
సాక్షి, అనంతపురం: టీడీపీ అభిమానిపై ఎమ్మెల్యే బాలకృష్ణ చేయి చేసుకోవడాన్ని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఖండించారు. శనివారం అనంతపురంలోని 25వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాస్‌కు మద్దతుగా గోరంట్ల మాధవ్, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ప్రచారం నిర్వహించారు. ఎంపీ మాధవ్ మాట్లాడుతూ.. రాత్రి మందు తాగడం.. పగలు ప్రజలను కొట్టడం ఎమ్మెల్యే బాలకృష్ణకు మామూలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి ఓటేసిన పాపానికి అభిమానులు శిక్ష అనుభవించాలా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment