్లు, కొవ్వూరు మున్సిపాలిటీలో 9 వార్డులు, నర్సాపురం మున్సిపాలిటీలో 31 వార్డులకు గాను 3 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. విశాఖ జిల్లాలోని యలమంచిలి మున్సిపాలిటీలో 25 వార్డులకు గాను 3 వార్డులను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మున్సిపాలిటీలో 20 వార్డులకుగాను 2 వార్డులు, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో 31 వార్డులకు గాను 2 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఏకగ్రీవం. విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీలోని 30 వార్డులకు గాను 6 వార్డులు, బొబ్బిలి మున్సిపాలిటీలో 1 వార్డులో వైఎస్సార్సీపీ ఏకగ్రీవం. -
మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను తగ్గిస్తాం
సాక్షి, అమరావతి: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ఆస్తి పన్ను పెంచుతుందని, తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే దానిని తగ్గిస్తూ కౌన్సిల్ మొదటి సమావేశంలోనే తీర్మానం చేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. మున్సిపల్ ఎన్నికలపై టీడీపీ నాయకులతో మంగళవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పట్టణాల్లో భారీగా ఆస్తిపన్ను పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామన్నారు. జగన్‌కు ఓటేస్తే ప్రజలపై భారం పడుతుందని తెలిపారు. అద్దె విలువ ఆధారంగా ఉండే పన్నులను రిజిస్ట్రేషన్ విలువ పెంచినప్పుడల్లా ఆస్తి పన్ను పెరిగేలా ఈ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా భారాలు వేసేందుకు చట్టాలు తీసుకొస్తున్నారని విమర్శించారు. అభ్యర్థులను కిడ్నాప్ చేసి బెదిరించే పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయన్నారు. ఇలాంటి అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొంటే ఏమీ చేయలేరన్నారు. భయపడి నామినేషన్లు వెనక్కుతీసుకోవడం పిరికిచర్య అన్నారు. రేపటి నుంచి బాబు ప్రచారం గురువారం నుంచి తాను మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చంద్రబాబు తెలిపారు. ఈ నెల 4న కర్నూలు, 5న చిత్తూరు, 6న విశాఖ, 7న విజయవాడ, 8న గుంటూరు జిల్లాల్లో రోడ్ షోలు నిర్వహిస్తానని చెప్పారు. -
ఎన్నికలతో వలంటీర్లకు సంబంధమే ఉండదు
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో వార్డు వలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకోకుండా చర్యలు తీసుకోవాలన్న ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంలో మంగళవారం వాదనలు ముగిశాయి. మున్సిపల్ ఎన్నికలకు వలంటీర్లను దూరంగా ఉంచేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, వలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, అయినా ఎన్నికల కమిషన్ స్పందించడం లేదంటూ విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కూడా వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు ఈ మూడు వ్యాజ్యాల్లో బుధవారం ఉత్తర్వులు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఓటర్ స్లిప్పులిచ్చేది బ్లాక్ స్థాయి అధికారులే.. రాష్ట్ర ప్రభుత్వ వ్యాజ్యంపై ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. వలంటీర్లు ఓటర్ స్లిప్పులను పంచుతున్నారన్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. బ్లాక్ స్థాయి అధికారులే ఓటర్ల స్లిప్పులను పంపిణీ చేస్తున్నారని, వలంటీర్లకు ఎన్నికలతో సంబంధం ఉండదని చెప్పారు. వలంటీర్ల వద్ద కేవలం తమ పరిధిలో ఉండే వివిధ పథకాల లబ్ధిదారుల వివరాలు మాత్రమే ఉంటాయి తప్ప, పౌరులందరి సమాచారం ఉండదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వలంటీర్లకు మొబైల్ ఫోన్లు ఎంతో ముఖ్యమని, వాటిలోనే లబ్ధిదారుల సమాచారం ఉంటుందన్నారు. మొబైల్ ఫోన్లు లేకుండా వారు సంక్షేమ పథకాలను అమలు చేయలేరని తెలిపారు. పింఛన్ నగదును నేరుగా లబ్ధిదారులకు వలంటీర్లే అందజేస్తున్నారని, మిగిలిన పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని వివరించారు. వలంటీర్ల వ్యవస్థను స్తంభింప చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ల తరఫు న్యాయవాది ఎన్.రంగారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల కమిషన్ వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉండాలంటూ ఆదేశాలిచ్చిన నేపథ్యంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యం నిరర్థకం అవుతుందన్నారు. ఫిర్యాదులొచ్చాయి కాబట్టే.. అంతకుముందు ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ.. వలంటీర్ల తీరుపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇతర పార్టీల సానుభూతిపరులకు ఓటర్ స్లిప్పులు ఇవ్వడం లేదన్నారు. పౌరుల సమాచారం మొత్తం వలంటీర్ల వద్ద ఉంటుందన్నారు. ఈ సందర్భంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, వలంటీర్ల వద్ద ఉన్న డేటా దుర్వినియోగం అవుతుందని ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. ప్రతి ప్రభుత్వం వద్ద పౌరుల సమాచారం ఉంటుందని, దాన్నెలా తప్పు పట్టగలమని ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తరఫున న్యాయవాది రాసినేని హరీ‹Ù, ఎమ్మెల్యే రామకృష్ణబాబు తరఫున న్యాయవాది ఎస్.ప్రణతి వాదించారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఈ మూడు వ్యాజ్యాల్లో బుధవారం ఉత్తర్వులు ఇస్తామని ప్రకటించారు. -
అన్నీ ఆయనే చేసేస్తే.. ఎన్నికల ట్రిబ్యునల్ ఎందుకు!
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత పలువురు అభ్యర్థులకు నామినేషన్ల దాఖలుకు అనుమతిస్తూ ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు చెందిన పలువురు అభ్యర్థులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని హైకోర్టును కోరారు. కమిషన్ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్ధించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు మంగళవారం విచారణ జరిపారు. గడువు ముగిశాక మళ్లీ అవకాశం ఇవ్వడం చట్టవిరుద్ధం పిటిషనర్ల తరఫున వీఆర్ రెడ్డి, ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తరువాత తిరిగి నామినేషన్లు దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వడం ఏపీ మున్సి’పాలిటీల చట్టానికి విరుద్ధమన్నారు. గత ఏడాది మొదలైన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయా వార్డులు, డివిజన్లకు పిటిషనర్లు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. కరోనా వల్ల ఎన్నికలు వాయిదా పడటంతో పిటిషనర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం అప్పట్లో సాధ్యం కాలేదన్నారు. ఒకే నామినేషన్ వచ్చిన చోట అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు ప్రకటిస్తామని అప్పట్లో ఎన్నికల కమిషనర్ తెలిపారని వివరించారు. అయితే, బలవంతంగా నామినేషన్లు ఉపసంహరణ జరిగిన వ్యక్తుల, బెదిరింపుల వల్ల నామినేషన్లు వేయని వ్యక్తుల నామినేషన్లను పునరుద్ధరించాలంటూ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశిస్తూ ఎన్నికల కమిషనర్ ఇటీవల ఉత్తర్వులిచ్చారని తెలిపారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా పలుచోట్ల నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇచ్చారని తెలిపారు. సహేతుక కారణాలు, తగిన ఆధారాలు లేకపోయినప్పటికీ నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇచ్చారని తెలిపారు. వాస్తవానికి ఓసారి నామినేషన్ల దాఖలు గడువు ముగిసిన తరువాత తిరిగి నామినేషన్ దాఖలుకు అవకాశం ఇవ్వడం చట్ట విరుద్ధమని, ఇందుకు ఏ చట్టం కూడా అంగీకరించదని వారు వివరించారు. ఇలా చేసే అధికారం ఎన్నికల కమిషనర్‌కు లేదన్నారు. ఒకవేళ పిటిషనర్ల నామినేషన్లపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే చట్టబద్ధంగా ఏర్పాటైన ఎన్నికల ట్రిబ్యునల్ ముందు సవాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇది తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. ఎన్నికల కమిషనర్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారు.. ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. విశేషాధికారాల పేరుతో ఎన్నికల కమిషనర్ ఇష్టానుసారం వ్యవహరించడానికి వీల్లేదన్నారు. ఎన్నికల కమిషనర్ అధికారాలకూ పరిమితులు ఉన్నాయని, ఈ విషయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పాయన్నారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించే ఎన్నికల అధికారులు ఓ సారి నామినేషన్లు ఆమోదించిన తరువాత అందులో ఎన్నికల కమిషనర్ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని, ఎన్నికల అధికారే సుప్రీం అని హైకోర్టు గతంలోనే తీర్పునిచ్చిందన్నారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని తేలినా వాటిపై ఎన్నికల ట్రిబ్యునల్‌కు వెళ్లాలని చట్టం చెబుతోందన్నారు. ఎన్నికల ట్రిబ్యునల్ చేయాల్సిన పనులను ఎన్నికల కమిషనర్ చేయడానికి వీల్లేదన్నారు. అన్నీ ఎన్నికల కమిషనరే చేసేస్తే, ఇక ఎన్నికల ట్రిబ్యునల్ ఎందుకని ప్రశ్నించారు. అక్రమాలు జరిగాయని ఎన్నికల కమిషనరే నిర్ధారిస్తే, ఎన్నికల ట్రిబ్యునల్ చేయడానికి ఏమీ ఉండదన్నారు. ఫిర్యాదులు వచ్చినందునే... ఎన్నికల కమిషన్ తరఫున న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగినప్పుడు వాటిపై స్పందించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బలవంతపు నామినేషన్లు ఉపసంహరణ, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం వంటి ఘటనలపై కమిషన్‌కు అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా నివేదికలు తెప్పించుకుని పరిశీలించాకే.. మళ్లీ నామినేషన్ల దాఖలుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. ఎన్నికల కమిషన్‌కు విశేషాధికారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. 14 చోట్ల నామినేషన్ల దాఖలుకు అనుమతినిచ్చామని, అయితే కేవలం 4 చోట్ల మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఈ వ్యాజ్యాలపై బుధవారం ఉత్తర్వులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. -
తొలి రోజు 2,472 నామినేషన్ల ఉపసంహరణ
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో 2,472 మంది అభ్యర్థులు మంగళవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఉపసంహరణకు మంగళవారం, బుధవారం అవకాశం ఇవ్వగా.. 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో తొలి రోజు నామినేషన్లు ఉపసంహరించుకున్న వారిలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు 1,070 మంది, టీడీపీ అభ్యర్థులు 738 మంది, జనసేన అభ్యర్థులు 76 మంది, బీజేపీ అభ్యర్థులు 77 మంది, సీపీఎం అభ్యర్థులు 34 మంది, సీపీఐ అభ్యర్థులు 18 మంది ఉండగా.. మిగిలిన వారు ఇండిపెండెంట్లు. ఏకగ్రీవాల్లో వైఎస్సార్సీపీదే ఆధిక్యత తొలి రోజు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం రాష్ట్రంలో దాదాపు 245 డివిజన్లు/వార్డులు ఏకగ్రీవమైనట్టు అనధికారిక సమాచారం. ఏకగ్రీవాల్లో వైఎస్సార్సీపీ పూర్తి ఆధిక్యం కనబరిచింది. వైఎస్సార్, చిత్తూరు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైంది. పులివెందుల మున్సిపాలిటీలో 33 వార్డులు ఉండగా.. ఒక్కొక్కటి చొప్పున మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. రాయచోటిలో 34 వార్డులకు గాను ఒక్కొక్క నామినేషన్ దాఖలు అయిన వార్డులు 28 ఉన్నాయి. కడప కార్పొరేషన్లో 18 డివిజన్లలో ఒక్కొక్క నామినేషన్ మాత్రమే ఉన్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. గుంటూరు జిల్లాలో 2 మున్సిపాలిటీల్లో అత్యధిక వార్డులు ఏకగ్రీవమయ్యేందుకు మార్గం సుగమమైంది. బుధవారం మధ్యాహ్నం 3 తర్వాత ఏకగ్రీవంగా ఎన్నిౖకైన డివిజన్లు/వార్డుల విషయంలో స్పష్టత వస్తుంది. -
వలంటీర్లపై ఎస్ఈసీ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో వార్డు వలంటీర్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ జారీచేసిన ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కమిషనర్ ఆదేశాలను ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా, పంచాయతీరాజ్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దుచేయాలని కోరుతూ గ్రామ వలంటీర్, వార్డు వలంటీర్, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. అజయ్‌జైన్ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ రూపంలో అత్యవసరంగా దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు విచారణ జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, ఎస్ఈసీ ఉత్తర్వులవల్ల పెన్షన్లు, నిత్యావసరాల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాల అమలు నిలిచిపోతుందన్నారు. వలంటీర్లకు రాజకీయాలతో సంబంధంలేదని, వారు స్వచ్ఛంద సేవకులని వివరించారు. పంచాయతీ ఎన్నికల్లో వలంటీర్లపై ఫిర్యాదులు వచ్చాయని, అందువల్ల మున్సిపల్ ఎన్నికల్లో వారు పాల్గొనకుండా ఉత్తర్వులిచ్చామని ఎస్ఈసీ చెబుతున్నారని.. వాస్తవానికి వలంటీర్లపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని శ్రీరామ్ తెలిపారు. నిర్దిష్టమైన ఆరోపణలుంటే చర్యలు తీసుకోవచ్చునని, అంతేతప్ప మొత్తం వలంటీర్ల వ్యవస్థనే స్తంభింపజేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదని ఆయన వివరించారు. వలంటీర్ల వ్యవస్థ వచ్చిన తరువాత గ్రామస్థాయిలో సంక్షేమ పథకాల అమలులో వేగం పెరిగిందని ఏజీ తెలిపారు. వలంటీర్లు ప్రతీనెలా మొదటి తేదీన లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తున్నారని.. ఇప్పుడు ఎన్నికల కమిషనర్ ఆదేశాలవల్ల పెన్షన్ అందజేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తనకు ఎలాంటి ఆదేశాలైనా ఇచ్చే అధికారాలున్నట్లు ఎన్నికల కమిషనర్ భావిస్తున్నారని, ఈ భావన సరికాదన్నారు. ఉద్యోగం నుంచి తొలగిస్తానని కూడా కమిషనర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారని, వాస్తవానికి వలంటీర్ల తొలగింపు అధికారం కమిషనర్‌కు లేదన్నారు. ఒకటో తేదీ పెన్షన్ మంజూరు చేసే రోజు అని, అందువల్ల పెన్షన్ మంజూరులో జోక్యం చేసుకోకుండా ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, రేపు చూద్దామని తెలిపారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి పిటిషన్ ఇదిలా ఉంటే.. తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు ముగిసే వరకు వార్డు వలంటీర్లను వారి విధుల నుంచి దూరంగా ఉంచేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని తెలిపారు. ఈ వ్యాజ్యంపై కూడా జస్టిస్ సోమయాజులు విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, వలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. అనంతరం న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. పురపాలక ఎన్నికలపై పిల్ కొట్టివేత గత ఏడాది పురపాలక ఎన్నికలు నిలిచిపోయిన దశ నుంచే ఇప్పుడు ఆ ఎన్నికలను ప్రారంభిస్తూ ఎన్నికల కమిషనర్ గత నెల 15న జారీ చేసిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. ఇందులో తాము ఏ రకంగా జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్లను సవాలు చేస్తూ తెలుగు రాష్ట్రాల కామన్‌మెన్ ఫోరం కన్వీనర్ జీవీ రావు హైకోర్టులో పిల్ వేశారు. కాగా, పురపాలక ఎన్నికల నోటిఫికేషన్లో జోక్యానికి నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీల్‌ను అత్యవసరంగా విచారణ జరపాలని సీనియర్ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, పి.వీరారెడ్డి సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. దీనికి స్పందించిన ధర్మాసనం, అప్పీల్‌ను భౌతికంగా ఫైలింగ్ చేస్తేనే విచారిస్తామని స్పష్టం చేసింది. -
మున్సిపాలిటీల్లోనూ పంచాయతీ ఫలితాలే..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: మున్సిపల్ ఎన్నికల్లోనూ పంచాయతీ ఫలితాలే రానున్నాయని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా ఇన్చార్జి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. గత 20 నెలలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న పథకాలే తమ పార్టీ గెలుపునకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఇన్చార్జి మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి ఆయన సోమవారం అనంతపురంలో ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంటరీ జిల్లా ఇన్చార్జీలు, పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీకి ఎన్నికల్లో పోటీచేసేందుకు కనీసం అభ్యర్థులు దొరకడం లేదని విమర్శించారు. ఈ పరిస్థితిని కప్పిపుచ్చుకునేందుకు నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను బెదిరిస్తున్నారంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించడం శోచనీయమన్నారు. తిరుపతి విమానాశ్రయంలో చంద్రబాబు నేలమీద కూర్చుని నాటకలాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు చంద్రబాబును నమ్మేస్థితిలో లేరన్నారు. ప్రజలకు అందే సంక్షేమ పథకాలు నిలిచిపోయి వారు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతోనే.. వలంటీర్ల నుంచి ఫోన్లు తీసుకోవాలంటూ ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం కోర్టుకు వెళ్లిందని చెప్పారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటిస్తామని.. అయితే ఈ పేరుతో ప్రజలను ఇబ్బందిపెట్టకూడదన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో పట్టణ ప్రజలపై భారీగా పన్నుల భారం మోపారని చెప్పారు. కనీసం ఏం చేయగలమో కూడా తెలియకుండానే, ప్రజలను మభ్యపెట్టే ఉద్దేశంతో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిందని విమర్శించారు. టీడీపీ పూర్తిగా నిరాశ, నిస్పృహల్లో ఉందని, అందుకే ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ తిరుపతి విమానాశ్రయంలో చంద్రబాబు నిరసన డ్రామాకు తెరలేపారని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి, అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. -
వలంటీర్ల ఫోన్ల స్వాధీనం సరికాదు
సాక్షి, అమరావతి: వార్డు వలంటీర్ల వద్ద ఉండే మొబైల్ ఫోన్లను కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదేశాలు జారీచేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఎన్నికల నిర్వహణలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సోమవారం ఆయన విజయవాడలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధులు నారాయణమూర్తి, పద్మజారెడ్డిలు హాజరుకాగా.. టీడీపీ నుంచి వర్ల రామయ్య, సీపీఎం నుంచి వైవీ రావు, సీపీఐ తరఫున జల్లి విల్సన్, కాంగ్రెస్ నుంచి మస్తాన్‌వలితో పాటు బీజేపీ, జనసేన తదితర పార్టీల ప్రతినిధులూ హాజరయ్యారు. మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవాలన్న ఆదేశాలవల్ల వార్డు వలంటీర్లు వారి రోజు వారీ విధులు నిర్వర్తించే పరిస్థితి ఉండదని, నిబంధనల పేరుతో వారికి ఆటంకాలు కలిగే నిర్ణయాలు తీసుకోవడం సరికాదని వైఎస్సార్సీపీ ప్రతినిధులు నిమ్మగడ్డ దృష్టికి తీసుకెళ్లారు. వృద్ధులు, వికలాంగులకు రవాణా సౌకర్యం వృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వ యంత్రాంగమే వారికి ఉచితంగా రవాణా సౌకర్యం ఏర్పాటుచేస్తుందని సమావేశంలో కమిషనర్ వివరించారు. అలాగే, ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని నిమ్మగడ్డ స్పష్టంచేశారు. కాగా, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పలుచోట్ల బదిలీలు జరుగుతున్నాయని పలువురు ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు నిమ్మగడ్డ దృష్టికి తీసుకురాగా.. ‘దీర్ఘకాలికంగా ఒకేచోట ఉన్న వారి బదిలీలకు తానే సీఎస్‌కు సిఫార్సు చేశానని, అందుకనుగుణంగానే మార్పులు జరుగుతున్నాయ’ంటూ కమిషనర్ బదులిచ్చారు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు: వర్ల పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని సమావేశంలో వర్ల రామయ్య ప్రస్తావించడంతో నిమ్మగడ్డ ఆయన్ను వారించి మున్సిపల్ ఎన్నికలపై మాట్లాడాలని సూచించారు. అయినా, అదే అంశాన్ని పెద్ద గొంతుతో పదేపదే ప్రస్తావిస్తుండడంతో ఎన్నికల కమిషనర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశానంతరం వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడుతూ, మేం మొన్నమొన్నటి వరకు చూసిన నిమ్మగడ్డలా ఆయన కనిపించడంలేదని.. ఆయనపై మాకు అనుమానాలున్నాయని, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
విశేషాధికారాల ముసుగులో.. టీడీపీ సేవ
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ప్రక్రియ ప్రారంభం నుంచి తెలుగుదేశం పార్టీకి మేలు చేకూర్చేలా ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తాజాగా మరో ఉత్తర్వు జారీచేశారు. ఈనెల 10న జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ఘట్టం ఎప్పుడో ముగిసిపోయినప్పటికీ కొందరు టీడీపీ నేతలకు మాత్రం ఇప్పుడు నామినేషన్ వేసుకునేందుకు తన విశేషాధికారాలతో అనుమతిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిశాక మళ్లీ వాటిని వేసేందుకు వీల్లేదని ఎన్నికల చట్టాలు స్పష్టంగా చెబుతున్నా నిమ్మగడ్డ వాటన్నింటినీ తోసిరాజని.. ఫిర్యాదులు, వినతులు వచ్చాయంటూ ఓ పార్టీకి లబ్ధిచేకూర్చేలా నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలను దెబ్బతీసేందుకే ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉందన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. మరోవైపు.. నామినేషన్లపై తామెంలాంటి ఫిర్యాదు చేయలేదని, వినతులు కూడా పంపలేదంటూ ఇద్దరు నేతలు స్పందించినట్లు తెలిసింది. తమ సంతకాలను ఎవరన్నా ఫోర్జరీ చేసి వినతులు పెట్టి ఉండొచ్చని, ఇప్పుడు నామినేషన్ల దాఖలుపై తమకెలాంటి ఆసక్తిలేదని వారు ఎన్నికల అధికారులకు స్పష్టంచేసినట్లు సమాచారం. వివరాలివీ.. తిరుపతి నగరపాలక సంస్థతో పాటు పుంగనూరు, రాయచోటి, ఎర్రగుంట్ల మున్సిపాలిటీల్లో మొత్తం 14 డివిజన్లు, వార్డులలో టీడీపీ అభ్యర్థులకు ఇప్పుడు ప్రత్యేకంగా నామినేషన్ల దాఖలుకు వీలుకల్పిస్తూ నిమ్మగడ్డ సోమవారం ఆదేశాలు జారీచేశారు. నిజానికి ఈ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ 2020 మార్చి 13నే ముగిసింది. ఆ మరసటి రోజు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయ్యాక కరోనా సాకుతో ఎన్నికల ప్రక్రియ వాయిదా వేశారు. అప్పుడు ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి తిరిగి కొనసాగిస్తున్నట్లు గత నెలలో ఎస్ఈసీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ల దాఖలు చేసుకోవడానికి ఇప్పుడు అవకాశంలేదు. కానీ, నిమ్మగడ్డ మాత్రం.. పలువురు టీడీపీ నేతలకు అవకాశం కల్పిస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ఏకగ్రీవాలను అడ్డుకునేందుకేనా!? నిజానికి తిరుపతి నగరపాలక సంస్థలోని ఆరు డివిజన్లలో సింగిల్ నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. అవీ వైఎస్సార్సీపీ అభ్యర్థులవే. అంటే ఇక్కడ వీరి ఎన్నిక దాదాపు ఏకగ్రీవమే. అయితే, ఇప్పుడు ఆ ఆరు డివిజన్లలో నామినేషన్లకు మళ్లీ అవకాశం కల్పించడమంటే వైఎస్సార్సీపీకి అయ్యే ఏకగ్రీవాలకు గండికొట్టి టీడీపీకి లబ్ధిచేకూర్చడమేనన్నది స్పష్టంగా తెలుస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పుంగనూరు, రాయచోటిలోనూ ఇదే లక్ష్యం కనపిస్తోందంటున్నారు. అవి ఫోర్జరీలేమో.. ఇదిలా ఉంటే.. పుంగనూరులోని 14, 28 వార్డుల్లో కొత్తగా నామినేషన్ దాఖలకు అవకాశం దక్కిన వారిలో ఇద్దరు నాయకులు ఎస్ఈసీ నిర్ణయంపై విస్మయం వ్యక్తంచేసినట్లు తెలిసింది. తాము అసలు కొత్తగా నామినేషన్ వేసేందుకు జిల్లా కలెక్టరుకుగానీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కుగానీ ఎలాంటి వినతులు పంపలేదని.. తమ సంతకాలను ఎవరన్నా ఫోర్జరీ చేసి వినతులు పెట్టి ఉండొచ్చని వారు ఎన్నికల అధికారులకు తెలియజేసినట్లు సమాచారం. ఇప్పుడు నామినేషన్ల దాఖలుపై తమకెలాంటి ఆసక్తి కూడా లేదని వారు స్పష్టంచేసినట్లు తెలిసింది. అప్పుడు అడ్డుకున్నారంటూ.. తిరుపతి నగరపాలక సంస్థలోని 2, 8, 10, 21, 41, 45 డివిజన్లలో ఐదుగురు టీడీపీ, ఒక బీజేపీ నేత పేర్లను ప్రత్యేకంగా తెలియజేస్తూ మంగళవారం సా.3 గంటల వరకు వారి నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లుచేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అలాగే, పుంగనూరు మున్సిపాలిటీలోని 9, 14, 28 వార్డులు.. వైఎస్సార్ జిల్లా రాయచోటి మున్సిపాలిటీలోని 20, 31 వార్డుల్లో ఐదుగురు టీడీపీ నేతల పేర్లను ప్రత్యేకంగా పేర్కొన్నారు. గతంలో వీరు నామినేషన్లు వేయడానికి సిద్ధపడగా, ప్రత్యర్థులు వీరిని అడ్డుకున్నట్లుగా తాను నిర్ధారణకు వచ్చానని నిమ్మగడ్డ పేర్కొన్నారు. అలాగే, వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో కూడా 6, 11, 15 వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత ముగ్గురితో వారి ప్రత్యర్థులు బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేశారని.. వారికీ ఇప్పుడు మళ్లీ నామినేషన్ దాఖలకు అవకాశం కల్పిస్తున్నట్లు నిమ్మగడ్డ ఆదేశాలు జారీచేశారు. -
వైఎస్సార్సీపీలో చేరిన మాజీ మేయర్ బంగి
సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): కర్నూలు కార్పొరేషన్ మాజీ మేయర్, టీడీపీ నేత బంగి అనంతయ్య సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ పార్టీ కండువా వేసి.. ఆయన్ని వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. అనంతయ్య 1995వ సంవత్సరం నుంచి 2000 వరకు కర్నూలు మేయర్‌గా పనిచేశారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు లక్ష్మయ్య, సురేష్, రవిశంకర్, గణేష్, రఘు రాణా ప్రతాప్, శంకర్, చిరంజీవి సహా దాదాపు వంద మంది వైఎస్సార్సీపీలో చేరారు. బంగి అనంతయ్య మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి వైఎస్సార్సీపీలో చేరినట్లు చెప్పారు. కర్నూలుతో పాటు రాష్ట్రాభివృద్ధి సీఎం జగన్‌తోనే సాధ్యమన్నారు. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించటం ఖాయమని చెప్పారు. -
‘పుర’ జనులది కూడా గ్రామీణుల బాటే!
ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న పురపాలక సంఘాల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రజలు పట్టం కట్టనున్నారన్న విషయం సుస్పష్టమయింది. రాష్ట్రంలో 12 కార్పొరేషన్లు, 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు జరగనున్న ఎన్నికల్లోనూ వైసీపీనే విజయం సాధించడం తథ్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న విపక్షాలు పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఇప్పటికే మట్టికరిచాయి. అన్ని సామాజిక వర్గాల్లోని పేదలూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని స్వాగతిస్తున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా జిల్లాలన్నింటిలో వైఎస్ జగన్ నాయకత్వమే ఈ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి శరణ్యమని ప్రజల్లో గట్టి నమ్మకంగా నిలిచింది. మూడు రాజధానుల నిర్ణయాన్ని వివాదాస్పదం చేస్తూ టీడీపీ చేపట్టిన అమరావతి ఉద్యమం బూటకమని, దీనికి ప్రజామద్దతు లభించలేదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. అమరావతిలోనూ 80 శాతానికి పైగా పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులే విజయం సాధించడం నిజం. ప్రభుత్వమంటే కాగితాల మీద పంచరంగుల సింగపూర్, మలేషియా చిత్రాలతో మాయ చేయడం కాదని, ప్రజల్ని పంచప్రాణాలుగా పరిరక్షించుకుంటున్న జగన్ పాలనే నిజమైన ప్రభుత్వమని ప్రజలు భావిస్తున్నారు. లక్షలాది మంది పట్టణ పేదలకోసం ప్రభుత్వం సంక్షేమపథకాలు అమలుచేస్తోంది. వీటిలో ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, పెన్షన్ కానుక, కాపునేస్తం, పేదలందరికీ ఇల్లు, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, విద్యాదీవెన, వసతిదీవెన, చేయూత, వాహనమిత్ర, విద్యాకానుక, జీవక్రాంతి పథకాలు, డ్వాక్రా మహిళలకు ఆర్ధిక భరోసా, విద్యా, వైద్య సంస్థల్లో ‘నాడునేడు’ పథకం ద్వారా అభివృద్ధి పనులు వంటి వాటితోపాటు ఇప్పుడు అగ్రకుల పేద మహిళలకు సైతం ఆర్థిక సహాయాన్ని జగన్ ప్రభుత్వం అందించనుంది. అభివృద్ధి పనులను విమర్శించడం తప్ప ప్రజలకు ముఖం చూపించలేకపోతున్న టీడీపీ నాయకులు ఇక పుర ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగగలరనే ప్రశ్నగా మిగులుతుంది. పుర ఎన్నికల సందర్భంగా టీడీపీనేత లోకేష్ తన ఎన్నికల మేని ఫెస్టో ప్రకటించారు. దీనిలో అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుస్తామని పేర్కొన్నారు. నేటి ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ సరుకులు తీసుకెళ్ళి అందజేస్తుంటే దీనిని కోట్లాది రూపాయల దుబారా ఖర్చుగా టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా ఫలహారాలు, భోజనాలు ఉచితంగా సంతర్పణ చేయడం దుబారా ఖర్చు కిందకు ఎందుకు రాదో వారు గుర్తించగలగాలి. ఆటో డ్రైవర్లకు తమ వాహనాలను బాగుచేసుకోమని పదివేల రూపాయల సహాయాన్ని అందిస్తే విచ్చలవిడిగా డబ్బు విసిరేస్తున్నారని ఎద్దేవా చేసిన టీడీపీనేతలు ఇప్పుడు శాశ్వత ఆటో స్టాండ్లు నిర్మిస్తామనే విషయాన్ని తెరమీదకు తీసుకురావడం విడ్డూరం. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా లబ్ధిదారులకు అందించిన సున్నావడ్డీ రుణాలు, పట్టణపేదలకు టీడ్కో ఇళ్లని లోకేష్ తన మేనిఫెస్టోలో పేర్కోవడం హాస్యాస్పదం. కరోనా తీవ్రంగా ప్రబలుతున్న సమయంలో అవిశ్రాంతమైన సేవలందించిన పారి శుధ్య కార్మికులకు స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు, అధికారులతో అభినందన కార్యక్రమాలు నిర్వహించింది జగన్ ప్రభుత్వం. అంతేగాక వారికి బీమాతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు లోకేష్ పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామనడం చాలా వింతగా వుందని వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నారు. అభాగ్యులకు అన్నక్యాంటీన్లు, ఆడపడుచులకు పసుపు, కుంకుమ సౌభాగ్యంగా అందించినా గత ఎన్నికల్లో ఘోర పరాజయం పొందింది టీడీపీ. పారదర్శకంగా అమలు జరుగుతున్న పేదల సంక్షేమం మీద దుష్ప్రచారం చేయడం దినచర్యగా టీడీపీ నేతలు ఆచరిస్తున్నట్టు కనిపిస్తోంది. నిరంతరం నిరాధారమైన, నీతిలేని విమర్శలు కొనసాగిస్తూనే వున్నారు. పురఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రజలు పట్టం కట్టనున్న అఖండ విజయాన్ని కూడా కళ్ళారా చూసిన తర్వాతైనా వాళ్ళ వైఖరి మారుతుందేమో వేచిచూడాలి. డా. జీకేడీ ప్రసాద్‌రావు వ్యాసకర్త ఫ్యాకల్టీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఏయూ, విశాఖపట్నం మొబైల్ : 93931 11740 -
ఈసీ నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాలైన 11 చోట్ల రీ నామినేషన్‌కి అవకాశం కల్పించారు. నామినేషన్ వేయకుండా అడ్డుకుని బలవంతంగా ఏకగ్రీవం చేయించుకున్నందునే రీ నామినేషన్‌కి అవకాశమిస్తున్నట్లు సోమవారం జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి కార్పోరేషన్లో ఆరు, పుంగనూరు మున్సిపాలిటీలో మూడు, కడప జిల్లా రాయచోటిలో రెండు ఏకగ్రీవాలలో రీ నామినేషన్ జరగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ వేసేందుకు అవకాశం ఉంది. ఏకగ్రీవంగా ఎన్నికైన ఆ 11 చోట్ల రీనామినేషన్‌కు అవకాశం ఇవ్వడంపై గెలిచిన అభ్యర్ధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఈసీ నిర్ణయంపై కోర్టుని ఆశ్రయించనున్నారు. చదవండి : ‘దాని కోసమే చంద్రబాబు ఇంత డ్రామా చేస్తున్నారు’ -
ఎన్నికలకు 55,840 మంది సిబ్బంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు/నగర పంచాయతీలకు మార్చి 10న నిర్వహించనున్న ఎన్నికల కోసం పురపాలక శాఖ సర్వసన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో 9,308 పోలింగ్ కేంద్రాల్లో ఒకేసారి నిర్వహించనున్న ఈ భారీ పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అంతేస్థాయిలో ఎన్నికల సిబ్బందిని వినియోగించాలని నిర్ణయించింది. అందుకు వివిధ స్థాయిల్లో అధికారులు, సిబ్బంది కలిపి మొత్తం 55,840 మందిని భాగస్వాములను చేయనుంది. అందుకోసం జిల్లాల వారీగా, ఎన్నికలు జరగనున్న స్థానిక సంస్థల వారీగా ప్రతిపాదనలను రూపొందించి ఆమోదించింది. ఆ వివరాలు.. ► మున్సిపల్ ఎన్నికల కోసం మొత్తం 55,840 మంది అధికారులు, సిబ్బందిని వినియోగించనున్నారు. వారిలో రిటర్నింగ్ అధికారులు, అదనపు రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతోపాటు ఇతర అధికారులు, సిబ్బంది ఉంటారు. ► ఎన్నికలు జరగనున్న 12 నగరపాలక సంస్థల్లో మహా విశాఖపట్నం (జీవీఎంసీ) మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 1,712 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 17.52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకు రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో 10,271 మంది అధికారులు, సిబ్బందిని కేటాయించారు. ► అలాగే, నగరపాలక సంస్థల్లో మచిలీపట్నంలో తక్కువ మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఇక్కడ 133 పోలింగ్ కేంద్రాల్లో 1.33 లక్షల మంది మాత్రమే ఓటు హక్కువినియోగించుకోనున్నారు. ఇందుకు 799 మంది అధికారులు, సిబ్బందిని కేటాయించారు. ► మరోవైపు.. ఎన్నికలు జరగనున్న పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో నంద్యాలకు అత్యధికంగా ఎన్నికల సిబ్బందిని కేటాయించారు. 170 పోలింగ్ కేంద్రాల్లో 1.86 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక్కడ 1,084 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. అలాగే, కర్నూలు జిల్లా గూడూరులో తక్కువ మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. 20 వార్డుల్లో 50,758 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్న ఈ నగర పంచాయతీలో కేవలం 120 మంది సిబ్బందిని మాత్రమే కేటాయించారు. సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణ ఇక ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది గుర్తింపు ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. పురపాలక శాఖతోపాటు ఇతర ప్రభుత్వ శాఖలు, వార్డు సచివాలయాల సిబ్బందిని ఎన్నికల విధుల కోసం వినియోగించనున్నారు. ఎన్నికలకు అవసరమని భావించిన మొత్తం 55,840 మందికి గాను ఆదివారం నాటికి 48,141 మందిని గుర్తించారు. వారిలో 43,012 మందిని విధుల్లో నియమించారు. మిగిలిన వారిని సోమవారం గుర్తించి నియామక ప్రక్రియ పూర్తిచేస్తారు. ఇక ఎన్నికల సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నారు. మార్చి 1, 2 తేదీల్లో మొదటి విడత.. 6, 7 తేదీల్లో రెండో విడత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. -
ఎన్నికల్ని కబ్జా చేస్తున్నారు
సాక్షి, అమరావతి/చిత్తూరు అర్బన్: వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను కూడా కబ్జా చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న తమ పార్టీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతిలో 20 ఏళ్లుగా టీకొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు దుకాణాన్ని తొలగించారని.. శ్రీకాకుళం జిల్లా పలాసలో తమ అభ్యర్థులను బెదిరించి వైఎస్సార్సీపీలో చేర్చుకున్నారని విమర్శించారు. జగన్స్వామ్యంలో ప్రజాస్వామ్యం జీవచ్ఛవమైందని పేర్కొన్నారు. నేడు చిత్తూరులో చంద్రబాబు ధర్నా టీడీపీ అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ చిత్తూరు జిల్లా నేతలు ఫిర్యాదు చేయడంతో అక్కడ నిరసన తెలియచేయడానికి చంద్రబాబు సోమవారం చిత్తూరు నగరానికి రానున్నారని పార్టీ నేతలకు సమాచారం అందింది. ఇదిలా ఉండగా ఈ నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించినట్టు పోలీసులు చెప్పారు. -
నామినేషనే వేయని వారికి ఇప్పుడు అవకాశం కుదరదు
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో గతంలో అసలు నామినేషన్ దాఖలు చేయని అభ్యర్థులకు ఇప్పుడు అవకాశమివ్వడానికి, స్కూృటినీలో తిరస్కరణకు గురైన వాటిని తిరిగి పునరుద్ధరించడానికి ఎన్నికల నిబంధనలు అంగీకరించవని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ నిబంధనలకు లోబడి కొన్ని పరిమితుల మేరకు బలవంతపు చర్యల ద్వారా నామినేషన్లు విరమించుకున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై సోమ లేదా మంగళవారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఇతర జిల్లాల అధికారులతో నిమ్మగడ్డ విజయవాడలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. తర్వాత ఆయా జిల్లాల రాజకీయ పార్టీ నేతలతోనూ వర్చువల్ సమావేశంలో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మున్సిపల్ ఎన్నికల్లో బలవంతం మీద నామినేషన్లు ఉపసంహరించుకున్న విషయంలో అభ్యర్థిత్వాల పునరుద్ధరణను బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పరిగణనలోకి తీసుకుంటాం. అలాంటి ఫిర్యాదులపై కొన్ని జిల్లాల నుంచి నివేదికలు వచ్చాయి. మరికొన్ని చోట్ల నుంచి కూడా తెప్పించుకుంటాం. పాక్షికంగా పునరుద్ధరించడం రాష్ట్రస్థాయిలో జరుగుతుంది’ అని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ చర్యల వల్ల కరోనా నియంత్రణలోకి వచ్చినప్పటికీ.. మున్సిపల్ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం ఐదుగురు మించి చేయడానికి వీలులేదన్నారు. అతిక్రమిస్తే క్రిమినల్ చర్యగా పరిగణిస్తామన్నారు. పరిమితంగా రోడ్డు షోలకు అనుమతిస్తామన్నారు. సోమవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామన్నారు. -
వలంటీర్లను మున్సిపోల్స్‌కు దూరంగా ఉంచండి
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో వార్డు వలంటీర్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ విధంగానూ పాల్గొనకుండా వారిని పూర్తిగా దూరం పెట్టాలని కలెక్టర్లను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఆదేశించారు. ఈ మేరకు ఎస్ఈసీ కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని నిబంధనలు వలంటీర్లకూ వర్తిస్తాయన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థికి అనుకూలంగా వలంటీర్లు వ్యవహరిస్తే నేరపూరిత చర్యగా పరిగణిస్తామన్నారు. ఓటర్ల స్లిప్‌ల పంపిణీ బాధ్యతలను కూడా వలంటీర్లకు అప్పగించవద్దని ఆదేశించారు. వలంటీర్ల కదలికలను నిశితంగా పరిశీలించాలన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశం లేకుండా వలంటీర్ల ఫోన్లను స్వాదీనం చేసుకోవాలన్నారు. కాగా, వారి సాధారణ విధుల నిర్వహణకు ఎలాంటి అడ్డంకులుండవన్నారు. -
వార్డు వాలంటీర్లపై ఎస్ఈసీ కఠిన ఆంక్షలు