న్యూఢిల్లీ: పోటీలో ఉన్న అభ్యర్థులు మరణించడంతో యూపీ, ఉత్తరాఖండ్‌లలో ఒక్కో నియోజకవర్గంలో ఫిబ్రవరి 15న జరగాల్సిన పోలింగ్ వాయిదావేస్తున్నట్లు ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. యూపీలో ఆలంపూర్ నియోజకవర్గంలో ఎస్పీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థి ఆదివారం గుండెపోటుతో కన్ను మూయడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్‌లో కర్నాప్రయాగ్ సీటుకు బీఎస్పీ తరఫున పోటీచేస్తున్న కుల్దీప్ సింగ్ ఆదివారం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఈసీ తెలిపింది.
పాఠశాలల్లోనే ‘ఎన్నికల అక్షరాస్యత’: ఈసీ
విద్యార్థులకు ‘ఎన్నికల అక్షరాస్యత’పై అవగాహన కల్పించాలని కేంద్ర హెచ్చార్డీ మంత్రిత్వ శాఖకు ఈసీ లేఖ రాసింది. సానుకూలంగా స్పందించిన హెచ్చార్డీ మంత్రి.. దీనిపై నూతన విద్యారంగ విధానంలో మార్పుల సమయంలో పరిగణలోకి తీసుకోవాలని ఎన్ సీఈఆర్‌టీకి సూచించారని సమాచారం.
రెండు స్థానాల్లో పోలింగ్ వాయిదా
Published Mon, Feb 13 2017 1:23 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement