ప్రజల్ని పిచ్చోళ్లని చేస్తా..డబ్బు సంపాదిస్తా.. | UP: Independent candidate admits entering politics only for money, says 'I’ll fool people' | Sakshi
Sakshi News home page

ప్రజల్ని పిచ్చోళ్లని చేస్తా.. డబ్బు సంపాదిస్తా..

Published Sat, Jan 28 2017 9:40 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

ప్రజల్ని పిచ్చోళ్లని చేస్తా..డబ్బు సంపాదిస్తా.. - Sakshi

ప్రజల్ని పిచ్చోళ్లని చేస్తా..డబ్బు సంపాదిస్తా..

లక్నో: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల చిత్రపటంలో ఓ ఆసక్తికరమైన అంశం నమోదైంది.  ఆగ్రా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా  పోటిస్తున్న వ్యక్తి   షాకింగ్ ప్రచారంతో వెలుగులోకి వచ్చారు. తాను డబ్బుకోసమే  రాజకీయాల్లోకి వచ్చానంటూ ఇండిపెండెంట్  అభ్యర్థి  చౌదరి బహిరంగంగా  ప్రకటించుకోవడం  సంచలనంగా మారింది. ఈ అభ్యర్థి చేస్తున్న ఎన్నికల ప్రచారానికి సంబంధించిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్  అయింది.

రాజకీయాల్లో రావడానికి కారణం కేవలం డబ్బు సంపాదించడానికే.. ప్రజల్ని అవివేకులను (ఫూల్స్) చేస్తానంటున్నాడు. అంతేకాదు దాదాపు అందరూ రాజకీయాల్లోకి  పరోక్షంగా అదే ఉద్దేశ్యం తో వస్తున్నారని వ్యాఖ్యానించారు.

మరోఅడుగు ముందుకేసి ఏకంగా ప్రధానమంత్రి  నరేంద్రమోదీపై తన దాడిని ఎక్కుపెట్టి, విమర్శలు గుప్పించారు. ప్రజల్ని పిచ్చోళ్లని చేసి...ఒక వ్యక్తి దేశాన్నేలుతున్నపుడు ..తానెందుకు చేయలేనని ప్రశ్నించారు. తానూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నానంటున్నారు .ప్రజలను ఫూల్స్ ని చేసిన ఎవరైనా ప్రధానమంత్రి   కావచ్చు. దానికి కొంత టాలెంట్ ఉండాలంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement