పుర ప్రచారం నేటితో సమాప్తం | AP Municipal election campaign event ends on today | Sakshi
Sakshi News home page

పుర ప్రచారం నేటితో సమాప్తం

Published Mon, Mar 8 2021 3:07 AM | Last Updated on Mon, Mar 8 2021 3:07 AM

AP Municipal election campaign event ends on today - Sakshi

సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారం ముగియనుంది. రాష్ట్రంలో 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. వీటిలో పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని వార్డులు ఏకగ్రీవమవ్వడంతో అక్కడ పోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం లేదు. మిగిలిన నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో ఈ నెల 10న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement