సాక్షి, తిరుపతి: మున్సిపల్ ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంచి గిఫ్ట్ ఇచ్చారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అఖండ మెజారిటీలతో అత్యధిక సీట్లను గెలిపించారని, వార్ వన్ సైడ్ అనే విధంగా ఎన్నికలు జరిగాయని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హైదరాబాదులో రెస్ట్ తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వాళ్లు ఇక అక్కడే పరిమితమైతే మంచిదని తెలిపారు. ప్రజల విశ్వాసం ఉంటే ఎంతటి ఘన విజయాలు సాధించవచ్చని మున్సిపల్ ఎన్నికలు నిరూపించాయని చెప్పారు.
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఒకే రకంగా ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎక్కడున్నారో వెతుక్కొని మరీ ప్రజలు ఓట్లు వేశారని తెలిపారు. ఇంత అభిమానం పొందడం సీఎం జగన్‌కే సాధ్యమైందని తెలిపారు. చరిత్ర సృష్టించాలన్నా, దాన్ని తిరగరాయాలన్నా జగన్‌కే సాధ్యమని పేర్కొన్నారు.
చదవండి:
నా భర్తకు చేసిన అవమానమే ఇప్పుడు వాళ్లకు: లక్ష్మీ పార్వతి
మున్సి‘పోల్స్’ ఫలితాలు: వైఎస్సార్‌సీపీ ప్రభంజనం..
Comments
Please login to add a commentAdd a comment