
పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బందితో ఫొటోలు దిగుతున్న బాలకృష్ణ
సాక్షి, హిందూపురం: ఓటేసేందుకు అనంతపురం జిల్లా హిందూపురం రెండో వార్డు చౌడేశ్వరీకాలనీలోని పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన బాలయ్య, ఆయన సతీమణి వసుంధరలు హంగామా చేశారు. క్యూలో నుంచుని ఓటర్లకు నమస్కారాలు చేస్తూ, నవ్వుతూ పలకరిస్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నించారు. మీడియాకు ఫోజులిస్తూ అక్కడి ఓటర్లు, పోలీస్, పోలింగ్ సిబ్బందితో మాట్లాడటం గమనార్హం. ఓటు వేసి అక్కడి పోలింగ్ సిబ్బందిని పలకరించి వారితో ఫొటోలు దిగారు.