సాక్షి, ప్రకాశం: విదేశాల్లో రాసలీలలు చేసే లోకేష్‌కు తనను విమర్శించే హక్కు లేదని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. ''లోకేష్ ఒక దరిద్రుడు.. చంద్రబాబు ఒక నీచుడు. చంద్రబాబు, లోకేష్ ఇక్కడ దోచుకుని విదేశాల్లో దాచుకుంటున్నారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని లోకేష్ నాపై మాట్లాడటం సిగ్గుచేటు. ప్రత్తిపాటితో కలిసి లోకేష్ పేకాట క్లబ్ నడిపిన విషయం ప్రజలకు తెలుసు. నేను కులాలు చూడలేదు.. కమ్మవారికి కూడా కార్పొరేషన్‌లో టికెట్ ఇచ్చా. టీడీపీ వారు వ్యక్తిగత సమస్యలపై నా వద్దకు వస్తే పరిష్కరించా. ఒంగోలు అభివృద్ధిపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదు.
గతంలో ఒంగోలును అభివృద్ధి చేశా.. ఇప్పుడూ చేస్తున్నా. టీడీపీ ఇన్‌ఛార్జ్ దామచర్ల జనార్ధన్ బాగోతం అందరికీ తెలుసు. నాకు సంస్కారం ఉంది కాబట్టి.. వ్యక్తిగత విమర్శలు చేయను. దామచర్ల జనార్ధన్ అప్పులు ఎగ్గొడితే.. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కరోనా సమయంలో ఒంగోలులో రూ.కోటి సొంత డబ్బు ఖర్చు చేశా. రోడ్లు మీద రోడ్లు వేసి టీడీపీ నేతలు దోచుకున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చూస్తే.. కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారు. కుప్పంలో చంద్రబాబుకు పట్టిన గతే.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రిపీట్ అవుతుంది'' అంటూ పేర్కొన్నారు.
చదవండి:
ఇక టీడీపీ చాప్టర్ క్లోజ్: విజయసాయిరెడ్డి
లెక్కలు తప్పులైతే ముక్కు నేలకు రాస్తా..
Comments
Please login to add a commentAdd a comment