ఇక టీడీపీ చాప్టర్‌ క్లోజ్‌: విజయసాయిరెడ్డి | Vijaya Sai Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

ఇక టీడీపీ చాప్టర్‌ క్లోజ్‌: విజయసాయిరెడ్డి

Published Sun, Mar 7 2021 5:38 AM | Last Updated on Sun, Mar 7 2021 10:06 AM

Vijaya Sai Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడినా జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ భారీ విజయం సాధిస్తుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల తరువాత టీడీపీ చాప్టర్‌ క్లోజ్‌ అవుతుందన్నారు. పురపాలక, కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఒక్కచోట కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం 85 నుంచి 90 శాతం స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పారు. చంద్రబాబు ఎన్ని మాయమాటలు, అబద్ధాలు చెప్పినప్పటికీ ప్రజలు విశ్వసించే అవకాశం లేదన్నారు. చంద్రబాబు సినిమాకు ప్రజలు ముగింపు పలకబోతున్నారని చెప్పారు.

వాళ్లిద్దరూ రాబందులు 
చంద్రబాబు, అతని కొడుకు పప్పునాయుడు రాబందులని ఘాటుగా విమర్శించారు. టీడీపీ హయాంలో పరిశ్రమలు, హౌసింగ్, ఇతరత్రా పేరు మీద భూములను తమ అనుయాయులకు దోచిపెట్టారని ఆరోపించారు. భూ దందాలు, ఆక్రమణలు, దొంగతనంగా భూములు రాయించుకోవడం వంటి దుర్మార్గాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. అందుకే టీడీపీకి దొంగల పార్టీగా ముద్ర పడిందని పేర్కొన్నారు. పెద్దల రూపంలో ఉన్న భూకబ్జాదారులకు మేలు చేసే ఈ ముఠా విశాఖను ఛిద్రం చేసిందన్నారు. ఈ ముఠా చెరబట్టిన భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుంటే చంద్రబాబు, అతని కొడుకు లోకేశ్‌ తట్టుకోలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాబందులను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని విజయసాయిరెడ్డి   ప్రజలకు పిలుపునిచ్చారు.

ఏ మొహం పెట్టుకుని విశాఖలో తిరుగుతున్నాడు 
విశాఖను రాజధాని కాకుండా అడ్డుకుంటూ విశాఖపై విష ప్రచారం చేస్తున్న చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని నగరంలో పర్యటిస్తున్నారని విజయసాయిరెడ్డి ప్రశి్నంచారు. ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు, లోకేశ్‌లను ప్రజలు తరిమికొట్టే సమయం వచి్చందన్నారు. వీరు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ విశాఖ కార్యనిర్వాహక రాజధాని అవడం ఖాయమని పునరుద్ఘాటించారు. ప్రశాంత వాతావరణంతో అందమైన నగరంగా విశాఖను తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement