సాక్షి, తిరుపతి: ఆంధ్రపదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం వరకు 42.84 శాతం పోలింగ్ నమోదయ్యింది. మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోంది. దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యింది. తిరుపతి 43వ డివిజన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దొంగ ఓట్లు వేయించేందుకు టీడీపీ విఫలయత్నం చేసింది. కానీ చివరి నిమిషయంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు గుర్తించి అభ్యంతరం తెలిపారు. దొంగ ఓట్లు వేయకుండా అడ్డుకున్నారు.
ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఐదుగురు మహిళలు సహా 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా రామచంద్రాపురం మండలం మొండేడుపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
విశాఖలో..
విశాఖపట్నం 5 వార్డులో దొంగ ఓట్లు వేయడానికి టీడీపీ కార్యకర్తలు తీసుకువచ్చిన వచ్చిన వారిని వైఎస్సాఆర్‌సీపీ కార్యకర్తలు సారిపల్లి గోవింద, వార్డు ఇన్చార్జి తుళ్ళి చంద్రశేఖర యాదవ్ పట్టుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించిచారు. టీడీపీ నేతలకు ఓడిపోతామనే భయం పట్టుకుందని.. అందుకే ఇలా అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment