సాక్షి, తాడేపల్లి: మున్సిపల్ ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి అన్నారు. ఇప్పటికే 571 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. ఈ మేరకు తాడేపల్లిలో గురువారం ఆయన మాట్లాడుతూ.. పేదల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని అన్నారు. 20 నెలల కాలంలో ప్రజల్లో సీఎం సుస్థిరస్థానం సంపాదించుకున్నారని.. ఈ నేపథ్యంలో ప్రజలు తమ అభిమానాన్ని చాటుతూ వైస్సార్‌సీపీకి మద్దతుగా నిలుస్తున్నారన్నారు. మరోవైపు ఏకగ్రీవాలపై ఎల్లో మీడియాలో దిగజారుడు కథనాలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బెదిరింపులతో నామినేషన్ల ఉపసంహరణ జరగవని స్పష్టం చేశారు.
ఎల్లో మీడియా కథనాలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని సజ్జల పేర్కొన్నారు. పార్టీ తరపున పరువునష్టం దావా వేస్తామని అన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని, అబద్ధాలతో ప్రజలను మోసం చేద్దామని బాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 20నెలల్లో సాధించిన ప్రగతిని ప్రజల ముందు పెడతామని, అధికారంలోకి రాగానే 4 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు. లబ్ధిదారుల ఖాతాల్లోకే నేరుగా నగదు జమ చేస్తున్నామని, సంక్షేమాన్ని ప్రజల ఇంటి వద్దకే తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. మహిళలను బలోపేతం చేసే అన్ని కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. మంచి చేసిన ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో మద్దతు పలకాలని కోరారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment