
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బుధవారం(10వ తేదీ) హైకోర్టుకు సెలవు దినంగా ప్రకటించారు. అలాగే హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ, లీగల్ సర్వీసెస్ కమిటీ, మీడియేషన్, ఆర్బిట్రేషన్ సెంటర్‌లకు కూడా సెలవు ప్రక టించారు. దీనికి బదులుగా మే 1(శని వారం)ని పనిదినంగా నిర్ణయించారు.
అలాగే శివరాత్రి మరుసటి రోజు సెలవు కావాలంటూ హైకోర్టు ఉద్యోగుల సంఘం పెట్టుకున్న వినతిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం 12వ తేదీన కూడా సెలవు ఇచ్చింది. దీనికి బదులు ఈనెల 20వ తేదీ(శనివారం)ని పనిదినంగా నిర్ణయించింది. ఈ విషయాన్ని రిజిస్ట్రార్ జనరల్ భానుమతి మంగళవారం తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment