AP Municipal Election 2021: Minister Botsa Satyanarayana Said YSRCP Achieved Grand Victory In AP Municipal Elections - Sakshi
Sakshi News home page

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది

Published Sun, Mar 14 2021 3:51 PM | Last Updated on Sun, Mar 14 2021 8:35 PM

Botsa Satyanarayana Speaks About Municipal Elections 2021 YSRCP Victory - Sakshi

సాక్షి, తాడేపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో 100 శాతం వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందని తెలిపారు. సీఎం జగన్ పాలనకు ప్రజలు పట్టం కట్టారని చెప్పారు.22 నెలల సంక్షేమ సీఎం పాలనకు ప్రజలు ఘన విజయం అందించారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పనిచేసే ప్రభుత్వానికి, నిజాయితీ, నిబద్ధతకు ప్రజలెప్పుడూ మద్దతు ఇస్తారని వ్యాఖ్యానించారు. ఎక్కడా ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ ప్రజల వద్దకు వెళ్తున్నామని చెప్పారు. ఎక్కడైతే టీడీపీ గెలిచిందో అక్కడ ఎక్స్ ఆఫీషియో సభ్యులతో ఫామ్ చేస్తామని తెలిపారు. 

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా, దౌర్జన్యాలు చేసినా ప్రజలు వైఎస్సార్‌సీపీనే నమ్మారని తెలిపారు. ఏ సమస్య వచ్చినా స్పందిస్తున్నామని, ప్రజలపై తనకు నమ్మకం ఉందని జగన్ చెప్పారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని చేసినా ప్రజలు తమవైపే ఉన్నారని సీఎం చెప్పారని వ్యాఖ్యానించారు. ఈ విజయాన్ని ఇచ్చిన పట్టణ ప్రాంత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

రానున్న రోజుల్లో ఇంకా బాధ్యతగా పని చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మేయర్, చైర్మన్ ఎంపిక పార్టీ అధ్యక్షుడు నిర్ణయిస్తారని చెప్పారు. టీడీపీని ఒక సామాజికవర్గ పార్టీగా మారుస్తున్నారని సొంత పార్టీ వారే అంటున్నారని తెలిపారు. మాయ మాటలు, మోసం చేసే వ్యక్తికి ఓటు ఎలా వేస్తారని అన్నారు. అమరావతి, విశాఖ ఉక్కు అంటూ బాబు రాజకీయం చేయబోయాడని అందుకే ప్రజలు ఆయన ఆలోచనకు బుద్ధి చెప్పారని తెలిపారు. తండ్రీకొడుకులు ఎలా మాట్లాడారో రాష్ట్రమంతా చూశారని  బొత్స మండిపడ్డారు.

చదవండి: మున్సి‘పోల్స్‌’ ఫలితాలు: వైఎస్సార్‌సీపీ ప్రభంజనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement