Abdul Hafeez
-
ఈ రాష్ట్రానికి జగనన్న అవసరం ఎంతో ఉంది
-
చంద్రబాబు స్కిల్ స్కీమ్ పై ఎమ్మెల్యే ఫైర్
-
కర్నూలు కు ఏమిచేయని చంద్రబాబు ఇప్పుడు ఓట్లకోసం వస్తున్నాడు : ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
-
దమ్ముంటే కర్నూలు నుంచి పోటీ చెయ్!
కర్నూలు(రాజ్‌విహార్): జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవాలని కర్నూలు ఎమ్మెల్యే ఎంఎ హఫీజ్‌ఖాన్ అన్నారు. ఆదివారం కర్నూలు పాతబస్తీలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు చోట్ల పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన పవన్‌కు ప్రజా సంక్షేమ పాలనపై విమర్శించే అర్హత లేదన్నారు. ఆయన ఉనికిని కాపాడుకునేందుకే పర్యటనలు చేస్తున్నారని, నిజంగా ప్రజాబలం ఉంటే కర్నూలులో పోటీ చేయాలన్నారు. గోదావరి జిల్లాల కంటే ఇక్కడ ఘోరంగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతూ పర్యటనలు చేస్తున్నారు తప్ప ప్రజా మేలు కోసం కాదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీల్లో 95 శాతానికి పైగా అమలు చేశారని, అందులో అత్యధిక శాతం బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు మేలు చేసేవి ఉన్నాయన్నారు. పవన్ ఒకవైపు బీజేపీతో కాపురం చేస్తూ.. మరోవైపు టీడీపీతో జత కట్టేందుకు తహతహలాడుతున్నారని పేర్కొన్నారు. కర్నూలుకు వచ్చిన ఆయన రైతుల గురంచి మాట్లాడడం కాదని.. గతంలో చంద్రబాబు కర్నూలుకు ఇచ్చిన హామీలపై మాట్లాడి ఉంటే ప్రజలు వినేందుకు బాగుండేదన్నారు. వాస్తవానికి రైతుల వ్యతిరేకి అయిన చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు అన్నదాతల మేలు కోరి మాట్లాడేందుకు ఏమీ లేదన్నారు. నటుడు పవన్ కల్యాణ్‌కు స్క్రిప్ట్ ఇచ్చి పంపించారని, ఆయన పర్యటనల్లో దానిని చదువుతూ బాబు మెప్పు పొందుతున్నారని పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సు కోరి తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలు దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచాయన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, రుణాల పంపిణీ, విత్తన సరఫరాతో పాటు ఎన్నో రకాల మేలు చేస్తున్నారని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా వైఎస్ఆర్సీపీని ఏమీ చేయలేరని అన్నారు. సమావేశంలో పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. -
కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు సన్మానం
సాక్షి, కర్నూలు: ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించారు. కోవిడ్ నివారణ కోసం పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులను ఓ ఎలక్ట్రానిక్ మీడియా, మెడికల్కన్సల్టెన్సీఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను సత్కరించి అభినందనలు తెలిపారు -
వైఎస్సార్సీపీలో చేరిన మాజీ మేయర్ బంగి
సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): కర్నూలు కార్పొరేషన్ మాజీ మేయర్, టీడీపీ నేత బంగి అనంతయ్య సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ పార్టీ కండువా వేసి.. ఆయన్ని వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. అనంతయ్య 1995వ సంవత్సరం నుంచి 2000 వరకు కర్నూలు మేయర్‌గా పనిచేశారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు లక్ష్మయ్య, సురేష్, రవిశంకర్, గణేష్, రఘు రాణా ప్రతాప్, శంకర్, చిరంజీవి సహా దాదాపు వంద మంది వైఎస్సార్సీపీలో చేరారు. బంగి అనంతయ్య మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి వైఎస్సార్సీపీలో చేరినట్లు చెప్పారు. కర్నూలుతో పాటు రాష్ట్రాభివృద్ధి సీఎం జగన్‌తోనే సాధ్యమన్నారు. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించటం ఖాయమని చెప్పారు. -
‘అన్ని రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయి’
సాక్షి, కర్నూలు : వాలంటరీ వ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజల ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను అందిస్తున్నామని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను ఊరు ఊరు తిరిగి తెలుసుకొనేందుకు వైఎస్సార్ ఆశయ సాధన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్ బైక్ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సోమవారం కర్నూలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రెడ్డి, పేదల డాక్టర్ ఈసీ గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య, వైఎస్సార్ ఆశయ సాధన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉదయగిరి మహమ్మద్ షరీఫ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ('విశాఖ చరిత్రలో ఆ కుటుంబానికి ఓ పేజీ') ఈ సందర్భంగా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. స్వలాభం కోసం చంద్రబాబు పని చేశారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయని, ఇదే ఆచరణకు సిద్ధమౌతున్నాయని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయ సాధన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ షేరిఫ్ చేపట్టిన యాత్రకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు తెలియజేసే విధంగా ఈ ప్రచార యాత్ర ముందుకు సాగాలని సూచించారు. (ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభలో సీఎం జగన్ ) ప్రజా సంక్షేమ పథకాలను ఊరు ఊరు తిరిగి తెలుసుకొనేందుకు మహ్మద్ షరీఫ్ బైక్ యాత్ర చేపట్టడం సంతోషంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. ఆయనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభినందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని హామీలను అమలు చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్ పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకొని, ముందు చూపుతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి కరోనా వైరస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చారని పేర్కొన్నారు. -
చంద్రబాబు అర్ధంపర్ధం లేకుండా మాట్లాడుతున్నారు
-
క్యాన్సర్ పేరుతో నాటకం
రూ. కోటి వసూలుచేసి పరారైన యువతి బంజారాహిల్స్: తనకు క్యాన్సర్ ఉందని నయం కావాలంటే ఆపరేషన్‌కు రూ లక్షలు ఖర్చవుతుందని, అంత డబ్బు తన వద్ద లేనందున మృత్యువుకు చేరువవుతున్నానంటూ మాయమాటలు చెప్పి స్నేహితులను, స్వచ్ఛంద సంస్థలను మోసం చేసిన కిలాడి లేడిపై బంజారా హిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎస్ఐ వెంకటేశ్వరరా కథనం మేరకు .. గత ఫిబ్రవరి 10న సమియ అబ్దుల్ హఫీజ్(22) అనే యువతి బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఒమేగా క్యాన్సర్ ఆస్పత్రికి వెళ్లి ఎండి మోహన్ వంశీని కలిసి తన తండ్రికి క్యాన్సర్ ఉందని నయం కావడానికి చికిత్స వివరాలు చెప్పాలని కోరింది. అందుకు మోహన్‌వంశీ మీ తండ్రిని తీసుకొని వస్తే పరీక్షించి చెబుతామంటూ చెబుతుండగానే డాక్టర్ ఫొటోలు, వీడియోలు కూడా తీసుకుని వెళ్లిపోయింది. ఆ తర్వాతి రోజు సమియా తనకు క్యాన్సర్ ఉందని డాక్టర్ మోహన్‌వంశీతో మాట్లాడగా లక్షలు ఖర్చవుతాయని చెప్పారని పేర్కొంటూ.. ఫేస్బుక్లో ఆయనతో ఉన్న ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసింది. పథకంలో భాగంగా స్నేహితులు, స్వచ్ఛంద సంస్థలకు ఫొటోలు పంపించింది. వైద్యులు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్లను కూడా జత చేస్తూ దాతలు గన్‌ఫౌండ్రిలోని ఎస్బీహెచ్ ఖాతాలో విరాళాలు జమ చేయాలని కోరింది. దీంతో దుబాయ్‌లో నివసిస్తున్న ఆమె స్నేహితులు సొమ్మును సేకరించి రూ.40 లక్షల వరకు ఆమె ఖాతాలో డిపాజిట్ చేశారు. మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా విరాళాలు పంపాయి. గత నెల 29న శస్త్రచికిత్స చేయించుకున్నట్లు ఫేస్బుక్లో పోస్టు చేయడంతో ఆమెను పరామర్శించేందుకు దుబాయ్ నుంచి వచ్చిన స్నేహితులు ఓమెగా ఆస్పత్రికి వెళ్లి సమియా కోసం ఆరా తీయగా ఆ పేరుతో ఎవరూ లేరని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరింత లోతుగా విచారిస్తే క్యాన్సర్రోగిగా నమ్మించి డాక్టర్‌తో పాటు స్నేహితులు, స్వచ్ఛంద సంస్థలను బురిడి కొట్టించినట్లు తేలడంతో స్నేహితురాలు ఫాతిమా, ఓమెగా ఆస్పత్రి హెచ్ఆర్ మేనేజర్ రాజారాం నరేంద్ర బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నాటకం ద్వారా నిందితురాలు సమియా దాదాపు రూ.1 కోటి వరకు వసూలు చేసినట్లు తేలింది. బ్యాంకు ఖాతా వివరాలను పరిశీలిస్తున్న పోలీసులు సమియా కోసం గాలింపు చేపట్టారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.