మున్సిపల్‌ ఫలితాలు సీఎం జగన్ ‌పాలనకు నిదర్శనం | Sajjala Ramakrishna Reddy Speaks On Municipal Election YSRCP Victory | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ఫలితాలు సీఎం జగన్ ‌పాలనకు నిదర్శనం

Published Sun, Mar 14 2021 1:51 PM | Last Updated on Sun, Mar 14 2021 2:10 PM

Sajjala Ramakrishna Reddy Speaks On Municipal Election YSRCP Victory - Sakshi

సాక్షి, తాడేపల్లి: మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు నిదర్శనమని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ తన రెక్కల కష్టంతో నిర్మించుకున్న పార్టీ వైఎస్సార్‌సీపీ అని పేర్కొన్నారు. పార్టీ గెలుపు క్రెడిట్ అంతా ఆయనను ఆశీర్వదించిన ప్రజలదేనని చెప్పారు. అక్కా చెల్లెల్లు, అన్నదమ్ములు, అవ్వతాతలు తన వైపు ఉన్నారని సీఎం జగన్‌కి భరోసా ఉందని, నేడు అదే నిజమైందని చెప్పారు. వారి కుటుంబంలో ఒకరిగా సీఎంను గుర్తించారని హర్షం వ్యక్తం చేశారు.

దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఫలితాలు వచ్చాయిని సజ్జల పేర్కొన్నారు. ఒక నాయకుడిపై ఇంత భరోసా చూపడం దేశంలోని ఇది తొలిసారి అని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ప్రచారం పేరిట, ప్రజల్ని బూతులు తిట్టారని మండిపడ్డారు. ఇప్పుడు వెళ్లి హైదరాబాద్లో‌ కూర్చున్నారని, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ఉన్నారని ఎద్దేవా చేశారు. బాబును ప్రజలు చెత్తబుట్టలో వేశారని ఆయనకీ తెలుసన్నారు. దింపుడు కల్లం ఆశతో విపరీతంగా డబ్బు కూడా పంచారని మండిపడ్డారు. తాము ప్రతిపక్షం ఉండాలి అని కోరుకుంటున్నామని, కానీ, చంద్రబాబు దానికి కూడా అర్హుడను కాదు అని నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. ఇక వెంటిలేటర్ మీద నుంచి కూడా టీడీపీ కిందకు పడిపోయినట్లేనని సజ్జల పేర్కొన్నారు.


చదవండి: మున్సి‘పోల్స్‌’ ఫలితాలు: క్లీన్‌స్వీప్‌ దిశగా దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement