
టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఇక్బాల్, గోపాల్‌రెడ్డి, శమంతకమణి దరఖాస్తులను ఈసీ తిరస్కరించింది.
అనంతపురం: తాడిపత్రి ఎక్స్‌అఫిషియో ఓట్ల కేటాయింపులో ట్విస్ట్ చోటుచేసుకుంది. నలుగురు ఎమ్మెల్సీలకు ఎక్స్‌అఫిషియో ఓటును ఈసీ తిరస్కరించింది. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఇక్బాల్, గోపాల్‌రెడ్డి, శమంతకమణి దరఖాస్తులను ఈసీ తిరస్కరించింది. తాడిపత్రిలో ఓటు హక్కు లేనందున ఎమ్మెల్సీలకు ఎక్స్‌అఫిషియో తిరస్కరించారని.. ఓటు హక్కు ఉన్న చోటే సభ్యత్వం ఉంటుందని కమిషనర్ తెలిపారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, అనంతపురం ఎంపీ రంగయ్యకు ఎక్స్‌అఫిషియో ఓట్లు జారీ అయ్యాయి. 18న తాడిపత్రి మున్సిపల్ సమావేశానికి హాజరుకావాలని అధికారులు లేఖ రాశారు.
చదవండి:
ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చు.. కానీ
ఏం చంద్రబాబు ఇప్పుడేమంటారు..?