
పొన్నూరు/తెనాలి అర్బన్: గుంటూరు జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. జిల్లాలో చానాళ్లుగా 10 లోపు కేసులే నమోదవుతుండగా, ఆదివారం ఒకే రోజు 48 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. పొన్నూరు పట్టణంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో 8 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చినట్టు తహసీల్దార్ డి.పద్మనాభుడు చెప్పారు. వారితో పాటు పట్టణంలోని మరో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు.
పాఠశాలను మూసివేసి పిల్లలను హోం క్వారెంటైన్‌లోఉంచినట్టు తెలిపారు. అలాగే తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో ఆరుగురు ఉద్యోగులు కోవిడ్ బారిన పడినట్టు సిబ్బంది చెప్పారు. కార్యాలయ మేనేజర్, టౌన్ ప్లానింగ్ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిసింది. ఈ నెల 10న మున్సిపల్ ఎన్నికల విధుల్లో వీరు పనిచేయడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment