సాక్షి, విజయవాడ: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మరోసారి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అసహనంతో ఊగిపోయారు. ఎన్నికల ప్రచారంలో ఆయన అక్కసు వెళ్లగక్కారు. టీడీపీకి ఓట్లు వేయలేదని ఉక్రోశంతో ప్రజలను దూషించారు. కోపం రాదా? రోషం రాదా? అంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. పాచి పనులు చేసేందుకు హైదరాబాద్, బెంగళూరు వెళ్లండంటూ ప్రజలకు చంద్రబాబు శాపనార్ధాలు పెట్టారు. ఓటు వేసేందుకు డబ్బులు తీసుకుని ఊడిగం చేయండంటూ ప్రజలను దూషించారు. చంద్రబాబు తీరుపై ప్రజలు విస్తుపోయారు. ఆయన వ్యాఖ్యలపై విజయవాడ స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘‘ప్రజలు బరితెగించాలి’’ అంటూ శనివారం విశాఖలో రోడ్‌షోలో చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. ‘‘ఏం పీకుతావ్.. గడ్డిపీకుతావా.. నీ అబ్బ జాగీరా..’’ అంటూ తిట్ల వర్షం కురిపించారు. పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఒకవైపు.. మున్సిపల్ ఎన్నికల్లోనూ పరాజయం తప్పదన్న వాస్తవం మరోవైపు చంద్రబాబులో తీవ్ర అసహనానికి కారణమవుతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. విశాఖ, విజయవాడలో మాత్రమే కాదు.. గత కొద్ది రోజులుగా చంద్రబాబు ఇలానే అదుపు తప్పి మాట్లాడుతున్నారు.
చదవండి:
విశాఖ రోడ్‌షోలో చంద్రబాబు విచిత్రమైన పిలుపు
‘హెరిటేజ్ అంతా పాపాల పుట్ట’
Comments
Please login to add a commentAdd a comment