
బంగి అనంతయ్యను పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్
సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): కర్నూలు కార్పొరేషన్ మాజీ మేయర్, టీడీపీ నేత బంగి అనంతయ్య సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ పార్టీ కండువా వేసి.. ఆయన్ని వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. అనంతయ్య 1995వ సంవత్సరం నుంచి 2000 వరకు కర్నూలు మేయర్‌గా పనిచేశారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు లక్ష్మయ్య, సురేష్, రవిశంకర్, గణేష్, రఘు రాణా ప్రతాప్, శంకర్, చిరంజీవి సహా దాదాపు వంద మంది వైఎస్సార్‌సీపీలో చేరారు.
బంగి అనంతయ్య మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి వైఎస్సార్‌సీపీలో చేరినట్లు చెప్పారు. కర్నూలుతో పాటు రాష్ట్రాభివృద్ధి సీఎం జగన్‌తోనే సాధ్యమన్నారు. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించటం ఖాయమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment