సాధారణంగా ఎన్నికల్లో నామినేషన్ అంటే చుట్టూ జనాలు, పదుల సంఖ్యలో వాహనాలు.. ఓ వేడుకను తలపిస్తుంటుంది. అయితే ఓ వ్యక్తి మాత్రం వీటికి భిన్నంగా 22 కి.మీ పరిగెత్తుకుంటూ వెళ్లి పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేశాడు. అయితే తాను ఈ పద్ధతినే ఎంచుకోవడం వెనుక ఓ కారణముందని చెబుతున్నాడు. అదేంటంటే.. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల 2023 నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
అందుకే 22 కి.మీ పరగు
డార్జిలింగ్ జిల్లాలోని సొనాడ గ్రామ పంచాయతీకి చెందిన తుమ్సోంగ్ ఖాస్మహల్ నివాసి అయిన సనారా సుబ్బా ఈ సారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నాడు. ఇక డార్జిలింగ్‌లో కొండ ప్రాంతంలోని గ్రామంలో రోడ్లు కూడా సరిగా ఉండవు, ఇక కమ్యూనికేషన్ వ్యవస్థ గురించి చెప్పక్కర్లేదు. ఈ సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశ్యంతో 22 కిలోమీటర్లు పరిగెత్తుతూ బీడీఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశాడు.
ఎన్నో ఏళ్లుగా తమ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని ఈ విధంగా నిరసన తెలిపాడు. తన గ్రామంలోని రోడ్ల పరిస్థితి ఎంతో అధ్వాన్నంగా ఉందని.. ఎవరైనా అనారోగ్యానికి గురైతే, అతన్ని పర్వత సానువులలో అనేక కిలోమీటర్లు స్ట్రెచర్‌పై తీసుకెళ్లి అంబులెన్స్‌లో తీసుకెళ్లాల్సి ఉంటుందని తెలిపాడు. రోడ్లు లేకపోవడంతో విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారని అతను అభిప్రాయపడ్డాడు. పర్యావరణ కాలుష్యం పర్వతాలను కూడా ప్రభావితం చేసిందని.. దీంతో పాటు ట్రాఫిక్ జామ్ కూడా పెరిగిందని తెలిపాడు.ట్రాఫిక్ జామ్‌తో కొండవాలు, పర్యాటకులు కూడా నానా అవస్థలు పడుతున్నారని.. అయితే రాజకీయ పార్టీలకు వాటి గురించి ఆలోచించే సమయం లేదని వాపోతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment