
న్యూఢిల్లీ: దేశంలోని 12 రాష్ట్రాల్లో జనవరి 4వ తేదీ వరకు కోవిడ్–19 సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు 619 నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో కర్ణాటకలో అత్యధికంగా 199 కేసులు నమోదయ్యాయన్నారు.
ఆ తర్వాత కేరళలో 148, మహారాష్ట్రలో 110, గోవాలో 47, గుజరాత్‌లో 36, ఏపీలో 30, తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్తాన్‌లో 4, తెలంగాణలో 2, ఒడిశా, హరియాణాల్లో ఒక్కటి చొప్పున కేసులు వెలుగు చూశాయి.