సాక్షి, అమరావతి: ఆలయాలపై దాడుల పేరిట రాష్ట్రంలో ఇటీవల తెలుగుదేశం పార్టీ లేవనెత్తిన మత రాజకీయాలు మున్సి‘పోల్స్’పై ఏమాత్రం ప్రభావం చూపలేదు. సీఎం వైఎస్ జగన్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఆ పార్టీ చేసిన కుటిల యత్నాలకు ఆదివారం వెల్లడైన ఫలితాలు చెంపపెట్టులా మారాయి. సీఎంపై రాష్ట్ర ప్రజలకు ఉన్న నమ్మకాన్ని చంద్రబాబు మత రాజకీయాలు ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయన్నది ఈ ఫలితాల ద్వారా రుజువైందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు వారు పలు ఉదంతాలను ఉదహరిస్తున్నారు.
► విజయనగరం జిల్లా రామతీర్థంలోని శ్రీరాముని ఆలయంలో మూలవిరాట్ విగ్రహాన్ని «కొందరు విద్రోహులు ధ్వంసం చేయడం.. వెంటనే చంద్రబాబు అక్కడ హంగామా చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇక్కడకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోని నెల్లిమర్ల మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ బావుటా ఎగురవేసింది. అలాగే..
► విజయవాడ దుర్గగుడిలో వెండి సింహాల చోరీ అంశాన్ని టీడీపీ రాజకీయం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించింది. అయినా, ఇక్కడ కార్పొరేషన్‌లో కూడా వైఎస్సార్‌సీపీ తిరుగులేని విజయం సాధించింది.
► తిరుమల తిరుపతి దేవస్థానంపై కూడా టీడీపీ దుష్ప్రచారానికి చేయని ప్రయత్నంలేదు. కానీ, తిరుపతి ప్రజలు ఇవేమీ పట్టించుకోలేదు. కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీకి అఖండ విజయం చేకూర్చారు. మత రాజకీయాలకు రాష్ట్రంలో చోటులేదనేందుకు ఈ ఫలితాలు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.
మత రాజకీయాలకు చెంపపెట్టు
Published Mon, Mar 15 2021 3:57 AM | Last Updated on Mon, Mar 15 2021 3:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment