సీఎం జగన్‌పై దాడి.. కొడాలి నాని సంచలన కామెంట్స్‌ | Kodali Nani Serious Over CM YS Jagan Vijayawada Issue | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌పై దాడి.. కొడాలి నాని సంచలన కామెంట్స్‌

Published Sun, Apr 14 2024 1:35 PM | Last Updated on Sun, Apr 14 2024 1:59 PM

Kodali Nani Serious Over CM YS Jagan Vijayawada Issue - Sakshi

సాక్షి, కృష్ణా: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొలేకనే ఆయనపై దాడి చేశారని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. పక్కా వ్యూహంతోనే సీఎం జగన్‌పై దాడి జరిగింది. చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల సందర్భంగా, ఇప్పుడు దాడులు జరిగాయని తెలిపారు. 

కాగా, కొడాలి నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. నిన్న మధ్యాహ్నం తుళ్లూరులో చంద్రబాబు.. సీఎం జగన్‌ను రాళ్లతో కొట్టాలని చెప్పాడు. చంద్రబాబు మాటలు విని కులోన్మాదంతో దాడి చేశారు. చాలా పకడ్బంధీగా వ్యూహం ప్రకారం గురి చూసి గన్‌తో దాడి చేశారు. ప్రచారంలో కదలికల వల్ల గురి తప్పి కన్నుకు తగిలింది. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉండబట్టే సీఎం జగన్‌తో గాయంతో బయటపడ్డారు. దీన్ని ఖండించాల్సిన కొందరు వ్యక్తులు సంస్కారహీనంగా సీఎం జగనే తనపై దాడి చేయించుకున్నారని చెప్తున్నారు. 

ఎన్నికల సందర్బంగా గుర్తింపు పొందిన తొమ్మిది సంస్థల సర్వేల్లో వైఎస్సార్‌సీపీకి భారీ మోజార్టీలు వస్తాయని చెప్పాయి. దీంతో, సీఎం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక.. కొందరు రాజకీయ నిరుద్యోగులు ఇలా చేశారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్‌ విగ్రహం నెలకొల్పారన్న కక్షతో కొన్ని వర్గాలు కలిసి ఇలా దాడి చేశాయి. ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు తీయడానికే ప్రయత్నం జరిగిందంటే దీని వెనుక చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఎంతో పక్కగా దాడి చేయబట్టే సీఎం జగన్‌కు తగిలిన రాయి వెల్లంపల్లికి కూడా తగిలింది. 

ప్రధాని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు రోడ్‌ షోగా వెళ్లేటప్పుడు పగలైనా, రాత్రి సమయంలోనైనా కరెంట్‌ తీసేస్తారు?. ఈ విషయం సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు తెలియదా?. చంద్రబాబు బస్సుపై రోడ్‌ షోలు చేసేటప్పుడు కరెంట్‌ తీయలేదా?. సీఎం జగనే కరెంట్‌ తీయించారని టీడీపీ నేత పిచ్చివాగుడు వాగుతున్నారు. అధికారులపై యాక్షన్‌ తీసుకోవాలని చంద్రబాబు 420 వ్యాఖ్యలు చేస్తున్నాడు. సీఎం జగన్‌కు బ్లాక్ క్యాట్స్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను’ అంటూ కామెంట్స్‌ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement