
సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించడంపై సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ గొప్ప విజయం ప్రజలదని వినమ్రంగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. ‘‘ఈ గొప్ప విజయం ప్రజలది. దేవుని దయతో ప్రతి అక్కచెల్లెమ్మ, ప్రతి సోదరుడు, స్నేహితుడు, ప్రతి అవ్వాతాత మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం వల్ల ఈ చారిత్రక విజయం సాధ్యమైంది.
ఈ విజయం నా మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని, బాధ్యతను పెంచింది. ఇంకా మంచి చేయడానికి మీ కుటుంబంలో ఒకరిగా మరింత తాపత్రయపడతాను’’ అని పేర్కొన్నారు. విజయం సాధించిన ప్రతి సోదరుడికి, అక్కచెల్లెమ్మకూ అభినందనలు తెలియజేస్తున్నానని సీఎం పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment