
సాక్షి, విజయవాడ: కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ పూటకో రంగు మార్చి పబ్బం గడుపుకోవాలని చూసే చంద్రబాబు నాయుడుని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయనగరంలో హిందువునని, కర్నూలుకు వెళ్లి టోపీ పెట్టుకొని ముస్లింనని ప్రచారం చేసుకునే చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పూటకో మతం పేరు చెప్పుకుంటూ ఆయా మతాల వారి మనోభావాలను దెబ్బతీస్తున్న చంద్రబాబుకు ఓటనే ఆయుధంతో బుద్ధిచెప్పాలని కోరారు.
చంద్రబాబు హయాంలో సంపదనంతా విజయవాడలో గోడలపై పెయింటింగ్‌ల కోసం ఖర్చ చేశారని విమర్శించారు. గత కౌన్సిల్‌లో నిధులను టీడీపీ నేతలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. టీడీపీ నేతలు నగరంలో పేదల ఉండే ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, తమ ప్రభుత్వం వచ్చాక వారి స్థితిగతుల్లో చాలా మార్పు వచ్చిందని పేర్కొన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంచి ఆలోచనతో పేదల కోసం 30 లక్ష ఇళ్ల పట్టాలను ఇవ్వాలని చూస్తే చంద్రబాబు అండ్ కో కోర్టుల ద్వారా అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 45 వేల స్కూళ్ల రూపురేఖల్ని మార్చేశామన్నారు.
టీడీపీ హయాంలో కార్పొరేట్ కళాశాలు రాజ్యమేలిన విషయాన్ని ఆయన ప్రస్థావించారు. 8 వేల కోట్లతో రాష్టంలో 16 మెడికల్ కళాశాలు కట్టాలని సీఎం జగన్‌మెహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. సీఎం జగన్‌మెహన్‌రెడ్డిపై విషం కక్కాలని చూసే చంద్రబాబుకు ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయడులు సహకరిస్తున్నారన్నారు. కరోనా కష్టాల్లో ఉన్నా అప్పులు తెచ్చి మరీ నిరుపేదల కడుపులు నింపిన గొప్ప వ్యక్తి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్ధులకు ఓటు వేసి.. రాష్టాన్ని సంక్షేమం, అభివృద్ధిపధంలో తీసుకెళ్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment